economic crisis
-
ట్రూడో తాయిలాలు
టొరంటో: ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న కెనడియన్లకు ఊరట కల్పిస్తూ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కిరాణా, పిల్లల దుస్తులు, మద్యం, క్రిస్మస్ ట్రీలతో సహా పలు వస్తువులపై రెండు నెలల పాటు పన్ను మినహాయించింది. 2023లో 1.5 లక్షల కెనేడియన్ డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న 1.87 కోట్ల మందికి ‘వర్కింగ్ కెనడియన్స్ రిబేట్’కింద ఒక్కొక్కరికి 250 డాలర్ల చొప్పున పంపిణీ చేయనుంది. ట్రూడో ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులో వెల్లడించారు. ‘‘మా ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు. కానీ ప్రజలకు మరింత డబ్బు అందించగలదు. 250 డాలర్ల రిబేట్‌తో పాటు కెనేడియన్లు డిసెంబర్ 14 నుంచి రెండు నెలల పాటు జీఎస్టీ, హెచ్ఎస్టీ నిలిపివేత రూపంలో పన్ను మినహాయింపు పొందనున్నారు’’అని ప్రకటించారు. దాని ప్రకారం కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాలు, పిల్లల దుస్తులు, డైపర్లు, ప్రాసెస్డ్ ఫుడ్, రెస్టారెంట్ భోజనం, స్నాక్స్, ఆల్కహాల్, బొమ్మలు, పుస్తకాలు, వార్తాపత్రికలతో సహా పలు ఇతర వస్తువులపై రెణ్నెల్లపాటు పన్ను ఎత్తేస్తారు. ట్రూడో ప్రకటనను విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే తప్పుపట్టారు. రెండు నెలల తాత్కాలిక పన్ను విరామం వచ్చే సంవత్సరం ప్రారంభంలో పెరిగే కార్బన్ పన్నుల భారాన్ని భర్తీ చేయబోదన్నారు. ‘‘ట్రూడో హయాంలో గృహనిర్మాణ ఖర్చులు రెట్టింపయ్యాయి. ఫుడ్‌బ్యాంక్ వినియోగం ఆకాశాన్నంటుతోంది. ఫెడరల్ కార్బన్ ట్యాక్స్ వల్ల చలికాలంలో ఇళ్లలో వెచ్చదనం కూడా ప్రజలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది’’అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కొత్తింటి అమ్మకాలపై కార్బన్ పన్ను, జీఎస్టీ రద్దు చేస్తామన్నారు. ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం తెలిసిందే. దాంతో తాజా ఆర్థిక తాయిలాలను వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో వారిని బుజ్జగించడంలో భాగమని భావిస్తున్నారు. కాగా జీఎస్టీ రద్దు తమ పార్టీ ప్రచారం ఫలితమేనని ఎన్డీపీ నేత జగీ్మత్ సింగ్ అన్నారు. -
పిల్లల తిండి కోసం... పస్తులుంటున్న కెనడియన్లు
ఒట్టావా: ఒకప్పుడు లక్షల మందికి కలల గమ్యస్థానమైన కెనడా కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కిరాణా బిల్లులు, గృహ నిర్మాణ ఖర్చులతో ప్రజలు సతమతమవుతున్నారు. అనేక కుటుంబాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే ఆపసోపాలు పడుతున్నాయి. చివరికి పిల్లలకు పౌష్టికాహారం కూడా గగనంగా మారుతోందట. సాల్వేషన్ ఆర్మీ చేసిన సర్వేలో ఇలాంటి విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. కెనడాలో 25 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి తమ ఆహారాన్ని తగ్గించుకుంటున్నారు. ఇక ఏకంగా 90 శాతానికి పైగా కుటుంబాలు కిరాణా వస్తువుల కొనుగోలును వీలైనంతగా తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే... → కెనడాలో ప్రతి నలుగురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు మంచి ఆహారం అందించడానికి స్వీయ ఆహార వినియోగాన్ని తగ్గించారు → సర్వేలో పాల్గొన్న వారిలో 90% మందికి పైగా ఇతర ఆర్థిక ప్రాధాన్యతలకు కావాల్సిన డబ్బు కోసం కిరాణా ఖర్చులు తగ్గించినట్లు చెప్పారు → కెనడాలో ఫుడ్ బ్యాంకులు కూడా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. → దాంతో భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులను తిప్పి పంపాలని అవి నిర్ణయించాయి. → చాలామందికి ప్రస్తుతం కనీస నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సరిపడా జీవనోపాధి పొందడం కూడా కష్టంగా మారింది → డబ్బుల్లేక చాలామంది చౌకగా దొరికే నాసిరకం ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు → అది కూడా కుదరినప్పుడు భోజనాన్ని దాటవేస్తున్నట్లు 84% మంది చెప్పారు. చాలామంది కెనడియన్లు తమ పిల్లలు, కుటుంబసభ్యుల రోజువారీ ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి ఇది అద్దం పడుతోంది– జాన్ ముర్రే, సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధి -
సమస్యల నడుమ సారథ్య పోరు..
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...బరిలో 39 మంది అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్‌కు ఊరటనిచ్చే అంశం.సజిత్ ప్రేమ దాస మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్‌కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్‌కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్‌కు మరింతగా కలిసిరానుంది.నమల్ రాజపక్స మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.అనూర కుమార దిస్స నాయకె నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్థిక మాంద్యం భయాలు..రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతుందనే భయాలు అధికమవుతున్నాయి. ఇటీవల గ్లోబల్‌గా స్టాక్‌మార్కెట్ ట్రెండ్ గమనిస్తే ఆ అనుమానం మరింత బలపడుతుంది. అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన వడ్డీరేట్లు, తగ్గిన ఆర్థిక శక్తి వెరసి మాంద్యం భయాలు అధికమవుతున్నాయి. దాంతో ఇటీవల ప్రపంచ స్టాక్‌మార్కెట్లు భారీగా పడుతున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా మార్కెట్లకుతోడు యూరప్, ఆసియా మార్కెట్లు భారీగా క్షీణిస్తున్నాయి. మార్కెట్ సోమవారం(మధ్యాహ్నం 1:21 వరకు) నిఫ్టీ దాదాపు 713 పాయింట్లు, సెన్సెక్స్ అయితే ఏకంగా 2300 పాయింట్లు పడిపోయింది. అంటే సుమారు రూ.8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.మాంద్యంలోకి జపాన్..జపాన్ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్ మధ్య)లో 0.4%, అంతకుముందు జులై–సెప్టెంబర్‌లో 2.9%, 2024 మొదటి త్రైమాసికంలో 0.5 శాతం క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగిస్తే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని గుర్తుగా భావిస్తారు. దీంతోపాటు, జపాన్ కరెన్సీ యెన్ కూడా బలహీనపడింది. ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జపాన్ క్రమంగా దాని స్థానాన్ని కోల్పోతోంది.బ్రిటన్‌లో ఇలా..పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ గతంలో నివేదించింది. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయింది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 4.7 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది.ఆర్థిక సంక్షోభంలో చైనా..చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా నేపాల్ నుంచి శ్రీలంక వరకు తన ఉనికిని విస్తరిస్తోంది. ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహాన్ని నటిస్తోంది. చైనా ప్రాపర్టీ రంగంలో భారీగా క్షీణించింది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా నేషనల్ బ్యూరో ఆప్ స్టాటిస్టిక్స్(ఎన్బీఎస్) సీనియర్ అధికారి హె కెంగ్ గతంలో తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో కోట్ల మంది ప్రజలు నివసించవచ్చన్నారు. చైనాలోని డాంగ్-గ్వాన్ అనే నగరంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య కోట్లుల్లో ఉందని కెంగ్ తెలిపారు. ఎన్బీఎస్-చైనా గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదు.ఇదీ చదవండి: రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!మన మార్కెట్లపై ప్రభావం ఎంతంటే..భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా గుర్తింపు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలను నిరుద్యోగం, శ్రామికశక్తి, వనరులు, ముడిసరుకులు..వంటి ఎదోఒక సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. అయితే భారత్‌లో ఇలాంటి సమస్యలున్నా వాటి ప్రభావం చాలా తక్కువ. ఇది ఇండియా ఆర్థిక వృద్ధికి బలం చేకూరుస్తోంది. తాత్కాలికంగా దేశీయ మార్కెట్లు పడినా దీర్ఘకాలికంగా రెట్టింపు లాభాలను తీసుకొస్తాయి. ఇలా మార్కెట్లు పడిన ప్రతిసారి మదుపర్లు నష్టాలను పట్టించుకోకుండా మంచి కంపెనీలను ఎంచుకుని పెట్టుబడిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ జీడీపీ మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 8.2 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
Pakistan General Elections 2024: పాక్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు
ఇస్లామాబాద్: పెచ్చరిల్లిన హింస, పెట్రేగిన ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధానిఇమ్రాన్‌ఖాన్ ఊచలు లెక్కపెడుతున్న వేళ ఆరేళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం దన్నుతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 74 ఏళ్ల షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. నవాజ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పారీ్ట అత్యధిక సీట్లు సాధించేలా కన్పిస్తోంది. ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌పై ఈసీ నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలో దిగారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 12.85 కోట్ల ఓటర్లు ఈసారి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. బుధవారమే బలూచిస్తాన్ ప్రావిన్స్న్స్లో ఉగ్రవాదులు జంట బాంబుదాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న నేపథ్యంలో 6.5 లక్షల మంది భద్రతా సిబ్బందితో పోలింగ్స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో ఈసారి 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 336 సీట్లకుగాను 266 సీట్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్‌చేశారు. మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్‌చేశారు. ఇంకొన్ని సీట్లు పార్టీలు గెలిచిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. -
గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రణాళికలు!
ముంబై: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న దేశీ విమానయాన కంపెనీ గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ లిక్విడేషన్ ప్రతిపాదనకు ఈ వారంలో రుణదాతలు అనుకూలంగా ఓటింగ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పారిశ్రామివేత్త నస్లీ వాడియా ప్రమోట్ చేసిన కంపెనీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో పలుమార్లు విఫలమైంది. కంపెనీ రుణదాతలకు రూ. 6,521 కోట్లవరకూ చెల్లించవలసి ఉంది. రుణదాతలలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 1,987 కోట్లు బకాయిపడి ఉంది. ఈ బాటలో బీవోబీకి రూ. 1,430 కోట్లు, డాయిష్ బ్యాంక్‌కు రూ. 1,320 కోట్లు చొప్పున రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ(సీవోసీ) కంపెనీ ఆస్తుల విలువను రూ. 3,000 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా చట్టం(ఐబీసీ)లో భాగంగా 270 రోజులలోగా కేసులను పూర్తి చేయవలసి ఉంది. దీంతో త్వరలోనే కంపెనీ లిక్విడేషన్‌కు తెరలేవనున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బ్యాంకులు తదితర రుణదాతలకు నిధులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. రేసులో జిందాల్ గో ఫస్ట్ విమానాలను కొనుగోలు చేయకుండా సేల్, లీజ్‌బ్యాక్ పద్ధతిలో కార్యకలాపాల నిర్వహణ చేపట్టడంతో కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కీలక ఆస్తులలో థానేలోని 94 ఎకరాల భూమిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ భూమిని వాడియా బ్యాంకులకు కొలేటరల్‌గా ఉంచారు. ఈ భూమి విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు ముంబైలోని ఎయిర్‌బస్ శిక్షణా కేంద్రం, ప్రధాన కార్యాలయాలను అదనపు ఆస్తులుగా పరిగణిస్తున్నాయి. గో ఫస్ట్ కొనుగోలుకి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ(ఈవోఐ).. జిందాల్ పవర్ మాత్రమే రుణదాతల కమిటీ పరిశీలనలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకుకాకుండా విమాన సరఫరాదారులకు రూ. 2,000 కోట్లు, వెండార్లకు రూ. 1,000 కోట్లు, ట్రావెల్ ఏజెంట్లకు రూ. 600 కోట్లు, కస్టమర్లకు రూ. 500 కోట్లు చొప్పున బకాయి ఉన్నట్లు తెలియజేశాయి. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్ పథకం కింద మరో రూ. 1,292 కోట్ల రుణం పొందినట్లు వెల్లడించాయి. వెరసి గో ఫస్ట్ మొత్తం రూ. 11,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నట్లు చెబుతున్నాయి. 2023 మే 2న కార్యకలాపాలు నిలిపివేసిన కంపెనీ 8 రోజుల తదుపరి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు స్వచ్చంద దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. -
సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారిపోతోంది. తాజాగా ఇంధనం లేని కారణంగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) 48 జాతీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇంధనం పరిమితంగా ఉండటం వల్ల విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని విమాన సర్వీసులను రీషెడ్యూల్ కూడా చేశామని పీఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 13 దేశీ, 11 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే 12 విమానాలను షెడ్యూల్ మార్చామని అన్నారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని కోరారు. బుధవారం మరో 16 విమానాలను రద్దు చేశామని, మరోకొన్ని ఆలస్యం కానున్నాయని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ చమురు సంస్థ (PSO) పీఐఏకు ఇంధన సరఫరా నిలిపివేయడంతో ఈ సంక్షోభం తలెత్తినట్లు సమాచారం. దీంతో పీఐఏకు ఇంధన కొరత ఏర్పడింది. మరోవైపు రుణభారం పెరిగిపోతున్న నేపథ్యంలో పీఐఏను ప్రైవేట్ పరం చేసేందుకూ ఆలోచనలు నడుస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు రోజూ వారి ఖర్చుల కోసం రూ. 23 బిలియన్ల పాయం అందించాలని పీఐఏ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇటీవలే కోరింది. కానీ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. PSO నుంచి ఇంధన సరఫరా కోసం రోజుకు రూ.100 మిలియన్లు అవసరమవుతాయి. అడ్వాన్స్ పేమెంట్లు మాత్రమే అని పీఎస్ఓ కొత్తగా డిమాండ్ చేయటంతో పీఐఏ చేతులెత్తేసింది. భవిష్యత్తులో మరిన్ని విమానాల రాకపోకలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో దాయాది పాకిస్థాన్ గత కొంతకాలంగా సతమతమవుతోంది. ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోగా.. ప్రజలు, ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇదీ చదవండి: దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్ -
అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన తప్పదా?
వాషింగ్టన్: అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోయే ముప్పు ఉంది. రిపబ్లికన్ల డిమాండ్ మేరకు సరిహద్దు భద్రత సహా వివిధ ఏజెన్సీల చెల్లింపుల కోసం ప్రతిపాదిత బడ్జెట్లో 30% మేరకు నిధుల్లో కోత విధించినప్పటికీ మద్దతునివ్వడానికి వారు అంగీకరించడం లేదు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకే స్వల్ప మెజార్టీ ఉండడంతో ఈ బిల్లు పాస్ కాకపోతే ఏం చెయ్యాలన్న ఆందోళనలో అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. అదే జరిగితే 20 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది జీతాల్లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలకు నిధులు కేటాయించలేరు. -
పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు
అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్ధప్రయోజనాలు పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వరల్డ్ బ్యాంకు పాక్ ప్రతినిధి నజీ బాన్‌హాస్సిన్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది. 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు, తగినన్ని వనరులు లేకపోవడం సహా అనేక ఆర్ధిక కష్టాలను పాక్ ఎదుర్కొంటోంది. పిల్లల విద్యా ప్రమాణాలు, చిన్నారుల మరణాలు వంటి సూచికలు.. పాక్ పేదరికం తారా స్థాయికి చేరిందని చెబుతున్నాయని నజీ బాన్‌హాస్సిన్ తెలిపారు. 2000 నుంచి 2020 మధ్య కాలంలో పాకిస్థాన్ సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే. ఇది దక్షిణాఫ్రికా దేశాల సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువగా ఉందని నజీ వెల్లడించారు. పాక్ మానవాభివృద్ధి సూచికలోనూ దక్షిణాసియాలో చిట్టచివరన ఉంది. విదేశీ నిల్వలు అడుగంటాయి. వాతావరణ మార్పులు ఆ దేశానికి శాపంగా మారుతున్నాయి. పాక్‌లో వచ్చే జనవరిలో జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఆర్ధిక పరిస్థితులు బాగులేని కారణంగా ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ధిక వ్యవస్థను సరిచేసుకోవాల్సిన సమయమని సూచించింది. నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉచిత హామీలకు పోకూడదని పేర్కొంది. ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరింది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ప్రజా సేవలు, మౌలిక సదుపాయాల్లో పరిమితమైన ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్ -
పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు
Petrol Diesel Prices దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభం లోకి కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో అక్కడ ఇంధన ధరలు రూ. 300 మార్కును దాటాయి. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశ ప్రజలు మరింత సంక్షోభంలోకి కూరుకు పోనున్నారని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంధన ధరలను పెంచేసింది. పెట్రోల్ ధరను 14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను 18.44 పెంచినట్లు గురువారం సాయంత్రం ప్రకటించింది. దీంతో అక్కడ ప్రస్తుతం పెట్రోల్ ధర305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరుకుంది. ఇటీవలి ఆర్థిక సంస్కరణలతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆల్ టైం హైకి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి కూడా దిగ జారి పోతుండటంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను కూడా భారీగా పెంచేసింది. డాలరు మారకంలో పాక్ కరెన్సీ 305.6 వద్దకు చేరింది. -
Global Wealth Report 2023: భారత్ తప్ప పలు అగ్రదేశాల్లో సంపద కరిగిపోతోంది
అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో సంపద పెరుగుతోంది. భారత్‌లో తప్ప ► అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, డాలర్‌తో పోల్చి చూస్తే వివిధ దేశాల కరెన్సీలు పడిపోవడం, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు వంటివెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సంపద క్షీణించడం ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నట్టుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) రూపొందించిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023లో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యధికంగా సంపదని కోల్పోతే ఆ తర్వాత స్థానంలో జపాన్ ఉంది. 2021లో ప్రపంచ దేశాల సంపద 466.2 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి 2.4% తగ్గి 454.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంపద తగ్గిపోవడంలో అమెరికా ముందుంది. ఏడాదిలో 5.9 ట్రిలియన్ డాలర్ల సంపదను అగ్రరాజ్యం కోల్పోయింది. ఆ తర్వాత స్థానంలో జపాన్ నిలిచింది. 2021తో పోల్చి చూస్తే ఆ దేశం 2.5 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ప్రాంతాల వారీగా ఇలా.. ► అత్యంత సంపన్న దేశాలున్న ఉత్తర అమెరికా, యూరప్‌లు భారీగా నష్టపోయాయి. 2022లో ఈ దేశాల్లో 10.9 ట్రిలి యన్ డాలర్ల నష్టం జరిగింది. ► ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► లాటిన్ అమెరికాలో 2.4 ట్రిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ► 2022లో భారీగా సంపద హరించుకుపోయిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఆ్రస్టేలియా ఉన్నాయి. ► సంపద భారీగా పెరిగిన దేశాల్లో భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా నిలిచాయి. ► తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో పెరుగుతున్న సంపద ► ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం సంపద పెరుగుతోంది. 2021తో పోల్చి చూస్తే మన దేశ సంపద 675 బిలియన్ డాలర్లు అంటే 4.6% పెరిగింది. 2022 నాటికి 15.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా వంటి దేశాల్లో కూడా సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం పెరగడం విశేషం. దేశంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అపర కుబేరులుగా మారారు. 2000 నుంచి 2022 వరకు ఏడాదికి 15% మిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నప్పటికీ రష్యా సంపద కూడా పెరగడం గమనార్హం. స్థిరంగా సంపద పెరుగుదల.. ► భారత్‌లో సంపద పెరుగుదల 20 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సంపద ఏడాదికి 5.9% చొప్పున పెరుగుతోంది. ఒకప్పుడు చైనాలో మధ్యతరగతి సంపద అధికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించింది. మిలియనీర్లు మన దేశంలో ఏకంగా 15% పెరుగుతూ వస్తున్నారు. మొత్తమ్మీద మిలియనీర్లు అమెరికాలోనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన వారు 5.9 కోట్ల మంది ఉంటే వారిలో 2.3 కోట్ల మంది అంటే 40% అమెరికాలోనే ఉన్నారు. 2027 నాటికి భారత్, చైనా, బ్రెజిల్, యూకే, దక్షిణ కొరియాలో కూడా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అంచనా. 2022–27 మధ్య చైనాలో కోటీశ్వరులు 26%,భారత్‌లో 11% పెరుగుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు మీరు..
-
ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి
ఇస్లామాబాద్: అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ దేశ ఆర్ధిక పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలీయని అనిశ్చితిలో దొరికిన చోట దొరికినంత అప్పు చేస్తోంది. తాజాగా తన మిత్ర దేశమైన చైనా దగ్గర మరికొంత ఋణం తీసుకునేందుకు అంతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేసి స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గత కొంతకాలముగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) దగ్గర కొంత ఋణం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మిత్రదేశం చైనా దగ్గర మరికొంత రుణాన్ని పొందనుంది. చైనాకు పాకిస్తాన్ ఇప్పటికే 2.07 బిలియన్ డాలర్ల రుణపడి ఉండగా తాజాగా తీసుకోనున్న మరో 600 మిలియన్ డాలర్ల రుణంతో కలిపి ఆ మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది. దీంతో విపరీతంగా పెరుగుతున్న అప్పుల భారం దృష్ట్యా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ స్పందించారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులను, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్తాన్ గర్విస్తోందని అన్నారు. ఎంతకాలం ఇలా పొరుగుదేశాల దగ్గర చిప్ప పట్టుకుని తిరుగుతాం. ముందు చేతిలోని ఆ చిప్పను విసిరేయాలి. రుణాల కోసం ఇతర దేశాల మీద మీద ఆధారపడటం మానేయాలి. సొంత కాళ్ళ మీద నిలబడి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలని అన్నారు. ఇది కూడా చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం -
తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆ దేశంలో పెట్రోల్ బంకులు బంద్
ఇస్లామాబాద్: పెట్రోల్ అమ్మకాలపై పాకిస్తాన్ ప్రభుత్వం మార్జిన్ పెంచని కారణంగా జులై 22 నుండి జులై 24 వరకు రెండు రోజులు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం. పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్లో లీటరు పెట్రోల్ రూ.253 కాగా డీజిల్ ధర రూ. 253.50 గా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్. గత కొంతకాలంగా పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ వారు పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5%(రూ.12) మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం కేవలం 2.4%(రూ.6) మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా జులై 22, శనివారం నుండి జులై 24,సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం. ఈ మేరకు శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసు నిలిపివేస్తున్నట్లు తెలిపారు సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్. ఇది కూడా చదవండి: తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే.. -
ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లే
ముంబై: వ్యాపార ఒప్పందాల విషయంలో జాప్యం జరుగుతోందని మధ్య స్థాయి ఐటీ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ తెలిపింది. రాబోయే ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లు ఉంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కల్రా శుక్రవారం తెలిపారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను కంపెనీ చవిచూసిందని అన్నారు. ‘ప్రస్తుతం ఒప్పందాల ముగింపునకు ఎక్కువ సమయం పడుతోంది. సగటు సమయం సుమారు మూడు నెలల నుండి 4–6 నెలలకు చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్త ఒప్పందాల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే రూ.2,050 కోట్ల నుంచి రూ.1,943 కోట్లకు పడిపోయింది. అయితే ఒప్పందాల విషయమై పలు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. కంపెనీ ఆదాయ వృద్ధి మార్చి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 3 శాతం క్షీణించి రూ.2,321 కోట్లకు పడిపోయింది. నిర్ణీత సమయాల్లో మొత్తం 800 మంది ఫ్రెషర్లను బోర్డులోకి తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. మార్చితో పోలిస్తే జూన్ క్వార్టరులో ప్రాఫిట్ మార్జిన్ 0.5 తగ్గి 14.9 శాతంగా ఉంది. నికరలాభం 8.1 శాతం ఎగసి రూ.229 కోట్లను తాకింది. కొత్తగా 240 మంది చేరికతో మొత్తం సిబ్బంది సంఖ్య జూన్ చివరినాటికి 23,130కి చేరింది. కోల్‌కత, కొచి్చలో నూతనంగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని సందీప్ వెల్లడించారు. -
దయనీయంగా పాక్ పరిస్థితి.. బాంబు పేల్చిన ఐఎంఎఫ్, ఇప్పట్లో కష్టమే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దయనీయంగా మారుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్ధిక స్థితిగతులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 120 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతానికైతే పాకిస్తాన్ అప్పులతో ఏదో ఒక విధంగా నెట్టుకొస్తుంది కానీ భవిష్యత్తులో వారికి మరిన్ని కష్టాలు తప్పవని తేటతెల్లం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ దేశం ఎక్కడెక్కడో ఉన్న వారి ఆస్తులను అమ్ముకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో వాషింగ్టన్ లోని వారి ఎంబసీ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. అలాగే కరాచీ, లాహోర్ విమానాశ్రయాలను కూడా లీజుకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ఇస్లామాబాద్ విమానాశ్రయాన్నైతే ఇప్పటికే అవుట్సోర్సింగ్ కు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను ఆర్థిక సహాయం కోరిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ కొంత నిధులను సమకూర్చినా కూడా పాకిస్తాన్ వారి ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడాలంటే మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది ఐఎంఎఫ్. పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తోనూ ఆర్థిక ద్రవ్య విధానాలపై వారు చేసిన ఒప్పందం ఆధారంగా నివేదిక తయారుచేశామని ఐఎంఎఫ్ ఈ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రస్తుత అంతర్గత విధానాలు, దీర్ఘకాలిక చెల్లింపులు దృష్ట్యా వెలుపల నుండి సహకారం అందిస్తున్నవారు మరికొంత కాలం పాక్ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది ఐఎంఎఫ్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఈ సంక్షోభం నుండి గట్టెక్కడం కష్టమని నివేదికలో చెప్పకనే చెప్పింది. మరోపక్క పెరుగుతోన్న నిత్యావసర వస్తువుల ధరలకు తాళలేక పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. వీటితోపాటు ఇటీవలే యూనిట్ పై ఐదు పాకిస్తాన్ రూపాయల విద్యుత్ చార్జీలు, గ్యాస్ చార్జీలు 40% కూడా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు.. -
సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!
కోవిడ్–19 మహమ్మారి ప్రభావాల నుంచి కోలుకుంటున్న దశలో శ్రీలంకను 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది. ఆహారం, ఇంధన కొరతతో కూడిన పెద్ద ఆర్థిక సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకోవడానికి డబ్బులేకపోయింది. ఈ సంక్షోభం తీవ్రత ఎంతంటే.. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా ప్రకారం సంక్షుభిత శ్రీలంకలో ప్రజలు భోజనాల సంఖ్యను 37% తగ్గించుకున్నారు. తినే ఆహారాన్ని 40% తగ్గించుకున్నారు. తక్కువ ఇష్టపడే ఆహారాలను తినటం 68% తగ్గించుకోవాల్సి వచ్చింది. కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ) ఆవరణలో పచ్చికను తొలగించి కూరగాయలు సాగు చేస్తున్న దృశ్యం బయటి నుంచి ఆహారోత్పత్తులు నగరానికి రావటం తగ్గినప్పుడు ఉన్న పరిమితులకు లోబడి నగరంలోనే కూరగాయలు, పండ్లు వంటివి పండించుకోవటం తప్ప వేరే మార్గం లేదు. దేశ రాజధాని కొలంబో అతిపెద్ద నగరమైన కొలంబో(అప్పటి) మేయర్ రోసీ సేననాయక (మార్చి 19న ఆమె పదవీ కాలం ముగిసింది) ఈ దిశగా చురుగ్గా స్పందించారు. కొలంబో మునిసిపల్ కౌన్సిల్ (సీఎంసీ) మద్దతుతో నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆహార పంటలను పండించేలా చొరవ చూపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కూరగాయలు, పండ్ల సాగు ప్రారంభమైంది. కొలంబో విస్తీర్ణం 37 చ.కి.మీ.లు. జనాభా 6.26 లక్షలు (2022). నిజానికి ప్రజల స్థాయిలో టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ప్రయత్నాలకు కొలంబో గతం నుంచే పెట్టింది పేరు. అయితే, పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సెంట్రల్ కొలంబోలో కూరగాయల మొక్కలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ కరోనాకు ఆర్థిక/ఆహార సంక్షోభం తోడైతే తప్ప కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ)కి, శ్రీలంక ప్రభుత్వానికి అర్బన్ అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏమిటో తెలిసిరాలేదు. నగరంలో ఖాళీ స్తలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నంతలో ఆకుకూరలు, కూరగాయల సాగుకు కౌన్సిల్ పచ్చజెండా చూపటమే కాదు.. మొదటి పెరటి తోట కొలంబో టౌన్ హాల్ చుట్టూ ఉన్న పచ్చిక బయలు లోనే ఏర్పాటైంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత 30 సంవత్సరాల క్రితం క్యూబాలోని హవానాలో కూడా ఇలాగే జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట పచ్చికను తొలగించి కూరగాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భం అది. ఉపయోగించని ప్రతి అంగుళం ఖాళీ స్తలాల్లో ఇంటి పెరటిలో, బాల్కనీలలో, ఇంటి పైకప్పులలోనూ కూరగాయలు పండించమని నివాసితులను, పాఠశాల విద్యార్థులను సీఎంసీ ప్రోత్సహించింది. కొలంబో సిటీ కౌన్సిల్ ఆవరణలో సాగవుతున్న కూరగాయలను పరిశీలిస్తున్న మాజీ మేయర్ రోసీ సేననాయక తదితరులు Good morning from our rooftop terrace #SriLanka #naturelovers #GoodMorningTwitterWorld pic.twitter.com/SkFGeLFr6V— Devika Fernando (@Author_Devika) June 28, 2023 60%గా ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలకు అర్బన్ అగ్రికల్చర్ చాలా అవసరమని సీఎంసీ భావిస్తోంది. కోవిడ్డ మహమ్మారికి ముందు నగరంలో కూరగాయల సాగు ఆవశ్యకతను సీఎంసీలో ఏ విభాగమూ గుర్తించ లేదు. ఇప్పుడు వచ్చిన మార్పు గొప్పది. ఈ సానుకూల ప్రయత్నాలకు శ్రీలంక కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ పంటలు పండించడానికి శుక్రవారం ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి, నగర పరిసరాల్లో పడావుపడిన వరి పొలాలు, ఖాళీ ప్రభుత్వ స్తలాలను సాగు చేయడానికి సైన్యాన్ని కూడా నియోగించారు. ప్రైవేటు సంస్థలు కూడా కదిలాయి. సెంట్రల్ కొలంబోలో పూర్తిగా వివిధ కూరగాయ మొక్కలతో రూపొందించిన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం) -
Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్..
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల వేతనాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక వాషింగ్టన్ లోని పాకిస్తాన్ ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలోని అమ్మకానికి పెట్టిన ఎంబసీ 7.1 మిలియన్ డాలర్లకు అమ్ముకుంది. వాషింగ్టన్‌లోని పాకిస్తాన్ చారిత్రాత్మక భవనమైన ఎంబసీ 2003 నుంచి ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్న కారణంగా 2018లో దౌత్య హోదాను కూడా కోల్పోయిన ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థతో సహా పలు సంస్థలు పోటీపడగా చివరకు పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త హఫీజ్ ఖాన్ దీన్ని 7.1 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు వాషింగ్టన్లో రెండు చోట్ల ఎంబసీ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్ స్ట్రీట్‌లో ఉన్న ఈ భవనాన్ని1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. క్రమేపీ అందులో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఈ భవనాన్ని దుర్భర స్థితిలో ఉన్న ఆస్తుల లెక్కలో చేర్చడంతో దీని అంచనా విలువపై టాక్స్ కూడా భారీగా పెరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది బిడ్ లను ఆహ్వానించింది పాకిస్తాన్ ప్రభుత్వం. తర్వాత భవనం తరగతిని మార్చిన పాకిస్తాన్ అధికారిక వర్గం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఒకపుడు క్లాస్ -2 హోదాలో ఉన్న ఈ భవనం తర్వాత క్లాస్-3 కి ఇప్పుడు క్లాస్-4 స్థాయికి పడిపోయింది. ఇది కూడా చదవండి: పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధుల కుమ్ములాట -
వీడియోకాన్‌పై ఆడిట్ సందేహాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఖాతా పుస్తకాల ఆడిట్ సమీక్షలో కొన్ని పద్దులు, లావాదేవీల నమోదుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రమోటర్ ధూత్ కుటుంబం నిర్వహణలో ఉన్నప్పుడు వీటి నమోదు జరిగి ఉండవచ్చని ఆడిట్ సమీక్ష పేర్కొంది. కంపెనీపై దివాలా చట్ట చర్యలు ప్రారంభించకముందు ఈ సందేహాస్పద లావాదేవీలు నమోదైనట్లు ఆడిట్ అభిప్రాయపడింది. కాగా.. వీడియోకాన్ రుణపరిష్కార నిపుణులు ఇప్పటికే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు ఇలాంటి లావాదేవీలను రద్దు చేయడం, ప్రక్కన పెట్టడంపై దరఖాస్తు చేశారు. ఈ ఆడిట్ సమీక్ష వివరాలను గత నాలుగు త్రైమాసికాల ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న సందర్భంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. దివాలా చట్ట నిబంధనల ప్రకారం ప్రిఫరెన్షియల్, విలువ తక్కువగా మదింపు, అక్రమ లావాదేవీల గుర్తింపునకు రుణ పరిష్కార నిపుణులు చేపట్టిన స్వతంత్ర లావాదేవీ ఆడిట్ సమీక్ష అనంతరం ఈ అంశాలు బయటపడినట్లు వివరించింది. రుణ పరిష్కార నిపుణులు 2021 జూన్(క్యూ1), సెప్టెంబర్(క్యూ2), డిసెంబర్(క్యూ3), 2022 మార్చి(క్యూ4)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను క్రోడీకరించి పూర్తిఏడాది(2021–22) పనితీరును ప్రకటించారు. వెరసి వీడియోకాన్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ ఆదాయం రూ. 756 కోట్లకు చేరగా.. రూ. 6,111 కోట్లకుపైగా నికర నష్టం నమోదైంది. -
ఆర్ధిక ఇబ్బందుల వల్ల అమ్మకానికి పాకిస్థాన్
-
ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా?
ఇస్లామాబాద్: గత కొంత కాలంగా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఈ పరిస్థితుల్లో నుంచి బయట పడటానికి కొంత సమయం పడుతుందన్నారు పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్. గతంలోనూ ఇదే పరిస్థితి... కరాచీ వాణిజ్య మండలి పరిశ్రమ నిర్వహించిన ఓ సమావేశంలో పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి ఇషాక్ దార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించే ప్రయత్నం చేశారు ఇషాక్ దార్. ఆయన మాట్లాడుతూ.. 1998, 2013 లో మనం ఇంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ కొంత కాలానికి ఆ సంక్షోభం నుంచి బయటపడ్డాము. పడి లేచిన ఆర్ధిక వ్యవస్థ... 2017 సమయానికి పాకిస్తాన్ ఆర్ధికంగా అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత కారణంగా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. ఇటువంటి సంక్షోభాలకు తక్షణ పరిష్కారం అంటూ ఉండదు. తేరుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది. తొందర్లోనే మనం ఈ దుస్థితి నుండి బయటపడి ఆర్ధికంగా నిలదొక్కుకుంటామన్నారు ఇషాక్ దార్. నూతన కార్యాచరణ.. కఠినమైన సంస్కరణలు తీసుకొచ్చి సమిష్టిగా సవాళ్ళను ఎదుర్కొంటే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పడుతుంది. ఇప్పటికే ఈ కార్యాచరణను కూడా మొదలుపెట్టాము. విదేశీ చెల్లింపులకే మా మొదటి ప్రాధాన్యత. వ్యవసాయ రంగంలోనూ ఐటీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నాము కాబట్టి త్వరితగతినే కుదురుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఇది కూడా చదవండి: బీజేపీ ప్రధాని కాదు, భారత దేశ ప్రధాని -
మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ
బెర్లిన్: యూరోప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు పేర్కొన్నాయి. 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. (ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా) మరిన్ని బిజినెస్వార్తలు, ఇ ంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి
న్యూఢిల్లీ: కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలంటూ విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు .. పైలట్లు ..ఇతర సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు, నిధులు .. వర్కింగ్ క్యాపిటల్, లీజుదార్లతో ఒప్పందాలు తదితర వివరాలు అందులో పొందుపర్చాలని డీజీసీఏ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళికను సమీక్షించిన తర్వాత డీజీసీఏ తగు నిర్ణయం తీసుకోవచ్చని వివరించాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 2న స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా మే 3, 4 తారీఖుల్లో రద్దు చేసిన విమాన సేవలను ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించింది. ఈలోగా సర్వీసుల నిలిపివేతపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో మారటోరియం వ్యవధిని ఉపయోగించుకుని పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలంటూ గో ఫస్ట్ తన సమాధానంలో కోరింది. మరోవైపు లీజుదార్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గో ఫస్ట్ దివాలా పరిష్కార పిటిషన్‌ను అనుమతించాలని ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మే 22న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
‘భారత్ కోరుకునేది పాకిస్తాన్లో శాంతి, సుస్థిరత’
‘పొరుగు దేశాలు చల్లగా ఉండాలి. వాటితో మనకు సుహృద్భావ సంబంధాలు ఉండాలి’ అనేది భారత విదేశాంగ విధానం ముఖ్యసూత్రం. ఇప్పుడు పశ్చిమాన సరిహద్దు దేశం పాకిస్తాన్ రాజకీయ అశాంతిని చుట్టుముట్టే పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలిటరీ రేంజర్లు దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని హైకోర్టు ముందు అరెస్టు చేయడంతో సంక్షోభం తీవ్రమౌతోంది. కిందటేడాది ఏప్రిల్ మొదటివారం పాక్ కేంద్ర చట్టసభ నేషనల్ అసెంబ్లీలో నాటి ప్రధాని ఇమ్రాన్ మెజారిటీ కోల్పోవడంతో మన దాయాది దేశంలో రాజకీయ సంక్షోభం మొదలైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి షెహబాజ్ నాయకత్వాన రెండు ప్రధాన పార్టీల (పాకిస్తాన్ ముస్లింలీగ్–ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ)తో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాది కాలంగా అధికారంలో ఉన్న ప్రస్తుత పాక్ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. 2022 ఆగస్ట్ మాసంలో వచ్చిన వరదలు దేశంలో మున్నెన్నడూ కనీవినీ ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. ఈ వరదలు దేశంలో తీవ్ర ఆహార కొరత సృష్టించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఆహార ధాన్యాల కొరత.. ఇటీవలి రంజాన్ మాసంలో ఆహార ధాన్యాల కొరత, ఆర్థిక సమస్యలు ప్రజలను కుంగదీశాయి. ఈ నేపథ్యంలో పాత కేసులకు సంబంధించి మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్షం పాకిస్తాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) నేతను అరెస్టు చేయడంతో పాక్ ప్రధాన నగరాలు భగ్గుమన్నాయి. జాతీయ రాజకీయాల్లో పాక్ ఆర్మీ తెరవెనుక నుంచి క్రియాశీల పాత్ర పోషించడం జగమెరిగిన సత్యం. కొత్త పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ ఆరోపణలు, ఆర్మీతో విభేదాలు దేశ రాజకీయాలను మరిన్ని చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. నిన్నటి అరెస్టు తర్వాత సర్వశక్తిమంతమైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల కార్యాలయాలపై ఇమ్రాన్ అనుచరులు, అభిమానులు చేసిన దాడులు పాక్ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. అసలే ఆర్థిక, సామాజిక సమస్యలు తీవ్రమైన సమయంలో మాజీ ప్రధాని, మంచి జనాకర్షణ శక్తి ఉన్న ఇమ్రాన్ అరెస్టు పాకిస్తాన్‌ను ‘అగ్నిగుండం’లోకి నెట్టివేసే ప్రమాదం ఉందని భారత రక్షణ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1947 నుంచీ నాలుగు యుద్ధాలు.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ మధ్య నాలుగు (1947–48, 1965, 1971, 1999) యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల రెండు దేశాలకూ ఆర్థికంగా నష్టమే జరిగింది. అయినా, ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌తో శాశ్వత శాంతి కోసమే భారత్ ప్రయత్నిస్తోంది. 1947 ఆగస్ట్ 14 వరకూ ఒకే దేశంగా ఉన్న ఈ రెండు దక్షిణాసియా దేశాలు కశ్మీర్ కారణంగా 20వ శతాబ్దంలో పోరుకు తలపడడం దురదృష్టకర పరిణామం. మతం ఆధారంగా జరిగిన దేశ విభజన పర్యవసానాల వల్ల ఇప్పటికీ రెండు దేశాలూ మానసికంగా బాధపడుతూనే ఉన్నాయి. 1947కు ముందు అంటే బ్రిటిష్ ఇండియాలోని అవిభక్త పంజాబ్‌లో జన్మించిన (ఈ ప్రాంతాలు ఇప్పుడు పాక్ పంజాబ్‌లో చేరి ఉన్నాయి) ముగ్గురు నేతలు గుల్జారీలాల్ నందా, ఇందర్ కుమార్ గుజ్రాల్, డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రధానులుగా పనిచేశారు. రెండు సర్వసత్తాక దేశాలుగా విడిపోయి 75 ఏళ్లు దాటినాగాని భారత్, పాక్ దేశాల మధ్య దౌత్య, సాంస్కృతిక, ఇతర సంబధాలు కొనసాగుతున్నాయి. వేలాది సంవత్సరాల అనుబంధం ఉన్న పాకిస్తాన్ ప్రశాంతంగా, సుభిక్షంగా ఉంటేనే దానికి ఆనుకుని ఉన్న అతిపెద్ద సరిహద్దుదేశం ఇండియాకు కూడా మంచిదని భారత ప్రజలు భావిస్తున్నారు. భూభాగంలో, జనాభాలో పాకిస్తాన్ కన్నా చాలా పెద్దదైన భారత దేశం పెద్ద మనుసుతో పాకిస్తాన్ ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి త్వరగా కోలుకుని బయటపడాలని ఆశిస్తోంది. 22 కోట్ల ప్రజలున్న పాక్‌లో శాంతి, సుస్థిరత 142 కోట్ల ప్రజలు నివసించే భారతదేశానికి కొండంత బలం. పొరుగు ఇంట మంటలు ఎప్పుడూ మన ఇంటికి క్షేమం కాదని నమ్మే భారత ప్రజల విశ్వాసం ఎంతో విలువైనది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. ఇది కూడా చదవండి: సోరెన్‌తో నితీశ్ భేటీ -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీ ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిచ్చింది. కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ఎన్సీఎల్టీ దాదాపు వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా బుధవారం నాడు ఆదేశాలను వెలువరించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంటు.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. గో ఫస్ట్ తాను బాకీల విషయంలో డిఫాల్ట్ అయ్యానని, రుణదాతల నుంచి వచ్చిన డిమాండ్ నోటీసులను కూడా సమర్పించిందని, లీజు సంస్థలు కూడా దీన్ని ఖండించడం లేదని ద్విసభ్య ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో దివాలా చట్టంలోని సెక్షన్ 10 కింద కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనుంది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవరీ చేసుకోవడానికి గానీ ఉండదు. గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
దారుణాతి దారుణంగా పాకిస్థాన్ పరిస్థితి శ్రీలంకను దాటేసింది...
-
మళ్లీ డిఫాల్ట్.. రూ.4,161 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన జేపీ అసోసియేట్స్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్) తాజాగా రూ. 4,161 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది. దీనిలో అసలు, వడ్డీ కలసి ఉన్నాయి. మార్చి31న రూ. 1,653 కోట్ల అసలు, రూ. 2,508 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కంపెనీ నియంత్రణ సంస్థలకు వెల్లడించింది. ఈ రుణాలు వివిధ బ్యాంకులకు చెందినవని తెలియజేసింది. వడ్డీసహా కంపెనీకున్న మొత్తం రుణ భారం రూ. 29,396 కోట్లుకాగా.. 2037కల్లా తిరిగి చెల్లించవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. వీటిలో రూ. 4,161 కోట్లు 2023 మార్చి31కల్లా చెల్లించవలసి ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రతిపాదిత ఎస్పీవీ పథకాన్ని వాటాదారులంతా ఆమోదించారని, ఎన్సీఎల్టీ అనుమతించవలసి ఉన్నదని తెలియజేసింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు దీంతో ఎస్పీవీకి బదిలీ తదుపరి రూ. 18,051 కోట్లమేర రుణాలు తగ్గనున్నట్లు వివరించింది. కాగా.. జేఏఎల్‌కు వ్యతిరేకంగా 2018 సెప్టెంబర్‌లో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్‌లో రూ. 6,893 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యంపై పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ సైతం జేఏఎల్‌పై ఎన్సీఎల్టీ వద్ద ఫిర్యాదు చేసింది. కాగా.. ఇటీవల జేఏఎల్, గ్రూప్ సంస్థలు దాల్మియా భారత్‌కు మిగిలిన సిమెంట్ ఆస్తుల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ. 5,666 కోట్లుకాగా.. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా అంతక్రితం కంపెనీ 20 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ సామర్థ్యాలను ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్నకు 2014–2017 మధ్య విక్రయించింది. ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి -
జేపీ మోర్గాన్ చేతికి ఫస్ట్ రిపబ్లిక్
న్యూయార్క్: ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లో తలెత్తిన సంక్షోభం మొత్తం వ్యవస్థకు వ్యాపించకుండా చూసేందుకు అమెరికా బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, అసెట్లలో చాలా మటుకు భాగాన్ని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌నకు విక్రయించాయి. అమెరికా చరిత్రలో ఓ భారీ స్థాయి బ్యాంకు విఫలం కావడం ఇది రెండోసారి. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో వాషింగ్టన్ మ్యూచువల్ కుప్పకూలింది. ప్రస్తుత ఫస్ట్ రిపబ్లిక్ తరహాలోనే అప్పట్లో వాషింగ్టన్ మ్యూచువల్‌ను కూడా జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంకే టేకోవర్ చేసింది. సోమవారం నుంచి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 84 శాఖలు .. జేపీమోర్గాన్ చేజ్ బ్యాంక్ బ్రాంచీలుగా పనిచేయడం ప్రారంభమవుతుందని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది. ఏప్రిల్ 13 గణాంకాల ప్రకారం ఫస్ట్ రిపబ్లిక్కు 229 బిలియన్ డాలర్ల అసెట్లు, 104 బిలియన్ డాలర్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. పరిమాణం ప్రకారం అమెరికన్ బ్యాంకుల్లో 14వ స్థానంలో ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సమస్య పరిష్కారానికి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌పై 20 బిలియన్ డాలర్ల భారం పడగా, ఫస్ట్ రిపబ్లిక్పరంగా మరో 13 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడవచ్చని ఎఫ్‌డీఐసీ అంచనా వేసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు సంక్షోభంలో చిక్కుకున్న ప్రభావంతో మార్చి నుంచి ఫస్ట్ రిపబ్లిక్ సైతం సవాళ్లు ఎదుర్కొంటోంది. తక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువగా రుణాలివ్వడం, అధిక శాతం డిపాజిట్లకు బీమా భద్రత లేకపోవడం వంటి అంశాల కారణంగా బ్యాంకుపై డిపాజిటర్లలో నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా బిలియన్ల కొద్దీ డాలర్ల విత్‌డ్రాయల్స్ వెల్లువెత్తాయి. ఒక దశలో ఫస్ట్ రిపబ్లిక్కి సహాయం చేసేందుకు ఇతర బ్యాంకులు కూడా ముందుకు వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత వారాంతంలో భేటీ అయిన అమెరికా నియంత్రణ సంస్థలు పరిష్కార మార్గాన్ని అమలు చేశాయి. -
పండుగ వేళ పాకిస్తాన్లో దయనీయ పరిస్థితులు.. వీడియో వైరల్
దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. తినడానికి తిండి లేక పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక, ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ సహా 11 మంది మృత్యువాతపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఆర్థిక సంక్షోభం కారణంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో పాకిస్తాన్ ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. సామాన్యులు తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేసేందుకు వస్తున్న ఓ ట్రక్కుపైకి జనాలు ఎగబడ్డారు. రన్నింగ్‌లో ఉన్న ట్రక్కుపైకి ఎక్కి బస్తాల కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. Another video of a truck carrying floor/atta being looted in Pakistan. Reportedly one woman dead & few injured in sahiwal park during stampede for atta. Sad But the Propaganda of World Happiness Index, Hunger Index, self-styled fact checkers and anti-india haters, busted again. pic.twitter.com/HR46xrMHw5 — Megh Updates 🚨™ (@MeghUpdates) March 29, 2023 దీంతో, అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని సహివాల్, బహవాల్పూర్, ముజఫర్‌గఢ్, ఒఖారా ప్రాంతాలపోటు, ఫైసలాబాద్, జెహానియాన్, ముల్తాన్ జిల్లాల్లో తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 50 ఏండ్ల రికార్డు స్థాయికి చేరింది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. అయితే పవిత్ర రంజాన్ మాసం కావడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ధరాభారం నుంచి కొద్దిగానైనా ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేస్తున్నది. దీంతో, ఇలా తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. This video from #TerroristNationPakistan is for all the people who actually “believe” in the ‘indexes”, according to whom Pakistan is better ranked than Bharat. Shame on presstitute media, who keeps propagating those rankings. People r dying just a bag of wheat flour. pic.twitter.com/YH29j3uCc0 — Tathvam-asi (@ssaratht) March 29, 2023 -
నేటితో ముగియనున్న యస్ బ్యాంక్ షేర్ల లాకిన్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ షేర్ల మూడేళ్ల లాకిన్ వ్యవధి సోమవారంతో ముగియనుంది. దీంతో మార్కెట్లో భారీ అమ్మకాలు వెల్లువెత్తవచ్చని భావిస్తున్నారు. 2020 మార్చిలో యస్ బ్యాంక్‌లో దాదాపు 49 శాతం వాటాలు కొనుగోలు చేసిన తొమ్మిది బ్యాంకులు తాజాగా షేర్లను అమ్ముకుని నిష్క్రమించేందుకు ప్రయత్నించవచ్చని అంచనా. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు (రిటైల్, సంపన్న వర్గాలు, ప్రవాస భారతీయులు) చెందిన 135 కోట్ల షేర్లు, ఈటీఎఫ్‌లకు చెందిన 6.7 కోట్ల షేర్లు లాకిన్ అయి ఉన్నాయి. 2022 డిసెంబర్ ఆఖరు నాటికి ఎస్బీఐకి 605 కోట్లు, హెచ్డీఎఫ్సీ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంకులకు తలో 100 కోట్ల షేర్లు ఉన్నాయి. నిర్వహణపరమైన అవకతవకలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును 2020 మార్చిలో రిజర్వ్ బ్యాంక్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత రూపొందించిన ప్రణాళిక ప్రకారం తొమ్మిది బ్యాంకులు తలో రూ. 10,000 కోట్లు సమకూర్చడం ద్వారా వాటాలు తీసుకుని యస్ బ్యాంక్‌ను నిలబెట్టాయి. అలా తీసుకున్న వాటాల్లో 75 శాతం షేర్లను మూడేళ్ల వరకూ విక్రయించకుండా లాకిన్ విధించారు. ఇతర ఇన్వెస్టర్లకూ ఇదే నిబంధన వర్తింపచేశారు. -
సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్: మరో ప్లాంట్ షట్‌డౌన్
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొంటూ మరో కార్ల తయారీ సంస్థ హోండా తన ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పాక్‌కు గుడ్‌బై చెబుతుండగా, ఈ జాబితాలో తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా చేరింది. ప్రస్తుతం పాక్‌లోని హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణమని ప్రకటించింది. జియో న్యూస్ ప్రకారం మార్చి 9 నుంచి 31 వరకు హోండా తన ఫ్లాంట్‌ను మూసివేయనుంది. పాక్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తిని కొనసాగించలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్టాక్ఎక్స్ఛేంజ్‌కు అందించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. ప్రభుత్వం పూర్తి నాక్-డౌన్ కిట్ల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ నిషేధం, ముడిసరుకు, విదేశీ చెల్లింపుల స్తంభన లాంటి చర్యలతో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిందని కంపెనీ తెలిపింది. కాగా అధిక ద్రవ్యోల్బణం, పాక్ కరెన్సీ క్షీణత, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పాకిస్తాన్ ఆటో పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని జియో న్యూస్ నివేదించింది. వాణిజ్య లోటును నియంత్రించేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిగుమతుల ఆంక్షలతో ఆటో పరిశ్రమ కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినడమే కాకుండా కంపెనీలు తమ సీకేడీ మోడళ్ల ధరలను కూడా పెంచాయి, ఇది ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాక్‌లోని టయోటా-బ్రాండ్ ఆటోమొబైల్స్‌కు చెందిన సుకుజీ మోటార్ కంపెనీ (PSMC) ఇండస్ మోటార్ కంపెనీ (IMC) అసెంబ్లర్లు కూడా తమ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. -
50 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం: పాతాళానికి పాక్ కరెన్సీ
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా దేశంలో ద్రవ్యోల్బణం తారా స్తాయికి చేరి 50 ఏళ్ల గరిష్టం వద్ద కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారి పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 31.5 శాతానికి చేరింది. జూలై 1965లో డేటా-కీపింగ్ మొదలైనప్పటినుంచి ఏప్రిల్ 1975లో ఒకసారి ద్రవ్యోల్బణం భారీగా పెరిగినప్పటికీ, 29 శాతంగా ఉండట గమనార్హం. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) తాజాగా గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ 31.5 శాతం వద్ద మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) ప్రకారం, అమెరికా డాలర్‌తో పోలిస్తే పాక్ రూపీ గణనీయంగా పడిపోయింది.ఈ ఏడాది 20 శాతం క్షీణించి డాలర్ మారకంలో 284 వద్ద రికార్డు స్థాయికి క్షీణించింది. దీంతో దక్షిణాసియా దేశం ఇప్పుడు ప్రపంచంలో 17వ అత్యంత ఖరీదైన దేశంగా అవతరించింది.పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ విదేశీమారకద్రవ్య నిల్వలు మూడు వారాల దిగుమతులకు సరిపడా స్థాయికి పడిపోయాయి. ఇది ఇలా ఉంటే గత నెల ప్రారంభం నుండి చర్చలు జరుపుతున్నప్పటికీ ఐఎంఎఫ్ నిధుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. ఈ ఆలస్యం కరెన్సీ మార్కెట్లో అనిశ్చితిని సృష్టిస్తోందని కరాచీకి చెందిన బ్రోకరేజ్ హౌస్ టాప్‌లైన్ సెక్యూరిటీస్‌కు చెందిన మహ్మద్ సోహైల్ అన్నారు. మరోవైపు వచ్చే వారం నాటికి ఐఎంఎఫ్ ప్రాథమిక డీల్‌పై ఆర్థిక మంత్రి దార్ భారీ ఆశలు పెట్టుకున్నారు. -
PakistanCrisis ‘ఓన్లీ వన్ మీల్...నో స్కూల్’ అల్లాడుతున్న జనం
ఇస్లామాబాద్:పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దేశ ప్రజలను వణికిస్తోంది. ఒక పూట తింటే మరో పూటకు లేక, పిల్లల్ని బడికి పంపించే దారిలేక నానా అవస్థలు పడుతున్నారు. దేశాన్ని ముంచెత్తిన వరదలు, రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి వరదలకు గోధుమ పంట మొత్తం నాశనం కావడంతో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. దీనికితోడు ప్రభుత్వ పన్నుల భారం పిడుగులా తాకింది డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం దీంతో ఒకప్పుడు మూడు పూటలా తినేవాళ్లం, కానీ ఇప్పుడు... ఒక్కసారే వండుకుని మూడు పూట్లకు సర్దుకుంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఒక్క పూట మాత్రమే తింటున్నామని.. పిల్లల్ని స్కూళ్లకు పంప లేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. చివరికి ఆహారాన్ని తగ్గించు కోవడమే కాదు మండుతున్న పెట్రోల్ ధరలతో, రెట్టింపైన టికెట్ల రేట్లతో ప్రయాణఖర్చుల్ని భరించలేక, ప్రయాణాల్నిమానివేసి కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు. ఇళ్లల్లో పనులు చేసినందుకు గతంలో ఇంటికి 3 నుంచి 4 వేలు సంపాదించేది రుక్సానా బీబీ. కానీ ఇపుడదే నెల మొత్తం ఆదాయంగా వస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖర్చులు రెట్టింపైతే, ఆదాయం మాత్రం భారీగా పడిపోయింది. గోధుమ పిండి దొరక్క నానా అగచాట్లు పడుతున్నారు. ఒక బస్తా గోధుమ పిండి కోసం రోజుల తరబడి పిల్లలు లైన్లో నిలబడాల్సి వస్తోంది. ఒక వస్తువు కొంటే మరొకటి కొనలేకపోతున్నామని మరో సామాన్యుడి ఆవేదన ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ గత మూడేళ్లుగా తన ఆదాయంలో మార్పు రాలేదని ఇక పిల్లలను బడికి పంపే స్థోమత ఎక్కడదని వాపోయాడు.ద్రవ్యోల్బణం కారణంగా తన బిజినెస్ దెబ్బతిందని ఒక చిన్న దుకాణదారుడు నదీం ఉద్దీన్ సిద్దిఖీ చెప్పాడు. వారానికి రూ.50వేలయ్యే పెట్టుబడి కాస్తా లక్షకు పెరిగింది. మాలో మేం కుంచించుకు పోతున్నాం. ఇంతకుముందు నాలుగు కప్పుల టీ తాగితే, ఇప్పుడు ఒకటి తాగడమే కష్టంగా ఉందంటూ విచారం వ్యక్తంచేశారు. మరోవైపు పాక్స్తాన్ వీక్లీ ఇన్‌ప్లేషన్ 40శాతానికి పైగా ఎగిసింది. -
పాక్‌లో వేతనాలు, బిల్లుల చెల్లింపులు బంద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక కష్టాలతో షహబాజ్ షరీఫ్ సర్కారు అతలాకుతలమవుతోంది. ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది వేతనాలు సహా అన్ని బిల్లుల చెల్లింపుల్ని నిలిపేసింది. తదుపరి ఉత్తర్వుల దాకా శాఖలు, డివిజన్లు అనుబంధ విభాగాల బిల్లులను క్లియర్ చేయొద్దని ఆదేశించింది. మరోవైపు అత్యవసరమైన మందులు కూడా దొరక్క రోగులు నరకం చూస్తున్నారు. అత్యవసర ఆపరేషన్లు కూడా ఆగిపోతున్నాయి! -
Sri Lanka: పాపం శ్రీలంక.. నిధులు లేక ఎన్నికలు వాయిదా..!
కొలంబో: అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ ఖజానా ఎప్పుడో ఖాళీ కావడంతో కనీసం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి 9న నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 3న కొత్త తేదీలను వెల్లడించే అవకాశం ఉంది. శ్రీలంక విదేశీ మారక నిల్వలు 500 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఆర్థికి పరిస్థితి అద్వాన్నంగా మారడంతో ఈ దేశానికి అప్పులు ఇవ్వకుండా ఐఎంఎఫ్, పారిస్ క్లబ్ ఆంక్షలు విధించాయి. దీంతో మిత్ర దేశం చైనా కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో తమపై ఐఎంఎఫ్ ఆంక్షలు ఎత్తివేసేలా చూసి అమెరికా, జపాన్ తమను ఆదుకుంటాయేమోనని లంక గంపెడు ఆశలు పెట్టుకుంది. ఐఎంఎఫ్ ప్రతిపాదించిన విధంగా 10 సంవత్సరాల రుణ మారటోరియంతో ఆర్థిక సహాయం కోసం చైనా వైపు శ్రీలంక చూస్తున్నప్పటికీ అలా జరిగే సూచనలు కన్పించడం లేదు. అసలు సమస్య ఏంటంటే ఒకవేళ శ్రీలంకకు చైనా సాయం చేయాల్సి వస్తే ఇతర దేశాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందించవలసి ఉంటుంది. ఆఫ్రికాలో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)తో పాటు, తమ చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్‌కు కూడా చైనా ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే పాకిస్తాన్‌కు 700 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసింది తప్ప కొత్తగా రుణాలు ఇవ్వలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం ఆ దేశ విదేశీ మారకపు నిల్వలు 3.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మూడు వారాల దిగుమతికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్, శ్రీలంకలో పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో రెండు దేశాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలు తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!' -
‘తప్పట్లేదు.. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస వద్దు’
గత కొంత కాలంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆ దేశ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది పాక్. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన పొదుపు చర్యల్లో భాగంగా తమ మంత్రులు ఇకపై 5-స్టార్ హోటళ్లలో బస, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేయవద్దని స్పష్టం చేసింది. కీలక నిర్ణయం.. అవి బంద్ ఇస్లామాబాద్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘మనం సమయానుకూలంగా నడుచుకోవాలి. కాలం మన నుంచి ఏమి కోరుతుందో వాటిని ఇవ్వాల్సి ఉంటుందని’ షరీఫ్ అన్నారు. పెరుగుతున్న అప్పులు, ప్రపంచ ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు గతంలో ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలను తగ్గించడంతో పాటు సమాఖ్య మంత్రుల సంఖ్యను మరింత తగ్గించింది. వీటితో పాటు మంత్రిత్వ శాఖలు, విభాగాల ఖర్చులను చాలా వరకు అరికట్టింది. దీంతోపాటు లగ్జరీ వస్తువులు, కార్ల కొనుగోలుపై కూడా వచ్చే ఏడాది వరకు పాక్ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. అంతేకాకుండా ప్రభుత్వం ఖర్చు తగ్గించే చర్యలలో $764 మిలియన్ల ప్రణాళికను కూడా పాటిస్తోంది. తద్వారా ఐఎంఎఫ్ నుంచి నిధులు పొందాలనే ఆలోచనలో ఉంది. సబ్సిడీలను తొలగించాలని ఐఎంఎఫ్ చేసిన అభ్యర్థనను అనుసరించి, పాకిస్తాన్ లగ్జరీ దిగుమతులపై సుంకాలను పెంచింది. ఇంధన ధరలను పెంచడంతో పాటు ఈ వారం ప్రారంభంలో కరెన్సీని తగ్గించింది. అదనంగా, ఐఎంఎఫ్ మార్కెట్ నిర్ణయించిన కరెన్సీ రేటును అనుమతించాలని సూచించింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దెబ్బకు అటు సామాన్యులను మాత్రమే కాకుండా సైన్యాన్ని కూడా ప్రభావితం చేసింది. సరఫరాలో కోత కారణంగా పాకిస్తాన్ సైన్యం మెస్‌లలో ఆహార కొరత సమస్యలను ఎదుర్కొంటోంది. చదవండి : 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!' -
‘మోదీని మాకు ఇవ్వండి’.. ఓ పాకిస్థానీ ఆవేదన
ఇస్లామాబాద్: మోదీ పాలనలో బతికేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయన చెడ్డ వ్యక్తి ఎంత మాత్రం కాదు. గొప్ప మనిషి. భారతీయులు ఇవాళ అర్ధరాత్రిళ్లు సైతం పిల్లల ఆకలి తీర్చే స్థితిలో ఉన్నారు. నిత్యావసరాలు అందుబాటు ధరలో కొనుగోలు చేసుకుంటున్నారు. మనం అలాంటి స్థితిలో లేనప్పుడే.. పుట్టిన దేశాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాం అంటూ ఓ పాక్ పౌరుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బీజేపీ నేతలతో పాటు మోదీ అభిమానులు వాటిని తెగ వైరల్ చేస్తున్నారు. పాక్‌లోని పలు ప్రముఖ ఛానెల్స్‌లో పని చేసిన మాజీ జర్నలిస్ట్, యూట్యూబర్ సనా అంజాద్.. తాజాగా ‘బతికేందుకు పాక్ నుంచి పారిపోండి.. అది భారత్‌లో ఆశ్రయం పొందైనా సరే!’ పేరిట.. ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా ఆమె.. వీధుల్లో తిరుగుతూ అక్కడి పౌరుల స్పందన కోరుతూ వస్తున్నారు. అలా ఓ యువకుడు మాట్లాడిన వీడియోనే ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘అసలు పాక్ భారత్ నుంచి విడిపోవాల్సింది కాదు. అలా జరగకపోయి ఉంటే.. ఇప్పుడు మనం(పాక్ ప్రజలను ఉద్దేశించి) అందుబాటు ధరల్లోనే అన్నీ కొనుక్కునేవాళ్లం. పేరుకే మనది ఇస్లాం దేశం. కానీ, ఇస్లాం స్థాపన మాత్రం ఇక్కడ జరగలేదు. మనకన్నా భారత ప్రధాని మోదీ ఎంతో నయం. ఆయన్ని అక్కడి ప్రజలు ఎంతో గౌరవిస్తారు. ఒకవేళ మనకే గనుక మోదీ ఉండి ఉంటే.. మనకు ఏ నవాజ్ షరీఫ్‌లు, బెనజీర్ భుట్టోలు, ఇమ్రాన్ ఖాన్లు, ముష్రాఫ్‌లు అవసరం ఉండేవాళ్లు కాదు. ఆయనొక్కడు చాలూ.. దేశంలోని అన్ని సమస్యలను చక్కబెట్టేవారు. ప్రస్తుతం ఆ దేశం(భారత్) ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉంది. మరి మనం ఎక్కడ ఉన్నాం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడా పాక్ పౌరుడు. మన దేశానికి మోదీని ఇవ్వమని, ఆయన మన దేశాన్ని పాలించాలని నేను అల్లాని ప్రార్థిస్తాను అని చివర్లో సదరు యువకుడు భావోద్వేగంగా చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. అల్లా.. మోదీని మాకు ఇవ్వండి. ఆయన దేశాన్ని బాగు చేస్తారు అంటూ ఆవేదనగా మాట్లాడాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే.. పాక్‌లో ప్రస్తుతం దారుణమైన ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ హయాంలో మొదలైన సంక్షోభం.. షెహ్బాజ్ షరీఫ్ ప్రభుత్వంలో తారాస్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది. అయితే సనా అంజాద్ చేసిన కార్యక్రమంలో.. భారత ప్రధాని మోదీ నాయకత్వంపై పలువురు పాక్ ప్రజలు ప్రశంసలు గుప్పించగా.. మరికొందరు మాత్రం ఈ రెండు దేశాలను, వాటి పరిస్థితులను పోల్చడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. "Hamen Modi Mil Jaye bus, Na hamen Nawaz Sharif Chahiye, Na Imran, Na Benazir chahiye, General Musharraf bhi nahi chahiye" Ek Pakistani ki Khwahish 😉 pic.twitter.com/Wbogbet2KF — Meenakshi Joshi ( मीनाक्षी जोशी ) (@IMinakshiJoshi) February 23, 2023 -
మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..
ఇస్లామాబాద్: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండగా.. ఇప్పుడు పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. దీంతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు దిగుమతి చేసుకోలేక పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే పాకిస్తాన్లో కర్యకలాపాలు నిలివేశాయి. సుజుకీ మోటార్ కార్పోరేషన్ మరికొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. టైర్లు, ట్యూబ్‌లు తయారు చేసే ఘంధారా టైర్, రబ్బర్ కంపెనీ తమ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు చెప్పింది. ముడిసరుకు దిగమతికి ఇబ్బందులు, వాణిజ్య బ్యాంకుల నుంచి కన్‌సైట్‌మెంట్ క్లియరెన్స్ పొందడానికి అడ్డంకులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ రెండు కంపెనీలు కేవలం ఉదాహరణలే. ఫర్టిలైజర్స్, స్టీల్, టెక్స్ట్టైల్స్ రంగాలకు చెందిన అనేక పరిశ్రమలు పాకిస్థాన్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. పాకిస్తాన్ విదేశీ కరెన్సీ నిల్వలు 3.19 బిలియన్ డాలర్లే ఉండటంతో దిగుమతులకు నిధులు సమకూర్చలేకపోతుంది. నౌకాశ్రయాల్లో వేలాది కంటైనర్ల సరఫరా నిలిచిపోయింది. పరిశ్రమల ఉత్పత్తి ఆగిపోయింది. వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. పరిశ్రమలు మూతపడితే నిరుద్యోగం పెరిగి ఆర్థిక వృద్ధిపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని పాక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో పరిశ్రమలు మూతపడటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. సుజుకీతో పాటు హోండా మోటార్, టొయోటా మోటార్ కూడా కొద్దివారాల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశాయి. దీంతో పాకిస్తాన్లో కార్ల సేల్స్ జనవరిలో 65శాతం పడిపోయాయి. ఆర్థిక సంక్షోభం వల్ల డిమాండ్ భారీగా తగ్గడమూ దీనికి మరో కారణం. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
పాకిస్తాన్‌కు కొత్త ముప్పు.. దేశంపై పట్టుకు టీటీపీ ప్లాన్.. దాని లక్ష్యాలేంటి ?
ఆర్థికంగా దివాలా తీశామని ఒకవైపు దేశ రక్షణ మంత్రే ప్రకటిస్తున్న పరిస్థితుల్లో తెహ్రిక్–ఇ–తాలిబన్ రూపంలో కొత్త ముప్పుని ఎదుర్కొంటోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు తాము బలిపశువుగా మారినందుకు ఎలా అడుగు లు వెయ్యాలో తెలీక బిత్తరపోతోంది. ఎవరీ తెహ్రిక్–ఇ–తాలిబన్లు, వారి లక్ష్యమేంటి ..? 2021, ఆగస్టు అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భం... పాకిస్తాన్లో సంబరాలు జరిగాయి. తమ కనుసన్నల్లో మెలిగిన తాలిబన్లు అమెరికానే తరిమి కొట్టారని, అగ్రరాజ్యంపై ఇస్లాం ఘన విజయం సాధించిందంటూ నాయకులందరూ ప్రకటనలు గుప్పించారు. ఆ నాటి పాక్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్‌కు వెళ్లి తాలిబన్ల ప్రభుత్వ స్థాపనకు స్వయంగా ఏర్పాట్లు చేసి మరీ వచ్చారు. నెల రోజులయ్యేసరికి.. అఫ్గాన్‌లో అధికారంలోకొచ్చిన తాలిబన్ల అండతో తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) రెచ్చిపోవడం ప్రారంభించింది. పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నిస్తూ దాడులకు దిగడం మొదలు పెట్టింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు పాక్‌లో కనీసం 250 దాడులు జరిగాయని పాక్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే దాడుల సంఖ్య రెట్టింపు అయింది. ఈ దాడుల్లో 95శాతం బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుఖ్వా(కె.పి)లో కీలక ప్రాంతాలు లక్ష్యంగా జరిగాయి. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 100 మంది ప్రాణాలను బలితీసుకున్న పెషావర్ మసీదు దాడి ఘటన జరిగిన కొద్ది రోజులకే కరాచీలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఏమిటీ టీటీపీ తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్‌ను టీటీపీ అని పిలుస్తారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల మద్దతుతో వీళ్లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. 2001లో అమెరికాపై ట్విన్ టవర్స్ దాడి తర్వాత అగ్రరాజ్యం చేసిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి పాకిస్తాన్ అండగా నిలవడంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వీరంతా ఒక గూటి కిందకి చేరారు. పాక్ విధానాలను వ్యతిరేకిస్తూ దక్షిణ వజిరిస్తాన్‌లో బైతుల్లా మెహసూద్ నేతృత్వంలో 2007లో తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఏర్పాటైంది. టీటీపీ ప్రస్తుత చీఫ్ నూర్ వలీ మెహసూద్ అఫ్గాన్ నుంచి పాక్‌లో హింసను రాజేస్తున్నాడు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి.! అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారిపోతాయని పాక్ ప్రభుత్వం భావించింది. రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయం అందించి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న భారత్ ఓ పక్కకి వెళ్లిపోతుందని ఆనందపడింది. అయితే సరిహద్దు రూపంలో తాలిబన్లతో సమస్య మొదలైంది.డ్యూరాండ్ రేఖపై ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీపీ తుపాకీలు వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని పాక్ సర్కార్ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. సరిహద్దుల్లో ఉన్న గిరిజనుల్ని పాక్ చేతుల నుంచి విడిపించడమే తమ లక్ష్యమన్నట్టుగా టీటీపీ మారిపోయింది. అఫ్గానిస్తాన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొన్నాళ్లు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా గత ఏడాది నవంబర్‌లో జనరల్ అసీమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించగానే కాల్పుల విరమణను రద్దు చేసింది. అప్పట్నుంచి పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడులు, ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, బెదిరింపులు వంటివి చేయసాగింది. మరోవైపు పాక్ ప్రభుత్వం కూడా తాలిబన్లను అదుపు చేయడానికి దాడులకు దిగుతూ ఉండడంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ అఫ్గాన్‌లో మంచి తాలిబన్లు, పాక్‌లో ఉన్న టీటీపీ చెడ్డ తాలిబన్లు అని భావించిన పాక్‌కు ఇద్దరూ చేతులు కలపడంతో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని నిట్టూరుస్తోంది. ఈ పరిణామాలన్నీ దేశంలో అంతర్యుద్ధానికి దారి తీయవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దివాలా తీశాం: పాక్ రక్షణ మంత్రి ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్తాన్ రేపో మాపో దివాలా తీస్తుందని అందరూ అనుకుంటున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్ బాంబు లాంటి నిజం చెప్పారు. ఇప్పటికే దేశం దివాలా తీసిందని అన్నారు. ఆదివారం సియాల్కోట్లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘‘పాక్ దివాలా తీస్తుందన్న వార్తలు మీరు వినే ఉంటారు. వాస్తవానికి ఇప్పటికే దేశం దివాలా తీసింది. మనం ప్రస్తుతం దివాలా తీసిన దేశంలో బతుకుతున్నాం’’ అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దేశంలో ఆర్థిక సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఏమీ చేయలేదని మనమే ఏదో ఒకటి చెయ్యాలన్నారు. పాకిస్తాన్లో చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని, ఈ దుస్థితికి రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, మన వ్యవస్థలు అన్నీ బాధ్యతవహించాలన్నారు. టీటీపీ లక్ష్యాలేంటి ? పాకిస్తాన్ మిలటరీ విధానాలను తీవ్రంగా వ్యతిరేంచిన ఈ సంస్థ దేశాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. 2021లో అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెళ్లిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పాకిస్తాన్‌పై దృష్టి సారించింది. ఇస్లాం విస్తరణ తాలిబన్ల ప్రధాన ధ్యేయంగా మారింది. అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా పాకిస్తాన్లో కూడా ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి షరియా చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న తమ వారిని బయటకు తీసుకురావాలని, అఫ్గాన్, పాక్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికుల్ని వెనక్కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది. పాకిస్తాన్లో ఉగ్ర దాడులకు ఐసిస్ అవసరం లేదు. పాకిస్తానీ తాలిబన్లు చాలు. అఫ్గానిస్తాన్ తరహాలో ఏదో ఒకరోజు తాలిబన్లు పాకిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. – తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ రచయిత్రి – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రిటన్కేమైంది? ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం!
యునైటెడ్ కింగ్డమ్. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం. కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది. నానాటికీ పతనం... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోక తప్పదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో 100% పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ ఎమ్మర్సన్ అభిప్రాయపడ్డారు. జీ–7 దేశాల్లో వెనక్కి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్ మాత్రం కోలుకోలేకపోతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ–7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డాలర్‌తో పౌండ్ విలువ : 0.83 బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు అంచనా: 0.6% ద్రవ్యోల్బణం : 10.1% బ్రెగ్జిట్ దెబ్బ... ప్రపంచదేశాలు కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటే బ్రిటన్ ఆర్థిక సమస్యలకు బ్రెగ్జిట్ అదనపు కారణంగా నిలిచింది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ దేశానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా యూకే ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి ఏకంగా 10 వేల కోట్ల పౌండ్ల నష్టం వాటిల్లుతోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 2021 జనవరి నుంచి బ్రిటన్ నుంచి ఈయూకు ఎగుమతులు 16% పడిపోయాయి. ఈయూ నుంచి వచ్చే పెట్టుబడులు 2,900 కోట్ల పౌండ్లు తగ్గిపోయాయి. శ్రామికులు కావలెను... బ్రెగ్జిట్ ముందు వరకు ఈయూ నుంచి బ్రిటన్‌కి స్వేచ్ఛగా పని చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు వర్కర్లు రావడం మానేశారు. ఫలితంగా ఆతిథ్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. యువత పని చేయడం కంటే ఉన్నత చదువులపై దృష్టి పెడుతూ ఉంటే, వయసు మీద పడ్డ వారు ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. అత్యధికులు రోగాల పాలై ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారే తప్ప పని చేసే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్‌లో కొండెక్కిన ధరలు.. చుక్కలు చూపిస్తున్న పాలు, పెట్రోల్, డీజిల్
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. లీటర్ పాల ధర 210 రూపాయలకు పెరిగింది. పాడి ఉత్పత్తులతోపాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు పాక్‌లో పెట్రోల్ ధరలు కూడా చారిత్రలో తొలిసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. అంతేగాక డీజిల్‌పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగంపేర్కొంది. కాగా ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న పౌరులపై మరింత భారాన్ని మోపింది. రికార్డు స్థాయిలో చికెన్ ధరలు పాకిస్తాన్లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలైంది! బోన్‌లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కొన్నాళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి శ్రీలంకను తలపిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. చదవండి: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
చేతులెత్తేసిన పాక్ సర్కార్.. దారుణంగా పాకిస్తానీల పరిస్థితి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు శ్రీలంకను మించిన పరిస్థితి దాయాది దేశంలో కనిపిస్తుంది. ఇప్పటికే తిండి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తానీలపై ప్రభుత్వం మరో బాంబు వేసింది. ఇంధన ధరలను భారీగా పెంచేసింది. ఈ క్రమంలో పాక్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఒకేసారి ఏకంగా 35 రూపాయలు పెంచింది. దీంతో, బంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూలు దర్శనమిస్తున్నాయని డాన్ పత్రిక పేర్కొంది. ఈ సందర్బంగా పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల సిఫార్సుల మేరకే రేట్లను పెంచినట్టు చెప్పారు. గ్లోబల్ మార్కెట్ నుండి చమురు కొనుగోలు చేయడానికి అధిక ధర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతకు ముందు, ఆర్థిక మంత్రి దార్.. పాకిస్తాన్‌ను అల్లా రక్షిస్తాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభం కారణంగా పాక్ కరెన్సీ ఇటీవలే భారీగా పతనమైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో పాకిస్తాన్ రూపాయి పతనమైంది. ఒకేరోజు ఏకంగా డాలర్‌కు 255 రూపాయలకు పడిపోయింది. ఇక, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో పాకిస్తాన్ కేవలం మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉన్నట్టు సమాచారం. సంక్షోభం అధిగమించేందుకు ఐఎంఎఫ్ విడుదల చేసే తదుపరి 100 కోట్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్రోగ్రాం కోసం పాకిస్తాన్ వేచిచూస్తోంది. మరోవైపు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ ఐఎంఎఫ్ ప్రతినిధి బృందం పాకిస్తాన్లో పర్యటించనుండగా నిధుల ప్రవాహం ప్రారంభమవుతుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
అడుగంటిన విదేశీ మారక నిల్వలు
ఇస్లామాబాద్: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో అష్టకష్టాలు పడుతున్న పాకిస్తాన్‌కు విదేశీ రుణాలు సైతం దొరకడం లేదు. 2022లో జూలై నుంచి డిసెంబర్ వరకు కేవలం 5.6 బిలియన్ డాలర్ల రుణాలు లభించాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) రుణ కార్యక్రమాన్ని పునరుద్ధరించే విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. విదేశీ మారక నిల్వలు 3.1 బిలియన్ డాలర్లకు అడుగంటాయి. కొత్త అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న అప్పులపై వడ్డీలు భారీగా పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపుకూ అప్పులే గతి! క్రెడిట్ రేటింగ్ దెబ్బ పాకిస్తాన్‌కు డిసెంబర్లో 532 మిలియన్ డాలర్ల రుణం లభించింది. ఇందులో 44 శాతం అంటే.. 231 మిలియన్ డాలర్లను ఆసియన్ అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణంగా ఇచ్చింది. పాక్ ప్రభుత్వం చాలా దేశాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. గత ఏడు రోజుల్లో చైనా ఆర్థిక సంస్థలకు 828 మిలియన్ డాలర్లు చెల్లించింది. -
ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులకు పాక్ ప్రభుత్వం షాక్! భారీగా కోత?
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమి ట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల్లో 10 శాతం కోత పెట్టాలని యోచిస్తోందట! మంత్రుల ఖర్చులను 15 శాతం తగ్గించాలని, స్వతంత్ర మంత్రులు, సహాయక మంత్రులు, సలహాదారులను 78 నుంచి 30కి కుదించాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏర్పాటుచేసిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రధానికి తుది నివేదిక ఇవ్వనుందని జియో న్యూస్ కథనం పేర్కొంది. -
Pakistan: భారత్ పట్ల వ్యతిరేకతే కొంప ముంచిందా?
దాయాది దేశం పాకిస్తాన్లో స్వాతంత్య్రానంతరం రాజ్యం, పాలనా వ్యవస్థా, ప్రజాస్వామ్య స్ఫూర్తీ నిర్వీర్యం అవుతూ వచ్చాయి. భారత్ వ్యతిరేక విధానమే అక్కడి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికీ, వచ్చిన ప్రభుత్వం స్థిరంగా నిలబడక పోవటానికీ ప్రాతిపదికగా ఉంది. అందుకే భారత్‌లో మత, ప్రాంతీయ విద్వేషాలను రగిలిస్తోంది. ఉగ్రవాదుల్ని తయారుచేసి సరిహద్దులు దాటిస్తోంది. భారత్‌పై మూడుసార్లు యుద్ధం చేసింది. అవకాశం దొరికిన ప్రతిసారీ భారత్‌ను ఛిన్నాభిన్నం చేయాలనేది దాని ప్రధాన ధ్యేయం. ఇందుకోసం పెంచిపోషించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారు. పాక్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న దురవస్థకు నేపథ్యం ఇదే. పొరుగు దేశాన్ని అస్థిర పరచడంలో ఉన్న శ్రద్ధ సొంత ప్రజల బాగోగులపై లేకపోవడంతో చివరికి పాక్ మును పెన్నడూ లేని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. ప్రకృతి శక్తులు ఈ స్థితిని మరింత దిగజారుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ బియ్యం, గోధుమలు, వంటగ్యాస్ వంటి కనీస అవసరాల కోసం ప్రజలు అర్రులు చాచాల్సి వస్తోంది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే... గ్యాస్ సిలిండర్ ధర అప్పుడు రూ. 2,373 ఉండగా, ఇప్పుడు రూ. 2,680కి చేరింది. పెసర పప్పు కిలో రూ. 172 ఉండగా నేడు రూ. 260గా ఉంది. అలాగే కేజీ చికెన్ రూ. 203 ఉండగా, ఈ ఏడాది రూ. 366కు పెరిగింది. 20 కిలోల గోధుమ పిండి ధర రూ.1,112 ఉండగా, ఈ ఏడాదికి రూ.1,812కు చేరింది. పరిస్థితి తీవ్రతకు ఈ ధరవరలు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం విదేశీ మారకం నిల్వలు 4.5 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరడంతో మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఆ దేశం ఆర్థిక సహాయం కోసం యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాల వైపు చూస్తోంది. పాకిస్తాన్లో 2010 నుంచి 2020 వరకు ఎకనామిక్ గ్రోత్ కేవలం 1.5 శాతం మాత్రంగానే ఉంది. ద్రవ్యోల్బణం రేటు 28.7 శాతంగా ఉంది. అప్పులు కూడా పుట్టడం లేదు. తమది చెప్పుకోవడానికి అణ్వస్త్ర దేశమైనా అప్పుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాపోయారు. గత 70 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కోలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ స్వయంగా పెంచి పోషించిన ‘తెహ్రీక్ ఇ తాలిబాన్’ పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పిగా మారింది. తాలిబన్లు పాకిస్తాన్‌కు అత్యంత కీలక ప్రాంతాలైన ఖైబర్ఫక్తున్ఖ్వా, బెలూచిస్తాన్, పంజాబ్ లాంటి ప్రదేశాల్లో.. సైన్యం, పోలీ స్లు టార్గెట్‌గా పనిచేస్తూ అనేక ఉగ్రవాద సంస్థలను తమలో కలుపుకొని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ చెప్పవలసిన మరో అంశం ఏంటంటే పాకిస్తాన్‌లోని ‘బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ని తాలిబన్లు తమ సంస్థలో విలీనం చేసుకున్నట్లు కూడా పాకిస్తాన్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ యువకులనూ తాలిబన్లు సైన్యంలో చేర్చుకుంటూ, ఆయుధ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ తాలిబన్ల మీద పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే ఎదుర్కోలేని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. అఫ్ఘానిస్తాన్‌ను వదిలి వెళ్లేటప్పుడు నాటో దళాలు సుమారు 22,000 వాహనాలు, 64,000 మిషన్‌గన్స్‌ను అక్కడే వదిలి వెళ్లాయి. ఎమ్ 16, ఏకే 47 రకానికి చెందిన ఆయుధాలు సుమారుగా మూడు లక్షలకు పైగా అక్కడ ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి ఇంత ఆధునికమైన ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన తాలిబన్ల మీద పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా విజయం సాధించగలదు? తినడానికి తిండి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబన్లను ఎదిరించగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గణాంకాల ప్రకారం పాక్‌లో కేవలం 68 శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తిచేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీటితో పాటుగా ప్రపంచంలోనే అతి తక్కువగా అక్షరాస్యత కలిగిన దేశాల్లో ఒకటిగా తయారయింది. అక్కడ 34.8 శాతం యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న భారత్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకోవటమే పాకిస్తాన్‌కు మంచిదని రక్షణ నిపుణులు పాక్‌కు సలహా ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందనీ, అక్కడి మీడియా కూడా ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని పాకిస్తాన్ దినపత్రిక ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కీర్తించింది. అమెరికా, రష్యాలు కూడా భారత్‌తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర కాలం నుంచి కశ్మీర్ పాకిస్తాన్‌దే అంటూ నానాయాగీ చేసిన పాకిస్తాన్... కశ్మీర్ అంశంపైన సామరస్య పూర్వకంగా ఒక నిర్ణయానికి రావాలనీ, తద్వారా రెండు దేశాలూ అభివృద్ధి సాధిస్తాయనీ పాక్ కొత్త హితవచనం అందుకుంది. భారత్‌తో మూడు యుద్ధాల్లో తలపడటం వల్ల కష్టాలూ, పేదరికం, నిరుద్యోగం మిగిలాయి. మూడు యుద్ధాలతో ఇప్పుడు తాము పాఠాలు నేర్చుకున్నాం అంటున్నారు పాక్ నాయకులు. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామనీ, కశ్మీర్ వంటి సమస్యలపై భారత ప్రధాని మోదీతో నిజాయతీగా చర్చలు జరపాలనీ పాక్ ప్రధాని పిలుపునిచ్చారు. నిజంగా ఈ పిలుపు సాకారమైతే కేవలం పాక్ మాత్రమే కాదు... ఇండియా కూడా లాభపడుతుంది. (క్లిక్ చేయండి: హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు) - డాక్టర్ ఎ. కుమార స్వామి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్ -
కొలువుపోయి కొత్త కష్టాలు! అమెరికాలో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరం
వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి దెబ్బకు దిగ్గజ టెక్ సంస్థలు భారీగా తీసివేతలకు దిగడంతో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత నవంబర్ నుంచి ఏకంగా 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ సహా ఐటీ, సోషల్ మీడియా, ఆర్థిక సేవల సంస్థలు ఉద్యోగులను భారీగా తీసేస్తున్నాయి. వీరిలో 30 నుంచి 40 శాతం భారత టెకీలేనని పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. వీరంతా హెచ్–1బీ, ఎల్1 వీసాల మీద అమెరికాలో పని చేస్తున్నావారే. 60 రోజుల్లోపు మరో ఉద్యోగం వెతుక్కోకుంటే వీరిని స్వదేశానికి పంపించేస్తారు. లేదంటే హెచ్–1బీ, ఎల్1 నుంచి వేరే కేటగిరీకి మార్చుకోక తప్పని పరిస్థితి! ‘‘మూణ్నెల్ల కింద అమెరికా వచ్చా. మార్చి 20న తప్పుకోవాలని చెప్పేశారు. నేను సింగిల్ పేరెంట్ను. నా పరిస్థితేమిటి?’’ అంటూ అమెజాన్ ఉద్యోగి ఒకామె వాపోయారు. వీరికి మరింత గడువివ్వాలని సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ లీడర్ భుతోరియా అన్నారు. పరస్పర సాయం... ఉన్నపళాన ఉద్యోగం కోల్పోయిన వారికి సాయపడేందుకు గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (జీఐటీపీఆర్ఓ) ముందుకొచ్చింది. వారికి, సంస్థలకు అనుసంధానకర్తగా ఉంటోంది. ఉద్యోగ ఖాళీల ప్రకటనలను షేర్ చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్‌లో వందలాది భారత టెకీలు సభ్యులుగా ఉన్నారు. తొలి అమెరికాకు వచ్చిన వారి వీసా స్టేటస్ మార్చేందుకు సాయపడుతూ కొందరు వాట్సాప్ గ్రూప్‌లను నిర్వహిస్తున్నారు. మరోవైపు పులి మీద పుట్రలా తమ ఉద్యోగుల గ్రీన్‌కార్డు ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టేలా కన్పిస్తున్నాయి. ఈ టెకీలను మోదీ సర్కార్ తక్షణం ఆదుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించాలంటూ సోమవారం హిందీలో ట్వీట్‌చేశారు. -
పతనం అంచున పాక్
‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్ సర్కార్ ఉంది. గోధుమల లారీని వెంబడించి.. ! పాకిస్తాన్లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి చేరుకుంది. విద్యుత్ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో పాక్‌లో చీకటి పడగానే విద్యుత్ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం వెళ్లిపోతోంది. పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.200కి పైనే ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు ప్రాణావసరమైన మందులకి కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్ లభించకపోవడంతో మధుమేహ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8 తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది. ►పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో నిల్వలు నిండుకుంటున్నాయి. స్టేట్ బ్యాంకులో 420 కోట్ల డాలర్లే ఉన్నాయి. ఇవి 25 రోజుల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. ►విదేశీ మారక నిల్వలు 2022 జనవరిలో 1660 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి కాస్త 560 కోట్ల డాలర్లకి పడిపోయాయి. ►ఈ ఆర్థిక సంవత్సరం జనవరి –మార్చి మధ్య పాకిస్తాన్ 830 కోట్ల డాలర్ల విదేశీ అప్పులు తీర్చవలసి ఉంది. ►2022–23లో జీడీపీలో 2.8% ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2.2శాతానికి తగ్గించారు. ►2022 ఆకస్మిక వరదలు 3.8 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. దేశం విలవిలలాడింది. ► స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. ►వాణిజ్య లోటు ఒక్కసారిగా 57% పెరిగిపోయింది. అత్యవసర జాబితాలో లేని లగ్జరీ వస్తువులు 800కి పైగా రకాల వస్తువుల దిగుమతులపై నిషేధం విధించినప్పటికీ వాణిజ్య లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం పాక్ వాణిజ్య లోటు 4.866 కోట్ల డాలర్లుగా ఉంది. భారతే దిక్కా ..? పాకిస్తాన్‌కు అండదండ అందించే చైనా ఈ సారి ఆ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం వందల కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ఇంక ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. యూఏఈ, సౌదీ అరేబియాలు ముస్లిం దేశాలు కావడంతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. యూఏఈ 200 కోట్ల డాలర్ల సాయాన్ని చేయడానికి కూడా అంగీకరించింది. కరోనా విలయం, రష్యా, అమెరికా యుద్ధంతో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాలు కూడా సాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే భారత్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తే నిత్యావసరాలైన బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, మందులు వంటివి తీసుకురావడం అత్యంత సులభంగా మారుతుంది. వాఘా–అట్టారి, ఖోఖర్పార్–మునాబావో సరిహద్దుల నుంచి నిత్యావసర సామగ్రి తరలించడం సులభతరంగా ఉంటుందని పాక్‌లో ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2%‘ నెమ్మదిస్తుందని తెలిపింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కారణంగా దక్షిణాసియా ప్రాంత పురోగతి రేటు కూడా తగ్గిపోతోందని పేర్కొంది. పాకిస్తాన్‌ను గత ఏడాది ముంచెత్తిన వరదలే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు 3,300 కోట్ల డాలర్లు రుణంగా వస్తే తప్ప ఆ దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కిలో ఉల్లి 220, కిలో చికెన్ 383, మరి బియ్యం?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఒక వైపు రుణ సంక్షోభం, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, మరోవైపు తరిగి పోతున్న విదేశీ నిల్వలతో మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కల్నంటుతున్నాయి. గోధుమ పిండి కొరతతో పాటు, బియ్యం, పాలు చమురు ధరలు 40-50 శాతంపెరిగాయి. దీంతో అక్కడి ప్రజల బాధలు అన్నీ ఇన్నీ కావు. (తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్ వీడియోలు) గత ఏడాది 36 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర 501 శాతం పెరిగి రూ. 220 గా ఉంది. చికెన్ కిలో రూ.210 నుంచి రూ.383కి, పప్పుధాన్యం దాదాపు రూ.151 నుంచి రూ.228కి ఎగబాకాయి. తాజా లెక్కల ప్రకారం ఒక కిలో బాస్మతి బియ్యం 46 శాతం పెరిగి రూ.146 పలుకుతోంది. పాల ధరలు 30 శాతం పెరిగి దాదాపు రూ. 150కి చేరుకున్నాయి. 2022 డిసెంబరులో పాక్ ద్రవ్యోల్బణం 24.5 శాతానికి చేరుకుంది. ఇది భారతదేశం కంటే దాదాపు నాలుగు రెట్లు. అలాగే విదేశీ నిల్వలు ఎనిమిదేళ్ల కనిష్టం 5.576 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులకు సరిపోతుంది. ఫలితంగా చమురును దిగుమతి చేసు కోవడానికి తగినంత నిల్వలు లేనందున ఇంధనాన్ని ఆదా చేయడానికి మార్కెట్లు, హాళ్లను త్వరగా మూసివేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించవలసి వచ్చింది. విదేశీ రుణాలను చెల్లించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 13 బిలియన్ డాలర్లు అవసరం. ప్రపంచ బ్యాంక్ వార్షిక రుణ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరం నాటికి పాకిస్థాన్ 33 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాలి.అయితే ప్రస్తుతం 20 బిలియన్ డాలర్లు ఖాతాలో ఉన్నాయని, 2023 జూన్ నాటికి దేశానికి ఇంకా 13 బిలియన్ డాలర్లు అవసరమని గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ చెప్పారు. కాగా పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో ప్రజలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా సింధ్ ప్రావిన్స్‌ల వంటి అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సింధ్‌లో, షహీద్ బెనజీరాబాద్‌లోని సక్రంద్ పట్టణంలోని ఒక పిండి మిల్లు వెలుపల జరిగిన తొక్కిసలాట, ఘర్షణలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. -
తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్ వీడియోలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభానికి ఇటీవలి వరదలు తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రధానంగా గోధుమ పంట నాశనంకావడంతో, గోదుమ పిండి ధరలు కనీ వినీ స్థాయిలో పెరిగి పోయాయి. గోధుమ సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. గోధుమ పిండి కోసం ప్రజలు పాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోధుమల సంక్షోభంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. గోధుమలు పలు చోట్ల ప్రస్తుతం 10 కిలోల బస్తా రూ.1,500 ఉండగా, 20 కిలోల బస్తా రూ.2,800గా ఉంది. మరోవైపు అనేక ప్రావిన్స్‌లలో, సబ్సిడీపై పిండిని సరఫరా చేస్తోంది ప్రభుత్వం. దీన్ని కొనుగోలు చేయడానికి వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో ఉన్నారు. ఇది ఘర్షణలు , తొక్కిసలాటలకు దారితీసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ,బలూచిస్థాన్‌లలో తొక్కిసలాట కూడా జరిగింది. సింధ్ ప్రావిన్స్‌లోని మీర్పూర్ ఖాస్ నగరంలో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వీరిని నియంత్రించడానికి సైన్యాన్ని మోహరించారు. తాము చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామనీ అత్యవసర ప్రాతిపదికన 400,000 బస్తాల గోధుమలు అవసరం అని బలూచిస్థాన్ ఆహార మంత్రి జమరాక్ అచక్జాయ్ తెలిపారు. తమ ప్రావిన్స్‌లో గోధుమ నిల్వ పూర్తిగా అయిపోయిందని ప్రకటించారు. బలూచిస్తాన్‌కు సహాయం చేయాలని ఇతర ప్రావిన్సులను ఆయన కోరారు. లేదంటే సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బలూచిస్థాన్‌లో గోధుమ సంక్షోభానికి ఫెడరల్, సింధ్ , పంజాబ్ ప్రభుత్వాలను నిందించిన మంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి 600,000 బస్తాల గోధుమలను అందిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. రష్యా నుండి గోధుమలు దిగుమతి దేశంలో గోధుమల కొరతను తీర్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం 75 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు పెద్ద ఎత్తున కరాచీ పోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది అలాగే రష్యా నుంచి అదనంగా 4 లక్షల 50 వేల టన్నుల గోధుమలు గ్వాదర్ పోర్టు ద్వారా పాకిస్థాన్‌కు చేరుకోనున్నాయి. కాగా పాకిస్థాన్‌కు సంబంధించి దాదాపు 70శాతం గోధుమ ఉత్పత్తి పంజాబ్ నుంచే వస్తోంది. గోధుమల దిగుమతికి సంబంధించి ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఇదే గోధుమ పిండి కొరతకు దారి తీసిందని భావిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య గొడవలే కారణమని ఎంత గోధుమలను దిగుమతి చేసుకోవాలో సరిగ్గా అంచనా వేయడంలో పంజాబ్ ఆహార శాఖ విఫలమైందని విమర్శలు చెలరేగాయి. Acute shortage of #wheat flour in #Pakistan - people dying in stampedes. However, Pak set to dispatch around 160 containers with #ammunition for #Ukraine. 'Project Shipping' firm to #ship containers from #Karachi to #Gdansk.#Poland #Russia #Food #War #Economy #Port pic.twitter.com/oTmX2Y9m14 — Nishit Doshi (@NishitDoshi144) January 10, 2023 #PakistanFlourCrisis, Visual from #Sindh Pakistan, people were seen squabbling for flour. It's Painful💔💔#PakistanEconomy #ResilientPakistan pic.twitter.com/7qlSjh3rni — Bakhtawar Shah (@Shah_Bakhtawar1) January 10, 2023 br /> -
Pakistan economic crisis: నిత్యావసరాలకూ కటకట
లాహోర్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. ఏమీ కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, కొందామన్నా ఏమీ దొరికేటట్టు లేదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. తినే తిండికి కూడా కొరత ఏర్పడుతోంది. ప్రజలకు ప్రధాన ఆహారమైన గోధుమ పిండి లాహోర్‌లో దొరకడం లేదు. దీంతో ప్రజలు ఎనలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశీ నిల్వలు తరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పంచదార, నూనె, నెయ్యి వంటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. 15 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ఖరీదు రూ.2,050గా ఉంది. దేశవ్యాప్తంగా గోధుమపిండి, పంచదార, నెయ్యి, ధరలు 25 నుంచి 62 శాతం పెరిగాయి. నిత్యావసరాలపై సబ్సిడీలన్నీ ఎత్తేయడంతో ప్రజలపై ధరల పిడుగు పడింది. ద్రవ్యోల్బణం రేటు వారానికి 1.09 % చొప్పున పెరుగుతోంది! పాకిస్తానీలు వినియోగించే వంటనూనెలో 90 శాతం దిగుమతుల ద్వారా లభిస్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం మూడు వారాలకు సరిపడా మాత్రమే ఉండటంతో వంటనూనెను అత్యవసరాల జాబితా నుంచి తొలగించారు. మార్చిలో రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున నెయ్యి, నూనెల సరఫరాను చక్కదిద్దాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పడిపోతున్న రూపాయి విలువ అప్పుల కుప్పగా మారిపోయిన పాకిస్తాన్లో రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి 227కు పడిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 550 కోట్ల డాలర్లకు పరిమితమై ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. పరిస్థితి ఆందోళనకరమేనని ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అంగీకరించారు. ఒక రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన ‘‘పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది. 2016లో ప్రభుత్వం మాకు అప్పగించినప్పడు విదేశీ ద్రవ్య నిల్వలు 2,400 బిలియన్ డాలర్లు ఉండేవి. ఇప్పుడు అవి కూడా మా దగ్గర లేవు. కానీ ఈ తప్పు నాది కాదు. వ్యవస్థది’’ అని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం కంటే తక్కువగా వృద్ధి రేటు ఉంటుందనే అంచనాలున్నాయి. -
సంక్షోభంలో పాక్
ఇస్లామాబాద్: చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు. తీర్చలేని రుణ భారం. నానాటికీ పతనమవుతున్న కరెన్సీ విలువ. తీవ్ర రూపు దాలుస్తున్న కరెంటు కొరత. పులి మీద పుట్రలా పడ్డ ప్రకృతి విలయాలు... ఇలా ఎటు చూసినా సమస్యలతో పొరుగు దేశం పాకిస్తాన్ నానాటికీ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. మరో శ్రీలంకలా మారకముందే ఏదోలా సమస్య నుంచి బయట పడే మార్గాల వెదుకులాటలో పడింది. ఆపద నుంచి గట్టెక్కించకపోతారా అని అంతర్జాతీయ ద్రవ్య నిధి తదితరాల వైపు ఆశగా చూస్తోంది... పాకిస్తాన్లో నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న ఆర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ఇంధన బిల్లుదే పెద్ద వాటా. ప్రస్తుతం విదేశీమారక నిల్వలు 11.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దేశ మొత్తం దిగుమతి అవసరాలను తీర్చడానికి ఇవి మరో నెల రోజులు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగి పలు చర్యలు చేపట్టింది. మార్కెట్లన్నీ రాత్రి 8.30కల్లా మూసేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు కూడా పదింటికల్లా మూతబడాల్సిందేనని తేల్చి చెప్పింది. షాపింగ్ మాల్స్ కూడా ముందుగానే మూతపడుతున్నాయి. ‘ఇంధన పొదుపు’ లక్ష్యంతో మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ వెల్లడించారు. రూ.6,200 కోట్ల ఆదాయే లక్ష్యం... పాక్‌లో విద్యుదుత్పాదన చాలావరకు చమురు ఆధారితమే. చమురు దిగుమతులపై ఏటా 300 కోట్ల డాలర్ల దాకా ఖర్చు పెడుతోంది. తాజా చర్యల ఉద్దేశం ఈ వ్యయాన్ని వీలైనంత తగ్గించడమే. అంతేగాక ప్రభుత్వ శాఖల్లో కూడా విద్యుత్ వాడకాన్ని కనీసం 30 శాతం తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. దీనివల్ల మొత్తమ్మీద 6,200 కోట్ల రూపాయలు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. వీటితో పాటు ఉద్యోగులు వీలైనంత వరకూ ఇంటి నుంచి పని చేసేలా చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. నాసిరకపు విద్యుత్ బల్బుల తయారీ తదితరాలపై త్వరలో నిషేధం కూడా విధించనున్నారు. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంపై దుకాణదారులు, ఫంక్షన్ హాల్స్, మాల్స్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కరోనాతో రెండేళ్లకు పైగా సతమతమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమ పాటిల ఇది పిడుగుపాటు నిర్ణయమేనని, దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా షాపింగులు, రెస్టారెంట్లలో డిన్నర్లు పాకిస్తానీలకు రివాజు. ప్రభుత్వ నిర్ణయంపై వారినుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 600 కోట్ల డాలర్ల రుణం! మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ఐఎంఎఫ్ నుంచి కనీసం 600 కోట్ల డాలర్ల తక్షణ రుణం సాధించేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఆగస్టులో ఐఎంఎఫ్ నుంచి పాక్ 110 కోట్ల డలర్ల రుణం తీసుకుంది. గత వేసవిలో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు దేశాన్ని అతలాకుతలం చేసి వదిలాయి. వాటివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 4,000 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. -
2023లో సమస్యలతో సావాసమే: సునాక్
లండన్: బ్రిటన్‌వాసులకు ప్రధాని రిషి సునాక్ తన న్యూ ఇయర్ సందేశంలో చేదు వార్త విన్పించారు. దేశాన్ని వేధిస్తున్న పెను సమస్యలు 2023లో పూర్తిగా పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు. ‘‘నేనలాంటి డొల్ల మాటలు చెప్పబోను. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆర్థికంగా బ్రిటన్‌తో పాటు ప్రపంచం వెన్ను విరిచింది. రుణ భారాన్ని అదుపులోకి తెచ్చే క్రమంలో కఠినమే అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. -
నిరంకుశ శక్తులతోనే ప్రపంచానికి రిస్కు:హెచ్డీఎఫ్సీ చైర్మన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక సవాళ్ల కన్నా నిరంకుశ శక్తులు, సహకార కొరవడటం, వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకోవడం వంటివే ప్రపంచానికి అతి పెద్ద రిస్కులుగా మారాయని ప్రముఖ బ్యాంకరు, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సంక్షోభాలను ఉటంకిస్తూ .. ప్రపంచం ప్రస్తుతం ఏకకాలంలో అనేక పెను విపత్తులను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ‘దేశాల మధ్య విశ్వాసలేమి, గ్రూపులు కట్టడం వంటివి ఎంతగానో పెరిగిపోయాయి. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. వాణిజ్యాన్ని ఆయుధంగా ప్రయోగించడం, పరస్పర సహకారం కొరవడటం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవి ఆర్థిక సవాళ్ల కన్నా పెద్ద రిస్కులు. ఇప్పటికే ఇంధనం, ప్రకృతి వనరులు, సెమీ-కండక్టర్లు మొదలైన అంశాల్లో మనం వీటిని చూస్తూనే ఉన్నాం‘ అని కోల్‌కతాలోని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ విభాగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరేఖ్ చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మరికొన్నాళ్లు కొనసాగుతాయన్నారు. రూపాయి పతనం విషయంలో (డాలరుతో పోలిస్తే మారకం విలువ) రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోరాదని, దేశీ కరెన్సీ తనంత తాను సహేతుక స్థాయిని వెతుక్కునేందుకు వదిలేయాలని పరేఖ్ చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ సూచించినట్లుగా దేశాలు తమ విదేశీ మారక నిల్వలను భవిష్యత్ షాక్‌లను ఎదుర్కొనేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు మరింత వివేకవంతంగా ఉపయోగించుకోవాలని పరేఖ్ చెప్పారు. -
ఆప్, బీజేపీ కరెన్సీ నోట్ల పంచాయితీ.. మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు ముందున్న వేళ కరెన్సీ నోట్లపై ముద్రించే చిత్రాల వివాదం ముదురుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ హిందూ వ్యతిరేకి అని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందన్న విషయాన్ని చాటి చెప్పడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ముద్రిస్తే మన దేశం సుసంపన్నమవుతుందని ఆయన వాదిస్తున్నారు. ముస్లిం దేశమైన ఇండోనేసియాలో గణేశుడి చిత్రాన్ని ముద్రిస్తూ ఉంటే మనం చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇండోనేసియాలో 20 వేల రూపాయల నోటుపై మాత్రమే గణేశుడి బొమ్మ ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రం ముద్రించాలని డిమాండ్ చేస్తోంది. అంబేద్కర్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉనికిలోకి వచ్చిందని కాబట్టి ఆయన చిత్రమే ముద్రించాలని అంటోంది. నోట్లపై ఎవరి బొమ్మలు ముద్రించాలి, డిజైన్ ఎలా ఉండాలి అన్న అధికారం కేంద్రప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఆర్బీఐకే ఉంది. గుజరాత్ ఎన్నికల దృష్ట్యా కేజ్రివాల్ లక్ష్మీదేవి చిత్రం ముద్రించాలన్న డిమాండ్ తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ధ్వజమెత్తారు. అసలు నోటుపై ఎవరిదైనా చిత్రాన్ని ముద్రించాలంటే అన్నివిధాలా అర్హుడైన వ్యక్తి అంబేద్కరేనని ఆయన అంటున్నారు. గాంధీజీ, అంబేడ్కర్ చిత్రాలతో నోట్లను ముద్రించాలన్న డిమాండ్ తెచ్చి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ హీట్ పెంచింది. ఒక్కసారి చరిత్రలోకి వెళితే 1969లో తొలిసారి గాంధీ శతజయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రాలున్న నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు ప్రముఖ గుళ్లు, గోపురాలు, ఉపగ్రహాలు, ఆనకట్టలు, ఉద్యానవనాలు వంటివి ముద్రించారు. 1935లో ఆర్బీఐ ఏర్పాటయ్యాక 1938లో తొలిసారిగా రూపాయి నోటు ముద్రించింది. 1949లో జాతీయ చిహ్నమైన నాలుగు సింహాలు, అశోక స్తూపాన్ని నోట్లపై ముద్రించారు. తర్వాత జింకలు, ఏనుగులు, పులుల చిత్రాలు నోట్లపై వచ్చాయి. 1954లో ఆర్బీఐ విలువ అధికంగా ఉండే రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ముద్రించినప్పుడు తంజావూర్ ఆలయం, గేట్ వే ఆఫ్ ఇండియా, సారానాథ్లో అశోక స్తూపం నోట్లపై వచ్చి చేరాయి. తర్వాత పార్లమెంటు, బ్రహ్మేశ్వర్ ఆలయం కనిపించాయి. -
Ned Davis Research: ముంచుకొస్తున్న మాంద్యం
ప్రపంచాన్ని మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసేలా కన్పిస్తోంది. కరోనా దెబ్బ నుంచి కోలుకోకముందే వచ్చిపడ్డ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తదితరాలతో ఆర్థిక వృద్ధి క్రమంగా కుంటుపడుతూ ప్రధాన దేశాలన్నీ మాంద్యం వైపు అడుగులేస్తున్నాయి.... (డి.శ్రీనివాసరెడ్డి) ప్రపంచం ఆర్థిక మాంద్యం బారిన పడటం ఖాయమని ఫ్లోరిడాకు చెందిన నెడ్ డేవిస్ రీసెర్చ్ చెబుతోంది. మాంద్యాన్ని అంచనా వేయడంలో ఈ సంస్థ అందెవేసిన చేయి. దాని లెక్క ప్రకారం వచ్చే ఏడాదికల్లా ప్రపంచం మాంద్యం గుప్పెట్లో చిక్కేందుకు 98.1 శాతం ఆస్కారముంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ జూలైలో చేసిన సర్వేలో మాంద్యం తప్పదని 49 శాతం ఆర్థికవేత్తలు పేర్కొనగా అక్టోబర్‌లో వారి సంఖ్య 63 శాతానికి పెరిగింది! 12 నెలల్లోపే అమెరికా మాంద్యం కోరల్లో చిక్కడం ఖాయమని సర్వే తేల్చింది. వర్ధమాన దేశాలపై ఇది సుదీర్ఘ ప్రభావమే చూపవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్ఫాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, యుద్ధం, వాతావరణ విపరణామాలు ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎండీ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు. కుంటినడకన ఆర్థికం... చాలా దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు నానాటికీ పడిపోతోంది. 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి రేటు 6.1 శాతముంటే 2023 నాటికి ఏకంగా సగానికి సగం పడిపోయి 3.2 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సంపన్న దేశాల ఆర్థిక వృద్ధి కూడా నేల చూపులే చూస్తోంది. యూరప్ జీడీపీ 1.2 శాతానికి, బ్రిటన్ కేవలం 0.3, ఫ్రాన్స్ 0.7కు పరిమితం కావచ్చని అంచనా. సవరించిన వృద్ధి రేట్ల ప్రకారం చూసినా అమెరికా 1 శాతం, చైనా 3.2 శాతంతో సరిపెట్టుకునేలా ఉన్నాయి. 2016తో పోలిస్తే ప్రపంచ జీడీపీ 23 శాతం పెరగాలన్నది అంచనా కాగా కరోనా, యుద్ధం తదితరాల దెబ్బకు 17 శాతానికే పరిమితమైంది. ఇలా పడిపోయిన ఉత్పాదకత విలువ ఏకంగా 17 లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచ ఆదాయంలో ఏకంగా 20 శాతం! ఎందుకీ దుస్థితి...? కరోనా, యుద్ధం నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోయిన ధరలకు కళ్లెం వేసేందుకు ఈ ఏడాది ఏకంగా 90 దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ దెబ్బకు ఉత్పాదకత తగ్గడంతో పెట్టుబడులు, వినియోగం పడిపోయి మాంద్యం ముంచుకొస్తోంది. ధరల అదుపు కోసమని పదేపదే వడ్డీ రేట్లు పెంచితే మాంద్యం బారిన పడక తప్పదని జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ పావ్లిన్ టియెన్ అన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుతో 90 దేశాల కరెన్సీ విలువలు పతనమయ్యాయి. గతేడాది 125.7గా ఉన్న ఆహారోత్పత్తుల ధరల సూచీ ఈ ఏడాది 146.94 పాయింట్లకు పెరిగింది. మాంద్యం దెబ్బకు కంపెనీలు నియామకాలకు కత్తెర వేస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత వచ్చే డిసెంబర్ నాటికి 3.7 శాతానికి, 2023 జూన్‌కల్లా 4.7కు పెరుగుతుందని అంచనా. మాంద్యమంటే... మామూలు పరిభాషలో వరుసగా రెండు త్రైమాసికాలు గనక జీడీపీ తిరోగమనంలో సాగితే ఆ దేశంలో మాంద్యంలోకి జారుకున్నట్టు పరిగణిస్తారు. ఇవీ సంకేతాలు... ► సుదీర్ఘంగా సాగేలా కన్పిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ► డాలర్ ముందు కుదేలవుతున్న అన్ని దేశాల కరెన్సీలు ► చుక్కలనంటుతున్న ద్రవ్యోల్బణం ► వడ్డీరేట్లను పెంచేస్తున్న అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ► నియామకాలు బాగా తగ్గిస్తున్న కార్పొరేట్ సంస్థలు ► నానాటికీ మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి మనకూ తిప్పలే... మన జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 6.8 శాతం ఉంటుందని, 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది మెరుగేనని కితాబిచ్చింది. కానీ మాంద్యం ఎఫెక్ట్ భారత్‌పైనా గట్టిగానే ఉంటుందని అంచనా. అమెరికాకు మన ఎగుమతులు 2011 10.1 శాతముంటే ఇప్పుడు 18.1 శాతానికి పెరిగాయి. మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఏకంగా 54.8 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. అగ్రరాజ్యం మాంద్యంలో చిక్కితే వీటిపై గట్టి ప్రభావమే పడుతుంది. మన విదేశీ మారక నిల్వలు వరుసగా తొమ్మిదో వారమూ తిరోగమన దిశలో ఉన్నట్టు అక్టోబర్ 7నాటి నివేదికలో రిజర్వ్ బ్యాంకే పేర్కొంది. అమెరికాతో భారత వాణిజ్య లోటు 3.8 శాతానికి ఎగబాకుతుందని అంచనా! -
Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్ చరిత్రలో లిజ్ ట్రస్ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్ ప్రధాని జార్జ్ కానింగ్ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఫ్రీజ్ ప్రజాసంక్షేమం పేరుతో లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్ కోతలతో బ్రిటన్‌లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్ ట్రస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది మినీ బడ్జెట్ ప్రకంపనలు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ సెప్టెంబర్ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్లో చూపించకుండా విద్యుత్ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్‌తో పోల్చి చూస్తే పౌండ్ విలువ భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్ స్కీమ్స్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్‌పై యూ టర్న్ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్‌ను నియమించారు. మినీబడ్జెట్లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను బ్రేవర్మన్ తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్‌ట్రస్‌పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Climate Transparency Report 2022: భారత్‌ను దెబ్బతీసిన వాతావరణ మార్పులు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు మన దేశాన్ని ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 2021లో వడగాడ్పులకి భారత్‌కి 15,900 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్–2022 వెల్లడించింది. పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలసికట్టుగా ఈ నివేదిక రూపొందించాయి. వ్యవసాయం, నిర్మాణం, తయారీ, సేవా రంగాల్లో ఈ నష్టం వాటిల్లింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 5.4% నష్టం జరిగినట్టు ఆ నివేదిక వివరించింది. ఆ నివేదికలో ఏముందంటే..! ► మండే ఎండలతో గత ఏడాది దేశంలో 16,700 పని గంటలు వృథా అయ్యాయి. 1990–1999తో పోల్చి చూస్తే 39% పెరిగింది. ► 2016–2021 మధ్య కాలంలో తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 3.6 కోట్ల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు 375 కోట్ల డాలర్లు నష్టపోయారు. ► దేశంలో 30 ఏళ్లలో వర్షాలు పడే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య ఆర్థిక ప్రభావాన్ని కనబరిచింది. ► 1850–1900 మధ్య కాలంతో పోల్చి చూస్తే భూ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి ► వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్‌పై రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిలువ నీడ లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ► వాతావరణ మార్పులతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలంటే ప్రపంచ దేశాలు భూ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడానికి కృషి చేయాలి. 2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు వినియోగించడమే దీనికి మార్గం. ► పర్యావరణ మార్పుల్ని కట్టడి చేయాలంటే మనం వాడుతున్న ఇంధనాలను మార్చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ చేంజ్ డైరెక్టర్ సురుచి భద్వాల్ పేర్కొన్నారు. -
ద్రవ్యోల్బణంపై పోరు తప్పదు!
వాషింగ్టన్: ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపు తప్పుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలిన్ జార్జివా హెచ్చరించారు. అసాధారణమైన ఆర్థిక సంక్షోభ సమయంలో మరింత బాధను కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా విధాన నిర్ణేతలు ద్రవ్యోల్బణంపై పోరు సల్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశం నేపథ్యంలో ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒకదాని తర్వాత మరొ కటి షాక్‌లు తగులుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఇప్పుడు ద్రవ్యోల్బణం తీవ్రత అన్నీ సమస్యాత్మకమే. ► ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన అంశం. మనం ధర స్థిరత్వాన్ని పునరుద్ధరించలేకపోతే, వృద్ధి అవకాశాలకూ విఘాతం కలుగుతుంది. ప్రత్యేకించి పేద ప్రజల జీవనం మరింత సంక్షోభంలోకి వెళుతుంది. ► మహమ్మారితో పోరాడిన నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ఆహార కొరత లేకుండా చేయడం, ఇంధన వ్యయాల కట్టడి, పేద వారికి సహాయం చేయడంపై తక్షణం దేశాలు దృష్టి పెట్టాలి. విస్తృత వ్యయ కార్యక్రమాలపై ఇప్పుడు ప్రణాళికలు సరికాదు. విధాన చర్యలు పటిష్టం లక్ష్యంతో సాగాలి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పోటీ రాజకీయ కూటములతో ‘విచ్ఛిన్నం’ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరాల చెయిన్ పూర్తిగా దెబ్బతింటుంది. రేటు పెంపు వల్ల అనుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించలేం. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఐక్యతా ప్రయోజనాలను మనం కోల్పోతే, మనమందరం పేదలుగా ఉండే అవకాశం ఉంది. -
దివాలా అంచున స్విస్ బ్యాంక్?
2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది. న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్‌తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు. అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. మూడు ముక్కలు... మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్‌లు... క్రెడిట్ స్విస్‌ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్‌లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్‌లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం! ఇదీ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇన్వెస్టర్లలో వణుకు..! గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది. -
మరోసారి ఆర్థిక మాంద్యం తప్పదా?
-
చైనా డొల్లతనం..దాచేస్తే దాగని సత్యం!
బీజింగ్: చైనాలో మీడియా అన్నది ఉండదు. ఉన్న ఒక్క మీడియా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. అందుకే చైనా ఆర్ధిక వ్యవస్థలోని డొల్లతనం గురించి ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశాలు తక్కువ. కానీ ఎంతకాలమని ఇలా దాచగలరు. నిప్పు కణికలను గుప్పెట్లో దాచి పెడితే కొంత సేపటికి చెయ్యి కాలిపోతుంది. చైనా ప్రభుత్వం కూడా అటువంటి ప్రమాదం ముంగిట నిలబడిందని మేధావులు అంటున్నారు. పైకి చాలా బలంగా ఆరోగ్యంగా సిరి సంపదలతో ఉన్నట్లు కనిపిస్తోంది చైనా. కానీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో చైనా సతమతమవుతోంది. ఇదీ చదవండి: చైనా సర్కార్‌కు సవాల్ విసురుతున్న దెయ్యాల నగరాలు కరోనా కారణంగా చైనా ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. చైనా నుండి రక రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలు ఆర్ధిక సంక్షోభం కారణంగా చైనాతో లావాదేవీలు నిలిపివేయడంతో చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. అది చైనా విదేశీ మారక ద్రవ్యంపై ప్రభావాన్ని చూపింది. ఇది చాలదన్నట్లు రెండేళ్లుగా చైనా లో అకాల వర్షాలు.. భారీ వరదలతో వ్యవసాయ ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. అది ఆహార సంక్షోభానికి కారణమయ్యింది. కానీ లోపల మాత్రం అగ్ని పర్వతాల్లాంటి సంక్షోభాలు రగులుతున్నాయంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది? చైనాలో ఏం జరిగినా ప్రపంచానికి తెలీకుండా అక్కడి ప్రభుత్వం దాచిపెడుతూ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే చైనాలో విదేశీ మీడియాను కూడా ఉండనివ్వరని పత్రికలపై ఎక్కడా లేని ఆంక్షలు ఉంటాయని వారంటున్నారు. అయితే తమ మీడియా ద్వారా అంతా అద్భుతంగా ఉందని చైనా ప్రచారం చేసుకుంటోందని వారంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కోలుకునే పరిస్థితి లేకపోతే మాత్రం చైనా పరిస్థితి చెప్పనలవి కానంత దుర్భరంగా మారిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, చైనా 2009 నుండి గ్లోబల్ మీడియా పెట్టుబడులపై 6.6 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఇదీ చదవండి: China: రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా -
చైనా సర్కార్‌కు సవాల్ విసురుతున్న దెయ్యాల నగరాలు
ఒక్క రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో కూరుకుపోతే దేశ ఆర్ధిక వ్యవస్థే తల్లకిందులైపోతుందా ఏంటి? అని చాలా మంది బుగ్గలు నొక్కుకోవచ్చుకానీ.. చైనా విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్లూ నిజమే అంటున్నారు ఆర్ధిక వేత్తలు. ఎందుకంటే చైనా స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 29 శాతం. దీనికి కారణాలు లేకపోలేదు. చైనాలో కోటికి పైగా జనాభా ఉండే నగరాలు పదికి పైనే ఉన్నాయి. 1970ల తర్వాత చైనాలో పట్టణీకరణ వేగం అందుకుంది. మామూలు వేగం కాదు. రాకెట్ వేగంతో పట్టణాలు,నగరాలు విస్తరించారు. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రజలు ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకుంటూ నగరాలకు వలసలు రావడం మొదలు పెట్టింది అప్పుడే. ఇదీ చదవండి: China: రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా) 50ఏళ్ల వ్యవధిలో ఈ వలసలు ఎంత వేగంగా పెరిగాయంటే ప్రస్తుతం చైనాలో పట్టణ జనాభా 64 శాతం మేరకు పెరిగిపోయింది. అంటే గ్రామీణ చైనాలో కేవలం 36 శాతం మంది ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. అందరూ పట్టణాలవైపు మొగ్గు చూపడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారపు జోరు కారణంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి చేరుతోంది. ఆదాయంలో సింహభాగం రియల్ ఎస్టేట్ పైనే ఆధార పడుతోంది చైనా. రియల్ బూమ్ యాభై ఏళ్లల్లో ఏటేటా పెరిగిపోతూ చైనా ఆర్ధిక వ్యవస్థను ఓ పెద్ద బుడగలా పెంచేసింది. ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క సారిగా కుదుపునకు లోను కావడంతో చైనా భవిష్యత్ ఏంటా అని ఆర్ధిక రంగ నిపుణులు సైతం కంగారు పడుతున్నారు. నిజానికి ఇటువంటి సంక్షోభం ఏ ఇతర దేశంలో చోటు చేసుకున్నా అది ఆ దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీయడం ఖాయం. (చైనా డొల్లతనం..దాచేస్తే దాచని సత్యం!) ఇదీ చదవండి: చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది? పైకి అంతెత్తున కనిపిస్తున్న చైనాలో పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని చాలా మందే హెచ్చరిస్తున్నారు. గంభీరంగా కనిపించే డ్రాగన్ పాలకులు లోలోన తీవ్ర కలవరానికి గురవుతున్నారని చెబుతున్నారు. అయితే పాలకులు ఈ సంక్షోభాన్ని కూడా అధిగమించగల సత్తా ఉన్నారని ఆ దేశ ఆర్ధిక వేత్తలు బీరాలు పలుకుతున్నారు. ఎవర్ గ్రాండే, ఫాంటాసియాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఎవర్ గ్రాండే ఆస్తులపై ప్రభుత్వం ఓ కన్నేసింది. దెయ్యాల నగరాలు.. ఔను చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాల నగరాలే. అంటే నిజంగా దయ్యాలు ఉంటాయని కాదు కానీ.. ఆ నగరాల్లో ఎవరూ ఉండరని అర్థం. చైనాలోని ఈ దెయ్యాల నగరాలే ఇపుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. చైనాలో చాలా నగరాల్లో లక్షలాది సంఖ్యలో ఇళ్లు నిర్మించి ఉన్నాయి. చిత్రం ఏంటంటే చాలా నగరాల్లో నిర్మించిన ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఈ నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసే వారు కేవలం పెట్టుబడుల కోసమే వాటిని కొంటున్నారు. అంతే కానీ ఇల్లు కొని గృహప్రవేశాలు చేసి అందులో కాపురం ఉండడానికి ఎంత మాత్రం కాదు. ఇలా అందరూ పెట్టుబడులకోసం కొని పెట్టుకున్న ఇళ్లతో నగరాలు వెల వెల బోతూ కనిపిస్తాయి చైనాలో. ఇలాంటి నగరాలనే ఘోస్ట్ సిటీస్ అంటారు. అవే దెయ్యాల నగరాలన్నమాట. చైనాలోని దెయ్యాల నగరాల్లో నిర్మించిన ఆకాశహర్మ్యాల్లో కనీసం 20 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్లను పంచిపెడితే 9 కోట్ల మందికి ఇళ్లు అందించవచ్చన్నమాట.జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాల్లోని మొత్తం జనాభాకు సరిపడ ఇళ్లు చైనాలో ఖాళీగా అఘోరిస్తున్నాయి. 2021 లో చైనాలో ఇళ్ల నిర్మాణాల్లో 14 శాతం తగ్గుదలనమోదయ్యింది. లక్షలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. వరుస సంక్షోభాల కారణంగానే ఎవ్వరి దగ్గరా డబ్బులు లేవు. అందుకే కోట్లాది ఇళ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. వేలాది బిలియన్ల డాలర్లమేరకు పెట్టుబడి పెట్టిన వెంచర్లు మధ్యలోనే ఆగిపోవడం..రియల్ వ్యాపారులనే కాదు చైనా ప్రభుత్వాన్నీ కంగారు పెడుతోంది. యావత్ ప్రపంచాన్ని శాసించేయాలని సామ్రాజ్య వాద విస్తరణ కాంక్షతో రగిలిపోతోన్న చైనాలో అసలు పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. -
స్థూల పరిస్థితులపై నిరంతరం నిఘా పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో .. నిలకడైన వృద్ధి, సుస్థిరతను సాధించేందుకు స్థూల ఆర్థిక పరిస్థితులపై నిరంతరం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ నెలవారీ ఎకనామిక్ రివ్యూలో పేర్కొంది. రాబోయే శీతాకాలంలో ఇంధన భద్రతపై సంపన్న దేశాలు మరింతగా దృష్టి పెడుతుండటంతో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకూ ఇంధన అవసరాల నిర్వహణలో సమయోచితంగా వ్యవహరిస్తున్న భారత్ సామర్థ్యాలకు ఇది పరీక్షగా మారవచ్చని పేర్కొంది. ఇంధన అవసరాలకు సంబంధించి భారత్ 85 శాతం పైగా ముడిచమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటున్నందున రేటు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం మరింతగా ఎగిసే ముప్పు ఉంది. వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం ఎగియడం వంటి సమస్యలతో చాలా మటుకు దేశాలు సతమతమవుతుండగా .. భారత్‌లో మాత్రం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, వృద్ధి కూడా భారీ స్థాయిలోనే నమోదు చేయగలుగుతోందని రివ్యూ వివరించింది. భారత్ తన వృద్ధి లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే వివేకవంతమైన ద్రవ్య విధానం, విశ్వసనీయమైన పరపతి విధానాలు కీలకమని పేర్కొంది. ప్రభుత్వ విధానానికి పునాది రాళ్ల వంటి ఈ రెండింటినీ సరిగ్గా నిర్వహించుకోగలిగితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి రుణాలపై వడ్డీల భారం తగ్గగలదని, పెట్టుబడులకు తోడ్పాటు లభించగలదని రివ్యూ వివరించింది. ’అమృత కాలం’ (ఇప్పటి నుంచి 2047 వరకూ)లో మేడిన్ ఇండియా నినాదాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు, నిలకడగా ఆర్థిక వృద్ధి సాధించేందుకు, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో గట్టి పునాదులు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పుంజుకుంటోన్న ఎకానమీ.. 2019–20 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వృద్ధి గణాంకాలు దాదాపు నాలుగు శాతం అధికంగా నమోదయ్యాయని రివ్యూ వివరించింది. కోవిడ్ మహమ్మారి అనంతరం ఎకానమీ వృద్ధి పటిష్టంగా కోలుకోవడాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. 2022–23లో వృద్ధికి సర్వీసుల రంగం సారథ్యం వహించగలదని వివరించింది. ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటం వల్ల ప్రైవేట్ వినియోగం భారీగా పుంజుకోవడమనేది రాబోయే రోజుల్లో నిలకడగా వృద్ధి సాధించేందుకు తోడ్పడగలదని రివ్యూ తెలిపింది. ప్రైవేట్ వినియోగం, సామర్థ్యాల వినియోగం పెరగడంతో పెట్టుబడులు పెట్టడం కూడా ఊపందుకుంటోందని వివరించింది. గత దశాబ్దకాలంలోనే అత్యధికంగా 2022–23 తొలి త్రైమాసికంలో పెట్టుబడుల రేటు పెరిగిందని తెలిపింది. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
ఫోన్ చేసినా.. అడుక్కోవడానికే చేశారనుకుంటున్నారు
ఇస్లామాబాద్: నానాటికీ దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కళ్లకు కట్టారు. మిత్రదేశాలు కూడా పాకిస్తాన్‌ను అడుక్కునే దేశంగానే చూడటం మొదలుపెట్టాయంటూ విచారం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో లాయర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘మనతో సన్నిహితంగా ఉండే ఏ దేశానికి వెళ్లినా, వారికి ఫోన్ చేసినా అడుక్కోటానికే అని అనుకుంటున్నారు. చాలా చిన్న దేశాలు కూడా అభివృద్ధిలో పాక్‌ను దాటేసి పోయాయి. మనం మాత్రం 75 ఏళ్లుగా జోలె పట్టుకుని తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు కూడా దేశం పరిస్థితి ఇదే, వరదలతో ఇప్పుడు మరింత తీవ్రంగా మారిందన్నారు. తాజా వరదల నేపథ్యంలో పొరుగు మిత్ర దేశం చైనా కేవలం సాయ ప్రకటనకే పరిమితం అయ్యింది. తమ దగ్గర సంభవించిన స్వల్ప కరువును, కరోనా-లాక్డౌన్ పరిస్థితులను చూపుతూ పాక్ సాయం విషయంలో చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో షెహబాజ్ కామెంట్లు పరోక్షంగా చైనా మీదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదీ చదవండి: దేశాభివృద్ధి పథంలో అమెరికా కీలక పాత్ర- ప్రధాని మోదీ -
మందగమనంలో ఆర్ధిక రంగం..
‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’– ఒక సినిమాలో నూతన్ ప్రసాద్ ఊతపదంగా ఉపయోగించిన డైలాగ్ ఇది. ఇప్పుడు ఒక దేశమనేం ఖర్మ యావత్ ప్రపంచమే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రెండేళ్లు పూర్తిగా పీడించిన ‘కోవిడ్’ మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశాలు ఇప్పుడు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలే కాదు, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ‘కరోనా’ తాకిడి సద్దుమణిగిందనుకుంటున్న ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మొదలైంది. దీని ఫలితంగా కనీస నిత్యావసరాల కోసం, ఉపాధి కోసం ప్రజలు నానా ఇక్కట్లకు లోనవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వల్ల నిరాశాజనకమైన పరిస్థితులు, మరింత అనిశ్చితి నెలకొన్నాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్’ ఈ ఏడాది జూలైలో ఆందోళన వెలిబుచ్చింది. ప్రపంచ ఆర్థికరంగంలో ప్రస్తుత మందగమనానికి దారితీసిన కారణాలను, మందగమనం వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం... కోవిడ్ మహమ్మారి, ఆ తర్వాత రష్యా–ఉక్రెయిన్ల మధ్య తలెత్తిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టాయి. కోవిడ్ మహమ్మారి కాలంలో లాక్డౌన్లు దేశ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలను కుదేలయ్యేలా చేశాయి. చాలాచోట్ల వివిధ రంగాల్లో పనిచేసే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఆన్లైన్ సేవలతో కాలక్షేపం చేసినప్పటికీ, కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాక్డౌన్ కాలంలో వస్తూత్పత్తి, భవన నిర్మాణ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు పెరుగుతున్నంత వేగంగా సామాన్యుల ఆదాయాలు పెరగకపోవడంతో వారి కొనుగోలు శక్తి గణనీయంగా క్షీణించింది. ఏ వస్తువు కొనాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితిలో పడ్డారు. ఫలితంగా విపణిలో లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ‘ప్రపంచ దేశాలు ఈ ఆర్థిక మందగమనాన్ని తప్పించుకోవడం కష్టం’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ వ్యాఖ్యానించారంటే, పరిస్థితుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే! ఇదే మొదటిసారి కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. ఆధునిక ప్రపంచంలో 1930 దశకంలో తీవ్రమైన ఆర్థికమాంద్యం సంభవించింది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఆకలితో అల్లాడాయి. అందుకే, 1930 దశకాన్ని ‘హంగ్రీ థర్టీస్’గా పేర్కొంటారు. రెండు ప్రపంచయుద్ధాల నడుమ ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభమది. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక ప్రపంచ దేశాలు నెమ్మదిగా ఆర్థికంగా తేరుకున్నాయి. అభివృద్ధి బాటలో ముందుకు సాగాయి. దాదాపు మూడు దశాబ్దాల కాలం ప్రపంచ ఆర్థిక రంగానికి పెద్ద అవరోధాలేవీ ఎదురు కాలేదు. ఆ తర్వాత గడచిన శతాబ్దిలో 1974–75, 1981–82, 1990–91 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత శతాబ్దిలో 2007–09లో ప్రపంచ ఆర్థిక మందగమనం ఏర్పడినా, భారత్ పెద్దగా ఇబ్బంది పడకుండానే తేరుకుంది. ప్రస్తుత సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మళ్లీ మొదలైంది. దీని ప్రభావం భారత్‌పైనా కనిపిస్తోంది. ధరల పెరుగుదలతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత వంటనూనెల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండగా మారింది. కట్టెల పొయ్యిల పొగ బారి నుంచి మహిళలకు విముక్తి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మారుమూల పల్లెల్లో సైతం ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు వచ్చాయి. అప్పట్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.527 ఉండేది. ఇప్పుడు సిలిండర్ ధర దాదాపు పదకొండు వందల రూపాయలకు చేరింది. దీంతో దేశంలోని పలు మారుమూల పల్లెల్లో గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ జనాలు కట్టెల పొయ్యిలపైనే ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మిగిలిన నిత్యావసరాల ధరలూ గణనీయంగా పెరిగాయి. సామాన్యుల ఆదాయంలో మాత్రం ఇదేస్థాయి పెరుగుదల నమోదు కాకపోవడంతో జనాలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ‘కోవిడ్’ తర్వాత దేశంలో నిరుద్యోగం కూడా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక మందగమనం ప్రభావం మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కాస్త తక్కువగానే ఉంది. ఒకరకంగా భారత్ మీద మాంద్యం ప్రభావం అత్యల్పంగా మాత్రమే ఉంది. ఈ ఏడాది దేశ ఆర్థిక వృద్ధిరేటు అంచనా 8.8 శాతం ఉండగా, దీనిని 7.7 శాతానికి తగ్గిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. భారత్ వృద్ధిరేటు ఈసారి 7.4 శాతం వరకు ఉండవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023 నాటికి 2 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొన్ని దేశాల్లో మాంద్యం పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. సంక్షోభంలో శ్రీలంక ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యానికి శ్రీలంక అత్యంత దారుణంగా ప్రభావితమైంది. దేశం దివాలా తీసింది. ఇంధనానికి తీవ్రమైన కరువు ఏర్పడి, ప్రతిరోజూ గంటల తరబడి విద్యుత్తు కోతలు సామాన్యంగా మారాయి. దేశంలో ఎటుచూసినా ఆహార కొరత కారణంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి నిరసనలు తారస్థాయికి చేరుకోవడంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశాన్ని విడిచి పరారయ్యారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం 2019లోనే మొదలైంది. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిత్యావసరాలకు సైతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఈ ఏడాది జూన్‌లో సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రకటించారు. విదేశీ రుణాలను చెల్లించలేని దుస్థితిలో చిక్కుకుపోయి, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోనే 21వ శతాబ్దిలో మొదటి సార్వభౌమ ఎగవేతదారుగా మారింది. అంతర్యుద్ధం తర్వాత నిలకడలేని ప్రభుత్వాలు, ఇష్టానుసారం పన్నుల కోతలు, నోట్ల ముద్రణ వంటి అనాలోచితమైన ఆర్థిక చర్యలకు దిగడంతో శ్రీలంక పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. మితిమీరి నోట్లు ముద్రిస్తూ పోతే ఆర్థిక సంక్షోభం తప్పదని ఐఎంఎఫ్ ఇచ్చిన సలహాను శ్రీలంక సెంట్రల్ బ్యాంకు పెడచెవిన పెట్టింది. ఫలితంగా ‘కోవిడ్’ ముందునాటికి దాదాపు 5 శాతానికి కాస్త ఎక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం, 2022 ఫిబ్రవరి నాటికి 18 శాతానికి చేరుకుంది. ఇక ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్ నాటికి 75.8 శాతానికి చేరింది. నిత్యావసరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే శ్రీలంక, చెల్లింపులు జరపలేని స్థితికి చేరుకోవడంతో దిగుమతులు నిలిచిపోయి, నిత్యావసరాలకు భారీ కొరత ఏర్పడింది. దిగుమతుల కోసం శ్రీలంక ఎక్కువగా భారత్, చైనాలపైనే ఆధారపడుతోంది. దిగుమతులకు గండిపడ్డాక సరుకుల సరఫరా కంటే గిరాకీ ఎక్కువగా ఉండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోవడంతో ప్రజలు పస్తులుంటున్నారు. ఆదాయం కోసం శ్రీలంక ప్రధానంగా పర్యాటకరంగంపై ఆధారపడేది. ఎక్కువగా యూరోపియన్లు, ముఖ్యంగా రష్యన్ పర్యాటకులు శ్రీలంకకు వస్తుండేవారు. ‘కోవిడ్’ దెబ్బకు పర్యాటకరంగం కుదేలైంది. ‘కోవిడ్’ సద్దుమణిగినా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో పర్యాటకుల రాక బాగా తగ్గిపోయింది. ఇక అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి శ్రీలంక ప్రపంచ దేశాల సాయం కోసం చూస్తోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు సాయంగా భారత్ 4 బిలియన్ డాలర్లు (31,273 కోట్లు) ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే విదేశీ మారక నిల్వల సమస్యను పరిష్కరించాలని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పతనం వేగాన్ని తగ్గించేందుకు మొదట్లోనే చర్యలు ప్రారంభించినట్లయితే ఇప్పుడు ఇంతటి కష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి తలెత్తేది కాదని ఆయన అన్నారు. అయితే, దేశం దివాలా తీసినట్లు ప్రకటించడం వెనుక అధ్యక్షుడు రాజపక్స కుటుంబ సభ్యుల కుట్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో దోచుకున్న సొమ్మును రాజపక్స కుటుంబం విదేశీ బ్యాంకుల్లో దాచిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దివాలా తీసి దిక్కు తోచని స్థితిలో పడ్డ శ్రీలంక ప్రస్తుతం ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తోంది. అగ్రరాజ్యాలకూ దడ పుట్టిస్తున్న ధరలు అగ్రరాజ్యాలు సైతం ఆర్థిక మందగమనంలో చిక్కుకున్నాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో పలు దేశాల్లో ధరలు దడ పుట్టిస్తున్నాయి. అమెరికాలో ఈ ఏడాది జూలై నాటికి ద్రవ్యోల్బణం 10.9 శాతానికి చేరుకుంది. అమెరికాలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం 1979 తర్వాత ఇదే మొదటిసారి. మన దేశంలో పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకం మాదిరిగానే అమెరికాలో ఫెడరల్ ఫ్రీ స్కూల్ మీల్స్ ప్రోగ్రాం అమలవుతోంది. ధరలు అదుపు తప్పడంతో ఈ పథకం కింద పాఠశాలలకు ఆహార సరఫరా చేయడానికి ఆహార సరఫరాదారులెవరూ ముందుకు రావడం లేదు. అమెరికాలో ఫెడరల్ ఫ్రీ స్కూల్ మీల్స్ ప్రోగ్రాం కింద పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో నిర్ణీత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తారు. ధరల పెరుగుదల నేపథ్యంలో కచ్చితమైన ప్రమాణాలతో కూడిన పదార్థాలను సరఫరా చేయడం సరఫరాదారులకు దుస్సాధ్యంగా ఉంటోంది. అమెరికాలో ఏడాది వ్యవధిలోనే ఇంధన ధరలు దాదాపు 60 శాతం మేరకు పెరిగాయి. దీనివల్ల నిత్యావసరాల రవాణాకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా ఆర్థిక వృద్ధిరేటు 2021లో 5.7 శాతం నమోదైతే, 2022లో ఈ వృద్ధిరేటు 2.3 శాతం వరకు మాత్రమే ఉండగలదని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అమెరికాలో ఆర్థిక మందగమనం 2024 వరకు కొనసాగవచ్చని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో దీని నుంచి ముందుగానే తేరుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని ప్రముఖ ఆర్థకవేత్త స్టీఫెన్ రోష్ వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక మాంద్యంలో పడిందని ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతుంటే, అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ మాత్రం అదంతా ఉత్తదేనని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికీ నెలకు నాలుగు లక్షలకు పైగా ఉద్యగాలను సృష్టించగలుగుతున్నామని, గత ఏడాది 5.5 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి సాధించామని చెబుతున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితులపై జానెట్ వ్యాఖ్యలు ‘ట్వట్టర్’లో పెద్ద చర్చకే దారితీశాయి. అమెరికాలో 2022 రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 0.9 శాతం మేరకు తగ్గింది. వినియోగదారులు ఖర్చులను తగ్గించుకోవడం, ఉద్యోగాల్లో ఉన్నవారిలో కొందరు ఉపాధి కోల్పోవడం, వ్యాపార సంస్థలు తమ పెట్టుబడులను తగ్గించుకోవడం, పరిశ్రమలు తమ ఉత్పాదకతకు తగ్గించుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఆర్థిక మాంద్యం మొదలైనట్లేనని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికాలో 2023లోనూ ఆర్థికమాంద్యం పరిస్థితులు కొనసాగవచ్చని మూడింట రెండొంతుల మంది జనాలు నమ్ముతున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ సర్వేలో తేలింది. అయితే, మాంద్యం కచ్చితంగా ఎన్నాళ్లు కొనసాగుతుందో అంచనా వేయడం కష్టమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్ సైతం ద్రవ్యోల్బణం ధాటికి అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అదుపు తప్పడంతో సామాన్యులు నిర్బంధ పొదుపుచర్యలు పాటిస్తున్నారు. దేశంలో కొందరికైతే పస్తులుండక తప్పని పరిస్థితులూ తలెత్తుతున్నాయి. బ్రిటన్‌లో ఒకవైపు నిత్యావసరాల ధరలు అదుపుతప్పి పెరుగుతుండగా, మరోవైపు ప్రజల ఆదాయం ఈ ఏడాది 2.5 శాతం తగ్గింది. ‘కోవిడ్’ ముందు కాలంతో పోల్చుకుంటే, ప్రజల ఆదాయంలో 7 శాతం తగ్గుదల నమోదైంది. పెరుగుతున్న ధరలను అందుకోలేని జనాలు అవసరాలనే వాయిదా వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కనీసావసరాలకు మాత్రమే బొటాబొటి ఆదాయంతో నెట్టుకొస్తున్న జనాభా దాదాపు 70 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఆదాయంలో ఏమాత్రం పొదుపు చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు 53 లక్షల వరకు ఉంటారని కూడా అంచనా. ఇంధన ధరలు అదుపు తప్పి పెరగడంతో ప్రజల ఆదాయంలో ఎక్కువ భాగం విద్యుత్తు బిల్లులు చెల్లింపులకు, వాహనాల ఇంధనానికే సరిపోతోందని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్’ (ఎన్ఐఈఎస్ఆర్) డిప్యూటీ డైరెక్టర్ స్టీఫెన్ మిలార్డ్ చెబుతున్నారు. దేశ ఆర్థికరంగంలో ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో నెలకొన్నాయని, ఈ పరిస్థితులు ప్రజల దైనందిన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆయన అన్నారు. బ్రిటన్‌లో ఈ ఏడాది నిత్యావసరాల ద్రవ్యోల్బణం 11 శాతానికి చేరుకుంది. నిరుద్యోగం 5 శాతానికి మించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను 3 శాతం పెంచింది. రైళ్ల చార్జీలు ఒకేసారిగా 17.7 శాతం పెరిగాయి. రైళ్ల చార్జీల పెరుగుదల గత నలభయ్యేళ్లలో ఇదే అత్యధికం. ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది శీతాకాలం గట్టెక్కేదెలా అని సామాన్యులు దిగులు పడుతున్నారు. గదులు వెచ్చబరచుకోవడానికి ఇళ్లల్లో హీటర్లు వాడితే, రాబోయే బిల్లులు జనాల గుండెలను గుభిల్లుమనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో ఈ పరిస్థితులు మరో రెండేళ్లు ఇలాగే కొనసాగే సూచనలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని దేశాల్లో అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్ల పరిస్థితే ఇక్కట్లమయంగా కనిపిస్తుంటే, ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉండే దేశాల పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది. మాంద్యం ప్రభావం ఏ స్థాయిలో కనిపిస్తుందో కొన్ని దేశాల పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుంది. మాంద్యం దెబ్బకు ఆఫ్రికా దేశమైన నైజీరియాలో బేకరీలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. నైజీరియాలో గడచిన ఏడాదికాలంలోనే గోధుమపిండి ధర 200 శాతం పెరిగింది. చక్కెర ధర 150 శాతం, కోడిగుడ్ల ధర 120 శాతం మేరకు పెరిగాయి. బేకరీలు నష్టాలతో కుదేలవడంతో వాటిలో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. ‘కోవిడ్’, ఆ తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల నైజీరియాలో ఆర్థిక పరిస్థితులు బాగా దిగజారాయి. ఈ ఏడాది జూలై నాటికి నైజీరియాలో ఆహార ద్రవ్యోల్బణం 22 శాతానికి చేరింది. ఇంధన ధరలు 30 శాతం మేరకు పెరిగాయి. నైజీరియన్లు తమ ఆదాయంలో దాదాపు 60 శాతం ఆహారానికే ఖర్చు చేస్తారు. ధరల పెరుగుదల వల్ల జనాల వద్ద ఇతర కనీసావసరాలకు డబ్బులేని పరిస్థితి తలెత్తుతోంది. లాటిన్ అమెరికా దేశమైన పెరూలో ఈ ఏడాది జూలై నాటికి ఆహార ద్రవ్యోల్బణం 11.59 శాతానికి చేరింది. అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యం, దానికి నిరసనగా రైతుల ఆందోళనల ఫలితంగా ఆహార పదార్థాల కొరత ఏర్పడి, మాంద్యం తీవ్రతను మరింతగా పెంచాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని పరిస్థితులకు ఈ ఉదాహరణలు మచ్చు తునకలు మాత్రమే! ఇక ఆసియాలో బలమైన ఆర్థికశక్తిగా ఉన్న చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించుకుంది. డాలర్‌తో పోల్చుకుంటే మన రూపాయి పతనమై, 80కి చేరుకుంటే, యువాన్ 7కు చేరుకుంది. అమెరికా వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతుండటంతో, యువాన్ విలువను తగ్గించుకున్నట్లు చైనా మీడియా ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది సగటున 9 శాతం వరకు ఉండవచ్చని ‘నోమురా’ నివేదిక అంచనా. మిగిలిన దేశాల కంటే మన పరిస్థితి కొంతైనా నయంగా ఉందనేదే కాస్త ఊరట. -
Human Development Index: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
ఐక్యరాజ్యసమితి: కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్‌తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల సగటు ఆయుర్దాయం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాల ఆధారంగా తయారు చేసే మానవాభివృద్ధి సూచిలో ప్రపంచదేశాలు వరసగా రెండేళ్లు 2020, 2021లో వెనక్కి పయనిస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) వెల్లడించింది. ‘‘అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు’’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ‘‘ప్రజలు ఆయుష్షు తగ్గిపోతుంది, ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించలేరు, ఆదాయాలు పడిపోతాయి. గతంలో ఎన్నో సంక్షోభాలు చూసి ఇప్పుడున్న పరిస్థితులు గట్టి ఎదురుదెబ్బ’’ అని యూఎన్డీపీ చీఫ్ అచిమ్ స్టెనియర్ తెలిపారు. 32 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధి క్షీణించడం ఇదే మొదటిసారి. కోవిడ్–19తో మొదలైన మానవాభివృద్ధి తిరోగమనం, వివిధ దేశాల్లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రపంచ దేశాలను కోలుకోనివ్వకుండా చేశాయని ఆ నివేదిక వెల్లడించింది. కరోనాతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రభావంతో చాలా దేశాలు కోలుకోవడం లేదని ఆ నివేదిక వివరించింది. తక్కువ కార్బన్ వినియోగం, అసమానతల కట్టడి , సుస్థిరత సాధించడం ద్వారా ప్రపంచ దేశాలు తిరిగి మానవాభివృద్ధిలో ముందుకు వెళ్లవచ్చునని నివేదిక రచయిత పెడ్రో కాన్సీకావో అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం, భవిష్యత్‌లో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనే సన్నద్ధత, భవిష్యత్ సంక్షోభాల నుంచి బయటపడే సామర్థ్యం పెంపు వంటివి చేస్తే మానవాభివృద్ధి సూచి మెరుగుపడుతుందని తెలిపారు. 132వ స్థానంలో భారత్ 2021 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచిలో మొత్తం 191 దేశాలకు గాను భారత్ 132వ స్థానంలో నిలిచింది. భారత మానవాభివృద్ధి విలువ 0.633గా నిలిచింది. అంటే మన దేశంలో మానవాభివృద్ధి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. 2020 సంవత్సరంలో 0.645గా ఉన్న విలువ ఏడాదిలో కాస్త తగ్గింది. అదే ఏడాది 189 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 131 ఉండేది. ఇక భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్ల నుంచి 67.2 ఏళ్లకి తగ్గింది. 2019తో పోల్చి చూస్తే మన దేశ మానవాభివృద్ధిలో అసమానలు తగ్గుముఖం పట్టాయని అదొక శుభపరిణామమని భారత్‌లో యూఎన్డీపీ ప్రతినిధి షోకో నోడా చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే పురుషుల, మహిళల అభివృద్ధిలో ఉన్న తేడా చాలా వేగంగా తొలగిపోతోందని తెలిపారు. -
Bharat Jodo Yatra: యాత్ర మొదలైంది
సాక్షి, చెన్నై: బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని పథకం ప్రకారం మతం, భాష పేరిట నిలువునా విభజిస్తున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ‘‘అన్ని మతాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు సొంతమైన త్రివర్ణ పతాకాన్ని తమ సొంత ఆస్తిగా బీజేపీ, ఆరెస్సెస్ భావిస్తున్నాయి. దేశంలో మోదీ సర్కారు దాడికి గురవని వ్యవస్థ, సంస్థ అంటూ లేవు. బీజేపీ అసమర్థ పాలన వల్ల దేశం ఎన్నడూ లేనంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగిత ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు, త్రివర్ణ స్ఫూర్తిని కాపాడుకునేందుకు పౌరులంతా కలిసి రావాలి’’ అంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ భారత్ జోడో పాదయాత్రను బుధవారం తమిళనాడులోని కన్యాకుమారిలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సముద్ర తీరంలో దివంగత సీఎం కె.కామరాజ్ స్మారక మందిరం దాకా పాదయాత్ర చేశారు. అనంతరం పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశ సమైక్యత కోసం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని కోట్లాది మంది పౌరులు భావిస్తున్నారు. అందుకే ఈ యాత్ర’’ అని ప్రకటించారు. ‘‘మోదీ సర్కారు అచ్చం బ్రిటిష్ పాలకుల్లా విభజించి పాలించు సూత్రాన్నే అమలు చేస్తోంది. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు... ఇలా ప్రతి వర్గాన్నీ పథకం ప్రకారం పీడిస్తోంది. వారిని కొట్టి ఒకరిద్దరు బడా బాబులకు దేశాన్ని దోచిపెడుతోంది. వారు లేకుండా మోదీ ఒక్క రోజు కూడా రాజకీయంగా మనలేరు. అప్పట్లో ఈస్టిండియా కంపెనీ దేశాన్ని నియంత్రించేది. ఇప్పుడు దేశాన్ని ఓ మూణ్నాలుగు బడా కంపెనీల నియంత్రణలోకి బీజేపీ సర్కారు నెట్టింది. దీనిపై ప్రశ్నించకుండా మీడియాను అణగదొక్కుతోంది. విపక్షాలు నిలదీయకుండా ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల ద్వారా భయపెట్టజూస్తోంది. కానీ ఎంత వేధించినా ఒక్క విపక్ష నాయకుడూ భయపడబోడు. ఈ త్రివర్ణం మనకు అంత తేలిగ్గా లభించలేదు. కానుకగానూ రాలేదు. ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్నది. అలాంటి జాతీయ పతాకమే ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీ కాషాయీకరణ తాలూకు ముట్టడిలో ఉంది’’ అన్నారు. 12 రాష్ట్రాలు, 150 రోజులు, 3,570 కి.మీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగే భారత్ జోడో యాత్రకు రాహుల్ సారథ్యం వహించనున్నారు. 119 మంది కాంగ్రెస్ నేతలు ఆయనతో పాటు కలిసి నడుస్తారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల దూరం 150 రోజుల పాటు యాత్ర సాగుతుంది. దీన్ని స్వతంత్ర భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ తలపెట్టిన అత్యంత సుదీర్ఘ యాత్రగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ చేతికి జాతీయ పతాకాన్ని అందించారు. కన్యాకుమారిలోని గాంధీ స్మారకం వద్ద రాహుల్‌కు ఆయన స్వాగతం పలికారు. సామూహిక ప్రార్థనల అనంతరం ప్రఖ్యాత వివేకానంద శిలా స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. గాంధీ స్మారక మండపంలో ధ్యానం చేశారు. రఘుపతి రాఘవ రాజారాంతో పాటు తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి రచించిన పలు దేశభక్తి గీతాల ఆలాపన నడుమ యాత్రను ప్రారంభించారు. ‘‘దేశ సమగ్రతకు, సమైక్యతకు, వైవిధ్యానికి, ఆత్మగౌరవానికి చిహ్నమైన త్రివర్ణాన్ని చేబట్టి భారత్ జోడో యాత్రలో ఈ రోజు తొలి అడుగు వేస్తున్నాం. నడవాల్సిన దూరం ఎంతో ఉంది. అంతా కలిసి దేశాన్ని మరోసారి సమైక్యం చేద్దాం రండి’’ అంటూ ట్వీట్ చేశారు. చరిత్రాత్మక సందర్భం: సోనియా భారత్ జోడోయాత్రను చరిత్రాత్మక సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభివర్ణించారు. పార్టీ పునరుజ్జీవానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఇది దేశ రాజకీయాలను కూడా మేలిమలుపు తిప్పే సందర్భమన్నారు. ‘‘వైద్య పరీక్షల నిమిత్తం విదేశాల్లో ఉన్నందున యాత్రలో పాల్గొనలేకపోతున్నా. కానీ మానసికంగా యాత్రలో ప్రతి రోజూ పాల్గొంటూనే ఉంటా’’ అంటూ ఆమె సందేశం పంపారు. రాజీవ్‌కు నివాళులు యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబుదూరులో దివంగత ప్రధాని, తన తండ్రి రాజీవ్‌గాంధీకి రాహుల్ ఘనంగా నివాళులు అర్పించారు. విద్వేష, విభజన రాజకీయాలే తన తండ్రిని బలి తీసుకున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. దేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి బలిపె ట్టబోనన్నారు. ‘‘ద్వేషాన్ని ప్రేమ, భయాన్ని ఆశ జయిస్తాయి (అన్బు వెరుప్పై వెల్లుం). . కలసికట్టుగా సమస్యలను అధిగమిద్దాం’’ అంటూ తమిళంలో ట్వీట్ చేశారు. రాజీవ్ స్మారకం వద్ద మొక్క నాటారు. 1991 మే 21న లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడికి రాజీవ్ బలవడం తెలిసిందే. యాత్ర సాగేదిలా... గురువారం ఉదయం ఏడింటికి కన్యాకుమారిలో రాహుల్ తదితరులు యాత్రకు శ్రీకారం చుడతారు. ఉదయం 10.30 దాకా, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 6.30 దాకా సగటున రోజుకు 23 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. తిరువనంతపురం, కొచ్చి, నీలంబూర్, మైసూర్, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోటా, దౌసా, ఆళ్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబారా, పఠాన్‌కోట్, జమ్మూ గుండా సాగి శ్రీనగర్‌లో ముగుస్తుంది. సెప్టెంబర్ 11న యాత్ర కేరళలో ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో 18 రోజులు సాగాక సెప్టెంబర్ 30న కర్నాటకలోకి ప్రవేశిస్తుంది. 21 రోజుల అనంతరం వికారాబాద్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించనుంది. యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటిదాకా 50 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌పై కసరత్తు
న్యూఢిల్లీ: జపాన్‌లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్‌గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్‌లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు. ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్‌లో జరిగిన గత మెగా ఈవెంట్లో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్ పాయింట్ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు. ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్‌ని 2020 నవంబర్‌లో కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్నెస్ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లలో సెమీస్ చేరిన ప్రణయ్ స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌తో తృప్తి చెందాడు. థామస్ కప్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్ దక్కుతుందని చెప్పాడు. -
Afghanistan: ఏడాదిగా అరాచకమే
సరిగ్గా ఏడాది క్రితం.. అమెరికా రక్షణ ఛత్రం కింద ఉన్న అఫ్గానిస్తాన్ మళ్లీ తాలిబన్ల చెరలో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోవడం ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే దేశంలో తాలిబన్లు పాగా వేశారు. వారి అరాచక పాలనకు ఏడాది నిండింది. తాలిబన్లు అఫ్గాన్ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, కనీస వసతులు అందని ద్రాక్షగా మారాయి. మానవ హక్కుల జాడే లేదు. పేదరికం, కరువు ప్రధాన శత్రువులుగా మారిపోయి పీడిస్తున్నాయని అఫ్గాన్ పౌరులు ఆవేదన చెందుతున్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. పిడివాద పాలనను పరిశీలిస్తే నిర్వేదమే మిగులుతుంది. ఆహార సంక్షోభం ప్రపంచంలో తాలిబన్ పాలకులు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. అఫ్గాన్ ప్రభుత్వాన్ని చాలా దేశాలు అధికారికంగా గుర్తించడం లేదు. విదేశీ సాయం నిలిచిపోయింది. 2020–21లో అఫ్రాఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో 5.5 బలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ ప్రకటించారు. ఇందులో 75 శాతం నిధులు విదేశాల నుంచి సాయం రూపంలో అందినవే కావడం గమనార్హం. తాలిబన్ల రాకతో ఈ సాయమంతా హఠాత్తుగా ఆగిపోయింది. అఫ్గాన్‌కు చెందిన 7 బిలియన్ డాలర్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. ఆర్థిక ఇబ్బందులు కుంగదీస్తున్నాయి. ఉద్యోగాలు లేవు, ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. అఫ్గాన్ పేదలు ఉపాధి కోసం పొరుగుదేశం ఇరాన్‌కు వలసవెళ్తున్నారు. అక్కడా పనులు దొరక్క ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. లక్షలాది మంది జనం పేదరికంలోకి జారిపోతున్నారు. ఈ రోజు తినడానికి తిండి దొరికితే అదే గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. అఫ్గాన్ జనాభా 4.07 కోట్లు కాగా, సగానికి పైగా ప్రజలు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులోనూ బతుకులు మారుతాయన్న సూచనలు కనిపించడం లేదు. ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు: అఫ్గాన్‌లో మహిళలపై వివక్ష యథావిధిగా కొనసాగుతోంది. తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే మహిళలను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. మీరు ఇక ఇళ్లకే పరిమితం కావాలి, మీ కుటుంబాల్లోని పురుషులకు ఉద్యోగాలు ఇస్తాం అంటూ తేల్చిచెప్పేశారు. వారికి ఉన్నత విద్యను సైతం దూరం చేస్తున్నారు. బాలికలు పాఠశాలల్లో ఆరో గ్రేడ్‌కు మించి చదువుకోవడానికి వీల్లేదు. టీనేజీ బాలికలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. అంతోఇంతో స్తోమత కలిగిన కొందరు ఇళ్లల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వస్తే శరీరమంతా కప్పేసేలా దుస్తులు ధరించాలి. ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలుంటాయి. వ్యవసాయ కూలీలుగా విద్యావంతులు దేశంలో ఈ ఏడాది కరువు తీవ్రత పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రధాన పంట గోధుమల ఉత్పత్తి తగ్గింది. ఉన్నత చదువులు చదువుకున్న యువత కూడా ఉపాధి కోసం చేలల్లో పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారికి రోజువారీ కూలీ 2 డాలర్ల లోపే లభిస్తోంది. జనం ఆవేదన ఇలా ఉండగా, తాలిబన్ల వాదన మరోలా ఉంది. దేశంలో అవినీతిని అంతం చేశామని, దురాక్రమణదారులను తరిమికొట్టి ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని చెబుతున్నారు. షరియా చట్టం పరిధిలోనే మహిళలకు హక్కులు కల్పిస్తున్నామనిఅంటున్నారు. బొగ్గు, పండ్లను పాకిస్తాన్‌కు ఎగుమతి చేయడంతోపాటు కస్టమ్స్ రెవెన్యూ వసూళ్ల ద్వారా తాలిబన్లు ఆదాయం సంపాదిస్తున్నారు. 2021 డిసెంబర్ నుంచి 2022 జూన్ మధ్య 840 మిలియన్ డాలర్లు ఆర్జించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అఫ్గానిస్తాన్ బడ్జెట్ 2.6 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
లంకలో నిరసనలకు తెర
కొలంబో: శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది. మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధశారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది. -
Sri Lanka: రుణ ఉపశమనం కాదు.. రుణ న్యాయం కావాలి
శ్రీలంక పార్లమెంటులో జూలై 20న అధ్యక్షుడిగా విక్రమసింఘె ఎన్నిక, కొత్త ప్రధాని గుణవర్దనె నియామకం, ప్రధాని మోదీ వారిని అభినందించటం ఇటీవలి వార్తలు. విక్రమ సింఘె గెలుపు ఖాయమని ముందు రోజునే తేలిపోయిందనీ, గెలుపునకు భారత ప్రభుత్వ సహాయ సహకా రాలున్నాయనీ, ఆ ఇద్దరూ అమెరికా, యూరప్, ఇండియాలకి ఆమోదయోగ్యులే అని విశ్లేషణలు వెలువడ్డాయి. జూలై 19నే కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఐఎంఎఫ్ రుణం పొందటానికి తగిన సాయం చేస్తామని విదే శాంగమంత్రి జయశంకర్ చెప్పారు. పనిలోపనిగా ఇక్కడి రాష్ట్రాల రుణాలను, సబ్సిడీలను ఈ సందర్భంగా తప్పుపట్టే రీతిలో వివరించారు. ఇది అప్రస్తుతమనీ, శ్రీలంక ‘దేశం’ అప్పులను ‘రాష్ట్రాల’ అప్పులతో పోల్చి గందర గోళం సృష్టిస్తున్నారనీ, ఆ పేరుతో ఇక్కడ ‘రాజకీయాలు’ చేయటం, పరోక్షంగా రాష్ట్రాలను నిందించటం తగదనీ వివిధ పార్టీలు నిరసన తెలిపాయి. శ్రీలంకకు చెందిన 30 మంది ఆర్థిక, సామాజిక శాస్త్రాల నిపుణులు; మాజీ అధికారులు, విద్యార్థి కార్మిక రైతాంగం మత్స్యకారుల సంఘాల నేతలు అధ్యక్ష ఎన్నిక తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ముఖ్య కారణం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ సావరీన్ బాండ్ (ఐఎస్బీ), అమెరికా, యూరపు దేశాల, ‘బ్లాక్ రాక్’ వంటి కమర్షియల్ రుణాలూ, వారి షరతులే. 2022 మే నెలలో శ్రీలంక రుణాలు 5 వేల కోట్ల డాలర్లు కాగా అందులో సగానికి పైగా పైన పేర్కొన్న రుణ సంస్థల వాటాయే. నిజానికి ఈ ఏడు కట్టాల్సిన రుణం 500 కోట్ల డాలర్లే. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం, వాటివల్ల భారాలు పెరిగి, టీ వంటి ఎగుమతులూ, టూరిజం ఆదాయం తగ్గి, అనేక దేశాల్లాగే శ్రీలంకా దెబ్బతిన్నది. స్వతంత్రం వచ్చాక శ్రీలంకలో బాకీలు తీర్చలేని స్థితికి చేరడం ఇదే మొదటిసారి. కాగా అతిశయోక్తులతో, తప్పుడు సమాచారంతో పై పాశ్చాత్య శక్తులు, వారి మీడియా విదేశీమారకం (డాలర్ల) కొరతనీ ‘దివాళా స్థితిగా చిత్రించి’ రుణదిగ్బంధనం వంటిది చేశారు. మానవాభివృద్ధి సూచికలో పైకి వచ్చిన శ్రీలంకని ప్రస్తుత రుణ సంక్షోభంతో ఇప్పుడు ‘అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం’గా (ఎల్డీసీ) పునర్వర్గీకరించ చూస్తున్నారు. అలాంటి దేశాలకు ఆర్థిక విదేశాంగ వ్యవహారాల్లో అటానమీ, సార్వభౌమాధికారం నిరాకరించబడుతుంది. ఇది నిజంగా దివాళా కాదు, ఇది వారు ‘సృష్టించిన డిఫాల్ట్’. తమ వ్యూహా నికి తగినట్టుగా వారు శ్రీలంక వనరులను, ఆస్తులను, పెట్టుబడులను తగ్గించి చూపి, ఆర్థిక–ద్రవ్య లెక్కలనూ, సూచికలనూ, అల్గారిథమ్స్– మ్యాట్రిసెస్నూ తారుమారు చేస్తున్నార’’నేది ఆ ప్రకటన సారాంశం. శ్రీలంకలో ‘ఆర్థిక ప్రజాస్వామ్య సమష్టి వేదిక’ పేరిట ఉన్న ఈ ప్రకటనలో ఐఎంఎఫ్‌తో కొద్దివారాల క్రితమే మొదలైన చర్చలలో పారదర్శకత బొత్తిగా లేదని ఆరోపించారు. ప్రపంచ సముద్ర రహదారుల్లో కీలక స్థావరంగా ఉన్న శ్రీలంక ‘క్వాడ్’లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ‘కోవిడ్–19 బెయిల్ అవుట్ ఫండ్’ పేరిట అమెరికా ప్రభుత్వం అనేక పేద దేశాలకు రుణాలు ఇచ్చి ఆయా దేశాల సంపదల్ని కాజేయటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్నీ, ప్రాజెక్టుల్నీ... చౌకగా, చాటుగా అమ్మేసే, ప్రైవేటీకరించే రీతిలో స్థానిక వనరుల ఆస్తుల విలువను తగ్గించి చూపుతున్నారనీ; దేశ ఇంధనం, ఆహార భద్రతలనూ, సార్వభౌమత్వాన్నీ బలిపెడుతున్నారనీ ఆరోపించారు. ‘యుగ ఘనవి పవర్ ప్లాంట్’ని ఇప్పటికే అమె రికాకు చెందిన కంపెనీ ‘న్యూఫోర్ట్రెస్’కు కారుచౌకగా కట్ట బెట్టారని ఉదహరించారు. ‘ఇప్పుడు కావల్సింది రుణ ఉపశమనం కాదు, రుణ న్యాయం’ అన్నారు. అర్జెంటీనా, గ్రీస్, లెబనాన్ దేశాల్ని ఉదహరించి, ‘సంక్షోభానికి ఐఎమ్ఎఫ్ కారణమే కాని పరిష్కారం కాజాలదు’ అని చెప్పారు. డాలరు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని రద్దు చేసి, వివిధ కరెన్సీల బాస్కెట్‌తో లావాదేవీలు జరపాలనీ... కుబేరులపై పన్నులు వేసి వసూలు చేయాలనీ, ‘స్థానిక ఉత్పత్తుల్ని కొనాలి’ అన్న ఉద్యమాన్ని ప్రోత్సహిం చాలనీ వారు కోరారు. రాజపక్స కుటుంబాల వంటి వాటికాజేసిన ఆస్తులను రాబట్టడం అవసరమే కానీ అంతకు మించి రుణ న్యాయం, రుణాల రద్దు అవసరమని అన్నారు. మొత్తం మీద ఈ ప్రకటన శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితినీ, ప్రజల ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తోంది. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) - డా. ఎమ్. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
రిలయన్స్ క్యాపిటల్ ప్రణాళికకు డెడ్‌లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్‌ను (ఆర్సీఎల్) కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల సంస్థలు తగు పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు గడువును రుణదాతలు ఆగస్టు 28 వరకూ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ మదింపు కోసం మరింత సమయం కావాలంటూ బిడ్డర్లు కోరడంతో డెడ్‌లైన్‌ను పొడిగించడం ఇది అయిదోసారని పేర్కొన్నాయి. గడువు ఆగస్టు 10తో ముగియాల్సి ఉంది. బరిలో ఉన్న పిరమల్, టోరెంట్ సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇవ్వాలని కోరగా రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆగస్టు 30 వరకూ గడువు కోరింది. వాస్తవానికి పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు మే 26 అసలు డెడ్‌లైన్. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు గవర్నెన్స్‌పరంగా లోపాలు ఉండటంతో గతేడాది నవంబర్ 29న ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసి అడ్మినిస్ట్రేటరును నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విక్రయానికి అడ్మినిస్ట్రేటర్ బిడ్లను ఆహ్వానించారు. -
వివక్షే ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టు
భారత దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలన్నీ... కులం, కులానికి పునాదైన మతం వల్ల ప్రభావితమై ఉన్నాయి. అందువల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీల్లో తీవ్రమైన అసమానతలతో కునారిల్లుతోంది. కులానికో ఉత్పత్తి బాధ్యత ఉన్న దేశంలో ఆయా కులాల పట్ల వివక్ష చూపడం, వారికి భూమిని దక్కకుండా చేయడం వల్ల ఉత్పత్తిని స్తబ్ధత ఆవరించిందని అంబేడ్కర్ అన్నాడు. భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా కులం ఊబిలోనే సతమతమవుతోంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేడ్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మనకు అవగతమవుతోంది. అంబేడ్కర్... రాజకీయాల్లో వ్యక్తిత్వం, ఆదర్శం, నీతి, నిజాయితీ చాలా అవసరమని చెప్పి ఆయన స్వయంగా ఆచరించాడు. నాయకులకు వ్యక్తిత్వం శూన్యమైతే భారత సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ సంక్షోభంలో పడక తప్పదు. భారతదేశ వ్యాప్తంగా అవినీతి పెరిగింది. అందువల్ల దేశ సంపద అంతా అధికంగా నాయకులు, కార్పొరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ప్రతి పదిమందిలో ఒకరు దుర్భరమైన చాకిరీ చేస్తే కానీ బతకలేని స్థితి దాపురించింది. వీళ్ళందరిలో ఎస్సీ, ఎస్టీల పిల్లలు తొంభై శాతం అని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికీ చాలామంది బొగ్గు క్వారీల్లో, హోటళ్లలో పనిచేస్తూ... రైల్వే ట్రాక్‌ల మీద కాగితాలు, విసిరేసిన సీసాలు ఏరుకుంటూ కాలే కడుపుతో కళ్ళు పీక్కుపోయి బతుకుతున్నారు. రాజ్యాంగం వీరికి కల్పించిన హక్కులు కాలరాయబడుతున్నాయి. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మరో విషయం నిరుద్యోగం. సంస్కరణలు వృద్ధి రేటును పెంచినట్టు చూపిస్తున్నాయి. కానీ నిరుద్యోగం అధికమవుతోంది. రెగ్యులర్ ఎంప్లాయీస్‌ను తగ్గిస్తూ క్యాజువల్ లేబర్‌ను పెంచుతున్నారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం లేకుండా పోయింది. శ్రామిక సంక్షోభానికి తూట్లు పొడిచారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడడానికి కారణమైన లాకౌట్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగినవే. సంస్కరణల పేరుతో వ్యవస్థాపకులు శాశ్వత శ్రామికుల్ని తొలగించి తాత్కాలిక ఉద్యోగుల్ని నియమిస్తూ వస్తున్నారు. శాశ్వత శ్రామిక వర్గాన్ని అంతరింపజేయాలనీ; సమ్మె, పోరాటం అనే రాజ్యాంగ హక్కులను దెబ్బతీయాలనీ పెద్ద ప్రయత్నం జరుగుతోంది. వ్యయసాయ రంగ విస్తరణ తొమ్మిదో ప్రణాళిక నుండి పధ్నాలుగో ప్రణాళిక వరకూ రెండు శాతం దగ్గరే స్తబ్ధంగా ఉండిపోయింది. దీనికి కారణం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల శాతం తగ్గిపోవడమే. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం లేదు. వరి, గోధుమ వంటి పంటలను ప్రోత్సహించి భూసారాన్ని సహజంగా పెంచే ప్రక్రియకు తిలోదకాలిచ్చారు. అలాగే వ్యవసాయ కూలీలుగా ఉన్న ముప్పై కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు ఒక్క శాతం భూమి కూడా లేదు. అంబేడ్కర్ భూమిని పంచకుండా ఆర్థిక సామాజిక వ్యవస్థ బలపడదని స్పష్టంగా చెప్పాడు. ప్రధానంగాఎస్సీ, ఎస్టీలకు భూమి పంపకం జరగలేదు. దానివల్ల దళితుల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగడం లేదు. ‘భారతదేశంలో నేనొక వ్యక్తిని, నాదొక కుటుంబం’ అనే భరోసా రావాలంటే అది భూమి పంపకంతో సాధ్యమవుతుందని అంబేడ్కర్ చెప్పాడు. రైతులు అంటే అన్ని రాష్ట్రాల్లో భూమి కలిగిన ఐదు అగ్ర కులాలను చెప్పుకోవడంలోనే నిర్లక్ష్యం దాగి ఉంది. అంబేడ్కర్ దేశంలోని ప్రతి గ్రామంలోనూ నివసిస్తున్న దళితులందరికీ విద్యుత్ సౌకర్యం ఉచితంగా అందించినప్పుడే వారిలో వెలుగు వస్తుందని చెప్పాడు. ఇప్పటివరకూ నలభై శాతం దళిత వాడల్లో విద్యుత్తు లేదు. ఎస్సీ, ఎస్టీలు చీకటి గుహల్లో జీవిస్తున్నారు. అటువంటి సమయంలో వారి పిల్లలకు విద్యావకాశాలు ఎలా మెరుగు పడతాయని ఈనాటి సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దళితులను వ్యవసాయ కూలీల నుండి వ్యవసాయ దారులుగా మార్చకపోయినట్లయితే భారతదేశ ఉత్పత్తులు పెరగవని అంబేడ్కర్ ఆనాడే చెప్పాడు. భారతదేశంలో ఉత్పత్తులు స్తబ్ధతలో ఉండడానికి కారణం దళితులకు భూమీ, నీరూ, విద్యుత్తు, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో తగిన వాటా లభించకపోవడమే. ఇకపోతే 2017–18 నాటి యునెస్కో లెక్కల ప్రకారం ముప్పై ఐదు శాతం మంది చదవడం, రాయడం రానివారు భారతదేశంలోనే ఉన్నారని తేలింది. ఇందులో నిరక్షరాస్యులుగా ఉంది ఎస్సీ, ఎస్టీలే. నిరక్షరాస్యులుగా ఉంచి మతభావాలు, కులభావాలు కలిగించడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలనే రాజకీయ వ్యూహం నుండి దళితులను, దళిత వయోజనలను బయటకు తీసుకు వచ్చినప్పుడే దళిత విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందుతారు. ప్రకృతి శక్తులైన దళిత శ్రామికుల మీద చూపిస్తున్న నిర్లక్ష్యం... రాజ్యాంగేతర భావజాలంతో పెరుగుతోంది. అంబేడ్కర్ భారతదేశంలోని కుల, మతాలను అర్థం చేసుకుని, ఆ దృక్కోణంలోనే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అధ్యయనం చేశాడు. అందుకే భారత రాజకీయాలనూ, ఆర్థిక వ్యవస్థనూ కులం, దానికి పునాది అయిన మతం నేపథ్యంలోనే వ్యాఖ్యానించారు. మార్క్సిస్టులు ఈ అవగాహన నుండి ఇంతవరకు ఆర్థిక శాస్త్రాన్ని చూడలేకపోయారు. భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా అది కులం ఊబిలోనే సతమతమవుతోంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేడ్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. అంబేడ్కర్ ఇలా అన్నాడు: ‘అధికారంలో ఉన్న వ్యక్తులు దేశ ప్రయోజనాల పట్ల నిర్ద్వంద్వమైన నిబద్ధత కలిగి ఉండేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి. న్యాయాన్ని ఇచ్చే సామాజిక, ఆర్థిక నియమావళిని సవరించేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి’. ఇకపోతే ఇప్పటికీ ఉద్యోగ వ్యవస్థలో బ్రాహ్మణ, బనియాలదే పెద్ద పాత్ర. ‘ఈపీడబ్ల్యూ’ భారతదేశ అధికార వర్గ వ్యవస్థ గురించి ఇలా పేర్కొంది. దేశ కార్పొరేట్ బోర్డ్ డైరెక్టర్లు... కులాల ప్రకారం బ్రాహ్మణులు 44.6 శాతం, వైశ్యులు 46.0 శాతం ఉంటే, ఎస్సీ, ఎస్టీలు కేవలం 1 శాతంగా ఉన్నారు. 1989–90లో ప్రభుత్వ సంస్థలు 1,160 ఉంటే 2010 నాటికి అవి 21,642కు పెరిగాయి. అదే ప్రైవేటు రంగ కంపెనీలు 1990లో రెండు లక్షలు ఉంటే ఇప్పుడు 8.5 లక్షలకు పెరిగాయి. వాటిలో పెట్టుబడి 64 వేల కోట్ల నుండి 11 లక్షల కోట్లకు పెరిగింది. తాజా అంచనాల ప్రకారం భారత కుబేరుల మొత్తం సంపద జీడీపీలో 15 శాతానికి సమానం. ఐదేళ్ల కిందట ఇది 10 శాతం గానే ఉంది. ప్రస్తుతం దేశంలో 166 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆదాయం, వినియోగం, సంపద విషయాల్లో ప్రపంచంలోనే అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలతో కునారిల్లుతున్న భారతీయ సమాజానికి ఆర్థిక అసమానతలు మరింత ఆందోళన కలిగించేవే. ఈ ఆర్థిక అసమానతల వల్ల దళిత, మైనారిటీల స్త్రీల పరిస్థితి అధోగతి పాలయ్యింది. అంబేడ్కర్ ఆర్థిక శాస్త్ర సంపన్నుడు. ఆయన భారత దేశంలో కులం, అçస్పృశ్యత, స్త్రీ వివక్ష పోయినప్పుడు మాత్రమే ఆర్థిక సంపద పెరుగుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల హిందూవాదులు కులాన్నీ, అస్పృశ్యతనూ స్థిరీకరించే క్రమంలో కార్పొరేట్ వ్యవస్థను విస్తృతం చేసి, రాజ్యాంగ సూత్రాలు దళితులకు అన్వయం కాకుండా చేసి, అçస్పృశ్య భారతాన్ని కొనసాగించాలనే దుర్వ్యూహంలో ఉన్నారు. అంబేడ్కర్ కుల నిర్మూలన, అçస్పృశ్యతా నిర్మూలన భావజాలంతో భారతదేశాన్ని ప్రేమించి, దేశంలో ఉన్న ప్రతి పౌరునికీ ఆర్థిక స్వావలంబనకు అవకాశం కల్పించి, భారతదేశ ఆర్థిక ఉత్పత్తుల్ని పెంచి, కుల రహిత గ్రామీణాభి వృద్ధీ, కుల వివక్ష లేని ఉద్యోగిత; మత అణచివేత లేని, స్త్రీ అణచివేత లేని సామాజిక వాదం సమ్మిశ్రితంగా నూతన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విప్లవాన్ని అంబేడ్కర్ మార్గంలో నిర్మిద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు, కవి. 98497 41695 -
పెట్రోడాలర్‌కు రష్యా చెక్..!
రష్యా–ఉక్రెయిన్ వార్... భూగోళంపై మరోసారి అణు యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా, యూరప్ దేశాలు మళ్లీ తెరతీయడం... తన పక్కలో బల్లెంలా విస్తరిస్తున్న నాటో కూటమి... రష్యాను ఉక్రెయిన్‌పై ఉసిగొల్పేలా చేశాయి. రేపన్నదే లేదన్నట్లు, రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు... మిగతా ప్రపంచ దేశాలను మేల్కొలుపుతున్నాయి. ఈ ఉక్రెయిన్ వార్... ప్రపంచ భౌగోళిక రాజకీయాలను కొత్త మలుపు తిప్పడం ఖాయమని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రపంచ పోలీసుగా, డాలర్ ఆధిపత్యంతో ఇన్నాళ్లూ శాసించిన అమెరికాకు రష్యా ఇచ్చిన కరెన్సీ షాక్ దిమ్మదిరిగిపోయేలా చేసింది. యుద్ధ భూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ పావులు కదపడంలో తమ సత్తా ఏంటో రష్యా అధినేత పుతిన్ పశ్చిమ దేశాలకు రుచి చూపిస్తున్నారు. పెట్రోడాలర్ పెత్తనానికి గండి పడటంతో పాటు ఆంక్షలు తిరిగి అమెరికా కూటమి మెడకే చుట్టుకుంటున్నాయి. అయితే, ఈ పరిణామం ప్రపంచ దేశాలను మరోసారి మాంద్యం కోరల్లోకి నెట్టేస్తోంది. అసలు పెట్రోడాలర్ సంగతేంటి? దీనికి రష్యా ఎలా చెక్ చెబుతోంది? ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కరెన్సీ వార్‌గా ఎలా మారుస్తోంది? పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి బ్రిక్స్ కూటమి వ్యూహాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి అలా కదన రంగంలోకి వెళ్లొద్దాం రండి!! ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దాదాపు దశాబ్దం క్రితమే బీజం పడింది. ఉక్రెయిన్‌లో గత ప్రభుత్వానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పొగపెట్టి, తమ కీలుబొమ్మ లాంటి జెలెన్స్కీకి పట్టం కట్టిబెట్టాయి. తద్వారా నాటో దళాలను రష్యా గుమ్మం ముందు నిలబెట్టాలనేది పశ్చిమ దేశాల వ్యూహం. అంతేకాదు, ఉక్రెయిన్‌లోని రష్యా జాతీయులపై జెలెన్స్కీ సర్కారు చేస్తున్న అకృత్యాలు కూడా పుతిన్ కన్నెర్రకు కారణమే. దీనికితోడు ఉక్రెయిన్‌తో రష్యా గతంలో కుదుర్చుకున్న మిన్స్క్ ఒప్పందాన్ని జెలెన్స్కీ సర్కారు తుంగలో తొక్కింది. ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉంటామన్న హామీకి తూట్లు పొడుస్తూ... యూరోపియన్ యూనియన్, నాటో కూటమిలో చేరేందుకు తహతహలాడింది. ఉక్రెయిన్ నాటో చేరిక యత్నాలను విరమించుకోవాలన్న పుతిన్ సూచనలను పెడచెవిన పెట్టడంతో... ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్‌పై దండెత్తింది. మొదట్లో ఎడాపెడా దాడులతో విరుచుకుపడిన రష్యా... నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టింది. ఉక్రెయిన్‌కు నల్లసముద్రంతో పూర్తిగా తెగతెంపులు చేసి, భూ సరిహద్దులకే పరిమితం చేసేలా చకచకా ముందుకెళ్తోంది. ఇప్పటికే సుమారు 25% ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలోకి వచ్చినట్లు అంచనా. కాగా, పశ్చిమ దేశాల కూటమి బిలియన్ల డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని, అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపిస్తూ... రష్యాపై పరోక్ష యుద్ధం చేస్తోంది. మరోపక్క, నాటో దేశాలు గనుక నేరుగా ఉక్రెయిన్ కదన రంగంలోకి అడుగుపెడితే, దాన్ని రష్యాతో యుద్ధంగా పరిగణిస్తామని, అణు యుద్ధం తప్పదంటూ పుతిన్ ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాలంటూ తమ దళాలను సమాయత్తం చేశారు కూడా. మొత్తంమీద ఈ పరిణామాలు... ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆంక్షల అస్త్రం... రష్యా దాడి నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. రష్యాపై నేరుగా యుద్ధం చేసే పరిస్థితి లేక ఆర్థిక యుద్ధానికి తెరతీశాయి. వందల బిలియన్ల కొద్దీ రష్యా ప్రభుత్వ ఆస్తులు, ఆ దేశానికి చెందిన కుబేరుల ఆస్తులను సీజ్ చేశాయి. రష్యా ఎకానమీకి కీలకంగా నిలిచే క్రూడ్, గ్యాస్ ఎగుమతులపై నిషేధం విధించాయి. రష్యాను ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఏకాకిని చేయడమే లక్ష్యంగా బెదిరింపులకు దిగాయి. రష్యా సెంట్రల్ బ్యాంకుకు చెందిన 600 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారక నిల్వల్లో దాదాపు 300 బిలియన్ డాలర్లను అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. తద్వారా రష్యాను ఆర్థికంగా దివాలా తీయించాలనేది వారి వ్యూహం. రూబుల్ ‘రబుల్’ కాదు.. డబుల్! ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టడంతోనే.. రష్యా ఆర్థిక కుంభస్థలాన్ని ఆంక్షల పంజాతో చీల్చి చెండాడేస్తామంటూ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ ఇలా పెద్దన్న కూటమి మొత్తం గొంతుచించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయితే, తమ ఆంక్షల దెబ్బకు రష్యా కరెన్సీ రూబుల్.. రబుల్ (పనికిరాని చెత్త)గా మారుతుందని డాలరు మారకంలో ఏకంగా 200కు పడిపోతుందంటూ సంచలన ప్రకటనలు కూడా చేశారు. వార్ మొదలయ్యేటప్పుడు దాదాపు 60 స్థాయిలో ఉన్న రూబుల్.. క్రూడ్, గ్యాస్ ఇతరత్రా ఎగుమతులపై నిషేధంతో ఒక్కసారిగా 140 స్థాయికి కుప్పకూలింది. దీంతో బైడెన్, పశ్చిమ దేశాలు ఇక రష్యా పనైపోయిందంటూ జబ్బలు చరుచుకున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. అగ్రరాజ్యం ఆడుతున్న ఆర్థిక చదరంగంలో పుతిన్lఅదిరిపోయే పావును కదపడంతో పశ్చిమ దేశాల గొంతులో మిసైల్ పడింది. రష్యా క్రూడ్, గ్యాస్‌కు డాలర్లలో చెల్లింపులను అంగీకరించబోమని, తమకు రూబుల్లో మాత్రమే చెల్లించాలంటూ పుతిన్ ఆదేశించారు. ఎందుకంటే రష్యా బ్యాంకులను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుంచి తొలగించడంతో రష్యాకు వచ్చే డాలర్లను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. రష్యా ఇచ్చిన షాక్‌తో యూరోపియన్ దేశాలకు దిమ్మదిరిగిపోయింది. పుతిన్ ‘నో రూబుల్.. నో క్రూడ్–గ్యాస్’ అని కరాఖండిగా చెప్పేయడంతో ఇక చేసేది లేక రూబుల్ పేమెంట్‌కు చచ్చీచెడీ అంగీకరించాయి. ఈ దెబ్బకు డాలరుతో రూబుల్ విలువ అమాంతం పుంజుకోవడం మొదలైంది. 140 స్థాయి నుంచి మూడున్నర నెలల్లోనే∙దాదాపు 51 స్థాయికి బలపడింది. అంటే యుద్ధం ప్రారంభానికి ఉన్న స్థాయిని మించి రూబుల్ బలోపేతం అయింది. రష్యా ఆర్థిక పైఎత్తుకు అగ్రరాజ్య కూటమి చిత్తయింది. పెట్రోడాలర్ వ్యవస్థను అంతం చేయడమే లక్ష్యంగా పుతిన్ విసిరిన ‘రూబుల్’ పాచిక బాగానే పారిందని ఆర్థిక విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. అంతేకాదు, తమ విదేశీ రుణాల (డాలర్, యూరో)కు సంబంధించి చెల్లింపులను రూబుల్స్‌లో మాత్రమే చేస్తామని కూడా రష్యా ప్రకటించింది. ఇకపై గోధుమలు, ఎరువులు ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులకు రూబుల్లో మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుందని కూడా తాజాగా పుతిన్ తేల్చిచెప్పడం గమనార్హం. తద్వారా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో డాలర్ అధిపత్యానికి గండిగొట్టాలనేది రష్యా అధినేత వ్యూహం. పెట్రోడాలర్ సంగతేంటంటే! 1970వ దశకంలో ప్రపంచం క్రూడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లాగానే ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికా నుంచి జపాన్ దాకా పెట్రో ఉత్పత్తుల రేట్లు ఆల్‌టైమ్ గరిష్ఠాలను (అమెరికాలో గ్యాలన్ పెట్రోలు ధర 4 డాలర్లు) తాకాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియాతో అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతో జరిపే చమురు క్రయవిక్రయాలకైనా అమెరికా డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పేమెంట్ వ్యవస్థనే ‘పెట్రోడాలర్’గా వ్యవహరిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే, క్రూడ్‌ను ఉత్పత్తి చేసే దేశాలేవైనా డాలర్లు ఇస్తేనే క్రూడ్ అమ్ముతాయి. గడిచిన 50 ఏళ్లుగా ఈ పెట్రోడాలర్ సిస్టమ్ ఎదురులేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఏ దేశమైనా సరే డాలర్లను కొనాల్సి రావడంతో రిజర్వ్ కరెన్సీగా ‘డాలర్’ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరిగేది క్రూడాయిల్లోనే కాబట్టే అరేబియా గల్ఫ్‌లో అమెరికా అన్ని యుద్ధాలు చేసింది. లిబియా, ఇరాక్, సిరియా సైతం పెట్రోడాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా గొంతెత్తడం వల్లే అమెరికా వాటిని నామరూపాల్లేకుండా బాంబులతో నేలమట్టం చేసింది. అయితే, ఇప్పటిదాకా పుతిన్లాంటోడు అమెరికాకు తగలకపోవడంతో దాని ఆటలు బాగానే సాగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు పుతిన్ పశ్చిమ దేశాలపై కరెన్సీ వార్‌కు సైతం తెరలేపారు. అంతర్జాతీయంగా బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం ఉపయోగించే పేమెంట్ వ్యవస్థ ‘స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్)’ నుంచి వెలేస్తారని పుతిన్‌కు ముందే తెలుసు. దీనివల్ల రష్యా బ్యాంకులు స్విఫ్ట్ ద్వారా లావాదేవీలు జరపలేవు. రష్యా కంపెనీలకు తమ ఎగుమతులకు రావాల్సిన డబ్బులు రావు. దీంతో రష్యా రూబుల్ అస్త్రాన్ని ప్రయోగించింది. తమ క్రూడ్ గ్యాస్ ఉత్పత్తులకు రూబుల్ లేదంటే డాలర్ యేతర అసెట్లలో చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో క్రూడ్ మార్కెట్లు షేక్ అయ్యాయి. రష్యా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు కావడమే దీనంతటికీ కారణం. ‘స్విఫ్ట్’కు షాక్... అమెరికా, యూరప్ ఆధిపత్యంలో ఉన్న స్విఫ్ట్ పేమెంట్ వ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయం కోసం రష్యా, చైనా చాన్నాళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టాయి. స్విఫ్ట్ వ్యవస్థ అనేది డాలర్‌ను, అంతిమంగా అమెరికాను మాత్రమే బలోపేతం చేయడానికి పనిచేస్తోందనేది రష్యా, చైనాల వాదన. ఇప్పుడు ఉక్రెయిన్ వార్తో రష్యా పూర్తిగా స్విఫ్ట్ నుంచి వైదొలగడంతో.. తన క్రూడ్, గ్యాస్, ఇతరత్రా ఎగుమతుల కోసం రూబుల్–చైనా యువాన్, రూబుల్–ఇండియన్ రూపీ తదితర కరెన్సీల్లో చెల్లింపులకు రష్యా తెరతీసింది. అంటే రష్యా నుంచి దిగుమతుల కోసం జరిపే చెల్లింపులకు ఏ దేశమైనా తమ కరెన్సీలను డాలర్లలోకి మార్చాల్సిన పని లేకుండా నేరుగా రూబుల్స్‌లోకి మార్చుకుంటే సరిపోతుందన్న మాట. ఇప్పటికే రష్యా, చైనా తమ వాణిజ్యాన్ని రూబుల్–యువాన్ కరెన్సీలో చేసుకుంటున్నాయి. భారత్ కూడా రూపాయి–రూబుల్ పేమెంట్‌కు సిద్ధమవుతోంది. ఇరాన్, యూఏఈ, సౌదీ వంటి పలు దేశాలు కూడా తమ సొంత కరెన్సీల్లో లావాదేవీలకు ఓకే అంటున్నాయి. రష్యా, చైనా ఇప్పుడు స్విఫ్ట్ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్ (సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్)ను అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీన్ని రష్యా సెంట్రల్ బ్యాంక్ రూపొందించింది. ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను చైనాకు చెందిన క్రాస్–బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ (సీఐపీఎస్)తో అనుసంధానించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అంతేకాదు, ఎస్పీఐఎఫ్ను బ్రిక్స్ కూటమి (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నీ వాడుకునేలా కూడా తాజా బ్రిక్స్ సదస్సులో రష్యా ప్రతిపాదించింది. అలాగే, బ్రిక్స్ దేశాలకు కమోడిటీల ఆధారిత ప్రత్యేక రిజర్వ్ కరెన్సీని తీసుకురావడంపై తమ కూటమి కసరత్తు చేస్తోందని కూడా పుతిన్ ప్రకటించడం గమనార్హం. మరోపక్క, స్విప్ట్ నుంచి రష్యాను వెలేయడం అనేది యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఎందుకంటే స్విఫ్ట్ లావాదేవీల్లో అత్యధికంగా అమెరికా డాలర్‌లోనే సెటిల్ అవుతాయి. ఇప్పుడు రష్యా, చైనా గనుక స్విఫ్ట్ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు.. అంతిమంగా డాలర్ పెత్తనానికి గండి పడినట్లే. ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు కాగా, చైనా ప్రపంచంలో నంబర్ వన్ తయారీ వస్తువుల ఎగుమతిదారు. బ్రిక్స్‌తో సహా తమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మిత్ర దేశాలను సైతం రష్యా ఈ కొత్త పేమెంట్ సిస్టమ్‌లోకి తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు చెల్లుచీటీ తప్పదని పరిశీలకులు పేర్కొంటున్నారు. పశ్చిమ దేశాల పెత్తనానానికి చెల్లు! రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో భౌగోళిక రాజకీయాలు కూడా కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రపంచంలో 195 దేశాల్లో రష్యాపై ఆంక్షలు విధించిన అంతర్జాతీయ కమ్యూనిటీలో పట్టుమని 40 దేశాలు కూడా లేవు. అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు, కొన్ని అమెరికా మిత్ర దేశాలు మాత్రమే వీటిలో ఉన్నాయి. మిగతా ప్రపంచమంతా ఆంక్షలకు నో చెప్పింది. జీ7 అగ్ర దేశాల మొత్తం జనాభా 77.7 కోట్లు కాగా, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) జనాభా ఏకంగా 320 కోట్లు (ప్రపంచ జాభాలో 41%) కావడం విశేషం. 2030 నాటికి బ్రిక్స్ దేశాల జీడీపీ ప్రపంచ మొత్తం జీడీపీలో 50 శాతానికి చేరుతుందని అంచనా. బ్రిక్స్‌తో పాటు ఆఫ్రికా మొత్తం కనీసం ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండించలేదు కూడా. గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా యూఏఈ రష్యాకు అండగా నిలుస్తోంది. మిత్రదేశం సౌదీ కూడా అమెరికాకు ముఖం చాటేసింది. అంతేకాదు, యూఏఈ, భారత్ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి ఐక్యారాజ్యసమితిలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం మరో విశేషం. అంటే అమెరికా కూటమి చెబుతున్న అంతర్జాతీయ కమ్యూనిటీకి అర్థమేంటి? ‘‘కొంతమంది పశ్చిమ దేశాల రాజకీయ విశ్లేషకులు చేసే ఘోరమైన తప్పేంటంటే... వారి శత్రువులను మనందరికీ శత్రువులుగా ఉంచాలనుకోవడం’’ అని నెల్సన్ మండేలా చేసిన వ్యాఖ్యలు పశ్చిమ దేశాల కుటిల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అమెరికా ఇప్పుడు ఆడిస్తున్న ఈ భయంకరమైన సామ్రాజ్యవాద యుద్ధ చదరంగంలో రష్యన్లు కొన్ని పావులను కోల్పోతుండవచ్చు, అది వారికీ తెలుసు... అయితే అంతిమంగా వాళ్లు కోరుకుంటున్న ‘క్వీన్’ను మాత్రం చేజిక్కించుకోవడం ఖాయం. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాలే ఇందుకు బలమైన నిదర్శనం అనేది విశ్లేషకుల మాట!! ధరదడ.. మాంద్యం భయం! ఇప్పటికే ధరలు మండిపోతున్న నేపథ్యంలో, రష్యా ఎగుమతులపై ఆంక్షలతో ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయింది. రష్యా క్రూడ్, గ్యాస్‌పై నిషేధంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు దాదాపు 80 డాలర్ల స్థాయిలో ఉన్న ముడిచమురు ధర ఒక్కసారిగా 140 డాలర్ల స్థాయికి భగ్గుమంది. దీంతో అనేక దేశాల్లో పెట్రోలు బంకుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ ఇలా ఒకటేంటి.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకాయి. ఉక్రెయిన్, రష్యాల నుంచి గోధుమలు, ఎరువులు, నూనెగింజలు వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. వెరసి, అగ్రరాజ్య కూటమి ఆడుతున్న ఆంక్షల గేమ్‌కు ప్రపంచ దేశాలు బలవుతున్నాయి. వీటన్నింటికీ తోడు దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడం కోసం అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా పెంచుతుందటంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఒకపక్క, ధరాఘాతం, మరోపక్క, మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ.. ఇన్వెస్టర్లకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. యూరప్ గజగజ..! అమెరికా రెచ్చగొట్టడంతో రష్యా క్రూడ్, గ్యాస్‌పై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు.. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. వాస్తవానికి యూరప్ మొత్తం క్రూడ్, గ్యాస్ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం పైనే. జర్మనీ తదితర కొన్ని దేశాలైతే ఏకంగా 60–80 శాతం క్రూడ్–గ్యాస్ అవసరాలకు రష్యాపైనే ఆధారపడ్డాయి. అంతేకాదు రష్యా నుంచి నేరుగా పైపు లైన్ల (నార్డ్‌స్ట్రీమ్) ద్వారా యూరప్ మొత్తానికి సరఫరా వ్యవస్థ ఉండటంతో అత్యంత చౌకగా కూడా లభించేది. అయితే, రష్యాపై ఆంక్షలతో ఈ చౌక క్రూడ్, గ్యాస్‌కు చాలా దేశాలు నో చెప్పాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని దేశాలు ప్రత్యామ్నాయం లేక రష్యా రూబుల్స్‌లోనే చెల్లించి దిగుమతులు చేసుకుంటున్నాయి. అయితే, నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ నిర్వహణ, రిపేర్ల పేరుతో రష్యా గ్యాస్ ఎగుమతుల్లో దాదాపు సగానికిపైగా కోత పెట్టడంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలు.. ముఖ్యంగా జర్మనీ గజగజలాడుతోంది. ఎందుకంటే యూరప్‌లో చలికాలం మొత్తం ఇళ్లలో వెచ్చదనం కోసం గ్యాస్ హీటర్లనే ఉపయోగిస్తారు. అంతేకాదు, యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో చాలా కంపెనీలు నడిచేది గ్యాస్‌తోనే. వీటికి గనుక గ్యాస్ సరఫరాలు తగ్గితే, మూతబడే పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన బీఏఎస్ఎఫ్.. తమకు గ్యాస్ గనుక కోత పెడితే ప్లాంట్‌ను మూసేయాల్సి వస్తుందని ఇప్పటికే సంకేతాలిచ్చింది. రష్యా చౌక గ్యాస్‌ను కాదని, అమెరికా నుంచి భారీ ధరకు యూరప్ చేశాలు దిగుమతి చేసుకుంటుండటం మరో విచిత్రం. ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న అమెరికా... యూరప్ దేశాలనూ ఆర్థికంగా కకావికలం చేస్తోందని అక్కడి ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. ‘‘అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం. కానీ మిత్రుడిగా ఉండటం ప్రాణాంతకం’’ అంటూ అమెరికా రాజనీతిజ్ఞుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ ఎ. కిసింజర్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద రష్యాపై ఎడాపెడా విధిస్తున్న ఆంక్షలు.. బ్యాక్‌ఫైర్ కావడంతో పశ్చిమ దేశాలు గిలగిలాకొట్టుకుంటున్నాయి. చైనా, భారత్‌కు ‘రష్యా క్రూడ్’ పంట! ఇదంతా ఒకెత్తయితే, ప్రపంచ క్రూడ్ వినియోగదారుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న చైనా, భారత్‌కు రష్యా–ఉక్రెయిన్ వార్ కాసులు కురిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల కారణంగా నిలిచిపోయిన వాణిజ్యాన్ని రష్యా.. బ్రిక్స్ దేశాలు, ఇతరత్రా మిత్ర దేశాలకు మళ్లిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలకు 30 శాతం మేర డిస్కౌంట్ రేటుకు క్రూడ్ ఇస్తుండటం విశేషం. ఉక్రెయిన్‌తో వార్ మొదలయ్యాక మూడు నెలల్లో రష్యా నుంచి చైనా రెట్టింపు స్థాయిలో 18.9 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు, గ్యాస్, బొగ్గు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇక భారత్ అయితే దాదాపు ఐదు రెట్లు అధికంగా 5.1 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్, బొగ్గు, ఇతర కమోడిటీలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. వార్ మొదలయ్యాక తొలి 100 రోజుల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతుల ద్వారా రష్యా ఆర్జించిన మొత్తం 98 బిలియన్ డాలర్లు. ఇందులో 61 శాతం అంటే దాదాపు 58 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులను యూరప్ దేశాలే చేసుకోవడం విశేషం. ఆంక్షలు ఎంతలా విఫలమయ్యాయో చెప్పేందుకు ఈ లెక్కలు చాలు! - శివరామకృష్ణ మిర్తిపాటి -
లంక క్రికెటర్‌ను చుట్టుముట్టిన కష్టాలు.. రెండురోజుల పాటు
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.తినడానికి సరైన తిండి దొరక్క అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆర్ధిక సంక్షోభానికి.. రాజకీయ సంక్షోభం కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. లంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆ దేశ ప్రజలు ప్రెసిడెన్షియల్ భవనాన్ని ముట్టడించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ముందుగా మాల్దీవులు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్న ఆయన అక్కడి నుంచి తన రాజీనామా పత్రాన్ని ఈమెయిల్ ద్వారా పంపించారు. కాగా తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇదిలా ఉంటే దేశంలో నిత్యవసరాలు సహా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్ కోసం రోజుల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. తాజాగా ఆ ప్రభావం లంక క్రికెటర్లపై కూడా పడింది. దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకక.. ఎందరో ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్నారు.గ్రౌండ్ వరకు వెళ్లాలంటే రవాణావ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితిని శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రెండు రోజుల పాటు క్యూలో నిల్చున్న కరుణరత్నే పెట్రోల్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఏఎన్ఐ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరుణరత్నే మాట్లాడుతూ.. ''దొరికిన పది వేల రూపాయల పెట్రోల్ తో రెండు మూడు రోజుల వరకు ప్రాక్టీస్‌కు వెళ్లాలి. దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుంది. దేశానికి అండగా నిలబడుతూనే మా ఆటపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. గొటబాయ రాజపక్స రాజీనామా తర్వాతైనా లంకకు అధ్యక్షుడిగా మంచి వ్యక్తులు వస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే అంతా సర్దుకుంటుందని.. శ్రీలంక ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందని'' ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఆసియా కప్ 2022కు శ్రీలంకనే ఆతిధ్యం ఇవ్వనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను లంక క్రికెటర్లను కలవరపెడుతోంది. ఆసియా కప్ లో రాణించాలంటే కనీస ప్రాక్టీస్ ఎంతో అవసరం. అయితే లంక క్రికెటర్లు చాలా మంది కూడా పెట్రోల్, డీజిల్ కొరతతో గ్రౌండ్ లకు వెళ్లి ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నారు. మరి ఆసియా కప్ వేదికను ఐసీసీ మారుస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే మ్యాచ్ లు జరిగే సమయంలో ఆటగాళ్లను మైదానాలకు తీసుకెళ్లడం.. హోటల్ కు తీసుకురావడం కోసం ఎంతగానో చమురు అవసరం పడుతుంది. శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ముదిరి పాకానా పడ్డప్పటికి గత నెలలో ఆస్ట్రేలియా జట్టు లంక పర్యటనకు వచ్చింది. కష్టాల్లో ఉన్న లంకతో సిరీస్ ఆడి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొంది. టి20 సిరీస్ ను ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్ ను శ్రీలంక గెలుచుకుంది. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌లో మాత్రం ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి డ్రా చేసుకున్నాయి. ఇక కరుణరత్నే 2019లో అంతర్జాతీయ క్రికెట్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ తో పాటు 18 వన్డే, 25 టీట్వంటీ మ్యాచ్ లు ఆడాడు. #WATCH | Sri Lankan cricketer Chamika Karunaratne speaks to ANI; says, "We've to go for practices in Colombo&to different other places as club cricket season is on but I've been standing in queue for fuel for past 2 days. I got it filled for Rs 10,000 which will last 2-3 days..." pic.twitter.com/MkLyPQSNbZ — ANI (@ANI) July 16, 2022 చదవండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ Virat Kohli: సెంచరీ కోసం కోహ్లి కూడా ఇంతలా తపించి ఉండడు.. -
కొనడానికి లేదు.. తినడానికి లేదు
ఏమీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. కొనడానికి డబ్బుల్లేవు. డబ్బులున్నా కొనడానికి ఏమీ దొరకవు. పెట్రోల్ బంకుల దగ్గర రోజుల తరబడి క్యూ లైన్లు ఆఫీసుల్లేవు, పనుల్లేవు. చదువుల్లేవు. కాస్త గాలి ఆడేలా ఫ్యాన్ కింద కునుకు తీద్దామంటే కరెంట్ ఉండదు. ఏం చేయాలి? ఎలా బతకాలి? అందుకే కడుపు మండిన సగటు శ్రీలంక పౌరులు రోడ్డెక్కారు. అవినీతి అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ సమరభేరి మోగించారు. కడుపు నింపుకోవడానికి కావల్సినంత తిండి దొరకదు. అర్థాకలితో కంచం ముందు నుంచి లేవాలి. కాసేపు ఫ్యాన్ కింద కూర్చుద్దామంటే కరెంట్ ఉండదు. రోజుకి 13 గంటల విద్యుత్ కోతలు. బయటకు వెళ్లాలంటే పెట్రోల్ లేక వాహనం కదలదు. పాఠశాలలు, కార్యాలయాలు మూతబడ్డాయి. అటు ధరాభారం, ఇటు నిత్యావసరాల కొరతతో శ్రీలంక పౌరుల బతుకు భారంగా మారింది. ఏది కొనాలన్నా క్యూ లైన్లలో నిల్చోవాలి. కాళ్లు పడిపోయేలా నిల్చున్నా కావల్సినవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. లీటర్ పెట్రోల్ రూ.450, కేజీ బియ్యం రూ.250, కేజీ కందిపప్పు రూ. 420, ఒక కొబ్బరికాయ రూ.110, కేజీ కేరట్ రూ.250, అయిదు కేజీల గ్యాస్ బండ ధర రూ.1150... ఇవీ శ్రీలంకలో ధరలు ... నిత్యావసరాల ధరలు ఆ స్థాయిలో ఉంటే ఎలా కొంటారు ? ఏం తింటారు ? ఇక పిల్లలకైతే పౌష్టికాహారం దొరకడం లేదు. పాల పౌడర్ దిగుమతులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బతుకు దుర్భరమైన పరిస్థితుల్లో ఒంటికేదైనా వచ్చినా ఆస్పత్రుల్లో అత్యవసర మందులకి కూడా కొరత నెలకొంది. వైద్యం కూడా అందరికీ అందని పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్ ధరలు మండిపోతూ ఉండడంతో చాలా మంది తమ కండబలాన్ని నమ్ముకున్నారు. స్కూటర్లు, కార్లు అమ్మేసి సైకిళ్లు కొనుక్కుంటున్నారు. బంగారాన్ని, ఆభరణాల్ని కూడా అమ్మేస్తున్నారు. 2021లో 7 టన్నుల బంగారాన్ని అమ్మిన శ్రీలంక ప్రజలు ఈ ఏడాది 20శాతం అధికంగా అమ్మేయవచ్చునని అంచనాలున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో ప్రజాగ్రహం అధ్యక్ష పీఠాన్ని వదలని గొటబాయ రాజపక్స మీదకు మళ్లింది.దేశంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష, ప్రధాని భవనాలను ముట్టడించారు. మొత్తంగా శ్రీలంక ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి ? పర్యాటక రంగం మీద ప్రధానంగా ఆధారపడిన శ్రీలం కోవిడ్–19 విసిరిన పంజా కోలుకోలేని దెబ్బ తీసింది. 2019లో 19 లక్షల మంది లంకను సందర్శిస్తే, 2020లో వారి సంఖ్య ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రధానంగా పర్యాటకం మీద ఆధారపడ్డ ఆ దేశానికి దెబ్బ తగిలింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి భారీగా ఆదాయం వచ్చే దేశంలో రైతులు అందరూ సేంద్రీయ ఎరువులు వాడి తీరాలన్న ప్రభుత్వ నిబంధనతో వ్యవసాయ దిగుబడులు భారీగా తగ్గిపోయాయి.. మరీ ముఖ్యంగా ధాన్యం, రబ్బర్, టీ, కొబ్బరి వంటి పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు రాజపక్స కుటుంబం ఏళ్ల తరబడి చేస్తున్న అవినీతి, ప్రభుత్వ అరాచక విధానాలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విదేశీ అప్పుల్ని శ్రీలంక ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో డాలర్ మారకం విలువ రూ.200 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.360కు చేరుకుంది. విదేశీ నిల్వలు తరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రపంచ దేశాల సహకారంతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి తేవాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సాగులో ఉత్పాదకత పెంచడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన, సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయడం, కార్మికులు రెట్టింపు శ్రమ చేయడం, ప్రజా సేవలు, విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను రూపొందించడం వంటివి చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'గోట గో హోమ్' అంటూ పార్లమెంట్లో నినాదాలు... వీడియో వైరల్
"Gota Go Home" Chants: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. దాన్ని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే అధ్యక్షతన ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒకవైపు లంకలో రోజురోజుకి దిగజారిపోతున్న ఆర్థిక స్థితి. మరోవైపు రాజపక్సల పై ప్రజల్లో నెలకున్న ఆగ్రహం ఎంతమాత్రం చల్లారటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే విపక్షాల నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స. ఈ మేరకు మంగళవారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ సమావేశాలను హజరైన గోటబయను చూసి పార్లమెంట్ సభ్యులు ' గోట గో హోమ్' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో ఆయన చేసేదేమిలేక అక్కడ నుంచి నిష్క్రమించారు. విదేశీ కరెన్సీ నిల్వలు లేకపోవడంతో అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోలేని సంకట స్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. నెలలుతరబడి తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని, ఇంధన సంక్షోభాన్ని, విద్యుత్ కోతలను ఎదుర్కొంది. ఈ సంక్షోభం వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశంలో చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధితో శ్రీలంక కొనసాగిస్తున్న చర్చలు ఆగస్టు నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఖరారు చేయడంపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రస్తుతం తాము దివాలా తీసిన దేశంగానే చర్చలో పాల్గొంటున్నామని చెప్పారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స పార్లమెంట్ నుంచి బలవంతంగా నిష్క్రమించిన వీడియోని పార్లమెంటు సభ్యుడు హర్ష డి సిల్వా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Ouch! This is how the arrival of #SriLanka President @GotabayaR to @ParliamentLK a few minutes ago ended: #GotaGoHome2022. Unplanned and never happened in the history. He had to get up and leave. pic.twitter.com/zuXiyQodAs — Harsha de Silva (@HarshadeSilvaMP) July 5, 2022 (చదవండి: శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత) -
పుచ్చకాయలివ్వండి..కొత్త ఇల్లు సొంతం చేసుకోండి!
బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంతో అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చైనాలో భారీ ఉద్యోగాలను అందించే రియల్ ఎస్టేట్ కుప్పకూలి పోవటం ఆందోళనకు దారి తీసింది. దీంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు బిల్డర్లు కొత్త ఆఫర్లను ఆందిస్తున్నారు. పుచ్చకాయలు, పీచెస్ పళ్లు, వెల్లుల్లి, గోధుమలులాంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు తక్కువ రేటుకే ఇళ్లను విక్రయిస్తున్నారు. ఒకవైపు కొనుగోలుదారులేక, మరోవైపు ఇప్పటికే గృహాలను కొనుగోలుచేసిన వారు డబ్బులు చెల్లించక పోవడంతో ప్రాపర్టీ వలపర్లను కష్టాల్లోకి నెట్టేసింది. దీంతో పుచ్చకాయలు, పీచెస్, వెల్లుల్లి, గోధుమలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను స్వీకరిస్తున్నారని స్థానిక మీడియా నివేదించింది. కస్టమర్ల నుంచి డబ్బులకు బదులు పుచ్చకాయలు, గోధుమలు, వెల్లుల్లి వంటి వాటిని అంగీకరిస్తున్నారు. టైర్ 3, 4 నగరాల్లోని రియల్టర్లు ఈ విధంగా ప్రాపర్టీ కొనుగోళ్లలో రైతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా హౌసింగ్ మార్కెట్ మందగమనానికి తోడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు బిల్డర్లు డిపాజిట్లు తీసుకోవడంపై ప్రభుత్వ నిషేధం విధించింది. దీంతో తూర్పు నగరమైన నాన్ జింగ్‌లోని ఒక డెవలపర్ స్థానిక రైతుల నుండి డౌన్‌పేమెంట్‌గా 100,000 యువాన్ల వరకు విలువైన ట్రక్కుల పుచ్చకాయలను స్వీకరిస్తున్నారట. 100,000 యువాన్ల విలువను 5000 కిలోల పుచ్చకాయలుగా లెక్కిస్తున్నారు. మరో చిన్న పట్టణమైన వుక్సీలో, మరొక డెవలపర్ పీచెస్ పళ్లను తీసుకుంటున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. దీంతో సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రధాన వెల్లుల్లి ఉత్పత్తి ప్రాంతమైన క్వి కౌంటీలోని గృహ కొనుగోలుదారులు తమ డౌన్ పేమెంట్‌లో కొంత భాగాన్ని మార్కెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటున్నారు. కొత్త వెల్లుల్లి సీజన్ సందర్భంగా, క్వి కౌంటీలోని వెల్లుల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని హోమ్‌బిల్డర్ సెంట్రల్ చైనా మేనేజ్మెంట్ మే చివరిలో సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంతో అమ్మకాలు పెరిగాయట. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును కూడా తగ్గించింది. 4.6 శాతం నుంచి 4.4 శాతం వరకు కోత పెట్టింది. ప్రస్తుతం చైనా గృహ రుణాల విలువ 10 ట్రిలియన్లకు డాలర్లకు చేరింది. చైనాలో దాదాపు 27 శాతం బ్యాంకు రుణాలు రియల్ ఎస్టేట్‌తో ముడిపడి ఉన్నాయని థింక్ ట్యాంక్, పాలసీ రీసెర్చ్ గ్రూప్ నివేదించింది. కాగా అధికారిక డేటా ప్రకారం చైనాలో గృహ విక్రయాలు వరుసగా 11 నెలలోనూ క్షీణతను నమోదు చేశాయి. గత ఏడాదితో పోలిస్తే మేలో 31.5 శాతం తగ్గాయి. కోవిడ్ మహమ్మారి విలయంతో చైనాతోపాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా వార్ తోడవ్వడంతో గ్లోబల్‌గా నిత్యావసరాలు, ఇంధనం, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. -
Sri Lanka: పెట్రోల్ కోసం క్యూలో రోజుల తరబడి..
శ్రీ లంక సంక్షోభం ఇప్పుడు ఏమేరకు చేరిందో తెలుసా?.. పెట్రోల్ కావాలంటే ముందు టోకెన్లు తీసుకోవాలి. గంటల తరబడి కాదు.. రోజుల తరబడి క్యూలో ఎదురు చూడాలి. అవును.. శ్రీలంకలో పరిస్థితి దయనీయమైన స్థితికి చేరుకుంది. పెట్రో అమ్మకాలపై శ్రీలంక ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తోంది. అమ్మకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. గత పది పదిహేను రోజులుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిలకోసం లైన్లలో ఎదురు చూపులు తప్పడం లేదు. కొందరైతే క్యూలోనే రోజుల తరబడి ఉండిపోతున్నారు. అక్కడే బస చేస్తున్నారు. అత్యవసరం ఉన్న వాహనాలకు సైతం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, వాహనాలనే నమ్ముకుని బతుకుతున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తీవ్ర సంక్షోభం.. అప్పుల నడుమ శ్రీలంకకు చమురు ఇంధనాలు చేరుకోవడం లేదు. ఇంధన కొరతతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి చాలా చోట్ల. దీంతో పెట్రో బంకుల వద్ద భారీ క్యూలు, కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితి అదుపు చేయడానికి సైన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాదారులను అదుపు చేయడంతో పాటు టోకెన్లను సైతం వాళ్లే దగ్గరుండి పంచుతున్నారు. గాలే టెస్టును కవరేజ్ చేయడానికి ఓ జర్నలిస్ట్.. సుమారు ఐదు కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించాడంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్టర్ ఆండ్రూ ఫైడెల్ ఫెర్నాండోకు ఈ అనుభవం ఎదురైంది. Almost no fuel in the country, so nearly impossible to get a trishaw. Buses unreliable and the ones that come are crammed. Still need to get to the ground to cover the Galle Test this week. There was only one option. pic.twitter.com/av2qVWup7G — Andrew Fidel Fernando (@afidelf) June 30, 2022 -
చమురు సంక్షోభం: ఆఫీసులు, విద్యా సంస్థలు బంద్
కొలంబో: చమురు సంక్షోభంతో శ్రీలంక సతమతమవుతోంది. దాంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని పేర్కొంది. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలనిఆదేశించింది. చమురు నిల్వలు అడుగంటుతుండటంతో విదేశీ మారక ద్రవ్యం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక ప్రజలు మళ్లీ నిరసనలకు దిగుతున్నారు. చదవండి: (Warren Buffett: బఫెట్‌తో భోజనం @ రూ.148 కోట్లు) -
పెట్రోలు లేదు: రెండు వారాలు ఇంటినుంచే పని
కొలంబో: గత ఏడుదశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన పెట్రోలు కొరత కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రెండు వారాల పాటు ఇంటి నుంచి పని చేయాలని శుక్రవారం ఆదేశించింది. ఇంధన సరఫరాపై ఆంక్షలు, బలహీనమైన ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ సర్క్యులర్ జారీ చేశామని మినిమం స్టాఫ్ సోమవారం నుండి పనికి రావచ్చని శ్రీలంక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఫలితంగా సుమారు పది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులలో, ఆరోగ్య సంరక్షణ వంటి అవసరమైన సేవలను అందించే వారు మాత్రమే ఆఫీసు డ్యూటీకి రిపోర్టు చేస్తారని పేర్కొంది. (అటు పెట్రో సంక్షోభం: ఇటు రహమాన్ పాటకు డాన్స్‌తో ఫిదా!) విదేశీ మారకద్రవ్య నిధులు అడుగంటిపోవడంతో ఇంధనం కోసం శ్రీలంక అష్టకష్టాలు పడుతోంది. రానున్న ఆహారకొరత భూతం మరింత వణికిస్తోంది. మరోవైపు పెట్రోలు, డీజిల్ కోసం పెట్రో బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో జనాలు నానా అగచాట్లు పడుతున్నారు. కొంతమంది వినియోగదారులు పెట్రోలు కోసం ఏకంగా 10 గంటలకు పైగానే వేచి ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతమున్న స్టాక్ పెట్రోల్, డీజిల్ కొద్ది రోజుల్లో అయిపోనుందనే ఆందోళన వెంటాడుతోంది. కోవిడ్-19, ఇటీవలి రాజకీయ సంక్షోభం లాంటి పరిణామాల నేపథ్యంలో 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. కాగా బెయిలౌట్ ప్యాకేజీ కోసం దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో కొలంబోలో ఒక ప్రతినిధి బృందం చర్చలు జరపనుంది. రాబోయే నెలల్లో 5 మిలియన్ల మంది శ్రీలంక వాసులు ఆహార కొరతతో ప్రత్యక్షంగా ప్రభావితం కావచ్చని ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రాబోయే నాలుగు నెలల్లో మరింత సంక్షోభంలోకి జారిపోనున్న 1.7 మిలియన్ల శ్రీలంక పౌరులకు సహాయం అందించేందుకు 47 మిలియన్ డాలర్లు సేకరించేలా ఐక్యరాజ్యసమితి కసరత్తు చేస్తోంది. -
అటు పెట్రో సంక్షోభం: ఇటు రహమాన్ పాటకు డాన్స్‌తో ఫిదా!
కొలంబో: శ్రీలంక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో కుదేలవుతోంది. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక విదేశీ దిగుమతులకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో పడిపోయింది ద్వీప దేశ శ్రీలంక. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ రేట్లతో జనం నానా అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోలు ధరలకు తోడు అక్కడి ప్రభుత్వ ఆంక్షలు సామాన్య జనానికిచుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు పెట్రోలు బంకుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్లో ఒక ఆటో డ్రైవర్ డాన్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఏఆర్రహమాన్ స్వరపర్చిన ముక్కాలా.. ముకాబులా పాట ఆయన చేసిన డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. #SriLanka: The petrol queue dance (to @arrahman's music from 1994) - received via whatsapp. Hoping to see him sometime when I'm in line. #lka #SriLankaEconomicCrisis pic.twitter.com/e42hiiLWmi — Meera Srinivasan (@Meerasrini) June 16, 2022 -
ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు
Sri Lanka Crisis: గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంకోభాలతో కొట్టుమిట్టాడుతూ.. తీవ్ర ఉద్రిక్తలతో మగ్గిపోయింది. ఇప్పడిప్పుడే కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం కొత్త ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. ఆ దేశా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రధాని రణిల్ విక్రమసింఘే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తమ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంధనానికి సంబంధించి రాబోయే మూడు వారాలు మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందువల్ల మనం ఇప్పటి నుంచే ఇంధనం, గ్యాస్‌లను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అనవసరమైన ప్రయాణాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. సంక్షోభాన్ని అధిగమించడానికి దేశం ఇంధనం కోసం నెలకు సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది" అని చెప్పారు. అదీగాక అంతర్జాతీయ పరంగా మనం అనుసరిస్తున్న నాసిరకం విధానాల వల్లే దేశం మరింతగా అణగారిపోతుందని విక్రమసింఘే అన్నారు. అందువల్ల ప్రస్తుతం దేశం తన విదేశీ సంబంధాలపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!) -
'ఆసియా కప్ నిర్వహించలేం.. వేదికను మార్చండి'
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు మండిపోతుండగా.. పెట్రోల్ ధర ఆకాశాన్ని అంటింది. తీవ్ర సంక్షోభంతో అక్కడి జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో లంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ నిర్వహించలేమంటూ చేతులెత్తేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృశ్యా ఆసియా కప్‌ను నిర్వహించలేమని.. వేదికను మార్చాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జై షాకు లంక క్రికెట్ బోర్డు వినతిపత్రం సమర్పించింది. కాగా జై షా సహా బీసీసీఐ అధికారులతో పాటు లంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉన్నారు. ఇవాళ(మే 29) ఐపీఎల్ ఫైనల్ జరగనుండడంతో మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో జై షా నేతృత్వంలో ఆసియా కప్ నిర్వహణకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేశారు. లంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమని ఆ దేశ బోర్డు వివరించగా.. అందుకు మెజారిటీ ఏసీసీ సభ్యులు పాజిటివ్‌గా స్పందించారు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాతే ఆసియా కప్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది. ముందుగా అనుకున్న ప్రకారం శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమైతే యూఏఈకి తరలించడమో లేక బంగ్లాదేశ్ వేదికగా టోర్నీని నిర్వహించాలని ఏసీసీ భావించింది. ఇదే నిజమైతే ఆసియా కప్ యూఏఈ లేదా బంగ్లాదేశ్‌లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, యూఏఈలు తలపడనున్నాయి. టి20 ఫార్మాట్లో టోర్నీని నిర్వహించనున్నారు. ఆసియా కప్ చివరిసారి 2018లో యూఏఈలో జరగ్గా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన టీమిండియా ఏడోసారి కప్‌ను కైవసం చేసుకుంది. చదవండి: కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్ -
శ్రీలంక: ఐదు వారాల్లో రెండోసారి ఎమర్జెన్సీ విధింపు
కొలంబో: శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చింది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంక గడ్డపై ఐదువారాల్లో రెండోసారి ఇది ఎమర్జెన్సీ ప్రకటించడం. ఎమర్జెన్సీ ద్వారా పోలీసులకు, భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయి. ఎవరినైనా నిర్బంధించేందుకు, అరెస్టు చేసేందుకు వీలుంటుంది. అధ్యక్షుడు గొటబయా Gotabaya Rajapaksa తక్షణం రాజీనామా చేయలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం గమనార్హం. మరోవైపు గోటబయా రాజీనామాను డిమాండ్ చేస్తూ వేల మంది విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి ఉపక్రమించారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఇంకోపక్క.. దేశంలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్వహించిన సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పనులకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా రైలు సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లపైకి రాలేదు, పారిశ్రామిక కార్మికులు తమ ఫ్యాక్టరీల వెలుపల ప్రదర్శనలు చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టేసిన చేతకానీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేశారు. చదవండి: అప్పుల కుప్ప .. అంతా రాజపక్సల మాయ! -
Sakshi Cartoon: శ్రీలంకకు భారత్ చేయూత
-
Sri Lanka crisis: లంకకు అండగా నిలిచిన ప్రధాని మోదీ..
సాక్షి, న్యూఢిల్లీ: అన్నిరకాలుగా సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సెంట్రల్ లంకలోని రంబుక్కన వద్ద హైవేను, రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. వారిపై పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా, లీటర్ పెట్రోల్ మంగళవారం ఏకంగా 84 రూపాయలు పెరిగి రూ.338కి చేరింది. బస్సు చార్జీలు కూడా ఏకంగా 35 శాతం పెరిగాయి. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. సంక్షోభంలో ఉన్న లంకు మరోసారి భారత్ భారీ సాయాన్ని అందించనుంది. చమురు కొనుగోలు కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3800 కోట్లు) అందించనుందని శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్ పిరిస్ వెల్లడించారు. అంతకు ముందు కూడా భారత్.. శ్రీలంకకు భారీ మొత్తంలో డీజిల్, ధాన్యాన్ని పంపించింది. అలాగే, ఐఎంఎఫ్ నుండి(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) నుండి వచ్చే సాయం ప్రస్తుతం దశల వారీగా అందుతోందన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నుండి అందే ఆర్థిక సాయం 450 మిలియన్ డాలర్లు కొంత ఆలస్యం కానున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు.. ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్త నిరసనలతో సతమతమవుతున్న శ్రీలంకలో సోమవారం పాత ప్రధాని మహింద రాజపక్స సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొత్తం 17 మందితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాని విడివిడిగా జాతినుద్దేశించి మాట్లాడారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొస్తామని గొటబయ ధీమా వెలిబుచ్చారు. స్వచ్ఛమైన, సమర్థమైన పాలన అందించేందుకు సహకరించాల్సిందిగా మహింద కోరారు. -
లంక ఆర్థిక సంక్షోభం.. తరలివస్తున్న మాజీ క్రికెటర్లు
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక రూపాయి విలువ దారుణంగా పడిపోడవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబోయ రాజపక్స గద్దె నుంచి దిగిపోవాలంటూ వారం రోజుల నుంచి ప్రజలు సెక్రటరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్.. రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతు ఇచ్చారు. క్రికెట్ రిత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్.. సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. ''ఈరోజు బయట మా అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇంకా అధికారిక ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం.. ప్రజలకు మా అవసరం ఉంది.. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగాం.. క్రీడాకారులైనా సరే.. దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరు.'' అంటూ రణతుంగ పేర్కొన్నాడు. కాగా జయసూర్య నినాదాలు చేస్తూనే రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కాగా వీరిద్దరికి తాజాగా మరికొందరు మాజీ క్రికెటర్లు పరోక్షంగా తమ మద్దతు తెలిపారు. రాజకీయపరంగా నిరకుంశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. గొటబయ రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా ట్విటర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇక మాజీ టెస్టు క్రికెటర్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గతంలో జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చాడు. అప్పుడు రాబర్ట్ ముగాబే.. ఇప్పుడు గొటబయ రాజపక్స ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ''కొన్ని సంవత్సరాల క్రితం నేను జింబాబ్వే వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై త్రీవ నిరసన వ్యక్తం చేశారు. నా కారు డ్రైవర్ డీజిల్ తేవడానికి గంటల పాటు క్యూలైన్లో నిల్చోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా దేశంలో రావద్దని కోరుకున్నా. కానీ నా అంచనా తలకిందులైంది. ఒకప్పుడు జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఇప్పుడు లంక ప్రజలు అనుభవిస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Dhammika Prasad: నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్ Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
శ్రీలంకలో ఇంధన రేషనింగ్
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించారు. తాజా రేషన్ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచి్చందని శ్రీలంక ప్రభుత్వం అధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. దీని ప్రకారం టూ వీలర్లకు రూ.వెయ్యి, త్రీ వీలర్లకు రూ.1,500, కార్లు, వ్యాన్లు, జీప్‌లకు రూ.5,000 మేరకే పెట్రోల్, డీజిల్ పోస్తారు. వాణిజ్య వాహనాలను రేషన్ నుంచి మినహాయించారు. విద్యుత్ కోతలు కూడా రోజుకు 12 గంటలపాటు అమలవుతున్నాయి. తీవ్ర వంటగ్యాస్ కొరతను తీర్చేందుకు భారత్‌ను శ్రీలంక సాయం కోరింది. రుణ రూపేణా వంటగ్యాస్‌ను సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థించినట్లు ప్రభుత్వ రంగ లిట్రో గ్యాస్ కంపెనీ చైర్మన్ తెషార జయసింఘే తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ భారత హైకమిషన్ ద్వారా మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి తనకు సహకారం అందడంలేదని, తనపై గ్యాస్ మాఫియా ఒత్తిడి పెరుగుతున్నందున బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన అధ్యక్షుడు గొటబయకు రాజీనామా లేఖ పంపించారు. శ్రీలంక రూపాయి విలువ పతనం కావడంతో అత్యవసరాలకు సైతం తీవ్ర కొరత ఏర్పడింది. 2019 ఏప్రిల్ 21న ఈస్టర్ నాటి బాంబు పేలుడు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ క్రికెటర్ ధమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. అప్పట్లో మూడు చర్చిల్లో జరిగిన ఆరు బాంబు పేలుళ్లలో 269 మంది చనిపోయారు. -
నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహారదీక్షకు దిగాడు. ప్రస్తుతం శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పాటు 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు కుటుంబాలకు న్యాయం చేకూరేందుకే తాను నిరాహారదీక్షకు దిగినట్లు దమ్మిక ప్రసాద్ తెలిపాడు. ''బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేవరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. దీంతో పాటు లంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని'' మీడియాకు తెలిపాడు. అంతకముందు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఉంటున్న గాలేలోని సెక్రటరియట్ ఎదుట ఆందోళన చేస్తున్న లంక ప్రజలకు మద్దతుగా దమ్మిక ప్రసాద్ తన నిరసనను వ్యక్తం చేశాడు. కాగా 2019లో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది ప్రాణాలు పోయాయి. మూడు చర్చిలు, మూడు హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. కాగా ఈ కుట్ర వెనుక సూత్రధారులపై శ్రీలంక ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతోపాటు బాంబు దాడిలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూడా ఎలాంటి నష్టపరిహారం అందించలేదు. చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
లంక ప్రధానితో చర్చలకు నో!
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడి భవనం ముందు నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులను ఆ దేశ ప్రధాని మహింద రాజపక్సే చర్చలకు ఆహ్వానించారు. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలని, ఇతర రాజపక్సే కుటుంబ సభ్యులు అధికారం నుంచి వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అంతవరకు చర్చలకు రామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆందోళనకారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలిపారు. ‘‘మేం ఇక్కడకు చర్చలకు రాలేదు. నువ్వు, నీ ప్రభుత్వం రాజీనామా డిమాండ్ చేయడానికి వచ్చాం’’ అని నిరసనకారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. వీరు నిరసన తెలియజేసే స్థలానికి గాట్గోగామా అని పేరు పెట్టుకున్నారు. బుధవారానికి ఈ ఆందోళనలు ఐదో రోజుకు చేరాయి. ఎక్కువగా యువత ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. దేశంలోని అవినీతి రాజకీయ సంస్కృతిని మార్చేవరకు వెనుదిరగమంటున్నారు. బుధవారం ఆందోళనల్లో పలువురు సంగీతకారులు, సెలబ్రిటీలు, ఆర్టిస్టులు పాలుపంచుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్ రోషన్ మహానామా కూడా ఉన్నారు. ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదని, ఇంతవరకు సంక్షోభానికి పరిష్కారమార్గాలు రాజకీయనాయకుల నుంచి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు నిరసనకారులతో చర్చలకు రావాలంటూ ప్రధాని కార్యాలయం యువతను కోరుతూ ప్రకటన చేసింది. ఒకవేళ వారు చర్చలు అంగీకరిస్తే వారి బృందంలో మరింత మంది పాల్గొనే అవకాశం ఇస్తానని మహింద చెప్పారు. దేశమంతా అదే డిమాండ్ రాజపక్సే కుటుంబం పదవులను వీడాలంటూ లంకలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దేశంలో పెట్రోల్ బంకుల వద్ద, దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకునే వీలు లేకపోవడంతో వరుసల్లో నిలబడ్డ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. విదేశీ నిల్వలు భారీగా దిగజారడంతో బహిర్గత రుణ చెల్లింపులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే! ప్రభుత్వంలో పలు మంత్రులు రాజీనామాలు చేసిన అనంతరం కొత్త కేబినెట్ ఏర్పాటు చేయడంలో గొటబయ ఇప్పటకీ సఫలం కాలేదు. పార్లమెంట్లో ప్రభుత్వంపై అవిశ్వాసం, అధ్యక్షుడి అభిశంసన, అధ్యక్షుడికి అధిక అధికారాలు కల్పించే 20 సవరణల తొలగింపును కోరుతూ తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామైన ఎస్ఎల్పీపీ నేత సిరిసేన ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలకు హాజరుకానని తేల్చిచెప్పారు. అయితే సంక్షోభానికి కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. -
దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి!
మన పక్కదేశం శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా తదనంతర పరిణామాల అనంతరం లంకకు ఆదాయం తెచ్చిపెట్టే టూరిజం బాగా దెబ్బతింది. దీంతో పెట్రోల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు దేశం విడిచి వలస పోతుంటే.. మరికొందరు పుట్టిన మట్టిని వదిలిరాలేక ఆకలితో అలమటిస్తున్నారు. రోజురోజుకు అక్కడ పరిస్థితి దిగజారుతూనే వస్తుంది. దీనికి ప్రధాన కారణమైన గొటబొయ రాజపక్స ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ క్రికెటర్.. మంత్రి అర్జున రణతుంగ శ్రీలంక ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేశారు. ''ఆర్థిక సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోంది.. దయచేసి ఐపీఎల్లో ఆడుతున్న లంక క్రికెటర్లు తిరిగి వచ్చి దేశానికి మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నా. దేశం తగలబడిపోతున్నా కొందరు క్రికెటర్లు ఏం పట్టనేట్లే ఉన్నారు. మాకెందుకు ఇదంతా అన్నట్లు ఐపీఎల్లో ఆడుతూ సొంత దేశం గురించి పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. కాగా క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి.. సదరు బోర్డు ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ బోర్డులో ఉన్న ఉద్యోగులు, క్రికెటర్లు తమ జాబ్‌లు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో యంగ్ క్రికెటర్లు ముందుకు వచ్చి తమ మద్దతు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడే ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు కావాలి. మీరెందుకు నిరసన వ్యక్తం చేయడం లేదని ప్రజలు అడుగుతున్నారు. దానికి నా దగ్గర కారణం ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చి 19 ఏళ్లయింది. అయితే ఇప్పుడున్నది రాజకీయ సమస్య కాదు.. ఆర్థిక సమస్య. ఇంతకముందు వనిందు హసరంగా, బానుక రాజపక్స ఆర్థిక సంక్షోభానికి మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడేమో వెళ్లి ఐపీఎల్ ఆడుకుంటున్నారు. నేను మీ జాబ్‌ను పూర్తిగా వదిలేయమని చెప్పను.. ఒక వారం పాటు ప్రత్యేక అనుమతి తీసుకొని దేశానికి వచ్చి మీ మద్దతు ఇవ్వండి చాలు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: దివాళా తీశాం.. విదేశీ రుణాలు తీర్చలేం: లంక ఆర్థిక శాఖ మా పాలన కాదు! తీవ్ర సంక్షోభానికి అసలు కారణం చెప్పిన లంక ప్రధాని -
Sri Lanka Crisis: శ్రీ లంక సంచలన ప్రకటన
ఊహించిన స్థాయిలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. దేశం దాదాపుగా దివాళా తీసిందని సూత్రప్రాయంగా సంకేతాలు పంపింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టే పరిస్థితి ఎదురయ్యిందని మంగళవారం ఆ దేశ ఆర్థిక శాఖ ఒక ప్రకటన లో పేర్కొంది. తీసుకున్న అప్పులను సమయంలోగా చెల్లించలేని స్థితిలో ఉన్నాం(డిఫాల్ట్). సుమారు 51 బిలియన్ డాలర్ల అప్పులను కట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టం చేసింది శ్రీ లంక ఆర్థిక శాఖ. ప్రస్తుతం అప్పు చెల్లింపులు తమకు పెద్ద తలనొప్పిగా మారాయని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అన్నారు. ఇప్పుడు అప్పులు కట్టడం అసాధ్యం కూడా అని తేల్చి చెప్పారు. కారణం.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. కాబట్టే, అప్పులను కట్టలేమని లంక పేర్కొంది. అలాగే తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే.. దేశంలోనే వేరే ఇతర మార్గాలనుంచైనా వసూలు చేసుకోవచ్చని, లేదంటే.. శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది. ట్విస్ట్.. అయితే అప్పుల ఎగవేతపై శ్రీలంక ఆర్థిక శాఖ కాసేపటికే మరో ప్రకటన చేసింది. అప్పులు చెల్లించడాన్ని తాత్కాలికంగా మాత్రమే రద్దు చేసుకున్నామని సెంట్రల్ బ్యాంక్ అధికారులు అంటున్నారు. మార్చి చివరినాటికి కేవలం $1.9 బిలియన్ల నిల్వలు ఉండగా, ఈ సంవత్సరం తన రుణ భారాన్ని తీర్చుకోవడానికి శ్రీలంకకు $7 బిలియన్లు అవసరమని అంచనాలు ఉన్నాయి. కడితే.. పెను సంక్షోభమే! ఇప్పుడున్న మిగులు విదేశీ నిధులతో.. అప్పులు గనుక కడితే తిండి గింజలు, నిత్యావసరాల దిగుమతులపై పెను ప్రభావం పడే ముప్పుందని అంటున్నారు అక్కడి ఆర్థిక నిపుణులు. ఈ నేపథ్యంలోనే అప్పుల చెల్లింపును తాత్కాలికంగా రద్దు చేసి ఆ డాలర్లను దిగుమతులకు చెల్లిస్తామని అంటున్నారు. 1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో పయనిస్తోంది. దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలకు సుదీర్ఘమైన విద్యుత్ కోతలతో పాటు తీవ్రమైన ఆహారం, ఇంధన కొరతలు విస్తృతమైన బాధలను తెచ్చిపెట్టాయి. సంబంధిత వార్త: తీవ్ర సంక్షోభానికి అసలు కారణం చెప్పిన లంక ప్రధాని -
నన్ను క్షమించండి: శ్రీ లంక ప్రధాని
ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు చేజారిపోయిన వేళ.. శ్రీలంకలో నిరసనలు మిన్నంటాయి. ఆహార.. మందలు కొరత, నిత్యావసరాల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం అవినీతి విధానాల వల్లే ఇదంతా అంటూ ఆరోపిస్తూ.. దిగిపోవాలంటూ ప్రజా నిరసన పెల్లుబిక్కుతోంది. ఈ తరుణంలో ప్రధాని మహీంద రాజపక్స ఒక వీడియో విడుదల చేశాడు. ఆర్థిక సంక్షోభంతో పాటు తాజా పరిస్థితులపైనా దేశ పౌరులకు వివరణ ఇచ్చుకున్నాడు. శ్రీ లంక ప్రధాని మహీంద రాజపక్స.. సోమవారం జాతిని ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశాడు. రాజీనామా డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చల్లార్చే దిశగా ఆయన ప్రసంగం సాగింది. లంక తీవ్ర సంక్షోభానికి కారణాలేంటో చెప్పిన మహీంద రాజపక్స.. ప్రదర్శలను తక్షణమే విరమించాలని నిరసనకారుల్ని విజ్ఞప్తి చేశాడు. ‘‘కొవిడ్‌తో లంక ఆర్థిక స్థితి కుప్పకూలింది. క్షీణించిన విదేశీ నిల్వలు కారణంగానే.. ఆర్థిక సంక్షోభంలోకి దేశం కూరుకుపోయింది. మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే మన దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిసినప్పటికీ.. లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. అందుకే మన విదేశీ నిల్వలు క్షీణించాయి. అంతేగానీ.. ప్రభుత్వ విధానాలు, మా పాలన అందుకు కారణాలు కావు. మా పాలనలో అసలు అవినీతికి చోటే లేదు కూడా. గత ప్రభుత్వాలు కూడా దేశాన్ని అప్పుల్లోకి నెట్టాయి. కరోనా పరిస్థితులు ఆ అప్పుల్ని మరింత ఊబిలోకి లంకను నెట్టేశాయని చెప్పుకొచ్చారు మహీందా. ప్రజల కష్టాలు చూసి చాలా బాధపడుతున్నా. శ్రీ లంక ప్రజల్ని క్షమాపణ కోరుతున్నా అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నాడు మహీంద. ‘‘ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 24 గంటలూ మా ప్రభుత్వం పని చేస్తోంది. మీరు(నిరనసకారుల్ని ఉద్దేశిస్తూ..) వీధుల్లో గడిపే ప్రతి నిమిషమూ దేశానికి డాలర్ ప్రవాహాన్ని దూరం చేస్తుంది. ఈ సమయంలో రాజకీయాలు వద్దన్నా.. ఎవరూ వినడం లేదు. దేశం పతనం కాకుండా రక్షించుకునేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలన్నా ఎవరూ స్పందించలేదు. మీరైనా సహనంతో మాకు సహకరించండి. అతికొద్దిరోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తాం’’ అని పేర్కొన్నాడు. స్నేహపూర్వక దేశాల నుండి సహాయం తీసుకునేటప్పుడు తాను దేశ సార్వభౌమత్వాన్ని త్యాగం చేయనని పేర్కొన్న రాజపక్సే.. ద్వీపం దేశం చాలా నిర్ణయాత్మక దశలో ఉందని అన్నారు. పనిలో పనిగా.. రైతులకు ఎరువుల సబ్సిడీని పునరుద్ధరిస్తానని శ్రీలంక ప్రధాని కీలక ప్రకటన చేశారు. చదవండి: మా వల్ల కాదు బాబోయ్.. లంకలో తీవ్ర ఉద్రిక్తతలు -
సమస్య పరిష్కారానికి అదొక్కటే దారి: శ్రీలంక ఆర్థిక మంత్రి
ఆర్థిక, ఆహార సంక్షోభం కారణంగా శ్రీలంక అల్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి పరిస్థితులు రోజురోజూకి మరింత క్లిష్టంగా మారుతోంది. గతంలో దేశాధినేతలు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు నిత్యావసరాల కొరత ఏర్పడడంతో లంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాల నేపధ్యాన సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగు వేయకలేకపోతోంది. తాజాగా శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ.. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఓ మార్గం ఉన్నట్లు సూచించారు. అప్పుడే ఔషదాల, ఇంధనం, నిత్యావసరాల వంటి అత్యవసర వస్తువులను సరఫరా చేయగలమని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయగలమని అన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాల కారణంగా నిరసనకారులను వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నారు. 22 మిలియన్ల జనాభా కలిగిన ద్వీప దేశం చాల కాలం నుంచి విద్యుత్ కోతలు, మందులు, ఇంధనం, ఇతర వస్తువుల కొరతతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతుల చేప్టటిన తర్వాత అలీ సబ్రీ తొలిసారిగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం శ్రీలంక తీవ్రమైన సంక్షభంలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి కొంచెమైనా బయటపడాలంటే 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని, అయితే ఈ మొత్తం అనుకున్నంత సులవు కాదని అన్నారు. ఈ నెలలో ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఈ సమస్యపై చర్చిందేకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: అరటి రైతులకు శుభవార్త ! ఆ దేశంతో కుదిరిన ఒప్పందం -
గొటబయ ప్రభుత్వంపై అవిశ్వాసం
కొలంబో: దేశంలో నెలకొన్న సంక్షోభాలను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టకుంటే గొటబయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లంక ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీ ప్రకటించింది. దేశంలో అధ్యక్ష పాలన పోవాలని పార్టీ నేత సజిత్ ప్రేమదాస అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ జరగాలన్నారు. గొటబయ తొలగాలన్న ప్రజా డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేదంటే తామే అవిశ్వాసం తెస్తామని హెచ్చరించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా ఎంపీల సంతకాల సేకరణను ఎస్‌జేబీ ఆరంభించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలో గొటబయ ఎస్‌జేపీని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పార్టీ తిరస్కరించింది. దేశంలో రాజపక్సేల ఆధిపత్యం పోవాలని ఎస్‌జేబీ కోరుతోంది. గొటబయ రాజీనామా చేయకపోతే అవిశ్వాసం తెస్తామని మరో విపక్షం జేవీపీ నేత విజేత హెరాత్ చెప్పారు. అయితే రాజీనామా డిమాండ్‌ను గొటబయ తోసిపుచ్చారు. పరిష్కారం దొరకలేదు దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభపై చర్చ పార్లమెంట్లో మూడు రోజులు చర్చించినా తగిన పరిష్కారం లభించలేదు. పలువురు మంత్రులు రాజీనామా నేపథ్యంలో తక్షణం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణా మర్గాలు అన్వేషించాలని అధికార కూటమి సభ్యులు కూడా కోరుతున్నారు. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్, చైనా, ఇండియాతో సాయంపై చర్చలు జరుపుతోందని గొటబయ చెబుతున్నారు. ప్రజలు పొదుపుగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగమంత్రి పెరిస్ చర్చలు జరిపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ రంగ ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేశారు. మరోవైపు దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత తీవ్రస్థాయికి చేరింది. -
మా వల్ల కాదు.. కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలు
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీ లంక ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రధాని గద్దెదిగిపోవాలంటూ ప్రధాని కార్యాలయం ఎదుట నిరసనల నినాదాలతో హోరెత్తిస్తున్నారు. చేతగానీ పాలనతో దేశాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిన ప్రధాని మహీందా రాజపక్సే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, తన సోదరుడు అధ్యక్షుడైన గోటబయ రాజపక్సతో సహా పదవుల నుంచి దిగిపోవాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ప్రధాని నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని భరించడం తమ వల్ల కాదంటూ నినాదాలు చేశారు. అవినీతి ద్వారా కూడబెట్టిన డబ్బును తక్షణమే బయటకు తేవాలని, సంక్షోభం నుంచి లంకను బయటపడేయాలంటూ రాజపక్స కుటుంబాన్ని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులను అడ్డగించిన భద్రతా సిబ్బంది.. ప్రధాని నివాసం చుట్టూ భారీ వలయంగా ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా.. దేశం కోసం నినాదంతో మహీంద రాజపక్స తీసుకొచ్చిన కొన్ని నిర్ణయాలు లంక పాలిట శాపంగా పరిణమించాయి. కరోనా ఎఫెక్ట్‌తో దేశ ప్రధాన ఆదాయంవచ్చే టూరిజం ఘోరంగా దెబ్బతినగా.. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి పెరిగిన ధరలు, నిత్యావసరాలు, మందుల కొరతతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. చదవండి: చర్యలకు ఉపక్రమించిన అధ్యక్షుడు.. కష్టాల నుంచి లంక గట్టేక్కేనా? -
లంక మంటలకు కారణాలేమిటి?
ద్వీపదేశం శ్రీలంకలో ప్రజలు నిత్యావసరాల కోసం గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోంది. దశాబ్దాలుగా తీసుకున్న నిర్ణయాలు ఆ చిన్న దేశాన్ని పెద్ద సంక్షోభం లోకి నెట్టేశాయి. వీటికితోడు ఎకాఎకీ సేంద్రీయ వ్యవసాయంలోకి మరలడం, హింసాకాండ వల్ల పర్యాటక రంగం దెబ్బతినడం, కోవిడ్ మహమ్మారి పంజా విసరడం, ఇంకా ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం, ఫలితంగా పెరిగిన చమురు ధరలు ఆ దేశం మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దాంతో నిసర్గ ప్రకృతి సౌందర్యానికి పేరున్న దేశం నిరసనలతో దద్దరిల్లుతోంది. ఇండియా, చైనా, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ చేస్తున్న సాయంతో ప్రస్తుతానికి లంక గట్టెక్కవచ్చు. కానీ తన విధానాలను సరిదిద్దుకుంటేనే అంతిమ పరిష్కారం లభిస్తుంది. శ్రీలంకను మళ్లీ కల్లోల పరిస్థితులు చుట్టు ముట్టాయి. దేశ మంత్రివర్గం సామూహికంగా రాజీనామా చేసింది. ఇంధనం, ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడ టంతో ప్రజా నిరసనలు మిన్నుముట్టాయి. దీంతో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స అత్యవసర పరిస్థితి ప్రకటించారు. తిరిగి తొలగిం చారు. నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి కూడా విదేశీ మారక ద్రవ్యం తగినంతగా లేకపోవడంతో ప్రజలు తమకు కావలసిన వాటిని పొందడానికి గంటలపాటు క్యూలలో నిల్చోవాల్సి వస్తోంది. పైగా గంటలపాటు విద్యుత్ కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శ్రీలంక జనాభా 2.2 కోట్లు. నిసర్గ ప్రకృతి సౌందర్యంతో మెరిసే ఈ దేశం దశాబ్దాలపాటు కొనసాగిన అంతర్యుద్ధంలో 2009లో సైనిక విజయం పొందిన తర్వాత సాపేక్షంగా శాంతిని అనుభవించింది. అంతర్యుద్ధం చివరి సంవత్సరాల్లోనూ, ఆ తర్వాతా భారీగా రుణాలు తీసుకొంది. దేశ ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడానికి విదేశీ పెట్టుబడు లను తీసుకురావడంలో తనదైన మార్గంలో ప్రయాణించింది. ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంది. ఒక దశాబ్ద కాలంలో దేశ స్థూల ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది. దీంతో 2019లో శ్రీలంకను ఎగువ మధ్య ఆదాయ స్థితిని సాధించిన దేశంగా ప్రపంచబ్యాంకు కూడా మంచి ర్యాంకునిచ్చి కొనియాడింది. కరిగిపోయిన విదేశీ మారక నిల్వలు అయినా సరే స్వావలంబన లేని ఈ ఆర్థిక అద్భుతం చాలా కాలం కొనసాగలేదు. స్థూల దేశీయ ఉత్పత్తికి లాగే శ్రీలంక తీసుకున్న విదేశీ రుణాలు కూడా మూడురెట్లు పెరిగాయి. దీని ఫలితంగా ఎగువ మధ్య ఆదాయ దేశంగా శ్రీలంక సాధించిన విశిష్టమైన హోదా ఒకే ఒక్క సంవత్సరంతో గాల్లో కలిసిపోయింది. చాలా మీడియా సంస్థలు శ్రీలంకను రుణ ఊబిలో చిక్కుకున్న బాధితురాలిగా నివేదించాయి. అయితే దేశ ఆర్థిక సమస్యలు మరింత లోతైనవీ, బహుముఖీనమైనవీ. శ్రీలంక ప్రభుత్వ రుణాల్లో 14 శాతం వరకు చైనా నుంచి తీసుకున్నవే. కాగా అంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్ వాటా 36 శాతంగా ఉంది. అన్నిటికంటే మించిన సమస్య ఏమిటంటే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దశాబ్దాలుగా ఆర్థిక అవకతవకల సంక్షోభంలో కూరుకుపోయింది. ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణా పాటించకుండానే లంక ప్రభుత్వాలు వరుసగా రుణాల మీద రుణాలను తీసుకుంటూ దేశాన్ని అప్పుల ఊబిలోకి దింపేశాయి. లంక విదేశీ రుణం 51 బిలియన్ డాలర్లకు చేరుకుంది. పైగా వడ్డీలు చెల్లించడానికి ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 7 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయి. గత రెండేళ్ల కాలంలో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపుగా 70 శాతం వరకు కరిగిపోయాయి. ఇప్పుడు శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం కేవలం 2 బిలియన్ డాలర్లలోపు ఉంటోందంటే ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా శ్రీలంకలో కొనసాగుతూ వచ్చిన ఆర్థిక అవకతవకలు ప్రామాణికమైన ఆర్థిక సమస్యకు దారితీశాయి. అదేమి టంటే శ్రీలంక తన రాబడికి మించి ఖర్చుపెడుతూ వచ్చింది. పెరుగు తున్న లోటును సర్దుబాటు చేసుకోవడానికి అవసరమైన సరుకులు, సేవల ఉత్పత్తి కూడా లంకకు సాధ్యపడలేదు. ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన కొన్ని ఘటనలు ఈ వ్యవస్థీకృత ఆర్థిక సమస్యను మరింత విస్తృతం చేశాయి. కొన్ని బాహ్య కారణాలు కాగా, మరికొన్ని ప్రభుత్వ స్వయంకృతాపరాధం అనే చెప్పాలి. కుప్పకూలిన పర్యాటకం శ్రీలంక పర్యాటక పరిశ్రమ చాలా పెద్దది. దేశ ఆర్థిక వ్యవస్థకు 5 బిలియన్ డాలర్ల మేరకు పర్యాటక పరిశ్రమే దోహదం చేస్తోంది. 2018 సంవత్సరంలో శ్రీలంకను 20 లక్షలమంది పర్యాటకులు సందర్శిం చారు. 2019లో శ్రీలంక రాజధాని కొలంబోలో అత్యంత సమన్వ యంతో జరిగిన బాంబు దాడుల్లో 200 మంది ప్రజలు చనిపోయారు. దీంతో శ్రీలంకకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా తగ్గి పోయింది. ఆనాటి నుంచి పర్యాటక పరిశ్రమ పూర్తిగా కోలుకోలేదు. పైగా గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి తన వంతు పాత్ర పోషిం చింది. కోవిడ్–19 కారణంగా విదేశాల్లో పనిచేస్తున్న శ్రీలంక ప్రవా సుల నుంచి, వలస కార్మికుల నుంచి దేశం అందుకుంటున్న ‘రెమి టెన్స్ డబ్బు’ చాలావరకు తగ్గిపోయింది. శ్రీలంక ఆర్థిక కష్టాలకు ఉక్రెయిన్ యుద్ధం కూడా తోడయింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిపోవడంతో శ్రీలంకపై మరింతగా భారం పడింది. రష్యా నుంచి, ఉక్రెయిన్ నుంచి భారీ పరిమాణంలో ఆహార పదార్థాలను శ్రీలంక దిగుమతి చేసుకుంటోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా లంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం మరింతగా పెరిగింది. పైగా, శ్రీలంకను సందర్శిస్తూ వచ్చిన రష్యన్ పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. ఆర్థిక సంక్షోభానికి తోడు 2019లో లంక ప్రభుత్వం భారీగా పన్ను రాయితీలను ఇవ్వడం పరిస్థితిని మరింత విషమింప జేసింది. 2021లో దేశవ్యాప్తంగా రసాయనిక ఎరువులను నిషేధించాలని నిర్ణయించడంతో దేశంలో వరి, టీ ఉత్పత్తులు చాలావరకు పడి పోయాయి. తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారనుకోండి! శ్రీలంకలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభానికి విదేశీ రుణం, మహమ్మారి కొంత దోహదం చేసి ఉండవచ్చు కానీ పేలవమైన ఆర్థిక, ద్రవ్యపరమైన నిర్ణయాలే శ్రీలంక సంక్షోభానికి మూల కారణం అని చెప్పాలి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి ఆర్థిక సహాయం కోర కూడదని శ్రీలంక ప్రభుత్వం చాలాకాలం స్థిర నిర్ణయంతో ఉండింది. ఎందుకంటే ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకుంటే ఆర్థిక సంస్కర ణలను తీసుకురావల్సి ఉంటుంది. దీనివల్ల దేశ కరెన్సీని ఎక్కువగా కోల్పోవాల్సి ఉండటమే కాకుండా నిత్యావసర వస్తువుల కొరతను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే చాలాకాలంగా ఐఎంఎఫ్‌ని ఆశ్రయించడానికి బదు లుగా చైనా, భారతదేశం వైపు శ్రీలంక దృష్టి సారించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో శ్రీలంకకు భారత్ 1.5 బిలియన్ డాలర్లను రుణంగా ఇచ్చింది. వీటితో నిత్యావసర వస్తువులను, ఇంధనాన్ని కొనుక్కునే వెసులుబాటు లంకకు దక్కింది. అదే సమయంలో చైనా కూడా లంకకు 2.5 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక సహాయంగా ఇచ్చింది. చైనా, భారత్‌లు ఈ ద్వీపదేశాన్ని ప్రభావితం చేయడానికి పోటీ పడుతున్నాయి. అంటే షరతులు లేకుండా ఈ రెండు దేశాలు లంకకు మద్దతు ఇస్తాయని భావించాల్సిన పని లేదు. అయితేనేం, ఆర్థిక సంక్షోభం తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే శ్రీలంక చివరకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులను సహాయం కోసం అర్థించక తప్పడం లేదు. చైనా, భారత్, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుంచి అందే ఆర్థిక సహాయం, రుణాలు త్వరలోనే కొలంబో ఆర్థిక పరిస్థితిని సుస్థిరపరిచే అవకాశం ఉంది. అయితే దేశ ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక కారణాల కంటే రాజకీయ కారణాలే ఎక్కువ! జాతి కేంద్రకమైన జాతీయవాదం, మెజారిటీ సింహళ ప్రజలవైపు మొగ్గు చూపడం ఇప్పటికీ విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయి. పార్లమెంటులో 150 సీట్ల అఖండ మెజారిటీతో గెలుపొందిన గొటబయ రాజపక్స ప్రభుత్వంపై, ముఖ్యంగా రాజపక్స కుటుంబంపై లంకేయులు ప్రస్తుతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారంటే ఈ కుటుంబ రాజకీయ విధానాలు ఎంత ఏహ్యభావాన్ని వారిలో పెంచాయో అర్థమవుతుంది. అందుకే శ్రీలంకకు అందుతున్న బాహ్య సహాయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్క వచ్చు. కానీ దాని ఆర్థిక విధానాలను, అంతకు మించి తన రాజకీయ విధానాలను సరిదిద్దుకోకపోతే శ్రీలంక సమస్యకు అంతిమ పరి ష్కారం లభించడం కష్టసాధ్యమే! -అశోక్ స్వయిన్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఉప్సల యూనివర్సిటీ, స్వీడన్ (‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
చర్యలకు ఉపక్రమించిన అధ్యక్షుడు రాజపక్స.. లంక గట్టేక్కేనా?
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. ఆహార వస్తువుల కొరత, నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చోవడంతో.. పట్టెడన్నం తినలేక పస్తులుంటున్నారు లంక ప్రజలు. ఈక్రమంలో అప్పుల ఊబిలో చిక్కుకున్న దేశాన్ని గట్టెకించేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స చర్యలకు ఉపక్రమించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనల కోసం ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సలహా బృందాన్ని నియమించారు. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సలహా బృందాన్ని రాజపక్స నియమించారు. ఐఎంఎఫ్‌తో చర్చలు జరపడం, ప్రస్తుత రుణ సంక్షోభాన్ని అధిగమించడంపై మార్గదర్శకత్వం చేసే బాధ్యతలను ఈ బృందానికి అప్పగించారు.మరోవైపు.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. -
శ్రీలంక ప్రధాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏ క్షణం ఏం జరుగుతుందో?
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. ఏకంగా ప్రధాని మహింద్ర రాజపక్సే ఇంటిని ముట్టడించారు. పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బారికేడ్లు విరగొట్టి ప్రధాని ఇంటి వైపునకు ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రధాని ఇంటివద్దకు భారీ ఎత్తున పోలీసులు, ఆర్మీ బలగాలు చేరుకున్నాయి. ఇక ఆందోళనకారులు ప్రవేశించిన చోట విద్యుత్ నిలిపేసిన పోలీసులు వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పరిస్థితులు చేయిదాటిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని ఇంటి వద్ద లెవల్-2 సెక్యురిటీ లైన్ దాటితే టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మూడో లెవల్ సెక్యురిటీ లైన్ దాటితే కాల్పులు జరిపే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సిబ్బందిని పోలీసులు అక్కడ నుంచి దూరంగా పంపించివేశారు. (చదవండి: భారత్, మోదీపై లంక క్రికెటర్ సనత్ జయసూర్య ఆసక్తికర కామెంట్స్) -
మే చివరి నాటికి మునిగిపోవడమే..!
కొలంబో: దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదని శ్రీలంక ప్రభుత్వం తేల్చి చెప్పింది. తమ ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభాలను ఎదుర్కొంటుందని తెలిపింది. దేశంలో ఎమర్జెన్సీ విధించాలన్న గొటుబయ నిర్ణయాన్ని సమర్థించింది. ఆందోళనలను అణచివేసేందుకు గొటుబయ దేశంలో ఎమర్జెన్సీ విధించి అనంతరం ప్రజాగ్రహానికి తలవంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే! అధ్యక్ష పదవికి ఎన్నికైన గొటబయ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పార్లమెంట్లో ప్రభుత్వం చీఫ్ విప్, మంత్రి జాన్స్టన్ ఫెర్నాండో చెప్పారు. గతవారం దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని మంగళవారం రాత్రి గొటబయ రద్దు చేశారు. సభలో వాదనలు.. మంగళవారం పార్లమెంట్లో ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో సభను స్పీకర్ రెండుమార్లు వాయిదా వేశారు. లంకలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస మానవహక్కుల కార్యాలయం పేర్కొంది. శాంతియుత పరిష్కారం కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో పరిస్థితులు కొన్ని వారాలుగా క్షీణించాయని ఐరాస ప్రతినిధి లిజ్ చెప్పారు. మే నాటికి మునిగిపోవడమే! లంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు మే చివరికి మరింత ముదిరిపోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ఈ రెండు సంక్షోభాలకు తక్షణ పరిష్కారం చూడకపోతే భవిష్యత్‌లో భారీ మూల్యం తప్పదని ఆర్థికవేత్త జనక్ సింఘే చెప్పారు. కేబినెట్ నియామకాలపై అధ్యక్షుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వంలో చేరాలన్న ఆయన పిలుపునకు రాజకీయపార్టీలేవీ స్పందించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజపక్సే కుటుంబం కీలక పదవులన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుంది. సంక్షోభం ముదిరిపోవడంతో ఇప్పుడు పదవులు పంచుతామని పిలిచినా ఏ పార్టీ స్పందించడం లేదు. దీంతో అటు రాజకీయ, ఇటు ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. -
మైనార్టీలో ప్రభుత్వం.. ఎమర్జెన్సీ ఎత్తివేత!
శ్రీ లంకలో పరిస్థితి మరింతగా దిగజారింది. ఒక్కో వ్యవస్థ దారుణంగా పతనమైపోతోంది. తాజాగా ఎమర్జెన్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రకటించడంతో పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చాక శ్రీ లంకలో ఈస్థాయి సంక్షోభం తలెత్తడం ఇప్పుడే కనిపిస్తోంది. ఆర్థిక సంక్షోభంతో మొదలై.. ప్రజలను ఆగమాగం చేస్తోంది. ప్రజా నిరసనలతో దేశం అట్టుడికి పోతుండగా.. మరోవైపు మంత్రుల రాజీనామా, మైనార్టీలోకి పడిపోయిన ప్రభుత్వంతో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తింది. ఈ తరుణంలో మంగళవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించాడు. ► ప్రభుత్వం నుండి చట్టసభ సభ్యులు వాకౌట్ కావడంతో శ్రీలంక అధ్యక్షుడు ఎమర్జెన్సీ ఆర్డర్‌ను రద్దు చేశారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రేట్లు ఆకాశాన్ని అంటాయి. చివరకు టీవీ ఛానెళ్లను, పత్రికలను సైతం మూసేశారు. శ్రీ లంకలో ఐపీఎల్ టెలికాస్టింగ్ ఆపేశారు. ► మందుల కొరతతో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చివరకు ప్రాణాప్రాయ స్థితిలో ఉపయోగించే మందులకు సైతం కొరత ఏర్పడింది. దీంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతీ తెలిసిందే. ► ఇంకోవైపు ప్రభుత్వ కూటమి నుంచి మంది ప్రజాప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో 225 మంది సభ్యులున్న సభలో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన 113 మ్యాజిక్ ఫిగర్‌కు మహీంద రాజపక్స ప్రభుత్వం దూరమైంది. ప్రభుత్వం మైనార్టీలో పడింది. ► శ్రీ లంక పరిస్థితులను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో పాటు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం సైతం నిశితంగా పరిశీలిస్తోంది. ఘటనపై దర్యాప్తు శ్రీ లంక పార్లమెంటు దగ్గర పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. అయితే ఆ నిరసనల్లో ముసుగులు ధరించిన సైనికుల బృందం.. బైక్‌లపై గుంపు గుండా వెళ్లడంపై శ్రీలంక ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వా విచారణకు ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి. పార్లమెంటు ఆవరణలో జరిగిన నిరసనలో బైక్‌లపై వచ్చిన ఆర్మీ సైనికులకు, పోలీస్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు దృష్టికి రావడంతో ఆర్మీ కమాండర్ శవేంద్ర సిల్వా, ఐజిపిని ఘటనపై విచారణకు అభ్యర్థించినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ ఉంటుందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న క్రికెటర్లు
Top Sri Lanka Cricketers Back Anti Government Protests: ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లు, హెడ్ కోచ్‌లు గళం విప్పారు. తమ దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడానికి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడానికి శ్రీలంక ప్రభుత్వ తీరే కారణమని వారు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ దుర్భర పరిస్థితులకు కారణమయ్యారని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. లంకలో ఎమర్జెన్సీ విధించడం.. కఠినమైన కర్ఫ్యూ చట్టాలను అమలుచేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం.. వారి బాగోగులను గాలికొదిలేసి, నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమని అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడుతున్న న్యాయవాదులు, విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. జయవర్ధనేతో పాటు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సలు నిరసనకారులకు మద్దతు తెలిపారు. తాను భారత్‌లో ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ తన మనసంతా అక్కడే (శ్రీలంక) ఉందని రాజపక్స ఆవేదన వ్యక్తం చేయగా, నా దేశ ప్రజల దుస్థితి చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందంటూ సంగక్కర వాపోయాడు. సోమవారం కొలొంబోలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సంగక్కర భార్య యహేలి కూడా పాల్గొన్నారు. కాగా, శ్రీలంకలో ఆర్థిక ఎమర్జెన్సీకి తోడు ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ. 190, చక్కెర రూ. 240, పాల పౌడర్ రూ. 1,900, కోడి గుడ్డు రూ. 30 వరకు పలుకుతుంది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..! -
మరో మలుపు తిరిగిన శ్రీలంక సంక్షోభం..
-
Sri Lanka: మొత్తం మంత్రుల రాజీనామా.. ప్రధాని మాత్రం నో!
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. కేంద్ర కేబినెట్లోని మొత్తం 26 మంత్రులు తమ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ప్రభుత్వం విఫలమైందన్న కారణంతోనే తాము రాజీనామా చేస్తున్నట్లు మంత్రులు తమ లేఖల్లో పేర్కొన్నారు. అయితే.. ఆదివారం అర్ధరాత్రి లంక మంత్రులంతా తమ రాజీనామాలను ప్రధాని మహీందా రాజపక్సకు సమర్పించగా.. ప్రధాని పదవికి మాత్రం మహీందా రాజీనామా చేయడానికి సుముఖంగా లేనట్లుతెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపద్ధర్మ ప్రభుత్వం లేదంటే కొత్త కేబినెట్.. ఈ రెండు ఆఫ్షన్స్‌లో ఏదో ఒకదాంతో మహీందా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజపక్స కుటుంబ చిత్రం ఇక రాజీనామా చేసిన మంత్రుల్లో మహీందా తనయుడితో పాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులే కావడం విశేషం. దీంతో ప్రజావ్యతిరేకత కొంతైనా తగ్గుముఖం పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడు ప్రధాని మహీందా. ఇక కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా ఆదివారం పౌరులు, విద్యార్థులు, ప్రతిపక్షాలు కలిసి నిరసనలు వ్యక్తం చేయగా.. ఉద్రిక్తతలకు దారి తీశాయి. స్వాతంత్ర్యం వచ్చిన 1948 నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో అధిక ధరలు, కరెంట్‌కోతలు, నిత్యావసరాల కొరత.. చూస్తుండడం ఇదేమొదటిసారి. అందుకే ప్రజా వ్యతిరేకత పెల్లుబిక్కింది. సంబంధిత వార్త: లంకలో ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటంటే.. -
Sri Lanka: లంక పెను సంక్షోభం.. హింసాత్మకం!
శ్రీ లంక పెను ఆర్థిక సంక్షోభం హింసాత్మకంగా మారుతోంది. అధ్యక్ష భవనం ప్రజా ముట్టడిలో రణరంగాన్ని తలపించింది. గురువారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో ఓ పోలీస్ వాహానానికి నిప్పు అంటించడంతో పాటు పలు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ప్రతిగా పోలీసులు జరిపిన దాడిలో పలువురు పౌరులు గాయపడినట్లు తెలుస్తోంది. శ్రీ లంకను ప్రస్తుతం పెను ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. కరోనా నుంచి మొదలైన ఈ పరిస్థితి.. ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. టూరిజానికి భారీ దెబ్బ పడడం, అప్పుల ఊబిలో చిక్కుకుపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీటికి తోడు మార్చి 2020లో దిగుమతుల్ని నిషేధిస్తూ.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లంక పాలిట శాపంగా మారింది. ఫారిన్‌కరెన్సీని పొదుపు చేసి.. 51 బిలియన్ డాలర్ల అప్పుల్ని తీర్చాలన్న ప్రభుత్వ ఆలోచన బెడిసి కొట్టింది. నిత్యావసరాల కొరత, నిజంగానే ఆకాశాన్ని అంటిన ధరలు.. ఆఖరికి మంచి నీళ్లు కూడా బ్లాక్‌లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. పేపర్లు లేక పిల్లల పరీక్షలను సైతం వాయిదా వేశారంటే.. లంక సంక్షోభాన్ని అంచనా వేసుకోవచ్చు. మరోవైపు సరుకుల కోసం దొపిడీలకు పాల్పడుతున్నారు పలువురు పౌరులు. పరిస్థితులు తట్టుకోలేక దేశం దాటి పోతున్నారు మరికొందరు. అయితే ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడినా కూడా అధ్యక్షుడు గోటబయ రాజపక్స Gotabaya Rajapaksa పట్టన్నట్లు ఉండడంపై ప్రజాగ్రహాం పెల్లుబిక్కింది. గురువారం అర్ధరాత్రి ర్యాలీగా వెళ్లిన వేల మంది.. కొలంబోలోని అధ్యక్ష భవనం ముందు చేరి నిరసనలు చేపట్టారు. రాజీనామా డిమాండ్ నినాదాలతో హోరెత్తించారు. ఒకానొక తరుణంలో ఐదు వేలమందికి పైగా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు నిరసనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేయగా.. హింస చెలరేగింది. పోలీసుల మీదకు రాళ్లు, బాటిళ్లు రువ్వారు నిరసనకారులు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. పోలీసులను ప్రతిఘటిస్తూ.. రాత్రంతా అధ్యక్ష భవనం ముందే నిరసన వ్యక్తం చేస్తూ ఉండిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల ప్రతిదాడిలో పలువురు పౌరులు గాయాలపాలయ్యారు. అయితే నిరసన సమయంలో అధ్యక్షుడు ఇంట్లో లేడని తెలుస్తోంది. ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణకు సంబంధించి 45 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరిస్థితిని అడ్డుకుని ఉండకపోతే అధ్యక్ష భవనంపై దాడి చేసేవాళ్లని తెలిపారు. కుటుంబ పాలనతో సర్వనాశనం చేస్తున్నాడంటూ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడు కాగా, అతని సోదరుడు మహీంద రాజపక్సా ప్రధానిగా ఉన్నాడు. మరో సోదరుడు బసిల్ రాజపక్సా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నాడు. పెద్దన్న చామల్ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరో బంధువు నమల్ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా ఉన్నాడు. డీజిల్ కొరతతో 22 మిలియన్ల మంది 13 గంటలపాటు చీకట్లో ఉండిపోయారు. వేల కొద్దీ వాహనాలు రోడ్ల మీదే నిలిచిపోయాయి. మందులు లేక ఆపరేషన్లను సైతం ఆపేశారు. గత కొన్ని రోజులుగా లంక దుర్భేద్యమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అయితే బయటి దేశాల నుంచి అప్పులు తెచ్చి అయినా సరే పరిస్థితిని అదుపులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేస్తోంది. -
దిగజారిన పరిస్థితి.. ఏకంగా 10 గంటల పవర్ కట్! భారత్ ఏమంటోంది..
ప్రజల కనీస అవసరాలు తీర్చలేక ద్వీపదేశం శ్రీలంక అల్లాడిపోతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేశం విలవిల్లాడుతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. పెట్రోల్ నుంచి కూరగాయల వరకూ అన్నీంటికీ కొరతే. డీజిల్ లేక బంకులు మూతపడ్డాయి. ఔషధాల కొరతతో శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. అత్యవసరాలతోపాటు నిత్యావసరాలూ లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంధన కొరత కారణంగా శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కరెంట్ కోతలు పెరిగాయి. తాజాగా ఈ కోతల సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 7 గంటలపాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండగా.. దాన్ని 10 గంటలకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటలపాటు పవర్ కట్ ఉంటుంది. విద్యుత్ కోతలు పెరగడంతో లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక నగరాలు అంధకారంగా కన్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు క్యాండిల్ వెలుతురులో వ్యాపారాలు చేస్తున్నారు. మరోవైపు లంక దీనస్థితిపై భారత విదేశాంగమంత్రి జైశంకర్ ట్విట్టర్లో స్పందించారు. ఈ విషయంలో భారత్ ఎలా సహకరించగలదో తెలుసుకోమని మన దేశ రాయబారిని ఆదేశించారు. ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న శ్రీలంకకు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్నట్టు భారత్ ఇప్పటికే ప్రకటించింది. (చదవండి: రష్యా దురాక్రమణ.. ఆఫీస్‌కు లేటయి బతికిపోయాడు!) -
లంకలో ఆకలి కేకలు!
కోవిడ్ మహమ్మారి వల్ల 2020 మార్చిలో విధించిన లాక్డౌన్ శ్రీలంకలోని ప్రధాన రంగాలైన తేయాకు, వస్త్ర, పర్యాటకాల మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో స్థిరమైన ఆదాయ వనరులు లేని శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారింది. ఆ దేశపు విదేశీ మారకద్రవ్యం కూడా తరిగిపోయి నిత్యావసరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటూ లేకుండా పోయింది. దీంతో శ్రీలంక తన చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టోంది. లంక ప్రధాన ఆదాయ వనరైన టూరిజం... కోవిడ్ సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతింది. 2019లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు కూడా శ్రీలంక టూరిజంపై ప్రభావం చూపాయి. కరోనా సంక్షోభం సమయంలో చైనా నుంచి ఎడాపెడా అప్పులు చేయడం కూడా శ్రీలంక కొంప మునగ డానికి ఒక కారణం. నిత్యావసరాల విషయంలో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడడం సంక్షోభా నికి మరో కారణమైంది. శ్రీలంకలో విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోవడంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెట్రోల్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇంధన కొరత కార ణంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలకు, ఆందోళన లకు దిగుతున్నారు. పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పలు చోట్ల పెట్రోల్, డీజిల్ కోసం క్యూలో నిలబడి వయస్సు పైబడిన వారు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. పేపర్ల కొరత కారణంగా విద్యార్థుల అన్ని రకాల పరీక్షలను ఇప్పటికే నిలిపివేసింది శ్రీలంక సర్కార్. శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స ఇటీవల రెండు రోజుల పర్య టన కోసం భారత్ వచ్చి... అత్యవసరమైన ఆహారం, మందుల సేకరణ కోసం సహాయం అర్థించారు. మనకు శ్రీలంకకు మధ్య సంబంధాలు ఒకప్పటిలా లేనప్పటికీ... 1 బిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది భారత్. పెట్రోలియం ఉత్ప త్తులు కొనుగోలు చేసేందుకు మరో 500 మిలియన్ డాలర్ల రుణ సాయం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో గోటబయ రాజపక్స ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన కుటుంబ పాలన కొనసాగుతోంది. ప్రధానిగా అన్న మహీంద రాజపక్స, తమ్ముడు గోటబయ రాజపక్స అధ్యక్షుడిగా, మరో తమ్ముడు బసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. వీరు అనుసరిస్తున్న విధానాలు శ్రీలంకకు ఉరితాళ్లుగా మారాయి. రాజ పక్స కుటుంబం తలపెట్టిన ఆర్థిక, వ్యవసాయ విధా నాలు పూర్తిగా విఫలమయ్యాయి. పన్నులను బాగా తగ్గించడంతో రెవెన్యూ లోటు 2022 నాటికి 15 శాతా నికి చేరుకుంది. ద్రవ్యోల్బణం 17.5 శాతానికి పెరి గింది. నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. 2010 నుంచే విదేశీ అప్పులు అపరిమితంగా పెరిగి పోయాయి. విదేశీ అప్పులు 700 కోట్ల డాలర్ల వరకు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ దేశం వద్ద 230 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. ఎన్నికల ప్రయోజనాల కోసం స్వల్పకాలిక, స్వార్థ పూరిత తప్పుడు ఆర్థిక విధానాలు అమలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంకలో ధరలు ఆకాశాన్ని అంటు తున్నాయి. కిలో చికెన్ రూ. 800, కోడి గుడ్డు ఒక్కోటి రూ. 35, కిలో ఉల్లిపాయలు రూ. 200 – రూ. 250, కేజీ పాల పొడి రూ. 1,945, కేజీ గోధుమ పిండి రూ. 170–220... ఇవీ అక్కడి నిత్యాసరాల ధరలు! శ్రీలంక కొన్నేళ్ల క్రితం హంబటోటాలో చైనా పెట్టుబడితో ఒక భారీ పోర్టు ప్రాజెక్టును ప్రారంభిం చింది, కానీ వంద కోట్ల డాలర్ల ఆ ప్రాజెక్టు అప్పులు, చైనా కాంట్రాక్టర్ల కారణంగా వివాదంలో కూరుకు పోయింది. ఆ తర్వాత, అది ఏ మాత్రం లాభ దాయకం కాదని తేలడంతో పాటు రుణభారంతో కుంగిపోయింది. చాలా సందర్భాల్లో చైనా దగ్గర తీసు కున్న అప్పుల్ని తీర్చడానికి పేద దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శ్రీలంక దుస్థితికి చైనాకు చెల్లించా ల్సిన అప్పులూ ఒక కారణమే అనేది మరువరాదు. జాజుల దినేష్ వ్యాసకర్త పొలిటికల్ సైన్స్ లెక్చరర్ మొబైల్: 96662 38266 -
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక అతలాకుతలం
-
తప్పుల... అప్పుల... కుప్ప
Sri Lanka Economic Crisis: కప్పు టీ వంద రూపాయలు... కోడిగుడ్డు 35 రూపాయలు... కిలో చికెన్ వెయ్యి రూపాయలు... పచారీ కొట్ల దగ్గర క్యూలు... రోజూ ఏడెనిమిది గంటల విద్యుత్ కోతలు... నిత్యావసరమైన పాలు, పంచదార, బియ్యానికి రేషన్లు... ఆసియాలోనే గరిష్ఠ స్థాయికి ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యో ల్బణం పెరిగిన శ్రీలంకలో పరిస్థితికి ఇవి మచ్చుతునకలు. పెట్రోల్, కిరోసిన్‌ల కోసం కొండవీటి చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడి ఇద్దరు వృద్ధులు మరణించారట. ఆఖరికి ప్రింట్ చేసే కాగితం దిగుమతి చేసుకొనేందుకు విదేశీ మారక ద్రవ్యం కరవై, లక్షలాది స్కూలు విద్యార్థుల పరీక్షల రద్దు చేయాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన 1948 నాటి నుంచి ఎన్నడూ లేనంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక దుఃస్థితి ఇది. 2.2 కోట్ల జనాభా ఉన్న ఈ దక్షిణాసియా దేశం ఆదుకొనే దేశాలు, అంతర్జాతీయ సంస్థల కోసం ఆశగా చూస్తోంది. తరిగిపోతున్న దేశ ఆదాయ నిల్వలు, పెరిగిపోతున్న అప్పుల కుప్పల మధ్య తన ప్రధాన ఋణదాత చైనా మొదలు తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాకా పలువురి సాయం కోరాల్సి వచ్చింది అందుకే! శ్రీలంకలో ఇవాళ చివరకు జ్వరానికి వేసుకొనే పారాసెటమాల్ సహా అనేక ఔషధాల ధరలు 30 శాతం పైనే పెరిగాయి. ఒకప్పుడు పచారీ సరుకులకు 2 వేలైతే, ఇప్పుడు అంతకు మూడు రెట్లు ఎక్కువ చెల్లిస్తే కానీ ఆ మాత్రం ఇంటికి రావట్లేదు. శ్రీలంకలోని ఇలాంటి సామాన్యుల కష్టాల వెనుక పెద్ద కథే ఉంది. 2019లో గొటబయా రాజపక్స శ్రీలంక అధ్యక్షుడయ్యారు. అప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా ఉంది. తీవ్రవాదుల దాడులు, రాజకీయ సంక్షోభాలు దెబ్బతీశాయి. 2001 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. ద్వీపదేశానికి విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఆదాయ వనరు పర్యాటకులే. దాదాపు దశాబ్ద కాలం పాటు పెరుగుతూ వచ్చిన వారి సంఖ్య బాగా పడిపోయింది. ఆ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడు పన్నులకు కోత పెట్టారు. కరెన్సీ ప్రింట్ చేయడం మొదలెట్టారు. అధ్యక్షుడు, మంత్రులైన ఆయన సోదరులు, మేనల్లుళ్ళ అనాలోచిత చర్యలతో ద్రవ్యోల్బణం హెచ్చింది. పన్ను రాబడి పడిపోయింది. బడ్జెట్ లోటు పెరిగిపోయింది. శ్రీలంకను పాలించిన వరుస ప్రభుత్వాలు అధిక వడ్డీ బాండ్లు అప్పు తీసుకున్నాయి. దానికి చైనా, జపాన్ తదితర దేశాల నుంచి తీసుకున్న వందల కోట్ల అప్పులు తోడయ్యాయి. అలా తిరిగి చెల్లించాల్సిన విదేశీ ఋణభారం ఇంతలంతలు అయింది. వేలాది కోట్ల ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ కావడంతో శ్రీలంక ఇప్పుడు 600 కోట్ల డాలర్ల వాణిజ్య లోటుతో బండి నెట్టుకొస్తోంది. ముడి చమురు తీసుకొచ్చి నౌకాశ్రయంలో నౌకలు వేచి ఉన్నా, వాటికి చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డాలర్లు లేని పరిస్థితి. బస్సులు ఆగి, ప్రజా రవాణా సైతం స్తంభించే దశకు వచ్చింది. ఈ సంక్షోభ వేళ సర్కారీ బ్యాంక్ సైతం చేతులెత్తేయడంతో, డాలర్ మారకం విలువ ఇప్పుడు 280 రూపాయల స్థాయికి చేరింది. క్రెడిట్ రేటింగ్‌లో కిందకు జారిపోవడంతో, అప్పులు చేయలేని పరిస్థితి. సహజంగానే ఈ పరిణామాలన్నీ ప్రజల్లో ఆగ్రహావేశాలు రేపాయి. అధ్యక్షుణ్ణి ఇంటి ముఖం పట్టమంటూ అనేక పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరగడమే అందుకు నిదర్శనం. కరోనాతో సహా అనేక కష్టాలు మీద పడినప్పటికీ, దక్షిణాసియాలో తమ దేశం ఒక్కటే నెగటివ్ వృద్ధిలోకి రావడమేమిటని వారి ప్రశ్న. ఆర్థికంగా ప్రభుత్వం చేసిన అనేకానేక తప్పులు, నిర్వహణ లోపాలు, అవినీతి దీనికి ప్రధాన కారణాలని కార్యకర్తల మాట. రాజపక్సకు ఓటు బ్యాంకైన బౌద్ధ సింహళీయుల్లోనే ఆయనను వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. విదేశీ ఋణాల పునర్వ్యవస్థీకరించడంలో ప్రభుత్వం విఫలమైంది. గతంలో చేసినట్టు ఐఎంఎఫ్ నుంచి శ్రీలంక అత్యవసర ఋణం తీసుకోవాల్సింది. కానీ, ఆ పనీ చేయలేదు. ఐఎంఎఫ్ పెట్టే షరతుల వల్ల పొదుపు చర్యలు చేపట్టాలనీ, ప్రజాకర్షక వాగ్దానాల్ని పక్కన పెట్టాల్సి వస్తుందనీ, రాజకీయంగా నష్టపోతామనీ పాలకులు ఇష్టపడ లేదు. అనేక నెలల తర్జనభర్జన తర్వాత చివరకు ఇప్పుడు ఐఎంఎఫ్ సాయం కోరారు. అయితే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విదేశీ పర్యాటకుల సంఖ్య మళ్ళీ పెరుగుతుందనీ, ఎగుమతులు పెరుగుతాయనీ శ్రీలంక పాలకులు ఆశ పడుతున్నారు. కానీ, అది వట్టి దింపుడు కళ్ళం ఆశేనని నిపుణుల మాట. పైగా, దాని వల్ల ప్రస్తుత సంక్షోభం సమసిపోయే పరిస్థితి లేదు. తప్పుడు విధానాలతో ఆదాయాన్ని వృథా చేసిన పాలకుల వల్ల కొలంబో కష్టాల కడలిలో మునిగింది. ఆ మధ్య బీజింగ్‌కు దగ్గరవుతున్నట్టు కనిపిం చిన కొలంబో సంక్షోభవేళ మన దేశ సాయం కోరింది. మనం సాయం చేయడంతో గత ఏడాదితో పోలిస్తే ఇరుదేశల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. అయితే, 2019 నవంబర్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా తమిళ ఎంపీలను ఒక్కసారైనా కలవని రాజపక్స, శ్రీలంక సర్కారు తమిళ అంశంపై రాజకీయ పరిష్కారాన్ని సుదీర్ఘంగా సాగదీస్తూనే ఉంది. ఏమైనా, ఓటేసి ప్రస్తుత శ్రీలంక సర్కారును గద్దెనెక్కించిన వారంతా ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం అంటున్నారు. ఖర్చు లకు జీతాలు చాలక, ఉద్యోగమయ్యాక సాయంత్ర వేళల్లో ఆటో నడుపుతున్న ఇంజనీర్ల కథలిప్పుడు బోలెడు. ఇలాగైతే కష్టమని బతుకుతెరువు కోసం సౌదీ సహా వివిధ దేశాలకు ప్రయాణం కడుతున్న వారూ అనేకం. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి రావడమంటే ఇదే! వెరసి, ద్వీపదేశానికి ఇది అగ్నిపరీక్షా సమయం. పాలకుడు రాజపక్సకు భవిష్యత్తు గడ్డుకాలం. -
చేతులెత్తేసిన శ్రీలంక సర్కార్.. అల్లాడుతున్న లంకేయులు
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అల్లాడుతోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి నుంచి లీటర్ పెట్రోల్ వరకు ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్లో పోల్చిచే రూ. 275 ($1 = 275.0000 Sri Lankan rupees)కు చేరుకుంది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. ముడి చమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో ఆదివారం కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక రన్వాలా తెలిపారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 283కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. కాగా, వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్ వాడుతున్నారు.ఇక కోడి గుడ్డు ధర రూ. 35, కిలో చికెన్ రూ. 1000, కిలో ఉల్లి ధర రూ. 600, పాలపొడి ప్యాకెట్ ధర రూ. 250, టీ ధర రూ. 100కు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్ కోసం క్యూలో నిలుచున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతిచెందినట్టు లంక పోలీసులు తెలిపారు. వీరు ఇంధనం కోసం క్యూలైన్లో నిలుచుకొని అస్వస్థతకు గురై చనిపోయినట్టు కొలంబోలో పోలీసు ప్రతినిధి నలిన్ తల్దువా పేర్కొన్నారు. మరోవైపు లంకేయులు విద్యుత్ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్టు సమాచారం. -
ఇమ్రాన్ ఖాన్ కామెడీ.. పాక్‌లో నవ్వులు
ఛాన్స్ దొరికితే చాలు.. ప్రతీ అంశంలోనూ భారత్‌ను లాగి.. అక్కసు వెల్లగక్కుతుంటాడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఓ స్టేట్మెంట్ నవ్వులు పూయించడమే కాదు.. రాజకీయ విమర్శలకు, ఇంటర్నెట్లో సొంత ప్రజల నుంచే సెటైర్లు పడేలా చేస్తోంది. ‘ప్రపంచ దేశాలతో పాకిస్థాన్ చౌక దేశంగా ఉంది. చాలా వస్తువులు చీప్‌గా దొరుకుతున్నాయి. కానీ, ప్రతిపక్షాలేమో మమ్మల్ని చేతకానీ ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు. మేమేమో అన్ని సంక్షోభాల నుంచి దేశాన్ని రక్షిస్తున్నాం’ అంటూ రావల్పిండిలో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇక్కడితో పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, అతిశయోక్తికి పోయి.. భారత్‌ను లాగడంతో అసలు వ్యవహారం మొదలైంది. చాలా దేశాల కంటే పాక్ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని, ముఖ్యంగా భారత్ కంటే మెరుగ్గా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతే.. బిల్లు దేని కోసం ఖాన్ సాబ్? ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాక పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. చివరకు ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె సైతం చెల్లించలేని స్థితికి చేరుకుంది. ఈ తరుణంలో ఆర్థిక గండం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సాయం కోసం ప్రాధేయపడుతున్నాడు. అంతేకాదు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్ పెట్టిన ఎన్నో షరతులకు అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. సంబంధిత బిల్లుకు పార్లమెంటు ముద్ర వేయించేందుకు నానా పాట్లు పడుతున్నాడు. సొంత ప్రజలే ట్రోలింగ్ ఇమ్రాన్ ఖాన్ భారత్ మీద చేసిన కామెంట్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాలే సెటైర్లు పేలుస్తున్నాయి. ప్రతిపక్ష నేత పీఎంఎల్ ఎన్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని నేషనల్ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తాడు. ఒక వైపు అణుశక్తి దేశంగా ఉంటూ.. మరోవైపు చిప్ప పట్టుకుని అడుక్కోవడం ఎలా సాధ్యమవుతోందని? పైగా భారత్ లాంటి దేశం కంటే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నామంటూ ఎలా వ్యాఖ్యానిస్తారని ఇమ్రాన్ ఖాన్‌ను ఏకీపడేశాడు. ఇక దేశ ఆర్థిక పరిస్థితిని పీఎంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దివాలా తీయించిందని, కరోనా టైంలో అన్ని రంగాల్లో దెబ్బ తీసిందని, వ్యాక్సినేషన్ సంగతి ఏంటని?.. ఇంటర్నెట్లో పాక్ ప్రజలే ఇమ్రాన్‌పై మీమ్స్ వేస్తున్నారు. -
పైసల్లేవ్.. ఏం చేస్తారు? తిండి తగ్గించారు!
కరోనా వైరస్.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెట్టింది.. ఇంకా చూపెడుతోంది కూడా. కానీ, ఆ దేశంలో పరిస్థితిని మాత్రం ఘోరంగా దిగజార్చింది. వ్యవసాయం, విద్య, ఉద్యోగ, వ్యాపారం.. ఇలా ఎందులోనూ పైకి రాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏకంగా దేశాన్నే దివాళా వైపు అడుగులు వేయిస్తోంది. హిందూ మహసముద్ర ద్వీప దేశం శ్రీలంక.. ఆర్థిక-మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కరోనా సమయంలో తీవ్ర స్థాయికి చేరిన పరిస్థితులు.. అక్కడి పౌరుల జీవన ప్రమాణాలపై పెను ప్రభావం చూపెడుతున్నాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రభుత్వ ఖజానా ఎండిపోవడంతో 2022 దివాళా సంవత్సరంగా మారబోతోందన్న భయాందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి. పేదరికంలోకి.. శ్రీలంకలో ఈ కరోనా టైంలో ఐదు లక్షల మంది పావర్టీ లైన్ దిగువకు చేరుకున్నారని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. ఈ పరిస్థితి ఆ దేశం ‘పేదరికంతో ఐదేళ్లపాటు పోరాడడంతో సమానమ’ని అభివర్ణించింది కూడా. ఇక కిందటి ఏడాది నవంబర్‌లో ద్రవ్యోల్బణం 11 శాతం దాటగా, డిసెంబర్లో 12 శాతం పైనే కొనసాగింది. ఈ దెబ్బకి నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే.. మిలిటరీని రంగంలోకి దించి ప్రభుత్వ ధరలకే నిత్యావసరాలు అమ్మేలా చర్యలు చేపట్టారు. అయినా కూడా ప్రజలకు ఊరట లభించింది కొంతవరకు మాత్రమే!. తిండి తగ్గించారు.. రాజధాని కొలంబో సహా చాలా చోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన జనాభానే కనిపిస్తోంది. ఉద్యోగాలు పొగొట్టుకుని, ఉపాధి దొరక్క తిరుగుతున్నారు. అవసరాల కోసం బాకీలు చేయక తప్పడం లేదు. బాకీలు తీర్చే క్రమంలో తిండి తినడం తగ్గించేస్తున్నాయి కొన్ని కుటుంబాలు. ఒక్కరోజుకి సరిపడే సరుకుల్ని వారానికి సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దుకాణాలు సైతం యాభై, వంద గ్రాముల స్థాయి ప్యాకింగ్‌లు సైతం సిద్ధమవుతున్నాయి. కూరగాయల రేట్లు 50 శాతం రేట్లకు చేరడాన్నే వాళ్లు ఊరటగా భావిస్తున్నారంటే.. అంతకు ముందు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బియ్యం, బ్రెడ్డు, పాల కోసం భారీ భారీ ‘క్యూ’లు కడుతున్నారు జనాలు. పాత తరం ప్రజలకు ఈ పరిస్థితులన్నీ 70వ దశకంలో ఎదురైన సంక్షోభాన్ని గుర్తు తెస్తున్నాయట. అప్పులంక రుణాలు తీర్చడం ఎలా?.. ఇప్పుడు లంక ముందు ఉన్న అతిపెద్ద సమస్య. స్వదేశీ, విదేశీ రుణాలన్నింటిని కలిపి సుమారు 7.37 బిలియన్ డాలర్ల అప్పును ఈ ఏడాదిలో చెల్లించాల్సి ఉంది. ఒక్క చైనాకే 5 బిలియన్ డాలర్ల రుణం బాకీ పడింది. అంతేకాదు కరోనా టైంలో అత్యవసరాల కోసం బీజింగ్ నుంచి మరో 1 బిలియన్ డాలర్ల రుణం తీసుకుని.. దశల వారీగా చెల్లిస్తూ వస్తోంది. అయితే ఆర్థిక వేత్త, ప్రతిపక్ష నేత హర్ష డి సిల్వా అంచనాల ప్రకారం.. విదేశీ నిధుల నిల్వ-అప్పుల్ని బేరీజు వేసి మరీ ఈ ఏడాది అక్టోబర్ లోపే దేశం దివాళా తీయడం ఖాయమని చెబుతున్నారు. ఒకవైపు బాకీలు తీర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే చెబుతూనే.. మరోవైపు ఆర్థిక విపత్తుకు అవకాశం లేకపోలేదన్న వాదనను ప్రభుత్వం సైతం తోసిపుచ్చకపోతుండడం విశేషం. ప్రస్తుతం లంక ఖజానాలో విదేశీ కరెన్సీ నిల్వలు కేవలం 1.6 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. టూరిజం వల్లే ఇదంతా! కరోనా వల్ల శ్రీలంకకు భారీ దెబ్బ పడింది పర్యాటక రంగం విషయంలోనే!. సుమారు 2 లక్షల మంది టూరిజం సెక్టార్, ట్రావెల్ రంగాల ద్వారా ఉపాధి కోల్పోయారని ప్రపంచం ప్రయాణ, పర్యాటక మండలి చెబుతోంది. ఈ పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే.. చదువుకున్న యువత, విద్యావంతులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు పాస్‌పోర్ట్ ఆఫీసుల ముందు క్యూ కట్టేంతదాకా. బెడిసి కొట్టిన ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే నిర్ణయాలు తీసుకోకపోవడం ఒక ఎత్తయితే.. కరెన్సీ ముద్ర-ఎక్స్ఛేంజ్, ప్రభుత్వ పథకాల్లో ప్రయోగాలు ఇలా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తీసుకున్న కొన్ని నిర్ణయాలు సైతం లంక పరిస్థితిని మరింత దిగజార్చాయి. మే నెలలో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మీద నిషేధం విధించిన ప్రభుత్వం.. బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించింది. అయితే నష్టపోతామనే భయంతో చాలామంది వ్యవసాయం చేయలేదు. దీంతో ఆహార కొరత సమస్య తీవ్రంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యూటర్న్ తీసుకుని.. నిషేధం ఎత్తేయడం ఒక ఎత్తయితే, ఫర్టిలైజర్ల రేట్లు ఒక్కసారిగా పెంచడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు ఖజానాలు ఖాళీ అయిన పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక పొరుగు దేశాల నుంచి ఉత్పత్తులను, అప్పులను తీసుకుంది. అయితే అవి దీర్ఘకాలిక అప్పులు కాకపోవడంతో.. అధిక వడ్డీ రేట్లకు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పోషకాహార లోపం అక్కడ ప్రధాన సమస్యగా కొనసాగుతుండగా.. కరోనా విజృంభణ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. -
డెడ్‌లైన్ ఫినిష్.. పెనుసంక్షోభం అంచున చైనా!
కమ్యూనిస్ట్ కంట్రీ పెనుసంక్షోభం అంచున నిలిచింది. ఓవైపు కరోనా సవాళ్లు, మరోవైపు కార్పొరేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న అధ్యక్షుడు జింగ్ పిన్ నిర్ణయాలు, ఇంకోవైపు రియల్టి రంగంలో పెనుసంక్షోభంతో ప్రపంచంలోనే రెండో పెద్ద అర్థిక వ్యవస్థ చైనా పతనం దిశగా దూసుకుపోతోంది. తాజాగా చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్’(ఎవర్‌గ్రాండే)కి విధించిన డెడ్‌లైన్ ముగియడంతో దాదాపు డిఫాల్టర్ అయినట్లేనని భావిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరున్న ఎవర్‌గ్రాండ్.. చెల్లింపుల గడువు ముగియడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు సుమారు 300 బిలియన్ల డాలర్ల బాకీ పడిన ఎవర్‌గ్రాండ్.. గడువులోగా వడ్డీలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. ఆస్తులు అమ్ముకున్నా(కొన్ని ఒప్పందాలు కుదరలేదు కూడా) కూడా సమయానికి చెల్లించలేకపోయింది. దీంతో పతన భయంతో చైనా రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు వణికిపోతున్నాయి. ఫిట్చ్ ప్రకటన సోమవారం నాటికల్లా (డిసెంబర్ 6, 2021) దాదాపు 1.2 బిలియన్ డాలర్ల అప్పును ఎవర్‌గ్రాండ్ చెల్లించాల్సి ఉంది. కానీ, బుధవారం నాటికి కూడా చెల్లింపులు జరగకపోవడంతో.. కంపెనీ దాదాపు డిఫాల్ట్‌గా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఫిట్చ్.. ఎవర్‌గ్రాండ్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించడం విశేషం. రియల్టి రంగంపై చైనా ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం వల్లే ఎవర్‌గ్రాండ్ పతనం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను తట్టుకునేందుకు అడ్డగోలుగా డిస్కౌంట్లను ప్రకటించి.. ఇబ్బందుల పాలైంది ఎవర్‌గ్రాండ్. ఒకవేళ చైనాలో గనుక అతిపెద్ద కార్పొరేట్ పతనం ఏర్పడితే.. గ్లోబల్ మార్కెట్ సైతం కుదేలు కావడం ఖాయం. అప్పట్లో.. ఎవర్‌గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో షెంజెన్ కేంద్రంగా ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్గ్జౌ ఫుట్‌బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. చదవండి: ఎవర్‌గ్రాండ్ ఓనర్.. చినిగిన బట్టలతో బాల్యం.. కడుపు కాలి కుబేరుడు అయ్యాడు -
Afghan Crisis: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు
అనుకున్నదానికంటే వేగంగా అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. మూడు నెలల పాలనలో తాలిబన్లకు పెద్దగా చేయడానికి ఏం లేకుండా పోయింది. దీంతో అఫ్గన్ నేలకు తగిలిన ‘ఆర్థిక’ గాయం మానకపోగా.. పుండు మరింత పెద్దది అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభం చూడబోతున్నామన్న ఐరాస, కొన్ని ప్రపంచ దేశాల అంచనాలే నిజం కావడానికి ఎంతో టైం పట్టేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన మిలియన్ డాలర్ల సహాయం పత్తా లేకుండా పోయింది. అఫ్గనిస్తాన్‌కు చెందిన బిలియన్ల ఆస్తులు నిలిచిపోయాయి. ఆర్థిక ఆంక్షలు కొత్త ప్రభుత్వానికి గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏర్పడ్డ నగదు కొరత.. వ్యాపారాలు, బ్యాంకుల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఇక కరెన్సీ కొరత అఫ్గన్ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అకౌంట్లలో డబ్బులున్నా.. నిల్వలు నిండుకోవడంతో బ్యాంకులకు క్లోజ్డ్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరెన్సీ కోసం వందల కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకపోవడంతో దొరికిన వస్తువునల్లా తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి డబ్బును తెచ్చుకుంటున్నారు కొందరు. బ్యాంకుల ముందు నగదు కోసం బారులు తీరిన జనం ఉత్పత్తుల కొరతతో ఆహార, ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అఫ్గన్ అంతటా ఇదే పరిస్థితి. వీటికి తోడు ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా 30 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి పది లక్షల చిన్నారులు మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫర్నీచర్ అమ్ముకుని మరీ.. ఆర్థికంగా చితికిపోయిన వందల కుటుంబాలు రాజధాని కాబూల్ రోడ్ల మీదకు చేరి ఇంట్లోని సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తు మార్పిడికి పాల్పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు చిన్నపిల్లలతో నిండిపోతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేని తల్లిదండ్రులు.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేర్పిస్తున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఆధారపడడం వల్లే! అఫ్గనిస్తాన్ ఎన్నో ఏండ్లుగా దిగుమతి ఆహారం, నిత్యావసరాలు, ఇంధనాల మీదే ఆధారపడి ఉంటోంది. సొంతంగా ఎలాంటి వనరులను వృద్ధి చేసుకోలేదు. ప్రతీదానికి పొరుగు దేశాల వైపు చూస్తుండేది. తాలిబన్ ఆక్రమణ తర్వాత సరిహద్దులు కూడా మూసుకుపోవడంతో ఆహారం, మందులతో సహా అన్నింటి కొరత ఏర్పడింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసేది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేసేది ప్రభుత్వం. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక బైడెన్ ప్రభుత్వం ఏకంగా 9.5 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేసింది. అంతేకాదు అఫ్గన్ కేంద్రీయ బ్యాంక్‌కు అవసరమైన డాలర్ల పంపడం ఆపేసింది. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ఓ దేశం త్వరగతిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రపంచ సమాజం చూడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తాలిబన్ ప్రభుత్వానిది. గతంలో లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రైవేట్ సెక్టార్.. ఇప్పుడు మూగబోయింది. వచ్చే ఏడాది జూన్ కల్లా 97 శాతం అఫ్గనిస్తాన్ జనాభా దారిద్ర్యరేఖ దిగువకు మునిగిపోనుందని యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విశ్లేషించింది. దీనికితోడు ఉపాధి కరువు, అవినీతి, పేదరికం, కరువు.. తాలిబన్ పాలనలో అఫ్గన్ నేలను ఆర్తనాదాలు పెట్టిస్తోంది. కరెన్సీ కొరతను అధిగమించేందుకు విత్‌డ్రా కరెన్సీపై పరిమితులు విధించిన అఫ్గన్ ప్రభుత్వం.. చైనా, పాకిస్థాన్, ఖతర్, టర్కీ దేశాలకు ఆ లోటును పూడ్చేందుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు వీలైనంత మేర సాయం ద్వారా ఉపశమనం అందించాలని, లేదంటే యూరప్ దేశాలకు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్‌లో బైడెన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే.. మానవతా ధృక్పథంతో కొన్ని మినహాయింపులతో సాయం అందించేందుకు ఒప్పుకుంది. కానీ, ఆ మినహాయింపుల ద్వారా ఒరిగింది ఏంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ ఆంక్షలు ఇలాగే కొనసాగితే అఫ్గన్ పౌరుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ పరిణామాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయనేది నిపుణుల హెచ్చరిక. అయితే బిలియన్నర డాలర్ల సాయాన్ని తాజాగా ప్రకటించిన అమెరికా, యూరప్ యూనియన్లు.. అఫ్గన్ అంతర్గత వ్యవస్థ బలపడనంత వరకు మానవతా కోణంలో బయటి దేశాల నుంచి సాయం ఎంత అందినా లాభం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఆర్థిక సంక్షోభంగా మారకూడదు!: నిర్మలా
న్యూఢిల్లీ: కోవిడ్ ప్రేరిత ఆరోగ్య సంక్షోభం పూర్తిస్థాయి ఆర్థిక విపత్తుగా మారకుండా వర్థమాన దేశాలకు తగిన సహాయం అందించాలని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)సహా వివిధ బహుళజాతి రుణ సంస్థలకు భారత్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విజ్ఞప్తి చేశారు. మనీలా (ఫిలిప్పైన్స్) ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడీబీ, గవర్నర్ల బోర్డు 54వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించారు. వర్థమాన దేశాలపై దీర్ఘకాలంలో మహమ్మారి ప్రభావం పడకుండా చూడడానికి ‘‘సమన్వయ, సమ్మిళిత’’ అంతర్జాతీయ వ్యూహం అవసరమని ఆమె ఈ వెర్చువల్ సదస్సులో పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో జరిగిన రెండవ ఏడీబీ గవర్నర్ల బోర్డ్ వెర్చువల్ సమావేశమిది. తాజా సమావేశంలో ఆర్థికమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►2020 తొలి ఆరు నెలల కాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్నీ కరోనా ప్రేరిత సవాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అయితే అటు తర్వాత మళ్లీ రికవరీ జాడలు కనిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త కేసుల నేపథ్యలో ఆర్థిక రికవరీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుతం మనముందు ఉంది. ►ప్రపంచ ఆర్థిక ఫలాలను సంరక్షించుకోడానికి అభివృద్ధి చెందిన దేశాలు, అలాగే బహుళజాతి బ్యాంకింగ్ సంస్థలు వర్థమాన సభ్య దేశాల (డీఎంసీ) తరఫున నిలవాలి. ►జాగ్రత్తగా పరిశీలిస్తే, కొన్ని సంవత్సరాల నుంచీ పేదరికం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే 2020వ సంవత్సరం.. ఒక్కసారిగా 7.8 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టేసింది. సంపద అసమానతలు భారీగా పెరిగిపోయాయి. ►మహమ్మారి తలెత్తడంతోటే ఈ సవాళ్లను అడ్డుకోడానికి ఏడీబీ తన వంతు ప్రయత్నాన్ని సమర్థవంతంగా నిర్వహించింది. దేశాల ఎకానమీలు, అలాగే ఆరోగ్య వ్యవస్థలకు తోడ్పాటును అందించింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ విస్తృతికి కృషి చేస్తోంది. భారత్ విషయంలో కోవిడ్, నాన్–కోవిడ్ ప్రాజెక్టులకు ఏడీబీ సకాలంలో తగిన మద్దతును అందజేసింది. ►గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో క్షీణతలోకి జారిపోయింది. వృద్ధి రికవరీలో తీవ్ర విఘాతం ఏర్పడింది. వర్థమాన దేశాల దీర్ఘకాల పురోభివృద్ధి లక్ష్యాలను గండి పడింది. ►కోవిడ్ తదనంతర ఎకానమీలు కోవిడ్ ముందస్తు ఎకానమీల అంత పటిష్టంగా ఉండజాలవు. దీర్ఘకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని దేశాల సమన్వయ సహకారం అవసరం. ►2021–22లో 12.5 శాతం పటిష్ట వృద్ధి ఉంటుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలతో 2021ని భారత్ ఎంతో ఆశావహంగా ప్రారంభించింది. అయితే దేశం ప్రస్తుతం సెకండ్‌వేవ్ కోవిడ్ సవాళ్లను ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్య రక్షణ వ్యవస్త తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఎకనమీ రికవరీ ప్రక్రియకు తాజా పరిస్థితి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మద్దతుగా సహాయం అందిస్తున్న అంతర్జాతీయ సమాజానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుం టోంది. కోవిడ్ బారిన పడిన ప్రజలకు సకాలంలో చికిత్స అందేందుకు తగిన కృషి జరుగుతోంది. అదే సమయంలో ఎకానమీ పట్టాలు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కష్టాల నుంచి భారత్ గట్టెకుతుందన్న గట్టి విశ్వాసం ఉంది. ►దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థాన్ని పెంచుతున్నాము. వ్యాక్సినేషన్ విస్తృతికి తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నాము. ►ఏడీబీ రుణ సామర్థ్యాలు మరింత పెరగడానికి తగిన చర్యలు ఉండాలి. సావరిన్ రుణాల విషయంలో ఏడీబీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రైవేటు రంగ భాగస్వామ్యం ఆకర్షణ విషయంలో బ్యాంక్ మరింత తగిన , వినూత్న ఫైనాన్షింగ్ ఇన్స్ట్రమెంట్స్ను ఆవిష్కరించాలి. ప్రైవేటు రంగంలో మరింత క్రియాశీల చర్యల కోసం ముంబైలో ప్రైవేట్ రంగ ఆఫరేషన్స్ బ్రాంచ్ ఆఫీస్‌ను ఏడీబీ ఏర్పాటు చేయాలి. ►ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి ఉద్ధేశించిన సౌత్ ఆసియా సబ్–రీజినల్ ఎకనమిక్ కో–ఆపరేషన్ (ఎస్ఏఎస్ఈసీ) సెక్రటేరియట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని ఏడీబీని కోరుతున్నాం. ఆరోగ్య రంగంపై పెట్టుబడులే కీలకం: ఏడీబీ ఇదిలావుండగా, మహమ్మరి కరోనా సవాళ్ల నుంచి బయటపడ్డానికి ఆరోగ్యం, విద్య, సామాజిక రంగాలపై పెట్టుబడులే ప్రస్తుతం కీలకమని ఏడీబీ బుధవారం పేర్కొంది. ఆయా అంశాలతో పాటు సమగ్ర ప్రాంతీయ సహకారం ప్రస్తుతం ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కీలకమని తెలిపింది. బుధవారం ముగిసిన మూడు రోజుల గవర్నర్ల బోర్డ్ సమావేశంలో ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకావా మాట్లాడుతూ, కోవిడ్–19 కష్టాల నుంచి ఆసియా గట్టెక్కుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.పర్యావరణం, అసమానత, మౌలిక రంగం, ప్రాంతాయ సహకారం, వనరుల సమీకరణ వంటి అంశాల్లో సాధించిన ప్రగతిని మించి కోవిడ్–19పై ఈ ప్రాంతం విజయం సాధిస్తుం దన్న భరోసా ఉందని అన్నారు. ఇందుకు ఏడీబీ తగిన సహాయసహకారాలను అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే 20 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఏడీబీ అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే సహకారం మున్ముందూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే మహమ్మారి వల్ల ఏడీబీ ఇప్పటికే చేపట్టిన పథకాల అమల్లో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తబోవన్నారు. -
‘కోవిడ్-19 సంక్షోభం సమసిపోలేదు’
న్యూయార్క్ : కోవిడ్-19తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తొలుత భయపడినంతగా కుప్పకూలకపోయినా అది సృష్టించిన సంక్షోభం ఇంకా సమసిపోలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. కరోనా విధ్వంసంతో ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొన్నాఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి అంచనాలు కొంతమేర పెంచే వెసులుబాటు కలిగిందని వచ్చేవారం జరగనున్న ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంక్ సమావేశాలకు ముందు ఆమె వ్యాఖ్యానించారు. ఈ భేటీలో తాజాపరిచిన వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ ప్రపంచబ్యాంక్‌కు సమర్పించనుంది. ప్రపంచ జీడీపీ వృద్ధి దాదాపు ఐదు శాతం తగ్గుతుందని ఐఎంఎఫ్ ఈ ఏడాది జూన్‌లో అంచనా వేయగా, రెండు, మూడు త్రైమాసాల్లో ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా వెల్లడయ్యాయి. చదవండి : రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం కరోనా వైరస్‌తో ప్రభావితమైన వ్యక్తులు, సంస్ధలకు ప్రభుత్వాల నుంచి ఊతం లభించడంతో ప్రపంచ వృద్ధి రేటు పుంజుకుందని ఆమె పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న సాయం ముందస్తుగా నిలిపివేయరాదని, వచ్చే ఏడాది వృద్ధిరేటు అంచనాలపై అనిశ్చితి నెలకొన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. పది లక్షల మందిని బలిగొన్న అనంతరం కూడా ఈ వైపరీత్యం ఇంకా సమసిపోయేందుకు చాలా దూరంగా ఉందని అన్నారు. అన్ని దేశాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకునేందుకు సుదీర్ఘ అసమాన పోరాటం చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా, యూరప్‌ల్లో భయపడినంతగా ఆర్థిక సంక్షోభం లేదని, చైనా అనుకున్నదాని కంటే వేగంగా కోలుకుంటోందని అన్నారు. అల్పాదాయ దేశాల్లో మాత్రం పరిస్థితి భయానకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలను కాపాడుకునేందుకు ఖర్చు చేయాల్సిన రీతిలో వనరులు అల్పాదాయ దేశాలకు అందుబాటులో లేవని అన్నారు. నిధుల విడుదల, రుణ పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలతో ఆయా దేశాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
పీఎస్ఎల్పై అక్తర్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)పై మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ సంచన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పీఎస్ఎల్ నిలదొక్కుకోవడం కష్టమేనన్నారు. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ జట్లును అమ్ముకోడానికి సిద్దంగా ఉన్నాయని తెలిపాడు. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చిలో జరగాల్సిన ఈ లీగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్ వరకు పూర్తిస్థాయిలో క్రికెట్ కార్యకలాపాలు జరిగే అవకాశాలు లేవని, దీంతో మరో 16 నుంచి 18 నెలల లోపు పీఎస్ఎల్ నిర్వహించడం సాధ్యం కాదని తేల్చిచెప్పాడు. (వధువు లేని పెళ్లిలా ఉంటుంది... ఆ ఆట!) ఆర్థికంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ పీఎస్ఎల్ ఫ్రాంచైజీలను డబ్బులు అడిగే సాహసం చేయదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే పీఎస్ఎల్ కథ సమాప్తం కానివ్వనని, ఈ లీగ్ సజావుగా సాగేందుకు అవసరమైన ఆర్థిక, ఇతరాత్ర సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నానని అక్తర్ పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ నిర్వహణ అనేది ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ చేతుల్లో లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపాడు. అయితే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజల ఆరోగ్యానికే ఆసీస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నానని అక్తర్ పేర్కొన్నాడు. (‘ధోనిని మిస్సవుతున్నా.. మళ్లీ ఆ రోజులు రావాలి’) -
టాప్–3లో భారత్
లండన్: ప్రపంచ దేశాల సైనిక వ్యయం గత పదేళ్లలో 2019లోనే భారీగా పెరిగిందని ఓ అధ్యయనం తేల్చింది. ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించిన మొదటి మూడు దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆసియాలోని చైనా, భారత్ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) అనే సంస్థ ఓ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి కారణంగా మున్ముందు సైనిక వ్యయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ► 2019లో ప్రపంచ దేశాల సైనిక వ్యయం 1,917 బిలియన్ డాలర్లు. 2018తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ. ► మొత్తమ్మీద టాప్–5 దేశా(అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా)ల వ్యయం 62 శాతంగా ఉంది. ► సైనిక వ్యయం ఎక్కువచేస్తున్న దేశాల్లో అమెరికా టాప్‌లో ఉండగా, చైనా, భారత్ 2, 3 స్థానాల్లో, రష్యా నాల్గో స్థానంలో నిలిచాయి. ► ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా వాటా 38 శాతం. 2019లో అమెరికా సైనిక వ్యయం అంతకు ముందు ఏడాది కంటే 5.3 శాతం పెరిగి 732 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ► 2019లో చైనా సైనిక వ్యయం 261 బిలియన్ డాలర్లు కాగా, 2018తో పోలిస్తే ఇది 5.1శాతం ఎక్కువ. అదే భారత్ విషయానికొస్తే 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ► ఆసియాలో శక్తివంతమైన జపాన్ 47.6 బిలియన్ డాలర్లు, దక్షిణకొరియా 43.9 బిలియన్ డాలర్లు సైనికపరంగా వెచ్చించాయని సిప్రి తెలిపింది. -
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
సాక్షి, తిరువనంతపురం : వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఇపుడు కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతోంది. కరోనా విలయం, లాక్డౌన్ తో రాష్ట్రం భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి టి.ఎం థామస్ ఐజాక్ శనివారం ఆందోళన వెలిబుచ్చారు. లాక్ డౌన్ విధించిన నెల రోజుల తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు. కేంద్రం ఇచ్చేదానిని చేర్చినట్లయితే, రాష్ట్ర ఖజానా రూ .2,000 కోట్లకు చేరుతుంది. జీతాల చెల్లింపు కోసం తమకు 2,500 కోట్ల రూపాయలు అవసరమని ఐజాక్ తెలిపారు. దీంతోప్రస్తుత పరిస్తితుల్లో ట్రెజరీని మూసివేయాల్సిన పరిస్థితి రానుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక నెల జీతం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ అభ్యర్థించామన్నారు. ఈ నిధులను సిఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్ తరలించి బాధితుల అవసరాలకు వినియోగించాలన్న ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ సహా వివిధ సిబ్బంది సంస్థలు వ్యతిరేకించడంతో ఈ విషయంలో ముందుకు పోలేకపోతున్నామని, ప్రతి నెలలో ఆరు రోజుల జీతం ఐదు నెలల వరకు కోత విధింపునకు నిర్ణయించామన్నారు. వచ్చే నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుత సంక్షోభం సమయంలో ఇదే ఏకైక మార్గంగా భావించామని, ఈ డబ్బును తిరిగి చెల్లిస్తామని ఆయన చెప్పారు. (కరోనా: ఈ వీడియో చాలా ప్రత్యేకం) (అద్భుతం : మనకీ ధైర్యం పెరుగుతుంది) కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉద్యోగుల నెల జీతంలో కోత విధిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట మంత్రివర్గం ఆమోదం లభించిన ఈ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రాష్ట్ర అనుబంధ పరిశ్రమలు, యూనివర్శిటీలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల నెల జీతంనుంచి 6 రోజుల జీతం కోత అయిదు నెలలపాటు వుంటుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇ-కామర్స్ కంపెనీలకు మరో షాక్) -
న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్ మీడియాను ఆదుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఐఎన్ఎస్ కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్‌ను 100% పెంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బకాయిలన్నీ తక్షణమే సెటిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. ‘ముద్రణ వ్యయాలు అధికంగా ఉండే పత్రికలకు ప్రకటనల ఆదాయాలే కీలకం. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు మూతబడి, ప్రకటనలు లేకపోవడంతో ఆదాయవనరు కోల్పోయినట్లయింది’ అని గుప్తా వివరించారు. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి పత్రికలు ఇప్పటికే ప్రచురణ నిలిపివేశాయని, మిగతావి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇవి కూడా కుప్పకూలిన పక్షంలో దేశీ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదన్నారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు డెలివరీ బాయ్స్ దాకా చాలా మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా కోలుకునేందుకు తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ట్రంప్‌కు హెచ్-1బీ వీసా ఉద్యోగుల అభ్యర్థన?
వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఉన్న అనేక దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా అతలాకుతలం అవుతోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రపంచం ఆర్ధిక మాంద్యం వైపు పరుగులు తీస్తోంది. దీంతో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా పై అమెరికాలో పనిచేస్తున్న వారు ఉద్యోగం కోల్పొతే తమ వీసా గడువును ప్రస్తుతమున్న 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. టెక్నికల్ సహాయం కోసం కొంతమంది ప్రొఫెషనల్స్‌ని కంపెనీలు అమెరికాకు పిలిపించుకొని పనిచేయించుకుంటాయి. అటువంటి వారు హెచ్-1బీ వీసాపై వచ్చి అమెరికాలో కొంత కాలం పనిచేసి వారి దేశాలకు తిరిగి వెళతారు. అయితే కరోనా విజృంభించిన కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న వారే ముందు వరుసలో ఉన్నారని పలు కంపెనీలు ఇప్పటికే వారి ఉద్యోగులకు సంకేతాలు ఇచ్చాయి. సాధారణంగా హెచ్-1బీ వీసా పై వెళ్లిన వారు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం పొందక పోతే వారు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. అయితే కరోనా కారణంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించి అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేశాయి. అదేవిధంగా ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ విదేశాల నుంచి కూడా ఎవరిని వారి దేశానికి రానివ్వడం లేదు. హెచ్-1బీ వీసాపై వెళ్లిన వారిలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. అయితే హెచ్-1బీ వీసా ఉండి ఉద్యోగం కోల్పోయిన వారు నిరుద్యోగులకు ప్రభుత్వం అందించే ఏ ప్రయోజనాలు పొందలేరు. అదేవిధంగా వారి జీతం నుంచి ప్రతి నెల సామాజిక భద్రత ప్రయోజనాల కోసం కొంత మొత్తం కట్ అవుతున్నా ఈ సమయంలో అవి కూడా వారికి అందించరు. కరోనా ఎఫెక్ట్ కారణంగా అమెరికాలో 47 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్1బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని, కరోనా కారణంగా ప్రపంచమంతా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలవాలంటూ చాలా మంది అభ్యర్థిస్తున్నారు. అయితే ఈ విషయంపై వైట్‌హౌస్ నుంచి స్పందన రావాలంటే లక్షల మంది పిటిషన్ ఇవ్వాలి. ఇప్పటికే దీనికి సంబంధించి 20,000 లకు పైగా సంతకాలు స్వీకరించారు. ట్యాక్స్‌ల రూపంలో హెచ్1బి ఉద్యోగులు ఐటీ కంపెనీలకు అండగా నిలుస్తున్నారు. ఈ కష్టకాలంలో తమకు అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7,82,365 కరోనా కేసుల నమోదు కాగా 37,582 మంది చనిపోయారు. అమెరికాలో అత్యధికంగా 1,61,807 కరోనా కేసులు నమోదయ్యాయి. (హెచ్-1బీ వీసా : పరిమితి ముగిసింది) -
ఆర్థిక సంక్షోభానికి విరుగుడు వ్యవసాయమే
డిసెంబర్ 3న జరిగిన వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘మనిషి జీవితంలో, దేశాభి వృద్ధిలో వ్యవసాయం ప్రాముఖ్యత’’ అనే అంశంపై జరిగిన విస్తృ తమైన చర్చల్లో పలు మౌలిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా, నేడు ప్రతి మనిషి తన జీవితంలో వ్యవసాయానికి ఉన్న స్థానాన్ని, ప్రాముఖ్యతను గుర్తించగలుగుతున్నాడా? తమ ఆహార భద్రత వ్యవసాయంతోనే ముడిపడి ఉందన్న వాస్తవం ఎంతమంది ప్రజలకు తెలుసు? వ్యవసాయ ప్రాముఖ్యతను ప్రభుత్వాలే విస్మరిస్తున్నప్పుడు.. ప్రజలను తప్పుపట్టాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశం అయ్యాయి. నేటికీ 70% మందిపైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే అతిపెద్ద రంగం వ్యవసాయమని.. ఇందులో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అవగాహన ఉన్న వారు కొంతమందే. కొన్ని దేశాల్లో వ్యవసాయ విద్యకు ఉన్న డిమాండ్ ఇతర రంగాల్లోని విద్యకు లేదు. వివిధ పంటలపై పరిశోధన, నూతన వంగడాల వృద్ధి, చిరుధాన్యాలసాగు, నూనెగింజల పరిశోధన, అభి వృద్ధి.. మొదలైన అంశాలలో పుష్కలమైన అవకాశాలు ఇక్కడి విద్యార్థులకు కూడా ఉన్నాయి. కానీ, వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే సాహసం చాలామంది చేయడం లేదు. ప్రైవేటీకరణ, ఉదారవాద విధానాలు, ప్రపంచీకరణల మేలు కలయికగా చెప్పబడే ఈ నయా ఉదార ఆర్థిక విధా నాలు దేశంలో మొదలైన క్షణం నుంచే వ్యవసాయ రంగానికి పెను సవాళ్లు మొదలయ్యాయి. సన్న, చిన్నకారు రైతాంగం నడ్డి విరగడం మొదలైంది అప్పుడే. రైతాంగానికి ఇన్పుట్స్ అందించడంలో ప్రభుత్వ చొరవ తగ్గింది. పారి శ్రామికాభివృద్ధి పేరుతో వ్యవసాయోగ్యమైన భూములను రైతుల నుండి బలవంతంగా సేకరించి పారిశ్రామిక వేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ఆర్థిక సంస్కరణల్లో ప్రధాన ఎజెండాగా మారింది. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా క్రమేపీ 14 శాతానికి దిగజారింది. వ్యవసాయాభివృద్ధి రేటు ఇతర రంగాల కంటే కనిష్టంగా నమోదు కావడం 1995 తర్వాత ఎక్కువైంది. బ్యాంకింగ్ రంగంపై అంతకుముందున్న నియంత్రణ సడలిపోవడంతో జాతీయ బ్యాంకులు సైతం తమ సామాజిక బాధ్యత నుండి వైదొలగాయి. చిన్న, సన్నకారు రైతులకు రుణాలు అందించడం తగ్గించి.. పారిశ్రామిక వేత్తలకు నామమాత్రపు షూరిటీపై వందలకోట్ల రుణాలు ఉదారంగా అందించడం, పర్యవసానంగా వారు వేలకోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం పెట్టడం పరిపాట య్యింది. దీంతో, గ్రామీణ ప్రాంత రైతాంగం విధిలేని పరిస్థితుల్లో అధిక వడ్డీపై అప్పులు చేస్తున్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భాగంగా ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)తో 1995లో చేసుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు దేశ వ్యవసాయరంగాన్ని సంక్షోభ స్ధాయికి చేర్చాయి. దేశంలోకి ఆహార ధాన్యాలతోపాటు హార్టికల్చర్, వంటనూనెలు, డెయిరీ, ఫిషరీస్ ఉత్పత్తులు కూడా దేశంలోకి కుప్పలుతెప్పలుగా వచ్చి పడటం మొదలైంది. ఎగుమతుల అవకా శాలు పెరుగుతాయని మభ్యపెట్టినప్పటికీ.. అటువంటి అవకాశాలు దేశ రైతాంగానికి దక్కలేదు. మరోపక్క సేంద్రియ ఎరువుల వాడకాన్ని తగ్గించి అధిక ఉత్పత్తి కోసం పంటపొలాల్లో హానికర రసాయనిక ఎరువులు, నియంత్రణ లేకుండా పురుగు మందుల్ని విని యోగించే విధానాలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం పెరిగింది. ఫలితంగా భూసారం తగ్గిపోయింది. పర్యావరణ సమస్యలు ఎక్కువయ్యాయి. వీటన్నింటి కారణంగానే.. గత 10 సంవత్సరాలలో దేశంలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా.. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 నుండి నేటి వరకు దేశంలో దాదాపు 8 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ సందర్భంలో ‘వ్యవసాయం దండగకాదు.. పండుగ’ అని చాటిచెప్పి, రైతులలో భరోసా నింపిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2003లో వైఎస్ చేపట్టిన పాదయాత్రలో.. వ్యవసాయ రంగానికి 9 గంటలు ఉచిత విద్యుత్ వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చాక నిలు పుకొన్నారు. నాటి నుంచి నేటివరకు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అన్నది ఆక్సిజన్‌లా పనిచేస్తూనే ఉంది. 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం అందించే నగదుకు తోడుగా ప్రకటించిన ‘వైఎస్సాఆర్ రైతు భరోసా’ ఓ వినూత్న పథకం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసి రైతాంగానికి ఏడు మార్గాల ద్వారా రైతులకు ఆదాయం అందించడంపై దృష్టి పెట్టింది. అనేక కోణాల నుంచి ముప్పేటన దేశాన్ని ఆవరించిన ఆర్థిక మాంద్యం దేశ ప్రజలకు శరాఘాతమే. దీన్ని అధిగమించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా తమవంతు సామాజిక బాధ్యతగా వ్యవసాయ రంగంలో విరివిగా పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. క్యూబాలో సంక్షోభం ఏర్పడినప్పుడు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎంత చిన్న స్థలం ఉన్నా.. ఆహార పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం మొదలుపెట్టారు. తమ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా.. సహకార పద్ధతిలో ఇచ్చిపుచ్చుకోవడం, మిగు లును మార్కెట్లో అమ్మి లాభాలను పంచుకోవడం చేశారు. జపాన్‌లో కూడా ఇదే విధానంలో రెండో ప్రపంచయుద్ధం మిగిల్చిన విషాదాన్ని అధిగమించి తొలినాళ్లలో వ్యవసాయరంగం ద్వారానే తమ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసుకున్నది. ప్రజా భాగస్వామ్యంతో వ్యవసాయం అనే విధానం క్రమంగా అనేక దేశాలకు విస్తరించింది. పొలం నుంచి పళ్లెం వద్దకు అనే ప్రాతిపదికపై సీఎస్ఏ (కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్)లు పనిచేస్తున్నాయి. ఈ విధానాన్ని దేశంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలి. పౌర సమా జం భాగస్వామ్యం వహించాలి. ఆర్థిక మాంద్యం తట్టుకోవడానికి వ్యవసాయాన్ని ఆలంబనగా చేసుకోవాలి. వ్యాసకర్త, చీఫ్ విప్, ఏపీ శాసనమండలి, డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. -
ఈనెల 4న విపక్షనేతలతో సోనియా భేటీ
-
మా మేనిఫెస్టో నుంచి దొంగిలించండి
న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ గురించి ఓనమాలు కూడా తెలియవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో నుంచి ఆలోచనలను, ప్రణాళికలను దొంగిలించాలని అని హితవు పలికారు. ‘సాధారణంగా గ్రామీణ వినియోగం, పట్టణ వినియోగం కన్నా ఎక్కువ వేగంతో పెరుగుతుంటుంది. కానీ సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో అది రివర్స్ అయింది. గత ఏడేళ్లలోనే కనిష్ట స్థాయిలో గ్రామీణ వినియోగం ఉంది’ అంటూ వచ్చిన ఒక మీడియా రిపోర్ట్‌ను ప్రస్తావిస్తూ.. ‘గ్రామీణ భారతం సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఏం చేయాలో తెలీని స్థితిలో కేంద్రం ఉంది’ అని ట్వీట్ చేశారు. ప్రజల దృష్టి మరలుస్తుంటారు మహేంద్రగఢ్: దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారని రాహుల్ విమర్శించారు. నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్(గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్– జీఎస్టీ)ల కారణంగా వ్యాపార వర్గాలు భారీగా నష్టపోయాయన్నారు. కాగా, ఢిల్లీకి తిరిగి వచ్చే సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం సరిగా లేకపోవడంతో ఓ గ్రౌండ్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. గ్రౌండ్లో ఉన్న వారితో కలసి క్రికెట్ ఆడి అనంతరం రోడ్డు మార్గంలో ఢిల్లీ వెళ్లిపోయారు. -
బ్యాంకుల విలీనంతో ఆర్థిక సంక్షోభం
సాక్షి, సుజాతనగర్: కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను విలీనం చేయడం వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధి రేటు 7 శాతం అని కేంద్రం అంటున్నా అది 5 శాతానికి మించలేదన్నారు. ప్రైవేటీకరణలో భాగంగానే బ్యాంకులను కుదించారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్డెట్, ఇతర అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రజలకు మొండి చెయ్యే మిగిలిందని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని, ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. నిరుద్యోగభృతి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదన్నారు. పెట్టుబడి సాయం కోసం 9 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్లో తిరుగుబాటు మొదలైందని, ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని చెప్పారు. రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఇతర వామపక్ష పార్టీలను కలుపుకుని ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట రాష్ట నాయకులు కాసాని ఐలయ్య, మండల కార్యదర్శి వీర్ల రమేష్ ఉన్నారు. -
అధ్వాన్న దిశగా మన ‘ఆర్థికం’
ప్రస్తుతానికి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం పెద్ద గీత ముందు చిన్నగీతను చూసినట్టు ఉంటుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ఇంకా మిగిలుందనే విశ్వాసాలను గౌరవిస్తూ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యాంశాలు చూద్దాం. ఆకస్మిక లేదా తక్షణ ఆర్థిక సమస్యలను ఎదుర్కోడానికి ఆర్బీఐ వద్ద సరయిన క్యాపిటల్ ఉందా లేదా అన్నది ప్రాథమికంగా చూడాలి. అభివృద్ధి చెందిన దేశాలలో సెంట్రల్ బ్యాంకులు 13–14 శాతం ఆస్తులు రిజర్వ్‌గా ఉంచుకుంటున్నాయి. మనం కేవలం 7 శాతం మించకుండా పెట్టుకున్న రిజర్వ్ ఇది. దేశంలో జరిగే ద్రవ్య లావాదేవీలకు కావాల్సిన వెసులుబాటు ఇప్పుడు ఆర్బీఐకి లోపించింది. కశ్మీరులో 370వ ఆర్టికల్ రద్దు జరిగాక – మన దేశభద్రత విషయంలో విదేశీ మదుపుదార్లు అప్రమత్తంగా ఉంటున్నారు. మన దేశ స్థితి ’ప్రస్తుతానికి బాగలేదు’ నుంచి ’అధ్వానం’ దిశగా వెళుతోందనేది సుస్పష్టం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి అక్షరాలా రూ. 1.76 లక్షల కోట్లను డివిడెండ్ పేరుతో బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇది భారతీయ ఆర్థిక శాస్త్రంలోనే చారిత్రక సంఘటన. 1990లలో లిబరలైజేషన్ జరగడానికి ముందున్న సంకట సమయంలో కూడా ఈ చర్య తీసుకోలేదు. ఇలా చేయడం తప్పాఒప్పా అని చూడ్డం ఒక కోణం అయితే, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందా అనేది మరో కోణం. ప్రస్తుతానికి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం పెద్ద గీత ముందు చిన్నగీతను చూసినట్టు ఉంటుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ఇంకా మిగిలుందనే విశ్వాసాలను గౌర విస్తూ ముందు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యాంశాలు చూద్దాం. ఇది పూర్వపు గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ప్రతిపాదించిన సూత్రంప్రకారం ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా ఇలా చేయడం జరిగింది. ఆకస్మిక లేదా తక్షణ ఆర్థిక సమస్యలను ఎదుర్కోడానికి ఆర్బీఐ వద్ద సరి అయిన క్యాపిటల్ ఉందా లేదా అన్నది ప్రాథమికంగా చూడాలి. మన రూపాయి విలువ అనుకోని విధంగా క్షీణించినా లేదా పెరిగినా, మన దగ్గర తాత్కాలిక లిక్విడిటీ సమస్యలు ఏవన్నా వచ్చినా, బాండ్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం అవసరం. అలాంటి వాటి కోసం ఆర్బీఐ కొంత డబ్బు వెనకేసుకుని ఉంటుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో భాగంగా కొంచెం కొంచెం రిజర్వుగా పెట్టుకుంటూ వచ్చింది. అందులో డివిడెండ్ రూపంలో ప్రభు త్వానికి ప్రతి సంవత్సరం ఏభై, అరవై వేల కోట్లు ఇచ్చుకోగా మిగిలించుకుంటూ వచ్చిన క్యాపిటల్ అది. అభివృద్ధి చెందిన దేశాలలో సెంట్రల్ బ్యాంకులు 13–14 శాతం ఆస్తులు రిజర్వ్‌గా ఉంచుకుంటున్నాయి. మనం కేవలం 7 శాతం మించకుండా పెట్టుకున్న రిజర్వ్ ఇది. ఇప్పటికి సుమారు రూ. 2.4 లక్షల కోట్ల ఆపత్కాల నిధి ఉంటే అందులో నుండి రూ. 1.23 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా నిశితంగా ఈ ‘వెసులుబాటు భావాన్ని’ అర్థం చేసుకోవాలంటే ‘తలసరి’ లెక్కన చూడాలి. ఆర్థిక సమస్య తీవ్రత అంచనా దొరకదు. మనకుండే ఆస్తులను మనం ఎంతమందిమి పంచుకుంటున్నాం అన్నది ఒక ఆర్థిక శాస్త్రవేత్తకుండాల్సిన సెన్సిటివిటీ. ఒక వ్యక్తికి ఎంత సంపాదించే సామర్థ్యం ఉంది, అందులో సగటున మనం ఎంత రిజర్వ్‌గా వాడుకుంటున్నాం అన్నది ముఖ్యం. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడ్డం అంటే వ్యక్తుల సముదాయం, సంస్థల సముదాయం కష్టాల్లో పడ్డట్టు. వ్యక్తిగత స్థాయిలో కాకుండా ఒక సమూహంగా మనం కేంద్రస్థాయిలో కొంత రిజర్వ్ ఏర్పాటు చేసుకుంటాము. ఆ కోణంలో చూస్తే – మన రిజర్వ్ శాతం అభివృద్ధి చెందిన దేశాల రిజర్వ్ శాతంతో పోలిస్తే కనీసం ఐదోవంతు కూడా ఉండదు. ఇలా అత్యవసర నిధి ప్రపంచంలో అతి తక్కువగా ఉన్న దేశాలలో మనదొకటి. అంత తక్కువలో ఉన్నది ప్రభుత్వానికి ఇచ్చేసి వాడుకోమంటున్నాం. దానివలన భవిష్యత్తులో ఏదైనా అనుకోని విపత్తు వస్తే ఆర్బీఐ తట్టుకునే సామర్థ్యం కోల్పోతుంది. మన జీడీపీ సుమారు 190 లక్షల కోట్ల రూపాయలు. మన సేవింగ్స్ రేటు అతి తక్కువ స్థాయిలో ఉంది. 2008లో 37 శాతంగా ఉన్న ఈ సేవింగ్స్ రేటు ఇప్పుడు 30 శాతానికి పడిపోయింది. అంటే వ్యక్తిలేదా సంస్థ స్థాయిలో మనకుండే వెసులుబాటులో నాలుగో వంతు ఇప్పటికే తగ్గిపోయింది. మన దేశంలో జరిగే ద్రవ్య లావాదేవీలకు కావాల్సిన వెసులుబాటు ఇప్పుడు ఆర్బీఐకి లోపించింది. అంటే – రేపు చైనా, అమెరికా వ్యాపార ఘర్షణ వలన రూపాయి దెబ్బతిన్నా, మన బాండ్ మార్కెట్లో వడ్డీరేట్లు అస్తవ్యస్తతకు గురైన సందర్భాలను ఎదుర్కోవడంలో ఆర్బీఐ శక్తి సామర్థ్యాలు బాగా తగ్గుముఖం పట్టినట్టే. ఇంతకుముందులా నమ్మకంగా వేలకోట్లు మార్కెట్లో పెట్టేసి అడ్డుపడి సమతూకంగా వ్యవహరించే స్థితి ఇక ఆర్బీఐకి లేదు. ఇది వాస్తవం. సింపుల్‌గా చెప్పాలంటే మన ఆర్థిక వ్యవస్థను దేహంగా భావిస్తే, మనలో కొవ్వు రూపంలో నిలువ ఉన్న సొమ్ము ఈ ఆర్బీఐ రిజర్వ్. ఇది కాస్తా సగానికి పైగా కరిగిపోయింది. మన శక్తి లోపించే కొద్దీ కొవ్వు కరిగిపోతే ఇక ఉన్న కండలు కరిగించాల్సిన పరిస్థితి వస్తుంది అని సాధారణ పరిభాషలో చెప్పుకోవచ్చు. ఉదాహరణకు కశ్మీరు విషయంలో 370 ఆర్టికల్ రద్దు జరిగాక – మన దేశభద్రత విషయంలో విదేశీ మదుపుదార్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ఒక్క జూలైలోనే విదేశీ వ్యవస్థాగత మదుపుదార్లు సుమారు రూ. 8,000 కోట్లను దేశంనుంచి ఉపసంహరించారు. మనదేశంలో ఉండే రాజకీయ పరిస్థితుల వలన, అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఘర్షణ వలన ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా వెళుతుందో ఇతమిద్దంగా చెప్పడం కష్టం. ఫైనాన్స్ దిగ్గజం ఐఎల్ఎఫ్ఎస్ ఊహించని విధంగా కూలిపోవడం మన ఆర్థిక వ్యవస్థకు ఒక షాక్. అలాగే దీవాన్ లాంటి పెద్ద హౌసింగ్ సంస్థలు ఇకపై లోన్లు ఇవ్వలేని స్థితికి వచ్చి, డీఫాల్ట్ చేస్తున్నపరిస్థితి ఊహించనిది. కేవలం గత సంవత్సరంలోనే బ్యాంకింగ్ రంగంలో బయటపడిన మోసం విలువ రూ. 70,000 కోట్లు. ఇవి మనం ముందే ఊహించి ప్లాన్ చేసుకున్న పరిణామాలు కావు. ఇవన్నీ ఆర్థికవ్యవస్థలో కరిగిపోతున్న మన ఆస్తి విలువలు. ఒక్క ఐఎల్ఎఫ్ఎస్ కరిగిపోవడంతో రమారమి లక్షకోట్ల ప్రాజెక్టులు నిధులు పొందే సామర్థ్యం మనదగ్గర క్షీణించింది. ఈవిధంగా మనం ప్రతి బ్యాంకులో ప్రస్తుతం ఉన్న సంస్కృతి చూస్తూ పోతే కొన్నిలక్షల కోట్ల ప్రాజెక్టులకు నిధులు అందచేయగలిగే సామర్థ్యం ఇప్పటికే కోల్పోయాం. ఈ పరిస్థితి అంతా గమనిస్తే– మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళడానికి కావాల్సింది మన దగ్గర ఎన్నడూలేని విధంగా పడిపోతున్న గ్రామీణ వినియోగ సామర్థ్యం పెరగడం. అధిక జనాభా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. స్వేచ్ఛగా ఖర్చు పెట్టడం కూడా పట్టణ స్థాయిలో బాగా దెబ్బతిన్నది. వీటి కోసం మనం చిన్నతరహా, మధ్యతరహా సంస్థలను ప్రోత్సహించాల్సి ఉంది. మొండి బకాయిల బూచి చూపించి మనం అప్పులు ఇవ్వడం ఆపేస్తే ఇక ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. నిజానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారులైన పెద్ద సంస్థల వలన జరిగినవే ఎక్కువ శాతం. మొత్తం లోన్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల శాతం 10 కంటే తక్కువ ఉండొచ్చు. వాస్తవానికి అది ఎక్కువే. అయితే – నూరుశాతం అప్పు తీసుకున్న వాళ్ళు ఎగవేయడానికి తీసుకుంటారనే భావంతో పోలిస్తే మాత్రం తక్కువే. ఈ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకి అందవలసిన అప్పుల కోసం ఒక రిస్క్ కుషన్ ఏర్పాటు చేసుకోవలసి ఉంది. పెద్ద బ్యాంకులను విలీనం చేసే ఆలోచన చేసిన ప్రభుత్వం ఈ రూ. 1.76 లక్షల కోట్లలో రూ. 70,000 కోట్లు బ్యాంకులకు ఇచ్చి ఇదెలా సాధించగలదో మనకు ఇప్పటికీ తెలీదు. మిగతా డబ్బులు ప్రభుత్వం ఈ సంవత్సరం తగ్గిన పన్నుల చెల్లింపులు పూరించడానికి వాడుతుందని తెలిసింది. బదిలీ అయిన ఈ మొత్తం డబ్బును ప్రభుత్వం ఎలా వినియోగం చేస్తుందనేది కీలకమైనప్పుడు, ఇది కేవలం ద్రవ్యలోటుకు వాడుకోడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనేది నిరాశాజనకమైన విషయం. ప్రాజెక్టులకు నిధులు ఆగిపోయిన ఈ పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు పెరిగి, సామాన్య మానవుడి ఆదాయ స్థాయి పెంచాల్సిన దిశగా ఈ డబ్బు ఉపయోగపడదు అనేది విదితం. మన దేశ స్థితి ‘ప్రస్తుతానికి బాలేదు’ నుంచి ‘అధ్వానం’ దిశగా వెళుతోందనేది సుస్పష్టం. మన ఆర్బీఐ కష్టమొస్తే కోలుకునే శక్తి ఇంతకు ముందులా ఉండబోదు. సామాన్యుడికి అందని ఈ సూక్ష్మ విషయాలు ఇకపై తప్పనిసరిగా వ్యక్తిగత క్షేమం దృష్ట్యా గమనంలో ఉంచుకోవాల్సి ఉంది. ప్రముఖ ఆర్థికవేత్త అన్నట్టు ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు పెంపుడు కుక్క కూడా బిస్కెట్లు దొరికే పరిస్థితి ఉందా లేదా అని ఆలోచిస్తుందట. ప్రభుత్వం ఈ డబ్బుతో మేజిక్ చేసే పరిస్థితిలో లేదు. అందుకు పాలసీ స్థాయిలో నిర్ణయాలు అవసరం. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులపై ట్యాక్స్ తీసేయడం లాంటివి గొప్ప ఊపిరి పీల్చుకునే చర్యలు కావు. ప్రభుత్వమే ముందుపడి అమలు చేసే ప్రాజెక్టులను త్వరితగతిన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వ సంస్థల నుండి రావల్సిన బకాయిలను వెంటనే వ్యవస్థలోకి తేవాల్సి ఉంది. ముఖ్యంగా – మన దేశం కాంగ్రెస్ పాలన నుంచి ఇప్పటిదాకా కూడా ‘పాలసీ బాటిల్ నెక్స్’తో సతమతమౌతూనే ఉంది. ఇవేవీ మనం పట్టించుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు ఇలా కొవ్వు కరిగించుకుంటాం? వ్యాసకర్త: పి. విక్టర్ విజయ్ కుమార్ ఇన్వెస్డ్మెంట్ బ్యాంకర్, భారీమౌలిక పరిశ్రమల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఈ–మెయిల్ : pvvkumar@yahoo.co.uk -
కొనుగోలు శక్తి పెంపే కీలకం
కీలకరంగాల్లో వృద్ధిరేటు వేగంగా పడిపోవడం, బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోవడం, రూపాయి విలువ పతనం, నిరుద్యోగిత తారస్థాయికి చేరడం, వస్తుసేవల వినియోగం తగ్గుముఖం పట్టడం, దేశంలో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతుండటం.. ఇవన్నీ దేశ ఆర్థిక జవజీవాలు ప్రమాదంలో పడుతున్నాయని సంకేతిస్తున్నాయి. వినియోగదారుల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లడం అనే ఒకే ఒక కారణంవల్లే దేశ స్థూల ఉత్పత్తికి ఊపిరినిచ్చే కీలకరంగాలు ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా బలహీనతకు లోనవుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి ఎంత బలంగా ఉంటే అంతగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం అన్నది ఏ ప్రభుత్వానికైనా అతిపెద్ద సవాలు. అదే లక్ష్యం కూడా. దీన్ని పక్కనబెట్టి ఆర్థిక మాంద్యానికి అరకొర మందులు ఎన్ని వేసినా ఫలితం శూన్యమే. తుపాను ముందు ఏర్పడే ప్రశాంతత మాదిరిగా.. తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభానికి ప్రతీకగా దేశ ఆర్థికరంగం నిస్తేజంగా తయారైంది. ఆర్థికరంగం మందగమనం దుష్ఫలితాలు పలు రంగాలలో అనేక రూపాల్లో కనపడుతున్నాయి. కీలకరంగాల్లో వృద్ధిరేటు వేగంగా పడిపోతున్నది. బంగారం ధర అనూహ్యంగా పెరుగుతున్నది. రూపాయి విలువ పతనం చెందుతున్నది. 4 దశాబ్దాల కనిష్టానికి నిరుద్యోగిత చేరింది. అదేవిధంగా, దేశంలో వస్తుసేవల వినియోగం తగ్గింది. విదేశీ ఎగుమతులు మందగించాయి. మౌలిక సదుపాయాల రంగంలో జరిగే ప్రభుత్వ వ్యయంలో క్షీణత నమోదవుతున్నది. ప్రైవేటు పెట్టుబడులు నిరుత్సాహంగా ఉన్నాయి. నిజానికి, దేశంలో ఇప్పటికే మాంద్యం ఏర్పడిందన్న వాదన కూడా విన్పిస్తున్నది. కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలకే ఎసరొస్తున్న దీనావస్థ అందుకు ప్రధాన సంకేతం. ఇవన్నీ తీవ్రమైన ఆర్థిక మందగమనానికి సాక్ష్యాలు. ఆర్థిక మందగమనానికి, మాంద్యానికి తేడా ఉందని.. ప్రస్తుతం దేశంలో ఏర్పడింది ఆర్థిక మందగమనమే తప్ప.. మాంద్యం కాదన్న వాదన కూడా విని పిస్తున్నది. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వరుసగా రెండు త్రైమాసికాలలో వృద్ధిరేటు క్షీణించినపుడు.. ముఖ్యంగా, దేశంలో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నప్పుడు.. దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ఎవరికైనా ఆందోళన కలగడం సహజం. మందగమనమైతే ఆర్థిక రంగం త్వరితగతిన కోలుకొనే అవకాశం ఉంది. అదే మాంద్యం అయితే.. కోలుకోవడానికి దీర్ఘకాలం పడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కావడానికి ప్రధాన కారణం.. వినియోగదారుల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లడమే. ఈ ఒక్క కారణంగానే దేశ స్థూల ఉత్పత్తికి ఊపిరినిచ్చే కీలకరంగాలు ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా బలహీనతకు లోనవుతున్నాయి. దేశంలో వాహనరంగం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. వాహన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. కొన్ని కంపెనీలైతే తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేశాయి. డీలర్ల వద్ద కార్ల నిల్వ పెరిగిపోయింది. కార్ల తయారీ కంపెనీలు కొన్ని వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా అధిక వేతనాలు అందుకొనే ఉద్యోగులను తొలగించడానికి సిద్ధపడుతున్నాయి. వాహన విక్రయాలు తగ్గడంతో పరికరాల తయారీ పరిశ్రమపైన ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితి మెరుగుపడనట్లయితే.. దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న దేశీయ ఆటో మొబైల్ రంగంలో ఏకంగా 10 లక్షల మేర ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందని ‘ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎమ్ఏ)’ స్పష్టం చేసింది. స్థిరాస్తి రంగంలోనూ ఇదే పరిస్థితి. చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరల్లో పెరుగుదల లేకపోగా క్రయవిక్రయాల లావాదేవీలు మందగించాయి. 250 అనుబంధ పరిశ్రమలకు మూలాధారంగా ఉన్న నిర్మాణ రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా అనేక దుష్ఫ లితాలు కన్పిస్తున్నాయి. ఇటుకలు, సిమెంట్, ఉక్కు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, తదితర రంగాలు అమ్మకాలు లేక వెలవెలపోతున్నాయి. జీఎస్టీ భారాన్ని తగ్గించాలని, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, రుణ లభ్యత పెంచాలని నిర్మాణ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకొంటున్నాయి. ఐదు రూపాయలకు లభించే బిస్కెట్ ప్యాకెట్లు సైతం ఇంతకుముందులా వేగంగా అమ్ముడు కావడం లేదని తయారీ సంస్థలు పేర్కొంటున్నాయంటే.. ప్రజల కొనుగోలు శక్తి ఏవిధంగా తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. రూపాయి క్షీణత, పెద్దనోట్ల రద్దు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో రెండేళ్లుగా ఒడిదుడుకులకు లోనవుతున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరింత సంక్షోభంలో కూరుకొనిపోయింది. ముఖ్యంగా.. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే మార్గాల్లో ఒకటైన ఎగుమతులు పడకేశాయి. 2013–14లో 31,488 కోట్ల డాలర్ల మేర జరిగిన ఎగుమతులు 2017–18 నాటికి 30,331 కోట్ల డాలర్లకు పడిపోయాయి. అయితే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఎగుమతులపై ఆధారపడకపోవడం కొంత మేలైంది. అయితే, ఆర్థికరంగానికి వెన్నెముకగా నిలిచే ప్రైవేటు పెట్టుబడులను పరిశీలిస్తే 2011 వరకూ సగటున రూ. 25 లక్షల కోట్లుగా నమోదు కాగా, ఆ మొత్తం 2018– 19 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.5 లక్షల కోట్లకు పడిపోయింది. దేశంలో పెట్టే మొత్తం పెట్టుబడుల్లో.. దాదాపు 66%గా ఉండే ప్రైవేటు పెట్టుబడులు 2018–19 ఆర్థిక సంవత్సరంలో 47%నికి క్షీణించాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గడిచిన పదేళ్లలో ఏడేళ్లుగా క్షీణిస్తున్నది. రూపాయి క్షీణత వల్ల దేశీయ కార్పొరేట్ సంస్థల్లో విదేశీ మదుపరుల వాటాలు, ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులు పడిపోతున్నాయి. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఈ అంశాలు దేశంలో నగదు నిల్వల తగ్గుదలకు కారణం అవుతున్నాయి. వేధిస్తున్న నగదు లభ్యత మొండి బకాయిలు (ఎన్పిఏ) కారణంగా బ్యాంకులు రుణాల మంజూరును కఠినతరం చేయడంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎన్నడూ లేనివిధంగా నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రజల కొనుగోళ్లు, వినియోగం తగ్గాయి. వివిధ పరిశ్రమల టర్నోవర్‌లో క్షీణత నమోదవుతున్నది. ఫలితంగా.. ప్రభుత్వానికి పన్నులు, ఇతరత్రా రూపేణా సమకూరే ఆదాయం తగ్గింది. దీంతో ఆయా రంగాల్లో ప్రభుత్వ వ్యయం పడిపోయింది. రెండు, మూడేళ్ల ముందు వరకూ ప్రభుత్వ వ్యయంలో వృద్ధి ఏడాదికి సగటున 19% ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది దాదాపుగా 10%కి పరి మితం అయింది. దీంతో దేశ వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్ఠస్థాయికి చేరుకొని 6.3% వద్ద నిలబడింది. కేంద్రం దిద్దుబాటు చర్యలు ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం లక్షణాలపై కేంద్రం అప్రమత్తం అయింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించి కొన్ని చర్యలు చేపట్టారు. సంపద సృష్టించే వారికి తమ ప్రభుత్వం మద్దతు ఉంటుందని ప్రకటించడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. కేంద్రం తీసుకున్న చర్యలను పరిశీలించినట్లయితే.. ద్రవ్య లభ్యత పెంచడానికి బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తున్నారు. రెపో రేట్ల కోత బదిలీలకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, జలాన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్బీఐ బోర్డ్ ఆమోదముద్ర వేయడం గొప్ప ఊరట. ఈ నిధుల లభ్యతతో ఆర్థిక వృద్ధిరేటును మెరుగుపర్చడం సాధ్యపడుతుంది. ఇదికాక మొత్తంగా రూ. 5 లక్షల కోట్ల నగదు చలామణిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గృహ, వాహన, ఇతర రిటైల్ రుణాలు చౌకగా అందిస్తున్నట్లు ప్రకటించారు. వాహనాల పన్నుల్లో కోత విధించడం, ప్రభుత్వమే భారీగా కార్లు కొనడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. ఏంజెల్ పన్ను వల్ల ఇబ్బందుల పాలవుతున్న స్టార్టప్‌లకు (అంకుర కంపెనీలకు) ఆ పన్నును తొలగించారు. అధిక సంపన్నవర్గాలపై సర్‌చార్జి ఉపసంహరణ, ఎమ్ఎస్ఎమ్ఈలకు 60 రోజుల్లోనే జీఎస్టీ రిఫండ్లు మొదలైన పలు రాయితీలను ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్యాకేజీలూ (ఉద్దీపనలు) ప్రకటించబోమని స్పష్టం చేసినప్పటికీ.. ఆర్థిక మందగమనం రీత్యా కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్రం కొన్ని నెలల క్రితమే సమర్పించిన బడ్జెట్లోని నిర్ణయాలపై ‘యు టర్న్’ తీసుకున్నదని కొందరు విమర్శిస్తున్నప్పటికీ.. ఈ చర్యలను సానుకూల దృష్టితోనే చూడాలి. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి కేంద్రం ఏ చర్య తీసుకున్నా స్వాగతించాల్సిందే. ముఖ్యంగా.. నగదు లభ్యత పెరగాలి. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత గరిష్ఠస్థాయికి చేరగలగాలి. కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలి. ఇవన్నీ సాకారం కావాలంటే.. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. తాజాగా, కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యలు ఆర్థిక మాంద్యం రుగ్మతకు మందుగా పని చేయగలవా? ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి ఉరుకులు పెట్టించగలవా? ప్రతిపక్షాలు విమర్శిం చినట్లు ఇవి అరకొర చర్యలేనా? ఈ ప్రశ్నలకు జవాబులు భవిష్యత్తు పరిణామాలే స్పష్టం చేయగలవు. వ్యాసకర్త: సి. రామచంద్రయ్య మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
ఆచితూచి అడుగేయాలి
కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కూ మధ్య ఎట్టకేలకు సఖ్యత కుది రింది. ఎంతో వివాదాస్పదంగా, జటిలంగా కనిపించిన నగదు నిల్వల బదిలీ వ్యవహారం సుఖాం తమైంది. దాదాపు ఏడాది నుంచి ఇద్దరికీ మధ్య కొనసాగుతూ వస్తున్న ఘర్షణ వాతావరణం పలు పరిణామాలకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ వ్యవహారంలోనే ప్రభుత్వంతో విభేదించి నిరుడు డిసెంబర్లో నిష్క్రమించారు. డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య సైతం ‘వ్యక్తిగత కారణాలతో’ రెండు నెలలక్రితం తప్పుకున్నారు. వీరిద్దరే కాదు... నగదు నిల్వల బదిలీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీతో కూడా ప్రభుత్వానికి సమస్యలొచ్చాయి. ఆ కమిటీలో కేంద్రం తరఫున సభ్యుడిగా ఉన్న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఇతర సభ్యులతో గట్టిగా వాదించారు. ప్రభుత్వం అడిగినంతా ఇవ్వడం సాధ్యం కాదని కమిటీకి నేతృత్వం వహించిన బిమల్ జలాన్ చెప్పారు. అత్యవసర పరి స్థితులు ఏర్పడిన పక్షంలో రంగంలోకి దిగడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గరుంచుకోవాల్సిన నిధులపై భిన్నాభిప్రాయాలున్నాయి. అమెరికా, బ్రిటన్లలో ఈ నిధులు వాటి మొత్తం ఆస్తుల్లో 13 నుంచి 14 శాతం మించవని... మనదగ్గర మాత్రం ఆర్బీఐ 25 శాతం నిధుల్ని రిజర్వ్‌లో ఉంచుతున్నదని ప్రభుత్వ వర్గాల వాదన. ఏమైతేనేం ఎప్పుడూలేని విధంగా కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల నగదు ఇవ్వడానికి ఆర్బీఐ బోర్డు అంగీకరించింది. ఇది ఆర్బీఐ ఆస్తుల్లో 12.5 శాతం. నిపుణులంతా కొంతకాలం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు గడ్డు రోజులు రాబోతున్నాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో మొన్న శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భిన్న రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో ప్రకటించిన ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపును ఉపసంహరించుకున్నారు. ఈ పెంపుతో దాదాపు రూ. 25,000 కోట్లు వెనక్కి తీసుకున్న విదేశీ మదుపుదార్లను తిరిగి ఆకర్షించడమే దీని ఆంతర్యం. ఇప్పుడు ఆర్బీఐ కూడా నగదు బదిలీకి అంగీకరించడంతో కేంద్రం పని సులభమైంది. గత రెండేళ్లుగా ఆర్థిక రంగం పనితీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా– చైనాల మధ్య సాగుతున్న టారిఫ్‌ల యుద్ధం ముదిరితే ఇది మరింత క్షీణించడం ఖాయమని అందరిలోనూ గుబులుంది. మూడేళ్లుగా వృద్ధిరేటు క్షీణిస్తుండటం, ప్రైవేటు రంగంలో ఆశించినంత పెట్టుబడులు రాకపోవడం, ఉపాధి లేమి, వాహనాలు, ఇతర వినియోగ వస్తువుల అమ్మకాల్లో క్షీణత వంటివి మాంద్యానికి సూచనలు. ఆదాయపన్ను, జీఎస్టీల ద్వారా వచ్చే రెవెన్యూ అంచనా లకు తగినట్టు లేదు. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం అటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు రుణలభ్యతను అసాధ్యం చేస్తున్న ఆర్బీఐ ఆంక్షలను సడలించాలని, దాని దగ్గరుండే నగదు నిల్వల్లో కొంత భాగం తనకు దఖలు పడాలని కోరుకుంది. ఈ రెండింటి విషయంలోనూ ఉర్జిత్ పటేల్‌కూ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకూ మధ్య విభేదాలు తలెత్తాయి. ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకోవడంలో విఫలమవుతున్న బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం అసాధ్యమయ్యేలా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అది ఉత్పాదక తపైనా, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపడాన్ని గమనించిన కేంద్రం... ఆ ఆంక్షల్ని సడలిం చమని ఆర్బీఐని కోరింది. అందుకు ఆర్బీఐ బోర్డు నిరుడు అంగీకరించింది. ఇక నగదు నిల్వల బదిలీకి సంబంధించి మాత్రం ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్బీఐ దగ్గర తగినంతగా నగదు నిల్వలు న్నప్పుడే దాని సమర్థతపై మార్కెట్లో విశ్వసనీయత ఏర్పడుతుందని ఉర్జిత్ భావించారు. ఆ నిల్వలు గడ్డు పరిస్థితుల్లో వినియోగించడానికి తప్ప ప్రభుత్వానికి బదిలీ చేయడం కోసం కాదని ఆయన చెప్పడంతో సమస్య జటిలంగా మారింది. చివరకు ఈ వివాదం ఎక్కడివరకూ పోయిం దంటే...ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ను ఉపయోగించి బ్యాంకు వ్యవహారాలను కేంద్రం తన పరిధి లోకి తెచ్చుకుంటుందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. ఆర్బీఐకీ, కేంద్రానికీ మధ్య విభేదాలు తలెత్తడం కొత్తేమీ కాదు. గతంలో రిజర్వ్‌బ్యాంక్ గవ ర్నర్లుగా పనిచేసినవారు సైతం కేంద్రం ప్రతిపాదనలు తోసిపుచ్చటం, అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థేగానీ సర్వస్వతంత్రంగా ఉండటం సాధ్యం కాదు. అందువల్లే విభేదాలు తలెత్తినప్పుడల్లా పరస్పరం చర్చించుకోవడం, ఒక అంగీకారానికి రావడం రివాజు. అయితే ఆ చర్చ వాస్తవాల ప్రాతి పదికన ఉండాలి. గతంలో ఉర్జిత్ పటేల్‌తో కేంద్రం తరఫున గట్టిగా వాదించిన శక్తికాంత దాస్ ఇప్పుడు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా వచ్చారు కాబట్టి పరిస్థితులు మారిపోయాయి. అయితే ఇప్పుడు బదిలీ అవుతున్న ఈ నిధులను వెచ్చించడంలో కేంద్రం ఆచితూచి అడుగులేయాల్సి ఉంటుంది. వృద్ధిరేటు ప్రస్తుతం అయిదేళ్ల కనిష్టంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలివ్వడం తాడు మీద నడకలాంటిది. వాస్తవానికి ప్రైవేటు రంగానికి ఇప్పుడున్న సమస్య రుణలభ్యత కాదు. మార్కెట్లో డిమాండ్ పడిపోవడం వల్ల తమ ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో లేదోనన్న బెంగ వారిని పీడిస్తోంది. అందుకే అవి చొరవ చేసి ముందుకు రాలేక పోతున్నాయి. భిన్న రంగాలకు ప్రకటించిన ఉద్దీపనలు సహజంగానే ఆ రంగాలు పుంజుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే రూ. 70,000 కోట్లను బ్యాంకులకు మూలధన సాయంగా వెచ్చించా లని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవసరమైన ఇత రేతర చర్యలు కూడా తీసుకోవాలి. ఆ చర్యలు ప్రజల్లో కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచు తాయి. అప్పుడు మాత్రమే ఆర్థిక రంగం ఎంతో కొంత కుదుట పడుతుంది. -
కొనుగోలు శక్తికి ఉద్దీపన కరువు
భారతదేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలంలో ఉంది. ఒకవైపున మోదీ 2024 నాటికి ఆర్థికవ్యవస్థ స్థాయిని 5 లక్షల కోట్ల రూపాయలకి తీసుకువెళ్ళాలనే లక్ష్యాన్ని ప్రకటిస్తున్నారు. మరో ప్రక్కన దేశ ఆర్థ్ధికవ్యవస్థపై మాంద్యం తాలూకు కారుమబ్బులు కమ్ముకుంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. ‘ప్రభుత్వం బయటకు చెప్పకపోయినా, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుంచి అందుతోన్న సంకేతాల మేరకు గడచిన 34 సంవత్సరాల నుంచీ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంద’ని బజాజ్ ఆటోకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ అన్నారు. ‘పెట్టుబడులకు, డిమాండ్‌కి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏవిధంగానూ ప్రయత్నించడం లేద’ని కూడా ఆయన చెబుతున్నారు. ఆయన ఈ మాటలు అన్నది 2019 జూలై మాసం చివరిలో. కాగా, ఇంతటి తీవ్ర పరిస్థితులలో కూడా నేటి వరకూ ఆర్ధికమాంద్యం నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరో ప్రక్కన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాటల ప్రకారం జూన్ మాసంలో ‘ద్రవ్య విధాన కమిటీ’ సమావేశం జరిగిన నాటికే దిగజారివున్న ఆర్థిక స్థితి, ఈ కొద్ది కాలంలో మరింత అధోముఖంగా జారిపోయింది. ఈ స్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రిజర్వ్ బ్యాంకు తన వంతుగా ఇప్పటివరకూ వడ్డీ రేట్లను 1.1% మేరన తగ్గించింది. అయితే, ప్రభుత్వం తన వంతుగా ఉద్దీపన వంటివి చేపట్టడం కూడా తప్పనిసరి అని రిజర్వ్‌బ్యాంకు పెద్దల అభిప్రాయం. కాగా, కడకు నేడు ఉద్దీపన ప«థకం ఏదీ ఇచ్చే ఉద్దేశం లేదంటూ ప్రధానమంత్రి ప్రధాన ఆర్థ్ధిక సలహాదారు చావు కబురు చల్లగా చెప్పారు. కానీ, షేర్మార్కెట్లలో పతనం గురించి మాత్రం ప్రభుత్వం మెరుపు వేగంతో ప్రతిస్పందిస్తోంది. మొన్నటి బడ్జెట్ అనంతరం అత్యంత ధనవంతుల మీద పెంచిన పన్ను మొత్తం తాలూకు భారం అనేక విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారులను తాకింది. దాంతో వారు షేర్ మార్కెట్ల నుంచిపెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీనితో సెబీ విదేశీ ఫోర్ట్‌ఫోలియో మదుపుదారులకు సంబంధించిన పలు నిబంధనలను సరళీకరించింది. తద్వారా పతన దిశగా సాగుతోన్న షేర్ మార్కెట్‌కు కొంత ఊతాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతోంది. 2008లో అమెరికాలో ఆరంభమైన ఆర్థ్ధిక మాంద్యం మనల్ని తాకకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, మన జాతీయం చేయబడిన బ్యాంకులు. రెండవది దేశంలోని జాతీయ ఉపాధి హామీ ప«థకం. నాడు మన జాతీయ బ్యాంకులు అడ్డగోలు రుణవితరణ చేయలేదు. అవి ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారలేదు. అలాగే, జాతీయ ఉపాధి హామి పధకం వలన దేశంలోని కోట్లాది మందికి కొనుగోలు శక్తి పెరిగింది. నేడు జాతీయ బ్యాంకులలో మొండి బకాయిలు పెరిగిపోయాయి. రుణవితరణలో పెద్ద పాత్ర ఉన్న బ్యాంకింగేతర ఆర్థ్ధికసంస్థల స్థితి కూడా దివాలా బాట పట్టింది. మన నీతిఆయోగ్ ప్రకారమే నేడు ఆర్థ్ధిక సంస్థల స్థితి 70 సంవ త్సరాలలో కనీవినీ ఎరుగనంత దయనీయంగా ఉంది. ఇక, జాతీయ ఉపాధి హామి పథకం పట్ల విముఖత కారణంగా కూలీల వేతనాల చెల్లింపు జాప్యం అవుతోంది. వ్యవసాయ రంగం స్థితి కూడా దిగజారి గ్రామీణ ఆర్థ్ధిక ఆరోగ్యం çకుదేలైపోతోంది. గ్రామాల ఆర్థిక స్థితికి కొలబద్ద అయిన ట్రాక్టర్లు, బైక్‌ల అమ్మకం దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే, తల నూనెలు, సబ్బులు, కడకు బిస్కెట్ల వంటి చిన్న చిన్న వినియోగ వస్తువుల అమ్మకాలు కూడా నేడు గ్రామీణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో కంటే దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆసియా దేశాల కరెన్సీల విలువలో కూడా పతనం నెలకొంది. మన రూపాయి విలువ మరింత అధికంగా పతనం చెందింది. అలాగే, మనదేశం నుంచి ఎగుమతి అయ్యే కార్ల అమ్మకాలు ఇతర దేశాలలో డిమాండ్ పతనం వలన 4.2% మేరకు తగ్గాయి. మన దేశీయ మార్కెట్లో ఈ అమ్మకాల తగ్గుదల 19% మేరకు ఉంది. అలాగే, జూలై 2019 మధ్యనాటి స్థితి ప్రకారంగా ప్రపంచంలోని అతిపెద్ద 10 షేర్ మార్కెట్లలో ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది (2.8%) భారతదేశ షేర్ల సూచీయే ! అలాగే గత నాలుగేళ్లలో భారతదేశ ఎగుమతుల వృద్ధి రేటు సగటున 0.2%గా మాత్రమే ఉంది. ప్రపంచదేశాల ఎగుమతుల సగటు వృద్ది రేటు 0.6% గా ఉంది. 2010 2014లో ప్రపంచ దేశాల సగటు ఎగుమతుల వృద్ధి సాలీనా 5.5% గా ఉండగా, మన దేశంలో అది 9.2% గా ఉంది. అంటే, ప్రపంచంలోని ఇతర దేశాలలో కంటే భారత్‌లో మరింత తీవ్ర మాంద్య పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం మన ఆర్థిక రంగాన్ని ఇప్పటికీ వెంటాడటమే. ఇక నోట్ల రద్దుతోపాటుగా హడావుడిగా అమలు జరిగిన జీఎస్టీ వలన కూడా సమస్యలు మరింత జటిలం అయ్యాయి. నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం మాంద్యం పరిష్కారానికి చేపడుతోన్న చర్యలు కూడా అరకొరగానే మిగిలిపోయాయి. ఒక ఉద్దీపన పథకం అవసరం అయిన దశలో దానిని తిరస్కరించి; కార్పొరేట్లపై పన్ను శాతాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థ్ధిక వ్యవస్థ కోలుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని ‘మింట్ స్థూల ఆర్థిక పరిశీలక సూచీ’ చెబుతోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ద్రవ్యలోటును కట్టడి చేసే ఆలోచనలు మానుకొని తన యథాశక్తి ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనను ఇవ్వడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా ఈ ఉద్దీపన గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా ఉండాలి., 2024 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థ్ధిక వ్యవస్థ కల కనే ముందు, నేడు మనం స్థూలవృద్ధి రేటులో ప్రపంచంలో ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయిన వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి. పీ.ఎస్: శుక్రవారం ఆర్థికమంత్రి ప్రకటించింది–సామాన్య జనాభా, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తిని పెంచే ఉద్దీపన పథకం కాదు. అది కేవలం వడ్డీ రేట్ల తగ్గింపు లేదా బ్యాంకుల ద్రవ్యలభ్యతను పెంచేది మాత్రమే. కానీ, ఎస్బీఐ చైర్మన్ ప్రకారం అసలు ప్రజలకు కొనుగోలు శక్తి లేకపోవడమేగానీ, బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవ డం కాదు. కాబట్టి సామాజిక రంగంలోన, మౌలిక వసతుల రంగంలో ఉపాధిని పెంచే చర్యలు మాత్రమే ప్రస్తుత స్థితిలో నిజమైన ఆర్థిక ఉద్దీపనకు దోహదపడతాయి. వ్యాసకర్త: డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
గుల్లగా మారిన ‘డొల్ల’ ఆర్థికం!
‘‘ఆర్థ్ధిక మందగమన పరిస్థితులు దేశ ఆర్థిక రంగంలో వివిధ రంగాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. ఫలితంగా దేశంలో ఉద్యోగాలకు, సంపదకు విఘాతం కలుగుతున్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కుంగిపోతుండడం ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తోంది’’ – భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం.(15.08.19) ‘‘ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను దేశాధినేత ఎంత గొప్పవాడైనా అతని పాదాక్రాంతం చేయకూడదు. అలాగే త్యాగాలతో నిర్మించుకున్న ప్రజాస్వామ్య సంస్థల్ని కూల్చేయగల అధికారాన్ని అలాంటి నేత చేతిలోనూ పెట్టరాదు. ఎందుకంటే ఇండియాలో మితిమీరిన భక్తి భావన లేదా వీరారాధన తత్వమనేది రాజకీయాల్లో చొరబడే లక్షణాలు ఎక్కువ. రాజకీయాల్ని ప్రభావితం చేసే ఈ చెడు లక్షణం ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోనూ లేదు. రాజకీయాల్లో ‘భక్తి’ అనే ఆరాధనాతత్వం పతన దశకు తద్వారా నియంతృత్వానికి నిస్సందేహంగా రాచమార్గం’’ – రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరి ప్రసంగంలో హెచ్చరిక(25.11.1949) కునారిల్లుతున్న దేశ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు మొదటి అయిదేళ్ల పాలనలో దేశ ప్రజలకు వాస్తవాలు కనబడకుండా దాచిపెట్టినా, రెండోసారి(2019) పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలి మాసాల్లోనే కఠోర సత్యాలను గుర్తించక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. దీనికితోడు ఏలినాటి శనిగా మారిన ‘కశ్మీర్ కొరివి’తో తలగోక్కోటానికి మన పాలకులు అలవాటు పడ్డారు. పాత, కొత్త పాలకులకు ‘అభివృద్ధి’ అనేది ఒక మంత్రంగా మారినంత మాత్రాన దేశ ప్రజాబాహుళ్యం ఆర్థిక పరిస్థితులలో, జీవనవిధానంలో, విద్య, వైద్యం,ఆరోగ్య విషయాలలో పెనుమార్పులు రావు. కనుకనే వారు ‘పూత మెరుగులతో’ కాలక్షేపం చేస్తూ రావటం జరుగుతోంది. అధ్వానమవుతున్న దేశ ఆర్థిక పరిస్థితులకు ప్రస్తుత పాలకులు గత పాలకుల్ని ఆడిపోసుకోవడం ద్వారానో, లేక సంక్షోభానికి బయటి శక్తుల్ని కారణంగా చూపడం ద్వారానో కాలక్షేపం చేస్తున్నారు. 2014 నుంచి కడిచిన అయిదేళ్ల పాలన మత విద్వేషాలు రెచ్చగొట్టడం, వేధింపులు, హత్యలు వగైరాలతో గడిచిపోయింది. ‘‘అభివృద్ధి’’ మంత్రం నోట్ల రద్దుతో ప్రారంభమై చిన్న, మధ్య తరగతి వ్యాపార వర్గాల, రైతు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసి, కొన్ని ఆత్మహత్యలకు దారితీసింది. బ్యాంకులు, ఏటీఎంలు డబ్బు కొరత వల్ల పలుసార్లు మూతపడటంతో చిన్న వ్యాపారులు, సన్నకారు రైతాంగం అల్లల్లాడారు. బాగుపడిందెవరయ్యా అంటే బడా వ్యాపారులు, ప్రయివేట్ రంగంలో కోటికి పడగలెత్తినవారూ! ఇంతకీ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనం పొందింది ఎవరన్న ప్రశ్నకు రెండురకాల వదంతులు బలంగా వ్యాప్తిలోకి వచ్చాయి. (1) పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 80–84 సీట్లతో ఏ పార్టీకి ఆధిక్యం వస్తే ఆ పార్టీకి పార్లమెంటులోనూ మెజారిటీ లభిస్తుంది. అలాగైతేనే దక్షిణాది రాష్ట్రాలపైనా పెత్తనం చెలాయించడం సాధ్యమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కాలంటే ఆ రాష్ట్రంలో సొంత ప్రభుత్వం ఉండటం అవసరం. కనుక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గడానికి అవసరమైన డబ్బు ప్రవహింపజేయడం కోసం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని, (2) కశ్మీర్ సరిహద్దుల్లో ‘‘ఆకస్మిక దాడుల’’ నిర్వహణకు భారీ మొత్తంలో నిధులు మళ్లాయనీ–వదంతులు వ్యాపించాయి. ఆకస్మికంగా నోట్ల రద్దును ప్రకటించి, కొత్త నోట్లకు తెరలేపడానికే బీజేపీ పాలకులు రూ. 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సివచ్చిందని పత్రికల వార్తలు వెల్లడించాయి! ఇలాంటి పెక్కు వివాదాస్పద నిర్ణయాలతో బీజేపీ తొలి అయిదేళ్ల పాలన ముగియనున్న తరుణంలో దేశవ్యాప్తంగా, ప్రజల్లో ఏర్ప డిన తీవ్ర అసంతృప్తిని చల్లార్చడానికి సరిహద్దుల రక్షణలో ‘‘ఆకస్మిక దాడుల’’ను (సర్జికల్ స్ట్రయిక్స్) చూపించి దేశ రక్షణకు బీజేపీయే శ్రీరామరక్ష అన్న వాదనను పాలకులు సమర్థవంతంగా ప్రజల్లోకి నెట్టగలిగారు. తొలిసారి పాలనలో అభివృద్ధి నామమాత్రం కావడంతో 2019 ఎన్నికల కోసం బీజేపీ పన్నిన వ్యూహం, ఎత్తుగడలు ఓ పెద్ద కలగూర గంప రాజకీయ వ్యూహాన్ని తలపించాయి. దేశ ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి మాట వచ్చేసరికి కాంగ్రెస్ పాలకులు జంకిన కొన్ని విషయాల్లో బీజేపీ పాలకులు ‘ముందంజ’ వేశారు! ఎలాగంటే, ఒకప్పుడు తొలి ప్రధాని పండిట్ నెహ్రూ దేశ స్వాతంత్య్రానికి కొలది మాసాల ముందుగా ఒక ప్రకటన చేస్తూ ‘స్వాతంత్య్రానంతరం కూడా దేశాన్ని కొల్లగొట్టిన విదేశీ గుత్త పెట్టుబడి సంస్థల్ని కొనసాగించడం దేశాభివృద్ధికి ఆటంకమ’ని చెప్పగా ఇప్పుడు బీజేపీ పాలకులు దానికి విరుద్ధమైన బాణీ అందుకున్నారు. అది ‘విదేశీ వాణి’గానే ఉందిగానీ, దేశీయవాణిగా లేదు! మరీ విడ్డూరమూ, అసత్యమూ, అభ్యంతరకరమూ అయిన అంశం–రెండోసారి పాలనకు వచ్చిన ప్రధాని మోదీ కొన్ని రోజులనాడు విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో పారిస్‌లో చేసిన ఒక ప్రసంగంలో చెప్పిన మాటలు: ‘అవినీతికి, బంధుప్రీతికి తావులేకుండా, ప్రజాధనం లూటీ కాకుండా చూడ్డంలో బీజేపీ పాలన విజయం సాధించింది. ఈ విజయం మేము నవభారత నిర్మాణంలో భాగంగా చేశాం’అని. ఇది హాస్యాస్పద ప్రకటన. ఎందుకంటే, విదేశీ బ్యాంకుల్లో భారతీయ పెట్టుబడిదారులు దాచుకున్న దొంగ డబ్బు విలువ రు. 25 లక్షల కోట్లనీ, ఆ అక్రమ ధనరాశుల్ని ఇండియాకు రప్పించి దేశంలోని పేద కుటుంబాలకు రూ. 15లక్షల చొప్పున పంచేస్తానని 2014 ఎన్నికలకు ముందు బాహాటంగా ప్రకటించిన వ్యక్తి మోదీ! కానీ జరిగిందేమీ లేదు. బహుశా అందుకే ఈ చిత్రవిచిత్ర భారతదేశ పరిస్థితుల్ని పిన్న వయస్సులోనే పసిగట్టకల్గిన వీర భగత్‌సింగ్ 1920 నాటికే ముందస్తుగా ఒక హెచ్చరిక చేసి ఉరికంబమెక్కాడు. ‘‘దేశ స్వాతంత్య్రానంతరం ఒక్క విదేశీ గుత్త పెట్టుబడి వర్గాలే గాక, దేశీయ గుత్తపెట్టుబడివర్గాలు కూడా జోడుకూడి, జమిలిగా భారత ప్రజల్ని దోచుకుతింటార’’ని హెచ్చరించిన క్రాంతదర్శి అతను! రెండోసారి పాలనకు వచ్చిన బీజేపీ పాలకులు దేశ ఆర్థిక పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదని అడిగితే ‘తాడిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేత కోసం’ అన్న చందాన జవాబిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ప్రబలుతున్నందువల్లనే ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు. అయినా ‘ఉట్టికెక్కలేనివాడు స్వర్గానికి నిచ్చెన వేసినట్లు’గా తొలి అయిదేళ్ల పాలన మరచిపొండి, వచ్చే అయిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ‘అయిదు ట్రిలియన్ డాలర్ల విలువ’(అయిదు లక్షల కోట్ల డాలర్ల)కు చేరుస్తామ’ని అంటున్నారు. ఒకవేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అమెరికా తన డాలర్‌తో శాసిస్తోందని అనుకున్నా దాన్నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించి నిర్ణయాలు చేయలేనంతకాలం సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాల బెడదనుంచి భారత్‌లాంటి దేశాలు తప్పించుకోలేవు. ఇక్కడ చైనా ఉదాహరణ చెప్పుకోవాలి. అమెరికా పాలకుడు ట్రంప్ చైనా నుంచి వచ్చే సరుకులపై సుంకాలు బాగా పెంచేసి ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ అసలు రహస్యం–చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులన్నీ చైనాకు ఎగబాకిన అమెరికన్ కంపెనీలవే! చైనా వనరులపై ఆధారపడి అక్కడే ఉత్పత్తి చేసి ఆ సంస్థలు అమెరికాకు పంపుతున్నాయి. ఈ వాస్తవాన్ని ట్రంప్ ‘ఉల్టా’ చేసి ప్రపంచానికి చూపుతున్నాడు. ఇదే నిజం కాకపోతే చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచికూడా, వాణిజ్యయుద్ధం చేస్తున్నామని చెబుతూ కూడా అమెరికా ఆ దేశంతో ఎందుకు రాజీ పడుతున్నట్టు? చైనా అనుసరించిన ఈ వ్యూహాన్నే మన పాలకులు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మొన్నటి దాకా అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై మనం విధిస్తున్న సుంకాలను మనపై ఒత్తిళ్లు తెచ్చి ఆ దేశం తగ్గించుకుంది. ఇంకా మరిన్ని వస్తువులపై తగ్గించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. కాగా మనం ఏం చేస్తున్నాం? నోరు మూసుకుని ‘చిత్తం, అలాగే’ అంటున్నాం! మన పాలకులు ఏమాత్రం విదేశీ గుత్త కంపెనీలపైన సుంకాలు పెంచినా, ఆ కంపెనీలు స్టాక్ మార్కెట్లనుంచి అర్ధంతరంగా పెట్టుబడులను ఉపసంహరించుకుని ఉడాయించి మార్కెట్లను దెబ్బతీస్తున్నారు. ఇలా ఆకస్మికంగా తరలించుకుపోయిన పెట్టుబడులు (ఒక్క రోజులోనే)విలువ రూ. 25,000 కోట్లు. దీంతో జరిగిన పనేమిటి, బీజేపీ పాలకులు చూపిన విరుగుడేమిటి? విదేశీ గుత్త పెట్టుబడి కంపెనీలపైన పెంచిన సర్‌చార్జి ఆదాయపు పన్నును రద్దు చేస్తూ లొంగిపోవడం! బహుశా అందుకే సుప్రసిద్ధ రాజ్యాంగ వ్యాఖ్యాత, అమెరికన్ అటార్నీ, మానవ హక్కుల పరిరక్షణా సంస్థ ప్రతినిధి జాన్ వైట్‌హెడ్ ‘‘మూడే మూడు మాటలతో’’ ప్రారంభమయ్యే అన్ని దేశాల రాజ్యాంగాల గురించి ఇలా అన్నాడు: ‘‘ఆ మూడు అందమైన మాటలు– ‘‘మేము అంటే ప్రజలం’’అని. మనం లేకుండా, మన శ్రమ లేకుండా సంపదైశ్వర్యాలు... మనం సృష్టించే ఆర్థిక వ్యవస్థ లేకుండా ప్రభుత్వాలు, పాలకులు ఉండరు. అయినా విచారకరమైన ‘పచ్చి’ వాస్తవం–మన మనస్సులను కుదిపి కదపలేకపోవటం! ఎందుకని? దేశ పాలనా రథానికి రథికులు(డ్రైవర్లు)అయినవారు నిద్రపోవటం వల్ల వాస్తవాలు కనుమరుగవుతున్నాయి. మనం ప్రశ్నించడం మానుకున్నాం, మనం శాసనవేదికలకు పంపిన ప్రతినిధులు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండేలా కట్టడి చేయడంలో విఫలమవుతున్నాం, ఫలితంగా పాలకులు మన నెత్తిపైన ఎక్కి అసాధారణ అధికారాన్ని చెలాయిస్తున్నారు. ప్రజలను అణిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు నిద్రమత్తు వదలకపోతే మన మీద విరుచుకుపడ్డానికి కాచుక్కూర్చున్న మృగాన్ని అదుపు చేయటం కష్టమని గ్రహించాలి’’(ఏ గవర్నమెంట్ ఆఫ్ వోల్వ్స్–తోడేళ్ల ప్రభుత్వాలు)!! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
జెట్ పునరుద్ధరణపై ఆశలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిల్చిపోయిన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణపై ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తూ తాజాగా బ్రిటన్ వ్యాపారవేత్త జేసన్ అన్స్వర్త్.. కంపెనీలో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మెజారిటీ వాటాల కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ జెట్ సీఈవో వినయ్ దూబేకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన దూబే .. ఇతర సీనియర్ జెట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేలా ఏర్పాటు చేశారని అన్స్వర్త్ తెలిపారు. వాటాల కొనుగోలు కోసం జెట్ రుణదాతలకు కూడా గతంలో లేఖ రాసినప్పటికీ.. వారి నుంచి ఇంకా స్పందన రాలేదని ఆయన వివరించారు. ‘జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు జీతభత్యాలు అందుకునేలా, సంస్థ మరిన్ని అసెట్స్‌ను కోల్పో కుండా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా చూడాలన్నది నా ఉద్దేశం‘ అని అన్స్వర్త్ తెలిపారు. అట్మాస్ఫియర్ ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ పేరిట స్టార్టప్ సంస్థను ప్రారంభించిన అన్స్వర్త్.. లండన్‌లోని స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్టు నుంచి భారత్, దుబాయ్ తదితర ప్రాంతాలకు ఈ ఏడాది ఆఖర్లోగా విమాన సేవలు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్లాన్ ఉంది.. జెట్ సమస్యలు, అప్పుల భారాల గురించి తనకు తెలుసని, వాటిని అధిగమించేందుకు తన దగ్గర ప్రణాళిక కూడా ఉందని అన్స్వర్త్ తెలిపారు. అట్మాస్ఫియర్‌పై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లలో కొంత మంది జెట్‌పై కూడా ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. 2015లో అట్మాస్ఫియర్‌ను ఏర్పాటు చేసినప్పటినుంచీ వివిధ స్థాయిల్లో వివిధ సంస్థలతో కలిసి పనిచేయడమనేది జెట్ పునరుద్ధర ణకు తోడ్పడగలదని చెప్పారు. కంపెనీ విలువ మరింత పడిపోకుండా సాధ్యమైనంత త్వరగా సం స్థ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యేలా చూడటం ముఖ్యమని తెలిపారు. ఇప్పటికే చాలా మంది జెట్ ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లిపోతున్నారని, అట్మాస్ఫియర్ ఎయిర్‌లైన్స్ భారత విభాగానికి కూడా జెట్ ఉద్యోగుల నుంచి వందల కొద్దీ దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. విదేశీ రూట్లపై దృష్టి.. ప్రధానంగా విదేశీ రూట్లలో సేవలపై దృష్టి పెట్టడం ద్వారా జెట్‌ను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు అన్స్వర్త్ చెప్పారు. సవాళ్లున్నప్పటికీ చౌక చార్జీల విమానయాన సంస్థలతో పోలిస్తే పూర్తిస్థాయి ఎయిర్‌లైన్స్‌కు దీర్ఘకాలంలో అవకాశాలు పుష్కలం గా ఉన్నాయన్నారు. వినోదం, రిఫ్రెష్మెంట్స్తో సరైన రేటుకి ప్రీమియం అనుభూతినివ్వడం ఇం దుకు కీలకమని చెప్పారు. భారీ రుణభారంతో కుంగుతున్న జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17న సర్వీసులను నిలిపివేసింది. దీంతో 20,000 మంది పైచిలుకు ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కంపెనీని రుణదా తలు వేలానికి ఉంచాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, ఎన్ఐఐ ఎఫ్ సంస్థలు షార్ట్లిస్ట య్యాయి. ఇవి మే 10లోగా తుది బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంది. అయితే ప్రధానమైన స్లాట్స్, వి మానాలు, పైలట్లు, ఉద్యోగులు సంస్థ చేజారిపో తుండటంతో బిడ్డర్స్ కూడా ఆసక్తి చూపకపోవచ్చే మోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్లాట్స్ కేటాయింపు తాత్కాలికమే: కేంద్రం విమానాశ్రయాల్లో జెట్ ఎయిర్వేస్ స్లాట్స్‌ను ఇతర సంస్థలకు కేటాయించడం తాత్కాలికం మాత్రమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంగళవారం తెలిపింది. జెట్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించిన వెంటనే తిరిగి అప్పగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. జెట్ ఎయిర్వేస్ సర్వీసుల రద్దు కార ణంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకే మూడు నెలల పాటు తాత్కాలికంగా జెట్ స్లాట్స్‌ను ఇతర ఎయిర్ లైన్స్‌కు ఇవ్వనున్నట్లు కేంద్రం వివరించింది. స్లాట్స్ కేటాయింపు పారదర్శ కంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ కమిటీలో ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ తదితర సంస్థల ప్రతినిధులు ఉంటారు. -
జెట్ సిబ్బందికి ప్రత్యేక రుణాలివ్వండి
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో 22,000 మంది పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జీతాలు అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు కష్టకాలంలో కొంత తోడ్పాటునిచ్చేలా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను (ఐబీఏ) బ్యాంకు యూనియన్లు కోరాయి. జెట్ సిబ్బందికి స్పెషల్ లోన్ స్కీముల్లాంటివి రూపొందించేలా బ్యాంకులకు సూచించాలని అభ్యర్థించాయి. అలాగే, ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించడంలో జెట్‌కు తోడ్పడేలా తగు విలువ గల ఆస్తులను తనఖాగా ఉంచుకుని కంపెనీకి కూడా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. ఉద్యోగులకు ఒక్క నెల జీతాలైనా చెల్లించాలంటే కనీసం రూ.170 కోట్లు అవసరమవుతాయంటూ జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే వెల్లడించిన నేపథ్యంలో బ్యాంకు యూనియన్ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్ ఉద్యోగుల భవిష్యత్‌ను కాపాడేలా కంపెనీని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలంటూ గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బ్యాంకు యూనియన్లు లేఖ రాశాయి. బ్యాంకులకు రూ. 8,500 కోట్లు, విమానాలు లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు జెట్ రూ. 4,000 కోట్ల బాకీపడింది. ఫ్లయిట్స్ రద్దుతో ప్రయాణికులకు వేల కోట్ల రూపాయలు రిఫండ్ చేయాల్సి ఉంది. -
జెట్ క్రాష్ ల్యాండింగ్!
న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో కఠిన పరిస్థితులను ప్రతిబింబిస్తూ మరో విమానయాన సంస్థ మూసివేత అంచులకు చేరింది. రుణభారం, నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ. 400 కోట్లను సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ‘రుణదాతల నుంచి గానీ మరే ఇతర మార్గాల ద్వారా గానీ అత్యవసరంగా కావాల్సిన నిధులు లభించే భరోసా లేదు. దీంతో కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో ఇంధన విక్రేతలకు, ఇతరత్రా సేవలందించే వారికి చెల్లింపులు జరపలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. దేశీయంగాను, విదేశీ రూట్లలోనూ నడిపే ఫ్లయిట్స్ అన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సి వస్తోంది. బుధవారం రాత్రి అమృత్సర్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి రాత్రి 10.30 గం.లకు వెళ్లే ఫ్లయిట్ ఆఖరుది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు జెట్ ఎయిర్వేస్ బుధవారం తెలిపింది. దీంతో 20 వేల మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రయాణికులు, బ్యాంకులు, రుణదాతలకు వేల కోట్ల రూపాయల బాకీల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి జెట్ పరిష్కార ప్రణాళికకు తోడ్పాటునిస్తామని పేర్కొంది. మే 10 దాకా నిరీక్షణ .. సంస్థలో వాటాలను విక్రయిస్తున్న రుణదాతలు .. బిడ్లను ఖరారు చేసే ప్రక్రియ పూర్తయ్యే దాకా వేచి చూడనున్నట్లు జెట్ తెలిపింది. నాలుగు సంస్థలు అర్హత పొందాయని, ఇవి తుది బిడ్లను దాఖలు చేసేందుకు మే 10 దాకా గడువుందని పేర్కొంది. ఎతిహాద్ ఎయిర్వేస్, జాతీయ పెట్టుబడి నిధి ఎన్ఐఐఎఫ్, ప్రైవేట్ సంస్థ టీపీజీ, మరో ఫండ్ హౌస్ ఇండిగో పార్ట్నర్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు, జెట్ కార్యకలాపాల నిలిపివేతపై పౌర విమానయాన శాఖ స్పందించింది. సంస్థ సమస్యల పరిష్కారమార్గాన్ని కనుగొనేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నామని ఉద్యోగులకు పంపిన లేఖలో జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే తెలిపారు. ‘అయితే, విక్రయ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందన్న సంగతి అంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఈలోగా మరిన్ని సవాళ్లు ఎదురవ్వొచ్చు. వీటికి సంబంధించి ప్రస్తుతానిౖMðతే మన దగ్గర సమాధానాలు లేవు‘ అని ఆయన తెలిపారు. మంగళవారం సమావేశంలో ఆఖరు ప్రయత్నంగా రూ. 400 కోట్లయినా సమకూర్చాలని బ్యాంకులను కోరాలంటూ సీఈవో వినయ్ దూబేకి జెట్ బోర్డు సూచించింది. బ్యాంకులు దానికి అంగీకరించకపోతే, సంస్థ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అయితే, అత్యవసరంగా నిధులను సమకూర్చాలన్న విజ్ఞప్తిని అంగీకరించడం లేదంటూ రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మంగళవారం రాత్రి పొద్దుపోయాక జెట్ ఎయిర్వేస్కు తెలిపింది. ఈ పరిణామాల దరిమిలా సర్వీసులను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీ ఎయిర్‌లైన్స్ కష్టాలకు కారణాలు.. విమానయాన సంస్థల కష్టాలకు పలు కారణాలు ఉంటున్నాయి. ప్రధానంగా దేశీ విమాన సర్వీసులకు ఉపయోగించే ఇంధనంపై అధిక పన్నుల పోటు, విమానాశ్రయాల్లో ఇన్ఫ్రా సమస్యలతో మరిన్ని ప్లేన్స్‌ను చేర్చే పరిస్థితి లేకపోవడం, తీవ్రమైన పోటీ కారణంగా చౌక చార్జీలతో కొనసాగాల్సి వస్తుండటం, నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటం మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి. జెట్ పాతికేళ్ల ప్రస్థానమిదీ.. ►1992లో సంస్థ ఏర్పాటు. 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటర్‌గా కార్యకలాపాలు ప్రారంభం. 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు. 2004లో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్. ►2005లో పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ). ► 2007లో రూ. 2,050 కోట్లతో ఎయిర్ సహారా కొనుగోలు. ► 2010 – 2012 దాకా ప్యాసింజర్ మార్కెట్లో అత్యధిక వాటాతో అగ్రస్థానం. ► 2011–12లో సంక్షోభ పరిస్థితులు. 2013లో ఎతిహాద్‌కు 24 శాతం వాటాల విక్రయం. డీల్ విలువ 379 మిలియన్ డాలర్లు. ► గడిచిన పదేళ్లలో ఎనిమిది సంవత్సరాలు నష్టాలు. 2015లో 22.5 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 2018 నాటికి 15.5 శాతానికి పడిపోయింది. ►2018 మార్చి నుంచి తాజాగా మరో సంక్షోభం మొదలు. ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యాలు, టాప్ మేనేజ్మెంట్ జీతభత్యాల్లో 25 శాతం దాకా కట్. గడిచిన ఏడాది కాలంగా సంస్థ మార్కెట్ విలువ 60 శాతం పైగా హరించుకుపోయింది. రుణదాతలకు దాదాపు రూ. 8,000 కోట్లకు పైగా బాకీపడింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో మరింత ముదిరిన సంక్షోభం. 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి. ►ఈ ఏడాది తొలినాళ్ల నుంచి ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయి. కంపెనీ బోర్డు నుంచి వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ తప్పుకున్నారు. బ్యాంకు యాజమాన్యాన్ని బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థలో 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్ ఆహ్వానించాయి. కార్యకలాపాలు కొనసాగించేందుకు రూ. 1,500 కోట్లు సమకూర్చే ప్రతిపాదనలు చేశాయి. వీటిని అందించడంపైనే మల్లగుల్లాలు పడిన బ్యాంకులు చివరికి అత్యవసరంగా కావాల్సిన నిధులను ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. ప్రస్తుతం కంపెనీలో ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు 51 శాతం, నరేష్ గోయల్‌కు 24 శాతం, ఎతిహాద్ ఎయిర్వేస్కు 12 శాతం వాటాలు ఉన్నాయి. ►ఒకప్పుడు 120 పైగా విమానాలు ఉండేవి. కానీ అద్దెలు కట్టకపోవడంతో లీజుకిచ్చిన సంస్థలు పలు విమానాలను నిలిపివేయడంతో ప్లేన్స్ సంఖ్య 5కి పడిపోయింది. ఉద్యోగులకు జీతభత్యాలు నిల్చిపోయాయి. జెట్ సంక్షోభంతో విమాన చార్జీలు భారీగా పెరుగుతున్నాయి. స్వయంగా ప్రధాని కార్యాలయం, పౌర విమానయాన శాఖ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అయిదేళ్లలో ఏడో సంస్థ.. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆర్థిక సంక్షోభం, తీవ్ర పోటీ ధాటికి పలు విమానయాన సంస్థలు కుప్పకూలుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో ఎయిర్ పెగాసస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, జూమ్ ఎయిర్ మూతబడ్డాయి. తాజాగా ఈ జాబితాలో ఏడో సంస్థగా జెట్ ఎయిర్వేస్ కూడా చేరుతోంది. అంతక్రితం 1987లో వాయుదూత్, 1996లో ఈస్ట్ వెస్ట్ ఎయిర్‌లైన్స్.. మోదీలుఫ్త్, 1997లో దమానియా ఎయిర్వేస్, ఎన్ఈపీ, 2000లో అర్చనా ఎయిర్వేస్ మూతబడ్డాయి. ఎయిర్‌లైన్ కర్మ: మాల్యా.. జెట్ ఎయిర్వేస్ పరిస్థితిపై మూతబడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ప్రమోటర్ విజయ్ మాల్యా స్పందించారు. కంపెనీకి సంఘీభావం ప్రకటించారు. ప్రైవేట్ విమానయాన సంస్థల కష్టాలకు కేంద్రమే కారణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు వేల కోట్ల ప్రజాధనమిచ్చి గట్టెక్కిస్తోంది కానీ .. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌పై మాత్రం పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. ‘కింగ్ఫిషర్కు జెట్ ఎయిర్వేస్ ప్రధాన పోటీదారు అయినప్పటికీ.. అంత పెద్ద సంస్థ మూసివేత పరిస్థితుల్లోకి జారిపోవడం చూస్తే నాకు బాధేస్తోంది. ఎయిరిండియాను కాపాడేందుకు కేంద్రం రూ. 35,000 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. ప్రైవేట్ రంగ సంస్థలను మాత్రం వదిలేస్తోంది. అప్పట్లో నేను భారీ పెట్టుబడులు పెట్టిన కింగ్‌ఫిషర్ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది. అవార్డులూ అందుకుంది. బ్యాంకుల నుంచి కూడా కింగ్‌ఫిషర్ రుణాలు తీసుకున్న సంగతి వాస్తవమే. నేను 100 శాతం చెల్లించేస్తానంటున్నా నాపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఇదంతా ఎయిర్‌లైన్ కర్మ అనుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. -
నిధులిచ్చి సంస్థను కాపాడండి!
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్కు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక కింద ఇస్తామన్న రూ.1,500 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జెట్ ఎయిర్వేస్ పైలట్ల సమాఖ్య నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ కోరింది. కంపెనీ మూతబడితే 20,000 పైచిలుకు సిబ్బంది రోడ్డున పడే ప్రమాదం ఉందని, వారిని ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది కూడా. ‘జెట్ కార్యకలాపాలు యథాప్రకారం సాగించేందుకు వీలుగా రూ.1,500 కోట్ల నిధులను విడుదల చేయాలని ఎస్బీఐని కోరుతున్నాం. అలాగే, 20,000 పైచిలుకు ఉద్యోగాలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నాం’’ అని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) వైస్ ప్రెసిడెంట్ అదీమ్ వలియాని చెప్పారు. సోమవారమిక్కడ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమైన సందర్భంగా ఆయన విలేకరులతో ఈ విషయాలు చెప్పారు. సంక్షోభంలో ఉన్న సంస్థకు సంఘీభావం తెలిపేందుకు పైలట్లు, ఇంజనీర్లు, క్యాబిన్ సిబ్బంది తదితర ఉద్యోగులు కంపెనీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు రూ. 8,000 కోట్ల పైగా బాకీ పడిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్య అధికారాలను బ్యాంకుల కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకోవటం తెలిసిందే. కొత్త ఇన్వెస్టరు వచ్చే దాకా కంపెనీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా రూ.1,500 కోట్లు సమకూర్చేలా బ్యాంకులు ప్రతిపాదనలు చేశాయి. ఇప్పటిదాకా కేవలం రూ.300 కోట్లు.. అది కూడా విడతలవారీగా చిన్న మొత్తాల్లోనే ఇచ్చాయి. తాజాగా తక్షణం అత్యవసరంగా ఎంత ఇవ్వాలన్న దానిపై గత శుక్రవారం ఎయిర్‌లైన్ మేనేజ్మెంట్, ఎస్బీఐ మధ్య జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. బ్యాంకుల నిర్ణయం నేటికి వాయిదా.. జెట్‌కు అత్యవసరంగా నిధులు సమకూర్చే అంశంపై సోమవారం జరిగిన సమావేశంలో కూడా బ్యాంకర్లు తగు నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో మంగళవారం మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ సిబ్బందికి అంతర్గతంగా రాసిన లేఖలో జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే ఈ విషయాలు వెల్లడించారు. నిధులు అందుబాటులోకి రాకపోవడంతో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్ రద్దును ఏప్రిల్ 18 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ‘సోమవారం సమావేశంలో నిధుల విడుదల చేస్తారని ఆశించాం. అలా జరగకపోవడం నిరాశపర్చింది. మంగళవారం కూడా నిధులు అందకపోతే కంపెనీ కొనసాగే పరిస్థితులైతే కనిపించడం లేదు‘ అని పైలట్ల యూనియన్ వర్గాలు పేర్కొన్నాయి. -
మరింత సంక్షోభంలో జెట్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. తాజాగా లీజు అద్దెలు చెల్లించకపోవడంతో మరో 10 విమానాలు నిలిపివేయాల్సి వచ్చినట్లు సంస్థ గురువారం వెల్లడించింది. దీంతో ఇలా నిల్చిపోయిన విమానాల సంఖ్య 79కి చేరింది. అయినప్పటికీ కార్యకలాపాలు సజావుగా సాగించే క్రమంలో నిధుల సమీకరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జెట్ పేర్కొంది. మరోవైపు, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ 26 శాతం వాటాలను తనఖా పెట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి జెట్ ఎయిర్వేస్ తీసుకున్న రుణాలకు గాను 2.95 శాతం షేర్లు (26.01 శాతం వాటాలు) ఏప్రిల్ 4న తనఖా ఉంచినట్లు కంపెనీ వెల్లడించింది. రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం బ్యాంకులు జెట్ ఎయిర్వేస్ను తమ చేతుల్లోకి తీసుకున్న నేపథ్యంలో కంపెనీ చైర్మన్ హోదా నుంచి గోయల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. విదేశీ సేవల కొనసాగింపుపై కేంద్రం దృష్టి.. జెట్ విమానాల సంఖ్య 14కి తగ్గిపోయిన నేపథ్యంలో అంతర్జాతీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు సంబంధించి కంపెనీకి గల అర్హతలను ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశాలు ఉన్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. వాస్తవ పరిస్థితుల గురించి జెట్ నుంచి అన్ని వివరాలు సేకరించాలంటూ నియంత్రణ సంస్థ డీజీసీఏకు సూచించడం జరిగిందని, నివేదిక వచ్చాక తగు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ రూట్లలో విమానాలు నడపాలంటే దేశీ ఎయిర్‌లైన్స్‌కు కనీసం 20 విమానాలు ఉండాలి. జెట్ దగ్గర ఒకప్పుడు 123 పైచిలుకు విమానాలు ఉన్నప్పటికీ.. సంఖ్య ప్రస్తుతం 14కి తగ్గిపోయింది. రుణభారం దాదాపు రూ. 8,000 కోట్ల మేర పేరుకుపోయింది. వాటాల రేసులో నరేష్ గోయల్ కూడా.. జెట్ ఎయిర్వేస్లో వాటాల కొనుగోలు రేసులో మాజీ చైర్మన్ నరేష్ గోయల్ కూడా పోటీపడనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన కూడా బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని వివరించాయి. ఇందుకు నిబంధనలు కూడా అనుమతిస్తున్నట్లు తెలిపాయి. నరేష్ గోయల్ సహా ఎవరైనా సరే బ్యాంకుల కన్సార్షియం విక్రయిస్తున్న వాటాల కొనుగోలుకు పోటీపడొచ్చంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ గోయల్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో గోయల్ కూడా పోటీలో ఉంటారన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్ ఎయిర్వేస్లో 31–75% దాకా వాటాలు విక్రయిస్తున్న బ్యాంకుల కన్సార్షియం బిడ్స్ దాఖలుకు గడువును ఏప్రిల్ 12కి పొడిగించింది. ఈశాన్య రాష్ట్రాలకు సేవలు నిలిపివేత.. మరోవైపు, తూర్పు, ఈశాన్య భారతంలోని ప్రాంతాలకు జెట్ సర్వీసులు నిలిపివేసినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీంతో కోల్‌కతా, పాట్నా, గౌహతి తదితర ప్రాంతాలకు జెట్ విమానసేవలు ఆగిపోయాయని పేర్కొన్నాయి. నిర్వహణపరమైన కారణాలతో కోల్‌కతా–గౌహతి, ముంబై–కోల్‌కతా, డెహ్రాడూన్–గౌహతి (వయా కోల్‌కతా) మధ్య సేవలను శుక్రవారం (ఏప్రిల్ 12న) నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ వివరణనిచ్చింది. అలాగే ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి లండన్, ఆమ్స్టర్డామ్, ప్యారిస్‌కు ఏప్రిల్ 12న నడపాల్సిన విమాన సేవలను నిర్వహణపరమైన కారణాల వల్ల నిలిపివేస్తున్నట్లు జెట్ వర్గాలు తెలిపాయి. -
ఉపాధి మూత
గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో అనేక మంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. గల్ఫ్‌లో కొంత కాలం నుంచి సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా వలస కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. ఫలితంగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో కొన్ని కంపెనీలు మూతబడగా.. అనేక కంపెనీలు దశలవారీగా తమ కాంట్రాక్టులను నిలిపివేస్తున్నాయి. ఎప్పటికైనా ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోతాయా తమ జీవన స్థితిగతులు మారకపోతాయా అని నమ్మిన కొంత మంది కార్మికులు మొండి ధైర్యంతో సౌదీలోనే ఉండిపోయారు. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవడంతో కార్మికులు ఇంటికి చేరుకోక తప్పడం లేదు. అలాగే ఒమన్, కువైట్, ఇరాక్ దేశాల్లోనూ కంపెనీలు దివాళా స్థితికి చేరుకుంటుండటంతో ఆ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు ఇంటిదారిపడుతు న్నారు. చమురు ధరలు తగ్గిపోవడం గల్ఫ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సౌదీ, ఒమన్, కువైట్ తదితర దేశాల్లో ఆ దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృపరచాలని అక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో వలస కార్మికుల ఉపాధికి గండిపడుతుంది. అలాగే ఏదో ఒక దేశంలో ప్రతి ఏటా ఆమ్నెస్టీ(క్షమాభిక్ష) ప్రకటిస్తున్నాయి. ఆమ్నెస్టీ వల్ల అకామా, వీసా లేనివారు సొంత దేశాలకు వెళ్లడానికి సులభమైన మార్గం కలుగుతుంది. ఆమ్నెస్టీ అమలు చేయడానికి ఆర్థిక సంక్షోభం కూడా ఒక కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానూ అనేక మంది కార్మికులు ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటి ముఖం పడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) కేరళ తరహాలోపునరావాసం కల్పించాలి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి అక్కడ పరిస్థితులు బాగాలేక ఇంటి ముఖం పట్టిన కార్మికుల సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలో పునరావాస చర్యలు తీసుకోవాల్సి ఉంది. స్వగ్రామాలకు వచ్చిన తరువాత పునరావాసం లేకపోవడంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చితికిపోయి కుటుంబ పోషణ భారం కావడంతో కొందరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రవాస కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లేదా వేర్వేరుగా పునరావాసం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వలస కార్మికుల జీవన స్థితి గతులపై పరిశోధన చేసిన మేధావులు వెల్లడిస్తున్నారు. ప్రవాస కార్మికుల పునరావాసం కోసం ఏర్పాటు చేసే సంస్థ శాశ్వత ప్రాతిపదికన పనిచేసేదిగా ఉండాలని సూచిస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన కార్మికులు గల్ఫ్ నుంచి తిరిగి వస్తే వారికి పునరావాసం కల్పించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. కార్మికులు గల్ఫ్ దేశంలో పొందిన నైపుణ్యాన్ని కేరళ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఒక వేళ నేరుగా కార్మికుల నైపుణ్యాన్ని వినియోగించుకునే పరిస్థితి లేకపోతే వారికి రాయితీపై రుణాలు అందించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కృషిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం కేరళ ప్రభుత్వం ప్రవాసుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే. అలాంటి మంత్రిత్వ శాఖను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేరలేదు. నైపుణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళుతున్న కార్మికులు ఇక్కడ ఎలాంటి నైపుణ్యం సంపాదించుకోకపోయినా ఆ దేశాలకు వెళ్లిన తరువాత కొంత నైపుణ్యం సాధిస్తున్నారు. గల్ఫ్ నుంచి తిరిగివచ్చిన కార్మికుల నైపుణ్యాన్ని ప్రభుత్వం వినియోగించుకోలేకపోతే.. కార్మికులకు తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. వారికి పునరావాసంతో పాటు పునరేకీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పునరావాస చర్యలు అవసరం ప్రవాస కార్మికులకు పునరావాస చర్యలు ఎంతో అవసరం. స్వదేశంలో ఉపాధి లేకనే పొరుగు దేశాలకు.. ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. ఆ దేశాల్లో పరిస్థితి బాగాలేకపోవడంతో ప్రతి ఏటా ఇంటికి చేరుకుంటున్న ప్రవాసుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సందర్బంలో కార్మికులకు మన ప్రభుత్వం ఉపాధి చూపాల్సిన అవసరం ఉంది. పునరావాస చర్యల ద్వారానే ప్రవాస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. అలాగే ప్రవాస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.– ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ,విదేశీ వలసల పరిశోధకుడు స్వదేశంలో ఉపాధి చూపాలి విదేశాల నుంచి సొంత గ్రామానికి తిరిగి వస్తున్న కార్మికులకు ప్రభుత్వం స్వదేశంలో ఉపాధి చూపాలి. ఎంతో మంది కార్మికులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో స్వదేశానికి తిరిగి చేరుకుంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా సమా జంలో చులకన భావానికి గురవుతున్నారు. ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకుంటే స్వదేశానికి వచ్చే ప్రవాస కార్మికులు మానసికంగా ధైర్యంగా ఉంటారు. – నాగిరెడ్డి ప్రశాంతి,సౌమ్య ట్రావెల్ బ్యూరోనిర్వాహకురాలు రాయితీ రుణాలు ఇవ్వాలి గల్ఫ్ దేశాల్లో ఉపాధికి నోచుకోకుండా సొంత దేశానికి వస్తున్న కార్మికులకు ప్రభుత్వం రాయితీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. రుణాలు ఇవ్వడం వల్ల కార్మికులపై ఆర్థిక భారం తప్పుతుంది. ఫలితంగా వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రవాస కార్మికులకు ఉపాధి చూపడం లేదా రాయితీ రుణాలు ఇవ్వడం వల్ల వారు సొంతంగా ఉపాధి చూసుకునే అవకాశం ఉంటుంది. – జక్కుల చంద్రశేఖర్,సర్పంచ్ భూపతిపూర్(ఒమన్ రిటర్నీ) పునరావాసం కల్పించడంప్రభుత్వ బాధ్యత గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఉద్యోగాలు కోల్పోతున్నవారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. విదేశాల్లో ఉపాధి కరువై గత్యంతరం లేక స్వదేశానికి చేరుకున్నవారికి ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. స్వదేశంలో ఉపాధి చూపించకపోతే కార్మికులు మనోవేదనకు గురై ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి పునరావాస కార్యక్రమాలను అమలు చేయాలి.– సూర్యప్రకాష్,ఐసీబీఎఫ్ మాజీ సభ్యుడు, ఖతార్ -
వెనిజులాలో అగ్రరాజ్యాల ఆధిపత్యం!
మాస్కో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న వెనిజులాలో రష్యా సైన్యం అడుగుపెట్టింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు మద్దతుగా తమ సైన్యం ఆ దేశానికి చేరుకున్నట్లు రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా తెలిపారు. ఇరుదేశాల మధ్య కుదిరిన సైనిక సహకార ఒప్పందం మేరకే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. వెనిజులాలో ఉండే ప్రతీ హక్కు రష్యా సైన్యానికి ఉందని తేల్చిచెప్పారు. అయితే వెనిజులాకు ఎంతమంది రష్యా సైనికులు చేరుకున్నారన్న విషయమై మారియా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–రష్యా సంబంధాలు మరింత దిగజారనున్నాయి. -
‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’
ముంబై : మేం కూడా సాధరణ మనుషులమే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఒత్తిడికి గురవుతాం. కానీ ఒక్కసారి కాక్‌పిట్‌లో ప్రవేశించామంటే.. అన్ని సమస్యలను పక్కన పెట్టేస్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టిన వారిగా మిగిలిపోవాల్సి వస్తుందంటున్నారు జెట్ ఎయిర్వేస్ సీనియర్ కమాండర్ ఒకరు. దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక సంక్షభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం. ఈ విషయం గురించి గత 20 ఏళ్లుగా జెట్ ఎయిర్వేస్ సంస్థలో బోయింగ్ 7777 కమాండర్‌గా పనిచేస్తున్న కరణ్ చోప్రా మాట్లాడుతూ.. ‘మేం కూడా అందరి లాంటి వాళ్లమే. నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇల్లు గడవడం కోసం మా అమ్మ నగలను కుదవపెట్టాను. ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంత కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒత్తిడిని మేం కాక్‌పిట్ బయటే వదిలేసి వెళ్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసిన వారిగా మిగులుతాం’ అని తెలిపారు. అంతేకాక మిగితా ఉద్యోగాలతో పోలిస్తే.. దీనికి చాలా ఏకాగ్రత, ప్రశాంతమైన మనసు అవసరం అని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 1 లోగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోయినా.. జీతాలు ఇవ్వకపోయిన నిరవధిక సమ్మెకు దిగుతాం అని తెలిపారు. మరో సీనియర్ కమాండర్ మాట్లాడుతూ.. ‘ఒక వేళ జెట్ ఎయిర్వేస్ ఈ సంక్షభం నుంచి బయటపడకపోతే.. దాదాపు 1500 మంది ఉద్యోగులు వీధిన పడాల్సి వస్తుంది. ప్రసుత్తం మార్కెట్లో ఇన్ని ఖాళీలు కూడా లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఎవరి మీద నిందలు వేయడం సరికాదు’ అని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతూ వస్తోంది. చాలా వరకు విమానాలను నడపకుండా నిలిపివేసింది. వేతనాల చెల్లింపుల్లోనూ జాప్యం అవుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్ ఎయిర్వేస్ కూడా జెట్ ఎయిర్వేస్ నుంచి తప్పుకోవాలని చూస్తోంది. -
జెట్‌కు బ్యాంకుల బాసట
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్వేస్ కుప్పకూలకుండా చూసేందుకు బ్యాంకర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేనేజ్మెంట్ మార్పు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మేనేజ్మెంట్తో కంపెనీ నిర్వహణ సాధ్యపడే అవకాశాలు లేనందున.. జెట్ ఎయిర్వేస్ను పునరుద్ధరించేందుకు బ్యాంకులు రూపొందించిన ప్రణాళికలో యాజమాన్య మార్పు ప్రతిపాదన ఉండొచ్చని వివరించారు. దివాలా కోడ్ పరిష్కారం కాదు.. జెట్ ఎయిర్వేస్ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి వివరించేందుకే జైట్లీతో భేటీ అయినట్లు సమావేశం అనంతరం రజనీష్ కుమార్ చెప్పారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై బ్యాంకులు గత అయిదు నెలలుగా కసరత్తు చేస్తున్నాయని, ఇది దాదాపు సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. సర్వీసుల రంగంలో ఉన్న జెట్ లాంటి కంపెనీ నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు దివాలా కోడ్‌ను తక్షణం ప్రయోగించడం పరిష్కారం కాదని, ఇది ఆఖరు అస్త్రం మాత్రమే కాగలదని కుమార్ చెప్పారు. ‘ఐబీసీని ప్రయోగించడమంటే కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడమే. అయితే, ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదనే మేం భావిస్తున్నాం. కాబట్టి జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. వీటిని.. ఒక వ్యక్తినో లేదా ప్రమోటరునో కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా భావించనక్కర్లేదు. బ్యాంకుల, దేశ, ఏవియేషన్ రంగ ప్రయోజనాలను కాపాడేందుకు జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే పునరుద్ధరణ ప్రణాళిక గురించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. జెట్ లో కొత్తగా మరో వాటాదారును తెస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. సంస్థలో 24% వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్ వాటి విక్రయం కోసం ఎస్బీఐ ని సంప్రతించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్‌లో ప్రమోటరు నరేష్ గోయల్‌కు 51% వాటాలు ఉన్నాయి. దాదాపు రూ. 8,200 కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే రుణదాతలకు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి కంపెనీ రూ. 1,700 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. 119 విమానాలకు గాను.. ప్రస్తుతం కేవలం 41 ఎయిర్‌క్రాఫ్ట్స్ మాత్రమే నడుపుతోంది. జీతాలు బకాయిపడటంతో అటు ఉద్యోగులూ ఆందోళనకు దిగబోతున్నారు. తక్షణం జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమానసేవలు నిలిపివేస్తామంటూ పైలట్ల యూనియన్ హెచ్చరించింది. కంపెనీ గానీ మూతబడితే దాదాపు 23,000 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. స్లాట్స్‌ను వేరే సంస్థలకు కేటాయించడంపై దృష్టి.. జెట్ ఎయిర్వేస్ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో నిరుపయోగంగా ఉంటున్న ఆ సంస్థ స్లాట్స్‌ను తాత్కాలికంగా ఇతర దేశీ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఎయిరిండియా, స్పైస్‌జెట్, గోఎయిర్, ఇండిగో ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎన్ని స్లాట్స్ ఉపయోగిస్తోంది, ఎన్ని అవసరం ఉందన్న దానిపై జెట్ ఎయిర్‌వేస్‌తో చర్చించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. రద్దీ సీజన్లో ఫ్లయిట్స్ రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రధానికి పైలట్ల లేఖ.. జీతాల బకాయిల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసింది. 7 నెలలుగా కంపెనీ జీతాలను సక్రమంగా చెల్లించడం లేదని.. దీంతో పైలట్లు, ఇంజనీర్లు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. ‘జెట్ ఎయిర్వేస్ పతనం అంచున ఉందన్న భయాలు నెలకొన్నాయి. అదే జరిగితే వేల మంది సిబ్బంది ఉపాధి కోల్పోతారు. విమానాలు అందుబాటులో లేకపోవడం వల్ల చార్జీలు పెరిగిపోతాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని వివరించింది. ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నందున.. భద్రతా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించింది. మార్చి నెలాఖరులోగా జీతాల బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలు పూర్తిగా ఆపేస్తామంటూ పైలట్లు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. జెట్ విమానాలపై స్పైస్‌జెట్ కన్ను.. మరోవైపు జెట్ ఎయిర్వేస్ కష్టాలు పోటీ సంస్థ స్పైస్‌జెట్‌కు వరంగా మారుతున్నాయి. పలు జెట్ ఫ్లయిట్స్ రద్దవుతుండటంతో.. ప్రయాణికులు స్పైస్‌జెట్ వైపు మళ్లుతారన్న అంచనాలతో ఆ సంస్థ షేరు బుధవారం పెరిగింది. జెట్ ఎయిర్వేస్కి చెందిన పలు విమానాలు నిల్చిపోవడంతో వాటిలో కొన్నింటిని తీసుకోవాలని పోటీ సంస్థ స్పైస్‌జెట్ యోచిస్తోంది. ఇటీవల నిషేధం వేటుపడిన బోయింగ్ 737 మ్యాక్స్ రకం 12 విమానాలను పక్కనపెట్టాల్సి రావడంతో స్పైస్‌జెట్ విమానాల కొరత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ విమానాలను తీసుకోవడంపై దృష్టి సారించింది. అటు జెట్ ఎయిర్వేస్ గానీ దివాలా తీస్తే.. తమ విమానాలు భారత్‌లోనే చిక్కుబడిపోతాయన్న భయంతో లీజుకిచ్చిన సంస్థలు (లెస్సర్లు) కూడా స్పైస్‌జెట్ వెంటపడుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 50 ఎయిర్‌క్రాఫ్ట్‌లను స్పైస్‌జెట్‌కు లెస్సర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాయి. -
జెట్ ఎయిర్వేస్లో సంక్షోభం
ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. భాగస్వామ్య సంస్థ ఎతిహాద్ కూడా ఏదో ఒక ధరకు వాటాలు విక్రయించేసి తప్పుకునే ప్రయత్నాల్లో ఉంది. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్‌లో తమకున్న 24 శాతం వాటాలను రూ. 400 కోట్లకు అమ్మేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీని ప్రకారం చూస్తే జెట్ ఎయిర్వేస్ విలువ రూ. 1,800 కోట్లుగా ఉండనుంది. దీంతో పాటు .. జెట్ ప్రివిలెజ్ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా ఎస్బీఐకి ఎతిహాద్ ఆఫర్ చేసింది. ఒకవేళ అదే జరిగితే.. ఇప్పటికే రుణాల చెల్లింపుల్లో ఢీఫాల్ట్ అవుతున్న జెట్ పరిస్థితి మరింత జటిలంగా మారనుంది. దాదాపు రూ. 8,200 కోట్ల మేర రుణభారంలో ఉన్న జెట్ ఈ నెలాఖరు కల్లా రూ. 1,700 కోట్లు చెల్లించాల్సి ఉంది. భారీగా రుణభారంతో దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ని జెట్ ఎయిర్వేస్ తలపిస్తుండటం గమనార్హం. పైలట్లు, ఇంజినీర్ల హెచ్చరికలు.. మరోవైపు, జీతాల చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతుండటంతో పైలట్లు సైతం పోరు బాట పట్టనున్నారు. మార్చి 31లోగా పరిష్కార ప్రణాళికపై స్పష్టతనిచ్చి, తమ జీతాల బకాయిలను చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలు నిలిపివేస్తామంటూ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) హెచ్చరించింది. అటు, జెట్ విమానాల నిర్వహణ ఇంజనీర్ల సంఘం (జేఏఎంఈడబ్ల్యూఏ) కూడా తమ జీతాల విషయంలో జోక్యం చేసుకుని, బకాయిలు ఇప్పించాలంటూ డీజీసీఏకి ఈ–మెయిల్ పంపింది. మూడు నెలలుగా జీతాలు రాకపోతుండటంతో ఆర్థిక సమస్యలతో తమపై మానసికంగా ఒత్తిడి పెరిగిపోతోందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఇది మరింత తీవ్రమైతే ఫ్లయిట్ భద్రతకు ప్రమాదమని తెలిపారు. వందకు పైగా విమానాల నిర్వహణ కోసం జెట్ ఎయిర్వేస్లో సుమారు 560 మంది ఇంజనీర్లు ఉన్నారు. అటు మొత్తం 119 విమానాల్లో జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం 41 విమానాలతో దేశీయంగా 603, విదేశీ రూట్లలో 382 ఫ్లయిట్స్ నడుపుతోందని డీజీసీఏ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గొచ్చని మంగళవారం జెట్ యాజమాన్యంతో సమావేశం అనంతరం డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులను విధుల్లోకి పంపొద్దని జెట్‌కు సూచించినట్లు వివరించాయి. కేంద్రం సమీక్ష.. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. జెట్ ఎయిర్వేస్కు నిధులు సమకూర్చి, దివాలా తీయకుండా చూడాలంటూ బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. ఎన్నికల వేళ జెట్ ఎయిర్వేస్ గానీ దివాలా తీస్తే.. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడటం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోందని సంబ ంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాన వాటాదారులు (వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఎతిహాద్ ఎయిర్వేస్) గానీ మరిన్ని వాటాలను తనఖా ఉంచిన పక్షంలో బ్యాంకులు మరికొంత మేర రుణాలిచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గడిచిన ఏడాదికాలంగా జెట్ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్ర ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు బ్యాంకుల నుంచి సమాచారం తెలుసుకుంటూనే ఉందని వివరించాయి. జెట్‌లో నరేష్ గోయల్, ఆయన కుటుంబానికి 52%, ఎతిహాద్‌కు 24 శాతం వాటాలు ఉన్నాయి. రుణాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొంత రుణాన్ని బ్యాంకులు ఈక్విటీ వాటాల కింద మార్చుకునే ప్రతిపాదనకు జెట్ బోర్డు గత నెల ఆమోదముద్ర వేసింది. దీంతో జెట్ ఎయిర్వేస్లో బ్యాంకులే అతిపెద్ద వాటాదారుగా మారనున్నాయి. ఇక, రుణభారం, ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ పెద్ద స్థాయిలో ఫ్లయిట్స్‌ను రద్దు చేస్తుండటంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు దృష్టి సారించారు. ఫ్లయిట్స్ రద్దు, అడ్వాన్స్ బుకింగ్స్, రీఫండ్స్, భద్రతాపరమైన అంశాలు మొదలైన వాటన్నింటినీ సమీక్షించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి కూడా నివేదిక తీసుకోవాలని సూచించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయాలు తెలిపారు. -
అనుమతి లేకుండా మొండిబాకీలుగా ప్రకటించొద్దు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థల ఖాతాలను తమ అనుమతి లేకుండా మొండిపద్దుల కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రకటించరాదని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశించింది. సంస్థ రుణ పరిష్కార ప్రణాళిక సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ. 90,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన ఐఎల్ఎఫ్ఎస్ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కొత్త మేనేజ్మెంట్.. ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలు కోసం ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్సీఎల్ఏటీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌లో కాస్త మెరుగ్గా ఉన్న 22 కంపెనీలు తమ తమ రుణాల చెల్లింపు ప్రక్రియలను యథావిధిగా కొనసాగించేందుకు ఫిబ్రవరి 11న హియరింగ్‌లో ఎన్సీఎల్ఏటీ అనుమతించింది. అలాగే, రుణ పరిష్కార ప్రక్రియ పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. -
ఎయిరిండియా ముంబై భవంతిపై ఎల్ఐసీ ఆసక్తి
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాకు దక్షిణ ముంబైలో ఉన్న 23 అంతస్తుల భవంతిపై పలు ప్రభుత్వ రంగ సంస్థలు కన్నేశాయి. ఈ ప్రాపర్టీని విక్రయించాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ అంతకన్నా ముందే ఎల్ఐసీ, జీఐసీ వంటి ప్రభుత్వ రంగ బీమా దిగ్గజాలు దీనిపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎయిర్‌లైన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణ ముంబైలోని కీలక వ్యాపార కేంద్రం నారిమన్ పాయింట్లో ఈ భవంతి ఉంది. ఇది తమ తమ ప్రధాన కార్యాలయాలకు దగ్గర్లో ఉండటంతో ఎల్ఐసీ, జీఐసీ వంటి సంస్థలు దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 2013– 2018 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ ప్రాపర్టీపై లీజు రెంటల్స్ రూపంలో ఎయిరిండియాకు రూ.291 కోట్ల ఆదాయం వచ్చింది. అటు జవహర్లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్టు (జేఎన్పీటీ) కూడా దీనిపై ఆసక్తిగా ఉంది. దాదాపు రూ.55,000 కోట్ల మేర రుణ భారం పేరుకుపోయిన నేపథ్యంలో.. ప్రధాన వ్యాపారేతర ఆస్తులను విక్రయించడం ద్వారా భారాన్ని తగ్గించుకునేందుకు ఎయిరిండియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
జెట్‌లో కొనసాగుతున్న ఉద్వాసనలు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా మరో 16 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్, కొచి కార్యాలయాల్లో పని చేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘జెట్ ఎయిర్వేస్ పరిమిత స్థాయిలో కొద్ది కొద్దిగా ఉద్యోగులను తొలగించడం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కార్యాలయాన్ని మూసివేసింది. ఇందులో నలుగురైదుగురు సిబ్బంది ఉండేవారు. గతవారం కొచ్చి కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో కొందరికి వైదొలగాలంటూ సూచన కూడా చేసింది. మొత్తం మీద ఈ రెండు కార్యాలయాలకు సంబంధించి 16 మందిని తొలగించినట్లయింది‘ అని సంబంధిత వర్గాలు వివరించాయి. గత నెలాఖరులోనే 20 మంది ఉద్యోగులకు జెట్ ఉద్వాసన పలికింది. వీరిలో సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు మొదలుకుని ఇన్–ఫ్లయిట్ సర్వీసుల విభాగాలకు చెందిన సిబ్బంది దాకా ఉన్నారు. అంతకు ముందు ఇంజినీరింగ్, సెక్యూరిటీ, సేల్స్ తదితర విభాగాల్లో మేనేజర్ స్థాయిలోని 15 మంది దాకా ఉద్యోగులను తప్పుకోవాలని సంస్థ సూచించినట్లు సమాచారం. జెట్ ఎయిర్వేస్లో 16,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. టర్నెరౌండ్ ప్రణాళికలో భాగం.. ఉద్యోగుల తొలగింపు అంశంపై స్పందిస్తూ... టర్న్ అరౌండ్ ప్రణాళికలో భాగంగా నిర్దిష్ట నగరాల్లో వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. దీని ప్రకారంగానే నెట్వర్క్, సిబ్బంది వినియోగం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షిస్తున్నామని, లాభసాటిగా లేని రూట్ల నుంచి మెరుగైన రూట్ల వైపు వనరులను మళ్లిస్తున్నామని పేర్కొంది. జెట్ ఎయిర్వేస్ వరుసగా మూడు త్రైమాసికాలుగా భారీ నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,261 కోట్లు నష్టాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వివిధ వనరుల ద్వారా నిధు లు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే ఇటీవలే వెల్లడించారు. -
పాక్‌కు అన్నివిధాలా సాయం
బీజింగ్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను అన్నిరకాలుగా ఆదుకుంటామని చైనా తెలిపింది. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడంలో భాగంగా వ్యవసాయం, పరిశ్రమలు, టెక్నాలజీ సహా 16 రంగాల్లో పాక్‌తో శనివారం ఒప్పందం చేసుకుంది. చైనాలో తొలిసారి పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా ప్రధాని కెకియాంగ్‌తో ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అనంతరం ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ..‘చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యాయి. 2013లో ఇది ఒక ఆలోచన మాత్రమే. కానీ ఇప్పుడది కార్యరూపం దాల్చింది’ అని తెలిపారు. కెకియాంగ్ స్పందిస్తూ..‘చైనా, పాకిస్తాన్ల మధ్య అన్ని రంగాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాక్‌కు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో భాగంగానే పాక్‌లో పేదరిక నిర్మూలన కోసం ఒప్పందాలు చేసుకున్నాం’ అని వెల్లడించారు. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పరిరక్షణకు చర్యలు..
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ విలువను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బోర్డు పేర్కొంది. వ్యవస్థాగతంగా కీలకమైన సంస్థను గట్టెక్కించే ప్రణాళిక రూపకల్పన కోసం తరచూ భేటీ కానున్నట్లు తెలిపింది. గురువారం తొలిసారిగా భేటీ అయిన కొత్త బోర్డు దాదాపు అయిదు గంటల పాటు కంపెనీ వ్యవహారాలపై చర్చించింది. గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇతర వాటాదారులతో కూడా తగు సమయంలో భేటీ కానున్నట్లు సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ ఉదయ్ కొటక్.. విలేకరులకు తెలిపారు. గ్రూప్ ఆడిట్ కమిటీ చైర్మన్‌గా బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆడిటర్ నందకిశోర్ ఎంపికయ్యారని చెప్పారు. దాదాపు రూ. 91,000 కోట్ల రుణ భారమున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతుండటం.. మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రంగంలోకి దిగి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు కొత్త బోర్డును నియమించింది. ఉదయ్ కొటక్ సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డులో సెబీ మాజీ చైర్మన్ జీఎన్ బాజ్‌పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది, ఐఏఎస్ అధికారి మాలిని శంకర్, టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తదితరులు ఉన్నారు. మారుతీ చైర్మన్ పదవి నుంచి తప్పుకునేది లేదు: భార్గవ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం నేపథ్యంలో తాను మారుతీ సుజుకీ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న వార్తలను ఆర్సీ భార్గవ ఖండించారు. చట్టప్రకారం తాను తప్పు చేసినట్లు రుజువైతే తప్ప తప్పుకోనక్కర్లేదని గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ డైరెక్టరుగా వ్యవహరించిన భార్గవ తెలిపారు. వడ్డీలు చెల్లించేందుకు తగినన్ని నిధులు లేవన్న అంశం మేనేజ్మెంట్కు మూడు నాలుగేళ్లుగా తెలుసన్నారు. బోర్డు సమావేశాల్లో పలు మార్లు ఇది చర్చకు వచ్చేదని, తగు పరిష్కార మార్గాలపై ప్రణాళికల రూపకల్పన కూడా జరిగేదని చెప్పారాయన. యాజమాన్య నిర్వహణ లోపాలు, నిర్లక్ష్య ధోరణుల ఆరోపణలతో 10 మంది మాజీ డైరెక్టర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వేసిన పిటీషన్లో భార్గవ పేరు కూడా ఉంది. ఈ పది మందిని ఇతర కంపెనీల బోర్డుల్లో కొనసాగనివ్వబోరంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మార్కెట్‌పై సంక్షోభ ప్రభావం పెద్దగా పడదు: జైట్లీ ఐఎల్ఎఫ్ఎస్ సంస్థలో సంక్షోభాన్ని మొదట్లోనే నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కనుక ఇదేమంత తీవ్ర ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.91,000 కోట్ల రుణాలను తీసుకుని, ఇటీవల పలు చెల్లింపుల్లో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ విఫలం కావడంతో, బోర్డును ప్రభుత్వం సస్పెండ్ చేసి తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐఎల్ఎఫ్ఎస్లో సంక్షోభం మార్కెట్లలో నిధుల సమస్యకు దారితీస్తుందన్న ఆందోళనలు తలెత్తడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్‌కోటక్ నేతృత్వంలో ఐఎల్ఎఫ్ఎస్కు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ‘‘ఇది దేశ అంతర్గత అంశం. వేగంగా దీనికి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. కనుక ఏమంత తీవ్ర ప్రభావం ఉండదు’’అని జైట్లీ పేర్కొన్నారు. -
సంస్కరణలను కొనసాగించాల్సిందే
వాషింగ్టన్: సంస్కరణల మార్గం తప్పుతున్న దేశాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బుధవారం హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భద్రత తగ్గుతుందని, స్థిరత్వం అపాయంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా దేశాలు పరస్పర సహకారంతో సంస్కరణలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత పదేళ్ల కాలంలో సంస్కరణల తీరు, భవిష్యత్తుకు సంబంధించి ఓ నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 10 ఏళ్ల కాలంలో ప్రగతి స్పష్టంగా ఉందంటూ, సంస్కరణల ఎంజెడా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. సంస్కరణలను ఉపసంహరించుకుంటే, రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్ అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. ఇది నియంత్రణ, పర్యవేక్షణ మరింత పడిపోయేందుకు దారితీస్తుందని అభిప్రాయపడింది. సైబర్ సెక్యూరిటీ రిస్క్ పెరగడం వల్ల ఆర్థిక సంస్థలకు సవాళ్లు పొంచి ఉన్నాయని... ఈ విషయంలో నియంత్రణ, పర్యవేక్షణ సంస్థలు సదా అప్రమత్తంగా ఉండి, అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. -
ఐఎల్ఎఫ్ఎస్ మళ్లీ డిఫాల్ట్
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో భాగమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్ (ఐటీఎన్‌ఎల్) దాదాపు రూ. 21 కోట్లు డిఫాల్ట్ అయింది. మూడు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ)పై వడ్డీ చెల్లింపులు జరపలేకపోయినట్లు సంస్థ తెలిపింది. జూన్ 30 నుంచి సెప్టెంబర్ 29 మధ్యలో వీటిని చెల్లించాల్సి ఉన్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. 19 సిరీస్ బీ కింద రూ. 10.58 కోట్లు, 19ఎం సిరీస్ ఏపై రూ. 6.95 కోట్లు, సిరీస్ 3పై రూ. 3.24 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, వడ్డీ డిఫాల్ట్ అయినప్పటికీ బుధవారం ఐటీఎన్‌ఎల్ షేరు బీఎస్ఈలో 20 శాతం పెరిగి రూ.32.15 వద్ద క్లోజయ్యింది. దాదాపు రూ. 91,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇప్పటిదాకా పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. రైట్స్ ఇష్యూకు సెంట్రల్ బ్యాంక్ దూరం ! ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ప్రతిపాదిత రూ.4,500 కోట్ల రైట్స్ ఇష్యూలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాల్గొనకపోవచ్చని సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. నేడు బోర్డు సమావేశం .. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో పరిస్థితులను చక్కదిద్దే ప్రణాళికను రూపొందించేందుకు కొత్తగా ఏర్పాటైన బోర్డు గురువారం సమావేశం కానుంది. సంస్థ ఆర్థిక పరిస్థితులను మదింపు చేయడంతో పాటు తగు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై బోర్డు 15 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. కంపెనీ పాత బోర్డును రద్దు చేసి ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కేంద్రం కొత్త బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, గ్రూప్‌తో పాటు 160 అనుబంధ సంస్థల కార్యకలాపాలపై కూడా విచారణ జరపాలంటూ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో)ను కూడా ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక) అక్టోబర్ 30న సమావేశం కానుంది. కంపెనీలో వాటాదారులైన ఎల్ఐసీ, ఎస్బీఐ ప్రతినిధులతో పాటు ప్రస్తుత మేనేజ్మెంట్ను కూడా సమావేశానికి హాజరు కావాలని సూచించినట్లు మొయిలీ తెలిపారు. పార్లమెంటరీ కమిటీ రెండు నెలల్లోగా నివేదికను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. -
మరోసారి ఆర్థిక సంక్షోభంలో అమెరికా
న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందట. 2008లో ఎదుర్కొన్న సంక్షోభం మాదిరే మళ్లీ తలెత్తే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తెలిపారు. ఇటీవల జరిగిన ''ఆస్క్ మి ఏనీథింగ్(నన్నేమైనా అడగండి)'' అనే కార్యక్రమంలో బిల్‌గేట్స్ ఈ విషయాన్ని తెలిపారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటిది సమీప భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్నదా? అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బిల్‌గేట్స్.. అవును అని చెప్పడం కష్టమే అయినప్పటికీ అలాంటి సంక్షోభం తలెత్తడం తథ్యమని హెచ్చరికలు జారీచేశారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇరకాటంలో కూరుకుపోయింది. దాదాపు 88 లక్షల ఉద్యోగాలు అమెరికన్ ప్రజలు కోల్పోయారు. అమెరికా ప్రజల నికర సంపద కూడా 19 ట్రిలియన్ డాలర్లకు పైగా(19 లక్షల కోట్ల డాలర్లు) హరించుకుపోయింది. గృహాలు లేనివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని గేట్స్ చెప్పినప్పటికీ, ఇన్నోవేషన్, క్యాపిటలిజం మరింత మెరుగైతే దాన్ని నుంచి బయటపడటం సాధ్యమవుతుందని గేట్స్ చెప్పారు. -
ఆకలి, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత
కారాకాస్, వెనెజులా : ఆ బ్రిడ్జి దాటితే చాలు.. గుక్కెడు నీళ్లు తాగొచ్చు. ఆ బ్రిడ్జి దాటితే చాలు ఒక్క ముద్ద యంగిలి పడొచ్చు. ఇది సగటు వెనెజులా వాసి ఆలోచన. కొలంబియా దేశానికి వలస పోవడమే లక్ష్యంగా వేలాది మంది వెనెజులియన్లు కదులుతున్నారు. రోజు రోజుకూ తీవ్రమవుతోన్న ఆర్థిక సంక్షోభం, పరుగెడుతున్న ద్రవ్యోల్బణం, ఆకలి, రాజకీయ అస్థిరత వెనెజులా ప్రజల పాలిట శాపంగా మారింది. రాయిటర్స్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో వెనెజులా రాజధాని కరాకస్‌లో 162 దోపిడీలు జరిగాయి. వీటిలో 42 ట్రక్కుల దోపిడీలు ఉన్నాయి. ఈ దోపడిల్లో ఎనిమిది హత్యలు జరిగాయి. అత్యధిక హత్యలు జరుగుతున్న దేశాల్లో వెనెజులా కూడా ఒకటి. ట్రక్కులపై దాడులు పెరుగుతుండటంతో రవాణా ఖరీదు కూడా బాగా పెరిగింది. ఆకలిని తట్టుకోలేక.. ప్రజలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రవాణా మార్గం ద్వారా తరలిస్తున్న ఆహార పదార్థాలను దోచుకునే గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. రవాణా చేస్తున్న వాహనంలో ఉన్న వారిని హత్య చేసి పదార్థాలను దుండగులు దోచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరగడంతో వాటికి ‘మ్యాడ్ మ్యాక్స్ వైలెన్స్’ అని పేరు పెట్టారు. వెనెజులా-కొలంబియాల మధ్య కీలక మార్గంగా ఉన్న సిమోన్ బొలివర్ ఇంటర్నేషనల్ బ్రిడ్జి గుండా కొలంబియాలోకి ప్రవేశించేందుకు వెనెజులియన్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణలో పడిన కొలంబియా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. దేశంలోకి ప్రవేశించడానికి యత్నించేవారిని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొలంబియాను ఆనుకుని ఉన్న బ్రెజిల్ సైతం సరిహద్దులో భద్రతను పెంచింది. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పింది.