DGMO
-
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
ఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ (Pakistan)శరణుగోరింది. పాక్ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025 -
చూపింది శాంపిలే
న్యూఢిల్లీ: దాయాదికి మన సైన్యం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘పాక్ ఇప్పుడు చవిచూసిన తీవ్ర సైనిక నష్టాలు కేవలం శాంపిల్ మాత్రమే. మరోసారి యుద్ధమంటూ వస్తే అది పూర్తి భిన్నంగా, వాళ్లూ ఊహించలేనంత తీవ్రంగా ఉంటుంది’’ అని స్పష్టం చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ (డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (డీజీఎన్‌ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సోమవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మన సైనిక వ్యవస్థలు, స్థావరాలు నిరంతరం అప్రమత్తంగా, పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఎలాంటి ఆపరేషన్లౖMðనా క్షణాల్లో రంగంలోకి దిగిపోతాయి’’ అని ప్రకటించారు. ‘‘మనం పోరాడింది కేవలం ఉగ్రవాదులతో. కానీ వారికి దన్నుగా పాక్ సైన్యం రంగంలోకి దిగడం శోచనీయం. ఆ దేశాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో చెప్పేందుకు ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు’’ అని డీజీఏఓ భారతి అన్నారు. మన వైమానిక దాడుల్లో కరాచీ సమీపంలోని మరో కీలక వైమానిక స్థావరం కూడా నేలమట్టమైందని ఆయన వెల్లడించారు. అయితే పాక్ తన అణ్వాయుధ, అణు కమాండ్ వ్యవస్థలను దాచి ఉంచినట్టు చెబుతున్న కిరానా హిల్స్‌పై తాము దాడులు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కూల్చేసిన అత్యాధునిక పాక్ యుద్ధ విమానాల్లో ఒక మిరాజ్ కూడా ఉందని చెప్పారు. అనంతరం దాని తాలూకు శకలాల ఫొటోలను సైన్యం ఎక్స్‌లో షేర్ చేసింది.ఆకాశ్.. హైలైట్మనవి కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని డీజీఎంఓ రాజీవ్, డీజీఏఓ భారతి గుర్తు చేశారు. పాక్ దాడులను తిప్పికొట్టడంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ హైలైట్‌గా నిలిచిందంటూ కొనియాడారు. ‘‘నిరంతరాయంగా దూసుకొచ్చిన డ్రోన్లను ఆకాశ్, కాస్ వంటి దేశీయ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసిన తీరు మనకు గర్వకారణం. దశాబ్ద కాలంగా మన రక్షణ వ్యవస్థలు సాధించిన అద్భుత ప్రగతికి నిదర్శనం’’ అని చెప్పారు. పాక్‌కు అతి కీలకమైన రహీంయార్ ఖాన్ వైమానిక స్థావరంలో జరిగిన విధ్వంసం తాలూకు వీడియో, ఫొటోలను ఈ సందర్భంగా విడుదల చేశారు. రాజస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఈ స్థావరంలో ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రన్‌వేపై అతి భారీ గొయ్యి ఏర్పడింది. దాన్ని పూర్తిగా పూడ్చి సరిచేసేదాకా అక్కడ ఎలాంటి వైమానిక కార్యకలాపాలూ జరిగే అవకాశం లేదు. ఇవన్నీ మన దాడుల తాలూకు కచ్చితత్వానికి తిరుగులేని నిదర్శనాలని డీజీఏఓ భారతి చెప్పారు.యోధుని నోట రాముని మాటపాక్పై దాడులు తదితర వివరాలతో సీరియస్‌గా సాగుతున్న మీడియా భేటీలో డీజీఏఓ భారతి ఉన్నట్టుండి రామయణంలోని వారధి ఉదంతాన్ని ఉటంకించి ఆకట్టుకున్నారు. ‘‘లంకకు వెళ్లేందుకు దారివ్వాలని మర్యాదగా కోరితే సముద్రుడు మూడు రోజులైనా స్పందించలేదు. భయపెట్టనిదే పనికాదంటూ రాముడు ఆగ్రహంతో కోదండం ఎక్కుపెట్టగానే తక్షణం కాళ్లబేరానికి వచ్చాడు’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి రామచరిత్ మానస్‌లోని ‘వినయ్ న మానత్ జలధి...’ పద్య పంక్తులను ఆశువుగా చెప్పి అలరించారు. ‘‘నేనేం చెప్పదలచిందీ అర్థమైందిగా! తెలివైనవాడికి కనుసైగ చాలు’’ అంటూ చమత్కరించడంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు. పాక్ నిరంతర కవ్వింపులు మనం గట్టిగా బదులివ్వక తప్పని పరిస్థితి కల్పించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆది, సోమవారాల్లో సైనిక డీజీల మీడియా బ్రీఫింగ్ సందర్భంగా కూడా రాయబార ఘట్టంలో కౌరవులకు కృష్ణుని హిత వచనాలు, హెచ్చరికలకు సంబంధించిన పద్యాలు, శివతాండవ స్తోత్రం తదితరాలను నేపథ్యంలో విన్పించడం విశేషం.ఎయిర్ డిఫెన్స్‌కు క్రికెట్‌పరంగా భాష్యంమన వైమానిక స్థావరాలను, సైనిక కేంద్రాలను లక్ష్యం చేసుకోవడం అత్యంత కష్టమని డీజీఎంఓ రాజీవ్ స్పష్టం చేశారు. పాక్ దాడుల వేళ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత శత్రు దుర్భేద్యంగా నిలిచిందో క్రికెట్ పరిభాషలో వివరించి అలరించారు. ‘‘1970ల్లో జరిగిన ఓ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ద్వయం జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ ఇంగ్లండ్‌కు వణుకు పుట్టించింది. అయితే జెఫ్, లేకపోతే లిల్లీ అన్నట్టుగా సిరీస్ పొడవునా ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలు చేశారు. ఎస్–400 మొదలుకుని ఆకాశ్, కాస్, ఏడీ గన్స్ దాకా పలు శ్రేణులతో కూడిన మన ఎయిర్ డిఫెన్స్ కూడా అంతే. వాటిలో ఏదో ఒక వ్యవస్థ పాక్ వైమానిక దాడులను దీటుగా అడ్డుకుని పూర్తిగా తిప్పికొట్టింది’’ అని చెప్పారు. సోమవారమే టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్ అని చెప్పారాయన. -
DGMO press briefing: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏర్పాటు చేసిన త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడిన డీజీఎంవోలు ఆపరేషన్ తీరుతెన్నుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల డీజీఎంవోలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులతోనే మా పోరాటం. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్.కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోంది. ఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోంది. అందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాం. ఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దే. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాం. #WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD— ANI (@ANI) May 12, 2025 పాక్ వివిధ రాకల డ్రోన్లను వినియోగించింది. మనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్‌తో అడ్డుకున్నాం. చైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్ భారత్‌పై దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాం. పాకిస్తాన్‌లోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో నూర్ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమైంది. సైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసింది ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాల్ని మార్చుకుంటున్నారు. లాంగ్ రేంజ్ మిసైళ్లతో శత్రు స్థావరాలపై ప్రయోగించాం. 9,10వ తేదీలలో పాకిస్తాన్ భారత్‌లోని వైమానిక స్థావరాల్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్‌కు సాధ్యం కాలేదు. మనకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కా స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్‌ను వినియోగించాం. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓ వైపు పాక్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేస్తూనే.. మన ఎయిర్ బేస్‌లను సురక్షితంగా ఉండేలా చూసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాలు సమన్వయంతో కలసి పనిచేశాయి. దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు. -
భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా
-
పాకిస్తాన్ ఒప్పుకోవాల్సిందే! DGMOల మీటింగులో మోదీ మాస్టర్ ప్లాన్
-
ముగిసిన భారత్-పాక్ DGMOల తొలిరౌండ్ చర్చలు
DGMO Meeting Updatesఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా భారత్-పాక్ దేశాల మధ్య తొలిదశ చర్చలు జరిపాయి. హాట్‌లైన్ ద్వారా జరిపిన చర్చల్లో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. సుమారు గంటపాటు కొనసాగింది. భారత్ తరపున సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాల డీజీఎంవోల సమావేశంలో కాల్పుల విరమణపై విధివిధానాలపై చర్చించారు. ఉగ్రవాదులతోనే మా పోరాటం: అంతకుముందుకు ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల డీజీఎంవో (director general of military operations) మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో డీజీఎంవోలు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులతోనే మా పోరాటంమనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాంఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోందిఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోందిఅందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాంఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్దేచర్చలు వాయిదా.. భారత్, పాకిస్తాన్ డీజీఎంవోల చర్చలు వాయిదా. ఈరోజు సాయంత్రం చర్చలు జరిగే అవకాశం. సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్‌లైన్ ద్వారా రెండు దేశాల డీజీఎంవోలు చర్చలు జరపనున్నారు. చర్చలు ప్రారంభం..భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు ప్రారంభం,హాట్లైన్లో భారత్, పాక్ డీజీఎంవోల చర్చలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశంసమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ 👉భారత్-పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.👉ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు. Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM— ANI (@ANI) May 12, 2025👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్ లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. -
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం -
విరమణ.. ఉల్లంఘన
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్‌తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్ వైమానిక, రెండు రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్‌లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్‌లకు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్ ప్రకటించింది. బయటపడ్డ పాక్ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ -
కాల్పులకు విరమణ: కీలక పాత్ర వీరిదే!
పహాల్గమ్ ఉగ్రదాడి తరువాత.. భారత్ ప్రతీకారదాడులకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పాక్ ప్రతిదాడులకు ప్రయత్నించినప్పటికీ.. ఇండియన్ ఆర్మీ ముందు నిలబడలేకపోయింది. చేసేదేమీ లేక ఉద్రిక్తతలు తగ్గించాలని వేసుకోవడంతో.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసారు.భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో డీజీఎంవో (డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) అధికారులే కీలక పాత్ర పోషించారు. కాల్పుల విరమణ ప్రకటన రావడానికి ముందు పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉన్నత సైనిక అధికారి భారతదేశానికి ఫోన్ చేశారని, ఆ తర్వాత రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.కాల్పుల విరమణ ప్రకటన రావడానికి గంట ముందు, పాకిస్తాన్ భవిష్యత్తులో చేసే ఏదైనా ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామని, భారతదేశం దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని భారతదేశం తెలిపింది. గత మూడు రాత్రులుగా ఉత్తర భారతదేశంలోని సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపైకి పాకిస్తాన్ డ్రోన్ & క్షిపణి దాడులకు పాల్పడినప్పటికి వాటన్నింటినీ భారత వైమానిక రక్షణ శాఖ విజయవంతంగా అడ్డుకుంది.సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం వంటి వాటిలో.. డీజీఎంఓల పాత్ర చాలా కీలకం. ఆర్మీలో సీనియర్ అధికారి స్థాయిలో ఉండే వీరు.. సైనిక ఆపరేషన్లలో వ్యూహాత్మక, కార్యాచరణలను అమలు చేస్తుంటారు. ఆర్మీ చీఫ్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. అంతే కాకుండా ప్రత్యర్థులపై దాడులు, శత్రుమూకలను దీటుగా ఎదుర్కొనే సైనిక ఆపరేషన్లకు సంబంధించిన వ్యూహాలు కూడా రచిస్తుంటారు.బలగాలను సిద్ధం చేయడం మాత్రమే కాకుండా.. వాటిని రంగంలోకి దించడం వంటి విధులతో పాటు శాంతి పరిరక్షణలోనూ డీజీఎంఓలు కీలకంగా వ్యవహరిస్తారు. ఒకవైపు నిఘా వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకుంటూ.. మరోవైపు వ్యూహాలు రచిస్తారు. మనదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలు, సరిహద్దు ఉద్రిక్తతల వేళ కూడా డీజీఎంవోదే ప్రధాన పాత్ర అని చెప్పాల్సిందే. ఎందుకంటే కాల్పుల విరమణకు ముందు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విరమణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. -
కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు
జమ్మూ / శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత పోస్టులు, పౌర ఆవాసాలపై ఆదివారం ఎలాంటి కవ్వింపు లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఓ పోలీస్ అధికారి సహా 14 మంది గాయపడ్డారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) గత నెల 29న అంగీకరించారు. ఈ ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే పాకిస్తాన్ ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు జమ్మూలోని అఖ్నూర్, కనచాక్, ఖౌర్ సెక్టార్లపై మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయి. పాక్ కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఏఎస్సై ఎస్.ఎన్.యాదవ్(47), కానిస్టేబుల్ వీకే పాండేలు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వీరిద్దరూ మృతిచెందారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. పాక్ మాటల్లో ఒకటి చెప్పి, చేతల్లో మరొకటి చేస్తుందని తాజా ఘటన రుజువు చేసిందని జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ మండిపడ్డారు. రక్తపాతాన్ని ఆపండి: మెహబూబా జమ్మూకశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు భారత్, పాక్‌ల డీజీఎంవోలు వెంటనే మరోసారి చర్చలు జరపాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు. శ్రీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇరుదేశాల కాల్పులతో జవాన్లు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు వేర్పాటువాదులు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం ముందుకు రావాలన్నారు. కశ్మీర్ సమస్యను రాజకీయంగానే పరిష్కరించగలమన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో రంజాన్‌మాసంలో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల్లో కశ్మీరీ యువత భారీగా చేరుతోందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాదిలో కశ్మీర్ నుంచి 81 మంది యువకులు వివిధ ఉగ్ర సంస్థల్లో చేరినట్లు వెల్లడించాయి. ఈ ఏడాదే విచ్చలవిడిగా.. సంవత్సరం పాక్ కాల్పుల ఘటనలు 2015 287 2016 271 2017 860 2018(మే చివరి నాటికి) 1252 -
భారత్, పాక్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య సరిహద్దుల్లో ఎప్పుడూ భీకర వాతావరణమే దర్శనమిస్తుంది. గతంలో పలుమార్లు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరిగినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. తాజాగా 2003లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని మంగళవారం ఇరు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల మిలటరీ ఉన్నతాధికారులు హాట్‌లైన్ ద్వారా జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లోని పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇరుదేశాల అధికారులు కలసి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పరిస్థితులపై సమీక్ష నిర్వహించినట్టు భారత ఆర్మీ పేర్కొంది. సరిహద్దుల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని పాక్ ఆర్మీ కూడా స్పష్టం చేసింది. -
మేం రెడీగా ఉన్నాం..: డీజీఎంవో
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైన్యానికి భారత్ శుక్రవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి కాల్పులకు తెగబడితే మాత్రం మా భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చొరబాట్లకు పాకిస్తాన్ సైన్యం సహకరిస్తోందని.. భవిష్యత్‌లో ఇటువంటివి ఎదురైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ డీజీఎంఓకు.. ఏకే భట్ స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. చొరబాట్లకు సంబంధించి భారత డీజీఎంవో పాక్ అధికారులతో ఫోన్లో సంభాషించినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు. పాకిస్తాన్ సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దీనివల్ల జమ్మూ కశ్మీర్లో భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయని భట్.. పాక్ డీజీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే ఇండియన్ ఆర్మీలో సుశిక్షితులైన సైనికులు ఉన్నారని.. వారంతా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు భట్ స్పష్టం చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్ర రేఖ వెంబడి భారత దళాలు శాంతిగా ఉంటాయని.. అవసరమైతే మాత్రం తుపాకులు పనిచెబుతాయని.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదన్నారు. చెప్పారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. -
గత సర్జికల్ దాడుల రికార్డులు లేవు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వెల్లడి న్యూఢిల్లీ: 2016 సెప్టెంబర్ 29వ తేదీ కంటే ముందు చేపట్టిన సర్జికల్ దాడులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) తెలిపింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ప్రశ్నకు డీజీఎంఓ సమాధానమిచ్చింది. ఇండియన్ ఆర్మీ రికార్డులో సర్జికల్ దాడులకు ఎలాంటి నిర్వచనం ఉందో తెలపాల్సిందిగా అతను దరఖాస్తులో కోరాడు. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమధానమిస్తూ ‘ఇంటెలిజెన్స్ సమాచారంతో నిర్దేశిత లక్ష్యంపై వేగంగా, కచ్చితమైన దాడులు చేయడాన్ని’సర్జికల్ దాడులుగా పేర్కొంది. అంతేకాకుండా భారత సైన్యం చరిత్రలో 2016 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన సర్జికల్ దాడులే మొదటిదా లేక 2004–2014 మధ్యలో ఏమైనా సర్జికల్ దాడులు జరిగాయా తెలపాలని దరఖాస్తులో కోరాడు. ఇంటిగ్రేటేడ్ హెడ్‌క్వార్టర్స్ (ఆర్మీ)కి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును బదిలీ చేసింది. -
ప్రాంతీయ అగ్రరాజ్యంలా..
* భారత్‌పై పాక్ ఎన్ఎస్ఏ విమర్శ * తమదీ అణ్వస్త్ర దేశమేనని వ్యాఖ్య ఇస్లామాబాద్: భారత దేశం ప్రాంతీయ అగ్రరాజ్యం తరహాలో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)సర్తాజ్ అజీజ్ ధ్వజమెత్తారు. ఉఫా ఒప్పందాన్ని అతిక్రమిస్తూ భారత్ తన ఎజెండాను రుద్దుతోందని.. దానివల్లే ఎన్ఎస్ఏ చర్చలు రద్దయ్యాయని ఆరోపించారు. డాన్ వార్తా పత్రిక సోమవారం ప్రచురించిన కథనం ప్రకారం.. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఏడాది ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ.. భారత్‌ను ప్రాంతీయ అగ్రరాజ్యంగా పరిగణిస్తున్నారు. మోదీ సారథ్యంలోని భారత్ ప్రాంతీయ అగ్రరాజ్యంగా వ్యవహరిస్తోంది. కానీ మాదీ అణ్వస్త్ర శక్తిగల దేశమే.. మమ్మల్ని రక్షించుకోవటం ఎలాగో మాకు తెలుసు’ అని అజీజ్ అన్నారు. కశ్మీర్ అనేది ఒక అంశం కానట్లయితే.. ఆక్రమిత కశ్మీర్లో భారత్ 7 లక్షల మంది సైనికులను ఎందుకు మోహరించిందని ప్రశ్నించారు. ‘‘రెండు దేశాల మధ్య కశ్మీర్ అనేది ఒక సమస్య అని, దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సమాజం యావత్తూ విశ్వసిస్తోంది.కశ్మీర్ ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు వీలు కల్పిస్తూ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణను భారత్ నిర్వహించాలి’’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై చర్చల నుంచి పాక్ పారిపోదని.. ఎందుకంటే పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించటంలో భారత గూఢచర్య సంస్థ ‘రా’ ప్రమేయంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆంక్షలు కొనసాగిస్తే.. చర్చలు అసాధ్యం భారత్-పాక్‌ల ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు రద్దయినప్పటికీ.. సెప్టెంబర్ 5-6 తేదీల్లో జరగాల్సివున్న భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల సమావేశం షెడ్యూలు ప్రకారం జరుగుతుందని అజీజ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే.. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ అయిన హురియత్ కాన్ఫరెన్స్ నేతలతో పాక్ నేతలు కలవకూడదని భారత్ ఆంక్షలు విధించటం కొనసాగిస్తే.. ఎటువంటి చర్చలూ సాధ్యం కాదని అని ఓ టీవీ చానల్‌తో అన్నారు. -
షరీఫ్ కొత్త పల్లవి!
భారత, పాకిస్థాన్ ప్రధానుల మధ్య చర్చలు జరిగి 20 రోజులై ంది. దానికి సంబంధించి ఇంతవరకూ పురోగతి ఏమాత్రం లేదు. ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్స్ (డీజీఎంఓలు) ఎప్పుడు సమావేశం కావాలన్న అంశంపై తదుపరి చర్చలు లేవు. ఈలోగా ఎప్పట్లాగే పాక్ వైపునుంచి అడపా దడపా కాల్పుల విరమణ ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 10రోజుల్లో దాదాపు 36సార్లు ఇలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ఇరుదేశాల ప్రధానుల చర్చలకు చాలాముందే ఇవి మొదలయ్యాయి. ఒకటి రెండు రోజుల విరామం మినహా నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ ఎన్నికలకు ముందూ, ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించాక భారత్‌తో స్నేహం గురించి నవాజ్ షరీఫ్ చాలా మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారం పెంచుకుంటామని, సరిహద్దు తగాదాలకు శాంతియుత పరిష్కారం సాధనకు కృషిచేస్తామని చెప్పారు. ఈ మూడున్నర నెలల పాలనాకాలంలో మాత్రం అందుకు సంబంధించిన జాడలు కనబడనేలేదు. సరిగదా సరిహద్దుల్లో కొత్తగా ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. అందుకు సంజాయిషీ ఇవ్వాల్సిన సమయంలో షరీఫ్ ఇప్పుడు కొత్త స్వరం వినిపించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా మధ్యవర్తిత్వం కావాలని ఆయన కోరారు. రెండు దేశాల ప్రధానులు చాలా కాలం తర్వాత చర్చించుకున్నారని, అందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, పర్యవసానంగా స్నేహసంబంధాలు పెరగడానికి ఆస్కారం ఉన్నదని ఆశించేవారికి షరీఫ్ ఇలా అడ్డం తిరగడం ఆశ్చర్యమూ, అసంతృప్తి కలిగిస్తాయి. నిజానికి షరీఫ్ మాటలు కొత్తవేమీ కాదు. పాకిస్థాన్‌లో అధికార పీఠంపై ఉన్న ప్రతి ఒక్కరూ గత ఆరున్నర దశాబ్దాలుగా ఈ మాటలే వినిపిస్తున్నారు. సమస్యను ఎలాగైనా అంతర్జాతీయం చేసి ఏదోరకంగా తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని చూస్తున్నారు. క్రితంసారి ప్రధానిగా పనిచేసినప్పుడు కూడా షరీఫ్ ఇలాంటి మాటలే మాట్లాడారు. ఆ సంగతి ఆయనే చెబుతున్నారు. 1999లో అమెరికా పర్యటించినప్పుడు అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముందు ఇలాంటి ప్రతిపాదనే పెట్టానంటున్నారు. అమెరికా పశ్చిమాసియా సమస్యపై వెచ్చించే సమయంలో 10 శాతం కాశ్మీర్ సమస్యపై కేంద్రీకరిస్తే అది సులభంగా పరిష్కారమవుతుందని క్లింటన్‌కు ఆయన చెప్పారట. అయితే, ఇలా మూడో పక్షం జోక్యం చేసుకోవడం భారత్‌కు నచ్చదని కూడా ఆయనకు తెలుసట. ప్రధాని పదవి చేపట్టాక నవాజ్ షరీఫ్ అమెరికాలో చేస్తున్న తొలి అధికారిక పర్యటన ఇది. ఈ పర్యటనకు ముందే, లండన్‌లో ఆగిన సందర్భంలో షరీఫ్ ‘మూడో పక్షం’ జోక్యం ప్రతిపాదన చేశారు. వాస్తవానికి తాను మన్మోహన్‌తో మాట్లాడినప్పుడు ఏ నిర్ణయాలు జరిగాయో, అవి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో చూసి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తాము అనుకున్నదానికి భిన్నంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు కొనసాగుతున్నాయో ఆరా తీయాల్సి ఉంది. కానీ, అవేమీ చేయకపోగా ఇలా పాత ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇందువల్ల షరీఫ్ ఆశిస్తున్నదేమిటో స్పష్టమే. దీనిద్వారా ఆయన తన చేతగానితనాన్ని దాచుకోవాలని చూస్తున్నారు. దేశ ప్రధానిగా ఆ చర్చల్లో తాను ఇచ్చిన హామీలకు తన సైన్యమే తూట్లు పొడుస్తుంటే, వారిని వారించలేక ఆయన ఇలా సమస్యను పక్కదోవపట్టించాలని చూస్తున్నారు. కానీ, ఆ విషయంలో ఆయన విజయం సాధించలేకపోయారు. అమెరికా వెళ్తూ లండన్‌లో ఆగినప్పుడు షరీఫ్ ఈ ప్రతిపాదన చేయగా ఆయనింకా ఒబామాతో సమావేశం కాకుండానే అమెరికా దీన్ని చెత్తబుట్టలో వేసింది. ద్వైపాక్షిక సమస్యలపై ఆ రెండుదేశాలే చర్చించుకోవాలని, ఆ చర్చల ఉరవడి, పరిధి,స్వభావమూ ఎలా ఉండాలో అవే తేల్చుకోవాలని అమెరికా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికైనా తన ప్రతిపాదనలోని తెలివితక్కువతనం ఆయనకు తెలిసిందో, లేదో?! అమెరికా జోక్యానికి షరీఫ్ కొన్ని కారణాలను చూపుతున్నారు. ఈ ఆరున్నర దశాబ్దాలుగా ఇరుదేశాలమధ్యా ఆయుధపోటీ పెరిగిందని, ఇరుపక్షాలూ పోటాపోటీగా క్షిపణులనుంచి అణ్వస్త్రాల వరకూ సమకూర్చుకున్నాయని, ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నదని షరీఫ్ అన్నారు. అంతా నిజమే. కానీ కారకులెవరు? చర్చల్లో తీసుకుంటున్న నిర్ణయాలను కాలరాస్తున్నదెవరు? తాము దృఢంగా వ్యవహరించి, తమ సైన్యం వైపుగా తప్పిదాలు జరగకుండా చూస్తే సామరస్యపూర్వక పరిష్కారం లభించడం అంత కష్టమా? కానీ, ఎప్పుడూ చర్చల దారి చర్చలది...తమ వైఖరి తమది అన్నట్టే పాకిస్థాన్ వ్యవహరిస్తున్నది. ఇప్పుడు షరీప్ తెచ్చిన ‘మూడో పక్షం జోక్యం’ ప్రతిపాదననే తీసుకుంటే...అది ఇరుదేశాల మధ్యా నాలుగు దశాబ్దాలక్రితం కుదిరిన సిమ్లా ఒప్పందానికి పూర్తి విరుద్ధం. ద్వైపాక్షిక సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని, మూడో పక్షం జోక్యాన్ని కోరవద్దని ఆ ఒప్పందంలో ఇరు దేశాలూ అంగీకరించాయి. ఇప్పుడు దాని స్ఫూర్తికి విరుద్ధంగా షరీఫ్ వ్యవహరిస్తున్నారు. పాత ఒప్పందాలపై ఖాతరులేక, తాజా చర్చల్లో తీసుకున్న నిర్ణయాలపై గౌరవంలేక తోచినట్టు మాట్లాడే ఇలాంటి ధోరణి సమస్య పరిష్కారానికి ఏమాత్రం దోహదపడదని షరీఫ్ గుర్తిస్తున్నట్టు లేరు. సరిహద్దులు ప్రస్తుతం చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. కాల్పులు జరగని రోజంటూ లేదు. ఇప్పటికివి స్వల్ప ఘర్షణలుగా కనిపిస్తున్నా...భవిష్యత్తులో మరింత ముదురుతాయనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయంలోనూ, గద్దెనెక్కిన తర్వాత తానిచ్చిన హామీలేమిటో, వాటిని అమలు చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులేమిటో షరీఫ్ చిత్తశుద్ధితో ఆలోచించాలి. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటో అన్వేషించాలి. అంతేతప్ప పరిస్థితిని మరింత జటిలం చేసేలా వ్యవహరించకూడదు.