రెండో రోజు 150 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండో రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్షా కేంద్రాలలో 1155 మంది అభ్యర్థులకుగాను 150 మంది గైర్హాజరయారని డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. కేజీబీవీ రాష్ట్ర డైరెక్టర్, జిల్లా అబ్జర్వర్ మధుసూదన్‌రావు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
రైతులకు కేంద్రం శుభవార్త
కడప అగ్రికల్చర్: పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతులకు రూ. 2 వేలను శనివారం విడుదల చేయనుంది. మహారాష్ట్రలోని వాసిమమ్ నుంచి ప్రధాని మోదీ మధ్యాహ్నం 12 గంటలకు పీఎం కిసాన్ పథక 18వ విడత నిధులను విడుదల చేయనున్నారు. జిల్లాలో అర్హత కలిగిన 1,87,083 మంది రైతుల ఖాతాలకు రూ. 37.42 కోట్లు పెట్టుబడి సాయం నేరుగా జమకానుంది, తొలి విడతగా గత జూన్ 18న జిల్లాలో 1,86,507 మంది రైతులకు రూ. 37.36 కోట్లను రైతు ఖాతాలకు జమ చేశారు.
బాధ్యతల స్వీకరణ
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) రీజనల్ డైరెక్టర్‌గా డాక్టర్ రామగిడ్డయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్‌గా ఉంటూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం జోన్ –4 పరిధిలో పనిచేస్తున్న రాయలసీమ ప్రాంత ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ఆ శాఖ కార్యాలయ సిబ్బంది ఆర్డీకి శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ భక్తవత్సలం, సూపరిండెంట్ గోపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బత్తనయ్య, వనీష, రవి పాల్గొన్నారు.
డీపీఓగా రాజ్యలక్ష్మి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పంచాయతీ అధికారిగా రాజ్యలక్ష్మి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న డీపీఓను రాష్ట్ర ప్రభుత్వం ఆదోని డీఎల్‌డీఓగా బదిలీ చేసింది. ఏపీఎస్‌ఐఆర్‌డీలో పనిచేస్తున్న రాజ్యలక్ష్మి ఇక్కడికి వచ్చారు.
రేపు ‘గడియారం’
పురస్కార సభ
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక శ్రీకృష్ణగీతాశ్రమం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మహాకవి డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 43వ సాహి త్య పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్న ట్లు రచన సాహిత్యవేదిక ఉపాధ్యక్షుడు గడియా రం వేంకటశేషశర్మ పేర్కొన్నారు. రామేశ్వరంలోని గడియారం వారి లైబ్రరీలో పురస్కారాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గడియారం వేంకట శేషశాస్త్రి సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది నెల్లూరుకు చెందిన ప్రముఖ కవి, వైద్యుడు డాక్టర్ శింగరాజు రామకృష్ణ ప్రసాదరావుకు అందిస్తున్నామన్నారు. ఆయన రచించిన ‘‘శ్రీ శంభు భారతం’’అనే కావ్యానికి ఈ పురస్కారం అందిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment