bribe
-
లంచం ఇస్తేనే ఆక్వా సాగు.. అటవీ అధికారుల వీడియో వైరల్
-
కేసు మూసేసినా ధన దాహం తీరలేదు!
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యగా తేలిన మిస్సింగ్ కేసులో అనుమానితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో షాహినాయత్‌గంజ్ ఠాణా మాజీ ఇన్స్పెక్టర్ బాలు చౌహాన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ కేసు క్లోజ్ అయినా ధనదాహం తీరని ఇన్స్పెక్టర్ వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం కొసమెరుపు. షాహినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో నివసించే ఓ వ్యక్తి అప్పుల బాధతో గత నెల 5న అదృశ్యమయ్యాడు. దీనిపై గత నెల 7న కుటుంబీకుల ఫిర్యాదుతో షాహినాయత్‌గంజ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు కొలిక్కిరాకుండానే గత నెల 11న అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. అప్పు ఇచి్చన వారి వేధింపుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో నమోదైన కేసులు షాహినాయత్‌గంజ్ ఠాణాకు బదిలీ చేయించుకుంటారు. అయితే బాలు చౌహాన్ మాత్రం ఆ కేసును అక్కడే ఉంచి.. ఇక్కడ నమోదైన మిస్సింగ్ కేసును గత నెల 19న క్లోజ్ చేశారు. ఆ కేసులో అనుమానితులుగా ఉన్న అప్పు ఇచ్చిన వ్యక్తులను పిలిచి నిందితులుగా చేరుస్తానంటూ బెదిరించాడు. ఓ వ్యక్తిని మాత్రం తీవ్రంగా హెచ్చరించిన బాలు చౌహాన్ అలా కాకుండా ఉండాలంటే తనకు రూ.1.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నెల 23, 24 తేదీల్లో చౌహాన్ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఇన్స్పెక్టర్ను కలిసి, అతడితో రూ.50 వేలకు బేరసారాలు చేసి, ఆ మొత్తం తతంగాన్ని ఆడియో రికార్డు చేశాడు. ఈ సాక్ష్యాన్ని ఏసీబీ అధికారులకు అందించాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు బాలు చౌహాన్‌పై ఈ నెల 3న బదిలీ వేటు వేశారు. దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి ఏసీబీ అధికారులు శుక్రవారం అతడిని అరెస్టు చేశారు. -
కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ కట్..
-
విశాఖలో వివాదంగా మారిన పోలీసుల పనితీరు
-
‘‘లంచం.. సత్యం.. నిత్యం.. అనంతం’’!
ప్రజల సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిలో.. చివరకు వాళ్ల దగ్గరకు చేరేది కేవలం 15 పైసలే!. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాట ఇది. ఈ మాట ఇవాళ్టికీ ఎన్నికల టైంలలో కొందరు నేతల నోటి వెంట వినాల్సి వస్తోంది. అంటే.. అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదా?.సమాజాన్ని పట్టి పీడించే సమస్యలంటూ అవినీతి, లంచగొండితనం మీద సినిమాలు తీసే దర్శకులు కూడా.. క్లైమాక్స్‌లో వాటికి ఓ సరైన ముగింపు చూపలేకపోతున్నారు. అందుకు కారణం.. జనం అవసరాలు అంతలా ఉండడం. వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది అత్యాశకు పోతున్నారు. వేలు, లక్షల్లో వేతనాలు వస్తున్నా.. చాలదన్నట్లుగా పక్కచూపులు చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే.. ఇలాంటి వాటికి తావులేకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ(డీబీటీ)లాంటి ఆలోచనలు చాలావరకు ఊరట ఇస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..👉దేశంలోని మెజార్టీ కంపెనీలు ప్రభుత్వ అధికారులకు ఏదో ఒక దశలో లంచాలు ఇచ్చామని ఒప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన విస్తుపోయే వివరాలు.. ఓ సర్వే ద్వారా వెల్లడయ్యాయి.👉సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రకారం.. గత ఏడాది కాలంలో ఒక్కసారైనా లంచం ఇచ్చామని మనదేశంలో సుమారు 66 శాతం కంపెనీలు తెలిపాయి. బలవంతంగా లంచం ఇవ్వాల్సి వచ్చిందని 54 శాతం బిజినెస్‌లు, పనులు వేగంగా పూర్తి చేసేందుకు లంచం ఇవ్వడానికి వాలంటరీగా ముందుకొచ్చామని 46 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి.👉తూనికలు-కొలతలు, ఔషధాలు, ఆరోగ్యం.. ఈ విభాగాలు అత్యంత అవినీతిమయంగా మారాయి. ఈ విభాగాలకు సంబంధించిన ప్రతీ నాలుగింటిలో ముగ్గురు తప్పనిసరిగా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక.. 👉మొత్తం 159 జిల్లాల్లోని కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఈ వివరాలను బయటపెట్టింది. ఈ సర్వే కోసం 18 వేల రెస్పాన్స్‌లను సేకరించింది. ఇంకా ఈ సర్వే రిపోర్ట్‌లో.. ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో డీల్ చేస్తున్నప్పుడు పర్మిట్స్ పొందడానికి, సప్లయర్ క్వాలిఫికేషన్, ఫైల్స్, ఆర్డర్స్, పేమెంట్స్ పొందడానికి లంచం ఇచ్చుకోవల్సి వచ్చిందని బిజినెస్‌లు తెలిపాయి. ‘ప్రభుత్వ అనుమతులను వేగంగా పొందాలంటే లంచం ఇవ్వడం తప్పదని చాలా బిజినెస్‌లు పేర్కొన్నాయి. ప్రాసెస్‌లో ఇదొక పార్ట్‌గా మారిందని చెప్పాయి. అథారిటీ లైసెన్స్ డూప్లికేట్ కాపీ కోసం కూడా లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని, ప్రాపర్టీ సంబంధిత అంశాల్లో లంచం తప్పదని బిజినెస్‌లు పేర్కొన్నాయి. గత ఏడాది కాలంలో వివిధ రూపాల్లో లంచం ఇచ్చుకున్నామని 66 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి. అయితే..159 జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన 9 వేల వ్యాపారాలను ఈ సర్వేలో భాగం చేసింది లోకల్‌సర్కిల్స్. మెట్రో(టైర్1) జిల్లాల నుంచి 42 శాతం, టైర్ 2 జిల్లాల నుంచి 33 శాతం, టైర్-3, టైర్-4 జిల్లాల నుంచి(రూరల్) 25 శాతం పాల్గొన్నారు.ఇందుగలడందులేడనిసందేహము వలదుఎందెందు వెదకి చూచినఅందందు అమ్యామ్యా మూలము గలదు!.. అవినీతిలో భారత్ స్థానం ప్రపంచంలో ఎంతో తెలుసా?లంచం ఇచ్చినవాళ్లలో 47 శాతం.. తాము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అమ్యామా ముట్టజెప్పామని చెప్పారు. 62 శాతం మంది జీఎస్టీ అధికారులకు లంచాలిచ్చి పనులు చేయించుకున్నామని తెలిపారు. ప్రతీ ఇద్దరిలో ఒక వ్యాపారవేత్త.. కాలుష్యనివారణ, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ రంగాల్లో అధికారులకు అమ్యామ్యా ఇచ్చామన్నారు. అయితే ఇదే సర్వేలో ఇంకో ఆసక్తికరమై విషయం గమనిస్తే..లంచం ఇవ్వకుండానే పనులు పూర్తి చేసుకోగలిగామని 16 శాతం బిజినెస్‌లు చెప్పాయి. అలాగే లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదని 19 శాతం బిజినెస్‌లు పేర్కొన్నాయి. అవినీతి నిరోధక చట్టం(2018-సవరణ) ప్రకారం.. లంచం తీసుకోవడం మాత్రమే కాదు.. ఇవ్వడమూ నేరమే. అయినా ఇలాంటి సర్వేలు అప్పుడప్పుడు మన దేశంలో లంచగొండితనం ఎంత లోతుల్లో వేళ్లు పాతుకుపోయిందో అనే విషయాన్ని మనకు చెబుతుంటాయి. అవినీతి అవగాహన సూచిక 2023 ప్రకారం.. 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో ఉంది. -
కోనసీమ: వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం
సాక్షి, కోనసీమ జిల్లా: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం రేపుతోంది. ప్రతి పనికి కార్యాలయంలో మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో మెడికల్ ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై డీఎంహెచ్‌వో దుర్గారావు దొర ఆరా తీశారు. శ్రీధర్ అనే క్లర్క్ మామూళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.మెడికల్ ఆఫీసర్లను డీఎంహెచ్‌వో తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఆర్‌లో ఎంట్రీలు నమోదు చేసేందుకు, ప్రసూతి సెలవులకు, నాలుగు నుంచి పదివేల రూపాయలు చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు.కాగా, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్ల్లోనూ డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
-
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
సాక్షి,విశాఖ: సీబీఐ వలకి అవినీతి అధికారి అడ్డంగా దొరికి పోయారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.వాల్తేరు డివిజన్ డీఅర్ఎంగా సౌరభ్ కుమార్ పని చేస్తున్నారు. అయితే మెకానికల్ బ్రాంచ్ పనులుకి టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ సౌరబ్‌కు డబ్బులు ముట్ట జెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్ ప్రకారం.. సదరు కాంట్రాక్టర్ ముడుపుల వ్యవహారంపై సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.పక్కా సమాచారంతో కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు డీఆర్ఎం సౌరబ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఏసీబీ సోదాలు.. కోట్లలో బయటపడ్డ అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు
సాక్షి,హైదరాబాద్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాడి ఆగస్ట్ నెలలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.5కోట్లకు పైచీలుకు స్థిర,చర ఆస్తుల గుర్తించారు.అయితే రూ.4కోట్ల 19లక్షల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. రూ.8లక్షల లంచం తీసుకుంటూఈ ఆగస్ట్ 13న రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించగా భూపాల్‌రెడ్డి వద్ద భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు. -
Ameenpur: ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వేలు, లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుంచి సైతం సొమ్మును జలగల్లా పీలుస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.అమీన్పూర్ మండల కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌గా పనిచేస్తున్న చాకలి అరుణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మన్నె సంతోష్ బాధితుడు వెంకటేశం యాదవ్ నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ వారసత్వం ఆస్తి ఫార్వర్డ్ కోసం సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసేందుకు సంప్రదించగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తీసుకున్న లంచం డబ్బును ఆపరేటర్ చాకలి అరుణ్‌కుమార్ కారులో దాచుకోగా కారును తనిఖీ చేసి అందులో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి ఆపరేటర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు తహసీల్దార్ పి రాధను కూడా విచారించి ఆమె ఇంటిని సోదా చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
పోలీసుల వంకర బుద్ధి.. వీడియో వైరల్
-
లంచాల బాగోతంలో టీడీపీ కీలక నేత!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలోనే సంచలనం సృష్టించిన రైల్వే అధికారుల లంచాల కేసులో రోజుకో కొత్త వ్యక్తి పేరు వెలుగుచూస్తోంది. గుంతకల్లు రైల్వే డివిజనల్ అధికారులు కాంట్రాక్టు పనులు ఇచ్చేందుకు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఇటీవల సీబీఐ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఆర్ఎం వినీత్‌సింగ్‌తో పాటు మరో నలుగురు అధికారులు, ఇద్దరు కాంట్రాక్టర్లను సీబీఐ ఇప్పటికే అరెస్టుచేసింది. లంచాల వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో కొత్తకొత్త పేర్లు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పారీ్టకి చెందిన ఒక కాంట్రాక్టరు కూడా కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గం కొట్టాల గ్రామానికి చెందిన సదరు కాంట్రాక్టరు గత పదిహేనేళ్లుగా రైల్వే కాంట్రాక్టులు చేస్తున్నారు. రైల్వే అధికారులకు ముడుపులు చెల్లించి కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం, మిగతా కాంట్రాక్టర్లను దగ్గరకు కూడా రానివ్వకపోవడం వంటివి చేసేవారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఈ కాంట్రాక్టరు రింగు లీడర్‌గా వ్యవహరించే వారని, గడిచిన నాలుగేళ్లలో రూ.150 కోట్ల విలువైన పనులు చేసినట్లు సమాచారం. హుటాహుటిన హైదరాబాద్‌కు.. ఈ నేపథ్యంలో.. టీడీపీకి చెందిన సదరు కాంట్రాక్టరు పేరు సీబీఐ అధికారుల పరిశీలనలో ఉండటంతో అతను హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లినట్లు ఇక్కడి కాంట్రాక్టర్లు చెబుతున్నారు. లంచాల వ్యవహారంలో ఇప్పటివరకూ 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అందులో తన పేరు లేకుండా చేసుకునేందుకు సదరు కాంట్రాక్టరు భారీస్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇతని ఆధిపత్యాన్ని భరించలేకే కొంతమంది కాంట్రాక్టర్లు సీబీఐని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. డీఆర్ఎం (డివిజనల్ రైల్వే మేనేజర్), డీఎఫ్ఎం (డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్)లకు ఇతనే భారీగా ముడుపులిచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈయన చేసిన కాంట్రాక్టుల వివరాలన్నీ సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు.2014 నుంచి డాక్యుమెంట్ల పరిశీలన.. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి పాత వివరాలన్నీ సీబీఐ అధికారులు తోడుతున్నారు. 2014 నుంచి 2024 మార్చి వరకు జరిగిన కాంట్రాక్టుల అగ్రిమెంట్లన్నీ పరిశీలిస్తున్నారు. సుమారు 500 వరకూ అగ్రిమెంటు కాపీలు స్వా«దీనం చేసుకున్నారు. పనులు చేయకపోయినా బిల్లులు చేసుకున్నట్లు గుర్తించారు. ఒక్కో కాంట్రాక్టు పనికి సంబంధించి అగ్రిమెంటు దశలో 1 శాతం, ఇంజినీర్లకు 2 శాతం, ఫైనాన్స్ మేనేజర్‌కు 2 శాతం.. ఇలా కాంట్రాక్టు అగ్రిమెంటు నుంచి బిల్లుల చెల్లింపు పూర్తయ్యే వరకూ 10 శాతం వరకూ లంచాలు ముట్టాయి. అంటే.. రూ.100 కోట్ల పనులు చేస్తే రూ.10 కోట్ల వరకు లంచాల రూపంలో అధికారులకే ముట్టాయి. దీంతో గడిచిన పదేళ్లలో రైల్వే డివిజన్ పరిధిలో జరిగిన అన్ని పనులను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ముడుపులు రూ.వందల కోట్లలో చెల్లించినట్లు తెలుస్తోంది. -
ఈఎంఐల్లో లంచాలు
-
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడి
-
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి అడ్డంగా పట్టుబడ్డారు. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ 30,000 డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. నేడు రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమలాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి.అయితే సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ చేపడితే అనేక అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తహసిల్దా్ర్‌ను ఏసీపీ పట్టుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పైసలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 7 వేలు లంచం తీసుకుంటూ చాయితీరాజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్‌ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
హారతి పట్టు.. వెయ్యి కొట్టు అన్న చందంగా సాగుతున్న ప్రచారం
-
మాదాపూర్ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై
సాక్షి,హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం(ఏప్రిల్ 6) ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్ అవినీతి వ్యవహారం బయటపడింది. ఇదీ చదవండి.. కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్ -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
-
‘స్వాగతం’.. సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: లంచాల కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులు లేవంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ‘స్వాగతం.. సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది.’ అని కొనియాడారు. ఇకపై దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కొనసాగుతాయని, సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని కూడా జత చేశారు. కాగా లంచాల కేసులో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే, ఎంపీలు లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. 1998లో పీవీ నరసింహారావు కేసులో అయిదుగురు జడ్జీల తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. పార్లమెంట్, శాసనసభలో లంచాలు తీసుకొనిలో ప్రసంగాలు చేయడం. ఓటు వేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. లంచం కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది. చదవండి: సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో ముఖ్యాంశాలు -
ఏసీబీ అధికారులు గులాబీ రంగు సీసా: ఈ లాజిక్ ఏంటో తెలుసా?
సాధారణంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొందరు ఉద్యోగులు, సిబ్బంది లంచాలు తీసుకుంటూ పట్టుబడిన కథనాలు చూస్తూఉంటాం కదా. ఈ సమయంలో కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగులో ద్రావణం ఉండే సీసాలను కూడా ఉంచుతారు అధికారులు. అవేంటో వాటి కథ ఏంటో ఎపుడైనా ఆలోచించారా? అయితే అసలు ఆ సీసాలు ఏమిటి? అందులో పింక్ రంగులో ద్రావణం ఎందుకు ఉంటుంది ? దానికి లంచానికి సంబంధం ఏమిటి ? ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల కోసంపనిచేయాల్సిన కొందరు అక్రమార్కులు లంచం ఇస్తేనే పని స్థాయికి దిగజారుతారు. లబ్దిదారులు, బాధితులకు అందాల్సినవి అందకుండా, చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ జలగల్లా పీడించుకు తింటారు. నిజానికి లంచం తీసుకోవడం, ఇవ్వడమూ రెండూ నేరమే. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా, వాళ్లకు ఎంతోకొంత ముట్టజెప్పి తమ పని కానిచ్చుకుంటారు. కానీ కొంతమంది అలాకాదు. అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదిస్తారు. వారికి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు లాంచావతార ఉద్యోగుల ఆటకట్టించేందుకు అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరప్షన్ బ్యూరో) రంగంలోకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్షించడమే ఈ శాఖ పని. ఈ క్రమంలోనే ఫిర్యాదు, లేదా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కొన్ని నోట్లిచ్చి వాటిని లంచం డిమాండ్ చేస్తున్న అధికారి లేదా ఉద్యోగికి ఇవ్వమంటారు. అయితే దీనికంటే ముందే ఏసీబీ అధికారులు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాల్ఫ్తలీన్ అనే పౌడర్‌ను రాస్తారు. నిజానికి ఈ పౌడర్ కళ్లకు కనిపించదు,గుర్తించలేం.ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి సదరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం ముందుగా వేసిన వల ప్రకారం వారి దగ్గర్నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. లంచం తీసుకున్న అధికారి చేతులను సోడియం బైకార్బొనేట్ మిశ్రమంలో ముంచుతారు. అంతకుముందే లంచంగా తీసుకున్న నోట్లకు ఉండే ఫినాల్ఫ్తలీన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది. ఎపుడైతే ఈ ద్రావణంలో చేతులు ముంచుతారో, సోడియం బైకార్బొనేట్ మిశ్రమం కాస్తా పింక్ రంగులోకి మారుతుంది. దీంతో వారు లంచం తీసుకున్నారని ధృవీకరించుకుంటారు. పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే కీలక సాక్ష్యంగా ఉంటుంది. -
ఏసీబీవలకు చిక్కిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్
-
రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబడిన ఈడీ అధికారి
సాక్షి, చెన్నై: తమిళనాడులో లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు(ఈడీ) చెందిన అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈడీ సీనియర్ అధికారి అంకిత్ తివారీ లంచం తీసుకుంటూ రాష్ట్ర పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దిండిగుల్ జిల్లాలో ఓ వైద్యుడి వద్ద రూ.20 లక్షల లంచం స్వీకరిస్తున్న అతడిని అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ వెల్లడించింది. కారులో ప్రయాణిస్తున్న అంకిత్ తివారీని దుండిగల్ పోలీసుల సాయంతో ఓ టోల్గేట్ వద్ద ఆపి అరెస్టు చేసినట్టు పేర్కొంది. అరెస్ట్ అనంతరం మధురై జిల్లా ఈడీ కార్యాలయంపై, అంకిత్ తివారీ ఇంట్లో దిండిగుల్ జిల్లా విజిలెన్స్ అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ అధికారులు దాడులు చేపట్టారు. శుక్రవారం రాత్రి నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ భద్రత నడుమ అధికారులు ఈడీ ఆఫీసులో తనిఖీ చేస్తున్నారు. అయితే అర్ధరాత్రివేళ సీఆర్పీఎఫ్ జవాన్లు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ఆఫీసును తమిళనాడు పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో వారు గేటు బయటే ఉండిపోయారు. దిండిగుల్లో ఓ ప్రభుత్వ వైద్యుడి ఆస్తులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా అంకిత్ రూ. కోటి లంచం డిమాండ్ చేసినట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. ఒప్పందంలో భాగంగా రూ. 20 లక్షలను వైద్యుడు స్థానిక జాతీయ రహదారి పక్కన ఇస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే అరెస్ట్ ఎప్పుడు జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టులో ఈ కేసు విచారణకు రావడంతో విషయం వెలుగు చూసింది. అంకిత్ తివారీకి డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది న్యాయస్థానం. ఈ కేసు దర్యాప్తులో మధురై, చెన్నైకి చెందిన మరికొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.. అంకిత్ తివారీ ఇప్పటి వరకు చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అతను ఇతర ఈడీ అధికారులకు కూడా లంచాలను పంపిణీ చేస్తున్నాడని పేర్కొన్నారు. మరోవైపు అంకిత్ అరెస్ట్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే అంకిత్‌ను ఈ కేసులో ఇరికించారని ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాడులో భారీగా లంచం తీసుకున్న కేసులో ఓ ఈడీ అధికారి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. వాస్తవానికి మనీలాండరింగ్ కేసుల్లో కొందరు డీఎంకే మంత్రులు ఇప్పటికే అరెస్టయ్యారు. మరికొందరు ఈడీ నిఘాలో ఉన్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం సంచలనంగా మారింది. -
ఏసీబీ వలలో బంజారాహిల్స్ సీఐ నరేందర్
సాక్షి, బంజారాహిల్స్: లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్స్పెక్టర్ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్ పీఎస్, నరేందర్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది. -
రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ
సాక్షి, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ అదికారులు అడ్డగోలుగా వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అదివారం సెలవు దినం కూడా వదిలిపెట్టడం లేదు. పట్టాపాసు పుస్తకంలో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన జిల్లాలోని మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్‌కు చెందిన యతీంద్రనాథ్ అనే రైతు మావల సమీపంలోని 14 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు పాసు పుస్తకాల్లో మార్పుల కోసం మావల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకు ఎమ్మార్వో అరీఫా సుల్తానా, ఆర్ఐ హన్మంతరావు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్లాప్లాన్‌తో తహసిల్దార్ ఆరిఫాసుల్తానా, ఆర్ఐ హనుమంతరావుకు మావల తాహసీల్దార్ కార్యాలయంలో రెండు లక్షలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’ -
బరితెగించిన టీడీపీ మాజీమంత్రి.. డబ్బు తీసుకుని పనిచేయాలని ఒత్తిడి
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు హయాంలో ‘తెలుగు తమ్ముళ్లు’ లంచాలు, దౌర్జన్యాలతో పనులు కానిచ్చుకున్నట్లుగానే ఇప్పుడూ బరితెగిస్తున్నారు. తమ పనులు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు డబ్బులు ఎరగా వేసేందుకూ వెనుకాడడంలేదు. ఇందుకు తాజాగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండల రెవెన్యూ అధికారికి లంచం ఇచ్చేందుకు ఏకంగా టీడీపీ మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డే ప్రయత్నించిన ఫొటోలు బయటకొచ్చాయి. ఆ వివరాలు.. కదిరిలో పల్లె రఘునాథరెడ్డికి సంబంధించి శ్రీవివేకానంద పేరుతో డిగ్రీ కాలేజీ ఉంది. కాలేజీకి సెక్యూరిటీ కార్పస్ ఫండ్ కోసం సైదాపురం రెవెన్యూ పొలంలో 38/1, 38/2, 38/5, 38/6 సర్వే నంబర్లలోని 4.5 ఎకరాల స్థలాన్ని పూచీగా చూపించారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని సుమారు 88 ప్లాట్లుగా విభజించి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎలాంటి హద్దులు చూపకుండానే అమ్మకాలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి.. అనుమతుల్లేవని తేల్చారు. ఈ తతంగం చాలారోజుల క్రితమే జరిగింది. ప్రస్తుతం ఈ స్థలానికి అధికారిక అనుమతులివ్వాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, వారు ససేమిరా అన్నారు. చదవండి: బండారూ.. తప్పుడు ప్రచారం మానుకో.. డబ్బు ఎరగా చూపి.. రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి పల్లె రఘునాథరెడ్డిపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అనుమతులివ్వాలని కోరారు. లంచాలు ఇచ్చేందుకూ ప్రయత్నించారు. డబ్బు వద్దని.. నిబంధనల ప్రకారమే పనిచేస్తామని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. తాజాగా.. సోమవారం ఉదయం కూడా కదిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన పల్లె రఘునాథరెడ్డి తన చేతిలో ఇలా‘నోట్లు’ పట్టుకుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మోసపూరిత బుద్ధి మానుకుంటే మంచిది : ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అవినీతికి పాల్పడటం, అక్రమాలు చేయడం టీడీపీ నేతలు మానుకుంటే మంచిది. సెక్యూరిటీ కార్పస్ ఫండ్‌కు అనుమతులు తీసుకున్న స్థలంలో ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం సరికాదు. మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. ఎలాంటి అనుమతులివ్వడం సాధ్యంకాదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. అయితే.. డబ్బులతో అధికారులకు గాలం వేయాలని పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటు. -
లంచంతో పట్టుబడి.. అధికారుల్ని చూసి కంగారులో..
జబల్పూర్: అవినీతికి పాల్పడడంలో ఏమాత్రం జంకని అధికారులు.. పైఅధికారుల చర్యలకు ఎందుకనో వణికిపోతుంటారు. అయితే ఇక్కడో అధికారి భయపడలేదు.. ఏకంగా బెదిరిపోయాడు. ఆ కంగారులో కరెన్సీ నోట్లను మింగేశాడు. మధ్యప్రదేశ్ కత్నికి చెందిన రెవెన్యూ అధికారి(పట్వారి) గజేంద్ర సింగ్ బర్ఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడట. దీంతో బాధితుడు లోకాయుక్తకు చెందిన స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(SPE) అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం గజేంద్ర కోరిన ఐదు వేల లంచంతో బాధితుడు కార్యాలయానికి చేరుకున్నాడు. గజేంద్ర లంచం తీసుకుంటున్న టైంలో ఎస్పీఈ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసి ఆందోళన చెందిన ఆ అధికారి తప్పించుకోవాలనే ఆలోచనతో ఆ నోట్లను కసాబిసా నమిలి మింగేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి క్షేమంగానే ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. A patwari in Katni in Madhya Pradesh was caught in a bribe-taking act by a team of the Lokayukta's Special Police Establishment. In a desperate attempt to escape, he allegedly swallowed the money he had accepted as a bribe. #AntiCorruption #BriberyCase #Lokayukta #Katni #MP pic.twitter.com/zgYXpbdYGv — The BothSide News (@TheBothSideNews) July 24, 2023 -
సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్..
ఢిల్లీ: ఢిల్లీలో లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓ దుకాణాదారుడి వద్ద రూ.50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. దేశ రాజధానిలోని మొగలిపురా ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #WATCH | CCTV footage of CBI raid under Mangolpuri Police Station area in Delhi on 10th July where one of the accused Head Constable Bheem Singh was seen attempting to flee, but he was caught. CBI has registered FIR against two head constables in a bribery case. (Source: CCTV… pic.twitter.com/qeoka3n40t — ANI (@ANI) July 12, 2023 మొగలిపురా ప్రాంతంలో బీమ్ సింగ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. స్థానికంగా ఓ దుకాణాదారుని షాప్ ముందు పార్కింగ్ అంశంలో డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.50,000 ఇవ్వాలని ఆ షాప్‌కీపర్‌పై ఒత్తిడి పెంచాడు. విసిగిపోయిన దుకాణాదారుడు సీబీఐ అధికారులకు సమాచారం అందించాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. వ్యూహం ప్రకారం రంగంలోకి దిగారు. పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని నమ్మించి ఆ షాప్ కీపర్ పోలీస్ కానిస్టేబుల్‌ను దుకాణం ముందుకు రప్పించాడు. అక్కడా కాపుగాసిన అధికారులను గమనించిన కానిస్టేబుల్ దుకాణదారుని నుంచి లంచం తీసుకోబోయాడు. వెంటనే అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా బీమ్ సింగ్‌ను పట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య -
ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది.. మహిళా కమిషన్ సీరియస్
పెళ్లిళ్లలో మోటు హాస్యాలు, స్నేహితుల ప్రాంక్‌లు శృతి మించుతున్నాయి. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టే సమయంలో వధూవరుల తలలను మెల్లగా తాడించాలనే సంప్రదాయం కేరళలో రభస సృష్టించింది. అల్లరి బంధువొకరు వధూవరుల తలలను పట్టి ‘ఠాప్పు’మనిపించడంతో వధువు బేర్‌మంది. ఈ వీడియో వైరల్ అయ్యేసరికి బంధువు పరార్ అయ్యాడు. మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. అత్తగారు కళ్లొత్తుకుంటూ ఇదంతా చూస్తూ కోడలితోపాటు నెత్తి కొట్టుకుంది. మొన్నటి శుక్రవారం సాజిలా అనే అమ్మాయికి, సచిన్ అనే అబ్బాయికి పెళ్లి జరిగింది. ఊరు పాలక్కాడ్‌లోని పల్లస్సేనా అనే చిన్న పల్లె. ఇక వరుణ్ణి, వధువును ఇంట్లోకి ఆహ్వానించాలి. మన దగ్గర ఆ సమయంలో కొన్ని హాస్యాలు, పరాచికాలు నడిచినట్టే అక్కడ కూడా ఏవో చిన్న చిన్న సరదాలు ఉంటాయి. గుమ్మం ముందు నిలుచున్న వధువు సాజిలా, వరుడు సచిన్ బంధువులకు నమస్కారాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో చిన్న సాంగెం బాకీ ఉండిపోయింది. అదేంటంటే వధువు, వరుడు ఒకరి తలను ఒకరు మెల్లగా తాడించుకోవాలి. కాని దీనికోసమే వారి వెనుక చేరిన ఒక అల్లరి బంధువు ఇద్దరి తలలూ పుచ్చుకుని ఠపీమనిపించాడు. ఇందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని వధువు ఠారెత్తిపోయింది. కళ్ల ముందు చుక్కలు కనిపించి ఆ తర్వాత కన్నీటి చుక్కలు రాలి పడ్డాయి. శుభమా అంటూ అత్తారింట్లో కాలు పెడుతుంటే ఏమిటిది అని ఆ అమ్మాయి ఆ వీడియోని తన ఇన్‌స్టాలో పెట్టింది. అంతే. క్షణాల్లో 20 లక్షల వ్యూస్ వచ్చాయి. కేరళ అంతా ఈ వీడియో ప్రచారమయ్యి ‘ఇలాంటి సాంగేలు ఇంకా ఉన్నాయా’ అని కొందరు, ‘కుర్రాళ్ల ప్రాంక్‌లు శృతి మించుతున్నాయ’ ని ఒకరు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. గగ్గోలు రేగేసరికి ఆ తలలు కొట్టించిన బంధువు ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. జరిగిందేదో జరిగింది అనుకుందామనుకున్నా ఈ లోపు కేరళ మహిళా కమిషన్ రంగంలో దిగి సుమోటోగా ఈ ఉదంతాన్ని తీసుకుంది. ‘వధువుకు ఎవరు ఇలాంటి బాధ కలిగించారో తేల్చండి’ అని తాకీదులిచ్చింది. యూట్యూబ్ చానెళ్లు వధూవరుల వెంట పడ్డాయి. ప్రచారం కోసమో సానుభూతి కోసమో వధువు విపరీతంగా తల పట్టుకుని ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇవన్నీ చూస్తూ పాపం పెళ్లికొడుకు, పెళ్లికొడుకు తల్లి తల కొట్టుకుంటున్నారు. ఇదొక్కటే కాదు పెళ్లిళ్లలో పిచ్చిపనులు చేయాలనుకునేవారు బాగా తయారయ్యారు. పర్యవసానాలు అర్థం చేసుకుని నవ వధూవరులను సంతోషంగా సౌకర్యంగా ఉంచడమే అందరూ చేయవలసిన పని. -
రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వీసీ గుప్తా
-
అవును.. ఆయన లంచంతో పట్టుబడ్డాడు: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా(63) తమ అదుపులోనే ఉన్న విషయాన్ని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ ప్రకటించారు. అయితే ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని.. పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిశాక అరెస్ట్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. సాక్షితో మాట్లాడిన ఆయన.. శనివారం జరిగిన పరిణామాలకు వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. తార్నాకలోని తన ఇంట్లోనే బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడాయన. ఆయన అల్మారా నుంచి నగదును సేకరించి.. కెమికల్ టెస్ట్ నిర్వహించి వేలిముద్రలతో పోల్చి చూసుకున్నాం. ఆ వేలిముద్రలు ఆయన ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలాయి. నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. వీడియో: గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి డబ్బులు చల్లుతూ వీసీ రవీందర్ డ్యాన్స్ లు ఇదీ చదవండి: కోరుకున్న కాలేజీ.. కోర్సు కూడా! -
ఏసీబీ ట్రాప్ లో తెలంగాణ యూనివర్సిటీ వీసీ
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడినట్లు సమాచారం. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు వీసీ రవీందర్ గుప్తా. ఈ క్రమంలో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి బాధితుడు డబ్బు ఇవ్వబోయాడు. ఆ టైంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రవీందర్ గుప్తా. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన్నీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదీ చదవండి: BRS ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి ఏం తీసుకెళ్లారు? -
‘దళితబంధు’కు లంచం ఇవ్వొద్దు: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, పెద్దపల్లి: దళితబంధు లబ్ధిదారులు ఆ మొత్తం పొందేందుకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. దళితులు ధనికులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి రూ.10 లక్షలు ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తోందని, తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారని అడిగితే.. ప్రతి ప్రజాప్రతినిధి గంటసేపు చెప్పగలరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో 19 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచిందని గుర్తు చేశారు. నల్లధనం వెనక్కి తెస్తానని, జన్‌ధన్ ఖాతా తెరిపించి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన గడ్డం తాత (పీఎం మోదీ) తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల చొప్పున 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తే బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ టూ జెడ్ స్కామ్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకగాంధీ తెలంగాణకు వచ్చి అవినీతి గురించి మాట్లాడుతున్నారని, వారిని నమ్మొద్దని కోరారు. కేటీఆర్ సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌లో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు శంకుస్థాపన, బెల్లంపల్లిలో పుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, అర్బన్ మిషన్ భగీరథలకు ప్రారంభోత్సవం చేశారు. సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న ఏడు వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలో, రామగుండంలో నిర్వహించిన ‘రామగుండం నవనిర్మాణ’సభలో ఆయన మాట్లాడారు. ఆ బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలి ‘ప్రధాని, అదానీ అవిభక్త కవలు. ఆ దోస్తును ధనవంతుల్లో 603వ స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులను అదానీకి కట్టబెట్టేందుకే వేలం పాట నిర్వహిస్తున్నారు. గాలి మోటరులో రామగుండం వచ్చిన మోదీ సింగరేణిని అమ్మబోమని గాలిమాటలు చెప్పారు. ఆ తెల్లారే నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేస్తున్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని సింగరేణికి కేటాయించాలి. పొరపాటున సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్నిగుండం అవుతుంది.’ అని మంత్రి హెచ్చరించారు. బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలి: ‘బొగ్గు గనులను కాపాడుకోవాలంటే బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలి. మోదీ వచ్చాక గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెర్రెలు, నెత్తురు పారిన తెలంగాణలో నేడు కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు పారుతున్నాయి. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కథానాయకులు కావాలి.’ అని కేటీఆర్ పి లుపునిచ్చారు. ఆకాశంలో స్పెక్ట్రమ్ నుంచి పాతా ళంలో బొగ్గును విడిచిపెట్టని కాంగ్రెస్ నేతలు ఒక్క చాన్స్ అంటూ అడుగుతున్నారని, మరి పదిసార్లు అవకాశం ఇస్తే ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రి ఎద్దేవా చేశారు. పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మతోడు ఇక్కడ ఐటీ కంపెనీలంటే నమ్మలే..! ‘బెల్లంపల్లిలో ఐటీ కంపెనీలు ఉన్నాయంటే అమ్మతోడు నేనసలు నమ్మలేదు. ఎమ్మెల్యే చిన్నయ్య తీసుకెళ్లి చూపిస్తే, వాళ్లని చూసి ఎంతో స్ఫూర్తి పొందా. రంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు అనే యువకులు అమెరికా, యూరప్ లాంటి ప్రాంతాల్లో స్థిరపడకుండా పుట్టిన గడ్డకు ఎంతో కొంత చేయాలని అనలటిక్స్ ఐటీ కంపెనీతో 100 మందికి, వెంకటరమణ వాల్యూ పిచ్ కంపెనీతో 200 మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రపంచంతో పోటీ పడేలా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు. చదవండి: ఇంఫాల్ నుంచి ఇంటికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు -
లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు
బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు సుమారు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్‌ను తయారు చేసే ప్రభుత్వ యజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్(కేఎస్డీఎల్) కార్యాలయం నుంచి అరెస్టు చేశారు. లోకాయుక్త వర్గాల సమాచారం మేరకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్బీ) చీప్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ప్రశాంత్ కుమార్ పనిచేస్తున్నాడు. అయితే అతన్ని మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్‌ని తయారు చేసే ప్రభుత్వ యజమాన్యంలోని కేఎస్‌డీఎస్ కార్యాలయం నుంచి అరెస్టు చేశారు. ఆ కార్యాలయం నుంచి సుమారు మూడు బ్యాగుల నగదు లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐతే ఆయన తండ్రి విరూపక్షప్ప దావణగెరె జిల్లా చన్నగిరి ఎమ్మెల్యే కేఎస్డీఎల్ చైర్మన్‌గా ఉండటం గమనార్హం. ఈ ప్రశాంత్ కుమార్ 2008 బ్యాచ్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి. అతను సబ్బు, ఇతర డిటర్జెంట్లు తయారికీ అవసరమైన ముడిసరుకు కొనగోలు చేసే డీల్ కోసం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఆ కాంట్రాక్టర్ నుంచి సుమారు రూ. 81 లక్షలు డిమాండ్ చేయడంతో లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో అధికారులు సాయంత్రం 6 గంటలకు పకడ్బందిగా ఉచ్చు బిగించారు. ఐతే ఈ డబ్బు అందుకుంది తండ్రీకొడుకులని సీనియర్ లోకాయుక్త తెలిపారు. (చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. రోబోల సాయంతో మంటలు అదుపులోకి.. ) -
లోకాయుక్తకు పట్టుబడిన అధికారిణి
సాక్షి, కర్ణాటక: పెట్రోల్ బంక్ రెన్యూవల్‌కు అవసరమైన ధ్రువీకరణపత్రం మంజూరుకు లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల అధికారిణి ఎస్.మాలాకిరణ్ లోకాయుక్తకు చిక్కారు. వివరాలు... చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట రోడ్డులో బసవేశ్వర పెట్రోల్ బంక్ ఉంది. బంక్ రెన్యూవల్‌కు అవసరమైన పత్రం కోసం యజమాని తూనికలు, కొలతల అధికారి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారిని మాలకిరణ్ రూ.8వేలు డిమాండ్ చేశారు. ఏపీఎంసీ ఆవరణలోని కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. నగదను స్వాధీనం చేసుకొని మాలకిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులపాటు రిమాండ్‌కు ఆదేశించారు. మరో వైపు బెంగళూరులోని మాలకిరణ్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. -
ఇంత కథ నడిచిందా!, చోక్సీ భారత్ రాకుండా లంచాలు ఎరచూపుతున్నారా?
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఫైనాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, ప్రముఖ ఎడిటర్ కెన్నెత్ రిజోక్ తెలిపారు. చోక్సీ లంచాల భాగోతంపై కెన్నెత్ రిజోక్ తన బ్లాగ్ (rijock.blogspot)లో ఓ ఆర్టికల్ ను పోస్ట్ చేశారు. ఆ న్యూస్ ఆర్టికల్‌లో కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్న చోక్సీ భారత్‌కు రాకుండా ఉండేలా ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఇక్కడ (ఆంటిగ్వాలో) అతనిని అదుపులోకి తీసుకొని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న ఇంటర్‌పోల్ ప్రయత్నాలకు స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం : సీనియర్ పోలీస్ అధికారి ఆడోనిస్ హెన్రీ) అంతేకాదు న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా ఆంటిగ్వా ప్రభుత్వ పెద్దలతో పాటు సీనియర్ పోలీస్ అధికారి ఆడోనిస్ హెన్రీ వంటి అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నట్లు తేల్చారు ఆంటిగ్వాలో వ్యాపారం భారత్‌లో బ్యాంకుల్ని కొల్లగొట్టిన చోక్సీ ఆంటిగ్వాలో పెద్ద ఎత్తున రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. చోక్సీకి సొంతమైన జోలీ హార్బర్ రెస్టారెంట్లో హెన్రీని పలు మార్లు కలిసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. చోక్సీ హెన్నీని కలవడం మాత్రమే కాదని, లంచం ఇచ్చి న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్‌ని సైతం ప్రభావితం చేస్తున్నారని నివేదికలో హైలెట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం : మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్) పక్కా ఆధారాలున్నాయి క్లార్క్,హెన్రీలు కుట్రపన్ని ఇంటర్ పోల్ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారని, అందుకు తగిన సాక్ష్యాదారాలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే చోక్సీని ఇండియాకు తీసుకొని రావడం కష్టతరంగా మారిందన్నారు. కిడ్నాప్ డ్రామా.. విఫలం అంటిగ్వా నుండి క్యూబాకు పారిపోవడానికి చోక్సీ కిడ్నాప్ డ్రామా ఆడి అందులో విఫలమైనట్లు రిజోక్ ఆ కథనంలో వివరించారు. 2021లో క్యూబా - భారత్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున విచారణ నుండి తప్పించుకునేందుకు క్యూబా పారిపోవాలని చోక్సీ భావించాడని నివేదికలో పేర్కొన్నాడు. మే 2021లో స్మగ్లర్ల సాయంతో పారిపోయే ప్రయత్నంలో చోక్సీ .. వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని, అందుకే వాళ్లు డొమినికాలో వదిలేశారని చెప్పారు. చదవండి👉 బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్ వన్! -
షాకింగ్ ఘటన: పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి 5 ఏళ్లు జైలు శిక్ష
ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేక కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరజ్‌పురకాలన్‌లోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రభాన్ సేన్ గెస్ట్ టీచర్ లక్ష్మీకాంత్ శర్మ అనే వ్యక్తిని పనిలో చేర్చుకునేందుకు రూ. 2 వేల రూపాయాలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాన్ సేన్‌ను దోషిగా తేల్చి.. ఐదేళ్ల జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 30 వేల రూపాయాలు జరిమాన కూడా విధించింది. సదరు గెస్ట్ టీచర్ శర్మ ఈ విషయమై జనవరి 6, 2015న లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజల్లోనే వారు వేసిన ప్లాన్‌లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఈ మేరకు న్యాయమూర్తి సిన్హా మాట్లాడుతూ...ప్రభుత్వ సేవకులు అవినీతికి పాల్పడటం అనేది సమాజంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. అందులోకి ఉపాధ్యాయుడు సమాజంలో కీలకమైన భాగం, పైగా అందరికీ మార్గదర్శి. అలాంటి వ్యక్తే అవినీతికి పాల్పడితే సమాజానికే చేటు అంటూ..సదరు ఉపాధ్యాయుడికి ఈ విధంగా శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: పక్కా ప్లాన్‌తో కిడ్నాప్..త్రుటిలో తప్పించుకున్న మహిళ) -
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై.. నోట్ల కట్టను నోట్లో పెట్టుకొని
సాధారణంగా కావాల్సిన పనులు తొందరగా జరగాలంటే అధికారులు లంచం డిమాండ్ చేయడం తెలిసిందే. ఇది కాస్తా ప్రస్తుతం లంచాలు ఇవ్వనిదే ఏ పని జరగదనే స్థాయికి వచ్చింది. అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు అయినా చివరికి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కూడా లంచాల బాట పడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి పట్టుబట్టాడు. అయితే తరువాత సదరు అధికారి చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే హర్యానాలోని ఫరీదాబాద్‌లో లంచం తీసుకుంటున్న పోలీస్‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గేదెల దొంగతనం కేసులో నిందితుడిపై చర్య తీసుకోవడానికి శుభనాథ్ అనే వ్యక్తి నుంచి సబ్-ఇన్స్పెక్టర్ మహేంద్ర పాల్ రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు అప్పటికే అధికారికి రూ.6 వేలు ఇచ్చాడు. అయితే తరువాత విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి నుంచి ఎస్సై లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. లంచగొండి పోలీస్ నుంచి డబ్బులు రికవరీ చేస్తుండగా.. అతడు వెంటనే ఎవరూ ఊహించని పనిచేశాడు. లంచం రూపంలో తీసుకున్న కరెన్సీ నోట్లను నోట్లో పెట్టుకుని మింగేశాడు. పోలీసు చర్యను అడ్డుకున్న అధికారులు వెంటనే అతను మింగిన డబ్బును బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఓ పోలీస్ అధికారి ఏకంగా నోట్లో వేళ్లు కూడా పెట్టాడు. కానీ పోలీస్ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఫలితం లేకుండా పోయింది. దీన్నంతటినీ ఓ వ్యక్తి ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పట్టుబడ్డ పోలీస్ నోట్లు మింగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిజంగా అతడు చేసిన పనితో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Inspector in Faridabad Haryana took Rs 10,000 as a bribe! Caught red-handed by Vigilance team. Sub-inspector also tried to swallow the money in front of the vigilance team and also manhandled them. pic.twitter.com/KoWanFElgf — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) December 13, 2022 A police sub-inspector in #Faridabad, #Haryana swallowed currency notes, to avoid being trapped by the vigilance team. Reportedly, the cop took a bribe from a person in exchange for initiating action on his complaint of buffalo theft.#SubInspector #MahenderPal #ViralVideo pic.twitter.com/oK3ZIIP2r3 — Hate Detector 🔍 (@HateDetectors) December 13, 2022 -
కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అనధికార వ్యక్తుల సంచారం అధికమైంది. వైద్య సిబ్బందిలాగా యూనిఫాం ధరించి వార్డులో తిరుగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రోగులు, వారి సహాయకులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి ఫిమేల్ వార్డుకు వైద్యపరీక్షల కోసం ఓ మహిళ వచ్చింది. ఆమెకు సహాయంగా వచ్చిన వృద్ధురాలిని డబ్బులు ఇవ్వాలంటూ యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వేధించారు. తన వద్ద డబ్బులు లేవంటూ వృద్ధురాలు బతిమిలాడినా వదిలిపెట్టలేదు. చివరికి వంద రూపాయలు ఇస్తానని వృద్ధురాలు చెప్పగా కనీసం రూ.150 ఇవ్వాలంటూ వేధించి మరీ తీసుకున్నారు. ఈ తతంగాన్ని కొందరు సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్‌గా మారింది. ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రి అధికారులను విచారణకు ఆదేశించారు. అయితే వైద్య సిబ్బంది ముసుగులో ఉన్న వ్యక్తులు ఆసుపత్రికి సంబంధించిన వారు కాదని, బయటి వ్యక్తులని అధికారులు తేల్చారు. వారిపై మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది నిత్యం పర్యవేక్షణలో నిమగ్నమై ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు, డ్రస్ కోడ్ ధరించి ఉండాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: (ఏపీ సంక్షేమ పథకాలకు లండన్ ఎంపీ కితాబు) -
అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్..
చండీగఢ్: పంజాబ్ మొహాలీలో ఓ మహిళా పోలీస్ అధికారి అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు రూ.20వేలు వసూలు చేసింది. స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఏఎస్ఐ డబ్బు తీసుకున్న దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఏఎస్ఐ పర్వీన్ కౌర్ లంచం తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీఎస్పీ దర్పణ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. విజిలెన్స్ బ్యూరో దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. పర్వీన్ కౌర్ పోలీస్ లైన్స్‌లో విధులు నిర్వహిస్తోంది. తనపై అత్యాచారం జరిగిందని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. నిందుతుడ్ని అరెస్టు చేయాలండే డబ్బు ఇవ్వాల్సిందేనని ఏఎస్ఐ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు డబ్బు ఇచ్చింది. చదవండి: ఈ డాక్టర్ టెన్త్ ఫెయిల్.. భారీగా ఫీజులు.. రోగం ముదిరిందంటే చాలు.. -
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఇన్చార్జి తహసీల్దార్
సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): లంచం తీసుకుంటూ ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు.. రామారెడ్డి ఇన్చార్జి తహసీల్దార్ మానస, ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా అన్నారం గ్రామానికి చెందిన రైతు బన్నం బలరాం నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్, ఇన్స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్‌లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్‌ను కలిశాడు. తన పెద్దమ్మకు ఎవరూ లేకపోవడంతో బాగోగులు తనే చూసుకునేవాడినని రెండేళ్ల క్రితం ఆమె మరణించడంతో ఆమె పేరిట ఉన్న 37 గుంటల భూమిని తన పేరు మీదకు మార్చాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్లైన్ ఫీజు రూ. 3వేలు, దాని తర్వాత లంచం రూపంలో రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేనని రైతు ఇన్చార్జి తహసీల్దార్ మానసను కలవగా.. రూ. 4వేలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టంలేక బలరాం నిజామాబాద్‌లోని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం బలరాం రూ. 4వేలు లంచం డబ్బులను ధరణి ఆపరేటర్ లక్ష్మణ్‌కు ఇస్తుండగా అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి విచారణ చేస్తున్నామని ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్‌పై చర్యలు ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు. -
కేసు నుంచి తప్పిస్తా.. కానీ ఖర్చవుతుంది: ఎస్ఐ మరో అవతారం!
యశవంతపుర(బెంగళూరు): కేసు నుంచి తప్పిస్తామంటూ భారీ మొత్తాల్లో లంచం తీసుకుంటూ బెంగళూరు ఉత్తర తాలూకాలోని చిక్కజాల ఎస్ఐ ప్రవీణ్‌తో పాటు కానిస్టేబుల్ రవిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. రవిని లోకాయుక్త అరెస్ట్ చేయగా ఎస్ఐ ప్రవీణ్ తప్పించుకున్నారు. వివరాలు... ప్రకాశ్ అనే ఒక కాంట్రాక్టర్‌పై చిక్కజాల పోలీసుస్టేషన్లో కేసు ఉంది. కేసుపై కోర్టులో చార్జిషీట్ వేయడంపై మాట్లాడడానికి ప్రకాశ్ మామ దేవరాజును కానిస్టేబుల్ రవి కలిశాడు. ప్రకాశ్‌ను కేసు నుంచి తప్పించాలంటే రూ. 3.70 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎస్ఐ ప్రవీణ్‌కు 3.50 లక్షలు, ఇద్దరు స్టేషన్ రైటర్లకు తలా రూ. 10 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉందన్నాడు. సరేనని దేవరాజు సదరు మొత్తాన్ని రవికి ఇచ్చాడు. కానీ కేసులో ఎలాంటి పురోగతి కనపడలేదు. దేవరాజు వెళ్లి రవిని కలిసి ఇదే అడిగాడు. మరో రూ. 5 లక్షలకు డిమాండ్ ఇది చాలా పెద్ద కేసు, మరో రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రకాశ్‌కు మరో షాక్ తగిలింది. డబ్బులు ఇవ్వని కారణంగా ఎస్ఐ ప్రవీణ్ కాంట్రాక్టరు కుటుంబానికి తక్షణం విచారణకు రావాలని నోటీసులు పంపాడు. తీవ్ర ఆక్రోశానికి గురైన దేవరాజు లోకాయుక్తను ఆశ్రయించాడు. రవి, ప్రవీణ్‌లు కలిసి దేవరాజును లంచం డబ్బుతో చిక్కజాల పోలీసుస్టేషన్ వద్దకు పిలిపించుకున్నారు. రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు తక్షణం రవిని అరెస్ట్ చేయగా ఎస్ఐ ప్రవీణ్ పరారయ్యాడు. ఫోన్లో ఏసీబీ అని వినబడడంతో రవి తప్పించుకోగలిగాడు. అతని కోసం గాలింపు చేపట్టారు. చదవండి: అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని.. -
కోళ్లు ఇస్తే.. కరెంట్ ఇస్తా.. విద్యుత్ సిబ్బంది నిర్వాకం
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి చిత్రంగ్‌పల్లి పంచాయతీ పరిధి 6 గ్రామాలకు గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరా లేదు. తుఫాను గాలుల ధాటికి కెసల్‌గూఢ, గుముకగూఢ, ఏంతాగూఢ, పూజారిగూఢ, తంగగూఢ, ఒరెల్‌గూఢ గ్రామాల్లోని విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీనిపై పలుమార్లు కలిమెల విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు అంగీకరించిన కొందరు సిబ్బంది.. లంచంగా కోళ్లు, వాహనం పెట్రోల్ ఖర్చులు ఇస్తేనే బాగు చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గ్రామాస్తులంతా కలిసి కలిమెల విద్యుత్‌శాఖ అధికారి పీకే నాయక్‌ను శుక్రవారం కలిసి, ఫిర్యాదు చేశారు. గత 2 నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్నామని, కరెంట్ లేకపోయినా రసీదు ఇచ్చి బిల్లు చెల్లించమంటున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన అధికారి.. ఘటనపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత మూడేళ్లుగా అవినీతి రహిత పాలన చేస్తున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు నవరత్నాల పథకాల్లో భాగంగా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అవినీతికి అడ్డాగా ఉన్న శాఖల్లో ఒకటైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో భూములు, స్థలాల క్రయ విక్రయదారుల నుంచి అధికారులతోపాటు దస్తావేజు లేఖర్లు వేలల్లో లంచాలు వసూలు చేసి వారి జేబులను ఖాళీ చేసేవారు. దీంతో ఆ శాఖలో అవినీతికి చెక్ పెట్టేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో కెమెరాల ఏర్పాటు వైఎస్సార్ జిల్లాలో కడప అర్బన్, కడప రూరల్, కడప చిట్స్, సిద్దవటం, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, వేంపల్లె, కమలాపురం, దువ్వూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలి, పుల్లంపేట, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, మదనపల్లె, పీలేరు, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు, తంబళ్లపల్లెలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయాలకు ప్రతిరోజు వచ్చి వెళ్లే వారిని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవినీతికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. చదవండి: (ఆర్ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే అంతే సంగతులు) వెబ్సైట్లో దస్తావేజు నమూనా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారంలో క్రయ విక్రయదారులు ఎక్కువగా దస్తావేజుల లేఖర్లను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో దస్తావేజు లేఖర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. వారితోపాటు కొంతమంది రిజిస్ట్రేషన్ సిబ్బంది కాకుండా బినామీలు కార్యాలయాలు తెరిచి తమ వారితో నిర్వహిస్తున్నారు. దీంతో దస్తావేజుల తయారీ సమయంలో లేఖర్లు చెప్పిందే వేదంగా అక్కడి వ్యవహారాలు నడిచేవి. క్రయ విక్రయదారులను లేఖర్ల బాధ నుంచి తప్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నమూనా దస్తావేజులను ఆ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు స్థిరాస్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో ప్రజలు లంచాల బారిన పడకుండా వారి సొంత గ్రామాల్లో వార్డుల పరి«ధిలోనే స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. అవినీతిపై ఫిర్యాదు చేయవచ్చు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బంది తీరుపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. లంచాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 14400 నంబరుకుగానీ, జిల్లా రిజిస్ట్రార్‌కుగానీ నేరుగా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – బి.శివరాం, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, కడప 14400 నంబరుతో ఫ్లెక్సీల ఏర్పాటు అవినీతికి అడ్డుకట్ట వేసేలా, అలాగే లంచగొండితనంపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన టోల్ ఫ్రీ నంబరు 14400పై ప్రజ లకు అవగాహన కలిగేలా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తొగుట ఎమ్మార్వో కృష్ణమోహన్
-
లంచం అడిగి అడ్డంగా దొరికాడు.. ఇంటికి వెళ్లి వస్తాను సార్ వదలండి!
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకుకుళం): కాశీబుగ్గ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం(కాశీబుగ్గ సర్కిల్)లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాడ లక్ష్మీపతి మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. రూ.8వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించిన వివరాల మేరకు.. కవిటి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యా పారి జీఎస్టీ నిబంధనల మేరకు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ప్రభుత్వం నుంచి రూ.82 వేలు రిఫండ్ రావాల్సి ఉందని తెలుసుకున్నారు. ఏప్రిల్ నెలలో తన రిటర్న్స్ చూసు కుని రూ.82వేలు అందాల్సిందిగా నిర్ధారించుకు ని తనకు రావాల్సిన నగదు కోసం కాశీబుగ్గ జీఎస్టీ కార్యాలయం, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న బాడ లక్ష్మీపతిని సంప్రదించారు. అయితే ఈ ఫైలు ముందుకు పంపించాలంటే తనకు రూ.10వేలు లంచం ఇవ్వాలని లక్ష్మీపతి డిమాండ్ చేశారు. ఆ వ్యాపారి లంచం ఇవ్వడం ఇష్టం లేక మూడు నెలలుగా తనకు రావాల్సిన రిఫండ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా రు. అయితే ఎంతకూ ఫైలు ముందుకు కదలకపోవడంతో శ్రీకాకుళంలోని అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ వ్యాపారి జూనియర్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి రూ.10వేలు ఇవ్వలేనని రూ.8వేలు ఇస్తానని చెప్పారు. ఫోన్ పే చేయాలని లక్ష్మీపతి సూచించగా.. అలా చే యకుండా ఏసీబీ అధికారులు చెప్పినట్లు మంగళవారం జూనియర్ అసిస్టెంట్ చాంబర్లోకి వెళ్లి రూ.8వేలు ఇచ్చారు. సరిగ్గా అదే సమయానికి అక్కడే మాటు వేసి ఉన్న డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ బృందం అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ మేరకు వ్యాపారి నుంచి వాంగ్మూలం తీసుకొని జూనియర్ అసిస్టెంట్‌ను విచారించి అక్కడున్న పెండింగ్ ఫైల్స్ పరిశీలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మిపతిని అరెస్టు చేశామని, బుధవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ప్రకటించారు. ఇంటికి వెళ్లి వస్తాను.. విడిచి పెట్టండి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 20వ వార్డు శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాడ లక్ష్మీపతికి 2013లో వివాహం జరగ్గా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తండ్రి జీఎస్టీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో తండ్రి ఉద్యోగం ఆయనకు 2017 లో వచ్చింది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన తర్వాత లక్ష్మీపతి ఇంటికి వెళ్తానంటూ, ఇంటి వారితో ఫోన్లో మాట్లాడతానంటూ ఏసీబీ అధికారులను కోరగా.. వారు దానికి అనుమతి ఇవ్వలేదు. వాంగ్మూలం తీసుకున్నాక కారులో తరలించారు. -
కొడుకు శవం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్.. బిక్షమెత్తిన తల్లిదండ్రులు
పాట్నా: ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఏ కార్యాలయాల్లోనైనా పని జరగాలంటే చేతులు తడపాల్సిందే! జరిగే పని తొందరగా జరగాలన్నా కొంతమంది అవినీతి అధికారులకు డబ్బు ధార పోయాల్సిందే. కాసుల కోసం కక్కుర్తి పడే అంటువంటి లంచావతారులు చివరకు మనుషుల ప్రాణాల విషయంలోనూ తగ్గడం లేదు. పరిస్థితులు, ఆర్థిక స్థోమతను కూడా అర్థం చేసుకోకుండా బాధితుల నుంచి డబ్బులను రక్తంలా పిండుకుంటున్నారు. తాజాగా మార్చురీ నుంచి కుమారుడి మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేని తల్లిదండ్రులు భిక్షాటన శారు. గుండెలు పిండిసే ఈ ఘటన బిహార్‌లో జరిగింది. సమస్తిపూర్ తాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహేష్ ఠాగూర్ దంపతులకు సంజీవ్ అనే కుమారుడు ఉన్నాడు. మానసిక వికలాంగుడైన సంజీవ్ అదృశ్యమయ్యాడు. అయితే జూన్ 6న కొడుకు మృతదేహం సమస్తిపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. కన్నీరుమున్నీరవుతూనే కొడుకు మృతదేహాన్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. మృతదేహం తమ కొడుకుదే అని నిర్ధారించుకొని ఇంటికి తీసుకెళ్లేందుకు అధికారులను సంప్రదించారు. मानवता शर्मसार, फिर भी #NitishKumar जी का सुशासन का दावा बरकरार!! https://t.co/E3eV3aSOjV — Prashant Kishor (@PrashantKishor) June 9, 2022 అయితే పోస్టుమార్టం సిబ్బంది నాగేంద్ర మల్లిక్ అనే వ్యక్తి మృతదేహాన్ని అప్పగించడానికి రూ. 50 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు వృద్ద జంట వద్ద లేకపోవడంతో బిక్షాటన ఎత్తుకోవటం ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ జోలెపట్టి అడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమస్తిపూర్ సదార్ హాస్పిటల్ ఉన్నతాధికారులకు ఈ విషయం చేరింది దీంతో తక్షణమే యువకుడి డెడ్‌బాడీని అతని ఇంటికి పంపించేశారు. ఈ వీడియోను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ట్విటర్లో షేర్ చేశారు. మానవత్వానికి సిగ్గుచేటు నితీష్ కుమార్ ప్రభుత్వ పాలను ఇది నిదర్శనమంటూ మండిపడ్డారు. మరోవైపు ఈ విషయంపై సమస్తిపూర్ సివిల్ సర్జన్ మాట్లాడుతూ.. సిబ్బంది డబ్బులు అడగొచ్చు కానీ, రూ. 50,000 అయితే డిమాండ్ చేసి ఉండకపోవచ్చని అన్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది లంచం అడగడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ఈ వీడియో వైరల్‌గా మారడంతో మృతదేహాన్ని ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఉద్యోగులపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్ ! -
పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు
సనత్‌నగర్: విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తామంటూ లంచం తీసుకున్న ఏఈతో పాటు లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ భాస్కర్‌రెడ్డి మూసాపేటలోని ఓ భవనానికి 20 విద్యుత్ మీటర్ల కోసం గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. సనత్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ అవినాష్, లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద్ రెడ్డిలు రేపు మాపు అంటూ భాస్కర్‌రెడ్డిని తిప్పించుకుంటున్నారు. డబ్బులు ముట్టజెబితేనే పని అవుతుందని కరాఖండీగా చెప్పారు. ఏఈకి రూ.25,000, లైన్ ఇన్స్పెక్టర్కు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేక ఈ నెల 18న ఏఈకి రూ.10,000, 19న లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు రూ.3,500ను భాస్కర్‌రెడ్డి ఇచ్చారు. దీంతో కేవలం ఐదు మీటర్లను మాత్రమే వారు మంజూరు చేసి మిగతా మీటర్లను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన డబ్బులు కూడా ఇస్తేనే మీటర్లను మంజూరు చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక భాస్కర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సనత్‌నగర్‌లోని విద్యుత్ ఏఈ కార్యాలయంలో అవినాష్‌కు రూ.10,000, కృషానంద్‌రెడ్డికి రూ.4,000ను ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇరువురు అధికారులను అరెస్టు చేసి ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లకు చెందిన కూకట్పల్లి, బోరబండలలోని వారి ఇళ్లలో సోదాలు కొనసాగించారు. (చదవండి: ఫోనొచ్చింది ఆపండహో!) -
Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది
హైదరాబాద్: ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన ఓ వైద్యుడిపై నేరుగా వెళ్లి మరీ చర్యలు తీసుకున్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం డిమాండ్ చేస్తున్నారని కొందరు బాధితులు మంత్రి హరీష్‌రావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీలకు వెళ్లిన ఆయన.. వివరాలు తెలుసుకుని సదరు డాక్టర్‌పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి అంతా పరిశీలించి.. పేషెంట్లతో మాట్లాడారు. మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce — Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022 -
నరకం చూస్తున్న సామాన్యుడు.. సచ్చినా.. మారరా..?
గోల్కొండ: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఆ కల సాకారం కావాలంటే మాత్రం నరకం చూడాల్సిందే.. ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మొదలు.. నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులకు లంచాలు ముట్టజెప్పాల్సిందే.. లేదంటే అడుగడుగునా ఇబ్బందులు తప్పవు.. అడిగినంతా ఇచ్చుకుంటే ఇక ఆ ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైంది అన్ని శాఖల అధికారుల తీరు. దీంతో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న ప్రజలు బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ ఏ అధికారికి ఎంత ముట్టజెప్పాలో తెలిసిన బిల్డర్లు లంచాలు వారికి అందించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోవడం లేదు. ♦ అక్రమ నిర్మాణానికి డ్రైనేజీ లైన్ వేయాలన్నా.. తాగునీటి పైప్‌లైన్ అయినా.. ట్రాన్స్ఫార్మర్, మీటర్లు ఇలా ఏది కావాలన్నా బిల్డర్లు అధికారుల జేబుల్లో డబ్బులు కుక్కి.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ లైన్ నుంచి ఇష్టానుసారంగా అక్రమ కనెక్షన్లు ఇస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ♦ నిర్మాణాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అడ్డుగా ఉండే వాటిని ప్రైవేటు వ్యక్తులు పక్కకు తరలించే అవకాశం కల్పిస్తున్నారు. డబ్బులిచ్చుకో.. పనులు చేసుకో.. అంటూ బిల్డర్లకు, భవన యజమానులకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ♦ 10 రోజుల క్రితం తేజ కాలనీలో ఓ బిల్డర్లు తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరో ప్రదేశానికి తరలిస్తుండగా విద్యుదాఘాతానికి ఓ కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ నిర్లక్ష్యంలో విద్యుత్ శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ♦ పెద్దపెద్ద ప్రమాదకరమైన పనులను దినసరి కూలీలతో చేయిస్తున్నా.. అధికారులు మొద్దు నిద్ర వదలకపోవడంపై స్థానిక కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచాలు ముడితే చాలు ప్రాణాలు పోయినా పట్టించుకోరా..? అని ప్రశి్నస్తున్నారు. ♦ నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లంచాలు ఇవ్వకపోతే ఒక్క అధికారి కూడా పని చేయడం లేదు. డబ్బులు ఇచ్చే వరకు ఫైల్ పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఇంకా కొందరు అధికారులు సొంత పనులపైనే దృష్టి పెడుతున్నారు. ♦ అయ్యా.. సారూ.. అంటూ వారి చుట్టూ తిరుగుతున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారు. మీటింగులు, విజిట్ అంటూ సొంత పనుల కోసం తిరుగుతున్నారు. కొంత మంది బిల్డర్లు, గుత్తేదారులు ఫోన్లోనే మాట్లాడుకొని ముడుపులు వారి వద్దకే పంపడంతో పనులు చకచకా సాగిపోతున్నాయి. ♦ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారు అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి. దీంతో విసిగిపోయి చాలామంది బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ♦ అన్ని శాఖల్లో ఇదే విధానం కొనసాగుతోంది. తాగునీటి కనెక్షన్, డ్రైనేజీ లైన్ కావాలంటే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు డబ్బులు ఇవ్వాల్సిందే.. విద్యుత్ మీటర్ కోసం క్షేత్రస్థాయి సిబ్బందికి లంచాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. డబ్బులు ఇస్తే ఎలాంటి అక్రమాలైనా.. సక్రమాలవుతున్నాయి. ♦ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు మార్చడానికి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. అయితే కాలనీల్లో బిల్డర్లు వీటిని పాటించడం లేదు. దీని వల్ల స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ♦ పలుమార్లు విద్యుత్ స్తంభాలు వేయడానికి, మార్చడానికి బిల్డర్లు నిబంధనలకు వ్యతిరేకంగా దినసరి కూలీలను పెట్టుకుని పనులు కానిస్తున్నారు. తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి మార్చడానికి ఓ వ్యక్తి పది రోజుల క్రితం ఓ కూలీలను నియమించుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా పనులు కొనసాగించాడు. దీంతో ఆ కూలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. -
పుస్తెలమ్మి.. లంచం ఇమ్మంటుండ్రు.. డబుల్ బెడ్రూం అక్రమాలపై గొంతెత్తిన మహిళ
సిరిసిల్ల టౌన్: ‘ఓట్లప్పుడు మాలాంటి గరీబోళ్లకు డబుల్ బెడ్రూం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేసిండు. అదే ఆశతో ఉంటున్నాం. కానీ.. సిరిసిల్లలో అధికారులు లంచాలు ఇస్తేనే పని చేస్తున్నారు. డబుల్బెడ్రూం ఇల్లు కోసం పుస్తెలు అమ్మి లంచం ఇవ్వాలని వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన నందగిరి మల్లిక మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్యను నిలదీసింది. మల్లిక వివరాల మేరకు.. అధికారులు స్థానిక కమ్యూనిటీ హాలులో డబుల్బెడ్రూం ఇళ్ల అర్హుల లిస్టును మంగళవారం ప్రకటించారు. లిస్టులో మల్లిక కుటుంబం పేరు లేదు. దీంతో దివ్యాంగుడైన తన భర్త పేరు లిస్టులో రాలేదని, తాము ఏ రకంగా అర్హులం కాదని మల్లిక వేదికపై ఉన్న కమిషనర్ వెల్దండి సమ్మయ్యను నిలదీసింది. ‘మా ఆయనకు ఒక చేయి పూర్తిగా పనిచేయదు. నేను ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పాచిపని చేసి ఇద్దరు పిల్లలతో పాటు అత్తను పోషిస్తున్న. పదమూడేళ్లుగా పద్మనగర్లోనే కిరాయికి ఉంటున్నం. డబుల్బెడ్రూం కోసం గంపెడాశతో దరఖాస్తు చేసుకున్న. ఆర్పీల ముందే ఇద్దరుసార్లు వచ్చి పార్కులో కూర్చుని రూ.లక్ష లంచం అడిగిండ్రు. అవే ఉంటే డబుల్బెడ్రూం ఇండ్లకోసం ఎందుకు దరఖాస్తు చేసుకుంటా? ఇప్పుడు లిస్టులో పేరు తీసేసిండ్రు. మాకు ఎక్కడా జాగలు, సొంతిల్లు లేవు. పుట్టింటి, అత్తింటి ఆస్తులు కూడా లేవు. ఏ విచారణకైనా సిద్ధం. మేము ఏవి«ధంగా అర్హులము కాదో చెప్పండి. నాకు న్యాయం కావాలి’ అంటూ వేదికపై తన బాధను వెలిబుచ్చింది. మల్లిక ఒక్కతే కాదు.. పద్మనగర్ వార్డుసభలో జాబితాలో పేర్లు రానివారి రోదనలు మిన్నంటాయి. అర్హులైన తమ పేర్లు లిస్టులో లేకపోవడమేంటంటూ వారు అధికారులు, ప్రజా ప్రతినిధులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోళ్లను లంచాలు అడిగి ఏం బాగుపడుతారంటూ వాపోయారు. దీంతో చివరకు అర్హులైన పలువురి పేర్లను డ్రాలో వేయించడానికి మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య అనుమతించారు. -
కౌన్సిలర్ భర్తా మజాకా..! అక్రమ నిర్మాణాల్లో ఆ వార్డు నెం.1
అతనో మాజీ వార్డు సభ్యుడు, ఆ ప్రాంతం పై గట్టిగా పట్టు ఉంది. అంతకు మించి ఆయన ఇంట్లో ప్రస్తుతం అధికారం ఉంది. దీంతో ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. భార్య పదవిని అడ్డుపెట్టుకొని అక్రమంగా యథేచ్ఛగా అక్రమాలను పోత్సహిస్తున్నాడు. ఇదీ ఓ కౌన్సిలర్ భర్త బాగోతం. అతడి అక్రమ దందా తన వార్డులోనే కాకుండా మున్సిపాలిటీలోని మిగిలిన 15 వార్డుల్లోనూ కొనసాగిస్తున్నాడు. ఏ వార్డుల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్ట వచ్చు అని బిల్డర్లు ముందుగా భరత్సింగ్ను సంప్రదిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సాక్షి,శామీర్‌పేట్: శామీర్‌పేట మండల రెవెన్యూ పరిధి, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి గ్రామాలను కలుపుతూ పంచాయతీ ఉన్న తూంకుంటలో మరి కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ తూంకుంట కేంద్రంగా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉండటమే కాకుండా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, కరీంనగర్ – హైదరాబాద్ రాజీవ్ రహదారి ఉండటంతో ఇక్కడి భూములకు ఊహించని రీతిలో రెక్కలొచ్చాయి. ఇదే స్థాయిలో పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, విల్లాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన తూంకుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ పూజ భర్త భరత్‌సింగ్ అనుమతులు లేని నిర్మాణ యజమానులకు అండగా ఉంటూ కోట్లు దండుకుంటున్నాడు. అక్రమ నిర్మాణాలు ఇక్కడే అధికం.. తూంకుంట మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. కానీ అన్ని వార్డులతో పోలిస్తే ఈ ఒక్క వార్డులోనే 90 శాతం అక్రమ నిర్మాణాలు వేలిశాయి. దీనికి కారణం లేకపోలేదు. 1వ వార్డు కౌన్సిలర్ భర్త భరత్‌సింగ్ తూంకుంట గ్రామపంచాయతీ ఉన్నప్పుడు వార్డు సభ్యుడు. దీంతో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు, కల్వర్టులు ఉన్నాయనేది పూర్తిగా తెలుసు. అంతేకాకుండా అధికారులకు ఎలాంటి ముడుపులు అప్పజెప్పాలి, అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు ఎలా చేపట్టాలనేవి పూర్తిగా తెలిసుండటంతో ఇతడి కనుసన్నల్లో మూడు షాపింగ్ కాంప్లెక్సులు.. ఆరు భవంతులుగా అతడి అక్రమ దందా కొనసాగుతోంది. ► ప్రభుత్వ స్థలాలు, నాలాలను కాపాడాల్సిన పదవిలో భార్య ఉండగా భర్త భరత్‌సింగ్ మాత్రం వాటిని కబ్జా చేసి నగదును సొమ్ము చేసుకుంటున్నాడు. ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకొని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ►ఇటీవల ఉప్పరిపల్లిలోని 2వ వార్డులో సైతం స్థానిక కౌన్సిలర్‌కు ఫోన్ చేసి అన్నా.. వాళ్లు మనవాళ్లే.. నీకు నేను ఉన్నా.. చూసుకుంటా.. వాళ్ల ను ఇబ్బంది పెట్టకు అంటూ మ« ద్యవర్తిత్వం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ►1వ వార్డులో ఉన్న కల్వర్లులు, ప్రభుత్వ పార్కులు సైతం కబ్జాకు గురయ్యాయి. తూంకుంట నుంచి దేవరయాంజాల్‌కు వెళ్లే దారిలో కల్వర్టును సైతం మూసివేసి నిర్మించిన కట్టడాల వెనుక ఇతని పూర్తి సహకారం ఉన్నట్లు సమాచారం. ►అలాగే కరీంనగర్–హైదరాబాద్ రాజీవ్ రహదారికి ఆనుకొని ప్రభుత్వ పార్కు స్థలంలో ఓ వ్యాపారం కొనసాగుతుంది. ఈ స్థలాన్ని వాడుకున్నందుకు భరత్సింగ్కు ఏటా నగదు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భరత్‌సింగ్ ఆగడాలతో అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తోటి ఉద్యోగులతో బాహాటంగానే చెప్పుకుంటున్నారు. చదవండి: TS Inter 1st Year Result: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్ -
అవినీతి కేసులో డీఎస్పీ జగన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని నుంచి లంచం డిమాండ్ చేసి, కొంత మొత్తం తీసుకున్న కేసులో డీఎస్పీ గ్యార జగన్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు బుధవారం ప్రకటించారు. ఈయనతో పాటు హెచ్ఎండీఏలో ఔట్ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బి.రామును సైతం కటకటాల్లోకి పంపారు. కొన్ని రోజుల క్రితం వరకు హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీఎస్పీగా పని చేసిన జగన్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్నారు. ఈ లంచం వ్యవహారం అప్పట్లోనే చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన బొమ్మిన కోటేశ్వరరావు ప్రజాపతి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సంస్థ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ విషయంలో చూసీ చూడనట్లు పోవడంతో పాటు సహకరించడానికి జగన్ రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరారు. కోటేశ్వరరావు ఈ మొత్తాన్ని జూన్ 11న రాము ద్వారా జగన్‌కు ఇచ్చారు. మిగిలిన మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా జగన్ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. తన వద్ద ఉన్న ఆధారాలతో పాటు జగన్, రాములతో జరిగిన ఫోన్ సంభాషణల వివరాలనూ అందించాడు. చదవండి: రైళ్లలో పూజలు చేసుకోవచ్చు కానీ.. దీంతో జగన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఏసీబీ అధికారులు రెండు నెలల క్రితమే వలపన్నారు. ఇది కార్యాచరణలోకి వచ్చేసరికి జగన్ హెచ్ఎండీఏ నుంచి బదిలీ అయ్యారు. బాధితుడు అందించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం హబ్సిగూడలోని జగన్ ఇంటిపై దాడి చేసి అతడిని, అనంతరం సెక్యూరిటీ గార్డు రామును అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. నిందితులను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. చదవండి: గాడిద పాలకు మంచి డిమాండ్.. కప్పు పాల ధర ఎంతంటే.. -
Bribe: కదిరి తహశీల్దార్ ఆడియో వైరల్.. కలెక్టర్ సీరియస్
అనంతపురం అర్బన్: కదిరి తహసీల్దారు మారుతిపై కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను కదిరి తహసీల్దారు స్థానం నుంచి రిలీవ్ చేస్తూ..కలెక్టరేట్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు తహసీల్దారు లంచం అడుగుతున్నట్లుగా వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కదిరి ఆర్డీఓ ద్వారా ప్రాథమిక విచారణ చేయించారు. ఆర్డీఓ ఇచ్చిన నివేదికపై కలెక్టర్ సంతృప్తి చెందలేదు. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ అధికారి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు
సాక్షి,డిండి(నల్గొండ): నేరేడుగొమ్ము మండలం చర్లపల్లి తండాకు చెందిన బాలికతో పెద్దఅడిశర్లపల్లి మండలం గడ్డమీది తండాకు చెందిన బాలుడు ప్రేమ పేరుతో ఇరువురు సఖ్యతగా ఉన్న ఫొటోలు తీసి సదరు బాలిక బంధువులు, మిత్రుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో డిండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆ బాలుడిపై 164 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా బాలుడి తండ్రి అభ్యర్థన మేరకు కేసు మాఫీ చేయించేందుకు సీఐడి. వెంకటేశ్వర్లు రూ.లక్ష డిమాండ్ చేసినట్లు గత నెల 19వ తేదీన సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో వైరల్ అయ్యింది. దీనిపై 20వ తేదీన సాక్షి దినపత్రికలో ‘సీఐపై అవినీతి ఆరోపణలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎస్పీ రంగనాథ్ సీఐపై విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగానే మంగళవారం సీఐ వెంకటేశ్వర్లును వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: అయ్యా.. ఇక మాకు దిక్కెవరు? -
రాజస్తాన్ సీఎంకు టీచర్ల షాక్.. ‘అవును మేం లంచం ఇచ్చాం’
జైపూర్: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఊహించని ఇబ్బందికర పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చింది. బదిలీలు, కొత్తగా పోస్టుల కోసం తాము స్థానిక ఎమ్మెల్యేలతో పైరవీలు చేయించుకుని, డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందంటూ సాక్షాత్తూ సీఎం పాల్గొన్న సభలో పలువురు టీచర్లు ఆరోపణలు చేశారు. టీచర్ల ఆరోపణలపై స్పందించిన సీఎం గహ్లోత్.. ఇది నిజమేనా అంటూ ప్రశ్నించగా ఊహించని విధంగా ‘అవును..మేం ముడుపులు ఇచ్చుకున్నాం..’అంటూ సభికుల నుంచి సమాధానం వచ్చింది. దీంతో నిశ్చేష్టుడైన గహ్లోత్.. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ హామీ ఇచ్చారు. ‘బదిలీల కోసం ఉపాధ్యాయులు లంచాలు ఇవ్వాల్సి రావడం దురదృష్టకరం. ఇందుకు సంబంధించి త్వరలో ఒక విధానాన్ని ప్రకటిస్తాం’ అంటూ ప్రకటించారు. ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కూడా గోవింద్ దోతస్రా కూడా ఉండటం గమనార్హం. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. -
ఏసీబీ వలలో ఎలక్ట్రికల్ ఏఈ.. రూ.2లక్షలు లంచం తీసుకుంటూ
అనకాపల్లి టౌన్: లేబర్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఏఈ శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. జిల్లా ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ వీవీఎస్ఎస్ రమణమూర్తి అందించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది ఏఈగా మహేశ్వరరావు పనిచేస్తున్నారు. బిల్లులను క్లియర్ చేసేందుకు నర్సీపట్నానికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ పైలా రమణ నుంచి మహేశ్వరరావు రూ.3.20 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే.. రమణ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రం ఏఈ మహేశ్వరరావు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ దుకాణం వద్ద రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్లుల మొత్తానికి మహేశ్వరరావుకు 5 శాతం చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు డీఎస్పీ తెలిపారు. ఏఈని శనివారం విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.లక్ష్మణమూర్తి, రమేష్, సతీష్, కిశోర్‌కుమార్, పి.శ్రీనివాసరావు, వి.విజయకుమార్ పాల్గొన్నారు. -
‘సెక్రెటరీ నా దగ్గరకు వచ్చి రెండు సంతకాలు చేస్తే 300 కోట్లు వస్తాయన్నాడు’
న్యూఢిల్లీ: తన జీవితంలో అవినీతితో ఎప్పుడూ రాజీ పడలేదని అటువంటి పరిస్థితే వస్తే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధపడినట్లు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. కాగా సత్యపాల్ మాలిక్ ఆగష్టు 21, 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. సంవత్సరం తరువాత అక్టోబర్ 2019లో గోవాకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మేఘాలయకు గవర్నర్‌గా పని చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను జమ్మూ కాశ్మీర్‌కు పోస్ట్ అయిన వెంటనే, తన టేబుల్‌పై రెండు ఫైళ్లు వచ్చాయని తెలిపారు. అవి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆరెస్సెస్‌తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థలవి. కాకపోతే అందులో ఏదో స్కామ్ ఉందని తనకు తెలిసిందని, అందుకు ఆ రెండు ఒప్పందాలను రద్దు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ ఫైల్‌లను క్లియర్ చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన సెక్రటరీ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ఒత్తిళ్లు వస్తాయని కూడా కొందరు తెలపడంతో ఆ పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ విషయాన్నే అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలియజేయగా, తన నిర్ణయాన్ని ప్రధాని సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. मेघालय के राज्यपाल प्रधानमंत्री की पोल खोल रहे हैं. जरूर देखा जाए pic.twitter.com/QnwQUiU8VK — Ranvijay Singh (@ranvijaylive) October 21, 2021 -
చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా
తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పదేళ్లుగా పాతుకుపోయిన చిరుద్యోగి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే దిగజారుడు స్వభావం బట్టబయలవుతోంది. సదరు చిరుద్యోగి తన పబ్బం గడుపుకునేందుకు అధికారులను డబ్బుతో ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విలాసాలను రుచి చూపించి వశం చేసుకోవడం.. చిన్న అవసరాలను తీర్చి ఆకట్టుకోవడం.. వ్యక్తిగత విషయాలను సైతం తనతో పంచుకునేలా నమ్మకం సంపాదించుకోవడం.. వలలో చిక్కని వారిని ముగ్గులోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ తర్వాత వారిపై అవినీతిపరులనే ముద్ర వేసి మానసిక వేదనకు గురిచేస్తాడు. దొంగ వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. చివరికి నయానో.. భయానో తన దారికి తెచ్చుకుని అక్రమార్జనకు మార్గంసుగమం చేసుకుంటాడు. ఇదీ ‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన చిరుద్యోగి ‘చీకటి బాగోతం’ . సాక్షి, తిరుపతి: అక్రమాలనే ఆదాయ వనరుగా మార్చుకున్న తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ చిరుద్యోగి లీలలు అన్నీఇన్నీ కావు. పదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన ఆయన ప్రమేయం లేనిదే ఒక్క రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి ఏర్పడింది. చిల్లర కోసం సదరు చిరుద్యోగి వేస్తున్న చీకటి వేషాలపై కార్యాలయం సిబ్బందే కథలు కథలుగా చెబుతున్నారు. ఉన్నతాధికారులపైనే పెత్తనం చెలాయిస్తున్న ఆయన వైఖరిపై విస్తుపోతున్నారు. పథకం ప్రకారం ప్రలోభం తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి చిరుద్యోగే సర్వం సరç్ఛౌరా చేస్తుంటాడు. అందరితోనూ చనువుగా మసలుకుంటుంటాడు. అందరి అవసరాలను తానే తీరుస్తుంటాడు. తద్వారా తన అవినీతికి ఎవరూ అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. బదిలీపై వస్తున్న అధికారులను సైతం ముందుగానే ఫోన్ లో సంప్రదించి తిరుపతిలో అన్నీ తానే అని నమ్మిస్తాడు. వారికి కావాల్సిన పనులన్నీ చేసిపెట్టి తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. ఒకవేళ వచ్చిన అధికారి వలలో చిక్కకుంటే మరింత దారుణంగా వ్యవహారం నడిపిస్తాడు. ఏదో ఒక ఫంక్షన్ పేరు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి ఆహారం, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపేస్తాడు. మత్తులోకి జారుకున్న అధికారిపైకి వేశ్యలను ఉసిగొల్పి నగ్న వీడియోలను చిత్రీకరిస్తాడు. కొద్దిరోజుల తర్వాత ఆ అధికారికి వీడియోలు చూపించి బ్లాక్‌మెయిలు చేస్తాడు. ఇక చేసేది లేక నిజాయితీపరులైన అధికారులు సైతం చిరుద్యోగికి అనుకూలంగా మారిపో తారు. అప్పటి నుంచి ఆ అధికారి ఉన్నన్ని రోజులు యథేచ్ఛగా అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతాడు. డబ్బుకు లొంగే అధికారులైతే చిరుద్యోగి మరింత దారాళంగా వ్యవహరిస్తాడు. నెలకు ఎంత కావాలి అని డీల్ కుదుర్చుకుంటాడు. ( చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు ) ఒకేసారి ఏడాదికి ఇవ్వాల్సిన సొమ్మును ముట్టజెప్పి మొత్తం కార్యాలయాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగని అధికారులపై లేనిపోని నిందలు మోపి విస్తృతంగా ప్రచారం చేయిస్తాడు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారితో యథాలాపంగా మాట్లాడుతున్న అధికారుల వీడియోలను ఫోను లో చిత్రీకరించి అవినీతి మరకను అంటిస్తాడు. చిరు ద్యోగి బారిన పడి పలువురు అధికారులు మానసి క క్షోభకు గురై తిరుపతి నుంచి బదిలీ చేయిం చుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. ఎవరితో కలవ కుండా తమ పని తాము చేసుకుని వెళ్లే అధికారులను సైతం చిరుద్యోగి వదిలిపెట్టడం లేదని పలు వురు సిబ్బంది తెలియజేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఓ అధికారి ఒంటరిగా కూర్చుని మద్యం తాగుతున్న వీడియోను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని మరికొందరు అధికారులను బెదిరింనట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రచారం సాగుతోంది. -
సారు పేరులోనే ‘లక్ష్మీ’ కళ.. వసూళ్లలో డిఫరెంట్ స్టైల్
సాక్షి, అనంతపురం: ఆయన పేరులోనే ‘లక్ష్మీ’ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహారశైలీ ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందం. పొరుగు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన కొన్నాళ్లకే అక్రమ వసూళ్లకు తెర లేపారు. ఏకంగా అక్రమ మద్యం సరఫరాదారులతో సమావేశం ఏర్పాటు చేసి.. నెల వారీ మామూళ్లు ఫిక్స్ చేశారు. ప్రభుత్వం విడతల వారీగా మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటుండగా.. అందుకు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) హిందూపురం సీఐ లక్ష్మీ దుర్గయ్య మాత్రం భిన్నంగా వెళ్లారు.సర్కారు లక్ష్యానికి తూట్లు పొడిచేలా అక్రమ వసూళ్లకు దిగారు. ఈ విషయం తెలిసి కంగుతిన్న ఉన్నతాధికారులు ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. లక్ష్మీదుర్గయ్య ఎక్సైజ్ శాఖలో సీఐగా పని చేసేవారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. సెబ్ ఏర్పాటుతో అందులో విలీనమయ్యారు. సెబ్ సీఐగా కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టులో పనిచేస్తూ.. ఈ ఏడాది జూన్ 15న హిందూపురానికి బదిలీపై వచ్చారు. పని రాక్షసుడనే పేరున్న ఈయన మామూళ్లు వసూలు చేయడంలోనూ దిట్ట అని తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పనిచేసిన సమయంలో అప్పటి మద్యం సిండికేట్‌దారుల నుంచి డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. అయితే.. పంచలింగాల చెక్‌పోస్టులో పనిచేసిన సమయంలో విస్తృత తనిఖీలు నిర్వహించి, పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడం గమనార్హం. అనతికాలంలోనే వసూళ్ల పర్వం ఆంధ్ర–కర్ణాటక సరిహద్దున ఉండే హిందూపురంలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడటం లేదు. బెంగళూరు, బాగేపల్లి, చిక్‌బళ్లాపుర తదితర ప్రాంతాల నుంచి కొందరు కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరి ఆగడాలను కట్టడి చేయాల్సిన సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే వసూళ్ల బాట పట్టారు. అక్రమ మద్యం సరఫరాదారులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ మామూళ్లు నిర్ధారించడం కలకలం రేపింది. తక్షణమే చర్యలు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారే వారితో చేతులు కలిపారని సమాచారం అందుకున్న సెబ్ ఉన్నతాధికారి రామమోహన్ రావు తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. ఆయన్ను విధుల నుంచి తప్పించి.. జిల్లా ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆయనపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అనంతరం చర్యలు తీసుకునే అవకాశముంది. చదవండి: రాహుల్ హత్య: చార్జర్ వైర్‌తో చంపేశారు -
‘అరెస్ట్ కాకుండా మీకెంత కావాలి? పోలీసులకు హీరోయిన్ ఆఫర్
ముంబై: ఈ ఏడాది ప్రారంభం నుంచి బాలీవుడ్‌ను పలు కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్ కేసు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ అగ్రనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వెబ్‌సిరీస్, సినిమాలు తీశారనే ఆరోపణలతో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులతో మరికొందరికి సంబంధాలు ఉన్నాయనే వార్తలు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. అయితే ఈ రాకెట్ ఆనవాళ్లు ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉన్నాయి. పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఓ హీరోయిన్ పోలీసులకు లంచం ఇవ్వజూపారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో హీరోయిన్ గెహన వశిష్ట్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో ‘నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాల్నో చెప్పండి’ అని పోలీసులకే ఆఫర్ ఇచ్చారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక చివరగా రూ.15 లక్షలు ఇస్తాను అని గెహన పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుందని దర్యాప్తులో తేలింది. అయితే లంచం పోలీసులే డిమాండ్ చేశారని గెహన ఆరోపిస్తోంది. ఈ కేసు విషయంలోనూ ఇద్దరితో వాట్సప్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారే యశ్ ఠాకూర్ అలియాస్ అర్వింద్ కుమార్ శ్రీవాస్తవ, తన్వీర్ హష్మీ. వీరితో ఈ కేసు విషయమై చాటింగ్ చేసింది. పోలీసులు లంచం అడగడంతో వారిద్దరూ కలిపి రూ.8 లక్షల వరకు సమకూర్చగలరని ఆ చాటింగ్‌లో ఉంది. గెహనా నటించిన మూడు అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలతో రాజ్‌కుంద్రాకు చెందిన కంపెనీలో ఉన్న వ్యాపారవేత్త కాస్త నిర్మాతగా మారిన వ్యక్తికి సంబంధం ఉంది. -
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు..
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు.. ప్రసవం చేస్తే వేలకు వేలు గుంజేస్తున్నారు.. సొమ్ము ఇవ్వలేని నిరుపేదలను నీచంగా చూస్తున్నారు.. మాటలతోనే మనసును కుళ్లబొడుస్తున్నారు.. మానవత్వం మరిచి.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిబ్బందే, రాబందులై ప్రజలను పీక్కుతింటున్నారు. చిత్తూరు రూరల్: చిత్తూరు నగరంలోని జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం అధిక సంఖ్యలో పేదలే వస్తుంటారు. సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడువాసులు కూడా ప్రసవం కోసం ఇక్కడికే వస్తుంటారు. రోజుకు సగటున 25 నుంచి 30 కేసులు డెలివరీ కోసం వస్తుంటాయి. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది అదేపనిగా డబ్బులు దండుకుంటున్నారు. వసూళ్లు ఇలా.. ప్రసూతి విభాగంలో ఉదయం, రాత్రి, అత్యవసరమైతే మధ్యాహ్న వేళల్లో ప్రసవం కోసం ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఇక్కడ సిబ్బందిలో కొందరు బిడ్డను చూపించిన వెంటనే కాసులు అడుగుతున్నారు. అది కూడా రూ.1000 లేదా రూ.2000 అనుకుంటే పొరబాటే. ఏకంగా రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణులు, తమిళనాడు వాసులను టార్గెట్ చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆపరేషన్ అయిన వెంటనే బెడ్‌పైకి మార్చాలని, క్లీనింగ్ పేరు చెప్పి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. పురిటినొప్పులే నయం.. చిత్తూరు ఆస్పత్రికి ప్రసవానికొచ్చే వారికి పురిటినొప్పుల కంటే.. అక్కడ పనిచేసే సిబ్బంది తీరుతో పడే ఇబ్బందులే అధికం అంటే అతిశయోక్తి కాదేమో. వారు అడిగిన డబ్బులిస్తే పని చేస్తారు. లేకుంటే డబ్బు కోసం పీడిస్తారు. ఇచ్చే వరకు దుర్భాషలాడుతారు. ఆ మాత్రం డబ్బులు ఇవ్వలేనివాళ్లు ఎందుకొచ్చారంటూ.. తీవ్రంగా అవమానిస్తారు. డబ్బులిచ్చే వరకు జలగల్లా పట్టుకుంటారు. వారిని అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. ►4 పలమనేరుకు చెందిన కోకిల(19) కాన్పు కోసం తమిళనాడులోని వేలూరులో అరుకంబడి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో గతవారం చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఇక్కడ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డ జన్మించింది. అయితే బిడ్డను చేతిలో పెట్టగానే ఆస్పత్రి సిబ్బంది కోకిల తల్లిని రూ.20 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.10 వేలు గుంజేశారు. బిడ్డను ఏమైనా చేస్తారేమో అని భయపడి డబ్బు ఇచ్చామని బాధితురాలు కంటతడి పెట్టింది. ►4 తిరుత్తణికి చెందిన అనిత(25) ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరి, ఆదివారం డిశ్చార్జ్ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యుల వద్ద కూడా సిబ్బంది రూ.10 వేలు లాగేశారు. అడిగినంత ఇస్తేనే.. మీ బిడ్డను బయటకు తెస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ మాత్రం ఇవ్వలేని వారు మీకెందుకు బిడ్డలంటూ హేళన చేశారు. బాధితులు చేసేది లేక అప్పుచేసి.. వారికి అడిగినంతా ముట్టజెప్పారు. -
బంగారంతో టాయిలెట్.. బయట పడ్డ బండారం..!
లంచం వ్యవస్థకు పట్టిన ఓ చీడ. పురుగు పట్టిన చెట్టు క్షీణించనట్టే.. అవినీతి వల్ల పేదవాడు.. మరింత పేదరికంలోకి జారుకుంటాడు. రోజంతా కష్టపడితే పూట గడిచే బతుకులు ఓ వైపు.. బల్ల కింద చేతులు పెట్టి కోట్లకు పడిగెత్తే వారు మరోవైపు. ఈ డబ్బు మనుషుల మధ్య ఎన్నో వ్యత్యాసాలను సృష్టిస్తుంది. మాస్కో: రష్యాలో ఓ ట్రాఫిక్ పోలీసు అధికారిపై అవినీతి ఆరోపలు వచ్చాయి. దీనిపై పరిశోధన చేపట్టిన రష్యా అధికారులకు విస్తుపోయే అనుభవం ఎదురైనది. పోలీసు అధికారి అవినీతి సొమ్ముతో ఏకంగా గోల్డెన్ టాయిలెట్‌ను కట్టించాడు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని దక్షిణ స్టావ్రోపోల్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు అధికారి కల్ అలెక్సీ సఫోనోవ్.. వ్యాపారాలకు నకిలీ అనుమతులు జారీ చేసినందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రష్యా అధికారులు విచారణ చేపట్టారు. అతడితో పాటు మరో 35 మంది అధికారులు ఓ ‘మాఫియా ముఠా’ నడుపుతున్నట్లు గుర్తించారు. అయితే అవినీతి అధికారి ఇంటికి సంబంధించిన ఫోటోలు, సీసీ ఫుటేజ్ వీడియో లీక్ అయ్యాయి. ఈ వీడియోలో ఓ పెద్ద భవనంలో విలాసవంతమైన గదులు, అతి ఖరీదైన వస్తువులతో అలంకరణలు, బిలియర్డ్స్ హాల్, బంగారు బిడెట్, సింక్, బంగారు మరుగుదొడ్డి ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ వీడియాలో తెగ వైరలవుతోంది. ప్రతిపనికి అవినీతే! ఈ ముఠా కొన్ని సంవత్సరాలు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్ నంబర్ ప్లేట్లు, కార్గో పర్మిట్ల నుంచి ఇసుక డెలివరీల వరకు ప్రతిదానికి అవినీతికి పాల్పడుతున్నట్లు వినికిడి. దీనికి సంబంధించి 35 మందికి పైగా ట్రాఫిక్ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు యునైటెడ్ రష్యా పార్టీలోని ఎంపీ అలెగ్జాండర్ ఖిన్షెయిన్ అన్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా రెండు లక్షల యాభై ఐదు వేల డాలర్లు దోచుకున్నట్లు సమాచారం. ఇక సఫోనోవ్ దోషిగా తేలితే 8 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. -
ఏసీబీ వలలో కాటారం తహశీల్ధార్
సాక్షి, భూపాలపల్లి: కాటారం తహశీల్దార్ మేడిపల్లి సునీత 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐత హరికృష్ణకు చెందిన కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు-3 లో భూమికి ఆన్లైన్ చేసి, పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు తహశీల్దార్ డిమాండ్ చేశారు. చివరకు రూ. 2 లక్షలు తీసుకుంటూ సునీత.. ఏసీబీ అధికారులకు చిక్కారు. -
పోలీసులకు రాజ్‌కుంద్రా భారీ లంచం?
-
పోలీసులకు రాజ్‌కుంద్రా భారీ లంచం? ఎందుకంటే..
ముంబై: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా లీలలు.. అక్రమాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులకు రాజ్‌కుంద్రా భారీగా లంచం ఇచ్చాడని తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పోలీసులకు ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యశ్ ఠాకూర్ పోలీసులకు పంపిన ఓ మెయిల్లో ఆరోపించారు. హాట్ హిట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా రాజ్ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మార్చిలోని ఏసీబీకి పంపిన ఈమెయిల్లో తెలిపారు. తాజాగా ఈమెయిల్‌ను ఏసీబీ పోలీస్ కమిషనర్‌కు పంపింది. అయితే ఈ విషయంపై ముంబై పోలీసులు స్పందించడం లేదు. ఈ ఆరోపణలతోనే అంధేరిలోని రాజ్‌కుంద్రా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అమెరికాకు చెందిన ఫ్లిజ్ మూవీస్ సంస్థకు సీఈఓగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ ఏసీబీకి ఈమెయిల్ చేశారు. ఈ సంవత్సరం మార్చిలో ఏసీబీ ముంబైలోని సంస్త కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రూ.4.5 కోట్లు ఉన్న రెండు బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. అయితే ఇదే కేసులో అప్పట్లో రాజ్‌కుంద్రా అరెస్ట్ కాకుండా రూ.25 లక్షలు ఇచ్చారని, మీరు కూడా అంతే మొత్తం ఇస్తే అరెస్ట్ చేయమని ఓ పోలీస్ రాయబారం చేసినట్లు ఈమెయిల్లో అరవింద్ తెలిపారు. మరిన్ని విషయాలపై సుదీర్ఘ లేఖ ఈమెయిల్ ద్వారా పంపారు. వాటి వివరాలు బయటకు రాలేదు. -
లంచం ఇస్తే కేసు పెట్టనన్నాడు.. ఏసీబీ వలలో పడ్డాడు
సాక్షి,పెద్దేముల్( వికారాబాద్): ఏసీబీ అధికారుల వలకు పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్ చిక్కారు. ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు చేయకుండా వదిలేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని మంబాపూర్కు చెందిన నర్సింలు, శేఖర్‌కు చెందిన ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుండగా ఇటీవల పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్ సీజ్ చేశారు. గత నెల 23న ఒక ట్రాక్టర్, ఈనెల 5న మరో వాహనాన్ని పట్టుకున్నారు. ఈ విషయంలో మంబాపూర్ ఎంపీటీసీ యాలేటి శ్రీనివాస్ ట్రాక్టర్లను వదిలేయాలని ఎస్ఐ చంద్రశేఖర్‌ను సంప్రదించారు. రూ.50 వేలు ఇస్తే కేసు నమోదు చేయకుండా ట్రాక్టర్లను వదిలేస్తానని ఎస్ఐ స్పష్టం చేశారు. దీంతో ఎంపీటీసీ ఈనెల 11న రూ.20 వేలను ఎస్ఐ చంద్రశేఖర్‌కు ముట్టజెప్పారు. మిగతా డబ్బులను మరోరెండు రోజుల్లో సమకూరుస్తానన్నారు. ఎస్ఐ చంద్రశేఖర్ అవినీతి వే«ధింపులను తాళలేక ఎంపీటీసీ శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు ఎస్ఐ చంద్రశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఏసీబీ అధికారులు రెండు రోజులుగా మాటు వేశారు. మంగళవారం ఉదయం ఎంపీటీసీ శ్రీనివాస్‌కు కెమికల్స్‌ను కలిపిన నగదు ఇచ్చి పంపించారు. ఉదయం నుంచి ఎస్ఐకి డబ్బులు ఇవ్వాలని ప్రయతి్నంచారు. సాయంత్రం సమయంలో అనువైన సమయం దొరకడంతో ఎంపీటీసీ ఠాణాలో ఉన్న ఎస్ఐ వద్దకు వెళ్లి రూ.30 వేలను అందించారు. అక్కడే మాటు వేసి ఉన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ బృందం వెంటనే పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. అయితే, కొంతకాలంగా ఎస్ఐ భూ వివాదాలు, ఇసుక, మట్టి అక్రమ రవాణా విషయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఠాణాకు వచ్చే వారి నుంచి డబ్బులు తీసుకున్నారని మండలవాసులు చెబుతున్నారు. సమాచారం ఇవ్వండి పట్టుకుంటాం అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ప్రజలు సమాచారం అందించాలని ఏసీబీ డీసీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. అధికారులు డబ్బుల కోసం డిమాండ్ చేస్తే 9440446140 నంబర్లో సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి లంచావతారులను పట్టుకుంటామన్నారు. -
ఏసీబీకి అడ్డంగా దొరికిన మియాపూర్ ఎస్సై
సాక్షి, మియాపూర్: స్టేషన్ బెయిల్ మంజూరు చేయిస్తానని, మరో వ్యక్తి పేరును కేసులో లేకుండా చూస్తానని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు మియాపూర్ సెక్టార్– 2 ఎస్ఐ యాదగిరి. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. మియాపూర్‌నకు చెందిన షేక్ సలీమ్ పుమా కంపెనీకి చెందిన బ్రాండెడ్ దుస్తులను విక్రయిస్తుంటాడు. వీటితో పాటు ఈ కంపెనీ పేరు వాడుకొని నకిలీ దుస్తులు కూడా అమ్ముతున్నట్లు మియాపూర్ పీఎస్‌లో వారం రోజుల క్రితం సదరు కంపెనీ యజమానులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో షేక్ సలీమ్‌తో పాటు అతని దుకాణంలో పనిచేస్తున్న మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి షేక్ సలీమ్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు అతని షాపులో పనిచేసే ఉద్యోగి పేరు కేసులోంచి తొలగించేందుకు మియాపూర్ సెక్టార్– 2 ఎస్ఐ యాదగిరి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ నెల 3న ఎస్ఐ యాదగిరి రూ.10 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20 వేలు మంగళవారం పోలీస్ స్టేషన్లో షేక్ సలీమ్ తీసుకుంటుండగా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ బృందం పట్టుకున్నారు. ఎస్ఐని అదుపులోకి తీసుకొని రూ.20 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. ఎస్ఐ యాదగిరి అక్రమ ఆస్తులపై దృష్టి సారించారు. మియాపూర్‌లోని వీడియో కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేశారు. -
చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చోడవరం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. భూమి మార్పిడి పేరిట నాలుగు లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఏసీబికి అడ్డంగా దొరికొపోయారు. వీరికి సహకరించిన డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చోడవరం సమీపంలోని నరసాపురం వద్ద ఓ వ్యవసాయ భూమిని నివాసభూమి గా మార్చేందుకు ఓ వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ పనులు చేయకుండా ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది జాప్యం చేశారు. ఈ దశలో దరఖాస్తుదారుడు ఎమ్మార్వో రవికుమార్‌తో పాటు డిప్యూటీ తాసిల్దారు రాజాను కలిసి భూముల రికార్డుల మార్పిడి చేయాలని కోరాడు. ఈ పని పూర్తి చేయాలంటే నాలుగున్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తాసిల్దారు డ్రైవర్ రమేష్ కు ఇవ్వాలని తెలిపారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సదరు వ్యక్తి వారి సూచనల మేరకు డ్రైవర్ రమేష్‌కు నాలుగున్నర లక్షల రూపాయలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వారి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్ర పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దారు, డ్రైవర్ : విశాఖ
-
వీడియో తీయడంతో అడ్డంగా బుక్కైన వసూల్ రాజాలు
సాక్షి, చెన్నై : వాహనాల నుంచి డబ్బు వసూలు చేస్తున్న పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. సేలం జిల్లా ఓమలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సెల్వమణి, ప్రత్యేక ఎస్ఐ సెల్వమణి ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి విమానాశ్రయం కార్గో నుంచి వచ్చే వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. శుక్రవారం యూనిఫాం కూడా ధరించకుండా ప్రైవేటు వాహనంలో వచ్చి వాహనాల తనిఖీ చేపట్టారు. కార్గో నుంచి బయటకు వచ్చిన ఓ లారీని ఆపేశారు. అన్ని పేపర్లు ఉన్నాయని, చూడాలని డ్రైవర్ చెప్పినా ఇన్స్పెక్టర్ వినలేదు. డబ్బు ఇచ్చి కదలాలని ఆదేశించారు. ఈ దృశ్యాన్ని క్లీనర్ తన సెల్ ద్వారా వీడియో తీసి ట్రాన్స్‌పోర్టు సంస్థకు పంపించాడు. అక్కడి సిబ్బంది ఆ ఇన్స్పెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. అలాగే జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు శనివారం వీడియో, ఆడియోను పంపించారు. వారిని డీఐజీ మహేశ్వరి సస్పెండ్ చేశారు. చదవండి: యూట్యూబర్ మదన్‌కు రిమాండ్ -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జగిత్యాల ఎస్సై.. వెక్కి వెక్కి ఏడుస్తూ
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జగిత్యాల ఎస్సై.. వెక్కి వెక్కి ఏడుస్తూ
సాక్షి, జగిత్యాల: బెయిల్ మంజూరుకు ఓ వ్యక్తి నుంచి జగిత్యాల పట్టణ ఎస్సై రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణం విద్యానగర్ ప్రాంతానికి చెందిన బెజ్జారపు అఖిలకు గత డిసెంబర్ 28న మెట్పల్లి పట్టణం చైతన్యనగర్‌కు చెందిన బెజ్జారపు శివ ప్రసాద్‌తో వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అఖిలను భర్తతో పాటు మామ భూమయ్య, అత్త నాగమణి, బావ రాజేశ్, ఆడబిడ్డ భాగ్య వేధించగా, బాధితురాలి సోదరి కట్ట మౌనిక పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. మార్చి 30న అప్పటి ఎస్సై శంకర్‌నాయక్ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి బెయిల్ ఇచ్చారు. అయితే ఇటీవల పట్టణ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శివకృష్ణ, బాధితులకు ఫోన్ చేసి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కేసులో ఎ–4 గా ఉన్న బెజ్జారపు రాజేశ్ రూ. 30వేలు ఇచ్చేలా ఎస్సైతో ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బాధితుడు రాజేశ్ గురువారం మధ్యాహ్నం డబ్బుతో జగిత్యాల పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఎస్సై శివకృష్ణకు ఫోన్ చేయగా, తన డ్రైవర్ రవికి ఇవ్వాలని చెప్పాడు. డ్రైవర్ రవికి రూ.30 వేలు ఇస్తుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ ద్రయ్య, సీఐలు రాము, సంజీవ్, రవీందర్, తిరుప తి, సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే ఉన్న ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడితో ఎస్సై ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఏసీబీ డీఎ స్పీ మాట్లాడుతూ, ఎస్సై శివకృష్ణ ఓ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైనా తిరిగి రిమాండ్‌కు పంపుతానని బెదిరించి రూ.50 వేలు డి మాండ్ చేశాడని, ఒప్పందం ప్రకారం బాధితులు ఎౖ స్సె డ్రైవర్‌కు రూ.30 వేలు ఇస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎస్సైతో పాటు రవిని కరీంనగర్ ఏసీ బీ కా ర్యాలయానికి తరలించి విచారణ పూర్తి చేసి శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. అయితే, పట్టుబడ్డ అనంతరం ఎస్సై విపరీతంగా బాధ పడ్డారు. తన పరువు పోతుందని ఏడ్చేశారు. బల్లపై ముఖం దాచుకొని మరీ వెక్కివెక్కి ఏడ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్సై ఇంట్లో సోదాలు.. ఏసీబీకి పట్టుబడిన ఎస్సై శివకృష్ణ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కొన్ని విలు వైన వస్తువులతో పాటు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చదవండి: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ -
లోన్‌యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్‌యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. లోన్‌యాప్స్ ఎండీ దగ్గర నుంచి ఈడీ అధికారి లంచం తీసుకున్నట్లు తేలింది. ఈడీ అధికారిగా పనిచేస్తున్న లలిత్ బజార్డ్ అనే వ్యక్తి బెంగళూరులో రూ. 5లక్షల లంచం తీసుకున్నారు. లంచం తీసుకున్న సదరు అధికారి సీసీఎస్ అధికారులు ఫ్రీజ్ చేసిన ఖాతాలను తెరిపించే ప్రయత్నం చేశాడు. బెంగళూరులోని ఓ బ్యాంకులో లావాదేవీలు జరిగినట్లు తేలింది. కాగా ముంబైకి చెందిన అపోలో ఫైన్‌వెస్ట్ ఎండీ దగ్గర నుంచి లలిత్ లంచం తీసుకున్నారు. బెంగళూరులోని పలు బ్యాంక్‌లకు లలిత్ తప్పుడు పత్రాలు ఇచ్చి డబ్బులు రిలీజ్ చేయించారు. కాగా ఈడీ అధికారి బాగోతంపై హైదరాబాద్ పోలీసులు సీబీఐకి సమాచారం ఇవ్వడంతో బెంగళూరులో లలిత్ బజార్డ్‌పై కేసు నమోదు చేశారు. -
మంత్రి మల్లారెడ్డి ఆడియో క్లిప్ వైరల్
-
మీకిస్తే సరిపోతుందా .. పొట్టు పొట్టు జేస్తా
సాక్షి, హైదరాబాద్: ‘మహేందర్... 50 ఎకరాల వెంచర్ నడుస్తోంది... సర్పంచ్‌కిస్తే సరిపోతుందా... పొట్టు పొట్టు చేస్తం.. వాడిని బిచ్చం అడుగుతవా... మంత్రిని కలువు అని’ అంటూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, హైదరాబాద్ శివార్లలోని ఓ సర్పంచ్ భర్తను బెదిరించినట్టుగా భావిస్తున్న ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను కలిసే వరకు వెంచర్ ఆపేయాలంటూ మంత్రి చేసినట్టుగా ఉన్న ఆ ఆడియోలోని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. మంత్రిపై చర్యలు తీసుకో వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా అసలు ఆ ఆడియోలోని వాయిస్ తనది కానేకాదని మల్లారెడ్డి ఖండించారు. ఈ ఆడియో ఉదం తంతో నగర శివార్లలో జరుగుతున్న రియల్ వసూళ్ల పర్వం మరోసారి తెరపైకి వచ్చింది. శివార్లలో వెంచర్ పడిందంటే చాలు ప్రజా ప్రతినిధులు గద్దల మాదిరి వాలిపోయి సాగి స్తున్న వసూళ్ల దందా సంచలనం సృష్టిస్తోంది. ఆదాయ వనరులుగా వెంచర్లు రాజధాని చుట్టూ స్థిరాస్తి రంగం ఊపందుకుని రెండు దశాబ్దాలు కావస్తోంది. గత 20 ఏండ్లుగా శివారు భూములపై లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ క్రమంలో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న వెంచర్లు ప్రజా ప్రతినిధులకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. చోటా నేతల నుంచి బడా లీడర్ల వరకు ఇదే దందా సాగిస్తున్నారు. ఇందులో వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, మంత్రులు సైతం ఉంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘లైన్’లోకి వస్తే సరే.. లేదంటే వెంచర్లు వెలియగానే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు.. రియల్టర్లపై సాగించే బెదిరింపుల పర్వం అంతా ఇంతా కాదు. లేఅవుట్ పడగానే సదరు సంస్థ లేదా డెవలపర్‌ను ‘లైన్’లోకి తీసుకుంటారు. అంతా సవ్యంగా సాగి తాము అనుకున్నది ముడితే ఓకే... లేదంటే ఆ డెవలపర్‌కు చుక్కలు కనబడాల్సిందే. భూమి అమ్ముకోలేని పరిస్థితుల్లో అడిగినంత సమర్పించుకుంటే కానీ అడుగు ముందుకు పడదు. సదరు నేత స్థాయిని బట్టి.. వెంచర్‌ను బట్టి, సదరు ప్రజాప్రతినిధి స్థాయిని బట్టి రియల్ వసూళ్లు చేతులు మారుతుంటాయి. కనీసం రూ.10వేల నుంచి మొదలయ్యే ఈ తతంగం కొన్నిసార్లు ‘కోట్లు’ దాటుతాయి. లేఅవుట్ వేసిన భూమిలో ఏవైనా లోపాలుంటే వాటిని ఎత్తిచూపుతూ బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా కొందరు వెనుకాడడం లేదనే ఆరోపణలున్నాయి. వారు అడిగినంత ఇస్తే ఏ లోపం ఉన్నా, నిబంధనలేవీ పట్టించుకోక పోయినా అటువైపు ఎవరూ కన్నెత్తి చూడరు. లేదంటే కష్టాలు తప్పవని స్థిరాస్తిరంగ వ్యాపారి ఒకరు వాపోయారు. అనుమతులకు అదనం ప్రజాప్రతినిధుల దందాకు తోడు వెంచర్ నిర్వాహకులకు అధికారిక అనుమతులు కూడా భారంగా మారుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటే సదరు వెంచర్‌ను నిర్దేశిత రుసుముతో అనుమతించాలి. నిబంధనల ప్రకారం లేని దరఖాస్తును తిరస్కరించాలి. కానీ స్థానిక సంస్థలైనా, స్వయం ప్రతిపత్తిగల సంస్థలైనా.. అందులో పనిచేసే అధికారులు, సిబ్బంది రియల్ డబ్బులకు ఆశ పడుతున్నారు. నిబంధనల మేరకు ఉన్నా, లేకపోయినా వారికి సంబంధం లేదు. వారి వాటా వారికి ముట్టాల్సిందే. అడిగింది ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో అనుమతుల జారీలో జాప్యం చేస్తారనే భయంతో వెంచర్ నిర్వాహకులు కూడా ముందే ముట్టజెప్పేస్తున్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), డీటీసీపీ నుంచి అనుమతి పొందిన లేఅవుట్లను కూడా పురపాలికల సిబ్బంది, పాలకవర్గం వదలడం లేదనే ఆరోపణలున్నాయి. సిండికేట్‌గా మారి అన్ని అనుమతులున్న లేఅవుట్లలోనూ వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. ‘తూముకుంట మునిసిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 333 పార్ట్, 361 పార్ట్ గల భూమిలో 4 ఎకరాల 28 గుంటలలో హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకొని లేఅవుట్ వేశారు. హెచ్ఎండీఏ నుంచి ఫైనల్ లేఅవుట్ కూడా వచ్చింది. అయితే మున్సిపాలిటీకి ఒక శాతం ఇంపాక్ట్ ఫీజు కడదామని వెళితే తీసుకోవట్లేదు. లక్షల్లో ఇస్తేగానీ చేసేదే లేదని తెగేసి చెప్పారు. వినకపోతే మీ లేవుట్‌లో అభివృద్ధి సరిగా లేదని, రోడ్లు బాగాలేకున్నా...ఎలా అనుమతి ఇచ్చారంటూ హెచ్ఎండీఏకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారు. ఓవైపు హెచ్ఎండీఏకు రూ.70 లక్షల ఫీజు కట్టి అనుమతి తెచ్చుకుంటే...వీళ్లేమో ఫిర్యాదు చేస్తామంటూ వ్యాపారానికి అడ్డంకిగా మారుతున్నారు. ఇలాచేసి అధికారిక లేఅవుట్ అనుమతులు తీసుకునే బదులు, అనధికారికంగా లేఅవుట్ చేసి స్థానిక సంస్థలకు రూ.20 లక్షలు ముట్టచెబితే మా వ్యాపారం సజావుగా సాగేలా ఉంది..’ అని రియల్టర్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయేది ప్రజలే.. రియల్టర్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ప్రభుత్వ సిబ్బంది... ఇలా ఎవరి చేతుల నుంచి ఇంకెవరి చేతుల్లోకి డబ్బులు వెళ్లినా ఆ భారమంతా చివరకు సాధారణ ప్రజలే మోయాల్సి వస్తోంది. వెంచర్ వేసే స్థలం కొనుగోలుకు అదనంగా గజానికి రూ.250 ఖర్చు పెడితే డెవలప్ చేసి కొనుగోలుదారులకు అమ్మవచ్చు కానీ, తాము కొన్న దానికంటే రెండింతలు అదనంగా ధర నిర్ణయించి రియల్ వ్యాపారులు సదరు స్థలాలను ప్రజలకు అంటగడుతుండటం గమనార్హం. ఇదీ సంభాషణ మల్లారెడ్డి: హలో మహేందర్ మహేందర్ (బొమ్మరాసిపేట్ సర్పంచ్ భర్త): సార్ నమస్కారం సార్ మల్లారెడ్డి: 50 ఎకరాల వెంచర్ నడుస్తోంది, సర్పంచ్‌కు ఇస్తే సరిపోతదా, కలెక్టర్‌కు జెప్పి వాడిని పొట్టుపొట్టు జేస్తా మహేందర్: సార్ సార్ మాకు ఇంతవరకూ కలవలేడు సార్, నేను పోయిన సార్, వెంచర్ అతను కలవలేదు. మల్లారెడ్డి: వాడ్ని పట్టుకరర్రి వయా, మీకు కలిసేదేంది. ఈడ ఎమ్మెల్యే ఉన్నడు, మంత్రి ఉన్నడు. మహేందర్: అవును సార్, మొన్న పోయిన సార్ అతను కలువలేడు మల్లారెడ్డి: వాడు ఎవడాడు, వాడు కలుసుడేంది.. వాణ్ణి బిచ్చం అడుగుతవా.. మంత్రిని కలువు, వాడ్ని కలువు అని. హాస్పిటల్ అని, స్కూల్ అని దేనికో ఇవ్వాలెగా. లేకుంటే పొట్టుపొట్టు చేసి ఇడిశిపెడ్తం. మహేందర్: సార్ సార్ నేను తప్పకుండా తీసుకొని వస్త సార్. మల్లారెడ్డి: ఎప్పుడు తెస్తవ్. మహేందర్: అతనికి యాక్సిడెంట్ అయిందంట సార్, హాస్పిటల్లో ఉన్నడు సార్. మల్లారెడ్డి: వాడు రాడు. వచ్చేదాకా వెంచర్ పనులు ఆపేసేయ్ మను. మహేందర్: ఓకే సార్. నిరూపిస్తే రాజీనామా చేస్తా ఆ ఆడియో టేపులో ఉన్నది నా వాయిస్ కాదు. నా గొంతును వేరొకరు అనుకరించారు (మిమిక్రీ). ప్రస్తుతం నగరంలో మిమిక్రీ చేసేవాళ్లు ఎక్కువయ్యారు. ఎవరినీ బెదిరించాల్సిన అవసరం నాకు లేదు. ఈ వెంచరే కాదు, ఏ వెంచర్ల వద్ద నుంచి నేను ఒక రూపాయి కూడా అడగలేదు. తీసుకోలేదు. ఎవ్వరైనా ఇచ్చినట్లు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నాకే వందల ఎకరాల భూములు ఉన్నాయి. సరిపడా డబ్బులు ఉన్నాయి. వేరేవాళ్ల భూములు, డబ్బులు నాకు అవసరం లేదు. వాయిస్ రికార్డుపై దేనికైనా సిద్ధమే. దీనిపై విచారణకు ఆదేశిస్తాం. ప్రజలకు సేవ చేయటానికి నేను రాజకీయాల్లోకి వచ్చా. విద్యాసంస్థలు పెట్టి విద్యార్థులను ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారు చేస్తున్నా. ప్లేస్మెంట్లు నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నా. – చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చదవండి: శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి -
ఏసీబీ వలలో రెవెన్యూ చేప!
పాల్వంచరూరల్: కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.3,500 లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ మోహన్ చక్రవర్తి పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కోట అరుణ్‌సాయి ఫ్యామిలీ మెంబర్ల సర్టిఫికెట్ కోసం గత ఫిబ్రవరి 12న మీ సేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు స్పందించడంలేదు. సర్టిఫికెట్ ఇవ్వాలంటే కొంత ముట్టజెప్పాలంటూ జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ మోహన్ చక్రవర్తి వేధించాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ( ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆనంద్‌కు రూ.3,500 లంచం ఇచ్చాడు. అప్పటికే నిఘావేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఆనంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఖమ్మం ఇన్చార్జి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. దాడిలో ఖమ్మం ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ తహశీల్‌లో పెచ్చుమీరుతున్న అవినీతి పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల అవినీతి రోజురోజుకూ మితిమీరిపోతోంది. లంచం ఇవ్వనిదే ఏపనీ చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్ట్‌లో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో యానంబైల్‌కు చెందిన ఓ మహిళ కల్యాణలక్ష్మి పథకం మంజూరు కోసం వీఆర్వో పద్మను సంప్రదించగా.. రూ. 10 వేలు డిమాండ్ చేసింది. విసిగిపోయిన బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వీఆర్వో సదరు మహిళ నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇతను ఇసుక ట్రాక్టర్లదారుల నుంచి అధిక మొత్తంలో డిమాండ్ చేస్తూ, భారీగా అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
ఏసీబీకి చిక్కిన ఏఈ.. పంచాయతీరాజ్‌లో కలవరం
సాక్షి, ఆదిలాబాద్: రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్‌రూరల్ ఏఈ చంద్రశేఖర్ ఏసీబీకి పట్టుబడిన వ్యవహారం పంచాయతీరాజ్ శాఖలో కలకలం కలిగిస్తోంది. నడి రోడ్డు మీదా కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అధికారి దొరికిపోయాడు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసుల్లో రూ.2 లక్షలు పట్టుబడటం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016– 17 సంవత్సరంలో రెబ్బెన తహసీల్దార్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయితే ప్రస్తుత వ్యవహారంలో ఒక్క ఏఈకే సంబంధం ఉందా.. పర్సంటేజీ రూపంలో మిగితా అధికారులకు ముట్టాల్సిన రుక్కం కూడా ఉందా అన్న చర్చ సాగుతోంది. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో ప్రతీ పనికి సంబంధించిన బిల్లు మంజూరులో కింది నుంచి పైస్థాయి వరకు నిర్ధారిత పర్సంటేజీ ఉండడమే దీనికి కారణం. ఏసీబీ విచారణలో ఈ వ్యవహారం కూడా బయటకు వస్తుందా అనేది వేచిచూడాల్సిందే. అనేక పద్దులు.. కోట్ల విలువైన పనులు పంచాయతీరాజ్ శాఖలో అనేక పద్దుల్లో కోట్ల రూపాయల విలువైన పనులు జిల్లాలో నడుస్తున్నాయి. పద్దుల పరంగా గమనిస్తే.. జెడ్పీ జనరల్ ఫండ్, నాబార్డు, ఎస్ఎఫ్సీ, సీఆర్ఆర్, పీఎంజీఎస్‌వై, సీబీఎఫ్, ఎంపీ ల్యాడ్స్, సీడీపీ నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైకుంఠధామాలు, రైతు వేదికలు కూడా ఈ శాఖ ఆధ్వర్యంలోనే ఉంటాయి. రోడ్లు, భవనాల నిర్మాణ పనులు జోరుగా సాగుతుంటాయి. అయితే ఈ శాఖలో క్షేత్రస్థాయి నుంచి పై అధికారుల వరకు పర్సంటేజీల రూపంలో ప్రతీ పనిలో నిర్ధారిత మొత్తం బిల్లు చెల్లించే ముందు కాంట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. ఇందులో పని విలువపై క్షేత్రస్థాయిలో అధికారులకు 5శాతం, డివిజన్ స్థాయి అధికారులకు 3 శాతం, జిల్లా స్థాయి అధికారులకు 2 శాతం కాంట్రాక్టర్ల నుంచి నేరుగా ముడుతాయి. దొరక్కపోతే పర్సంటేజీ.. దొరికితే లంచం అన్నట్టు.. ప్రస్తుతం ఏసీబీ దాడితో అంత పెద్ద మొత్తం లంచమా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతున్నప్పటికీ ఈ శాఖలో ఇది ‘మామూలే’. -
75 వేలు లంచం: సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: లంచం తీసుకున్న కేసులో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరాచారి, జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డిలను ఏసీబీ అరెస్టు చేసింది. గిడ్డంగుల సంస్థలో గ్రేడ్–1 మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన బానోత్ సుందర్‌లాల్‌కు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే రూ.75 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కరాచారి, సుధాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బుధవారం సుందర్‌లాల్ రూ.75 వేల నగదును సుధాకర్‌రెడ్డికి ఇచ్చాడు. అక్కడే మాటేసిన అధికారులు తొలుత సుధాకర్‌రెడ్డి.. ఆ తర్వాత భాస్కరాచారిని అరెస్టు చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ జడ్జి ముందు నిందితులను ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు ఏసీబీ అధికారులు ఇద్దరు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఘటనపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘బాధితుడు సుందర్‌లాల్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 6 నెలలుగా తిప్పించుకుంటున్నారు. రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. సుందర్‌లాల్ గతంలో కరీంనగర్లో ఏసీబీ కేసులో ఉండటంతో దానిని కారణంగా చూపి, అతని ఫైల్ ముందుకు సాగనివ్వలేదు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి..’అని ఆయన సూచించారు. -
కాంట్రాక్టుల కోసం రూ.కోటి లంచం
న్యూఢిల్లీ: కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్‌కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్స్ట్రక్షన్) మహేందర్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్(ఐఆర్ఎస్ఈ) 1985 బ్యాచ్‌కు చెందిన చౌహాన్‌ను అస్సాం రాజధాని గువాహటిలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే లంచం చేరవేసిన ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి భూపేంద్ర రావత్, మరో వ్యక్తి ఇంద్రాసింగ్ను అరెస్టు చేశారు. దీంతో సంబంధం ఉన్న రైల్వే అధికారులు హేమ్‌చంద్ బోరా, లక్ష్మీకాంత్ వర్మ, ఏబీసీఐ సంస్థ డైరెక్టర్ పవన్ బైద్పై కేసు నమోదు చేశారు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్ పరిధిలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు చౌహాన్ ఏబీసీఐ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఆ సంస్థ నుంచి లంచం కింద రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 60 లక్షలను సీబీఐ రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాంలో పలుచోట్ల దాడులు చేసి, రూ.54 లక్షలు స్వాధీనం చేసుకుంది. -
అవినీతి తిమింగలం.. కట్టలు కట్టలుగా నగదు, బంగారం
సాక్షి, చెన్నై: పర్యావరణ అనుమతుల కోసం వచ్చే పరిశ్రమల వద్ద లక్షల కొద్ది లంచం పుచ్చుకుంటున్న ఓ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు తమ వలలో వేసుకున్నారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో బయటపడ్డ నగదు, ఆభరణాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేసింది. చెన్నై, సైదాపేట పనగల్ మాలిగైలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ విభాగం కార్యాలయం ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పాండియన్ పనిచేస్తున్నారు. అనుమతుల కోసం వచ్చే సంస్థలు, పరిశ్రమలు ఈయన గారి చేతులు తడపాల్సిందే. లక్షల్లో లంచం పుచ్చుకునే ఈ అధికారి గుట్టును రట్టు చేస్తూ ఓ సంస్థ ఏసీబీకి రహస్యంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఏసీబీ ఏడీఎస్పీ లావణ్య నేతృత్వంలోని బృందం పాండియన్‌పై కన్నేసింది. చదవండి: (సోదరిపై ప్రేమ: అతడు చేసిన పని హాట్‌టాపిక్..) ఈ పరిస్థితుల్లో సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పాండియన్ గదిలోకి ప్రవేశించిన ఈ బృందం సోదాల్లో నిమగ్నమైంది. మరో బృందం శాలిగ్రామంలోని పాండియన్ ఇంట్లో సోదాలు చేపట్టింది. రాత్రంతా ఈ సోదాలు సాగాయి. రెండో రోజు మంగళవారం కూడా తనిఖీలు సాగాయి. పాండియన్ కార్యాలయ గదిలో లక్షల కొద్ది నగదు, ఇంట్లో కట్టలు కట్టలుగా 1.5 కోట్ల నగదు బయటపడింది. రూ.7 కోట్లు విలువ చేసే 18 ఆస్తుల దస్తావేజులు చిక్కాయి. బీరువాల్లో 3 కేజీల బంగారు ఆభరణాలు, రూ. ఐదున్నర లక్షల విలువ చేసే వజ్రహారం, ఒకటిన్నర కేజీ వెండి వస్తువులు ఈ సోదాల్లో బయట పడ్డాయి. ఈ ఆస్తులు ఎలా గడించారో అన్న విషయంగా పాండియన్ వద్ద ఏసీబీ విచారణ సాగుతోంది. చదవండి: (నైట్ క్లబ్‌లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది) ఈరోడ్‌లో.. ఈరోడ్‌లో శ్రీపతి అసోసియేట్స్‌పై ఐటీ దాడులు సాగాయి. ఈ సంస్థ ప్రభుత్వ భవనాల నిర్మాణాలతోపాటు పలు, ప్రైవేటు సంస్థల నిర్మాణాలు చేపట్టింది. పన్ను ఎగవేత సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి ఈసంస్థ కార్యాలయాలు, యజమానుల ఇళ్లల్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.16 కోట్లు విలువ చేసే నగదు, ఆస్తుల దస్తావేజులు బయట పడ్డట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఐటీ వర్గాలు సాగించిన దాడుల్లో రూ. 23 కోట్ల నగదు, రూ. 110 కోట్లు విలువ చేసే ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల్ని సీజ్ చేసినట్టు ఆ కార్యాలయం ఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: (చచ్చిపో.. అంటూ చిత్రను ప్రేరేపించిన హేమనాథ్) -
గుంతకల్లు డీఈ అవినీతి బాగోతం
సాక్షి, అనంతపురం : గుంతకల్లు ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ రవిబాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు కోసం రైతుల నుంచి డీఈ రవిబాబు లక్షన్నర లంచం తీసుకున్నారు. ఇద్దరు రైతులు కలిసి లక్షన్నర లంచం ఇవ్వగా ఈ సొమ్ము లైన్ మెన్ ద్వారా డీఈకు చేరింది. కాగా రవిబాబు బాగోతాన్ని రైతులు రహస్యంగా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో డీఈ రవిబాబు దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా రైతులను వేధిస్తున్నట్లు డీఈ రవిబాబు పై కొంతకాలంగా ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఒక్కొ కొత్త ట్రాన్స్ ఫార్మర్కు 75000 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు దళారుల సహకారంతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు జరిగాయి. బాన్సువాడ కు చెందిన సుధాకర్‌ను కామారెడ్డి పోలీసులు బెట్టింగ్ వ్యవహారంలో 15 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం సీఐ జగదీశ్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ముందుగా రూ.1,39,500లను సుధాకర్ సీఐకి ఇచ్చాడు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్ ఒత్తిడి పెంచ డంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నెల 19న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్‌తో పాటు ఈ వ్యవహా రంలో మధ్యవర్తిత్వం చేసిన సుజయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగాయి. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. మధ్యవర్తి సుజయ్‌ను సైతం విచారిస్తున్నామని, సీఐని ఏసీబీ కోర్టులో శనివారం ప్రవేశపెడుతామని చెప్పారు. -
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి..
సాక్షి, జనగామ: ఇరిగేషన్ డిపార్టమెంట్‌కు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకెళ్తే.. ఇరిగేషన్ డిపార్టమెంట్ డీఈ రవీందర్ రెడ్డి శనివారం ఓ కాంట్రాక్టర్ నుంచి 50 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (నడి రోడ్డు మీద లంచావతారం..) -
అత్యాశకు పోయి అడ్డంగా బుక్కైన సీఐ
సాక్షి, నిజామాబాద్ : ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్ పట్టణ సీఐ, కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ భూవివాదంలో రూ. 50 వేలు, ఓ బైకు, రూ.లక్షకు పైగా విలువల చేసే ఫోన్‌ను లంచంగా తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. సాజిద్ అనే వ్యక్తి నుంచి ఈ లంచాన్ని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు..మాటు వేసి సీఐ పల్లె రాకేష్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ గజేంద్ర ద్వారా సీఐ లంచం తెప్పించుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
పట్టపగ్గాల్లేని ‘బరి’తెగింపు
‘అవినీతికి మూల్యం చెల్లించేది పేదలే’ అంటారు పోప్ (ఫ్రాన్సిస్). నిజమే! మన వ్యవస్థలో వేర్లు విస్తరించి, ఊడలు బలిసిపో యిన అవినీతికి అంతిమ బాధితులు నిరుపే దలు, నిస్సహాయులు. ప్రత్యక్షంగా పనులు జరుగక, ఫలాలు అందక ఒకసారి, వ్యవస్థ లన్నీ నిర్వీర్యమై అవకాశాలేవీ దక్కక అట్ట డుక్కు నెట్టేయబడి మరోసారి... వంచితుల య్యేది వారే! సంపద ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్న వాళ్లు అడ్డదారుల్లో అవినీతిని పెంచి పోషించడానికి వెచ్చించే మొత్తాల్ని తమ వ్యయంలోనో, పెట్టుబడిలోనో భాగంగానే లెక్కేసుకుంటున్నారు. పెట్రేగుతున్న అవినీతితో పాలనా వ్యవస్థలతో పాటూ, అంతిమంగా ప్రజాస్వామ్యమే విశ్వసనీయత కోల్పోతోంది. రాజకీయ వ్యవస్థ కనుసన్నల్లోనో, అంటకాగుతూనో జరిగే అధికారిక అవినీతి తారస్థాయికి చేరింది. మన తెలుగునాట అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలవుతున్న తీరు, వారి వద్ద జమవుతున్న నికృష్ట సంపద గగుర్పాటు కలిగిస్తోంది. మొన్నొక ఈఎస్సై అధికారిని, మరో ఎమ్మార్వో, నిన్న ఓ అడిషనల్ కలెక్టర్, నేడు ఏసీపీ! ఇలా ఎందరెం దరో... ఇది దొరికిన దొంగల సంగతి! అదేదో ఇంగ్లీషులో సామెత చెప్పినట్టు దొరకనిది కొండంత, దొరికేది పిసరంత. చట్టాల్లో లోపాలు, అపరిమిత నియంత్రణ, సంక్లిష్టమైన పన్నులు–లైసెన్సు విధానం, లోపించే పారదర్శకత, అధికారుల విచ్ఛలవిడి నిర్ణయాధికారం... అన్నీ వెరసి అవినీతికి ఆస్కారం పెంచుతున్నాయి. భూముల విలు వలు అసాధారణంగా పెరిగి, దాన్నొక వినిమయ వస్తువు చేసిన వైనం అవినీతిని అమాంతం పెంచేసింది. తేరగా గడించే నల్లధనం– భూమిపై పెట్టుబడి–భూలావాదేవీ లాభాల్ని నల్లధనంగా మార్చడం.. ఇదొక విషవలయం. ఇవన్నీ ఒక ఎల్తైతే మన ఆలోచనా ధోరణి అవి నీతికి ఆజ్యం పోస్తోంది. అవినీతిని సమకాలీన సమాజమే పెంచి పోషిస్తున్నట్టుంది. ఎలా సంపాదించినా సరే, సంపద కలిగినోడికున్న గౌరవం, మర్యాద నిజాయితీ పరులైన పేదలకు, సామాన్యులకు సమాజంలో దక్కడం లేదు. నిజాయితీ అధికారులకు అసలు గుర్తింపే లేకపోవడం వ్యవస్థలోని పెద్ద లోపం. కొత్త తరాన్ని సమాజం పెంచు తున్న తీరు కూడా లోపభూయిష్టమే. అవినీతికి పాల్పడి దొరికితే పరువుపోతుందనో, శిక్ష పడుతుందనో అధికారుల్లో భయమేలేని నిర్బీతి నేటి విచ్చలవిడి అవి నీతికి ప్రధాన కారణం. మన నేర దర్యాప్తు–న్యాయ విచారణ వ్యవస్థ అవినీతి పరుల్ని ఏ మాత్రం భయ పెట్టలేని స్థితికి రావడం ఆందోళనకరం. ఇంత బరితెగింపా? పట్టుబడినా ఏమీ కాదన్న ధీమాయే అధికారుల విచ్ఛలవిడి తనానికి కారణం. అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నమోదు చేస్తున్న వేర్వేరు కేసుల్లో కొనదాకా నిలిచేవి చాలా తక్కువ. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ (ట్రాప్) కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, ఇతర అవినీతి కేసుల్లో విచారణలు సజావుగా సాగి, అభియోగాలు నిర్ధారణ అయి, శిక్షలు పడ్డ కేసుల కన్నా నిందితులైన అధికారులు నిక్షేపంగా బయటపడ్డ కేసులే ఎక్కువ. కొలిక్కి వచ్చే కొన్ని సందర్భాలూ చిన్న మొత్తాల అవినీతి కేసులే తప్ప బడాబాబులవి కావు! పైరవీలకు ‘సచి వాలయం’తో సంపర్కం లేనివాళ్లు, దళారుల్ని పట్టుకునే ‘వ్యవహార దక్షత’ లేనివాళ్ల కేసులే కడదాకా నిలుస్తాయి. సాక్ష్యాలు దొరకకో– నిలువకో, సాక్షులు మాట మార్చో, తదుపరి దర్యాప్తుల్ని సాగనీయకో, చర్యల్ని నిలిపివేయించుకునో.. కారణాలేమైతేనేం వారు శిక్షలు తప్పిం చుకుంటున్నారు. చూస్తుండగానే తిరిగి పోస్టింగ్ తెప్పించుకుంటు న్నారు. సస్పెన్షన్ కాలపు జీతాల్ని కూడా తిరిగి పొందుతున్నారు. అవేవీ రాకపోయినా సరే! లేకపోతే, ఏ దైర్యంతో... ఒక అధికారి 40 లక్షల నగదు తీసుకొని, లంచం కింద భూమి రిజిష్టరు చేయించు కుంటాడు? న్యాయమూర్తి అయ్యుండీ కోట్ల రూపాయల లంచం డబ్బును ఏకంగా బ్యాంకులో ఎలా జమచేసుకుంటారు? ప్రభుత్వ అధికారిగా, మరో ఆదాయవనరు లేకుండా రూ.7 కోట్లతో నగలెలా కొంటారు? రెండు కోట్ల లంచం, కోటి పదిలక్షల రూపాయల నగ దుతో పట్టుబడ్డ అధికారి నిర్వాకాన్ని, అవినీతిలో ప్రపంచ రికార్డుల కెక్కించమని గిన్నిస్ సంస్థకు వినతిపత్రం వెళ్లిందంటే, మన కీర్తి ఏ స్థాయిలో ఉందో ఊహించొచ్చు. ఏపీలో ఒక నకిలీ ‘ఏసీబీ అధికారి’ పోలీసులకు దొరికాడు. అతన్ని పట్టుకొని కూపీ లాగితే, 18 మంది పెద్ద అధికారుల వద్ద ‘కేసు చేస్తా’మని భయపెట్టిన ముఠా డబ్బు గుంజినట్టు తేలింది. అంటే, ఎంత విచ్ఛలవిడిగా అవినీతికి పాల్పడి అక్రమార్జన చేస్తే, దారిన పోయే దొంగ ఏసీబీ అధికారులకూ చేయి తడుపుతారు? ఆ 18 మందిపై తర్వాత అసలు ఏసీబీ కేసులు నమోదు చేసింది, అది వేరొక పరిణామం! చట్టమంటే భయం లేదు. నేర దర్యాప్తంటే లెక్కలేదు. అక్రమార్గంలో వచ్చిన సంపాదనలో కొంత వెచ్చిస్తే ఉపశమన మార్గాలవే దొరుకుతాయ్, ఇదీ వరస! ‘భూ’మాయ ! పట్టణాలు, నగరాల శివారుల్లో భూముల విలువలు అమాంతం పెరిగిపోవడంతో అవినీతికి రెక్కలొచ్చాయి. భూలావాదేవీలతో ప్రత్య క్షంగా, పరోక్షంగా సంబంధమున్న అధికారుల్లో కొందరి నిర్వాకాలకు పట్టపగ్గాల్లేవు. డబ్బిస్తే ఏమైనా చేయగలరు. దీనికి ఆడా మగ తేడాయే లేదు. తన భూమిని ఇతరులకు పట్టా రాయించారనే కోపంతో ఒక కక్షిదారు ఏకంగా ఓ మహిళా ఎమ్మార్వోను ఆఫీసులోనే నిప్పంటించి కాల్చే శాడు, అదే మంటల్లో తానూ చచ్చాడు. ఇంకో ఎమ్మార్వో వద్ద ఏసీబీ అధికారులు రూ.30 లక్షలు స్వాధీనపరచుకోవడంతో భర్త అవ మాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే భూవివాదంలో ఆర్ఐ కూడా నగదుతో పట్టుబడ్డాడు. గతేడాది శివారు ఎమ్మార్వో వద్ద రూ. 93 లక్షల నగదు దొరికింది. ఇప్పుడు ఏసీబీకి దొరికిన పోలీస్ అధికారి (ఏసీపీ) పెద్దఎత్తున సివిల్ దందాల్లో తలదూర్చి, భూలావాదేవీలు జరిపి అక్రమార్జన చేశారని అభియోగం. రూ.కోటి నగదుతో పట్టుబడ్డ ఎమ్మార్వో, కోటిన్నర రూపాయల అవినీతి డీల్ చేసుకున్న జిల్లా అధి కారి... వీరందరివీ భూదందాలే! భూమి ధరలు అసాధారణంగా పెర గడంతో అక్రమార్జన పెట్టుబడి తరలివస్తోంది. నిర్ణయాధికారం ఉన్న అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. ‘ఆ సర్వే నంబర్లో అప్పనంగా మీకంత ప్రయోజనం కలుగుతున్నపుడు, అందులో మాకొక 5 లక్షల రూపాయలిస్తే మీకేంటి నష్టం?’ అని ఓ ఎమ్మార్వో బహిరంగంగా అన్నారంటే, పరిస్థితికి ఇది అద్దం పట్టేదే! ఎక్కడో సంపాదించిన పెద్ద మొత్తాలు, నల్లధనం భూముల కొనుగోళ్లకు పెట్టుబడు లవు తున్నాయి. స్వల్పకాలంలో అసాధారణంగా ధరలకు రెక్కలొచ్చిన భూక్రయవిక్రయ లాభాలు మరెక్కడో నల్లధనంగా పోగవుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత, రెండు లక్షల రూపాయలకు మించి నగదు వ్యవహారాలు జరుపొద్దన్న ప్రభుత్వ నిబంధనలు గాలికిపోయాయి. సందట్లో సడే మియ్యాల్లా ఈ వ్యవహారాల్లో తమ అవసరాల్ని, అవకా శాల్ని అవినీతి అధికారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే, అవినీతిలో రెవెన్యూ శాఖది అగ్రతాంబూలం. ఇదే వరుసలో ఎకై్జజ్, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్టీయే, వాణిజ్యపన్నులు వంటి శాఖలు న్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కస్టమ్స్, రైల్వే, వస్తు–సేవా పన్నులు తదితర శాఖల్లో అవినీతి పెద్ద మొత్తాల్లోనే! విలువల పతనం అరిష్టాల మూలం అధికారిక అవినీతికి మూలాలు రాజకీయాల్లో ఉంటాయన్నది కౌటి ల్యుని రాజనీతి శాస్త్రం నుంచి నేటి వరకు ఎడతెగని సత్యం. రాజకీయ నాయకుల బెదిరింపులో, లొంగదీసుకోవడాలో, కూడబలుక్కోవ డమో... నమూనా ఏదైతేనేం అత్యధిక సందర్బాల్లో అధికారుల అవి నీతికి రాజకీయాలే ప్రేరణ! అధికారుల అవినీతి విడిగా చూడదగ్గ, రాజకీయాలకు పూర్తిగా సంబంధంలేని వ్యవహారమైతే కాదు. కీలక స్థానాల్లోకి అధికారుల బదిలీలు జరిపించడం, నిలువరించడం కొందరు నాయకులకొక ఫక్తు వ్యాపకం. చట్టాల్ని ఉల్లంఘించే వక్ర మార్గాలకు వారిపై వత్తిడి పెంచి చేయించుకునే నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్ని స్థాయిల్లోనూ ఉన్నారు. మరికొన్ని సార్లు సఖ్యత కుదిరి, దోపిడీ సొత్తు తగుపాళ్లలో పంచుకునే అధికార–రాజకీయ జోడిగుర్రాల అవినీతి పరుగుకూ పట్టపగ్గాల్లేవు. నాయకులు ఒత్తిడి తెచ్చి ఒకటి, అర తప్పుడు పనులు చేయించుకుంటే, అదే బాటలో చడీచప్పుడు లేకుండా తాము నాలుగయిదు చేసుకునే అధికారులకూ కొదువ లేదు. వినని వారిని వేధిస్తుంటారు. అక్రమార్జన వక్రమార్గంలో తమ దారికి రాకుంటే, సదరు అధికారుల్ని తప్పుడు కేసుల్లో నేతలు ఇరికించే సందర్భాలూ ఉన్నాయి. దీన్ని పరిహరించేందుకే, విజిలెన్స్ కేసుల్లో దర్యాప్తు అనుమతి అధికారం ప్రభుత్వం చేతిలో ఉండేట్టు ప్రతి పాదించినా, సుప్రీంకోర్టు అందుకు సమ్మతించలేదు. రాజ్యాంగపు సమానత్వ హక్కుకి భంగమని అనుమతి నిరాకరించింది. అలా ఏక పక్ష నిర్ణయాధికారం సర్కారు చేతిలో ఉండటం కూడా ప్రమాద కరమే! ఏకకాలంలో అనేక చర్యలే మార్గం అధికారిక అక్రమార్జన సంస్కృతిని రూపుమాపాలి. చట్టాలను పటిష్ట పరచడంతో పాటు పాలనలో పూర్తి పారదర్శకత తేవాలి. పలు పాలనా వ్యవహారాల్ని ‘ఆన్లైన్’ చేసిన తర్వాత అవినీతి తగ్గినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధారాలున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన ఢిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ (సీఎమ్మెస్), అవునని నిర్దారించింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషన్ ఇదే ప్రతిపాదించింది. విప్లవాత్మక సమాచార హక్కు చట్టం దీన్ని ధృవపరిచింది. అధికారుల విచక్షణాధికారాలకు కత్తెర పడాలి. అవినీతి బాహాటంగా ఉండి, తమకు అన్యాయం జరిగినపుడు... పౌరులు గొంతెత్తి పోరాడ్డానికి పలు ప్రజాస్వామ్య వేదికలుండాలి. మానవహక్కుల సంఘం, విజిలెన్స్ కమిషన్, లోకాయుక్త, ఆర్టీఐ వంటి వ్యవస్థలు, సంస్థలన్నింటినీ పాలకులు నిర్వీర్యం చేయడమో, నీరుగార్చడమో చేస్తున్నారు. జన్‌లోక్‌పాల్‌కు మోక్షమివ్వరు. ఈ దుస్థితే పౌరుల పాలిట శాపమౌతోంది. మనుగడ కోసం మధ్యాహ్న భోజనమే ఆసరాగా బడికొచ్చే ఓ విద్యార్థికి, టీసీ ఇవ్వడానికి రెండు వేల రూపాయలు లంచమడిగితే ఇవ్వలేక బడి మానాల్సి వచ్చింది. ఆ అధికారిని ఏం చేయాలి? అవినీతి ఒక క్యాన్సర్. ఏం చేసైనా దాన్ని అంతం చేయాలి, లేకుంటే అది ప్రజాస్వామ్యాన్నే అంతం చేస్తుంది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నగరపాలక సంస్థలో బయటపడ్డ అవినీతి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని నగరపాలక సంస్థలో అవినీతి బయటపడింది. బిల్డింగ్ క్రమబద్ధీకరించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. వివరాలు.. టౌన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తన బిల్డింగ్ క్రమబద్ధీకరణకు రూ.4 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు సత్యనారాయణ ఆరోపణలు చేశాడు. అంతే కాకుండా లంచం డబ్బ కోసం ఆ అధికారులు తనని వేధిస్తున్నారని తెలిపాడు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం అడిగిన ఓ వీడియోను బాధితుడు బయటపెట్టాడు. రూ.లక్ష లంచం తీసుకుంటూ మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నెల రోజుల కిందట బాధితుడు తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఇటీవల మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. టైన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తరఫున ఆయూబ్ లంచం తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. దీంతో పాటు అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అవినీతిపై బాధితుడు సత్యనారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. -
జీతం కావాలంటే.. లంచం తప్పదు
సాక్షి, ఒడిశా : ఒక ఉపాధ్యాయినికి సంబంధించిన మూడు నెలల జీతం చెల్లించాలంటే రూ.పదివేలు లంచం ఇవ్వాలి. లేదంటే ఫైల్ ముందుకు కదలదంటూ తెగేసి చెప్పిన భాగోతం ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జిల్లా పరిధిలో గల కొల్నారా సమితిలోని ఆగుడి గ్రామం పాఠశాలలో పనిచేస్తున్న జ్యోతిర్మయి మల్లిక్ అనే ఉపాధ్యాయిని మెటర్నిటీ లీవ్‌పై వెళ్లారు. సెలవు అనంతరం తనకు రావాల్సిన మూడు నెలల జీతాన్ని చెల్లించమని సమితి విద్యాధికారి ఎం. ఖగేశ్వరావును ఆమె సంప్రదించింది. త్వరలో జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడంతో ఉపాధ్యాయిని వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా ఇంకా చెల్లించక పోవడంతో సమితి విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అకౌంటెంట్ ఫరీదా బేగంను సంప్రదించింది. జీతం అందాలంటే రూ.పది వేలు చెల్లించాలని అకౌంటెంట్ లంచం డిమాండ్ చేసింది. నెల జీతం రూ.6,400 అయితే రూ.పదివేలు ఎలా ఇవ్వగలనని ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్ వాపోయింది. జ్యోతిర్మయి మల్లిక్ (ఉపాధ్యాయిని), అకౌంటెంట్ ఫరీదా బేగం వారిద్దరి సంభాషణలకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో విషయం బయటకొచ్చింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రమోద్ కుమార్ బెహరా దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఈ మేరకు ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్, అకౌంటెంట్ ఫరీదా బేగంను జిల్లా తన కార్యాలయానికి డీఈఓ పిలిపించి విచారణ చేపట్టి ఇద్దరి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి అకౌంటెంట్ బేగంను విలేకరులు ప్రశ్నించగా ఇదంతా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారమని ఖండించారు. ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్ మాత్రం తనకు జీతం చెల్లించాలంటే రూ.పదివేలు లంచం అడిగిన మాట వాస్తవమని అందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని జిల్లా విద్యా శాఖాధికారికి అందించానని చెప్పారు. -
అడ్డంగా దొరికిన ఆస్పత్రి అటెండర్
-
అడ్డంగా దొరికిన ఆస్పత్రి అటెండర్
సాక్షి, విజయవాడ: కృష్ణజిల్లా మచిలీపట్నంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మృతదేహాన్ని అప్పగించాడానికి డబ్బులు ఇవ్వాల్సిందేనని మార్చురీ అటెండర్ డిమాండ్ చేశాడు. అసలే కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు లంచం ఇవ్వక తప్పలేదు. అయితే, ఆ అటెంటర్ లంచావతారం మొత్తం వీడియోలో రికార్డవడంతో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ నెల 21 సుమలలిత అనే వివాహితను ఆమె భర్త హత్య చేశాడు. పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కూతురి మృతదేహం కోసం మార్చురీకి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. శవాన్ని ఇచ్చేందుకు మార్చురీ అటెండర్ రూ.6 వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వనిదే మృతదేహాన్ని అప్పగించేది లేదని స్పష్టం చేశాడు. చివరకు ఆ తల్లిదండ్రులు రూరూ.1500 ముట్టజెప్పారు. ఈక్రమంలో వారి బంధువులు అటెండర్ బాగోతాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. మార్చురీ అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రూ.35 లక్షల లంచం.. మహిళా ఎస్ఐ అరెస్ట్
అహ్మదాబాద్ : అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్నారనే అభియోగంపై ఓ మహిళా ఎస్ఐను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు కాకుండా చేసేందుకు లంచం డిమాండ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ పని చేసే ఇద్దరు మహిళలు తమపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనాల్ షా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. కాగా, ఇటీవల ఈ కేసు విచారణ అహ్మదాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తోన్న శ్వేతా జడేజాకు అప్పగించారు. కేసు విచారణ ప్రారంభించిన శ్వేత.. నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితుడి సోదరుడు భావేష్‌ను హెచ్చరించారు. భావేష్ ఓ మధ్యవర్తి ద్వారా 20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని, అ మొత్తాన్ని అప్పజెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మరో 15లక్షలు ఇవ్వాలని ఎస్ఐ నుంచి ఒత్తిడి రావడంతో సిటీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు రాగా, విచారణ చేసి శుక్రవారం శ్వేతను అరెస్ట్ చేశారు. రూ.20లక్షల లంచం తీసుకుని, మరో 15లక్షలు డిమాండ్ చేసినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. శనివారం ఆమెను సెషన్స్ కోర్టు హాజరు పర్చగా, కోర్టు 3 రోజుల రిమాండ్‌ను విధించింది. ఈ మొత్తం కేసు దర్యాప్తును స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏసీపీ బీసీ సోలంకికి అప్పగించినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ చెప్పారు. -
అవినీతి అధికారులకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: సస్పెండ్ అయిన, అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులకు పాస్‌పోర్ట్ జారీ చేయరాదని కేంద్రం ఆదేశాలిచ్చింది. అధికారులకు పాస్‌పోర్ట్ జారీ చేసే ముందు సీవీసీ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి సస్పెన్షన్‌లో ఉన్నా, దర్యాప్తు సంస్థలు అతడిపై కోర్టులో చార్జిషీట్ వేసినా పాస్‌పోర్టు జారీని నిలిపివేయవచ్చని తెలిపింది. అతడికి లేదా ఆమెకు పాస్‌పోర్టు జారీ చేయవచ్చని పై అధికారి సూచించినప్పటికీ అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాలను కోరింది. అతడు/ఆమెకు అనుమతి ఇవ్వడం వల్ల భారత్‌కు ఆ దేశంతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని, ప్రజోపయోగం కాదని భావించినా, మరే ఇతర కారణంతోనైనా పాస్‌పోర్టును నిరాకరించే అధికారం విజిలెన్స్ కమిషన్‌కు ఉందని తెలిపింది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న అధికారికి కోర్టు సమన్లు జారీ చేసినా, అరెస్టు వారెంట్లు ఇచ్చినా, ఆ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నా దేశం వదిలి వెళ్లరాదని ఏదైనా కోర్టు నిషేధం విధించినా కూడా పాస్‌పోర్టు ఇవ్వరాదని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలపై విదేశాంగ శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)తో సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది శాఖ తెలిపింది. (ఆ గుడిలో టాయిలెట్ వారికి మాత్రమే..) -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
సాక్షి, ఇల్లెందు: ఏసీబీ అధికారులకు ఇల్లెందు మున్సిపల్ ఏఈ అనిల్ పట్టుబడి ఆరు నెలలు గడవకముందే మున్సిపాల్టీలో మరో అవినీతి ఉద్యోగి, ఇన్చార్జ్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న బాబు శుక్రవారం రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ కథనం ప్రకారం.. ఇల్లెందు మున్సిపాలిటీలో ఇన్చార్జ్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.బాబు కాంట్రాక్టర్ సురేశ్‌గౌడ్‌కు బిల్లు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండటమే గాక కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. 14వ వార్డులో రూ.15 లక్షల విలువ గల తాగునీటి పైపులైన్ పనుల టెండర్‌ను కాంట్రాక్టర్ సురేశ్‌గౌడ్ దక్కించుకున్నాడు. నెల రోజుల కిందట టెండర్ పనులు పూర్తి చేశారు. బిల్లు కోసం పలు దఫాలు ఏఈని ఆశ్రయించగా ఏదో ఒక కారణం చెబుతూ దాట వేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. చివరికి రూ.30 వేలు ఇస్తేనే బిల్లు చేస్తానని సురేశ్‌కు హుకుం జారీ చేశాడు. సురేశ్‌కు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వివరాలను నమోదు చేసుకున్న ఏసీబీ బృందం రంగంలోకి దిగింది. ప్రతిరోజూ పనులు ముగించుకున్న తర్వాత మధ్యాహ్న భోజనం చేసేందుకు డీఈ కొండల్రావు ఉంటున్న ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తారు. డీఈ ఇటీవల సెలవు పెట్టి ఇంటి తాళాలు బాబుకు అప్పగించి తన స్వగ్రామనికి వెళ్లారు. రోజువారీలాగే శుక్రవారం బాబు డీఈ కొండల్రావు ఇంటికి వెళ్లాడు. అనంతరం సురేశ్‌కు ఫోన్ చేసి డబ్బులను తీసుకొని తన వద్దకు రమ్మని చెప్పాడు. సురేశ్ వెంటనే విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు. నిఘా వేసిన ఏసీబీ బృందం సురేశ్ నుంచి రూ.20 వేలు తీసుకుంటున్న ఏఈ బాబును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. లంచం ఇస్తేనే బిల్లు చేస్తా అన్నాడు.. పైపులైన్ పనుల టెండర్ దక్కించుకున్న నాటి నుంచి ఇన్చార్జ్ ఏఈ బాబు లంచం అడు గుతున్నాడు. పనులు పూర్తయినప్పటికీ బిల్లు చెల్లించేందుకు నిర్లక్ష్యం చేశాడు. రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాబును పట్టించాను. సురేశ్, కాంట్రాక్టర్, ఇల్లెందు -
ఆబ్కారీ శాఖకు మామూళ్ల కిక్!
134 వైన్స్‌లు.. 9బార్ అండ్ రెస్టారెంట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో సిండికేట్ల పుణ్యమాని.. ఊరికి ఒకటీ.. రెండు బెల్ట్‌షాపులు.. మరికొన్ని చోట్ల మూడు.. సిండికేట్ పరిధిలోని షాపులనుంచి రూ.20వేలు.., సిండికేట్ లేని దుకాణాలనుంచి నెలకు రూ.13వేలు, ఇక, బార్లనుంచి రూ.30 వేలు... ఇలా నెలనెలా ముక్కుపిండి వసూలు చేస్తున్న ముడుపుల మొత్తం ఏటా రూ.3కోట్ల పైమాటే. వెరసి జిల్లా ఎక్సైజ్‌శాఖ మామూళ్ల మత్తులో ఊగుతోంది..! సాక్షి, నల్లగొండ : ‘జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో ఒక మహిళ బెల్ట్‌షాప్ నిర్వహిస్తోంది.. అయితే ఆమె తమ మండలంలోని వైన్స్‌నుంచి కాకుండా.. నల్లగొండలోని ఓ వైన్స్ నుంచి మద్యం తీసుకెళ్లి విక్రయిస్తోంది. సిండికేట్‌లోని వైన్స్ నుంచి కాకుండా, బయటి ప్రాంతంనుంచి మద్యం ఎలా తెచ్చి అమ్ముతావని ఆబ్కారీశాఖలోని ఓ సీఐ స్థాయి అధికారికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఇంకేముంది తన సిబ్బందిని పురమాయించి ఆ మహిళను తీసుకురావాలని హుకుం జారీ చేశారు. గతంలో తాను బెల్ట్‌షాప్ నిర్వహించానని, ఇప్పుడు మానుకున్నానని ఆ మహిళ ఎంత మొత్తుకున్నా వినని ఎక్సైజ్ సిబ్బంది ఆమెను నానా దుర్భాషలాడారు. దీంతో ఆమె తనకు తెలిసిన వారి ద్వారా పరిస్థితిని ఓ ఎమ్మెల్యేకు వివరించింది. ఆయన మందలింపుతో ఎక్సైజ్ శాఖ అధికారి వెనక్కి తగ్గారు.’ ఈ ఉదంతం తేటతెల్లం చేసిందేమిటి? ‘బెల్ట్‌షాప్‌లు నడుపుకోండి. అభ్యంతరం లేదు.. కానీ, తమ మండలంలోని వైన్స్‌నుంచి మాత్రమే మద్యం కొనుక్కుని పోవాలి’ అన్నది ఆబ్కారీ అధికారుల పంతం. కారణం.. సిండికేట్‌గా ఏర్పడిన వైన్స్ నుంచి తమకు నెలా నెలా ఇబ్బడి ముబ్బడిగా అందుతున్న మామూళ్లే. ఈ వైన్స్లలో ఎక్కువ విక్రయాలు జరిగే బాధ్యతను ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు భుజానికి ఎత్తుకున్నారన్నది తేటతెల్లమవుతోంది. సిండికేట్ షాపుల్లో ఎందుకు కొనరంటే..? బెల్ట్‌షాపుల నిర్వాహకులు .. తమ ప్రాంతంలోని వైన్స్‌నుంచి మద్యం ఎందుకు కొనడం లేదంటే.. సదరు సిండికేట్ షాపులనుంచి ఎంఆర్పీకి మద్యం దొరకదు. రూ.5 నుంచి రూ.10 అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకెళ్లిన మద్యాన్ని బెల్ట్‌షాపుల్లో మరో రూ.5 నుంచి రూ.10 అదనంగా తీసుకుని విక్రయించుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగానే బెల్ట్‌షాపుల నిర్వాహకులు సిండికేట్‌లో భాగం లేని వైన్స్‌లనుంచి మద్యం తీసుకుని గ్రామాల్లో విక్రయిస్తున్నారు. దీంతో మండలాల్లోని వైన్స్‌లో విక్రయాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి వాటిని గట్టెక్కించేందుకు అధిక మామూళ్లు ఇస్తున్న సిండికేట్ వైన్‌షాపుల బిజినెస్ దెబ్బతినకుండా ఉండేందుకు ఎక్సైజ్‌శాఖలోని కొందరు అధికారులు బెల్ట్‌షాపుల వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదీ.... పరిస్థితి.. జిల్లాలో 134 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికితోడు నల్లగొండ, దేవరకొండలో కలిపి 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పట్టణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు సిండికేట్‌కు దూరంగా ఉన్నాయి. ఇక, మండలాల్లోని దుకాణాలు మాత్రం సిండికేట్‌గా ఏర్పడ్డాయి. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, చండూరు, నాంపల్లి, హాలియా, దేవరకొండల్లో ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని పట్టణ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని చోట్లా సిండికేట్లను ఎక్సైజ్ శాఖే ప్రోత్సహిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొద్ది నెలల కిందట.. ఈ శాఖ ఎన్ని బెల్ట్‌షాపులు ఉన్నాయో లెక్క తేల్చేందుకు ఓ సర్వే నిర్వహించింది. కనీసం 1800 బెల్ట్‌షాపులు ఉన్నట్లు లెక్క తేలిందని సమాచారం. అంటే జిల్లాలోని 844 గ్రామాల్లో సరాసరిన ఊరికి ఒకటీ .. రెండు బెల్ట్‌షాపులు.. మరికొన్ని చోట్ల మూడు దాకా ఉన్నట్లు అంచనా. మామూళ్లు ఇవ్వకుంటే కొర్రీలు అన్ని నిబంధనలను పాటించి సక్రమంగా నడుపుకునే వైన్స్‌నుంచి కూడా నెలనెలా మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తోందన్న ఆరోపణ ఉంది. ఇవ్వకుంటే సవాలక్ష కొర్రీలతో సతాయించడం ఎక్సైజ్ శాఖకు వెన్నతో పెట్టిన విద్య అన్న అభిప్రాయం ఉంది. దీంతో సిండికేట్‌లో లేని దుకాణాలనుంచి నెలకు రూ.13వేలు, సిండికేట్ పరిధిలోని షాపుల నుంచి రూ.20వేలు... ఇక, బార్లనుంచి రూ.30 వేలు చొప్పున... నెలనెలా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతినెలా వైన్స్, బార్ల నుంచి రూ.28.80లక్షలు వసూలు అవుతున్నాయని సమాచారం. ఇలా లెక్కగడితే ఏడాదికి వీరి మామూళ్లు మొత్తం 3.45కోట్ల పైమాటేనని చెబుతున్నారు. -
లంచం అడిగిన తహసీల్దార్‌కు ఊహించని షాక్
భోపాల్ : లంచం అడిగిన తహసీల్దార్‌కు ఓ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. లంచంగా తన ఇంటిలో ఉన్న గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు..నౌధియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ ..పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీద మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పని కావాలంటే రూ. 10వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయ అధికారులు అడిగారు. దీంతొ సదరు మహిళ అప్పు చేసి మరీ రూ.10వేలు లంచం అప్పజెప్పింది. అయినప్పటికీ ఆమె పని కాలేదు. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. ఇంకా పని కాలేదని, మ్యుటేషన్ చేయాలంటే మరో రూ.10వేలు లంచంగా ఇవ్వాలన్నారు. లంచం ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో తన గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. లంచంగా తన గేదెను తీసుకొని తన పేరుపై మ్యుటేషన్ చేయాలని కోరింది. లంచం అడిగిన విషయం అందరికీ తెలియడంతో తహసీల్దార్ అధికారులు ఆందోళన చెంది.. అసలు నిన్ను లంచం ఎవరు అడిగారు అంటూ ఆ మహిళపై కోపగించుకున్నారు. అంతేకాదు నాలుగు రోజుల కిత్రమే మహిళ పేరున మ్యుటేషన్ చేశామని , తమను అల్లరి చేసేందుకే మహిళ కుట్ర పన్ని కార్యాలయానికి గేదెను తెచ్చిందని ఎమ్మార్వో వివరణ ఇచ్చారు. కాగా, మహిళపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఎమ్మారో కార్యాలయ అధికారులు తెలిపారు. -
ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ రవికుమార్ అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు బడ్డారు. వివరాలు.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ తన పదవీ కాలం(2014ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు) లోని అభివృద్ధి పనులు, ఖర్చులకు సంబంధించిన ఆడిట్ లెక్కల్ని నివేదించాలని డీపీఓగా పనిచేస్తోన్న రవికుమార్ అడిగారు. ఆయన చెప్పిన ప్రకారమే ఆడిట్ లెక్కల్ని క్లియర్ చేసేందుకు వెళ్లగా.. ఆపని పూర్తి చేసేందుకు రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బులివ్వలేనని ఈశ్వర్ తెలుపగా, ఇరువురి మధ్య రూ.5 నుంచి రూ.4 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఈశ్వర్ ఏసీబీకి తెలిపారు. గురువారం ఈశ్వర్ రూ.లక్ష రవికుమార్‌కు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంపల్లిలోని రవికుమార్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
ఏసీబీ వలలో అవినీతి ఏఎస్సై
సాక్షి, కాకినాడ: కాకినాడలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో 1981లో చేరిన గుణ్ణం వీరవెంకట సత్యనారాయణ చౌదరి 37 ఏళ్లలో రూ. కోట్లకు పడగెత్తారు. తన ఉద్యోగంతో పాటు అక్రమ ఆస్తులనూ అదే స్థాయిలో కూడబెడుతూ వచ్చారు. ఏఎస్సై స్థాయి అధికారి రూ. కోట్లకు పడగెత్తాడంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని వివిధ చోట్ల రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని, వారికి బినామీగా ఉంటూ రూ. కోట్లకు ఎగబాకినట్టు తెలుస్తోంది. రాత్రిపూట వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల వారిని తనిఖీల పేరుతో భారీగా సొమ్ములు వసూలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా పోలీసులు సైతం చెబుతున్నారు. ఆయన తాను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం, స్థలాలు కొనుగోలు చేయడం, తన శాఖ అధికారులు, సిబ్బంది, బంధువులు, స్నేహితులతో వడ్డీ వ్యాపారం చేయించడం అలవాటుగా మార్చుకున్నాడు. పొలం కొనుగోలుతో వివాదం ఇటీవల సామర్లకోట మండలం అచ్చంపేట–ఉండూరు మధ్యలో సత్యనారాయణ చౌదరి అరెకరం పొలం కొనుగోలు చేయడంతో వివాదం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో కొందరు వ్యక్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు చెబుతున్నారు. కాకినాడ ట్రాఫిక్‌లో హెచ్‌సీగా పనిచేసిన సత్యనారాయణ చౌదరి పదోన్నతిపై పోర్టు పోలీస్ స్టేషన్ ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. వారు ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు జరిపారు. కాకినాడ జగన్నాథపురం మరిడమ్మపేటలోని సత్యనారాయణ చౌదరి ఇంటితో పాటు కాకినాడ రామారాపుపేట, రావులపాలెం, సామర్లకోటలోని రెండుచోట్ల, యానాం, గండేపల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో బుధవారం సోదాలు నిర్వహించారు. ముందుగా కరప మండలం అరట్లకట్టకు పెదపూడికి ఏసీబీ బృందాలు వెళ్లాయి. అరట్లకట్టలో అత్తగారి పేరుతో ఇల్లు, చర్చి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కాకినాడలో రెండుచోట్ల, సామర్లకోటలో రెండుచోట్ల, రావులపాలెంలోను సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు గుర్తించాయి. రూ. మూడు కోట్లుగా చెబుతున్నా.. అధికారులు గుర్తించిన ఏఎస్సై అక్రమాస్తుల విలువ రూ. మూడు కోట్లుగా చెబుతున్నప్పటికీ బయట మార్కెట్లో చూస్తే వీటి విలువ రూ.10 నుంచి 15 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో జగన్నాథపురంలోని రెండంస్తుల భారీ భవనం, రామారావుపేటలో రెండంస్తుల డాబా ఇల్లు, సామర్లకోటలో రెండంతస్తుల భవనాలు రెండు, యానాంలో నాలుగంతస్తుల భవనంతో పాటు కేజీన్నర బంగారం, కేజీ వెండి, 100కు పైగా అప్పులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, ఎనిమిది ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలు, రూ. 3 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులతో పాటు 10 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ బ్యాంకులో రూ.19.75 లక్షలు ఉన్నట్లు బ్యాంకు పుస్తకాల పరిశీలనలో తెలిసింది. అంతేగాకుండా పెద్ద మొత్తంలో బ్యాంకు లాకర్లు ఉన్నాయని, వీటిల్లో కూడా పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా సత్యనారాయణ చౌదరి భార్య వీరవెంకట వరలక్ష్మి పేరుతోనే ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. బ్యాంకులోని లాకర్లను కూడా తెరిపించనున్నట్లు వివరించారు. బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఏఎస్పీ పీవీ రవికుమార్, ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, ఏసీబీ అధికారులు తిలక్, పుల్లారావు, సూర్యనారాయణ తదతరులు పాల్గొన్నారు. ఏఆర్ కానిస్టేబుల్‌గా ప్రస్థానం సామర్లకోట మండలం ఉండూరుకు చెందిన సత్యనారాయణ చౌదరి 1981లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. కొంతకాలం తర్వాత సివిల్ కానిస్టేబుల్‌గా మారారు. కాకినాడ, సామర్లకోట, రావులపాలెం, పిఠాపురం పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఎక్కువ కాలం కాకినాడలోనే ఆయన ఉద్యోగం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వాధికారులకు అవినీతికి పాల్పడినా, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా తమకు సమాచారం అందించాలని ఏసీబీ ఏఎస్పీ పీవీ రవికుమార్, డీఎస్పీ రామచంద్రరావు కోరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించడంతో సత్యనారాయణ చౌదరిని అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. -
రెండు నెలలు కాలేదు.. అప్పుడే..
సాక్షి, హైదరాబాద్/తుర్కయంజాల్: ఓ రైతుకు సంబంధించిన భూమిని మ్యుటేషన్ చేసేందుకు వీఆర్వో రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) చేతికి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడలో గురువారం ఈ ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుర్రంగూడకు చెందిన రైతు ముత్యంరెడ్డి తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో కొంతకాలం క్రితం ఎకరం 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమికి సంబంధించిన మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మ్యుటేషన్ చేయాలని రైతు ముత్యంరెడ్డి వీఆర్వోను ఆశ్రయించగా, రూ.1 లక్ష లంచం ఇవ్వాలని వీఆర్వో శంకర్ డిమాండ్ చేశాడు. అంతడబ్బు ఇవ్వలేనని, రూ.70 వేలు ఇస్తానని రైతు వీఆర్వోకు చెప్పాడు. అనంతరం ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపాడు. ఈ మేరకు వీఆర్వోను పట్టుకోవాలని ఏసీబీ అధికారులు పథకం పన్నారు. గురువారం రూ.50 వేలను రైతు ముత్యంరెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలోని వీఆర్వో కార్యాలయంలో శంకర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. అధికారులు ఎవరైనా పనులు చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే తమను ఆశ్రయించాలని 94404 46140 నంబర్లో ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సూచించారు. కాగా, వీఆర్వో శంకర్ రెండు నెలల క్రితమే తొలిసారిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం. -
గేదెల రుణం : బ్యాంకు సీనియర్ అధికారి అరెస్ట్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేసినందుకు గాను లక్ష రూపాయల లంచం లంచం డిమాండ్ చేశాడు. దీంతో వలపన్నిన సీబీఐ అధికారులు పీఎన్బీ సీనియర్ మేనేజర్ సుమేర్ సింగ్, అతని సతీష్ సహచరుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానా, రేవారి జిల్లా కన్వాలి బ్రాంచ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ అందించిన సమాచారం కుష్పురాలో డెయిరీ యూనిట్ నడుపుతున్న ఫిర్యాదుదారునికి రూ .24.72 లక్షల రుణం మంజూరుకు పశుసంవర్ధక శాఖ ఆమోదించింది. గేదెలను కొనుగోలు చేసేందుకు మొదటి దశగా రూ.7.92 లక్షలను బ్యాంకు మంజూరు చేయాల్సి వుంది. అయితే ఇందుకుగాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు సుమేర్ సింగ్. ఈ మొత్తాన్ని మధ్యవర్తి (ప్రైవేట్ వ్యక్తి) కు అప్పగించాలని నిందితులు ఫిర్యాదుదారుని కోరారు. దీంతో అతడు సీబీఐని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
‘అంత ఇచ్చుకోలేను సారూ.. ఈ గేదెను తీసుకెళ్లండి’
భోపాల్: సాధరణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే ఏ పని జరగదనేది జనమేరిగిన సత్యం. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దోగొప్పో మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఉన్నదే ప్రజలకు సేవ చేయడం కోసం అనే విషయాన్ని జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సామాన్యుల ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. దాంతో లంచాలు అడిగే ఆఫీసర్లకు తగిన విధంగా బుద్ధి చెప్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాతికవేలు లంచం డిమాండ్ చేసిన ఓ అధికారికి తగిన గుణపాఠం చెప్పాడో రైతు. వివరాలు.. విదిషా ప్రాంతం సిరోంజ్ జిల్లాకు చెందిన భూపేంద్ర సింగ్‌కు, ఇతర కుటుంబ సభ్యులతో భు వివాదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకోవడం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సిద్ధార్థ సింగాల్ అక్కడ తహసీల్దార్‌గా పని చేస్తున్నాడు. భూపేంద్ర సమస్య తెలుసుకుని, దాన్ని పరిష్కరించాలంటే రూ. 25 వేలు లంచం ఇవ్వాలన్నాడు. అందుకు భూపేంద్ర పేదవాడిని అంత సొమ్ము ఇవ్వలేనని ప్రాధేయపడ్డాడు. కానీ సిద్ధర్థ మనసు కరగలేదు. ఇలా గత 6 నెలలుగా భూపేంద్ర తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ పని మాత్రం కావడం లేదు. తహసీల్దార్ ప్రవర్తనతో విసిగిపోయిన భూపేంద్ర రెండు రోజుల క్రితం తన గేదెను తీసుకువచ్చి సిద్ధార్థ కారుకు కట్టేశాడు. ఆశ్చర్యపోయిన జనాలు ఎందుకిలా చేశావని ప్రశ్నించగా.. అధికారులు కోరిన లంచం ఇవ్వలేనని.. తన గేదెను తీసుకెళ్లమని చెప్పాడు. విషయం కాస్త బయటకు పొక్కడంతో తహసీల్దార్ సిద్ధార్థ కాళ్ల బేరానికి వచ్చాడు. లంచం వద్దు ఏం వద్దు గేదెను తీసుకెళ్లాల్సిందిగా భూపేంద్రను కోరాడు. కానీ భూపేంద్ర ముఖ్యమంత్రి, జిల్లా అధికారికి ఓ మెమరాండం అందజేసిన తర్వాతే గేదెను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం కాస్తా మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు స్పందిచారు. సిద్ధార్థపై వచ్చిన ఆరోపణలు పరిశీలించి.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భార్య దగ్గరే లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
జైపూర్: నేటి కాలంలో వివాహ వేడుక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అందమైన జ్ఞాపకం కావడంతో పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా సర్వ సాధరణమయ్యింది. ఉన్నత కుటుంబాల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రీ వెడ్డింగ్ షూట్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం భిన్నమైన పద్దతులను అనుసరిస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ఓ అధికారి పాలిట సమస్యగా పరిణమించింది. ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా కాబోయే భార్య దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నట్లు తీసిన వీడియో కాస్తా ఓ పోలీసు అధికారి కొంపముంచింది. ఆ వివరాలు.. ఓ పోలీసు అధికారికి వివాహం నిశ్చయమయ్యింది. వేడుకలో భాగంగా కాబోయే భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొన్నాడు. పోలీసు కదా అందుకే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఓ భిన్నమైన కాన్సెప్ట్‌ను ఎన్నుకున్నాడు. దానిలో భాగంగా.. సదరు అధికారి హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో తనకు కాబోయే భార్యను ఆపుతాడు. హెల్మెట్ లేదు.. ఫైన్ కట్టాలని చెప్తాడు. అప్పుడామే తనకు కాబోయే భర్త, సదరు అధికారి జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. అలా వెళ్తూ తన భర్త జేబులో నుంచి వాలెట్ కొట్టేస్తుంది. ఇది గమనించిన అధికారి తన వాలెట్‌ను తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమెను కలుసుకుంటాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ కాన్సెప్ట్‌తో తీసిన వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ స్నేహితులకు, బంధువులకు విపరీతంగా నచ్చింది. దాంతో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. నెటిజనులకు కూడా ఈ వీడియో తెగ నచ్చింది. అందరికి నచ్చిన ఈ వీడియో పోలీసు శాఖకు మాత్రం ఆగ్రహం తెప్పించింది. డిపార్ట్మెంట్ పరువు తీసేలా లంచం తీసుకుంటూ వీడియో తీయడమే కాక దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేసినందుకు సదరు అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల ఇవ్వడమే కాక తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నారు. అసలు యూనిఫామ్‌ని ఇలా వ్యక్తిగత కార్యక్రమాల కోసం వినియోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక మీదట ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఎంవీఐ లంచం.. వయా గూగుల్ పే
సాక్షి, కరీంనగర్ : రవాణాశాఖ కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయనే సుప్రీం. పేరుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) అయినా... రవాణా శాఖ జిల్లా అధికారికి తగ్గని స్థాయి ఆయనది. జిల్లాల పునర్విభజన తరువాత నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితమైన కరీంనగర్‌కు ఆయనొక్కడే ఎంవీఐ. ఐదేళ్లుగా రెగ్యులర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ లేరు. ప్రస్తుతం ఆదిలాబాద్ డీటీసీ శ్రీనివాస్ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీఐదే ఇష్టారాజ్యం. మూడేళ్లలో పదవీ విరమణ చేయాల్సిన ఆయన వాహనాల తనిఖీ పేరిట సాగించే అవినీతి దందాకు సరికొత్త విధానాన్ని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నగదు రహిత లావాదేవీల విధానాన్ని లంచం వసూళ్లకు కూడా వాడుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నుంచి వసూలు చేసే అపరాధ రుసుమును ‘గూగుల్ పే’ ద్వారా చెల్లించాలని డ్రైవర్లకు ఆదేశాలిచ్చారు. అయితే అది వెళ్లేది మాత్రం రవాణా శాఖకు కాకుండా సొంతానికి. ఇందుకోసం ప్రైవేటు సైన్యాన్ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. ఇటీవల తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం ఎంపీటీసీ భర్త అశోక్‌రెడ్డి నుంచి రూ.5 వేలు గూగుల్‌పే యాప్ ద్వారా ఎంవీఐ లంచం తీసుకున్నాడు. అలాగే వాహన తనిఖీ పేరిట పెద్ద ఎత్తున డబ్బులు పలు ఖాతాల్లో జమ చేయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అశోక్‌రెడ్డి డీటీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, మీడియాలో రవాణా శాఖలో జరుగుతున్న దందాపై కథనాలు రావడంతో కరీంనగర్ ఇన్చార్జి డీటీసీ శ్రీనివాస్ సదరు ఎంవీఐని రవాణాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేశారు. ఎంవీఐ గౌస్‌పాషా సరెండర్ కరీంనగర్ జిల్లా రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్‌పాషాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను రవాణాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి డీటీసీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలు, ఇతర ఫిర్యాదుల మేరకు జరిపిన ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిన అంశాల ఆధారంగా గౌస్‌పాషాను సరెండర్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గుర్తించిన అంశాలపై పూర్తిస్థాయిలో రవాణాశాఖ కమిషనర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా, గౌస్‌పాషా సరెండర్‌తో ప్రస్తుతం జిల్లాలో రెగ్యులర్ ఎంవీఐ లేకుండా పోయినట్లయింది. మూడేళ్ల సర్వీస్.. పర్సనల్ గార్డుల నియామకం సరెండర్ అయిన వీఎంఐకి ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న కాలంలో అందిన కాడికి దండుకోవాలనే ఆలోచనతో నిత్యం వాహనాల తనిఖీ పేరిట వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. డీటీసీకి సైతం సమాచారం ఇవ్వకుండా తనే వాహనంలో వెళ్లి తనిఖీల దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులను గార్డులుగా నియమించుకొని మరీ వాహనాలను నిలిపివేయించి, నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరైనా మీరెవరు..? మీ గుర్తింపు కార్డేది? అని ప్రశ్నిస్తే వెంటనే ఎంవీఐకి ఫోన్‌చేసి మాట్లాడిస్తారు. అధికారి స్వయంగా మాట్లాడి తానే వారిని నియమించానని, మీ పత్రాలు చూపించి వెళ్లాలని చెప్పి... వారికి డబ్బులు ఇచ్చి వెళ్లాని ఆదేశించేవారని తెలిసింది. ఇటీవల కూడా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో సదరు పర్సనల్ హోంగార్డులు వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కొత్తగూడెంలో పనిచేసిన సమయంలోనూ ఇదేరీతిన వ్యవహరించినట్లు సమాచారం. గూగుల్ పేతో పలు నెంబర్లకు మనీ ట్రాన్స్ఫర్ రవాణా అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఎంవీఐ లంచం తీసుకున్నాడని నిర్ధారణ అయినట్లు తెలిసింది. తన చేతికి కరెన్సీ నోట్లు అంటని విధంగా... నేరుగా డబ్బులు తీసుకోకుండా ‘గూగుల్ పే’ ద్వారా పలు బినామీ నంబర్లకు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు తేలింది. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. వాహనాల తనిఖీలో నిబంధనలు పాటించని వాహనాలపై వేసే అపరాధ రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉండగా... తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు తేలింది. గతమంతా అవినీతిమయమే.. కరీంనగర్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంవీఐ గత చరిత్ర కూడా అవినీతిమయమే అని తెలుస్తోంది. గతంలో కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించిన సమయంలో వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీకి పట్టుపడ్డట్టు సమాచారం. దీంతో రవాణా అధికారులు ఈయనతోపాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి విధుల్లో చేరారు. అతడిని విధుల్లోకి తీసుకున్న అధికారులు కరీంనగర్ రవాణా కార్యాలయానికి బదిలీ చేశారు. -
ఫుట్‌బాల్ టికెట్లు, వాచీలు..!
న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్ పొందేందుకు కంపెనీ మేనేజ్మెంట్ ఏవిధంగా అడ్డదారులు తొక్కారన్న వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా తాయిలాలిచ్చి ఏవిధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర ఆడిట్లో వెల్లడయింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలకు మెరుగైన రేటింగ్స్ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్మెంట్ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్ నిర్వహిస్తున్న గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఇండియా రేటింగ్స్ అధికారికి లబ్ధి.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ (ఐటీఎన్‌ఎల్), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎఫ్ఐఎన్), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ సంస్థలు రేటింగ్ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్ఐఎన్ మాజీ సీఈవో రమేష్ బవా, ఫిచ్ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విభాగం హెడ్ అంబరీష్ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణలను గ్రాంట్ థార్న్టన్ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోనూ రమేష్ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్ ఎండీ అజయ్ చంద్రను కూడా రమేష్ కోరినట్లు నివేదికలో పేర్కొంది. -
అవినీతి తిమింగళాలు..
సాక్షి, షాద్‌నగర్: ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా రెవెన్యూ సిబ్బందిలో మార్పు కానరావడం లేదు. యథేచ్ఛగా అక్రమాలను కొనసాగిస్తున్నారు. చిన్నచిన్న పనుల కోసం వచ్చే రైతులను లంచాల పేరుతో వేధిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ రైతు నుంచి కొందుర్గు వీఆర్వో రూ.4లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. హైదరాబాద్‌లోని కేశంపేట వీఆర్వో ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి. భూమి ఆన్లైన్లో నమోదుకు రూ.9లక్షలు లంచం డిమాండ్ కొందర్గు వీఆర్ఓ అనంతయ్య ఇటీవల కేశంపేట నుంచి బదిలీపై వచ్చారు. కాగా, కేశంపేట మండలం దత్తాయపల్లె శివారులో సర్వే నంబర్ 85/ఆ లో 9–07 ఎకరాల విస్తీర్ణం భూమి మామిడిపల్లి చెన్నయ్య పేరున పట్టా ఉంది. వీఆర్ఓ అనంతయ్య చెన్నయ్యకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే సమయంలో రూ.30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత అనంతయ్య జూన్ 13న కొందుర్గు బదిలీపై వచ్చారు. అయితే, రైతు చెన్నయ్యకు సంబందించిన భూమి 2019 జూన్ 18 వరకు ఆన్లైన్లో ఆయన పేరుపైనే కనిపించింది. కానీ, జూన్ 24న ఆన్లైన్లో చూడగా ఆ భూమి కనిపించలేదు. దీంతో బాధిత రైతు సంబందిత వీఆర్ఓ అనంతయ్యను సంప్రదించారు. దీంతో ఆన్లైన్లో నమోదు చేయడం కోసం రూ.9 లక్షలు కావాలని, తనతోపాటు తహశీల్దార్ లావణ్యకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అనంతయ్య రైతు చెన్నయ్య, అతడి కుమారుడు భాస్కర్‌కు చెప్పాడు. దీంతో వారు రూ.8 లక్షలు లంచం ఇవ్వడానికి వీఆర్ఓ అనంతయ్యతో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమై రైతు చెన్నయ్య కుమారుడు భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్ఓ అనంతయ్యకు బుధవారం భాస్కర్ రూ.4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ దాడల్లో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు గంగాధర్, మాజీద్, రామలింగారెడ్డి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. రూ.9లక్షలు అడిగాడు : భాస్కర్ 1951లో మా నాన్న చెన్నయ్య భూమి కొనుగోలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా వచ్చాయి. ఆన్లైన్లో కూడా నమోదు చేశారు. కానీ, తిరిగి ఆన్లైన్లో నుంచి తొలగించారు. ఆన్లైన్ నమోదు చేయాలంటే రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 8లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. నాలుగు బృందాలుగా ఏర్పడి.. అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి అవినీతి చేపలను పట్టుకున్నారు. అయితే బుధవారం ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి కొందుర్గు, షాద్‌నగర్, కేశంపేట రెవెన్యూ కార్యాలయాలతో పాటుగా, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కేశంపేట తహిసీల్దార్ లావణ్య ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొందుర్గు తహిసీల్దార్ కార్యాలయంలో రైతు మామిడిపల్లి భాస్కర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో షాద్‌నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంతో పాటు కేశంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుకు సంబంధించిన భూరికార్డులను అధికారులు పరిశీలించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలోని కంప్యూటర్లతో పాటుగా, రికార్డులను పరిశీలించారు. భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి తీసుకోవడం వెనక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైతు మామిడిపల్లి భాస్కర్‌కు సంబంధించిన భూమి వివరాలను ఓసారి ఆన్లైన్లో నమోదు చేసి కొన్ని రోజుల తర్వాత ఏవిధంగా తొలగించారన్న విషయంపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వీఆర్వో బదిలీ అయినా కేశంపేట మండలంలో సుమారు పదేళ్ళకు పైగా అనంతయ్య వీఆర్వోగా పనిచేశారు. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, దత్తాయపల్లి, ఇప్పలపల్లి, కేశంపేట గ్రామాల్లో వీఆర్వోగా పనిచేసిన అనంతయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేశంపేటకు చెందిన చందన అనే మహిళా రైతుకు సంబంధించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో ఆమె తహిసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ వ్యవహారంలో తహిసీల్దార్ లావణ్య, వీఆర్వోలు ఇబ్బందులు పెడుతున్నారని మహిళా రైతు ఆరోపణలు చేసింది. ఇటీవల జిల్లా అధికారులు వీఆర్వోల బదిలీల నేపథ్యంలో అనంతయ్యను కొందుర్గు మండల కేంద్రానికి బదిలీ చేశారు. ఆయన బదిలీ అయినా కేశంపేట మండలానికి సంబంధించిన రైతుల భూ వ్యవహరాల్లో తలదూర్చి ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఇటీవల షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు కేశంపేట తహిసీల్దార్ లావణ్య కాళ్లుపట్టుకొని భూ సమస్యను పరిష్కరించాలని వేడుకున్న సంఘటన ఆ రోజు చర్చనీయాంశమైంది. ఆర్డీఓ కార్యాలయ అధికారుల పాత్ర? వీఆర్వో భారీ ఎత్తున లంచం డిమాండ్ చేయడంలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే అధికారుల హస్తం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నా.. తొలగించాలన్నా.. ఆర్డీఓ కార్యాలయం అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది. అయితే భూమికి సంబంధించిన వివరాలను ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత.. తొలగించడంలో ఎవరెవరి పాత్ర ఉంది, లంచాలు ఎవరెవరు డిమాండ్ చేశారు అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాపు చేపడుతున్నట్లు తెలిసింది. ఉలిక్కిపడిన అధికారులు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో షాద్‌నగర్ డివిజన్లోని అన్ని శాఖల అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు అధికారులు సమయాని కంటే ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ పట్టుబడటం, ఏకకాలంలో కార్యాలయాల్లో తనిఖీలు జరగడంతో అసలు ఏం జరుగుతుందోనని, ఎవరెవరు మెడకు ఉచ్చుబిగించుకుంటుందనే చర్చ జరుగుతోంది. అవినీతి దందాలో కుమ్మక్కు తహసీల్దార్, వీఆర్వో ఇద్దరు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే రైతుకు సంబంధించిన భూమి వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. భూ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించాలంటే.. ఎందుకు తొలగించాల్సి వస్తుందోనన్న వివరాలను రైతుకు తెలియజేయడంతో పాటుగా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్‌లు విధిగా ఉండాలని, అప్పుడే ఆన్లైన్లో నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం అలాందేమీ లేకుండా ఆన్లైన్లో వివరాలు తొలగించినట్లు తెలుస్తోంది. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూర్యానారాయణ సూచించారు. అధికారులు లంచం అడిగితే 9440446140 సంప్రదించాలని తెలిపారు. -
బీజేపీకి షాక్.. రిపోర్టర్లకు లంచం ఇవ్వబోయారంటూ
శ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల జోరుగా సాగుతున్న తరుణంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. లడఖ్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వార్తలు ప్రచారం చేయాలంటూ.. ఆ పార్టీ నాయకులు తమకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని లేహ్ రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎన్డీటీవీ ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ విషయం గురించి మహిళా జర్నలిస్ట్ రించెన్ ఆంగ్మో మాట్లాడుతూ.. 'ఈనెల 2న ఓ హోటల్లో బీజేపీ నాయకులు విక్రం రంధావా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాం. కార్యక్రమం ముగిశాక మేము బయటకు వెళ్తున్న సమయంలో బీజేపీ నాయకులు మా దగ్గరకు వచ్చారు. నలుగురు రిపోర్టర్లకు ఎన్వలప్‌లను ఇచ్చారు. అనుమానం వచ్చిన రిపోర్టర్లు వాటిని తెరిచి చూడగా దానిలో రూ. 500 నోట్లు ఉన్నాయి. బీజేపీ చర్యలకు మేం షాక్ అయ్యాం. ఇలా చేయడం తప్పని చెప్పాం’ అన్నారు. కానీ విక్రం, రవీందర్‌లు ‘ఇది కేవలం అభిమానంతో ఇస్తున్నాం. ఈ రోజుల్లో ఇదంతా సాధారణమేనని, ఇలాంటివి ప్రతిచోటా జరుగుతాయని మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ, వెంటనే మా రిపోర్టర్లు ఆ ఎన్వలప్‌లను అక్కడే టేబుల్‌పై పెట్టి బయటకు వచ్చార’ని రించెన్ ఆంగ్మో తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఓ సీనియర్ బీజేపీ నాయకుడు ఖండించారు. తమ నాయకులు రిపోర్టర్లకు ఇచ్చింది ఎన్వలప్‌లు కాదని.. ఇన్విటేషన్ కార్డని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో నిర్మలా సీతారామన్ పర్యటించబోతున్నారని.. దాన్ని కవర్ చేయడానికి రిపోర్టర్లను ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ ఇచ్చామని ఆయన తెలిపారు. జర్నలిస్ట్‌లకు మేం చాలా గౌరవం ఇస్తాం. బీజేపీ ఇలాంటి పనుల ఎన్నటికి చేయదని ఆయన స్పష్టం చేశారు. ఈసీకి జర్నలిస్టుల ఫిర్యాదు లడఖ్ ఎంపీ స్థానంలో ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా వార్తలు ప్రచారం చేయాలంటూ రిపోర్టర్లకు లంచం ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నించిందని లేహ్ ప్రెస్ క్లబ్ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. -
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప
గరిడేపల్లి : ఏసీబీ అధికారుల దాడులతో గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఒక రైతు నుంచి లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్, కార్యాలయంలో పని చేస్తున్న ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలిలా.. మండలంలోని కుతుబ్షాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్యకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన రికార్డులు మార్చి రెవెన్యూ సిబ్బంది పట్టా చేశారు. లింగయ్య బతుకు దెరువు కోసం వెళ్లి కొంతకాలంగా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో నివాసం ఉంటున్నాడు. గత ఏడు సంవత్సరాలుగా కుతుబ్షాపురంలో ఉన్న భూమిని గుడుగుంట్ల వెంకయ్య అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. అయితే రెండేళ్లుగా కౌలు ఇవ్వటం లేదని లింగయ్య తెలిపాడు. కుతుబ్షాపురానికి చెందిన కొంతమంది భూమి పట్టా మార్చుకున్నారని లింగయ్యకు తెలిసింది. దీంతో లింగయ్య గరిడేపల్లిలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాడు. తన పేరు మీద ఉన్న సర్వే నంబర్ 399లోని భూమిని తన అక్క లక్ష్మి, వెంకయ్యల పేరు మీద పట్టా అయినట్లు రికార్డుల్లో ఉండడంతో అవాక్కయ్యాడు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ వద్దకు వెళ్లి అడగగా రూ.20వేల లంచం ఇస్తే నీ పేరు మీద పట్టా ఇస్తానని చెప్పినట్లు బాధితుడు లింగయ్య తెలిపాడు. తన వద్ద డబ్బులు లేవని, పేద వ్యక్తినని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో 1980 నుంచి ఉన్న పాత పహాణీలు ఇవ్వాలని డీటీని కోరినట్లు తెలిపాడు. పహాణీలకు కూడా రూ.15వేల లంచం ఇస్తేనే అందజేస్తానని డీటీ చెప్పటంతో రూ.8వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. లింగయ్య సోమవారం డబ్బులు తీసుకుని కార్యాలయానికి వెళ్లగా అక్కడ పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి పయిడిమర్రి ప్రకాశంకు ఇవ్వాలని డీటీ సూచించాడు. రూ.8వేలు పయిడిమర్రి ప్రకాశానికి అప్పజెప్పగానే పహాణీలు ఇచ్చాడు. అదే సమయంలో అక్కడే కాచుకునివున్న ఏసీబీ అధికారులు ప్రకాశంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కాగా కార్యాలయానికి వచ్చిన రైతుల సమస్యలను ఏసీబీ అధికారులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ నల్లగొండ రేంజ్ అధికారి ఏపీ ఆనంద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ బండారు సత్యనారాయణ సూచన మేరకు కార్యాలయంలో పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి ప్రకాశం కుతుబ్షాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్య అనే రైతు నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా అవినీతికి పాల్పడినా, లంచం అడిగినా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్, సీఐ రఘుబాబు, వెంకటరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
రూ.5వేలు లంచం తీసుకుంటూ..
సాక్షి, పరకాల : కల్యాణలక్ష్మి లబ్ధిదారుడి నుంచి రూ. ఐదు వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏసీపీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం పరకాల మండలం రాయపర్తి గ్రామానికి చెందిన పర్నెం శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు పెళ్లి చేసి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేçసుకున్నాడు. పథకానికి అర్హులు కావడానికి పలు ధృవీకరణ పత్రాలు అందజేశాడు. అయినప్పటికీ ఆరునెలలుగా నడికుడ ఆర్ఐ సంపత్‌కుమార్ పెండింగ్‌లో పెడుతూ ఇబ్బందులు పెడుతున్నాడు. లంచం ఇస్తేనే పనిచేస్తానని స్పష్టం చేయడంతో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కార్యాలయంలో సంపత్‌కుమార్‌కు రూ.ఐదు వేల లంచం అందజేశాడు. కొద్ది క్షణాలకే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. ఐదు వేలు స్వాధీనం చేసుకొని ఏసీబీ కోర్టుకు తరలించారు. నడికుడ తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం అయిన సమయంలోనే వీఆర్వో నుంచి ఆర్ఐగా ఉద్యోగోన్నతి పొందిన ఆయన ఏసీబీ చిక్కడం కలకలం రేపింది. -
గేదెల దొంగతనం కేసు: ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై
సాక్షి, మహేశ్వరం: రూ. 80 వేల లంచం తీసుకుంటుండగా మహేశ్వరం ఎస్ఐ జి. నర్సింహులును ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. గేదెల దొంగతనం కేసులో నిందితులపై కేసులు, సేక్షన్లను తగ్గించి చిన్న కేసులు పెట్టించి సురక్షితంగా బయటపడేవిధంగా చేస్తానని చెప్తూ.. నిందితుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. నర్సింహులును ఏసీబీ క్యాచ్‌చేసింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గతవారం రోజుల కిత్రం కల్వకోల్, నాగిరెడ్డిపల్లి, గొల్లూరు గ్రామాల్లో పొలం వద్ద పశువుల పాకలో కట్టేసిన గేదెలను దొంగలు అపహరించుకుపోయారు. గేదెలు పోయిన రైతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి ఈ దొంగతనం కేసును ఛేదించారు. అమీర్‌పేట్ గ్రామానికి చెందిన రాజు పొలం వద్ద కట్టేసిన గేదెలను దొంగిలించాడని గుర్తించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించారు. దొంగిలించిన గేదెలను మొయినాబాద్‌కు చెందిన సయ్యద్ నజీర్, ఖలీద్‌కు సర్ధార్‌నగర్ సంతలో విక్రయించానని అతను పోలీసులకు చెప్పాడు. పోలీసులు నజీర్, ఖలీద్‌లను పట్టుకొని విచారించడంతో.. కొనుగోలు చేసిన గేదెలను సంగారెడ్డికి చెందిన గేదెల వ్యాపారి హర్షద్‌కు విక్రయించామని వారు తెలిపారు. ఈ దశలో ఎస్ఐ నర్సింహులు కేసును తన చేతిలోకి తీసుకొని గేదెల దొంగతనం చేసిన రాజు, కొనుగోలు చేసిన సయ్యద్ నజీర్, ఖలీద్, హర్షద్‌లను పోలీసులకు స్టేషన్‌కు తీసుకొచ్చి బెదింపులకు దిగాడు. ముగ్గురిపైన కేసులు, సేక్షన్‌న్లు నమోదుచేసి ఇబ్బందులకు గురి చేస్తానని బెదిరించాడు. అడిగినవన్నీ డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని, బెయిల్ రాకుండా చేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన గేదెల వ్యాపారి సయ్యద్ నజీర్.. ఎస్సై లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే రూ. 60 వేలు ఇచ్చాడు. చోరీ కేసులో ఉన్న మరో గేదెల వ్యాపారి హర్షద్‌ను రూ. 1.10 లక్షలు ఇస్తే నామమాత్రం కేసులు పెట్టి వదిలేస్తానని, ఇవ్వకపోతే పెద్దకేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించడంతో అంత డబ్బులు తాను ఇవ్వలేను రూ. 80 వేల రూపాయాలు ఇస్తానని.. తనను తప్పించండి సార్ అని బతిమాలాడుకున్నాడు. గురువారం పోలీస్ స్టేషన్ వచ్చి నేరుగా మీకే డబ్బులు ఇస్తానని ఎస్ఐకి చెప్పాడు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న లంచగొండి ఎస్ఐ నర్సింహులును ఏసీబీ అధికారులకు పట్టించి తగిన బుద్ధి చెప్పాలని హర్షద్ నిర్ణయించుకున్నాడు. గురువారం ఉదయం నాంపల్లిలో ఉన్న ఏసీబీ అధికారులను హర్షద్ ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ముందుగానే ప్రణాళిక వేసుకొని హర్షద్ చేతికి కెమికల్ రుద్దిన రెండు వేలనోట్లతో కూడిన రూ. 80 వేలు ఇచ్చి ఎస్ఐ నర్సింహులు వద్దకు పంపారు. ఎస్ఐ నర్సింహులు హర్షద్ వద్ద నుండి రూ. 80 వేల లంచం తీసుకుంటుండగా పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా ఎస్ఐ నర్సింహులు , డబ్బులను పట్టుకున్నారు. -
‘లంచం తీసుకోనని అమ్మకు మాటిచ్చాను’
న్యూఢిల్లీ : ఆ రోజు మా అమ్మ నా చేత లంచం తీసుకోనని ప్రమాణం చేయించింది.. అందువల్లే నేను ఈ రోజు ఇంత స్వచ్ఛంగా ఉన్నాను అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు విషయాల గురించి మాట్లాడారు. ‘మా అమ్మ దృష్టిలో ప్రధాని పదవి కన్నా గుజరాత్ సీఎం పదవే చాలా విలువైనది. ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు నేను ఆమెకు దగ్గరగా ఉండేవాడిని కదా అందుకే సీఎం పదవంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం’ అని తెలిపారు. అంతేకాక ‘నన్ను తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రకటించిన సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. ప్రమాణస్వీకారానికి ముందు నేను మా అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవడానికి అహ్మదాబాద్ వెళ్లాను. అప్పుడు మా అమ్మ నా సోదరుని దగ్గర ఉండేది. నేను వెళ్లేసరికే అక్కడ సంబరాలు ప్రారంభమయ్యాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని కాబోతున్నానని మా అమ్మకు కూడా తెలిసింది. అయితే ఆ పదవి బాధ్యతలు ఎలా ఉంటాయనే విషయం మా అమ్మకు తెలియదు. నేను వెళ్లగానే మా అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని.. పోనిలే ఇక మీదట నువ్వు ఇక్కడే ఉంటావు. నాకదే చాలు అంది’ అని గుర్తు చేసుకున్నారు. అప్పుడు మా అమ్మ ‘నీ ఉద్యోగం ఏంటో నాకు తెలియదు. కానీ జీవితంలో లంచం తీసుకోను అని నాకు మాటివ్వు అన్నారు. ఆ రోజు మా అమ్మకిచ్చిన మాట ప్రకారం నా జీవితంలో లంచం తీసుకునే పాపం చేయ్యలేదు. ఫలితంగా ఈ రోజు ఇంత స్వచ్ఛంగా ఉన్నాన’ని తెలిపారు. అంతేకాక ‘సీఎం, పీఎం అన్నది అమ్మకు ముఖ్యం కాదు. ఆ సీటులో కూర్చున్న వారు ఎవరైనా సరే నిజాయితీగా ఉండాలి.. దేశం కోసం పాటుపడాలి అనేదే ఆమె సిద్దాంతం’ అంటూ చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా 13 సంవత్సరాలు పనిచేశారు. 2014లో బీజేపీ తరఫున ప్రధాని అయ్యారు -
లంచం ఇచ్చేందుకు భిక్షాటన..
వెలుగోడు: అధికారులకు లంచం ఇవ్వడం కోసం కుటుంబ సభ్యులతో కలసి భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపాడు ఓ రైతు. ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గౌరెడ్డికి ఇద్దరు కొడుకులు కాగా.. వారిలో వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు రెండో కుమారుడు. వారసత్వంగా తనకు 25 ఎకరాల భూమి దక్కాల్సి ఉండగా, దీన్ని సమీప బంధువు ఆక్రమించాడని రాజు ఆరోపిస్తున్నాడు. తన భూమి తిరిగి ఇప్పించాలని రాజు కోరగా వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం వెలుగోడు పట్టణంలో రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు చేతిలో గిన్నె పట్టుకొని.. మెడలో ఓ బ్యానర్ వేసుకుని భిక్షాటన చేయడం ప్రారంభించారు. బ్యానర్‌పై ‘దయచేసి నాకు దానం చేయండి. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయా. కాబట్టి నా భూమిని కోల్పోయా. రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నా’ అని రాసి ఉంది. రాజు ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య వెలుగోడు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. రాజు అనుభవంలో 2.15 ఎకరాల పొలం మాత్రమే ఉందని, దాయాదుల మధ్య వివాదాన్ని తమపై నెడుతున్నాడని ఆరోపించారు. ఆయన భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని తహసీల్దారు సూచించారు. -
అధికారులకు లంచం ఇచ్చేందుకు రైతు భిక్షాటన
-
లంచమివ్వాలి.. దానం చేయండి ప్లీజ్!
సాక్షి, కర్నూలు : సమాజంలో అవినీతి, లంచం ఎంతలా పెరిగిపోయాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. అధికారులకు లంచం ఇవ్వడం కోసం ఓ రైతు కుటుంబంతో కలిసి భిక్షాటన చేస్తున్నారు. వివరాలు.. కర్నూలు జిల్లాకు చెందిన మన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజుకు పశ్చిమ గోదావరి జిల్లా మాధవరం గ్రామంలో 25 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమిని రాజు సమీప బంధువు ఒకరు అక్రమంగా ఆక్రమించినట్లు రాజు ఆరోపించారు. అంతేకాక సదరు బంధువు అధికారులకు లంచం ఇచ్చి, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి.. భూమిని ఆక్రమించుకున్నాడన్నారు రాజు. ఈ విషయం గురించి అధికారులను సంప్రదించగా ఇప్పటికే సదరు బంధువు పేర మీద డాక్యుమెంట్ పేపర్లు తయారయ్యాయని.. ఏ నిమిషంలోనైనా వాటిని అతనికి అందజేస్తామని తెలిపారన్నారు. అధికారుల తీరుతో విసిగిపోయిన రాజు.. తన భూమిని కాపాడుకునేందుకు బిచ్చగాడిగా మారారు. రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు కూడా చేతిలి భిక్షపాత్ర పట్టుకుని.. మెడలో ఓ బ్యానర్ వేసుకుని కనిపించిన వారినల్లా దానం చేయమని కోరుతున్నారు. బ్యానర్ మీద ‘దయచేసి నాకు దానం చేయండి.. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయాను.. కాబట్టి నా భూమిని కోల్పోయాను. గత రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నాను’ అని రాసి ఉంది. అయితే ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్‌ని ప్రశ్నించగా.. రాజు చేస్తున్న ఆరోపణలు నిరాధరమైనవని తెలిపారు. అధికారుల గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నందుకుగాను అతని మీద పరువునష్టం కేసు పెడతామని హెచ్చరించారు. అతని భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని చెప్పారు. -
చేయి తడిపితేనే..
సాక్షి, యాదాద్రి : నూతన మున్సిపాలిటీల ఏర్పాటు అధికారులకు సిరులు కురిపిస్తున్నాయి. నేటినుంచి కొత్త మున్సిపాలిటీలు కొలువుదీరనుండడంతో ఆలోపే అందినకాడికి దండుకుంటున్నారు. వివిధ రకాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నవారి నుంచి పోటీ పడి వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తూనే అంతకు రెట్టింపు స్థాయిలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది, మధ్యవర్తులుగా మారి భవన నిర్మాణాలు, వెంచర్ల అనుమతుల కోసం లక్షల రూపాయలు వసూలు చేశారు. అనుమతుల కోసం క్యూ జిల్లాలో మేజర్‌గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆలేరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూర్ పట్టణాలను సమీప గ్రామాలతో కలిసి మున్సిపాలిటీలుగా మారాయి. దీంతో ఇళ్లు, భవన నిర్మాణాల కోసం జనం ఈఓల వద్దకు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. ఇదే అదనుగా ప్రజలనుంచి అనధికారికంగా లక్షల రూపాయలు దండుకున్నారు. ఈ క్రమంలోనే చౌటుప్పల్ ఈఓపీఆర్డీ, చౌటుప్పల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ భవన నిర్మాణ అనుమతికోసం రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలో అనుమతుల పేర జరుగుతున్న అక్రమాలను అరికట్టడంలో ఉన్నతస్థా యి అధికారులు విఫలమయ్యారా లేక వారితో భా గస్వాములు అయ్యారా.. అన్న అనుమానం ప్రజ ల్లో వ్యక్తమవుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తుండగా కొందరు అధికారులు మాత్రం అక్రమాలకు పాల్పతుం డడం ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు వస్తోంది. ప్రత్యేకంగా వచ్చాడు చౌటుప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శిగా నర్సిరెడ్డి జూలై 16నుంచి విధుల్లో చేరారు.ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి ఈయనను ప్రత్యేకంగా రప్పించినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఉన్న రెగ్యులర్ కార్యదర్శి అంజన్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం లేదని ఓ ప్రజాప్రతినిధి తీవ్రమైన ఒత్తిడి తేవడంతో ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం తనకు అనుకూలమైన అధికారిని సదరు ప్రజాప్రతినిధి ఇన్చార్జి కార్యదర్శిగా నియమించడంలో విజయం సాధించారు. ఇంకేముంది ఉన్నది 15 రోజులే కాబట్టి ఆలోపే అందినంత దండుకోవాలన్న ఎజెండాతో పని చేశాడు నర్సిరెడ్డి. ఈఓపీఆర్డీగా మండల పరిషత్‌లో సంతకం చేసి ఇన్చార్జి కార్యదర్శిగా చౌటుప్పల్ పంచాయతీకి వెళ్లేవారు. ప్రజల అవసరాలను అదునుగా భావించి.. చౌటుప్పల్ మున్సిపాలిటీ కావడంతో పన్నులు పెరుగుతాయన్న భయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం నర్సిరెడ్డి వద్దకు క్యూకట్టారు. ఆయన ఇదే అదునుగా భావించి తన అనుచరుల ద్వారా ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు ఇవ్వడం కోసం రూ.లక్షల్లో బేరాలు కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వని వారికి కొర్రీలు పెట్టి తన చుట్టూ తిప్పుకునేవాడు. మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు మాట్లాడి వారి ద్వారా వసూలు చేశారు. గత నెల 30, 31తేదీల్లో నర్సిరెడ్డి సెలవు పెట్టి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, దాబాల్లో కూర్చుని బేరాలు సాగించాడు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం సుమారు 20 మంది వరకు డబ్బులు లంచాలుగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఏసీబీకి పట్టుబడటంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాగే అనుమతుల కోసం వెంచర్లలో ప్లాట్లను తమ బినామీల పేర్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏసీబీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబును ఇదే స్థాయిలో వేదించాడు. భవన నిర్మాణ అనుమతి కోసం రూ.2లక్షలు డిమాండ్ చేయగా రూ.70వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మొత్తాన్ని బుధవారం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. పన్నులపై ప్రజల్లో అవగాహన లేమి మున్సిపాలిటీలో మూడేళ్ల వరకు పన్నులు పెంచడం లేదని సీఎం కేసీఆర్ ప్రకటించిన విష యం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలకు ఈవిషయంపై అవగాహన లేక పన్నులు పెరుగుతాయన్న భయంతో అనుమతుల కోసం ఎగబడుతున్నారు. మున్సిపాలిటీలుగా మారుతున్న చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్టల్లో భూములకు ధరలు అధికంగా ఉన్నాయి. వాటి ఆధారంగా పన్నులు పెరిగితే అనుమతుల కోసం అధికంగా ఫీజులు చెల్లించాల్సి వస్తుందని ముందుగానే పంచాయతీ కార్యదర్శులు, మధ్యవర్తులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో జనం పెరిగే పన్నులను అతిగా ఊహించుకుని అమనుతుల కోసం అధికారుల వద్దకు క్యూ కట్టారు. ఇది వారికి కాసులను కురిపించింది. గతంలోనూ ఏసీబీకి చిక్కిన కొందరు అధికారులు గతంలో భువనగిరి మున్సిపాలిటీలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడానికి రూ.50వేలు లంచం తీసుకుంటున్న మున్సిపల్ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అలాగే ట్రాన్స్‌కోకు చెందిన భువనగిరి రూరల్ ఏఈ, లైన్మెన్లు లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబట్టారు. బస్వాపురం వీఆర్వో, యాదగిరిగుట్ట తహసిల్దార్, ఆర్ఐ, ఆలేరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు, రాజాపేట మండలం బొందుగుల వీఆర్ఓ ఇలా పలువురు అధికారులు సుమారు 20మంది వరకు యాదాద్రిభువనగిరి జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. మరికొందరిపై ఏసీబీ నిఘా! జిల్లాలో మరికొందరిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సబ్‌ట్రెజరీ, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరుపై ఇటీవల పలు ఫిర్యాదులు వస్తున్నాయి. భూముల రి జిస్ట్రేషన్ల కోసం సబ్‌ట్రెజరీ అధికా రులు, భూ రికార్డుల ప్రక్షాళనలో పాస్‌బుక్కులు, భూముల ఆస్తి మార్పిడి కోసం, రెవెన్యూ అధికారులు, గొ ర్రెల పంపిణీలో డాక్టర్లు, వెంచర్లకు అనుమతులు ఇవ్వడం కోసం టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, పం చాయతీరాజ్ అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఏసీబీ నిఘా పెట్టింది. తాజాగా పంచాయతీరాజ్ ఉద్యోగి పట్టుబడటంతో జిల్లాలోని పలువురు ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది. -
మసబ్‌ట్యాంక్ టీయూఎఫ్ఐడీసీలో ఏసీబీ దాడులు
-
ఏసీబీ వలలో టీయూఎఫ్ఐడీసీ ఇంజనీర్
హైదరాబాద్ : తెలంగాణ పట్టణ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీయూఎఫ్ఐడీసీ) ఇంజనీర్‌గా పనిచేస్తోన్న ప్రవీణ్ చంద్రను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌కు రావలసిన నిధుల విడుదలకు లంచం వసూలు చేసినందుకు గానూ అదుపులోకి తీసుకున్నారు. వనపర్తిలో కాంట్రాక్టర్ కాంతారెడ్డి 2008 సంవత్సరంలో రూ.14.32 కోట్ల విలువైన సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల పనులను ప్రారంభించి 2010లో పూర్తి చేశారు. ఆ పనులకు సంబంధించి రూ.13 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో రూ.1.32 కోట్లు సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. ఆయన మరోసారి అభ్యర్థించగా మేలో నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వాటి విడుదల అధికారం ప్రవీణ్ చంద్రకు ఉంది. తనకు రూ.10 లక్షలు లంచం ఇస్తేనే నిధులు వస్తాయంటూ మెలిక పెట్టారు. రూ.3 లక్షలు ఇవ్వగలనని కాంట్రాక్టర్ బేరమాడి సమాచారాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు. ఫోన్ చేసి రూ.2 లక్షలు ఇస్తానని, నిధులు విడుదలైన తర్వాత మరో లక్ష ఇస్తానని కాంట్రాక్టర్, ఇంజనీర్‌కు చెప్పారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ.2 లక్షలు తీసుకుని మాసాబ్ ట్యాంక్‌కు వెళ్లారు. ఆ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రవీణ్ చంద్రను అక్కడికక్కడే పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మసాబ్ ట్యాంక్‌లోని ప్రవీణ్ కార్యాలయంలో దాడులు కొనసాగిస్తున్నారు. -
లంచం ఇస్తేనే పింఛన్..
సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో ఆసరా లేక, పనిచేయలేక జీవనం సాగిస్తున్న వృద్ధుల నుంచి లంచాలు తీసుకోవడానికి కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు వెనుకాడటం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల ఉన్నతాధికారులతో వివిధ పథకాల సంతృప్తి, అసంతృప్తి స్థాయిలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పింఛన్ అడిగితే లంచం అడుగుతున్నారని 23 వేల మంది ఫిర్యాదులు చేశారని అధికార వర్గాలు సీఎం దృష్టికి తీసుకువచ్చాయి. లంచం ఇస్తేనే పింఛన్ మంజూరు చేస్తున్నారని, లేదంటే ఏదో సాకుతో ఇవ్వడం లేదని సీఎంకు చెప్పాయి. రియల్ టైమ్ గవర్ననెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) నిర్వహించిన సర్వేలో కూడా పింఛన్ కోసం పీడీలు, ప్రజాప్రతినిధులు లంచాలు అడుగుతున్నారని 50 శాతం మంది తెలిపారు. కాగా, పింఛన్ నిర్దిష్ట సమయానికి ఇవ్వడం లేదని 36 వేల మంది ఫిర్యాదు చేశారు. కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇవ్వడం లేదని కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ కారణాలను సాకుగా చూపి ఏకంగా 4.45 లక్షల మందికి పింఛన్ల సొమ్ము ఇవ్వడం లేదు. మే నెలలో 49,41,145 పింఛన్లకు నిధులు విడుదల చేశారు. అయితే 44,95,456 మందికే పింఛన్లను పంపిణీ చేశారు. ఏకంగా 4,45,689 మందికి పింఛన్లు పంపిణీ చేయలేదు. ఇలా ప్రతి నెలా వివిధ కారణాల పేరుతో పింఛన్ల పంపిణీని లక్షల్లో తగ్గించేస్తున్నారు. ఇదే సమీక్షలో రేషన్ పంపిణీపై సంతృప్త స్థాయి గత నెలల కంటే ఈ నెలలో తగ్గిపోయినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రేషన్ కార్డు కావాలన్నా లంచాలు అడుగుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.కాగా, ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యుల దృష్టి భూముల కొల్లగొట్టడంపై పడింది. ఏళ్ల తరబడి తరతరాలుగా వస్తున్న భూముల హక్కులను కాలరాసేందుకు ఎత్తుగడ వేశారు. దీనికోసం ఇటీవల భూముల రికార్డులను కంప్యూటీకరించారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారులు, పట్టణాలకు సమీపంలోని విలువైన భూములపై కన్నేశారు. ఆ భూముల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ‘చుక్క’ పెడుతున్నారు. ఫలానా భూమికి సంబంధించి సరైన రికార్డులు లేవంటూ చుక్క పెడుతున్నారు. ఆ చుక్క తీయించేసి ఆ భూమి తనదేనని రికార్డులను సరిచేయించుకోవడానికి లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎకరాకు ఇంత చొప్పున రెవెన్యూ అధికారులకు లంచం రూపంలో ముట్టచెప్పాల్సి వస్తోంది. ఈ విధంగా తీసుకునే లంచాలు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాటాల రూపంలో పంపిణీ అవుతున్నాయి. ఇంటి జాగాలకు దరఖాస్తు చేసుకున్నా, గృహాల మంజూరుకు దరఖాస్తు చేసుకున్నా లంచం ఇస్తేనే పని అవుతోందని, లేదంటే అనర్హత జాబితాలోకి నెట్టేస్తున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ప్రధానంగా జన్మభూమి కమిటీలతోపాటు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు లంచాల బాట పట్టడంతోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గ్రామదర్శిని, నగరదర్శిని పేరుతో పై స్థాయి అధికారులను గ్రామాల బాట పట్టిస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
‘కల్యాణలక్ష్మి’కి దళారులు
సాక్షి, ఆసిఫాబాద్ కొమరంభీం : పేదింటి ఆడ బిడ్డ పెళ్లి చేసుకునే సమయంలో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంలో దళారుల తాకిడి ఎక్కువైంది. దరఖాస్తు చేసుకునేప్పుడు అందినకాడికి లబ్ధిదా రుల నుంచి దండుకుంటున్నారు. వివిధ సర్టిఫికెట్ల కోసం ఒక్కో దానికి ఓక్కో రేటు ఫిక్స్ చేసి లబ్ధి దారుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నా రు. ఈ పథకానికి దరఖాస్తు విధానం, అవసరమైన సర్టిఫికెట్లు తదితరవన్ని చాలా మందికి తెలియకపోవడంతో దళారులకు వరంగా మారింది. ఎవరైనా జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద కల్యాణలక్ష్మి లేదా షాదీముబారక్ కోసం వచ్చిందంటే ఆ లబ్ధిదారుల చుట్టు మధ్యవర్తులు చేరి వారికి కావాల్సిన వివరాలు తీసుకుంటూ రంగంలోకి దిగి ఒక్కో సర్టిఫికెట్‌కు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి పనులు చేస్తున్నారు. ఎక్కడ తిరిగే ఒపిక లేక లబ్ధిదారుల అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని.. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వివి ధ మండలాల నుంచి గ్రామీణులు, నిర క్షరాస్యులు నిత్యం వస్తుంటారు. వీరిలో కల్యాణలక్ష్మి కో సం కనీసం రోజుకు ఐదు నుంచి పది మంది వర కు లబ్ధిదారులు మ్యారేజి సర్టిఫికెట్ కోసం వ స్తుంటారు. ఇలా వచ్చిన వారిలో ఎలా దరఖాస్తు చేయాలో.. సర్టిఫికెట్ ఎలా పొందాలో చాలా మం దికి తెలియదు. దీంతో ఇలా అమాయకంగా కని పించే వారి వద్దకు మధ్యవర్తులు వెళ్లి అన్ని పనులు మేం చేసి పెడతాం.. దానికి కొంత ఖర్చు అవుతుందని చెబుతూ రంగంలోకి దిగుతున్నారు. ఉదాహరణకు కల్యాణలక్ష్మికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల వయస్సు నిర్ధారణ తప్పనిసరి. దీనికి ఆ ధార్కార్డు లేదా చదువుకున్న వాళ్లకు పదో తరగతి మార్కుల మెమోను ఆధారంగా తీసుకుంటున్నారు. చదువుకోని వాళ్లకు వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఇందుకు సివిల్‌సర్జన్ స్థాయి డాక్టర్‌తో వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్ తీసుకురావాలి. ఈ సర్టిఫికెట్లు పొందేందుకు నేరుగా లబ్ధిదారులు అధికారుల వద్దకు వెళ్తే పనులు కావడం లేదు. అదే దళారుల ద్వారా చాలా సులువుగా అయిపోతోంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.200 వరకు వీరి నుంచి వసూలు చేస్తూ డాక్టర్ల నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తున్నారు. మరో కీలక మైనది ఫస్ట్ మ్యారేజి సర్టిఫికెట్. ఇది లబ్ధిదారులు నేరుగా సబ్రిస్ట్రేషన్ ఆఫీసుకు దరఖాస్తు చేసి పంపిస్తే అధికారులు ఆ దరఖాస్తును అక్కడే నిలిపి వేస్తున్నారు. అదే మధ్యవర్తుల ద్వారా ఆఫీసుకు దరఖాస్తు వెళ్తే క్షణాల్లో సంతకం పెట్టి దరఖాస్తును ఆమోదిస్తున్నారు. దీంతో చదువుకున్న వారు సైతం మధ్యవర్తులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మ్యారేజి సర్టిఫికెట్ ప్రభుత్వ ఫీజు రూ.220 వరకు ఉంటే లబ్ధిదారుల నుంచి దళారులు రూ.2 నుంచి 3వేల వరకు గుంజుతున్నారు. గెజిటెడ్ సంతకాలు, లాయర్లతో అఫిడవిట్ ఫాంలు, ఆధార్‌కార్డులో వయస్సు, ఇంటిపేరు తప్పులు, కుల, ఆదాయ, పెళ్లి కూతురి తల్లి బ్యాంకు అకౌంట్ వివరాలు తదితర వన్ని ఒక్కో సర్టిఫికెట్ ఒక్కో రేటు చొప్పున మొత్తంగా పెళ్లి కానుకు అందుకోవాలంటే కనీసం రూ.5వేల వరకు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ దళారులు సంపాదించే వాటాలో అధికారులకు కూడా వాటా ఉండడంతో వాళ్లు కూడా వచ్చే సంపాదన కాదనక లేకపోతున్నారు. ‘ఎక్కడ ఏ సర్టిఫికెట్ దొరుకుతుందో ఖచ్చితంగా తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళా తెలిసినా.. సంబంధిత ఆఫీసుల చుట్టు తిరగలేక విసిగిపోతున్నారు. దీంతో మధ్యవర్తులకు ఎంతో కొంత ముట్టచెబుతూ పనులు చేసుకుంటున్నారని’ రెవెన్యూ శాఖలో పని చేసే ఓ అధికారి పేర్కొన్నారు. అయితే గతంలో ఇంత అధిక మొత్తంలో మధ్యవర్తులు వచ్చేవారు కాదని, గత మార్చిలో ప్రభుత్వం రూ.75 వేల నుంచి పెళ్లి కానుక లక్ష నూట పదహారు రూపాయలకు పెంచడంతో ఈ దళారుల బెడద ఎక్కువ అయిందని చెప్పుకొచ్చాడు. కొంతమంది అధికారులు పూర్తిగా మధ్యవర్తులకు పనులు చేయడంతో లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. దళారులను నమ్మొద్దు లబ్ధిదారులు మ్యారేజి సర్టిఫికెట్ కోసం ఎక్కడా అధికంగా డబ్బులు చెల్లించవద్దు. ప్రభుత్వ ఫీజు రూ.210 మాత్రమే చెల్లించాలి. దీనిపై గతంలో ఆఫీసులో సమీపంలో ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశాం. లబ్ధిదారులు స్థానికంగా పంచాయతీ ఈవో, మున్సిపాలిటీ కమిషనర్‌లో మ్యారేజి సర్టిఫికెట్ పొందితే చాలు. మళ్లీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్టిఫికెట్ అవసరం లేదు. అక్కడ చేసుకోలేని వారు మా వద్దకు రావాలి. – విజయకాంత్, సబ్‌రిజిస్ట్రార్ ఆసిఫాబాద్ -
ఏసీబీ వలలో సర్వేయర్..
ఒక్క రోజు కాదు.. రెండ్రోజులు కాదు.. సుమారు మూడు నెలలు... ‘నా భూమికి కొలత వేయండి సారూ...’ అని, ఆ సర్వేయర్‌ను అనిల్‌కుమార్ కోరుతున్నాడు. ఆ అధికారి.. ‘ఇదిగో–అదిగో’ అంటాడేగానీ కొలత వేయడం లేదు. అనిల్‌కుమార్‌కు ఆ అధికారి ‘అంతరంగం’ అర్థమైంది. ఆ అధికారి కూడా నేరుగా అసలు ‘విషయం’లోకి వచ్చాడు. పని జరగాలంటే 50వేల రూపాయలు లంచంగా ఇవ్వాలన్నాడు. బేరసారాలు సాగాయి. చివరికి 30వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాతేం జరిగింది...? ఎవరీ అనిల్‌కుమార్...? ఆ సర్వేయర్ ఎవరు.? ఖమ్మంసహకారనగర్ : విజయవాడలోని సూర్యా రావుపేటకు చెందిన ఎం.హన్మంతరావుకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో 29 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని కొలత వేసేందుకుగాను ఆయన కుమారుడు అనిల్‌కుమార్, మే 3వ తేదీన ‘మీ సేవ’ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. ఆ తరువాత, ఎర్రుపాలెం మండలసర్వేయర్ రాజును కలిశాడు. రోజులు గడుస్తున్నాయి. సర్వేయర్ ఎంతకీ పని చేయడం లేదు. ఆయన (కార్యాలయం) చుట్టూ అనిల్‌కుమార్ తిరుగుతున్నాడు. తిరిగీ.. తిరిగీ విసుగెత్తాడు. ఆ అధికారి లంచం అడిగాడు. వేయి కాదు.. రెండువేలు కాదు.. 50వేల రూపాయలు ఇవ్వాలన్నాడు. అనిల్‌కుమార్‌కు చిర్రెత్తుకొచ్చింది. తమాయించుకున్నాడు. అంత ఇచ్చుకోలేనన్నాడు. బేరసారాలు సాగాయి. చివరకు, 30వేల రూపాయల వద్ద ‘బేరం’ కుదిరింది. ‘నన్ను మూడు నెలలపాటు తిప్పించుకుని, 30వేల రూపాయలు లంచం అడుగుతాడా..?’ అనుకున్నాడు అనిల్‌కుమార్. ఇలాంటి అవినీతి జలగను వదిలేస్తే... తనలాంటి ఇంకెంతోమంది రైతులు బలవుతారని భయపడ్డాడు. ఈ ‘జలగ’ను తేలిగ్గా వదలకూడదనుకున్నాడు. ఏసీబీ అధికారులను అనిల్‌కుమార్ సంప్రదించాడు. విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ అధికారులు స్కెచ్ గీశారు. బుధవారం రోజున ఆ సర్వేయర్‌కు అనిల్‌కుమార్ ఫోన్ చేశాడు. ‘ఆ డబ్బు ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ కలుస్తారు?’ అని అడిగాడు. తాను కలెక్టరేట్లో సమావేశానికి వచ్చానని, అక్కడకు రావాలని సర్వేయర్ రాజు చెప్పాడు. కలెక్టరేట్‌కు అనిల్‌కుమార్ చేరుకున్నాడు. ఆయనకు దగ్గరలోనే ఎవరికీ కనిపించకుండా, ఎవ్వరూ గుర్తించకుండా.. ఏసీబీ అధికారులు మాటు వేశారు. కలెక్టరేట్ లోపలి నుంచి ఆవరణలోకి సర్వేయర్ రాజు వచ్చాడు. అక్కడే ఒక మూలకు అనిల్‌కుమార్, సర్వేయర్ రాజు వెళ్లారు. సర్వేయర్ రాజుకు అనిల్‌కుమార్ నగదు ఇస్తున్నాడు. సరిగ్గా అప్పుడే.. ఆ క్షణంలోనే ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్, ఖమ్మం, వరంగల్ సీఐలు రమణమూర్తి, పి.వెంకట్, క్రాంతికుమార్ దూసుకొచ్చారు. రాజును పట్టేసుకున్నారు. అతని చేతిలోని నగదును స్వాధీనపర్చుకున్నారు. అప్పటికే కలెక్టరేట్ ఆవరణలో అధికారులు, అనధికారులు, ప్రజలు.. ఇలా అనేకమంది అటూఇటూ తిరుగాడుతున్నారు. అక్కడేదో హడావుడి జరుగుతుండడంతో అందరూ గుమిగూడారు. ‘ఏసీబీ అధికారులొచ్చారు. సర్వేయర్‌ను పట్టుకున్నారు’ అనే వార్త.. క్షణాల్లోనే వ్యాపించింది. ‘కలెక్టరేట్లోనే లంచావతారమా..?!’ అనుకుంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇది అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. ఆ అవినీతి జలగ... సారీ.. సర్వేయర్ రాజును ఏసీబీ కోర్టుకు అప్పగించేందుకని తమ (ఏసీబీ) కార్యాలయానికి డీఎస్పీ, సీఐలు తీసుకెళ్లారు. కలెక్టరేట్లో ఇది రెండోసారి.. ఖమ్మం కలెక్టరేట్లో అవినీతి జలగను ఏసీబీ అధికారులు పట్టుకోవడం ఇది రెండోసారి. సుమారు మూడేళ్ల క్రితం, లంచం డిమాండ్ చేసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయ ఉద్యోగి ఒకరిని కలెక్టరేట్లోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఇకపై లంచం ఇచ్చిన వారూ శిక్షార్హులే
న్యూఢిల్లీ: లంచం తీసుకున్న వారితోపాటు లంచం ఇచ్చిన వారు కూడా ఇకపై నేరస్తులే. ఇందుకు గాను వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అవినీతి నిరోధక (సవరణ) బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. అవినీతి వ్యతిరేక చట్టానికి చేసిన కొన్ని సవరణలతో సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఉద్దేశపూర్వకంగా చేసే ఫిర్యాదుల నుంచి ఉన్నతాధికారులకు, వారు రిటైరైన తర్వాత కూడా రక్షణ కల్పించటం తోపాటు అవినీతి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఇందులో పలు నిబంధనలను చేర్చాం’ అని ఆయన చెప్పారు. ‘తాజా సవరణ ద్వారా లంచం ఇవ్వజూపిన వారికి కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బలవంతంగా ఎవరైనా లంచం ఇవ్వజూపితే సదరు అధికారి ఆ విషయాన్ని పై అధికారులకు వారంలోగా తెలియజేయాలి. అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూ రుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎటువంటి కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులపై పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు ఆమోదం ‘పరారైన ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2013’ను లోక్‌సభ ఆమోదించింది. ‘దీంతో నేరాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తుల లేదా బినామీ దారుల ఆస్తులను జప్తు చేసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. పరారైన వారి నుంచి డబ్బు రాబట్టుకునేందుకు బ్యాంకులకు ప్రభుత్వం సాయపడుతుంది’ అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. -
‘ఇక్కడ లంచాలు కామన్.. 3 లక్షలు ఉంటే చాలు’
మీరట్, ఉత్తరప్రదేశ్ : ప్రభుత్వం, ఉన్నతాధికారుల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించాడంటూ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను(ఎస్హెచ్ఓ)ను సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పరశురామ్ అనే వ్యక్తి బదిలీలో భాగంగా నోయిడాలోని దిబాయ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమితుడయ్యాడు. అయితే ఇలా కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు తాను ఉన్నతాధికారులకు లంచం ఇచ్చానంటూ పరశురామ్ చేసిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తితో చాట్ చేసిన పరశురామ్..‘ భయ్యా ఇది యోగి ప్రభుత్వం. ఇక్కడ లంచాలు ఇవ్వడం, తీసుకోవడం కామన్. నేను కూడా నా ట్రాన్స్ఫర్ కోసం ఏడీజీకి 50 వేల రూపాయలు ఇచ్చానంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా బులంద్‌షహర్ ఎస్ఎస్పీ గురించి చెబుతూ... ‘డబ్బులెవరైనా నేరుగా తీసుకుంటారా చెప్పు. ఆయన కూడా అంతే. నా ట్రాన్స్ఫర్ కోసం ఆయనకు 3 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చిందంటూ’ పరశురామ్ అవతలి వ్యక్తికి మెసేజ్ పంపించాడు. అవన్నీ అవాస్తవాలు.. పరశురామ్ చాట్ వైరల్ కావడంతో తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉన్నతాధికారులు స్పందించారు. బులంద్‌షహర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ... కేవలం తమ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే పరశురామ్ ఇలా వ్యవహరించాడని తెలిపారు. అధికారులను కేవలం ఒక రేంజ్ నుంచి మరొక రేంజ్‌కు బదిలీ చేసే అధికారం మాత్రమే తనకు ఉంటుందని పేర్కొన్న ఆయన.. పరశురామ్‌ను బదిలీ చేసింది ఐజీ అని తెలిపారు. కాగా పరశురామ్‌ను సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. -
డీఎస్పీకి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
నిజామాబాద్ క్రైం: లంచం తీసుకున్న డీఎస్పీకి కరీంనగర్ ఏసీబీ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిఖ విధించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. నిజామాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ తిరునగిరి శ్రీనివాస్, విజయకుమారిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత వీరి మధ్య విభే దాలు రావడంతో విజయకుమారి భర్త శ్రీనివాస్‌పై 2006 జూలై 9న నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది శ్రీనివాస్‌పై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో అప్పటి ఎస్పీ సస్పెండ్ చేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అప్పటి డీఎస్పీ విలియమ్స్‌ను కోరగా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ సూచన మేరకు డబ్బులు ఇస్తుండటంతో అధికా రులు పట్టుకున్నారు. ఈ కేసులో శుక్రవారం ఏసీబీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ తన వాదనలు వినిపించా రు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఆర్అండ్బీ ఏఈ
వరంగల్ క్రైం: రోడ్డు పని చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్అండ్బీ అసిస్టెంట్ ఇంజనీర్ గురువారం ఉదయం ఏసీబీ అధికారులకు చిక్కాడు. హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని ఆర్అండ్బీ అర్బన్ కార్యాలయంలో బాధిత కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి నుంచి ఏఈ కోటేశ్వర్ రూ.60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. క్షణాల్లో జరిగిపోయిన ఏసీబీ దాడులతో కార్యాలయంలోని మిగతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏసీబీ డీఎస్పీ ముద్దసాని కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. హన్మకొండ పెద్దమ్మగడ్డ రోడ్డులో ఆర్ఆర్ గార్డెన్ దగ్గర రోడ్డు విస్తరణ, కల్వర్ట్ నిర్మాణంలో భాగంగా రూ.45 లక్షల పని జరిగింది. రెండు విడతల్లో కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డికి రూ.30 లక్షల బిల్లులు వచ్చాయి. మిగతా రూ.15 లక్షల బిల్లుల కోసం ఏఈ కోటేశ్వర్రావు రూ.60 వేలు డిమాండ్ చేశాడు. సంవత్సరం క్రితమే పని పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని, తనను ఏఈ లంచం డిమాండ్ చేస్తున్నాడని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల సూచన మేరకు తిరుపతిరెడ్డి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని ఆర్అండ్బీ కార్యాలయానికి వెళ్లి కోటేశ్వర్రావుకు రూ.60 వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు వెళ్లి ఏఈని పట్టుకున్నారు. కార్యాలయంతోపాటు ఏకకాలంలో కోటేశ్వర్రావు ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అనంతరం కోటేశ్వర్‌రావును విచారించగా డబ్బులు ఈఈ లక్ష్మన్‌నాయక్, డీఈ అడగమంటేనే తాను అడిగినట్లు ఏసీబీ అధికారులకు తెలిపాడు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వాసాల సతీష్, క్రాంతికుమార్, పులి వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. నెల రోజుల్లో ఉద్యోగ విరమణ వచ్చే నెలలో తనకు ఉద్యోగ విరమణ ఉందని, తనను అరెస్ట్ చేయొద్దని ఏసీబీ అధికారులను ఏఈ కోటేశ్వర్రావు బతిమిలాడినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణకు ముందు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు కోటేశ్వర్రావు పట్టుబడినట్లు కార్యాలయం సిబ్బంది మాట్లాడుకోవడం కనిపించింది. -
చాయ్‌కి డబ్బులివ్వండి..
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం కొత్తేమి కాదు. రోగిని స్ట్రెచర్‌పై వార్డుకు తీసుకురావడానికి రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తుంటారు. ఇదే ఒక ఎత్తేతే కాసుల వర్షం కురిపించే ప్రసూతి వార్డులో రూ.500కు పైనే వసూలు చేస్తారు. ఆడబిడ్డ, మగబిడ్డకు ఓ లెక్క చెప్పి మరీ మామూళ్లు తీసుకుంటుంటారు. ఎమర్జెన్సీ వార్డు కింద అంతస్తు నుంచి పైఅంతస్తులోకి రోగిని తీసుకెళ్తే, ఆపరేషన్ అయిన తర్వాత వార్డుకు తరలిస్తే, ప్రసూతి అయిన తర్వాత.. సదరు సిబ్బంది డబ్బులు అడుగుతుంటారు. డెలివరీ కోసం తీసుకొచ్చింది మొదలు బిడ్డ పుట్టి.. వార్డుకు తరలించి.. బట్టలు మార్చే వరకు ఆయా విభాగాల సిబ్బందికి తప్పకుండా చేయి తడపాల్సిందే. ప్రసూతి అయినప్పుడు మహిళ సిబ్బంది అక్కడి నుంచి వార్డుకు తీసుకొచ్చిన తర్వాత స్ట్రెచర్ సిబ్బంది, మళ్లీ బట్టలు మార్చాలంటే మహిళ సిబ్బంది.. ఇలా ఆ వార్డులో కాసుల కక్కుర్తితో రిమ్స్‌కు వచ్చే పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ డబ్బులు లేవంటే వారిపై కస్సుబుస్సు మనడం పరిపాటిగా మారింది. దూరప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి నిరుపేదలు ఆస్పత్రికి వస్తుంటే వారి నుంచి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటని పలువురు పేర్కొంటున్నారు. మారని సిబ్బంది తీరు.. గతంలో పలుమార్లు వీరిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పురావడం లేదు. రిమ్స్‌లోని పలు వార్డుల్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఎవరైన డబ్బులు అడిగితే తమ కు సమాచారం ఇవ్వండని అధికారులు సైతం బోర్డులు పెడుతున్నారు. అయినా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. గతంలో రాష్ట్ర మంత్రి జోగు రామన్న రిమ్స్‌లో ఆకస్మిక తనిఖీ చేసే సమయంలో కొంత మంది మహిళలు ప్ర సూతి వార్డులో డబ్బులు తీసుకుంటున్నారని మం త్రి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయితే డ బ్బులు తీసుకున్న వారి గురించి చెబితే మళ్లీ వార్డుకు వచ్చి తమను బెదిరిస్తారనే భయంతో సదరు రోగులు చెప్పడానికి వెనుకడుగు వేస్తున్నారు. గుర్తించిన తర్వాత చర్యలు సిబ్బంది డబ్బులు వసూలు చేసిన సమాచారం అందింది. అయితే డబ్బులు తీసుకున్నది ఎవరనేది గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదు. వార్డుల్లో సిబ్బంది డబ్బులు ఇవ్వమని అడిగితే తమకు సమాచారం అందించాలి. – అశోక్‌కుమార్, రిమ్స్ డైరెక్టర్ -
బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా : బైరియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఇటీవల తరుచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వార్తలోకి ఎక్కడం పరిపాటిగా మారింది. తాజాగా మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులకంటే ప్రాస్టిట్యూట్లు(వేశ్యలే) నయమని సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లే నయం. కనీసం వారు డబ్బులు తీసుకుని పని అయినా చేస్తారు. స్టేజీలపై డ్యాన్స్‌లు చేస్తూ.. మనల్ని సంతోష పరుస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటారు. పని చేస్తారో చేయరో గ్యారెంటీనే లేదు’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అంతేకాక లంచాలు అడిగిన ప్రభుత్వ అధికారులను అక్కడే చెప్పులతో కొట్టండి అంటూ ఆయన మద్దతుదారులను ఆదేశించారు కూడా. బైరియా తహసీల్దార్ ఆఫీసులో అధికారులు లంచాలు అడిగారనే ఆరోపణలపై మండిపడ్డ సింగ్, ఈ మేర ఆదేశాలు జారీచేశారు. సింగ్ తన మద్దతుదారులతో కలిసి ‘వార్నింగ్ డే’ ను నిర్వహించారు. లంచాలు అడిగిన అధికారుల వాయిస్‌లను కూడా రికార్డు చేయాలని మద్దతుదారులను కోరారు. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే సురేంద్ర సింగ్, ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, వారి సంక్షేమం కోసం తాను జైలుకి వెళ్లడానికైనా సిద్దమన్నారు. సురేంద్ర సింగ్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకముందు కూడా దేశంలో అత్యాచార ఘటనలు పెరగడానికి కారణం తల్లిదండ్రులేనని, వారి పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అసలు ఆడపిల్లలను స్వేచ్ఛగా తిరగకుండా కట్టడి చేయాలన్నారు. పదిహేనేళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి కాపలా కాయాలని, అలా కాకుండా వారిని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. తన సొంత పార్టీకి చెందిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర కామెంట్లు చేశారు. కొంతమంది మంత్రులను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తీసేయాలని, లేదంటూ యూపీలో పతనం తప్పదని హెచ్చరించారు. పోలీసు స్టేషన్లలో, తహసీల్దార్ ఆఫీసుల్లో, బ్లాక్ ఆఫీసుల్లో పేద ప్రజల బాధలను వినకపోతే, వారు బీజేపీకి ఓటు వేయరన్నారు. -
రెండు గంటల్లో రిటైర్మెంట్.. ఇంతలో...
సాక్షి, ముంబై: చేసిన నేరం దాస్తే దాగదు.. తప్పు చేసిన వాడు ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు... ఇలాంటి మాటలు ఒక్కోసారి రుజువవుతుంటాయి. మరికాసేపట్లో పదవీ విమరణ చేయాల్సిన వ్యక్తి.. తప్పుడు పని చేసి కటకటాలపాలైన ఘటన వార్తల్లో నిలిచింది. ముంబైకి చెందిన సదాశివ్ ధ్యాన్‌దేవ్ సాత్పుత్(58) అకౌంట్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అతని ఆఖరి పని దినం. మరో రెండు గంటల్లో అతను రిటైర్ అవ్వాల్సి ఉంది. ఇంతలో ఓ సర్టిఫికెట్ పని నిమిత్తం వచ్చిన వ్యక్తి నుంచి రూ.1500 లంచం తీసుకున్నాడు. అదే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రైడ్ చేసి అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తొలుత సదాశివ్ రూ. 2 వేల కోసం డిమాండ్ చేశాడని, చివరకు రూ.15 వందలకు బేరం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. సదాశివ్ వేధింపులు, అవినీతి చరిత్ర గురించి తెలుసుకున్న బాధిత యువకుడు పక్కా స్కెచ్‌తో ఏసీబీకి పట్టించాడు. అధికారులు కేసు నమోదు చేసుకుని సదాశివ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
ఏసీబీ వలలో చిల్పూరు ఆలయ ఈవో
సాక్షి, వరంగల్ : లంచం తీసుకుంటూ వరంగల్ రూరల్ జిల్లా చిల్పూర్ దేవాదాయ శాఖ ఈవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఈవో జయశంకర్ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రాట్యుటీ చెక్ ఇచ్చేందుకు జయశంకర్ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేవాదాయ శాఖ ఈవో కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. -
రూ.1.5 లక్షలు ఇస్తే..బెట్టింగ్ కేసు లేకుండా చేస్తా
-
ఏసీబీ వలలో రెవెన్యూ చేప
సరుబుజ్జిలి(శ్రీకాకుళం) : ఓ పక్క ఏసీబీ అధికారుల దాడులు విస్తృతంగా జరుగుతున్నా అధికారులు లంచాలు తీసుకోవడం మానడం లేదు. తమను ఎవరు పట్టిస్తారులే అని మొండిగా వ్యవహరించి చిన్న పనికీ డబ్బులు గుంజుతుండడంతో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఏసీబీ అధికారులకు శుక్రవారం చిక్కాడు. సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎం.నాగేంద్రప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. 10 వేలు (అన్నీ రూ. 2 వేల నోట్లే) లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తన బృందంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మాటువేసి చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం కరణం రాజేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సరుబుజ్జిలి మండలంలో నందికొండ గ్రామానికి చెందిన గుర్రాల ఈశ్వరరావు నందికొండ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 4/1లో 2.50 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) కోసం గత 3 నెలలుగా సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఇక్కడ పనులు చేయడంలేదని, పని జరగాలంటే లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు తమ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడని చెప్పారు. లంచాలు ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్రప్రసాద్‌ను పట్టుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఉద్యోగి నుంచి పూర్వాపరాలు విచారించి కేసు నమోదు చేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టులో సరౌండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. తహసీల్దార్ వివరణ ఏసీబీ దాడులు విషయమై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ జేమ్స్ ప్రభాకర్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అడ్డదారుల్లో పనులు చేయాలని తమపై ఒత్తిళ్లు చేస్తున్నారని ఆయన అన్నారు. తప్పుడు పనులు చేయనందుకు లేనిపోని ఆరోపణలు చేసి ఉద్యోగులను బలిచేస్తున్నారని వివరించారు. ఉద్యోగులు పరుగులు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో పలు శాఖల అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో తామెక్కడ ఉరిలో పడతామన్న భయంతో తమ సీట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సెల్ఫోన్లు ఆపు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండవసారి దాడులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రెండవ సారి దాడి చేశారు. గతంలో దాడిచేసిన సంఘటనలో నాటి తహసీల్దార్ భాస్కరరావు, ఆర్ఐ ప్రవీణ్‌కుమార్‌ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కావాలనే బలిచేశారు నేను విధుల్లోకి వచ్చాక ఇక్కడ కార్యాలయంలో జరుగుతున్న తెరచాటు వ్యవహారాలకు చెక్ పెట్టాను. కొంతమంది కక్షకట్టారు. నందికొండ రెవెన్యూ పరిధిలోని హైలెవల్ కాలువ సమీపంలోని భూములకు నిరభ్యంతర పత్రం కోసం కొంతమంది దరఖాస్తు చేశారు. దరఖాస్తును సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోల పరిశీలన కోసం పంపించాను. తప్పుడు ధ్రువీకరణపత్రాలు అందించాలని ఒత్తిడి చేశారు. మూత్ర విసర్జన కోసం బయటకువెళితే బలవంతంగా జేబులో డబ్బులు పెట్టి కావాలనే ఇరికించారు. – ఎం.నాగేంద్రప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్, సరుబుజ్జిలి కాళ్లరిగేలా తిరుగుతున్నా... అధికారులకు లంచాలు ఇవ్వనిదే పనులు జరగడంలేదు. నందికొండ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 4/1లోని రెండున్నర ఎకరాల భూమికి నిరభ్యంతర ధ్రువీకరణపత్రం కోసం 3 నెలలుగా తిరుగుతున్నాను. రూ. 80 వేలు ఇవ్వనిదే పనిచేయమని డిప్యూటీ తహసీల్దార్ చెప్పడంతో విసిగి రూ. 10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు అంగీకరించి, ఏసీబీకి ఫిర్యాదు చేశాను. అవినీతిని అరికట్టకపోతే సామాన్యులకు న్యాయం జరగదు. – గుర్రాల ఈశ్వరరావు, ఫిర్యాదుదారు, నందికొండకాలనీ -
రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ..
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి అలవాటు పడ్డ రైల్వే మేనేజర్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కోటి రూపాయల బిల్లుల మంజూరు కోసం 15 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారుల ముందు బుక్కైపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే మేనేజర్‌గా పనిచేస్తున్న కె.వెంకటేశ్వరరావు ఓ కాంట్రాక్టర్ చేసిన పనుల బిల్లుల మంజూరుకు 15లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖా అధికారులను సంప్రదించారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పథకం ప్రకారం వెంకటేశ్వరరావు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు. మేనేజర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అంతొస్తోందిగా.. ఎంతిస్తావు.?
‘కంగ్రాట్స్ బాబు.. విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికయ్యావు. రూ.20 లక్షలొస్తాయి. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఇంత డబ్బు వస్తోంది కదా? మరి నాకెంత ఇస్తావ్? ఓసారి ఆలోచించి నా వాటా తేల్చేయ్’ – లబ్ధిదారునితో ఖమ్మం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఓ అధికారి అన్న మాటలివి. సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కలను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకంతో సాకారం చేస్తోంది. ఏటా 1,000 మందికి అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. 2015–16 వరకు ఎస్సీ, ఎస్టీలకే పథకం అమలవగా తర్వాత బీసీ, ఈబీసీ, మైనారిటీలకు అందుబాటులోకి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం.. బీసీ, ఈబీసీలకు మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి, మైనారిటీలకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ విద్యానిధి పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు. ఆయా సంక్షేమ శాఖల వారీగా పథకాలు అమలవు తున్నాయి. విద్యార్థుల ఎంపిక రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్నతాధి కారుల సమక్షంలో పక్కాగా జరిగినా.. నిధులు మాత్రం జిల్లా స్థాయి నుంచి ఇస్తున్నారు. ఈ తంతే విద్యార్థులకు గుదిబండగా మారుతోంది. వాటా ఇవ్వందే నిధులు ఇవ్వమంటూ కొందరు సంక్షేమ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది కాలయాపన చేస్తున్నారు. విధిలేని పరిస్థితిలో వారు అడిగిన మొత్తానికి ఒప్పుకోవాల్సి వస్తోంది. ఎంపిక ఇలా.. పంపిణీ అలా.. విదేశాల్లో పీజీ చేయాలనుకున్న విద్యార్థి తొలుత విద్యానిధి పథకం కింద ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత నిర్దేశిత తేదీల్లో రాష్ట్ర కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ చేసి అర్హత నిర్ధారిస్తారు. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ సంచాలకులు, సంయుక్త సంచాలకుల సమక్షంలో ప్రక్రియ పక్కాగా జరుగుతుంది. అనంతరం అర్హుల పేర్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. అర్హత సాధించిన విద్యార్ధి నిర్దేశిత వర్సిటీలో ప్రవేశం పొందిన తర్వాత సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి తనిఖీ అధికారులు విద్యార్థి వాస్తవ పరిస్థితిని సమీక్షిస్తారు. మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అనంతరం విదేశీ వర్సిటీలో ప్రవేశ పత్రాలు, మార్కుల మెమోల ఆధారంగా ఆర్థిక సాయం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉత్తీర్ణులయ్యాక తొలి విడత రూ.10 లక్షలు, రెండో సంవత్సరంలో సెమిస్టర్ పరీక్షల సమయంలో మిగతా రూ.10 లక్షలు చెల్లిస్తారు. 10 శాతం ఇచ్చుకోవాల్సిందే! ఎలాంటి పూచీకత్తు లేకుండా అర్హత, ప్రతిభ ఆధారంగా విద్యానిధి పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధికారులు.. వాటాలు ఆర్జిస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన సమయంలోనే విద్యార్ధి కుటుంబ సభ్యులతో బేరం మాట్లాడుకుంటున్నారు. 5 నుంచి 10 శాతం డిమాండ్ చేస్తూ రేటు ఫిక్స్ చేస్తున్నారు. తొలి, రెండో విడత చెల్లింపుల సమయంలో సొమ్ము అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కమీషన్ ఇస్తేనే నిధుల జమకు మార్గం సుగమమవుతుంది. లేదంటే ఫైలుకు కొర్రీలేస్తూ నిధుల విడుదలలో జాప్యం చేస్తారు. ఇలా ఏటా రూ.10 కోట్ల వరకు కమీషన్ల రూపంలో లబ్ధిదారులు నష్టపోతున్నారు. -
పీఎన్బీ స్కామ్: లంచంగా ఏమిచ్చాడంటే..
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్‌లో అధికారులు విస్తుపోయే విషయాలను వెల్లడిస్తున్నారు. బ్యాంక్ అధికారుల సాయంతోనే ఈ బడా కుంభకోణం చోటు చేసుకుందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. నీరవ్ మోదీ నుంచి బ్యాంక్ అధికారులు బంగారం కాయిన్లు, డైమండ్ నగలను లంచంగా తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శనివారం ఈ విషయాన్ని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ వారిని విడివిడిగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది నీరవ్ మోదీ నుంచి లంచం స్వీకరించినట్లు తెలిపింది. ముంబై బ్రాంచ్ ఫోరెక్స్ విభాగపు మేనేజర్ యశ్వంత్ జోషి నీరవ్ మోదీ నుంచి 60 గ్రాముల చేసే రెండు బంగారు కాయిన్లను, ఒక జత గోల్డ్, డైమండ్ ఇయర్ రింగ్స్‌ను తీసుకున్నట్లు అంగీకరించినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. వీరితోపాటు మరికొందరు కూడా తాము లంచం స్వీకరించినట్లు అంగీకరించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సహకారంతోనే ఈ బడా స్కామ్ చోటు చేసుకున్నట్లు సీబీఐ స్పష్టతకు వచ్చింది. జోషితోపాటు మరో నలుగురు పీఎన్బీ అధికారులు, ఇద్దరు బ్యాంక్ అడిటర్లు, మోదీ సహయకుడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే రూ.12,600 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో ముంబై కోర్టు మోదీ, చోక్సీలపై నాన్ బెయిల్‌బుల్ వారంట్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
అవార్డు తీసుకున్న నెలలోపే..
సాక్షి, గంగాధర నెల్లూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారిగా కలెక్టరు నుంచి పురస్కారం అందుకున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు తహశీల్దారు సుశీల.. నెల రోజులు తిరక్కమునుపే అవినీతి ముద్ర వేసుకున్నారు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పాలసముద్రం మండలానికి చెందిన రాజేంద్ర తిరుపతిలో ఉంటున్నారు. ఈయనకు గంగాధర నెల్లూరు మండలం పాతపాళ్యంలో 10.44 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించి పాస్‌పుస్తకం ఇచ్చారు. ఈ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఆయన గంగాధర నెల్లూరు తహశీల్దారు కార్యాలయంలో 3 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆన్లైన్లో నమోదుకు తహసీల్దార్ సుశీల రూ. 20 వేల డిమాండ్ చేశారు. రాజేంద్ర ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాజేంద్ర తహసీల్దారుకు రూ. 15 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో సీఐలు చంద్రశేఖర్, గిరిధర్, ప్రసాద్, ఎస్ఐ విష్ణువర్దన్, సిబ్బంది పాల్గొన్నారు. -
పీఆర్ డీఈఈపై ఏసీబీ పంజా
చేర్యాల: ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.85 వేలు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూరపాటి చంద్రప్రకాశ్‌ను అధికారులు వలపన్ని పట్టుకున్నారు. డీఎస్పీ ప్రతాప్‌కుమార్ కథనం ప్రకారం.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప«థకం ద్వారా 2016లో రూ.74 లక్షలతో మంజూరైన చేర్యాల, రోళ్లబండ బీటీ రోడ్డు నిర్మాణ పనులను జనగామకు చెందిన ఈడీఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. పనుల నిర్వహణకు సంబంధించి చేర్యాలకు చెందిన ఎంఏ రహమాన్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. 2017 ఫిబ్రవరిలోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. నిర్ణీత కాలంలో కాంట్రా క్టరు 90 శాతం పనులు పూర్తి చేశాడు. పనుల నాణ్యతపై ఢిల్లీకి చెందిన నేషనల్ క్వాలిటీ కంట్రోల్ బృందం క్షుణ్ణంగా విచారణ జరిపింది. ఈ పనుల్లో కొన్ని లోటుపాట్లను సవరించుకోవాలని సూచించింది. ఆ మేరకు కూడా కాంట్రాక్టరు చర్యలు తీసుకున్నాడు. రోడ్డు పనులు పూర్తి కావడంతో బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టరు రహమాన్.. డీఈఈ చంద్రప్రకాశ్‌ను కలిశాడు. బిల్లు మంజూరు చేయాలంటే రూ.1.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూ.85 వేలు ఇస్తానని రహమాన్ ఒప్పం దం కుదుర్చుకున్నాడు. ఆపై రహమాన్ ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం చేర్యాలలోని డీఈఈ చంద్రప్రకాశ్ ఇంటి సమీపంలో మాటువేసిన అధికారులు.. రహమాన్ రూ.85 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. దాడుల్లో ఏసీబీ ఎస్ఐలు బి.గంగాధర్, సీహెచ్ మురళీమోహన్, రఘునందన్ పాల్గొన్నారు. 1064కు ఫోన్ చేయండి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ప్రతాప్‌కుమార్ హెచ్చరించారు. ప్రజలు ఫిర్యాదుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు. -
బతికుండగానే చంపేశారు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి) : బతికుండగానే ఆ వృద్ధుడిని రికార్డుల్లో చంపేశారు. రూ.ఐదువేలు లంచం ఇవ్వనందు కే అధికారులు ఇంతపని చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లికి చెందిన జంగ మాధవరెడ్డి(80) వృద్ధుడు కొంతకాలంగా ఆసరా పెన్షన్ తీసుకుంటున్నాడు. అక్టోబర్ నుంచి పెన్షన్ జాబితాలో మాధవరెడ్డి పేరు తొలగించారు. ఎందుకు తొలగించారని అడిగితే బతి కున్నవారి జాబితాలో తనపేరు లేదని అం దుకే తొలగించారని అధికారులు సెలవిచ్చారని, పైఅ ధికారులకు రూ. ఐదువేలు లంచం ఇస్తే తిరిగి పెన్షన్ కొనసాగుతుందని అధికారులు కరాఖండిగా తేల్చారని బాదితుడు వాపోయాడు. తనకు భార్య పిల్లలు లేరని ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రూ.200 ఇచ్చారని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. వెయ్యి ఇచ్చారని ఇప్పుడు లంచం ఇస్తేనే తిరిగి పింఛన్ ఇస్తామనడంతో ఆ వృద్ధుడు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చాడు. లంచం అడగలేదు.. పింఛన్ విషయమై ఎంపీడీవో సురేశ్‌ను ‘సాక్షి’ వి వరణ కోరగా గ్రామ పంచాయతీ వారు పంపిన జాబితాలో చనిపోయినట్లు పేర్కొనడంతో పింఛన్ నిలిపి వేశామని తానెవరిని లంచం అడగలేదన్నారు. కావాలనే నాపై ఆరోపణలు చేస్తున్నారని మాధవరెడ్డికి తిరిగి పింఛన్ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. -
డీఎస్పీ నెల ఆదాయం రూ.1.50 కోట్లు?
వేలూరు : లంచం కేసులో పట్టుబడి కటకటాల పాలైన ఆంబూరు డీఎస్పీ నెల ఆదాయం రూ.1.50 కోటి అని వదంతులు వ్యాపించాయి. వేలూరు జిల్లా ఆంబూరు డీఎస్పీ ధనరాజ్, ఎస్ఐ లూర్దు జయరాజ్ ఇసుక క్వారీ నడుపుతున్న వ్యక్తి వద్ద రూ.1.45 లక్షలు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంబూరు డీఎస్పీ ఇసుక అక్రమ రవాణా, నాటుసారా, కట్ట పంచాయితీ చేసే ముఠా సభ్యుల నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకోవడం వీటికి ఆయా స్టేషన్లలోని ఎస్ఐలు, కానిస్టేబుళ్ల ద్వారా నగదును తీసుకుంటున్నట్లు వదంతులు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు డీఎస్పీ ధనరాజ్, ఎస్ఐలను గురువారం రాత్రి 12 గంటల వరకు రహస్యంగా విచారణ జరిపి న్యాయమూర్తి రాజు ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించడంతో వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. డీఎస్పీ ధనరాజ్ గతేడాది విరుదనగర్ జిల్లా నుంచి బదిలీపై ఆంబూరుకు వచ్చారు. విరుదునగర్‌లో పనిచేసిన సమయంలోనే నాటు సారా అక్రమరవాణ దారులు, కిడ్నాపర్ల నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకునే వాడని అనంతరం ఆంబూరులోని ఇసుక అక్రమ రవాణా చేసే మాఫియా వద్ద ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని వేధింపులకు గురి చేసే వాడని ఇవ్వకుంటే కేసులు నమోదు చేసే వాడని తెలిసింది. ఈ మామూళ్లు ఇవ్వడంతోనే ఇసుక మాఫియా ముఠా సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించే వారని తెలిసింది. డీఎస్పీ లంచం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న ఆంబూరు వాసులు పోలీస్‌స్టేషన్ ఎదుట బాణసంచా పేల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. -
లంచం తీసుకున్న ఇద్దరికి కఠిన శిక్ష
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పట్టా భూమి పేరు మార్పునకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోకు ఏడాది, ఆయన అసిస్టెంట్‌కు ఆర్నెళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు కరీంనగర్ ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. బీర్కూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన వెన్నం వెంకట్రామయ్య 1970లో మిర్జాపూర్ శివారులో 5.20 గుంటల భూమిని సబ్బిడి భూమయ్య, సబ్బిడి విఠల్ల నుంచి కొన్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. ఈయన మరణాంతరం 5.20 గుంటల వ్యవసాయ భూమిని అన్నలిద్దరు తమతమ పేర్లమీదకు మార్చుకోగా చిన్నవాడైన వెన్నం రామకృష్ణ తన భాగం భూమిని తన పేరుమీదకు మార్చేందుకు 28 జనవరి 2009న మిర్జాపూర్ వీఆర్వో కొమ్ము మురళికి దరఖాస్తు చేశాడు. అందుకు వీఆర్వో తనకు రూ.2100లు లంచం ఇస్తేనే విచారించి తహసీల్దార్‌కు నివేదిక ఇచ్చి పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇప్పిస్తానని, లేదంటే కుదరదని చెప్పాడు. అనంతరం వీఆర్వో కొద్దిరోజుల తర్వాత పాస్‌బుక్ టైటిల్ డీడ్లు సిద్ధంగా ఉన్నాయని, 26 ఫిబ్రవరి 2009న లంచం డబ్బులు తనను ఇంట్లో కలిసి ఇచ్చి వాటిని తీసుకెళ్లాలని చెప్పాడు. దాంతో రామకృష్ణ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అదే రోజు ఏసీబీ అధికారులను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు రామకృష్ణ వీఆర్వోకు లంచం డబ్బులు ఇవ్వగా ఆయన ఆ డబ్బులను తన అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఇచ్చి దగ్గర పెట్టుకోవాలని చెప్పాడు. శ్రీనివాస్ డబ్బులు లెక్క పెడుతుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు వారిని రెడ్హాండ్గా పట్టుకున్నారు. ఈ కేసులో బుధవారం ఏసీబీ తరపున ప్రత్యేక పీపీ లక్ష్మీప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరువార్గల వాదనలు విన్న న్యాయమూర్తి భాస్కర్‌రావు వీఆర్వో మురళీకి ఏడాది, రూ.5వేలు, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఆర్నెళ్ల శిక్ష, రూ. 2500లు జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఏసీబీకి చిక్కిన రైల్వే హెడ్ కానిస్టేబుల్
సాక్షి, ఎర్రగుంట్ల: లంచం తీసుకుంటూ ఓ రైల్వే పోలీసు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్లో దేవానందం అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఓ కేసు విషయమై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
రూ.18 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఓ రైతు వద్ద రూ.18 వేలు లంచం తీసుకుంటూ తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వీఆర్వో ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లెల్లకు చెందిన కిరణ్ అనే రైతు సాదా బైనామాతో భూమిని ముటేషన్ చేసేందుకు వీఆర్ఓను ఆశ్రయించాడు. పని చేసేందుకు వీఆర్ఓ రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా..పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప
సాక్షి, నిజామాబాద్: ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్ గౌడ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆర్మూర్‌లోని మంజీర వాటర్ ప్లాంట్ పర్మిషన్ కోసం రాజ్ కుమార్ అనే వ్యక్తి నంచి శ్రీనివాస్ రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రైడ్ చేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. దీంతో పాటు ఆయనపై పలు ఆరోపణలు రావడంతో నిజామాబాద్, కరీంనగర్‌లోని బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. జగిత్యాలలో 3 ప్లాట్లు, హైదరాబాద్‌లో 2 ఓపెన్ ప్లాట్స్, కొన్ని విలువైన పత్రాలను అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
23.50 లక్షలతో పట్టుబడ్డారు
సాక్షి, విజయవాడ: భారీగా లంచం తీసుకుంటూ కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండలు, అసిస్టెంట్ కమిషనర్ అనంతరెడ్డి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు దొరికారు. వీరిద్దరూ తమ ఛాంబర్లో ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.23.50 లక్షలు లంచం తీసుకుంటూ శుక్రవారం పట్టుబడ్డారు. రూ.4.50 కోట్ల మేర పన్ను రాయితీ ఇప్పించేందుకు ఏడుకొండలు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్టు తెలిసింది. వాణిజ్యపన్నుల శాఖలో ఆయన జీఎస్టీ విభాగం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఐటీడీ కంపెనీకి చెల్లించాల్సిన ఇన్‌ఫుట్ పన్ను రాయితీ విడుదలకు ఏడుకొండలు, అనంతరెడ్డి రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. కంపెనీలు ప్రతినిధులు తమను ఆశ్రయించడంతో ఈ బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చామన్నారు. కమర్షియల్ టాక్స్ విభాగంకు సంబంధించి మొత్తం నలుగురి అధికారుల ప్రమేయం వుందని వెల్లడించారు. నిందితులను విచారించిన తర్వాత రేపు అరెస్ట్ చేస్తామన్నారు. ఐటీడీ సిమెంటేషన్ సంస్థ.. విశాఖ, గంగవరం పోర్ట్ బెర్త్ నిర్మాణాలను చేపడుతోంది. -
భర్త హత్యకు సుపారీ
నెల్లూరు: భర్తను హతమార్చేందుకు భారీ సుపారీ ఇచ్చింది. ఈ అరుదైన సంఘటన నెల్లూరులో వెలుగులోకి వచ్చింది. ప్రియుడిపై ఉన్న మోజుతో భర్తను కడతేర్చేందుకు సాయిప్రియ అనే మహిళ దారుణమైన పథక రచన చేసింది. ప్రియుడు రవి సాయంతో భర్తను చంపేందుకు కొందరికి సుపారీ ఇచ్చింది. కాగా, తన హత్యకు పథక రచన జరిగిందన్న అనుమానం వచ్చిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య సాయిప్రియ, ప్రియుడు రవిలు పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లంచం కేసులో సర్వేయర్ అరెస్ట్
అన్నానగర్: శ్రీరంగంలో రైతు వద్ద రూ.50 వేలు లంచం తీసుకున్న సర్వేయర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం శ్రీరంగంలో చోటుచేసుకుంది. తిరుచ్చి సోమరసమ్‌పేట పొన్ నగరానికి చెందిన అరుళానందరాజ్ (40) రైతు. ఇతనికి సొంత స్థలం పుంగనూర్‌లో ఉంది. ఈ స్థలాన్ని సర్వే చేయడానికి ఆన్లైన్లో శ్రీరంగం తాలూకా కార్యాలయంలో ఉన్న సర్వేయర్ విభాగ కార్యాలయంలో నమోదు చేశాడు. నమోదు చేసి 9 నెలలు అయినా స్థలాన్ని సర్వే చేయలేదు. ఈ క్రమంలో తన స్థలాన్ని సర్వే చేసి ఇవ్వాలని శ్రీరంగం తాలుకా కార్యాలయంలో ఉన్న సర్వేయర్ గణేషన్‌ని అరుళానందరాజ్ అడిగాడు. ఇందుకు, అతను రూ. 80 వేలు లంచం అడిగాడు. కానీ లంచం ఇవ్వడానికి ఇష్టపడని అతను తిరుచ్చి ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు రసాయనం పూసిన రూ.50 వేల నగదుని అరుళానందరాజ వచ్చి ఇచ్చి పంపారు. బుధవారం సాయంత్రం రూ. 50 వేల నగదు కార్యాలయంలో ఉన్న సర్వేయర్ గణేషన్ వద్ద అరుళానందరాజ ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జాయింట్ సూపరింటెండెంట్ రామచంద్రన్, సీఐలు శక్తివేల్, నవనీతకృష్ణన్, దేవిరాణి వెంటనే వచ్చి గణేషన్‌ని ఆధారాలతో పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు చేసి సెంట్రల్ జైల్లో ఉంచారు. -
దొంగల కోసం వెళ్లి.. దొరికిపోయిన పోలీసులు
పీఎంపాలెం (భీమిలి): మన రాష్ట్ర పోలీసులు.. వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలను పట్టుకోవడానికి వెళ్లారు.. అక్కడ వారి ఆచూకీ కనిపెట్టారు. దొంగలు దొరకగానే పట్టుకోవాల్సింది పోయి పోలీసులు వారితో లాలూచీ పడ్డారు. లంచమిస్తే వదిలేస్తామన్నారు. ఇంకేముంది.. దొంగలు కూడా పోలీసులు అడిగినదానికి ఆనందంగా తలలూపారు. ఇంతలోనే ఊహించని విధంగా ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు అక్కడ మాటు వేసి లంచం తీసుకుంటున్న మన రాష్ట్ర పోలీసుల్ని అరెస్ట్ చేశారు. ఇలా దొంగల్ని పట్టుకుందామని వెళ్లి పోలీసులే అరెస్ట్ అయిన సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దొంగల ముఠా నుంచి రూ.1.40 లక్షలను లంచంగా తీసుకుంటూ అక్కడి ఏసీబీ అధికారులకు సోమవారం విశాఖపట్నం పోలీసులు పట్టుబడ్డారు. రాజస్థాన్‌లోని బాలే జిల్లా దింగ్మా ప్రాంతానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి పీఎంపాలెం హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దెకు ఉండేవాడు. ఈ ఏడాది ఆగస్టు 29న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెంకటరమణ అనే నగల వ్యాపారిని బంగారం వ్యాపారం పేరుతో ఇక్కడకు పిలిపించి తాళ్లతో కట్టేసి 3 కిలోల బంగారు ఆభరణాలతో పారిపోయాడు. రాకేశ్‌తోపాటు ఈ దోపిడీ ముఠాలో రాజస్థాన్‌కే చెందిన హీరాలాల్, రాము, ఛత్తీస్‌గఢ్‌లోని కిసాన్గంజ్కి చెందిన హిమ్మత్ పటేల్, రమేశ్ పటేల్, అగృత పటేల్ ఉన్నట్టు గుర్తించి రెండు బృందాలుగా గాలించినా ప్రయోజనం దక్కలేదు. అయితే ఇటీవల పీఎంపాలెంకు చెందిన జిలేబీ వ్యాపారి సంతోశ్ సెల్ఫోన్లో ముఠా సభ్యుల నంబర్లు ఉండటంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంతోశ్ ఇచ్చిన సమాచారం మేరకు ముఠా సభ్యులను పట్టుకోవడానికి నార్త్ సబ్ డివిజన్ (పీఎంపాలెం) క్రైమ్ సీఐ సి.వి.ఆర్.కె.చౌదరి, పరవాడ ఎస్ఐ ఎస్.కె.షరీఫ్, మహరాణిపేట ఎస్ఐ గోపాలరావు, వన్‌టౌన్ కానిస్టేబుల్ హరిప్రసాద్‌లను పంపించారు. అయితే అక్కడ ముఠా సభ్యుల నుంచి లంచం తీసుకుంటుండగా రాజస్థాన్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. -
దొంగల కోసం వెళ్లి.. దొరికిపోయిన పోలీసులు
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ
విజయనగరం జిల్లా: విజయనగరం టూటౌన్ సీఐగా పనిచేస్తున్న నరసింహ మూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల కొంత మంది వ్యక్తులు పేకాటాడుతూ పట్టుబడ్డారు. వారిని కేసు నుంచి తప్పించేందుకు నరసింహమూర్తి రూ.50 వేలు లంచంగా అడిగారు. కాగా, పక్కా సమాచారంతో నిందితుల నుంచి లంచం తీసుకుంటుండగా సీఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం తీసుకుంటూ దొరికిపోయిన తహసీల్దార్
పాకాల/పూతలపట్టు : పూతలపట్టు తహసీల్దార్ కె.సుధాకరయ్య లంచం తీసుకుం టూ తిరుపతి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఏసీబీ అధికారులు ఆయనను ఆదివారం ఉదయం 9 గంటలకు అతని స్వగృహంలో అరెస్టు చేశారు. అనంతరం 3 గంటల వరకు సోదాలు నిర్వహిం చారు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి కథనం మేరకు.. పూతలపట్టు తహసీల్దార్‌గా పని చేస్తున్న కె.సుధాకరయ్య పాకాల పట్టణంలోని భారతంమిట్టలో నివాసముంటున్నారు. పూతలపట్టు మండలంలోని పి.కొత్తకోట వద్ద 4 హెక్టార్లలో ఉన్న ఒక క్వారీకి ఎన్వోసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.2.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. తాను అంత డబ్బు ఇవ్వలేనని, రెండు లక్షలు ఇస్తానని మధుసూదన్‌రెడ్డి చెప్పాడు. అందుకు తహసీల్దార్ అంగీకరించారు. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి శనివారం తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు ఆదివారం ఉదయం మధుసూదన్‌రెడ్డి తహసీల్దార్‌కు ఆయన నివాసంలో డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సుధాకరయ్యను పూతలపట్టు కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా, లంచం అడిగినా 9440446190 నంబర్‌కు ఫోన్ చేయాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, గిరిధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జైలుకు తరలింపు ఏసీబీ వలలో చిక్కిన పూతలపట్టు తహసీల్దారు సుధాకరయ్యను నెల్లూరు ఏసీబీ జైలుకు తరలించారు. ఆయన సొంత నివాసం పాకాలలో సోదాలు అనంతరం పూతలపట్టు తహసీల్దారు కార్యాలయానికి ఆయనను తీసుకొచ్చి విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 7.30గంటల వరకు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, నెల్లూరుకు తరలించారు. రికార్డులు తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు -
చితి పేర్చుకుని ఇంజినీరు ఆత్మాహుతి
లంచం కేసులో అరెస్టయ్యానని ఆవేదనతో ఘాతుకం సాక్షి, చింతామణి : లంచం తీసుకోవడం.. అతని జీవితాన్ని అగ్నికి ఆహుతి చేసింది. లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కి జైలుకు వెళ్లిన ఓ ఇంజినీర్ కట్టెలతో చితి ఏర్పాటు చేసుకొని సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలో కోలారు జిల్లా చింతామణి తాలూకాలోని వంగామాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి (27) బాగేపల్లి తాలూకాలో ఉపాధి హామీ పథకంలో సహాయక ఇంజినీర్‌గా పని చేస్తుండేవాడు. ఏడాది కిందటే ఉద్యోగంలో చేరాడు. ఆరునెలల క్రితం ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడి జైలు పాలయ్యాడు. కొద్దిరోజుల అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనాథ్ ఎవరితోనూ కలవకుండా మథనపడుతూ ఉండేవాడు. తాను చేయని తప్పునకు బలయ్యానని ఆవేదన చెందేవాడు. జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకులేకపోయిన శ్రీనాథ్ మంగళవారం అర్ధరాత్రి అందరూ పడుకున్నాక, ఇంటి సమీపంలో కట్టెలకుప్ప పేర్చి దానిపై పడుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని సజీవ దహనమయ్యాడు. రాత్రి తల్లితో వాగ్వాదం జరిగినట్లు ఇరుగుపొరుగు తెలిపారు. ఉదయం అందరూ చితిని చూడగానే కలకలం రేగింది. భట్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. తండ్రి వెంకటరెడ్డి గతంలో మరణించగా, తల్లి సరోజమ్మ ఉన్నారు. కుమారుని మరణంతో తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఎమ్మెల్యే ఆఫీసు వద్ద ఆత్మహత్యాయత్నం
సాక్షి, మానకొండూరు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ద ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. బెజ్జంకి మండలం గూడెనికి చెందిన శ్రీనివాస్, పరుశరామ్ అనే యువకులు ఎమ్మెల్యే రసమయి ఆఫీసుకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్ర కాలిన గాయాలైన ఇద్దరికి కరీంనగర్ లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. దళితులకు భూపంపిణీ చేయడానికి ఎకరానికి రూ.20 వేలు వీఆర్వో రవి డిమాండ్ చేశాడని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడానికి వెళ్లి ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డాడని శ్రీనివాస్ భార్య తెలిపారు. వెంటనే మంత్రి ఈటల.. కలెక్టర్ తో మాట్లాడి వీఆర్వో రవిని సస్పెండ్ చేయించారు. బాదితులకు ప్రభుత్వ పరంగా వైద్యం అందిస్తామని మంత్రి ఈటల తెలిపారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదంటూ మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే టీఆర్ఎస్ నేత అయూబ్‌ఖాన్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం సృష్టిం చింది. -
రక్షకుడే.. భక్షకుడు
పోలీస్.. వృత్తిపై నిబద్ధత, క్రమశిక్షణ, నిష్పక్షపాతం, హుందాతనం, నిందితులతో మర్యాదగా మసులుకోవాల్సిన ఉద్యోగం. నైతికత, నియమాల పాటింపులో పదిమందికి ఆదర్శంగా నిలవాలి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడడమే లక్ష్యంగా సాగుతున్నారు కోర్టు కానిస్టేబుళ్లు కొందరు. రక్షకుడే భక్షకుడై బాధితులను పీక్కుతింటున్నారు. పోలీసు శాఖకు మచ్చతెస్తున్నారు. ∙క్రిమినల్ కేసుల్లో చక్రం తిప్పుతున్న కోర్టు కానిస్టేబుళ్లు ∙నిందితులకు భరోసానిస్తూ మామూళ్లు వసూలు పలమనేరు: బాధితుల అమాయకత్వమే పెట్టుబడి.. వారి బలహీనతే ఆదాయంగా మార్చుకుని నిత్యం రూ.వేలు ఆర్జిస్తున్నారు జిల్లాలోని కొందరు రాటుదేలిన కానిస్టేబుళ్లు. ఏదో కోర్టు కానిస్టేబులే కదా.. ఇదో చిన్న వ్యవహారం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చిన్నపాటి పెట్టీ కేసుల నుంచి నాన్ బెయిలబుల్ కేసుల దాకా వారు చక్రం తిప్పుతున్నారు. చేసేది తప్పు కాబట్టి ఈ దోపిడీపై కక్షిదారులు సైతం నోరుమెదపడం లేదు. వాయిదా రోజు సంబంధిత కోర్టు కానిస్టేబుల్‌ను ప ట్టించుకోకుంటే ఆ రోజు వాయిదా కోసం సాయంత్రం దాకా కోర్టు వద్ద వేచి ఉండాల్సిందే. ఇలా ప్రతి విషయంలోనూ వీరు జోక్యం చేసుకుని రోజుకు నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. అత్యవసర పరిరస్థితుల్లోనూ వీరు సెలవులు పెట్టరంటే వీరికి ఈ ఉద్యోగం ఎం త లాభదాయకమో మరి. వీరి విధులు ఇలా.. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు కోర్టు కేసుల నిమిత్తం ఓ కానిస్టేబుల్‌ను నియమించారు. స్టేషన్లో నమోద య్యే కేసుల వివరాలను కోర్టుకు అప్పగించడం, చార్జి షీట్లను కోర్టుకు చేర్చడం, వాయిదాలను నోట్ చేసుకోవడం, కోర్టు జారీ చేసే ఆదేశాలను సంబంధిత పీఎస్ఎస్హెచ్వోకు తెలియజేయడం, చిన్నకేసులో జరి మానాలను కోర్టులో కట్టించడం, పీటీ వారెంట్లలో నిం దితులను కోర్టుకు తీసుకెళ్లడం తదితర పనులను చేయాల్సి ఉంటుంది. జరుగుతున్న దందా ఇలా.. చిన్న నేరాలతో కోర్టులో కట్టే జరిమానాలు రూ.200 నుంచి రూ.500 అయితే కోర్టు పనులంటూ నిందితుల నుంచి కనీసం రూ.2 వేలు గుంజుతుంటారు. పేకాట, ట్రాన్స్పోర్ట్ చట్టం కేసులు, మద్యం తాగి పట్టుబడిన వారు తదితర కేసుల్లో అక్రమ వసూళ్లు సాగుతున్నాయి. ఇక క్రిమినల్ కేసుల్లో బాధితులకు సంబంధిత కోర్టులోని ఏపీపీ న్యాయవాదిగా ఉండగా నిందితులకు ప్రైవేటు వకీళ్లు వకాలత్ వేస్తుంటారు. ఇలాంటి కేసులో అటు ప్రభుత్వ న్యాయవాదికి, ఇటు నిందితుని న్యాయవాదికి కోర్టు కానిస్టేబుళ్లు మధ్యవర్తులుగా ఉంటూ రెం డు చేతులా సంపాదించుకుంటున్నారు. వాయిదాలకొ చ్చే నిందితులు వీరికి టీ, కాఫీ, భోజనాలతో పాటు ఎంతో కొంత జేబులో పెట్టాల్సిందే. లేదంటే వచ్చే వాయిదాకు నిందితునికి సినిమా కష్టాలను చూపిస్తారు. పెద్ద కేసుల్లో భారీగా డీల్ ఎర్రచందనం, స్పిరిట్, దొంగనోట్లు, అడవిలో వేట, హత్య, అత్యాచారం తదితర కేసుల్లో నిందితులకు సాయం చేస్తామంటూ భారీ డీల్ చేసేవాళ్లు ఉన్నారు. నిందితులకు బెయిల్ నుంచి కేసు ట్రయిల్స్ సాగే వర కు కోర్టుకానిస్టేబుళ్లని పోషించాల్సిందే. ఏదైనా కేసు కోర్టులో నమోదు కాగానే నిందితులకు న్యాయవాదులను ఏర్పాటు చేయడం నుంచి వీరి వసూళ్లు ప్రారంభమవుతాయి. రోడ్డు ప్రమాద కేసుల్లో లాయర్లకు కేసు పట్టించిన కానిస్టేబుల్‌కు నిర్ణయించిన మేర కమీషన్లు ఇవ్వాల్సిందే. ఇంకొందరు చేయి తిరిగిన కానిస్టేబుళ్లు క్రిమినల్ కేసుల్లో మొత్తం తామే డీల్ చేస్తామంటూ జూనియర్ లాయర్‌ను ఏర్పాటు చేయడం కేసులోని సాక్షులను అనుకున్న వారికి అనుకూలం ప్రభావితం చేయడం వరకు తలమునకలై ఉంటారు. వారెంట్లను జారీ చేసేటపుడు వీరికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌లో అయితే భారీగా చేతివాటం చూపుతుంటారు. నిందితుడు వా యిదాలకు రాకున్నప్పటికీ సంబంధిత లాయర్ల ద్వారా పిటిషన్లు వేయించే సత్తా ఉన్న కోర్టు కానిస్టేబుళ్లు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ఏళ్ల తరబడి అదే పోస్టులో తిష్ట ఒకసారి కోర్టు కానిస్టేబుల్ విధుల్లోకి వెళ్లిన వారు ఇక వేరే పనులు చేసేందుకు వెళ్లడం లేదు. ఇందులో మంచి ఆదాయం ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే అన్ని స్టేషన్లలో ఈ విధులకు హాజరయ్యేందుకు పలువురు పోటీ పడుతుంటారు. అయితే ఎస్ఐకి నచ్చినవారు మాత్రమే ఈ పోస్టులో కొనసాగుతుంటారు. మొత్తం వ్యవహారాలు కోర్టు బయట జరగడం, వీరిపై బాధితులు ఫిర్యాదులు చేయకపోవడంతో ఇది చాలా సురక్షితమైన, లాభదాయక ఉద్యోగం అయినందున దీనికి మంచి డిమాండ్ ఉంది. మామూలుగా హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారే కోర్టు విధులకు హాజరు కావాలనే నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు. దీంతో ఈ విధులకు హాజరైన వారు ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. కోర్టు వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారినే నియమించాలనే ఉద్దేశంతో అధికారులు వీరినే కొనసాగించాల్సి వస్తోంది. ఇదే వీరికి వరంలా మారి అవినీతికి ఆజ్యం పోస్తోంది. ఈ దందాపై కొత్తగా వచ్చిన ఎస్పీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై పలమనేరు డీఎస్పీ శంకర్‌ను వివరణ కోరగా బా«ధితులెవరైనా లిఖితపూర్వకంగా తమకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోపణలపై ఏమీ చేసేందుకు ఆస్కారం ఉండదన్నారు.