హృదయాలను కలిపే జాతీయభాష ఉర్దూ
మదనపల్లె సిటీ: హృదయాలను కలిపే జాతీయ భాష ఉర్దూ అని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. స్థానిక బెంగళూరు బస్టాండు వద్దనున్న బడేమకాన్‌లోని హజరత్ ఖాదర్‌షా ఔలియా దర్గా ఉరుసు మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉర్దూ భాష మాధుర్యాన్ని వివరించారు. ఎందరో ముస్లిమేతరులు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఉర్దూభాషలో నిర్వహించే ముషాయిరాలు (కవి సమ్మేళనాలు) జాతీయ సమైకత్యకు దోహదడతాయన్నారు. ఇందులో భక్తితో కూడిన కవితలతో పాటు సమాజాన్ని మేల్కొలిపే కవితలు, గజల్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయన్నారు.అనంతరం పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఉర్దూ కవులు తమ కవిత్వంతో అందరినీ అలరించారు. మహా ప్రవక్త హజరత్ మహమ్మద్ జీవితంపై నాత్ కవితాగానం చేశారు. కవులు,ఉర్దూ అకాడమీ నుంచి పురస్కారాలు అందుకున్న మహమ్మద్ షాహిద్, డాక్టర్ మహమ్మద్ నఖీఉల్లాఖాన్, ఇమాం ఖాసిం, కె.సి.కరీముల్లాఖాన్, జాఫరుద్దీన్‌లను ధుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు.
● కార్యక్రమంలో టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, దర్గా ముతవల్లి హాషిం, కవి సమ్మేళనం కన్వీనర్ పఠాన్ మహమ్మద్‌ఖాన్, కార్యదర్శి ఖమర్‌అమీని, మదీనా విశ్వవిద్యాలయ అచార్యులు ఇనాయత్‌అమీన్, రూటా నాయకులు ఇస్మాయిల్, సిబాత్ ఉరద్‌రహ్మన్, నాదిర్‌షావల్లి, షరాఫత్‌అలీఖాన్, పలువురు కవులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే షాజహాన్‌బాషా
అలరించిన అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment