డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు

Published Mon, May 6 2024 10:05 AM

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు

భువనగిరి: డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 75 కాలేజీలు, వాటిలో 26,040 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు ఫస్టియర్‌లో ప్రవేశం కోసం హాల్‌ టికెట్‌ నంబర్‌తో దోస్త్‌ వెబ్‌సైట్‌ https://gg.gov.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

మూడు విడతల్లో సీట్ల కేటాయింపు

మూడు విడతల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. విద్యార్థులు రూ.200 రుసుము చెల్లించి రాష్ట్రంలో నచ్చిన కాలేజీలో సీటు పొందేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి 27వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్‌ 3న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. జూన్‌ 4 నుంచి 10 మధ్యలో సెల్ప్‌ రిపోర్టు చేయాలి. రూ.400 రుసుముతో జూన్‌ 4నుంచి 13వ తేదీ వరకు రెండో దశ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జూన్‌ 4 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంది. జూన్‌ 18న సీట్ల కేటాయింపు, 19 నుంచి 24వ తేదీ మధ్య రిపోర్ట్‌ చేయాలి. మూడో దశలో జూన్‌ 19 నుంచి25వ తేదీ వరకు రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జూన్‌ 19 నుంచి 26వ వరకు వెబ్‌ ఆప్షన్లు..జూన్‌ 29న సీట్ల్లు కేటాయిస్తారు. జూన్‌ 29 నుంచి జూలై 3 మధ్యలో సెల్ప్‌ రిప్టోర్‌ చేయాలి.

జూలై 8నుంచి తరగతులు

సీట్లు పొదిన విద్యార్థులు జూన్‌ 29 నుంచి జూలై 5వ తేదీ మధ్య కళాశాలల్లో రిపోర్టు చేయాలి. జూలై 8 నుంచి తరగుతులు ప్రారంభం కానున్నాయి.

ఫ నేటి నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్లు

ఫ ఎంజీయూ పరిధిలో 26,040 సీట్లు

కొత్త కోర్సులు ఇవీ..

డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బీకామ్‌ ఫైనాన్స్‌, బీఎస్సీ బయో మెడికల్‌ సైన్స్‌, బీఏ స్పెషల్‌, బీఏ పబ్లిక్‌ పాలసీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

ఎంజీయూ పరిధిలో ఇలా..

విద్యాసంస్థలు కాలేజీలు సీట్లు

ప్రభుత్వ 11 6,120

ఎయిడెడ్‌ 02 1,260

ప్రైవేట్‌ 62 18,660

మొత్తం 75 26,040

Advertisement
Advertisement