ఉచిత బియ్యంలో పాపాల పురుగులు | - | Sakshi
Sakshi News home page

ఉచిత బియ్యంలో పాపాల పురుగులు

Published Thu, Jan 30 2025 12:06 AM | Last Updated on Thu, Jan 30 2025 12:06 AM

ఉచిత

ఉచిత బియ్యంలో పాపాల పురుగులు

కలసపాడు : పేదలకు పంచాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. కార్డుదారులకు చేరాల్సిన బియ్యం బస్తాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. మరోవైపు చనిపోయిన వారి పేర్లతోనూ డీలర్లు బియ్యం దందా చేయడం బద్వేలు డివిజన్‌ పరిదిలోని కలసపాడు మండలం మహానందిపల్లె రేషన్‌ షాపులో తాజాగా వెలుగులోకి వచ్చింది. బద్వేలు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 172 రేషన్‌షాపులు ఉన్నాయి. ఈ మొత్తం రేషన్‌ షాపులకు 1080 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇందులో 40 శాతం బియ్యం వివిధ రూపాల్లో పక్కదారి పడు తున్నట్లు తెలుస్తోంది.

వెలుగులోకి సరికొత్త దందా

పేదల బియ్యాన్ని బొక్కేందుకు డీలర్లు రోజుకో పంథాలో వెళుతున్నారు. రకరకాల కుట్రలకు తెరతీస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బద్వేలు నియోజకవర్గంలో బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. ఇందులో భాగంగా కలసపాడు మండలం మహానందిపల్లె రేషన్‌ షాపు డీలరు చనిపోయినవారి పేర్లతో బియ్యం డ్రా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గాజులపల్లె సీతమ్మ చనిపోయి నాలుగేళ్లయింది. అదే గ్రామానికి చెందిన దేవసాని చిన్న కొండారెడ్డి చనిపోయి ఏడాది పూర్తెంది. వీరి పేర్లతో విఆర్‌ఓ.బయోమెట్రిక్‌ ద్వారా డ్రా చేస్తున్నట్లు తెలింది. ఇవి మచ్చుకు మాత్రమే.

దందా జరుగుతున్న తీరిది

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 75 శాతం మంది డీలర్లను మార్చి తమ పార్టీ కార్యకర్తలను డీలర్లుగా నియమించుకుంది. పేదలకు బియ్యాన్ని పంపిణీ చేసినందుకు డీలర్లకు క్వింటాకు రూ.140ల లెక్కన ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇది సరిపోదన్నట్లు డీలర్లు అడ్డదార్లు తొక్కు తున్నారు. కార్డు దారులు వేలిముద్రలు వేశాక తూకంలో బియ్యం వేసినట్లు రికార్డులో నమోదు చేసి సదరు కార్డుదారులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ బియ్యాన్ని అధికరేట్లకు దొడ్డిదారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే చనిపోయిన వారి లిస్టు తీసి వారి పేర్లను తొలగించకుండా విఆర్‌ఓ.ల బయో మెట్రిక్‌ ద్వారా బియ్యాన్ని డ్రాచేసి విక్రయిస్తున్నారు.

ప్రతినెలా 40 శాతం బియ్యం పక్కదారి

నియోజకవర్గంలో అంత్యోదయ,అన్నపూర్ట అహార భద్రతా కార్డులు దాదాపు 10 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.వీటికి ప్రభుత్వం 350 టన్నులకు పైగా బియ్యాన్ని నియోజకవర్గంలోని 172 రేషన్‌ షాపులకు కేటాయిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం కిలో బియ్యానికి రూ.39.35పై వరకు ఖర్చు చేస్తు న్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం కేటాయించిన బి య్యంలో దాదాపు 40 శాతం బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. కలసపాడు, కాశినాయన,పోరుమామిళ్ల,బి.కోడూరు మండలాల నుంచి రేషన్‌ బియ్యం చాలా వరకు బెంగుళూరు,చైనె,హైదారాబాద్‌ తదితర నగరాలకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ద్వారా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది

బియ్యం డ్రా చేసింది నిజమే

కలసపాడు మండలం మహానందిపల్లె రేషన్‌ షాపులో చనిపోయిన వారి పేర్లతో బియ్యం డ్రా చేసినట్లు తమకు సమాచారం వచ్చిందని తహసిల్దార్‌ మధురవాణి తెలిపారు.అక్కడికి వెళ్లి విచారించగా బియ్యం డ్రా చేసినట్లు తేలిందన్నారు. ఈ విషయాన్ని బద్వేలు ఆర్‌డిఓ.కు సమాచారం అందించామని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రేషన్‌ షాపుల్లో డీలర్ల నయా దందా

చనిపోయిన వారి పేర్లతో

బియ్యాన్ని కాజేస్తున్న డీల్లర్లు

వి.ఆర్‌.ఓ వేలిముద్రలతో బియ్యం దోపిడీ

పంపకాల్లో అధికారులకు

వాటా ఇస్తున్న డీలర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
ఉచిత బియ్యంలో పాపాల పురుగులు 1
1/1

ఉచిత బియ్యంలో పాపాల పురుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement