agreement
-
హైదరాబాద్ యూనివర్సిటీతో బయోఫ్యాక్టర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవ ఎరువుల తయారీలో ఉన్న బయోఫ్యాక్టర్ తాజాగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు అనువైన, వినూత్న నానోకణాల రూపకల్పనపై పరిశోధన, వాణిజ్యపర వినియోగానికి అనుగుణంగా ఆవిష్కరణలను చేపడతామని బయోఫ్యాక్టర్ సీఈఓ ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. పంట ఉత్పాదకత, కచ్చిత పోషకాల పంపిణీ, పర్యావరణ అనుకూల నానోపెస్టిసైడ్స్ను మెరుగుపరచడం, రసాయనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ భాగస్వామ్య లక్ష్యం అని చెప్పారు. తక్కువ ఖర్చుతో, అధిక దిగుబడినిచ్చే పరిష్కారాలతో రైతులకు ప్రయోజనం చేకూరుస్తామన్నారు. -
శత్రువు దాడులకు ‘అటానమస్’ కౌంటర్..యూఎస్ కంపెనీతో ‘ఎమ్అండ్ఎం’ ఒప్పందం
ముంబయి: అత్యాధునిక భద్రతా,నిఘా సాంకేతికత అభివృద్ధి చేయడంలో పేరుగాంచిన అమెరికాకు చెందిన అండ్యూరిల్ గ్రూపుతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా(ఎమ్అండ్ఎమ్) కంపెనీ తెలిపింది. అండ్యూరిల్ గ్రూపు సహకారంతో కృత్రిమమేధ (ఏఐ) ఆధారంగా నడిచే అటానమస్ (స్వయం ప్రతిపత్తి) మారిటైమ్ సిస్టమ్స్, కౌంటర్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్(సీయూఎస్ఎస్) సొల్యూషన్స్, నెక్స్ట్ జనరేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్లు తయారు చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది.ఈ అత్యాధునిక సాంకేతికతో ప్రాంతీయ భద్రత మరింత పటిష్టమవుతుందని పేర్కొంది. ఇంతేగాక మాడ్యులార్ అటానమస్ అండర్‌వాటర్ వెహికిల్స్(ఏయూవీ)లను అభివృద్ధి చేసేందుకు అండ్యూరిల్తో కుదిరిన ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్అండ్ఎమ్ తెలిపింది. సముద్ర తీర ప్రాంత భద్రత,నిఘాకు ఏయూవీలు ఎంతగానో ఉపయోగపడతాయని,ఏయూవీలతో జలాల లోపల మోహరించే ఆయుధ సంపత్తి మరింతగా పెరుగుతుందని పేర్కొంది. ఇవే కాకుండా డ్రోన్ దాడులను గర్తించి నిర్వీర్యం చేసే సీయూఏఎస్ సాంకేతికత అభివృద్ధి కోసం రెండు కంపెనీలు పనిచేస్తాయని తెలిపింది. డ్రోన్లతో పెరిగిన వైమానక దాడుల ముప్పును అరికట్టడంలో సీయూఏఎస్ సాంకేతికత దోహద పడుతుందని వెల్లడించింది.రక్షణ నిఘా వ్యవస్థల్లో వాడే పలు రకాల సెన్సార్ సాంకేతికతలన్నింటిని కలిపి సెన్సార్ ఫ్యూజన్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేసేందుకు రెండు కంపెనీలు పనిచేస్తాయని ఎమ్అండ్ఎమ్ తెలిపింది.భద్రత పరంగా ముంచుకొస్తున్న ముప్పును అత్యాధునిక సాంకేతికతో ఎదుర్కొనేందుకు రెండు కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని ఎమ్అండ్ఎం గ్రూపు ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ వినోద్ సహాయ్ తెలిపారు. ప్రస్తుతం డ్రోన్లు, మానవరహిత ఆయుధాల ద్వారా ఎదురువుతున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన సాంకేతిక వ్యవస్థలు ఎంతో ముఖ్యమని అండ్యూరిల్ గ్రూపు సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ గ్రెగ్ కాస్నర్ అభిప్రాయపడ్డారు. -
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమితో డీల్
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమి (ఈఎఫ్టీఏ)తో చేసుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా)తో భారత్ 400–500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.43.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎఫ్టీఏ సభ్య దేశాల నుంచి 15 ఏళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినప్పటికీ, వాస్తవంగా నాలుగైదు రెట్లు అధికంగా ఎఫ్‌డీఐ దేశంలోకి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, లీచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్య దేశాలుగా ఉండడం గమనార్హం. ఈఎఫ్టీఏ కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన డెస్క్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ఈ ఒప్పందం కింద స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్, పాలిష్డ్ వజ్రాల దిగుమతులను చాలా తక్కువ రేటుపై లేదా సున్నా రేటుపై భారత్ అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా సభ్య దేశాలు ఇచ్చిన హామీలో భాగంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నది అంచనా. నాలుగు సభ్య దేశాలు ఈ ఒప్పందం ఆమోదం దిశగా కీలకమైన చర్యలు తీసుకున్నాయంటూ, ఈ ఏడాది చివరికి ఇవి అమల్లోకి రావచ్చని మంత్రి గోయల్ చెప్పారు.ఇదీ చదవండి: 462 కంపెనీలపై దర్యాప్తు!పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో కేటాయింపులుఎన్ఐసీడీసీ అభివృద్ధి చేస్తున్న 20 పారిశ్రామిక స్మార్ట్ పట్టణాల్లో ప్రత్యేకంగా కొంత భాగాన్ని ఈఎఫ్టీఏ సభ్య దేశాలకు ఆఫర్ చేయనున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. లేదా బడ్జెట్లో ప్రకటించినట్టు 100 హబ్ అండ్ స్పోక్ పారిశ్రామిక కేంద్రాలను కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ దిశగా ఆయా దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2023–24లో 24 బిలియన్ డాలర్ల (రూ.2.08 లక్షల కోట్లు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో నార్వే ఉంది. 2000–2004 మధ్య స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు 10.72 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. -
ట్రంప్.. చైనాతో దోస్తీనా? కుస్తీనా?.. ఐదు పాయింట్లలో స్పష్టం
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడైన తర్వాత చైనా విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని ఈ రెండు శక్తిమంతమైన దేశాల మధ్య సంబంధాల్లో ఇప్పటికే ఉద్రిక్తతలున్నాయి. అయితే వాషింగ్టన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ రెండు దేశాలు పరస్పర చర్చలపై ఎంతో ఆసక్తి చూపించాయి. భవిష్యత్తులో అమెరికా-చైనా మధ్య సంబంధాలలో సానుకూల మార్పును సూచించే ఐదు పరిణామాలు ఇవేనంటూ విశ్లేషకులు చెబుతున్నారు.1. ఇటీవల ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా-చైనా సంబంధాలలో ‘కొత్త ప్రారంభ స్థానం’ కోసం పిలుపునిచ్చారు. ఇరుదేశాల ‘విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను’ ప్రస్తావించారు.2. ఈ సంభాషణలో టిక్‌టాక్‌పై కూడా చర్చ జరిగిందని ట్రంప్ అన్నారు. నిజానికి అమెరికా టిక్‌టాక్‌ను నిషేధించడానికి సిద్ధమయ్యింది. అయితే ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌పై నిషేధాన్ని 75 రోజుల పాటు వాయిదా వేశారు.4. జీ జిన్‌పింగ్.. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను పంపారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి బీజింగ్ నుంచి పంపిన అత్యంత సీనియర్ అధికారి హాన్ జెంగ్.5. ట్రంప్ వైట్ హౌస్‌లో తన మొదటి రోజు (జనవరి 20)ప్రకటనల్లో చైనా వస్తువులపై సుంకాల విషయాన్ని ప్రస్తావించలేదు. మొదటి రోజే ఆయన దీనిని ప్రకటిస్తారని చాలా మంది పరిశీలకులు భావించారు. కానీ అలా జరగలేదు.పన్నుల గురించి మీడియా ట్రంప్‌ను అడిగినప్పుడు తన మునుపటి అధ్యక్షుని కాలంలో విధించిన పన్నులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని అన్నారు. మెక్సికన్, కెనడియన్ వస్తువులపై సుంకాలు ఫిబ్రవరి ఒకటి నుండి అమల్లోకి వస్తాయని చెప్పారు. టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం మంచి విషయమే అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
కాల్పుల విరమణకు సై
జెరూసలేం: గాజాలో కాల్పుల విరమణపై సందిగ్ధత తొలగిపోయింది. కాల్పుల విరమణకు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం సిఫార్సు చేసింది. దీంతో ఈ ఒప్పందం ఫుల్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కోర్టులోకి చేరింది. మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. 15 నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడనుంది. హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. వారంతా స్వదేశానికి చేరుకుంటారు. కాల్పుల విరమణ కోసం ఖతార్, అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించాయి. హమాస్‌తోపాటు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఒప్పించాయి. గాజాలో దాడులకు స్వస్తిపలకడానికి ఇజ్రాయెల్, బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించాయి. అయితే, ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది. కనీసం 72 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఒప్పందం అటకెక్కినట్లేనన్న ప్రచారం ఊపందుకుంది. గాజా ప్రజలు, బందీల కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒప్పందాన్ని అమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ సిఫార్సు చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఓ కరపత్రం ‘ఏడు’పు కథ!
సాక్షి, అమరావతి: వక్రీకరణలే పరమావధిగా పచ్చి అబద్ధాలను కుమ్మరిస్తున్న ఈనాడు.. గత సర్కారు ఏడు గంటల్లోనే సెకీతో ఒప్పందాన్ని క్యాబినెట్ భేటీలో ఆమోదించుకుందంటూ మరోసారి బుకాయించింది. రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా ప్రయోజనం జరుగుతోంటే రూ.లక్ష కోట్లకుపైగా భారం అంటూ అసత్య ఆరోపణలు చేసింది. ఈ ఒప్పందానికి ఐఎస్టీఎస్ చార్జీలు వర్తించవని తెలిసినా పదేపదే విషం చిమ్ముతూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. నిజానికి రెండున్నర నెలల పాటు సుదీర్ఘ కసరత్తు.. లాభనష్టాల బేరీజు.. నిపుణుల కమిటీ పరిశీలన.. మంత్రివర్గంలో చర్చ.. చివరిగా విద్యుత్తు నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్.. ఇన్ని దశలు దాటి ప్రక్రియలన్నీ పక్కాగా పాటించాకే సెకీతో ఒప్పందం కార్యరూపం దాల్చింది.వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా పాతికేళ్ల పాటు అత్యంత చౌకగా సౌర విద్యుత్‌ను అందిస్తామని, అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి సైతం మినహాయింపు కల్పిస్తామని 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ స్వయంగా ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సెకీ కోరడంతో 2021 సెప్టెంబర్ 16న (అప్పటికి వారం ముందే కేబినెట్ భేటీ తేదీని నిర్ణయించారు) కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెట్టారు. అంతేగానీ సెకీ లేఖపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవటం కోసంగానీ.. ఆమోదించడం గానీ జరగలేదు. ముఖ్యమైన విషయాలు అత్యవసరంగా క్యాబినెట్ దృష్టికి వచ్చినప్పుడు టేబుల్ ఐటమ్ కింద ప్రవేశపెట్టడం పరిపాటి, ఆనవాయితీ. అందులో ఏం తప్పు ఉంది? ఈ క్రమంలో దీనిపై లోతైన అధ్యయనానికి కమిటీని నియమించి క్యాబినెట్‌కు నివేదిక ఇవ్వాలని గత ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ దశలన్నీ పూర్తయ్యాకే 2021 అక్టోబర్ 28న క్యాబినెట్ సమావేశంలో ఒప్పందానికి ఆమోదం లభించింది. ఏపీఈఆర్సీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని డిస్కమ్‌లను నిర్దేశించారు. అంతేగానీ ఈనాడు చెబుతున్నట్లుగా హడావుడిగా ఒప్పందాన్ని ఆమోదించాలనుకుంటే అంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించి ఉండాలి కదా? నెలల తరబడి ఎందుకు ఆగుతారు? ఇలా సుదీర్ఘంగా చర్చలు, పలు ప్రక్రియలు ముగిశాకే 2021 డిసెంబర్ 1న సెకీతో ఒప్పందం జరిగింది. అర్థ రహిత ఆరోపణలు..2021 సెప్టెంబర్ 15న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పింది. నిజానికి ఈ ధర అప్పటి వరకు ఇతర మార్గాల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వస్తున్న విద్యుత్ ధరల కంటే చాలా తక్కువ. పైగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహం కింద ‘అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీల (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు’ కూడా ఈ ఒప్పందానికి వర్తింపజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ లేఖ రాసింది.అయితే సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 7 గంటల వ్యవధిలోనే అంగీకరించిందని, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలేమిటి? అంత విద్యుత్ వినియోగించగలమా? లాంటి అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేదని ఈనాడు మొదటి ఆరోపణ చేసింది. సెకీ ప్రతిపాదన వల్ల ప్రజలపై రూ.1,10,000 కోట్ల మేర ఆర్ధిక భారం పడుతుందని ఆలోచించలేదనేది రెండో ఆరోపణ. కానీ ఈ రెండూ పచ్చి అబద్ధాలే. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అల్లుకున్న కట్టుకథలు మినహా ఇందులో ఏ ఒక్కటీ వాస్తవం కాదు. రెండున్నర నెలలు.. విశ్లేషించాకే అనుమతి..సౌర విద్యుత్తుకు సంబంధించి పలు ప్రయోజనాలను కల్పిస్తూ 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య విద్యుత్ విక్రయ ఒప్పందం (పవర్ సేల్ అగ్రిమెంట్) 2021 డిసెంబర్ 1న జరిగింది. అంటే ప్రతిపాదనకు – ఒప్పందానికి మధ్య రెండున్నర నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉంది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరితోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ రెండున్నర నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సెకీ మధ్య పలు పర్యాయాలు సంప్రదింపులు జరిగాయి. సెకీ ప్రతిపాదనలో లోటుపాట్లను, ఒప్పందం వల్ల కలిగే లాభనష్టాలను లోతుగా విశ్లేషించారు. అంతేకాకుండా ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆమోదాన్ని 2021 నవంబర్ 8న కోరారు. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ నుంచి దీనికి ఆమోదం లభించింది. సెకీ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కసరత్తు, అందుకోసం తీసుకున్న సమయం రెండున్నర నెలలకంటే ఎక్కువ ఉన్నట్లు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఈనాడు మాత్రం 7 గంటల్లోనే ఆమోదం తెలిపేశారంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది.క్షుణ్నంగా సుదీర్ఘ కసరత్తు..సెకీ ఒప్పందాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మంత్రి మండలి సెప్టెంబర్ 16వ తేదీన తీసుకుందని ఈనాడు మరో ఆరోపణ చేసింది. వాస్తవం ఏమిటంటే మంత్రి మండలి సమావేశాన్ని అప్పటికప్పుడు నిర్ణయించలేదు. అంతకుముందు వారం రోజుల క్రితమే ఆ సమావేశం షెడ్యూల్ ఖరారైంది. అంటే.. కేబినెట్ సమావేశం తేదీపై నిర్ణయం తీసుకునే నాటికి సెకీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. సమావేశానికి ఒక రోజు ముందు మాత్రమే సెకీ లేఖ అందింది. తమ లేఖపై వీలైనంత త్వరగా స్పందన తెలియజేయాలని ఆ లేఖలో సెకీ కోరింది. అయితే మొత్తం ప్రక్రియకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందనే వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సెకీ కోరినట్లుగా ప్రక్రియను ఆలస్యం చేయకూడదని భావించి తగిన మార్గదర్శకాల కోసం 2021 సెప్టెంబర్ 16న మంత్రి మండలి సమావేశంలో ఈ అంశాన్ని టేబుల్ ఐటమ్‌గా ఉంచింది. ఈ ప్రతిపాదనపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర ఇంధన శాఖను నాటి సమావేశంలో మంత్రి మండలి ఆదేశించింది. సెకీ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(ఏపీపీసీసీ) చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు పలుదఫాలు సెకీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం 2021 అక్టోబర్ 25న సెకీ ప్రతిపాదనకు అనుకూలంగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది.దీంతో అక్టోబర్ 28న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ సిఫార్సులను మంత్రి మండలి ముందు ఉంచారు. ఏపీఈఆర్సీ అనుమతికి లోబడి సెకీతో పీఎస్ఏ అమలును ఆమోదించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 2021 నవంబర్ 8న ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు దరఖాస్తు చేశాయి. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదం పొందిన తర్వాతే 2021 డిసెంబర్ 1న ఒప్పందం జరిగింది. కాబట్టి టీడీపీ, ఈనాడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకంగా చేస్తున్నవని స్పష్టం అవుతోంది.కరపత్రమా... కళ్లు తెరువు⇒ ట్రాన్స్మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు ⇒పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ‘సెకీ’ ‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..⇒ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ⇒ ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.⇒ ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.3,750 కోట్లు చొప్పున 25 ఏళ్ల పాటు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది.⇒ ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది.⇒ రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ⇒ ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?⇒ టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది. -
అదే ఒప్పందం మళ్లీ..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)తో ఒప్పందం చేసుకుంటే.. సీఎం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే సంస్థతో మరోసారి ఒప్పందం చేసుకున్నారు. నిజానికి.. గత ఏడాది ఫిబ్రవరి 9న నాటి సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ).. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న సీఎస్ సమక్షంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్–రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు ప్రారంభించలేదు. అలాగే, అప్పట్లోనే ఎన్టీపీసీకి థర్మల్ పవర్ కోసం కేటాయించిన భూములను కూడా గ్రీన్ ఎనర్జీ కోసం కేటాయిస్తూ నాటి జగన్ ప్రభుత్వమే మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో.. గురువారం అదే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీతో మళ్లీ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) మధ్య ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ.1,87,000 కోట్లు ఎన్జీఈఎల్ పెట్టుబడి పెట్టనుందని ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిద్వారా రాష్ట్రంలో దాదాపు 1,06,250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని.. అలాగే, రానున్న 25 ఏళ్లలో దాదాపు రూ.20,620 కోట్ల లబ్ధి రాష్ట్రానికి చేకూరనుందని తెలిపింది.పునరుత్పాదక విద్యుత్‌దే భవిష్యత్తు..ఈ ఒప్పందం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేసే క్రమంలో ఇది కీలక అడుగన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. భవిష్యత్తు అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్‌ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తిచేయాలని సీఎం తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్టీపీసి గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ గురుదీప్ సింగ్, ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. సారంగపాణి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్కో అధికారులున్నారు. -
ఓస్లో ఒప్పందం – వాస్తవాలు
ఇజ్రాయెల్, పాలస్తీనాలు ‘రెండు దేశాలుగా బతకడమే దారి’ అనే శీర్షికతో వ్యాసం రాసిన (అక్టోబర్ 23న) ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ కొన్ని వాస్తవాలను విస్మరించారు లేదా తప్పుగా పేర్కొన్నారు. రెండు స్వతంత్ర దేశాలను ప్రతిపాదించిన 1993 నాటి నార్వే (ఓస్లో) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి సంతకం చేయగా అందుకు హమాస్, ఇరాన్ నిరాకరిస్తున్నాయన్నారు. ఆ ఒప్పందం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) అధ్యక్షునిగా యాసిర్ అరాఫాత్కు, ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్‌కు మధ్య జరిగింది.తర్వాత అరాఫాత్ 2004లో మరణించే వరకు 11 ఏళ్లపాటు అది అమలు కాకపోవటానికి కారణం ఎవరు? ఓస్లో ఒప్పందం ప్రకారం ఇరుపక్షాలూ మొదటిసారిగా పరస్పరం గుర్తించుకున్నాయి. కానీ అది ఆ కాలంలో గానీ, ఈరోజుకు గానీ అమలు కాకపోవటానికి బాధ్యత పూర్తిగా ఇజ్రాయెల్దేనని... స్వయంగా ఆ చర్చలకు సాక్షి అయిన ఆరన్ డేవిడ్ మిల్లర్ అనే అమెరికాకు చెందిన అగ్రస్థాయి నిపుణుడు, అమెరికా నుంచే వెలువడే ‘ఫారిన్ పాలసీ’ అనే సుప్రసిద్ధ జర్నల్‌లో ఇటీవలే రాశాడు. అంతేకాదు, ఆ ఒప్పందంలో అసలు ‘పాలస్తీనా దేశం’ అన్న మాటే లేదని వెల్లడిస్తూ, 1993 నుంచి ఆ మాత్రపు ఒప్పందాన్ని అయినా ఇజ్రాయెల్ ఎట్లా ఉల్లంఘిస్తూ వస్తున్నదో వర్ణించి చెప్పాడు.వ్యాస రచయిత ప్రస్తావించిన వాటిలో మరొకటి మాత్రం చూద్దాము. అరాఫాత్ మరణం తర్వాత పీఎల్ఓ లేదా ఫతా పార్టీ నాయకత్వం పాలస్తీనా అథారిటీ (పీఏ) పేరిట పాలిస్తూ పూర్తి నిష్క్రియాపరంగా, అవినీతిమయంగా మారినందు వల్లనే, అంత వరకు కేవలం నామమాత్రంగా ఉండిన హమాస్, బాగా బలం పుంజుకుని 2006 నాటి ఎన్నికలలో గెలిచి 2007లో అధికారా నికి వచ్చింది. ఆ పరిణామం ప్రజాస్వామిక ఎన్నికలలో జరిగిందే తప్ప బలప్రయోగంతో కాదు. ఇక ఇజ్రాయెల్ 1947 నుంచి మొదలు కొని ఈ 77 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయ స్థానంతో పాటు అనేకానేక ఇతర ప్రపంచ సంస్థలను, ప్రపంచాభిప్రాయాన్ని ధిక్కరిస్తూ ఈరోజున గాజాలో, వెస్ట్ బ్యాంక్‌లో ఏ వ్యూహాన్ని అమలు చేసి అసలు పాలస్తీనా అన్నదే లేకుండా చేయ జూస్తున్నదో కనిపిస్తున్నదే.– టంకశాల అశోక్సీనియర్ సంపాదకుడు, హైదరాబాద్ -
భారత్,చైనా సరిహద్దు వివాదంలో కీలక ముందడుగు
న్యూఢిల్లీ:భారత్-చైనా మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న వివాద పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. వాస్తవాధీనరేఖ(ఎల్‌ఓఏసీ) వద్ద బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయని,ఎల్‌ఓఏసీ వద్ద గస్తీని మళ్లీ ప్రారంభించడానికి అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.అక్టోబర్ 22,23 రెండు రోజుల పాటు రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లనున్న తరుణంలో భారత్, చైనా దౌత్యవ్యవహరాల్లో కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సరిహద్దులో ఎల్‌ఓఏసీ వెంబడి పెట్రోలింగ్ పునఃప్రాంభంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.అనేక వారాలుగా జరుపుతున్న చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందని చెప్పారు. బలగాల ఉపసంహరణ 2020లో ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పాక్‌లో హిందూ గుడికి మోక్షం..64 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం -
ఇంధన రంగంలో సహకరించుకుందాం
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలతోపాటు ఇరుదేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. గాజాలోని తాజా పరిస్థితులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ(అండోక్)– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అండోక్–ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మధ్య దీర్ఘకాలం ఇంధన సరఫరాకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే అబుదాబీలోని బరాఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్‌ఈసీ)–న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. అండోక్–ఊర్జా భారత్ మధ్య ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాకుండా భారత్‌లో ఫుడ్‌పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అబుదాబీ డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ యువరాజు భారత పర్యటన కోసం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌ను సందర్శించాయి. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులరి్పంచారు. యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా భారత్, యూఏఈ మధ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవతుండడం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు. -
సహజీవనానికో అగ్రిమెంట్.. కోర్టు మెట్లెక్కిన యువతి
ముంబై : వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. సహజీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. హద్దులు దాటకూడదని నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ఒప్పందం కుదర్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.పెళ్లి చేసుకుంటానని తన భాగస్వామి మోసం చేయడమే కాకుండా తనపై పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీంతో సదరు వ్యక్తి శిక్ష నుంచి అతన తమ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్‌ను కోర్టుకు అందించాడు. ఆ తర్వాత ఏమైందటే? ముంబైలో కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి (29).. ప్రభుత్వ ఉద్యోగి (42)ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ముందుగా సహ జీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇబ్బందులు రాకూడదని అగ్రిమెంట్ రాసుకున్నారు. అన్నట్లుగానే కొన్ని రోజులు కలిసి జీవించారు. ఈ నేపథ్యంలో తన భాగస్వామి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని,సహజీవనం చేస్తున్న సమయంలో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తరుఫు న్యాయవాది సైతం తమకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు.‘తనని తప్పుడు కేసులో ఇరికించారు. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉండేందుకు అంగీకరించినట్లు అగ్రిమెంట్లో తేలింది. ఆమె సంతకం కూడా చేసింది’ అని ఆ వ్యక్తి తరఫు న్యాయవాది సునీల్ పాండే తెలిపారు. అందుకు ఒప్పంద పత్రాలు చూపించగా.. అందులో ఉన్న సంతకాలు తనవి కాదని బాధిత యువతి ఆరోపిస్తుంది.వారి మధ్య జరిగిన సహజీవనం ఒప్పందం.. ఇరువురి మధ్య జరిగిన ఏడు అంశాల ఒప్పందం ప్రకారం 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు కలిసి ఉండాలని నిర్ణయించారు.ఈ కాలంలో ఒకరిపై మరొకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోరని, శాంతియుతంగా ఉండాలి. ఆమె ఇంట్లోనే అతడితో కలిసి ఉండాలి. అతని ప్రవర్తన సరిలేదంటే ఒక నెల నోటీసు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా విడిపోవచ్చు.మహిళ అతనితో ఉంటున్నప్పుడు బంధువులు ఆమె ఇంటికి రాకూడదు.స్త్రీ పురుషుడికి ఎలాంటి వేధింపులు, మానసిక వేదన కలిగించకూడదు. అదే సమయంలో స్త్రీ గర్భం దాల్చితే పురుషుడు బాధ్యత వహించకూడదు. మానసిక ప్రశాంతత భంగం వాటిల్లకుండా చూసుకోవడం వంటి పాయింట్లు అగ్రిమెంట్లో చేర్చడంతో పాటు దాన్ని నోటరీ చేయించడం గమనార్హం. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. -
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్‌కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్‌టేకింగ్‌లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్‌పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్‌లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్‌పై తన ట్రేడ్‌మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్‌కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్‌ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్‌కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్‌కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్‌లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్‌పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్‌ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్‌పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్‌రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్‌ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
ఫోన్ పేతో వివాదం.. కన్నడిగులకు మద్దతుగా సుదీప్
కర్ణాటకలోని స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఫోన్ పే సంస్థపై బహిష్కరణ ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫోన్ పేపై కన్నడిగులు చేస్తున్న పోరాటానికి హీరో సుదీప్ మద్దతు తెలిపారు. ఫోన్ పేతో చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని సుదీప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.కర్ణాటకలో ఉండే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాముఖ్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అయితే, దీనిని పోన్ పే సీఈవో సమీర్ నిగమ్ తప్పుబట్టారు. దీంతో అక్కడి ప్రజల నుంచి ఫోన్ పే పట్ల తీవ్రమైన వ్యతిరేఖత వచ్చింది.నటుడు సుదీప్ కర్ణాటకలో ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అక్కడ వినియోగదారులు డబ్బును పంపుతున్న సమయంలో 'థ్యాంక్యూ బాస్' అంటూ సుదీప్ వాయిస్ వినిపిస్తుంది. అయితే, కన్నడిగుల పట్ల ఫోన్ పే వ్యవహరించిన తీరుతో ఆ సంస్థ మీద అక్కడ ప్రజలు ఫైర అవుతున్నారు. ఈ నేపథ్యంలో కిచ్చ సుదీప్ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తనను ఆదరించిన కన్నడిగుల పక్షాన నిలబడేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. కన్నడిగులకు క్షమాపణలు చెప్పకుంటే ఫోన్ పే సంస్థతో తాను చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సుదీప్ రేపు అధికారికంగా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.తమ ఫోన్లలో ఫోన్ పే యాప్‌ను అన్ఇన్స్టాల్ క్యాంపెయిన్‌ను అక్కడి ప్రజలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులకు సపోర్ట్ చేసేందుకు సుదీప్ ముందుకు వచ్చినట్లు ఆయన టీమ్ నుంచి సమాచారం అందుతోంది. అయితే, కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్లను చాలా మంది వ్యాపారవేత్తలు వ్యతిరేకించారు. దీంతో ఆయా పారిశ్రామికవేత్తలపై నిరసన కూడా వ్యక్తమైంది. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ మొదటగా వ్యతిరేకించారు. అందుకే, కన్నడిగుల అతనికి గుణపాఠం చెప్పాలని ప్రచారం జరుగుతోంది.రిజర్వేషన్ల విషయంలో వెనక్కు తగ్గిన కర్ణాటక ప్రభుత్వంకర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. అక్కడి పరిశ్రమవర్గాల నుంచి భారీగా వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా పరిశీలించి రానున్న రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వెల్లడించింది. -
ఇంజీనస్తో రెడ్డీస్ లైసెన్సింగ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ కంపెనీ ఇంజీనస్ ఫార్మాస్యూటికల్స్‌తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సలో వాడే సైక్లోఫాస్ఫామైడ్ ఇంజెక్షన్ ను యూఎస్ మార్కెట్లో రెడ్డీస్ విక్రయించనుంది. అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో 50% ఇంజీనస్కు చెల్లిస్తుంది. ఇక్వియా గణాంకాల ప్రకారం 2024 మార్చితో ముగిసిన 12 నెలల్లో ఇంజీనస్ తయారీ సైక్లోఫాస్ఫామైడ్ ఇంజెక్షన్ అమ్మకాల విలువ యూఎస్‌లో 51.8 మిలియన్ డాలర్లు నమోదైంది. -
జపాన్ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగో కోడ్‌షేర్ ఒప్పందం
ముంబై: జపాన్ ఎయిర్‌లైన్స్‌తో (జేఏఎల్) కోడ్‌షేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. ఇండిగో నెట్‌వర్క్‌లోని 14 ప్రాంతాలకు జేఏఎల్ సేవలు విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అది టోక్యో నుంచి ఢిల్లీ, బెంగళూరుకు ఫ్లయిట్ సరీ్వసులు అందిస్తోంది. ఈ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పెద్ద నగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, అమృత్సర్, కొచ్చి, కోయంబత్తూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, పుణె, లక్నో, వారణాసి తదితర ప్రాంతాలకు సరీ్వసులు విస్తరించేందుకు వీలవుతుంది. తదుపరి జేఏఎల్ నెట్వర్క్ రూట్లలో తమ సేవలు విస్తరించేందుకు ఇండిగో కోడ్õÙర్ కుదుర్చుకోనుంది. -
Hamas: గాజాలో దాడులు ఆపితే.. ఒప్పందానికి రెడీ
ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా రఫాపై దాడులకు తెగబడుతోంది.గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా పౌరులపై దాడులు ఆపేస్తే.. ఇజ్రాయెల్‌తో తాము పూర్తి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ మలిటెంట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సైతం వెంటనే వదిలేస్తామని తెలిపారు.‘‘ గాజాపై ఇజ్రాయెల్ ఇలానే దాడలు, మారణహోనం కొనసాగిస్తే.. హమాస్, పాలస్తీనా వర్గాలు ఎట్టిపరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరించవు. అందుకే మేము మధ్యవర్తులకు తెలిపుతున్నాం. గాజా పౌరులపై దాడులు ఆపితే.. ఇజ్రాయెల్‌తో పూర్తి ఒప్పందం చేసుకోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయెల్ బంధీలను వెంటనే వదిలేస్తాం’’ అని హమాస్ పేర్కొందిఅంతర్జాతీయ న్యాయ స్థానం.. గాజాలో దాడులు ఆపాలన్నా ఇజ్రాయెల్ దక్షిణ గాజాలోని రఫా నగరంపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రఫా నగరంలో తల దాచుకుంటున్న అమాయక పాలస్తీనా పౌరులు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హమాస్ వెనక్కి తగ్గి ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.ఇక.. గతంలో కూడా కాల్పుల విరమణ హమాస్ ముందుకు ఇచ్చినా ఇజ్రాయెల్ తిరస్కరిచిన విషయం తెలిసిందే.తమ దేశానికి ముప్పుగా ఉన్న హమాస్‌ను పూర్తిగా అంతం చేసేవరకు తమ దాడులు కొనసాగిస్తామని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,171 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. -
పారామౌంట్ గ్లోబల్‌తో రిలయన్స్ డీల్
న్యూఢిల్లీ: పారామౌంట్ గ్లోబల్ సంస్థ భారత్‌లోని టీవీ వ్యాపార విభాగం వయాకామ్ 18లో తమకున్న 13.01 శాతం వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించనుంది. ఇందుకు సంబంధించి పారామౌంట్ గ్లోబల్‌కి చెందిన రెండు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 4,286 కోట్లుగా ఉంటుందని వివరించింది. రిలయన్స్‌కి చెందిన టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌కి వయాకామ్18 అనుబంధ సంస్థ. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అందులో రిలయన్స్‌కి 57.48 శాతం వాటా ఉంది. పారామౌంట్ గ్లోబల్‌తో ఒప్పందం పూర్తయ్యాక ఇది 70.49 శాతానికి పెరుగుతుంది. తమ కంటెంట్‌కి సంబంధించి వయాకామ్18కి లైసెన్సును ఇకపైనా కొనసాగిస్తామని పారామౌంట్ వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులు, రిలయన్స్–స్టార్ డిస్నీ జాయింట్ వెంచర్ పూర్తి కావడం తదితర అంశాలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొంది. మీడియాలో రిలయన్స్ మరింత పటిష్టం.. 2014లో నెట్వర్క్18లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన రిలయన్స్ ఆ తర్వాత నుంచి మీడియా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసుకునేందుకు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహదపడనుంది. సదరు జాయింట్ వెంచర్లో రిలయన్స్ రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సోనీ, నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన మీడియా వెంచర్స్ అన్నీ నెట్వర్క్18 కింద ఉన్నాయి. ఇది టీవీ18 బ్రాండ్ పేరిట న్యూస్ చానళ్లు, ఇతరత్రా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ చానల్స్‌ని నిర్వహిస్తోంది. అలాగే, మనీకంట్రోల్డాట్కామ్, బుక్‌మైషో వంటి సంస్థల్లోనూ నెట్ట్ వర్క్18కి వాటాలు ఉన్నాయి. వీటితో పాటు రిలయన్స్‌కి జియోసూ్టడియోస్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. రెండు లిస్టెడ్ కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీల్లో (డెన్, హాథ్‌వే) మెజారిటీ వాటాలు ఉన్నాయి. -
తెలంగాణ స్టార్టప్‌ల అభివృద్ధికి జైకా.. ఏకంగా రూ.1336 కోట్లు
ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1,336 కోట్లు (JPY 23679 మిలియన్స్) లోన్ అందించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA), ఈ రోజు లోన్ అగ్రిమెంట్ మీద సంతకం సంతకం చేసింది. ఈ కార్యక్రమం కేవలం పట్టణ పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, ఔత్సాహిక వ్యాపార నాయకులకు కూడా మద్దతునిచ్చేలా వ్యూహాత్మకంగా రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ కోసం లోన్ అగ్రిమెంట్ మీద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ & జైకా ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జైకా ఇండియా ఆఫీస్ చీఫ్ రిప్రజెంటేటివ్ 'సైటో మిత్సునోరి' మాట్లాడుతూ.. తెలంగాణలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం మా లక్ష్యం అంటూ.. ప్రపంచంలోనే ఓడీఏ లోన్ ద్వారా స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ అండ్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి JICA మద్దతిచ్చే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే అని ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ దేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో జపాన్ & భారతదేశం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుందని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది. -
SONY: భారత్ మార్కెట్‌కు ప్రాధాన్యత
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో ఇతర అవకాశాలను అన్వేషించనున్నట్లు జపనీస్ దిగ్గజం సోనీ తాజాగా వెల్లడించింది. దేశీ మార్కెట్లో వృద్ధి అవకాశాలరీత్యా మరొక కొత్త ప్రణాళికకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలంలో భారీ వృద్ధికి వీలున్న దేశీ మార్కెట్లో సొంత కార్యకలాపాలకూ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అత్యంత అవకాశాలున్న భారత్ మార్కెట్లో పెట్టుబడులను కొనసాగించేందుకే కట్టుబడి ఉన్నట్లు సోనీ ప్రెసిడెంట్, సీవోవో, సీఎఫ్‌వో హిరోకీ టొటోకీ పేర్కొన్నారు. వెరసి వివిధ అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేశారు. కొత్తగా అవకాశం లభిస్తే పాత ప్రణాళికస్థానే అమలు చేయనున్నట్లు తెలియజేశారు. ‘జీ’తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో హిరోకీ భారత్ మార్కెట్లో కంపెనీ వ్యూహాలపై స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గత పెట్టుబడుల ప్రణాళికలు లేదా ఆలోచనల్లో ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి నిర్దిష్ట ప్రణాళికలు లేవని వెల్లడించారు. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) ద్వారా దేశీయంగా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు హీరోకీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ జేవీ
గోవా: దేశీ చమురు–గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ, అతిపెద్ద విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ఒప్పందంపై ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం వేదికగా బుధవారం సంతకం చేశాయి. ఈ జేవీ ద్వారా భారత్‌తోపాటు విదేశాల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తాయి. స్టోరేజ్, ఈ–మొబిలిటీ, కార్బన్ క్రెడిట్, గ్రీన్ క్రెడిట్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంతోపాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి విభాగాల్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తాయి. -
Israel-Hamas war: మరో 17 మంది బందీల విడుదల
గాజా్రస్టిప్: ఇజ్రాయెల్–హమాస్ గ్రూప్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో సందిగ్ధత వీడింది. ఒప్పందానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉంటున్నాయి. మూడో విడత కింద ఆదివారం మరో 17 మంది బందీలకు హమాస్ విముక్తి కలిగించింది. వీరిలో 14 మంది ఇజ్రాయెలీలు, ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అలాగే 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ అధికారులు విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ హమాస్ మిలిటెంట్లు శనివారం బందీలను విడుదల చేయడానికి నిరాకరించారు. ఒప్పందం అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఒప్పందం యథాతథంగా అమలవుతున్నట్లు కొన్ని గంటల తర్వాత తేటతెల్లమయ్యింది. శనివారం బందీల్లోని 13 మంది ఇజ్రాయెలీలను, నలుగురు థాయ్‌లాండ్ జాతీయులను హమాస్ విడుదల చేసింది. వీరిలో నాలుగేళ్ల అమెరికన్–ఇజ్రాయెలీ చిన్నారి అబిగైల్ ఎడాన్ కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులను అక్టోబర్ 7న మిలిటెంట్లు హత్య చేశారు. అమెరికా బందీలంతా సైతం అతిత్వరలో విడుదలవుతారని ఆశిస్తున్నామని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ చెప్పారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై అనూహ్యంగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా మార్చి, గాజాకు తరలించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్–హమాస్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలకు హమాస్ స్వేచ్ఛ కలి్పంచింది. నాలుగో విడత కింద సోమవారం మరికొంత మంది విడుదల కానున్నారు. మరోవైపు శనివారం రాత్రి ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్ దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ సీనియర్ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడిలో హమాస్ సీనియర్ కమాండర్ అహ్మద్ అల్–ఘందౌర్(56) మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ ఆదివారం స్వయంగా ప్రకటించింది. అయితే, ఈ దాడి ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న సంగతి బయటపెట్టలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా మరణించిన హమాస్ కమాండర్లలో అహ్మద్ అల్–ఘందౌర్ అత్యంత పెద్ద హోదా ఉన్న నేత కావడం గమనార్హం. ఉత్తర గాజాలో హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్నాడు. హమాస్ సాయుధ విభాగంలో హై–ర్యాకింగ్ కలిగి ఉన్నాడు. 2002నుంచి ఇజ్రాయెల్ సైన్యం సాగించిన హత్యాయత్నాల నుంచి మూడుసార్లు తప్పించుకున్నాడు. -
Israel-Hamas war: నేటి నుంచే కాల్పుల విరమణ!
ఖాన్ యూనిస్: గాజాలో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ, దాదాపు 50 మంది బందీలకు విముక్తి, ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా ఫైటర్ల విడుదలపై ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం ఒక్కరోజు ఆలస్యంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ఖతార్ ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది. తొలుత 13 మంది బందీలు విడుదలవుతారని తెలియజేసింది. వాస్తవానికి గురువారం ఉదయం నుంచే ఈ ఒప్పందం అమలు కావాలి. చివరి క్షణంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. కాల్పుల విరమణకు, బందీల విడుదలకు తగిన సానుకూల పరిస్థితులను సృష్టించే పనిలో మధ్యవర్తులు నిమగ్నమయ్యారని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్–అన్సారీ వివరించారు. ఈ కార్యాచరణ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఒప్పందం కుదిర్చే విషయంలో ఖతార్ అత్యంత కీలకంగా వ్యవహరించింది. గాజాలో హమాస్ చెరలో ఉన్న తమ ఆప్తుల విడుదల కోసం బందీల కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమ దేశంలోని జైళ్ల నుంచి విడుదల కావడానికి అర్హతలు కలిగిన 300 మంది పాలస్తీనా ఖైదీల జాబితాను ఇజ్రాయెల్ న్యాయ శాఖ బహిర్గతం చేసింది. వీరిలో చాలామంది యువకులే ఉన్నారు. గత ఏడాది కాలంలో వీరంతా అరెస్టయ్యారు. రాళ్లు విసరడం, చిన్నచిన్న నేరాలకు పాల్పడడం వంటి కారణాలతో ఇజ్రాయెల్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేస్తే, ఒప్పందం ప్రకారం 150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది. అల్–షిఫా డైరెక్టర్, డాక్టర్ల అరెస్టు గాజాలోని అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాల్మియాతోపాటు ఇద్దరు సీనియర్ డాక్టర్లను ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన వాహనాల్లో రోగులతోపాటు ప్రయాణిస్తుండగా సైన్యం వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్, వైద్యులను ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అల్–షిఫా కింద హమాస్ సొరంగం, బంకర్లు గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో భారీ సొరంగంలో హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే చెబుతోంది. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాన్ని సైన్యం తాజాగా బయటపెట్టింది. విదేశీ జర్నలిస్టుల బృందాన్ని హమాస్ సొరంగంలోకి తీసుకెళ్లి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించింది. రాళ్లతో నిర్మించిన ఈ సొరంగం 150 మీటర్ల పొడవు ఉంది. అల్–షిఫా కింద అండర్‌గ్రౌండ్ బంకర్లను కలుపుతూ దీన్ని నిర్మించారు. సొరంగం చివర వసతి గృహం లాంటిది కనిపిస్తోంది. ఏసీ, వంటగది, బాత్రూమ్, రెండు ఇనుప మంచాలు ఉన్నాయి. గచ్చుపై తెల్లటి టైల్స్ పరిచారు. ఈ టన్నెల్ చాలా రోజులు ఉపయోగంలో లేనట్లు దుమ్ముధూళితో నిండిపోయి ఉంది. అల్–షిఫా కిందనున్న హమాస్ సొరంగం దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాజాలోని ఆసుపత్రులను హమాస్ మిలిటెంట్లు ప్రధాన స్థావరాలుగా మార్చుకున్నారని, వాటి కింది భాగంలో సొరంగాలు, బంకర్లు నిర్మించుకున్నారని, ఆయుధాలు నిల్వ చేశారని, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆసుపత్రులపై గురిపెట్టి వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండిస్తోంది. -
సూపర్డ్రైతో రిలయన్స్ జత
న్యూఢిల్లీ: దక్షిణాసియా మేధో హక్కుల(ఐపీ ఆస్తులు) విక్రయానికి రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ఫ్యాషన్ రిటైలర్ సూపర్‌డ్రై తాజాగా పేర్కొంది. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ) ద్వారా రిలయన్స్ రిటైల్ 4 కోట్ల పౌండ్లు(రూ. 402 కోట్లు) వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా స్వెట్‌షర్టులు, హుడీస్, జాకెట్స్ తదితర ఫ్యాషన్ ప్రొడక్టులను రూపొందిస్తున్న సూపర్‌డ్రై.. జేవీలో 24 శాతం వాటాను పొందనుంది. మిగిలిన 76 శాతం వాటా రిలయన్స్ రిటైల్ చేతిలో ఉంటుంది. ఒప్పందం ప్రకారం సూపర్‌డ్రై బ్రాండ్ ఐపీ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీకి శాశ్వతంగా బదిలీకానున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్ యూకేతో ఐపీ జేవీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సూపర్‌డ్రై పీఎల్సీ.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. తద్వారా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో సూపర్‌డ్రై బ్రాండుసహా.. సంబంధిత ట్రేడ్‌మార్క్‌లను జేవీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధుల ఆవశ్యకత: సూపర్‌డ్రై ఇటీవల హోల్‌సేల్ కస్టమర్ల నుంచి బలహీన ఆర్డర్ల కారణంగా స్టాక్ నిల్వలు, లిక్విడిటీ తదితర అంశాలలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో జేవీకి తెరతీసింది. దీంతో స్థూలంగా 3.04 కోట్ల పౌండ్ల నగదు లభించనుందని అంచనా వేస్తోంది. కాగా.. తాజా ఒప్పందంతో రిలయన్స్ దక్షిణాసియాలోని మూడు దేశాలలో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు సూపర్‌డ్రై తెలియజేసింది. జేవీలో సూపర్‌డ్రై వాటాను కొనసాగించడంతోపాటు.. తమ నైపుణ్యం ద్వారా బ్రాండ్ డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్‌లలో మద్దతిస్తుందని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీ దర్శన్ మెహతా చెప్పారు. భారత్ భారీ అవకాశాల మార్కెట్‌కాగా.. రిలయన్స్‌తో పటిష్ట బంధమున్నట్లు సూపర్‌డ్రై వ్యవస్థాపకుడు, సీఈవో జూలియన్ డంకెర్టన్ పేర్కొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల బీమా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగంలో సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (బీమా)ని రూ.45 లక్షల నుంచి ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచింది. ఈమేరకు ఆర్టీసీ గురువారం ఎస్బీఐతో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత మూడేళ్ల క్రితం రూ.45 లక్షల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలులోకి తెచి్చంది. తాజాగా దీన్ని ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచడం విశేషం. కొత్త శాలరీ ప్యాకేజీ 2026 సెప్టెంబరు 2 వరకు అమలులో ఉంటుంది. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం: పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. శాలరీ ప్యాకేజీ ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అధిక పెన్షన్ విధానంతో అప్పటి వరకు రూ.5 వేలు పింఛన్ పొందిన ఉద్యోగులకు ఏకంగా రూ.40 వేల వరకు పెన్షన్ పెరిగిందన్నారు.ఇప్పుడు ప్రమాద బీమాను రూ.1.10 కోట్లకు పెంచడం ఉద్యోగుల కుటుంబాలకు భరోసానిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం పట్ల ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. రూ.1.10 కోట్ల ప్రమాద బీమాతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే వారి పిల్లల చదువుల కోసం అబ్బాయిలకు రూ.8 లక్షలు, అమ్మాయిలకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగుల పిల్లల వివాహ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఎంకే సిన్హా, ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఏ.కోటేశ్వరరావు, కృష్ణమోహన్,ఎఫ్ఏ–సీఏ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈయూ హర్షం ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలు చేయడంపట్ల ఈయూ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కృతజ్ఞతలు తెలిపింది.ఈమేరకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదరరావు, జీవీ నరసయ్య ఓ ప్రకటన జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఇలా.. ప్రమాద బీమా రూ.30 లక్షల నుంచి రూ.85 లక్షలకు పెంపు రూపే డెబిట్ కార్డ్ లింకేజీ ద్వారా రూ.10 లక్షలు కొత్త రూపే కార్డ్ ద్వారా మరో రూ.10 లక్షలు సహజ మరణానికి రూ.5 లక్షలు మొత్తం మీద రూ.1.10 కోట్లు -
విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రపంచస్థాయి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంస్ధల విద్యార్ధులు ప్రపంచస్ధాయిలో ఉద్యోగాలు సంపాదించేలా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ పిల్లలందరూ ప్రభుత్వ బడులు నుంచి వచ్చినవాళ్లు. అట్టడుగు వర్గాలకు చెందిన వీళ్లను దృష్టిలో ఉంచుకుని.. వారి పట్ల మరింత సహృదయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని కేవలం జూనియర్ లెవెల్కే పరిమితం చేయకుండా.. ప్లస్ వన్, ప్లస్ టూ సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలి. మీరు కచ్చితంగా మా ప్రభుత్వ బడులను చూడాలి. అప్పుడే మీకు మేం విద్యారంగంలో చేస్తున్న మార్పులు నేరుగా అర్ధం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ జూలై ఆఖరు నాటికి రాష్ట్రంలో 30,230 క్లాస్‌రూమ్‌లను డిజిటలైజ్ చేయబోతున్నాం. మొత్తంగా దాదాపు 63వేల క్లాస్ రూమ్‌లను డిసెంబరు నాటికి డిజిటలైజ్ చేయబోతున్నాం.’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్ ‘‘మరో వైపు 8వతరగతిలోకి అడుగుపెడుతున్న ప్రతి విద్యార్ధికి ట్యాబులు పంపిణీ చేశాం. ఈ ఏడాది కూడా 8వతరగతి విద్యార్ధులకు డిసెంబరు 21న ట్యాబులు పంపిణీ చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు నేడు పేరుతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్ధికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా ఉచితంగా అందిస్తున్నాం. వీటకి అదనంగా ఇప్పుడు టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ చెప్పారు. -
బ్యాంక్ లాకర్ డెడ్‌లైన్: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్..
Bank Locker Deadline: విలువైన వస్తువులు, ఆభరణాలు, పత్రాలను భద్రపరచడానికి అత్యంత సురక్షితమైన సాధనం బ్యాంక్ లాకర్ అని మనందరికీ తెలుసు. ఈ బ్యాంక్ లాకర్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి లాకర్ పరిమాణాన్ని బట్టి ఖాతాదారుల నుంచి బ్యాంకులు రుసుములు వసూలు చేస్తాయి. ఈ లాకర్లకు సంబంధించి ప్రతి బ్యాంకుకు సొంత నిబంధనలు ఉంటాయి. తాజగా బ్యాంక్ లాకర్ల వినియోగదారులకు ఎస్బీఐతో సహా అనేక బ్యాంకులు ముఖ్యమైన అలర్ట్ అందించాయి. సవరించిన లాకర్ ఒప్పందంపై జూన్ 30 లోపు సంతకం చేయడం తప్పనిసరి అని సూచించాయి. ఆర్బీఐ మార్గదర్శకాలేంటి? జనవరి 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకు లాకర్ ఒప్పంద ప్రక్రియను 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే జూన్ 30 నాటికి 50 శాతం లాకర్ ఒప్పందాల పునరుద్ధరణ పూర్తవ్వాలి. ఆ తర్వాత సెప్టెంబరు 30 నాటికి 75 శాతం, డిసెంబర్ 31 నాటికి 100 శాతం పూర్తవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు లాకర్ ఒప్పందాలు పూర్తి చేయాలని కస్టమర్లకు అలర్ట్‌లు పంపిస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 2021 ఫిబ్రవరిలో ఆర్బీఐ ఈ ఆదేశాలను జారీ చేసింది. తర్వాత 2021 ఆగస్టులో లాకర్ ఒప్పంద నియమాలను సవరించింది. ఎటువంటి చార్జ్ లేకుండా.. బ్యాంకుల్లో కొత్త లాకర్లను పొందే కస్టమర్ల కోసం ఒప్పంద నియమాలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే లాకర్లు కలిగిన కస్టమర్లు ఒప్పంద ప్రక్రియను 2023 జనవరి 1 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా చాలా మంది కస్టమర్లు సవరించిన ఒప్పందాలను పూర్తి చేయలేదు. దీంతో ఆర్బీఐ గడువును 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి చార్జ్‌లు వసూలు చేయకుండా స్టాంప్ పేపర్‌పై ఒప్పందాలను పూర్తి చేయాలి. లాకర్ నిబంధనలు ఇవే.. బ్యాంక్ లాకర్లు వివిధ నియమ నిబంధనలకు లోబడి ఉంటాయి. వర్షాలు, వరదలు, భూకంపం, పిడుగులు పడటం వంటి విపత్తులు, అల్లర్లు, తీవ్రవాద దాడుల వంటి ఘటనల కారణంగా లాకర్‌కు కలిగే నష్టానికి బ్యాంకులు బాధ్యత వహించవు. అయితే లాకర్ భద్రతను నిర్ధారించడం బ్యాంక్ బాధ్యత. అగ్నిప్రమాదం, దొంగతనం, చోరీలు, దోపిడీలు, భవనం కూలడం, బ్యాంకు నిర్లక్ష్యం, బ్యాంకు ఉద్యోగులు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన సందర్భాల్లో మాత్రం బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన -
ఈ ఏడాదీ ఆర్బీకేల్లో మిరప విత్తనం.. 35 కంపెనీలతో ఏపీ సీడ్స్ ఒప్పందం
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రధాన వాణిజ్య పంట అయిన మిరప సాగు గత నాలుగేళ్లుగా పెరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తు నుంచి మార్కెటింగ్ వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా నాణ్యమైన దిగుబడులు పెరిగి, మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో మిరప సాగుకు రైతులు ముందుకు వçస్తుండటంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గతంలో ప్రతి ఏటా మిర్చి రైతులకు బ్లాక్ మార్కెట్, అధిక ధరలు, నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు పెద్ద సమస్యగా ఉండేవి. రైతులను ఆర్థికంగా దెబ్బతీసేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విత్తనాలను అందించడం నుంచి పంటను అమ్ముకొనే వరకు రైతులకు అండదండగా నిలుస్తోంది. దీంతో విత్తనాలు, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ, కల్తీల బారి నుంచి అన్నదాత బయటపడ్డాడు. ఈ ఖరీఫ్‌లో కూడా మిర్చి రైతులకు కల్తీ, నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా ఈ ఏడాది కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా విత్తనాల కంపెనీలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటోంది. డిమాండ్ ఉన్న విత్తన రకాలను మార్కెట్లో అందుబాటులో ఉంచుతోంది. డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా టాస్క్‌ఫోర్స్ బృందాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతులు సాధారణంగా మేలో విత్తనాలు కొని జూన్, జూలైలో నారుపోస్తారు. సాగు విస్తీర్ణంలో 30 శాతం ఓపీ (ఓపెన్ పొలినేటెడ్), 70 శాతం హైబ్రీడ్ విత్తనం వేస్తారు. సీజన్లో 2.57 కిలోల ఓపీ, 35 వేల కిలోల హైబ్రీడ్ విత్తనం అవసరం. ఓపీ విత్తనానికి ఢోకా లేకున్నప్పటికీ, హైబ్రీడ్ విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 9 వేల ప్యాకెట్లు ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేశారు. వచ్చే ఖరీఫ్‌లో డిమాండ్ ఉన్న రకాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ సీడ్ యాక్టు కింద 35 విత్తన కంపెనీలతో ఏపీ సీడ్స్ ఎంవోయూ చేసుకుంది. అగ్రి ల్యాబ్స్‌లో జర్మినేషన్ టెస్ట్, నాణ్యతను పరీక్షించిన తర్వాతే ఆర్బీకేల ద్వారా కంపెనీలు నిర్దేశించిన ధరలకే రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణకు టాస్క్‌ఫోర్స్ సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో విత్తనాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మేవారు, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ ద్వారా అధిక ధరలకు విక్రయించే డీలర్లు, వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జిల్లాలవారీగా వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బందితో ఏర్పాటు చేస్తున్న ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాయి. ఎవరైనా కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయించినా, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటాయి. మరో వైపు నకిలీ నారు కట్టడికిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 50 శాతం మంది మార్కెట్లో కొన్న విత్తనాన్ని నారు కోసం షేడ్‌నెట్స్‌కు ఇస్తారు. మిగిలిన 50 శాతం రైతులు షేడ్‌నెట్స్ నుంచి నేరుగా నారు కొంటారు. నర్సరీలతో పాటు షేడ్‌నెట్స్‌ను కూడా నర్సరీ యాక్టు పరిధిలోకి తేవడంతో విధిగా సీడ్ రిజిస్టర్లు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. నారు అమ్మే ముందు నారుకు ఉపయోగించిన విత్తనం ఏ కంపెనీదో లాట్ నంబర్లతో సహా చెప్పాల్సి ఉంటుంది. నాణ్యమైన విత్తనం వాడలేదని తనిఖీల్లో తేలితే షేడ్‌నెట్స్ లైసెన్సులను రద్దు చేస్తారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిరప సాగవుతోంది. అత్యధికంగా పల్నాడులో 1.42 లక్షల ఎకరాలు, ప్రకాశంలో 91,347 ఎకరాలు, గుంటూరులో 67,500 ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. గత సీజన్లో గుంటూరు మిర్చి యార్డులో క్వింటాలు ధర రూ.27వేలకు పైగా, వరంగల్‌లో ఏకంగా రూ.50 వేలకు పైగా పలికింది. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో పత్తి, వేరుశనగ రైతులు కూడా పెద్ద ఎత్తున మిరప వైపు మళ్లుతున్నారు. 2021–22 లో రికార్డు స్థాయిలో 5.62 లక్షల ఎకరాలు, 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. రానున్న ఖరీఫ్‌లో మిరప సాగు విస్తీర్ణం 6 లక్షల ఎకరాలు దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం కొరత రానీయం రైతులకు సరిపడా హైబ్రీడ్ మిరప విత్తనాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. డిమాండ్ ఉన్న విత్తన రకాలను రైతులకు అందిస్తాం. ఎక్కడైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్సులు కూడా రద్దు చేస్తాం. బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ ఆర్బీకేల ద్వారా విత్తనం సరఫరా విత్తనాల కోసం 35 కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం. సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తాం. గతేడాది 9 వేల ప్యాకెట్లు ఆర్బీకేల ద్వారా విక్రయించాం. ఈ ఏడాది కూడా డిమాండ్ ఉన్న హైబ్రీడ్ రకాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. 29 రకాల విత్తనాలు 115 క్వింటాళ్లు అవసరమని ఉద్యాన శాఖ నుంచి ఇండెంట్ ఇచ్చింది. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. –డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్ అధిక ధరలకు కొనొద్దు మిరప, పత్తి విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆతృతపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతులకు సూచించారు. కల్తీ, నకిలీ విత్తనాలను, బ్లాక్ మార్కెట్‌ను నిరోధించేందుకు జిల్లాలవారీగా టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మిరప, పత్తి విత్తనాలను గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. విత్తనం దొరకదన్న ఆందోళన అవసరం లేదని, డిమాండ్ ఉన్న రకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. – రైతులకు మంత్రి కాకాణి సూచన -
హీరో-జీరో జట్టు.. ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తిలో ఇక తిరుగులేదు!
దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్‌తో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలూ కలిసి ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఈ మేరకు హీరో మోటర్ కార్ప్.. జీరో మోటర్‌సైకిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ మోటర్ సైకిళ్లు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న జీరో మోటార్ సైకిల్స్ సంస్థ ఈ ఒప్పందం ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీలో హీరో సంస్థకు సహకారం అందిస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో జీరో మోటార్‌సైకిల్స్ సంస్థలో హీరో ఆటోమొబైల్స్ 60 మిలియన్ డాలర్ల మేరకు ఈక్విటీ పెట్టుబడి పెట్టింది. ఈ తాజా ఒప్పందం గురించి హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ మాట్లాడుతూ.. జీరో మోటార్‌సైకిల్స్‌తో తమ భాగస్వామ్యాన్ని కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తమను భాగస్వామిగా ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నామని జీరో మోటార్‌సైకిల్స్ సీఈవో శామ్ పాస్చెల్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో హీరో సంస్థ లక్ష్య సాధనకు ఈ ఒప్పందం మరింత దోహదం చేస్తుంది. హీరో సంస్థ ఇప్పటికే విడా వీ1 పేరుతో ఓ ప్రీమియం ఎలక్ట్రానిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్లస్ వెర్షన్ రూ.1.45 లక్షలు, ప్రో వేరియంట్ (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) రూ. 1.59 లక్షలుగా ఉంది. ఇది బెంగళూరు, ఢిల్లీ, జైపూర్లలో పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు నగరాల్లో దాదాపు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! -
నిత్యానంద కైలాసకు బిగ్ షాక్
వాషింగ్టన్: కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో వార్తల్లోకెక్కిన వివాదాస్పద వ్యక్తి నిత్యానందకు పెద్ద షాకే తగిలింది. కైలాసానికి అంతర్జాతీయ ఉనికి, ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద అండ్ కో తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈలోపే కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం ఒకటి ప్రకటించింది. అమెరికన్ సిటీ నెవార్క్.. కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మేం మోసపోయాం. జరిగినదానికి చింతిస్తున్నాం. కైలాస పరిసర పరిస్థితుల గురించి తెలుసుకున్న వెంటనే మేం స్పందించాం. దాని చుట్టూరా అన్నీ వివాదాలే. అందుకే ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని జనవరి 18వ తేదీనే రద్దు చేసుకున్నాం’’ అని నగర అధికార ప్రతినిధి సుసాన్ గారోఫాలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కైలాస ప్రభుత్వ వెబ్సైట్ మాత్రం అమెరికా నగరం, తమ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను(USK)ను గుర్తించిందని, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ సంబంధిత పత్రాలను పోస్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించుకుంటోంది. జనవరి 12వ తేదీన నెవార్క్ సిటీ హాల్లో కైలాస ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోసం గురించి తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, అది చెల్లుబాటు కాదని, పైగా కైలాసం చుట్టూ వివాదాలు ఉన్నట్లు గుర్తించామని నెవార్క్ ప్రతినిధులు ఇప్పుడు చెప్తున్నారు. అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద స్వామి. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించి జనాల్ని బిత్తరపోయేలా చేశాడు. పైగా ఆ దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఐరాస మానవహక్కుల కమిషన్‌లో నిత్యానంద వేధింపులకు గురవుతున్నాడని, స్వదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ ఆ దేశ ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగం.. దానిని ఐరాస మానవహక్కుల కమిషన్ కొట్టిపారేయడం గురించి తెలిసిందే. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పరమహంస నిత్యానంద ఫాలోవర్స్ మాత్రం కైలాసను విపరీతంగా ప్రమోట్ చేస్తుంటారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా కైలాస మీద నడిచే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. -
తెలంగాణ ప్రభుత్వంతో బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ ఫార్మా కంపెనీ ఒప్పందం
-
గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. గడువు పొడిగించింది
ముంబై: సవరించిన సేఫ్ డిపాజిట్ లాకర్ల ఒప్పందాలను కస్టమర్లతో బ్యాంక్‌లు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఇందుకు ఈ ఏడాది చివరి వరకు గడువును ఆర్బీఐ పొడిగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లాకర్ల ఒప్పందాల్లో మార్పులు చేసి, వాటిపై కస్టమర్ల సమ్మతి తీసుకోవాలంటూ 2021 ఆగస్ట్‌లోనే ఆర్బీఐ అన్ని బ్యాంక్‌లను కోరింది. ‘‘పెద్ద సంఖ్యలో కస్టమర్లు నవీకరించిన లాకర్ ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. గడువులోపు (2023 జనవరి 1 నాటికి) లాకర్ ఒప్పందాలను తిరిగి కుదుర్చుకోవాలంటూ కస్టమర్లకు చాలా వరకు బ్యాంక్‌లు తెలియజేయలేదు. కనుక 2023 ఏప్రిల్ 30 నాటికి లాకర్ ఒప్పందాలను తిరిగి కుదుర్చుకోవాల్సిన విషయాన్ని కస్టమర్లకు బ్యాంక్‌లు విధిగా తెలియజేయాలని కోరాం. జూన్ 30 నాటికి కనీసం 50%, సెప్టెంబర్ 30 నాటికి కనీసం 75% కస్టమర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. ఒప్పందం కాపీని కస్టమర్‌కు అందించాలి’’ అని తాజా ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. జనవరి 1 నాటికి ఒప్పందాలు చేసుకుని లాకర్లను స్తంభింపజేస్తే, వాటిని తిరిగి విడుదల చేయాలని ఆదేశించింది. చదవండి: జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా! -
Cristiano Ronaldo: కళ్లు చెదిరే రీతిలో.. కాసుల పంట
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు బంపరాఫర్ తగిలింది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ముందే మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో అప్పటినుంచి ఏ క్లబ్‌కు సంతకం చేయలేదు. తాజాగా ఆ ఎదురుచూపులకు రొనాల్డో తెరదించాడు. ఇకనుంచి రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు అల్ నజర్ ఫుట్‌బాల్ క్లబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ (రెండేండ్లు) రొనాల్డో.. అల్ నజర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ విలువ 200 మిలియన్ యూరోలకు పైగా ఉందని సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1770 కోట్లు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంలో ఇదే డీల్ పై పలు రకాల కథనాలు వినిపించాయి. అప్పుడు రొనాల్డో వీటిని కొట్టిపారేసాడు. తాను ఎవరితో ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు భారీ డీల్‌తో ప్రేక్షకుల ముందు రావడం గమనార్హం. ఇక ఫిఫా ప్రపంచకప్‌లోనూ రొనాల్డో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్‌గా పోర్చుగల్‌ను ఫైనల్ చేరుస్తాడనుకుంటే క్వార్టర్స్‌కే పరిమితమయ్యాడు. అంతేగాక ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.అంతకముందు ఫిఫా ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్నాడు. అదీగాక మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్ తో గొడవ ఈ వివాదం మరింత ముదిరేలా చేసింది. History in the making. This is a signing that will not only inspire our club to achieve even greater success but inspire our league, our nation and future generations, boys and girls to be the best version of themselves. Welcome @Cristiano to your new home @AlNassrFC pic.twitter.com/oan7nu8NWC — AlNassr FC (@AlNassrFC_EN) December 30, 2022 చదవండి: Pele: భారత్‌తో అనుబంధం... నాడు సాకర్ మేనియాలో తడిసిముద్దయిన నగరం పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి -
హైదరాబాద్: వేర్‌హౌసింగ్ స్థలాలకు విపరీతమైన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాల సరఫరా, డిమాండ్ పెరిగింది. శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు ప్రాంతాలు వేర్‌హౌస్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందాయి. వీటిల్లో మేడ్చల్ వేర్‌హౌస్ హబ్‌గా మారిపోయింది. 2021–22లలో హైదరాబాద్‌లో 54 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్థల లావాదేవీలు జరిగాయి. 24 లక్షల చ.అ. లావాదేవీలు జరిగిన క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 128 శాతం ఎక్కువ అని నైట్‌ఫ్రాంక్ ఇండియా వేర్‌హౌసింగ్ నివేదిక వెల్లడించింది. ► 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే రిటైల్ రంగం 2022 ఆర్ధిక సంవత్సరంలో 17 శాతం మేర పెరిగింది. దీంతో ఈ–కామర్స్, రిటైల్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమలు వృద్ధి చెందుతుంది. ఫలితంగా వేర్‌హౌస్ విభాగానికి డిమాండ్ ఏర్పడింది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ రిటైల్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, డీమార్ట్, ఎస్వీఎస్ ఫార్మా వంటి ప్రధాన కంపెనీలు నగరంలో వేర్‌హౌస్ స్థలాన్ని ఆక్రమించాయి. చాలా వరకు లాజిస్టిక్, ఈ–కామర్స్ కంపెనీలు గిడ్డంగుల కార్యాకలాపాల నిర్వహణను థర్డ్ పార్టీ లాజిస్టిక్ (3 పీఎల్) కంపెనీలకు అందిస్తున్నాయి. 3 పీఎల్ సంస్థల వృద్ధితో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో 24 శాతంగా ఉన్న 3 పీఎల్ సేవల డిమాండ్ 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి 31 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. వేర్‌హౌస్ విభాగంలో ఈక్విటీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. గతేడాది ఈ రంగంలోకి 1.3 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి. మేడ్చల్ క్లస్టర్ జోష్.. ► హైదరాబాద్‌లోని గిడ్డంగుల స్థల లావాదేవీలలో మేడ్చల్ కస్టర్ల జోరు మీద ఉంది. 2021–22లో జరిగిన వేర్ హౌస్ లావాదేవీలలో అత్యధికంగా ఈ జోన్లోనే జరిగా యి. 2021 ఆర్ధిక సంవత్సరంలో 48% వాటా ఉన్న మేడ్చల్ క్లస్టర్ 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి 60 శాతానికి పెరిగింది. ► శంషాబాద్ క్లస్టర్ 51 శాతం నుంచి ఏకంగా 30 శాతానికి క్షీణించింది. అలాగే పటాన్చెరు క్లస్టర్ 2% నుంచి 10%కి పెరిగింది. ► మేడ్చల్, పటాన్చెరు గిడ్డంగుల క్లస్టర్లలో భూముల ధరలు పెరిగినా.. వేర్‌హౌస్ స్థలాల అద్దె లు స్ధిరంగానే ఉన్నాయి. ధరలెలా ఉన్నాయంటే.. మేడ్చల్ ► ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు ► గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.17–21 ► గ్రేడ్–బీ అద్దె చ.అ.కు రూ.16–19 ప్రాజెక్ట్‌లు: ముసద్దిలాల్ ప్రాజెక్ట్స్, జీరో మైల్ వేర్‌హౌసింగ్ పటాన్చెరు ► ఎకరం రూ.1.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు ► గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.17–20 ► గ్రేడ్–బీ అద్దె చ.అ.కు రూ.14–18 ప్రాజెక్ట్‌లు: ఆల్కార్గో లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ శంషాబాద్ ► ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు ► గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.18–20 ► గ్రేడ్–బీ అద్దె చ.అ.కు రూ.15–17 ప్రాజెక్ట్‌లు: ఈఎస్ఆర్ జీఎంఆర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్, కే రహేజా కార్ప్ ఇండస్ట్రియల్ పార్క్. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్స్కీ
ఇండోనేషియా బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకి వీడియో సమావేశంలో హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధం ముగించేందుకు రష్యాతో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే మిన్స్క్ 3 ఒప్పందాన్ని కూడా తోసి పుచ్చారు. పైగా రష్యా ఒప్పందం అంటూనే ఉల్లంఘిస్తూ.. ఉంటుందన్నారు. ఇది తూర్పు డోన్బాస్ ప్రాంతంలో కీవ్ మాస్కోల మధ్య విఫలమైన ఒప్పందానికి ఒక ఉదాహరణ అని జెలెన్స్కీ అన్నారు. "రష్యా బలగాలు కీవ్‌లో దారుణమైన బీభత్సం సృష్టించాయి. ప్రపంచ అస్థిరతతో ఆటలాడింది, ఎన్ని విధాలుగా చెప్పిన వినలేదు అందువల్ల తాము రష్యాతో చర్చలకు ఇష్టపడటం లేదు. అయినా ఒప్పందం జరిగిన వెంటనే ఉల్లంఘించడం రష్యాకు ఒక అలవాటు అని విమర్శించారు." వాస్తవానికి రష్యా మద్దతుగల వేర్పాటువాదులు, కీవ్ మధ్య యుద్ధ విరమణ కోసం జర్మనీ, ఫ్రాన్స్ 2014, 2015లలో మొదటిసారిగా మిన్స్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అదీగాక ఇటీవలకాలంలో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు తక్కువగానే సాగాయి. జెలెన్స్కీ కూడా రష్యాతో చర్చించేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే.. మదర్ హీరోయిన్ అవార్డు!) -
సోషల్ మీడియాను షేక్ చేసిన జంట.. వరుడికి బంపరాఫర్ ఇచ్చిన వధువు
మానవ జీవితంలో వివాహ బంధం అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివాహ బంధంలో ఎన్నో ఆనందాలు, సమస్యలు, ఒడిదుడుకులు, సర్దుకుపోవడం వంటివి సర్వసాధారణం. ముఖ్యంగా నూరేళ్ల వివాహం బంధంలో ఇద్దరూ సమయాన్ని బట్టి సర్దుకుపోవాలని పెద్దలు చెబుతూనే ఉంటారు. అయితే, ప్రస్తుత జనరేషన్లో పెళ్లికి ముందే వధువరులిద్దరూ తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. పెళ్లి తరువాత ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే ఒప్పందానికి వస్తున్నారు. కాగా, తాజాగా కేరళకు చెందిన ఓ పెళ్లి జంట.. వివాహం సమయంలో చేసుకున్న ఓ అగ్రిమెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పెళ్లి సమయంలో వారిద్దరి మధ్య జరిగిన బాండ్ పేపర్ ఒప్పందం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ వారు ఏం చేశారంటే..? కేరళకు ఓ వధువు.. తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడిపేందుకు అంగీరిస్తానని, ఆ సమయంలో అతనికి ఫోన్ కాల్స్ చేయనని ఒప్పంద పత్రంపై సంతకం చేసింది. ఈ మేరకు వారికి నమ్మకం కుదిరేలా.. 50 రూపాయల బాండ్ పేపర్‌పై ఒప్పంద నియమాలు రాసి మరీ సంతకాలు చేసుకున్నారు. ఈ బాండ్ పేపర్‌పై సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారు. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు పెద్దలు వివాహం నిశ్చయించారు. ముహుర్తం ప్రకారం వీరద్దరికీ నవంబర్ 5వ తేదీన పాలక్కాడ్‌లోని కంజికోడ్‌లో వివాహం జరిగింది. అయితే, పెళ్లి సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన ఒప్పందం జరిగింది. పెళ్లి అయిన తర్వాత తన భర్త రఘు.. రాత్రి 9 గంటల వరకు తన స్నేహితులతో బయట తిరిగేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు అన్నది ఒప్పందం. ఆ సమయంలో ఆమె తన భర్తకు ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా చేయరాదు అని కూడా అగ్రిమెంట్లో ఉంది. దీనికి వధువు అర్చన ఓకే చెప్పింది. అంతేకాకుండా 50 రూపాయల బాండ్ పేపర్‌పై ఆమె సంతకం కూడా పెట్టింది. అనంతరం.. ఈ బాండ్ పేపర్‌ను వరుడు రఘు స్నేహితులు.. కొత్త జంటకు బహుమతిగా అందించారు. కాగా, ఈ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. #Kerala groom's friends came up with the idea of making his bride sign the wedding contract.https://t.co/vzWtB7Fw8l pic.twitter.com/OAOmj6eL80 — News18.com (@news18dotcom) November 12, 2022 -
మీడియా మింట్ కొనుగోలు ఒప్పందం రద్దు: బ్రైట్‌కామ్
న్యూఢిల్లీ: మీడియామింట్ సంస్థ కొనుగోలు కోసం కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ బ్రైట్‌కామ్ వెల్లడించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. ‘కొనుగోలు లావాదేవీ కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య డీల్‌గా మార్చుకోవాలని, బ్రైట్‌కామ్ భవిష్యత్తులో చేపట్టే కొనుగోళ్లకు బ్యాక్ఎండ్ సేవలు అందించాలని ఇరు సంస్థలూ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో 2021 డిసెంబర్ 7న కుదుర్చుకున్న షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. మీడియామింట్ ఇటీవల దక్కించుకున్న కొంత మంది క్లయింట్ల కార్యకలాపాలు .. బ్రైట్‌కామ్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం కోవకే చెందినవని, దీని వల్ల విలీన సంస్థ వృద్ధి అవకాశాలపై ప్రభావం పడవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. -
'అప్పు'డేమైంది..?.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే నిలిపివేసిన రుణాల విడుదలకు అనుమతి స్తామని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. రుణమిచ్చే సంస్థ, రుణం తీసుకునే సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగస్వామ్యం కావాలని కేంద్రం పట్టు పడుతోంది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలా జరిగితే కార్పొరేషన్లు తీసుకునే రుణాలు రాష్ట్ర రుణ ఖాతాలోకి వెళ్తాయి. తద్వారా రాష్ట్రం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకునే రుణాలు తగ్గుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అప్పుడు లేని షరతులు ఇప్పుడెందుకు? రుణ ఒప్పందాల సమయంలో లేని షరతులు అకస్మాత్తుగా ముందుకు తీసుకుని రావడంపై రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రుణాల్లో ఇప్పటికే 70 శాతం వరకు విడుదల చేశాక ఇప్పుడు ఈ త్రైపాక్షిక ఒప్పందం అంటూ మెలిక పెట్టడంపై సీఎం కేసీఆర్ కూడా అగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తీసుకున్న రుణాలపై నెలవారీ చెల్లింపుల్లోనూ ఎక్కడా డిఫాల్ట్ కాలేదని, అయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ఈ విధంగా కేంద్రం వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై పలుమార్లు రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం.. చివరి ఆప్షన్‌గా కోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం ఉత్తర్వులతో నిలిచిన నిధులు రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ) సహా నాబార్డ్ వంటి సంస్థలు రూ.76,900 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.43 వేల కోట్లు విడుదల చేయగా, వాటి ఖర్చు సైతం జరిగిపోయింది. మరో రూ.33 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా త్రైపాక్షిక ఒప్పందాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఫలించని అధికారుల చర్చలు త్రైపాక్షిక ఒప్పందం అంటే రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాల్సి వస్తుంది. అదే జరిగితే కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి చేరుతాయి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ఇతర రుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రంతో చర్చలకు రాష్ట్ర ఉన్నతాధికారులు నడుం బిగించారు. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఢిల్లీకి వచ్చిన సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లు కేంద్ర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రుణాల అంశంపై ఆర్ధిక రంగ నిపుణులు, మాజీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఢిల్లీలోని తన నివాసంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం కూడా ఇద్దరు, ముగ్గురు ఆర్థిక, న్యాయ నిపుణులతో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులకు అనుమతులకూ కొర్రీలు! కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి విషయంలో కూడా కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు గడిచిన మూడురోజులుగా ఇరిగేషన శాఖ అధికారులు ఈ విషయమై కేంద్ర జల సంఘం, జల శక్తి శాఖల చుట్టూ తిరుగుతున్నా పెద్ద ఫలితం లేదని చెబుతున్నారు. ఒక అంశంపై స్పష్టత ఇస్తే, మరో అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకొస్తోందని, సీతారామ, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, రామప్ప–పాకాల, తుపాకులగూడెం ప్రాజెక్టుల విషయంలో కాలుకు వేస్తే వేలికి..వేలికేస్తే కాలుకు అన్న చందంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కూడా కేంద్రం తీరుపై ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి తదుపరి కార్యాచరణపై గురువారం ఇద్దరు, ముగ్గురు ఎంపీలతో మాట్లాడినట్లు తెలిసింది. -
బైజూస్ తో ఒప్పందం తో ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు
-
‘వాట్సాప్’ సేవలు.. ఏపీ సర్కార్ ఒప్పందం..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను త్వరితగతిన ప్రజలకు చేరవేసే విధంగా వాట్సాప్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ–సేవల విస్తరణలో భాగంగా వాట్సప్ చాట్‌బోట్ సేవలను కూడా అందించనున్నట్లు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) తెలియజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగతిశీల అజెండాను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చేర వేసేలా వాట్సాప్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఏపీడీసీ వైస్ చైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: దేశంలోనే తొలిసారి.. సెకీతో ఒప్పందం ఓ ట్రెండ్‌సెట్టర్ రాష్ట్రంలో ఈ–గవర్నెన్స్ మరింత మెరుగు పరిచే విధంగా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వాట్సాప్ ఇండియా పబ్లిక్‌పాలసీ అధిపతి శివనాథ్ ఠుక్రాల్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా వాట్సాప్ సేవలు ఉపయోగపడతాయన్నారు. -
స్పైస్‌జెట్: ర్యాన్సమ్వేర్ ఎటాక్, ప్రయాణీకుల గగ్గోలు
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లిమిటెడ్‌కు ఊరట లభించింది. క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య పెండింగ్‌లో ఉన్న వివాదానికి తెర దించింది. దీంతో బుధవారంనాటి మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్ 4 శాతం లాభపడింది. క్రెడిట్ సూయిస్‌తో పాటు, ఇటీవల కెనడా లిమిటెడ్, బోయింగ్, సీడీబీ ఏవియేషన్, బీఓసీ ఏవియేషన్, అవోలాన్లతో సెటిల్మెంట్లతో సంస్థ వృద్ధికి, విస్తరణకు దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్ఛేంజ్లకిచ్చిన సమాచారం ప్రకారం స్పైస్‌జెట్ లిమిటెడ్, క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య వివాద సెటిల్మెంట్, అంగీకారం నిబంధనలపై (మే 23) సంతకాలు ముగిసాయి. తుది ఉత్తర్వుల కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిసింది. ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించేందుకు పరస్పర అంగీకారం కుదిరిందని స్పైస్‌జెట్ తెలిపింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు స్పైస్‌జెట్ ఇప్పటికే 5 మిలియన్ల డాలర్ల బ్యాంక్ గ్యారెంటీని అందించిందని, దీనికి సంబంధించి తమపై ఎలాంటి ప్రతికూల ఆర్థిక ప్రభావం ఉండదని తెలిపింది. స్విస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాలింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎస్ఆర్ టెక్నిక్స్‌కు 24 మిలియన్ల డాలర్లకు పైగా చెల్లింపులు చేయడంలో ఎయిర్‌లైన్ విఫలమవడంతో క్రెడిట్ సూయిస్ స్పైస్‌జెట్‌పై గత సంవత్సరం మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737లు, క్యూ-400లు,ఫ్రైటర్ విమానాలను నడుపుతుంది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద 63 రోజువారీ విమాన సర్వీసులతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ప్రవేశ పెడుతుందని, త్వరలో తమ విమానాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సీఎండీ అజయ్ సింగ్ సోమవారం తెలిపారు. కాగా కరోనా సంబందిత ప్రయాణ ఆంక్షలు సడలింపులతో దేశీయ విమానయాన ట్రాఫిక్ కోలుకుంటోంది. ఏప్రిల్‌లో దాదాపు 1.08 కోట్ల మంది దేశీయ ప్రయాణికులు ప్రయాణించారని, మార్చిలో ప్రయాణించిన వారి సంఖ్య 1.06 కోట్లకు పైగా 2 శాతం ఎక్కువ అని భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఇటీవల వెల్లడించింది. ఈ ఏప్రిల్‌లో స్పైస్‌జెట్, ఇండిగో, విస్తారా, గో ఫస్ట్, ఎయిరిండియా,ఎయిర్ ఏషియా ఇండియా ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 85.9 శాతం, 78.7, 82.9, 80.3, 79.5, 79.6 శాతంగా ఉన్నాయన్నారు. ర్యాన్సమ్వేర్ ఎటాక్, ప్రయాణీకుల గగ్గోలు స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై ర్యాన్సమ్వేర్ దాడి కారణంగా వందలాది ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీంతో ప్యాసెంజర్లు ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాలో వీడియోలు, పోస్ట్‌లతో విరుచుకుపడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానంలో బాధలుపడుతున్నామంటూ ఒక యూజర్ వీడియో పోస్ట్ చేశారు. మరోవైపు రాన్సమ్వేర్ అటాక్‌తో బుధవారం ఉదయం స్పైస్‌జెట్ డిపార్చర్స్ ఇబ్బందులు, ప్రయాణికులు చిక్కుకుపోవడంపై అధికార ప్రతినిధి స్పందించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అటాక్ కారణంగా బుధవారం ఉదయం నాటి విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని ట్విట్ చేశారు. ఈ పరిణామాన్ని తమ ఐటీ టీం సరిదిద్దిందని, విమాన సేవలు సజావుగానే ఉన్నాయంటూ స్పైస్‌జెట్ ట్విట్ చేసింది. Operating normally?? We are stuck here since 3 hrs and 45 mins? Neither cancelling nor operating, sitting in the flight not even the airport. No breakfast, no response! pic.twitter.com/dAfdIjzVzH — Mudit Shejwar (@mudit_shejwar) May 25, 2022 #ImportantUpdate: Certain SpiceJet systems faced an attempted ransomware attack last night that impacted and slowed down morning flight departures today. Our IT team has contained and rectified the situation and flights are operating normally now. — SpiceJet (@flyspicejet) May 25, 2022 Hi @flyspicejet we were supposed to depart from IXB at 9 am today and there are still no updates from anyone. Worst part we boarded the flight and then this update came when the attack was last night and my wife is here with me with fractured leg waiting in vain pic.twitter.com/UBZmxCaWCu — Himanshu Maheshwari (@himannshum) May 25, 2022 -
6 అంశాల్లో సహకారంపై WEF - రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం
-
ఫ్లిప్‌కార్ట్‌లో నారాయణపేట హస్తకళాకృతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నారాయణపేట స్వయం సహాయక సంఘాల మహిళలు, చేతివృత్తులు, చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశమంతటా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నారాయణపేటకు చెందిన ఆరుణ్య ప్రాజెక్టుతో ఫ్లిప్‌కార్ట్ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ‘టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్’పై మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా మహిళా చేతివృత్తులు, చేనేతకారులకు తరగతుల నిర్వహణ, క్షేత్రస్థాయి శిక్షణను అందించి.. వారు తయారుచేసే ఉత్పత్తులకు జాతీయస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలోని చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సమ్మిళిత అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మహిళల జీవనోపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం వంటివి తోడ్పడుతాయి’’అన్నారు. తెలంగాణ, ఆరుణ్యలతో భాగస్వామ్యం కావడం సంతోషకరమని.. మహిళలకు ఆర్థిక స్వా తంత్య్రం అందించడం, వారి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మార్కెటింగ్ అందించడం తమకు ఆనందాన్ని ఇస్తోందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పొరేట్ సంబంధాల అధికారి రజనీష్‌కుమార్ చెప్పారు. ఏమిటీ ఆరుణ్య? నారాయణపేటలో చేనేత, హస్తకళాకృతులకు ‘ఆరుణ్య’ ప్రసిద్ధమైన బ్రాండ్. కరోనా కాలంలో స్థానిక మహిళలకు ఉపాధి, వారు చేసే ప్రత్యేక ఉత్పత్తుల విక్రయం ద్వారా సాయపడేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మొదట పది మందితో మొదలై.. ఇప్పుడు కలంకారీ, బ్లాక్ పెయింటింగ్ అంశాల్లో మహిళలకు శిక్షణనిచ్చే స్థాయికి చేరుకుంది. -
50 ఏళ్ల వివాదానికి చరమగీతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు చరమ గీతం పాడాయి. 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారం ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఒప్పందంపై ఇరువురు ముఖ్యమంత్రులు సంతకాలు చేయడాన్ని ‘చరిత్రాత్మక రోజు’గా వర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. సామరస్య పరిష్కారం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిలోమీటర్ల సరిహద్దులో ఆరు చోట్ల సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదాన్ని ఈ ఒప్పందం పరిష్కరించనుంది. ఈ ఆరు ప్రాంతాల్లో 36 గ్రామాలు ఉండగా.. 36.79 చదరపు కిలోమీటర్ల వివాదానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అసోం 18.51 చదరపు కి.మీ. ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుని మిగిలిన 18.28 చదరపు కి.మీ. ప్రాంతాన్ని మేఘాలయకు ఇస్తుంది. (క్లిక్: గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా) 50 ఏళ్ల వివాదం 1972లో అస్సాం నుంచి మేఘాలయను విభజించినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైంది. కాగా, అసోం సీఎంతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు మేఘాలయ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ వద్దే హోంశాఖ) -
అంతరిక్షంలో ‘ధృవ’
సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో... కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్ఎస్ఐఎల్)లో హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష ఇంజనీరింగ్ పరిష్కారాల ఆవిష్కర్త ‘ధృవ స్పేస్ ప్రైవేటు లిమిటెడ్’ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అంతరిక్ష రంగంలో తొలిసారి ప్రైవేటుగా వాణిజ్య ప్రయోగ సేవల్ని ‘ధృవ స్పేస్’అందించనుంది. స్పేస్‌క్రాఫ్ట్ ప్లాట్ఫారం, నియంత్రణ, సమాచార, విద్యుత్ వ్యవస్థలు, సోలార్ ప్యానెళ్లతో ఉపగ్రహ ప్రయోగ రంగంలో ‘ధృవ స్పేస్ ఆర్బిటల్ డిప్లాయర్స్’(డీఎస్‌ఓడీ) పేరిట కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఉపగ్రహ వాహక నౌకల్లో భద్రతా ప్రమాణాలు, కచ్చితత్వం నెలకొల్పడంతో పాటుగా వాటిని మరింత సులువుగా ప్రయోగించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. ఒప్పందానికి తొలిమెట్టు డీఎస్‌ఓడీ టెక్నాలజీ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ), స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ)లో ధృవ తన డీఎస్‌ఓడీ సాంకేతికత ద్వారా ప్రయోగ సేవలు అందించడానికి ఇది తొలిమెట్టు. ఒప్పం దం మేరకు ధృవ తొలుత ‘డీఎస్‌ఓడీ –1యు ç పరీ క్షించనున్నారు. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరింది లేనిదీ కచ్చితంగా తెలిపే సెన్సర్లు ఈ సాంకేతికతలో కీలకంగా పరిగణిస్తున్నారు. మరో ఏడాది కాలంలో మరింత సామర్థ్యంతో కూడిన డీఎస్‌ఓడీ 3యు, 6యు, 12యు డిప్లాయర్స్ పనితీరునూ ‘ధృవ’ పరీక్షించనుంది. ఇన్‌స్పేస్, ఇస్రో, కేంద్ర అంతరిక్ష విభాగం నుంచి లభించిన మద్దతుతో స్మాల్ శాటిలైట్ సాంకేతికతలో దేశీయ ఆవిష్కరణలకు చోటు లభించిందని ధృవ స్పేస్ సీఈఓ సంజయ్ నెక్కంటి వ్యాఖ్యానించారు. దీంతో భారతీయ అంతరిక్ష స్టార్టప్‌లకు మరింత ఊతం లభిస్తుందని ఎన్ఎస్ఐఎల్ సీఎండీ డాక్టర్ రాధాకృష్ణ దురైరాజ్ చెప్పారు. -
టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు: ఏపీ-ఎఫ్ఏవో మధ్య ఒప్పందం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యునైటెడ్ నేషన్స్‌కు చెందిన పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) బృందం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ప్రతినిధులు కలిశారు. సుస్థిర వ్యవసాయ–ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడంతో పాటు రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు ఎఫ్ఏఓ– ఏపీల మధ్య టీసీపీ(టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు) ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య.. టోమియో షిచిరి, కంట్రీ డైరెక్టర్ (ఇండియా), పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) యునైటెడ్ నేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏ కె సింగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. చదవండి: CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక అందరికీ ఆహార భద్రతపై అంతర్జాతీయంగా ఏఫ్ఏఓ కృషి చేస్తోంది. రాష్ట్రంలో ఆర్బీకేలకు సాంకేతికంగా, ఆర్ధికంగా సాయం అందించనుంది. రైతు భరోసా కేంద్రాల బలోపేతం చేసేందుకు ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ సహకరించనున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు ఎఫ్ఏఓ శిక్షణ అందించనుంది. ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతుల్లోనూ రైతులకు శిక్షణ అందించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల వాడకం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారని.. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆర్బీకేలు వచ్చాయని సీఎం అన్నారు. అలాగే రైతులకు మద్దతు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇ– క్రాపింగ్ గురించి సీఎం వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయరంగంలో పెను మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జి శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే.?
ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ గురువారం రోజున ఇండియన్ రైల్వేస్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రైల్వే ప్రయాణీకులకు కమ్యూనికేషన్ విషయంలో మరింత నమ్మకాన్ని అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ట్రూకాలర్ పేర్కొంది. రైల్వే ప్రయాణికుల కోసం 139 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఐఆర్సీటీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రూకాలర్ యాప్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు యూజర్లు కాల్ చేసేటప్పడు గ్రీన్ వెరిఫైడ్ బిజినెస్ బ్యాడ్జ్ లోగో ఇకపై కన్పించనుంది. చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో అలజడి..! భారీగా నిషేధం..! రైల్వే ప్రయాణికులు పలు గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఎస్ఎమ్ఎస్లకు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు ట్రూకాలర్ పేర్కొంది. ఐఆర్సీటీసీ నుంచి సమాచారాన్ని ట్రూకాలర్ యాప్ గుర్తించి ధృవీకరించబడిన ఎస్ఎమ్ఎస్ అంటూ ట్రూకాలర్ యూజర్లకు నోటిఫికేషన్ ఇస్తుంది. అంతేకాకుండా సురక్షితమైన కస్టమర్ అనుభవాన్ని ట్రూకాలర్ అందిస్తోంది. ట్రూకాలర్ యాప్‌లో 139 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఇండియన్ రైల్వే లోగో కన్పించనుంది. ట్రూకాలర్ భాగస్వామ్యంపై ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా మాట్లాడుతూ..రైల్వే ప్రయాణికులకు పటిష్టమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో ట్రూకాలర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పలు మోసపూరిత మెసేజ్లనుంచి ప్రయాణికులకు ఊరట లభిస్తోందని పేర్కొన్నారు. చదవండి: మీదే ఆలస్యం.. ఐటీ కంపెనీల్లో లక్ష పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్ -
ఐఐటీ హైదరాబాద్‌తో హనీవెల్ జట్టు
న్యూఢిల్లీ: హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ (హెచ్‌టీఎస్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–హైదరాబాద్ (ఐఐటీ–హెచ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ల్యాబ్ ఏర్పాటుతో పాటు కొత్త టెక్నాలజీలపై సంయుక్తంగా పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ల్యాబ్‌ను బుధవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా దేశంలోనే ఏఐలో పూర్తి స్థాయి బీటెక్ కోర్సు అందిస్తున్న తొలి విద్యా సంస్థ ఐఐటీ–హెచ్ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ ల్యాబ్‌ను ఐఐటీ–హెచ్ నిర్వహిస్తుంది. నిర్దిష్ట రంగాల్లోని వివిధ విభాగాల్లోని సిబ్బందికి అవసరమైన శిక్షణనిచ్చేందుకు, వర్క్‌షాప్‌ల నిర్వహణ, ఐఐటీ–హెచ్ విద్యార్థులు అలాగే హెచ్‌టీఎస్ ఉద్యోగులకు హ్యాకథాన్లు మొదలైన వాటి నిర్వహణకు రెండు సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందం తోడ్పడనుంది. -
మరో మేడిన్ ఇండియా వ్యాక్సిన్‌కు కేంద్రం ఒప్పందం
-
సరిహద్దు ఉద్రిక్తత : రాజ్‌నాథ్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ దిశగా చర్చలుకొనసాగుతున్నాయని పార్లమెంట్లో గురువారం వెల్లడించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడేలా చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ మూరకు చైనా రక్షణమంత్రితో చర్చించల అనంతరం, పూర్తిస్థాయిలో సైనిక బలగాల ఉపసంహరణపై అంగీకారం కుదిరిందని ప్రకటించారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నామని రాజ్‌నాథ్ రాజ్యసభకు వివరించారు. దీంతో భారత, చైనా సరిహద్దుల్లో గతకొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రికత్తకు ఎట్టకేలకు తెరపడినట్టయింది. (చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం) చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారంటూ భారత జవాన్లపై ప్రశంసలు కురిపించారు. మూడు సిద్ధాంతాల ఆధారంగా సమస్య పరిష్కరించుకోవాలని చైనాకు సూచించామనీ రక్షణమంత్రి వెల్లడించారు. ఏ దేశమైనా ఏకపక్షంగా వాస్తవ నియంత్రణ రేఖను మార్చే ప్రయత్నం చేయకూడదనీ ఇరువైపుల నుంచి ప్రయత్నాలు ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయన్నారు. లడఖ్ సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామనీ ఈ ఒప్పందంతో ఇరుదేశాలు దశల వారీగా పరస్పర సమస్వయంతో బలగాలను ఉపసంహరించుకోనున్నాయని ఆయన తెలిపారు. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ఫింగర్ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయి. భారత బలగాలు ఫింగర్ 2 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ వద్ద ఉంటాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘తూర్పు లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితి’ పై రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు లోక్‌సభలో ఒక ప్రకటన చేయనున్నారని రక్షణ మంత్రి కార్యాలయం వెల్లడించింది. -
అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం
సాక్షి, అమరావతి: జార్ఖండ్ రాష్ట్రంలోని అరుదైన కుకింగ్ కోల్ బ్లాక్ (బ్రహ్మదిహ)ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కైవసం చేసుకుంది. బిడ్డింగ్‌లో ఏపీఎండీసీ ఎల్1గా నిలవడంతో ఆ బొగ్గు క్షేత్రాన్ని ఏపీఎండీసీకి అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ – ఏపీఎండీసీ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర బొగ్గు గనుల శాఖ అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు, ఏపీఎండీసీ తరఫున రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిల సమక్షంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను గోపాలకృష్ణ ద్వివేదికి అందజేశారు. ఇది అత్యంత నాణ్యమైన, అరుదైన బొగ్గు జార్ఖండ్‌లోని గిరిడీ కోల్ ఫీల్డ్స్‌లో అత్యంత నాణ్యమైన, అరుదైన ఎస్1 రకం కుకింగ్ కోల్ ఉంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. దేశంలో వినియోగమయ్యే ఈ రకం బొగ్గులో 1.5 శాతం మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 98.5 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. అందువల్ల దీనికి మంచి డిమాండ్ ఉంది. ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నేస్ (ఉక్కును కరిగించడం) కోసం దీనిని వినియోగిస్తారు. ఏపీఎండీసీకి లభించిన గనిలో 25 లక్షల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా. ’బ్రహ్మదిహ’ క్షేత్రంలో తవ్వే బొగ్గు అమ్మకం ధరలో 41.75 శాతం జార్ఖండ్ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 48.25 శాతం ఏపీఎండీసీదన్నమాట. ఈ బొగ్గు గనిని పొందడంవల్ల ఏపీఎండీసీకి రూ.250 నుంచి రూ.350 కోట్ల వరకు నికర రాబడి వస్తుందని అధికారుల అంచనా. -
సరిహద్దులు దాటి రయ్.. రయ్
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల తర్వాత తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం ట్రాన్స్‌పోర్టు భవన్లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఆ వెంటనే ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటి ముందుకు వెళ్లటం విశేషం. కొత్త ఒప్పందం ప్రకారం.. తెలంగాణకు వచ్చే ఏపీ బస్సుల కంటే, ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సులే ఎక్కువ. సరిహద్దు నుంచి పరిశీలిస్తే తెలంగాణ భూభాగమే ఎక్కువగా ఉన్నందున టీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య ఎక్కువగా నిర్ధారించారు. 826 టీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీలో 1,61,258 కి.మీ.లు.. 638 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర తిరగనున్నాయి. తెలంగాణ ప్రతిపాదన ప్రకారమే.. రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రాంత భూ భాగంలో వెసులుబాటు ఆధారంగా సింహ భాగం ఆ ప్రాంత డిపో బస్సులే తిరిగేలా షెడ్యూల్స్ రూపొందించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒప్పందం జరగకపోవడంతో అవి అలాగే కొనసాగాయి. ఫలితంగా ఏపీ పరిధిలో టీఎస్ఆర్టీసీ బస్సులు తక్కువగా, తెలంగాణ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎక్కువగా తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు దాన్ని మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచించారు. ఆ మేరకే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దా ని ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.03 లక్షల కి.మీ. మేర తెలంగాణలో తక్కువగా తిరగాల్సి వస్తోంది. దీనికి బదులు టీఎస్ ఆర్టీ సీ కూడా అంతమేర ఎక్కువగా బస్సులు తిప్పుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కోరింది. కానీ అది నష్టమే తెస్తుందని గట్టిగా పేర్కొన్న తెలంగాణ, ఏపీ కూడా అంతమేర తగ్గించడమే రెండు ఆర్టీసీలకు మంచిదని వాదించింది. ఇప్పుడు ఆ మేరకే రెండు ఆర్టీసీలు ఒప్పం దం చేసుకున్నాయి. ఈ సమావేశంలో తెలంగాణ ఈడీలు వినోద్‌కుమార్, వెంకటేశ్వర్లు, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఏపీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే బస్సులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఒప్పందంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో బస్టాండ్లకు పెద్దగా ప్రయాణికులు రాలేదు. దీంతో పరిమిత సంఖ్యలో సర్వీసులు నడిపారు. రాత్రి సర్వీసులకు కొంత రద్దీ పెరిగింది. మంగళవారం నుంచి ప్రయాణికుల సంఖ్య ఆధారంగా సర్వీసుల సంఖ్య పెంచుతామని అధికారులు పేర్కొన్నారు. కాస్త ఆలస్యమైనా.. మంచి ఒప్పందం కోవిడ్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందంలో కొంత జాప్యంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగలేదు. కాస్త ఆలస్యమైనా ఇప్పుడు మంచి ఒప్పందం కుదిరింది. ఇది రెండు ఆర్టీసీలకు మేలు చేస్తుంది. ఈ ఒప్పందం సామరస్యపూర్వకంగా కుదరడంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఏపీ రవాణా మంత్రి పేర్నినాని, ఏపీ–తెలంగాణ ఎండీలు కృష్ణబాబు, సునీల్‌శర్మ, ఈడీలు ఎంతో కృషి చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. – మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ -
దేవాస్‌కు 8,939 కోట్లివ్వండి
వాషింగ్టన్: శాటిలైట్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ దేవాస్ మల్టీమీడియాకు రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు) నష్ట పరిహారం చెల్లించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంట్రిక్స్ కార్పొరేషన్‌ను అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. 2005 జనవరిలో ఈ ఒప్పందం కుదిరింది. 70 మెగాహెట్జ్ ఎస్–బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను దేవాస్ మల్టీమీడియాకు అందించేందుకు రెండు ఉపగ్రహాలను నిర్మించి, ప్రయోగించి, నిర్వహిస్తామని యాంట్రిక్స్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. అయితే, ఒప్పందం మేరకు స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు ఇవ్వడంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ విఫలమైంది. 2011 ఫిబ్రవరిలో ఒప్పందాన్ని యాంట్రిక్స్ రద్దు చేసింది. అనంతరం దేవాస్ భారత్‌లో పలు కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది. తమకు న్యాయం చేయాలని విన్నవించింది. సరైన స్పందన లేకపోవడంతో 2018లో అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి థామస్ ఎస్.జిల్లీ అక్టోబర్ 27న ఉత్తర్వు జారీ చేశారు. దేవాస్ సంస్థకు 562.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని, ఇప్పటిదాకా వడ్డీతో కలిపి రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు)ను దేవాస్ మల్టీమీడియాకు చెల్లించాలని యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు తేల్చిచెప్పారు. -
దసరా టూర్‌కు ‘ఆర్టీసీల’ బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్ కలెక్షన్లు కురిపిస్తుంది. పెద్దెత్తున ఆదాయం వస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు. అయితే.. ఈసారి తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలకు పెద్ద సమస్యే వచ్చిపడింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరకపోవడంతో బస్సులు సరిహద్దులు దాటడం లేదు. రెండు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నా సయోధ్య కుదరలేదు. పండుగలోపు కుదురుతుందో.. లేదో.. తెలియని పరిస్థితి. దీంతో ఈసారి ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ప్రయాణం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ నిబంధనలతో రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విధిలేక ప్రజలు ప్రైవేటు బస్సుల కోసం పరుగుపెట్టాల్సి వస్తోంది. దొరికిందే అదునుగా వారు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జీ రూ.290 ఉంటే.. ప్రైవేట్‌లో రూ.500కుపైగా వసూలు చేస్తున్నారు. ఆదాయ నష్టం ఐదారు కోట్లు.. ప్రతీ సంవత్సరం పండుగ వేళ తిరిగే అదనపు బస్సుల్లో 50 శాతం చార్జి ఎక్కువ ఉంటుంది. దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీకి ఏపీకి తిప్పే స్పెషల్ బస్సుల ద్వారా రోజుకు అదనంగా రూ.70 లక్షల ఆదాయం వస్తుంది. ఒప్పందం కుదరక ఈ సారి బస్సులు తిరిగే అవకాశం లేకపోవడంతో దాదాపు రూ.ఐదారు కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ సంవత్సరం ఇలా ఉంటే.. గతేడాది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దసరా వేళ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో టీఎస్ఆర్టీసీ బస్సులు సరిగాలేక ప్రజలు అప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్‌కు ముందు.. ►తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ.: 2.64 లక్షలు ►తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ.: 1.61 లక్షలు తెలంగాణ వాదన: తెలంగాణ పరిధిలో ఏపీ బస్సు లు.. ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల పరిధి కంటే 1.03 లక్షల కి.మీ. ఎక్కువ తిరుగుతున్నాయి. దాన్ని తగ్గించుకోవాలి. ఏపీ వాదన: తెలంగాణతో పోలిస్తే ఏపీ బస్సులు ఎక్కువ తిరుగుతున్న మాట వాస్తవమే. కాలం గడిచేకొద్దీ సర్వీసుల సంఖ్య పెంచుకోవాలి కాబట్టి.. టీఎస్ ఆర్టీసీ కూడా ఏపీలో అంతమేర పెంచుకుంటే సరిపోతుంది. కాదంటే మేం 50 వేల కి.మీ. తగ్గించుకుంటాం.. తెలంగాణ అంతమేర పెంచుకున్నా చాలు. పెంచుకోవడం సాధ్యం కాదు.. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది. బస్సులు పెంచుకోవడం సాధ్యం కాదు. ఇక లాభదా యకంగా ఉండే విజయవాడ–హైదరాబాద్, కర్నూలు–హైదరాబాద్, గుంటూరు–హైదరాబాద్, ఒంగోలు–హైదరాబాద్ తదితర ప్రాంతాల మధ్య ఏపీ బస్సులను తగ్గించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఆదాయం కోల్పోవడమే సమస్య... తెలంగాణకు పెద్ద సంఖ్యలో బస్సులు తిప్పడం ద్వారా ఏపీ ఆర్టీసీ సాలీనా రూ.575 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. తెలంగాణ వాదన మేరకు సంఖ్య తగ్గించుకుంటే దాదాపు రూ.260 కోట్ల ఆదాయం తగ్గుతుంది. అసలే నష్టాల్లో ఉండే ఆర్టీసీలు ఇంత ఆదాయం కోల్పోవటం పెద్ద సమస్యనే. కానీ ఏపీ బస్సులు ఎక్కువ తిరగటం వల్ల టీఎస్ ఆర్టీసీకి 250 కోట్ల కంటే ఎక్కువ నష్టమొస్తోందని తెలంగాణ వాపోతోంది. ఇద్దరికి రూ.1,100... దసరా వేళ హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్లాలంటే ప్రైవేట్ బస్సులో ఇద్దరికి కలిపి టికెట్ ధర రూ.1,100 అడిగారు. రైళ్లు ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లేవు. దీంతో మాలాంటోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. – సీతారామ్, యశ్వంత్, గుడివాడ మేం సిద్ధమే.. కానీ.. దసరాకి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా బస్సులు తిప్పేందుకు మేం సిద్ధం. కానీ.. ఏపీఎస్ ఆర్టీసీ మా ప్రతిపాదనకు అంగీకరించాలి. మా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రతిపాదన చేశారు. బస్సులు, కిలోమీటర్లు, రూట్లు.. ఈమూడింటిలో రెండు ఆర్టీసీలు సమంగా అనుసరించాలన్నారు. దాని ప్రకారమే మేం ప్రతిపాదించాం. మా ప్రతిపాదనతో రెండు ఆర్టీసీలు సమంగా లాభపడతాయి. – పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి -
భారత్-జపాన్ రక్షణ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, జపాన్ గురువారం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. రక్షణ ఒప్పందం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని అబే షింజో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. భారత్-జపాన్ల మధ్య రక్షణ ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ ఒప్పందం కింద ఇరు దేశాలు రక్షణ పరికరాలు, సేవలను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చొరవ చూపారంటూ షింజో అబేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇరువురు నేతలు ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు సహా ఇరు దేశాల మధ్య సహకారంపై సమీక్షించారు. గత కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతున్న భారత్-జపాన్ భాగస్వామ్యం ఇక ముందు కూడా ఉత్తేజంగా కొనసాగుతుందని మోదీ, అబే విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి : ‘డిజిటల్ వేదికగా ప్రపంచానికి చేరువ’ -
అమూల్ ఒప్పందంతో పల్లెల్లో పాలవెల్లువ
కరోనా వచ్చిన తరువాత ఇంచు మించు అన్నిరంగాలు తీవ్ర ఒడి దొడుకులకు లోనయ్యాయి. ఒక్క వ్యవసాయంలోనే చిన్నచిన్న అవాం తరాలు ఏర్పడినా ప్రభుత్వం తీసు కున్న పలురకాల నిర్ణయాలతో నిరం తర ప్రవాహంగా సాగుతోంది ఒక్క వ్యవసాయమే. దీని మీద ఆధారపడే అన్ని రంగాలవారు పెద్దగా ఇబ్బం దులు ఎదుర్కొనలేదనే చెప్పాలి. అలాంటి వ్యవసాయ రంగాన్ని మరింత పటిçష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ పడుతోంది. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమను సైతం లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పాల విప్లవానికి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందుకు అమూ ల్తో చేసుకున్న ఒప్పందం ఒకటి. ఈ నిర్ణయంతో పాడి రైతులకు పలు రకాల ప్రయోజనాలు అందనున్నాయి. అమూల్ కంపెనీ కాదు అమూల్ అనగానే చాలామంది దానిని కార్పొరేట్ కంపెనీ అనుకుంటారు. అది ఒక డెయిరీ కో ఆపరేటివ్ సొసైటీ. సహ కార సంఘం పేరు అమూల్ కాదు. కైరా డిస్ట్రిక్ట్ కోపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ (కేడీసీఎంపీ యూఎల్). దీనిని గుజరాత్‌లోని ఆనంద్‌లో 1946లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానికి ఒక ఏడాది ముందు అంటే బ్రిటిష్ హయాంలోనే దీనిని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సంఘంలో వచ్చిన లాభాలు డివిడెంట్ రూపంలో పాల ఉత్పత్తిదారులకు (పాడి రైతులకు) మాత్రమే అందుతాయి. అదే ప్రైవేట్ డెయిరీలు అయితే లాభాలు తమ వద్ద ఉంచుకుంటాయి. ఒక సహకార సంఘం ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందడం అసాధ్యం. కానీ దీనిని సాధ్యం చేసింది మాత్రం స్వాతంత్య్ర సమరయోధుడు త్రిభువన్దాస్ పటేల్, డాక్టర్ వర్గీస్ కురియన్లు. గుజ రాత్లో పాడి రైతుల కష్టాలను, నష్టాలను చూసిన వీరు అమూల్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో రైతుల వద్ద నుంచి పాలను సేకరించే ప్రైవేట్ కంపెనీలు లాభాలను వారు మాత్రమే పొందేవారు. దీనిని అమూల్ బద్దలుకొట్టింది. అమూల్ వచ్చిన తరువాత పాడి రైతులకు లాభాలు అందాయి. నిజంగా ఇదొక విప్లవం. దేశంలో పాల విప్లవానికి అమూల్ పునాదులు వేసింది. ప్రపంచంలో పాల దిగుబడిలో మన దేశం అమెరికాను దాటి ప్రథమస్థానంలో నిలిచింది. పాడి రైతులకు లాభాలను అమూల్ చూపిం చింది. సర్దార్ పటేల్ స్వప్నం మేరకు ప్రతీ గ్రామంలోను పాడిరైతులతో సొసైటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. అమూల్ రాకముందు గుజరాత్లో పెస్తోన్జీ అనే వ్యక్తి పెట్టిన పోల్సన్ కంపెనీ ఉండేది. ఇది గుజరాత్ రైతుల వద్ద నుంచి తక్కువ ధరకే పాలను సేకరించి ముంబైలో అధిక ధరలకు విక్రయించేది. లాభాలు పంచడం దేవుడెరుగు, తన స్వలాభం కోసం రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా రాకుండా చేసింది. అమూల్ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు అమూల్ స్ఫూర్తితో ఇంచుమించు ప్రతీ రాష్ట్రంలో కో ఆపరేటివ్ డెయిరీలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో డెయిరీలు చాలా విజయ వంతంగా నడిచాయి. చిత్తూరు, విశాఖ, విజయ, గోదావరి డెయిరీలు అటువంటివే. ఇవన్నీ కో ఆపరేటివ్ డెయిరీలుగా వచ్చాయి. అయితే రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న నయా పెస్తోన్జీలు (చంద్రబాబు) స్వలాభాల కోసం.. తమ సొంత కంపెనీల ఎదుగుదల కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారు. నష్టాల బాటలు పట్టించి కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. కొన్ని డెయిరీలను నిర్వీర్యం చేయడం ద్వారా తమ సొంత ప్రైవేట్ డెయిరీలు కోట్ల రూపాయల మేర లాభాలు పొందే విధంగా చూసుకున్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమూల్‌తో ఒప్పందం చేసుకున్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ ఆశించిన విధంగానే పాల డెయిరీలు రైతుల చేతుల్లో ఉండాలని బలంగా విశ్వసిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. పాల ఉత్పత్తిదారులతో గ్రామాల వారీగా సంఘాలను ఏర్పాటు చేయనుంది. వారి ద్వారా పాలను సేకరించడం, పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మకాలు చేయడం ద్వారా వచ్చిన లాభాలను రైతు లకు డివిడెండ్ రూపంలో అందజేస్తారు. ఇలా చేయడం ద్వారా మన రాష్ట్రంలో పాడి రైతులు లాభాలు పొందే అవ కాశముంది. ఇప్పటి వరకు రైతులు ఉత్పత్తి చేస్తున్న పాలను విక్రయాలు చేయడం ద్వారా ఆదాయం పొందుతున్నారు కానీ... డెయిరీల ద్వారా వచ్చే లాభాలను రైతులు పొంద లేకపోతున్నారు. లాభాలన్నీ ప్రైవేట్ కంపెనీలు పొందు తున్నాయి. ఉత్పత్తి చేస్తున్న పాలకు సరైన ధర రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. పెరిగిన మేత, డెయిరీల నిర్వహణ ధరలకు అనుగుణంగా పాల ధరలు పెరగడం లేదన్నది రైతుల ఆవేదన. ఇదే విషయంపై ఎన్నికలముందు ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పాడి రైతులకు మేలు చేసే నిర్ణయాలు ప్రకటించిన విషయం తెలిసిందే. సహకార డెయిరీలకు పాలు విక్రయిస్తే రైతులకు లీటరుకు రూ.2 చొప్పున బోనస్ ఇస్తానన్న విషయం తెలిసిందే. అమూల్ వచ్చిన తరువాత పాల ధరలు పెరిగే అవకాశముంది. అన్ని రకాల వసతులు అందుబాటులోకి వచ్చి పల్లెల్లో పాల ఉత్పత్తి ఉరకలు వేయ నుంది. వ్యవసాయం లాభసాటి కావాలంటే పంటలతో పాటు పాడి ఉండాలని నాడు దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, నేడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. దీనిలో భాగంగానే అమూ ల్తో ఒప్పందం. అలాగే గ్రామ సచివాలయాలలో వెటర్నరీ అసిస్టెంట్లను కూడా నియమించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాలవెల్లువకు ఆయన బాటలు వేశారు. త్వరలో రాష్ట్రంలో 7 వేల పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అవి కూడా మహిళ లతో ఏర్పాటు చేస్తారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 10,641 రైతు భరోసా కేంద్రాలకు పాల కొనుగోళ్లను అనుసంధానం చేయను న్నారు. ఈ విధంగా గ్రామీణ రైతులు, మహిళల ఆదాయం పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బల మైన పునాదులు వేస్తున్నారని చెప్పవచ్చు. వ్యాసకర్త ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు మొబైల్ : 98483 91234 -
'ఐఎస్బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి'
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై శనివారం అధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్ట్ 5న ఐఎస్బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జరగనుందన్నారు. ఐఎస్బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం లభించనుందని తెలిపారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్బీ కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించేందుకు ఐఎస్బీ తోడ్పాటు అందించనుందని తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు ఐఎస్బీ సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ కల్లా నైపుణ్య కాలేజీల ఏర్పాటు అంతకముందు నైపుణ్య కాలేజీల ఏర్పాటుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్‌లో నైపుణ్య కాలేజీలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో ఏ అవకాశాన్ని వదలకూడదన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు రుణాలందించడానికి ఏయే బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆరా తీశారు. దీనికి సంబంధించి బ్యాంకులు ఎంత మొత్తంలో రుణాలందించేందుకు సుముఖంగా ఉన్నాయో ఎండీ అర్జా శ్రీకాంత్ మంత్రికి వివరించారు. ప్రభుత్వ పూచికత్తుతోనే మరిన్ని నిధులు సాధ్యమని నైపుణ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము మంత్రికి వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ కాలేజీ ఏర్పాటు అవుతున్నందున స్థానిక ఎంపీల నిధుల నుంచి కొంత సాయం పొందవచ్చని ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. యువత భవిష్యత్ ను మార్చే స్కిల్ కాలేజీల ఏర్పాటులో ప్రతీ రూపాయి అవసరమేనని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరాలని గౌతమ్‌రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి మరింత లోతుగా చర్చిద్దామని మంత్రి మేకపాటి అధికారులతో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. -
శిఖర్ ధావన్‌తో ఐఎంజీ రిలయన్స్ ఒప్పందం
ముంబై: భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో ప్రముఖ మేనేజ్మెంట్ కంపెనీ ఐఎంజీ రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అతని మార్కెటింగ్ వ్యవహారాలన్నీ ఇకనుంచి ఐఎంజీ చూస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా స్పాన్సర్షిప్, ఎండార్స్మెంట్, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూ్యలన్నీ ఐఎంజీ రిలయన్స్ కంపెనీ చక్కబెడుతుంది. ‘మేటి మేనేజ్మెంట్ కంపెనీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉంది. మైదానంలో నేను నా ఆటను చూసుకుంటే నా మార్కెటింగ్ అంశాల్ని ఇప్పుడు ఐఎంజీ చూసుకుంటుంది. ఇది నా ప్రతిభకు గరిష్ట ప్రయోజనాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది’ అని ధావన్ ఒక ప్రకటనలో తెలిపాడు. ధావన్‌లాంటి స్టార్ క్రికెటర్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం తమ కంపెనీ బ్రాండ్ విలువను పెంచుతుందని ఐఎంజీ రిలయన్స్ హెడ్ నిఖిల్ బర్దియా తెలిపారు. ఈ కంపెనీతో ఇప్పటికే రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్, కృనాల్ పాండ్యా సోదరులు, శ్రేయస్ అయ్యర్ జతకట్టారు. -
ఎంఎస్ఎంఈలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయాన్ని ప్రకటించింది. వాటికి ద్రవ్య లభ్యత లభించేందుకు 750 మిలియన్ డాలర్లు(సుమారు 5,670 కోట్ల రూపాయలు) పైగా సహకారం అందించే ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే, ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్ జునైద్ అహ్మద్ సంతకం చేశారు. ప్రస్తుత సంక్షోభంనుంచి తట్టుకోవడంతోపాటు, మిలియన్ల ఉద్యోగాలను రక్షించడంలోనూ, తక్షణ ద్రవ్య భ్యత, ఇత రుణ అవసరాల నిమిత్తం 1.5 మిలియన్ల సంస్థలకు ఇది సాయపడుతుందని తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఇబ్బందులనుంచి గట్టెక్కించడానికి అవసరమైన చర్యల్లో ఇది మొదటి అడుగు అని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. మహమ్మారి ఎంఎస్ఎంఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఫలితంగా జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోతున్నారని ఖరే చెప్పారు. సంక్షోభం నుండి బయటపడేందుకు ఎంఎస్ఎంఈ రుణ ప్రణాళికను ప్రకటించామని చెప్పారు. జునైద్ అహ్మద్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ రంగం భారతదేశం వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. (భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం) కరోనా అనంతరం ఆర్ధిక పునరుద్ధరణకు ఈ రంగానికి ద్రవ్యలభ్యత తక్షణ అవసరమని ఆయన తెలిపారు. మొత్తం ఫైనాన్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రధానంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బిఎఫ్సి) స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌సిబి)ల రుణ సామర్థ్యాన్ని పెంచాలని, దీంతో ఎంఎస్ఎంఈ ఆర్థిక సమస్యల పరిష్కారంలో ఇవి సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కాగా కరోనా నేపథ్యంలో భారత సామాజిక, వైద్య రంగాలకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2.75 బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించింది. వీటికి అదనంగా ప్రస్తుతం ప్రకటించిన మొత్తాన్ని ఎంఎస్ఎంఈల కోసం ఇస్తామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ లోన్ మెచ్యూరిటీ 19 ఏళ్లతో 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ కలిగి ఉంటుందని చెప్పారు. భారతదేశ ఆరోగ్య రంగానికి తక్షణ మద్దతు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించింది. అలాగే పేదలు, బలహీన వర్గాలకు నగదు బదిలీ, ఆహార ప్రయోజనాల నిమిత్తం మే నెలలో మరో బిలియన్ డాలర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఏపీ సర్కార్ మరో కీలక ఒప్పందం..
సాక్షి, అమరావతి: ప్రపంచస్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం కుదురింది. ఈ మేరకు ఏపీ కార్ల్ సీఈఓ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ డాక్టర్ ఆదినారాయణరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. (టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించిన సీఎం జగన్) రాష్ట్ర విభజన తర్వాత పశువులకు అవసరమైన వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం లేకపోవడంతో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం కుదురింది. 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించనున్నారు. (ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ) పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు తయారీ కానున్నాయి. గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ యూనిట్‌కు ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించనుంది. దీంతో 100 నిపుణులకు, సిబ్బందికి ఉపాధి కలుగనుంది. మన రాష్ట్రాలు అవసరాలు తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. -
అమెరికన్ సంస్థతో జొమాటో ఒప్పందం..
ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరో దిగ్గజ సంస్థతో జత కట్టనుంది. అమెరికాకు చెందిన మారియేట్ ఇంటర్నేషనల్ (అత్యాధునిక రిస్టారెంట్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో తమ సంస్థను మరింత విస్తరించేందుకు జొమాటోతో పనిచేయనున్నట్లు మారియేట్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ‘మారియేట్ ఆన్ వీల్స్’ పేరుతో క్యాటరింగ్ సేవలు, మీల్స్ అందిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లకు వేగంగా పుడ్ డెలివరీ సేవలందించడమే తమ లక్క్ష్యమని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. జొమాటో సంస్థతో ఒప్పందం ద్వారా కస్టమర్లకు మరింత వేగంగా సేవలను అందిస్తామని మారియేట్ దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ నీరజ్ గోవిల్ పేర్కొన్నారు. మారియేట్ సంస్థతో కలిసే పనిచేయడం ద్వారా సంస్థ మరింత వృద్ధిని సాధిస్తుందని జొమాటో పేర్కొంది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఇరు సంస్థలు శానిటైజేషన్‌కు(శుభ్రత) అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు జొమాటో సంస్థ అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇటీవల డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: స్విగ్గీ, జొమాటో డ్రోన్ డెలివరీ..) -
సన్‌రైజ్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసిన ఐటీసీ
ముంబై: దేశంలోని ఎఫ్ఎమ్సీజీ రంగానికే బ్రాండ్ ఇమేజ్ క్రియెట్ చేసిన ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ కీలక నిర్ణయం వెల్లడించింది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సన్‌రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎ్‌ఫపీఎల్) కంపెనీని కొనుగోలు చేసినట్లు ఆదివారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐటీసీ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 మేర చెల్లించి ఉంటుందని మార్కెట్ నిపుణల అంచనా వేస్తున్నారు. దేశంలోని మసాలా, సుగంధ ద్రవ్యాల మార్కెట్లో సన్‌రైజర్స్ ఫుడ్‌కు మంచి పేరుంది. ఎఫ్ఎమ్సీజీ మార్కెట్లలో మరింత వృద్ధిని పెంచుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఐటీసీ లిమిటడ్ పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేలో ఆశీర్వాద్ గోదుమపిండి వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకుందో .. సన్‌రైజ్ ఫుడ్స్ ద్వారా దేశ వ్యాప్తంగా ఐటీసీ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. రైతుల ఆదాయాలు పెంచడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి: చాక్లెట్@:రూ.4.3 లక్షలు -
అనుకున్న సమయానికే రఫేల్ జెట్లు
న్యూఢిల్లీ: భారత్‌తో ఫ్రాన్స్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 36 రఫేల్ జెట్లను అందించేందుకు సిద్దంగా ఉన్నామని ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి ఈమాన్యుల్ లినేన్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో కరోనా ఉదృతి నేపథ్యంలో నెలకొన్న అనుమానాలను తెరదిస్తు కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్ మెదటి రఫేల్ జట్ను 2019 అక్టొబర్ 8న భారత్‌కు అందించింది. భారత్ రఫేల్ తయారీలో కొన్ని సూచనలు ఇచ్చిందని వాటిని పరిగణలోకి తీసుకొని అత్యధునిక సాంకేతికతతో అందించామని ఫ్రెంచ్ ఉన్నతాధికారులు తెలిపారు. భారత వైమానిక దళం సూచించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని అధికారుల పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 1,45,00మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 28,330 మంది మరణించారు. -
ఐఎస్ఎల్-ప్రీమియర్ లీగ్‌ల మధ్య కొత్త ఒప్పందం
ముంబై : ప్రీమియర్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)ల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. నెక్ట్స్ జనరేషన్ ముంబై కప్‌లో భాగంగా శుక్రవారం ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీ, ప్రీమియర్ లీగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ మాస్టర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, రిచర్డ్‌లు కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. గత ఆరేళ్ల నుంచి ఈ రెండు లీగ్‌లు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం భారతలో ఫుట్‌బాల్ అభివృద్ధితోపాటు, కోచింగ్ సౌకర్యాలు, యువతలో ఫుట్‌బాల్ నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రీమియర్ లీగ్‌తో ఐఎస్ఎల్ భాగస్వామ్యం మరో దశకు చేరుకుందన్నారు. గత ఆరేళ్లుగా భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి తాము చేసిన కృషి సంతృప్తినిచ్చిందని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంపొందించడం, కోచింగ్, రిఫరీ అంశాలను మరింత బలోపేతం చేయడానికి రెండు లీగ్‌ల మధ్య కుదిరిన నూతన ఒప్పందం తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిచర్డ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. ఐఎస్ఎల్తో కొత్త ఒప్పందాన్ని చేసుకోవడం భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. ఇందుకు తాము చాలా సంతోషిస్తున్నాం. గత ఆరేళ్లుగా ఐఎస్ఎల్ భాగస్వామ్యంతో ఫుట్‌బాట్ కోచింగ్, అభివృద్ధి, అలాగే మౌలిక సదుపాయాలకు మద్దతిచ్చాం. కొత్త ఒప్పందం ద్వారా యువతలో ఫుట్‌బాల్ నైపుణ్యాన్ని పెంపొందించడం, భారత్‌లో ఫుట్‌బాల్ పరిధిని విస్తృత పరిచేందుకు ఎదురుచూస్తున్నామ’ని తెలిపారు. -
పరిశ్రమలతో ఎంవోయూ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కనీసం 5 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. ఉద్యోగ,ఉపాధి అ వకాశాలు ఎక్కువగా ఉన్న, మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 కొత్త కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లు (ఇన్‌టేక్) పెరగకుండా, ఉన్న సీట్లలోనే కోర్సులు బదలాయించుకోవచ్చని (కన్వర్షన్) వెల్లడించింది. అదనపు సీట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, నెట్ వర్కింగ్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రొబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్ వంటి కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొంది. ఈ నెల 26 నుంచి యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. మార్చి 11 నుంచి మార్చి 16 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. మార్చి 16 నుంచి దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ పరిశీలన కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ప్రాసెస్‌పై కాలేజీల యాజమాన్యాలతో మంగళవారం జేఎన్టీయూ సమావేశం నిర్వహించింది. 2020–21 విద్యా ఏడాదిలో తాము అమలు చేయబోయే విధానాలను తెలియజేయడంతో పాటు యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు ఈ సందర్భంగా స్వీకరించింది. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏఐసీటీఈ అనుమతిస్తేనే మేం ఇస్తాం రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్లో సమస్యలు ఉన్న 238 కాలేజీల్లో 154 కాలేజీలు జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయని జేఎన్టీయూ పేర్కొంది. అందులో 79 కాలేజీలు తమ లోపాలకు సంబంధించిన వివరణలతో కూడిన నివేదికలు అందజేశాయని పేర్కొంది. ఇంకా 75 కాలేజీలు వివరణలతో కూడిన నివేదికలు ఇవ్వలేదని, తాము ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. అయితే ఈ కాలేజీల విషయంలో తాము ఏం చేయలేమని, ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తేనే తాము అనుబంధ గుర్తింపు ఇస్తామని, ఏఐసీటీఈ ఇవ్వకపోతే తాము అనుబంధ గుర్తింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బీటెక్, బీ–పార్మసీ విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు రోజుల్లో గవర్నింగ్ బాడీల నామినీలు ప్రతి కాలేజీ గవర్నింగ్ బాడీలు ఏర్పాటు చేయాల్సిందేనని, సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహించాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ స్పష్టం చేసింది. జేఎన్టీయూ నామినీలను 3 రోజుల్లో ఇస్తామని పేర్కొంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద కాలేజీల్లో పదోన్నతులు ఇచ్చుకోవచ్చని, వాటిని యూనివర్సిటీలో ర్యాటిఫై చేయించుకోవాలని తెలిపింది. కాలేజీలు పక్కాగా మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం అమలు చేయాల్సిందేనని సూచించింది. వరుసగా మూడేళ్లు 25% కంటే ప్రవేశాలు తక్కువగా ఉంటే ఆ కోర్సును అమలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. అన్ని కోర్సులు ఇవ్వాలి: ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు ఉద్యోగ అవకాశాలున్న 10 రకాల కొత్త కోర్సులకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపిందని, అందులో 8 కోర్సులకే అనుమతిస్తామని జేఎన్టీయూ పేర్కొనడం సరికాదని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు పేర్కొన్నారు. ఏఐసీటీఈ ఆమోదించిన అన్ని కోర్సులకు సిలబస్ రూపొందించి జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరారు. -
'నన్నెవరు కొట్టలేదు..మనస్పూర్తిగా స్వాగతించారు'
-
'నన్నెవరు కొట్టలేదు..మనస్పూర్తిగా స్వాగతించారు'
గుహావటి : గత డిసెంబర్లో పార్లమెంట్లో పౌరసత్వ సవరణ చట్టం బిల్ పాస్ అయి అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రంలో శుక్రవారం పర్యటించారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను ఏమాత్రం పట్టించుకోలేదని మోదీ తెలిపారు. కొన్ని దశాబ్ధాలుగా బోడో మిలిటెంట్లతో ఈ ప్రాంతం నిరసన, హింసతో అట్టుడికిపోయేదని, కొన్ని వేలమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారని మోదీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కోక్రాఝర్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ బోడో వేడుకను ఒక పండుగలా జరుపుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో అస్పాం రాష్ట్రంలో శాంతి మంత్రం కోసమే బోడో వంటి చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నట్లు గుర్తుచేశారు.(నెహ్రూపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు) ప్రధాని మాట్లాడుతూ.. ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్( ఎబిఎస్యూ), నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్‌డిఎఫ్‌బి), బిటిసి చీప్ హగ్రమా మొహిలరీ, అస్సాం ప్రభుత్వం బోడో ఒప్పందం సక్రమంగా జరగడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వారందరికి తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోదీ తెలిపారు. చారిత్రాత్మకమైన బోడో ఒప్పందం ద్వారా ఇక నుంచి అస్సాం ప్రాంతం అభివృద్ధి బాటలో పయనించనుందని మోదీ వెల్లడించారు. అస్సాంలో బోడో డామినేట్ ప్రాంతంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో జనవరి 27న కేంద్ర ప్రభుత్వంతో నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్, అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, ఇతర పౌర సమాజ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.ఈ ఒప్పందం జరిగిన రెండు రోజులకే వేల సంఖ్యలో బోడో మిలిటెంట్లు వచ్చి తమ ఆయుధాలు సరెండర్ చేశారని మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలపై పట్ల గత ప్రభుత్వాల్లాగా కాకుండా తమ ప్రభుత్వం ఎంతో ప్రేమ చూపుతోందన్నారు. ఒకప్పుడు కేంద్రం ఎలాంటి నిధులు ఇస్తుందోనని ఈశాన్య రాష్ట్రాలు ఎదురుచూసేవని... కానీ ఇప్పుడు అవే ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధిలో కీలకంగా మారాయని మోదీ తెలిపారు. చారిత్రాత్మక బోడో ఒప్పందం ద్వారా ఇకపై ఈ ప్రాంతంలో హింసకు తావు లేకుండా శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు తర్వాత తాను ఈశాన్య రాష్ట్రంలో అడుగుపెడితే కర్రలతో తనను తరిమి కొడతారని కొందరు వాఖ్యానించినట్లు మోదీ పేర్కొన్నారు. ' ఈరోజు నేను ఈశాన్య రాష్ట్రంలో అడగుపెట్టాను. ఏ ఒక్కరు నాపై కర్రలతో దాడి చేయకపోగా నన్ను సాధరంగా ఆహ్వానించారు. నా వెనుక వేల సంఖ్యలో అక్కా, చెల్లెమ్మల ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్ను ఎవరు తరిమికొట్టలేరని ప్రధాని మోదీ రాహుల్ గాంధీని ఉద్ధేశించి ట్విటర్ వేదికగా పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు. PM Modi in Kokrajhar, Assam: Kabhi kabhi log danda marne ki baatein karte hain. Lekin jis Modi ko itne badi matra mein mata aur beheno ka suraksha kawach mila ho us par kitne bhi dande gir jaye, usko kuch nahi hota. pic.twitter.com/yo7wjU14tP — ANI (@ANI) February 7, 2020 -
ఖతార్ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా
న్యూఢిల్లీ: అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లో 25.1 శాతం వాటాను ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ రూ.3,200 కోట్లు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ ట్రాన్సిమిషన్ తెలిపింది. అదానీ ట్రాన్సిమిషన్ కంపెనీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థ(ఏఈఎమ్ఎల్), ముంబైలో 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్తును పంపిణి చేస్తోంది. ఈ డీల్ నేపథ్యంలో అదానీ ట్రాన్సిమిషన్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.350ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.342 వద్ద ముగిసింది. -
మేయో క్లినిక్‌తో ఏఐజీ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ధరల్లో భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాలోని మేయో క్లినిక్‌తో ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(ఏఐజీ) ఒప్పందం కుదుర్చుకుంది. మేయో క్లినిక్ కేర్ నెట్‌వర్క్‌లో భాగమైన తొలి భారతీయ ఆస్పత్రి ఏఐజీనే అని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో సంక్లిష్టమైన కేసులకు సంబంధించి రెండో అభిప్రాయం తీసుకోవడం మొదలుకొని.. పలు అంశాల్లో మేయో క్లినిక్ పరిశోధనల వివరాలు ఏఐజీకి అందుబాటులోకి వస్తాయని అన్నారు. అయితే దీని వల్ల రోగులపై అదనపు భారమేదీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు 155 ఏళ్లుగా వైద్య రంగంలో లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న మేయో క్లినిక్‌లో 5 వేల మంది నిపుణులైన వైద్యులు ఉన్నారని చెప్పారు. దీంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో 9 ఆస్పత్రులున్న మేయో నెట్వర్క్ అనుభవాలను కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. వైద్యంతోపాటు పరిశోధన రంగంలోనూ ఇరు సంస్థలు కలసి పనిచేస్తాయని తెలిపారు. కాలేయ మూలకణ పరిశోధనల్లో ఏఐజీకి ఎంతో ప్రావీణ్యముంటే.. గుండె మూలకణాలపై మేయో క్లినిక్ ఎన్నో పరిశోధనలు చేపట్టిందన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు ఈ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి కలగనుందని చెప్పారు. ఆరోగ్యం, వ్యాధుల విషయం లో శరీరంలోని సూక్ష్మజీవావరణం కీలకపాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్న నేపథ్యం లో ఏఐజీ వీటిపై కూడా పరిశోధనలు చేపట్టిందని తెలిపారు. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వారిలో కొందరికి మధుమేహం ఉంటూ.. ఇంకొందరికి లేకపోవడం వెనుక బ్యాక్టీరియా వైవిధ్యతలో ఉన్న తేడాలే కారణమని తాము గుర్తించామని చెప్పారు. మేయో క్లినిక్ కేర్ నెట్వర్క్ డైరెక్టర్, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ హేస్ మాట్లాడుతూ.. అందరికీ మెరుగైన వైద్యం అందించే ఏకైక లక్ష్యంతో ఈ నెట్వర్క్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. మేయో క్లినిక్ పేరును మార్కెటింగ్‌కు వాడుకునే ఏ సంస్థకూ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం కల్పించబోమని తెలిపారు. మూల కణాలపై పరిశోధనలు ఏఐజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రమే కాకుండా.. అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలు చేసే సంస్థ కూడా అని నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో మూలకణాలపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలను ఇతర అవయవాలకు సంబంధించిన కణాలుగా మార్చి ఎన్నో సత్ఫలితాలు సాధించామని వివరించారు. ఈ నేపథ్యంలో పేగుల్లోకి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను జొప్పించేందుకు కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. -
రష్యాతో భారత్ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ : యుద్ధ ట్యాంకులకు సంబంధించి భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. శనివారం భారత్-రష్యాల మధ్య రూ.200కోట్ల విలువైన యాంటీ ట్యాంక్ మిస్సైల్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎమ్ఐ-35/25 అటాక్ హెలికాప్టర్ల కోసం స్ట్రుమాట్కా యాంటీ ట్యాంక్ క్షిపణులను కొనుగోలు చేయడానికి రష్యాతో ఒప్పందం చేసుకోనున్నట్లు ఇదివరకే ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు . ఈ ఒప్పందం ప్రకారం వచ్చే మూడు నెలల్లో ఇజ్రాయిల్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ కింద ఆయుధాల సరఫరా జరుగుతుందని వెల్లడించారు. ఈ క్షిపణలు ఒప్పందం విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాంటీ ట్యాంక్ క్షిపణులు ఎమ్ఐ-35 చాపర్లకు యుద్ద సయయంలో అదనపు శక్తిని సమకూర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. అయితే ఈ ఒప్పందంతో దశాబ్ద కాలంగా రష్యా క్షిపణులను సొంతం చేసుకోవాలన్న భారత్ కల నెరవేరినట్టయింది. -
అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి, ముంబై : చుట్టూ సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపునకు భారీ ఊరట లభించింది. తనఖా పెట్టిన షేర్లను విక్రయించకుండా రుణదాతలతో అనిల్ అంబానీ గ్రూప్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అడాగ్ గ్రూపు షేర్లు లాభాల పరుగందుకున్నాయి.. సెప్టెంబర్‌వరకూ తనఖా షేర్లను విక్రయించకుండా 90 శాతం రుణదాతలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అడాగ్ తాజాగా వెల్లడించింది. ఇందుకువీలుగా రుణాలకు సంబంధించిన వాయిదా చెల్లింపులను సమయానుగుణంగా చెల్లించే విధంగా అడాగ్ రుణదాతలకు హామీ ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్న అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు నష్టాల మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏకంగా 12 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 12 శాతం, రిలయన్స్ కేపిటల్ దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ సైతం లాభాల బాటపట్టడం విశేషం. కాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. -
జీఎంఆర్‌కు ‘మలేసియా’ షాక్
హైదరాబాద్: జీఎంఆర్ గ్రూప్‌నకు మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హడ్ (ఎంఏహెచ్‌బీ) షాక్ ఇచ్చింది. జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌తో కుదిరిన షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు తేల్చిచెప్పింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తమకున్న 11 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు విక్రయించేందుకు ఎంఏహెచ్‌బీ గతేడాది ఫిబ్రవరిలో అంగీకరించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ సుమారు రూ.530 కోట్లు. అయితే నిబంధనల ప్రకారం 2018 డిసెంబర్ 31లోగా ఒప్పందాన్ని సక్రమంగా అమలుపరచని కారణంగా డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ఎంఏహెచ్‌బీ ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో జీహెచ్‌ఐఏఎల్‌లో ఎంఏహెచ్‌బీ, ఎంఏహెచ్‌బీ (మారిషస్) వాటాదారుగా ఉంటాయని వెల్లడించింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (జీహెచ్ఐఏఎల్) జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు 63%, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 13%, తెలంగాణ ప్రభుత్వానికి 13% వాటా ఉంది. గురువారం బీఎస్ఈలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర 1.88 శాతం తగ్గి రూ.15.65 వద్ద స్థిరపడింది. -
వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేకులు
బ్యూనస్ ఎయిర్స్: దాదాపు ఆరు నెలలుగా వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన అమెరికా, చైనాల మధ్య ఎట్టకేలకు సంధి కుదిరింది. వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రస్తుతానికి కొత్తగా మరిన్ని టారిఫ్‌లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇవ్వగా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీకి చర్యలు తీసుకుంటామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భరోసానిచ్చారు. వార్షిక జీ–20 సదస్సు సందర్భంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన విందు సమావేశంలో ఈ మేరకు ఇరువురు అంగీకారానికి వచ్చారు. 2019 జనవరి 1 నుంచి 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 25 శాతానికి పెంచకుండా.. ప్రస్తుతం 10 శాతానికే పరిమితం చేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ప్రతిగా 375 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న వాణిజ్య లోటును తగ్గించేందుకు అమెరికా ఉత్పత్తులు భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు జి జిన్‌పింగ్ అంగీకారం తెలిపారు. ’అమెరికా, చైనాలకు అపరిమిత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఫలవంతమైన చర్చలు జరిగాయి’ అని ట్రంప్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ వెల్లడించింది. ట్రేడ్వార్కు తాత్కాలికంగా బ్రేకులు వేసే దిశగా ట్రంప్, జిన్‌పింగ్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ చైనా మీడియా కథనాలు ప్రచురించింది. 90 రోజుల వ్యవధి.. ముందుగా ప్రతిపాదించినట్లు జనవరి 1 నుంచి టారిఫ్‌లను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు, దీంతో ఈ అంశంపై మరిన్ని చర్చలకు ఆస్కారం లభించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరి సారా సాండర్స్ తెలిపారు. వాణిజ్య లోటు భర్తీ క్రమంలో అమెరికా నుంచి వ్యవసాయ, ఇంధన, పారిశ్రామికోత్పత్తులు మొదలైనవి గణనీయంగా కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. టెక్నాలజీ బదలాయింపు, మేథోహక్కుల పరిరక్షణ తదితర అంశాలపై తక్షణం చర్చించేందుకు ట్రంప్, జిన్‌పింగ్ నిర్ణయించినట్లు వివరించారు. ఇరు పక్షంలో 90 రోజుల్లోగా ఒక అంగీకారానికి రాలేకపోయిన పక్షంలో 10 శాతం సుంకాలను 25 శాతానికి పెంచడం జరుగుతుందన్నారు. గతంలో తిరస్కరించిన క్వాల్కామ్–ఎన్ఎక్స్పీ డీల్ తన ముందుకు వచ్చిన పక్షంలో ఈసారి ఆమోదముద్ర వేసేందుకు జిన్‌పింగ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు శాండర్స్ వివరించారు. -
ఐఎన్ఎఫ్ నుంచీ నిష్క్రమిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ఇరాన్ అణు ఒప్పందాన్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే విమర్శలను ఎదుర్కొటున్న ట్రంప్.. తాజాగా మూడు దశాబ్దాల నాటి ఇంటర్మీడియట్–రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) నుంచి అమెరికాను ఉప సంహరించనున్నట్లు చెప్పారు. 1987లో అమెరికా, యూఎస్ఎస్ఆర్ అధ్యక్షులు వరుసగా రొనాల్డ్ రీగన్, గోర్బచేవ్‌ల మధ్య ఐఎన్ఎఫ్ ఒప్పందం కుదిరింది. 300 నుంచి 3,400 మైళ్ల శ్రేణి కలిగిన క్రూయిజ్ క్షిపణులను అమెరికా, రష్యాలు ఉత్పత్తి చేయకుండా, తమ దగ్గర ఉంచుకోకుండా, పరీక్షించకుండా ఈ ఒప్పందం నిరోధిస్తోంది. 2021లో ఈ ఒప్పందం గడువు ముగియనుంది. అయితే రష్యా ఈ ఒప్పందాన్ని ఏళ్లుగా ఉల్లంఘిస్తోందని ట్రంప్ తాజాగా ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ‘ఒప్పందాన్ని మేం రద్దు చేసుకోబోతున్నాం. వైదొలుగుతాం. రష్యా, చైనాలు కొత్త ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఐఎన్‌ఎఫ్‌ను రద్దు చేసి ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటాం’ అని చెప్పారు. ‘వారు (రష్యా, చైనాలు) మా దగ్గరకు వచ్చి మన మంతా బాగుండాలనీ, ఎవ్వ రూ ఆయుధాలు ఉత్పత్తి చేయకూడదని చెబుతారు. కానీ వారు ఆయుధాలు తయారు చేస్తుంటే మేం మాత్రం ఒప్పందానికి కట్టుబడి చేతులు ముడుచుకుని కూర్చోవాలా? ఇది ఆమోదయోగ్యం కాదు’ అని ట్రంప్ అన్నారు. కాగా, ట్రంప్ నిర్ణయం ప్రమాదకరమైనదని రష్యా పేర్కొంది. -
‘రాఫెల్’పై 10న సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు కోసం ఫ్రెంచి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను ‘సీల్డు కవర్’లో అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాఫెల్ ఒప్పందం అమలుపై స్టే విధించాలంటూ తాజాగా దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి దీనిపై ఈ నెల 10న విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం నిర్ణయించింది. భారత్, ఫ్రెంచి కంపెనీ డసో మధ్య కుదిరిన రూ.58వేల కోట్ల రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రధానిపై అవమానకరమైన, నీతిబాహ్యమైన రీతిలో ఆరోపణలు చేస్తున్నాయని పిటిషనర్ లాయర్ వినీత్ ధండా పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదానికి తెరదించాలని సుప్రీంకోర్టును కోరారు. -
మధుకాన్ ప్రాజెక్ట్స్‌కు ఎన్సీఎల్టీ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ గట్టి షాక్‌నిచ్చింది. పూర్తిచేసిన పనులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఎగవేసినందుకు మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాళా పరిష్కార ప్రక్రియ (ఐఆర్పీ)కు ఎన్సీఎల్టీ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ సభ్యులు రాతకొండ మురళి ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) కోసం సొరంగ తవ్వకాల పనుల్లో భాగంగా అనిక్ పంజర్పోల్ లింక్ రోడ్ పనులను చేపట్టేందుకు మధుకాన్ ప్రాజెక్ట్స్‌తో శ్రీకృష్ణ రైల్ ఇంజనీర్స్ కంపెనీ 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ 2014 నాటికి రూ.4.02 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. అయితే మధుకాన్ ఈ పనులకు కేవలం రూ.96 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన బకాయిల కోసం మధుకాన్‌కు శ్రీకృష్ణ రైల్ ఇంజనీర్స్ పలుమార్లు నోటీసులు పంపింది. అయినా ప్రయోజనం లేకపోవటంతో మధుకాన్ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఆ కంపెనీ హైద రాబాద్లోని ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. మధుకాన్ తమకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయి ందని ఆ కంపెనీ తరఫు న్యాయవాది వివరించారు. చేసిన పనులకు ఎంఎంఆర్డీఏ డబ్బు చెల్లించినా మధుకాన్ మాత్రం తమకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బెంచ్ ముందుంచారు. వీటిని పరిశీలించిన సభ్యులు చెల్లించాల్సిన బకాయిలను మధుకాన్ ప్రాజెక్ట్స్ చెల్లించలేదని నిర్ధారించుకున్నారు. మధుకాన్ దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతినిచ్చారు. తాత్కాలిక దివాళా పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) రాకేష్ రాఠీని నియమించారు. మధుకాన్ ప్రాజెక్ట్స్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించారు. -
‘రక్షణ’కు అమెరికా సాంకేతికత
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన, క్లిష్టమైన సాంకేతికతను అమెరికా భారత్‌కు సమకూర్చే చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలో గురువారం ఫలప్రదంగా జరిగిన ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల(2+2) మంత్రుల తొలి సమావేశం ఇందుకు వేదికైంది. కామ్కాసా(కమ్యూనికేషన్స్, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్)గా పిలిచే ఈ ఒప్పందంపై చాన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు, రష్యా నుంచి భారత్ కొనుగోలుచేయనున్న ఎస్–400 క్షిపణులు, హెచ్–1బీ వీసా, సీమాంతర ఉగ్రవాదం, ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి, ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న యత్నాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మైకేల్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్‌లు చర్చల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రెండు దేశాల త్రివిధ దళాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రష్యాతో సంబంధాలను అర్థం చేసుకుంటాం.. ఇంధన అవసరాల కోసం ఇరాన్‌పై ఆధారపడుతున్న సంగతిని భారత్ అమెరికా దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయంలో సాయం చేస్తామని అమెరికా భారత్‌కు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి క్షిపణుల కొనుగోలు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భారత్–రష్యాల చారిత్రక సంబంధాలను అర్థం చేసుకుంటామని అమెరికా పేర్కొన్నట్లు వెల్లడించాయి. అమెరికాతో వ్యూహాత్మక సహకారంపై రష్యాతో సంబంధాలు ఎలాంటి ప్రభావం చూపవని భారత్ అమెరికాకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. చర్చలు ముగిసిన అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో సుష్మా స్వరాజ్ తొలి 2+2 భేటీ అజెండాపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నియంత్రించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపునకు భారత్ మద్దతిస్తుందని తెలిపారు. కామ్కాసా ఇరు దేశాల సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పోంపియో పేర్కొన్నారు. భారత రక్షణ సామర్థ్యం, సన్నద్ధతను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. కామ్కాసా అంటే.. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి భారత్‌కు అత్యాధునిక మిలిటరీ కమ్యూనికేషన్ పరికరాలు అందుతాయి. ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కీలక సమాచారాన్ని సంకేత భాషలో పంచుకునేందుకు వీలు కలుగుతుంది. సత్వరమే అమల్లోకి వచ్చే ఈ ఒప్పం దం పదేళ్లపాటు అమల్లో ఉంటుంది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అమరుస్తారు. సి–17, సి–130జే, పి–81 విమానాలతో పాటు, అపాచె, చింకూర్ హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇరు దేశాల సైనికుల మధ్య సమాచార మార్పిడి మరింత విస్తృతం అవుతుంది. ఉదాహరణకు భారత్ వైపు చైనా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు రావడాన్ని అమెరికా యుద్ధ విమానాలు గుర్తిస్తే భారత్‌కు ఆ సమాచారం క్షణాల్లోనే చేరిపోతుంది. శత్రు దేశాల యుద్ధ విమానాల ఉనికిని పసిగట్టే సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయొచ్చు. -
కామ్ కాసా ఒప్పందం అంటే..
భారత్, అమెరికా మధ్య అత్యంత కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ (కామ్ కాసా)పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో అమెరికా భారత్‌కు విక్రయించే అత్యాధునిక ఆయుధాలకు కమ్యూనికేషన్ పరికరాలను అమర్చడం, ఉపగ్రహాల సమాచారాన్ని ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కలుగుతుంది. ఇంతకీ ఈ ఒప్పందం ఏమిటంటే.. సైనిక అవసరాల కోసం అమెరికా నుంచి అత్యంత ఆధునిక సాంకేతికపరమైన యుద్ధ పరికరాలు కొనుగోలు చేయడం కోసం కుదుర్చుకోవాల్సిన మూడు ప్రధానమైన ఒప్పందాల్లో కామ్ కాసా ఒకటి. కామ్కాసా ఒప్పందానికి ముందు భారత్ 2016లో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన మూడో ఒప్పందం బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియోస్పాషియల్ కోపరేషన్‌పై ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అమర్చడానికి వీలవుతుంది. సి–17, సి–130జే, పి–81 విమానాలతో పాటు, అపాచె, చింకూర్ హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇరు దేశాల సైనికుల మధ్య కమ్యూనికేషన్లు మరింత విస్తృతం అవుతాయి. ఉదాహరణకి భారత్ వైపు చైనా యుద్ధ విమానాలు, లేదంటే జలాంతర్గాములు రావడాన్ని అమెరికా యుద్ధ విమానాలు గుర్తిస్తే భారత్‌కు ఆ సమాచారం క్షణాల్లోనే చేరిపోతుంది. రక్షణ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించిన చట్టపరమైన ప్రాతిపదికలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది. ఈ ఒప్పందంతో అమెరికా నుంచి సీ గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ డ్రోన్లు శత్రుదేశాల యుద్ధ విమానాల ఉనికిని పసిగట్టగలవు. వాటిని టార్గెట్ కూడా చేయగలవు. కమ్యూనికేషన్ల కోసం ఇప్పటివరకు భారత్ వినియోగిస్తున్న వ్యవస్థ కంటే అమెరికా అమర్చే పరికరాలు సాంకేతికపరంగా అత్యున్నతమైనవి. అత్యంత సురక్షితమైనవి కూడా. దీనిని గతంలో కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సెక్యూరిటీ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ అని పిలిచారు. అయితే ఇది భారత్‌కు చెందినదని స్పష్టంగా గుర్తించడానికి వీలుగా కామ్ కాసా అని మార్చారు. ఈ ఒప్పందం గత పదేళ్లుగా ఇరుదేశాల మధ్య నానుతూనే ఉంది. ఎందుకంటే ఈ ఒప్పందం భారత్ సైనిక స్వేచ్ఛ సమగ్రతను కాలరాసే చర్య అన్న అభిప్రాయం నెలకొంది. అంతేకాదు భారత్ సైన్యాన్ని అమెరికా రక్షణవ్యవస్థ చేతుల్లో పెట్టేసినట్టేనన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. రష్యాతో మనకున్న రక్షణ సంబంధాలపై కూడా కామ్కాసా ఒప్పందం ప్రభావాన్ని చూపిస్తుందని విమర్శలు వచ్చాయి.అయితే ట్రంప్ సర్కార్ మన దేశానికి వ్యూహాత్మక వ్యాపార భాగస్వామి హోదా కట్టబెట్టి భారత్ అంటే తమకున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది. -
‘రాఫెల్’పై విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌ను విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ప్రకటించింది. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది ఎంఎల్ శర్మ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాఫెల్ ఒప్పందంలో పలు లొసుగులు ఉన్నాయని, దాని అమలుపై స్టే విధించాలని శర్మ కోర్టును కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ఫ్రెంచ్ రక్షణ సంస్థ డసాల్ట్‌లపై కేసులు నమోదుచేసి విచారించాలని కోరారు. -
విజయా బ్యాంక్‌తో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఒప్పందం
న్యూఢిల్లీ: బీమా సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్ విజయా బ్యాంక్ ద్వారా తన సేవలను మరింత విస్తరించనుంది. దేశవ్యాప్తంగా 2,129 శాఖలను కలిగిన విజయా బ్యాంక్ తమ ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ బీమా సేవలను అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు విజయా బ్యాంక్ సీఈఓ ఆర్ఏ శంకర నారాయణన్ చెప్పారు. దీర్ఘకాలంలో ఇరు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
నాయకులకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ శాఖలోని రెండు సంఘాలకు చెందిన పలువురు నాయకులకు బదిలీ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ మేరకు శనివారం సంఘాల నాయకులకు, వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్కు మధ్య ఒప్పందం జరిగింది. ఈ నెల 11, 12 తేదీల్లో వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేసి బదిలీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఐదేళ్లకు పైబడినవారు దాదాపు 300 మంది వరకు బదిలీ అయ్యే అవకాశముందని అంచనా వేశారు. ఇంకా జాబితాను ఖరారు చేయలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తమ ఆఫీస్ బేరర్లను బదిలీ చేయకూడదన్న నిబంధన ఉందని ఇటీవల కొందరు వ్యవసాయాధికార సంఘ నేతలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి మరింత సమాచారం కోరుతూ జీఏడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో అసలు ఎన్ని సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో వివరణ కోరారు. అయితే ఇంతలోనే మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కల్పించుకుని వ్యవసాయ శాఖలో రెండే సంఘాలున్నందున అనవసరంగా రాద్ధాంతం చేయడం ఎందుకని, ఆ రెండు సంఘాల నేతలను కూర్చోబెట్టి ఒప్పందం చేసుకోవాలని సూచించారు. దీంతో పార్థసారథి ఆదేశం మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రెండు సంఘాల నేతలతో సమావేశమై కొందరు నేతలను బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. సంఘానికి రాష్ట్రస్థాయిలో 10 మంది.. కమిషనర్ జగన్మోహన్తో జరిగిన ఒప్పందం ప్రకారం ఆ రెండు సంఘాలకు ప్రత్యేక వసతి కల్పించారు. ఆ సంఘాలకు చెందిన 10 మంది చొప్పున రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే రెండు సంఘాలకు కలిపి రాష్ట్రస్థాయిలో 20 మందికి మినహాయింపు వస్తుంది. అలాగే జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆ ప్రకారం 31 జిల్లాల్లో రెండు సంఘాలకు కలిపి 62 మందికి మినహాయింపు రానుంది. అంటే మొత్తంగా 82 మంది బదిలీ నుంచి మినహాయింపు పొందారు. ఆ మేరకు జగన్మోహన్తో సమావేశం జరిగిందని అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, వ్యవసాయశాఖలో బదిలీ కోసం ఇతర ఉద్యోగులు పైరవీలు ముమ్మరం చేశారు. రోజూ అనేకమంది వ్యవసాయ కమిషనరేట్‌కు వచ్చి తమతమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
ఓటర్లను ‘ఫేస్బుక్’ చేద్దాం!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా లీకేజీతో ప్రకంపనలు సృష్టించిన కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేయడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం రూ.2.5 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. ఫేస్బుక్ డేటా ఉల్లంఘన కుంభకోణం బహిర్గతం కావడానికి కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌కు సీఏ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు సీఏ ప్రతిపాదించినట్లుగా భావిస్తున్న 49 పేజీల పత్రంలో ఈ విషయాలున్నాయి. ప్రస్తుతం ఈ పత్రం సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ డేటాను వినియోగించి ఓటర్లను ప్రభావితం చేద్దామని సీఏ అందులో ప్రతిపాదించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. సీఏ సేవలను తాము ఉపయోగించుకోలేదని వివరణ ఇచ్చింది. ‘కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఇలాంటి ప్రతిపాదనలు రోజూ ఎన్నో వస్తాయి. ప్రచారానికి సంబంధించి సీఏతో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదరలేదు’ అని ఆ పార్టీ డేటా అనలిటిక్స్ ఇన్చార్జి ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. ఇటీవల కుంభకోణం నేపథ్యంలో వేటుకు గురైన సీఏ మాజీ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ ఈ ప్రతిపాదనను 2017 ఆగస్టులో రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సంధి కాలంలో ఉన్న సమయంలో ఈ ఆఫర్ ఇస్తున్నామని అందులో పేర్కొంది. -
తిరిగిచ్చేస్తాను...ఒప్పదం రద్దు చేయండి
వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫర్డ్ మధ్య గత కొద్ది కాలం నుంచి కొనసాగుతన్న వివాదం అందరికి తెలిసిందే. తాజాగా ఈ వివాదం సరికొత్త మలుపు తిరగనుంది. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెట్టకుండా ఉండేదుంకు ట్రంప్ తనకిచ్చిన 1,30,000 అమెరికన్ డాలర్ల సొమ్మును తిరిగి ఇచ్చివేయాలనుకుంటున్నట్లు క్లిఫోర్డ్ మీడియాకు తెలిపారు. ఫలితంగా తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన వ్యక్తిగత సలహాదారు మైకెల్ కోహెన్, వైట్ హౌస్ వర్గాలు ఖండించాయి. అయితే అనూహ్యంగా కోహెన్ గత నెలలో ట్రంప్, స్టెఫానీ క్లిఫోర్డ్ మధ్య ఉన్న అనుబంధాన్ని బహిర్గతపరచకుండా ఉండాలని అందుకు ప్రతిఫలంగా సొమ్ము చెల్లించెలా 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆమెతో ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు. ప్రస్తుతం క్లిఫోర్డ్ తరుపు న్యాయవాది మైకెల్ అవనట్టి కోహెన్‌కు ఒక లేఖ పంపించాడు. అందులో తాము గతంలో చేసుకున్న ఒప్పందం వల్ల పొందిన 1,30,000 డాలర్లను తిరిగి ఇచ్చివేస్తామని, ఆ మొత్తాన్ని అధ్యక్షుని పేరిట ఉన్న ఖాతాలో జమచేస్తామని వివరించారు. ఫలితంగా వారి మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దుచేయాలని కోరారు. ఒకవేళ ఒప్పందం రద్దయితే క్లిఫోర్డ్ తనకు అధ్యక్షునికి మధ్య ఉన్న అనుబంధం గురించి బహిరంగంగా మాట్లాడవచ్చు, తమ అనుబంధానికి సంబంధించిన సందేశాలను, ఫోటోలను, వీడియోలను బహిర్గతం చేయవచ్చు. దానివల్ల ఆమె మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలులేదు. -
ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం
మాస్కో: ఉగ్రవాదం పోరులో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఉగ్రవాదంపై పోరులో సహకరించుకునేలా ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్, రష్యా అంతర్గత మంత్రి కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో భాగంగా సోమవారం రష్యా మంత్రితో రాజ్‌నాథ్ పలు అంశాలపై చర్చలు జరిపారు. సమాచార మార్పిడి విస్తృతం చేయడంతో పాటు డేటాబేస్, పోలీసు, దర్యాప్తు విభాగాలకు శిక్షణలో సహకారానికి కూడా భారత్, రష్యాలు అంగీకరించాయి. -
స్వదేశానికి రోహింగ్యాలు!
యాంగాన్: ఆరునెలలుగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చిక్కుముడిగా ఉన్న రోహింగ్యా ముస్లిం శరాణార్థుల విషయంపై ఇరుదేశాలు ముందడుగు వేశాయి. బంగ్లాదేశ్‌లో ఉంటున్న రోహింగ్యా శరణార్థులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు మయన్మార్ అంగీకరించింది. ఈమేరకు ఈ రెండు దేశాల మధ్య మయన్మార్ రాజధాని నేపిదాలో గురువారం ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ, బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి మహమ్మూద్ అలీ ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినట్లు మయన్మార్ కార్మిక శాఖ కార్యదర్శి మీంట్ కయాంగ్ మీడియాకు తెలిపారు. మయన్మార్‌లోని రఖానే రాష్ట్రంలో ఆ దేశ సైనికులు రోహింగ్యా ముస్లింలపై హింసకు పాల్పడటంతో అక్కడ్నుంచి 6,20,000 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చేశారు. -
కాంగ్రెస్–పటేళ్ల మధ్య సయోధ్య
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ, పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) మధ్య రిజర్వేషన్లపై నెలకొన్న పీటముడి వీడింది. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పటేళ్లకు కల్పించే రిజర్వేషన్లపై ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని పీఏఏఎస్ కన్వీనర్ దినేశ్ బాంభానియా తెలిపారు. ఈ ఒప్పందం వివరాలు, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశాలను సోమవారం రాజ్‌కోట్‌లో జరిగే సభలో తమ నాయకుడు హార్దిక్ పటేల్ వెల్లడిస్తారని చెప్పారు. ఆదివారం కాంగ్రెస్, పీఏఏఎస్ల మధ్య జరిగిన సమావేశానికి హార్దిక్ పటేల్ హాజరుకాలేదు. ‘రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తో కీలక సమావేశం నిర్వహించాం. అందుబాటులో ఉన్న పలు ప్రత్యామ్నాయాలపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సోమవారం రాజ్‌కోట్‌లో జరిగే కార్యక్రమంలో హార్దిక్ పటేల్ వివరాలు వెల్లడిస్తారు. రిజర్వేషన్ల ఫార్ములాపై మాత్రమే కాంగ్రెస్‌తో అవగాహన కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ వర్గానికి టికెట్లు ఇవ్వడంపై చర్చించలేదు. కాంగ్రెస్‌కు మద్దతిస్తామా? లేదా? అన్నది హార్దిక్ చెబుతారు’అని దినేశ్ అన్నారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు కాంగ్రెస్ 77 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. సీనియర్ నాయకులు శక్తిసిన్హా గోహిల్, అర్జున్ మోధ్వాడియాలకు టికెట్లు దక్కాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడంలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భరత్‌సిన్హా సోలంకి స్పష్టం చేశారు. ఈ జాబితాలో 20 మంది పటేళ్లకు చోటు కల్పించడం గమనార్హం. -
‘అయోధ్య’పై వక్ఫ్, అఖాడా ఏకాభిప్రాయం
అలహాబాద్: అయోధ్యలో రామ మందిరం వివాదంపై అఖిల భారతీయ అఖాడా పరిషత్, యూపీ షియా వక్ఫ్‌బోర్డు మధ్య ఓ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేయగానే, ఆ వివరాలను సుప్రీంకోర్టుకు తెలపనున్నారు. ‘అయోధ్య లేదా ఫైజాబాద్‌లో మసీదు నిర్మించకూడదనే ఏకాభిప్రాయానికి వచ్చాం. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏదేనీ ఇతర ప్రాంతంలో మసీదు నిర్మాణానికి మేం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం’ అని షియా వక్ఫ్‌బోర్డు చీఫ్ వసీం రిజ్వీ చెప్పారు. -
అమెరికాతో సౌదీ భారీ ఆయుధ డీల్
-
అమెరికాతో సౌదీ భారీ ఆయుధ డీల్
వాషింగ్టన్: సౌదీ అరేబియాకు అత్యాధునిక టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్) క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. థాడ్ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు(రూ. 97 వేల కోట్లు) అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. శక్తివంతమైన రాడార్లు అమర్చిన ఈ థాడ్ క్షిపణులు శత్రు దేశాల క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకుని పేల్చివేస్తాయి. గంటకు 10 వేల కి.మీ వేగంతో ప్రయాణించే థాడ్ క్షిపణులు 150 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగరగలవు. ‘ఈ ఒప్పందం అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు సహకారంగా ఉంటుంది. సౌదీ అరేబియా, గల్ఫ్‌లో ఇరాన్‌తో పాటు ఇతర ప్రాంతీయ ముప్పుల నేపథ్యంలో థాడ్ దీర్ఘకాల రక్షణ వ్యవస్థగా ఉపయోగపడుతుంది’ అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే థాడ్‌ను సౌదీ పొరుగు దేశాలైన ఖతర్, యూఏఈలకు అమెరికా సరఫరా చేసింది. అమెరికా ఆయుధ సంపత్తిలో థాట్ అత్యంత సమర్థవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ. శత్రు క్షిపణుల్ని కచ్చితంగా గుర్తించి పేల్చేందుకు ఇందులో రాడార్ వ్యవస్థలున్నాయి. 20 అడుగుల పొడవుండే థాడ్ క్షిపణులు టన్ను బరువుంటాయి. ఇన్ఫ్రారెడ్ సెన్సర్ల సాయంతో మిస్సైల్‌ను అంచనావేసి పేల్చేస్తుంది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ నిర్ణయించారు. పాక్‌కు గట్టి హెచ్చరికలు చేసేందుకు విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల్ని పాక్‌కు పంపనున్నారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని ట్రంప్ తప్పుపట్టడం తెలిసిందే. అమెరికా హెచ్చరించినా పాక్ తీరు మారకపోవడంతో ఈ నెల చివరిలో అమెరికా విదేశాంగ మంత్రి పాక్‌కు వెళ్లనున్నారు. అందుకే ట్రంప్‌తో విడిపోయా న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు సహా పలు ఆసక్తికర అంశాల్ని ఆయన మొదటి భార్య ఇవానా బయటపెట్టారు. ‘రైజింగ్ ట్రంప్’ పేరుతో ఆమె రాసిన పుస్తకంలో ట్రంప్ వివాహేతర సంబంధాల బాగోతాన్ని వివరించారు. 1977లో ట్రంప్‌ను పెళ్లిచేసుకున్న ఇవానా 1992లో విడిపోయారు. ‘మా వివాహ బంధం ముగిసిందని 1989లో∙నాకు అర్థమైంది. ఒక యువతి నా దగ్గరకు వచ్చి తన పేరు మార్లా అని, నా భర్తను ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను వెంటనే బయటకు పో.. నేను నా భర్తను ప్రేమిస్తున్నానని గట్టిగా సమాధానమిచ్చాను’ అని పాత సంగతుల్ని పుసక్తంలో ఇవానా గుర్తుచేసుకున్నారు. మార్లా మేపుల్స్‌తో వివాహేతర సంబంధాన్ని 1990లో న్యూయార్క్ పోస్టు పత్రిక ‘బెస్ట్ సెక్స్ ఐ హావ్ ఎవర్ హాడ్’ పేరుతో ప్రకటించడంతో ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవానాతో విడాకుల తర్వాత 1993లో ట్రంప్ మార్లాను పెళ్లి చేసుకున్నారు. ‘మేమిద్దరం విడిపోయాక పెద్ద కొడుకు డొనాల్డ్ జూనియర్ ఏడాది పాటు తండ్రితో మాట్లాడలేదు. ప్రస్తుతం వారానికోసారి మాట్లాడుకుంటున్నాం. చెక్ రిపబ్లిక్కు రాయబారిగా నాకు చాన్సిచ్చినా వద్దన్నా’ అని పేర్కొన్నారు. -
శాంతికాముకులకు... నోబెల్ ‘సలామ్’
సాక్షి నాలెడ్జ్ సెంటర్: మానవాళి మంచి కోరుతూ, మనిషి మనుగడకు భరోసాను అడుగుతూ, అణ్వస్త్రమనేది లేని రేపటి ప్రపంచాన్ని కాంక్షిస్తున్న లక్షలాది మంది శాంతి కాముకులకు దక్కిన గౌరవమే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి. అణ్వాయుధాల మూలంగా మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పుపై ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ప్రచారం చేస్తూ, వివిధ దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ... స్థాపించిన పదేళ్లకే నోబెల్ శాంతి బహుమతి సాధించింది ఐ కెన్. ఇది ఒక వ్యక్తి కృషికో, సంస్థకో లభించిన గుర్తింపు కాదు. మనుషులంతా బాగుండాలని కోరుకోవడమే కాకుండా ఆ దిశగా తమకు తోచిన రీతిలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవం. భారత్ నుంచి మూడు సంస్థల భాగస్వామ్యం మందుపాతరలపై నిషేధం కోరుతూ వచ్చిన స్వచ్ఛంద ఉద్యమం మూలంగా 1997లో వాటిని నిషేధిస్తూ అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీని నుంచి స్ఫూర్తి పొందిన అణుయుద్ధ నివారణకు పనిచేసే అంతర్జాతీయ డాక్టర్ల సంఘం... అణ్వాయుధ నిర్మూలనను కోరుతూ ఉద్యమాన్ని నిర్మించాలని తీర్మానించింది. ఫలితంగా 2007 ఏప్రిల్ 30న ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన సమావేశాలతో ఐకన్ పురుడు పోసుకుంది.. ఐ కెన్‌లో 101 దేశాల నుంచి 468 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల నుంచి అంతర్జాతీయ సంస్థల దాకా వీటిలో ఉన్నాయి. ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్... భారత్ నుంచి ఐకన్లో భాగస్వాములుగా ఉన్న మూడు సంస్థలివి. అంతర్జాతీయ స్టీరింగ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఐకన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. బీట్రిస్ ఫిన్ 2014 జూలై నుంచి కార్యనిర్వాహక డైరెక్టర్‌గా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏవైనా ఐ కెన్‌లో భాగస్వాములు కావొచ్చు. ప్రవేశ, వార్షిక రుసుములు ఏవీ ఉండవు. లక్ష్యం... పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించే రసాయన, జీవ ఆయుధాలు, మందుపాతరల వాడకాన్ని నిషేధిస్తూ స్పష్టమైన అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. కానీ మానవ మనుగడకే తీవ్ర ముప్పు అని నిరూపించే సాక్ష్యాలు ఉన్నా, హిరోషిమా, నాగసాకిలో జరిగిన అణు విధ్వంసాన్ని ప్రపంచం కళ్లారా చూసినా, అణ్వస్త్ర నిర్మూలన దిశగా పెద్దగా ముందడుగు పడలేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం (ఎన్పీటీ) 1970లో కుదిరినా... అది సమూల నిర్మూలకు ఉద్దేశించింది కాదు. 1967 ముందు అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకున్న అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలను ఎన్పీటీ అణ్వస్త్ర దేశాలుగా గుర్తించింది. తర్వాత భారత్, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించి తాము అణ్యాయుధాలను అభివృద్ధి చేసుకున్నామని బాహటంగా ప్రకటించుకున్నాయి. ఇజ్రాయెల్ ఇలా బాహటంగా చెప్పకున్నా... అణ్వాయుధాలను కలిగి ఉంది. పైన చెప్పిన ఎనిమిది దేశాల ఉమ్మడిగా దాదాపు 15,000 వేల అణ్వస్త్ర వార్హెడ్లను కలిగి ఉన్నాయని అమెరికా సైంటిస్టులను ఉటంకిస్తూ ఐ కెన్ చెబుతోంది. ఓ వంద అణు బాంబులు వేస్తే లక్షల కొద్దీ జనం మృత్యువాతపడటమే కాకుండా... రేడియేషన్ ప్రభావం, పర్యావరణ మార్పుల కారణంగా 100 కోట్ల మంది జనం కరువుబారిన పడతారని ఐకన్ చెబుతోంది. అలాంటి దాదాపు 15,000 అణుకుంపట్లతో మనం కలిసి జీవిస్తున్నామని గుర్తుచేస్తోంది. అణ్వస్త్రాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఐ కెన్ పనిచేస్తోంది. నోబెల్ విజేతలు డెస్మండ్ టుటు, దలైలామా, ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తదితరులు ఐకన్కు మద్దతు పలికారు. ఫలించిన కృషి... ఐ కెన్, రెడ్‌క్రాస్ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న సంస్థలు దశాబ్దకాలంగా చేసిన కృషి ఈ ఏడాది ఫలించింది. 2017లో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని 2016 అక్టోబర్ 27న ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2017లో చర్చలు మొదలై జూలె ఏడో తేదీన ‘అణ్వాయుధ నిషేధ ఒప్పందం (టీపీఎన్‌డబ్ల్యూ)’ ఐరాస సాధారణ సభ ఆమోదం పొందింది. కనీసం 50 దేశాలు తమ చట్టసభల్లో దీనికి ఆమోదముద్ర వేసిన వెంటనే ఒప్పందం అమలులోకి వస్తుంది. అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, తయారుచేయడం, కలిగి ఉండటం, సాంకేతికతను బదలాయించడం, నిల్వచేయడాన్ని టీపీఎన్‌డబ్ల్యూ నిషేధిస్తుంది. అయితే అణ్వస్త్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు టీపీఎన్డబ్ల్యూపై ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ప్రధాన దేశాలు దూరంగా ఉన్నందువల్ల... రేప్పొద్దున్న ఈ అంతర్జాతీయ ఒప్పందం అమలులోకి వస్తే... అణ్వస్త్రదేశాలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది చెప్పలేం. మొత్తం మీద ఓ ప్రజా ఉద్య మాన్ని నిర్మించి, ఐరాసలో 122 దేశాలతో అనుకూల ఓటు వేయించిన ఐ కెన్ కృషికి ‘నోబెల్ బహుమతి’ రూపంలో తగిన గుర్తింపు లభించింది. ► ‘ఐ కెన్’కు నోబెల్ శాంతి పురస్కారం, అణ్వస్త్ర నిరాయుధీకరణ ఉద్యమానికి దక్కిన గుర్తింపు ఓస్లో: అణ్వాయుధాలను నిర్మూలించేందుకు విశేష కృషిచేస్తున్న ‘ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్–ఐ కెన్’ (అణ్వాస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ ఉద్యమం) అనే సంస్థను 1.1 మిలియన్ డాలర్ల విలువైన నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఐ కెన్ అనేది ఒక ఉద్యమ సంస్థ. అంతర్జాతీయంగా అణ్వస్త్ర నిరాయుధీకరణను కోరుకుంటున్న వివిధ దేశాల్లోని వందలాది సంస్థల సమాహారం. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ఐ కెన్...అణ్వాయుధాల నివారణకు ప్రపంచ దేశాలు సహకరించుకోవడంలో చోదక శక్తిగా పనిచేస్తోందని నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్‌వుమన్ బెరిట్ రీస్–అండర్సన్ శుక్రవారం పేర్కొన్నారు. నోబెల్ ప్రకటన అనంతరం ఐ కెన్ కార్యనిర్వాహక డైరెక్టర్ బీట్రిస్ ఫిన్ మాట్లాడుతూ ‘మా సంస్థకు లభించిన ఈ పురస్కారం అణ్వాయుధాలు కలిగిన, వాటిపై ఆధారపడే దేశాలకు ఓ సందేశం పంపుతుంది. అదేంటంటే ఆ దేశాల విధానం ఆమోదనీయం కాదు అని. భద్రత పేరుతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను అవి ప్రమాదంలో పెట్టలేవు’ అని పేర్కొన్నారు. నోబెల్ ప్రైజ్ లభించినట్లు అధికారిక ప్రకటనకంటే కొన్ని నిమిషాల ముందే తనకు ఫోన్‌కాల్ వచ్చిందనీ, అప్పుడు నమ్మలేదని ఫిన్ తెలిపారు. ఇటీవల ఉత్తర కొరియా వరుసగా అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు జరుపుతుండటం, ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతి ఐ కెన్‌కు లభించడం గమనార్హం. -
బర్కిలీ కాలేజీతో ఎస్ఆర్ఎం వర్సిటీ ఒప్పందం
అమరావతి: చెన్నై, అమరావతిల్లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ.. డాడో, మారియా బనటావో ప్రపంచ విద్యా కేంద్రం ద్వారా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బర్కిలీ ఇంజనీరింగ్ కళాశాలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, వ్యవస్థాపక రంగంలో ఈ రెండు విద్యాసంస్థల మధ్య పరస్పరం సమాచార మార్పిడి జరగనుంది. ఇందులో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆవిష్కరణలు, వ్యవస్థాపక రంగంలో శిక్షణ నిచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ పి.సత్యనారాయణ్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆలోచనలు, వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక సామాజిక పద్ధతులను కలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. తద్వారా అమరావతి, చెన్నైల్లో వినూత్న ఆవిష్కరణలకు చోటిచ్చే వాతావరణాన్ని సృష్టించి తీర ప్రాంతాలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆవిష్కరణలు, నమూనాల రూపకల్పనకు సంబంధించిన కోర్సులను రూపొందించడంలో బర్కిలీ ఇంజనీరింగ్ కళాశాల సహకరిస్తుంది. అలా భవన నిర్మాణాన్ని పరిశీలించడానికి ఎస్ఆర్ఎం సిబ్బందిని తమ కాలేజీలోకి అనుమతించనుంది. -
నీరు–చెట్టు.. తమ్ముళ్లకు తాకట్టు
►నీరు–ప్రగతికీ అదే దుర్గతి ►అగ్రిమెంట్ కాకపోయినా పనులు చేస్తున్న వైనం ►రూ.కోట్లు స్వాహాకు పన్నాగం నీరు– చెట్టుతోపాటు పేరు మార్చిన నీరు–ప్రగతి పథకాలను తెలుగు తమ్ముళ్లు కాసులు కురిపించే కామధేనువుగా మార్చుకున్నారు.అధికారం అండతో అడ్డంగా నిధులు దోచుకుంటున్నారు. నీరు–ప్రగతి పథకంలో రూ.కోట్లను దండుకోవడానికి వ్యూహం పన్నారు. టెండర్ విధానానికి గండికొట్టి నామినేషన్ పద్ధతిలో పనులు చేజిక్కించుకున్నారు. అడుగడుగునా స్వాహా పర్వానికి తెరతీశారు. పెళ్లకూరు/దొరవారిసత్రం : నీరు–చెట్టు, నీరు–ప్రగతి పనులను అధికార పార్టీ నాయకులు చేజిక్కించుకున్నారు. పనులు చేయకపోయినా చేసినట్టు రికార్డుల్లో నమోదు చేయించి నిధులు స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పెళ్లకూరు మండలంలో నీరు–ప్రగతి కింద చేపట్టే వివిధ పనులకు గత నెలలో రూ.17 కోట్లు మంజూరయ్యాయి. శ్రీకాళహస్తి ఇరిగేషన్ డివిజన్లో 94 పనులకు రూ.8.52 కోట్లు, నాయుడుపేట ఇరిగేషన్ డివిజన్లో 64 పనులకు రూ.6.48 కోట్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు మరో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. పనులు చేయకున్నా ఎం.బుక్‌లో నమోదు చేయించి నిధుల స్వాహాకు తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జన్మభూమి కమిటీలతో కలిసి.. అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు కలిసి పనులను పంచుకున్నారు. ఏదైనా పనికి సంబంధించి అంచనా విలువ రూ.10 లక్షలు దాటితే బహిరంగ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అదే జరిగితే పనులు తమకు దక్కవన్న ఉద్దేశంతో ప్రతి పనికి రూ.10 లక్షల లోపే అంచనాలు రూపొం దించారు. ఇందుకోసం అధికారులతో కుమ్మక్కయ్యారు. ప్రతి పనికి రూ.9.90 లక్షలలోపు నిధులు సరిపోతాయంటూ సరిపెట్టించారు. మండలంలోని సీనియర్ టీడీపీ నేతల్లో ఒక్కొక్కరికి రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల విలువైన పనులను కేటాయించారు. అర్ధమాల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకునికి రూ.38.19 లక్షలు, శిరసనం బేడుకు చెందిన సీనియర్ నాయకునికి రూ.78.36 లక్షల విలువైన పనులు కేటాయిం చారు. పెళ్లకూరుకు చెందిన నాయకునికి రూ.62 లక్షలు, కానూరు, రోసనూరు, పాలచ్చూరు, కప్పగుంట కండ్రిగ, కలవకూరు తదితర గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఒక్కొక్కరికి రూ.30 లక్షల విలువైన పనులు అప్పగించారు. చివరకు ఈ పనులన్నిటినీ రూ.30 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుని అదే పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకు అప్పగించారనే ప్రచారం సాగుతోంది. అంతా డొల్ల నీరు–ప్రగతి పథకంలో చెరువుల్లో పూడిక తొలగింపు చేపట్టి నీటినిల్వ సామర్థ్యం పెంచాలనేది లక్ష్యం. పెళ్లకూరు మండలంలో మొత్తం 67 చెరువులున్నాయి. గతంలో తొలి విడతగా 5, రెండో విడతగా 13 చెరువుల్లో నీరు–చెట్టు పథకం కింద పనులు చేపట్టారు. ఒక్కొక్క చెరువుకు రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.78 లక్షలు మంజూరయ్యాయి. కొత్తూరు, తాళ్వాయిపాడు చెరువుల్లోని మట్టిని అక్కడి టీడీపీ నాయకులు ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. రెండోవిడత నీరు–చెట్టు కింద రూ.6.78 కోట్లు మంజూరు కాగా, ఈనిధులతో శిరసనంబేడు గ్రామంలోని సెజ్ భూముల్లో రైతులకు అవసరం లేనిచోట తూతూమంత్రంగా చెరువు పనులు చేపట్టి నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పెళ్లకూరులో కోనేరు పనులు చేపట్టకుండా స్థానిక నాయకుడు రూ.2.50లక్షలు నిధులు మింగేసినట్టు విమర్శలొచ్చాయి. నీరు–ప్రగతి పనుల్లోనూ అదే దందా నడుస్తోంది. అగ్రిమెంట్లు కాకపోయినా పనులు చేపట్టి నిధులు స్వాహా చేసేందుకు చకచకా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. నాలుగు స్తంభాలాట దొరవారిసత్రం మండలంలో నీరు–చెట్టు పనులు చేజిక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. వారంతా నాలుగు వర్గాలుగా ఏర్పడి పనులన్నిటినీ తమ వర్గానికే కేటాయించాలంటూ నియోజకవర్గ నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. తొలి, మలివిడత పనుల్లో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా పనులు చేసి రూ.లక్షలు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మూడో విడతగా చేపట్టే 67 పనులకు రూ.7.77 కోట్లు మంజూరయ్యాయి. పని విలువ రూ.10 లక్షలు దాటి ఉంటే టెండర్లు ద్వారా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉంది. అలాకాకుండా రూ.10 లక్షల లోపు అంచనాలు వేయించి పనులను చేజిక్కించుకునేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. ఏకొల్లు, పూలతోట, మీజూరు, కల్లూరు తదితర పంచాయతీల్లో ఈ పనులు దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అగ్రిమెంట్ లేకుండానే.. ఏకొల్లు, నెల్లూరుపల్లి, కట్టూవాపల్లి తదితర ప్రాంతాల్లో నీరు–చెట్టు పథకం కింద చెరువు కట్ట మరమ్మతులు, కలుజు, తూముల నిర్మాణం వంటి పనులు నెల రోజులుగా జరుగుతున్నాయి. సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ పనులను అగ్రిమెంట్ చేయకుండానే తెలుగు తమ్ముళ్లు చేయిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రాంతాల్లో చేపట్టిన పనులు 80 శాతం పైబడి పూర్తికావచ్చాయి. నెల్లూరుపల్లి, బూదూరు. అక్కరపాక, పోలిరెడ్డిపాళెం పంచాయతీల్లో అధికార పార్టీ నాయకులే పనులు చేస్తున్నారు. నెల్లూరుపల్లి ప్రాంతంలో మూడు చెరువులకు నిధులు మంజూరు కాగా, కట్ట మరమ్మతులు పూర్తి చేసి కలుజు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. -
జేఎన్టీయూతో టీసీఎస్ ఒప్పందం
► బోధన, శిక్షణ కార్యక్రమాల్లో సహకారం అందించనున్న ఐటీ దిగ్గజం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన బోధన కోసం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్)మరో ముందడుగు వేసింది. ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో ఒప్పందం కుదు ర్చుకుంది. ఇందులో భాగంగా జేఎన్టీయూహెచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించే కార్యక్రమాలకు టీసీఎస్ సహకారం అందించనుంది. పరిశ్రమ ఆధారిత శిక్షణలు, బోధన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల ఇంటర్న్‌షిప్, అవార్డులు, పరిశోధన ల్లోనూ టీసీఎస్ పాలుపంచుకోనుంది. శనివారం జేఎన్టీ యూహెచ్ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి, టీసీఎస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న ఒప్పంద పత్రా లపై సంతకాలు చేశారు. జేఎన్టీయూ భాగస్వామ్యంతో దాదాపు పదేళ్లుగా వివిధ అంశాల్లో ఒప్పం దం కుదుర్చుకుని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపా రు. టీసీఎస్ రీసెర్చ్ స్కాలర్ ప్రొగాంను కూడా పొడిగిం చినట్లు చెప్పారు. -
స్పైస్‌జెట్‌కు 50 ‘క్యూ400’ విమానాలు
♦ బంబార్డియర్తో ఒప్పందం ♦ డీల్ విలువ రూ.10,900 కోట్లపైనే న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్’ విమానాల కొనుగోళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. కార్యకలాపాల విస్తరణే ప్రధాన లక్ష్యంగా ఇది తాజాగా బంబార్డియర్ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి 50 వరకు ‘క్యూ400’ టర్బోప్రాప్ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి 86 సీటర్ విమానాలు. ఈ డీల్ విలువ 1.7 బిలియన్ (దాదాపు రూ.10,900 కోట్లు) డాలర్లు. ఈ మేరకు కంపెనీ బంబార్డియర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘క్యూ400’ విమానాలకు సంబంధించి ఇదే అతిపెద్ద సింగిల్ ఆర్డరని స్పైస్‌జెట్ పేర్కొంది. ఇందుకోసం ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై స్పైస్‌జెట్ సంతకాలు చేసింది. ‘క్యూ400 విమానాల కొనుగోలు డీల్ ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ డీల్ ద్వారా చిన్న పట్టణాలకు కనెక్టివిటీ సదుపాయాలను విస్తరిస్తాం’ అని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. పారిస్ ఎయిర్ షో కార్యక్రమంలో ఈ డీల్ కుదిరిందని పేర్కొన్నారు. కాగా 40 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ప్లేన్స్ కొనుగోలు ఒప్పందం జరిగిన మరుసటి రోజే స్పైస్‌జెట్ ఈ డీల్‌ను ప్రకటించడం గమనార్హం. -
ఇక భారత్‌లో ఎఫ్–16 ఫైటర్ జెట్స్ తయారీ!
♦ టాటా గ్రూప్, లాక్‌హీడ్ మార్టిన్ల మధ్య ఒప్పందం ♦ భారత్, అమెరికాలో ఉద్యోగాలకు ఊతం లండన్: అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిస్ ఎయిర్‌షో సందర్భంగా కంపెనీలు ఈ విషయం వెల్లడించాయి. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చే ఈ డీల్ ప్రకారం లాక్‌హీడ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ వర్త్‌లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్‌కు తరలించనుంది. ఈ క్రమంలో అక్కడి అమెరికన్ల ఉద్యోగుల ఉపాధికి ప్రత్యక్షంగా భంగం కలగకుండా చర్యలు తీసుకోనుంది. మేకిన్ ఇండియా నినాదానికి ప్రాధాన్యమిస్తున్న ప్రధాని మోదీ, అమెరికన్లకే ఉద్యోగాల నినాదానికి ప్రాధాన్యమిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భేటీ కానున్న నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, లాక్‌హీడ్ మార్టిన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఓర్లాండో కర్వాలో సమక్షంలో టీఏఎస్ఎల్ సీఈవో సుకరణ్ సింగ్, లాక్‌హీడ్ వైస్ ప్రెసిడెంట్ జార్జ్ స్టాండ్ రిడ్జ్ దీనిపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం ఈ డీల్‌తో మరింత పటిష్టం కాగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఎఫ్–16ల తయారీకి సంబంధించి ఇదొక అపూర్వమైన ఒప్పందమని ఓర్లాండో పేర్కొన్నారు. టీఏఎస్ఎల్ ఇప్పటికే లాక్‌హీడ్‌కి చెందిన సీ–130జే ఎయిర్‌లిఫ్టర్, ఎస్–92 హెలికాప్టర్లకు ఎయిర్‌ఫ్రేమ్ విడిభాగాలు అందజేస్తోంది. ఉపాధికి తోడ్పాటు..: భారత వైమానిక దళానికి అవసరమైన సింగిల్ ఇంజిన్ ఫైటర్ విమానాల అవసరాలు తీర్చేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లాక్‌హీడ్ భాగస్వామ్యం తోడ్పడనుంది. భారత ఎయిర్‌ఫోర్స్‌కు ఈ తరహా విమానాలు సుమారు 200 అవసరమని రక్షణ రంగ నిపుణుల అంచనా. అత్యంత ఆధునిక ఎఫ్–16 బ్లాక్ 70 విమానాల తయారీ, నిర్వహణ, ఎగుమతికి ఈ డీల్ ద్వారా భారత్‌కు అవకాశం లభించగలదని టాటా సన్స్ పేర్కొంది. అలాగే, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌కు ప్రముఖ స్థానం దక్కగలదని వివరించింది. భారత్‌లో ఎఫ్–16 విమానాల తయారీ ఇటు దేశీయంగా తయారీ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అటు అమెరికాలోనూ వేల కొద్దీ ఉద్యోగాల కల్పనకు ఊతమివ్వగలదని ఓర్లాండో తెలిపారు. ఇప్పటిదాకా సుమారు 4,500 పైగా ఎఫ్–16 యుద్ధ విమానాలు ఉత్పత్తి కాగా, 26 దేశాల్లో 3,200 పైచిలుకు విమానాలు నడుస్తున్నాయి. -
భూకంపాల పరిశోధన సంస్థతో ‘నన్నయ’ ఒడంబడిక
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : అహ్మదాబాద్‌లోని భూకంపాల పరిశోధన సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీ సహకార పరిశోధనపై అవగాహన ఒడంబడికను కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అంగీకార పత్రాలపై శుక్రవారం యూనివర్సిటీ వీసీ ఛాంబర్లో భూకంపాల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎం.రవికుమార్, నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పరస్పరం సంతకాలు చేశారు. భూకంపాలకు సంబంధించి జరిపే పరిశోధనల వల్ల కలిగే ప్రయోజనాలు, భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలపై ఉభయులు చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోది ప్రోత్సాహంతో ఈ సంస్థ దేశంలో అనేక ప్రాంతాల్లో భూకంపాలకు సంబంధించి పలు అంశాలపై పరిశోధనలు చేస్తుందన్నారు. అనంతరం యూనివర్సిటీలోని జియాలజీ విభాగం అధిపతి డాక్టర్ కేవీ స్వామి, వారి బృందంతో కూడా భూకంపాల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎం.రవికుమార్ చర్చించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ టి.మురళీధర్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎ.మట్టారెడ్డి, ఇంజినీర్ ఏవీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఎనలిటికల్ స్కిల్స్ పరీక్ష ఫీజు రద్దు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 29న నిర్వహించనున్న ఎనలిటికల్ స్కిల్స్ అనే ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన నాలుగో సెమిస్టర్ పరీక్షకు విద్యార్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. ఈనెల ఒకటిన జరిగిన ఈ పరీక్ష మోడల్ మారడంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల విజ్ఞప్తుల మేరకు పరీక్ష రద్దు చేసి, తిరిగి 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. అయితే ఇందుకుగాను ప్రతి విద్యార్థి రూ.250 ఫీజు చెల్లించాలనడంపై ‘తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి’ అనే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఫీజును రద్దు చేసి, గతంలో ఇచ్చిన హాల్ టికెట్లతో పాత సెంటర్లలోనే నేరుగా పరీక్షకు హాజరుకావొచ్చన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చన్నారు. -
భారత్ రష్యా మధ్య కుదిరిన ఒప్పందం
-
అగ్రిమెంట్ చేసినా పన్ను చెల్లించాల్సిందే
- ఆస్తుల క్రయవిక్రయాలపై ఫల్గుణకుమార్ - చాంబర్ కామర్స్‌లో అవగాహన కార్యక్రమం కర్నూలు(హాస్పిటల్): ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తేనే బదలాయించినట్లు కాదని, కొంత ప్రతిఫలం తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్నా అమ్మకంగా భావించి ఆదాయం పన్ను విధిస్తారని సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ మాజీ చైర్మన్(చెన్నై), చార్టెడ్ అకౌంటెంట్ ఈ. ఫల్గుణకుమార్ చెప్పారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కర్నూలు బ్రాంచ్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ జి. శేషాచలం ఆధ్వర్యంలో స్తిరాస్తి కొనుగోలు, అమ్మకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫల్గుణకుమార్ మాట్లాడుతూ స్తిరాస్తిని వ్యాపారం కోసం కొంటే అతని ఖర్చుగా కాకుండా ఆదాయంగా పరిగణిస్తారన్నారు. ఆస్తిని ప్రభుత్వ విలువ కన్నా తక్కువకు అమ్మినా, కొన్నా ఆ వ్యత్యాసం కూడా అతని ఆదాయం కిందనే చూపుతారన్నారు. స్తిరాస్తి కొనుగోలు విలువ రూ.50లక్షలు దాటితే, ప్రతి చెల్లింపులో 1 శాతం ఆదాయం పన్ను మినహాయించుకుని, ప్రత్యేక చలానా ద్వారా అమ్మకందారుని పేరుపై చెల్లించాలన్నారు. ఇది అగ్రిమెంట్లకు కూడా వర్తిస్తుందన్నారు. ఇంటి స్థలాన్ని అపార్ట్మెంట్ నిర్మాణం కోసం వేరొకరికి అగ్రిమెంట్ రాయిస్తే, ఆ రోజే తన భాగానికి వచ్చే ఇళ్ల కోసం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. తనకున్న భూమిలో ప్లాట్లు వేసి, ఇళ్ల స్థలాలను అమ్మేందుకు ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ తేదీనే అతను సొంత ఆస్తిని వ్యాపార నిమిత్తం బదలాయించినట్లు భావించి పన్ను విధిస్తారన్నారు. కొత్తగా నిర్మించిన ఇళ్లు, అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నా బాడుగ ఇచ్చినట్లు ఆదాయం పన్ను చెల్లించాలన్నారు. ఆస్తులు కొనేందుకు కావాల్సిన డబ్బు ఎలా వచ్చింది, ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బు ఎలా ఉపయోగించారు అనే ప్రశ్నలకు కూడా ఆదాయపు పన్ను శాఖకు సమాధానమివ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఇకాయ్ కర్నూలు బ్రాంచ్ మాజీ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ కేవీ కృష్ణయ్య, కర్నూలు ట్యాక్స్ బేరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి. బుచ్చన్న, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి, కార్యదర్శి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రిలయన్స్ జియోమనీతో ఉబెర్ జట్టు
ముంబై: టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌తో చేతులు కలిపింది. జియో యూజర్లు ఇకపై రిలయన్స్ పేమెంట్ సొల్యూషన్స్‌కి చెందిన ప్రీపెయిడ్ వాలెట్ జియోమనీ యాప్ ద్వారా ఉబెర్ ట్యాక్సీలను బుక్ చేసుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. జియోమనీ ద్వారా ఉబెర్ ట్యాక్సీ సేవలకు చెల్లింపులు జరిపేవారికి ఇరు సంస్థలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు జియోమనీ బిజినెస్ హెడ్ అనిర్బన్ ముఖర్జీ తెలిపారు. దేశీ యూజర్లకు మరింత మెరుగైన డిజిటల్ సర్వీసులు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఉబెర్ నూతన చీఫ్ బిజనెస్ ఆఫీసర్ (భారత విభాగం) మధు కన్నన్ పేర్కొన్నారు. -
మైక్రోసాఫ్ట్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం
సాక్షి, బెంగళూరు: దేశీ ఈ–కామర్స్ రంగ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ప్రపంచ ఐటీ అగ్రగామి మైక్రోసాఫ్ట్ మధ్య బెంగళూరులో సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. తాజా ఒప్పందం ప్రకారం పేమెంట్, లాజిస్టిక్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇకపై మైక్రోసాఫ్ట్ రూపొందించిన అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనుంది. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఫ్లిఫ్‌కార్ట్ సీఈఓ బిన్నీ బన్సాల్‌లు పాల్గొన్నారు. -
మైక్రోసాఫ్ట్‌తో టాటా మోటార్స్ జట్టు
ముంబై: మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలను తీర్చిదిద్దుకునే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం టాటా మోటార్స్ వాహనాల్లో అడ్వాన్స్డ్ నేవిగేషన్, టెలిమాటిక్స్ మొదలైన సర్వీసులు మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. ఇందుకు సంబంధించిన తొలి వాహనాన్ని మార్చ్ 7న జెనీవాలో జరిగే ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నట్లు టాటా మోటార్స్ ఎండీ గుంటర్ బుషెక్ తెలిపారు. కార్ల కొనుగోలుదారులు మరింత ఎక్కువగా విలువ ఆధారిత సర్వీసులను ఆశిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తమకు కొత్త ఆదాయ అవకాశాలను కల్పించగలదని ఆయన వివరించారు. ముందుగా ఇటీవలే ప్రవేశపెట్టిన సబ్–బ్రాండ్ టామో వాహనాలతో ప్రారంభించి, మిగతా బ్రాండెడ్ ప్యాసింజర్ వాహనాల్లో ఈ టెక్నాలజీలను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన వాటితో వాహనాల్లో సురక్షితమైన ప్రయాణ అనుభూతి కలిగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. టాటా టెక్నాలజీస్‌లో వాటా కొనుగోలు కోసం వార్బర్గ్ పిన్కస్ చర్చలు! ముంబై: టాటా మోటార్స్‌కు చెందిన ఇంజినీరింగ్ విభాగం, టాటా టెక్నాలజీస్‌లో వాటా కొనుగోలు కోసం వార్బర్గ్ పిన్కస్ చర్చలు జరుపుతోందని సమాచారం. టాటా టెక్నాలజీస్‌లో మైనారిటీ వాటాను 45 కోట్ల డాలర్లకు ఈ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని వారాల్లోనే దీనికి సంబంధించిన డీల్ కుదరవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ డీల్ కుదరవచ్చు లేక కుదరకపోవచ్చని, మరో సంస్థ వాటా కొనుగోలు కోసం ముందుకు రావచ్చని ఆ వర్గాలు వివరించాయి. వాహన, వైమానిక, పారిశ్రామిక, యంత్ర సంబంధిత పరిశ్రమలకు డిజైన్, రీసెర్చ్, డెవలప్మెంట్ సర్వీసులను టాటా టెక్నాలజీస్ అందిస్తోంది. ఈ కంపెనీలో టాటా మోటార్స్‌కు 70.4 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి టాటా మోటార్స్‌కు భారీగా ఉన్న స్థూల రుణ భారం రూ.74,800 కోట్లలో కొంతైనా తగ్గగలదు. కాగా డీల్ వార్తలపై ఇరు వర్గాల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. -
ఎస్వీ విద్యా సంస్థలతో ‘జైన్’ ఒప్పందం
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల, రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం 30 కంపెనీలతో క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించేలా జైన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం ఎస్వీ డిగ్రీ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్వీ విద్యా సంస్థల అధినేత సి.సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జైన్ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు ఇది మంచి అవకాశమని, జిల్లాలోని డిగ్రీ, బీటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2017 మార్చి 4న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని డిగ్రీ, బీటెక్ కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. జైన్ యూనివర్సిటీ ఎంబీఏ విభాగం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అశ్విన్, పి.సాయినాథ్‌రెడ్డి, ఎస్వీ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్టాన్చార్ట్తో ఎల్ఐసీ ఎంఎఫ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో యూనీఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వీలుంటుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా నగదు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశముంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
టోల్ ప్లాజాల్లో మొబిక్విక్ ద్వారా చెల్లింపులు
ఎన్హెచ్ఏఐతో సంస్థ ఒప్పందం న్యూఢిల్లీ: మొబైల్ వ్యాలెట్ సంస్థ మొబిక్విక్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 391 టోల్ ప్లాజాల వద్ద తమ కస్టమర్లు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా టోల్ రుసుములు చెల్లించవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అతి త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. నగదుకు కొరత నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు తమ కస్టమర్లు మొబైల్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎన్హెచ్ఏఐ నుంచి అనుమతి లభించినట్టు సంస్థ తెలిపింది. ‘‘టోల్ ప్లాజాల వద్ద మొబిక్విక్ ద్వారా రుసుము చెల్లించాలనుకునే వారు తమ ఫోన్లోని యాప్‌ను ఓపెన్ చేసి ప్లాజాలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. టోల్ ఆపరేటర్ చెప్పిన నగదును, వాహన నంబర్‌ను ఎంటర్ చేసి ‘పే’ బటన్‌ను ప్రెస్ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది’’ అని సంస్థ తెలియజేసింది. మరోవైపు, వాహనాల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 2 వరకు టోల్ రుసుములు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. -
అడాగ్ గ్రూప్ టీవీ చానళ్లు జీ చేతికి
• రేడియో వ్యాపారంలో 49 శాతం వాటా కూడా • లావాదేవీ విలువ రూ. 1,900 కోట్లు న్యూఢిల్లీ: అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన టీవీ చానళ్లను సుభాష్ చంద్రకు చెందిన జీగ్రూప్ కొనుగోలు చేయనుంది. ఎంటర్టైన్మెంట్ టీవీ చానళ్లలో 100 శాతం వాటాతో పాటు రిలయన్స రేడియో వ్యాపారంలో 49 శాతం వాటాను కూడా అడాగ్ విక్రరుుస్తోంది. ఈ మేరకు ఇరు గ్రూప్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆయా కంపెనీల బోర్డులు ఈ ఒప్పందాన్ని ఆమోదించారుు. ఈ మొత్తం లావాదేవీ విలువ రూ.1,900 కోట్లు. జీగ్రూప్ కంపెనీ అరుున జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రెజైస్ తమ టీవీ వ్యాపారాన్ని పూర్తిగా కొనుగోలు చేసిందని, జీ మీడియా కార్పొరేషన్‌కు తమ రెడియో వ్యాపారంలో 49 శాతాన్ని విక్రరుుస్తున్నామని రిలయన్స క్యాపిటల్ ఒక ప్రకటనలో తెలియజేసింది. తమకు ప్రధానం కాని వ్యాపారాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ విక్రయాలు జరిపినట్లు అడాగ్ తెలియజేసింది. హిందీలో బిగ్ మ్యాజిక్ పేరుతో ఒక కామెడీ చానల్, భోజ్‌పురి భాషలో బిగ్ గంగా పేరుతో ఒక ఎంటర్టైన్మెంట్ చానల్‌ను అడాగ్ గ్రూపు నిర్వహిస్తోంది. అలాగే ఈ సంస్థకు 45 ఎఫ్ఎం రెడియో స్టేషన్లు కూడా ఉండగా... మరో 14 కొత్త లెసైన్సుల్ని ఇటీవల వేలంలో దక్కించుకుంది. ఈ రేడియో వ్యాపారంలో రిలయన్స తనకున్న వాటాను కొత్తగా ఏర్పాటుచేసే ఒక సంస్థకు బదిలీ చేస్తుంది. ఈ కొత్త సంస్థలో జీ 49 శాతం వాటాను తీసుకుంటుంది. -
ప్రభుత్వంతో ‘లింక్డ్ ఇన్’ ఎంఓయూ
ముంబై: ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్వర్క్ ‘లింక్డ్ ఇన్’ తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. విద్యార్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో లింక్డ్ ఇన్.. మానవ వనరుల అభివృద్ధి శాఖతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో అనుసంధానమైన అన్ని కాలేజీలు తమ ‘ప్లేస్‌మెంట్స్’ ప్రొడక్ట్‌ను ఆమోదించాల్సి ఉంటుందని లింక్డ్ ఇన్ పేర్కొంది. విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ ప్రొడక్ట్ద్వారా దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కాగా లింక్డ్ ఇన్.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను సులభతరం చేయాలనే ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఈ ప్లేస్మెంట్ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని విద్యార్థులకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు అందుబాటులోకి తెచ్చింది. -
భూములిస్తే రిజిస్ట్రేషన్లకు అనుమతి
చిలకలపూడి : భూసమీకరణలో భూములు ఇస్తామని అంగీకార పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని బందరు ఆర్డీవో పి.సాయిబాబు అన్నారు. ఆయన తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఏడీఏ ద్వారా 33 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇందుకోసం 21 గ్రామాలను పది యూనిట్లుగా ఏర్పాటు చేసి ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించినట్లు తెలిపారు. భూసమీకరణకు అంగీకార పత్రాలు ఇస్తామని, తాము కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కొంత మంది తమను కోరటం జరిగిందన్నారు. ఇందుకోసం భూసమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చే వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేలా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ చేయించి రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు. భూసమీకరణలో గ్రామ కంఠాలు, గృహాలు కూడా పొందుపరిచారని కొంత మంది అపోహలో ఉన్నారన్నారు. గ్రామకంఠాలు, గృహాలను తాము సమీకరణలో చేర్చలేదని స్పష్టం చేశారు. అయితే గ్రామ కంఠాలు పక్కనే గృహాలు ఉండి వాటిని భూసమీకరణలో పొందుపరిచి ఉంటే వారి అభ్యంతరాలను స్వీకరించి తహసీల్దార్‌తో విచారణ చేయించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో బందరు తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జెంటిల్మెన్ ఒప్పందం
అమలాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం వ్యవహారం రెండేళ్లు గణేష్‌కు, మిగిలిన కాలానికి సతీష్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిలిపివేయాలంటూ 29న హైకోర్టులో రిట్ నేటి కోర్టు విచారణపై ఉత్కంఠ ఓవైపు జెంటిల్మెన్ ఒప్పందం కోసం స్థానిక దివంగత మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు నివాసంలో చర్చలు జరుగుతుండగానే, పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు గారపాటి మార్తాండ 29న జరిగే చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలంటూ సోమవారం హైకోర్టులో రిట్ వేశారు. మున్సిపల్ చైర్మన్ మల్లేశ్వరరావు మృతితో ఖాళీ అయిన నాలుగో వార్డుకు ఎన్నిక నిర్వహించకుండా, చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించరాదని.. ఇది మున్సిపల్ బైలాకు విరుద్ధమంటూ కోర్టును ఆశ్రయించారు. ఇదే విషయమై టీడీపీ కార్యకర్త మామిడిపల్లి సాయిబాబు కూడా చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలం టూ హైకోర్టులో రిట్ వేశారు. సాయిబాబు వేసిన రిట్‌పై దసరా సెలవుల తర్వాత విచారణకు వాయిదా వేస్తే, మార్తాండ వేసిన రిట్‌ను మంగళవారం విచారణ చేయనున్నట్టు హైకోర్టు పేర్కొంది. దీంతో చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జెంటిల్మెన్ ఒప్పందాన్ని సూచించిన రాజప్ప మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరుగుతున్న కసరత్తు, గణేష్, సతీష్ మధ్య జరుగుతున్న పదవీ పందేరంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకుని, జెంటిల్మెన్ ఒప్పందంతో ఆ అంశానికి తెరదించారు. దీంతో ఎమ్మెల్యే ఆనందరావు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, కౌన్సిలర్లు, పట్టణ టీడీపీ శ్రేణుల సమక్షంలో ఆ పదవి కోసం పోటీ పడుతున్న గణేష్, సతీష్‌కు సోమవారం ఈ ఒ ప్పందాన్ని వివరించారు. ఇందుకు గణేష్, సతీష్ అంగీకరించారు. దీంతో 29న జరిగే చైర్మన్ ఎన్నికకు గణేష్ ఒక్కరినే చైర్మన్ అ భ్యర్థిగా ఎంపిక చేశారు. ఒకే అభ్యర్థి కావడంతో చైర్మన్‌గా గణేష్ ఎన్నిక ఇక లాంఛనమేనని అంతా అనుకున్నారు. ఎన్నిక నిలిపివేతపై వేసిన రిట్‌తో ఉత్కంఠ అనివార్యమైంది. నాలుగో వార్డు నుంచి మల్లేశ్వరరా వు తనయుడు సతీష్ ఎన్నికై, చైర్మన్ పదవి చేపట్టాలని ఆశించారు. మూడేళ్లు మల్లేశ్వరరావు, రెండేళ్లు గణేష్ చైర్మన్లుగా పనిచేసేం దుకు 2014 మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన ఒప్పందంతో పాటు మల్లేశ్వరరావు మృతితో ఖాళీ అయిన చైర్మన్ పీఠాన్ని గణేష్ ఆశించారు. 29న జరిగే ఎన్నికలో గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారో, మంగళవారం నాటి హైకోర్టు విచారణతో ఎన్నిక వాయిదా పడుతుందో, ఎన్నిక నిర్వహించుకోవచ్చో తేలాలంటే వేచిచూడాల్సిందే. -
అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ కట్
♦ మూడు జేవీల్లో నిస్సాన్ వాటాల కొనుగోలుకు అశోక్ లేలాండ్ ఓకే ♦ ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం... న్యూఢిల్లీ: జపాన్ వాహన దిగ్గజం నిస్సాన్‌తో ఎనిమిదేళ్ల అశోక్ లేలాండ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇరు కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన మూడు జాయింట్ వెంచర్ల(జేవీ) నుంచి వైదొలగాలని నిస్సాన్ మోటార్ కంపెనీ నిర్ణయించింది. ఈ మూడు జేవీల్లో తమ వాటాలను అశోక్ లేలాండ్‌కు విక్రయించేందుకు బుధవారం ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఒక సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు వెల్లడించాయి. 2008 మే నెలలో అశోక్ లేలాండ్ నిస్సాన్ వెహికల్స్(ఏఎల్ఎన్వీఎల్) పేరుతో వాహన తయారీ జేవీ, అదేవిధంగా ఇంజిన్ల ఉత్పత్తి కోసం నిస్సాన్ అశోక్ లేలాండ్ పవర్ ట్రెయిన్(ఎన్ఏఎల్పీటీ), సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి నిస్సాన్ అశోక్ లేలాండ్ టెక్నాలజీస్(ఎన్ఏఎల్) అనే మూడు జేవీలను ఈ కంపెనీలు నెలకొల్పాయి. వీటిలో ఈక్విటీ రూపంలో దాదాపు రూ.1,000 కోట్లను పెట్టుబడిగా పెట్టాయి. కాగా, ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మూడు జేవీలు ఇక అశోక్ లేలాండ్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లుగా మారతాయని, భారత్‌లోని వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల మేరకు ఈ డీల్ పూర్తవుతుందని సంయుక్త ప్రకటన తెలిపింది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. దోస్త్, ఇతర ఎస్సీవీలకు తోడ్పాటు... అశోక్ లేలాండ్‌తో జేవీల నుంచి వైదొలగినప్పటికీ... కొన్ని వాహనాలకు సంబంధించి లెసైన్సింగ్‌కు ఇరు కంపెనీలు అంగీకరించాయి. ప్రధానంగా దోస్త్, ఇతర లైట్ కమర్షియల్ వాహనాల(ఎల్సీవీ)కు కొత్తగా లెసైన్సింగ్ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుంది. వీటికి ఇంజినీరింగ్, టెక్నాలజీ, డిజైన్‌ను నిస్సాన్ సమకూర్చింది. అదేవిధంగా కస్టమర్లకు సర్వీసింగ్, విడిభాగాల లభ్యత వంటివి కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయి. మరోపక్క, దేశీయంగా తయారైన విడిభాగాల కొనుగోలును నిస్సాన్ కొనసాగించేందుకు కూడా ఇరు కంపెనీలు అంగీకరించాయి. ఎందుకీ తెగదెంపులు... వాస్తవానికి మూడు జేవీల్లో ఒకదాని నుంచి వైదొలగుతామంటూ ఈ ఏడాది ఆరంభంలోనే నిస్సాన్ టెర్మినేషన్ నోటీసులను అశోక్ లేలాండ్‌కు పంపింది. యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక స్కీమ్(ఈపీసీజీ) నిబంధనలను రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అశోక్ లేలాండ్ కోర్టుకెళ్లడంతో ఇరు కంపెనీల మధ్య విభేధాలు మొదలయ్యాయి. అంతేకాకుండా జేవీల ద్వారా విడుదల చేసిన పలు మోడల్స్ మార్కెట్లో అంతగా విజయవంతం కాకపోవడం కూడా దీనికి కారణంగా నిలిచింది. ఇవాలియా ఎంపీవీని నిస్సాన్ నిలిపివేయగా... స్టైల్ ఎంపీవీ ఉత్పత్తిని అశోక్ లేలాండ్ ఆపేసింది. ఈ రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. అయితే, విజయవంతంగా అమ్ముడవుతున్న దోస్త్ ఎల్‌సీవీని మాత్రమే ప్రస్తుతం అశోక్ లేలాండ్ కొనసాగిస్తోంది. అతేకాకుండా దోస్త్‌కు సంబంధించి నిస్సాన్ అధిక రాయల్టీని డిమాండ్ చేయడం కూడా అశోక్ లేలాండ్‌కు నచ్చలేదు. అయితే, జేవీ ద్వారా తమకంటే తమ భాగస్వామే ఎక్కువగా లాభపడుతోందని నిస్సాన్ భావిస్తూవచ్చింది. ఈ పరిణామాలన్నీ చివరకు భాగస్వామ్యం ముగిసేలా చేసింది. మూడు జేవీల్లో నిస్సాన్ వాటాను కొనుగోలు చేయడానికి మేం అంగీకరించాం. మా కీలక వాహన వ్యాపారంపై మరింత దృష్టిపెట్టేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయి. అదేవిధంగా తాజా లెసైన్సింగ్ ఒప్పందం మేరకు నిస్సాన్‌తో మా బంధం కొనసాగుతుంది’. - వినోద్ దాసరి, అశోక్ లేలాండ్ ఎండీ భారత్‌లో మా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తాం. వాహనాల తయారీ, పరిశోధన-అభివృద్ధితో పాటు సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇక్కడి మార్కెట్లో ప్రధాన వాహన కంపెనీగా అవిర్భవించే సన్నాహాల్లో ఉన్నాం. అశోక్ లేలాండ్‌తో కొత్తగా కుదిరిన లెసైన్సింగ్ ఒప్పందం ప్రకారం ఎల్సీవీ కస్టమర్లకు నిస్సాన్ ఇంజనీరింగ్, సర్వీసింగ్, విడిభాగాల లభ్యతకు ఎలాంటి ఢోకా ఉండదు’. - ఫిలిప్ గురిన్-బౌటాడ్, స్సాన్ గ్లోబల్ ఎల్సీవీ బిజినెస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ -
తెలంగాణకు ‘మహా’ అన్యాయం: రేవంత్
-
తెలంగాణకు ‘మహా’ అన్యాయం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాలన్నీ ప్రాజెక్టుల విషయం లో తెలంగాణకు అన్యాయం చేశాయని చెబుతున్న కేసీఆర్, అసలు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వివరాలను ఎందుకు చెప్పడంలేదని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్ మహారాష్ట్రతో చేసుకు న్న ఒప్పందంవల్ల తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతందన్నారు.గురువారం ఇక్కడి ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర, అప్పటి ఏపీ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టులు, బ్యారేజ్‌ల నిర్మాణాలకు సంబంధించి 1975లోనే ఒప్పందాలు చేసుకున్నాయన్నా రు. దీనిపై అంతర్రాష్ట్ర బోర్డు సమావేశాల్లో పునస్సమీక్షించుకునే అవకాశం ఉందని, కేసీఆర్ తప్పును సరిద్దిద్దుకోవాలన్నారు. రీడిజైనింగ్ వల్ల రాష్ట్రంపై రూ.50వేల కోట్ల అదనపు భారం పడుతుందని, ప్రజాధనాన్ని కాపాడ డానికి అవసరమైతే కోర్టు తలుపులు తడతామని రేవంత్ చెప్పారు. -
కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవు
సాక్షి, సిటీబ్యూరో: అరవై ఏళ్ల వలస పాలనలో ఎండిన పొలాలకు నీళ్లిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేస్తున్న కాంగ్రెస్,టీడీపీ పార్టీలకు పుట్టగతులుండవని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో మంగళవారం తెలంగాణా ప్రభుత్వం కుదుర్చుకోనున్న ఒప్పందం చారిత్రాత్మకమైనదన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ గ్రేటర్ విభాగం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని నగరానికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈనెల 24న బేగంపేట్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందుకు భారీ జనసమీకరణ చేయాలన్నారు. మల్లన్న ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తున్నామన్నారు. నగరంలో పార్టీ బలోపేతం చేసేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని, ప్రతి సమావేశానికి విధిగా హాజరుకావాలని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..నూతన ఒప్పందంతో ఐదు జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణాలో ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. ప్రాజెక్టుల ఆవశ్యకతపై అదేరోజు విమానాశ్రయం ఆవరణలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారన్నారు. పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ప్రతినెలా తొలి ఆదివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి అందరికీ సౌలభ్యంగా ఉండేందుకు 27 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. త్వరలో ఆలయ కమిటీల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, ముఖ్యనేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
సింగపూర్ ‘ ఏ స్టార్’తో తెలంగాణ ఒప్పందం
హైదరాబాద్: ఆవిష్కరణ, పరిశోధన, ఇంక్యుబేషన్, వాణిజ్య రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సింగపూర్‌కు చెందిన ‘ఏ స్టార్’ (ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్) కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రిచ్ (రీసెర్చ్, ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. సింగపూర్ పర్యటనలో భాగంగా తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు బుధవారం 18 కంపెనీలకు చెందిన సీఈఓలతో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, విద్య రంగాల నడుమ వారధిగా పనిచేస్తున్న ఏ స్టార్‌తో ఒప్పందం ద్వారా.. పరిశోధన, ఆవిష్కరణ, ఇంక్యుబేషన్, వాణిజ్య రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు మార్గం సుగమంకానుందని తెలిపారు. -
సెర్నోవ ఫైనాన్షియల్తో టీసీఎస్ ఒప్పందం
లండన్: భారత సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్, సెర్నోవ ఫైనాన్షియల్ కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. తర్వాతి తరం క్లౌడ్ ఆధారిత డెరివేటివ్ పోస్ట్ ట్రేడ్ ప్రాసెసింగ్ సర్వీస్‌ను అందించడం కోసం ఈ సంస్థలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మారుతున్న అంతర్జాతీయ నియమనిబంధనలకు అనుగుణంగా ఉంటూనే నష్ట భయాన్ని తగ్గించే ఈ సర్వీస్ బ్యాంక్‌లకు, వ్యవస్థాగత ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లకు ప్రయోజనకరమని సెర్నోవ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వెంకట్ రామసామి చెప్పారు. వ్యయాలు, నిబంధనల పాటింపు, నష్ట భయం- ఈ మూడు విషయాల్లో సమతౌల్యం పాటించడంతో పాటు ఈ సేవలను వినియోగించుకోవడం వల్ల బ్యాంక్‌లకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) సుశీల్ వాసుదేవన్ చెప్పారు. -
అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో ఎస్బీఐ ఒప్పందం
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ల మధ్య ఒక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా ఎస్బీఐ ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్)ల్లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులను అంగీకరిస్తారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ఆఫ్‌లైన్, ఆన్లైన్ లావాదేవీలకు వర్తిస్తుందని ఎస్బీఐ డీఎండీ మంజు అగర్వాల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని, భారత్‌లో 3.12 లక్షల పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్) ఏర్పాటు చేశామని వివరించారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుదారులు తమ కార్డులను ప్రతి రోజూ కొనుగోళ్లకు ఉపయోగించి, రివార్డులు పొందవచ్చని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ రీజనల్ ప్రెసిడెంట్ సంజయ్ రిషి పేర్కొన్నారు. ఈ ఒప్పందం కారణంగా తమ క్రెడిట్ కార్డ్ వ్యాపారం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి భారత్‌లో తమ క్రెడిట్ కార్డులు 8.28 లక్షలుగా ఉన్నాయని వివరించారు. -
యస్ బ్యాంక్‌తో క్లిక్ అండ్ పే ఒప్పందం
హైదరాబాద్: తెలంగాణ హబ్ పోర్ట్‌ఫోలియో కంపెనీ అయిన క్లిక్ అండ్ పే, ప్రైవేట్ రంగలోని యస్ బ్యాంక్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. నగదు రహిత లావాదేవీలకు మొబైల్ ఆధారిత చెల్లింపు సొల్యూషన్లు అందించే తాము యస్‌బ్యాంక్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని క్లిక్ అండ్ పే ఒక ప్రకటనలో తెలిపింది. భద్రమైన, సౌకర్యవంతమైన నగదు రహిత లావాదేవీలను వినియోగదారులకు అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని క్లిక్ అండ్ పే వ్యవస్థాపకుల్లో ఒకరైన సాయి సందీప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా యస్‌బ్యాంక్ మొబైల్ వాలెట్లను జారీ చేస్తామని వివరించారు. మరోవైపు డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపులు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయని యస్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ రితేశ్ పాయ్ పేర్కొన్నారు. -
కృష్ణపట్నం పోర్టుతో మెర్క్ లైన్ ఇండియా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒమన్‌లోని సలాలా నుంచి కొత్తగా సేవలు ప్రారంభించేం దుకు మెర్క్ లైన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కృష్ణపట్నం పోర్టు (కేపీసీఎల్) వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి వీక్లీ సర్వీసులు ప్రారంభమవుతాయని కేపీసీఎల్ ఎండీ చింతా శశిధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల కస్టమర్లను నేరుగా ఒమన్ ప్రాంత కస్టమర్లకు అనుసంధానించేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు. -
విడాకుల కేసులో హీరోయిన్ ఒప్పందం
న్యూఢిల్లీ: బాలీవుడ్లో ఒకప్పటి టాప్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ల విడాకుల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కివచ్చింది. భరణం చెల్లింపు విషయంలో వీరిద్దరూ సుప్రీం కోర్టులో ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ కేసును శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ముంబైలో ఉన్న తన తండ్రి ఇంటిని కరిష్మా కపూర్ పేరు మీద బదలాయించేందుకు సంజయ్ అంగీకరించాడు. ఇక సంజయ్ కపూర్ పిల్లల కోసం 14 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాడు. వీటి ద్వారా ప్రతి నెల వచ్చే 10 లక్షల రూపాయల వడ్డీని పిల్లల ఖర్చులకు వెచ్చించనున్నారు. కరిష్మ, సంజయ్‌ల మధ్య మనస్పర్థలు రావడంతో గత అయిదేళ్లుగా విడిగా ఉంటున్నారు. కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కరిష్మా ఇటీవల తన భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది. భర్త, అత్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నట్టు కరిష్మా కోర్టుకు తెలియజేసింది. ఇక పిల్లలను కరిష్మా వద్ద ఉంచేందుకు సంజయ్ అంగీకరించాడు. పిల్లలను చూసేందుకు వెళ్లేందుకు సంజయ్‌కు అనుమతించారు. -
ఫ్లిప్‌కార్ట్‌తో యూసీ బ్రౌజర్ ఒప్పందం
హైదరాబాద్: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్, యూసీ(చైనా) బ్రౌజర్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా యూసీ బ్రౌజర్ హోమ్ స్క్రీన్‌లో ఫ్లిప్‌కార్ట్ సైట్ లభ్యమవుతుందని యూసీ బ్రౌజర్ ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక ఇ-టెయిలర్లు భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తున్నారని, ఎం-కామర్స్ మార్కెట్ జోరుగా వృద్ధి సాధిస్తోందని యూసీవెబ్ ఇండియా జనరల్ మేనేజర్ రాబర్ట్ బు పేర్కొన్నారు. ఉత్తమమైన షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి అందిస్తామని తెలిపారు. -
సోలార్ పార్కుల అభివృద్ధికి భారత్ కు రూ.5,681 కోట్లు
యూఎస్ఏఐడీ, ఏడీబీ మధ్య ఒప్పందం న్యూఢిల్లీ: భారత్‌లో సోలార్ పార్కుల ఏర్పాటుకు గానూ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇవి రెండు క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా భారత్‌లో సోలార్ పార్కుల అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం భారత్‌కు రూ.5,681 కోట్లు అందించనున్నాయి. -
'బ్యారేజీల నిర్మాణానికి సూత్రప్రాయం అంగీకారం'
హైదరాబాద్: గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణం కోసం తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య సూత్రప్రాయ అంగీకారం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో శనివారం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు భేటీ అయ్యారు. తుమ్మిడి హట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీలు నిర్మించేందుకు సూత్రప్రాయం అంగీకారం కుదిరినట్లు తెలిసింది. -
‘మహా’ ఒప్పందం సూత్రప్రాయమే
నెలాఖరులోగా పూర్తి ఒప్పందం ► అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ► తెలంగాణ-మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటైంది ► 19న ఇరు రాష్ట్ర ఇంజనీర్ల చర్చలు మొదలవుతాయి ► కాంగ్రెస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు ► సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై కుట్ర చేశారు ► అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికించి పూర్తి కాకుండా చూశారు ► గతంలో ఒప్పందం కుదుర్చుకుంటే ఎందుకు అమలు చేయలేదు? ► మిషన్ భగీరథ పూర్తయితే ఓట్లు రావని ప్రతిపక్షాల భయం ► వర్సిటీలకు కావాలనే వీసీలను నియమించలేదు ► ఆలస్యమైనా చేస్తాం.. తప్పులు మాత్రం చేయం ► హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలు దురదృష్టకరం ► ఆర్టీసీని పటిష్టం చేసి ఆదుకుంటాం సాక్షి, హైదరాబాద్: గోదావరిపై అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి ఈ నెలాఖరులోగా ఒప్పందం కుదురుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇటీవల మహారాష్ట్రతో సూత్రప్రాయ ఒప్పందం కుదిరిందని, ఈ నెలలో జరిగే ఉన్నతస్థాయి సమావేశాల అనంతరం ఆ ఒప్పందానికి పరిపూర్ణత వస్తుందని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర నియంత్రణ బోర్డు ఉండేదని, ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మూడంచెల ‘ఇంటర్ స్టేట్ బోర్డు’ ఏర్పాటైందని వెల్లడించారు. ఆదివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. మహారాష్ట్రతో ఒప్పందానికి సంబంధించి ఈ నెల 19 నుంచి సమావేశాలు మొదలవుతాయన్నారు. 19న ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో, తర్వాత నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సాగునీటి శాఖల మంత్రులు సమావేశమవుతారని చెప్పారు. అనంతరం అత్యున్నత స్థాయి(అపెక్స్ బాడీ) సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రాజెక్టుల వారీగా ఒప్పందాలు కుదుర్చుకుంటారని వెల్లడించారు. ఒప్పందంపై బ్లాక్ డే అంటారా? మహారాష్ట్రతో ఇటీవల ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం పాతదేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో మీరు పూర్తి బాధ్యతారహితంగా మాట్లాడారు. మేం రాష్ట్రానికి తలవంపులు తెచ్చామని, బ్లాక్ డే అని అన్నారు. తలవంపులు తెచ్చింది మేం కాదు.. మీరు’’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘సమైక్య రాష్ట్రంలో అంతర్రాష్ట్ర జల వివాదాలు, పర్యావరణ అనుమతుల చట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను ఇరికించి పనులు కాకుండా కుట్ర పన్నారు. 40 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గతంలో మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలను ఎందుకు అమలు చేయలేదు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోకుండానే తమ్మిడిహెట్టి వద్ద రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారు. ‘మీరుపెట్టిన ఖర్చు వృథా అవుతుంది’ అని నాటిమహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ చెప్పినా స్పందించలేదు. ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇష్టారీతిన పనులు చేశారు’’ అని సీఎం అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో.. పొరుగు రాష్ట్రాలతో చెరిగిపోయిన సుహృద్భావ వాతావరణం పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథను దేశంలో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాయన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్‌కుమార్ తెలంగాణలో అమలు చేస్తున్న నీటి పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘మిషన్ భగీరథ పూర్తయితే ఓట్లు రావనే భయం ప్రతిపక్షాలకు పట్టుకుంది. మిషన్ భగీరథకు రుణం ఇవ్వొద్దంటూ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హడ్కోకు లేఖ రాసి.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆరు నూరైనా ఈ డిసెంబర్ నాటికి 6,182 గ్రామాలకు, 12 మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తాం’’ అని సీఎం పునరుద్ఘాటించారు. ‘‘రాష్ట్రం వచ్చిన 9 నెలల తర్వాత నుంచి అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. కరువు రావడంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గిందని, అందుకే ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ను ఇవ్వగలుగుతోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. 2014-15తో పోల్చితే 2015-16లో 16 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేసిన విషయాన్ని మరిచారా?’’ అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టుతో లింకు లేకుండా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశ పెట్టిన బంగారుతల్లి పథకాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పం కాబట్టే ప్రజలు తమను గౌరవిస్తున్నారన్నారు. ‘మిషన్’ను అప్రతిష్టపాలు చేయొద్దు ‘‘మిషన్ కాకతీయ పనులు ప్రారంభం కాకముందే కమీషన్ కాకతీయ అంటూ విమర్శలు చేశారు. మీ హయంలో అలా జరిగాయి కాబట్టి ఇప్పుడు అలా జరుగుతున్నాయని అనుకుంటున్నారు. రాష్ట్రానికి చెరువులు ప్రాణాధారం. వాటికి జీవం పోసేందుకు ఉద్దేశించిన మిషన్ కాకతీయను అప్రతిష్ట పాలు చేయకండి’’ అని సీఎం ప్రతిపక్షాలకు సూచించారు. అర్ధంతరంగా నిలిచిపోయిన 57 వేల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని, ఇంకా పనులు ప్రారంభం కాని వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో అవకాశం ఇస్తామని తెలిపారు. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప కింది నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకే కేటాయిస్తామని, ఇంకా మిగిలిపోతే వాటిని ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తామని హామీనిచ్చారు. ‘‘చిన్న ముల్కనూరులో ఇళ్లు కూల్చాలని నేనే చెప్పా. భారమైనా వంద శాతం ప్రభుత్వమే ఖర్చును భరించి నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తాం’’ అని స్పష్టంచేశారు. మైనార్టీల రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బీసీ కమిషన్ పరిశీలనకు పెట్టి అవరోధాలు ఎదురవకుండా అమలు చేస్తామన్నారు. ఒకే విడతలో రుణమాఫీ అసాధ్యం ‘‘రైతు రుణమాఫీని ఒకే విడతలో మాఫీ చేసేందుకు ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరినా.. సానుకూల స్పందన లేదు. దీంతో ఒకే విడతలో రుణమాఫీ చేయలేకపోతున్నాం’’ అని సీఎం తెలిపారు. ఆహార కల్తీని నిరోధించేందుకు హార్టికల్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మెదక్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘‘సూరత్, తిరుప్పూర్ను మించి వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు 6,160 ఎకరాలు కావాలంటూ దరఖాస్తులు అందాయి’’ అని కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో 16 శాతం ఎగుమతులు పెరిగాయన్నారు. ఏరోస్పేస్ రంగానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. జంట నగరాల్లో శాంతి భద్రతలపై పోలీసు వ్యూహం ఫలించిందని పేర్కొన్నారు. ‘‘ఆర్టీసీకి హైదరాబాద్‌లో 3,800 బస్సులు ఉన్నాయి. నగర పరిధిలో సంస్థకు రూ.218 కోట్ల నష్టం వచ్చింది. పేదలకు ఉండే ఏకైక రవాణా మార్గం ఆర్టీసీ. దాన్ని పటిష్టం చేసి కాపాడుతాం’’ అని హామీ ఇచ్చారు. వర్సిటీలను పరిపుష్టం చేస్తాం ‘ఉద్దేశ పూర్వకంగానే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్ల నియామకం చేయలేదు. అవసరమైతే నాలుగు నెలలు ఆలస్యమైనా చేస్తాం. కానీ తప్పులు చేయం. వీసీలపై విచారణ జరిపితే ఒక్కొక్కరు 300 లేదా 400 ఉద్యోగాలు అమ్ముకుని వెళ్టినట్టు తేలింది. కొత్తగా యూనివర్సిటీలు పెట్టారు గానీ డబ్బులివ్వలేదు. వీసీల కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశాం. చీఫ్ జస్టిస్‌తోపాటు, ఇతర జడ్జిలను ఛాన్స్లర్లుగా వ్యవహరించమని కోరాం. యూనివర్సిటీల గౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. యూనివర్సిటీలకు గ్రాంటు ఇచ్చి పరిపుష్టం చేస్తాం. రోహిత్ వేముల మరణంపై వివాదం సృష్టించదలుచుకోలేదు. కారణం తెలుసుకున్నాం.. ఖండించాం. జేఎన్‌యూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనలు దురదృష్టకరం. ఫిలాసఫీలు, సిద్ధాంతాలు తీసుకెళ్లి యూనివర్సిటీల్లో రుద్దుతున్నారు. బీఫ్ ఫెస్టివల్, కిస్ ఫెస్టివల్ అంటూ చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. దేశంలో ఎవరైనా కిస్ ఫెస్టివల్‌ను ఒప్పుకుంటారా? ’’ అని సీఎం చెప్పారు. అమెరికాపైనా అప్పుల భారం ‘‘ప్రభుత్వ పథకాలతో అప్పుల భారం పెరుగుతుందని స్టీరియోటైప్ విమర్శ చేస్తున్నారు. అమెరికా కూడా రూ.1,140 లక్షల కోట్ల అప్పులో ఉంది. చైనా కూడా ఐదు ట్రిలియన్ డాలర్ల అప్పులో ఉంది. డబుల్ బెడ్రూంలకు అయ్యే రూ.12 వేల కోట్లు హడ్కో ద్వారా రుణం తెస్తాం. 2019-20 నాటికి పట్టణ జనాభా 50 శాతానికి చేరుకుంటుంది. అప్పటికల్లా రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది’’ అని సీఎం అన్నారు. అసెంబ్లీ స్థానాలు 153కు పెంచాలి ‘‘శాసన సభ స్థానాలు పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. ఎమ్మెల్యే స్థానాలు 153 చేయాల్సి ఉంది. ఎమ్మెల్సీ స్థానాలు కూడా 40 నుంచి 50 దాకా పెంచాల్సి ఉంది. రెండు సభల్లో సంఖ్య పెరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆదివారం శాసన మండలిలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీ స్థానాల పునర్విభజన కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కేంద్రానికి లేఖలు రాసినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కూడా లేఖలు రాసినట్లు వివరించారు. కొత్త జిల్లాలను కచ్చితంగా ఏర్పాటు చేస్తామని, ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 12% రిజర్వేషన్లపై తీర్మానం చేద్దాం ఎస్టీ, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం కేబినెట్‌తోపాటు ఉభయ సభల్లో తీర్మానం చేద్దామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. ఈ రిజర్వేషన్లపై రెండు కమిషన్లను నియమించామని, త్వరలోనే వాటి నివేదికలు రానున్నాయని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆదివారం శాసన మండలిలో ఈ మేరకు వెల్లడించారు. ‘‘మనం ఇతరులు ప్రశ్నించడానికి వీల్లేని సమాచారం సేకరిస్తే ఈ రిజర్వేషన్ల అమలు సులభం అవుతుందని జాతీయ మైనారిటీ కమిషన్‌లో పని చేసి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి శామ్యూల్ చెప్పారు. లేకపోతే న్యాయ వివాదాలు, ఇతర వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే 4 శాతం మైనారిటీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు ఉంది. దానిపై బలంగా వాదిస్తున్నాం. వాటిని కాపాడుకుంటూనే 12 శాతం రిజర్వేషన్ల సాధనకు కృషి చేస్తున్నాం. కమిషన్ల నివేదికలు రాగానే ప్రత్యేకంగా శాసన మండలి, శాసన సభ, కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపుదాం. అవసరమైతే ప్రధానిని స్వయంగా కలసి అడుగుదాం. మన రాష్ట్ర జనాభా, అవసరాలకు అనుగుణంగా మేం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతాం. కేంద్రం ఓకే చెబితే వారికి ధన్యవాదాలు చెబుతాం. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సాధించుకుందాం’’ అని అన్నారు. -
‘మిషన్’ ట్రబుల్
తొలి విడత మిషన్ ప్రగతి మొత్తం చెరువుల లక్ష్యం 903 మంజూరైనవి 851 టెండర్లు.. అగ్రిమెంట్ అయినవి 847 పనులు ప్రారంభమైనవి 838 25 శాతం మేరకు పనులు జరిగినవి 13 25 నుంచి 50 శాతం పనులైనవి 13 50 నుంచి 75 శాతం అయినవి 41 75 నుంచి 100 శాతం మధ్య ఉన్నవి 155 మొత్తం పనులైనవి 616 ఖమ్మం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత మిషన్ కాకతీయ పనులకు అక్కడక్కడ అవాంతరాలు ఏర్పడ్డాయి. జిల్లాలో మొదటి విడత 851 చెరువులకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఇప్పటివరకు 616 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు అధికారుల లెక్కల్లో ఉంది. ఐదు డివిజన్ల పరిధిలో మొత్తం 4,517 చెరువులు ఉన్నాయి. వీటిని నాలుగేళ్లలో పునరుద్ధరించడానికి ప్రణాళికలు తయారు చేసి.. తొలి ఏడాది 903 చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. వాటిలో 851 చెరువులకు ప్రభుత్వ పరిపాలన అనుమతి ఇచ్చింది. సంబంధిత అధికారులు 847 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టారు. 838 చెరువు పనులు చేశారు. 616 చెరువుల్లో వంద శాతం పనులు అయినట్లు, 155 చెరువుల్లో 75 నుంచి 100 శాతం పనులు, 25 నుంచి 50 శాతం 13 చెరువులు, 25 శాతం అయినవి 13 ఉన్నట్లు అధికారులు తయారు చేసిన నివేదికలే చెబుతున్నాయి. పూర్తికాక ముందే అక్రమాలు..! తొలి విడత పనులు ఆలస్యంగా మొదలుపెట్టడం.. ఇంతలోనే వర్షాలు కురవడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. అత్యధిక చెరువుల్లో పూడికతీత పూర్తి కాకముందే వర్షాలు కురిసి గుంతల్లో నీరు చేరాయి.. ఈ క్రమంలోనే పనుల్లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పునరుద్ధరణలో భాగంగా చెరువు కట్టలకు పోసిన మట్టి నాణ్యతగా లేకపోవడం.. అంచనా ప్రకారం మట్టి పోయకపోవడం.. చెరువు శిఖంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించలేదని అప్పుడే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆటుపోట్ల మధ్య తొలి ఏడాది మిషన్ కాకతీయ పనులు 73 శాతం మేర పూర్తి చేశారు. ఖమ్మం డివిజన్, కొత్తగూడెం, సత్యనారాయణపురం, సత్తుపల్లి డివిజన్ పరిధిలో గత ఏడాది చేపట్టిన 838 చెరువుల్లో పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. తొలి ఏడాది మొత్తం 4,517 చెరువుల్లో 20 శాతం అంటే.. 903 చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉంది. వాటిలో 889 చెరువులను సర్వే చేశారు. 875 చెరువుల ఎస్టిమేట్లు రూ.282.46 కోట్లతో పంపించారు. ప్రభుత్వం నుంచి 851 చెరువులకు పరిపాలన అనుమతి వచ్చింది. వాటిలో 849 చెరువులకు టెండర్లు పిలవగా.. 847 చెరువుల టెండర్లు పూర్తి చేశారు. వాటిలో 946 చెరువులకు అగ్రిమెంట్ చేసినప్పటికీ.. 838 చెరువుల్లో రూ.145 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టినట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రూ.70కోట్ల బిల్లులను ఆయా కాంట్రాక్టర్లకు చెల్లించారు. మిగిలిన పనులన్నీ మార్చి 31 నాటికి పూర్తి చేయాలని పదేపదే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. ఇంకా 150 పైగా చెరువుల్లో ఎక్కువ మొత్తంలో పనులు చేపట్టాల్సి ఉంది. పాత వాటితోపాటు రెండో విడతలో మరో 903 చెరువులు వచ్చి చేరుతాయి. పాతవి, కొత్తవి కలిపి పెద్ద మొత్తంలోనే ఈ ఏడాది పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పనులు చేస్తేగానీ.. రెండో ఏడాది ఎంతమేరకు లక్ష్యం సాధిస్తారనేది తెలుస్తుంది. పనులన్నీ పూర్తి చేస్తాం.. మిషన్ కాకతీయ పథకంలో మొదటి ఏడాది మిగిలిన పనులతో పాటు రెండో ఫేజ్‌లో చేపట్టాల్సినవన్నీ ఈ ఏడాది పూర్తి చేస్తాం. తొలి ఏడాది అంచనాలు, పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభించడం.. రెండుసార్లు అకాల వర్షాల ప్రభావంతో నెల రోజులుపాటు పనులు నిలిచిపోయాయి. అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాం. అయినా రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపాం. మొదటి ఫేజ్‌లోని మిగిలిన 100 నుంచి 150 చెరువుల పూర్తిస్థాయి పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయిస్తాం. ఫేజ్-2లో చెరువుల అభివృద్ధి కూడా వేగవంతంగా నడుస్తోంది. రెండో ఏడాదికి 961 చెరువులకు రూ.488 కోట్ల అంచనాలు తయారు చేసి.. 927 చెరువులకు అనుమతి కోసం ఇరిగేషన్ సీఈ కార్యాలయానికి పంపించాం. 810 చెరువులకు ప్రభుత్వ అనుమతి వచ్చింది. 623 చెరువులకు టెక్నికల్ అనుమతి రావడంతో ఇప్పటికే 610 చెరువులకు టెండర్లు పూర్తి చేశాం. 403 చెరువులకు రూ.68కోట్లతో అగ్రిమెంట్ పూర్తి చేశాం. ఇప్పటికే 85 చెరువుల పనులు మొదలుపెట్టాం. - వేమిశెట్టి రమేష్, ఇరిగేషన్ ఎస్ఈ -
ఓయోరూమ్స్ తో పేపాల్ అవగాహన
హైదరాబాద్: భారత దేశపు అతిపెద్ద బ్రాండెడ్ నెట్వర్క్ హోటల్ సంస్థ ఓయో రూమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని అంతర్జాతీయ ఓపెన్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేపాల్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఈ కామర్స్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని, అదే విధంగా ఆన్లైన్ చెల్లింపుల్లో రిస్క్ కూడా బాగా పెరుగుతోందని పేపాల్ రీజనల్ మర్చెంట్ సర్వీసెస్ హెడ్ హమిశ్ మోలైన్ పేర్కొన్నారు. ఓయోరూమ్స్ వంటి సంస్థలకు చెల్లింపుల విషయంలో రిస్క్‌ను తగ్గించేలా టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తామని తెలిపారు. వినియోగదారుల చెల్లింపులు సులభంగా, ఎలాంటి రిస్క్‌లు లేకుండా ఉండేందుకు గాను పేపాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయోరూమ్స్ సీఓఓ అభివన్ సిన్హా పేర్కొన్నారు. -
‘ఛత్తీస్’ అభ్యంతరాలపై దాటవేత!
♦ పొంతన లేని సమాధానాలిచ్చిన డిస్కంలు ♦ విద్యుత్ కొన్నా.. కొనకున్నా ♦ చార్జీల చెల్లింపునకు సమర్థన ♦ ఛత్తీస్‌గఢ్ విధించే పన్నులు, ♦ సుంకాలు భరించాల్సిందేనని ఒప్పుకోలు సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)పై విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)లో దాఖలైన అభ్యంతరాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ‘తగిన’ రీతిలో సమాధానాలు ఇవ్వలేకపోయాయి. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనుందని విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ పార్టీల నేతలు లేవనెత్తిన అభ్యంతరాలకు డిస్కంల సమాధానాలు అసంబద్ధంగా, పొంతన లేకుండా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినా.. చేయకపోయినా పూర్తి మొత్తంలో 1000 మెగావాట్లకు చార్జీలు ఎల్లవేళలా చెల్లించేందుకు ఒప్పందంలో అంగీకరించడాన్ని డిస్కంలు సమర్థించుకున్నాయి. విద్యుత్ కొన్న మేరకే చార్జీలు చెల్లిస్తామని ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిన డిస్కంలు తాజాగా మాట మార్చాయి. ఛత్తీస్‌గఢ్ ఇంకెవరికీ విక్రయించుకోకుండా మొత్తం విద్యుత్ రాష్ట్రానికే కేటాయించేందుకు ఈ నిబంధన అవసరమేనని తేల్చి చెప్పాయి. ఈ నెల 11న ఛత్తీస్‌గఢ్ పీపీఏపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనున్న నేపథ్యంలో తాజాగా డిస్కంలు తమ వివరణలను ప్రకటించాయి. రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 24,075 మెగావాట్లకు పెంచి 2018లోగా తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూనే ఛత్తీస్ నుంచి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు... వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్‌తో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు, ఎత్తిపోతల పథకాల భవిష్యత్ అవసరాలకు ఈ ఒప్పందం చేసుకున్నామని బదులిచ్చాయి. అదే విధంగా ఛత్తీస్ జెన్కోతో అక్కడి డిస్కం చేసుకున్న మాతృ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఆ రాష్ట్ర ఈఆర్సీ ఇంకా ఆమోదించనే లేదు. అయినా అక్కడి డిస్కంతో రాష్ట్ర డిస్కంలు చేసుకున్న ‘పిల్ల’ ఒప్పందాన్ని మాత్రం ఆమోదించాలని తెలంగాణ ఈఆర్సీని కోరినట్లు సమాచారం. ఇక విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు కేటాయింపుల వివరాలు సైతం డిస్కంలు వెల్లడించలేకపోయాయి. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా విధించనున్న పన్నులు, సుంకాలను రాష్ట్రమే భరించక తప్పదని డిస్కంలు పేర్కొన్నా యి. ఈ ఒప్పందంపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం, కాం గ్రెస్, టీడీపీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, రేవంత్‌రెడ్డి, సీనియ ర్ రిటైర్డ్ ఇంజనీర్ నారాయణ, జర్నలిస్టు ఎన్.వేణుగోపాల్ తదితరుల అభ్యంతరాలకు వివరణలు ఇచ్చిన డిస్కంలు... విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయాయి. -
‘డబుల్’ పనులు షురూ..
అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు రూ.92.50 కోట్లతో 1384 డబుల్ బెడ్రూం ఫ్లాట్లు అంబేద్కర్‌నగర్‌లో పనులు ప్రారంభం ఇళ్లు ఖాళీ చేస్తే ఎస్ఆర్ నగర్లోనూ నిర్మాణం వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించారు. స్లమ్ ఏరియాలైన హన్మకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్ఆర్ నగర్లో ఉన్న ఇళ్ల స్థానంలో జీ ప్లస్-1, జీ ప్లస్-3 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఫ్లాట్లు నిర్మించాలని జిల్లా యంత్రాం గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ ప్లస్ గృహాల నిర్మాణ ప్రాజెక్టు బాధ్యతలను కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్అం డ్బీ శాఖ చేపట్టింది. హైదరాబాద్‌కు చెం దిన ఒక ప్రైవేటు సాంకేతిక సంస్థ సహా యంతో డీపీఆర్‌ను రూపకల్పన చేశారు. డీపీఆర్‌లో కొన్ని తేడాలు ఉండడంతో మొదటిసారి నిర్వహించిన టెండర్లు రద్దయ్యాయి. పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధమయ్యాక టెండర్లు నిర్వహించడంతో ఖరారు అయ్యాయి. అంబేద్కర్ నగర్లో జీప్లస్-3 నిర్మాణం హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లోని సుమారు ఏడు ఎకరాల స్థలంలో జీ ప్లస్-3 పద్ధతిలో అర్హులుగా గుర్తించిన 592 మందికి రూ.39 కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో డ బుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ఎంజెఆర్ సంస్థ 4.58 శాతం తక్కువ ధరతో ఈ పనులను దక్కించుకుంది. అగ్రిమెంటు పూర్తికావడంతో ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఎస్ఆర్ నగర్లో జీప్లస్-1 ఇళ్ల నిర్మాణం వరంగల్‌లోని ఎస్ఆర్ నగర్లో 17 ఎకరాల్లో జీప్లస్-1 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించనున్నారు. ఇక్కడ అధికారులు జీప్లస్-3 పద్ధతుల్లో ఇళ్లు నిర్మించేం దుకు ప్రయత్నించగా స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో అర్హులుగా గుర్తించిన 792 మందికి రూ.53.50 కోట్ల వ్యయంతో జీప్లస్-1 పద్ధతిలో గ్రేడ్లుగా విభజించి ఇళ్లు నిర్మించనున్నారు. ‘ఎ’ గ్రేడ్‌లో 4+4, బి గ్రేడ్‌లో 2+2, సీ గ్రేడ్‌లో 1+1, డీ గ్రేడ్‌లో 1+1గా జీప్లస్ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ రూ పొందించారు. ఇందులో సి, డి గ్రేడ్ల ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించాల్సి వస్తున్నందున ఏ, బీ గ్రేడ్‌లో ఇళ్లు నిర్మించేం దుకు నిర్ణయించారు. జిల్లాకు చెందిన మంద ఐలయ్య కన్స్ట్రక్షన్ కంపెనీ 1.96 శాతం తక్కువ ధరతో ఈ పనులను దక్కిం చుకుంది. లబ్ధిదారులు వారు ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసిన వెంటనే ఎస్ఆర్నగర్లో పనులు ప్రారంభిస్తామని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. -
ఎంటర్ ద డ్రాగన్
-
'కంఫర్ట్ ఉమెన్'కు పరిష్కారం
ఏళ్ళ సమస్యకు తెరపడింది. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి 'కంఫర్ట్ ఉమెన్' సమస్యకు పరిష్కారం దిశగా ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా, జపాన్ లు తీవ్ర చర్చల అనంతరం అడుగు ముందుకేశాయి. యుద్ధ సమయంలో దక్షిణకొరియా నుంచి మహిళలను బలవంతంగా వ్యభిచార గృహాల్లోకి తరలించిన జపాన్ సైన్యం.. వారిని కంఫర్ట్ ఉమెన్ గా పిలిచేవారు. అయితే ఆ దారుణ కాండకు జపాన్ బాధ్యత వహించాలంటూ దశాబ్దాలుగా కొనసాగుతున్న డిమాండ్ కు ప్రస్తుతం పరిష్కారం కుదిరింది. కంఫర్ట్ ఉమెన్ సమస్యపై ఇరు దేశాలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. గతంలో దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పిన జపాన్ కొన్నాళ్ళపాటు చర్చలు జరిపినా... ఆ తర్వాత స్థబ్దత ఏర్పడింది. ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియాన్ హై... జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమై తిరిగి చర్చలను పునరుద్ధరించడంతో ఏళ్ళ సమస్యకు చరమగీతం పాడింది. జపాన్ తన ఒప్పందం మేరకు బాధ్యతలను నిర్వర్తిస్తే ఈ సమస్యకు ఇదే చివరి ఒప్పందంగా భావిస్తున్నట్లు సౌత్ కొరియా విదేశాంగ మంత్రి యున్ బైయుంగ్ సే తెలిపారు. జపనీస్ విదేశాంగ మంత్రి ఫ్యుమియో కిషిడాతో చర్చల అనంతరం ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దళాలు బానిసలుగా చేసుకున్న మహిళలకు (కంఫర్ట్ ఉమెన్) నష్ట పరిహారంగా ఓ బిలియన్ 'ఎన్' లను అందించేందుకు జపాన్ అంగీకరించినట్లు కిషిడా తెలిపారు. నిజానికి ఇది నష్ట పరిహారం కాదని, మహిళల గౌరవాన్నినిలబెట్టేందుకు, వారి మానసిక గాయాలను నయం చేసేందకుగా చెప్పాలని కిషిడా అన్నారు. జపనీస్ సైనిక ప్రమేయంతో జరిగిన కంఫర్ట్ ఉమెన్ సమస్య జపాన్ ప్రభుత్వం బాధ్యతగా పరిగణించిందని ఆయన వివరించారు. బాధితులకు జపాన్ ప్రధాని షింజో అబె క్షమాపణలను తెలపడమే కాక పశ్చాత్తాపాన్నికూడ వ్యక్తం చేసినట్లు కిషిడా తెలిపారు. దక్షిణ కొరియా, జపాన్ ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం భవిష్యత్తు లో ఇరు దేశాలమధ్య నూతన శకంగా మారుతుందని కిషిడా అన్నారు. ఈ ఒప్పందం తమ దేశానికి లాభం చేకూర్చడంతోపాటు.. శాంతి, స్థిరాత్వాలను అందించేందుకు దోహద పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఒప్పందంలో భాగంగా జపనీస్ రాయబార కార్యాలయానికి ముందు కంఫర్ట్ ఉమెన్ కు సాక్ష్యంగా ఉన్న విగ్రహాన్ని సంబంధిత ఎన్జీవోలు సంప్రదింపుల ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి బైయున్ సే అన్నారు. సంవత్సరాంతంలో చర్చలు విజయవంతమవ్వడం, 50వ వార్షికోత్సవం దౌత్య సంబంధాలను మెరుగుపరచడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. జపాన్ ప్రధాని షింజో అబే ఆగస్టులో చేసిన ఓ ప్రసంగంలో రెండో ప్రపంచ యుద్ధం ఎంతో బాధాకరమని, భవిష్యత్ తరాలను ఈ సమస్య ఇబ్బంది పెట్టకూడదన్నారని, అది దృష్టిలో ఉంచుకొనే ఈ సంబంధాలను మెరుగు పరచుకొన్నట్లు బైయున్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఒప్పందం విషయాన్ని జపాన్ ప్రధాని షింజో అబే, దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గియాన్ హై తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుమారు 200,000 మంది మహిళలు... అందులోనూ ముఖ్యంగా కొరియా మహిళలు జపాన్ బానిసలుగా మారినట్లు అంచనా. -
పారిస్ ఆశలు
పారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో రెండు వారాలపాటు ఏకధాటిగా సాగిన చర్చలు, వాదోపవాదాల అనంతరం శనివారం 196 దేశాలు ఒక ఒప్పందానికొచ్చాయి. ఇది చరిత్రాత్మకమని పలు దేశాధినేతలంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇంకొంచెం ముందుకెళ్లి ఇది అమెరికా నాయకత్వం సాధించిన విజయంగా చెప్పుకున్నారు. ఒప్పందం చూసినవారు కూడా ఇదంతా నిజమేనని నమ్ముతారు. ఎందుకంటే 31 పేజీల ఆ ఒప్పందంలో అందుకు బోలెడు దాఖలాలున్నాయి. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయాలని, దాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కే తగ్గించడానికి ప్రయత్నించాలని అది చెబుతున్నది. దీర్ఘకాలంలో అన్ని దేశాలూ కర్బన ఉద్గారాల ఊసేలేని ఆర్థిక వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. 2050-2100 మధ్యకల్లా ధనిక, పేద తేడా లేకుండా దేశాలన్నీ దీన్ని సాధించితీరాలన్నది. ఉద్గారాల తగ్గింపు అంశంలో ఏ దేశం తీరు ఎలా ఉన్నదో అయిదేళ్లకోసారి సమీక్షించాలని కూడా నిర్ణయించింది. అంతేకాదు...దేశాలన్నిటికీ ఉమ్మడి బాధ్యతను కట్టబెడుతూనే ధనిక, బీద దేశాల వ్యత్యాసాన్ని కూడా ఒప్పందం పరిగణనలోకి తీసుకుంది. ఇన్ని అనుకూలాంశాలున్నాయి గనుక పారిస్ ఒప్పందం ఒక ముందడుగేనని చాలామంది చెబుతున్నారు. కానీ ఉద్గారాల తగ్గింపునకు వివిధ దేశాలిచ్చిన స్వచ్ఛంద హామీలనన్నటినీ గుదిగుచ్చినా భూతాపం 2 డిగ్రీల సెల్సియస్‌లోపు ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలంటున్నారు. ఏం చేయాలన్న విషయంలో మాత్రమే పారిస్‌లో అవగాహన కుదిరింది. ఎలా చేయాలో, అందుకు నిర్దిష్టంగా అనుసరించవలసిన కార్యాచరణేమిటో స్పష్టం చేసి, దాన్ని సాధించని పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో ఒప్పందం చెప్పి ఉంటే వేరుగా ఉండేది. అందువల్ల అందరికీ భరోసా ఏర్పడేది. ఒప్పందానికి చట్టబద్ధత లేకపోతే సంపన్న దేశాలు దానికి కట్టుబడి ఉంటాయని నమ్మేదెలా? లాభాపేక్ష తప్ప ధరిత్రి క్షేమం పట్టని సంపన్న దేశాలు భారీయెత్తున వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ప్రపంచాన్ని చుట్టుముట్టిన కర్బన కాలుష్యంలో వాటి వాటా 70 శాతం పైబడేనని వివిధ గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత 1850 మొదలుకొని 2011 వరకూ విడుదలైన కర్బన ఉద్గారాల్లో అమెరికా వాటా 27 శాతం, యూరోప్ దేశాల భాగం 28 శాతం అని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. చైనా 11 శాతం, రష్యా 8 శాతం కాలుష్యానికి కారణమయ్యాయి. మన దేశం వాటా 3 శాతం మించలేదు. పర్యావరణ ధ్వంసానికి తామే ప్రధాన కారకులమన్న స్పృహను ప్రదర్శించి అందుకు తగినట్టుగా పెద్దయెత్తున కోత విధించుకోవాల్సింది పోయి సంపన్న దేశాలు పేచీకి దిగాయి. అందరికీ సమానంగా బాధ్యతలు పంచాలని డిమాండ్ చేశాయి. మరోవైపు కాలుష్యాన్ని వడబోసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు ఉదారంగా అందించేందుకు సైతం అవి ముందుకు రావడంలేదు. కర్బన ఉద్గారాలపై విధించే కోతలోనూ అవి వ్యాపార ప్రయోజనాలను వెదుక్కుంటున్నాయి. కోత కారణంగా వర్ధమాన దేశాల్లో పరిశ్రమల స్థాపనకు వీలు కుదరని స్థితి ఏర్పడితే తమ సరుకులకు గిరాకీ ఏర్పడుందని...స్థాపించాలని నిర్ణయించుకుంటే తమ కాలుష్య వడబోత టెక్నాలజీకి మంచి ధర వస్తుందని అవి లెక్కలేసుకుంటున్నాయి. పారిస్ ఒప్పందంలో టెక్నాలజీ ఊసెత్తకుండా 2020 తర్వాత పేద దేశాల కోసం ఏటా 10,000 కోట్ల డాలర్లు నిధులు సమకూరుస్తామని, భవిష్యత్తులో దీన్నింకా పెంచుతామని అవి తెలిపాయి. నిజానికి ఈ డబ్బంతా మళ్లీ ఆ దేశాలకే చేరుతుంది. ఎందుకంటే 2022 నాటికి పుష్కలంగా పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులో ఉంటే తప్ప కర్బన ఉద్గారాలకు కోత పడటం సాధ్యం కాదు. మళ్లీ ఆ టెక్నాలజీ సైతం సంపన్న దేశాలవద్దే ఉంది గనుక దాన్ని డబ్బు పోసి కొనుక్కొనక తప్పని స్థితి పేద దేశాలకుంటుంది. కనుక పేద దేశాల కోసం నిధులతోపాటు వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడానికి ధనిక దేశాలు ఏం చేయబోతాయో పారిస్ ఒప్పందం స్పష్టంగా చెప్పి ఉంటే కాస్తయినా ఉపయోగం ఉండేది. అలాగే భూతాపోన్నతివల్ల సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండే దేశాల్లోని ప్రజలు పెద్దయెత్తున వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో ధనిక దేశాలు తీసుకోవాల్సిన బాధ్యతల గురించి కూడా ఒప్పందం ప్రస్తావించలేదు. ఈ లోటుపాట్లు గమనిస్తే పారిస్‌లో రాజకీయంగా ఆలోచించి నిర్ణయాలు చేశారే తప్ప మానవాళికి ఎదురుకాబోయే సవాళ్లు, వాటిని ఎదుర్కొనవలసిన తీరుతెన్నులపై శాస్త్రీయ అవగాహనతో దృష్టిపెట్టలేదని అర్ధమవుతుంది. శిలాజ ఇంధనాలు రోజురోజుకూ అడుగంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే కాలం సౌరశక్తిదే. దానివైపుగా కదలాలని చెప్పడం బాగానే ఉన్నా అది ఎంత వేగంగా జరగాలి...దానికి దేశాలన్నీ ఏం చేయాలన్న దిశా నిర్దేశం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రస్తావించిన 'వాతావరణ న్యాయం' అనే పదం ఒప్పందంలోని పీఠికకే పరిమితమైంది తప్ప ఇతరచోట్ల దానికి అనుగుణమైన ప్రతిపాదనలు లేవు. వచ్చే ఏప్రిల్‌నుంచి అమల్లోకి రాబోయే పారిస్ ఒప్పందం కార్యాచరణ ఎలా ఉన్నదో చూడటానికి 2018లో వాతావరణ మార్పులకు సంబంధించిన కమిటీ సమావేశమవుతుంది. ఆపై మరో రెండేళ్లకు ఒత్తిళ్లు మొదలవుతాయి. ఈలోగా ప్రస్తుత ఒప్పందానికి అనుగుణంగా ప్రతి దేశమూ తమ చట్టాలను సవరించుకుని తగిన కట్టుదిట్టాలు చేసుకోవాల్సి ఉంటుంది. 2030కల్లా సౌరశక్తితోసహా మొత్తంగా 200 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులు సమీకరిస్తామని మన దేశం లోగడే లక్ష్య నిర్దేశం చేసుకుంది. కనుక ఆ రంగంలో భారీయెత్తున పెట్టుబడులు అవసరమవుతాయి. సంపన్న దేశాలు పారిస్‌లో ముఖం చాటేసిన నేపథ్యంలో ఇదంతా ఏమేరకు సాధ్యమవుతుందో వేచిచూడాలి. పారిస్ శిఖరాగ్ర సదస్సుకు ముందు కర్బన ఉద్గారాల్లో తమ దేశం రెండో స్థానంలో ఉన్నదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అంగీకరించారు. దాన్ని పరిష్కరించుకుంటామన్న హామీ కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుత ఒప్పందం ఆ విషయంలో ఆశావహంగా లేదు. 1992 నాటి రియో డి జెనైరో సదస్సుతో పోలిస్తే అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఎలాగైతేనేం ఒక ఒప్పందానికి రాగలిగాయని సంబరపడితే పడొచ్చుగానీ మంచి ఫలితాలు రావాలంటే ఆచరణలో అది మరింత పదునెక్కాలి. -
నిపుణుల కోసం డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగానికి అవసరమైన వృత్తి నిపుణులను తీర్చిదిద్దడానికి లైఫ్ సెన్సైస్ సెక్టర్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఎస్ఎస్ఎస్డీసీ), విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (వీఊపీఈఆర్)లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఫార్యాస్యూటికల్, బయోటెక్నాలజీ, క్లీనికల్ రీసెర్చ్ రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. దీంతో దేశ ఆర్థిక జీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న ఫార్మారంగానికి నిపుణుల కొరత తీరుతుందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఛత్తీస్గడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం వెనక్కి
-
ఇరాన్‌తో ‘సాంస్కృతిక’ ఒప్పందం
హైదరాబాద్: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఇరాన్‌కు మధ్య ఓ ఒప్పందం కుదిరింది. మంగళవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. రాష్ట్రం తరఫున భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఇరాన్‌కి చెందిన సాంస్కృతిక ప్రజా సంబంధాల అధికారి అలీ ఎ నిరూమాండ్, అలీ పర్గడ్ తదితరులు పాల్గొని చర్చించారు. ఒప్పందం ప్రకారం ఈ నెల 26న రవీంద్రభారతిలో ఇరాన్ కళాకారులు ఓ వినూత్న సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రయత్నం దీర్ఘకాలం కొనసాగుతుందని, బయటి దేశాల కళారూపాలను తాము స్వాగతిస్తున్నామని హరికృష్ణ తెలిపారు. అలాగే తెలంగాణ కళారూపాలను కూడా ఇరాన్ ఇదేవిధంగా గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ కళారూపాలను ప్రపంచ వ్యాప్తం చేసే ఆలోచనతో సాంస్కృతిక జైత్రయాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. -
రియల్ ఆఫర్లు
నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. నేరుగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఎయిర్‌పోర్టు విస్తరణ, పారిశ్రామిక వాడల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం భూ సమీకరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 33 వేల ఎకరాల పైనే సమీకరించింది. కొందరు రైతులు రియల్ వ్యాపారుల ఆఫర్లే బాగున్నాయని అటువైపు మొగ్గు చూపుతున్నారు. - రాజధాని ప్రాంతంలో ` కోల్పోతున్న - రైతులతో అగ్రిమెంట్లు - ప్రభుత్వ ప్యాకేజీ కంటే ఇవే బెటర్ అంటున్న అన్నదాతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను రాజధాని రైతులపై పడింది. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు ఏటా కొంత సొమ్ము పరిహారంగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూములన్నీ చదునుచేసి ప్లాట్లుగా మార్చిన తరువాత రైతులకు ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. అప్పుడే ఆ సొమ్ము చెల్లిస్తారు. అయితే రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి ఇస్తున్న భూములను తమకు ఇచ్చేందుకు అగ్రిమెంట్లు చేస్తే ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చే పరిహారాన్ని ఒకేసారి ఇవ్వడంతో పాటు బహిరంగ మార్కెట్లో భూమి విలువను బట్టి పది శాతం నుంచి 20 శాతం అదనంగా సొమ్ము ఇచ్చేందుకు రైతులకు రియల్ వ్యాపారులు ఆఫర్లు ఇస్తున్నారు. భూ బాధితులకు మంత్రి నారాయణ హామీ... ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం ప్రభుత్వం 490 ఎకరాలు సమీకరించనుంది. మొత్తం 300 మంది రైతులు ఉన్నారు. 90 మంది ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. మిగిలిన వారు ఇవ్వాల్సి ఉంది. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇస్తే రాజధాని ప్యాకేజీ ప్రకారం రాజధాని నిర్మాణ ప్రాంతంలో స్థలాలు ఇస్తామని గన్నవరం విమానాశ్రయ భూ బాధితులకు మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి కేసర పల్లి, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల నుంచి భూ సమీకరణ జరగనుంది. కేసరపల్లి పరిధిలోని భూములకు ఎకరాకు రూ.98 లక్షలు, బుద్ధవరం భూములకు ఎకరాకు రూ.56 లక్షలు, అజ్జంపూడి భూములకు ఎకరాకు రూ.47 లక్షలు మార్కెట్ విలువ ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విలువ ప్రకారం లెక్కకట్టి పరిహారం ఇస్తామని, లేదా రాజధాని ప్రాంతంలో స్థలం కావాలంటే ఇస్తామని ఉన్నతాధికారులు, మంత్రులు రైతులకు హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇస్తేనే ఇది సాధ్యమని అధికారులు, నేతలు రైతులకు చెప్పారు. ఏడేళ్ల క్రితమే రిజిస్ట్రేషన్ల నిలిపివేత... గన్నవరం విమానాశ్రయ విస్తరణకు తీసుకోవాలనుకుంటున్న భూములను అమ్మకాలు జరిపేందుకు వీలులేదని ఏడేళ్ల క్రితం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో ఈ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరగటం లేదు. ఎంతకాలం ఇలా ఉంటామనే ఆందోళన కూడా పలువురు రైతుల్లో ఉంది. అమ్ముకునేందుకు ప్రభుత్వం అడ్డుపడటం, పైగా వారు ఇచ్చే పరిహారం ఎప్పటికి అందుతుందో తెలియకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అగ్రిమెంట్లు చేసుకొని వారి నుంచి భూమి ఖరీదును ఒకేసారి తీసుకోవడం మంచిదనే ఆలోచనకు రైతులు వచ్చారు. ప్రభుత్వం ఇచ్చే దానికంటే భూమి విలువను బట్టి పది నుంచి 20 శాతం అదనంగా ఇచ్చేందుకు రియల్ వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయ భూ బాధితులు పలువురు రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. మరికొందరు ఆ ఆలోచనలో ఉన్నారు. రాజధాని ప్రాంతంలోనూ... రాజధాని ప్రాంతంలో కూడా కొందరు రైతుల నుంచి రియల్ వ్యాపారులు ఇదే ప్యాకేజీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎకరా పొలానికి ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం, కమర్షియల్ ఏరియాలో 200 గజాల స్థలాన్ని ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. బహిరంగ మార్కెట్ విలువను రైతుకు ఇప్పుడే రియల్ వ్యాపారులు ఇస్తారు. రాజధాని ప్యాకేజీ కింద ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చే స్థలాన్ని రియల్టర్లకు ఇస్తున్నట్లు అగ్రిమెంట్లు ఇవ్వాలి. ఇందుకు కొందరు ఎమ్మెల్యేలు కూడా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడో వచ్చే డబ్బు కోసం, స్థలం కోసం ఎదురు చూసేకంటే ఇప్పుడు మార్కెట్ విలువ ఇస్తానంటున్నందున తీసుకోవడం మంచిదని కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడిలోని కొందరు రైతులకు ఎమ్మెల్యే వంశీ సూచించినట్లు సమాచారం. -
ఇక కాంక్రీట్ రోడ్లే!
కంపెనీల నుంచి తక్కువ ధరకు సిమెంట్ దేశవ్యాప్తంగా ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం అందులో భాగంగానే రాష్ట్రానికీ రాయితీ సిమెంట్ త్వరలో ఢిల్లీకి ఉన్నతస్థాయి బృందం సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాల్లో దర్జాగా కనిపించే కాంక్రీట్ రోడ్లు త్వరలో మన రాష్ట్రంలో కూడా కనిపించబోతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా చేపట్టే జాతీయ రహదారులను సిమెంట్‌తో నిర్మించనున్నట్లు కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర రహదారుల విషయంలోనూ అదే మార్గాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు కొన్ని చోట్లే కనిపించిన కాంక్రీట్ రోడ్లు ఇకపై విస్తృతం కానున్నాయి. తారు రోడ్లతో పోల్చితే సిమెంటు రోడ్ల నిర్మాణానికి 15 నుంచి 20 శాతం వరకు అధిక వ్యయమవుతుంది. కానీ నేరుగా సిమెంటు కంపెనీల నుంచే తక్కువ ధరకు సిమెంటును పొందేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు రాయితీ రేట్లకు సిమెంట్‌ను అందించేలా ఆయా కంపెనీలతో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర రహదారుల నిర్మాణానికి ముందుకొచ్చే రాష్ట్రాలకు కూడా అదే ధరకు సిమెంట్‌ను అందజేస్తామని ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన రాష్ర్ట ప్రభుత్వం.. తెలంగాణలో కొత్తగా భారీ స్థాయిలో నిర్మించనున్న రోడ్లలో ముఖ్యమైన వాటిని సిమెంట్ డిజైన్లోకి మార్చాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన నితిన్ గడ్కారీతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రాష్ర్టంలో నిర్మించనున్న కాంక్రీట్ రోడ్ల వివరాలతో నివేదికను అందజేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతం రాష్ర్ట యంత్రాంగం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో బ్యాగుపై రూ. 100 ఆదా రోడ్లు, వంతెనలు నిర్మించే కాంట్రాక్టర్లు, సిమెంటు కంపెనీల మధ్య అనుసంధానం కోసం ఇటీవల కేంద్రం ప్రత్యేకంగా ఓ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సిమెంటు తయారీదారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి నేరుగా రోడ్ల నిర్మాణదారులకు సిమెంట్‌ను తక్కువ ధరకు పంపిణీ చేయాలని సూచించింది. దీనికి తయారీదారులు కూడా అంగీకరించారు. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో ధరను కోట్ చేయనుంది. ఇలా ఈ ఒప్పందం పరిధిలో దాదాపు 101 కంపెనీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వెరసి హీనపక్షంగా మార్కెట్ ధర కంటే ప్రతి బస్తాపై రూ.100 వరకు రాయితీ ఉంటుందని అంచనా. ఫలితంగా తారు రోడ్డు నిర్మాణానికయ్యే వ్యయం కంటే సిమెంట్ రోడ్డు నిర్మాణ వ్యయం మరీ ఎక్కువయ్యే అవకాశం లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై ఖర్చు తక్కువే... రాష్ట్రంలో ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిర్మించే రోడ్లకు తారు పొరలను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వ్యయం అధికంగా ఉంటోం ది. కానీ కాంక్రీట్ రోడ్లకు అదనంగా పొరలు నిర్మించాల్సిన అవసరం ఉండదు. అంటే తారు పొరలు ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ఇంచుమించు సిమెంటు రోడ్డు వ్యయానికి సమానంగా ఖర్చవుతోంది. అలాంటి చోట్ల సిమెంటు రోడ్లు నిర్మిస్తే అదనంగా అయ్యే వ్యయం పెద్దగా ఉండదు. దీంతో అలాంటి రోడ్లను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 6 వేల కోట్లతో రోడ్లు, వంతెనలను నిర్మించబోతున్నారు. వీటికి వీలైనంత మేర రాయితీ ధరలకు సిమెంటును నేరుగా కంపెనీల నుంచి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం నుంచి తెలుసుకునేందుకు త్వరలో ఓ ఉన్నత స్థాయిబృందాన్ని ఢిల్లీకి పంపుతోంది. -
చంద్రబాబు అగ్రిమెంట్ రాసివ్వాలి- భూమా అఖిలప్రియ
హైదరాబాద్: నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో అగ్రిమెంట్ చేయాలని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మంగళవారం ఆమె మాట్లాడుతూ...ప్రాజెక్టు పూర్తి చేయకుంటే తనదే బాధ్యత అని చంద్రబాబు అగ్రిమెంట్లో రాయాలన్నారు. దానితో పాటు అగ్రిమెంట్ కాపీని గవర్నర్ కు సమర్పించాలని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం వెనుక మంత్రుల వాటాలెంతో బయటపట్టాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అంజద్ బాషా, నారాయణ స్వామి లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
శాసనసభ ప్రాంగణంలో ఐదున ప్రమాణ స్వీకారం
ఎవరికి ఏ శాఖ దక్కేనో? సాక్షి, ముంబై: ఎట్టకేలకు బీజేపీ, శివసేన మధ్య ఒప్పందం కుదిరింది. శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం పది గంటలకు బీజేపీకి చెందిన 10 మంది, శివసేనకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వీరిలో ఎవరికి ఏ శాఖ అప్పగిస్తారనేది ఇప్పటిదాకా స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పైరవీలు ప్రారంభించారు. కాగా బీజేపీ సర్కారులో చేరాలా? వద్దా? అనే అంశాన్ని దాదాపు నలభై రోజులకుపైగా శివసేన నాన్చింది. పదవుల పంపిణీపై ఆ పార్టీ తగ్గడం బీజేపీ సర్కారుకు ఊరట లభించింది. శివసేనకు ఐదు కేబినెట్ హోదా, ఏడు సహాయ మంత్రి పదవులను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే ఈ పదవులు ఎవరిని వరిస్తాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ పదవుల విషయంలో సుభాష్ దేశాయి, ఏక్నాథ్ షిండే, దివాకర్ రావుతే, నీలం గోరే పేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా సహాయ మంత్రి పదవుల విషయంలో దాదా భుసే, విజయ్ అవుటీ, రవీంద్ర వైకార్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాఠోడ్, అర్జున్ ఖోత్కర్, దీపక్ కేసర్కర్ లేదా ఉదయ్ సామంత్, దీపక్ సావంత్ తదితరుల పేర్లు తెరపైకొచ్చాయి. దీంతో శివసేనతోపాటు బీజేపీలో కూడా భారీగా లాబీయింగ్ జరుగుతోంది. శివసేన ముందుగా డిమాండ్ చేసిన ప్రకారం ఉప ముఖ్య మంత్రి, హోం శాఖ లాంటి కీలక శాఖలను బీజేపీ ఇవ్వలేదు. కేవలం సాధారణ శాఖలతోనే సరిపెట్టింది. ఈ విషయంలో శివసేన విఫలమైందని కాంగ్రెస్, ఎన్సీపీలు విమర్శిస్తున్నాయి. అయితే శివసేనకు ప్రాధాన్యం లేని శాఖలను కేటాయించామనుకోవడం పొరబాటేనంటూ బీజేపీ సమర్థించుకుంది. ఎమ్మెస్సార్డీసీ, రవాణా లాంటి కీలకమైన శాఖలను శివసేనకు ఇవ్వనున్నారు. వీటితోపాటు కేంద్రంలో ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కావాలని శివసేన డిమాండ్ చేసింది. దీనిపై బీజేపీ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదని శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరికో? బీజేపీ సర్కారులో శివసేన చేరడం ఖాయమని తేలడంతో ఇక ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారనే అంశం తెరపైకి వచ్చింది. సంఖ్య బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో ప్రతిపక్ష స్థానం కాంగ్రెస్‌కు దక్కే అవకాశం మెండుగా ఉంది. అయితే ఎన్సీపీ కూడా ప్రతిపక్ష స్థానంలోనే ఉంటామంటోంది. ఇటీవల గవర్నర్ విద్యాసాగర్‌రావును తోపులాటల్లో గాయపర్చిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండయ్యారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 37కి చేరింది. ఈ లెక్కప్రకారం ఎన్సీపీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశముంది. స్వతంత్రులు, ఇతర పార్టీల బలం తమకుందని, అందువల్ల ప్రతిపక్షంలో తామే కొనసాగుతామంటూ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్సీపీ కూడా ఈ పదవిని ఆశిస్తుండడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఫలించని ఎన్సీపీ వ్యూహం శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మాజీ మిత్రపక్షమైన శివసేనను ఇరకాటంలో పడేసేందుకు ఎన్సీపీ యత్నించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు బయట నుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఆ తరువాత అనేక సందర్భాల్లోనూ ఇదే మాట చెప్పారు. అయితే పక్షం రోజుల్లోనే ఆయన మాట మార్చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచడం తమ బాధ్యత కాదన్నారు. ఆ తరువాత రెండు రోజులకే మరోసారి ఓ సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని అనడం ద్వారా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. బీజేపీ సర్కారులో చేరడానికి శివసేన అంగీకరించడంతో ఎన్సీపీ వ్యూహం తల్లకిందులైంది. -
దక్కని ధర
సుబాబుల్, జామారుుల్ రైతులు విలవిల కొనుగోళ్లు చేయని పేపర్‌మిల్లు యూజమాన్యాలు తప్పనిసరై బ్రోకర్లకు అమ్ముకుంటున్న రైతులు నేడు మానిటరింగ్ కమిటీ సమావేశం సుబాబుల్, జామారుుల్ కొనుగోలులో పేపర్ మిల్లుల యూజమాన్యాలు ఒప్పందాలు పాటించడం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీనిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు. ఒంగోలు : జిల్లాలో ఎంతోకొంత లాభసాటిగా ఉన్న సుబాబుల్, జామాయిల్ అమ్మకాలు కూడా బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో రైతులకు అగ్రిమెంట్ ప్రకారం ధర రాక తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల వద్ద నుంచి పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. దీనిపై ప్రకాశం జిల్లా కలెక్టర్ జూన్‌లో మానిటరింగ్ కమిటీని వేశారు. ఇందులో రైతుసంఘం నేతలతో పాటు మార్కెటింగ్ అధికారులు కూడా ఉన్నారు. రైతుల నుంచి పేపర్ మిల్లులు కొనుగోలు చేయడం లేదనే విషయం ఈ కమిటీ పర్యవేక్షణలో కూడా తేలింది. ఈ నేపథ్యంలో బుధవారం ఒంగోలులో మానిటరింగ్ కమిటీతో పాటు పేపర్ మిల్లుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ విజయకుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరిలో ఒప్పందం... జిల్లాలోని సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు, దర్శి, కనిగిరి, కందుకూరు, కొండపి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ తోటలు వేశారు. వీటికి సంబంధించి 2014 ఫిబ్రవరి 18న కృష్ణాజిల్లా నందిగామలో సుబాబుల్‌కు టన్నుకు రూ.4,400 చెల్లించే విధంగా రైతులకు, పేపర్ మిల్లుల యాజమాన్యాలకు మధ్య ఒప్పందం కుదిరింది. మన జిల్లాలో ఆ ఒప్పందం అమలు కాకపోవడంతో రైతుసంఘాలు జూన్‌లో కలెక్టర్‌ను కలిసి విన్నవించాయి. దీంతో ఆయన పేపర్‌మిల్లు యాజమాన్యాలను కూర్చోబెట్టి సుబాబుల్‌తో పాటు జామాయిల్‌కు ఒప్పందం కుదిర్చారు. సుబాబుల్‌కు టన్నుకు రూ.4,400, జామాయిల్‌కు రూ.4,600 చెల్లించేలా కుదిరింది. ఒప్పందం ప్రకారం కొనుగోళ్లు చేయని యూజమాన్యాలు... జిల్లాలో మార్కెట్ కమిటీలు ఎంపిక చేసిన 30 వేబ్రిడ్జిల వద్ద సరకు అమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు రైతులు సరకును తెస్తే పేపర్‌మిల్లు యాజమాన్యాలు ఎంపిక చేసిన అధీకృత ఏజెంట్లు కొనుగోలు చేస్తారు. అయితే కంపెనీలు అధీకృత ఏజెంట్లను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో ఒక వందమంది అనధికార ఏజెంట్లను ఏర్పాటు చేశారు. వీరు రైతులు సరకు తీసుకువస్తే కొనడం లేదు. దీంతో రైతులు అనివార్యంగా బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. గతంలో దీనిపై సంతనూతలపాడు వద్ద రైతుసంఘాలు అనేక సార్లు రాస్తారోకోలు చేశాయి. ఆందోళన చేసిన సమయంలో మొక్కుబడిగా కొనుగోలు చేసినా తర్వాత కొనడం లేదు. దీనిపై మానిటరింగ్ కమిటీ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. జిల్లాలో గత మూడు నెలల కాలంలో రైతుల వద్ద నుంచి సుమారు 25 వేల టన్నుల జామాయిల్, సుబాబుల్ అమ్మకాలు జరిగాయి. రైతులకు ఒప్పందం ప్రకారం ధర చెల్లించాల్సి ఉండగా, టన్ను సుబాబుల్‌కు రూ.3,700, జామారుుల్కు రూ.3,500 మాత్రమే చెల్లించారు. దీంతో రైతులు టన్ను సుబాబుల్‌కు రూ.500, జామాయిల్‌కు రూ.1,100 చొప్పున నష్టపోతున్నారు. మరో 30 వేల ఎకరాల్లో కటింగ్... వచ్చే మూడు నెలల్లో సుమారు 30 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కటింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పేపర్ మిల్లుల నుంచి సరైన ధర ఇప్పించని పక్షంలో రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. పేపర్ రేట్లు భారీగా పెరుగుతున్నా సుబాబుల్, జామాయిల్ ధర మాత్రం పెరగడం లేదు. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికైనా తమకు న్యాయమైన ధర అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. -
పెట్రోల్ బంక్‌ను ఖాళీ చేయండి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను ఆదేశించిన హైకోర్ట వరంగల్ లీగల్ : చట్టబద్దమైన అగ్రిమెంట్ లేకుండా భూయజమానుల స్థలాన్ని వినియోగించుకోవడం సరికాదని, మూడు నెలల్లో పెట్రోల్‌బంక్ ఖాళీ చేసి స్థలాన్ని యజమానులకు అప్పగించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై నెలకొల్పిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవుట్లెట్ పెట్రోల్ బంక్ 1973 నుంచి కొనసాగుతుంది. 20 ఏళ్లకు లీజు అగ్రిమెంటును స్థల యజమానురాలు వినోదరెడ్డితో కార్పొరేషన్ వారు కుదుర్చుకున్నారు. మొదటి ఐదేళ్లకు నెలకు 180 రూపాయలు అద్దె, మరో ఐదేళ్ల సమయానికి నెలకు రూ.200, చివరి 10 సంవత్సరాల కాలానికి నెలకు రూ.235 అద్దె చెల్లించేలా లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు. కార్పొరేషన్ వారు ఒప్పందం మేరకు అద్దెలు చెల్లించడం లేదని, వారు స్థలాన్ని ఖాళీ చేయమని గతంలో కోర్టులో దావా వేసింది. కానీ అగ్రిమెంట్ కాలం మధ్యలో ఖాళీ చేయమని చెప్పడం సరికాదని అప్పట్లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 20 ఏళ్ల కాలపరిమితి 1992 వరకు ముగిసినా ఆయిల్ కార్పొరేషన్ వారు ఖాళీ చేయలేదు. యజమానురాలు మృతిచెందడంతో ఆమె కుమారుడు వారసుడిగా దావాలో చేరాడు. లీజు స్థల విస్తీర్ణం 1135 గజాలకు తక్కువగా నెలకు రూ.235 చెల్లించడం సరికాదని, అదే ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇతర బంకులకు నెలకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారని, ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా 21 సంవత్సరాలుగా అక్రమంగా స్థలాన్ని వినియోగించుకుంటున్నారని యజమానులు కోర్టును ఆశ్రయించగా, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వరంగల్ వారు ఖాళీ చేయమని గతంలో తీర్పు ఇచ్చారు. దీంతో ప్రతివాది అయిన ఆయిల్ కార్పొరేషన్ వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్. కాంతారావు న్యాయపరమైన విషయాలు విచారించి ఎలాంటి అగ్రిమెంటు లేకుండా కొనసాగడం న్యాయబద్దమైనది కాదని తీర్పు ఇచ్చారు. మూడు నెలల్లో పెట్రోల్ బంకు ఖాళీ చేసి స్థలాన్ని యజమానులకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. -
‘రియల్’ సిండి‘కేట్లు’
ఆస్తుల క్రయ విక్రయాల్లో బ్రోకర్ల హవా నకిలీ పట్టాలతో నయవంచన అగ్రిమెంట్ల ముసుగులో మారు వ్యాపారం భారీగా కమీషన్ల దందా గన్నవరం మండలం వెంకటనరసింహాపురం కేంద్రంగా నకిలీ పట్టాలు సృష్టించి ప్లాట్లు విక్రయించే ముఠాలు జనాన్ని మోసగించి దోచుకుంటున్నాయి. నగరానికి చెందిన రాఘవరావుకు ఓ నకిలీ పట్టా చూపించి సిండికేట్లు రూ.ఐదు లక్షలు దండుకున్నారు. తీరా అక్కడికి వెళితే వేరే వ్యక్తి ఆ స్థలం తనదని అదే నంబర్‌తో పట్టా చూపించాడు. దీనిపై ఇద్దరూ గొడవ పడుతుండగా సిండికేట్లు జారుకున్నారు. నూజివీడులో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సిండికేట్‌గా తయారై భూముల క్రయ విక్రయాలను శాసిస్తున్నారు. వీరి బారినపడి అనేకమంది అమాయకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎవరైనా స్థలం, ఇల్లు విక్రయిస్తామని చెప్పగానే వారికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంటు రాయించుకుంటున్నారు. 60 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్న షరతు విధించి అదే ఆస్తిని మారు బేరానికి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. విజయవాడ : ఇన్నాళ్లు ఇసుక, మద్యం వ్యాపారాలకే పరిమితమైన సిండికేట్లు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి జొరబడ్డారు. వీరంతా ప్రాంతాలకు హద్దులు ఏర్పాటుచేసుకుని రియల్ మోసాలకు తెగబడుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కేవలం మాయ మాటలు చెప్పి ఇరు వర్గాలకు ఒప్పందం కుదిర్చి లక్షలాది రూపాయల కమీషన్లు నొక్కేస్తున్నారు. రాజధాని ఏర్పాటు వార్తలతో నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో భూములు, స్థలాల ధరలు చుక్కలనంటాయి. ఈ నేపథ్యంలో పలువురు రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్నివర్గాల్లోనూ ఈ తరహా సిండికేట్లు ఏర్పడినట్లు సమాచారం. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించి కొనుగోళ్లు, అమ్మకాల్లో మధ్యవర్తులుగా ఉండి కమీషన్లు పొందుతున్నారు. గ్రామాలు, పట్టణాలు దాటి సిండికేట్లుగా మారి సెల్ఫోన్లలో ఒప్పందం కుదిర్చి కొనుగోలుదారులు, అమ్మకందారులను కలవనీయకుండా దళారీ వ్యవస్థను నడుపుతున్నారు. లక్షకు రూ.రెండు వేలు చొప్పున కమీషన్ పొందుతున్నారు. కమీషన్ సొమ్ము కోసం బ్రోకర్లు అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ, కంకిపాడు, గన్నవరం, నున్న, నూజివీడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. అమ్మేవారి కోసం గాలం ఎవరైనా తమ ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందగానే కొనుగోలుదారులకంటే ముందుగా బ్రోకర్లే ప్రత్యక్షమవుతున్నారని జనం వాపోతున్నారు. సిండికేట్ సభ్యులు ఇరువర్గాల తరఫున మాట్లాడుతూ రేటును కూడా వారే పెంచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులరీత్యా ఆస్తి అమ్ముకోదలచినవారు సిండికేట్లను సంప్రదిస్తే.. ఆ ఆస్తి రేటుపై ఎక్కువ మొత్తం ధర నిర్ణయించి, ఆపై మొత్తం తమదేనని చెబుతున్నారు. దీనికి ఆస్తి యజమాని అంగీకరించకపోతే, సంబంధిత ఆస్తి గొడవల్లో ఉందని, దస్తావేజులు లేవని, వాస్తు బాగోలేదని ప్రచారం చేస్తూ అమ్మకందారులను ఇబ్బందులపాల్జేస్తున్నారు. అమాయకులు, మార్కెట్ ధర తెలియని వారు, కుటుంబ ఇబ్బందులు ఉన్నవారు, అప్పులపాలైన వారు వీరి బారినపడి నష్టపోతున్నారు. పెచ్చుమీరిన ‘టోకెన్’ వ్యాపారం స్థిరాస్తి వ్యాపారంలో దళారులు ఇటీవలి కాలంలో టోకెన్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టారు. టోకెన్ అంటే బయానా (కొంత అడ్వాన్స్) సొమ్ము చెల్లించి సంబంధిత ఆస్తిని అగ్రిమెంటు చేసుకుంటున్నారు. ఉదాహరణకు కోటి రూపాయల ఆస్తిని ఐదుగురు సిండికేట్ సభ్యులు రూ.25 లక్షలు బయానా ఇచ్చి అగ్రిమెంటుపై చేజిక్కించుకుంటున్నారు. 60 రోజుల షరతుతో మిగిలిన డబ్బు ఇస్తామని ఆస్తి అమ్మే వ్యక్తి చెప్పి గడువులోపే మారుబేరానికి ఆస్తిని విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు చేతిలో చిల్లిగవ్వలేకపోయినా ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి అమాయకులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అగ్రిమెంటు చేసుకుని పూర్తి సొమ్ము ఇవ్వకుండా, ఆస్తిని వేరొకరికి అమ్మనీయకుండా కొందరు నానా యాగీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తి యజమానులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేక, రాజకీయ పెద్దలను ఆశ్రయించలేక సిండికేట్ల వలలో ఇరుక్కుంటున్నారు. కొందరైతే అయినకాడికి ఆస్తులు అమ్ముకుని పూర్తిగా నష్టపోతున్నారు. సిండికేట్లలో విభేదాలు ఏర్పడితే పరిష్కారానికి కూడా ఒక కమిటీని వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పారని పాచిక
మండలిలో చైర్మన్ పోస్ట్ బీజేపీకే జేడీఎస్ మద్దతు పొందేలా మొదట కాంగ్రెస్ వ్యూహం అనంతరం కుమారతో శెట్టర్ చర్చలు సఫలం బీజేపీకి మద్దతిచ్చిన జేడీఎస్ బదులుగా డిప్యూటీ పోస్ట్ పుట్టన్నకు నిప్పులు చెరిగిన విమలా గౌడ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులను నిలబెట్టుకునే ప్రయత్నంలో బీజేపీ, జేడీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుత చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి కొనసాగుతారు. బీజేపీకి చెందిన ప్రస్తుత డిప్యూటీ చైర్పర్సన్ విమలా గౌడ రాజీనామా చేసి, ఆ స్థానాన్ని జేడీఎస్‌కు చెందిన పుట్టన్నకు ఇవ్వాలన్నది ఒప్పందం. శాసన సభ లాబీలో బుధవారం ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి దీనిపై సుదీర్ఘంగా చర్చించి, ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎత్తు చిత్తు శాసన మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పన్నిన వ్యూహం విఫలమైంది. జేడీఎస్ మద్దతుతో ఈ రెండు పదవులను కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేసింది. చైర్మన్ పదవి తనకు, డిప్యూటీ చైర్మన్ పదవి జేడీఎస్‌కు... అని ఒప్పందాన్ని సిద్ధం చేసుకుంది. చివరి నిమిషంలో కుమారస్వామి బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ పాచిక పారలేదు. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 75 కాగా బీజేపీ బలం 31. ఇటీవల జరిగిన ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులతో కాంగ్రెస్ బలం 28కి పెరిగింది. ముగ్గురు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్ వైపే ఉన్నారు. మరో స్వతంత్రుడు తటస్థంగా ఉంటున్నారు. జేడీఎస్ సంఖ్యా బలం 12. ఈ నేపథ్యంలో ఇరు పదవులు ఖాయమనుకున్న కాంగ్రెస్, ఈ వారంలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలనుకుని పథకం కూడా సిద్ధం చేసుకుంది. అయితే చివరి నిమిషంలో బీజేపీ, జేడీఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందంతో నిస్సహాయంగా మిగిలిపోయింది. విమలా గౌడ నిప్పులు డిప్యూటీ చైర్ పర్సన్ పదవి నుంచి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తనను కోరారని విమలా గౌడ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, జేడీఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. చైర్మన్ శంకరమూర్తి పదవి లేకుండా ఉండలేరని విమర్శించారు. ఆయన పదవిని కాపాడుకోవడానికి తనను రాజీనామా చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో చైర్పర్సన్, ప్రతిపక్ష నాయకురాలు పదవులను ఇస్తామని హామీ ఇచ్చిన తమ పార్టీ, అనంతరం మాట తప్పిందని విమర్శించారు. జేడీఎస్ నాయకులు ‘డీల్’ మాస్టర్లని నిప్పులు చెరిగారు. వారి బాగోతం ప్రజలకు తెలుసునని విమర్శించారు. మొత్తానికి ఓ ఒక్కలిగ మహిళకు అన్యాయం జరిగిందని ఆమె వాపోయారు. -
కాంట్రాక్టర్లకు ధనజాతర
=మేడారం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు =అధికారులతో కాంట్రాక్టర్ల ‘ముందస్తు’ ఒప్పందం =లెస్తో పనులు దక్కించుకుంటున్న వైనం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పనులు కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వారు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు లెస్(తక్కువ)తో టెండర్లు దాఖలు చేస్తూ ముందుకు వస్తుండడమే ఇందుకు నిదర్శనం. జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మేడారం జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అర్డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా సుమారు రూ.80కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. అయితే గత జాతరలో పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఈసారి సంబంధిత శాఖ అధికారులతో ‘ముందస్తు’ ఒప్పందం చేసుకుని పనుల మంజూరు కోసం రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిధులు మంజూరు చేయించే బాధ్యతను అధికారులే తీసుకోవడంతో కాంట్రాక్టర్లు సూచించిన మేరకే పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగానైనా చేపట్టనున్న పనులకు నిధులను తామే తెస్తున్నందున టెండర్లు కూడా తమకే దక్కుతాయని చెప్పి పలువురు కాంట్రాక్టర్లు టెండర్ల ప్రక్రియ పూర్తికాకున్నా పనులు ప్రారంభించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఆర్అండ్బీ శాఖ ఈ-ప్రొక్యూర్మెంట్లో టెండర్లు నిర్వహించడం, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయడంతో కొన్ని పనులను ఆయా కాంట్రాక్ట ర్లు ప్రారంభించారు. అయితే ఇరిగేషన్ శాఖలో జరుగుతు న్న మాయాజాలం అంతా ఇంతా కాదు. గత రెండు జాతరల సందర్భంగా పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ ఆరునెలల క్రితమే తన పలుకుబడిని ఉపయోగించుకుని సీఎం పేషీ నుంచి మంత్రాంగం నడిపినట్లు తెలుస్తోంది. జాతరలో నిధులు మొత్తం తనకే కేటాయిస్తే పనులను విభ జించాల్సి వస్తుందని భావించి ఇప్పుడు మంజూరైన పను ల నుంచి సగం వాటినే ప్రస్తుతం చేపట్టే విధంగా జీఓను జారీ చేయించడంలో అతడు విజయం సాధించాడు. కా గా, మంజూరైన నిధులతో చేపట్టే పనులను విభజించే అధికారం ఇరిగేషన్ ఎస్ఈకి ఉంటుందని తెలి సింది. అయితే ఈ నిబంధనను తొక్కి పెట్టేందుకు కాంట్రాక్టర్ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శితో టెండర్లను విభజించి కా కుండా ఒకే పనిగా టెండర్లు పిలవాలన్న ఆదేశాలు ఇప్పిం చడంతో ఆయన పలుకుబడి ఏమిటో అందరికీ అర్థమైంది. లెస్తో నాణ్యత ఎలా... పంచాయతీరాజ్ శాఖ ద్వారా 15.08 కిలోమీటర్ల రహదారులను రూ.7.69కోట్ల వ్యయంతో మరమ్మతులు, అభివృ ద్ధి చేసేందుకు టెండర్లు నిర్వహించారు. ఇందులో మేడా రం గ్రామంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి నార్లాపూర్ ఆర్అం డ్బీ రోడ్డు వరకు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.67లక్షలు కేటాయించారు. అయితే ఈ పనిని దక్కించుకునేందుకు కరీంనగర్‌కు చెంది న కాంట్రాక్టర్ ఏకంగా 32 శాతం లెస్ వేయడం, మరో పనికి 26 శాతం నుంచి 5 శాతం వరకు తక్కువగా టెం డర్లు దాఖలు కావడంతో శాఖలోని అధికారులు విస్మ యానికి గురయ్యారు. కాంట్రాక్టర్ చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపుల కోసం శాఖాపరంగా మరో 12 శాతం వరకు ఖర్చులుంటాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో తక్కువ వేసిన 32 శాతం కలిస్తే వంద రూపాయల పనిని యాభై రూపాయలకే చేయాల్సి ఉంటుంది. ఈ పనిని పొందిన కాంట్రాక్టర్ మరీ తక్కువగా వేయడంతో, తక్కువ వేసిన మొత్తానికి నిబంధనల ప్రకారం ఏఎస్డీ(అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పని రద్దు చేయాల్సి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి భావించారు. సదరు కాంట్రాక్టర్ ఏఎస్డీ రూ.7.43లక్షలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడంతో శాఖలోని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. టెండర్లలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకోకపోయినప్పటికీ పనులు ప్రారంభించారు. ఎస్టిమేట్లతో చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు... ఇంజినీరింగ్ అధికారులతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల వల్లనే ఎంత లెస్(తక్కువ శాతం)కైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజం కాదనకుండా ఉండలేం. ఏ మేరకు రోడ్లు వేస్తున్నారు...ఎంత వరకు బిల్లులు చెల్లిస్తున్నారో జాతర తర్వాత పట్టించుకున్న అధికారి ఇప్పటి వరకు లేరు. జాతర ముగిసిన వెంటనే అధికారులు ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావడమే ఇందుకు కారణం. ఈ వెసులుబాటుతోనే కాంట్రాక్టర్లు ఎస్టిమేట్లు ప్రత్యేకంగా తయారు చేసుకుంటూ పనులను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు పనులను పట్టించుకోకపోవడంతో గతంలో ఓసారి జాతర పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మళ్లీ వచ్చే జాతరకు పో టీపడడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.