రీ సర్వేత్రా సమస్యలే? | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేత్రా సమస్యలే?

Published Wed, Jan 29 2025 1:33 AM | Last Updated on Wed, Jan 29 2025 1:34 AM

రీ సర

రీ సర్వేత్రా సమస్యలే?

కడప సెవెన్‌రోడ్స్‌: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లాలో భూముల రీ సర్వే మళ్లీ ప్రారంభమైంది. రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ల డిప్యుటేషన్లు, వీఆర్వోలు ఒక బ్లాక్‌కే పరిమితం కావడం, భూమి రికార్డుల స్వచ్ఛీకరణ సక్రమంగా లేకపోవడం వంటి కారణాలతో రీ సర్వే సవ్యంగా జరగడం ప్రశ్నార్థకంగా మారింది.

● వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూముల రీ సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. జిల్లాలో ఫేజ్‌–1లో 86 గ్రామాల్లో 98478.83 ఎకరాలు, ఫేజ్‌–2లో 99 గ్రామాల్లో 132442.40 ఎకరాలు, ఫేజ్‌–3 కింద 98 గ్రామాల్లో 225356.17 ఎకరాల్లో రీ సర్వే నిర్వహించారు. మొత్తం 282 గ్రామాల్లో 456277.4 ఎకరాల్లో రీ సర్వే కార్యక్రమం సవ్యంగా ముగిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలల తర్వాత ఇప్పుడు రీ సర్వే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున 35 మండలాల్లో భూముల రీ సర్వే జరుగుతోంది. గ్రామాలను బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాక్‌ 250 ఎకరాలకు మించకుండా ఉండాలి. ప్రతి బ్లాక్‌కు ఇద్దరు సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్‌ఏ ఉంటారని అధికారులు ప్రకటించారు. అయితే జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నాలుగు బ్లాకులు ఉన్నాయనుకుంటే ఒక్క వీఆర్‌ఓ మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. వీఆర్వోను ఒక బ్లాక్‌కే పరిమితం చేస్తే మిగతా బ్లాకుల్లో సమస్యలు ఎదురైనపుడు ఎవరు అందుబాటులో ఉంటారనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు భూముల యజమానుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొందరు ఇతర ప్రాంతాల్లో ఎక్కడో ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ ఉంటారు. దీంతో వారు రాలేని పక్షంలో హద్దుల గుర్తింపు సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వీడియో కాల్‌ చేసి హద్దులు చూపెడతామని అధికారులు అంటు న్నా అది ఆచరణలో ఎంత వరకు అమలవుతుందో చూడాలి.

● క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ఉద్దేశ్యంతో నాటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొబైల్‌ కోర్టులను సైతం ఏర్పాటు చేసింది. అందుకు ఒక రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్‌ను కూడా నియమించింది. కానీ ప్రస్తుతం రీ సర్వే డీటీలంతా డిప్యుటేషన్లపై జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్నారు.

సమస్యల పరిష్కారం ప్రశ్నార్థకం?

క్షేత్రస్థాయిలో సిబ్బందికితప్పని ఇబ్బందులు

పకడ్బందీగా రీ సర్వే

జిల్లాలో రీ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. గతంలో 285 గ్రామాల్లో రీ సర్వే జరిగింది. మిగతా 635 గ్రామాల్లో రీ సర్వే జరగాల్సి ఉంది. ప్రస్తుతం మండలానికి ఒక గ్రామం చొప్పున 35 మండలాల్లో రీ సర్వే ప్రారంభించాం. ఎవరైనా భూ యజమాని అందుబాటులో లేకపోతే వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్‌ చేసి గట్లు చూపెడతాం. డిప్యుటేషన్లపై ఉన్న రీ సర్వే డీటీలనుకూడా పంపుతాం. – కె.మురళీకృష్ణ,

జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారి,

No comments yet. Be the first to comment!
Add a comment
రీ సర్వేత్రా సమస్యలే? 1
1/2

రీ సర్వేత్రా సమస్యలే?

రీ సర్వేత్రా సమస్యలే? 2
2/2

రీ సర్వేత్రా సమస్యలే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement