కార్పొరేషన్‌పై ఎమ్మెల్యే మాధవి దండయాత్ర
కడప కార్పొరేషన్: కడప కార్పొరేషన్‌పై టీడీపీ ఎమ్మెల్యే మాధవి దండయాత్ర చేశారు. మందీ మార్బలంతో ర్యాలీగా వచ్చి సర్వసభ్య సమావేశంలో రచ్చ రచ్చ చేశారు. తన కుర్చీని మేయర్‌తో సమానంగా పైన వేయకుండా, కార్పొరేటర్లతోపాటు కింద వేసిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. ముందస్తు వ్యూహం ప్రకారం వందలాది మంది టీడీపీ కార్యకర్తలతో వచ్చి సర్వసభ్య సమావేశంలో రభస సృష్టించారు. సభ లోపలికి ప్రవేశించగానే ఆమెకు కేటాయించిన కుర్చీలో ఆశీనురాలు కాకుండా వేదికపైకెక్కి నిల్చొన్నారు. తనకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని మేయర్‌ను కోరగా ఆయన సమ్మతించారు. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో ఎజెండాపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. అయినా ఆమె వినిపించుకోలేదు... సబ్జెక్టు మీదే మాట్లాడాలని కార్పొరేటర్ అరీఫుల్లా బాషా చెప్పగా ‘నీవు కూర్చో...నేను మాట్లాడుతున్నా...నీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు’ అంటూ ఏకవచనంతో సంభోదించారు. ‘ప్రజలు నాకు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చారు...మీకు పోలీస్ రక్షణ కావాలా...దేనికి’ అని వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్లనుద్దేశించి దురుసుగా ప్రశ్నించారు. ఈ క్రమంలో అరుపులు, కేకలతో సమావేశం గందరగోళంగా మారడంతో మేయర్ సురేష్ బాబు సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
చొరబడిన టీడీపీ శ్రేణులు
నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం సందర్భంగా కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు, అధికారులు, మీడియా మినహా మరెవరినీ అనుమతించలేదు. గుర్తింపు కార్డులు చూపిన వారిని మాత్రమే లోనికి అనుమతించారు. ఎమ్మెల్యే రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాదాపు 50 మంది టీడీపీ కార్యకర్తలు సర్వసభ్య సమావేశం జరిగే హాలు ఎదుట ఉన్న మరో సమావేశ మందిరంలో తిష్టవేశారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదు ట సుమారు 200 మంది గేట్లు తోసివేస్తూ మేయర్ డౌన్‌డౌన్ అంటూ రాద్ధాంతం చేశారు. వారిని పోలీసులు నియంత్రించలేకపోయారు. తమను గుర్తింపు కార్డులు చూపించాకే లోనికి అనుమతించిన పోలీసులు ఏ గుర్తింపు కార్డులు లేకుండా ఇంతమంది టీడీపీ కార్యకర్తలను ఎలా అనుమతించారని కార్పొరేటర్లు కమిషనర్‌ను ప్రశ్నించారు.
చేతులేత్తేసిన పోలీసులు
మళ్లీ సమావేశం నిర్వహించాలని మేయర్, కార్పొరేటర్లు నిర్ణయించినా భద్రతా కారణాలతో రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మేయర్ సురేష్‌బాబు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతానికి వాయిదా వేయాలని కలెక్టర్ సూచించిన ట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా చర్యలు తీ సుకోవాలని కోరుతూ మేయర్, కార్పొరేటర్లు సభ వాయిదాకు అంగీకారం తెలిపారు.
మందీ మార్బలంతోవచ్చి సర్వసభ్య సమావేశంలో రచ్చ...రచ్చ
ఎజెండాపై చర్చించాలన్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
వినిపించుకోని ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment