ప్రాజెక్టులో భద్రతా ప్రమాణాలు ముఖ్యం
వేముల: పర్యావరణానికి ఎలాంటి ముప్పు తలెత్తకుండా యురేనియం (యు సిఐఎల్) ప్రాజెక్టును నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ చెరు కూరి పేర్కొన్నారు. బుధవారం వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యు.సి.ఐ ఎల్) ప్రాజెక్టును కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సందర్శించి సంబంధిత అధికారులతో ప్రాజెక్ట్ పనులు, ఉత్ప త్తులు, ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ గనుల్లో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా భద్రత ప్రామాణాలను పాటించాలన్నారు. ప్రాజెక్టు నిర్వహణ, భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. ప్లాంటేషన్( మొక్కల పెంపకం) కార్యక్రమాన్ని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. యురేనియం గనులవల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండా చూడాలన్నారు. అలాగే జిల్లా విపత్తు నిర్వహణ కమిటీతో సమన్వయం చేసుకుంటూ మాక్ డ్రిల్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అంతకముందు యు.సి.ఐ.ఎల్ అధికారులు ప్రాజెక్టుపై పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు వివరించారు. యురేనియం ప్రాజెక్టుకు ఏ పల్లెలు దగ్గరగా ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతోందని అధికారులు అడిగి తెలుసుకున్నారు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాసుల రావు, యుసీఐఎల్ అధికారులు సుమన్ సర్కార్, కిశోర్ భగత్, శ్రీకాంత్, మాతి వన్నన్ సంజయ్ చటర్జీ, పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, ఆర్అండ్బీ డీఈ మాధవి, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
వేంపల్లె : వేంపల్లె పట్టణంలో ఆగిన రోడ్డు విస్తరణ, ప్రధాన రహదారుల నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. గండి రోడ్డులో ఆగిపోయిన విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ ఈఈ మాధవిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో నాలుగు రోడ్ల కూడలి నుంచి బైపాస్ వరకు 900 మీటర్లు మేర 72 అడుగుల రోడ్డు విస్తరణ పనులకు రూ.10 కోట్లు నిధులు మంజూరు చేసిందని, రోడ్డు విస్తరణలో గృహాలు, వాణిజ్య సముదాయాలు కోల్పోయిన లబ్ధిదారులకు రూ.18కోట్లు పరిహారం కూడా అందించారని ఈఈ సమాధానమిచ్చారు. ఇక్కడ ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని, సంబంధిత కాంట్రాక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి నిర్మాణ పనులను మొదలు పెట్టించాలని ఆర్అండ్బీ ఈఈ మాధవికి కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment