శివానీ.. భవానీ నమోస్తుతే
ప్రొద్దుటూరు కల్చరల్: దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో భవాని దేవిగా భక్తులను కరుణించారు. నరసింహాస్వామి, వివిధ దేవతా మూర్తుల సెట్టింగ్ ఆకట్టుకుంది. శివాలయంలో గజలక్ష్మీదేవిగా, గౌరమ్మకట్టలో బాలత్రిపుర సుందరిదేవిగా, చెన్నకేశవస్వామి ఆలయంలో ధాన్యలక్ష్మీదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అలాగే జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment