పక్కాగా ‘ఈ–ఆఫీస్’
కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, టైపిస్టులు, సిబ్బందికి ఈ–ఆఫీస్ నిర్వహణపై ఎన్ఐసీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ–ఆఫీస్ ఆచరణలో లేని శాఖలు అందుకు సంబంధించిన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చుకోవాలన్నారు. జిల్లా ఇన్ఫర్మేషన్ అధికారి డాక్టర్ టి.ఆర్ విజయ్ కుమార్, ఈ–ఆఫీస్ టెక్నీకల్ అసిస్టెంట్స్ శ్రీనివాసరావు, అనిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment