‘మ్యాథ్ ‘బి’కి చక్కటి స్పందన
వైవీయూ: లెక్కలంటే అన్నీ చిక్కులే.. కొందిరికిదో బ్రహ్మపదార్థం. అర్థం చేసుకున్న వారికి మాత్రం ఆసక్తికరం. చిన్నవయసులో నేర్చుకునే చిట్కాలు జీవితాంతం గుర్తుండిపోతాయనేది నిపుణుల మాట. విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి.. వారిలో గణితంపై ఆసక్తి పెంచేలా.. చిన్న చిన్న సమస్యలు మొదలు.. వారి స్థాయిని అనుసరించి నిర్వహించిన సాక్షి మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. కడప నగరంలోని జీఎంఆర్ హైస్కూల్‌లో నిర్వహించిన మ్యాథ్ ‘బి’ క్వార్టర్ ఫైనల్ కాంపిటీషన్ ఆదివారం నిర్వహించారు. కేటగిరీ–1లో 1, 2 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–2లో 3,4 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–3లో 5, 6,7 తరగతుల విద్యార్థులు ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment