ఏవీ రద్దు కావు.. ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ | Sakshi
Sakshi News home page

ఏవీ రద్దు కావు.. ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

Published Tue, May 7 2024 5:15 AM

ఏవీ ర

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు మారుస్తారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏవీ రద్దు కావని, సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌ మాత్రం రద్దవుతుందన్నారు. రాహుల్‌గాంధీ పరిస్థితి కూడా అదేనని, అందుకే వారికి భయం పట్టుకుందన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడితే గాడిదగుడ్డు అంటూ విమర్శలు చేస్తున్నాడని, గాడిదలు గుడ్డు పెట్టవన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. మూడేళ్ల పాటు పదవిలో ఉందామనుకున్న రేవంత్‌రెడ్డికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఎవరికీ తెలియదని, అతనో డమ్మీ అని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఏం సాధించావని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రూ.9వేల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. నా తర్వాత ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు ఏం చేశారు, ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

ఏవీ రద్దు కావు..  ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌
1/2

ఏవీ రద్దు కావు.. ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

ఏవీ రద్దు కావు..  ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌
2/2

ఏవీ రద్దు కావు.. ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement