2019 elections
-
‘అవును.. ఆ రెండు పార్టీలను చీల్చే మేం అధికారంలోకి వచ్చాం’
సాక్షి,ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ రచయిత ప్రియమ్ గాంధీ-మోదీతో 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. తాను ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను. రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందని అన్నారు. అదే ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.శివసేన (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాజకీయ పరిణామాలతో ఆ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ, శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఆ కూటమిలో మహరాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు కొనసాగుతున్నారు. -
నాడు కత్తుల కొలిమి– నేడు పొత్తుల చెలిమి
సాక్షి, అమరావతి: చాలా కాలం తర్వాత ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆదివారం నాడు ఉమ్మడిగా ఒకే వేదిక నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు ఏం మాట్లాడతారోనని రాజకీయ పరిశీలకులతో పాటు రాష్ట్రంలో చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఎందుకటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి నిష్క్రమించాక మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయించారు. ప్రధాని పర్యటన సమయంలో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీని ఉద్ధేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే... దానికి బదులు ప్రధాని మోదీ సైతం తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఆయన ఏమన్నారు.. ఈయన ఏమన్నారంటే... 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని మోదీనుద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన విమర్శలు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి ► ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీయే నుంచి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి’ –మార్చి 29, 2018న రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు. ► ‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, దానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. మోదీ జీ, మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు’ – ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్లో చంద్రబాబు ► మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా లేదు. మీకంటే వాళ్లే నయం. కాటన్ దొర ఇచ్చిన నీళ్లయినా తాగుతున్నాం. నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్‌షా రాజకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోయారు – 2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ► ‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి’. – 2018 జూన్ 9న నెల్లూరు సభలో చంద్రబాబు ► ‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్దార్. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయేమో. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగవు’. – 2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు ► ‘కేంద్రం సహకారం అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి టీడీపీకి లేదు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూ టర్న్ బాబు అనుకుంటున్నారన్నది మీ అందరికీ తెలుసు.‘ ► ‘ఏపీలో పరిస్థితి బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్ర మాదిరిగా ఉంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి దానిని కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ది చెందాలన్నది మా ఆలోచన అయితే... యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు’ – 2019 ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మోదీ. ► దేశం కోసం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెలాంటి బెరుకు లేదు.ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు(చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు.– 2019 మార్చి 2న విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ. ► ‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశా. భయమనేది నా జీవితంలో లేదు’. – 2018లో మార్చి 6 తేదీన విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు. ► ‘విభజన హామీలను నాలుగు బడ్జెట్లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ పెట్టలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా? ఎప్పుడైనా మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా? మీరు ఒక్కరే దేశాన్ని కాపాడతారా? ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా? –2018 మార్చి 7న సమావేశంలో చంద్రబాబు. ► ‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’. – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలివి. ► ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు’. – 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు. ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు ► ‘లోకే శ్ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం’ ► ‘ప్రజలారా మీరే చెప్పండి. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నాయన ఆయన కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని హామీ ఇచ్చారా లేదా? ఈ రోజు ఆయన ఎన్టీఆర్‌కు గౌరవమిస్తున్నారా? సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది. కానీ ఆయనలాంటి సీనియర్ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. ఇదంతా యువత తెలుసుకోవాలి్సన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు’ ► ‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నాకంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటారు. మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడు తక్కువ చేయలేదు. అవును మీరు సీనియర్. కూటములు మార్చడంలో. కొత్త కూటములు కట్టడంలో. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో. ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. ►‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం’. – 2019 ఫిబ్రవరి 10న గుంటూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. -
ఎన్డీఏ సర్కార్‌పై బాంబు పేల్చిన ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య సంచలన విషయాలు ప్రకటించారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఆరు నెలల పదవీకాలం ఉండగానే 2019లో తన పదవికి రాజీనామా చేసిన ఆచార్య తన పుస్తకంలో కొన్ని విషయాలను తొలిసారి బహిర్గతం చేశారు. ముఖ్యంగా 2018లో కేంద్రం, ఆర్బీఐ మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసిన సంఘటనల వివరాలను పంచుకున్నారు. అంతేకాదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాలను మూసి తలుపుల వెనుక చర్చించడం కంటే బహిరంగంగా చర్చించడం మేలని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు 2.-3 లక్షలు అడిగిని ఎన్డీఏ సర్కార్ ప్రధానంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఖర్చు కోసం 2018లో బ్యాలెన్స్ షీట్ నుండి 2-3 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలని ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను (ఆర్బిఐ) తిరస్కరించిందని విరాల్ ఆచార్య వెల్లడించారు. మింట్ నివేదిక ప్రకారం 2020లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే పుస్తకానికి అప్డేట్ ప్రిల్యూడ్ బుక్‌లో దీనికి సంబంధి చాలా విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రికార్డు లాభాలు బదిలీ గత ప్రభుత్వాల హయాంలో ఆర్బిఐ కి చెందిన నగుదును ప్రభుత్వ ఖాతాకు బదిలీకి సంబంధిచి బ్యూరోక్రసీ అండ్ ప్రభుత్వంలోని క్రియేటివ్ మైండ్స్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రతీ ఏడాది ఆర్బీఐ తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పంచిపెట్టే బదులు, నోట్ల రద్దుకు దారితీసిన మూడేళ్లలో, ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసిందని చార్య చెప్పారు. అలాగే ఆర్బిఐపై ఒత్తిడి తీసుకురావడానికి మరో కారణం డివెస్ట్మెంట్ రాబడులను పెంచడంలో ప్రభుత్వం వైఫల్యం అని పేర్కొన్నారు. అలాగే 2023లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ మెరుగుపడటాన్ని ప్రస్తావించిన ఆయన బ్యాడ్ లోన్స్ గుర్తింపు, దిద్దుబాటు చర్యల అమలు లక్ష్యంగా 2015లో రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన ఆస్తుల నాణ్యత సమీక్ష నిరంతరం అమలుతోనే సాధ్యమైందన్నారు. ఆర్బీఐ సెక్షన్ -7 వివాదం నిధుల బదిలీలో ఆర్బీఐ 80 ఏళ్ల చరిత్రలో సెక్షన్ 7ను సెక్షన్‌ను అమలు చేయడం అనూహ్యమైన చర్య అని ఆర్థిక నిపుణులు భావించారు. ఈ విభేదాలు, ఒత్తిడి నేపథ్యంలోనే ఆప్పటి ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడానికి తొమ్మిది నెలల ముందు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన వ్యక్తిగత కారణాలను ఉదహరించినప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒత్తిడి క్రమంలోనే పటేల్ రాజీనామా అని అంతా భావించారు. కాగా 2022లో రూ.30,307 కోట్లతో పోలిస్తే FY23లో, సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది. .2019లో ఆర్బీఐ అత్యధికంగా రూ.1.76 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఆర్బిఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుకు అనుగుణంగా, ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్, ఎంత మూలధన నిల్వ ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు. -
అది వైఎస్సార్సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (15వ ఏపీ శాసనసభ) పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనున్న సందర్భంగా కిందటి ఎన్నికలను ఒకసారి గుర్తుచేసుకుందాం. అంతకుముందు.. లోక్‌సభతోపాటు జరగాల్సిన ఈ ఎన్నికలకు 2019 మార్చి 10న ఆదివారం భారత ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2019 మే 27లోగా ఏపీ అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు జరిపించాల్సి ఉంది. దీంతో ఎలక్షన్ షెడ్యూల్ ప్రక్రియ పూర్తి కావడానికి రెండున్నర నెలల ముందు తేదీలు అధికారికంగా ప్రకటించారు. కిందటి శాసనసభ ఎన్నికల కార్యక్రమాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర 16వ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తారు. అంటే, 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎలక్షన్ల తేదీలు వస్తాయి. పార్లమెంటుతోపాటు జరిగిన కిందటి శాసనసభ ఎన్నికల ప్రక్రియ 2019 మార్చి 10–మే నెల 23 మధ్య 75 రోజుల్లో పూర్తయింది. మార్చి 10న ఎన్నికల షెడ్యూలు రాగా, మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు ఒకే రోజున (2019 ఏప్రిల్ 11న) పోలింగ్ జరిగింది. ఎన్నికల కార్యక్రమం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన మార్చి 18 నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చివరిసారి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఈ జోడు ఎన్నికల్లో ప్రస్తుత పాలకపక్షం వైఎస్సార్సీపీ పార్టీ మున్నెన్నడూ కనీవినీ ఎరగని మెజారీటీతో ఘనవిజయం సాధించింది. టీడీపీ అప్రజాస్వామిక చర్య.. ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ఆరు నెలల ముందే రాష్ట్రంలో ఓటర్ల వ్యక్తిగత వివరాలను నాటి పాలకపక్షం అక్రమంగా తనకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయంత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి ఆరోపణలు మాత్రమే కాదని వాస్తవాలని తర్వాత ప్రజలకు అర్ధమైంది. ఇంటింటికి వెళ్లి సర్వేల పేరుతో సేకరించిన ఓటర్ల వివరాలను బట్టి నాటి ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులని భావించిన ప్రజల ఓట్లను తొలగించే కార్యక్రమం మొదలవ్వగా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ యావత్తూ ఉద్యమించింది. ఫలితంగా నాటి టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు అడ్డకట్టవేయగలిగారు. ఈసీ చర్యలతో ప్రజాస్వామ్యానికి విజయం.. ఎన్నికల కమిషన్ సకాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరిగింది. మే 23న జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు ఐదున్నర కోట్ల ఆంధ్రుల అభీష్టానికి అనుగుణంగా వైఎస్పార్సీపీ 22 లోక్‌సభ, 151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని చరిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. మరి ఐదేళ్ల పదవీ కాలం తర్వాత అంటే 2024 మే నెలాఖరులోగా జరగాల్సిన ఏపీ 16వ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఆరు మాసాల ముందు రాష్ట్రంలో తెలుగుదేశం హయాంతో పోల్చితే మామూలు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రజాహిత విధానాలు, కార్యక్రమాల కారణంగా పాలకపక్షం వరుసగా రెండోసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నమోదు చేసుకుంటుందని ఎన్నికల, రాజకీయ పండితులు, విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2019 ఏప్రిల్–మే ఎన్నికల ముందు ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)తో పాటు కొత్తగా రూపొందించిన ప్రజా సంక్షేమ పథకాల ప్రకారం గత నాలుగున్నర ఏళ్లుగా నగదు బదిలీ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రా ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనతో గరిష్ఠ స్థాయిలో సంతృప్తి చెందుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ప్రజలు సిద్ధం.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి మొదటి భాగంలో ప్రకటించే ఏపీ అసెంబ్లీ ఎన్నికల తేదీల గురించి జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కిందటి ఎన్నికల్లో నాటి పాలకపక్షం టీడీపీ ఓటమిపై లేదా వైఎస్సార్సీపీ విజయంపై అప్పటి రూలింగ్ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసిన కట్టుకథలను నమ్మే జనం కొంత మందైనా ఉన్నారు. కానీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ మరోసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంపై అత్యధిక ప్రజానీకానికి ఎలాంటి అనుమానాలు లేవు. 2024 మార్చి మొదటి వారం తర్వాత నుంచి మే నెలాఖరులో ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించే రెండున్నర నెలల కాలం మరోసారి ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని బంగారు బాటన నడిపించడానికి అత్యంత కీలకమైనది. వైఎస్సార్సీపీ పార్టీని రెండోసారి వరుసగా గెలిపించి తమ సంక్షేమానికి, ప్రగతికి మార్గం సుగమం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది నేడు జగమెరిగిన సత్యం. :: విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు. -
మంటలు రేపిన మాటలు..
రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం... నోటికి ఏదొస్తే అది మాట్లాడటంగా మారిపోయింది. 2019 సంవత్సరం ఎన్నికల ఏడాది కూడా కావడంతో ఎందరో నేతలు నోరు జారారు. దిగజారుడుకు హద్దుల్లేవని నిరూపించారు. అలాంటి మాటలు కొన్ని చూస్తే... మేకిన్ ఇండియా కాదు రేపిన్ ఇండియా – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముస్లింలీగ్ గ్రీన్ వైరస్ – యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం గాడ్సే దేశభక్తుడు – ప్రజ్ఞాఠాకూర్, బీజేపీ ఎంపీ జయప్రద లోదుస్తులు ఖాకీ – ఆజంఖాన్, ఎస్పీ నాయకుడు తీరైన తీర్పులు దశాబ్దాలే కాదు... కొన్ని శతాబ్దాల సందిగ్ధానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం తెరదించిన సంవత్సరమిది. శ్రీరాముడి జన్మభూమిగా భావించే అయో«ధ్య అంశం మొదలుకొని... రాజకీయ యవనికను కుదిపేసిన రాఫెల్ డీల్ వరకు ఎన్నెన్నో కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో మత ప్రాధాన్యమైనవే కాదు!!. మహిళల హక్కులకు సంబంధించినవి... ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చే తీర్పులూ ఉన్నాయి. ఆ మేటి తీర్పులు సంక్షిప్తంగా... జన్మభూమి... రాముడిదే! దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిలో హిందువులు రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతిం చింది. ముస్లింలకు మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని వేరొకచోట కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. శబరిమలకు మహిళలు... కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్త్రుత ధర్మాసనానికి బదిలీచేస్తూ 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వయసు రీత్యా కొన్ని వర్గాలకు చెందిన మహిళల ప్రవేశంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై మాత్రం కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 14న ఈ తీర్పుని వెలువరించింది. న్యాయమా! నువ్వు ‘ఉన్నావ్’... ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై ఘోర అత్యాచారం జరగటంతో దేశం నిర్ఘాంతపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అధికార బీజేపీ ఎమ్మెల్యే కావటంతో కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పార్టీ అతన్ని బహిష్కరించింది. అయితేనేం!! నేరాన్ని కప్పిపుచ్చే యత్నాలు ఆగలేదు. బాధిత మహిళను కిడ్నాప్ చేయటం... ఆమె తండ్రి లాకప్ హత్య... బాధితురాలు సహా బంధువులను యాక్సిడెంట్ రూపంలో చంపే ప్రయత్నాలు... ఇలా ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ నాయకుడు నిందితుడైతే కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ తిరిగింది. దీంతో ఈ కేసుపై యావద్దేశం ఒక్కటయింది. చివరికి సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుంది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితం... బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 19న సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాఫెల్... విచారణకు నో! రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయటానికి ఆ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన గత తీర్పులను పునఃపరిశీలించాలన్న డిమాండ్‌ని కోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మంత్రులు యశ్వంత్ సింగ్, అరుణ్ శౌరి దాఖలు చేసిన పిటిషన్లపై మే 10న కోర్టు విచారణ ముగించి తన ఉత్తర్వులను రిజర్వులో ఉంచింది. నవంబరు 14న తీర్పు వెలువరించింది. -
2019 ఎన్నికల అంకెల్లో అవకతవకలు
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాల్సిందిగా శుక్రవారం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. దాదాపు 347 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యకు, పోలైన ఓట్లకు మధ్య తేడాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరపాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్), కామన్ కాజ్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును కోరాయి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి తేడాలు రాకుండా ఓ పటిష్టమైన పద్ధతి రూపకల్పనకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని వీరు నివేదించారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందుగా అంకెలను స్పష్టంగా లెక్కకట్టాలని కోరింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పత్రాలు 17సీ, 20, 21సీ, 21డీ, 21ఈల సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాని ఏడీఆర్ కోరింది. దేశవ్యాప్తంగా ఎన్నికల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పిటిషన్ వేసుకునేందుకు అవకాశముండగా, ఫలితాల కచ్చితత్వం, అంకెల్లోని తేడాల కారణంగా వచ్చే అనుమానాలను తీర్చేందుకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఏడీఆర్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. -
కొలిక్కిరాలే !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రాదేశిక ఎన్నికలు పూర్తయ్యాయి. జెడ్పీ చైర్పర్సన్లు.. చైర్మన్లు.. వైస్ చైర్మన్లు.. జెడ్పీటీసీలు.. ఎంపీటీసీలు ఎవరో తేలిపోయారు. వచ్చే నెల ఐదో తేదీన మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా పరిషత్‌లు కొలువుదీరనున్నాయి. అదే రోజు నుంచి ఆయా పరిషత్‌లలో పాలన ప్రారంభం కానుంది. కానీ.. కొత్తగా కొలువుదీరిన జిల్లాల్లో పరిషత్ కార్యాలయాల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. కనీసం కొత్త పరిషత్ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల కేటాయింపు జరగలేదు. మిగిలిన పక్షం రోజుల్లో జెడ్పీ భవనాల ఖరారు.. ఉద్యోగుల నియామకాలు అధికారులకు సవాలుగా మారింది. మరోవైపు ఉద్యోగుల నియామకాలు, భవనాల ఎంపికకు సంబంధించి ఈనెల 15న పంచాయతీరాజ్ కమిషనర్‌తో జెడ్పీ సీఈఓలతో జరగాల్సిన సమావేశం రద్దు కావడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సమావేశం తర్వాతే భవనాల ఖరారు, ఉద్యోగుల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని జెడ్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అరకొర సదుపాయాల మధ్య కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయనే భావన ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, చైర్మన్లు, సీఈఓలకు ప్రభుత్వం కొత్త వాహనాలు కేటాయించింది. ఈ వాహనాలు ఈ నెలాఖరులోగా ఆయా జిల్లాలకు చేరుకుంటాయని సమాచారం. ∙కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో 64 మండలాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా చారగొండ, పదర, మూసాపేట, రాజాపూర్, మదనాపురం, చిన్నంబావి, మరికల్, మహబూబ్‌నగర్ రూరల్, కృష్ణ, ఊర్కొకొండ, పెంట్లవెల్లి, రాజోలి, ఉండవెల్లి, కేటీ దొడ్డి, రేవల్లి, శ్రీరంగాపురం, అమరచింత మొత్తం 17 మండలాలు ఏర్పాటయ్యాయి. దీంతో మండలాల సంఖ్య 81కు చేరింది. అదే సమయంలో పది మండలాలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కలిశాయి. దీంతో ఉమ్మడి పాలమూరు 71 మండలాలకు పరిమితమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పాటు చేశారు. 15 మండలాలతో మహబూబ్‌నగర్ జిల్లా ఏర్పాటు కాగా 11 మండలాలతో నారాయణపేట, 20 మండలాలతో నాగర్‌కర్నూల్, 12 మండలాలతో జోగులాంబ గద్వాల, 14 మండలాలతో వనపర్తి జిల్లా ఏర్పాటైంది. తాజాగా గత నెలలో మూడు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి. వచ్చే నెల నాలుగో తేదీన ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది. మరుసటి రోజే ఎన్నికయిన కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. గడువులోగా గగనమే...! కొత్తగా కొలువుదీరిన జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఇంతవరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. కనీసం భవనాలు సైతం ఖరారు కాలేదు. పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో పరిషత్ కార్యాలయాల భవనాలు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో భవనాలు లేకపోవడంతో బిజినేపల్లిలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని జెడ్పీకి కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అటు వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రాల్లో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ భవనాలు, నారాయణపేటలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం జిల్లా పరిషత్ కార్యాలయాలకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వాన్ని నివేదించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాత భవనాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఐదు జిల్లా పరిషత్‌లు.. 60 మంది ఉద్యోగులు కొత్తగా కొలువుదీరనున్న జెడ్పీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల విభజన, కేటాయింపుల విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొత్తగా కొలువుదీరనున్న జెడ్పీ కార్యాలయాల్లో ఉద్యోగుల కేటాయింపు ఏ ప్రాతిపదికన జరుగుతుందో అనే ఉత్కంఠ ఆయా ఉద్యోగుల్లో నెలకొంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేస్తోన్న ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు కానున్న జెడ్పీలకు సమానంగా విభజించాలని ప్రాథమికంగా> నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో ఐదుగురు డీప్యూటీ సీఈఓలున్నారు. వీరందరికీ కొత్త జిల్లా పరిషత్‌లకు ఇన్చార్జ్ సీఈఓలుగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జెడ్పీలో మొత్తం 60మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఏడుగురు సూపరింటెండెంట్లు ఉండగా మహబూబ్‌నగర్ జెడ్పీకి ముగ్గురిని, మిగిలిన నాలుగు జెడ్పీ కార్యాలయాలకు ఒక్కొక్కరి చొప్పున నియమించాలని నిర్ణయించారు. 13మంది సీనియర్ అసిస్టెంట్లు ఉండగా నాగర్‌కర్నూల్‌కు నలుగురు, మహబూబ్‌నగర్‌కు ముగ్గురు, మిగిలిన మూడు జెడ్పీలకు ఇద్దరి చొప్పున కేటాయించనున్నారు. 21 మంది జూనియర్ అసిస్టెంట్లలో మహబూబ్‌నగర్‌కు తొమ్మిది మంది, మిగిలిన నాలుగు జెడ్పీలకు ముగ్గురి చొప్పున, ఉన్న ఐదుగురి టైపిస్ట్‌లలో ఒక్కొక్కరికి ఒక్కో జెడ్పీకి, 14 మంది అటెండర్లలో మహబూబ్‌నగర్ జెడ్పీ కార్యాలయానికి పది మంది, మిగిలిన నాలుగు జెడ్పీలకు ఒక్కొక్కరి చొప్పున కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. అయితే.. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకే ఉద్యోగుల విభజన జరగనుంది. అలాగే.. ప్రస్తుతం ఉమ్మడి జెడ్పీ కార్యాలయంలో అటెండర్ మొదలు డిప్యూటీ సీఈఓలుగా పని చేస్తోన్న అందరికీ పదోన్నతులు వచ్చే అవకాశాలుండడంతో ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
ప్రారంభం కాని ‘పుర’ ఎన్నికల కసరత్తు
‘పుర’ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. జూన్ లేదా జూలై లోగా పూర్తవుతాయని భావించిన ఈ పోరుకు మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. పారదర్శక పాలన కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన కొత్త చట్టం రూపకల్పనలో జాప్యం.. గతేడాది మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తేలకపోవడం.. విభజనకు నోచుకోని వార్డులు.. వెరసి మున్సిపల్ ఎన్నికలకు సమయం పట్టనుంది. దీంతో ఐదు నెలలుగా వరుసగా జరుగుతున్న ఎన్నికలకు బ్రేక్ పడినట్లే. ప్రచారం జరిగింది. ప్రజాప్రతినిధులు సైతం ‘పుర’ పోరుకు సన్నద్ధం కావాలని తమ కేడర్‌ను పలు సందర్భాల్లో సూచించారు. దీంతో కౌన్సిలర్‌గా పోటీకి సిద్ధమవుతోన్న ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. క్షేత్రస్థాయిలో తమ పట్టు కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు నెలలు కష్టపడితే చాలు ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలవొచ్చనే ధీమాతో తమ వార్డుల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వార్డుల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న సందర్భాలు పలు పురపాలికల్లో ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పార్లమెంట్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని జూన్ లేదా జూలై లోగా ఎన్నికలు పూర్తవుతాయని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు ‘పుర’పోరుకు అడ్డంకిగా మారాయి. గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత సర్పంచ్, ఈ ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభ, మే నెలలో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. దీంతో ప్రాదేశిక ఎన్నికల వెంటనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని.. జూన్ లేదా జూలై లోగా ఎన్నికల నిర్వహణ పూర్తవుతుందనే ప్రచారం జరిగింది. ప్రజాప్రతినిధులు సైతం ‘పుర’ పోరుకు సన్నద్ధం కావాలని తమ కేడర్‌ను పలు సందర్భాల్లో సూచించారు. దీంతో కౌన్సిలర్‌గా పోటీకి సిద్ధమవుతోన్న ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. క్షేత్రస్థాయిలో తమ పట్టు కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు నెలలు కష్టపడితే చాలు ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలవొచ్చనే ధీమాతో తమ వార్డుల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వార్డుల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న సందర్భాలు పలు పురపాలికల్లో ఉన్నాయి. ‘కొత్త చట్టం’లో ఏముంటుందో? ఎన్నికలతో ముడిపడి ఉన్న మున్సిపల్ కొత్త చట్టంపై సర్వత్రా చర్చ మొదలైంది. అసలు ఈ చట్టం ఏతరహాలో ఉండబోతుంది? పుర‘పాలన’లో ఎలాంటి గుణాత్మక మార్పులు రానున్నాయి? అధికారులు, కౌన్సిలర్ల అధికారాలపై ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. పంచాయతీరాజ్ చట్టం మాదిరిగానే కొత్తగా మున్సిపల్ చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధికారుల్లో జవాబుదారి తనం పెరగడం.. అవినీతికి పాల్పడే, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు, సుపరిపాలన లక్ష్యంగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లో కొత్త చట్టం రూపకల్పన జరుగుతోంది. చట్టం ఎంత మెరుగ్గా రూపకల్పన చేస్తే అంత మెరుగైన పాలన, సేవలు అందుతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. విలీన సమస్య.. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎ లాంటి స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలు ఉండగా.. ఏ డాది క్రితం నారాయణపేట, అయిజ మి నహా 16 మున్సిపాలిటీల్లో మొత్తం 58 గ్రా మాలు విలీనం అయ్యాయి. సుమారు లక్ష మంది పట్టణ ఓటరు జాబితాలో చేరారు. అయితే ఈసారి జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా చేరిన ఓటర్లు కూడా ఓటేయాల్సి ఉంది. మూడు నెలల క్రితమే వి లీన గ్రామాల్లో జనాభా, ఓటర్ల లెక్కను ము న్సిపల్ అధికారులు తేల్చారు. విలీనానికి ముందు మహబూబ్‌నగర్ మున్సిపల్ పరిధిలో 2,17,942మంది ఓటర్లు ఉంటే.. పది విలీన గ్రామాలకు చెందిన 43,695 మంది ఓటర్లు కొత్తగా ఈ మున్సిపల్ పరిధిలో చేరారు. దీంతో ఓటర్ల సంఖ్య 2,61,637కు పెరిగింది. ఇలా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓటర్ల తీరును పరిశీలిస్తే.. విలీన గ్రామాల్లో కొత్త వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒకటి, రెండు, మూడు గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో జనాభా తక్కువగా ఉంటే వాటిని ఆయా వార్డుల్లో కలుపుతారనే ప్రచారమూ జరుగుతోంది. ఇలా చేస్తే ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని మున్సిపాలిటీల్లోనూ వార్డుల విభజన అనివార్యమైంది. అదే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. వార్డులను ఏ ప్రాతిపదికన విభజిస్తుందో అనే చర్చ జరుగుతోంది. -
మండల పరిషత్‌లపై గులాబీ జెండా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల పరిషత్‌లపై గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో అత్యధిక ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు అబ్దుల్లాపూర్‌మెట్, కడ్తాల్, మంచాల ఎంపీపీలు దక్కగా.. బీజేపీ కందుకూరు, యాచారం స్థానాలను గెలుచుకుంది. ఒక స్థానాన్ని ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) ఎగురేసుకుపోయింది. కోరం లేకపోవడంతో మరో రెండు చోట్ల ఎన్నిక వాయిదా పడింది. కాగా, ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పలు చోట్ల నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ఎంపీటీసీలు.. కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ వాళ్లు టీఆర్ఎస్కు ఓట్లేశారు. ఇంకొన్ని చోట్ల గురువారం రాత్రి వరకు శిబిరాల్లో ఉన్న ఎంపీటీసీలు.. తీరా ఎన్నికకు గైర్హాజరయ్యారు. మరికొందరు ఒక పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచి.. ఎంపీపీగా ఎన్నికకాగానే గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. కారు స్పీడు 11 నుంచి 13కు.. టీఆర్ఎస్ పార్టీ 20 ఎంపీపీ స్థానాల్లో పాగా వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ సాధ్యపడలేదు. కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీఆర్ఎస్ స్థానాలు తగ్గాయి. ఒకటి రెండు మండలాల్లో టీఆర్ఎస్కు బలం ఉన్నప్పటికీ స్థానాలను దక్కించుకోవడంలో విఫలమైంది. ఆ అవకాశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సద్వినియోగం చేసుకున్నాయి. అధికారికంగా టీఆర్ఎస్ 11 ఎంపీపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే, కొత్తూరు ఎంపీపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీటీసీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి.. అప్పటికప్పుడే కారెక్కారు. కొందుర్గు ఎంపీపీగా> విజయం సాధించిన స్వతంత్ర ఎంపీటీసీ పోతురాజు జంగయ్యకు టీఆర్ఎస్ బీ–ఫారం అందజేసింది. ఇలా వీరిద్దరు అనూహ్యంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అధికార పార్టీ ఎంపీపీల సంఖ్య 13కు చేరుకుంది. ఇక కోరం లేకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల ఎన్నికలను ప్రిసైడింగ్ అధికారులు వాయిదా వేశారు. ఈ రెండు మండలాల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిపై సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. నేనంటే.. నేను అని ఎంపీటీసీలు పోటీపడటంతో ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దీంతో ఎంపీటీసీలు ఎన్నికకు దూరంగా ఉండటంతో కనీసం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా జరగలేదు. ఎన్నికల సంఘం త్వరలో సూచించే తేదీన ఈ రెండు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రిసైడింగ్ అధికారులు పేర్కొన్నారు. ఉపాధ్యక్షుల్లో టీఆర్ఎస్కు తగ్గిన బలం.. మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఎన్నికకు వచ్చేసరికి టీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ పార్టీ ఎంపీటీసీలు 7 మండలాల్లో మాత్రమే వైస్ ప్రసిడెంట్లుగా ఎన్నికయారు. అనూహ్యంగా స్వతంత్రులు ఏడు స్థానాల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదు. ఏఐఎఫ్బీ పార్టీ తరఫున ఒకరు వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. కోరం లేకపోవడం, అభ్యర్థులపై ఎంపీటీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల, నందిగామ, శంషాబాద్ మండలాల్లో ఉపాధ్యక్షుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆమనగల్లు, మాడ్గులలో తప్ప మిగిలిన 19 మండలాల్లోకోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. -
గులాబీ గుబాళింపు
కరీంనగర్: జిల్లాలోని 15 మండల పరిషత్ అధ్యక్షుల పీఠాలతోపాటు ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. శుక్రవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో మొదటగా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మండలాల్లో జెడ్పీటీసీలను పూర్తిస్థాయిలో గెలుచుకోని సత్తా చాటుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ ఎన్నికల్లోనూ 15 మండలాల్లో విజయం సాధించి మరో రికార్డును సొంతం చేసుకుంది. 11 మండలాల్లో ఎవరి మద్దతు లేకుండా పూర్తిస్థాయిలో అధికారం చేపట్టేందుకు సంఖ్య బలం టీఆర్ఎస్ పార్టీ సాధించగా.. ఎన్నిక ఏకపక్షంగానే పూర్తయింది. మిగతా నాలుగు మండలాలైన చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, సైదాపూర్‌లలో స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతో మండల పీఠాలను వశం చేసుకుంది. జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు కో ఆప్షన్ సభ్యుల స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష పార్టీలను కంగుతినిపించింది. ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఎంపీపీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా ముగిసింది. హుజూరాబాద్, కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని మండలాలతోపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో ఉదయం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు పూర్తి కావడంతో విజయోత్సవ ర్యాలీలతో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. -
తెరపైకి కొత్త పేరు
నాగరకర్నూల్: కందనూలు జిల్లా ఏర్పడిన తరువాత మొదటిసారిగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులు శనివారం జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 17 మంది టీఆర్ఎస్పార్టీకి చెందిన జెడ్పీటీసీలు గెలవగా, ముగ్గురు కాంగ్రెస్‌కు జెడ్పీటీసీలు విజయం సాధించారు. జిల్లాలోని తాడూరు, వంగూరు, అమ్రాబాద్ మండలాలు మినహా మిగిలిన స్థానాల్లో టీఆర్ఎస్ నెగ్గింది. శనివారం జరిగే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎన్నిక లాంఛనమే. జెడ్పీచైర్మన్‌గా పద్మావతి జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినా.. అనూహ్యంగా తెరపైకి మరో కొత్తపేరు తీసుకొచ్చారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లికి చెందిన పద్మావతి పేరును శుక్రవారం రాత్రి అధిష్టానం ఖరారు చేసి, బీ–ఫాం అందజేసింది. ఖరారు చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన బాలాజీసింగ్‌కు జెడ్పీ వైస్‌చైర్మన్‌గా అవకాశం కల్పిచేందుకు అధిష్టానం హామీ ఇచ్చింది. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుతో పాటు ఎంపీ రాములు అచ్చంపేటకు చెందిన వారే కావడంతో పాటు బాలాజీసింగ్ అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు. దీంతో ఎంపీ, జెడ్పీ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్ అన్ని పోస్టులు అచ్చంపేట నియోజకవర్గానికి ఎలా ఇస్తారని కొందరు నాయకులు పార్టీ పెద్దల ముందు ఉంచారు. దీంతో తెలకపల్లి జెడ్పీటీసీగా టీఆర్ఎస్ తరుఫున గెలిచిన పద్మావతికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ రాములు, తదితరులు హైదరాబాద్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మరీ పట్టబట్టి పద్మావతి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అధికారుల ఏర్పాట్లు పూర్తి.. జిల్లా జెడ్పీచైర్మన్ ఎంపిక కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ ఈ.శ్రీధర్ దగ్గరుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూంలో ఏర్పాట్లు చేయించారు. ఉదయం 9గంటలకు ప్రక్రియ ప్రారంభం కానుండగా మొదటి కో–ఆప్షన్ సభ్యులకు సంబంధించి 10గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం పరిశీలన, ఉప సంహరణ అనంతరం ఒంటిగంట వరకు కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. 3 గంటలకు జిల్లా జెడ్పీచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల పేర్లను వెల్లడించనున్నారు. -
కారుదే విజయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ఆయన గెలుపు లాంఛనమేనని భావిస్తుండగా.. మొత్తం ఓట్లలో ఆయనకు 883 దక్కాయి. దీంతో 825 ఓట్ల భారీ మెజార్టీతో శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డికి కేవలం 23 ఓట్లు రాగా, ఘోర పరాజయం పొందారు.ఏనుమాములలో లెక్కింపుఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు వరంగల్ ఏనుమాముల మార్కెట్ గోదాంలో ప్రారంభమైంది. కౌంటింగ్‌కు మూడు టేబుళ్లను ఏర్పాటు చేసి అభ్యర్థుల వారీగా ఓట్లు విభజించి లెక్కించారు. మొత్తం 902 ఓట్లకు 883 పోల్ కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 848, కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డికి 23 మాత్రమే వచ్చాయి. ఇక 12 ఓట్లు చెల్లలేదు. స్వతంత్రులుగా ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తక్కళ్లపెల్లి రవీందర్రావు, అన్నారపు యాకయ్య, రంగరాజు రవీందర్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. కాంగ్రెస్ నాయకుడు, ఖానాపూర్ ఎంపీపీ రవీందర్రావు తన ఓటు తాను సైతం వేసుకోలేదు. ఏకపక్షంగా పోలింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 902 మంది ఓటర్లు ఉండగా... 883 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, ఆజ్మీరా సీతారాం నాయక్ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్స్అఫిషీయో కోటాలో వారు ఓటేయలేదు. మరో 17 మంది కూడా వివి ధ కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 12 మంది ఎక్స్అఫీషీయో సభ్యులు, 871 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఎన్నికల సంఘం సమాచారం మేరకు ఎక్స్అఫిషీ యో సభ్యులు కలుపుకుని 680 మంది టీఆర్ఎస్, 169 మంది కాంగ్రెస్ మద్దతుదారులు ఉండగా, 53 మంది స్వతంత్రులు ఉన్నట్లు తేలింది. ఇందులో మెజార్టీ ఓట్లను సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేసి సక్సెస్ అయ్యింది. మూడు టేబుళ్ల ద్వారా ఓట్లను లెక్కించగా, మొదటి టేబుల్లో 300 ఓట్లకు గాను టీఆర్ఎస్ 292, కాంగ్రెస్‌కు ఆరు ఓట్లు రాగా, రెండు ఓట్లు చెల్లలేదు. రెండో టేబుల్లో 300 ఓట్లకు టీఆర్ఎస్కు 285, కాంగ్రెస్‌కు 11 ఓట్లు రాగా, నాలుగు ఓట్లు చెల్లలేదు. మూడో టేబుల్లో మొత్తం 283 ఓట్లను లెక్కించగా 271 టీఆర్ఎస్కు, ఆరు కాంగ్రెస్‌కు రాగా 6 ఓట్లు చెల్లని ఖాతాలో పడ్డాయి. టీఆర్ఎస్ ఉన్న 680 ఓట్లకు తోడు 53 మంది స్వతంత్రులు, 115 మంది కాంగ్రెస్ ఓటర్ల మద్దతును కూడగట్టారు. దీంతో పోలైన 883 ఓట్లలో 12 చెల్లకుండా పోగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం 23 ఓట్లే వచ్చాయి. ఈ లెక్కన అత్యధికంగా కాంగ్రెస్ మద్దతుదారులు, స్వతంత్రులు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు తేలింది. ఒక్క ఓటు దక్కించుకోలేని స్వతంత్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా పోటీలో నిలిచిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(టీఆర్ఎస్), ఇనుగాల వెంకట్రాంరెడ్డి (కాంగ్రెస్)తో పాటు స్వతంత్రులుగా తక్కళ్లపెల్లి రవీందర్ రావు, అన్నారపు యాకయ్య, రంగరాజు రవీందర్ పోటీలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ముగ్గురికీ ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ ముగ్గురు బరిలో ఉండటం కోసం కొందరు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు ప్రతిపాదించగా, వారు సైతం ఓటేయలేదు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఖానాపూర్ ఎంపీపీగా ఉన్న తక్కెళ్లపల్లి రవీందర్రావు తన ఓటును తనకు కూడా వేసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఖాతాలో 169 మంది ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 23 ఓట్లు రావడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికారుల పర్యవేక్షణ ఎన్నికల సంఘం నియమించిన అనిత రాజేంద్రన్ పర్యవేక్షణలో కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, ఎన్నికల ఎజెంట్ల సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా ఓట్లు లెక్కించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ ఎస్.దయానంద్ లెక్కింపును పరిశీలించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఎమ్మెల్సీగా గెలుపొందిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అధికారులు ధృవీకరణ పత్రం అందజేశారు. -
ఎమ్మెల్సీగా డాక్టర్ తేరా చిన్నపరెడ్డి విజయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎట్టకేలకు తేరా చిన్నపరెడ్డి కల నిజమైంది. చట్టసభల్లోకి అడుగు పెట్టాలని ఆయన ఇప్పటికి నాలుగు సార్లు ప్రయత్నించగా, మూడు సార్లు వెక్కిరించిన ఫలితం.. నాలుగోసారి ఆయన సొంతమైంది. దీంతో నల్లగొండ స్థానిక సంస్థల శాసన మండలి స్థానం టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. ఆ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలిచిన డాక్టర్ తేరా చిన్నపరెడ్డి 226 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై విజయం సాధించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్–అఫీషియో సభ్యులు అంతా కలిపి 1,085 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గానికి గత నెల 31వ తేదీన పోలింగ్ జరగగా.. 1,073 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఓట్లను లెక్కించారు. మొత్తం పోలైన ఓట్లలో 19 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎన్నికల్లో చెల్లిన 1054 ఓట్లలో సగానికిపై అంటే.. 528 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. కాగా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 640, కాంగ్రెస్‌కు 414 ఓట్లు పోలయ్యాయి. దీంతో 226 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్కు తొలి రౌండ్లోనే గెలుపునకు అవసరమైన ఓట్ల కంటే ఎక్కువే వచ్చాయి. మొదటి రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కించగా ఆయనకు 601 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో మిగిలిన 73 ఓట్లను లెక్కించారు. మొత్తంగా టీఆర్ఎస్కు 640 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు. ఎన్నాళ్లో.. వేచిన ఉదయం చట్టసభల్లో అడుగు పెట్టాలని తేరా చిన్నపరెడ్డి పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మరోమారు టీడీపీ నుంచే.. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో తేరా రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా విజయం సాధించగా, టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరారు. 2015 డిసెంబర్లో నల్లగొండ స్థానిక సంస్థల మండలి నియోజకవర్గానికి ఎన్నికలు రాగా, టీఆర్ఎస్ నుంచి టికెట్ సాధించి పోటీ చేశారు. అయితే, మూడోసారి కూడా ఆయనను విజయం వరించలేదు. నాటి ఎన్నికల్లో తేరా చిన్నపరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 192 ఓట్లు ఆధిక్యం వచ్చింది. మరో మూడేళ్ల పదివీ కాలం మిగిలి ఉండగానే, రాజగోపాల్ రెడ్డి మొన్నటి శాసన సభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరిగిన ఈ ఎన్నికల్లో విజయం తేరాకు దక్కింది. ఈ సారి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తేరా చిన్నపరెడ్డినే పోటీకి నిలబెట్టగా.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మిని పోటీకి పెట్టారు. 2015లో దక్కకుండా పోయిన ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ ముందునుంచీ వ్యూహాత్మకంగానే వ్యవహరించి అనుకున్న ఫలితాన్ని సాధించింది. దీంతో పదేళ్లుగా మూడు ఎన్నికల్లో చేదు ఫలితాలను అనుభవించిన తేరా చివరకు నాలుగో ప్రయత్నంలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. -
రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
డిచ్పల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మరో 24 గంటల్లో ఫలితం తేలనుంది. మరోవైపు, తమ పరిస్థితి ఏమవుతుందోనని అభ్యర్థుల్లో గుబులు నెలకొంది. ఇటీవల వెల్లడైన లోక్‌సభ ఫలితాలు అభ్యర్థులను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారోననే ఉత్కంఠ అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. జిల్లాలో మూడు విడతలుగా పరిషత్ ఎన్నికలు జరిగాయి. మొదటి విడత నిజామాబాద్ డివిజన్, రెండో విడతలో బోధన్, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్‌కు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు, జూన్ 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, మాక్లూర్ జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. ఇక్కడ ప్రత్యర్థులు లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇక, మిగిలిన 26 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే జిల్లాలోని 299 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 27వ తేదీనే ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే, ప్రస్తుత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం నెలకు పైగా ఉండడం, అప్పటివరకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎంపికకు సాంకేతికంగా కొన్ని అడ్డంకులు ఉండడంతో కౌంటింగ్ వాయిదా పడింది. చివరకు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ డివిజన్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ పాఠశాలలో, బోధన్ డివిజన్‌కు సంబంధించి బోధన్‌లోని విద్యావికాస్ పాఠశాలలో, ఆర్మూర్ డివిజన్‌కు సంబంధించి మునిపల్లి శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఫలితాలతో అభ్యర్థుల్లో టెన్షన్.. ఇటీవల నిజామాబాద్ ఎంపీ ఎన్నికల ఫలితాల్లో జిల్లా ఓటర్లు అనూహ్య తీర్పునివ్వడం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారోననే ఆసక్తి నెలకొంది. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించి గులాబీ జెండా ఎగురవేశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల్లోనూ టెన్షన్ పెరిగింది. ఓటర్లు ఎవరిని కరుణించారోనని అందోళన చెందుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా.. ఎన్నడూ లేనంతగా ఈ సారి గతంలో పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. అధికార టీఆర్ఎస్లోనే అశావహుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో టికెట్ దక్కని వారు చాలా చోట్ల రెబెల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు గెలుపు కోసం డబ్బును వెదజల్లారు. కొన్ని మండలాల్లో ఎంపీపీ పదవిని ఆశించిన అభ్యర్థులు తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు డబ్బులు సమకూర్చాల్సి వచ్చింది. దీనికి తోడు ఎంపీపీ పదవి ఆశిస్తున్న వారిలో చాలా మంది ముందుగా తాము ఏకగ్రీవం అయితే ఏ సమస్య ఉండదని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు, గ్రామాభివృద్ధికి కమిటీలకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యేందుకు తిప్పలు పడ్డారు. ఇక జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు తమ మండలంలోని సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు భరించాల్సి వచ్చింది. లేదంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయం వారిలో నెలకొంది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసినా అసలు గెలుస్తామా లేదా అనే అందోళన ప్రస్తుతం అభ్యర్థుల్లో నెలకొంది. ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం, ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరగడం టీఆర్ఎస్ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. లోక్‌సభ ఫలితాలకు ముందు కచ్చితంగా పరిషత్ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్న అధికార పార్టీ అభ్యర్థులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. పలు చోట్ల అసమ్మతి.. టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు అనేక మంది ఉత్సాహం చూపారు. అయితే వీరిలో కొంత మందికే టికెట్లు లభించాయి. టికెట్ దక్కని వారిలో కొందరు నిరాశలో మునిగి పోగా, మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. కొంతమంది సొంత పార్టీలోనే ఉంటూ తమ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించారు. దీంతో అధికార పార్టీలోనే అసమ్మతి సెగలు ఎక్కువ కావడంతో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. మరోవైపు, ఎంపీపీ పదవిపై కన్నేసిన పలువురు ఆశావహులు తమకు పోటీ వస్తారని భావించిన సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేసినట్లు తెలిసింది. ప్రతి మండలంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఎంపీపీ పదవిని ఆశిస్తుండటంతో ఈ అంశం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుంది. -
‘ప్రాదేశిక’ లెక్కింపునకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్‌క్రైం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిçష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కమిషనరేట్‌లోని చొప్పదంగి మండలం రుక్మాపూర్, మానకొండూరు మండలంలోని దేవంపల్లిలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల, తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాల వద్ద లెక్కింపు జరుగుతుందని వివరించారు. ఓట్ల లెక్కింపు పరిసర ప్రాంతాల్లో డాగ్, బాంబ్‌డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏజెంట్లు, లెక్కింపు విధులకు హజరయ్యే అధికారులు, సిబ్బంది డోర్‌ప్రేమ్ మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్లాలని తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా జారీ చేసిన గుర్తింపుకార్డులు ఉన్నవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు, మూడు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామన్నారు. లెక్కింపు కేంద్రాల్లో మొబైల్‌ఫొన్లు వినియోగం నిషేదించడం జరిగిందని, అగ్గిపెట్టెలు, లైటర్లు, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లొద్దని సూచించారు. కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. బాణాసంచ కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. భారీ బందోబస్తు భద్రత కోసం వివిధ స్థాయిల పోలీసులను వినియోగిస్తున్నారని సమాచారం. వీరిలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 10 మంది ఏసీపీలు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 75 మంది ఎస్సై స్థాయి అధికారులతో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీసులు బందోబస్తు విదులు నిర్వహిస్తారని తెలిసింది. -
మొక్కులు చెల్లించిన చెవిరెడ్డి
చంద్రగిరి : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మొక్కులు చెల్లించారు. తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారిమెట్టు మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీవారిమెట్టు వద్ద, ప్రత్యేక పూజల అనంతరం కుటుంబ సభ్యులతో భక్తిప్రపత్తులతో మెట్టుమెట్టుకూ పసుపు, కుంకుమతో పాటు కర్పూరం పెడుతూ తిరుమలకు వెళ్లారు. తలనీలాలు సమర్పించిన అనంతరం శనివారం తెల్లవారుజామున తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్సార్సీపీ ఆదరించి, అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో దివంగత నేత రాజన్న రాజ్యాన్ని మళ్లీ చవిచూస్తారని ధీమాగా చెప్పారు. రానున్న ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అందించాలని ఆ దేవుడిని ప్రార్థించానని, జగనన్న పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకముందు వైఎస్సార్సీపీ నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యారాశి చంద్రశేఖర్‌రెడ్డి, మస్తాన్, ఓబుల్ రెడ్డి, దొడ్లకరుణాకర్ రెడ్డి, శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏవీ ఆనాటి మెరుపులు !
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి కొన్నాళ్లుగా ప్రతీ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీచినా.. నరేంద్ర మోదీ హవా స్పష్టంగా కనిపించిన తాజా ఎన్నికల్లో సైతం వరంగల్ లోక్‌సభ పరిధిలో బీజేపీ అభ్యర్థికి గతంతో పోలిస్తే ఓట్లు ఇంకా తగ్గిపోవడం గమనార్హం. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 2,05,803 ఓట్లు పోల్ కాగా.. ప్రస్తుత ఎన్నికల్లో 83,777 ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో దేశం మొత్తం మీ ద రెండు స్థానాల్లోనే బీజేపీ గెలుపొందగా.. అందులో ఒకరు హన్మకొండ నుంచి గెలవడం చరిత్రగా చెబుతారు. కానీ అదంతా గతంగానే మిగిలిపోగా.. ఇప్పుడు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేని స్థితికి ‘కమలం’ చేరుకోవడాన్ని ఆ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం ఉండేది. అయితే, 1999 తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పరాజయాన్నే మూటగట్టుకుంటున్నారు. పరకాల, రద్దయిన శాయంపేట, వర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో బీజేపీకి చెందిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. పాత హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీకి ప్రాతినిథ్యం ఉంది. అలాగే, రద్దయిన శాయంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 1978, 1983లో చందుపట్ల జంగారెడ్డి విజయం సాధించారు. 1985, 1989లో పరకాల నుంచి ఒంటేరు జయపాల్, వర్ధన్నపేట నుంచి 1985లో వన్నాల శ్రీరాములు, 1989లో డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు గెలిచారు. ఇక 1999లో రద్దయిన హన్మకొండ నియోజకవర్గం నుంచి మార్తినేని ధర్మారావు విజయం సాధించారు. 1984లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా.. ఇందులో ఒకరు రద్దయిన హన్మకొండ లోక్‌సభ నుంచి చందుపట్ల జంగారెడ్డి కావడం విశేషం. ఆ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుడు మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు(ప్రధాని కాక ముందు)ను ఓడించారు. ఇలా గతంలో బీజేపీ గెలిచిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉన్నా గత ప్రాభవాన్ని సాధించలేక మరింత చతికిలపడడం గమనార్హం. ఇప్పుడు అంతంతే... 1999 అనంతరం జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ పూర్వ వైభవం చాటుతామని బీజేపీ పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి, రెండో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ తన సత్తా చాటలేకపోతోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. తెలంగాణలోనూ నాలుగు స్థానాల్లో విజయం సాధించినా మోదీ చరిష్మా, బీజేపీ పవనాలు ఇక్కడ పనిచేయలేదు. కాగా, 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా ఒక్క స్థానంలోనైనా కమలం వికసించలేదు. ఈసారి గతంలో మాదిరి కాకుండా పార్టీలో సీనియర్ అయిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తిని వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిపారు. అయినా విజయానికి సాధ్యం కాకపోగా.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 2014లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన రామగల్ల పరమేశ్వర్‌ను పార్టీ అభ్యర్థిగా నిలిపితే 2,05,803 ఓట్లు వచ్చాయి. 2015 ఉప ఎన్నికల్లో డాక్టర్ పగిడిపాటి దేవయ్యను నిలపగా 1,29,868 ఓట్లు సాధించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకీ చెందిన అభ్యర్థినే బరిలోకి దింపినా గత రెండు ఎన్నికల్లో పోలిస్తే ఓట్ల సంఖ్య మరింత పడిపోయి కేవలం 83,777 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా ప్రతీ ఎన్నికకు ఓట్లు తగ్గుతుండడం చర్చనీయాంశంగా మారింది. గడ్డు పరిస్థితులు.. వరంగల్ జిల్లాలో బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పడంలేదు. అభ్యర్థుల ఎంపికే సమస్యగా మారుతోందని తెలుస్తోంది. గెలిచే వారికి, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి, ప్రజల్లో పట్టు ఉన్న వారికి కాకుండా.. అధిష్టానం వద్ద పట్టు ఉన్న వారికి టికెట్లు ఇస్తుండడంతో ఓటమి తప్పడం లేదని ఆ పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇక టికెట్లు పొందిన వారు ఆ పార్టీలోని అసమ్మతి వాదులను కలుపుకుపోకపోవడం కూడా మరో సమస్య మారినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపర్చకుండా ఎన్నికలకు వెళ్లడం వంటి వైఫల్యాలతో ఆ పార్టీ పూర్వ వైభవం సాధించలేక పోతోందని భావిస్తున్నారు. -
ప్రాదేశిక కౌంటింగ్ వాయిదా
సిరిసిల్ల: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 58 జెడ్పీటీసీ, 650 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6, 10, 14వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలో 15 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ, పెద్దపల్లి జిల్లాలో 13 జెడ్పీటీసీ, 138 ఎంపీటీసీ, జగిత్యాల జిల్లాలో 18 జెడ్పీటీసీ, 211 ఎంపీటీసీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 123 ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. ఈ నెల 27న సోమవారం ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వివిధ రాజకీయ పక్షాలు ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని కోరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ ఉత్తర్వులు 2099/టీఎస్ఈసీ–పీఆర్2019 తేదీ 24–05–2019 జారీ చేసింది. జూలై 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. -
టీఆర్ఎస్.. పోస్టుమార్టం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ శిబిరం ఆలోచనల్లో పడింది. కేవలం ఆరు నెలల కిందటి ఆదరణ ఎలా తలకిందులైంది..? గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల నాటి ఓట్ల సునామీ.. ఇప్పుడెందుకు దూరమైంది..? నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి తప్పుటడుగు ఎక్కడ పడింది..? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉందని సమాచారం. కచ్చితంగా గెలిచి తీరుతామని భావించిన నల్లగొండ రెండోసారీ నిరాశ పరచడం, సిట్టింగ్ స్థానమైన భువనగిరిని తిరిగి నిలబెట్టుకోలేక పోవడానికి గల కారణాలను అన్వేషిస్తోందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మొత్తంగా 5,00,346 ఓట్లు సాధించారు. కానీ, డిసెంబర్ నాటి ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని దేవరకొండ, నాగార్జు సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులకు 6లక్షల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఓటమి పాలైన హుజూర్నగర్ ఓట్లూ ఉన్నాయి. అంటే కేవలం ఆరు నెలల తేడాతో ఆ పార్టీ ఏకంగా లక్ష పైచిలుకు ఓట్లను కోల్పోయింది. ఈ కారణంగానే నల్లగొండ ఎంపీ స్థానం దక్కకుండా పోయిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వ్యూహాత్మకంగా పనిచేసినా..! వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కడా అలసత్వం ప్రదర్శించినట్లు కనించలేదు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని వెంట తీసుకుని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేశారు. ఒక విధంగా కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ప్రచారం కంటే.. అధికార టీఆర్ఎస్ చేసిన ప్రచారమే ఎక్కువ. ఒకసారి పార్టీ అధినేత కేసీఆర్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేసి వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సైతం అభ్యర్థిత్వం ఖరారుకు ముందు ఒకసారి, చివరలో ఒకసారి నల్లగొండకు ప్రచారానికి వచ్చి బహిరంగసభలో, రోడ్ షోలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలూ ఎవరికి వారూ మండలాలు, గ్రామాలను చుట్టి వచ్చారు. ఇంత చేసినా టీఆర్ఎస్ గెలుపు వాకిట బొక్కబోర్ల పడడాన్ని ఆ పార్టీ నాయకత్వం సీరియస్‌గానే పరిగణిస్తోందని చెబుతున్నారు. అతివిశ్వాసం కొంపముంచిందా..? అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలకే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ నాటి ఫలితమే రిపీట్ అవుతుందన్న అతివిశ్వాసమే దెబ్బకొట్టిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలు అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లలేక పోయారా..? అదే పార్టీ కొంప ముంచిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏడింట ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఉన్నా.. చివరకు తమకు వచ్చిన మెజారిటీలో సగం ఓట్లు కూడా సాధించలేక పోవడం, పెద్ద మొత్తంలో ఓట్లకు కోత పడడాన్ని ఎవరి వైఫల్యంగా చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. మంత్రి సొంత నియోజకవర్గం సూర్యాపేటలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థికి 3,484 ఓట్ల ఆధిక్యం వచ్చినా.. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను పోలిస్తే.. 29వేల పైచిలుకు ఓట్ల తగ్గుదల ఉంది. ఇక, ఏ నియోజకవర్గంలో చూసినా.. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి సమంగా ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యమయ్యేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దెబ్బకొట్టిన కోదాడ.. హుజూర్నగర్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూర్యాపేట, నల్లగొండల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి లీడ్ వచ్చింది. దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వచ్చినా.. అది నాలుగు వేల ఓట్ల చొప్పునే. కానీ, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఆధిక్యమే టీఆర్ఎస్ అభ్యర్థిని దెబ్బకొట్టిందని విశ్లేషిస్తున్నారు. వరసగా కోదాడలో 11,930, హుజూర్గనర్లో 12,993, మిర్యాలగూడలో 7,186 ఓట్ల చొప్పున లీడ్ వచ్చింది. ఈ మూడు నియోజకవర్గాలే కాంగ్రెస్ అభ్యర్థిని విజయతీరాలకు చేర్చాయన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఫల్యం చెందారా ..? అన్న ప్రశ్నలపైనా చర్చ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఏమైనా వెన్నుపోటు రాజకీయాలు దెబ్బతీశాయా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే పార్టీ నాయకత్వం ఈ ఓటమిపై పూర్తిస్థాయి సమీక్ష జరిపే వీలుందని చెబుతున్నారు. -
నల్లగొండ నా గుండె
నల్లగొండ : నల్లగొండ నా గుండెలాంటిదని, రాజకీయంగా జన్మనిచ్చి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించడంతో పాటు ప్రస్తుతం భువనగిరి ఎంపీగా విజయం సాధించానంటే నల్లగొండ ప్రజల చలువేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భువనగిరి ఎంపీగా విజయం సాధించిన సందర్భంగా ఆయన శుక్రవారం నల్లగొండలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని పనిచేసి తెలంగాణ వెంకన్నగా పేరు తెచ్చుకున్నానన్నారు. ప్రస్తుతం ఎంపీ అయ్యానంటే అది కూడా నల్లగొండ ప్రజల చలువేనన్నారు. సీఎం కేసీఆర్ నన్ను ఓడించడం కోసం ఇన్‌చార్జ్‌లను పెట్టాడని ఆరోపించారు. నేను చేసిన ఉద్యమం ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్ కూతురు కూడా ఓడిపోయారంటే ప్రజలు టీఆర్ఎస్పై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తాను జిల్లాలో ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా పరిష్కరించడంతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ధర్మం, నీతి, నిజాయతీ విజయం సాధించిందన్నారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాబోయేవి కాంగ్రెస్ రోజులేనని గుర్తుంచుకోవాలన్నారు. దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ సారు.. కారు.. పదహారు అన్న కేసీఆర్‌కు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మైండ్ బ్లాక్ చేశారన్నారు. ముగ్గురు మొనగాళ్ల మాదిరిగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విజయం సాధించారన్నారు. కోమటిరెడ్డి మీద ఉన్న అభిమానమే భువనగిరిలో గెలిపించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గుమ్మల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అమరేందర్‌రెడ్డి, తండు సైదులుగౌడ్, బొడ్డుపల్లి లక్ష్మి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రాదేశిక కౌంటింగ్ వాయిదా
సిరిసిల్ల: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 58 జెడ్పీటీసీ, 650 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6, 10, 14వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలో 15 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ, పెద్దపల్లి జిల్లాలో 13 జెడ్పీటీసీ, 138 ఎంపీటీసీ, జగిత్యాల జిల్లాలో 18 జెడ్పీటీసీ, 211 ఎంపీటీసీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 123 ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. ఈ నెల 27న సోమవారం ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వివిధ రాజకీయ పక్షాలు ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని కోరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ ఉత్తర్వులు 2099/టీఎస్ఈసీ–పీఆర్2019 తేదీ 24–05–2019 జారీ చేసింది. జూలై 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. -
ఎందుకిలా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితికి సెంటిమెంట్ కరీంనగర్. పార్టీ ఆవిర్భావం తరువాత కేసీఆర్ 2001లో తొలి సింహగర్జన సభ నిర్వహించింది ఇక్కడే. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ సన్నాహక సభ నిర్వహించి జోష్ పెంచింది ఇక్కడి నుంచే. చివరికి ఎన్నికల షెడ్యూల్ విడుతలైన తరువాత తొలి బహిరంగసభను కూడా కరీంనగర్ నుంచే మొదలు పెట్టి ఈ జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత ఈ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్కు షాకిచ్చింది. కరీంనగర్ లోక్‌సభ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగింట బీజేపీకి ఘననీయమైన ఓట్లు పోల్ కావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమిలో పూర్వ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల భాగస్వామ్యం కూడా ఎక్కువే. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో సైతం మంథని, రామగుండంలలో టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ మెరుగైన ఓట్లు సాధించింది. మొత్తంగా చూస్తే పూర్వ కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, పెద్దపల్లిలో మాత్రమే టీఆర్ఎస్కు ఊరట లభించింది. మిగతా 8 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు రావడం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా 52వేల మెజారిటీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఇదే నియోజకవర్గంలో బీజేపీకి ఏకంగా 52,181 ఓట్ల మెజారిటీ లభించడం గమనార్హం. మైనారిటీ వర్గాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మెజారిటీ వర్గంలో 70 శాతం ఓట్లు బీజేపీకే పోలయినట్లు అంచనా వేస్తున్నారు. మిగతా స్థానాల్లోనూ... ఇక చొప్పదండి, మానకొండూరులలో టీఆర్ఎస్ అభ్యర్థులు రవిశంకర్, రసమయి బాలకిషన్‌లు అనూహ్యంగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. రవిశంకర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 91వేల ఓట్లు పోల్ కాగా, ఈసారి ఇక్కడ టీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు కేవలం 41,396 అంటే దాదాపు 50వేల ఓట్లు మైనస్. బండి సంజయ్‌కు ఈ నియోజకవర్గం నుంచి ఎవరూ ఊహించని విధంగా 97,441 ఓట్లు సాధించారు. మానకొండూరులో గత ఎన్నికల్లో రసమయికి 89వేల ఓట్లు రాగా, ఈసారి 41వేల ఓట్లకు టీఆర్ఎస్ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో 4356 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీకి 73వేల ఓట్లు పోలవడం గమనార్హం. వేములవాడలోనూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు 28వేల మెజారిటీ కట్టబెట్టిన ఓటర్లు ఈసారి బీజేపీ 25వేల ఓట్ల ఆధిక్యతనిచ్చారు. కరీంనగర్ పార్లమెంటులో కరీంనగర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీల్లో గత ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాకపోగా, ఈసారి భారీగా ఓట్లు పోలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిల్లో సైతం... నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి ఆ జిల్లాలోని నియోజకవర్గాలతోపాటు కరీంనగర్‌లోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లు కూడా ప్రధాన కారణమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కన్నా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు భారీగా మెజారిటీ లభించింది. జగిత్యాలలో 7,300, కోరుట్ల నుంచి 20వేల మెజారిటీ బీజేపీకి లభించడం గమనార్హం. నిజామాబాద్‌లో కవిత ఓటమిలో ఈ రెండు నియోజకవర్గాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇక పెద్దపల్లిలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, మంథని, రామగుండంలలో టీఆర్‌ఎస్‌కన్నా కాంగ్రెస్‌కే ఓట్లు అధికంగా పోలయ్యాయి. మంథనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రామగుండంలో టీఆర్ఎస్ నేతల వర్గపోరుతో కాంగ్రెస్‌కు 2వేల స్వల్ప ఆధిక్యత లభించింది. కొంప ముంచిన అతివిశ్వాసం అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీఆర్ఎస్ మూడు నెలల తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలను తుడిచేస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మారు. కరీంనగర్లో ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారి మధ్య సరైన సయోధ్య కరువైంది. సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్‌తోపాటు మంత్రి ఈటల రాజేందర్ గెలుపుపై పూర్తి ధీమాతో వ్యవహరించారు. కరీంనగర్‌తోపాటు ఒకటి రెండు పట్టణాల్లో బీజేపీకి ఓటింగ్ పెరిగినా, గ్రామీణ ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉంటారని కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కోల్పోవడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే బహిరంగసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అభ్యర్థి ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోగా, దాన్ని కౌంటర్ చేయడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారు. రైతుబంధు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలే తిరిగి ఓట్లు తెచ్చిపెడతాయని భావించిన ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. కాగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కన్నా 30వేల మెజారిటీ సాధించిన మంత్రి ఈటల రాజేందర్ బీజేపీని మూడోస్థానానికి పరిమితం చేయడం గమనార్హం. టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోలుకాకుండా ఆయన పకడ్బందీగా వ్యవహరించారు. హుస్నాబాద్‌లో సైతం 23వేల మెజారిటీ టీఆర్ఎస్ సాధించింది. త్వరలో మేథోమథనం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ అధిష్టానం త్వరలో పోస్టుమార్టం చేయనుంది. హైదరాబాద్‌లో పార్లమెంటరీ సమావేశం తరువాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తారు. కరీంనగర్లో ఓటమికి హిందుత్వ నినాదం, మోదీ ఎఫెక్ట్ బాగా పనిచేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో మేథోమథనం జరపనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ బీజేపీకి పెరగడానికి గల కారణాలపై విశ్లేషణ చేయనున్నారు. -
మోదం.. ఖేదం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. నియోజకవర్గాలు, పోలింగ్ బూత్‌లలో వచ్చి న ఓట్ల ఆధారంగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నాయి. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీకి మోదం కలిగించగా.. కాంగ్రెస్ పార్టీకి ఖేదం మిగిల్చాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించి.. పార్టీ టికెట్‌పై పోటీ చేసిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి ఆరు నెలలైనా గడవకముందే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేశాయి. ఇందులో కాంగ్రెస్.. మధిర, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. భాగస్వామ్య పక్షమైన సీపీఐ వైరాలో.. తెలుగుదేశం పార్టీ ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. వీటిలో వైరా, ఖమ్మం మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో జిల్లాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్‌కు రాజకీయంగా తిరుగు లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరమైనా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు, సంప్రదాయ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ విజయానికి కృషి చేసినా ఫలితం మాత్రం పార్టీ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, మహాకూటమి మిత్రపక్షాల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా అత్యంత తక్కువగా రావడమే కాకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్కు మెజార్టీ రావడానికి గల కారణాలపై కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ విజయానికి ఏ నియోజకవర్గంలో.. ఏ స్థాయిలో కృషి జరిగింది.. ఆయా ప్రాంతాల్లో ఓట్ల శాతం తగ్గడానికి గల కారణాలపై కాంగ్రెస్ నేతలు ఆరా తీసే పనిలో పడ్డారు. ఏడింట్లో మెజార్టీ రాదాయె.. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ మెజార్టీ సాధించలేకపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో మాత్రం రెండో స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పాలేరు, మిత్రపక్షమైన టీడీపీ గెలుపొందిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ మెజార్టీ సాధించడం, మధిర నియోజకవర్గంలోనూ ఆ పార్టీయే మెజార్టీ సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన కొత్తగూడెం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ది రెండో స్థానమే అయింది. ఇక వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చినా.. మిగితా నియోజకవర్గాలతో పోలిస్తే స్వల్పమే కావడం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. పార్టీ కోసం పరిశ్రమించే కార్యకర్తలున్నా కొన్నిచోట్ల వారిని పూర్తిస్థాయిలో పార్టీకి పనిచేసే విధంగా నాయకులు చేయలేకపోయారని, నాయకుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల పార్టీకి కొంత నష్టం జరిగిందని ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తన ఓటమికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామని, పోలింగ్ కేంద్రాలవారీగా వివరాలు వచ్చాక లోపం ఎక్కడ జరిగింది? పార్టీ గెలుపునకు అడ్డు పడింది ఎవరో తెలుస్తుందని.. దాని ఆధారంగా పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తామన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య రీతిలో పెరిగిన మెజార్టీతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ జిల్లాలో టీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందనడానికి నిదర్శనమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పరాజయం పాలు కావడంతో ఆ పార్టీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. -
ఫ్యాన్ సునామీ
ఫ్యాన్ సునామీ సృష్టించింది. ఈ ఉధృతికి సైకిల్ అడ్రెస్ లేకుండా కొట్టుకుపోయింది. గ్లాస్ ముక్కలుచెక్కలుగా పగిలిపోయింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ‘కంచుకోట’లో తిరుగేలేదని బలంగా చాటిచెప్పింది. జిల్లా ప్రజలంతా విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టారు. రాజకీయాల్లో విలువల పరిరక్షణకు, ప్రజలందరి శ్రేయస్సు కోసం పరితపిస్తున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారు. జిల్లాలోని అన్ని స్థానాలను ఒక పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మే 23 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా సరికొత్త చరిత్రను లిఖించింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ అన్నింటినీ గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చరిత్రలో తనదైన రికార్డును నమోదు చేసుకుంది. 2014 ఎన్నికల్లోనూ 14 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది. అలాగే రెండు ఎంపీ సీట్లనూ కైవసం చేసుకుంది. తదనంతరం ఇద్దరు ఎంపీలతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినప్పటికీ తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నామంటూ జిల్లా ప్రజలు స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తమకు అభిమానం తరిగిపోదని మరోసారి రుజువు చేశారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 14 అసెంబ్లీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీని రాజకీయ సమాధి చేసి.. వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారు. మరోవైపు జిల్లా రాజకీయాలను తమ చేతుల్లో బంధించుకుని నడిపిన కోట్ల, కేఈ కుటుంబాలను రాజకీయ సమాధి చేశారు. ఈసారి కూడా రెండు పార్లమెంటు స్థానాలనూ వైఎస్సార్సీపీకే ప్రజలు కట్టబెట్టారు. మొదటి నుంచి 13 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ కనిపించినప్పటికీ కర్నూలులో మాత్రం విజయం దోబూచులాడింది. రౌండు రౌండుకు ఉత్కంఠ పెంచింది. చివరకు కర్నూలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని నిరూపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు డాక్టర్లలో ఎంపీగా సంజీవ్‌కుమార్, కోడుమూరు ఎమ్మెల్యేగా సుధాకర్ గెలుపొందగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాటసాని రాంభూపాల్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ సారి కాటసాని జిల్లాలోనే అత్యధికంగా 43,857 ఓట్ల మెజార్టీ సాధించారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో మొదటి ఫలితం ఆదోని అసెంబ్లీ స్థానానిది వెలువడగా..చివరి ఫలితం పాణ్యం స్థానానిది వెలువడింది. పోస్టల్ బ్యాలెట్ల నుంచి మొదలైన వైఎస్సార్సీపీ ఆధిపత్యం చాలా నియోజకవర్గాల్లో చివరి రౌండ్‌వరకు కొనసాగుతూనే వచ్చింది. కోట్ల, కేఈ కుటుంబాలకు గుణపాఠం మొదటి నుంచి ఉప్పు–నిప్పుగా ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు తమ మధ్య విభేదాలు మరిచి తెలుగుదేశం పార్టీలో చేరాయి. కర్నూలు పార్లమెంటు నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేయగా.. పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. ముఖ్యంగా కోట్ల, కేఈ కుటుంబాలు కర్నూలు పార్లమెంటు పరిధిలో కలియతిరిగి.. గతంలో తమ వల్ల దెబ్బతిన్న కుటుంబాలు కలిసి పనిచేయాలని కోరారు. అయితే, వీరి వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చింది. ఈ కుటుంబాల రాజకీయాల వల్లనే కర్నూలు పార్లమెంటు వెనుకబడి ఉందన్న భావన వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి మరోసారి తమను మోసం చేసేందుకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఫలితంగా ఈ రెండు కుటుంబాలు పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ భారీ ఓటమిని గిఫ్టుగా ఇచ్చారు. గెలిచిన డాక్టర్లు కోడుమూరు నియోజకవర్గం నుంచి డెంటల్ డాక్టర్ జె. సుధాకర్, కర్నూలు పార్లమెంటు నుంచి డాక్టర్ సంజీవ్‌కుమార్ బరిలో నిలిచారు. ఇద్దరూ రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ప్రజాసేవ చేస్తారనే నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్లను కేటాయించింది. ఈ ఇద్దరూ రాజకీయ ఉద్దండులతోనే పోటీ పడ్డారు. కర్నూలు పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రి కోట్ల టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఆయనపై రాజకీయాలకు కొత్తగా వచ్చి పోటీ చేసిన సంజీవ్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక కోడుమూరు నుంచి బరిలో ఉన్న డాక్టర్ సుధాకర్ కూడా రాజకీయాలకు కొత్తే. ఈ నియోజకవర్గంలో ఒకవైపు కోట్ల, మరోవైపు విష్ణువర్దన్ రెడ్డితో పాటు కొత్తకోట ప్రకాష్ రెడ్డికూడా టీడీపీలోనే ఉన్నారు. వీరందరూ మూకుమ్మడిగా టీడీపీ అభ్యర్థి అయిన రిటైర్డు ఐఏఎస్ అధికారి రామాంజినేయులుకు మద్దతు పలికారు. అయితే, కోట్ల కుటుంబం నుంచి బయటకు వచ్చిన కోట్ల హర్షవర్దన్ రెడ్డి, రిటైర్డు ఎస్ఈ కృష్ణారెడ్డి వంటి నేతలు వైఎస్సార్సీపీ వెంట నడిచారు. అటువంటి రాజకీయ ఉద్దండులను వీరందరూ కలిసి ఢీ కొట్టి వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ సమకూర్చారు. వరుసగా రెండోసారి... డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బుగ్గన డోన్ నుంచి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు. రెండోసారి కూడా కేఈ ప్రతాప్‌పైనే విజయం సాధించారు. ఇక ఆలూరు నుంచి కూడా గుమ్మనూరు జయరాం వరుసగా రెండోసారి గెలుపొందారు. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. వరుసగా రెండోసారి... డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బుగ్గన డోన్ నుంచి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు. రెండోసారి కూడా కేఈ ప్రతాప్‌పైనే విజయం సాధించారు. ఇక ఆలూరు నుంచి కూడా గుమ్మనూరు జయరాం వరుసగా రెండోసారి గెలుపొందారు. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. కాటసాని ఆరోసారి.. అతి చిన్నవయసు నుంచే ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చరిత్ర కాటసాని రాంభూపాల్రెడ్డిది. 1985, 1989, 1994, 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి పాణ్యం శాసనసభ్యునిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విధేయునిగా ఉన్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంపై పార్టీ అభిమానులు, పాణ్యం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణరెడ్డికి నివాళి జిల్లా చరిత్రలో పత్తికొండకు ప్రత్యేక స్థానం ఉంది. కరువు పీడిత ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ను పోషించే ముఠా నాయకుల ఆగడాలను నిరోధించేందుకు చెరుకులపాడు నారాయణరెడ్డి చేసిన కృషి వెలకట్టలేనిది. ఆయన ప్రజలతో మమేకమైన తీరును చూసి ఎన్నికల్లో తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే కుట్రతో నారాయణరెడ్డిని అంతమొందించారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. ఆయన సతీమణి కంగాటి శ్రీదేవికి జిల్లాలో తొలి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయిస్తూ బహిరంగసభలో ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన కంగాటి శ్రీదేవి అలుపెరగని పోరాటం సాగించి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపు నారాయణరెడ్డికి ఘనమైన నివాళియేనని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. త్యాగానికి విజయ‘ఫలం’! గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు మంత్రి పదవుల కోసం పాకులాడి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పచ్చపార్టీలో చేరి మంత్రులుగా వెలగబెట్టిన నేతలకు బుద్ధి చెప్పేలా వ్యవహరించిన ఏకైక నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలకు కట్టుబడి తన ఎమ్మెల్సీ పదవిని తృణపాయంగా వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తద్వారా పార్టీ అభిమానుల్లో, ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆయన చేసిన త్యాగానికే విజయం వరించిందని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన వారు వీరే.. అసెంబ్లీ నియోజకవర్గం పేరు గెలిచిన అభ్యర్థి ఆలూరు గుమ్మనూరు జయరాం పాణ్యం కాటసాని రామిరెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రాలయం వై.బాలనాగి రెడ్డి ఆదోని వై.సాయి ప్రసాద్ రెడ్డి ఆళ్లగడ్డ గంగుల బీజేంద్రా రెడ్డి కోడుమూరు(ఎస్సీ) డాక్టర్ సుధాకర్ నంద్యాల శిల్పా రవించంద్ర కిశోర్ రెడ్డి ఎమ్మిగనూరు ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కర్నూలు హఫీజ్ ఖాన్ నందికొట్కూరు టి.ఆర్థర్ బనగానపల్లె కాటసాని రామిరెడ్డి పత్తికొండ కంగాటి శ్రీదేవి శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి ఎంపీలు కర్నూలు సింగరి సంజీవ్ కుమార్ నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి -
నవోదయం
జిల్లా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. హోరుగాలిలో ఊక ఎగిరిపోయినట్టు.. జోరువానలో ఉప్పు కరిగినట్లు.. వైఎస్ జగన్ సునామీలో రాజకీయ వటవృక్షాలు కొట్టుకుపోయాయి. జిల్లా ప్రజలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మెజార్టీ ఇచ్చారో అంతకు మించి వైఎస్సార్సీపీని ఆదరించారు. ఈ ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుండగా.. టీడీపీ డీలా పడింది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధిస్తే.. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగించింది. టీడీపీ తరఫున హిందూపురంలో బాలకృష్ణ మాత్రమే గెలుపొందారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తొలుత పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభించారు. తొలిరౌండ్ నుంచి వైఎస్సార్సీసీ ఆధిక్యతను ప్రదర్శించింది. ప్రతిరౌండ్‌లోనూ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఉదయం 11 గంటలకే ఫలితాల ట్రెండ్ తేలిపోయింది. హిందూపురం, మినహా తక్కిన 12 నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అయితే ఉరవకొండలో పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలతో అర్ధరాత్రి దాటినా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఉద్ధండులకు భంగపాటు జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. వీరి కనుసన్నల్లో జిల్లా రాజకీయం నడిచింది. అయితే ఇది గతం. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల నుంచి రాజకీయ వారసులుగా బరిలోకి దిగిన పరిటాల శ్రీరాం, జేసీ పవన్ కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిటాల రవీంద్ర వారసుడిగా శ్రీరాం బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేతిలో 25,575 ఓట్లతో ఘోరపరాభావం చవిచూశారు. పరిటాల కుటుంబం పాతికేళ్ల రాజకీయప్రస్థానంలో తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. ఈ దెబ్బతో పరిటాల కుటుంబానికి ఇక రాజకీయ సమాధి తప్పదనే చర్చ జరుగుతోంది. సామాన్యులు.. ‘అనంత’ విజేతలు ఈ ఎన్నికల్లో అందరిచూపు ఇద్దరి సామాన్యులపైనే ఉంది. అనంతపురం జిల్లాలో పలు స్టేషన్లలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్, ఇదే జిల్లాలో గ్రూపు–1 అధికారిగా పనిచేసిన తలారి రంగయ్యలు ఇద్దరు ప్రధాన నేతలపై పోటీగా దిగారు. జేసీ దివాకర్‌రెడ్డి వారసుడిపై రంగయ్య, టీడీపీ అత్యంత బలంగా ఉండే హిందపురం ఎంపీ అభ్యర్థిగా మాధవ్ బరిలోకి దిగారు. అయితే ఈ పోరులో ‘అనంత’ వాసులు సామాన్యుల పక్షాన నిలిచారు. కురబ, బోయ సామాజిక వర్గానికి చెందిన మాధవ్, రంగయ్యలను అఖండ మెజార్టీతో గెలిపించి దీవించారు. మాధవ్, రంVýæయ్య ఇద్దరూ 1.38 లక్షల పైచిలుకు మెజార్టీ సాధించారు. సామాన్యులకు రాజకీయ ఎదుగుదల కల్పించాలనే ఏకైక కారణంతో వీరిద్దరికీ వైఎస్ జగన్ టిక్కెట్ల కేటాయించారు. ఈ ఇద్దరినీ ప్రజలు ఆశీర్వదించారు. వీరితో పాటు రిటైర్డ్ ఐజీ ఇక్బాల్‌ను కూడా హిందపురం బరిలో నిలిపారు. దురదృష్టవశాత్తూ ఈయన బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. మంత్రులు, చీఫ్విప్ల స్థానాల్లో వైఎస్సార్సీపీ స్వీప్ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసుల, శాసనసభ, మండలి చీఫ్‌విప్‌లు పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన రాప్తాడు, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కీలక పదవుల్లో కొనసాగుతున్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి 25,575 ఓట్లతో గెలుపొందగా, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి 14,463 ఓట్లు, పుట్టపర్తిలో శ్రీధర్‌రెడ్డి 31,276 ఓట్లతో విజయం సాధించారు. ఫలించిన శింగనమల సెంటిమెంట్ శింగనమలలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. 46,221 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధించారు. అలాగే వీరితో పాటు గుంతకల్లు వెంకట్రామిరెడ్డి 48,532 ఓట్లతో, కళ్యాణదుర్గం ఉషాశ్రీచరణ్ 19,534 ఓట్లతో విజయం సాధించారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి 7,941 ఓట్లు, మడకశిరలో తిప్పేస్వామి 12,917 ఓట్లు, కదిరిలో సిద్ధారెడ్డి 27,063 ఓట్లతో విజయం దక్కించుకున్నారు. ‘అనంత’లో అఖండ మెజార్టీ అనంతపురం నియోజకవర్గ చరిత్రలో తిరుగులేని మెజార్టీని వెంకట్రామిరెడ్డి సాధించారు. 27,285 ఓట్లతో అనంత వెంకట్రామిరెడ్డి గెలుపొందారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఇంత మెజార్టీ రాలేదు. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురునాథరెడ్డి 24,739 ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు ఆ మెజార్టీని వెంకట్రామిరెడ్డి అధిగమించారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని ఆ పార్టీ శ్రేణులు పండుగలా చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో కేక్‌కట్ చేశారు. గెలుపొందిన నియోజకవర్గాల్లో కేక్ కటింగ్‌లు, ఆలయాల్లో మొక్కుల చెల్లింపులు, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రతీ పల్లెలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఫలితాల రోజు కూలీల మొదలు ఉద్యోగుల వరకు ఎవ్వరూ పనులకు పోకుండా, విధులకు వెళ్లకుండా ఉదయం నుంచి టీవీలకు అతుక్కుని ఫలితాలు వీక్షించారు. ఫలితాలు జగన్‌కు అనుకూలంగా ఉండటంతో అంతా సంబరాల్లో మునిగిపోయారు. రైతులు, మహిళలు, వృద్ధులు కూడా వైఎస్సార్సీపీ విజయాన్ని వేడుకగా చేసుకున్నారు. రాజకీయంగా జేసీ కుటుంబానికి కాలం చెల్లు జేసీ దివాకర్‌రెడ్డి నాలుగు దశాబ్దాల రాజకీయచరిత్రలో కాంగ్రెస్, టీడీపీ తరఫున పోటీ చేశారు. రాజకీయ అరంగేట్రంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోవడం మినహా ఎప్పుడూ దివాకర్‌రెడ్డి ఓటమి చవిచూడలేదు. అయితే జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఈ ఐదేళ్లలో నోటికి ఎంతమాటొస్తే అంతమాట అంటూ జనాల్లో చులకనయ్యారు. తాడిపత్రిలో అవినీతి, అరచకాలతో ‘రౌడీరాజ్యం’ నడిపించారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి వారసుడు పవన్‌రెడ్డి లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే జేసీ ప్రభాకర్‌రెడ్డి వారసుడిగా బరిలోకి దిగిన జేసీ అస్మిత్‌రెడ్డి 8వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు. తొలి నుంచి జేసీ కుటుంబం తాడిపత్రికి వరకు మాత్రమే పరిమితమై రాజకీయం నడిపారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచి జిల్లాలో చక్రం తిప్పాలని భావించారు. అయితే ఐదేళ్లకే కోలుకోలేని దెబ్బ తగలింది. తాజా ఓటమితో జేసీ కుటుంబం శకం ముగిసినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం జేసీ వైఖరే అని ఆ పార్టీ శ్రేణులు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో జేసీ బ్రదర్స్ పేరు ఇక ‘అనంత’ రాజకీయాల్లో వినపడకపోవచ్చని తెలుస్తోంది. -
24 గంటలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని 24 లక్షల మంది ఓటర్ల మనోగతంతో పాటు దాదాపు నెలన్నరగా తమ రాజకీయ భవితవ్యం ఏమిటని ఎదురుచూస్తున్న వివిధ పార్టీల నేతల ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమయ్యే కౌంటింగ్‌లో అసలు ప్రక్రియ 8.30 గంటలకు మొదలవుతుంది. ప్రతి రౌండులో పది టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫలితం రావడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత.. ప్రతి నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల చొప్పున లెక్కింపు నిర్వహిస్తామన్నారు. ఒక్కో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు 45 నిమిషాల నుంచి గంట వరకూ పడుతుందన్నారు. పోలింగు ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్– సీఆర్సీ) ఓటింగు యంత్రాల లెక్కింపు మాత్రం చివర్లో చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారమే ఆదేశాలు అందాయని ఆయన వెల్లడించారు. మెజార్టీ మరీ ఎక్కువగా ఉంటే వీటి లెక్కింపు కూడా జరిగే అవకాశం లేదన్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ఏయే సిబ్బందికి ఏ టేబుల్ వద్ద విధులు కేటాయిస్తారనే విషయం మాత్రం కౌంటింగ్ రోజు అంటే 23వ తేదీ ఉదయం 5 గంటలకు తేలుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఇలా... ఓట్ల లెక్కింపు ప్రక్రియ 23వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ అరగంటలో ఆ ఓట్ల లెక్కింపు పూర్తయినా, కాకపోయినా 8.30 గంటలకు ఓటింగు యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో రౌండుకు సంబంధించిన ఫలితాన్ని ఏజెంట్లకు చూపించి.. వారి ఆమోదం తర్వాత అధికారికంగా ఆర్వో ప్రకటిస్తారు. ఒక్కో రౌండు ఓట్ల లెక్కింపునకు 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం తీసుకుంటుంది. జిల్లాలో తక్కువ పోలింగు బూత్‌లు ఉన్న శ్రీశైలం నియోజకవర్గ ఫలితం మొదట వెలువడనుంది. ఇక అధిక బూత్‌లు ఉన్న పాణ్యం నియోజకవర్గ ఫలితం చివర్లో వెలువడనుంది. ఈ ఫలితాలను మాత్రం ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదేసి చొప్పున వీవీ ప్యాట్లను తీసి.. లెక్కించిన తర్వాతే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఒక్కో వీవీ ప్యాట్‌ను లెక్కించేందుకు 45 నిమిషాల నుంచి గంట వరకూ పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. అధికారికంగా తుది ఫలితం వెలువరించేందుకు సాయంత్రం ఆరు గంటలు కావొచ్చు. 3 వేల మంది సిబ్బంది జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌కు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో, నంద్యాల పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నంద్యాల రోడ్డులోని రాయలసీమ యూనివర్సిటీలో జరగనుంది. సూక్ష్మ పరిశీలకులుగా 596 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లుగా 491, కౌంటింగ్ సూపర్వైజర్లుగా 770 మందిని నియమించారు. వీరితో పాటు ఓట్ల లెక్కింపు సిబ్బంది, సహాయ సిబ్బంది అంతా కలిపి మూడు వేల మంది వరకూ కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. పోలీసు భద్రత విషయానికి వస్తే మూడంచెలు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రం నుంచి కిలోమీటరు వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. భద్రతాపరంగా వివిధ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది 1,200 మంది వరకూ ఉంటారన్నారు. -
మళ్లీ బీజేపీ గెలిస్తే..ఆర్థికమంత్రి ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టనుందంటూ ఎగ్జిట్ పోల్ అంచనాలు భారీగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ ఏర్పడితే ఆర్థికమంత్రిగా ఎవరు ఉంటారు? అనారోగ్య సమస్యలతో ఇటీవల ఇబ్బందులు పాలైన ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన పదవిని నిలబెట్టుకుంటారా? ఈ ప్రశ్నలు ఆర్థిక, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మోదీ కాబినెట్లో కీలకమైన నాయకుడు, న్యాయవాది, ట్రబుల్ షూటర్ అరుణ్ జైట్లీకే మళ్లీ ఆర్థికమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశం వుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా, అనుకోని పరిస్థితుల్లో రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ (54)కు ఆర్థికమంత్రిత్వ శాఖ బాధ్యతలిచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు జైట్లీ స్థానంలో తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన ఆయనకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని అంచనా. ప్రధానమంత్రి కార్యాలయం ద్వారానే కీలక నిర్ణయాలుంటాయి గనుక, ఆర్థికమంత్రి ఎవరనే పట్టింపు పెద్దగా ఉండదని కేర్ రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నావిస్ అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ లేదా ఎన్డీయేతర ప్రభుత్వమా అనేదే స్టాక్‌మార్కెట్లకు కీలకమన్నారు. మరోవైపు ఆర్థికమంత్రిగా ఎవరు బాధ్యతలను చేపట్టినా..కత్తిమీద సామేనని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాల్లో తక్కువ చమురు ధరలు పెరగడంతో, 2018 చివరి నాటికి వృద్ధిరేటు 6.6 శాతానికి పడిపోయింది. ఇంకా గ్రామీణ వినియోగ డిమాండ్ తగ్గుముఖం పట్టడం, పెరుగుతున్న ఇంధన ధరలు ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికలు ఏడుదశల్లో పూర్తి చేసుకుంది. ఈ నెల 23, గురువారం వెలువడనున్న ఈ ఫలితాలపై స్వర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
సాక్షి, కర్నూలు: ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. ఓట్ల లెక్కింపుపై సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కర్నూలు పార్లమెంటుకు చెందిన వారికి పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో, నంద్యాల పార్లమెంటుకు చెందిన వారికి జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపుపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు ఈ నెల 23వ తేదీ తమకు కేటాయించిన కేంద్రాలకు ఉదయం ఐదు గంటలకే చేరుకోవాలని సూచించారు. ఏ టేబుల్‌కు ఎవ్వరనేది అక్కడ ర్యాండమైజేషన్ ద్వారా కేటాయిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల నుంచి తెచ్చిన కంట్రోల్ యూనిట్ల సీల్‌ను పరిశీలించి.. కేటాయించిన టేబుల్‌పై ఉంచాలన్నారు. కంట్రోల్ యూనిట్లో ఉండే రిజల్ట్ బటన్ నొక్కితే అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లు డిస్ప్లే అవుతాయన్నారు. టోటల్ బటన్ ప్రెస్ చేసి 17సీతో సరిపోయిందా.. లేదా అని 17ఏతో సరిచూసుకోవాలన్నారు. ఒకవేళ రిజల్ట్ బటన్ నొక్కితే ఇన్వ్యాలిడ్ అని వస్తే పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్డ్ బటన్ నొక్కిండరని అర్థమని, ఇటువంటి వాటిని వెంటనే ఆర్వో దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్వో, పరిశీలకుడు కలసి తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రతి రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఏజెంట్లతో సంతకాలు తీసుకోవాలని సూచించారు. రౌండ్ల వారీగా ఫలితాలను న్యూ సువిధ యాప్‌లో అప్లోడ్ చేసిన తర్వాతనే ప్రకటించాలన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లకు వచ్చిన వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. కర్నూలు పార్లమెంట్ పరిశీలకుడు కేఆర్ మజుందార్, ఏఆర్వో ప్రశాంతి,డీఆర్వో వెంకటేశం, ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
గెలిచేదెవరు.. ఓడేదెవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఓ వైపు లోక్‌సభ... మరోవైపు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. 43 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా జరిగిన విషయం విదితమే. ఇందులో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఆ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జెడ్పీలు లక్ష్యంగా టీఆర్ఎస్ సర్వశక్తులొడ్డగా.. 27న వెలువడే ఫలితాలతో ఎవరి ఆశలు ఎంత మేరకు ఫలించాయనేది బయటపడనుంది. మూడు రోజుల వ్యవధిలో అటు పార్లమెంట్, ఇటు ప్రాదేశిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నాయకులతో పాటు ఇటు ఓటర్లలో చర్చలు మొదలయ్యాయి. బరిలో 3,166 మంది వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ పార్లమెంట్ స్థానాల్లో పార్టీలు, స్వతంత్రులు కలిపి 29మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఆరు జిల్లాల పరిధిలోని 70 జెడ్పీటీసీ స్థానాలకు 403 మంది, 780 ఎంపీటీసీ స్థానాలకు 2,734 మంది రంగంలో ఉన్నారు. అంటే మొత్తంగా విజయం కోసం 3,166 మంది నిరీక్షిస్తున్నారు. ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాల్లో ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలవనున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భారీగానే ఆశల్ని పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోరును ఇక్కడ కూడా చూపిస్తామనే ధీమాతో గులాబీ దళంలో ఉండగా.. ఫలితం తమకు అనుకూలంగా వస్తుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. ఇక వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి జయశంకర్, ములుగు జిల్లాల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరులో 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోగా 70 జెడ్పీటీసీ, 762 ఎంపీటీసీ స్థానాల్లో తామే గెలుస్తామంటూ 3,137 మంది అభ్యర్థులు ఎవరికి వారు చెబుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉన్నా.. అక్కడక్కడా స్వతంత్రులు గెలుపు బాటలో పయనించే అవకాశముందనే ప్రచారంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అందరిలోనూ ఆశలే ఈనెల 23, 27.. ఈ రెండు తేదీలపైనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బోలెడు ఆశల్ని పెట్టుకున్నారు. అటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ఇటు ప్రాదేశిక సమరంలో తలపడిన అభ్యర్థులంతా గెలుపు తమదేనన్న ఆశల లోకంలో విహరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయి.. మెజార్టీ ఎంత రావొచ్చంటూ లెక్కలేసుకుంటున్నారు. పార్టీల ఉనికిని కీలకంగా పరిగణించే ఈ ఫలితాల తీరుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమనే చెబుతున్నారు. కాగా రాబోయే ఐదేళ్లపాటు జిల్లాలో తమదైన ఉనికి సాగించాలనుకునే పార్టీలకు ఈ రెండు ఎన్నికల ఫలితాలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ జోరుకు అనుకున్న స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ శక్తివంచన లేకుండా చేసిన కృషి ఏ మేరకు ఫలితమిస్తుందోననేది వేచిచూడాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో గులాబీ పార్టీలో సరికొత్త ఉత్సాహం నెలకొనగా.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపు కోసం ప్రయత్నించింది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వచ్చే సరికి అన్ని పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. చకచకా ఏర్పాట్లు అభ్యర్థుల అంచనాలను పక్కన పెడితే.. ఇంకోపక్క అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఏనుమాముల మార్కెట్లో, మహబూబాబాద్ లోక్‌సభ స్థానం ఈవీఎంలను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భద్రపరిచారు. ఆయా కేంద్రాల్లో 24 గంటల భద్రత కొనసాగుతుండగా.. 23వ తేదీన జరిగే లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా శుక్రవారం ఏనుమాములలో వరంగల్ లోక్‌సభ రిటర్నింగ్ అధికారి, అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మహబూబాబాద్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శివలింగయ్య ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని సూచించిన వారు.. కౌంటింగ్ హాళ్లలో బారికేడ్లు, ఫెన్సింగ్‌ను పరిశీలించారు అధికారులకు సూచనలు చేశారు. -
జిల్లా పరిషత్ చివరి సమావేశం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. నేడు నిర్వహించ తలపెట్టిన సమావేశం జరిగేలా లేదు. కోరం లేక వాయిదా పడే అవకాశమే కనిపిస్తోంది. ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం జూలై మొదటి వారం వరకు ఉంది. అంటే మరో రెండు నెలల లోపు ఈ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించాలని జెడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు నిర్ణయించారు. కాగా సమావేశానికి సభ్యులు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు చేయరాదు. అలాగే పాలకవర్గం కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు వీలు లేదు. దీంతో సమావేశానికి సభ్యుల çహాజరు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం జెడ్పీటీసీలుగా ఉన్న వారు, ఎంపీపీలుగా కొనసాగుతున్న వారు ఎన్నికల్లో పోటీ చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవు. దీంతో సమావేశం వచ్చే నెలకు వాయిదా పడే అవకాశాలున్నట్లు సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికల పనుల్లో అధికారులు బిజీ.. మరోవైపు వరుస ఎన్నికల పనుల్లో జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం బిజీగా ఉంది. ‘పరిషత్’ ఎన్నికల పోలింగ్ ఇటీవలే ముగిసింది. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్పీ సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సమావేశం నిర్వహించి, సమస్యలపై చర్చించే క్రమంలో సమాధానాలు ఇవ్వాల్సిన అధికారులు లేకపోతే ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశం వచ్చే నెలలో నిర్వహించన్నట్లు తెలుస్తోంది. సాధారణ నిధులపై తీర్మానాలు జిల్లా పరిషత్ నిధులతో వివిధ అభి వృద్ధి పనులు చేపట్టేందుకు తీర్మానాలు చేయాలని పాలకవర్గం భావిస్తోంది. జెడ్పీలో ప్రస్తుతం సాధారణ నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులతో తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పన, చిన్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని పాలకవర్గం భావిస్తోంది. ఈ పనులు మంజూరు కావాలంటే జెడ్పీ సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో వచ్చే నెలలోనే తీర్మానాలు చేయాల్సి వస్తోంది. -
కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు శుక్రవారం జగిత్యాలలో పర్యటించారు. అక్కడి కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా, జాయింట్ కలెక్టర్ రాజేశం స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వీఆర్కే కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూం నుంచి నేరుగా కౌంటింగ్ హాలుకు వచ్చే దారిని పరిశీలించారు. అలాగే ఒక హాలులో 18 టేబుళ్లు చొప్పున జగిత్యాలకు రెండు హాళ్లను, కోరుట్లకు రెండు హాళ్లను పరిశీలించారు. కౌంటింగ్ వివరాలు ఏజెంట్లకు తెలుపడానికి ఏర్పాటు చేసిన టీవీలు, ఏర్పాట్లను చూసి సంతృప్తి చెందారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఎస్పీ సిందూశర్మ, సబ్ కలెక్టర్ గౌతమ్, డీఆర్వో అరుణ, ఇతర అధికారులున్నారు. -
బల్దియా పోరుకు కసరత్తు!
ఆదిలాబాద్‌రూరల్: మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు త్వరలో ముగియనుండడంతో మరో నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమాయత్తమవుతున్నారు. గతంలో మే 31లోగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్ నుంచి మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకొని పట్టిష్టమైన మున్సిపల్ చట్టాలను అమల్లోకి తెద్దామని ఇదీ వరకు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చట్టం అమలులోకి వచ్చిన 15 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మున్సి పాలిటీ పాలక వర్గం గడువు జూన్ 3తో ముగియనుంది. తాజాగా సీఎం కేసీఆర్ మున్సిపాలిటీ ఎన్నికలను జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ప్రటిం చారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదీ వరకే ఓటరు ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించడంతో అధి కారులు వాటిని సిద్ధం చేశారు. మున్సి పాలిటీలో వార్డుల వారీగా ఓటరు జాబి తాలను రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. వీటి బాధ్యతలను కమిషనర్లకు అప్పగించారు. ఇది వరకే ముసాయిదా జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తుది జాబితా విడుదల చేశారు. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్నికల ముసాయిదా విడుదలైనా ఇంకా మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై స్పష్టత రావాల్సి ఉంది. వార్డుల పెంపుపై స్పష్టత రాని వైనం మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అదే నెలలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డులను పెంచడంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత రాలేదు. గతంలో మున్సిపాలిటీలో విలీనమైన జీపీలను అధికారులు సమీప వార్డుల్లో సర్దుబాటు చేశారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం ఉన్న 36 వార్డులకు తోడు మరోఐదు వార్డులు పెంచాలంటూ మున్సిపల్ కౌన్సిల్, ఎమ్మెల్యే జోగు రామన్న రాష్ట్ర మున్సిపల్ శాఖకు విన్నివించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మున్సిపాలిటీలో కొత్తగా వార్డులు పెరుగుతాయా..లేక ప్రస్తుతం ఉన్న 36 వార్డుల్లోనే సర్దుబాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. పోలింగ్‌కేంద్రాల ఏర్పాటుకు విధివిధానాలు మున్సిపాలిటీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. కుటుంబంలోని ఓటర్లు అందరు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఓటరు జాబితా లను రూపొందించే అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారితోపాటు సహాయ అధికారిని నియమించే అవకాశం ఉంది. విలీన గ్రామాలపై తేలని నిర్ణయం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. గతేడాది పట్టణానికి సమీపంలోని గ్రామాలను విలీనం చేశారు. మావల పంచాయతీ, బట్టిసావర్గాం, రాంపూర్, అనుకుంట, బెల్లూరి, నిషాన్‌ఘాట్‌లను విలీనం చేశారు. సీడీఎంఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారులు విలీన జీపీలు, కాలనీలను సమీప మున్సిపాలిటీ వార్డుల్లో విలీనం చేశారు. దీంతో 32వ వార్డులో రాంపూర్ గ్రామాన్ని కలిపారు. 13వ వార్డులో అనుకుంట, 27వ వార్డులో బట్టిసావర్గాం జీపీలోని టైలర్స్‌కాలనీ, వివేకానంద, ఎన్హెచ్బీకాలనీ, అగ్రజా టౌన్షిప్, ఆదర్శకాలనీ, భగత్సింగ్కాలనీలను విలీనం చేశారు. 3వ వార్డులో బేల్లూరి, నిషాన్ఘాట్, 19వ వార్డులో మావల మేజర్ గ్రామ పంచాయతీలోని దస్నాపూర్, దర్గానగర్, కేఆర్కే కాలనీ, పీహెచ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కృష్ణానగర్, అటెండర్ కాలనీలను విలీనం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 36 వార్డులు ఉండగా మరో ఐదు వార్డులను పెంచి మొత్తం 41 వార్డులు చేస్తారని మున్సిపల్ పాలకవర్గం భావిస్తూ వస్తోంది. తాజాగా ఎన్నికల సంఘం ఎన్నికల ముసాయిదా విడుదల చేసింది. కొత్తగా వార్డులను పెంచుతారా? లేక సర్దుబాటు చేసిన వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారి సంఖ్య అన్ని పార్టీల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వార్డులు పెరిగితే కౌన్సిలర్‌గా పోటీ చేద్దామనుకునే ఆశావహుల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది. -
రీ పోలింగ్‌లో 3,899 మంది ఓటర్లు
సాక్షి, అమరావతి : చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల నిర్వహించనున్న పోలింగ్‌లో 3,899 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో ఈ ఐదు బూత్‌లలో మొత్తం 3,483 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఐదు చోట్ల అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్‌లను స్వాధీనం చేసుకుని యధేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వీడియో రికార్డులు స్పష్టం చేస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం రీ–పోలింగ్‌కు ఆదేశించింది. ఈ ఐదు చోట్ల పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు రీ–పోలింగ్ జరగనుంది. ఎన్ఆర్ కమ్మపల్లి (321) బూత్‌లో మొత్తం 698 మంది ఓటర్లుండగా.. పురుషులు 336, మహిళలు 362 మంది ఉన్నారు. ఇందులో ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో 658 ఓట్లు నమోదయ్యాయి. అదే విధంగా పుల్లివర్తిపల్లి (104) బూత్‌లో 805 ఓట్లుండగా.. పురుషులు 391, మహిళలు 414 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ బూత్‌లో 767 ఓట్లు నమోదయ్యాయి. కొత్త కండ్రిగ (316) పోలింగ్ కేంద్రంలో 991 ఓట్లుండగా.. పురుషులు 482, మహిళలు 509 ఉండగా గత ఎన్నికల్లో 812 ఓట్లు నమోదయ్యాయి. కమ్మపల్లి (318) పోలింగ్ కేంద్రంలో 1,028 ఓట్లుంటే.. పురుషులు 490, మహిళలు 538 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ బూత్‌లో 925 ఓట్లు పోలయ్యాయి. వెంకట్రామపురం (313) పోలింగ్ కేంద్రంలో 377 మంది ఓటర్లలో పురుషులు 179, మహిళలు 198 మంది ఉండగా గత ఎన్నికల్లో 323 ఓట్లు నమోదయ్యాయి. -
రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ, పోలీసు వర్గాల్లో టెన్షన్
సాక్షి, అమరావతి : ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడటం ఒకవైపు రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతుండగా మరోవైపు పోలీసు వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. రాష్ట్రంలో కౌంటింగ్ రోజు అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరికలే ఇందుకు కారణం. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు చోటు చేసుకునే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏప్రిల్ 11న పోలింగ్ రోజు అధికార టీడీపీపలు జిల్లాల్లో పెద్ద ఎత్తున దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజు టీడీపీ శ్రేణులు నేరుగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగినప్పటికీ కట్టడి చేయడంలో పోలీసులు విఫలం కావడం విమర్శలకు దారి తీసింది. ఘర్షణలుజరిగిన పోలింగ్ కేంద్రాల వద్ద కేవలం ఒకరిద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మాత్రమే ఉండటంతో దాడులను నిలువరించలేకపోయారు. 26 చోట్ల చెలరేగిన హింస.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ రోజు 26 చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆరు చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల దాడులు జరిగాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అలజడులు సృష్టించి ఓటర్లను భయపెట్టి ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు టీడీపీ నేతలు కుట్రలకు తెర తీశారు. పోలింగ్ రోజు టీడీపీ శ్రేణులు హింసకు దిగడంతో వైఎస్సార్సీపీకి చెందిన ఒకరు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడటం శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు బరితెగించి వీరాపురంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్ శ్రేణులు ప్రయత్నించడంతో జేసీ వర్గీయులు రెచ్చిపోయి వేట కొడవళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త పుల్లారెడ్డి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకట రమణప్పను టీడీపీ కార్యకర్తలు రాళ్లతో కొట్టి హత్య చేశారు. శ్రీకాకుళం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణితోపాటు పలు చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. పోలింగ్ అనంతరం కూడా నాలుగు రోజులపాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దాడులను కొనసాగించడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు కూడా ఇది పునరావృతమయ్యే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పోలీస్‌శాఖ అప్రమత్తం ఓట్ల లెక్కింపు రోజు ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిపై ఓ కన్నేసి ఉంచాలని, కౌంటింగ్ సందర్భంగా అసాంఘిక శక్తులు అలజడులకు దిగకుండా కట్టడి చేయాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈవీఎంల లెక్కింపులో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పుకార్లు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు రాజకీయ పార్టీల శ్రేణులు సమూహాలుగా చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడంచెల భద్రతా చర్యలు చేపట్టారు. స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సుతోపాటు కేంద్ర బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బందోబస్తుపై ఉన్నతాధికారులు జిల్లాలవారీగా వీడియో, టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు అనివార్యమనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయని, దీంతో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్పు ఖాయమని తేలడంతో... రాష్ట్రంలో మార్పు అనివార్యమనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయని, దీంతో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు, హోరాహోరీ పోరు సాగిన చోట్ల ఓట్ల లెక్కింపు సమయంలో టెన్షన్ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీస్ బాస్‌కు నివేదించాయి. -
వీధుల్లో వీరంగం!
బాధ్యతాయుతంగా మెలగాల్సిన పార్టీలు విలువలకు తిలోదకాలొదలి, బలప్రదర్శనకు దిగితే ఏమవుతుందో మంగళవారం కోల్‌కతాలో జరిగిన హింస, విధ్వంసం నిరూపించాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం తన్నులాడుకుని సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశారు. కోల్‌కతా పరిణామాలు గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) అసాధారణ రీతిలో రాజ్యాంగంలోని 324 అధి కరణాన్ని ప్రయో గించి ప్రచారపర్వాన్ని 24 గంటల ముందే నిలిపివేసింది. హింసను నివారిం చడంలో విఫలమయ్యా రన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(హోం)ని, సీఐడీ విభాగం అధిపతిని వారివారి పదవుల నుంచి తప్పించింది. వచ్చే ఆదివారం జరగాల్సిన ఆఖరి దశ పోలింగ్ ప్రచారానికి వాస్తవా నికి శుక్రవారంతో తెరపడాలి. కానీ తాజా ఆదేశాల పర్యవసానంగా గురు వారం రాత్రి 10 గంట లతో ఇది నిలిచిపోతుంది. అధికార యంత్రాంగం సహాయనిరాకరణ చేస్తున్నందువల్ల ఈ నిర్ణయా నికొచ్చామని ఎన్నికల సంఘం చెబుతోంది. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో హింస, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనుకుంటే, వాటిని నివారించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనుకుంటే పార్టీల ప్రచారాన్ని తక్షణమే నిలిపేసి ఉంటే వేరుగా ఉండేది. ఆఖరికి 19న జరగాల్సిన తుది దశ పోలింగ్‌ను వాయిదా వేసినా ఎంతో కొంత అర్ధముండేది. కానీ ఇందుకు బదులు గురువారం రాత్రి వరకూ ప్రచారానికి ఎందుకు అనుమతించారో సీఈసీయే చెప్పాలి. పార్టీలన్నీ ముందుగా నిర్ణయించుకున్న విధంగా రేపటి సభలూ, సమావేశాలు యధాతథంగా జరు పుకోనివ్వడమే ప్రజాస్వామికమనుకున్న ప్పుడు నిబంధనల ప్రకారం ఆ మర్నాడు కూడా దాన్ని కొనసాగించనీయడమే సరైంది అవుతుంది. ఎన్నికల సంఘం నిర్ణయంలోని హేతుబద్ధత సంగతలా ఉంచితే బెంగాల్లో తృణమూల్, బీజే పీల తీరుతెన్నులు జనం హర్షించదగ్గవిగా లేవు. అమిత్ షా ర్యాలీకి, ఆ మాటకొస్తే మరికొందరు ఇతర నేతల ర్యాలీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో ఆ పార్టీ నేతలకు తెలుసు. అటువంటప్పుడు మంగళవారం నాటి ర్యాలీ అదుపు తప్పకుండా బీజేపీ ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. పొంచి ఉన్న ప్రమాదాల గురించి, సంయమనం పాటించాల్సిన అవసరం గురించి తమ కార్యకర్తలకు చెప్పి ఉండాలి. బాధ్యతాయుతమైన పార్టీగా బీజేపీ ఆ పని చేసి ఉంటే అందరూ దాన్ని ప్రశంసించేవారు. కానీ యుద్ధరంగానికెళ్తున్న రీతిలో ర్యాలీ నిర్వహిం చడం, తీరా ఎవరినీ అదుపు చేసే స్థితిలో లేకపోవడం సరైంది కాదు. అవతలి పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వి ముందుగా తమ కార్యకర్తల్ని కవ్వించారని... తృణమూల్ కార్యకర్తలే తమ జెండాలు పట్టు కుని ఈ విధ్వంసాన్నంతటినీ సాగించారని చెప్పినంతమాత్రాన జరిగిందంతా మాసిపోదు. ర్యాలీ జరుగుతున్న క్రమంలోనే ఇదంతా చోటు చేసుకుంది గనుక నాయకులు సకాలంలో జోక్యం చేసు కుని నివారించి ఉంటే ఇలాంటి సంజాయిషీలు చెప్పుకునే బాధ తప్పేది. కోల్‌కతాలో జరిగిన హింస, విధ్వంసం సాధారణమైనవి కాదు. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, ఇటుకలతో పరస్పరం దాడులకు దిగడం మాత్రమే కాదు... వాహనాలకు నిప్పెట్టి, కళాశాల కార్యా లయాన్ని ధ్వంసం చేసి జనాన్ని భయభ్రాంతుల్ని చేశారు. అన్నిటికీ మించి బెంగాలీలు ఎంతో ప్రాణప్రదంగా చూసుకునే సంఘ సంస్కర్త, తత్వవేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని దుండ గులు ధ్వంసం చేశారు. ఆయన కేవలం బెంగాల్‌కు పరిమితమైన వ్యక్తి మాత్రమే కాదు. భిన్న రంగాల్లో ఆయన ఆచరణ 170 ఏళ్లక్రితమే దేశం మొత్తాన్ని కదిలించింది. ఎన్నో సంస్థలు సమష్టిగా సాధించలేనివి కూడా ఆయన వ్యక్తిమాత్రుడిగా కృషి చేసి అమల్లోకి తీసుకురాగలిగారు. మన కందు కూరి వీరేశలింగంవంటి ఎందరెందరికో ఆదర్శనీయుడయ్యారు. బాల్యవివాహాలకూ, బహుభార్య త్వానికి వ్యతిరేకంగా పోరాడారు. వితంతు పునర్వివాహాలు హిందూ శాస్త్రాలకు విరుద్ధం కాదని అలుపెరగని ప్రచారం చేసి విజయం సాధించారు. బ్రిటిష్ పాలకులను ఒప్పించి చట్టాలు తీసుకొ చ్చేలా చేశారు. బెంగాలీ భాష సంస్కరణకు నడుం కట్టారు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. దీన్ని బెంగాలీ ప్రజలపై, సంస్కృతిపై బీజేపీ చేస్తున్న దాడిగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటించుకోవడానికి, చేసింది చెప్పుకోవడానికి, మున్ముందు చేయదల్చుకున్నవాటిని వివరించడానికి ఎన్నికలు ఒక సందర్భం. కానీ ఆచరణలో ఇదంతా తారుమారవుతోంది. 42 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో ఏడు దశల్లోనూ పోలింగ్ నిర్వ హించబోతున్నామని ఎన్నికల సంఘం ప్రకటించినప్పుడు అభ్యంతరం చెప్పినవారున్నారు. ముఖ్యంగా తృణమూల్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే హింసాత్మక వాతావరణాన్ని అదుపు చేయడానికి ఇది ఏదో మేరకు తోడ్పడుతుందని చాలామంది భావించారు. ఇందువల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడటం భద్రతా బలగాలకు వీలవుతుందనుకున్నారు. కానీ అదేమీ లేకపోగా, సుదీర్ఘమైన పోలింగ్ షెడ్యూల్ ఉండటంతో పార్టీలు అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. అవతలి పార్టీల విధానాలను విమర్శించడానికి, పాలనలోని లోపాలను చూపడానికి బదులు నేతలు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగి ప్రశాంతమైన వాతావరణాన్ని భగ్నం చేశారు. ఎన్నికలొస్తున్నాయంటే సామాన్య జనం హడలెత్తే స్థితి కల్పించారు. ఏదో ఒక దశలో ఎన్నికల సంఘం చొరవ తీసుకుని దీన్నంతటినీ సరిదిద్దవలసింది. ఏవో అరకొర చర్యలు మినహా ఇంతవరకూ అది చేసిందేమీ లేదు. చివరి దశలో ఇప్పుడు తీసుకున్న చర్య అయినా హేతుబద్ధంగా లేదు. కోల్‌కతాలో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు అందరూ బాధ్యులే. కనీసం మున్ముందైనా ఈ పార్టీలన్నీ ఆత్మవిమర్శ చేసుకుని తమ లోపాలు సరిదిద్దుకుంటాయని ఆశించాలి. -
బీ అలర్ట్
ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఏ ముగ్గురు ముచ్చటించినా, ఏ నలుగురు కూడినా ఒకటే చర్చ.. ఎవరు గెలుస్తారు.. ఎవరి మెజార్టీ ఎంత.. అధికారం ఎవరిది.. ఎన్నికలు ముగిశాక ఫలితాలకు సుదీర్ఘ సమయం ఉండడంతో అటు పార్టీల నాయకులతోపాటు ప్రజలకూ టెన్షన్ మొదలైంది. ఫలితాలకు సమయం దగ్గర పడడంతో ఇప్పుడు ఆ టెన్షన్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడ్డాక పరిస్థితులు ఏంటి ? ఎక్కడైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉందా ? అనే అంశాలపై పోలీసులు నిఘా పెట్టారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో కదలికలపై ఇప్పటి నుంచే ఓ కన్నేశారు. మరో వైపు జిల్లాకు అదనపు బలగాలు కావాలంటూ ఉన్నతాధికారులు లేఖ రాశారు. సాక్షి, గుంటూరు: ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలతోపాటు గ్రామాల్లో సైతం వేడి రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత గ్రామాల్లో రెండు, మూడు రోజులపాటు గొడవలు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు ఆయా గ్రామాలపై డేగ కన్ను వేశారు. గొడవలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై స్థానిక పోలీసు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదనంగా మరి కొంత బలగాలు కావాలంటూ ఇప్పటికే ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత రూరల్ జిల్లా పరిధిలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. పల్నాడు ప్రాంతంపై నిఘా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో పోలింగ్ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అవాంఛనీయ ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసు శాఖపై మచ్చ పడింది. కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆయా ప్రాంతాల్లో గొడవలు జరిగాయని నిర్ధారించుకున్న ఉన్నతాధికారులు ఇప్పటికే వారిపై చర్యలకు సిఫార్సులు చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలే గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తున్న తీరు పోలీసులను కలవరపాటుకు గురి చేస్తోంది. దీనికి తోడు ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందంటూ సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, నెటిజన్లు సైతం పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల ఫలితాలు రాగానే దాడులు చేసేందుకు గ్రామాల్లోని కొన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయనే నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలు ఇప్పటికే జిల్లాలో ఉన్న 13 ఏపీఎస్పీ ప్లటూన్లకు తోడు మరో ఎనిమిది ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలను పంపాలంటూ గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా కోరినట్లు తెలిసింది. సమస్యాత్మక గ్రామాలపై పూర్తి స్థాయి నిఘా ఉంచడంతోపాటు గొడవలు సృష్టించే వారి వివరాలు సేకరించి వారికి హెచ్చరికలు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఫలితాలు వచ్చిన తరువాత తమకు ఓట్లు పడలేదనే అక్కసుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలపై దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 23న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పట్టణాలతోపాటు, గ్రామాల్లో సైతం 144 సెక్షన్ అమలులోకి తీసుకొచ్చి గుంపులుగా చేరడం, ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టకుండా చూసేలా స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల రోజు గొడవలు జరిగిన ప్రాంతంలో ప్రతిదాడులు జరిగే అవకాశాలు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ పోలీసు బందోబస్తును సైతం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూసేలా గ్రామాల్లో పోలీసు అధికారులు పర్యటించాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో గొడవలు జరిగితే ఎన్నికల సమయంలో బైండోవర్లు చేయించుకున్న నేతలపై కేసులు నమోదు అవుతాయంటూ ముందస్తు హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద సైతం అధికార పార్టీ నేతలు బాహాబాహీకి దిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు సమీపంలో గుంపులుగా చేరకుండా కౌంటింగ్ కేంద్రాలకు దగ్గర్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేసి తనిఖీలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతోపాటు, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాత మాత్రమే లోపలకు అనుమతిస్తారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు ఎన్నికల ఫలితాలు ముందుగాని, తరువాత గానీ గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఉపేక్షించం. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి నిఘా ఉంచాం. ఫలితాలు వెలువడే రోజు ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు శాఖకు సహకరించాలి.– రాజశేఖరబాబు, రూరల్ ఎస్పీ -
కిక్కే..కిక్కు
కొల్చారం(నర్సాపూర్): వరుస ఎన్నికలతో మద్యానికి ‘ఫుల్’ డిమాండ్ ఏర్పడింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు.. ఆ తర్వాత పంచాయతీ పోరు.. అనంతరం ప్రాదేశిక సమరం ఇలా ఒక దాని తర్వాత ఒకటి వస్తుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు మద్యాన్ని ఎరగా వేస్తున్నారు. దీంతో విక్రయాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో జిల్లాలో ఏకంగా రూ.23.56కోట్ల మద్యం అమ్మకాలు సాగడం ఎన్నికల్లో మద్యం ప్రభావం ఏ మేరకు ఉందనేది తేటతెల్లమవుతోంది. జిల్లాలోని 108 మద్యం దుకాణాలు, బార్ల ద్వారా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 15రోజుల్లో రూ.44.41కోట్ల మ ద్యం అమ్మకాలు జరిగితే, పంచాయతీ ఎన్నికల్లో 16రోజుల వ్యవధిలో రూ.56.75కోట్ల విక్రయాలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలిం గ్‌కు ఐదు రోజుల వ్యవధిలో రూ. 20.84కోట్ల మ ద్యం అమ్ముడైంది. ప్రస్తుతం ఆ రికార్డులను బద్ధ లు కొడుతూ రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఐదు రో జుల వ్యవధిలో ఏకంగా రూ.23.58కోట్ల మ ద్యం అమ్మకాలు జరగడం విశేషం. వీటిలో లిక్కర్ రూ.16,88,1,534, బీర్లు రూ.6,70, 59,343 విక్రయాలు ఉన్నాయి. మూడో విడత ఎన్నికలు ముగిసే నాటికి విక్రయాలు మరింతగా పెరగనున్నాయి. -
ఎమ్మెల్సీ రేసులో ఎవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ విషయమై సస్పెన్స్ కొనసాగుతుండగా ఆశావహులు ఎవరికి వారుగా తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈనెల 14వ తేదీన నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ప్రస్తుత ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్ చేరుకోనున్న నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అయ్యాక తన నిర్ణయాన్ని సోమవారం వరకు ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి కానీ అభ్యర్థి ఎవరనే విషయమై చర్చలకు పుల్‌స్టాప్ పడదనే చెప్పాలి. ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనకు కుటుంబంతో సహా వెళ్లారు. దీంతో ఈనెల 7న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా వరంగల్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థి ఎంపికపై స్తబ్దత నెలకొంది. ఇతర రాష్ట్రాల పర్యటన ముగించుకుని కేసీఆర్ శనివారం హైదరాబాద్ చేరుకుంటారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. అయితే, 14వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. కేసీఆర్ హైదరాబాద్ రాగానే అభ్యర్థిత్వంపై స్పష్టం వస్తుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకటి, రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ప్రకటిం చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాకు సం బంధించిన మంత్రి దయాకర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్య నేతలతో ఆదివారం భేటీ అవుతారని సమాచారం. ఆ తర్వాత సోమవారం అధికారికంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు. అదష్టవంతులు ఎవరో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇద్దరు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ రేసులో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్న రవీందర్రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళీధర్‌రావు రాజీనామా చేసిన గత డిసెంబర్లో రవీందర్రావు పేరే ప్రధానంగా చెప్పుకున్నారు. అయితే హైదరాబాద్‌లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరే ఖరారవుతుందన్న మరో ప్రచారం కూడా సాగుతోంది. ఇదే విషయమై ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ఇటీవల పోస్టింగ్‌లు పెట్టిన సందర్భంగా స్పం దించిన శ్రీనివాస్‌రెడ్డి.. తన పేరు ఖరారు కాలేదని, అధికారికంగా సీఎం కేసీఆర్ తన నిర్ణయించనందున కార్యకర్తలు సంయమనం పాటించాలం టూ లేఖ విడుదల చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే విషయమై సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ శని వారం హైదరాబాద్‌కు చేరుకోనున్న నేపథ్యంలో మళ్లీ చర్చ మొదలైంది. నేడో, రేపో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో చర్చించనున్న అధినేత ఎమ్మెల్యే అభ్యర్థి పేరును సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. -
ఎమ్మెల్సీ నగారా
సాక్షి, వికారాబాద్: ప్రాదేశిక సమరం పూర్తి కాకముందే మరో ఎన్నికకు నగరా మోగింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఒక స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మే 14వ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయాలి. మే 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 31వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతాయి. జూన్ 3వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఉప ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానంలో గెలిచిన అభ్యర్థి జనవరి 2, 2022 వరకు పదవిలో కొనసాగుతారు. స్థానిక సంస్థల కోటాలో ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. డిసెంబర్ 28, 2015లో వీటికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన శంబీపూర్ రాజు, పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి కొడంగల్నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ స్థానానికి ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఈఉప ఎనికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 771 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 2 వరకు ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. కొత్తగా ఎన్నికకాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఓటింగ్ అవకాశం ఉండదని అధికారవర్గాల సమాచారం. టీఆర్ఎస్ నుంచి మహేందర్‌రెడ్డి.. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచిమాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడి, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం అధికారికంగా పట్నం మహేందర్‌రెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆపార్టీ నాయకులుచెబుతున్నారు. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ,ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని, తప్పకుండాటీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అసెంబ్లీఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైన మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా గెలుపొందితే జిల్లా రాజకీయాలపై ఆయన పట్టు మరింత పెరగనుంది. కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కోర్టును ఆశ్రయించే అవకాశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీటికెట్ కోసం కాంగ్రెస్‌లోనూ ఆశావహులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల అసెంబ్లీఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నాయకులుఈ టికెట్ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాకు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్,మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితోపాటురంగారెడ్డి జిల్లాకు చెందిన కేఎల్ఆర్,రవియాదవ్ తదితరులు టికెట్ రేసులోఉన్నట్లు వినికిడి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎంపికపై త్వరలోనిర్ణయం తీసుకుంటామని రోహిత్‌రెడ్డి తెలిపారు. -
లాటరీ ఎమ్మెల్యే.. నాపై విమర్శలా?
బషీరాబాద్: ‘మొన్న తాండూరులో జరిగిన ఎన్నికల్లో లక్కీలాటరీలా.. ఎమ్మెల్యేగా గెలిచినోడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు.. నేను లోకల్ కాదని, నన్ను షాబాద్ పంపిస్తానని.. భాష రాదని.. ఎగతాలిచేస్తుండు.. నేను తలుచుకుంటే తాండూరులో బట్టలు ఊడదీసి పంపిస్తా..రాజకీయాల్లో హుందాగా విమర్శించడం నేర్చుకో.. మాజీ మంత్రి మాణిక్‌రావు కూడా ఇలా నాపై విమర్శలు చేయలేదు. నీలా దిగజారి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు..’’ అంటూ మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బషీరాబాద్ వచ్చిన ఆయన మైల్వార్‌లో నిర్వహించిన సమావేశంలో మొదటిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన రోహిత్‌రెడ్డి వారిని మోసం చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే పచ్చి అబద్ధాలకోరు.. మూర్ఖత్వంతో అలా మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో సద్విమర్శలు చేస్తే మంచిది.. లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో 18 జెడ్పీటీసీ సీట్లు గెలిచి సునీతారెడ్డి మూడో సారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కాబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిలా మారాయన్నారు. ఎన్నికలు ముగిసన వెంటనే.. ఇచ్చిన మాట ప్రకారం రెండింతల పెన్షన్లు, ఎకరాకు రూ.5 వేల రైతుబంధు సాయం అందజేస్తామని స్పష్టంచేశారు.టీఆర్ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పోరవాటి మాట్లు మాట్లాడుతున్నాడన్నారు. కనీసం పెద్దవాళ్లనే సంస్కారం కూడా లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం ఎక్మాయి, మంతన్‌గౌడ్‌తండా, క్యాద్గిర, జీవన్గీ, మర్పల్లి, నవల్గా గ్రామాల్లో మహేందర్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ అభ్యర్థి మిరాణం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాకేశ్, సీనియర్ నాయకుడు రాజుగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, మాజీ ఎంపీపీ కావలి భాస్కర్, అజయ్‌ప్రసాద్, శంకర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, అబ్దుల్ ఖాలీద్, సుధాకర్‌రెడ్డి, బన్సీలాల్, నర్సిరెడ్డి, హరిసూధన్‌రెడ్డి, శ్రావన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్, ఎక్మాయి రాజుగౌడ్, సర్పంచులు సీమా సుల్తాన, నారాయణ, వసంతమ్మ, లక్ష్మమ్మ, కోటం నవనీత, డి. నర్సిములు, ఎంపీటీసీ అభ్యర్థులు షాజాదీబేగం, వినోద, శ్రీనివాస్, పుర్మ సునీత తదితరులు పాల్గొన్నారు. -
నేడే ‘తొలి’ విడత పోలింగ్
సాక్షిప్రతినిధి,ఖమ్మం: తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 6న(నేడు) పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. జిల్లాలోని ఏడు మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనుండగా 7 జెడ్పీటీసీ స్థానాలకు 41మంది అభ్యర్థులు, 112ఎంపీటీసీ స్థానాలకు గాను ముదిగొండ మండలంలోని వల్లభి 1, 2 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 110స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. బందోబస్తుకు పోలీసులు సైతం ఆదివారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బందితో తరలివెళ్లారు. గత నెల 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా 25 వరకు నామినేషన్లు స్వికరించారు. పోలింగ్ జరిగే మండలాలివే.. జిల్లాలో 20 మండలాలు ఉండగా తొలి విడతలో 7 మండలాల్లో (కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముది గొండ, నేలకొండపల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం) ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 237పోలింగ్ స్టేషన్ల లో 629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 2,99,363మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,46,897 , మహిళలు 1,52,461మంది. ఇతరులు ఐదుగురు ఉన్నారు. పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గాను 26 జోన్లుగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రవాణాకు ఇబ్బందులు లేకుండా 91రూట్లుగా విభజించి 36కార్లు, 23మినీ బస్సులు, 87పెద్ద బస్సులను ఏర్పాటు చేశారు. ప్రలోభాల పర్వం.. శనివారం సాయంత్రం 5గంటల వరకే ప్రచారం ముగియడంతో ఆ తర్వాత నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు అనేక మంది ప్రత్యేకంగా ఓటర్లను కలుసుకొని తమకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూనే ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంకలు వేర్వేరుగా సందర్శించారు. కామేపల్లిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించగా, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాల్లోని కేంద్రాలను జెడ్పీ సీఈఓ ప్రియాంకలు సందర్శించి పలు సూచనలు చేశారు. -
ఓటమి భయం... ఆ వెనుకే భరోసా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రానున్న ఎన్నికల్లో గెలుపోటములపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో శనివారం సాగిన సమీక్ష భయం... అంతలోనే భరోసాల మధ్య సాగింది. వరుసగా వస్తున్న సర్వేలు టీడీపీకి వ్యతిరేకంగా ఉండడంతో పోటీదారులతోపాటు క్యాడర్ నిరాశా, నిస్పృహలకు లోనుకాకుండా ఉండేందుకు ప్రత్యేక సమీక్షల పేరుతో ఆక్సిజన్ ఎక్కించడానికి అన్నట్టుగా ఈ సమావేశం తీరు ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని వదిలేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డారు? ఏ మేరకు నష్టం చేకూర్చారు? వారి వివరాల జాబితా తనకు అందజేయాలంటూ పోటీదారులకు చంద్రబాబు సూచించడంతో పార్టీ నేతలే అవాక్కయ్యారు. ఫలితాలు వచ్చిన తరువాత చేయాల్సిన పంచాయతీ ముందస్తుగా ఎందుకు చేస్తున్నారని పార్టీ సీనియర్లే జుత్తు పీక్కుంటున్నారు. ‘టీడీపీయే గెలుస్తుంద’ంటూ ధైర్యం నూరిపోయాడానికి ఈ సమావేశం వేదికగా చేసుకుంటున్నారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను విజయవాడలో సీఎం చంద్రబాబు శనివారం నిర్వహించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 మంది చొప్పున దాదాపు 280 మంది అభ్యర్థులతో కలిసి హాజరయ్యారు. సమీక్ష ప్రారంభం దగ్గరి నుంచి వన్‌మేన్ షోగా నడిచింది. పోలింగ్ సరళి, నేతల పనితీరుపై చర్చించకుండా ఏక బిగువున సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎవరికీ పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తాను చెప్పాల్సిందంతా చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేశారు. ఎన్నికల్లో మనపై ఎన్నో కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ ఛేదించుకుని ముందుకెళ్లామని, అయినప్పటికీ ఓటర్లు మనకు అనుకూలంగా ఓట్లు వేశారని, తప్పకుండా గెలుస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడా రెండు నాల్కల ధోరణే... ఓ వైపు టీడీపీయే గెలుస్తుందని భరోసానిస్తూ మరోవైపు ఎన్నికల్లో ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేశారో నివేదిక ఇవ్వాలని కోరారు. కొందరు సీనియర్లుగా చెప్పుకుని హల్చల్ చేశారే తప్ప ఎన్నికల్లో పనిచేయలేదని, వారి సంగతి తేల్చుతానని ఈ సందర్భంగా హెచ్చరించారు. అంతేకాకుండా ప్రతీ ఎన్నికల్లోనూ మనమే గెలవాలని, పార్టీ కార్యకర్తల్లో జవాబుదారీతనం పెంపొందించాలని, కేడర్ మేనేజ్మెంట్, పబ్లిక్ మేనేజ్మెంట్లో పట్టు సాధించాలని, ఫలితాలపై అంచనాలు ఖచ్చితంగా ఉండాలని, నాయకుల పనితీరుపై గ్రేడింగ్ చేయాలని సూచించారు. ఇదంతా చూస్తుంటే గెలుపుపై నమ్మకం లేదనే అభిప్రాయంతో మాట్లాడినట్టుగా ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గెలుస్తామంటూనే ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నారని సమీక్షకు హాజరైన నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ సమీక్షలో రాజమహేంద్రవరం, టీడీపీ అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ ‘తమకు ఇంత మెజార్టీ వస్తుందని’ చెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీ అభ్యర్థి రూప మాత్రం జనసేన ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని, దాన్ని కొట్టిపారేయలేమని, ఆ పార్టీకి పడ్డ ఓట్లు ఎవరి కొంప ముంచుతాయో తెలియ’దంటూ తనకున్న భయాన్ని వ్యక్తం చేశారు. -
పరిషత్ ‘పరీక్ష’!
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తుంది. మొదటి విడత ఘట్టం ముంచుకొస్తుంది. మరో రెండు రోజుల్లో తొలి సమరం జరగనుంది. దీంతో అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే గెలుపోటముల ప్రభావం ముఖ్య నేతలపై ఉంది. దీంతో ఆ నేతలకు ఈ ఎన్నికలు కీలకమయ్యాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్న ఆ నేతల్లో కొందరికి తీపి, మరికొందరికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. అలా మొదటి పరీక్ష ఎదుర్కొనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల ద్వారా రెండో పరీక్షలోనూ ఫలితాలు చూశారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ద్వారా మూడో పరీక్షను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రాదేశిక ఎన్నికల ద్వారా మరో పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేతలకు కీలకం.. ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ పరంగా మంచి ఫలితాల కోసం కొంతమంది ముఖ్య నేతలు జిల్లాలో విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం వారికి కీలకం కానుంది. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేలకు ఈ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న మరోసారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత మొదటి విడత విస్తరణలో ఆయనకు అవకాశం రాకపోయినప్పటికీ ఎక్కడా వెనుకంజ వేయకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత నెల జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. మిగతా నేతలకు అందనంత దూరంలో ఆయన ప్రచారం సాగింది. తద్వారా నియోజకవర్గంలో అటు లోక్‌సభ, ఇటు ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ పరంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రెండో స్థానంలో నిలిచిన పాయల శంకర్ ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా అంత పెద్దగా ప్రభావం చూపనప్పటికీ స్వల్ప ఫలితాలు సాధించి పార్టీ ఉనికిని చాటారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ ఫలితాలు అనుకూలంగా వస్తే అటు పార్టీతోపాటు పాయల శంకర్‌కు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్ పాండేకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించినా గండ్రత్ సుజాతకు దక్కడంతో ఆమె గెలుపుకోసం ప్రయత్నించారు. అయితే నియోజవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఫలితాల్లో టీఆర్ఎస్ తర్వాత నిలిచినా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో అంతాతానై వ్యవహరిస్తుండడంతో ఫలితాలు కీలకంగా మారాయి. జిల్లా అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితానికి అనుకూల ఫలితాలు వస్తే ఉన్నతి లభించే అవకాశం ఉంటుంది. బోథ్ నియోజవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం బాపురావుకు ఊరటనిచ్చింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ కూడా బోథ్ నియోజకవర్గానికే చెందిన వారు కావడంతో ఆ ఫలితాల బాధ్యత ఇరువురిపై ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు కీలకం కానుంది. ప్రధానంగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఫలితాలు అనుకూలంగా వచ్చిన పక్షంలో సీఎం దగ్గర పలుకుబడి ఉంటుందని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి సోయం బాపురావుకు ప్రాదేశిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన నియోజకవర్గంలో పట్టుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీకి మెజార్టీపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రాదేశిక ఎన్నికల్లో మంచి ప్రభావం చూపాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సోయం బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు జిల్లాలోకి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రాథోడ్ రమేశ్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ మండలాలతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ సీనియర్ నేతగా, పార్టీలో మరింత పట్టుకోసం ఈ ఎన్నికల ద్వారా కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఈ మండలాల్లో గెలుపు కీలకం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాథోడ్ రమేశ్‌పై గెలుపుతో నియోజకవర్గంలో ప్రభావం చూపారు. అదే సరళిలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమె భుజస్కందాలపై ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇక్కడ గెలుపు పొందడం ద్వారా తన ప్రత్యర్థి రాథోడ్ రమేశ్‌ను గట్టిగా రాజకీయంగా దెబ్బతీయాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇక నార్నూర్, గాదిగూడలో ఈ ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పరంగా విజయం సాధించడం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమురంభీం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి కోవ లక్ష్మికి కీలకం కానుంది. -
‘తొలి’ సమరానికి సై
మెదక్ రూరల్: పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఆది వారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో హవేళిఘణాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 339 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 6 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 65 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 190 మంది బరిలో నిలిచారు. పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మానస ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు బీఫాం లను ఇచ్చిన అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నవారికి బ్యాట్, కత్తెర గుర్తులను కేటాయించారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు తర్వాత 6 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 16 నామినేషన్లు, 65 ఎంపీటీసీ స్థానాలకు గాను 158 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు 433 నామినేషన్లు, 6 జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 25న జరిగిన స్క్రూటినీలో పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి శైలజ ఐకేపీలో పనిచేస్తున్నందున నామినేషన్‌ను తిరస్కరించారు. రెండేసి చొప్పున వచ్చిన నామినేషన్లను తొలగించగా మొత్తం 341 మంది అభ్యర్థులు 354 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను 41 నామినేషన్లు వేయగా అందులో రెండేసి చొప్పున ఉన్న నామినేషన్లను తొలగించగా, మొత్తం 31 మంది అభ్యర్థులకు గాను 34 నామినేషన్లను పరిగణలోకి తీసుకున్నారు. బరిలో మిగిలిన అభ్యర్థులు సోమవారం నుంచి ప్రచారం నిర్వహించనున్నారు. ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం రెండో విడత నామినేషన్ల ప్రక్రియకు ఆదివారంతో తెరపడింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి మండలాలకు సంబంధించి ఈనెల 26 నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఇందులో భాగంగా మొత్తం 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను 53 మంది అభ్యర్థులు 66 నామినేషన్లు వేశారు. 60 ఎంపీటీసీ స్థానాలకు 405 మంది అభ్యర్థులు 454 నామినేషన్లను దాఖలు చేశారు. ఆదివారం చివరి రోజు 60 ఎంపీటీసీ స్థానాలకు 276 మంది అభ్యర్థులు 318 నామినేషన్లను వేయగా, 6 జెడ్పీటీసీ స్థానాలకు 44 మంది అభ్యర్థులు 57 నామినేషన్లను దాఖలు చేశారు. ప్రతి మండల కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామపత్రాలను స్వీకరించారు. రెండో విడత నామినేషన్ల వివరాలు ఇలా నర్సాపూర్‌లో 10 ఎంపీటీసీ స్థానాలకు 78 నామినేషన్లు, చిలప్‌చెడ్‌లో 6 ఎంపీటీసీ స్థానాలకు 41నామినేషన్లు, కౌడిపల్లిలో 10 ఎంపీటీసీ స్థానాలకు 66, కొల్చారంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 75 నామినేషన్లు, వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలకు 83 నామినేషన్లు, శివ్వంపేటలో 12 ఎంపీటీసీ స్థానాలకు 111 నామినేషన్ల చొప్పున మొత్తం 60 ఎంపీటీసీ స్థానాలకు 454 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు జెడ్పీటీసీ స్థానాలకు నర్సాపూర్‌లో 11, చిలప్‌చెడ్‌లో 10, కౌడిపల్లి 09, కొల్చారం 12, వెల్దుర్తిలో 15, శివ్వంపేటలో 09 చొప్పున మొత్తం 66 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఎన్నికల సిబ్బంది చేతివాటం
కర్నూలు: ఎన్నికల సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. తనిఖీల్లో పట్టుబడిన రూ.15 లక్షల నగదు స్వాహా చేశారు. బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మిడుతూరుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓసియన్ బ్రిడ్జి ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారు. ఈయన ఈ నెల 7వ తేదీన రాత్రి ఏపీ 9బీహెచ్ 9869 నంబర్ గల ఇన్నోవా కారులో తమిళనాడులోని కోయిలపట్టులో ఉన్న కంపెనీలో జమ చేసేందుకు రూ.15 లక్షల నగదు తీసుకుని బయలుదేరారు. కర్నూలు నగర శివారులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకు ఏటీఎం వద్ద ఏపీ21 బీఎఫ్ 8268 నంబర్ గల షిఫ్ట్ కారులో పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్ పేరుతో వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.15 లక్షలకు ఆధారాలను చూపమని కోరగా, తన వద్ద లేవంటూ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. రెండు రోజుల్లో చూపించి డబ్బు తీసుకెళ్లాలని వారు సూచించారు. అయితే.. ఆ డబ్బును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌లోని ముగ్గురు సిబ్బంది పంచుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. బాధితుడు చంద్రశేఖర్‌రెడ్డి ఈ విషయంపై ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేయడంతో తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన వాహనాన్ని తనిఖీ చేసిన సిబ్బంది వినియోగించిన కారు నంబర్‌ను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరపగా కానిస్టేబుల్ రమేష్, విద్యాశాఖకు చెందిన సింగ్‌తోపాటు కారు డ్రైవర్ ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. ఐపీసీ 406, 409, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా అర్బన్ సీఐ చలపతిరావు తెలిపారు. -
కౌంటింగ్‌కు పటిష్ట భద్రత
ఏలూరు టౌన్: సార్వత్రిక ఎన్నికలను రాష్ట్రంలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించామని, వచ్చేనెల 23న జరిగే కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశిం చారు. ఏలూరులోని పోలీసు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమవర్మ, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌తో ఎన్నికల నిర్వహణ, పరిస్థితులపై శనివారం డీజీపీ ఠాకూర్ సమీక్షించారు. అదనపు ఎస్పీ ఈశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌తోపాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు ఈ సమీక్షకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆదేశించామన్నారు. కౌంటింగ్ అనంతరం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతల కు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల్లో చేపట్టిన చర్యలు, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశాలపై సమీక్షిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో నక్సల్స్ ప్రభావం ఎంతవరకు ఉంది, ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి తదితర అంశాలపై ఆరా తీశామన్నారు. జిల్లాలోని స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉన్నాయనే అంశంపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోనూ ఉగ్రదాడులు జరుగుతాయనే విషయంపై తమిళనాడు డీజీతోనూ మాట్లాడామని, అయితే అక్క డ ఒక మాజీ మిలటరీ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ధ్రువీకరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ బలగా లతో ఎన్నికలను సజావుగా నిర్వహిం చామని, గతంతో పోల్చితే అతి తక్కువ కేసులు నమోదయ్యాయని, పటిష్ట భద్రత నడుమ పోలింగ్ చేపట్టామని డీజీపీ ఠాకూర్ వివరించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
రెబల్.. గుబులు!
అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు రెబల్ అభ్యర్థులు గుబులు పుట్టిస్తున్నారు. ఒక్కో ప్రాదేశిక స్థానానికి ఒకే పార్టీ తరఫున ఐదారుగురు అభ్యర్థులు బరిలో నిలుస్తుండటంతో ఆ రెండు ప్రధాన పార్టీల నేతలు అయోమయంలో పడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశగా ఏడు మండలాల పరిధిలోని 96 ఎంపీటీసీ, ఏడు జె డ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించిన అధికారులు పరిశీలన ప్రక్రియ కూడా పూర్తిచేశారు. ఈనెల 28న ఉపసంహరణ ఘట్టం కూడా ముగియనుంది. అయితే ఇందుకు మరో రోజు మాత్రమే మిగిలింది. కాగా, ఒక్కో స్థానానికి ఒకే పార్టీ తరఫున పోటీపడుతున్న నాయకులను బుజ్జగించడం నేతలకు కష్టంగా మారింది. ముఖ్యంగా ఎంపీటీసీలకు ఎన్నడూ లేని విధంగా పోటీ ఏర్పడింది. రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరిద్దరు వెనకడుగు వేస్తున్నా.. కొందరు మాత్రం తప్పనిసరిగా బరిలో ఉంటామని తేల్చిచెబుతున్నారు. పార్టీ ‘బీ’ ఫారం ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటామని హెచ్చరికలు సైతం జారీచేస్తున్నారు. ఇటువంటి వారికి సర్దిచెప్పడానికి పార్టీ నేతల తలబొప్పి కడుతోంది. ఆయా పార్టీల నుంచి వలసలు జరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నుంచి అధిక సంఖ్యలో ద్వితీయ శ్రేణి, చిన్న నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. గులాబీ కండువా కప్పుకున్న వారికి భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యం ఇస్తామని చాలామందిని టీఆర్ఎస్లోకి లాగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాదేశిక స్థానాలకు టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంతా అయ్యింది. దీనికితోడు పార్టీ పరంగా క్రియాశీలకంగా మెలగని నేతలూ రేసులో ఉన్నారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటంతో తమకే ‘బీ’ ఇవ్వాలంటున్నారు. మరికొందరు తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేశామని, దీనికి గుర్తింపుగా టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఎవరికి వారు టికెట్లు ఆశించి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువంటి వారిని బుజ్జగించడం గులాబీ నేతలకు అగ్ని పరీక్షగా మారింది. అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలకే రెబల్స్ బెడద లేకుండా చూడాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. దీంతో ఎమ్మెల్యేలంతా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒకే రోజు గడువు ఉండటంతో శక్తిమేరకు ప్రయత్నిస్తూనే అవసరం ఉన్న చోట తాయిలాలు, హామీలు గుప్పిస్తున్నారు. కొందరికి డబ్బు ఆశ చూపి పక్కకు తప్పిస్తుండగా.. మరికొందరికి వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా కొందరు నేతలు పట్టువీడకపోతుండటంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పదవుల ఎర టీఆర్ఎస్లో మాదిరిగానే కాంగ్రెస్‌కూ రెబల్ అభ్యర్థులు తలనొప్పిగా మారారు. అసలే వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న వేళ స్థానిక సంస్థలను ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. ఎలాగైనా పూర్వవైభవాన్ని ప్రదర్శించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇటువంటి సమయంలో రెబల్ అభ్యర్థుల తీరుతో పార్టీ సతమతమవుతోంది. కొన్ని చోట్ల నాయకులకు పార్టీ జిల్లా పెద్దలు నచ్చజెప్పి బరి నుంచి వైదొలగేలా చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులు బెట్టువీడడం లేదు. పార్టీ సంస్థాగతంగా, వచ్చే ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు. చివరకు నేతల మాటలకు కట్టుబడి ఉంటారా.. లేదా అనేది ఈనెల 28న తేలనుంది. ఎంపీటీసీలకిలా... ఏడు మండలాల్లోని మొత్తం 96 స్థానాలకు టీఆర్ఎస్ తరఫున 234 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా చేవెళ్లలో బరిలో నిలిచారు. ఈ మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలు ఉండగా టీఆర్ఎస్ పార్టీ తరఫున 46 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన మండలాల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో పోటీ నెలకొంది. అత్యల్పంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని 10 స్థానాలకు 24 మంది బీఫారం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే తరహాలో పోటీ కనిపిస్తోంది. అత్యధికంగా షాబాద్ మండలంలోని 15 ఎంపీటీసీలకు 36 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యల్పంగా ఇబ్రహీంపట్నంలోని 10 స్థానాలకు 21 నామినేషన్లు రిటర్నింగ్ అధికారులకు అందాయి. జెడ్పీటీసీల్లోనూ.. ఎంపీటీసీలతో పోల్చుకుంటే జెడ్పీటీసీలకు పోటీ బాగానే ఉంది. కొన్ని స్థానాలకు రెండు మూడు నామినేషన్లు దాఖలుకాగా.. మరికొన్ని మండలాల్లో ఈ సంఖ్య ఆరు వరకు ఉండటం గమనార్హం. టీఆర్ఎస్ తరఫున మొయినాబాద్ జెడ్పీటీసీకి ఆరుగురు పోటీపడుతున్నారు.ఆ తర్వాతి స్థానంలో ఇబ్రహీంపట్నం నిలిచింది. ఇక్కడ ఐదుగురు రేసులో ఉన్నాయి. షాబాద్‌కు మాత్రం ఈ పార్టీ నుంచి ఒక్క నామినేషన్ మాత్రమే అందింది. ఇక కాంగ్రెస్ తరఫున అబ్దుల్లాపూర్‌మెట్ స్థానానికి విపరీతంగా పోటీ కనిపిస్తోంది. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంచాల, షాబాద్, మొయినాబాద్ స్థానాలకు నలుగురు చొప్పున వరుసలో నిలిచారు. -
ఆశావహుల క్యూ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తొలి విడత ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 24 జెడ్పీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 93, కాంగ్రెస్ నుంచి 54, బీజేపీ నుంచి 36 మంది బీ ఫారాలు తమకే వస్తాయనే ధీమాతో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు 294 ఎంపీటీసీ స్థానాలకు 1,911 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధిక నామినేషన్లు టీఆర్ఎస్ అభ్యర్థులవే కావడం విశేషం. మరోవైపు నేటినుంచి ప్రారంభం కానున్న రెండో విడత, తర్వాత జరిగే మూడో విడత నామినేషన్ల పర్వంలోనూ గులాబీ పార్టీ తరఫున బరిలో ఉండేందుకు ఇలాంటి పోటీ నెలకొంటుందని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై గులాబీ పార్టీ ఇప్పటికే పూర్తి ధీమాతో ఉంది. అయితే టీఆర్ఎస్లో పోటెత్తుతోన్న ఆశావహులతో పార్టీనే నమ్ముకుని పని చేస్తోన్న కార్యకర్తల్లో ఎవరికి బీ ఫారాలు ఇవ్వాలో తెలియక గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాల్లో ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. జెడ్పీ చైర్మన్ గిరీకీ తీవ్ర పోటీ ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా పరిషత్‌ల పరిధుల్లో టీఆర్ఎస్ నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఇంకా ఎవరి పేర్లు ప్రచారంలోకి రాలేదు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి.రాములు కుమారుడు భరత్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భార్య అమలతో పాటు జిల్లాకు చెందిన కోళ్ల వెంకటేష్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ జరుగుతోంది. నారాయణపేట జిల్లా నుంచి డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాష, మద్దూర్‌కు చెందిన జెడ్పీ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు మహ్మద్ సలీం, కృష్ణ మండలానికి చెందిన శివరాజ్ పాటిల్, సీనియర్ నాయకుడు ఎల్కోటి నారాయణరెడ్డి ఆశావహులు రేసులో ఉన్నారు. వనపర్తి జిల్లా నుంచి పెద్దమందడి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మెఘారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్ గిరిలో ముందజలో ఉన్నట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లాలో మానవపాడు మండలానికి చెందిన సరితతో పాటు గట్టు భీముడు సతీమణి పేరు కూడా ప్రచారంలో ఉంది. అలంపూర్ నియోజకవర్గం నుండి పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల తర్వాత జెడ్పీ చైర్మన్, చైర్పర్సన్ల అభ్యర్థులను ప్రకటించే వీలుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దామనే ఆలోచనతో ఆశావహులున్నారు. ∙కాంగ్రెస్ పార్టీలోనూ జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల వేట కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ రేసులో రంగారెడ్డి గూడకు చెందిన దుష్యంత్‌రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. ఆయన నవాబ్‌పేట జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ భార్య డాక్టర్ అనురాధ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా ఉట్కూర్‌కు చెందిన సూరయ్యగౌడ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. వనపర్తి జిల్లాలో అభ్యర్థుల వేటలో ఆ పార్టీ నాయకత్వం ముమ్మరంగా వేటకొనసాగిస్తోంది. బీజేపీ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్ల రేసులో ఎవరెవరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఎవరి పేర్లు కూడా కనీసం ప్రచారంలోనూ రాలేదు. ఆ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు త్వరలోనే జరగనున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే వలసల పార్టీగా పేరొందిన కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమవుతోన్న అభ్యర్థుల్లో గెలిచిన తర్వాత ఎవరు కారెక్కుతారో అనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హస్తానికి చెయ్యిచ్చి కారెక్కిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచే ప్రతి అభ్యర్ధి పార్టీ వీడకుండా ఏం చేయాలో అనే దానిపై కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇటు బీజేపీ సైతం ఉమ్మడి జిల్లాలో పట్టుకోసం పాకులాడుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణతో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు ఇంకా పలువురు నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటేనే గానీ భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాలో పార్టీకి మనుగడ లేని పరిస్థితి నెలకొంది. దీంతో అరుణ, జితేందర్‌రెడ్డి తమతమ అభ్యర్థుల గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
‘రెండు’కు రెడీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం బుధవారం పూర్తి కావడంతో రెండో విడత నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మే 10వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికల్లో 6 జెడ్పీటీసీ, 85 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 29వ తేదీన అధికారులు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు 30వ తేదీన తగిన ఆధారాలతో అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 2వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రధాన రాజకీయ పక్షాలు పరిషత్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపిక.. నామినేషన్లు వేయించడంపై కసరత్తు చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాలివే.. మండలం : ఏన్కూరు ఎంపీటీసీ స్థానాలు–10.. బురదరాఘవాపురం, భద్రుతండా, ఏన్కూరు–1, ఏన్కూరు–2, జన్నారం, కేసుపల్లి, రేపల్లెవాడ, శ్రీరామగిరి, టీఎల్.పేట, తిమ్మారావుపేట. మండలం : కల్లూరు ఎంపీటీసీ స్థానాలు–18.. బాతుపల్లి, చండ్రుపట్ల, చెన్నూరు–1, చెన్నూరు–2, చిన్నకోరుకొండి, కల్లూరు–1, కల్లూరు–2, కల్లూరు–3, కప్పలబంధం, లింగాల, మర్లపాడు, ముచ్చవరం, నారాయణపురం, పెద్దకోరుకొండి, పేరువంచ, పుల్లయ్య బంజర, తాళ్లూరు, ఎర్రబోయినపల్లి. మండలం : పెనుబల్లి ఎంపీటీసీ స్థానాలు–15.. చింతగూడెం, గణేష్‌పాడు, గౌరారం, కరాయిగూడెం, కోండ్రుపాడు, కుప్పెనకుంట్ల, లంకపల్లి, లింగగూడెం, మండాలపాడు, పెనుబల్లి, రామచంద్రరావు బంజర, టేకులపల్లి, తాళ్లపెంట, వీఎం.బంజర, ఏరుగట్ల. మండలం : సత్తుపల్లి ఎంపీటీసీ స్థానాలు–13.. బేతుపల్లి, బుగ్గపాడు, చెరుకుపల్లి, గంగారం, కాకర్లపల్లి, కిష్టాపురం, కిష్టారం, రామగోవిందాపురం, రామనగరం, రేజర్ల, రుద్రాక్షపల్లి, సిద్ధారం, తుంబూరు. మండలం : తల్లాడ ఎంపీటీసీ స్థానాలు–16.. అన్నారుగూడెం–1, అన్నారుగూడెం–2, బిల్లుపాడు, కలకొడిమ, కొడవటిమెట్ట, కుర్నవల్లి, మల్లారం, మిట్టపల్లి, ముద్దునూరు, నూతనకల్, పినపాక, రామానుజవరం, తల్లాడ–1, తల్లాడ–2, తల్లాడ–3, వెంగన్నపేట. మండలం : వేంసూరు ఎంపీటీసీ స్థానాలు–13.. అడసర్లపాడు, భీమవరం, చౌడవరం, దుద్దెపుడి, జయలక్ష్మీపురం, కల్లూరుగూడెం, కందుకూరు, కుంచపర్తి, లచ్చన్నగూడెం, మర్లపాడు, రామన్నపాలెం, వి.వెంకటాపురం, వేంసూరు. -
స్థానికంపై కమలం కన్ను
స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుని జిల్లాలో పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుదేలైన ఆ పార్టీ.. ప్రాదేశిక ఎన్నికలతో పుంజుకోవాలని భావిస్తోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. దీనికితోడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుండటం కూడా తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఈ మార్పును జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి జిల్లా నేతలు పావులు కదుపుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు కమలం మార్క్ పెద్దగా లేదు. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో కీసర, బంట్వారంలో తెలుగుదేశం పార్టీ పొత్తుతో విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ నాయకత్వం కంకణం కట్టుకుంది. జిల్లాలోని 21 జెడ్పీటీసీలు, 257 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో అన్ని స్థానాలు గెలిచే అవకాశం లేకపోయినా.. కనీసం అన్ని గ్రామాల్లో పార్టీ పట్ల ఆదరణ పెరిగేలా చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కనీసం ఐదు జెడ్పీటీసీ, 40 నుంచి 50 ఎంపీటీసీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలో జాతీయ నేతలు వచ్చినప్పటి నుంచి జిల్లాలో పార్టీ క్రమంగా బలపడుతోందని నేతలు చెబుతున్నారు. టికెట్లు ఖరారు.. జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు కూడా పోటీపడుతున్నట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల ఒకరి పేరునే పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి. వీటిని అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే.. దాదాపు 150కి పైగా అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం. మిగిలిన స్థానాలకూ ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అరంజ్యోతికి అవకాశం? జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి సతీమణి అరంజ్యోతి పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెకు కాకుండా ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు పార్టీ ప్రయత్నం చేసినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. చివరి నిమిషంలో ఎవరైనా ముందుకు వచ్చినా అరంజ్యోతి పక్కకు తప్పుకోవచ్చన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. ఇదే జరిగితే.. కందుకూరు జెడ్పీటీసీకి పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి పోటీచేసే అవకాశం ఉంది. -
త్రిముఖ పోటీ
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లోనూ త్రిముఖ పోటీయే కనబడుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యనే వార్ నెలకొననుంది. సాధారణంగా ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని పార్టీల్లో అసంతృప్తులు, స్వతంత్ర అభ్యర్థులు అధికంగా బరిలో ఉండే వారు. అయితే ప్రధాన పార్టీల నుంచి పోటీ కనిపిస్తుండగా, మిగతా నామమాత్రమే అయింది. గురువారం ప్రాదేశిక ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. ఆరు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు మే 6న జరగాల్సి ఉండగా, ఈ మండలాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి అన్నిచోట్ల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఒకట్రెండు చోట్ల టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు రంగంలో ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికలో కసరత్తు.. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తీవ్రంగా కసరత్తు చేశారు. ప్రధానంగా బుధవారం నామినేషన్లకు చివరి రోజు అయినా మంగళవారం వరకు ఆయా మండలాల నుంచి పార్టీల అభ్యర్థులు ఎవరనేది స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో అసలు పోటీలో ఎవరుంటారనేది ఆసక్తి కలిగించింది. ఆదిలాబాద్‌రూరల్ మండలం: ఆదిలాబాద్‌రూరల్ మండలంలో జెడ్పీటీసీ జనరల్ రిజర్వేషన్ కాగా టీఆర్ఎస్ నుంచి మార్కెట్ కమిటీ తాజా మాజీ చైర్మన్ ఆరె రాజన్న, బీజేపీ నుంచి రిటైర్డ్ ఉపాధ్యాయుడు దారట్ల జీవన్, కాంగ్రెస్ పార్టీ నుంచి మడావి హన్మంత్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా మడావి హన్మంత్‌రావు తండ్రి మడావి రాజు బీజేపీ నుంచి తిరిగి సొంతగూటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తండ్రి, తనయులు కాంగ్రెస్‌లో చేరిన వెంటనే హన్మంత్‌రావు పేరును కాంగ్రెస్ ఖరారు చేయడం గమనార్హం. మడావి రాజు లోక్‌సభ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. ఇక టీడీపీ నుంచి ఆకుల రాము, సీపీఐ(ఎం) నుంచి ఆత్రం కిష్టన్న, సీపీఎం నుంచి పెందూర్ రాములు, స్వతంత్రులుగా కె.రాజేశ్వర్, ఎ.వినోద్‌కుమార్ నామినేషన్ వేశారు. మావల మండలం: మావల జెడ్పీటీసీ స్థానం ఎస్సీ(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి నల్ల వనిత, కాంగ్రెస్ నుంచి ధర్మపూరి నాగలత, బీజేపీ నుంచి ఎంబటి ప్రమిళ, టీడీపీ నుంచి గాలిపెల్లి ప్రియాంకలు బరిలో నిలిచారు. జైనథ్ మండలం: జైనథ్ జెడ్పీటీసీ జనరల్(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి తుమ్మల అరుంధతి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి గడ్డం మమతారెడ్డి, బీజేపీ నుంచి బోయర్ షాలున, స్వతంత్ర అభ్యర్థిగా జి.సౌందర్య నామినేషన్ వేశారు. బేల మండలం: బేల జెడ్పీటీసీ జనరల్(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి అక్షిత పవార్, కాంగ్రెస్ నుంచి నాక్లే సవిత, బీజేపీ నుంచి ఠాక్రే వర్ష, టీడీపీ నుంచి ఉధార్ వనిత బరిలో నిలిచారు. టీఆర్ఎస్ డమ్మి అభ్యర్థిగా పవార్ నానుబాయి నామినేషన్ దాఖలు చేశారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ జెడ్పీటీసీ స్థానం గతంలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఇక్కడ గెలువాలని టీఆర్ఎస్ ఆర్థికంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది. ఇక బీజేపీ సీనియర్ నేత కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపారు. ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. తాంసి మండలం: తాంసి జెడ్పీటీసీ స్థానం జనరల్ రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి తాటిపల్లి గంగాధర్, కాంగ్రెస్ నుంచి కౌడాల నారాయణ, బీజేపీ నుంచి సామ సంతోష్‌రెడ్డి, సామ కవిత ఇరువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి ఇప్పటి వరకు బీ–ఫాం ఇవ్వకపోవడం గమనార్హం. బీజేపీ నుంచి ఇరువురు నామినేషన్లు వేసినా బీ–ఫాం ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా బెల్లూరి భీమన్న బరిలో నిలిచారు. కాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సోదరుడు రామారావు రాథోడ్ ఇక్కడి నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరిగినా ఆయన నామినేషన్ వేయకపోవడంతో ఈ ప్రచారానికి తెరపడింది. అయితే తాటిపెల్లి గంగాధర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అనుచరుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరగణాలు రెండు గ్రూపులుగా ఉన్న విషయం విధితమే. భీంపూర్ మండలం: భీంపూర్‌లో జెడ్పీటీసీ ఎస్టీ(జనరల్) కాగా, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి కుమ్రం సుధాకర్, కాంగ్రెస్ నుంచి మెస్రం హన్మంత్, బీజేపీ నుంచి మరప భరత్, టేకం బోన్, స్వతంత్ర అభ్యర్థిగా ఎం.నామ్‌దేవ్ వేశారు. అయితే బీజేపీ నుంచి ఇద్దరిలో ఎవరికి బీ–ఫాం ఇస్తారో ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఎంపీటీసీకి జోరుగా నామినేషన్లు ఎంపీటీసీ స్థానాలకు కొన్ని మండలాల్లో జోరుగా నామినేషన్లు వచ్చాయి. జైనథ్‌లో 14 స్థానాలకు గాను 71 నామినేషన్లు దాఖలయ్యాయి. బేలలో 11 స్థానాలకు గాను 63 రావడం గమనార్హం. మిగతా మండలాల్లో స్థానాల సంఖ్యకు ప్రధాన పార్టీల నుంచిపోను కొంత స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. నేడు నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. గురు వారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26న అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 28న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఇక ఈ ఆరు మండలాల్లో ప్రచారం జోరందుకోనుంది. మే 6న ఎన్నికలు జరగనుండగా ఇక అభ్యర్థులు ఎవరనేది తేట తెల్లం కావడంతో పార్టీలు ప్రచారంలో వేగం పెం చనున్నాయి. కాగా రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. -
నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. స్థానిక పోరు మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తుండగా.. తొలిదశ ఎన్నికలు జరగనున్న ఏడు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇదే రోజు నుంచి తొలిపోరు మండలాల పరిధిలోని 96 ఎంపీటీసీలు, ఏడు జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. నామినేషన్ల దాఖలులో కొంత సమయం పెంచారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకే అవకాశం ఇవ్వగా.. ప్రాదేశిక ఎన్నికలకు మాత్రం సమయాన్ని మరింత పొడిగించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలుకు 24వ తేదీ ఆఖరు. తొలిదశగా ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా.. ఇందులో ఆరు పాత మండలాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి సంబంధించి నామినేషన్ల కేంద్రాన్ని హయత్‌నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నామినేషన్ల అందజేతకు అవసరమైన సహాయాన్ని అందజేసేందుకు ప్రతి కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలి. ఈ వివరాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ఎన్నికల వ్యయ ఖర్చులన్నీ ఈ ఖాతా నుంచే జరపాలి. గతం కంటే ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచారు. జెడ్పీటీసీకి రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, ఎంపీటీసీకి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జెడ్పీటీసీకి పోటీచేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎంపీటీసీకి రూ.2.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు డిపాజిట్ మొత్తంలో కాస్త మినహాయింపు ఇచ్చారు. జెడ్పీటీసీకి రూ.2,500, ఎంపీటీసీకి రూ.1.250 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. అయితే, ఈ అభ్యర్థులు తప్పనిసరి కులధ్రువీకరణ పత్రం లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన డిక్లరేషన్ అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థికి 21 ఏళ్ల వయసు నిండి ఉండాలి. ఒక్కరోజు తక్కువగా ఉన్నా అభ్యర్థి నామినేషన్లను తిరస్కరిస్తారు. -
స్థానికంపై గురి
ప్రాదేశిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో అందరూ సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఇప్పటికే ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధంగానే అభ్యర్థులను అందరికంటే ముందుగానే ఖరారు చేసి.. ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు ఆ పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం కూడా చేశారు. ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మెదక్, సిద్దిపేట జిల్లాల సమన్వయ సారధిగా నియమితులైన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ సైతం మండల స్థాయి సమావేశాలతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఇప్పుడిప్పుడే ప్రాదేశిక ఎన్నికలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి, మెదక్ : మండలాలు, జిల్లా పునర్విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు, 189 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ పురుటిగడ్డ అయిన మెతుకుసీమ మెదక్‌లో టీఆర్ఎస్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లకు తీవ్రపోటీ నెలకొంది. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు.. కొన్ని చోట్ల ఐదుగురు పోటీ పడుతున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించడంతో పలువురు టీఆర్ఎస్ నేతలు తమ సతీమణులను పోటీకి దింపే ఆలోచనతో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించిన కేసీఆర్.. స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని, ఉద్యమ వీరులు, పార్టీ అభ్యన్నతికి కృషిచేసిన వారికి ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సమన్వయ సారధి హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను త్వరగా ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లేలా రూపొందించుకున్న ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ గెలుపును సొంతం చేసుకోవడంతోపాటు ఎంపీ ఎన్నికల్లో సైతం సత్తా చాటుతామనే ధీమా టీఆర్ఎస్ నేతల్లో కనపడుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. క్లీన్‌స్వీపే లక్ష్యమని.. ప్రాదేశిక ఎన్నికల్లోనూ ‘గులాబీ’ జెండా ఎగరడం ఖాయమని నేతలతోపాటు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సన్నాహక సమావేశాల్లో కాంగ్రెస్.. వరుస ఎన్నికల్లో డీలా పడ్డ కాంగ్రెస్‌లో నైరాశ్యం అలుముకుంది. ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటి.. శ్రేణుల్లో ఉత్సాహం నింపేదుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మెదక్ నియోజకవర్గంలోని హవేళిఘనాపూర్ మండల కేంద్రంలో ఈ నెల 15న కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తలు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సేకరించారు. వడబోత అనంతరం తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇలా ఒకటి, రెండు చోట్ల సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. వరుసగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని ‘హస్తం’ నేతలు యోచిస్తున్నారు. ‘కమలం’లో కానరాని కసరత్తు? ఒకప్పుడు మెదక్‌లో ప్రభావం చూపిన బీజేపీకి.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వరుస ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో కేడర్‌లో నిరుత్సాహం నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీకి మంచి పట్టుంది. ఆ పార్టీలో ఇప్పటివరకు కసరత్తు మొదలుపెట్టిన దాఖలాలు కనిపిం చడం లేదు. ‘స్థానిక ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని.. ముందస్తుగా కసరత్తు చేపట్టి శ్రేణుల్లో జోష్ నింపితే మంచి ఫలితాలుంటాయని.. ఇప్పటికైనా నేతలు దృష్టి సారించాలి’ అని ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య కార్యకర్తలు చెబుతున్నారు. -
కౌంటింగ్‌కు ముందే.. జెడ్పీ విభజన
నల్లగొండ : జిల్లా పరిషత్ విభజన స్థానిక సంస్థల పోలింగ్ ముగిసిన వెంటనే జరగనుంది. ఫలితాలు వెలువడకముందే జెడ్పీని విభజించి మూడు కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ.. ఉమ్మడి జిల్లా పరిషత్ వారీగా ఉన్నటువంటి ఉద్యోగుల వివరాలతోపాటు ఫర్నిచర్, పాఠశాలల వివరాలను ఇవ్వాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచి యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అన్ని శాఖల వారీగా విభజన జరిగి ఆయా జిల్లాలకు వెళ్లిపోయాయి. వాటితోపాటు కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా పాలన రూపుదిద్దుకున్నాయి. జిల్లా పరిషత్ మాత్రం పాలక మండలి ఉమ్మడిగా ఉండడం వల్ల విభజన జరగలేదు. జూన్ 5వ తేదీ వరకు జిల్లా పరిషత్ పాలకమండలి గడువు ఉండడంతో దాన్ని విభజించలేదు. ప్రస్తుతం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినా కౌంటింగ్ మాత్రం మే 23న జరగనుంది. కౌంటింగ్‌లోపే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చనేది తెలుస్తోంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 14లోపే మూడు విడతల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి కానున్నాయి. అయితే ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే జిల్లా పరిషత్ విభజన చేపడతారు. కౌంటింగ్‌లోపు నల్లగొండ జిల్లా విడిపోయి మూడు జిల్లా పరిషత్‌లు అవుతాయి. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొత్త పరిషత్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత కొత్త పాలక మండలిలు కొలువుదీరనున్నాయి. విభజనకు వివరాలు అడిగిన పంచాయతీరాజ్ శాఖ కొత్త మండలాలు ఏర్పడినా మండల పరిషత్‌లు మాత్రం ఇంకా పెద్దగా కొలువుదీరలేదు. పూర్తిస్థాయిలో ఎంపీడీఓలు కూడా లేరు. ఇన్‌చార్జ్‌ల పాలనలోనే సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎంపీడీఓలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్లు, వాచ్మన్లతోపాటు జిల్లా పరిషత్ సిబ్బంది, 4వ తరగతి ఉద్యోగులు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలతో పాటు ఫర్నిచర్, జీపీఎఫ్, అకౌంట్స్, విద్య, బీఆర్జీఎఫ్, ప్లానింగ్ విభాగాలను మూడు భాగాలుగా విభజించాల్సి ఉంది. అవి ఎన్ని ఉన్నాయనేది వివరాలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ జిల్లా పరిషత్ సీఈఓను కోరింది. ఈ మేరకు ఆన్లైన్లో లేఖలు కూడా జిల్లా పరిషత్‌కు అందాయి. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఈ నెల 20 తర్వాత ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్‌కు ముందే ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఎన్నికలకు అవసరమయ్యే పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రవాణా, పోలింగ్ సిబ్బంది తదితర విషయాలపై సీరియస్‌గా ఉన్నారు. దీంతో అధికారులు ప్రస్తుతం విభజనకు సంబంధించి ప్రక్రియను ఇంకా మొదలుపెట్టలేదు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వెంటనే విభజన ప్రక్రియను మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
స్థానిక.. ‘సమరమే’!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నాలుగైదు రోజుల్లో వెలవడనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్లో ‘స్థానిక’ కోలాహలం కనిపిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలని ఆయా నేతలకు దిశానిర్దేశం చేసి బాధ్యతలు కూడా అప్పజెప్పారు. ఈ నెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, వచ్చే నెల (మే) రెండో వారంలోగా ఎన్నికలు పూర్తవుతాయని చెబుతున్నారు. సమయం కూడా తక్కువగానే ఉండడంతో టీఆర్ఎస్ నాయకులు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సారి నల్లగొండ జిల్లా పరిషత్ జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో పోటీ ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 మండలాలకు గాను 31మంది జెడ్పీటీసీ సభ్యులు, వారిలో నుంచి ఒక జెడ్పీ చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ఎన్నిక అవుతారు. అదే మాదిరిగా, 31 మంది మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) అదే సంఖ్యలో ఉపాధ్యక్ష పదవులు కూడా ఉంటాయి. ఇక, జిల్లావ్యాప్తంగా 349 ఎంపీటీసీ సభ్యులకు ఎన్నిక జరగాల్సి ఉంది. పార్టీ ఎన్నికల గుర్తుతో జరిగే ఎన్నికలు కావడం, పెద్ద సంఖ్యలో పోస్టులు అందుబాటులో ఉండంతో అధికార పార్టీలో ఆశావహులంతా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. జెడ్పీ చైర్మన్ పీఠంపై గురి! గత ఎన్నికల్లో నల్లగొండ జిల్లా పరిషత్ ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. ఈ సారి జనరల్ కేటగిరీకి కేటాయించారు. దీంతో జెడ్పీ చైర్మన్ పీఠంపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మండలం నుంచి ముందు జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనరల్ సీట్ కావడంతో సహజంగానే బీసీ, ఇతర వర్గాలకు చెందిన వారిని కాకుండా, ఓసీలకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయా ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులుగా ఉన్న నాయకులు జెడ్పీ పీఠంపై గురిపెట్టారు. జెడ్పీటీసీ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పజెప్పడంతో పలువురు నాయకులు వారి వెంటపడుతున్నారని చెబుతున్నారు. తమకే అ వకాశం వస్తుందని ఎవరికి వారు చెబుతున్నా.. పార్టీ నాయకత్వంనుంచి అందుతున్న సమాచారం మేరకు పార్టీకి, నాయకత్వానికి మొదటినుంచి ‘వి«ధేయులు’గా ఉన్న వారికే అవకాశం ఉంటుందని సమాచారం. అంతే కా కుండా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం దక్కాలంటే ముందుగా జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, ఎం పీ, ఇతర సీనియర్ నాయకుల మద్దతు కూడా అవసరమని చెబుతున్నారు. ఇది, ముం దునుంచీ పార్టీలో ఉన్న వారికి, పార్టీ ఆవి ర్భావం నుంచి కొనసాగుతున్న వారికే సాధ్యమని పేర్కొంటున్నారు. అధినేత కేసీఆర్ ఇప్పటికే జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరనే అంశంలో ఒక నిర్ణయానికి వచ్చారని, కొందరు నాయకులకు సూచాయగా సమాచారం ఇచ్చారని అంటున్నారు. మరోవైపు పలువురు నాయకులు ఎం పీపీ పోస్టులపైనా ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే అవకాశం కల్పిం చా లని అప్పుడే నాయకుల వద్ద క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలకు తలనొప్పిగా ఎంపిక బాధ్యత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పజెప్పడం వారికి తలనొప్పిగా మారనుందని అంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మొదటినుంచి పార్టీలో ఉన్న వారు, ఆ తర్వాత వివిధ పార్టీలనుంచి వచ్చిచేరిన వారు అది కూడా కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలనుంచి వచ్చిన వారు... ఇలా, మూడు నాలుగు కేటగిరీలుగా నాయకులు ఉన్నారు. వీరందరినీ సమన్వయ పరిచి, ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టమేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మిర్యాలగూడలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న భాస్కర్ రావు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయన పార్టీ మారిన సందర్భంలో ఆయన అనుచరులంతా కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్కు వచ్చారు. ఇప్పుడు తమ నాయకుడే మళ్లీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కావడంతో సహజం గానే ఆయన వర్గానికి ప్రాధాన్యం లభి స్తోంది. మొదటినుంచీ పార్టీలో ఉన్న వారికి ఇది జీర్ణం కావడం లేదు. ఇదే పరిస్థితి దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో కూడా ఉంది. సీపీఐనుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో పాత టీఆర్ఎస్ నాయకత్వం కలిసిపోలేదంటున్నారు. నల్లగొండలో టీడీపీనుంచి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే అయిన కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పార్టీ మారిన టీడీపీ శ్రేణులు, మొదటినుంచి టీఆర్ఎస్లో ఉన్న శ్రేణులకు పెద్దగా పొసగడం లేదు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం వేరుగా ఉండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యే చిరుమర్తి వర్గం వేరుగా ఉంది. వీరి మధ్య కూడా పెద్దగా సయోధ్య లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఎమ్మెల్యేలు ఎంపిక చేయడం ఒకింత సమస్యాత్మకంగా మారనుందని విశ్లేషిస్తున్నారు. -
ఆరు జెడ్పీలు మనవే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జెడ్పీ స్థానాల్లో మనమే గెలవాలి... జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా రెప రెపలాడాలి... నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో మనమే గెలవబోతున్నాం.. అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన మీకు అభినందనలు’ అంటూ గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓరుగల్లు ప్రజాప్రతినిధులకు కితాబునిచ్చారు. సమావేశానికి ముందు.. తర్వాత హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు, తర్వాత తనను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేసీఆర్ మాట్లాడారు. ఈ భేటీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, డాక్టర్ తాటికొండ రాజయ్య, డీఎస్.రెడ్యానాయక్, మాజీ స్పీకర్ మదుసూదనాచారి, మాజీ మంత్రి చందూలాల్, ఎంపీ అభ్యర్థులు పసునూరి దయాకర్, మాలోతు కవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలవబోతున్నామని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువగా ఉండాలని, ప్రజలే పార్టీకి హైకమాండ్ అని పేర్కొన్న ఆయన వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సీఎం నేతలకు వివరించిన అధినేత.. ఆ ప్రక్షాళన తర్వాత ప్రజల్లో పార్టీ, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఆరు జెడ్పీ స్థానాలతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాలు, మండల పరిషత్‌లను కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించలని కేసీఆర్ సూచించారు. ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు ఒక్కో జిల్లా పరిషత్ బాధ్యతలను సీనియర్ నేతకు గులాబీ దళనేత, సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, జనగామ జిల్లా బాధ్యతలను పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. మండల పరిషత్ బాధ్యతలను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, కార్యవర్గం ఏర్పాటు తదితర ప్రక్రియ పూర్తయ్యేవరకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కేసీఆర్ పేర్కొన్నట్లు పార్టీవర్గాల సమచారం. కాగా, రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై చర్చించిన సీఎం.. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. -
వేట మొదలైంది...!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం గల మండలం అది. మహిళా జనరల్‌గా రిజర్వు అయిన ఈ స్థానం నుంచి జెడ్పీటీసీగా తమ సతీమణులను టీఆర్ఎస్ తరఫున పోటీ చేయించేందుకు ఓ బీసీ నాయకుడు, ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ప్రయత్నిస్తున్నారు. వీరికి తోడు ఇటీవల ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు మండల స్థాయి కీలక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి టికెట్టు ఇప్పించాలో అర్థం గాని పరిస్థితి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిది. దీంతో ఆయన ‘గెలుపు గుర్రం’ ఎవరనే విషయంలో ముగ్గురి గురించి తానే ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నారు’. ఇది ఒక్క పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినదే కాదు. జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా పరిషత్‌లకు కేంద్రం నుంచి వచ్చే నిధులు లేక, తమ విధులు, విధానాలు ఏమిటో తెలియక.. ఏ పనులు కాక గత ఐదేళ్లుగా జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజకీయ ఎదుగుదలకు కీలకమెట్టుగా భావించే జెడ్పీటీసీ ప్రొటోకాల్‌లో ఎమ్మెల్యే తరువాత స్థానంలో ఉండడం, అదృష్టం కలిసొస్తే జెడ్పీ చెర్‌పర్సన్ అయితే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుందనే ఆలోచనతో మండల నాయకులు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేల కళ్లల్లో పడి జెడ్పీటీసీ టికెట్టు దక్కించుకునేందుకు శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రతిపాదించే పేర్లకే స్థానిక మంత్రుల నేతృత్వంలోని కమిటీలు ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల నుంచి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు టికెట్ల వేటలో పడిపోయారు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధును పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థిగా సోమవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందరిదీ టీఆరెస్సేనాయే..! 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికే ఉమ్మడి కరీంనగర్లో ఆ పార్టీలో మండలాల వారీగా నాయకులకు కొదవ లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇతర పార్టీల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా గెలిచిన వారు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. ఎమ్మెల్యేలకు సన్నిహితంగా మెలుగుతూ భవిష్యత్తు జెడ్పీటీసీ, ఎంపీపీలపై దృష్టి కేంద్రీకరించారు. ‘జెడ్పీటీసీ అయితే ఏముందన్నా,.. ఫండ్స్ లేవు, పరపతి లేదు’ అని బహిరంగంగా చెబుతూనే ఎలాగైనా ఆ పదవిని దక్కించుకునే ఆలోచనతో నాయకులు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో కీలక పదవులు అనుభవించిన వారు సైతం టీఆర్ఎస్లో చేరి, తమకు కూడా అవకాశం దక్కకపోతుందా అని పైరవీల్లో మునిగిపోయారు. పార్టీలో ఆది నుంచి పనిచేస్తున్న వారికి కొత్తగా 2014 తరువాత టీఆర్ఎస్లో చేరిన వారే ప్రధాన పోటీదారులుగా తయారయ్యారు. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలన్నింటిలో అదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ‘టీఆర్ఎస్లోని ఇద్దరు ముగ్గురు ఆశావహుల్లో గెలిచేవారు ఎవరు? ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ లేదా బీజేపీ నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటే టీఆర్ఎస్ నుంచి ఎవరికి సీటివ్వాలి’ అని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలమైన వ్యక్తులు, ఏ పక్షానికి చెందని వారితో సర్వేలు చేయిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే ఫైనల్ ఉమ్మడి కరీంనగర్‌లోని సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరిని జెడ్పీటీసీ చేయాలన్నా, ఎంపీపీలు అయ్యేందుకు ఎంపీటీసీ టికెట్టు ఇవ్వాలన్నా కేటీఆరే కావడంతో నాయకులంతా దేవుడి మీద భారం వేశారు. కేటీఆర్ పరోక్షంలో పార్టీ వ్యవహారాలను చూసుకొనే ఒకరిద్దరు నాయకుల కనుసన్నల్లో పడేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన నిర్ణయమే ఫైనల్. ధర్మపురిలో సైతం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిస్థితి అదే. మంత్రులు తమ నియోజకవర్గాలతోపాటు తాము లోక్‌సభ ఇన్చార్జిలుగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు సూచించిన పేర్లకు మార్పులు చేయాలన్నా, గెలిచే అభ్యర్థిగా ఎవరినైనా తెరపైకి తేవాలన్నా మంత్రులు సూచించిన వారికి అధిష్టానం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మంత్రులే ఫైనల్ కాబోతున్నారు. నాలుగు జెడ్పీ పీఠాలే లక్ష్యం ఉమ్మడి జిల్లాలో 58 జెడ్పీటీసీలు ఉండగా, వీరంతా నలుగురు జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోవలసి ఉంటుంది. జగిత్యాలలోనే ఎక్కువగా 18 మంది జెడ్పీటీసీలను ఎన్నుకోనున్నారు. 10 మంది జెడ్పీటీసీలు ఎవరిని ఎన్నుకొంటే వారే జెడ్పీ చైర్పర్సన్. సిరిసిల్లలో 12 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ ఏడుగురు సభ్యుల మద్ధతున్నవారు జెడ్పీ పీఠంపై కూర్చోవచ్చు. పెద్దపల్లిలో 13కు 7గురి మద్ధతు అవసరం కాగా, కరీంనగర్లో 15 జెడ్పీటీసీలకు 8 మంది సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కు ఉన్న నేపథ్యంలో ఉన్న నాలుగు జిల్లా పరిషత్‌లకు నాలుగింటిని గెలుచుకునే అవకాశం టీఆర్ఎస్కే ఉంది. ఈ నేపథ్యంలో పోటీ పెరిగింది. కాగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు పేరును ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే మిగతా మూడు జిల్లాలకు కూడా చైర్మన్లను ముందే నిర్ణయించే అవకాశం ఉంది. కాగా సోమవారం హైదరాబాద్‌లో జిల్లా పరిషత్ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, మంత్రులను మచ్చిక చేసుకునేందుకు ఆశావహులు రాజధానికి వెళ్లి పైరవీల్లో మునిగిపోయారు. అనుకున్నట్టుగా అవకాశం! మంథని: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ముందు నుంచి ఊహించిట్టుగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ ఒక్క మంథని మాత్రం ఓడిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన పుట్ట మధు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయనకు పార్టీ పరంగా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వాలని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ ప్రాంతానికి వచ్చిన అధిష్టానం పెద్దలు, మంత్రులు సైతం సరైన స్థానం లభిస్తుందని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిపికేషన్ రెండు రోజుల్లో రానుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పుట్ట మధు పేరును స్వయంగా ప్రకటించారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినా సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించారు. ఇందుకు పుట్టమధు కృషి చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేతకు వెన్నంటి ఉండి మంథనితోపాటు పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలోనే పుట్ట మధును జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రులతోపాటు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని నిర్ధారించడంతో కమాన్‌పూర్ మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు పుట్ట మధు సిద్ధమవుతున్నారు. -
పరిషత్తు.. కసరత్తు
సాక్షి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ, సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తెరలేచింది. ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పార్టీల నాయకులు ప్రణాళికలు రూపొందించుకునే పనిలోపడ్డారు. దూకుడుమీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో సోమవారం సమావేశంకాగా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తపరిచేందుకు కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలకు శ్రీకారం చుట్టింది. టార్గెట్ చైర్మన్ అసెంబ్లీ, సర్పంచ్ విజయాలతో దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం తమదేనంటున్న గులాబీ శ్రేణులు అదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి అధికారం కూడా టీఆర్ఎస్ చేతిలో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయనే భావనతో టీఆర్ఎస్ పెద్దలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని ఇప్పటికే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు. అందులోభాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లా ప్రజాపరిషత్‌లు, 66 మండల పరిషత్‌లను కైవ సం చేసుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిషత్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తరలివెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ప్ర జాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని జిల్లా ప్రజాపరిషత్‌లను కైవసం చేసుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులుగా సమర్థవంతులను ఎంపిక చేసుకోవాలన్నారు. అలాగే ఇటీవ ల ఉమ్మడి జిల్లాలో ఓటమి చెందిన ఏకైక పార్టీ అ భ్యర్థి కోవ లక్ష్మికి జెడ్పీ చైర్పర్సన్ అవకాశం క ల్పించారు. ఆసిఫాబాద్ టీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్స న్ అభ్యర్థిగా కోవ లక్ష్మి పేరును కేసీఆర్ ప్రకటిం చారు. అలాగే పరిషత్ ఎన్నికల బాధ్యతలు పార్టీ నేతలకు అప్పగించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం జెడ్పీ స్థానాలు గెలవాలని తేల్చిచెప్పారు. పోరుకు కాంగ్రెసై అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లోనైనా ఉనికి చాటుకోవా లని ఉబలాటపడుతోంది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ.. అదే ఊపుతో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను దక్కించుకోవాలని యోచిస్తోంది. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మండలాల వారిగా పార్టీ నాయకులు, క్యాడర్‌తో మంతనాలు జరుపుతున్నారు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల పేర్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీనితోపాటు కాంగ్రెస్ పార్టీకి వీలైనన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే మండలాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ, పార్టీ క్యాడర్‌ను స్థానిక పోరుకు సమాయత్తం చేసే పనిలో కాంగ్రెస్ నేతలున్నారు. పార్టీ గుర్తులతో జరిగే పరిషత్ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవడానికి టీఆర్ఎస్, పునరుత్తేజం పొందడానికి కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. -
మళ్లీ మోగనున్న ఎన్నికల నగారా!
ఆదిలాబాద్‌అర్బన్: గతేడాది సెప్టెంబర్‌లో మొదలైన ఎలక్షన్స్ సీజన్ ఎని మిది నెలలుగా ఆగకుండా కొనసాగుతూనే ఉంది. ‘ఒకటి తర్వాత ఇం కోటి’ అన్న చందంగా మొదట శాసనసభ ఎన్నికలు.. తర్వాత పంచా యతీ ఎన్నికలు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈమధ్య ఎంపీ ఎన్నికల కోలాహాలం మొన్నటి వరకు కొనసాగింది. ఇంకా లోక్‌సభ ఎన్నికల ఫలితా లు వెలువడాల్సి ఉండగానే.. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పరిషత్ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. అంటే.. అదే కోలాహలం మరో నెల రోజులపాటు కొనసాగనుండగా.. మరో ఎన్నికల నగారా త్వరలోనే మోగనుందన్న మాట! రాష్ట్రంలో, జిల్లాలో ఎనిమిది నెలలుగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రస్తుత టీఆర్ఎస్ సర్కారు 2018 సెప్టెంబర్ 6న శాసన సభను రద్దు చేసినప్పటి నుంచి మొదలైన ఎన్నికల సందడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గత డిసెంబర్ 7న శాసనసభ ఎన్నికలు, ఈ ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు, మార్చిలో శాసనమండలి, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. తాజాగా మే నెలలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఎనిమిది నెలల్లో ఇప్పటికే నాలుగు రకాల ఎన్నికలు జరగగా, వచ్చే నెలలో మరో ఎన్నిక జరుగనుంది. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో సందడి చేయగా, శాసనసభ, లోక్‌సభ, శాసన మండలి ఎన్నికలు పట్టణాలతోపాటు పల్లెల్లోనూ ఉత్సాహాన్ని నింపాయి. కాగా, త్వరలో జరుగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు మరో నెల రోజులపాటు గ్రామాల్లో సందడి చేయనున్నాయి. వేగంగా ‘పరిషత్’ ఏర్పాట్లు.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపక్క పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూనే.. మరో పక్కా ఎన్నికల సిబ్బందిని సేకరించడం, వారికి శిక్షణలు, పోలింగ్ మెలకువలు నేర్పిస్తున్నారు. ఇది వరకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు పూర్తి చేసిన యంత్రాంగం, ఓటర్ల జాబితాను సైతం సిద్ధం చేసి ఎన్నికలకు రెడీగా ఉంచింది. ఒక్కో మండలానికి ఒక్కో జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారిని నియమించగా, మరో 20 శాతం మంది రిటర్నింగ్ అధికారులను రిజర్వులో ఉంచనున్నారు. రెండు నుంచి ఐదు ఎంపీటీసీ స్థానాలకు ఒక ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారిని నియమించగా, సహాయ రిటర్నింగ్ అధికారులను సైతం అంతే మోతాదులో నియమించి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 17 మండలాలు ఉండగా, వీటి పరిధిలో మొత్తం 848 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారిని నియమించగా, 20 శాతం మంది పీవోలను రిజర్వులో ఉంచనున్నారు. అంతే మొత్తంలో సహాయ ప్రిసైడింగ్ అధికారులను కూడా నియమించి రిజర్వులో ఉంచారు. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ.. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) స్థానాలకు ఆయా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులు నియమించబడ్డారు. మొత్తం 17 మంది జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులు, 60 మంది ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులు, మరో 60 మంది సహాయ రిటర్నింగ్ అధికారులకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో నామినేషన్ పత్రాలను స్వీకరణ, ఏఏ ఫారాలు ఉంటాయి.. పత్రాలను ఎలా పరిశీలించాలి, ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలకు సంబంధించి ఆర్వోలకు, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రైనీల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణకు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, జెడ్పీ సీఈవో కె.నరేందర్ హాజరై రిటర్నింగ్ అధికారులు పలు సూచనలు ఇచ్చారు. కాగా, 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, 400 మంది ఓటర్లు ఉన్న పీఎస్‌లలో ముగ్గురు ఓపీవోలు, 600 మంది ఓటర్లు ఉన్న పీఎస్‌లలో నలుగురు ఓపీవోల చొప్పున ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. నేడు పీవో, ఏపీవోలకు.. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పీవో, ఒక ఏపీవో, ఒక ఓపీవోను నియమించారు. ప్రిసైడింగ్ అధికారులు (పీవో) సహాయ ప్రిసైడింగ్ అధికారులకు (ఏపీవో), ఇతర ప్రిసైడింగ్ అధికారుల (వోపీవో)కు మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగనుంది. పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ పూరైన వెంటనే పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, మరమ్మతులు, ఇతర పనులు చేపట్టి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 18న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు పరిషత్ ఎన్నికలపై కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. -
సర్వం సన్నద్ధం
నిజామాబాద్‌అర్బన్: పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు కేటాయింపుతో ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యా యి. ఉమ్మడి జిల్లాలో మూడు దశల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడమే తరువాయి ఎన్నికలు నిర్వహించేందు కు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 6 నుంచి 14 వరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి కానున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాల్లోనూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో 25 జెడ్పీటీసీలు, 299 ఎంపీటీసీలు, కామారెడ్డి జిల్లాలో 22 జెడ్పీటీసీలు, 236 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పరిషత్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో 7,78, 456 ఓటర్లు, కామారెడ్డి జిల్లాలో 6,02,752 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజు పూర్తి చేయనున్నారు. జిల్లా కేంద్రంలోనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నారు. ఇందుకోసం డివిజన్ల వారీగా ఎన్నికలు జరపనున్నారు. రెండు జిల్లాలోని డివిజన్ల వారీగా మండలాలను విభజించారు. దీనికి ఉన్నతాధికారుల ఆమోదం లభించింది. బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 1,626 పోలింగ్ కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 1,267 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తుది పరిశీలన అనంతరం పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేయనున్నారు. 22న తొలి నోటిఫికేషన్.. తొలి విడతలో నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ల లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 22న మొ దటి నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 6న పో లింగ్ జరుగనుంది. నిజామాబాద్ జిల్లాలో మొద టి విడత నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, మాక్లూర్, సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, నవీపేట మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక, కామారెడ్డి జిల్లాలో మొదటి విడత రామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట మండలాల్లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10న రెండో విడత.. బోధన్, బాన్సువాడ డివిజన్లలో రెండో విడత ఎన్నికలు జరనున్నాయి. ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా, మే 10న పోలింగ్ నిర్వహిస్తారు. బోధన్, రెంజల్, ఎడపల్లి, రుద్రూరు, వర్ని, కోటగిరి, మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక, కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ డివిజన్ పరిధిలోని బిచ్కుంద, పెద్దకొడప్గల్ , జుక్కల్, మద్నూరు, బీర్కూరు, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 14న తుది విడత ఎన్నికలు ఆర్మూర్, ఎల్లారెడ్డి డివిజన్లలో తుది విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 14న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, నందిపేట, వేల్పూరు, కమ్మర్పల్లి, జక్రాన్‌పల్లి, బాల్కొండ, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, భీమ్‌గల్ మండలాల్లో, అలాగే, ఎల్లారెడ్డి డివిజన్లోని గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, తాడ్వాయి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికారుల నియామకం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే అధికారులు, సిబ్బంది నియాయకం దాదాపు పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలో 3,252 మంది పీవోలు, ఏపీవోలు, 6502 మంది ఇతర సిబ్బందిని నియమించారు. ఇక, జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారులను ఒక్కో మండలానికి చొప్పున 25 మందిని నియమించారు. అలాగే మొత్తం ఎంపీటీసీలకు సంబంధించి 121 మంది ఆర్వోలు, 121 మంది ఏఆర్వోలను నియమించారు. కామారెడ్డి జిల్లాలో 2534 మంది ఏపీవోలు, పీవోలు, 5,068 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 24 మండలాలకు రిటర్నింగ్ అధికారులను, ఎంపీటీసీ స్థానాలకు గాను 96 మంది ఆర్వోలు, 96 మంది ఏఆర్వోలను నియమించారు. జెడ్పీటీసీలకు సంబంధించి మండల కేంద్రాల్లో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. -
ఇక స్థానికం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): లోక్‌సభ ఎన్నికలు ఈనెల 11న ముగిశాయి. ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల వంతు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఈనెల 22న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు శనివారం డ్రాఫ్ట్ షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల స్థానాల పునర్విభజన ప్రక్రియతోపాటు రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలు 71, ఎంపీటీసీ స్థానాలు 805 ఉన్నాయి. వీటి పదవీ కాలం జూలై 4వ తేదీతో ముగియనుంది. అంతలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేలా కార్యాచరణకు సంసిద్ధులయ్యారు. ఈనెల 20న పోలింగ్ స్టేషన్లు ఫైనల్ కానున్నాయి. ఈ వెంటనే ఎన్నికల నోటిపికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడతలో 22వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. వచ్చే నెల 6న పోలింగ్ ఉంటుంది. 26న రెండో విడత నోటిఫికేషన్ వెలువడనుండగా మే 10న పోలింగ్ జరుగుతుంది. ఈనెల 30న మూడో విడత నోటిఫికేషన్ జారీ చేయనుండగా మే 14న పోలింగ్ ఉంటుంది. ఈ మూడు విడతల ఫలితాలను 18న ప్రకటించనున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాపంగా 20,96,269 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,50,160 పురుషులు, 10,46,078 మహిళలు, ఇతరులు 31 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 805 ఎంపీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 805 ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 441 పం చా యతీలకుగాను 184 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డా యి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 పంచాయతీలు ఉంటే 212 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు గాను 128 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 పంచాయతీలకుగాను 141 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నారాయణపేట జిల్లాలో 280 గ్రామపంచాయతీలకుగాను 140 స్థానాలు ఉన్నాయి. జిల్లా పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో 982 స్థానాలు ఉండేవి. ప్రస్తుతం 805 స్థానాలకు తగ్గాయి. 71 జెడ్పీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 జెడ్పీటీసీలు స్థానాలు ఏర్పాడ్డాయి. గతంలో 64 జెడ్పీటీసీలు ఉండగా జి ల్లాల పునర్విభజన సమయంలోనే 20 కొత్త మం డలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీం తో ప్రతి మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో... ముసాపేట రాజాపూర్, గండీడ్ (రంగారెడ్డి నుంచి పాలమూరు జిల్లాలో క లిసింది); జోగుళాం గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోళి, కేటీదొడ్డి; నాగర్‌కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర; నారాయణ పేట జిల్లాలో కృష్ణ, మరికల్; రంగారెడ్డి జిల్లాలో క డ్తాల్, నందిగామ, చౌదర్‌గూడ; వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అ మరచింత మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి అధికారులు జెడ్పీటీసీ స్థానాలుగా గుర్తించారు. 3 జిల్లాల్లో రెండు విడతల్లో ఎన్నికలు మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడుతలో నవాబ్‌పేట, జడ్చర్ల, భూత్పూర్, గండీడ్, మిడ్జిల్, బాల్నగర్, రాజాపూర్ మండలాలు ఉన్నాయి. రెండవ విడతలో మహబూబ్‌నగర్, అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ, చిన్నచింతకుంట, ముసాపేట, హన్వాడ మండలాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు మండలాలు ఉన్నాయి. రెండో విడతలో మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, ఊట్కూర్ మండలాలు ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో ధరూరు, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్, గద్వాల; రెండో విడతలో అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోళి, అయిజ మండలాలు ఉన్నాయి రెండు జిల్లాలో మూడు విడతల్లో.. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి మొదటి విడతలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి, ఖిల్లాఘనపూర్; రెండో విడతలో పెద్దమందడి, కొత్తకోట, మాదనపూర్, ఆత్మకూర్, అమరచింత; మూడో విడతలో శ్రీరంగాపూర్, పెబ్బేరు, చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో లింగాల, అమ్రాబాద్, బల్మూర్, పదర, అచ్చంపేట, ఉప్పునుంతల, వంగూరు, చారగొండ; రెండో విడతలో వెల్దండ, కల్వకుర్తి, ఊర్కొండ, తాడూరు, తెల్కపల్లి; మూడో విడతలో తిమ్మాజీపేట, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, కోడేరు, పెంట్లవెల్లి, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలు ఉన్నాయి. ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో భాగంగా ఈనెల 14న జెడ్పీ హాల్లో ఆర్ఓ, ఏఆర్ఓలకు ఎన్నికల శిక్షణ ఇచ్చారు. అలాగే 15న మండల కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 19న కలెక్టర్, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎన్నికల నోడల్అధికారి సుచరిత ఆదేశించారు. ఆదివారం స్తానిక జెడ్పీ హాల్లో ఆర్ఓ, ఏఆర్ఓలకు ఎన్నికల శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేదాక అన్ని జాగ్రత్తగా నిర్వహించాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల ఫలితాలను వెల్లడించే వరకు ఆర్ఓ, ఏఆర్ఓలు కీలంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. జెడ్పీటీసీ నామినేషన్లు ఆయా మండలాల్లో స్వీకరించనున్నట్లు, ఎంపీసీటీ నామినేషన్లు క్లస్టర్లలో స్వీకరించనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ నామినేషన్లు ఆర్ఓలు, ఎంపీటీసీ నామినేషన్లను ఏఆర్ఓలు స్వీకరించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని, ఏమైనా అనుమానాలు వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ పద్మజా, ఎంపీడీఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధమే ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఓటర్ జాబితా, రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేశాం. ఈనెల 20న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల చేస్తాం. – వసంతకుమారి, జెడ్పీ సీఈఓ, మహబూబ్‌నగర్ -
ఇక స్థానిక సమరం!
సార్వత్రిక సమరం ముగిసింది. ఇంకా ఫలితాలు వెలువడటానికి మరో నలభైరోజుల వ్యవధి ఉంది. ఈలోగా స్థానిక సమరానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. పంచాయతీలు, మునిసిపాలిటీలకు కొత్త పాలకవర్గాల ఏర్పాటుకోసం రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఓటర్ల జాబితాలను తయారు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. మే ఒకటో తేదీలోగా మునిసిపాలిటీల స్థాయిలో... మే పదోతేదీలోగా పంచాయతీలవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయనగరం రూరల్: సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అప్పుడే స్థానిక సంస్థల సంగ్రామానికి తెరలేచింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల పాలకమండళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలలో వినియోగించిన ఓటరు జాబితాలను వా ర్డుల వారీగా విభజించి, ఓటరు ఫొటోతో కూడిన జాబి తాలను సమగ్ర వివరాలతో రూపొందించాలని అందరు కమిషనర్లకు ఈసీ నుంచి ఆదేశాలువచ్చాయి. వీటికి సం బంధించి ఇంకా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. మే 1లోగా మునిసిపాలిటీల్లో వార్డుల విభజన మునిసిపాలిటీల్లో అసెంబ్లీ ఓటర్ల జాబితాలకు అనుగుణంగా వార్డుల విభజన చేపట్టాలని ఆదేశాలిచ్చారు. మే ఒకటి లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్, నగరపాలక సంస్థల కమిషనర్లకు ఆదేశాలొచ్చాయి. వార్డుల వారీ ఓటర్ల విభజన కోసం కొత్త ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటారు. జిల్లాలో విజయనగరం సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీతో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు ఉండగా.. నెల్లిమర్ల నగర పంచాయతీగా ఉంది. ఇందులో నెల్లిమర్ల నగర పంచాయతీకి మినహా మిగిలిన వాటన్నింటికీ ఎన్నికలు జరిగాయి. జూలై రెండో తేదీతో ఆయా పాలకవర్గాల గడువు పూర్తవుతుంది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు జిల్లా కలెక్టర్ ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాలను సేకరించి ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది ప్రకటిస్తారు. జిల్లాలో ఉన్న ఐదు పట్టణాల్లో రెండింటి ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు ఉండగా... వాటిపై మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. ఆరేళ్లుగా పాలకవర్గం లేని నెల్లిమర్ల జిల్లాలోని నెల్లిమర్ల ప్రాంతం నగర పంచాయతీగా రూపాంతరం చెంది ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎన్నికలకు నోచుకోలేదు. 27వేల జనాభా, 18వేల ఓట్లు ఉన్న నెల్లిమర్ల, జరజాపుపేట మేజర్ గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ 2013 మార్చి 21న నగర పంచాయతీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నగర పంచాయతీకి ప్రత్యేక అధికారులే తప్ప పాలకవర్గం లేకపోవటం గమనార్హం. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్న తరుణంలో ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయో లేదో నన్న అయోమయం అక్కడ నెలకొంది. ఇక విజయనగరం కార్పొరేషన్ విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి చేరుకుంది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,44,598 మంది జనాభా ఉన్నారు. అయితే ఇవే ప్రామాణికాలతో 2015 సంవత్సరం జూలై నెలలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా... స్థానిక పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఉత్తర్వులను ఎబియన్స్లో ఉంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేకంగా జీఓ తీసుకువచ్చారు. అప్పట్లో ఉన్న అధికార టీడీపీ సైతం ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసేంత వరకువిజయనగరం సెలక్షన్‌గ్రేడ్ మున్సిపాలిటీగా కొనసాగుతుందని, పదవీ కాలం పూర్తయిన మరుక్షణం కార్పొరేషన్ హోదా వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై సమాయత్తం కావటంతో మరోసారి కార్పొరేషన్ హోదా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరలా విలీన ప్రాంతాలతో వార్డుల విభజన తదితర అంశాలపై అధికార యంత్రాంగం పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం సెలక్షన్‌గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరాన్ని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయాల్సి వస్తే పట్టణ పరిధి పెరగటంతో పాటు ప్రస్తుతం ఉన్న 40 వార్డుల సంఖ్య 55 నుంచి 60కు చేరే అవకాశం ఉంది. పంచాయతీవారీ ఓటర్ల జాబితాలు రాష్ట్రంలో పంచాయతీ పోరుకు సిద్ధమయ్యేలా పంచా యతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా వచ్చే నెల 10 నాటికి ప్రచురించాలని ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో సిద్ధం కాకపోవడంతో పంచాయతీ పాలన ప్రత్యేకాధికారుల ఆధీనంలోకి వెళ్లింది. జిల్లాలో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికలకు అయ్యే వ్యయ వివరాలను ప్రభుత్వం అధికారుల నుంచి సేకరించింది. ఇందుకు రూ. 9కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. 2018 అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఓటర్ల జాబితా గతేడాది మే, జూన్ నెలల్లో రూపొందించారు. 2018 జూన్ 15న 34 మండలాల్లో 920 పంచాయతీల ఓటర్ల జాబితాలను ప్రచురించారు. అయితే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో తాజాగా మే 10 నాటికి ఓటర్ల జాబితా రూపొందించా లని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. 2019 జనవరి 1 నాటికి అసెంబ్లీ ఓటర్ల సంఖ్య ఆధారంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని ఆదేశాలు వచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు. ఖరారు కాని రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం సందిగ్ధంగా మారుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించడానికి లేదు. 2013లో ఎస్టీ 8.5 శాతం, ఎస్సీ 18.25 శాతం, బీసీలు 34 శాతం ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి 50 శాతం దాటకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తే ఎటువంటి అవరోధం ఉండదు. ఏమైనా మార్పు చేయాల్సి వస్తే కేంద్రం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆదేశాలు రావాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలువచ్చాయి. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయనున్నాం. విజయనగరం సెలక్షన్‌గ్రేడ్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పించిన తరువాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజెప్పి, వారి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తాం. – ఎస్.ఎస్.వర్మ, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ. -
ఇక్కడ మీకేంటి పని?
ఆదోని టౌన్: సాయి డిగ్రీ కళాశాల పోలింగ్ కేం ద్రంలో మాజీ కౌన్సిలర్ లింగారెడ్డితోపాటు కొం దరు టీడీపీ నాయకులు ఉండడంతో గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాయి ప్రసాద్‌రెడ్డి భార్య శైలజారెడ్డి... ఇక్కడ మేకేంటి పని... ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికి వచ్చిన ఆమె టీడీపీ నాయకుల గుంపును గమనించారు. ఓటర్ల ను ప్రలోభపెడుతూ... సైకిల్ గుర్తుకు ఓటేయా లని కోరుతున్న విషయాన్ని గమనించిన ఆమె మాజీ కౌన్సిలర్ లింగారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలింగ్ బూత్ ఇక్కడ కాదుకదా... ఎందుకొచ్చినట్లు... ఏమి చేస్తున్నారు... ఎన్నికల నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడున్న పోలీసులు, మీడియా చుట్టుముట్టారు. లింగారెడ్డి ఓటరు కాదు.. ఏజెంటు కాదు... పోలింగ్ బూత్‌లో పనేంటని ప్రశ్నించారు. ఇంత దారుణంగా ప్రచారం చేస్తు న్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకులు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా అ ర్ధగేరి బసన్న గౌడ్ స్కూల్లోనూ పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. డీఎస్పీ వెంకటరాముడుతో మాట్లాడారు. టీడీపీ నాయకులు లోపలకు వచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు, -
బరితెగించిన టీడీపీ
కర్నూలు(అర్బన్): అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కడుతున్నారనే అక్కసుతో గురువారం జరిగిన పోలింగ్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. ఉదయం నుంచి ప్రజలు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనడంతో పాటు ఎక్కడ చూసినా ... వైఎస్ జగన్ ప్రభంజనం వినిపించడంతో తట్టుకోలేని టీడీపీ శ్రేణులు పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేసి గాయపర్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను కూడా లేకుండా చేసి ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకోవాలని ప్రయత్నించారు. కుదరకపోవడంతో కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు దిగారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై. బాలరాగిరెడ్డికి మద్దతుగా కూర్చున్న మాజీ సర్పంచు, పోలింగ్ ఏజెంట్ నరసన్నపై ప్రత్యర్థి టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నరసన్న తలకు బలమైన గాయం కావడంతో వెం టనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తలకు 11 కుట్లు పడ్డాయి. అలాగే కౌతాళం మం డలం గోతులదొడ్డిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ హనుమేష్పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఉలిగయ్య, ఆయన అనుచరులు ఏజెంట్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఆలూరు నియోజకవర్గం పి. కోటకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్ 288, 289లను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ సోదరుడు శ్రీనివాసులుపై టీడీపీ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. బనగానపల్లె నియోజకవర్గం గొర్విమానుపల్లెలో ఓట్లు వేసి ఇళ్లకు వెళ్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నేత రామేశ్వరరెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేశారు.ఈ దాడిలో వైఎస్సార్సీపీ వర్గీయులకు చెం దిన బోలేరో వాహనం అద్దాలు పగిలాయి. అలాగే కమ్మవారిపల్లెలో కూడా టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పత్తికొండ అసెంబ్లీ పరిధిలోని మల్లెపల్లె, రామళ్లకోట గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమనిగింది. కర్నూలు మండలం తులశాపురం, ఎదురూరు గ్రామాల్లో ఏజెంట్లను బయటకు పంపేందుకు టీడీపీ యత్నించింది. ఈ కుట్రను వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమనిగింది. -
ఓటు అడగలేదని పోలింగ్ బహిష్కరణ
మదనపల్లె : పేదలు నివసించే ప్రాంతమని వివక్ష చూపుతూ, కనీసం ఓటు అడిగేందుకు రాకపోవడంతో మూకుమ్మడిగా అందరూ కలిసి ఓట్లు వేసేందుకు వెళ్లమని పోలింగ్‌ను బహిష్కరించిన సంఘటన పట్టణంలోని విజయనగర్ కాలనీలో జరిగింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్థానిక విజయనగర్ కాలనీ సిమెంట్ రోడ్డు ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మహిళలు ఓటు వేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2, 3 వార్డుల పరిధిలో తమ కాలనీ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు అడిగేందుకు తమ వార్డులకు రాలేదన్నారు. నాయకులు వస్తే వారికి తమ సమస్యలను చెప్పి, గెలిచిన తర్వాత పరిష్కరించమని అడుగుదామనుకుంటే ఎవరూ అటువైపు చూడకపోవడంతో మా ఓట్లు వారికి అవసరం లేదనుకున్నారేమోనని ఓటుకు వెళ్లడం మానుకున్నామని చెప్పారు. -
టీడీపీ రౌడీయిజం
ఐరాల: సార్వత్రిక ఎన్నికల్లో దళితులను ఓట్లు వేయనీయకుండా తామే ఓట్లు వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఈ పర్యాయం మరింత రెచ్చిపోయారు. ఏకంగా పూతలపట్టు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థినిని చుట్టుముట్టి దాడికి తెగబడ్డారు. వారి దాడి నుంచి ఎలాగో బైటపడి వెళ్తున్న అభ్యర్థిని మళ్లీ అడ్డగించి పిడిగుద్దుల వర్షం కురిపించారు. తీవ్రగాయాలతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటన గురువారం మండలంలోని పి.కట్టకిందపల్లె పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. పోలింగ్ కేంద్రం నంబర్ 8లో అగ్రకులాల వారు తమను ఓట్లు వేయనీయడం లేదని దళితవాడ ప్రజలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుకు ఫోన్లో చెప్పడంతో ఆయన దళితులతో ఆ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికి సమయం 11.30 గంటలు. ఎంఎస్ బాబు సమస్యపై పోలింగ్ అధికారులతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దళితులు ఓటు వేయడానికి వీల్లేదంటూ వాగ్యుద్ధానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈవీఎం ను ధ్వంసం చేశారు. దాదాపు 70మంది టీడీపీకి చెందిన వారు కర్రలు, కమ్మీలతో వారిపై దాడికి తెగబడ్డారు. దీంతో ఎంఎస్ బాబు తల, ముఖం, వీపు, ఛాతీ, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. దాదాపు 40 నిమిషాల టీడీపీ నేతలు వారిపై రెచ్చిపోయారు. మండల కన్వీనర్ పి.చంద్ర శేఖర్ రెడ్డి సర్దిచెప్పేందుకు యత్నించినా ఆయనపై సైతం దాడి చేశారు. వారి దాడి నుంచి ఎలాగో బైట పడి కారులో బాబు వెళ్తుండగా అరకిలోమీటరు దూరంలోనే ఎదురుగా వాహనాలలో వచ్చి టీడీపీ నాయకులు మరోసారి అడ్డుకున్నారు. కారు వెళ్లనీయకుండా రాళ్లు అడ్డుపెట్టి, మళ్లీ దాడి చేశారు. రాళ్లతో కారు అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. అభ్యర్థి బాబు, ఆయన కుమారుడు ప్రవీణ్‌ను వెంటాడి మరీ ఇష్టానుసారంగా కొట్టారు. బాబు వద్ద రూ.40వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను సైతం లాక్కున్నారు. గన్‌మెన్ వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని గాయపడిన బాబును మరో వాహనంలో ఐరాల ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాబుపై దాడి ఘటనను నిరసిస్తూ చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన చేశారు. సాక్షి రిపోర్టర్‌గా భావించి... కట్టకిందపల్లె వద్ద టీడీపీ నేతల దాడి ఘటనను చిత్రీకరించేందుకు యత్నించిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిని సైతం టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నువ్వు సాక్షి విలేకరివా? అంటూ అతని కడుపులో తన్నారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. పోలీసుల వైఫల్యం పోలింగ్ కేంద్రం వద్ద బాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఎన్నోసార్లు ఎస్ఐ ప్రసాద్‌రావుకు ఫిర్యాదు చేసినా సకాలంలో ఆయన రాలేదని గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతం పోలీస్ స్టేషన్‌కు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా 2.15 గంటల సమయంలో ఎస్ఐ రావడం విమర్శలకు తావిచ్చింది. అప్పటికే బాబును చిత్తూరుకు తరలించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారిపై దాడి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పి.కట్టకిందపల్లె పోలింగ్ కేంద్రానికి వెళుతున్న నియోజకవర్గ ఎన్నికల అధికారి రవీంద్రను మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. వాహనం అద్దాలు పగుల కొట్టారు. వీటిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ నుంచి కెమెరా లాక్కొని వాటిని మూడు ముక్కలు చేశారు. కలెక్టర్‌కు ముందే ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం కట్టకిందపల్లె పోలింగ్ బూత్‌లో గత ఎన్నికల్లో అగ్రకులాల వారు తమను ఓటు వేయనీయడం లేదని నెల్లిమందపల్లె దళితవాడకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న్యకు గత నెలలో ఫిర్యాదు చేశారు. అధికారులు సైతం ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరైనా దళితులకు అవరోధాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఎన్నికల వేళకు సీన్ మారిపోయింది. అధికారులు ఏ చర్యలూ తీసుకోకపోవడంతో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నేతలు కాలరాచారు. -
ఓటుపై కత్తుల వేట!
జిల్లాలో టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. ఓటమి భయంతో హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. తంబళ్లపల్లెలో ఓ కార్యకర్తను రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపేశారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియానూ వదల్లేదు. కెమెరాలు లాక్కుని, ఐడీ కార్డులు చింపేసి అరాచకం సృష్టించారు. కొందరు నేతలు క్యూల్లోకి వెళ్లి యథేచ్ఛగా ప్రచారాలు చేస్తున్నా పోలీసులు అడ్డుచెప్పకపోవడం గమనార్హం. సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్: జిల్లాలోని ఓటర్లలో చైతన్యం కట్టలు తెంచుకుంది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. పోలింగ్ ప్రారంభ సమయానికే కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఓటర్లు బారులు తీరారు. అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీఎం పరిధిలో ఆ పార్టీ నేతలు దాడులకు పూనుకున్నా రు. నియోజకవర్గంలోని అన్ని బూత్‌లలో వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఓట్లు వేస్తుండడంతో ఒకింత అసహనానికి లోనయ్యారు. టిసదుం జెడ్పీ హైస్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌లో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఓటర్లు కొందర్ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారికి అడ్డుతగిలారు. రెచ్చిపోయిన టీడీపీ నేతలు రామాపు రం గ్రామానికి చెందిన ఆర్సీ వెంట్రామిరెడ్డి (68), మరికొందరు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంఎస్ బాబుపై హత్యాయత్నం పూతలపట్టు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్.బాబును హత్య చేయడానికి టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. సీఎం సామాజికవర్గానికి చెందిన పలు గ్రామాల్లో దళితులను ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. తొలుత బందార్లపల్లెలో దళితులను ఓటు వేయడానికి అగ్రవర్ణాలు అంగీకరించలేదు. దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన ఎంఎస్ బాబుపై అక్కడే దాడిచేసి మట్టుబెట్టాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. కానీ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పచ్చ ముసుగు ధరిం చిన అల్లరిమూలు పారిపోయాయి. అటునుంచి ఐరాల మండలంలోని కట్టకిందపల్లెకి వెళ్లిన బాబు దళితులను ఎందుకు ఓటు వేయనివ్వడం లేదని ప్రశ్నించారు. అప్పటికే కాపుకాచిన టీడీపీ నేతలు బాబుతో పాటు ఆయన గన్‌మన్, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయాలతో తప్పించుకుని వెళుతున్న బాబు వాహనాన్ని అడ్డగించి, ధ్వంసం చేశారు. ఆయన్ను కిడ్నాప్‌చేసి మామిడితోపులోకి తీసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో హత్య చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన అనుచరులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. తెల్లగుండ్లపల్లెలో వైఎస్సార్సీపీ ఏజెంటుగా ఉన్న బాబ్జి అనే యువకుడ్ని టీడీపీ నేతలు కొట్టుకుంటూ లాక్కొచ్చారు. దాదాపు 300 మందిని ఓట్లు వేయనివ్వకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెడ్డెప్పపై దాడికి యత్నం కుప్పం మండలంలోని కృష్ణదాసనపల్లెలో పోలింగ్ సరళి పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పపై టీడీపీ నాయకులు దాడి చేయడానికి ప్రయత్నిం చారు. చిత్తూరు రూరల్ మండలంలోని చెర్లోపల్లెలో స్థానికేతరులు ఓట్లు వేయడానికి వస్తుంటే అడిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వాళ్లు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. కుప్పంలో కుట్రలు కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతల కుట్రలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇదిలావుంటే కుప్పం పరిధిలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఎక్కడా తన ఏజెంట్లను నియమించకుండా చంద్రబాబుకు ఓట్లు వేసేలా కృషి చేశారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీపురం రాగిగుంట బూత్‌లో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ నేతలు, అధికారులు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లో ఉండకూడదట తిరుపతి ఎన్జీఓ కాలనీలోని బూత్ నంబర్ 40లో టీడీపీ ఏజెంట్లను లోపల కూర్చో బెట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. అదేమిటని అడిగితే లోపల స్థలం చాల్లేదని చెప్పుకొచ్చారు. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. రేణిగుంట మండలం ఎస్ఎన్ పురం బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలో ఫొటోలు లేవు. గుడిమల్లంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేయడం కనిపించింది. వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని ఓ కార్యకర్త చేత ఈవీఎంని గట్టిగా ఒత్తి మిషన్ పనిచెయ్యకుండా చేశారు. పోలింగ్ ప్రారంభమయ్యేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు రేణిగుంట మండలం గాజులమండ్యం, నల్లపాళెం గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గాజులమండ్యం పారిశ్రామికవాడ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా రెండు గ్రామాలతో పాటు మరికొన్ని పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఎవ్వరూ స్పందించకపోవడంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తర్వాత సమస్య సర్దుమణిగింది. చంద్రగిరిలో తమ్ముళ్లు దాష్టీకం వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారన్న నెపంతో రామచంద్రాపురం మండలానికి చెందిన దళితులను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారు. రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీకండ్రిగ, ఎన్ఆర్ కమ్మపల్లి, గణేశ్వరపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ దాడికి తెగబడ్డారు. టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి విలేకరులు ప్రకాష్, శివశంకర్, రాజారెడ్డి, మరో ఫొటోగ్రాఫర్‌ను అడ్డుకున్నారు. సాక్షి విలేకరి శివశంకర్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇతని వద్ద, రాజారెడ్డి వద్ద ఉన్న సెల్ఫోన్లు, ఐడీ కార్డులను లాక్కుని తరిమారు. సొరకాయలపాళెం గ్రామానికి చెందిన ఇరువర్గాల వారు రాళ్లు, రప్పలు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మండల పరిధిలోని అనేక గ్రామాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పాకాల మండలంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భాస్కరనాయుడుపై చేయిచేసుకున్నారు. తమ్ములగుంటలో పులివర్తి నాని భార్య హల్చల్ చేశారు. మొరాయించిన ఈవీఎంలు జల్లా వ్యాప్తంగా సుమా రు 2,350 ఈవీఎంలు మొరాయించినట్లు అధికారులు వెళ్లడించా రు. వీటిని సకాలంలో సరిచేయడంతో సమస్య తప్పినట్లయింది. -
సరిహద్దుపై డేగ కన్ను
వేమనపల్లి: దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం. ఒకవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేపై మావోలు దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. దీం తో తెలంగాణ మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్ సరిహద్దు ప్రాణహిత, గోదావరి నదీ తీరం వెంటా డేగకళ్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా గ్రా మాలు అప్పటికే పోలీసుల రక్షణ వలయంలోకి వెళ్లి పోయాయి. ప్రాణహితానది అవతలి వైపున్న గడిచిరోలి జిల్లా అభయారణ్యం మావోయిస్టులకు షెల్టర్‌జోన్. ఎతైనా.. గుట్టలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఎన్నికల స మయంలో మావోలు తమ ఉనికి చాటుకునేందుకు అవకాశాలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా పోలీస్ బలగాలు నిఘా తీవ్రతరం చేశాయి. ఎన్నికల ప్రక్రియకు మాత్రం ఆటంకం కలగకుండా అన్ని పీఎస్‌లపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంట రామగుండం పోలీస్‌కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షితా కే. మూర్తి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చో టులేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గ్రామాల్లో ఓటింగ్ సరళి పెంచేందుకు గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మా ర్చి 26న తీరం వెంట భారీ కూబింగ్ నిర్వహించారు. అదే రోజు ముక్కిడిగూడెం, కల్లంపల్లి గ్రా మస్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుహక్కు ప్రాధాన్యత, మావోల ప్రజావ్యతిరేక విధానాలపై వివరించారు. ప్రాణహిత ఫెర్రీపాయింట్‌ల వద్దకు డ్రోన్ కెమెరాల సహాయంతో తీరం వెంట గస్తీ నిర్వహిస్తున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్ సీఐ జగదీష్, ఎస్సై భూమేష్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర నిఘా.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రాణాహిత తీరం వెంట నిరంతర నిఘా కొనసాగుతోంది. జిల్లాలో 53 ఒకప్పటి మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో 98 పోలింగ్‌స్టేషన్లున్నాయి. సుమారు 88 మంది మావోయిస్ట్ మాజీ సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లు ఉన్నారు. వీరందరితో సమావేశాలు నిర్వహించి, అసాంఘిక శక్తులకు సహకరించొద్దని వారిని బైండోవర్ చేశారు. నది వెంట 16 ఫెర్రీ పాయింట్లుండగా వచ్చి పోయే ప్రయాణికుల మీద దృష్టి సారించారు. పడవలు నడిపే బోట్‌రైడర్లు, జాలరులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీస్స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు అనుమానిత వ్య క్తుల సమాచారం తెలుసుకుంటున్నారు. యాక్షన్‌టీంలాంటి వాటి సంచారాన్ని తిప్పికొట్టేందుకు కౌంటర్ యాక్షన్ టీం, క్యూఆర్టీ, టాస్క్‌ఫోర్స్ టీం లను ఏర్పాటు చేశారు. యాక్షన్‌టీం సభ్యుల ఫొటోలను గ్రామాల్లో గోడలపై అంటించి వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేయిస్తున్నారు. సరిహద్దు వెంట ఉన్న సుమారు 284 కల్వర్టులను ప్రత్యేకపోలీస్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలను నిర్వహించారు. -
నాగల్‌గొంది.. తీరిన రంది
కెరమెరి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి వా రు అనుభవిస్తున్న కష్టాలు ఎట్టకేలకు దూరమయ్యాయి. కెరమెరి తహసీల్దార్ ప్రమోద్ ప్రత్యేక చొరవ తీసుకుని ఉన్న గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఓటర్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల తర్వాత అక్కడి ఆదివాసీలకు ఎట్టకేలకు స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావిస్తున్నారు. ఏళ్ల కష్టాలు దూరం.. మండలంలోని కరంజివాడ గ్రామ పంచాయతీ లోని నాగల్‌గొంది, కొలాంగూడ గ్రామాల్లో 379 జనాభా ఉంది. అందులో పురుష ఓటర్లు 113 కా గా.. మహిళలు 106 మొత్తం 219 ఓటర్లు ఉన్నా రు. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇందాపూర్, లేదా నిషాని గ్రామంలోని పోలింగ్ బూత్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేవారు. 70 ఏళ్లలో ఇప్పటికి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వారికి కష్టాలు తప్పలేదు. ఇందాపూర్‌కు వెళ్లాలంటే 15 కిలోమీ టర్లు కాగా, నిషాని గ్రామం 18 కిలోమీటర్ల దూ రంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏ కాలంలో ఏ ఎన్ని కలు జరిగిన వారు పాదయాత్రగా వెళ్లక తప్పలే దు. చాలా సందర్భాల్లో వానకు తడుస్తూ, ఎండ కు ఎండుతూ.. చలికి వణుకుతూ వెళ్లి ఓట్లు వేశా రు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వారు దూరభా రం అధికమవుతుందని దగ్గర్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ఓటర్లు కోరినప్పటికి అధికారులు పట్టించుకోలేదు. పోలింగ్ కేంద్రాల మార్పు రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉన్నప్పటికి మనకెందుకులే అనుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఓటు వేసేందుకు కష్టాలు చవిచూశారు. సాక్షి, తహసీల్దార్ ప్రత్యేక చొరవ ఈ విషయమై డిసెంబర్ 7న సాక్షి దినపత్రికలో ‘ఓట్ల కోసం తప్పని పాట్లు’ అనే కథనం ప్రచురి తం కావడంతో పాటు ఆ ప్రాంత ప్రజలు కెరమెరి తహసీల్దార్ ప్రమోద్ను వేడుకున్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ అక్కడి ఓటర్లు, జనాభా తదితరాల వివరాలను సేకరించారు. అక్కడి ఓట ర్లు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్న విష యం వాస్తవమేనని గ్రహించిన ప్రమోద్‌కుమార్ వెంటనే నాగల్గొందిలోనే పోలింగ్ కేంద్రం ఏర్పా టు చేశారు. నేడు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు వారు నాగల్‌గొంది గ్రామంలో ఏర్పాటు చేసిన పో లింగ్ బూత్ సంఖ్య 90లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దూరభారం తగ్గింది చాలా కాలంగా ఓట్లు వేయడానికి పడుతున్న కష్టం ఎట్టకేలకు ముగిసింది. ఇక చక్కగ తమ గ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రెవెన్యూ అధికారులు కల్పించారు. సరైన రోడ్డు సౌకర్యం లేక , దూరభారం అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. – మధుకర్ సర్పంచ్, నాగల్‌గొంది ఓటర్ల బాధలు చూసి.. ఓటర్లు టు వేసేందుకు పడుతున్న బాధనలు చూ సి వారు ఉండే గ్రామంలోనే పోలింగ బూత్ కేంద్రం ఏర్పాటు చే యాలని భావించాం. వెంటనే అధికారులకు నివేదికలు సమర్పించండంతో అక్కడ నూతనంగా పోలింగ్ బూత్ కేంద్రం మంజూరైంది. దీనికి ‘సాక్షి’ కూడా తోడైంది. ప్రజల బాధలు తీరాయి. దూరభారం తగ్గింది. – వి.ప్రమోద్, తహసీల్దార్ -
‘ఆమె’ కీలకం
బజార్హత్నూర్(బోథ్): 17వ లోక్‌సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జాతీయ పార్టీలుగా సుదీర్ఘ కాలంగా పాలించిన కాంగ్రెస్, బీజేపీతో ప్రాంతీయ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలు గెలుపొందేందుకు ముమ్మర ప్రచారంతో హోరెత్తించగా.. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తమ ప్రచార పర్వం ఉధృతంగానే కొనసాగించాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు (ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, ముథోల్) ఉన్నాయి. అతివలే అంతిమ నిర్ణేతలు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా,నేనా అన్నట్లు రీతిలో ప్రచా రం చేపట్టాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో సిర్పూర్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాలల్లో పురుషులతో పోల్చితే మహిళ ఓటర్లే అధికం. సహజంగానే పోలింగ్ సరళిలో పురుషులతో పోల్చితే మహిళలే ఉత్సహంగా పాల్గొంటారన్నది గత అనుభావాలు సూచిస్తుండటంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ మహిళలదే కీలక పాత్ర కాబోతోంది. అంతే కాదు కొత్తగా 38,588 మంది ఓటర్లుగా నమోదైన యువత కూడా అభ్యర్థుల గెలుపోటమిలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఏడు నియోజకవర్గాల్లో 7,58,064 మంది మహిళా ఓటర్లు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 14,88,353 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,30,233 మంది పురుష ఓటర్లు, 7,58,064 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 56 మంది ఉన్నారు. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సిర్పూర్ మినహా పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లే అధికం. సిర్పూర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లతో పోల్చితే పురుష ఓటర్లు 1574మంది అధికంగా ఉన్నారు. మిగతా ఆరు నియోజక వర్గాలలో మహిళా ఓటర్లే అధికం. ఖానాపూర్‌లో 3,763, నిర్మల్ 13,396, ఆసిఫాబాద్ 135, ఆదిలాబాద్ 2437, బోథ్ 3896, ముథోల్ 5676, మొత్తం 27,381 మంది మహిళలు అధికంగా ఉండటంతో ఎంపీ అభ్యర్థుల గెలుపోటమి వీరిపైనే ఆధారపడి ఉంది. ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు లోక్‌సభ అభ్యర్థికి మహిళల ఓట్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ మా ప్రభుత్వం వస్తే, మా అభ్యర్థి గెలిస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పథకాలు ప్రవేశపెడుతామని హామీలిస్తూ మహిళలను కలుసుకుని ఓట్లు వేయాలని కోరారు. గ్రామస్థాయిలో సర్పంచులుగా మహిళల ప్రాతినిధ్యం పెరిగినందున అందులో అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా సర్పంచులు అధికంగా ఉండటంతో వారికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్కు ఓటు వేస్తే మహిళలకు మరింత లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. బీజేపీ ముస్లిం మహిళలకు తలాక్ రద్దు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పరువు కాపాడుటతో పాటు స్వచ్ఛభారత్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు ప్రచారం చేసింది. ఇక కాంగ్రెస్ మహిళలకు ప్రత్యేక పథకాలు ఉంటాయని భరోసా కల్పిస్తూ ప్రచారం హోరెత్తించాయి. మరి ఈ ఎన్నికల్లో మహిళలు ఎటువైపు మొగ్గుచూపుతారోనన్న ఉత్కంఠ సర్వత్రా చోటు చేసుకుంది. -
దోచుకో...దాచుకో...
విజయనగరం మున్సిపాలిటీ: ఐదేళ్ల చంద్రబాబు పాలన పూర్తిగా లంచమయంగా సాగిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి రోజు మంగళవారం 7వ వార్డు ఆయన హుకుంపేట, 13వ వార్డు అశోక్‌నగర్, 9వ వార్డు మేధరవీది, 16వ వార్డు జమ్ము ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కోలగట్లకు అడుగడుగునా ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు నుదుట విజయ తిలకం దిద్ది విజయీభవ అంటూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తే... ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి నుంచి గల్లీ వరకు ఒకే ఒక్క పథకం అమలైందని అది దోచుకో.. దాచుకో పథకమని వాఖ్యానించారు. చంద్రబాబు పోలవరం, అమరావతి ప్రాజెక్టులలో లంచాలు తీసుకుంటే... కింద స్థాయి నాయకులు ఇళ్లిస్తే లంచం, పింఛను ఇస్తే లంచం అంటూ దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకు తెలియదా.. అని ప్రశ్నించారు. కర్ఫ్యూలో అశోక్ ఎక్కడ ఉన్నారో తాను అక్కడే ఉన్నానని పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనను ప్రస్తావించి ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకున్న అశోక్‌గజపతిరాజు ఐదేళ్లలో తాను చేసిందేమి లేకనే మళ్లీ కర్ఫ్యూ పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవటం సిగ్గు చేటన్నారు. ఐదేళ్ల కాలంలో మీరేం చేశారో చెప్పాలన్నారు. తాను ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 8 వేలు ఇళ్లు కట్టామని, పట్టణంలోని ప్రధాన రహదారులు విస్తరించామన్నారు. మరల అధికారమిస్తే అటువంటి కాలనీలు మరో నాలుగు కట్టించి ఇస్తామన్నారు. తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ప్రచారంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బొత్స వర్సెస్ కిమిడి నాగార్జున
చీపురుపల్లి: ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొననున్నది. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, టీడీపీ అభ్యర్థిగా కిమిడి నాగార్జున పోటీలో నిలవనున్నారు. అనుభవానికి అనుభవలేమికి జరగనున్న పోటీల్లో గెలుపుపై నియోజకవర్గ ప్రజలు చర్చించు కుంటున్నారు. వీరి గుణగణాలను ప్రజలు బేరీజు వేసుకుం టున్నారు. బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన కళాశాల చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘ నాయకుడుగా పని చేశారు. ఆ తరువాత కాలంలో గాజులరేగ పీఏసీఎస్ అధ్యక్షుడిగా, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) చైర్మన్‌గా పని చేశారు. 1998లో బొబ్బిలి ఎంపీగా గెలుపొం ది పార్లమెంటు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినేట్లో రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖా మంత్రిగా, మార్కెటింగ్శాఖా మంత్రిగా, పంచా యతీరాజ్, గృహ నిర్మాణశాఖా మంత్రిగా ఎలా ఎన్నో పదవులు అలరించారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా, రాష్ట్ర రాజకీయాలను శాసిం చే సమర్థత కలిగిన నాయకుడు. ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో కార్యకర్తలను సైతం పేరు పెట్టి పిలిచే నాయకుడు. అర్థరాత్రి, అపరాత్రి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి ఫోన్ చేస్తే నేరుగా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేసి వారి కష్ట, సుఖాలు విని వాటిని పరిష్కరించే గొప్ప మనిషి. ఆయన పదేళ్ల పదవీ కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలలు, అన్ని గ్రామాలకు రోడ్లు, నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు తాగునీరు, టీటీడీ కల్యాణ మండపం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయాంలోనే జరిగాయి. కిమిడి నాగార్జున కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2016 వరకు అమెరికా లో ఉద్యోగం చేశారు. అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి 2016లో చీపురుపల్లి వచ్చారు. అప్పటి నుంచి ఆయన తల్లి, ఎమ్మెల్యే మృణాళినితో కలిసి గ్రామాల్లోకి వెళుతూ పరిచయం చేసుకున్నాడు. రాజకీయంగా ఎలాంటి అనుభవం, పదవులు లేవు. ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి మృణాళిని వారసునిగా తప్ప ఆయనకు ఎలాంటి గుర్తింపు లేదు. -
పోలింగ్ చీటీపైనే అన్నీ.
వాంకిడి(ఆసిఫాబాద్): ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల కమిషన్ ఓట్ల శాతం పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ చీటీలను బీఎల్వోల ద్వారా పంచి పెట్టింది. ఓటర్లకు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలింగ్ చీటీపైనే ఓటరు ఫొటో, పోలింగ్ కేంద్రం మ్యాప్, బీఎల్వో పేరు, ఫోన్‌నంబర్, కేంద్రం సమస్త వివరాలను ముద్రించింది. దీంతో గత ఎన్నికల్లో ఓటరు ఓటు వేయాలన్న కేంద్రం ఎక్కడుంది, ఓటు వేయాడానికి వెళ్లాలన్న ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్నికల కమిషన్ ఓటరు ఫొటోతో కూడిన పోలింగ్ చీటీలను పంపిణీ చేస్తూ వాటి వెనుకలో కేంద్రం మ్యాప్, వివరాలను పొందుపర్చారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ విధానం అములు చేయడంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడడంతో తిరిగి అదే విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు.జిల్లాలో మొత్తం 583 పోలింగ్ కేంద్రాలు చేశారు. ఇందులో సిర్పూర్(టి) నియోజకవర్గంలో 283, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 300ల కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 4,02,663 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 1863 మంది అధికారులను నియమించారు. ఓటర్లు వచ్చేలా చర్యలు పోలింగ్ చీటీలో ముద్రించిన సూచనలు ఇలా.. మీ గుర్తింపును నిరూపించడానికి ఓటరు చీటి మాత్రమే సరిపోదు, మీ గుర్తింపును బలపర్చడానికి మీరు మీ ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల కమిషన్ పేర్కొంది. 11 డాక్యూమెంట్లలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పని సరిగా మీ వెంట తీసుకురావాలి. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ వరుసలో ఉన్న ఓటర్లందరికీ టోకెన్ జారీ చేసి తమ ఓటు వేయడానికి అనుమతిస్తారు. మహిళకు ప్రత్యేక క్యూ ఉంటుంది. వయోవృద్ధులకు ఓటింగ్ నిమిత్తం ప్రాధాన్యం ఉంటుంది. అందులు, శారీరక వైకల్యం కలిగిన ఓటరు ఓటు వేయడం కోసం కంపార్టుమెంటు వద్దకు తీసుకెళ్లేందుకు ఒక వయోజనుడిని సహాయకుడిగా అనుమతించవచ్చు. మొబైల్ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పోలింగ్ బూత్‌లోకి అనుమతించరు. ఒక నిర్ణీత అభ్యర్థి కోసం ఓటు వేయడానికి డబ్బు లేదా ఏదేని ఇతర విధాలైన ప్రతిఫలాన్ని ఇవ్వజూపడం లేదా అంగీకరించడం చట్ట ప్రకారం అవినీతి చేష్ట కిందకు వస్తుంది. ఏ ఒక్క ఓటరును వదిలేయరాదు. ప్రతీ ఓటు లెక్కించబడుతుంది. ఓటరు చెంతలోనే పోలింగ్ చీటీలు మండలాల వారీగా ఏర్పాటు చేసిన బీఎల్వోలు పోలింగ్ చీటీలను వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అలా పంపిణీ చేసిన అనంతరం బీఎల్వోలు ఓటరులకు పోల్ చీటిలు ముట్టినట్లు సదరు ఓటరు ద్వార సంతకాలు తీసుకుంటున్నారు. ఇలా పోలింగ్ చీటీలు ఇవ్వడానికి బీఎల్వోలు వెళ్లినప్పుడు ఇంట్లో ఓటరు లేకున్న దిగులు పడకుండా ఓటింగ్ సమయంలో కేంద్రాల వద్ద ఉన్న బీఎల్వో వద్ద నుంచి తమ పోలింగ్ చీటీలు సేకరించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చనే వెసులుబాటు కల్పించారు. -
వైఎస్సార్సీపీ జెండా తీయకపోతే అంతు చూస్తాం!
కైకలూరు: కొల్లేరు లంక గ్రామాల్లో సమాంతర పాలన రాజ్యమేలుతోంది. చట్టాలు చట్టబండలవుతున్నాయి. కుల పెదరాయుళ్ల తీర్పుల ముందు స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామ కట్టుబాట్ల నడుమ ఓటర్లు నలిగిపోతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తే గ్రామ బహిష్కరణ తప్పదనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొల్లేరును అడ్డాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు ఓట్ల రాజకీయానికి తెరతీస్తున్నారు. స్వేచ్ఛాయుతంగా ఓటు వేయడానికి రక్షణగా ప్రత్యేక బలగాలను పంపించాలని ప్రజలు వేడుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 9 మండలాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లో కలిపి 122 గ్రామాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు, మండవల్లి మండలాల్లో 18 లంక గ్రామాల్లో ఓటర్లు 16,500 మంది ఉన్నారు. ఈ గ్రామాల్లో 90 శాతం ‘వడ్డీలు’ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. అనాధిగా ఈ గ్రామాల్లో కుల కట్టుబాట్లతో సమాంతర పాలన కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు సీటు కేటాయించింది. దీంతో కుల పెద్దలు టీడీపీకి ఓటు వేయాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ జెండా తీయకపోతే అంతు చూస్తాం! కృష్జా జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేరు లంక గ్రామం పెంచికలమర్రులో 149వ బూత్‌లో 1,093 ఓట్లు, 150వ బూత్‌లో 675 ఓట్లు ఉన్నాయి. ఇదే గ్రామానికి చెందిన ఘంటసాల మల్లిఖార్జునరావు.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో అతని ఇంటిపై వైఎస్సార్సీపీ జెండా కట్టుకున్నాడు. కైకలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) తరఫున ప్రచారం చేస్తున్నాడు. దీంతో గ్రామ పెద్దలు సోమవారం రాత్రి కమ్యూనిటీ హాల్లో పంచాయతీ పెట్టి.. అతని కుటుంబాన్ని పిలిపించి కుల కట్టుబాట్లు ధిక్కరిస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ జెండాను పీకేయాలని హుకుం జారీ చేశారు. ఇదే పరిస్థితి అనేక కొల్లేరు లంక గ్రామాల్లో కనిపిస్తోంది. భయం గుప్పెట్లో కొల్లేరు గ్రామాలు.. కొల్లేరు కుల పెద్దల హెచ్చరికలకు ఆయా గ్రామాల్లో ఓటర్లు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల ప్రజా సంకల్ప యాత్రలో ఈ ప్రాంతానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వడ్డీలు’ సామాజికవర్గంలో స్థానికులు సూచించిన వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించి కొల్లేరు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కి అందిస్తామన్నారు. దీంతో కొల్లేరు గ్రామాల్లో అనేక మంది వైఎస్ జగన్‌పై అభిమానంతో ఉన్నారు. ఈ అభిమానం ఓట్లు రూపంలో పడకుండా కుల పెద్దలు అడ్డుపడుతున్నారు. గ్రామ మైకుల్లో టీడీపీకి తప్ప మరో పార్టీకి సహాకరిస్తే రూ.10,000 జరిమానా వి«ధిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించడానికి పోలీసు బలగాలను కొల్లేరుకు పంపాలని స్థానికులు కోరుతున్నారు. -
మాచర్ల రైల్వేలైన్ సాధిస్తాం
నాగర్‌కర్నూల్ క్రైం: కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, స్థానికేతరులైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను కాకుండా టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాములును అధిక మెజార్టీతో గెలిపిస్తేనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం బిజినేపల్లిలో రోడ్‌షో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ప్రధాన అంశమైన మాచర్ల రైల్వేలైన్ హామీని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నెరవేర్చలేకపోయాయని, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మాచర్ల రైల్వేలైన్ సాధించేందుకు కృషిచేస్తామన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి రాములు అని గుర్తించి ఎంపీగా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులను కొట్లాడి సాధించుకుంటామన్నారు. ప్రస్తుత పార్లమెంట్ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికేతరులని, స్థానికుడైన తనను గెలిపిస్తే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషిచేస్తానన్నారు. రెండుసార్లు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమాత్రం కృషిచేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ ఐదేళ్లలో చేశారన్నారు. ఎంపీ అభ్యర్థి రాములును నియోజకవర్గ ప్రజలు తనకు ఇచ్చిన 54 వేల మెజార్టీ కంటే అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. రోడ్‌షోలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ రఘునందన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు సుధా పరిమళ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫెడరల్ ఫ్రంట్‌కు స్పందన లేదు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేశంలో ఫెడరల్ ఫ్రంట్‌కు స్పందనలేకనే 16 స్థానాలతో చక్రం తిప్పుతానని సీఎం కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నివాసంలో ఆయన మాట్లాడారు. దేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలను కలిసిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు స్పందన కరువవడంతో 16 స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, 300 స్థానాలు బీజేపీ, మిత్రపక్షాలు 50 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ కేసిఆర్ విధానాల వల్ల తెలంగాణ అప్పుల పాలైందని, గతంలో ఎంపీలు ఉన్నా ఏం చేయలేని కేసీఆర్ ఇప్పుడేదో చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎంపీగా తనను గెలిపిస్తే పాలమూరు కష్టాలు తీర్చేందుకు పనిచేస్తానన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని, దేశ భద్రత, సమగ్రతకు నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ, పద్మజారెడ్డి, శ్రీవర్దన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ పీఎం బనేగా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటివరకు దేశంలోని మైనార్టీలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమి లేదు.. అందరు టైంపాస్ చేసి వెళ్లిపోయారు.. సీఎం కేసీఆర్ ఒక్కరే మైనార్టీల సంక్షేమం గురించి ఆలోచించారు.. వారికి పెద్ద పీట వేసి పెద్దన్నలా భరోసా ఇచ్చారు.. రాష్ట్రంలో 16 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే దేశంలో ఫెడరల్‌ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పీఎం అవుతారు.. అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు పాలమూరులోని మదీనా మజీద్ ప్రాంతంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఙప్తి చేశారు. టీఆర్ఎస్ గెలుపుతోనే మైనార్టీలకు మేలు జరుగుతుందని, కుల, మత రాజకీయాలు చేస్తున్న పార్టీలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. దేశానికి వఫాదార్ కావాలి ప్రస్తుత ప్రధాని లాంటి చౌకీదార్.. రాహుల్ గాంధీ లాంటి టేకేదార్ లాంటి వ్యక్తులు దేశానికి అవసరం లేదని, సీఎం కేసీఆర్ లాంటి వఫాదార్, జిమ్మేదార్ వ్యక్తి అవసరమని మహమూద్ అలీ అన్నారు. ప్రదాని జిల్లాకు వచ్చి స్థానిక సమస్యల గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రిని విమర్శించి వెళ్లిపోయారని ఆరోపించారు. మంత్రి వెంట ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. సోలా ఎంపీ.. పీఎం పక్కా నారాయణపేట: ‘తెలంగాణ స్టేట్ మే సోలా ఎంపీ టీఆర్ఎస్ ఆద్మి జీతేగా.. సీఎం కేసీఆర్ పీఎం బనేగా.. అంటూ హోంమంత్రి మహమూద్ అలీ జోస్యం చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటలకు నారాయణపేటలోని మసూమ్అలీ దర్గా వద్ద స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ప్రచార సభకు హోంమంత్రి హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ముస్లిం మైనార్టీలకు ఎప్పుడు డిప్యూటీ సీఎం పదవీగాని, క్యాబినేట్లో ఉన్నత మంత్రి పదవులు ఇచ్చిన దాఖాలాలు లేవని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాముఖ్యత ఇచ్చారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో అల్లర్లు తగ్గిపోయాయన్నారు. -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్
సాక్షి,ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. దేశీయంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు ఫార్వర్డింగ్ ఇన్ఫో, ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ లాంటి ఫీచర్లను ఇటీవల లాంచ్ చేసిన వాట్సాప్ తాజాగా గ్రూపు అడ్మిన్లకు మరిన్ని అధికారాలను ఇస్తూ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఫీక్వెంట్లీ ఫార్వర్డెడ్ (తరచుగా ఫార్వార్డ్ చేసిన మెసేజ్) నిరోధానికి మరో కొత్తలేబుల్ను ఆవిష్కరించనుంది. దీంతో సదరు మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వార్డ్ అయిందో చెక్ చేసుకోవచ్చన్న మాట. నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించడానికి వాట్సాప్ తీసుకున్నచర్యల్లో ఇది తదుపరి దశగా భావిస్తున్నారు. తద్వారా వినియోగదారులకు నిరంతరం ఫార్వార్డ్ అవుతున్న మెసేజ్‌ల తలనొప్పులకు చెక్ పెట్టనుంది. వా బేటా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లకోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అనంతరం గ్రూపు సెటింగ్స్‌లో ఈ ఫీచర్‌తో త్వరలోనే అప్డేట్ చేయనుంది. దీని ప్రకారం ఒక్క అడ్మిన్ తప్ప ఈ ఫీక్వెంట్లీ ఫార్వర్డెర్డ్ ఆప్షన్‌ను చూసే, లేదా ఎడిట్ చేసే అవకాశం లేదు. అంతేకాదు సదరు మెసేజ్‌ను పార్వార్డ్ చేయాలా లేదా వద్దా అనేది కూడా గ్రూప్ అడ్మిన్ నిర్ణయించాల్సి ఉంటుంది. దీంతో అసంబద్ధ, లేదా అసత్య వార్తల తొందరగా వ్యాపించే ప్రక్రియ నెమ్మదిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా రూమర్లు, అసత్య వార్తలు, నకిలీ వార్తల వ్యాప్తిలో తన ప్లాట్‌ఫాం దుర్వినియోగాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం, చట్ట సంస్థలు, ఫాక్ట్ చెకర్స్, ఇతర స్వచ్ఛంద సంస్థలతో వాట్సాప్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. -
వరాల జల్లు
‘ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలుపుతాం. పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో.. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల మేర సాగు నీరు అందిస్తాం. సాధ్యమైనంత తొందరగా 111 జీఓను ఎత్తివేస్తాం. అనంతగిరి టీబీ ఆస్పత్రికి పునర్వైభవం తెస్తాం. అనంతగిరిని తెలంగాణ ఊటీగా అభివృద్ధి చేస్తా. రంజిత్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి’ – వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ వికారాబాద్: ఉమ్మడి జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. వికారాబాద్‌లోని కలెక్టరేట్ నూతన భవనం సమీపంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన వెంటనే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగుల డిమాండ్ మేరకు జోన్‌ను మార్చేస్తామని తెలిపారు. తాను 1985లో అనంతగిరికి వచ్చానని, అప్పుడే అనంతగిరి గొప్పతనం తెలుకున్నానని చెప్పారు. ఎన్నో ఔషధ మూలికలు ఉన్నాయి కాబట్టే అప్పటి నిజాం నవాబు ఇక్కడ టీబీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందించారని తెలిపారు. అనంతగిరి టీబీ ఆస్పత్రికి పునర్వైభవం తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. జిల్లాలో అనేక సమస్యలున్నాయని.. తానే స్వయంగా వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చదువుకున్న వ్యక్తి, బహుభాషా కోవిధుడని తెలిపారు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి లక్ష ఓట్ల మెజార్టీ అందించి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనను ఎప్పుడు కలిసినా 111 జీఓను ఎత్తివేయాలని కోరుతున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ ఇస్తే అంత తొందరగా 111 జీఓను ఎత్తివేస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతగిరిని అభివృద్ధి చేస్తా... జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని సీఎం స్పష్టంచేశారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు లక్ష ఎకరాల చొప్పున సాగు నీరు ఇస్తామని చెప్పారు. ఈ పథకాన్ని ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలలోపు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతగిరి తెలంగాణ రాష్ట్రానికే ఊటీలాగ ఉంటుందని, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం హామీలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. చప్పట్లు కొడుతూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, నాయకులు శుభప్రద్‌పటేల్, రాంచంద్రారెడ్డి, భూమోళ్ల కృష్ణయ్య, తాండూరు విజయ్‌కుమార్, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
రక్షణరంగాన్ని తాకట్టు పెట్టాయి
సూర్యాపేట : కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దేశ రక్షణరంగాన్ని తాకట్టు పెట్టాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ రోడ్ షోకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్ షో పూలసెంటర్ పీఎస్సార్‌సెంటర్, రాఘవప్లాజా, శంకర్ విలాస్ సెంటర్‌మీదుగా నేరుగా కొత్తబస్టాండ్ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. కొత్తబస్టాండ్ జంక్షన్ వద్ద ప్రజలనుద్ధేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగించారు. దేశం వెనుకబాటుకు ఆ రెండు పార్టీలే ప్రధాన కారణమన్నారు. ఆ పార్టీలు ప్రజల ఎజెండాను పక్కకు పెట్టాయని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రజల ఎజెండాను అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని ఆయన కొనియాడారు. పేదరికాన్ని పారద్రోలడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి తామే సీనియర్లమని ప్రగల్బాలు పలుకుతున్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డిలు రాజకీయంగా ఎదిగినట్లే జిల్లాలో ఫ్లోరిన్ పెరిగిందని మంత్రి దుయ్యబట్టారు. ఫ్లోరిన్‌పై సీఎం కేసీఆర్ దాడి చేసి మిషన్ భగీరథ పేరుతో ఇంటింటి మంచినీరు అందించే పథకాన్ని ప్రవేశపెడితే.. కాంగ్రెస్ పెద్దలు ఆ పథకాన్ని అడ్డుకోచూపారని గుర్తుచేశారు. మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి 17కు 17ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలోని ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి తెలంగాణ చేరుతుందని పేర్కొన్నారు. ఉత్తమ్‌పై విసుర్లు.. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా అధికార పార్టీ ఎజెండాపై చర్చించాల్సిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో ఆయనపై పోటీ చేస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై దాడికే పరిమితమయ్యారని విమర్శించారు. ఓటమి భయంతో నే ఉత్తమ్‌కుమారుడి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవయ్యారని అందుకే కిందటి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారికి డిపాజిట్లు గల్లంతయిన వారికి టికెట్లు ఇచ్చారని తెలిపారు. నల్లగొండలో చెల్లని రూపాయిని భువనగిరిలో.. కొడంగల్‌లో చెల్లని రూపాయిని మల్కాజిగిరిలో.. కల్వకుర్తిలో చెల్లని రూపాయిని మహబూబ్‌నగర్‌లో పోటీకి దింపారని ఎద్దేవా చేశారు. -
కల్వర్టును ఢీకొట్టిన బస్సు
చందంపేట (దేవరకొండ) : బ్రేకులు ఫెయిలైన బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 33 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని చిత్రియాలలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేం దుకు కాంగ్రెస్ పార్టి నాయకురాలు, సినీ నటి విజయశాంతి దేవరకొండలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొననుండడంతో వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు దేవరకొండకు వివిధ వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. కాగా ఎటువంటి అనుమతులు లేకుండా కాలం చెల్లిన చిత్రియాల గ్రామానికి చెందిన వివేకానంద యూపీఎస్ పాఠశాల బస్సులో సామర్థ్యానికి మించి సుమారు 65 మందిని దేవరకొండకు తరలించారు. కాగా చిత్రి యాల గ్రామ శివారులోని మూలమలుపులు(లోయల ప్రాంతం) ఎల్లమ్మగుడి వద్ద ఒక్కసారిగా బ్రేకులు ఫేల్ కావడంతో మూలమలుపులోని కల్వర్టును ఢీకొట్టింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న స్థానిక సర్పంచ్ కాకనూరి రంగయ్య, కుంభం కాశమ్మ తీవ్ర గాయాలయ్యాయి. వీంతో పాటు మరో 31 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంత మంది బస్సులోనే ఇరుక్కుపోవడంతో జేసి సహాయంతో క్షతగాత్రులను వెలికితీశారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని కూడా హైదరాబాద్‌కు తరలించాలని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కొంత మంది విధుల్లో లేనప్పటికి ఉన్నత వైద్యాధికారుల ఆదేశాల మేరకు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడే సమాచారం అందడంతో వైద్య సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేపట్టారు. క్షతగాత్రులను దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మరికొంత మందిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రామకృష్ణ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఉలిక్కిపడ్డ చిత్రియాల చిత్రియాల గ్రామంలో గత స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకనూరి రంగయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నత హోదా, ప్రముఖ వ్యాపార వేత్త అదే గ్రామం కావడంతో గ్రామస్తులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను దేవరకొండకు చేర్చేందుకు, విజయశాంతి రోడ్‌షోను విజయవంతం చేసేందుకు కార్యకర్తలను తరలించేందుకు చర్యలు చేపట్టడంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్న ఈ నేపథ్యంలో సుమారు 60 మంది బస్సులో ప్రయాణిస్తుండగా 33 మందికి గాయాలు కావడంతో గ్రామంలో ఏం జరిగిందోనన్న ఆవేదన పెరిగిపోయింది. 33 మందికి గాయాలు కావడంతో చిత్రియాల గ్రామం ఉలిక్కిపడింది. -
టీఆర్ఎస్కు అభ్యర్థి దొరకలేదా?
మిర్యాలగూడ : నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడానికి టీఆర్ఎస్కు స్థానికులు దొరకలేదా? టికెట్ అమ్ముకున్నారా? అని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం మిర్యాలగూడలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక హనుమాన్‌పేట చౌరస్తా నుంచి రాజీవ్‌చౌక్ వరకు సాగింది. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి మునుగోడులో చెల్లని రూపాయి, నల్లగొండలో చెల్లుతుందా? అని అన్నారు. నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, డబ్బు, మద్యంతో వచ్చే వారిని ఓడిస్తారని అన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, రాహుల్‌గాంధీకి, నరేంద్రమోదీకి మధ్య జరుగుతున్నాయని అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రతి పేద కుటుం బానికి నెలకు రూ.6 వేల రూపాయల చొప్పున అందిస్తారని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకే సారి చేస్తారని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచి నల్లగొండ ప్రజలు గర్వపడేలా నడుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ కార్యదర్శి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, డీసీసీ అద్యక్షుడు శంకర్‌నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. నల్లగొండ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేశ రక్షణకు సైనికుడిగా పనిచేస్తే టీఆర్ఎస్ అభ్యర్థి భూ కబ్జాదారుడిగా ఆక్రమణ లకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇందిరమ్మ రా జ్యం రావాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాల ని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సాధినేని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, మేడ సురేందర్‌రెడ్డి, ముజ్జ రామకృష్ణ, సలీం, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, శాగ జలేందర్‌రెడ్డి, ఎం డీ ఇస్మాయిల్, కంచర్లకుంట్ల దయాకర్‌రెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, తమన్న, ఆరీఫ్, టీడీపీ నాయకులు కాసుల సత్యం, మాన్యానాయక్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర వారధి నిర్మించా..ఆదరించాలి
మఠంపల్లి : తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న మట్టపల్లి వద్ద క్రిష్ణానదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో రూ.50కోట్లు మంజూరు చేసి అంతరాష్ట్ర వారథి హైలెవల్ వంతెన నిర్మాణానికి కృషి చేసినందున ఆదరించి కాంగ్రెస్‌పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మట్టపల్లి, పెదవీడు, మఠంపల్లి, రఘునాథపాలెం, తదదితర గ్రామాలలో రోడ్‌షో నిర్వహించారు. ముందుగా ఆయన హైలెవల్ వంతెనను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలలో మాట్లాడారు. కిష్టపట్టె ప్రాంతం వ్యవసాయాభివృద్ధితో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు రైల్వేలైను, హైలెవల్ వంతెన, సబ్స్టేషన్లు నిర్మించానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈప్రాంత అభివృద్దికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. కాగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలతో ఉత్తమ్‌కు ఘన స్వాగతం పలికారు. -
లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఎస్పీ మల్లారెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 11న ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానితో ఓటు వేసేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 283, ఆసిఫాబాద్‌లో 300 కేంద్రాలు, మొత్తం 583 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మహిళల కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 4,02,663 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో వికలాంగులు 6,388 మంది ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 3,87,578 మందికి ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1863 మంది సిబ్బందిని నియమించగా, 1276 మందికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో వారు పోస్టల్ బ్యాలెట్ అవసరం లేకుండా నేరుగా విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. జిల్లాలోని 96 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, వీటిలో ఆసిఫాబాద్‌లో 37, సిర్పూర్లో 59 ఉన్నాయన్నారు. ఆసిఫాబాద్‌లో 28, సిర్పూర్లో 65 మంది వీడియోగ్రాఫర్లు వీడియో చిత్రీకరణ చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. వీరితో పాటు 342 మంది వాలంటీర్లు సైతం ట్యాబ్‌లతో వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు తెలిపారు. వికలాంగులకు సహకరించేందుకు 479 మంది ఆశా, అంగన్వాడీ కార్యర్తలు సాయం అందిస్తారని, వీరిలో ఆసిఫాబాద్‌లో 262, సిర్పూర్లో 270 మంది ఉన్నారన్నారు. వికలాంగులను తరలించేందుకు 464 వీల్చైర్లు అందుబాటులో ఉంచామని, వీటిలో ఆసిఫాబాద్‌లో 252, సిర్పూర్లో 212 ఉన్నాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో తాత్కాలికంగా నీడ వసతి, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే వారికి అవసరమైన ప్రతి సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలు అమలు చేసేందుకు ఇప్పటికే జిల్లాలో ఎంసీఎంసీ కమిటీ పని చేస్తుందన్నారు. ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 583 పోలింగ్ కేంద్రాల పరిధిలో 74 సమస్యాత్మక, వామపక్ష తీవ్రవాదమున్న 60 పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే చెక్‌పోçస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు, గతంలో విధులకు ఆటంకం కలిగించిన వారిని బైండోవర్లు, లైసెన్సు కలిగి ఉన్న ఆయుధాలు డిపాజిట్ చేయించామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సివిల్, ఆర్మ్డ్ ఫోర్స్, హర్యాణా పోలీసులు, ఫారెస్టు, ఆర్టీసీ, లీగల్ మెట్రాలజీ శాఖల నుంచి సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. మొత్తం 1218 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీస్‌శాఖ అన్నిచర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించే పోస్టర్‌ను కలెక్టర్, ఎస్పీ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారి విజయలక్ష్మి, డీపీఆర్వో తిరుమల పాల్గొన్నారు. -
మళ్లీ నోరుజారిన సిద్ధరామయ్య
శివాజీనగర: ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య నోరుజారుతూ చిక్కుల్లో పడుతున్నారు. బీదర్‌లో గతవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక్కరుచుకున్న ఆయన మరోసారి నోరుజారారు. ముఖ్యమంత్రి కుమారస్వామిని మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించి నాలుక్కరచుకున్నారు. సోమవారం నగరంలోని హారోహళ్ళిలో సంకీర్ణ అభ్యర్థి కృష్ణభైరేగౌడ తరఫున ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ నేను ఇంకా అనేకచోట్ల ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉంది, అందుచేత నేను తక్కువగా మాట్లాడుతాను, తరువాత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని వ్యాఖ్యానించారు. వెంటనే ‘మాజీ కాదు, మాజీ కాదు’ అంటూ జనంలో నుంచి కొందరు కేకలు పెట్టారు. తప్పు గుర్తించిన సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని తెలిపారు. సిద్ధు ప్రసంగిస్తూ జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవేగౌడ బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేయాలని ఒత్తిడి ఉండేది. అయితే తుమకూరు ప్రజల కోరిక మేరకు అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా కృష్ణభైరేగౌడను ఎంపిక చేశామని చెప్పారు. కేంద్ర మంత్రి డీ.వీ.సదానందగౌడ నిష్క్రియాపరుడఉ, ఆయన మీకు ముఖం చూపించారా? ఆయనకు ముఖం చూపించే శక్తి లేదు అని విమర్శించారు. అందుచేత మోదీ ముఖం చూసి ఓటు వేయాలని చెబుతున్నారని అన్నారు. ఈలోగా సీఎం కుమారస్వామి ప్రచారానికి వచ్చారు. -
లోకేశ్ పర్యటనలో అపశ్రుతి
తాడేపల్లిరూరల్(మంగళగిరి): ‘ఎల్లప్పుడూ మీ వెంటే’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్న నారా లోకేశ్ మాటలు నీటిమీద రాతల్లా మారాయని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..మంత్రి నారా లోకేశ్ దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో పర్యటిస్తుండగా, అదే గ్రామంలో నివాసం ఉండే సయ్యద్ మస్తాన్, రేష్మా దంపతుల పెద్ద కొడుకైన జహీర్‌బాషాకు టీడీపీ నాయకులు ఐరన్ పైప్ తొడిగి ఉన్న జెండా ఇచ్చి, అది పట్టుకుని వారి కాన్వాయ్ వెంటే రావాలని సూచించారు. ఆ బాలుడు ఆ జెండా పైప్ తీసుకుని లోకేశ్ పర్యటన వెంట వెళ్తుండగా, విద్యుత్ స్తంభంపై ఉన్న కరెంటు తీగలకు జెండా రాడ్ తగిలింది. దాంతో కరెంటు షాక్ కొట్టి ఆ బాలుడు కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. అయినప్పటికీ నారా లోకేశ్ కిందపడిన ఆ బాలుడిని చూసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు తప్ప, కనీసం కిందకు దిగి ఏం జరిగిందని కూడా తెలుసుకోలేదు. అలాగే శుక్రవారం రాత్రి గౌడ సంఘం నాయకులు తమ వీధిలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో వారిపై అక్కడ ఉన్న నారా లోకేశ్ సామాజిక వర్గానికి చెందిన సీబీఎన్ సేన దాడికి పాల్పడింది. లోకేశ్ కనీసం వారిని వారించలేదు. ఓ మైనార్టీ కుటుంబంలోని బాలుడికి కరెంటు షాక్ కొడితే పట్టించుకోలేదని, గౌడ వర్గీయులపై విచక్షణారహితంగా దాడి చేసినా పట్టించుకోకపోవడం ఏమిటంటూ అక్కడి వారు ప్రశ్నించారు. ప్రాణాలు పోయినా అంతేనా అంటూ టీడీపీ నేతలే లోకేశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. -
మంగళగిరిలో లోకేశ్‌కు ఎదురుగాలి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. అయితే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం.. బలమైన ప్రత్యర్థి బరిలో ఉండడంతో ఈ ఎన్నికల్లో లోకేశ్ గెలుపుపై సందేహాలు నెలకొన్నాయి. దీనికితోడు ప్రచారంలో తానుగా చేస్తున్న కామెడీతో లోకేశ్ అభాసుపాలవుతున్నారు. ఇప్పటికే ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై నోరు జారడంతో సామాజిక మాధ్యమాలలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. అదే సమయంలో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. వైఎస్సార్సీపీ వైపే బీసీల మొగ్గు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు మంగళగిరిలో స్థానికంగా బలంగా ఉన్న బీసీలు తమకు టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకత్వం చివరకు మొండిచేయి చూపి అధినేత తనయుడికి సీటివ్వడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం శుక్రవారం మంగళగిరిలో సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇదే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ 2024లో మంగళగిరి స్థానాన్ని బీసీలకే కేటాయిస్తామని, ఈ మేరకు తమ పార్టీ అధినేతను తాను ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడున్న బీసీ సంఘాల నేతలంతా వైఎస్సార్సీపీకి మద్దతు తెలపడంతోపాటు ఆర్కేకు ఓటు వేసి గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు. లోకేశ్‌కు ఝలక్ తప్పదంటున్న బీసీలు ఇదిలా ఉంటే.. నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తరచూ కుప్పం గురించి ప్రస్తావిస్తూ, తన తండ్రిని నాలుగు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆదరించి, విజయాన్ని అందిస్తున్నారని, తాను గెలిస్తే మంగళగిరిని కుప్పంలా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఈ మాట బీసీలంతా పునరాలోచనలో పడేలా చేసింది. ఈ ఎన్నికల్లో లోకేశ్ గెలుపునకు సహకరిస్తే ఆయన ఇక్కడే పాతుకుపోతారని, భవిష్యత్తులో తమకు అవకాశమే లేకుండా పోతుందన్న భావనకు వారు వచ్చారు. ఇప్పటికే మంగళగిరి టికెట్‌ను బీసీలకే కేటాయిస్తామని చివరిదాకా చెప్పిన అధిష్టానం.. ఆఖరు నిమిషంలో లోకేశ్‌ను బరిలోకి దింపడం ద్వారా తమను నమ్మించి మోసం చేసిందని, ఈ పరిస్థితుల్లో లోకేశ్ గెలవకుండా చేసి తమ తడాఖా చూపాలని వారు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నియోజకవర్గంలో దాదాపు రెండున్నర లక్షలకుపైగా ఓటర్లు ఉండగా.. ఇందులో బీసీలు 70 వేల వరకు ఉన్నారు. వీరంతా ఏకతాటిపై నిలచి లోకేశ్‌కు మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బుల కట్టలతో గెలవాలని ప్రయత్నం.. నారా లోకేశ్ ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తున్నారు. ఏదేమైనా లోకేశ్‌ను గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు వెనుకాడట్లేదు. ఇందులో భాగంగా భారీ ఎత్తున డబ్బులు దింపేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం తనయుడు కావడంతో డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. శుక్రవారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకోసం ఒక్కో ఓటుకు రూ.4 వేల చొప్పున డబ్బులు పంచడం ఇందుకు నిదర్శనం. అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఆయన్ను నిలువరించేందుకు నానా తంటాలు పడుతున్న టీడీపీ నేతలు భారీ మొత్తంలో డబ్బు దించయినా గెలవాలని గట్టి పన్నాగంలో ఉన్నట్టు కనిపిస్తోంది. -
విజయనగరం, బొబ్బిలి రాజులను నమ్మొద్దు
చీపురుపల్లి: విజయనగరం, బొబ్బిలి రాజులను నమ్మొద్దని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రజలను కోరారు. పట్టణంలోని జి.అగ్రహారంలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించిన అనంతరం ఆంజనేయ విగ్రహం, రావిచెట్టు వద్ద నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ ..పదవులు పొంది కోటల్లో, ఢిల్లీలో కూర్చుని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయనగరం ఎంపీగా 2014లో అశోక్‌గజపతిరాజును గెలిపిస్తే ఢిల్లీలో కూర్చుని జిల్లా ప్రజలను మరిచి పోయారన్నారు. టీడీపీ హయాంలోనే ఆర్ఈసీ ఎస్కి అవినీతి మరకలు అంటుకున్నాయని మండిపడ్డారు. 5 ఏళ్లలో 500 హామీలిచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని బాబుపై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అత్యంత సామాన్యుడైన, అందరికీ అందుబాటులో ఉండే బెల్లాన చంద్రశేఖర్‌ను ఎంపీగా నిలబెట్టారని, నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన బొత్స సత్యనారాయణను ఎమ్మెల్యేగా నిలబెట్టారని, వీరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, ఇప్పిలి తిరుమల, పతివాడ రాజారావు, కర్రోతు ప్రసాద్, కోసిరెడ్డి రమణ, కరణపు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లు దోపిడీ చేశారు
ఆమదాలవలస: ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అన్నింటా దోపిడీ చేసిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధి 13వ వార్డు తవిటినాయుడు క్వార్టర్స్, విద్యానగర్, కిల్లివారి క్వార్టర్స్, కాలేజీ వీధి, చంద్రయ్యపేట, కొత్తకోటవారివీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన రావాలంటే జగనన్న సీఎం కావా లని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జె.జె.మోహన్‌రావు, కిల్లి లక్ష్మణరావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎ. ఉమామహేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, మాజీ చైర్పర్సన్ బొడ్డేపల్లి రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు బొడ్డేపల్లి అజంతాకుమారి, పొన్నాడ కృష్ణవేణి, దుంపల శ్యామలరా వు, డి.చిరంజీవిరావు, మరాఠి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి పొందూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి జగనన్నను సీఎం చేయాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ కోరారు. పొందూరు గ్రామంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కోరుకొండ సాయికుమార్, గాడు నాగరాజు, అనకాపల్లి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. బూర్జ: మండలంలోని సింగన్నపాలెం, లచ్చయ్యపేట గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, యువజన విభాగం అధ్యక్షుడు గుమ్మడి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బెజ్జిపురం రామారావు ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాంను, శ్రీకాకుళం ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేపారి లక్ష్మీనారాయణ, జల్లు అప్పలస్వామినాయుడు, బగాది నారాయణమూర్తి, ఎంపీటీసీలు బూరి శ్రీరామమూర్తి, గేదెల ముఖలింగం, జడ్డు మహేష్, నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘హస్తిన’.. ఎవరి హస్తగతమవునో..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందోననే అంశం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నిరసనలు, ఉద్యమాలకు నెలవు, భారత రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే రాజధాని నగరంలో గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డడానికి అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ మళ్లీ అదే ఫీట్‌ను నమోదు చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన ఆప్ ఎంపీ సీట్లనూ తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన హస్తం పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని పొందే దిశగా వ్యూహాలు పన్నుతోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న త్రిముఖ పోరులో గెలిచి మురిసేదెవరో..! రాజకీయ చరిత్ర ఢిల్లీ 1990 వరకూ హస్తం పార్టీకి కంచుకోటగా ఉండేది. 90ల తరువాత రాజధానిలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1991లో కాషాయ పార్టీకి హస్తిన ప్రజలు పట్టం కట్టారు. తదనంతర కాలంలో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిపత్యం మారుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి ఢిల్లీ కోటలో పాగా వేసింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ షీలా దీక్షిత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చి ఘనవిజయం సాధించింది. దూసుకొచ్చిన బీజేపీ కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉన్న ఢిల్లీలో 1991 పార్లమెంట్ ఎన్నికల్లో లాల్ కృష్ణ అద్వానీ సారథ్యంలోని బీజేపీ విజయ దుందుభి మోగించింది. 40.2శాతం ఓట్లతో బీజేపీ 5సీట్లు గెలుచుకోగా, 39.6శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది. మళ్లీ వికసించిన కమలం బీజేపీ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తన పట్టును నిలుపుకుంది. ఈసారి 49.6శాతం ఓట్లతో మళ్లీ 5సీట్లను గెలుచుకొని, కాంగ్రెస్‌ను ద్వితీయ స్థానానికి నెట్టింది. 37.3శాతం ఓట్లను హస్తం పార్టీ గెలుచుకోగలిగింది. 1998లో జరిగిన ఎలక్షన్లలో వాజ్‌పేయి హయాంలోని కమల దళం 50.7శాతం ఓట్లతో 6సీట్లలో విజయ బావుటా ఎగురవేసింది. 42.6శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒక సీటుకే పరిమితమైంది. కమలం క్లీన్‌స్వీప్ 1991 నుంచి చిక్కిన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన కాషాయ పార్టీ 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తూ 51.7శాతం ఓట్లతో 7సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ రెపరెపలు దాదాపు దశాబ్దం కాలంపాటు సాగిన బీజేపీ ఆధిపత్యానికి చెక్‌పెడుతూ సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004లో 54.8శాతం ఓట్లను సాధించి 6సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ అన్ని సీట్లనూ(7) తన వశం చేసుకుంది. బీజేపీ గెలుపు ఢంకా 2014 సార్వత్రిక ఎన్నికల్లో 3జీ స్కాం, కుంభకోణాలు, పలు అవినీతి ఆరోపణలతో దేశమంతా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచింది. ఎగ్జిట్‌పోల్స్ ముందే చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ 46.6శాతం ఓట్లతో 7సీట్లలో గెలుపు నగారా మోగించింది. -
స్థానిక సమరం.. గరం గరం
సాక్షి, దమ్మపేట: పంచాయతీ పోరు మరవక ముందే స్థానిక సమరం మొదలవనుంది. మండల, జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎంపీపీ, జిల్లాపరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు త్వరగా ఖరారవడంతో మండల, జిల్లాపరిషత్ ఎన్నికల వైపు అందరి దృష్టి మళ్లింది. 2011 జనాభా లెక్కలు, కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు, గ్రామ పంచాయతీలు కలిసొచ్చేలా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. నియోజకవర్గంలో కొన్ని చోట్ల మాత్రమే ఎంపీటీసీ స్థానాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలో 58 ఎంపీటీసీ స్థానాలు అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో మొత్తం 58 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో మండలాల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా చండ్రుగొండ మండలం నుంచి అన్నపురెడ్డిపల్లిని విభజించి మండలంగా ఏర్పాటు చేశారు. దమ్మపేట మండలం జమేదార్ బంజర్ ఎంపీటీసీ స్థానాన్ని లింగాలపల్లి కేంద్రంగా చేశారు. అశ్వారావుపేట మండలంలోని బచ్చువారిగూడెం ఎంపీటీసీ స్థానంలో గాండ్లగూడెం పంచాయతీని కలపవద్దని అక్కడ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెంలోని ఒక ఎంపీటీసీ స్థానాన్ని తొలగించి రాజాపురంలో కలపాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. దాన్ని ఆ స్థానం పరిధిలోని ఊటుపల్లి గ్రామస్తులు వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలగించిన స్థానాన్ని గుంపెనలో కలపాలని ఊటుపల్లి వాసులు కోరారు. ఆ రెండక అభ్యంతరాలు మాత్రమే అధికారులకు అందాయి. ఎస్సీ, బీసీలకు దక్కని రిజర్వేషన్లు ఈసారి ఎంపీటీసీల రిజర్వేషన్లలో ఎస్సీలు, బీసీలకు ఎక్కడా అవకాశం కల్పించలేదు. దీంతో వారి గొంతు మండల పరిషత్ సమావేశాల్లో వినపడదు. దీంతో ఆయా సామాజిక వర్గాలకు చెందినవారు జనరల్ స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అశ్వారావుపేట మండలంలో ఒక్క స్థానం మాత్రమే ఎస్సీలకు రిజర్వయింది. ఎంపీటీసీల రిజర్వేషన్ల విషయంలో తమకు జరిగిన అన్యాయంపై ఆందోళనకు దళిత, బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎంపీపీల రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో కొందరికి అనుకూలం, మరికొందరికి ప్రతికూలంగా మారాయి. ఇప్పటికే ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలపై గంపెడాశతో ఉన్న నాయకులకు ఈ రిజర్వేషన్లు నిరాశపరిచాయి. 58 ఎంపీటీసీ స్థానాలకుగాను జనరల్‌కు 29 కేటాయించారు. ఎస్టీలకు 28 స్థానాలు రిజర్వయ్యాయి. అశ్వారావుపేట మండలంలో ఒక స్థానం మాత్రమే ఎస్సీలకు రిజర్వయింది. ఎంపీపీ రిజర్వేషన్ల విషయానికొస్తే అశ్వారావుపేట మాత్రమే జనరల్‌కు వెళ్లింది. దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాలు ఎస్టీ జనరల్‌కు, ములకలపల్లి, చంద్రుగొండ మండలాలు ఎస్టీ మహిళలకు రిజర్వయ్యాయి. జడ్పీటీసీల విషయంలో ఎస్టీలకు ములకలపల్లి స్థానం రిజర్వయింది. దమ్మపేట, చంద్రుగొండ మండలాలు జనరల్‌కు వెళ్లాయి. అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి మండలాలకు జనరల్ మహిళలకు కేటాయించారు. జనరల్‌కు కేటాయించిన జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోని ఎంపీటీసీ స్థానాలు ఇవే.. అశ్వారావుపేట 17 దమ్మపేట 17 ములకలపల్లి 10 చంద్రుగొండ 08 అన్నపురెడ్డిపల్లి 06 -
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విషయంలో తనకు కొన్ని అభ్యంతరాలున్నాయన్నారు. టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని తెలిపారు. టీడీపీలో ప్రస్తుతం ఉన్న 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని చెప్పారు. ఇక సరిహద్దుల్లో పరిస్థితులు ఇలానే ఉంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. -
సరిహద్దులో యుద్ధమేఘాలు: సీఈసీ కీలక వ్యాఖ్యలు
లక్నో: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉండొచ్చంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. దేశంలో ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తామని, వాయిదా వేసే ఆలోచనే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన సునీల్ అరోరా శుక్రవారం లక్నోలో అక్కడి అధికారులతో సమీక్ష సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల నిబంధనల్లో కొత్తగా కొన్ని మార్పులను ప్రతిపాదించామని సునీల్ అరోరా చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తులను కూడా చూపాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఇచ్చే ఆస్తుల వివరాలపై ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుందని, తేడాలు వస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆస్తుల వివరాలన్నింటినీ తాము అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తామని, ఆదాయపు పన్ను శాఖ సుమోటోగా ఆస్తుల వివరాలను పరిశీలిస్తుందని తెలిపారు. దీనికోసం తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా రాదని చెప్పారు. త్వరలో తాము సీ-విజిల్ యాప్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నామని, దీనిద్వారా అభ్యర్థులపై ప్రజలు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా, విధ్వేషపూరితమైన ప్రసంగాలపై నిఘా ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. గత ఎన్నికల ప్రచారంలో కొన్ని కేసులను నమోదు చేశామని గుర్తుచేశారు. ఇలాంటి ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని అన్నారు. తమ దృష్టికి వచ్చిన విధ్వేష పూరిత ప్రసంగాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీల పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెడతామని చెప్పారు. పెయిడ్ ఆర్టికల్స్ లపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. -
మరో చాన్స్
సాక్షి, సంగారెడ్డి: అర్హులై ఉండి ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం ఈ నెల 2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనున్నారు. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్ల నమోదుకు దరఖాస్తు స్వీకరిస్తారు. గత నెల 22న రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ 2019లో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఓటరు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరాలను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు కావడానికి ఫాం–6 దరఖాస్తులను అక్కడికక్కడే పూర్తి చేసి బీఎల్ఓలకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 6,7,8, 8ఏ దరఖాస్తులనూ అందుబాటులో ఉంచుతారు. ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. జిల్లాలో 11,99,713 మంది ఓటర్లు.. గత నెల 22న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా మేరకు జిల్లాలో మొత్తం 11,99,713 మంది ఓటర్లు ఉన్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తగా ఓటర్ల నమోదుతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత 55,953 మంది అదనంగా ఓటర్ల జాబితాలో చేరారు. జిల్లాలో అందోలు, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితాను పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలకు అందుబాటులోకి ఉండేలా ఆయా మండలాల తహసీల్దార్లు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని వారు అసంతృప్తిగా ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పిస్తూ ప్రకటన చేయడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఎన్నికల కమిషన్ సూచించిన ఫిబ్రవరి 4 వరకు 18 సంవత్సరాలు నిండకుండా కొన్ని రోజులు తక్కువ ఉన్న వారికి కూడా ఈ అవకాశం కలిసి వచ్చినట్లయింది. 5 వరకు దివ్యాంగులకు అవకాశం.. ఓటర్ల నమోదు పొడిగింపుతో గత నెల 27 నుంచి మార్చి 5 వరకు దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఆయా మండల కేంద్రాల్లో దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌ల వద్ద వీరికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓటరు నమోదు సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఎంతమంది దివ్యాంగులు ఓటర్లుగా ఉన్నారనే విషయం స్పష్టం కానుండడంతో పోలింగ్ సమయంలో వీరికి వీల్చైర్లు, తదితర సౌకర్యాలను కల్పించేందుకు సులువుగా ఉంటుందని ఎన్నికల సంఘం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులు నమోదు చేసుకోవాలి ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు చేసేం దుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నందున అర్హులైన యువతీ, యువకులు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. పోలింగ్ బూత్‌ల వద్ద రెండు రోజులపాటు బూత్ లెవల్ అధికారు లు (బీఎల్ఓలు) అందుబాటులో ఉంటారు. ఓటు నమోదు దరఖాస్తులు కేంద్రాల వద్ద అ ందుబాటులో ఉంటాయి. అర్హులైన వారు ఆధార్ కార్డు, ఫొటోతో ఫాం–6ను పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలి. ఓటర్ల జాబి తాలో నమోదు చేసుకునే వారికి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. – శ్రీను, రెవెన్యూ డివిజనల్ అధికారి, సంగారెడ్డి -
చేవెళ్ల టికెట్ ఎవరికో..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. రాజకీయ ఉద్ధండులు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్‌సీట్‌గా మారిన ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీచేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇస్తే కదనరంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గులాబీ ఖాతాలో ఉండడంతో ముఖ్యనేతలు ఈ సీటుపై దృష్టిసారించారు. మొన్నటి వరకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అని విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి మరో అభ్యర్థి తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నేత, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం అవకాశమిస్తే చేవెళ్ల నుంచి బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నించినా ఆయనకు దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో స్వామిగౌడ్ వెనక్కితగ్గారు. ఈ సమయంలో ‘భవిష్యత్‌లో చూద్దాం’ అని స్వామిగౌడ్‌కు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే ధీమాతో చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘పట్నం’కు దక్కేనా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగి ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ స్థానం తనకేనని సంకేతాలిస్తున్న ఆయన.. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క గులాబీ గూటి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొండా కూడా బలమైన నేత కావడంతో టీఆర్ఎస్ నుంచి పటిష్ట క్యాడర్ ఉన్న మహేందర్‌రెడ్డినే బరిలోకి దించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో స్వామిగౌడ్ పేరు తెరమీదకు రావడంతో టికెట్ కోసం పోటీ తప్పేలా లేదు. టికెట్ కేటాయింపుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నేతకు హామీ ఇచ్చినట్లు మహేందర్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చేవెళ్ల టికెట్ అధికార పార్టీ నుంచి ఎవరికి దక్కుతుందో అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. -
టీపీసీసీ టు ఏఐసీసీ!
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న నాయకుల జాబితా సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తామని, తమకు టికెట్ కేటాయించాలను కోరుతూ పలువురు టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి పేర్లను వడబోసిన తర్వాత ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం కుదించింది. ఆ తర్వాత ఆ జాబితాను జాతీయ నాయకత్వానికి పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, భువ నగిరి లోక్‌సభ స్థానాలకు పోటీపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆశావహుల జాబితా టీపీసీసీ నుంచి ఏఐసీసీకి చేరినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలకు విపరీతమైన పోటీ ఉండగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర నాయకత్వం జాబితాను పలుమార్లు స్క్రూట్నీ చేసి సిద్ధం చేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లాలోని రెండు స్థానాల్లో పోటీచేయగా, భువనగిరిలో ఓట మి పాలై, నల్లగొండను చేజిక్కించుకుంది. ఆ పార్టీ తరఫున గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అధికార టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో రెండు నియోజవర్గాల్లో కాం గ్రెస్‌కు ఎంపీలు లేకుండా అయ్యారు. దీంతో ఈసారి ఎన్నికల్లో రెండు స్థానాలూ కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఈ కారణంగానే రెండు స్థానాలకూ బాగా పోటీ ఏర్పడింది. టికెట్ రేసులో ‘మాజీ’ ఎమ్మెల్యేలు! డిసెంబర్లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన తొమ్మిది చోట్ల ఓటమి పాలైన పార్టీ సీనియర్లు కొందరు లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షిం చుకోవాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంనుంచి పోటీ చేస్తానని అందరికన్నా ముందుగానే మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పేరు కూడా తెరపైకి వచ్చింది. సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్‌రెడ్డి కూడా టికెట్ రేసులోకి వచ్చారు. మరోవైపు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పేరును కూడా పీసీసీ నాయకత్వం ఢిల్లీకి పంపిన జాబితాలో చేర్చిందని చెబుతున్నారు. రఘువీర్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. కానీ, ఆ టికెట్ ఆయనకు దక్కకపోవడంతో ఈసారి నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంనుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరిగిందని చెబుతున్నారు. అదే మాదిరిగా, భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సూర్యాపేటకు చెందిన మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి పార్టీ నాయకత్వానికి సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన సూర్యాపేట అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన విషయం తెలిసింది. గత ఎన్నికల సమయంలోనే ఆయన భువనగిరి నుంచి తన తనయుడు సర్వోత్తమ్ రెడ్డికి టికెట్ కోసం ప్రయత్నించారు. ఈసారి ఆయనే రేసులోకి వచ్చారని అంటున్నారు. ఇదే స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ కూడా ఇక్కడినుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరందరి పేర్లతో ఒక జాబితాను టీపీసీసీ సిద్ధం చేసి ఏఐసీసీకి పంపించిందని సమాచారం. యువతకు అవకాశం ఇవ్వాల్సిందే..? మరోవైపు ఈ ఎన్నికల్లో పార్టీలోని యువకులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. భువనగిరి నుంచి ఆ పార్టీ యువజన విభాగం జాతీయ కమిటీ లో పనిచేసిన చామల కిరణ్‌కుమార్ రెడ్డి టికెట్ ఆశించారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాకు దరఖాస్తు కూడా ఇచ్చారు. అదే మాదిరిగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు కూడా దరఖాస్తు ఇచ్చారు. పార్టీకి జవసత్వాలు రావాలంటే యువరక్తానికి అవకాశాలు ఇవ్వాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకత్వం కూడా తీర్మానించి ఈ మేరకు జాతీయ యువజన కాంగ్రెస్ నాయకత్వానికి పంపించినట్లు సమాచారం. గురువారం పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం జరిగింది. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కేశవ్ చంద్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షుడు బి.వి శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జ్ జెబి మాథుర్, తెలగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్‌లో పనిచేసి, ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న చామల కిరణ్‌కుమార్ రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతూ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాం ధీకి చామల కిరణ్‌కుమార్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ తీర్మానం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రెండు టికెట్లను యువజన కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలని కోరుతున్నారని, అందులో భువనగిరి ఒకటని అంటున్నారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ దక్కుతుం దో చెప్పలేమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కసరత్తు కొలిక్కి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో లోక్‌సభ ఎన్నికల హడావిడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆలస్యం చేసిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఫలితాల్లో కోలుకోలేని దెబ్బతిన్న ఆ పార్టీ ఈసారి ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశాలుండడంతో ఈసారి అధికార టీఆర్ఎస్ పార్టీ కంటే ముందే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ కమిటీల ద్వారా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన పార్టీ అధిష్టానం, టీపీసీసీ నేతలతో కలిసి వచ్చిన దరఖాస్తులను వడబోసింది. ఈ క్రమంలో ఈ నెల 27న ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి ఇద్దరేసి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీ ఎంపి క చేసిన అభ్యర్థుల పేర్లను కేం ద్ర ఎన్నికల కమిటీకి పంపి.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశాల తో మరో రెండ్రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో తమకే టికెట్ వస్తుందనే ఆశతో ఉన్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పోటెత్తిన దరఖాస్తులు లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తీవ్రమైన పోటీ నెలకొంది. జిల్లా కా>ంగ్రెస్ కమిటీ ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి నుంచి 11, నాగర్‌కర్నూల్ నుంచి 36 దరఖాస్తులు వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ సీనియార్టీ, ఫాలోయింగ్‌తో పాటు ఒకవేళ ఓడినా పార్టీలోనే ఉంటారా? లేదా? అనే అంశాలపై సుదీర్ఘ అధ్యయనం చేసిన డీసీసీ మహబూబ్‌నగర్ నుంచి ఆరుగురిని, నాగర్‌కర్నూల్ నుంచి ఐదుగురిని ఎంపిక చేసి పీసీసీకి నివేదిక అందజేసింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆశావహుల పనితీరునే ప్రామాణికంగా తీసుకుని టికెట్లు ఖరారు చేయాలని భావిస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో పోటీకి సిద్ధమవుతోన్న ఆశావహుల్లో చాలా మంది సీనియర్లు కావడంతో వారిలో ఒకరిని ఎంపిక చేయడం స్క్రీనింగ్ కమిటీకి సవాల్‌గా మారింది. ఇద్దరేసి చొప్పున ఎంపిక.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రెండు నియోజకవర్గాలకు ఇద్దరేసి నాయకులతో షార్ట్ లిస్టును తయారు చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, శక్తి యాప్ జిల్లా కో–ఆర్డినేటర్ సంజయ్ ముదిరాజ్, కల్వకుర్తికి చెందిన బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్, బాలానగర్‌కు చెందిన యువ నాయకుడు అనిరుధ్‌రెడ్డి, కేవీన్రెడ్డిలను ఎంపిక చేసిన డీసీసీ టీపీసీసీకి అందజేసింది. వీరిలో చిత్తరంజన్‌దాస్ పోటీకి విముఖత చూపుతున్నట్లు తెలిసింది. కాగా, వంశీచందర్కే దాదాపు టికెట్ ఖరారవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ నంది ఎల్లయ్య, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవితో పాటు సతీష్ మాదిగ పేర్లు టీపీసీసీకి అందాయి. కానీ ఈ నెల 27న జరిగిన సమావేశంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, వంశీచందర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ స్ధానం నుంచి సంపత్‌కుమార్, మల్లురవి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇదీలావుంటే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య సైతం మళ్లీ బరిలో నిలవాలనే పట్టుతో ఉన్నట్లు సమాచారం. -
ఎంపీ టికెట్ ఎవరికో!
సాక్షిప్రతినిధి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిందని భావించిందో ఏమో.. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ముందుగానే కసరత్తు మొదలెట్టింది. లోక్‌సభ ఎన్నికల కోసం త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు ఆశావహుల నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీల ద్వారా టీపీసీసీ ఎన్నికల సంఘం దరఖాస్తులను స్వీకరించింది. చాలా మంది డీసీసీలకే దరఖాస్తు చేసుకోగా... కొందరు నేరుగా టీపీసీసీ, ఏఐసీసీలకు 20వ తేదీ వరకు తమ అభ్యర్థనలను పంపుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 77కు చేరింది. కాగా అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు వచ్చిన దరఖాస్తులపై మంగళవారం టీపీసీసీ ఎన్నికల సంఘం హైదరాబాద్ గాంధీభవన్‌లో మూడు గంటలకు పైగా కసరత్తు చేసింది. ఒక్కో నియోజకరానికి రెండు నుంచి ఐదు పేర్లను హైకమాండ్ పరిశీలనకు పంపిన టీపీసీసీ ఎన్నికల సంఘం... వరంగల్ నుంచి ముగ్గురు, మహబూబాబాద్ నుంచి ఇద్దరి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. హైకమాండ్‌కు ఇద్దరు నుంచి ఐదుగురు పేర్లు.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు డీసీసీల నుంచి అందిన జాబితాలను కూడా కీలకంగా భావించారు. ఈ మేరకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు భరత్‌చంద్రారెడ్డి, జనగామకు రాఘవరెడ్డిలను నియమించారు. ఈ కమిటీల ద్వారా వరంగల్ లోక్‌సభ స్థానం కోసం వచ్చిన 34 దరఖాస్తులు, మహబూబాబాద్ కోసం వచ్చిన 43 దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలన కోసం పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేసిన ఎన్నికల కమిటీ వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా వరంగల్ కోసం గత ఎన్నికల్లో ఓటమి చెందిన సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, ఇందిర, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మానవతారాయ్‌లతో పాటు 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహబూబాబాద్ కోసం మాజీ ఎంపీ పోరిక బలరామ్‌నాయక్, బెల్లయ్యనాయక్‌లతో పాటు 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారం.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత తొందరలో ఏఐసీసీ ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇందుకోసం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క తదితరుల ఎన్నికల కమిటీ మంగళవారం సుమారు మూడు గంటలకు పైగా కసరత్తు చేసిందన్నారు. వరంగల్, మహబూబాబాద్ స్థానాల కోసం 77 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ... వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి ఇద్దరు పేర్లను ఈ కమిటీ ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. ఈ జాబితాపైనా మరోమారు చర్చించిన అనంతరం అభ్యర్థుల ప్రకటనపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రక్రియంతా పూర్తి చేసి ఈ నెలాఖరులో గాని, మార్చి మొదటి వారంలో గాని అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీనియర్లకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. -
‘లోక్‌సభ’కు కసరత్తు
సాక్షి, వరంగల్ రూరల్: లోకసభ ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు, జనవరిలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా అధికార యంత్రాం గం లోకసభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే మొదటి దఫా ఈవీఎంల పరిశీలన పూర్తయింది. వివిధ రాజ కీయ పార్టీ నాయకుల సమక్షంలో ఈవీఎంలను అధికారులు పరిశీలించారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు లోకసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ లోకసభ పరిధిలో, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం మే నెలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు ఓటు హక్కు నమోదు చేయించుకునే అవకాశం కల్పించింది. మొదట జనవరి 25వరకు ఓటు నమోదు చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించగా దానిని ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4 వరకు ఓటరు నమోదు చేసుకున్న తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది జాబితాలను సైతం జిల్లా యంత్రాంగం ప్రకటించారు. అలాగే మార్చి 2, 3వ తేదీల్లో ఓటరు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. వీవీ ప్యాట్లపై అవగాహన.. ప్రజల్లో వీవీ ప్యాట్‌పై అవగాహన కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 16 మండలాలకు ఒక్కో మండలం మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనంలో వీవీ ప్యాట్లను ఉంచుతున్నారు. ఈ మొబైల్ వాహనాన్ని సోమవారం కలెక్టర్ హరిత ప్రారంభించారు. రోజుకు ఒక్క గ్రామం చొప్పున నెల రోజుల పాటు గ్రామాల్లో తిరిగి వీవీ ప్యాట్లపై అవగాహనతోపాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించనున్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు కమిటీలు.. జిల్లాలో లోకసభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో 20 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఒక్కో జిల్లా అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఈ కమిటీలు కృషి చేయనున్నాయి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు విడుదలయ్యే వరకు కమిటీలు పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఆయా కమిటీలతో నిత్యం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. -
పార్లమెంటు ఎన్నికలపై టీఆర్ఎస్ కసరత్తు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : లోక్‌సభ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ ముందస్తు ఏర్పాట్లలో బిజీగా ఉంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎదుటి పక్షం బలాబలాలను అంచనా వేయడంలో మునిగిపోయింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు పూర్తిగా టీఆర్ఎస్కే అనుకూలంగా వెలువడ్డాయి. ఒక్కో పార్లమెంటు నియోజకర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ టీఆర్ఎస్ స్థానాలు ఖాతాలో చేరాయి. ఉమ్మడి నల్లగొండకు సంబంధించి నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, భువనగిరి నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌కు మళ్లీ టికెట్ ఖాయమని చెబుతున్నారు. దీంతో ఇక్కడ కొత్తగా అభిప్రాయ సేకరణ, పరిస్థితిపై అంచనాకు రావాల్సిన అవసరం అంతగా లేదని తెలుస్తోంది. కానీ, గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన నల్లగొండపై పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉందని పేర్కొంటున్నారు. దీంతో ఈ స్థానంలో ఈసారి ఎలాగైనా గెలిచి తీరేలా వ్యూహాన్ని రచిస్తోందని సమాచారం. ప్రస్తుత నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నా.. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ నుంచి. దీంతో ఈ సారి టీఆర్ఎస్ గుర్తుపైనే ఇక్కడ విజయం సాధించాలన్న కసి పార్టీ అగ్రనాయకత్వంలో ఉంది. దీంతో ఈ స్థానం నుంచి సీఎం కేసీఆర్ కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, కేసీఆర్ పోటీ చేస్తారని కానీ, చేయరని కానీ ఇద్దమిద్దంగా చెప్పే పరిస్థితిలో పార్టీ వర్గాలు లేవు. ఈ కారణంగానే ఎరు పోటీ చేసే అవకాశం ఉంటుందన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతుండగా, మరో వైపు పార్టీ అధినాయకత్వం మాత్రం నల్లగొండ ఎంపీ స్థానంపై తన వ్యూహంలో తనుందని అంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడం.. ఎవరు అభ్యర్థి అయితే గెలుపు తేలికవుతుంది..? వంటి వివరాల సేకరణ కోసం ఆ నాయకత్వం ఒక సర్వే జరిపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రహస్య సర్వే ? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. నల్లగొండ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ పూర్తి ఆధితప్యం ప్రదర్శించింది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో హుజూర్నగర్ మినహా ఆరు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొత్తంగా వారందరి మెజారిటీ లక్ష ఓట్లకు పైగానే ఉంది. ఇదే ఫలితం పునరావృతం అయితే.. ఎంపీ స్థానంలో గెలుపు టీఆర్ఎస్కు నల్లేరుపై నడకే కానుంది. కానీ, టీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే ప్రత్యర్థిని బట్టి పోటీ ఉండే వీలుంది. దీంతో చాలా ముందస్తుగానే అభ్యర్థి ఎవరైతే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు, ఓ అంచనాకు వచ్చేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ రహస్యంగా ఓ సర్వే జరిపించారని తెలిసింది. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, ఎన్ఆర్ఐ జలగం సుధీర్ టికెట్ ఆశావహుల్లో ఉన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ ఇక్కడినుంచి పోటీ చేస్తే ఇక, ఎలాంటి శషబిషలు లేవు. మరోవైపు గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచే పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరో మారు నల్లగొండ నుంచి ఎంపీ స్థానంలో పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అధినేత ఆదేశిస్తే.. ప్రస్తుతం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పోటీ చేయరని చెప్పలేమన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. వీరందరిలో ఎవరు ఎంపీ అభ్యర్థి అయితే మెరుగ్గా ఉంటుందో తెలుసుకునేందుకు పార్టీ అగ్రనాయకత్వం ఒక సర్వే జరిపించిందని సమాచారం. ముందుగా ఇద్దరు నాయకుల పేర్లతో నియోజకవర్గంలో సర్వే జరిగిందని చెబుతున్నారు. మార్చి 11వ తేదీన నల్లగొండలో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లోగా సర్వేలపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
లోక్‌సభకు రెడీ!
సాక్షి, నాగర్‌కర్నూల్: పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాచాటిన అధికార టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో అపజయాన్ని చవిచూసిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం చేయడం వల్లే ఓటమి చెందడానికి ఒక కారణమని ఏఐసీసీ దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. టీఆర్ఎస్ సైతం అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగించాలన్న ఉద్దేశంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ముందుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలలోని నేతల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను సమీక్షించి సమన్వయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతె కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలతో పాటు పార్టీ సీనియర్ నేతలు లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుసమాచారం. మహబూబ్‌నగర్ స్థానానికి మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి డీకే అరుణ, రేవంత్‌రెడ్డి పోటీలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, వంశీచంద్‌రెడ్డి కూడా బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానాన్ని వరుసగా రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ వరుసగా కైవసం చేసుకుంది. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య వయోభారం వల్ల మళ్లీ పోటీలో ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మల్లురవితో పాటు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సతీష్ మాదిగ, డాక్టర్ అనురాధ, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ చెన్నయ్య తదితరులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ స్థానానికి 36 మంది, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు 11మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం కొల్లాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన నేతలనే రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతి పార్లమెంట్ స్థానానికి ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి షార్ట్లిస్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపనున్నట్లు తెలిసింది. ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ప్రజల్లోకి వెళ్లాలనే ముందస్తు వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. టీఆర్ఎస్ కసరత్తు పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. గెలుపే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటినట్లుగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో విజయం సాధించి తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ముందుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించడంతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గంలో విభేదాలున్న నేతల మధ్య సమన్వయం కుదర్చడంపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఈనెల 6వ తేదీన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం వనపర్తిలో నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మహబూబ్‌నగర్ పార్లమెంట్ ని యోజకవర్గ సన్నాహక సమావేశం ఈనెల 11న మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తారు. ఈ రెండు సమావేశాలు కూడా మంత్రుల నేతృత్వంలో నిర్వహించనున్నారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ సన్నాహక సమావేశం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో, మహబూబ్‌నగర్ సన్నాహక సమావేశం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. రెండు సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఈవీఎం, వీవీ ప్యాట్లను సిద్ధం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల తనిఖీ, ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. నాగర్‌కర్నూల్‌కు సంబంధించి సోమవారం కలెక్టర్ శ్రీధర్ 15బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, నోడల్ అధికారులను నియమించారు. మరోవైపు మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణకు ఢిల్లీ వెళ్లి వచ్చారు. -
వైఎస్ జగన్‌ను గెలిపించాలని పవన్‌ను కోరిన రైతు
-
వైఎస్ జగన్‌ను గెలిపించాలని పవన్‌ను కోరిన రైతు
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటించారు. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయిన అధోని పత్తి మార్కెట్ యార్డులో రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. రైతుల కష్టాలు ఏంటో చెబితే విందామని.. ఓ రైతును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పవన్ మైక్ ఇచ్చారు. అనంతం అక్కడున్న వారందరిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. 'ఒక్క నిమిషం. మీ అందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు. నేను ఇక్కడికి వచ్చింది మన రైతుల సమస్యలు వినడానికి. మీ భవిష్యత్తు కోసమే. రైతనేవాడే లేకపోతే, మన భవిష్యత్తు ఉండదు. ఒక్కసారి మీకోసమే వచ్చాను కాబట్టి రైతుల కష్టాలను విందాం' అని రైతును మాట్లాడమన్నారు. 'కోతకు సిద్దంగా ఉన్న పత్తిపంట వర్షం రావడంతో నానిపోయింది. పశువులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. పశువులు లేనది ప్రపంచం లేదు. ఏ ఉద్యోగస్తులు లేరు' అని రైతు తన బాధలు చెప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భజం పై చేయి వేసి మరీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డినిగనుక గెలిపిస్తే.. మీరు, నేను ఆయన్ని బతిమిలాడైనా రైతులకు ఏం కావాలో అవి ఇప్పిస్తా అని ధీమాగా చెప్పారు. ఆయన మాటలకు ఆ సభకు వచ్చిన వారందరూ హర్షధ్వానాలు చేయగా, రైతు నోటివెంట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరురాగానే పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ తొత్తురపాటుకు గురయ్యారు. మీరు దయ చేసి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని రైతు అక్కడున్న వారిని కోరగా, పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ మొహం చిన్నబోయింది. రైతు మాట్లాడటం ఆపకపోవడంతో .. ఇక చేసేదేమీ లేక మైకు తీసుకుని .. పక్కనే ఉన్న నాదేండ్ల మనోహర్‌కు ఇచ్చారు. అప్పటికీ రైతు మాట్లాడుతూ ఉండటంతో చేసేదేమీ లేక ఇంకా ఎవరైనా మాట్లాడతారా అంటూ పవన్ ఇతరులను కోరారు. -
పార్లమెంటు పోరుకు.. సమాయత్తం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రెండు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం తయారు చేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగా ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకుల్లో కదలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా మార్చి నెలలో ‘పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక కమిటీ సమావేశాలు’ జరపాలని నిర్ణయించింది. జిల్లాలోని భువనగిరిలో మార్చి 2వ తేదీన, నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సమావేశాన్ని 11వ తేదీన జరపనున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. ఊపును కొనసాగించేలా.. గతేడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ముందుస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క హుజూర్నగర్ మినహా మిగిలిన సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడెం, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. ఇదే ఊపును వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించేలా వ్యూహరచన చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ స్థానంలో విజయం సాధించగా, నల్లగొండలో మాత్రం ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావాల్సివచ్చింది. ఈ సారి ఆ పరిస్థితి తలెత్తకుండా ముందుగానే అప్రమత్తమవుతోంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం రెండు వేల మందిని, సమావేశం జరగనున్న నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి అదనంగా మరో వెయ్యి మందిని కలిపి మొత్తంగా 15వేల మందితో సన్నాహక కమిటీ సమావేశం జరపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావం నుంచి నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ ఎప్పుడూ గెలుచుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ను మూడో స్థానానికి నెట్టి కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. సాంకేతికంగా నల్లగొండ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైనా.. ఆ విజయం సాధించిన ఎంపీ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండడం, ఏడింట ఆరు సెగ్మెంట్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఆలోచనలో పడేస్తున్న.. లీడ్ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ ఆలోచనలో పడేస్తోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల గెలిచినా.. ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు కలిపితే మొత్తం 1,07,692 ఓట్ల లీడ్ మాత్రమే ఉంది. హుజూర్‌నగర్‌లో 7,466 ఓట్ల మైనస్‌లో ఉంది. రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పదహారు చోట్ల విజయమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న టీఆర్ఎస్కు ఇప్పుడు ప్రతీ స్థానం కీలకమైనదేనని పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూలుకంటే ముందే సన్నాహక కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తోందని విశ్లేషిస్తున్నారు. ఆశావహుల్లో.. హడావుడి మార్చి 11వ తేదీన నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు సెగెంట్లను నుంచి పార్టీ కేడర్‌ను సమీకరించి నిర్వహించనున్న సన్నాహక కమిటీ సమావేశంతో నల్లగొండ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్న నాయకుల్లో హడావుడి మొదలైంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానుండడంతో వీరు తమ ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. నల్లగొండ ఎంపీ టికెట్‌ను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి తదితరులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే, నల్లగొండ నుంచి సీఎం కేసీఆర్ కూడా పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరిగి ఈ స్థానం నుంచి పోటీ చేస్తారా..? లేదా..? పార్టీ అగ్రనాయకత్వం ఏం ఆలోచనలు చేస్తోంది..? ఎవరికి టికెట్ దక్కే వీలుంది..? అన్న అంశాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
‘లోక్‌సభ’కు సన్నద్ధం
నిర్మల్: శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో అధికార టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ పోరుకు సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ పోరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన సెంటిమెంట్‌తోనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ అందరికంటే ముందే టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే శనివారం ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధాన ఎజెండా పార్లమెంట్ ఎన్నికలే కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ ప్రతీ సమావేశం, సభలో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన 16స్థానాలను తామే గెలుస్తామని చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 8న ఆదిలాబాద్‌లో, 9న పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఈ సమావేశాల షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను మళ్లీ తామే కైవసం చేసుకుని పార్టీ అధినేతల మాట నిలుపాలన్న లక్ష్యంతో జిల్లా ప్రజాప్రతినిధులు ముందడుగు వేస్తున్నారు. అటు అధికార పార్టీ ఇప్పటి నుంచే లోక్‌సభ సమరానికి సన్నద్ధమవుతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలో మాత్రం ఇంకా కదలిక కనిపించడం లేదు. అధికారులు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండుస్థానాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినవే. ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఆదిలాబాద్ పరిధిలో ఉండగా, తూర్పు ప్రాంతం పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పశ్చిమ ప్రాంతంలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి(ప్రస్తుతం జిల్లాకేంద్రం) కేంద్రంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇక ఈరెండు స్థానాలు ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రకారం ఆదిలాబాద్ ఎస్టీ, పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా గోడెం నగేశ్ ఉండగా, పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచి.. నిలబెట్టుకోవాలని.. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను మళ్లీ గెలిచి నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే శనివారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేసేలా దిశానిర్దేశం చేయా లని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎంపీ సీట్లను గెలిపిస్తే ఢిల్లీస్థాయిలో తెలంగాణ అభివృద్ధి చక్రం తిప్పవచ్చన్న విషయాన్నీ వివరించాలని సూచించారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమష్టికృషితో అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ పరంగా అభ్యర్థుల ఖరారుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేశ్ మళ్లీ పోటీలో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పెద్దపల్లి స్థానంపైనే పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ స్థానానికి మాజీ ఎంపీ వివేక్‌తో పాటు మరికొందరు పోటీ పడుతున్నట్లు సమాచారం . కేటీఆర్ టూర్ ఖరారు.. టీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 8న ఆదిలాబాద్‌లో, మరుసటి రోజు 9న పెద్దపల్లి జిల్లా రామగుండంలో సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు షురూ చేశారు. స్తబ్ధుగానే ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్లో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ప్రభావం కనిపిస్తుండగా ప్రతిపక్షాల్లో మాత్రం ఆ సందడి ఇంకా మొదలు కాలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఓడినా పార్లమెంట్లో గెలువాలన్న తపనతో ఉంది. ఎలాగైనా అత్యధిక స్థానాలను గెలుచుకుని తమ అధినేత రా>హుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని భావిస్తోంది. కానీ.. అలాంటి పార్టీ ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పనిని మొదలు పెట్టినట్లుగా కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ హవా నడిచిన రోజుల్లో రెండు స్థానాలనూ గెలిచిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ స్థానాన్ని గెలుచుకుని ఉమ్మడి జిల్లాలో పరువు నిలబెట్టుకుంది. ఇక లోక్‌సభ స్థానాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ పరిధిలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి పరిధిలో ప్రేంసాగర్‌రావు వర్గాలు పార్టీలో బలంగా ఉన్నాయి. ఈ రెండు వర్గాలతో సంబంధం లేకుండా పలువురు అధిష్ఠానంతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక మళ్లీ తమ నరేంద్రుడిని ప్రధాని చేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో బోణి కొట్టలేకపోయింది. ఈసారీ విజయం అంత ఈజీ కాదన్న విషయం ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎంపీ స్థానానికి పోటీ పడేస్థాయి గల నాయకుల కోసం పార్టీ అధినేతలు చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల్లోనూ కొందరు ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అధికారులు సిద్ధం.. పార్టీలతోపాటుగా జిల్లాల అధికారులూ లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మం చిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలో ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ పూర్తయ్యింది. త్వరలోనే రెండోసారి పరిశీలన ప్రారంభం కానుంది. మరోవైపు ఈనెల 22న ఓటర్ల తుది జాబితా వచ్చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,63,963 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 10,20,320 మంది పురుషులు, 10,43,552మంది మహిళలు, ఇతరులు 91 మంది ఓటర్లు ఉన్నారు. -
లోక్‌సభ ఎన్నికలకు పోలీస్‌శాఖ కసరత్తు
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మరో ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ, ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. శాసనసభ ఎన్నికలు ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన అధికారులు, పోలీసులు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓ పర్యాయం ఈవీఎంల పరిశీలన, అధికారులతో సమావేశాలు, వీడియో కాన్షరెన్స్‌లు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తొలిదశ ఈవీఎంల తనిఖీలను చేపట్టగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి నాలుగు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈవీఎంల పనితీరు, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన పద్ధతులపై సీఈసీ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఇటీవల ఈవీఎంల తనిఖీలపై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే అంశంపై వికారాబాద్ కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతలో జాగ్రత్తలు పాటించాలని సీఈసీ స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన శిక్షణలో శాసనసభ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, సమస్యలు, తదితర వివరాలను నాలుగు జిల్లాల కలెక్టర్లు వివరించగా వచ్చే ఎన్నికల్లో అలాంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి నుంచి అధికారులను ఆప్రమత్తం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రత్యేక ప్రణాళికలు లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలొస్తే విధులు నిర్వహించడం పోలీసులకు కత్తిమీద సామే. ఈ మేరకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లడానికి పోలీసుశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల సమయంలో 45 రోజుల పాటు ఎన్నికల కమిషన్ చేతిలోకి సర్వాధికారాలు వెళ్తాయి. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్ శాఖలపై సీఈసీ గుత్తాధిపత్యం ఉంటుంది. సీఈసీ అనుమతి లేనిదే ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా శాంతి భద్రతల విధులు నిర్వర్తించడంలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోలీసుశాఖ విధులే కీలకం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే పార్టీల ప్రచారాలు హోరెత్తుతాయి. ఈ సమయంలో అనవసర ఎస్కార్ట్‌లు చేపట్టడం కుదరదు. ప్రస్తుతం ఉభయ జిల్లాలో కలిపి 3500 మంది సివిల్, ఏఆర్ సిబ్బంది పని చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల సమస్యాత్మక ఘటనలు జరిగిన దాఖలాలున్నాయి. పార్టీల నాయకులు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లారు. ఈ తరహా ఘటనలకు ఈసారి అవకాశం లేకుండా ముందస్తు వ్యూహం చేయాల్సిన అవసరం ఉంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జాబితాతో పాటు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుంటారు. శాంతి భద్రతల పరిరక్షణలో ముందస్తు సమాచారం కోసం పోలీసు శాఖలో స్పెషల్ బ్రాంచ్ విభాగం సిబ్బంది పని చేస్తున్నారు. ఈ విభాగాన్ని ఎన్నికల సమయంలో పూర్తిగా వాడుకుంటారు. ఇందుకోసం విభాగాన్ని కింది నుంచి బలోపేతం చేసేలా చాకచక్యంగా వ్యవహరించేవారు, క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారం రాబట్టే వారిని నియమించుకుని ముందుచూపుతో వ్యవహరించనుంది. -
ఓటేద్దాం రండి!
సాక్షి, మెదక్: మెదక్ పార్లమెంట్‌కు ఈనెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. నూతన జాబితాను అనుసరించి మొత్తం 15,95,272 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పెరిగిన ఓట్లు 22,758 మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్చెరు నియోకజవర్గాలు ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15,95,772 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లదే పైచేయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,99,958 మంది మహిళా ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 7,95,199 మంది, 115 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. నూతన జాబితా ప్రకారం మెదక్ నియోకజవర్గంలో ఓటర్ల సంఖ్య 2,04,445కు చేరుకుంది. ఇందులో మహిళా ఓటర్లు 1,06,353 మంది ఉండగా.. పురుష ఓటర్లు 98,090, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో నూతన జాబితాను అనుసరించి మొత్తం 2,10,658 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,06,921 మంది ఉండగా.. పురుషులు 1,02,731 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోకజవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలో 22,758 మంది ఓటర్లు పెరిగారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో 3,92,345 మంది ఓటర్లు ఉండగా.. తాజాగా సవరించిన జాబితాను ప్రకారం ఆ సంఖ్య 4,15,103కు చేరుకుంది. మెదక్ నియోజకవర్గంలో 12,660 మంది ఓటర్లు పెరగగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 10,098 మంది కొత్తగా చేరారు. పెరిగిన ఓటర్లలో అత్య«ధికులు యువకులు ఉన్నారు. మెదక్ జిల్లా అధికారులు కొత్త ఓటర్ల నమోదుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. అలాగే ఓటర్ల నమోదపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 22,758 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. పటాన్చెరులో 2,99,428 మంది ఓటర్లు మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా పటాన్చెరు పరిధిలో 2,99,428 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో 2,48,080 మంది ఓటర్లు ఉండగా.. సిద్దిపేట నియోజకవర్గంలో 2,17,831, సంగారెడ్డిలో 2,16,407, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,10,658, మెదక్‌లో 2,04,445, దుబ్బాకలో 1,98,423 మంది ఓటర్లు ఉన్నారు. -
జిల్లా ఓటర్లు 9,68,305
ఉమ్మడి జిల్లాలోని ఓటర్ల లెక్క తేలింది. శుక్రవారం ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈసీ జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అతివలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,22,888 ఓటర్లుండగా.. మహిళలు 13,78,186, పురుషులు 13,44,634గా ఉన్నారు. మొత్తంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఓటర్లు 33,552 అధికంగా నమోదయ్యారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళలు అధికంగా ఉండగా.. పెద్దపల్లిలో మాత్రం పురుషులు ఎక్కువగా ఉన్నారు. ఇతరులు 68 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13నియోజకవర్గాలుండగా.. కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి మినహాయిస్తే అన్నింటిలో మహిళాఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో నాయకులు మహిళల తీర్పుతోనే గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లు 4,81,271, మహిళలు 4,87,013, ఇతరులు 21తో కలిపి మొత్తం 9,68,305 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. జగిత్యాలలో పురుష ఓటర్లు 3,19,476, మహిళలు 3,39,479 ఓట్లుండగా.. ఐదుగురితో కలుపుకుని మొత్తం 6,58,960 ఓట్లున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పురుషులు 3,34,536 ఉండగా మహిళల ఓట్లు 3,31,405 ఇతరులతో 39 ఓట్లు కలపి మొత్తం 6,65,980 ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో పురుషులు అధికంగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశీలించినట్లయితే పురుషులు 2,09,351 ఉండగా మహిళలు 2,20,289 ఇతరులు ముగ్గురుతో కలిపి మొత్తం 4,29,643 ఓటర్లున్నారు. రానున్న ఎన్నికలు తుదిజాబితాతోనే.. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలకు జరిగే ఎన్నికల్లో తుది ఓటరు జాబితా ప్రకారమే ఓట్లు వేస్తారు. ఓటు హక్కు ప్రాధాన్యం పెరగడం, వరుస ఎన్నికలు వస్తుండడంతో ఓటు నమోదుపై ఆసక్తి చూపారు. దరఖాస్తులు కూడా ఊహించినదానికంటే ఎక్కువగానే వచ్చాయని సమాచారం. ఈనెల 14వరకు కొత్త ఓటరుగా దరఖాస్తుకు గడువు ఇచ్చి.. తుది జాబితాను శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితా ప్రకారమే రానున్న పార్లమెంట్, పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా ఎన్నికల కాంటాక్ట్ కేంద్రం ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారికి వెన్నుదన్నుగా నిలిచి చాలామంది సమస్యల పరిష్కారానికి కృషిచేసింది. ఫోన్ ద్వారా సమస్య తెలిపితే చాలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోకు అనుసంధానించి కొత్త ఓట్ల నమోదులో కీలకపాత్ర పోషించింది. దేశ, రాష్ట్ర స్థాయిలో కాంటాక్ట్ కేంద్రం ద్వారా చాలామంది ఓటరు దరఖాస్తు చేసుకున్నవారికి వెన్నుదన్నుగా నిలిచింది. -
తేలిన లెక్క
నిర్మల్: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,63,963 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తుది జాబితాను శుక్రవారం వెల్లడించారు. ఇందులో 10,20,320మంది పురుష ఓటర్లు, 10,43,552మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అలాగే 91మంది ఇతరుల కింద ఓటు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా నిర్మల్‌లో, అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్లు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నిర్మల్‌లోనే అధికం... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 4,01,106 మంది ఉండగా మహిళలు 1,99,795మంది, పురుషులు 2,01,300, ఇతరులు 11మంది ఉన్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,85,301మంది ఓటర్లు ఉన్నారు. ఇందు లో 2,90,903మంది మహిళలు, 2,94,359మంది పురుషులు, ఇతరులు 39మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పరిధిలో 4,09,341మంది ఓటర్లు ఉన్నారు. 2,07,703మంది మహిళలు ఉండగా, 2,01,630మంది పురుషులు, ఇతర 8మంది ఓటర్లు ఉన్నారు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,68,215మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,45,151మంది మహిళలు, 3,23,031మంది పురుషులు, 33మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ఓటర్ల నమోదు కనిపిస్తోంది. అలాగే నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. మహిళలదే పైచేయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20,63,963మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో పురుషులతో పోల్చితే మహిళలే అత్యధికంగా ఉండటం గమనార్హం. జనాభా పరంగా పురుషుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లలోనూ మహిళలే పైచేయి సాధించారు. పురుషులతో పోల్చితే 23,232మంది మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో పురుష ఓటర్లు 3,23,031మంది ఉండగా 3,45,151మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ జనాభాతో పాటు ఓటర్ల జాబితాలోనూ మహిళల చైతన్యం కనిపిస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91మంది ఇతరుల విభాగంలో ఓటు నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 39మంది ఇతరుల విభాగంలో ఉన్నారు. కుమురంభీంలో స్వల్పం.. జిల్లాల వారీగా పోలిస్తే కేవలం రెండు నియోజకవర్గాల పరిధి కలిగిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తక్కువ ఓటర్లు నమోదయ్యారు. ఇక్కడ 4,01,106మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాతో పోలిస్తే కాస్త ఎక్కువగా 4,09,341మంది ఓటర్లు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనూ రెండు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఇక అత్యధికంగా మూడు నియోజకవర్గాలు ఉన్న నిర్మల్ జిల్లాలో 6,68,215మంది ఓటర్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోనూ మూడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఇక్కడ 5,85,301మంది ఓటర్లు నమోదయ్యారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఓటర్లు గల్లంతు కావడంతో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, 2కే రన్, స్పెషల్ డ్రైవ్ వంటివి నిర్వహించారు. దీంతో నిర్మల్ జిల్లాలో ఓటర్ల సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మొదటి దశ ఈవీఎంల పరిశీలన పూర్తయింది. పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి నంబర్లను కేటాయించడం వంటి పనులు పూర్తి చేస్తున్నారు. -
ఎన్నికల వేళ.. పాత్రికేయులకు గూగుల్ ప్రత్యేక పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తుండటంతో అసత్య వార్తల వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెబ్సైట్లకు తోడు, సోషల్ మీడియాలోనూ తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు బాగా ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి సమాచారం, వార్తలు జనాలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. తప్పుడు వార్తలను తెలుసుకునేందుకు, మరింత నాణ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో డిజిటల్ లీడ్స్, ఇంటర్‌న్యూస్ సహకారంతో గూగుల్ దేశంలో ఉన్న జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పటికే 'గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్' పేరుతో దేశంలో ఉన్న జర్నలిస్టులకు గూగుల్ ప్రత్యేక వర్క్‌షాపుల్లో ట్రెయినింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది జూలై 20 నుంచి సెప్టెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో గూగుల్ శిక్షణ తరగతులను నిర్వహించింది. త్వరలో పార్లమెంట్తోపాటూ, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్‌లో భాగంగా పోల్ చెక్.. కవరింగ్ ఇండియాస్ ఎలక్షన్ పేరుతో శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఆన్లైన్ వెరిఫికేషన్, ఫ్యాక్ట్ చెకింగ్, డిజిటల్ సేఫ్టీ అండ్ సెక్యురిటీ, ఎన్నికల కవరేజీకి యూట్యూబ్ వాడే విధానం, డేటా విజువలైజేషన్వంటి అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గూగుల్ తెలిపింది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వరకు 30 నగరాల్లో ఇంగ్లీష్, హిందీ, మలయాళం, బంగ్లా, కన్నడ, గుజరాతీ, ఒడిషా, తమిళం, తెలుగు, మరాఠీ భాషలకు చెందిన జర్నలిస్టులకు ట్రెయినింగ్ ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్నవారితో పాటూ జర్నలిజం విద్యార్థులు ఉచిత శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అందులో అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఉచితంగా ట్రెయినింగ్ ఇస్తారు. 2016 నుంచి భారత్‌లో 40 నగరాల్లో 13,000 మందికిపైగా జర్నలిస్టులకు గూగుల్ శిక్షణనిచ్చిందని ఆసియా పసిఫిక్ గూగుల్ న్యూస్ ల్యాబ్ లీడ్ ఐరేన్ జే లియూ పేర్కొన్నారు. ఇక ట్రెయినింగ్ సమయంలో నకిలీ వార్తలు, సమాచారాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్‌లో మార్చి 13న, విశాఖపట్నంలో మార్చి 23న తెలుగు, ఇంగ్లీష్ బాషల్లో శిక్షణ ఇవ్వనున్నారు. గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్‌లో భాగంగా పోల్ చెక్.. కవరింగ్ ఇండియాస్ ఎలక్షన్ శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు, ప్రదేశాల వివరాలు.. -
పార్లమెంట్ కసరత్తు!
శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని మూటగట్టుకున్న కమలనాథులు ఆ చేదు ఫలితాలను ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నారు. మరో రెండు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వం కసరత్తు మొదలు పెట్టింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎన్నికలకు తయారు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందుకోసం జాతీయ నాయకత్వాన్ని పిలిపించి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని చూస్తోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి లోక్‌సభా స్థానాలతో పాటు ఖమ్మం లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్చార్జులను ఎన్నికల దిశలో కార్యోన్ముఖులను చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే ఈ నెల 25వ తేదీన నకిరేకల్‌లో నల్లగొండ, భువనగిరి, ఖమ్మం ఎంపీ స్థానాల పరిధిలోని కేడర్‌తో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది. మార్చి మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలకు ప్రకటన వెలువడే అవకాశం ఉండడంతో క్షేత్ర స్థాయిలో పార్టీకి కాయకల్ప చికిత్స చేసే పనిలో పడింది. రాష్ట్ర శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికలు పార్టీకి చేసిన గాయాన్ని మరిచిపోయి మళ్లీ ఎన్నికల పనిలో పడేలా వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంటు క్లస్టర్ సదస్సులు పార్టీ కార్యకర్తలను ఎన్నిలకు తయారు చేయడం, నాయకత్వంలో పోరాట పటిమను పెంచడం లక్ష్యంగా పార్లమెంటు క్లస్టర్ సదస్సులు ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా రెండు, మూడు లోక్‌సభా నియోజకవర్గాలకు కలిపి ఒక పార్లమెంట్ క్లస్టర్‌గా రూపొందించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా ఎంపీ స్థానాల పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్చార్జులు, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు. ఈ సదస్సులకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జులతో జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు కూడా హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే.. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం లోక్ సభాస్థానాల క్లస్టర్ సదస్సు ఈ నెల 25న నకిరేకల్‌లో ఏర్పాటు చేశారు. కేడర్‌లో ఉత్సాహం నింపడం కోసం ఉద్దేశించిన ఈ సదస్సులకు బయటి రాష్ట్రాలనుంచి కూడా నాయకులు హాజరవుతారని పార్టీ నాయకత్వం చెబుతోంది. నకిరేకల్ సదస్సుకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం మౌర్య హాజరవుతున్నారని, ఆయనతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొననున్నారు. 26వ తేదీన కమలజ్యోతి కార్యక్రమం శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు స్థానాలకు గాను భువనగిరి నియోజకవర్గంలో యువతెలంగాణ పార్టీకి మద్దతు ఇచ్చిన బీజేపీ, మిగిలిన పదకొండు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. సూర్యాపేట, మునుగోడు వంటి నియోజకవర్గాల్లోనే కాస్తో, కూస్తో పోటీ ఇవ్వగలిగింది. పలువురు జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు కాలికి బలపం కట్టుకుని తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి వారు కూడా ప్రచారం చేశారు. అయినా.. అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి కలిసిరాలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన నకిరేకల్‌లో పార్లమెంట్ క్లస్టర్ సదస్సు ముగిసిన మరుసటి రోజు నుంచే ప్రచారానికి దిగాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే 26వ తేదీన చేపట్టే కమలజ్యోతి కార్యక్రమంతో ఇంటింటికీ తిరగాలని భావిస్తోంది. కేంద్ర పథకాలతో లబ్ధిపొందిన వారందరినీ ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నామని, తిరిగి కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేలా తమ పార్టీని దీవించాలని కోరుతామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆ తర్వాత మార్చి 2వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణప్రాంతాల్లో 150 కి.మీలు, పట్టణ ప్రాంతాల్లో 50 కి.మీ వరకు బైక్ ర్యాలీ జరపాలని నిర్ణయించారు. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే కంటే ముందే గ్రామసీమలను చుట్టి వచ్చే పనిలో బీజేపీ పడింది. -
ఒకే ఒక్కటి
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. టీపీసీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం ప్రారంభించింది. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టికెట్ కోసం నేతల్లో స్పందన కరువైంది. కేవలం ఒక్కటంటే ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అది కూడా ఓ సామాన్య కార్యకర్త మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితి ఆ పార్టీలో నిస్తేజానికి నిదర్శమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో ఘెర పరాజయం పాలైంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు స్థానాల్లో ఏ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలోనూ చతికిల పడటంతో ఆ పార్టీ శ్రేణులతో నిస్తేజం ఆవహించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ముఖ్య నేతలెవరూ ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీపీసీసీ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు దరఖాస్తులు స్వీకరించగా, ఒక్కో స్థానానికి 20 నుంచి 30 మంది వరకు నేతలు దర ఖాస్తు లు చేసుకున్నారు. 17 స్థానాలకు ఏకంగా 380 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ స్థానం విషయానికి వస్తే మాత్రం ఇందుకు భిన్నంగా ఒకే ఒక్క దరఖాస్తు రావడం గమనార్హం. కాగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో నెలకొన్న ఈ పరిస్థితులు నిస్తేజం కాదని, వ్యూహాత్మకమని హస్తం నేతలు కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కల్వకుంట కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలకు అందనంత స్థాయిలో వ్యూహాన్ని అమలు చేసి రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చారు. ఇదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్వి ఏవైనా కీలక నిర్ణయాలుండే అవకాశాలుండటంతో అందుకు అనుగుణంగానే తమ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందని ఒకరిద్దరు కాంగ్రెస్ జిల్లా ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. కేవలం ఒకే దరఖాస్తు వచ్చిందని బయటకు చెబుతున్నప్పటికీ, పోటీకి ముగ్గురు నలుగురు గట్టి నేతలు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు వినిపించగా, తాజాగా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత కూడా తాను పోటీకి సిద్ధమని టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మధుయాష్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందిన ఆయన, 2014 ఎన్నికల్లో పరాజయం పాలుకాగా, ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇతర ముఖ్యనేతల నుంచి దరఖాస్తులు రాలేదని చెప్పుకొస్తున్నారు. 25 తర్వాత స్పష్టత వచ్చేఅవకాశాలు.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈనెల 15న హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకత్వం సమీక్ష జరిపింది. ఈసారి కూడా మధుయాష్కి పోటీ చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఎంపీ అభ్యర్థిత్వం ప్రకటన ఆలస్యం చేయవద్దనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న ఐదుగురు నేతల జాబితాను ఈనెల 25లోపు పంపాలని, జిల్లా కాంగ్రెస్ కమిటీకి రాష్ట్ర నాయకత్వం సూచించింది. డీసీసీ పంపనున్న జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనే అంశం ఈనెల 25 తర్వాత తేలనుంది. -
మేం రెడీ!
సాక్షి వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ నేడో, రేపో వెలువడుతుందన్న ప్రచారం సాగుతుండడంతో కాంగ్రెస్‌లో టికెట్ల హడావుడి మొదలైంది. ఇప్పటికే పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఇటీవల ముగియగా.. వీటిని వడపోసి టీ పీసీసీకి అందజేసే బాధ్యతను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. దీంతో డీసీసీ అధ్యక్షులు ఒక్కో స్థానం నుంచి ఐదుగురితోకూడిన జాబితా రూపొందించి పీసీసీకి అందజేస్తారు. ఆ తర్వాత అక్కడ మళ్లీ స్క్రీనింగ్ అనంతరం ఏఐసీసీకి నివేదిస్తారు. నాగర్‌కర్నూల్ స్థానానికి పోటాపోటీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగర్‌కర్నూల్ ఎంపీగా కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య, మహబూబ్‌నగర్ ఎంపీగా టీఆర్ఎస్ నేత జితేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఈ రెండు స్థానాలకు పోటీ చేయాలనుకున్న ఆశావహులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో నాగర్‌కర్నూల్ స్థానానికైతే భారీ పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ సార్లు సిట్టింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం ఆనవాయితీ. తద్వారా ఈసారి కూడా తనకే టికెట్ కేటాయించాలని నాగర్ కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య మరోసారి అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా ఏ.చంద్రశేఖర్, మాణిక్యాల చెన్నయ్య, మల్లు రమేష్, కోటూరి మానవతారాయ్, కొండ్రు పుష్పలీల, పి.సుశ్మిత శంకర్రావు, పి.శంకర్రావు, లింగారం కృష్ణయ్య, రాచమల్ల యాదగిరి, డాక్టర్ బి.రమేష్, డి.హమ్సు వర్శ, ఎం.శివకుమార్ లాల్, మల్లేపల్లి జగన్, చిన్నగల్ల కొండయ్య, కె.విజయ్‌కుమార్, ఎం.జగన్, ప్రొఫెసర్ దేవదాస్ మాన్వాల్, దేవని సతీష్ మాదిగ, నాగరిగారి ప్రీతమ్, బొల్లు కిషన్, , పి.సుశ్మిత, పోకల కిరణ్ మాదిగ, కిష్టయ్య బీష్వ, కైలాష్ కుమార్, అరుణ్ కుమార్ మిద్దె, జే.నర్సింగ్‌రావు, గ్యార మహేందర్, కొమ్ము వెంకటస్వామి, పోలేని యాదగిరిరావు, డాక్టర్ సి.అనురాధ, కాటం జంబులయ్య, పుట్టపాగ మునీంద్రనాధ్, జల్పల్లి నరేందర్ కూడా నాగర్‌కర్నూల్ స్థానం నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ నుంచి 11 మంది.. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డీకే.అరుణ, రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్, జిల్లెల చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, మల్లు రవి వంటి నేతలు అనేక మంది టీఆర్ఎస్ ప్రభంజనం ముందు తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూ»Œనగర్ స్థానం నుంచి బరిలోకి దిగి గెలిచి తీరాలని వీరిలో కొందరు భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా డీ.కే అరుణ, రేవంత్‌రెడ్డిలు అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ స్థానం నుంచి టికెట్ కోసం వంశీచంద్‌రెడ్డి, చల్లా వెంకట్రాంమిరెడ్డి, కేవీఎన్.రెడ్డి, చిత్తరంజన్‌దాస్, సూగప్ప, సంజీవ్ ముదిరాజ్తో పాటు మరో ఐదుగురు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఒక్కో స్థానం నుంచి ఐదుగురు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం జనరల్ రిజర్వేషన్ కాగా, నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలంగానే ఉండటంతో పోటీలో నిలవాలని వారి జాబితా కూడా అధికంగానే ఉంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల టికెట్ల దరఖాస్తులు ఆహ్వానించడంతో మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానానికి 11 దరఖాస్తులు రాగా, నాగర్‌కర్నూల్ స్థానానికి అత్యధికంగా 36 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి ఐదుగురితో కూడిన జాబితాను టీ పీసీసీకి పీసీసీకి అందిస్తారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు ఆశావాహులు అధికంగా ఉండటంతో జాబితాను రూపకల్పనలో డీసీసీల బాధ్యులు శ్రమించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇలా ఒక్కో స్థానానికి ఐదుగురు పేర్లతో కూడిన జాబితాను టీ పీసీసీకి అందజేశాక.. అందులో నుంచి మూడేసి పేర్లతో ఏఐసీసీకి పంపిస్తారని సమాచారం. అనంతరం అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఖరారు చేయనుంది. -
నేను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా..
సాక్షి, పూణే : లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తెరదించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మాధా లోక్‌సభ నియోజక వర్గం నుంచి శరద్ పవార్ బరిలో దిగనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ఇక్కడ మాట్లాడుతూ...’ వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్‌కు పోటీ చేస్తా. నా మేనల్లుడు అజిత్ పవార్, అలాగే కుటుంబ సభ్యులు పార్థ్ పవార్, రోహిత్ పవార్ కానీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరు. కేవలం శరద్ పవార్ మాత్రమే పోటీ చేస్తారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ కుమార్తే సుప్రియా సూలె ఇప్పటికే బారామతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన మేనల్లుడు అజిత్ పవార్ కుమారుడు రోహిత్ పవార్ వచ్చేఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ స్పష్టతనిచ్చారు. కాగా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని శరద్ పవార్.. 2012లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014లో మాధా స్థానం నుంచి ఆ పార్టీ నేత విజయసింహా మోహిత్ పాటిల్ గెలుపొందారు. -
పార్లమెంట్ పోరుకు సై
సాక్షి, వికారాబాద్: ఈనెల చివరన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు బిజీబిజీగా ఉన్నారు. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ, జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 30న ఎన్నికల నిర్వహించేందుకు అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించడంతో ఆ దిశగా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తిచేసిన అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నది. పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఎన్నికల నిర్వహణకు వైద్య, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను మినహాయించి మిగతా శాఖల ఉద్యోగుల వివరాలను పంపించాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో అధికారులు ఆ పని పూర్తి చేశారు. ఆరు నెలల్లో పదవీ విరమణ పొందేవారికి, గర్భిణులకు, బిడ్డలకు పాలు ఇచ్చే ఉద్యోగినులు, కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు మాత్రం ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలికంగా సెలవులో ఉన్నవారికి కూడా ఎన్నికల విధులు అప్పగించరాదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. వీరు మినహాయించి ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు డుమ్మా కొట్టరాదని స్పష్టం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు కారణాలు చూపుతూ చాలామంది విధులను ఎగనామం పెట్టేందుకు ప్రయత్నించారు. ఈసారి మాత్రం పకడ్బందీగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 31 పోలింగ్ కేంద్రాల పెంపు లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. అధికారులు ఒక్కో పనిని పూర్తిచేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా అవసరమైన చోట్ల పోలింగ్ కేంద్రాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మరో 31 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటుకు సిఫారసు చేశారు. గత ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,400 మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,200 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరక పోలింగ్ జరగాల్సి ఉన్నా.. కొన్ని కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రాత్రి 7 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట్ల పోలింగ్ కేంద్రాలను పెంచే ప్రతిపాదనలను పంపించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. పట్టణ ప్రాంతాల్లో 1,300 మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,100 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో జిల్లాలో అదనంగా మరో 31 కేంద్రాలు అవసరమని సిఫారసు చేశారు. ఈ నిర్ణయంతో గత ఎన్నికల్లో 1,095 ఉన్న పోలింగ్ కేంద్రాలు 1,126కు చేరనున్నాయి. జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా 8,40,181 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 4,21,561 మంది, మహిళలు 4,18,558 మంది ఉన్నారు. ఇతరులు 67 మంది ఉన్నారు. ఇటీవల ఓటరు నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తుది జాబితాను ఈనెల 22న ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ వెల్లడించారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి మన జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి సెగ్మెంట్లతో పాటుగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు వస్తాయి. త్వరలో జరగనున్న ఎన్నికలకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సంయుక్తంగా ఆర్ఓగా వ్యవహరించనున్నారు. అయితే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ మన జిల్లాకు కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తుండడంతో ఆయనే చేవెళ్ల పార్లమెంటుకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. త్వరలో సర్కారు జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించనున్నందున వీటిని నిపుణుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈపీ (ఎలక్షన్ పిటిషన్లు) లేని నియోజకవర్గాల ఈవీఎంలనే పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలోనే జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. -
మా టార్గెట్ 2021: రజనీకాంత్
సాక్షి, చెన్నై : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై దక్షిణాది సూపర్ స్టార్, రజనీ మక్కల్ మండ్రం అధినేత రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ... తమ టార్గెట్ 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయమని, అలాగే ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఎవరైనా తమ ఫోటోగానీ, పార్టీ గుర్తు కానీ వాడరాదని సూచించారు. ఒకవేళ అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాట నెలకొన్న ప్రధానమైన నీటి సమస్యను తీరుస్తారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఎంపీ టికెట్ కోసం పోటాపోటీ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు లాబీయింగ్ చేయడంలో నిమగ్నమైన ఆశావహ నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. మొదట ఈ నెల 14 వరకే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించిన అధిష్టానం ఆదివారం సాయంత్రం వరకూ ఆశావహ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి అభ్యర్థులను గెలిపించే వ్యూహాలపై కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలు హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వరకు భేటీ అయ్యారు. పెద్దపల్లి, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌కృష్ణన్, టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించారు. అయితే పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అశావహ నేతలపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులకు సూచించినట్లు తెలిసింది. ఆఫీస్ బేరర్లు, ముఖ్య నేతలు కూడా తమ అభిప్రాయాలు ఇవ్వవచ్చని సూచించారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం మరోమారు ఈ రెండు సెగ్మెంట్ల పరిధిలోని నేతలతో సమావేశం కానున్నారు. కరీంనగర్ తెరపైకి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి.. నిన్న మొన్నటి వరకు కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే వ్యక్తుల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. శుక్రవారం రాత్రి వరకు హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించిన ప్రవీణ్‌రెడ్డి పొత్తులో భాగంగా ప్రజాకూటమి సీటును అభ్యర్థి, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డికి కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2014 వరకు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూటమి అభ్యర్థికి వెళ్లగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డిని కరీంనగర్ నుంచి బరిలో దింపితే బాగుంటుందని కొందరు సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కరీంనగర్ టికెట్ రేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రముఖంగా వినిపిస్తుండగా, డీసీసీ చైర్మన్ కటకం మృత్యుంజయం, నేరెళ్ల శారద, రేగులపాటి రమ్యారావు, ప్యాట రమేష్, ఆమ ఆనంద్, జువ్వాడి నిఖిల్ చక్రవర్తి తదితరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు తెరమీదకు రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి ఎంపీ కోసం పోటాపోటీ.. 2014 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ నుంచి మళ్లీ మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం విదితమే. కాంగ్రెస్‌ను వీడిన వివేక్ ఈసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయనుండగా, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు 15 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గుమ్మడి కుమారస్వామి, గోమాస శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, గజ్జెల కాంతంతో పాటు సుమారు పదిహేను మంది ఈ స్థానంపై కన్నేశారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు గెలుపొందగా, రామగుండంలో ఇండిపెండెంట్ గెలిచారు. పెద్దపల్లిలో టీఆర్ఎస్కు గతం కంటే మెజార్టీ తగ్గగా, ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్ నాలుగు వందల స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులోనూ కాంగ్రెస్ పరిస్థితి ఫరవాలేదని భావిస్తున్న ఆ పార్టీ నేతలు పెద్దపల్లి సీటు కోసం ‘క్యూ’ కడుతున్నట్లు చెప్తున్నారు. ఈ సీటు విషయంలో మాజీ మంత్రి శ్రీ«ధర్‌బాబు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, త్వరలోనే అభ్యర్థుల ఖరారుపై స్పష్టత రానుందని అంటున్నారు. -
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం
స్టేషన్ మహబూబ్‌నగర్: రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ మేరకు పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో శనివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టనున్న ప్రణాళికలు, కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ ఇన్చార్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ఓట్లు తగ్గాయో తదితర అంశాలను ఆరా తీశారు. టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రచారం చేసి మైనార్టీలను కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాత్రాన నేతలు, కార్యకర్తలు ఆందోళన పడొద్దని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల కంటే 45 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించాలని మెజార్టీ నేతలు ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఇక సీనియర్లతో చర్చించి మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాను ఆదివారం లోగా గాంధీభవన్‌లో సమర్పించాలని డీసీసీ అధ్యక్షుడికి సూచించినట్లు తెలిసింది. మండల స్థాయిల్లో నేతల అభిప్రాయం మేరకు సాధ్యమైనంత తక్కువ మందితో జాబితాను అందజేయాలని చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు డీకే.అరుణ, రేవంత్‌రెడ్డి హాజరుకాకపోవడం గమనార్హం. -
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సుశీల్ చంద్ర
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్రను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సుశీల్ చంద్ర నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికల కమిషనర్‌గా చెలామణిలోకి వస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆయన 1980 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన అధికారి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తయారీలో సుశీల్ చంద్ర కీలక పాత్ర పోషించారు. టీ ఎస్ క్రిష్ణ మూర్తి తర్వాత ఓ ఐఆర్ఎస్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి. -
తెరపైకి కొత్త ముఖాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పార్లమెంటు ఎన్నికలకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రాజకీయ పార్టీల్లో కూడా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల విషయంలో అధికార టీఆర్ఎస్లో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన బాల్క సుమన్ ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావులకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అదే సమయంలో టీఆర్ఎస్ అధిష్టానం కూడా గెలుపు గుర్రాలు, వివాదరహితులైన మేధావుల కోసం పలు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం కాగా, పెద్దపల్లి ఎస్సీకి కేటాయించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు స్థానాలపైనే కేంద్రీకృతమైంది. పెద్దపల్లిలో వివేక్‌పై ఎమ్మెల్యేల వ్యతిరేకత మాజీ ఎంపీ గడ్డం వివేకానంద కోసమే పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ను చెన్నూరుకు పంపించినట్లు టీఆర్ఎస్లో సాగిన ప్రచారం. కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగే వివేక్ 2013లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి, 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆ తరువాత 2017లో మళ్లీ టీఆర్ఎస్లోకి వస్తూ, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు.అందుకు అనుగుణంగానే చెన్నూరు సీటును బాల్క సుమన్‌కు ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు వివేక్‌కు ఆటంకంగా మారుతున్నాయి. చెన్నూరు అసెంబ్లీ సీటును ఆశించిన వివేక్ సోదరుడు, మాజీ మంత్రి వినోద్‌కుమార్ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా వివేక్ బెల్లంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా తన యంత్రాంగాన్ని మోహరించారు. అలాగే చెన్నూరు, మంచిర్యాలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇక పెద్దపల్లి జిల్లా ధర్మపురిలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ వర్గం బాహాటంగానే వివేక్‌పై విమర్శలు చేశారు. మంథని, రామగుండంలో టీఆర్ఎస్ ఓడిపోగా, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావుకు ఆర్థిక సాయం అందించారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ పంచాయతీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరకు వెళ్లగా, సుమన్, కొప్పుల ఈశ్వర్, వివేక్లతో సమావేశం ఏర్పాటు చేశారు కూడా. అయితే ప్రస్తుతం ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన కోరుకంటి చందర్ కూడా వివేక్‌ను వ్యతిరేకిస్తున్నారు. వివేక్ తప్ప ఎవరికి సీటిచ్చినా గెలిపించుకు వస్తామని చెపుతున్నారు. ఆదిలాబాద్‌లోనూ అదే తీరా..? ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో నాలుగుసార్లు గెలిచిన గోడం నగేశ్ 2014 ఎన్నికల్లో పార్లమెంటుకు వెళ్లారు. అయితే బోథ్ నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని భావించిన నగేశ్ గత రెండేళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో పావులు కదిపారు. బోథ్ టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నించి విఫలమైన నగేశ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు సహకరించలేదు. ఆయన వర్గం కూడా దూరంగానే ఉంది. దీంతో స్వల్ప మెజారిటీతో బాపూరావు గెలిచారు. ఆదిలాబాద్ ఎంపీగా తమ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో గానీ, కేంద్ర నిధులు తీసుకురావడంలో గానీ నగేశ్ ఏమాత్రం ప్రయత్నించలేదని మిగతా ఎమ్మెల్యేల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ టికెట్టు మార్చాలని రాథోడ్ బాపూరావుతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. ఇందులో ఓ మాజీ మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ సీటును మారుస్తారనే ఊహాగానాలు లోక్‌సభ నియోజకవర్గంలో జోరందుకున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థిత్వం కోసం కోవ లక్ష్మి ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 సీట్లలో టీఆర్ఎస్ 9 గెలుచుకోగా, అనూహ్యంగా ఆసిఫాబాద్‌లో మాత్రం స్వల్ప తేడా తో ఓడిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. ఓడిపోయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కోవ లక్ష్మి తన బలాన్ని చాటుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయాలనే యోచనలో లక్ష్మి ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి భీంరావు కూతురైన కోవ లక్ష్మి సర్పంచి స్థాయి నుంచి ఎంపీపీగా, ఎమ్మెల్యేగా ఎదిగిన క్రమంలో ఈసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఓ ఆదివాసీని తొలిసారి పార్లమెంటుకు పంపే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా లక్ష్మి అభ్యర్థిత్వం పట్ల ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగానే ఉన్నట్లు ఆమె అనుయాయులు చెపుతున్నారు. పెద్దపల్లి ఆశావహులు ఎక్కువే! పెద్దపల్లిలో మాజీ ఎంపీ వివేక్‌ను ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుండడంతో అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. ఎమ్మెల్యేలను కాదని ఎంపీ టికెట్టు ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్నదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో బెల్లంపల్లి టికెట్టు ఆశించి భంగపడ్డ ప్రవీణ్‌కుమార్ ఇప్పటికే తనకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరగా, చెన్నూరు సిట్టింగ్ సీటు నుంచి వైదొలిగిన మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కూడా కేసీఆర్ ఆశీస్సులు కోరారు. కుల సమీకరణల్లో మాదిగ వర్గానికి టికెట్టు ఇవ్వాలని పార్టీ యోచిస్తే తనకు సీటు ఖాయమని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం దళిత మేధావులుగా గుర్తింపు పొందిన వారిని పెద్దపల్లి నుంచి బరిలోకి దింపాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్యల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
టికెట్ ప్లీజ్ !
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇటీవల వరుసగా జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీల ఎన్నికల్లో తలమునకలైన ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తాజాగా లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇంకా మూడు నెలల పాటు సిట్టింగ్ ఎంపీల పదవీ కాలం ఉన్నా.. అభ్యర్థుల ఎంపికపై వివిధ పార్టీలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. దీంతో షెడ్యూల్ కూడా రాకముందే టికెట్ల కోసం ఆశావహుల లాబీయింగ్ జోరందుకుంది. దరఖాస్తుల ఆహ్వానం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వారు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈనెల 16వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించగా.. పలువురు ఇప్పటికే తమ వివరాలను డీసీసీ, పీసీసీ అధ్యక్షులకు అందజేశారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జోరుగా పర్యటనలు సాగిస్తున్నారు. పార్టీ శ్రేణులను కలుస్తూ సమావేశాల్లో పాల్గొంటూ తామే అభ్యర్థులుగా పోటీకి దిగనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈనెల 11వ తేదీన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం సాగించాల్సిన తీరు.. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకున్నట్లయింది. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి... మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ తరఫున ఏపీ.జితేందర్‌రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మా దిరిగానే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. త ద్వారా ఈ స్థానం మళ్లీ జితేందర్‌రెడ్డికి ఖాయమైనట్లేనని చె బుతున్నారు. బీజేపీ నుంచి జిల్లా మాజీ అధ్యక్షుడు రతంగ్ పాం డురెడ్డి టికెట్ ఆశించినా బీసీ వర్గానికి(మున్నూరు కాపు) చెం దిన ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి బి.శాంతికుమార్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాగా కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానం కోసం ఆశావహులు పెద్దసంఖ్యలో ఉండడంతో పోటీ నెలకొంది. ఈ మేరకు పలువురు డీసీసీ, టీపీసీసీకి దరఖాస్తులు అందజేయగా.. కొందరు ఢిల్లీ స్థాయిలో పైరవీలు ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి చుట్టూ పార్లమెంట్ రాజకీయాలు సాగినా.. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఊహకందని రీతిలో ఫలితాలు వచ్చాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు టీఆర్ఎస్కు భా రీ మెజార్టీతో దక్కడం.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తారన్న నేప«థ్యంలో జైపాల్‌రెడ్డి స్థానంపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ స్థానం నుంచి మాజీ మంత్రి డీకే.అరుణ, మాజీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, డా క్టర్ వంశీచంద్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తూ ఢిల్లీలో తమ వం™ è ు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురికీ ఏఐసీసీ నేతలతో సత్సంబంధాలు ఉండడంతో వారిలోనే ఒకరికి ఎంపీ టికెట్ వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి.... నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.రాములు, బీజేపీ నుంచి ఆ పార్టీ మాజీ జా తీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతికి టి కెట్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు అచ్చంపేటకు చెందిన జెడ్పీటీసీ డాక్టర్ అనురాధ, మాజీ మంత్రి శంకర్రావు, రాష్ట్ర నాయకులు సతీశ్ మాదిగ, మానవతారాయ్ టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
మెదక్ ఎంపీ’ పోటీలో కానరాని కాంగ్రెస్ జోరు
మెదక్ పార్లమెంట్ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నేతల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ టికెట్ కోరుతున్న నేతల సంఖ్య తక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలోని బడా నేతలు ఎవరూ లోక్‌సభ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపడం లేదు. ఈ నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పోటీ చేసే ఆశావహుల నుంచి పీసీసీ వర్గాలు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మెదక్ స్థానానికి ఇప్పటి వరకు కేవలం మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈనెల 20వ తేదీ వరకు పీసీసీ చీఫ్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సాక్షి,మెదక్: దరఖాస్తులను 20వ తేదీ తర్వాత పీసీసీ వర్గాలు ఏఐసీసీకి పంపనున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ నెలాఖరున కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా మెదక్ ఎంపీ స స్థానం నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మాజీ ఎంపీ విజయశాంతి పోటీచేస్తారని ముందుగా ప్రచారం సాగింది. అయితే ఆమెకూడా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. తెలంగాణలోని మరోస్థానం నుంచి ఆమె పోటీలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కూడా పోటీచేస్తారని భావించినప్పటికీ ఆమె కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎవరూ పోటీచేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. అయితే జిల్లాకు చెందిన కొందరు నేతలు మాత్రం ఎంపీగా పోటీచేస్తామని ముందుకు వస్తున్నారు. అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత డాక్టర్ శ్రవణ్ కుమార్‌రెడ్డి సోమవారం పీసీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకుడు మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, తన భార్య మద్దుల ఉమాదేవికి టిక్కెట్ ఇవ్వాలని దరఖాస్తు సమర్పించారు. అలాగే యువజన కాంగ్రెస్ నాయకుడు సంతోష్‌రెడ్డి మంగళవారం దరఖాస్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి తన భార్య నిర్మలారెడ్డిని మెదక్ ఎంపీ బరిలో దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తన భార్య నిర్మలకు టిక్కెట్ ఇస్తే ఎంపీగా గెలిపిస్తానని చెబుతున్నారు. తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తన భార్య నిర్మలకు టిక్కెట్ ఇప్పించేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పటాన్చెరువు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు ఎం.ఏ. ఫయీం సైతం ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం జిల్లా నేతలకు టిక్కెట్ ఇస్తుందా? బయటి నేతలకు టికెట్ ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీలోనూ ఎంపీ అభ్యర్థుల ఎన్నికపై కసరత్తు జరుగుతుంది. ఇటీవల మెదక్ అసెంబ్లీనుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన రాజయ్య ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన మినహా నాయకులు ఎవరూ పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
ఎంపీ టికెట్ కావాలి!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ముందస్తు కసరత్తు చేస్తోంది. ఈ నెల 10 నుంచి ఆశావహ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. గురువారం (14వ తేదీన) ఈ తతంగం ముగియనుంది. 15 నుంచి 17 వ తేదీ వరకు లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలు, నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం అందించారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జి శ్రీనివాసకృష్ణన్ ఈ రెండు నియోజకవర్గాల నేతలతోనే 15న హైదరాబాద్ గాంధీభవన్‌లో భేటీ కానున్నారు. కరీంనగర్ ఎంపీ సీటు కోçసం పోటాపోటీ.. కరీంనగర్ లోక్‌సభ సీటును సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్‌కే మరోసారి టికెట్ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్రసమితి ప్రకటించగా.. ఈ స్థానం నుంచి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థినే బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా మందే ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌కే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతున్నా.. ఆశావహులు చాలా మంది దరఖాస్తు చేసుకోవడం ఆ పార్టీలో చర్చనీయంశంగా మారింది. ఈ నెల 10 నుంచి మంగళవారం వరకు పలువురు హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, ఆ పార్టీ సీనియర్ పల్కల రాఘవరెడ్డిలతో పాటు మరో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14కు పొడిగించడంతో మరికొందరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే రాజకీయ చైతన్యం కలిగిన కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై మాత్రం అభ్యర్థి ఎంపికలో అధిష్టానం సీరియస్‌గానే యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15న జిల్లా కమిటీల అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జిలతో ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జి శ్రీనివాస్‌కృష్ణన్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లికి పెరిగిన దరఖాస్తులు.. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రిజర్వుడ్ స్థానమైన పెద్దపల్లి లోక్‌సభ టికెట్ కోసం అధిక డిమాండ్ కనిపిస్తోంది. మంగళవారం నాటికే పది మందికి పైగా పెద్దపల్లి సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో స్థానికుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగగా, పెద్దపల్లి లోకసభ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. మంథనిలో ఏకంగా కాంగ్రెస్ విజయం సాధించగా, ధర్మపురిలో అతిస్వల్ప తేడాతో ఓటమి చెందింది. పెద్దపల్లిలోనూ తక్కువ మెజార్టీతో వెనుకబడగా, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో సైతం గట్టి పోటీ ఇచ్చింది. దీంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నంతగా టీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఉండదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అలాగే సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో సహజంగానే పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రమైంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, రాష్ట్ర నాయకుడు అద్దెంకి దయాకర్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఊట్ల వరప్రసాద్, గుమ్మడి కుమారస్వామి, గోమాస శ్రీనివాస్, మన్నె క్రిశాంక్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండడంతో మరింత మంది పెద్దపల్లికి పోటీపడే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ అభ్యర్థుల ‘ఎంపి’క!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: శాసనసభ సంగ్రామంలో ఎదురైన ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు పార్లమెంటు ఎన్నికలు సవాల్‌గా మారాయి. పార్లమెంటు ఎన్నికల్లో స్థానిక అంశాలు కాకుండా జాతీయ రాజకీయ పరిణామాలే కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు తదనుగుణంగా పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ప్రభ తగ్గిందని, రాహుల్‌గాంధీ పట్ల ప్రజల్లో అనుకూలత పెరుగుతుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభావం పెద్దగా ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు. ఈనెల 20వ తేదీలోగా ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను ఏఐసీసీకి పంపించాలని శనివారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో పీసీసీ, సీఎల్పీ నేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఎన్నికల వేడి షురూ కాబోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలోని 8 చోట్ల కాంగ్రెస్ టీఆర్ఎస్తో పోటాపోటీగా ఓట్లు సాధించగా, వాటిలో ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాలు కూడా ఉండడం గమనార్హం. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఈ రెండు లోక్‌సభ స్థానాలు రిజర్వుడు సీట్లే కావడంతో సమీకరణాల కూర్పుపై పార్టీలో భారీగానే కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీ టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల రాజకీయ, సామాజిక సమీకరణల మేరకే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆశావహులు మాత్రం తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీలకు అవకాశం? ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మూడు ఎస్టీలకు రిజర్వు చేసినవే. వీటిలో ఆసిఫాబాద్ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. బోథ్‌లో చివరి వరకు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, సోయం బాపూరావుకు విజయం దక్కలేదు. ఇక ఖానాపూర్‌లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ భారీ తేడాతో ఓడిపోయారు. ఆదివాసీలు స్వయం పాలన ఉద్యమం ఈ లోక్‌సభ పరిధిలోనే మొదలైంది. దీంతో ఆదివాసీలు, లంబాడీలకు మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో ఆదివాసీలు ఆదివాసీ అభ్యర్థికి, లంబాడీలు లంబాడా అభ్యర్థులకే ఓట్లేశారు. ఈ క్రమంలో ఖానాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు లంబాడీలు పోటీలో నిలవడంతో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆదివాసీ అభ్యర్థి అశోక్‌కు ఆ వర్గం ఓటర్లు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈసారి ఆదిలాబాద్ నుంచి ఆదివాసీకే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఆదిలాబాద్‌తోపాటు మహబూబాబాద్ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు కాగా, లంబాడీల జనాభా అధికంగా ఉన్న మహబూబాబాద్‌ను ఆ వర్గానికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ అదే జరిగితే ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ అభ్యర్థిగా బోథ్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయిన సోయం బాపూరావునే మరోసారి రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఖానాపూర్ నుంచి ఓడిపోయిన రమేశ్ రాథోడ్ సైతం టికెట్టుపై ఆశతో ఉన్నప్పటికీ, టీఆర్ఎస్ నుంచి కూడా ఆదివాసీ అయిన సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్ పోటీలో ఉండడంతో కాంగ్రెస్ కూడా అదే వర్గీయుడైన సోయంకు అవకాశం ఇస్తుందా? లేక ఓట్లు చీలకుండా లంబాడీ ఓట్ల కోసం రమేశ్ రాథోడ్‌కు చాన్స్ ఇస్తుందా? అనేది వేచి చూడాలి. పెద్దపల్లి మాలలకేనా? పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నికైన ఎంపీలలో ఒకరిద్దరు మినహా అందరూ మాల సామాజిక వర్గానికి చెందిన వారే. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇదే వర్గం వారికి టికెట్లు దక్కాయి. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లు ఉండగా, వాటిలో రెండు మాలలకు, ఒకటి మాదిగ వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూలులో ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వారే. వరంగల్ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి మాదిగ వర్గానికి చెందిన వారే పోటీ పడే అవకాశం ఉంది. మిగిలిన పెద్దపల్లి ఎస్సీ స్థానాన్ని మాల వర్గానికి కేటాయిస్తారని గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మాల వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్టు రేసులో ముందు వరుసలో ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీనివాస్ 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ఆయనతోపాటు గత ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బోర్లకుంట వెంకటేశ్ నేత కూడా టికెట్టు ఆశిస్తున్న వారిలో ఒకరు. కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఆయనకు పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన నేతకాని సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. మాల, మాదిగలతోపాటు నేతకాని వర్గానికి కూడా రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని భావిస్తే వెంకటేశ్ నేతకు చాన్స్ దక్కే అవకాశం ఉంది. ధర్మపురి సీటు నుంచి పోటీ చేసి స్వల్పతేడాతో ఓడిపోయిన వడ్లూరి లక్ష్మణ్ సైతం లోక్‌సభ రేసులో ఉన్నట్లు సమాచారం. ఆయన ఇటీవలే జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మానకొండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అదే నియోజకవర్గానికి చెందిన కాంపెల్లి సత్యనారాయణ కూడా టికెట్టు రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపు అవకాశం ఉన్న వారికే సీటివ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదిపే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక సైతం ప్రధాన ఆకర్షణగా నిలువనుండడంతో ఇప్పుడున్న ఆశావహులకు మరికొందరు తోడయ్యే అవకాశం ఉంది. -
మరో సంగ్రామానికి సన్నద్ధం!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఈ నెలలోనే మరో ఎన్నికల సమరానికి తెర లేవబోతోంది. ఏప్రిల్‌లో జరగాల్సిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం వేగంగా సాగుతోంది. మ్యాన్యువల్‌గా వచ్చిన ఓటరు దరఖాస్తులను జాబితాలో చేర్చడం ఇప్పటికే పూర్తయింది. ఇక ఆన్లైన్ ద్వారా వచ్చిన ఓటరు దరఖాస్తులను జాబితాల్లోకి ఎక్కించే తంతు ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 22న గ్రామాల్లో బూత్‌ల వారీగా ప్రచురించనున్నారు. ఓటర్ల తుది జాబితా వెలువడిన రెండు మూడు రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. రాజకీయ పార్టీల సమాయత్తంఅసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు కేవలం ఆసిఫాబాద్‌లోనే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పెద్దపల్లి సీటు ఇప్పటికే ఖాళీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీ గోడెం నగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు సీట్లలో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయ బావుటా ఎగరవేయాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలపైనే పెట్టే అవకాశం ఉండడంతో వారిపై భారం పడనుంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా మొన్నటి ఎన్నికల్లో లభించిన ఓట్ల లెక్కలను సరిచూసుకుంటూ గెలుపు అవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నలుగురు కొత్త అధ్యక్షులు పార్టీని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చాలనే కృత నిశ్చయంతో ఉండడం కలిసి వచ్చే అంశం. అభ్యర్థులు ఎవరో..? ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనను మార్చకపోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థిగా మొన్నటి ఎన్నికల్లో బోథ్ నుంచి ఓడిపోయిన సోయం బాపూరావును బరిలోకి దింపే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే ఒకరిద్దరు అధికారి స్థాయిల్లో రిటైర్డ్ అవుతున్న వారు కూడా ఎంపీ టికెట్టుపై పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీకి వెళ్లడంతో ఖాళీ అయిన సీటును ఎవరికి కేటాయిస్తారనే విషయంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ ఎంపీ వివేకానందను బరిలోకి దించాలని గత ఎన్నికల ముందు వరకు కేసీఆర్ భావించినప్పటికీ, ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు బదులు వేరే అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మాల వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారనే పేరు లేకుండా మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడతారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు కేవలం సుగుణకుమారి ఒక్కరే మాదిగ వర్గం నుంచి గెలిచిన ఎంపీ. ఈసారి మరోసారి మాదిగ వర్గం నాయకుడిని పోటీలో నిలపాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్‌లో సీటు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసిన గోమాస శ్రీనివాస్, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరులో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేష్ నేత, కరీంనగర్ పాత జిల్లా పరిధిలోకి ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఈ సీటును ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పరిధిలో గట్టిపోటీ శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒక్కో సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. కొన్ని స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. పెద్దపల్లి లోక్‌సభలో కీలకమైన మంథని అసెంబ్లీ సీటును కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలుచుకోవడం గమనార్హం. రామగుండంలో ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా పోటీచేసిన కోరుకంటి చందర్ విజయం సాధించగా, ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఓట్లు కూడా చందర్‌కే పడడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు నమోదయ్యాయి. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అంచుల దాకా వచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మంచిర్యాలలో కాంగ్రెస్ కేవలం 4వేల ఓట్ల తేడాతో ఓడింది. బెల్లంపల్లిలో కాంగ్రెస్ పోటీ చేయకపోగా, ఆ పార్టీ మద్ధతుదారులు బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్‌కు మద్దతుగా నిలిచారు. చెన్నూరు, ఇక ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఆసిఫాబాద్ సీటును కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో గెలుచుకోగా, బోథ్, నిర్మల్ సీట్లలో గట్టిపోటీ ఇచ్చింది. ఆదిలాబాద్, ఖానాపూర్, ముథోల్‌లలో మాత్రం కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఆదిలాబాద్, ముథోల్‌లలో కాంగ్రెస్ మూడోస్థానానికి చేరడం అనూహ్య పరిణామం. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 4,63,150 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ 3,75,023 ఓట్లు సాధించింది. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో కలిపి కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్కు మధ్య కేవలం 88 వేల ఓట్ల తేడానే. బెల్లంపల్లిలో పోటీ చేసి ఉంటే అది ఇంకా తగ్గేది. కాగా ఆదిలాబాద్‌లో మాత్రం రెండు పార్టీలకు లభించిన ఓట్ల మధ్య తేడా లక్షకు పైగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్కు 5,14,936 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 3,65,401 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. -
కాంగ్రెస్‌కు కొత్త సారథులు..!
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సారథులను ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన హైకమాండ్ ఒక ఓసీ, ఇద్దరు బీసీలు, ఒక దళిత నేతకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న కటకం మృత్యుంజయంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎన్.సత్యనారాయణగౌడ్, పెద్దపల్లికి ఈర్ల కొంరయ్య డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలకు శ్రేణుల్ని సంసిద్ధం చేసేందుకు ఈ కమిటీలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రక్రియను ఆ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు కొలిక్కి తెచ్చింది. మూడురోజుల క్రితం పార్టీ రాష్ట్రస్థాయి నేతలు ఢిల్లీలో సమావేశం కా వడం.. వీలైనంత తొందరగా జిల్లా సారథులను నియమించాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఆదేశిం చడం.. ఈ క్రమంలోనే గురువారం జిల్లాలకు సారథుల నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం చర్చనీయంగా మారింది. పోటాపోటీగా ప్రయత్నాలు.. చివరికు కమిటీలపై ప్రకటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగానే పార్టీ సారథి ఇప్పటివరకు కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన ఈ పదవిని అందుకునేందుకు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి పలువురు ఆశావహ నాయకులు పోటీపోటీగా ప్రయత్నాలు చేశారు. ఇంకొంతమంది మాత్రం ఈ పదవి తమకు ససేమిరా వద్దనే విషయాన్ని బాహాటంగానే పార్టీ ముఖ్య నాయకులకు వినిపించారు. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల పరిధిలో ఇదివరకు ఉన్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడితోపాటు పలువురి పేర్లు వినిపించాయి. సుమారు 22 మంది వరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్యాట రమేష్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, శంకర్, మేడిపల్లి సత్యం, మత్యుంజయం, గందె మాధవి తదితరులు ఆసక్తి చూపారు. పెద్దపల్లి జిల్లాలో ఈర్ల కొమురయ్య, ధర్మయ్యతోపాటు ఇంకొందరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. జగిత్యాలలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎం.రవీందర్‌తోపాటు ఇంకొకరిద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. రాజన్నజిల్లాలో సంగీతం శ్రీనివాస్, సత్యనారాయణగౌడ్ సహా ఐదుగురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీమంత్రులు, మాజీ ఎంపీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం ఎట్టకేలకు ఆయా జిల్లాలకు సారథులను ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్.సత్యనారాయణగౌడ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా అడ్లూరు లక్ష్మణకుమార్ నియామకంపై అంతగా వ్యతిరేకత లేనప్పటికీ.. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడి నియామకంపై సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ తదితరులు స్పందిస్తూ.. అధిస్టానంతో వద్ద చెవులు కొరికినవారు, లాబీయింగ్ చేసిన వారికే పదవి దక్కిందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుంచి కూడా పలువురు పోటీ పడినా మృత్యుంజయంకే ఇచ్చారని కొందరు వాపోయారు. డీసీసీ సారథుల ఎన్నిక వెనుక సీనియర్లే కీలకం.. పార్లమెంట్, ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలోనే కమిటీలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఆరెపల్లి మోహన్ పార్టీ ప్రకటించిన ఆయా కమిటీల్లో కీలక పదవుల్లో ఉన్నారు. వీరితోపాటు విజయరమణారావు, కేకే.మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీనర్సింహారావు, మక్కాన్‌సింగ్, జువ్వా డి నర్సింగరావు తదితరులు రాష్ట్రస్థాయిలో కీలక నాయకులుగా ఉమ్మడి జిల్లానుంచి ఉన్నారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారదతోపాటు యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర నాయకులు బల్మూరి వెంకట్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారవడంతో డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఈ ముఖ్యనాయకుల అభిప్రాయాల్ని కూడా పార్టీ పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. మొత్తంగా కొత్త నాయకత్వంతో సరికొత్త జవసత్వాల్ని పార్టీలో నింపాలనే దిశగా హస్తం పార్టీ అధినాయకత్వం వ్యవహరించిందని.. ఇందుకోసం ఆచితూచి అడుగులేస్తూ.. ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిందని ఆ పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు ఇప్పుడిప్పుడే తేరుకుంటుండటం.. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేలా చర్యల్ని చేపట్టాల్సి ఉండటంతో కొత్త అధ్యక్షుడిపై అంచనాలు అధికంగానే ఉండనున్నాయి. ఇంకా ఐదేళ్లపాటు సొంత ఖర్చులతో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేలా కార్యక్రమాల్ని చేపట్టడం.. అన్నివర్గాల నాయకులతో సమన్వయంగా వ్యవహరించడం డీసీసీ కుర్చీలో ఉన్న నేతకు అనివార్యం కానుంది. అటు రాష్ట్రస్థాయి నాయకులతోపాటు ఇటు జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా పదవికి న్యాయం చేయాల్సి ఉండగా.. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ కమిటీలు వేయడం పార్టీలో కొత్త చర్చకు తెరతీసింది. కాగా ముందున్న పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కొత్త సారథులు ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనేది వేచిచూడాల్సిందే. -
కొత్త సారథులు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు గురువారం నూతన అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్త అధ్యక్షులను ప్రకటించారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగు జిల్లాలకు కొత్త ముఖాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా యువ నాయకుడు భార్గవ్‌దేశ్‌పాండే, మంచిర్యాల జిల్లాకు కొక్కిరాల సురేఖ, నిర్మల్ జిల్లాకు పవార్ రామారావుపటేల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎమ్మెల్యే ఆత్రం సక్కును నియమించారు. ఉమ్మడి జిల్లాలో రెండు బలమైన వర్గాలుగా కొనసాగుతున్న ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అనుచరులకే డీసీసీ అధ్యక్ష పదవులు దక్కాయి. తూర్పున ‘కొక్కిరాల’ ఆధిపత్యం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ ఎన్నికల వరకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పదవి నుంచి తప్పకున్నారు. అంతకు ముందు నుంచే కొత్త జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షుల నియామకాలు ఉంటాయని కాంగ్రెస్ పెద్దలు చెబుతూ వచ్చారు. ఈ మేరకు గురువారం కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. ఇందులో తూర్పు ప్రాంతంలోని రెండు జిల్లాల్లో ప్రేమ్‌సాగర్‌రావు తన అధిపత్యం చాటుకోగా, పశ్చిమ ప్రాంతంలోని రెండు జిల్లాల్లో మహేశ్వర్‌రెడ్డి తన వర్గీయులకు అధ్యక్ష స్థానాలను ఇప్పించుకున్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖను నియమించారు. తాజా శాసనసభ ఎన్నికల్లో భర్త ప్రేమ్‌సాగర్‌రావు తరపున ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తన తర్వాత బలమైన లీడర్ లేకపోవడం, తన అధిపత్యాన్ని చాటుకోవడంలో భాగంగా ప్రేమ్‌సాగర్‌రావు భార్యకు డీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఇక తన అనుచరుడైన ఎమ్మెల్యే ఆత్రం సక్కును కుమురంభీం జిల్లాకు అధ్యక్షుడిగా నియమింపజేశారు. పార్టీ పరంగా తూర్పు జిల్లాల్లో తనకు ఎదురు లేదన్న విషయాన్ని చాటారు. మాట నెగ్గించుకున్న ఏలేటి.. ఉమ్మడి ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతంలో తనకు పార్టీ పరంగా తిరుగు లేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ నియామకాలతో చాటారు. శాసనసభ ఎన్నికల్లోనే పలువురు అనుచరులకు పార్టీ టికెట్లు దక్కకపోవడంతో ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీ పరంగా తన వాళ్లకు పదవులు దక్కేలా చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ప్రముఖ నాయకులు ఉన్నçప్పటికీ తన వర్గీయుడిగా కొనసాగుతున్న యువ నాయకుడు భార్గవ్‌దేశ్‌పాండేను డీసీసీ అధ్యక్షుడిగా నియమింపజేసుకున్నారు. తన సొంత జిల్లా నిర్మల్‌లో రామారావుపటేల్‌కు డీసీసీ పదవి దక్కేలా చేశారు. తాజా ఎన్నికల్లో ముథోల్ ఎమ్మెల్యేగా రామారావుపటేల్ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయడంలో రామారావుపటేల్ కీలకంగా వ్యవహరించారు. మొదటి నుంచి ఏలేటి అనుచరుడిగానే ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో పటేల్‌కు అధ్యక్ష పదవి దక్కేలా మహేశ్వర్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. నలుగురూ కొత్త వాళ్లే.. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్‌తో పాటు మూడు కొత్త జిల్లాలకు కొత్త వాళ్లనే అధ్యక్షులుగా నియమించింది. తాజా ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించిన భార్గవ్‌దేశ్‌పాండేకు నిరాశ ఎదురైంది. అక్కడ గండ్రత్ సుజాతకు ఎమ్మెల్యే టికెట్ దక్కింది. దీంతో భార్గవ్‌కు పార్టీ పరంగా ప్రస్తుతం అధ్యక్ష పదవిని ఇచ్చి సమన్యాయం చేశారు. ఎన్ఎస్యూఐ నుంచి ప్రస్థానం ప్రారంభించి పార్టీ జిల్లా అధ్యక్ష స్థాయి వరకు భార్గవ్ ఎదిగారు. సేవా కార్యక్రమాలతో ముథోల్ నియోజకవర్గ ప్రజలకు చేరువైన రామారావుపటేల్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గ బాధ్యతలను చూసుకున్నప్పటికీ పార్టీ పరంగా పదవులను చేపట్టలేదు. ఇప్పుడు ఏకంగా జిల్లా అధ్యక్ష పదవిని పొందారు. మంచిర్యాల అధ్యక్షురాలిగా నియమితులైన సురేఖ పూర్తిగా తన భర్త ప్రేమ్‌సాగర్‌రావు వెంటే ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు, బతుకమ్మ చీరల పంపిణీ, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. గత ఎన్నికల్లోనూ హస్తం గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేషంగా పనిచేశారు. ఇక కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన ఆత్రం సక్కు ప్రేమ్‌సాగర్‌రావుకు ప్రధాన అనుచరుడు. 2009 ఎన్నికల్లో కొక్కిరాల సహకారంతో సక్కు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన అండతోనే గెలిచి ఉమ్మడి జిల్లాలోనే పార్టీకి ఏకైక స్థానాన్ని అందించారు. పార్టీ తమను డీసీసీ అధ్యక్షులుగా నియమించడంపై నలుగురూ హర్షం వ్యక్తం చేశారు. తమ జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీకి పూర్వవైభవంగా తీసుకువస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. భార్గవ్ దేశ్‌పాండే ఇది వరకు చేపట్టిన పదవులు ఆదిలాబాద్‌అర్బన్: భార్గవ్ దేశ్‌పాండే 2006 నుంచి 2008 వరకు దాదాపు రెండేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఏఐసీసీ సభ్యులుగా, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. 2014లో ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాతకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంతో పార్టీని గెలిపించుకునేందుకు భార్గవ్ దగ్గరుండి సేవలందించారు. -
తొలగని ప్రతిష్టంభన
సాక్షి, మెదక్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై పార్టీలో ప్రతిష్టంభన నెలకొంది. డీసీసీ ఎన్నిక విషయంలో ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లా నేతలంతా ఒకే పేరు సూచించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడికే తెలియజేసింది. కానీ ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న నాయకుల పేర్లను సూచించినట్లు సమాచారం. దీంతో జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా అధ్యక్షుల జాబితాను అందజేసినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ ఆమెదముద్ర వేసిన వెంటనే రెండు మూడు రోజుల్లో డీసీసీ పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రస్తుతం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. జిల్లాల పునర్విభజనతో కొత్తగా మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో కొత్త జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే పీసీసీనిర్ణయం తీసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలో బీజీ కారణంగా డీసీసీ నియామకం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం కొత్త జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మెదక్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుని నియామకం దిశగా కసరత్తు జరుగుతోంది. త్వరలో ప్రకటన.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డి, చంద్రపాల్, బీసీ నేత మామిళ్ల ఆంజనేయులు, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన రెడ్డిపల్లి ఆంజనేయులు పోటీ పడుతున్నారు. వీరితోపాటు ఇటీవల మెదక్ ఎమ్మెల్యేగా పోటీచేసిన ఉపేందర్‌రెడ్డి పేరు కూడా ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. ఈ ఐదుగురు పేర్లను పీసీసీకి పంపటం జరిగింది. ఐదుగురిలో ఉపేందర్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ నియోజకవర్గంలోనే పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నిక విషయంలో మాత్రం జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరటంలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి సునీతారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరుపతిరెడ్డికి ఇవ్వాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న పక్షంలో తన అనుచరుడు రెడ్డిపల్లి ఆంజనేయులుకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డిలు మెదక్ మాజీ జెడ్పీటీసీగా పనిచేసిన మామిళ్ల ఆంజనేయులుకు డీసీసీ అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సైతం మామిళ్ల ఆంజనేయులుకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. జిల్లా నాయకుడు చంద్రపాల్ కోసం పీసీసీ నేత మరొకరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా నేతలు ఒక్కొక్కరు ఒక్కోపేరు సూచిస్తుండటంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తిరుపతిరెడ్డి లేదా మామిళ్ల ఆంజనేయులు ఎవరికో ఒకరికి డీసీసీ పీఠం దక్కే అవకాశం కనిపిస్తుంది. -
కాంగ్రెస్‌లో.. ఎంపీ టికెట్ల రేసు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల రేసు మొదలైంది. ఈ నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకులు అప్పుడే ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలకుగాను గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. కానీ, గత నెలలోనే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా రావడం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలవడం వంటి కారణాలతో లోక్‌సభ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ సారి జిల్లాలోని రెండు స్థానాల్లో విజయం తమదే అన్న ధీమా అధికార టీఆర్ఎస్ నాయకత్వం వ్యక్తం చేస్తుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుందని, తమకు అనుకూల పవనాలు వీస్తాయన్న ఆశాభావం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కొందరు సీనియర్లు విముఖంగా ఉన్నారని అంటున్నారు. దీంతో తమకు లోక్‌సభ టికెట్ ఇవ్వాలని కోరుతున్న యువ నాయకుల సంఖ్య పెరుగుతోంది. నల్లగొండ స్థానంనుంచి తాను పోటీకి దిగుతానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కాగా, నల్లగొండ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి పేరు మినహా రెండో పేరు బయటకు రాలేదు. భువనగిరి టికెట్‌కోసం పోటాపోటీ! భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. భువనగిరి నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి సుముఖంగా ఉన్నానని, తనకు టికెట్ కేటాయించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌కుమార్ రెడ్డి కోరుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాను కలిసి తనకు టికెట్ కేటాయించి పోటీ చేసే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. అదే మాదిరిగా.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన ఆ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. అయితే.. చామల కిరణ్‌కుమార్ రెడ్డి కుంతియాను కలిసినప్పుడు ఆయన వెంట అద్దంకి దయాకర్ కూడా ఉన్నారు. ఇదే స్థానం నుంచి పోటీ చేయాలని టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రణాళికల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ స్థానాన్ని ఓసీలకు కేటాయించే పక్షంలో భువనగిరి టికెట్‌ను బీసీలకు కేటాయించాలన్న డిమాండ్ కూడా పార్టీలో ఉంది. మద్దతు కూడగడుతున్న ఆశావహులు నల్లగొండ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మినహా ఏ సీనియర్ నేతా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించలేదు. ఆ పార్టీ సీనియర్లు దాదాపు పోటీకి విముఖంగానే ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక.. టికెట్ ఆశిస్తున్న వారు రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతల మద్దతు కూడగడుతున్నారు. టీ.పీసీసీ రాష్ట్రం నుంచి ఏఐసీసీ నాయకత్వానికి పంపించే ‘ప్రాబబుల్స్’జాబితాలో తమ పేరు ఉండేలా మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. ఏఐసీసీ నాయకత్వంతో తమకు ఉన్న పరిచయాలు, సంబంధాల నేపథ్యంలో రాష్ట్రంనుంచి పంపించే జాబితాలో పేరు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. రానున్న రెండు వారాల్లో ఈ పేర్ల విషయలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పార్లమెంట్ పోరు
సాక్షి, వనపర్తి: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగా, గ్రామపంచా యతీ ఎన్నికల ఘట్టం సైతం సజా వుగా ముగిసింది. ఇప్పటిదాకా ప్రచారపర్వంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, అధికార యంత్రాంగం ఇక లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే చివరి నాటికి ఐదేళ్లు పూర్తవుతుంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు ఇప్పటికే తెరవెనక ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, కో ఆర్డినేషన్ కమిటీ.. ఇలా ఐదు కమిటీలను నియమించింది. బీజేపీ ఈనెల 5న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం లో ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటుచేసిం ది. అంతేకాకుండా రాష్ట్రంలో రెండో సారి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్.. గ్రామపంచాయతీ ఎన్ని కల్లో విజయఢంకా మోగించిన నేపథ్యంలో పార్ల మెంట్ స్థానాలను అదే రీతిలో దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇలా ప్రధాన పార్టీల తమ వ్యూహాల్లో నిమగ్నం కాగా.. అధికార యంత్రాంగ సైతం ఓటరు జాబితా, ఈవీఎంలను సిద్ధం చేయడంపై దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. రెండు స్థానాలు దక్కించుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ఏపీ.జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య ఎంపీగా గెలిచారు. రెండు స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరొకటి గెలుచుకుని పోటాపోటీగా నిలి చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్ 13 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ కేవలం కొల్లాపూర్ స్థానంతోనే సరిపెట్టుకుంది. అదేవిధంగా తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా గ్రామాల్లో విజయం సాధించారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు రానుండటంతో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనను చూసి బీజేపీకే ఓటు వేస్తారని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలుపుకోవడంతో పాటు గత ఎన్నికల్లో చేజారిన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రణాకలు రచిస్తోంది. సిట్టింగ్‌లకు సీటు ఇస్తే... టీఆర్ఎస్ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ పాటిస్తే మహబూబ్‌నగర్ నుంచి ఎంపీ జితేందర్‌రెడ్డికి బెర్త్ ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇక 2014లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన మందా జగన్నాథం ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ అసెంబ్లీ సీటును మందా జగన్నాథం కుమారుడు శ్రీనాథ్‌కు ఇస్తారని ముందుగా ప్రచారం సాగినా అలా జరగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మందాకు సీటు దక్కుతుందా లేక కొత్త వారికి అవకాశమిస్తారా, అన్నది వేచిచూడాల్సిందే. కాంగ్రెస్‌లో పోటాపోటీ కాంగ్రెస్ పార్టీకి మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో మంచి పట్టు ఉన్నట్లు చెబతారు. అయినప్పటికీ ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమవడంతో పాటు మాజీ మంత్రులు జిల్లెల చిన్నారెడ్డి, డీకే.అరుణ, నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వంటి నేతలు ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీమంత్రి డీకే అరుణ, రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇదేస్థానం నుంచి బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతిని పోటీ చేయించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి ముగియకముందే పార్లమెంట్ ఎన్నికలు తెరపైకి రావడంతో మళ్లీ పార్టీలు, అధికార యంత్రాంగం బీజీగా మారనుంది. -
ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
-
నమో ఓటర్
-
లోక్‌సభకు రెడీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనసభ, పంచాయతీ పోరు ముగిసింది. ఇక లోక్‌సభ సమరానికి తెరలేచింది. అతిత్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 2014లో ఏప్రిల్ నెలాఖరున లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ డేకు 90 రోజుల ముందు (గత ఎన్నికల రోజు) నిర్వర్తించాల్సిన క్రతువుకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పరిశీలించనుంది. పార్లమెంట్ ఎన్నికలకు రెడీగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఇదివరకే సూచించింది. ముఖ్యంగా ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని సమకూర్చుకోవాలని నిర్దేశించింది. ఈవీఎంల ప్రక్షాళన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రక్షాళనకు తొలి ప్రాధాన్యతనివ్వాలని ఈసీ దిశానిర్దేశం చేసింది. ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎంల సమర్థతను పరీక్షించాలని ఆదేశించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలనే పార్లమెంటు ఎన్నికలకు కూడా ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలలో నిక్షిప్తమైన శాసనసభ ఎన్నికల సమాచారాన్ని తొలగించనున్నారు. డేటాను చెరిపివేయడమేగాకుండా.. ఈవీఎంల మీద అంటించిన స్టిక్కర్లు ఇతరత్రా వివరాలను కూడా తొలగించే ప్రక్రియను నేటి నుంచి చేపట్టనున్నారు. అయితే, న్యాయపరమైన ఇబ్బందులున్న అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను మాత్రం అలాగే భద్రపరచనున్నారు. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం ఫలితంపై బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లలో తేడా ఉండడంపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం తెలిపారు. దీనిపై న్యాయస్థానంలో కేసు నడుస్తున్నందున ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్‌కు వినియోగించిన 300 ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మినహా మిగతా నియోజకవర్గాల ఈవీఎంలను శుక్రవారం నుంచి మొదటి స్థాయి పరిశీలన (ఫస్ట్‌లెవల్ చెకింగ్) చేయనున్నారు. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 3,073 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,092 ఈవీఎంలను వినియోగించారు. వీటికి అదనంగా 566 రిజర్వ్‌గా ఉంచారు. వీటిలో ఇబ్రహీంపట్నం పోను మిగతా వాటిని పార్లమెంట్ ఎన్నికల్లో వాడనున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ యూనిట్లను యథాతథంగా వినియోగించనున్నారు. 4 వరకు ఓటరు జాబితా సవరణ ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల నాలుగు ఆఖరు తేదీ. ఆ లోపు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 11వ తేదీలోపు అభ్యంతరాలు, పరిష్కారాలకు చివరి తేదీ. ఆ తర్వాత 17వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 22న రాజకీయ పార్టీల ప్రతినిధులకు కొత్త ఓటర్ల జాబితాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలుండేవి. ఈ రెండింటికి గతంలో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించేవారు. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం జిల్లాలో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రమే ఉంది. ఈ సెగ్మెంట్ పరిధిలో చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు వస్తుండగా, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వెళుతోంది. ఎల్బీనగర్ సెగ్మెంట్ మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. ఇక పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జిల్లాలో చేరిన షాద్‌నగర్.. మహబూబ్‌నగర్ ఎంపీ సీటు పరిధిలో, అలాగే కల్వకుర్తి సెగ్మెంట్ పరిధిలోని కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలు నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోకి రానున్నాయి. -
ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం
-
లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఈవీఎం మొదటి దశ తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. అందుకు సంబంధించి బెంగళూరు నుంచి బెల్ కంపెనీకి చెందిన 16మంది ఇంజనీర్లు వచ్చారు. శుక్రవారం రాజకీయ పక్షాల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేయనున్నారు. నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడతోపాటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 15,01,209 మంది ఓటర్లు ఉండగా, 1,861 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మే మాసంలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించింది. జనవరి 25 వరకు ఓటు నమోదు, చేర్పులు, మార్పులు కార్యక్రమాన్ని చేపట్టింది. దాన్ని ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించింది. అప్పటివరకూ ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 22న తుది జాబితా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చేపడుతున్న ఓటర్ల జాబితా ముసాయిదా నమోదు కార్యక్రమం ఈ నెల 4న ముగియనుంది. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి 22న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటరు నమోదుపై అవగాహన కల్పించనున్నారు. 3వ తేదీన బీఎల్ఓలు పోలింగ్ స్టేషన్లలో ఫాం–6తో అందుబాటులో ఉండాలని ఎన్నికల అధికారులు నిర్ణయించి ప్రత్యేక క్యాంపులు పెట్టారు. నేటినుంచి ఈవీఎం చెకప్ బెంగళూరులోని బెల్ కంపెనీ (భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్) కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈవీఎంలను సరఫరా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా వాటిని మొదటి విడత చెకప్ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. శుక్రవారంనుంచి వాటిని మొదటి లెవల్ తనిఖీ చేసి క్లియర్ చేసేందుకు 16 మంది ఇంజనీర్లు వచ్చారు. వీరంతా అసెంబ్లీకి ఉపయోగించిన ఈ ఈవీఎంలలో ఉన్న డేటాను రాజకీయ పక్షాల ఎదుట క్లియర్ చేస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఈవీఎంలు 2,531 ఉండగా కంట్రోల్ యూనిట్లు 1,909, వీవీ ప్యాట్లు 2,044 ఉన్నాయి. పెరగనున్న పోలింగ్ స్టేషన్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 198 పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. అందుకు సంబంధించి డిసెంబర్ మాసంలోనే జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ప్రక్రియ ముగిసేందుకు ఆలస్యమవడంతో దాన్ని అధిగమించేందుకు పోలింగ్స్టేషన్లు పెంచాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో 1200 మంది ఓటర్లు ఉండగా దాన్ని 1100లకు కుదించారు. అదే విధంగా మున్సిపాలిటీల్లో 1400 ఓటర్లు ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఉంటే దాన్ని 1200కు కుదించి పోలింగ్ స్టేషన్లు పెంచాలని నివేదికలు పంపారు. -
భద్రత ప్రణాళిక
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు వేస్తున్న ఎన్నికల సంఘం పోలీసుశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో అవసరమైన భద్రత ప్రణాళిక (సెక్యూరిటీ ప్లాన్ ) సిద్ధం చేయాలని నిజామాబాద్ సీపీతో పాటు, కామారెడ్డి ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి ఆదేశాలందా యి. పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు, ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు అవసరమైన భద్రత సిబ్బంది, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, వాటి వద్ద ప్రత్యేక నిఘా వం టి వివరాలను పంపాలని ఆదేశాల్లో పేర్కొంది. జిల్లాలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలేమైనా ఉన్నాయా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయా? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలేమిటీ? వివరాలతో నివేదికలు తయారు చేయాల ని పోలీసుశాఖను ఆదేశించింది. రెండు జిల్లాల కలెక్టర్ల ద్వారా నిజామాబాద్ సీపీ, కామారెడ్డి ఎస్పీలకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసుశాఖ విజయవంతమైంది. పార్లమెంట్ ఎన్నికలను కూడా ఇదే తరహాలో జరపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ఏసీపీ, డీఎస్పీలు పార్లమెంట్ సెక్యూరిటీ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. వారి పరిధిలోని పోలీస్స్టేషన్ల వారీగా వివరాలను క్రోడీకరిస్తున్నారు. అసెంబ్లీకి 16 కంపెనీలు పార్లమెంట్ ఎన్నికల బందోబస్తు కోసం ప్రస్తుతం భద్రత సిబ్బంది ఎంత మంది ఉన్నారు.. కేంద్ర బలగాలు ఏ మేరకు అవసరం ఉంటుంది.. వం టి వివరాలను పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా కు పది కంపెనీలకు చెందిన సుమారు వెయ్యి మంది, కామారెడ్డి పరిధిలో ఆరు కంపెనీలకు చెందిన సుమారు 600 మంది కేంద్ర బల గాలను మోహరించారు. పారామిలటరీ బలగాలు జిల్లాకు వచ్చాయి. ఇవి కాకుండా ఒక్క నిజా మాబాద్ జిల్లాలోనే సుమారు 2,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల బందోబస్తు విధులు నిర్వర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ పరిధిలో 348 ఉండగా, కామారెడ్డి పరిధిలో 188 ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక నిఘా పెట్టిన విషయం విదితమే.. బదిలీలపైనా కసరత్తు.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖ బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నిబంధనల మేరకు నాలుగేళ్లలో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఒకే ప్రాంతంలో పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాలో ఏయే అధికారికి బదిలీ అయ్యే అవకాశాలున్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పోలిం గ్ కేంద్రాల కంటే అదనంగా ఏమైనా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అవసరమా ? తొలగించాల్సి న పోలింగ్ కేంద్రాలు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఎన్నికల సంఘానికి రేషనలైజేషన్‌పై పూర్తి స్థాయిలో నివేదికలు పంపినట్లు సమాచారం. -
దరఖాస్తుల వెల్లువ
ఆదిలాబాద్‌అర్బన్: రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగియనుంది. గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న ఈ సవరణ ప్రక్రియకు భారీగా స్పందన లభించింది. గతేడాదిలో మూడు సార్లు ఓటరు నమోదు చేపట్టినా రానంతగా స్పందన ఈసారి వచ్చింది. అయినా గ్రామాల్లో పూర్తి స్థాయిలో అర్హులైన యువత నమోదుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఓటు నమోదుపై అవగాహనలు, చైతన్య ర్యాలీలు, ప్రత్యేక నమోదులు, సదస్సులు పట్టణంలో మినహా గ్రామాల్లో కన్పించకపోవడంతో అర్హత గల వారు ఓటుకు దూరంగా ఉన్నారని సమాచారం. అలాంటి వారికి నమోదు గురించి తెలియపరిస్తే ఏ కొంత లక్ష్యాన్ని అయినా అందుకోవచ్చు. ఇదిలా ఉండగా, జిల్లాలో డిసెంబర్ 26 నుంచి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టగా ఇప్పటి వరకు 32,167 దరఖాస్తులు వచ్చాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 11లోగా పరిశీలన చేసి తుది జాబితాను రూపొందిస్తారు. అనంతరం ఫిబ్రవరి 22న జాబితాను విడుదల చేస్తారు. జిల్లాలో 32,167 దరఖాస్తులు జిల్లాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా అధికారులు అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈసారి చేపట్టిన నమోదుకు ఏకంగా 32,167 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 13,706 దరఖాస్తులు రాగా, బోథ్ అసెంబ్లీ పరిధి నుంచి 18,461 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఓసారి పరిశీలిస్తే.. జాబితాలో కొత్తగా ఓటు నమోదుకు 19,506 దరఖాస్తులు రాగా, జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు 828 వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఓటరు కార్డులో సవరణ చేసుకునేందుకు 452 దరఖాస్తులు రాగా, ప్రస్తుతమున్న పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులకు, చిరునామాల మార్పులకు 11,381 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను శనివారం నుంచి పరిశీలన ప్రారంభించి వచ్చే నెల 11లోగా పూర్తి చేయనున్నారు. నమోదుకు భారీగా స్పందన ఈసారి చేపట్టిన ఓటరు నమోదుకు జాబితాలో పేర్లు లేని వారు, యువత బాగా స్పందించారు. 2019 జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ నమోదుకు అర్హులు కావడంతో జిల్లాలో ప్రక్రియ ఊపందుకుంది. కళాశాలల్లో నమోదు, పట్టణంలోని వార్డుల్లో, గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టడంతో అర్హత గల వారు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్క అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తప్పా.. పంచాయతీ ఎన్నికల జరుగుతున్నందున యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం తప్పా ఓటు నమోదు గురించి అవగాహనలు చేపట్టిన సంఘటనలు కన్పించలేదు. పోలింగ్ కేంద్రాల వారీగా నమోదుకు దరఖాస్తులు స్వీకరించడం, ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ఫారాలు అందుబాటులో ఉండడం, ఆన్లైన్ ద్వారా వెసులుబాటు కల్పించడంతో చాలామంది నమోదుకు అభ్యర్థించడంతో ఈసారి నమోదుకు కలిసివచ్చిందని చెప్పవచ్చు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతైన విషయం తెలిసిందే. అర్హత ఉండి గల్లంతైన వారిని నమోదు చేయడంతోపాటు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం కూడా భారీ స్పందనకు కారణమైంది. -
ముసుగులో పొత్తులాట
-
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ఫిబ్రవరిలోనే!
-
ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తాం
-
ఏపీలో పొత్తులపై టీడీపీ,కాంగ్రెస్ కొత్త డ్రామా
-
ఈవీఎంలపై దుమారం
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాటికి మరింత విశ్వసనీయత పెంచేలా... రాజకీయ పార్టీలు జవాబుదారీతనం అలవర్చుకునేలా... చట్టసభలు రాజ్యాంగ నిబంధనలను గౌరవించేలా చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలన్న చర్చ జరగడానికి బదులు వేరే అంశాలు రంగం మీదికొస్తు న్నాయి. అమెరికాలో ముసుగు ధరించి కూర్చుని సామాజిక మాధ్యమం స్కైప్ ద్వారా సోమవారం లండన్‌లో మీడియాతో మాట్లాడిన సయ్యద్ షుజా లేవనెత్తిన ఈవీఎంల అంశం అటువంటిదే. ఎన్ని కల సీజన్ వచ్చినప్పుడల్లా ఈ వివాదం తెరపైకి రావడం మన దేశంలో రివాజుగా మారింది. కాక పోతే సయ్యద్ షుజా ఈసారి మసాలా అద్దాడు. అందులో రోడ్డు ప్రమాదాలు, పోలీసు ఎన్కౌంటర్లు, గుర్తు తెలియని వ్యక్తులు చేసిన హత్యలు ఉన్నాయి. తాను అలా బలికా కుండా ఉండటానికి భారత్ నుంచి పారిపోయి వచ్చానని కూడా చెప్పాడు. సయ్యద్ షుజాను చూస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలవారి మాటెలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్ఫురణకొస్తారు. హైదరాబాద్‌ను కట్టించింది తానే నని, సెల్ఫోన్లు తన ఘనతేనని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించింది తానేనని బాబు అవకాశం దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. ఈవీఎంలను ‘ట్యాంపర్’ చేయవచ్చునని ఎవరికైనా అనుమానం ఏర్పడినా, దాన్ని నిరూపి స్తామని ముందుకొచ్చినా వారిని తప్పుబట్టాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలక మని భావించే ఎన్నికలు సందేహాతీతంగా ఉండాలని, ప్రజల తీర్పు వమ్ముకాకుండా పక డ్బందీ ఏర్పాట్లుండాలని పౌరులంతా కోరుకుంటారు. అందువల్లే పౌర సమాజ సంఘాలు, రాజ కీయ పక్షాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసినప్పుడల్లా ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించి వివరణనిస్తూనే ఉంది. అలాగే పోలింగ్‌కు ముందు ఈవీఎంలను ప్రతి దశలోనూ తనిఖీ చేసుకునేందుకు, వాటి పనితీరును పరీక్షించేందుకు పార్టీల ప్రతినిధులకు అవకాశమిస్తున్నారు. ఈవీ ఎంలను ప్రభుత్వ రంగ సంస్థలైన బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఉత్పత్తి చేస్తు న్నాయి. వాటిల్లో వినియోగించే సాఫ్ట్వేర్ పోగ్రాం కోడ్‌ను ఆ సంస్థలే రూపొందించాయి. దానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా కల్పించామని చెబుతున్నాయి. ఈవీఎంలలో వాడే సెమీ కండ క్టర్ మైక్రోచిప్‌ల ఉత్పత్తి ఇక్కడ లేకపోవడం వల్ల వాటి కోసం విదేశీ ఉత్పత్తిదారులను ఆశ్రయించ వలసి వస్తున్నదని ఈసీ గతంలో వివరించింది. ఇందువల్ల ఇదంతా బయటకు పోయే అవకాశమున్న దని ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని, సాఫ్ట్వేర్ ప్రోగ్రాం కోడ్‌ను మెషీన్ కోడ్‌గా మార్చి పంపుతాం గనుక దాన్ని ఇతరులు చదవడం(రీడ్) లేదా నకలు తీయడం అసాధ్య మని ఈసీ వివరి స్తోంది. ఈవీఎంలకు వైఫై, బ్లూ టూత్ వగైరాలను అనుసంధానించడం కుదరని పని అని చెబు తోంది. ఈసీ వివరణతో సంతృప్తి చెందాల్సిన పని లేదు. ఎందుకంటే సాంకేతికత రోజురోజుకూ అభి వృద్ధి చెందుతోంది. అది బహుముఖాలుగా విస్తరిస్తోంది. దాన్ని అనేకులు అంది పుచ్చుకుని తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఎవరికైనా ఈవీఎంలపై కొత్త అనుమానాలు తలెత్తితే వాటిని సైతం ఈసీ ముందు ఉంచవచ్చు. అయితే అందుకు కొన్ని పద్ధతులుంటాయి. వాటిని కాదని అడ్డదార్లు తొక్కితే చివరకు అలాంటివారే నవ్వులపాలవుతారు. 2010లో ఈవీఎంలను ఎలా ‘ట్యాంపర్’ చేయవచ్చునో ‘ప్రయోగాత్మకం’గా నిరూపిస్తానని ఒక వ్యక్తి బయల్దేరినప్పుడు అప్పటికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అతనికి మద్దతు పలికి, ఢిల్లీకి తీసుకెళ్లి దాన్నొక జాతీయ వివాదంగా మార్చడానికి ప్రయత్నించారు. చిత్రమేమంటే బీజేపీ, వామపక్షాలు కూడా చంద్రబాబుకు అప్పుడు మద్దతు పలికారు. తీరా హరిప్రసాద్ ఉపయోగించిన ఈవీఎం ముంబై కలక్టరేట్ నుంచి మాయమైన చోరీ సొత్తని అక్కడి పోలీసులు తేల్చారు. అప్పట్లో ఆయన్ను అరెస్టు చేశారు. మన దేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అందుకు దారితీసిన పరిస్థితులపై ఆత్మవిమర్శ చేసుకోవడం కంటే ముందు ఈవీఎంలను తప్పుబట్టడం అలవాటైంది. అవే పార్టీలు విజయం సాధించినప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోతాయి. ఎన్నికలు జరిగాక ఆరోపించడంకాక ముందే అలా చెబితే, దాన్ని నిరూపించడానికి పూనుకుంటే వేరుగా ఉంటుంది. కానీ ఏ పార్టీ కూడా ఆ పని చేయదు. 2004 ఎన్నికల సమయంలో తాను అధికారంలో ఉండటం వల్ల అప్పట్లో చంద్రబాబు ఈవీఎంలపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పుడు ఆయన ఈవీ ఎంలలో మోసం జరిగిందని గగ్గోలు పెట్టారు. అనంతరకాలంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈవీ ఎంలకు ప్రింటర్(వీవీప్యాట్)లను అనుసంధానించడం కూడా మొదలైంది. షుజా తాను ఏకరువు పెట్టిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపడంలో విఫలమయ్యాడు. ఈవీఎంల సంగతలా ఉంచి అతని పేరు, ఊరు కూడా నిజమో కాదో చెప్పలేని స్థితి ఉంది. తాను ఈసీఐఎల్ మాజీ ఉద్యోగినని అతగాడు చెబుతుంటే, అలాంటివారెవరూ ఎప్పుడూ పనిచేయలేదని సంస్థ నిర్వాహకులు, సిబ్బంది కూడా చెబుతున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం, గౌరీ లంకేష్ హత్య కూడా అతను ఈవీఎంలతో ముడిపెట్టాడు. హైదరాబాద్‌లో తన బృందం సభ్యుల్ని పోలీసులు కాల్చిచంపడం వల్ల భయపడి భారత్ విడిచి వచ్చానంటున్నాడు. ఇందులో ఏ ఉదం తానికీ తగిన ఆధారాలు షుజా చూపలేకపోయాడు. ఇలాంటి వ్యక్తి మాటలకు విలువిచ్చి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ తదితర పక్షాలు ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. దానికి బదులు తాము విశ్వసనీయులని భావించే నిపుణుల ద్వారా మరోసారి ఈవీఎంలనూ, వీవీప్యాట్లను పరీక్షించడానికి అవకాశమివ్వమని ఈసీని ఆ పార్టీలు కోరడం ఉత్తమం. ఇప్పుడు విపక్షాల తీరును తప్పుబడుతున్న బీజేపీ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఇదే తీరున ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేసిన సంగతిని గుర్తుతెచ్చుకోవాలి. -
గురి.. ‘ఎంపీ’గిరి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో సానుకూల ఫలితాలు లభించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ఖమ్మం జిల్లాకు గల ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్‌లోని అనేక మంది ముఖ్య నేతలు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. జిల్లాలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉండడమే ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటున్న నేతలు.. ఈ నియోజకవర్గంపై దృష్టి సారించి.. టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లు ప్రచారమవుతోంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ అరంగేట్రంతోనే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఎన్నికల్లో సైతం ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐల మధ్య ఏర్పడిన ఎన్నికల పొత్తు కారణంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి కపిలవాయి రవీందర్, టీఆర్ఎస్ నుంచి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బుడాన్‌బేగ్ పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతోపాటు అదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను కైవసం చేసుకుని జిల్లాలో తన సత్తా చాటుకుంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో ఆ ముగ్గురు వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్లో చేరారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోవడం.. ఆ పార్టీ మద్దతిచ్చిన సీపీఐ అభ్యర్థి నారాయణ ఓటమి చెందడంతో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. నేతలు టికెట్ కోసం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పదవులకు సైతం తీవ్ర పోటీ ఉంటుంది. ఈ దశలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఖమ్మం లోక్‌సభపై దృష్టి సారించిన నేతలు పలువురు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అంశంపై అంతగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పట్టుబట్టి తమ వర్గానికి ఇప్పించుకుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ అంశంలో ప్రాధాన్యం ఏ విధంగా ఉంటుందనే అంశంపై పలువురు నేతలు ఆచితూచి అంచనాలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించి.. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలకు సీట్ల సర్దుబాటు చేయాల్సి రావడంతో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలకు పోటీ చేసే అవకాశం చివరి నిమిషంలో చేజారింది. దీంతో తమకు అధిష్టానం లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో పలువురు నేతలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. మహబూబాబాద్‌పై ఆసక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పోటీ చేశారు. ఈసారి సైతం ఆయన రంగంలో ఉండే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఇటీవల మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ వంటి నేతల పేర్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం అవుతున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందా? టీడీపీ, సీపీఐలతో కూడిన ప్రజాకూటమితో కలిసి పోటీ చేస్తుందా? అనే అంశంపై పార్టీ వర్గాల్లో స్పష్టత రాని పరిస్థితి. ఒకవేళ ప్రజాకూటమి పొత్తు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కొనసాగితే.. గత ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఐ, అప్పటి వరకు తమది సిట్టింగ్ స్థానమని టీడీపీ ఈ నియోజకవర్గాన్ని అడిగే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2009లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. అదే ప్రాతిపదికన టీడీపీ ఈ సీటు కోరే అవకాశం ఉందని.. అటువంటి పక్షంలో సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ మధ్య సీటు విషయంలో పోటీ తప్పదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో టీడీపీ విజయం సాధించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంతో భాగస్వామ్య పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎవరితోనూ పొత్తు పెట్టుకోం..
-
వామపక్షాలతో తప్ప ఎవరితోనూ కలిసి వెళ్లం
-
2019లో జగన్ సీఎం కావడం తథ్యం
విజయనగరం మున్సిపాలిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి 2019 సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో సీఎం కావడం తథ్యమని ఆ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సత్య కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వందలాదిగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) కేక్ కట్ట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని విజయపథంలో నడిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పిళ్లా విజయకుమార్, పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్, మార్క్‌ఫెడ్ డైరెక్ట్ కె.వి.సూర్యనారాయణరాజు, మాజీ ఎంపీపీ జగ్గారావు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కొత్త సంవత్సరంలో ప్రధాని ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాలకు సంబంధించి 2018 సంవత్సరం అసంతృప్తిగానే ముగిసిపోయింది. 2019 సంవత్సరంలోకి అడుగుపెట్టే నాటికి పాలకపక్ష భారతీయ జనతా పార్టీ కొంత పతనమైంది. కాంగ్రెస్ పార్టీ కొంత బలం పుంజుకున్నా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48 ఏళ్లకు కూడా పెద్దగా ఎదిగినట్లు కనిపించడం లేదు. దేశ ప్రయోజనాలకన్నా స్వీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుండడంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. దేశ యవనికపై మంచుపొర కప్పేసినట్లు భవిష్యత్ రాజకీయాలు అస్పష్టంగానే ఉన్నాయి. 2013లో ఇదే కాలానికి రాజకీయ వాతావరణం ఎండలో చలికాచుకున్నట్లు వెచ్చగా, అతి స్పష్టంగా కనిపించింది. కొత్త సంవత్సరంలో ఏ పార్టీ కేక్ కట్ చేస్తుందో దాదాపు తేలిపోయింది. ఇప్పడు ఆ సీన్ గల్లంతయింది. అయోమయం నెలకొంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం హోరెత్తించిన రాజకీయ నాయకులు అలసిపోయారు. వారి ప్రసంగాలను వినీ వినీ ప్రజలకు బోరుకొట్టింది. నాటి ఎన్నికల వేడిని నేటికీ కొనసాగించేందుకు మీడియా ఒక్కటే పడరాని పాట్లు పడుతోంది. రోజువారి రాజకీయ విశ్లేషనల పేరిట టీఆర్పీ రేట్ల కోసం టీవీ ఛానళ్లు కుస్తీ పడుతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలం ఇటీవలి రాజకీయ చరిత్రలో ఉద్రేకపూరిత ఉద్విగ్నమైనదని చెప్పవచ్చు. రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక ఘర్షణలు, సామాజిక సంఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గడచిన సంవత్సరం మూక హత్యలు, మూఢ నమ్మకాలు పెరిగాయి. అన్నింటికంటే నకిలీ వార్తల చెలామణి పెద్ద నోట్ల రద్దుకంటే సంచలనం సృష్టించాయి. 2018 సంవత్సరంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలనే వేడెక్కించాయి. ఆ ఎన్నికలు పాలకపక్ష బీజేపీని దాదాపు మోకాళ్లపై నిలబెట్టాయి. బ్రాహ్మణిజాన్ని వంట పట్టించుకున్న రాహుల్ గాంధీ గుజరాత్ ఫలితాలను చేపట్టబోయే అధ్యక్ష పదవికి ప్రతిఫలంగా అందించారు. అప్పటినుంచి రాహుల్ గాంధీ ‘వన్ మేన్ మిషన్’ లా రాజకీయ రంగంలో పరుగు మొదలు పెట్టారు. నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదన్న రాజకీయ వాతావరణంలో ‘ఎవరైనా ఫర్వాలేదు, మోదీ తప్ప’ అన్న పరిస్థితిని తీసుకొచ్చారు. కనుక ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రధాన మంత్రి ఎవరన్నది ప్రశ్న కాదు. మరోమారు నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నదే ప్రశ్న. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు తెరపైకి రావచ్చు. కార్యకర్తలే పునాదిగా ఎదిగిన బీజేపీ–ఆరెస్సెస్‌ల క్రమశిక్షణకు భిన్నంగా ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతున్న నరేంద్రమోదీ పట్ల పాలకపక్షంలోనే అసమ్మతి రాగాలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. గతంలో ఊహించినట్లుగా పాలకపక్ష ఎన్డీయే, కాంగ్రెస్ నేతత్వంలో మహా కూటమి మధ్యనే ప్రధాన పోటీ ఉండకపోవచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ అఖండ విజయంతో బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. మహా కూటమికి బదులుగా పలు చిరుకూటములు ఏర్పడవచ్చు. పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సమసిపోయిన నేటి రాజకీయాల్లో రాజకీయ శత్రువంటూ లేకుండా పోయారుకనుక ఏమైనా జరగవచ్చు! రాజకీయ వాతావరణం పట్ల స్పష్టత రావాలంటే మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. ప్రస్తుతం వాతావరణం గురించి వర్ణించాలంటే బిజినెస్‌లో చెప్పే ‘వీయూసీఏ’ (అస్పష్టత, అనిశ్చిత, సంక్లిష్టత, సంధిగ్ధత)లా ఉంది. -
పార్లమెంట్ హడావుడి..షురూ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ప్రధాన పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. 45రోజుల్లోగా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో ఆయా పార్టీల్లో అప్పుడే ఎంపీ ఎన్నికల ముచ్చట్లు మొదలయ్యాయి. జిల్లాలోని నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన విధంగా ఏకపక్షంగా పార్లమెంటు ఎన్నికల తీర్పు ఉండదన్న అంచనాతో ఉన్నారు. శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నాలుగు చోట్ల పరాజయం పాలైంది. ప్రధానంగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కేవలం హుజూర్నగర్ స్థానంలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన నల్లగొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదా డ, సూర్యాపేట .. ఇలా ఆరు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇది తమ కు లాభిస్తుందన్న అంచనాలో అధికార టీఆర్ఎస్ ఉండగా, శాసనసభ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఫలించవని, కచ్చితంగా భిన్నమైన తీర్పే వస్తుందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. ఈ అంశాల నేపథ్యంలోనే.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తారా..? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. దీంతో సహజంగానే టీఆర్ఎస్ శ్రేణులు ఈ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవలే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో కూడా నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారన్న మొదట్లో కొంత ప్రచారం జరిగినా, సెప్టెంబరు 6వ తేదీన అభ్యర్థులను ప్రకటించడంతో ఆ ప్రచారానికి తెరపడింది. పార్లమెంటు ఎన్నికలు అనగానే మరోమారు సీఎం కేసీఆర్ నల్లగొండనుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అ«ధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను శాసన మండలికి తీసుకుని కేబినెట్లో అవకాశం కల్పిస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఈసారి లోక్‌సభకు పోటీ చేయపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెరపైకి బండా నరేందర్‌రెడ్డి పేరు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. 2014 ఎన్నికల్లోనే ఆయన పేరు పరిశీలనలో ఉన్నా, చివరి నిమిషంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అభ్యర్థిత్వం దక్కింది. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజే శ్వర్‌రెడ్డి శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పార్లమెంటుకు జరగాల్సిన ఎన్నికల్లోనూ నల్లగొండనుంచి రాజేశ్వర్ రెడ్డి పేరు అక్కడక్కడా వినిపిస్తున్నా.. ఎఫ్డీసీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా చెబుతున్నారు. గతంలో పార్టీ కోసం .. గెలిచే అవకాశం లేకున్నా, నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మండలికి పోటీ చేయడంతోపాటు, పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆయనకు అధినేత కేసీఆర్ దగ్గర గుర్తింపు ఉంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేవనుకుంటున్న నేపథ్యంలో, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా ఉండడం, సీఎం కేసీఆర్ నిజంగానే ఇక్కడినుంచి పోటీ చేస్తారా అన్న అంశంలో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో బండా నరేందర్‌రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ..? రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగకుండా ఒకవేళ జమిలి ఎన్నికల జరిగి ఉంటే నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించానని, అసెం బ్లీకి ముందుగానే ఎన్నికలు జరగడంతో అనివార్యంగా పోటీ చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే కోమటిరెడ్డి ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మరో రెండు, మూడు నెలల్లోనే లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో ఆయన నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తనకు ఉన్న పరిచయాలు, సీనియర్ నేతలు జానారెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సహకారంతో ఎంపీగా విజయం సాధిస్తానని కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికలపై దృష్టి పెట్టి ఆ మేరకు పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తన దగ్గరి వారికి సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఆటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో పార్లమెంటు ఎన్నికల ముచ్చట్లు జోరుగా సాగుతున్నాయి. -
రైతుకు దన్ను.. మోదీ ముందు 3 మార్గాలు
న్యూఢిల్లీ: పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోయిన రైతులకు ఊరట కలిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా కొంత డబ్బు జమ చేయడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే పంటలను విక్రయించి నష్టపోయిన రైతుకు పరిహారం అందజేయడం, రుణ మాఫీ పథకం అమలు చేయడం ఇందులో ఉన్నాయి. ‘స్థూలంగా ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తోంది..అవి రుణమాఫీ, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు, నేరుగా రైతులకే డబ్బు బదిలీ ఇందులో ఉన్నాయి’ అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి గ్రామీణ ప్రాంత ఓటర్లే కారణం. కానీ, పంటల ధరల నిర్ణయంలో మార్కెట్లదే పైచేయి కావడం, ప్రభుత్వ జోక్యం తగ్గడంతో రైతులు ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. రెండేళ్లుగా దేశవ్యాప్తంగా పంటల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, ధరలు పడిపోవడం, ఎగుమతులు తగ్గడంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో 26 కోట్లకు పైగా ఉన్న రైతులు సుమారు రూ.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల మూడు కీలక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం రైతులకు, వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని తీవ్రంగా యోచిస్తోంది. ఎన్నికల లోపే రైతులందరికీ నేరుగా, సులువుగా డబ్బును అందించే ఈ మూడు మార్గాల్లో దేనిని అమలు చేసినా ఖజానాపై భారీగానే భారం పడనుంది. ఆ మూడూ ఇవే.. మొదటిది..సత్వరం అమలు చేయటానికి వీలైనదీ, ప్రభుత్వ వర్గాలు కూడా సానుకూలంగా ఉన్న ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు బంధు’ మాదిరి పథకం. దీని కింద సొంత భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎకరానికి రూ.1,700 నుంచి రూ.2,000 చొప్పున ప్రభుత్వం జమ చేయడం. ఈ పథకం అమలుకు సుమారు రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే తక్కువకే తమ పంటలను విక్రయించుకుని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడం రెండో ప్రత్యామ్నాయం. దీనిని అమలు చేస్తే రూ.50వేల కోట్లతోనే సరిపోతుంది. ఇక మూడోది.. అత్యంత ఖరీదైంది..ప్రభుత్వ వర్గాల్లో అంతగా సానుకూలత లేని రైతు రుణమాఫీ. దేశ వ్యాప్తంగా రూ.లక్షలోపు ఉన్న రైతురుణాలకు మాఫీ వర్తింప జేస్తే దేశ ఖజానాపై కనీసం రూ.3 లక్షల కోట్ల భారం పడుతుందని అధికార వర్గాల అంచనా. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాగా ప్రకటించుకుంది. సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ! న్యూఢిల్లీ: సకాలంలో చెల్లించే రైతుల పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.15వేల కోట్ల మేర ఉన్న వడ్డీ భారాన్ని భరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఆహార ధాన్యాల పంటలకు పూర్తిగాను, ఉద్యాన పంటలకు కొంత మేర రద్దు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైతులకు రూ.3 లక్షల వరకు 7 శాతం వడ్డీపై బ్యాంకులు స్వల్ప కాలిక రుణాలిస్తున్నాయి. కానీ, సకాలంలో తిరిగి చెల్లించే రైతుల నుంచి మాత్రం 4శాతం వడ్డీనే తీసుకుంటున్నాయి. సాధారణంగా 9 శాతం వడ్డీని రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. సకాలంలో రుణాలు చెల్లించే రైతులందరికీ ఈ మాఫీ వర్తింప జేస్తే కేంద్రం రూ.30వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చే రుణ వితరణ లక్ష్యాన్ని రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.11.69 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా త్వరలోనే మరిన్ని నిర్ణయాలు ప్రకటించనుంది’ అని తెలిపారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది.