బ్రహ్మోత్సవం.. ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవం.. ప్రారంభం

Published Wed, Jan 29 2025 1:34 AM | Last Updated on Wed, Jan 29 2025 1:34 AM

బ్రహ్

బ్రహ్మోత్సవం.. ప్రారంభం

అంకురార్పణ పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

కడప కల్చరల్‌: కడప రాయుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్‌, త్రివిక్రమ్‌లతోపాటు మరికొందరు వేద పండితులు దీక్షా తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత విశ్వక్సేనునికి పూజ చేసి పుణ్యాహవాచనం నిర్వహించారు. సాయంత్రం రక్షా కంకణధారణ నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మృత్సంగ్రహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్ట మట్టిని పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి చేర్చి అంకురార్పణ నిర్వహించారు.ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన అంకురార్పణ కార్యక్రమాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. టీటీడీ నుంచి వచ్చిన సూపరింటెండెంట్‌ హనుమంతయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్యుల కీర్తనలను ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. చివరగా హరికథా కాలాక్షేపం నిర్వహించారు.

నేడు ధ్వజారోహణం

బ్రహ్మోత్సవాల్లోభాగంగా బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.00 గంటల్లోపుగా తిరుచ్చి, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మ వారి సన్నిధిలో ఊంజల సేవ నిర్వహిస్తారు. ఇదే సమయంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామిపై కీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 6.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామిని కొలువుదీర్చనున్నారు.

కడప రాయుడు కప్పురపు రాయుడయ్యాడు. బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవ కళను సంతరించుకున్నాడు. పరిసరాలన్నింటికీ కొత్త పరిమళాలను సంతరించి పెట్టాడు. జిల్లాకే తలమానికంగా నిలిచే తిరుమల వాసుని ప్రతిరూపంగా కడప గడపను దివ్యంగా వెలిగిస్తూ అంతటా ఉత్సవ శోభను కల్పించాడు. నేటి నుంచి పది రోజులపాటు రోజుకో వాహనంపై సూర్యప్రభ తేజంతో వెలిగిపోనున్నాడు.

భక్తిశ్రద్ధలతో అంకురార్పణ

No comments yet. Be the first to comment!
Add a comment
బ్రహ్మోత్సవం.. ప్రారంభం 1
1/1

బ్రహ్మోత్సవం.. ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement