ఆకాశంలో బ్లాక్‌ రింగ్‌.. ఏలియన్స్‌ వచ్చేశారు! | Mysterious Smoke Ring Sighted Floating In Lahore Sky, Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఆకాశంలో బ్లాక్‌ రింగ్‌.. ఏలియన్స్‌ వచ్చేశారు!

Published Wed, Jan 22 2020 4:23 PM | Last Updated on Wed, Jan 22 2020 4:55 PM

లాహోర్‌ : పాకిస్తాన్‌లోని లాహోర్‌ ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది.  నల్లరంగులో ఉన్న వింత ఆకారం ఒకటి ఆకాశంలో తేలియాడుతూ కనిపించింది. మేఘం మాదిరి గగనతలంలో తేలియాడుతున్న బ్లాక్‌ రింగ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాలుష్యం కారణంగా బ్లాక్‌ రింగ్‌ ఏర్పడిందని కొందరు పేర్కొనగా.. వినాశనానికే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. 

మానవుడు చేస్తున్న కాలుష్యం వల్లే ఆకాశంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇంకొంత మంది నెటిజన్లు పేర్కొన్నారు. లాహోర్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం వల్లే పొగ అంతా వలయాకారంలో మారి ఆకాశంలో తేలియాడుతున్నదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మరి కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై తమదైనశైలిలో కామెంట్లు చేస్తు జోకులు పేలుస్తున్నారు  ‘ ఇది కచ్చితంగా ఏలియన్స్‌ పనే.. వాళ్లు వచ్చేస్తున్నారు’,, ఏలియన్స్‌ పాకిస్తాన్‌లోని వెళ్లరు. కచ్చితంగా వారు అమెరికాలోనే ల్యాండ్‌ అవుతారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement