మైదుకూరు రీ సర్వే డీటీ అంకాలయ్యను సీకే దిన్నెకు బదిలీ చేసి అక్కడున్న వేణుగోపాల్‌ను కడపకు పంపారు. అంకాలయ్యను డిప్యుటేషన్‌పై జాయింట్ కలెక్టర్ సీసీగా నియమించారు. సీకే దిన్నెలోభూముల విలువ అధికంగా ఉంటుంది గనుక సమస్యలు కూడా అధికమే. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు రీ సర్వే డీటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా దూరం మండలాలకు చెందిన డీటీలను సీసీగా నియమించుకుని ఉంటే బాగుండేదంటున్నారు. కడప రీ సర్వే డీటీగా నియమించిన చక్రధర్ డిప్యుటేషన్‌పై కలెక్టరేట్ డి–సెక్షన్‌లో పనిచేస్తున్నారు. అలాగే పోరుమామిళ్ల రీసర్వే డీటీ రాజశేఖర్‌రెడ్డి, పెండ్లిమర్రి రీ సర్వే డీటీ సునీల్ కూడా డిప్యుటేషన్‌పై కలెక్టరేట్‌లో ఉన్నారు. ఇక మరో రీ సర్వే డీటీ నరసింహప్రసాద్ చాలాకాలంగా కడప ఆర్డీఓ సీసీగా కొనసాగుతున్నారు. జిల్లాలో ఇంకాపలువురు రీ సర్వే డీటీలు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇలా వీరంతా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే రీ సర్వే పనులు కుంటుపడే ప్రమాదం ఉంటుంది. రీ సర్వేలో సమస్యలు వస్తే పరిష్కరించేందుకు రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ ఉంటారని ఉన్నతాధికారులు చెబుతున్నా.. రోజువారి కార్యకలాపాల్లో తలమునకలై ఉండే రెగ్యులర్ డీటీలు రీ సర్వే పనులు ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రమైన కడప చుట్టుప్రక్కల మండలాలకు చెందిన ఆర్‌ఐలను కూడా డిప్యుటేషన్లపై తరలించడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. రీ సర్వేలో ఇన్ని లోపాలున్నప్పుడు ఈ కార్యక్రమం ఎలా ముందుకు సాగుతుందనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment