‘బ్రౌన్’భవనాలు ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: సీపీ బ్రౌన్ గ్రంథాలయ అదనపు నూతన భవన నిర్మాణాలను ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలని కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆర్‌అండ్‌బీ, ఏపీ విద్యా సంక్షేమ అభివృద్ధి సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో సీపీ బ్రౌన్ గ్రంథాలయం, భాష పరిశోధనా కేంద్రం అభివృద్ధిపై సమీ క్షించారు. గతంలో గ్రంథాలయం అదనపు భవనాల నిర్మాణానికి స్థలం కొనుగోలు చేసినా, నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, పనులు ప్రారంభించక పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్రౌన్ గ్రంథాలయ సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్ మాట్లాడుతూ గ్రంథాలయ ఆవిర్భావం, అంచెలంచలుగా ఎదిగిన తీరును, నూతన భవనాల నిర్మాణ ఆవశ్యకతను గురించి వివరించారు. రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు చంద్రశేఖర్, కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, బ్రౌన్ గ్రంథాలయ సంచాలాకులు డా. జి. పార్వతి, ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ రాంప్రసాద్ రెడ్డి, ఇంజనీర్లు కల్యాణి పాల్గొన్నారు.
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
బదిలీ అయిన అధికారులు జిల్లాలో బాగా పని చేశారని, అదే స్ఫూర్తితో బదిలీ అయిన ప్రదేశంలో కూడా బాధ్యతాయుతంగా పనిచేసి ఆయా జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా నుంచి బదిలీ అయిన అధికారులకు ఆత్మీయ అభినందన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి సేవలను కొనియాడారు. జిల్లా నుంచి జమ్మలమడుగు ఆర్డిఓ శ్రీనివాసులు, పులివెందుల ఆర్డిఓ వెంకటేష్, స్పెషల్ కలెక్టర్ కౌసర్ భాను, మున్సిపల్ కమిషనర్ ఓవై నందన్, జెడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి, చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధి కారి వెంకటసుబ్బయ్య బదిలీ అయ్యారు. ఆయా అధికారులకు కలెక్టర్ ఘనంగా సన్మానించారు. జిల్లా రెవిన్యూ అధికారి గంగాధర్ గౌడ్, సీపీఓ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శివశంకర్
Comments
Please login to add a commentAdd a comment