‘తాత్కాలిక నిర్మాణాల పేరిట వెయ్యి కోట్లు స్వాహా’ | GVL Narasimha Rao Fire On TDP Government Over Corruption | Sakshi
Sakshi News home page

‘తాత్కాలిక నిర్మాణాల పేరిట వెయ్యి కోట్లు స్వాహా’

Published Tue, Nov 20 2018 9:51 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

ఏపీ రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు రంగుల కలగా మార్చడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్‌ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వం అని కొత్త అర్థం చెప్పారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని నిర్మాణం పేరిట చేస్తున్న దోపిడిపై టీడీపిని కడిగిపారేశారు. రాజధాని నిర్మాణాన్ని తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టె అంశంగా మార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూదందా వెనుక వేలకోట్ల కుంభకోణం ఉందని, అడ్డగొలుగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తాత్కాలికి నిర్మాణాల ముసుగులో వెయ్యి కోట్లు స్వాహా చేశారని జీవిఎల్‌ ఆరోపించారు. అమరావతిని టీడీపీ తన వ్యాపారాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement