వైభవంగా ధ్వజారోహణం
రథోత్సవానికి పకడ్బందీ చర్యలు
కడప కల్చరల్ : దేవతలారా రండి....కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించండి అంటూ వేద పండితులు సకల దేవతలను ఆహ్వానించారు. తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో బుధవారం నుంచి ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్ తదితరుల అర్చక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ధ్వజపూజ నిర్వహించారు.
కొడిముద్దల పంపిణీ
బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా భక్తులకు అందజేసే దీనిని గరుడుని ప్రసాదంగా కొడిముద్దలుగా పేర్కొంటారు. సంతానం లేని వారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే తప్పక ఫలం లభిస్తుందన్న విశ్వాసం ఈ ప్రాంత భక్తుల్లో ఉండడంతో మహిళలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఆ ప్రసాదం కోసం పోటీలు పడ్డారు. అనంతరం అలంకరించిన తిరుచ్చి వాహనంపై స్వామిని ఊరేగించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను ఊయలపై ప్రతిష్ఠించారు. భక్తిగీతాలాపనల మధ్య స్వామికి ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారిని చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో వైభవోపేతంగా ఊరేగించారు.
నేడు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9.00 నుంచి 10.00 గంటల్లోగా సూ ర్యప్రభ వాహనం, స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల సేవ, అన్నమాచార్య కీర్తనల ఆలాపన, రాత్రి 8.00 గంటలకు పెద్ద శేష వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది.
కడప కల్చరల్ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర వరి 4న నిర్వహించనున్న రథోత్సవానికి పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టనున్నామని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన దేవునికడప ఆలయాన్ని సందర్శించా రు. ఈ సందర్బంగా ఆయన ఆ క్షేత్రంలోని నా లుగు మాడవీధులను పరిశీలించారు. అక్కడ ఏ ర్పాటు చేసిన, చేయనున్న పోలీసు బందోబ స్తును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 4న రథసప్తమి నాడు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడారు. తొలుత ఎస్పీ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న పూజల్లో పాల్గొన్నారు. చిన్నచౌకు ఎస్ఐ రవికుమార్, రాజరాజేశ్వర్‌రెడ్డి, దేవదాయశాఖ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment