ICICI Bank
-
ఐసీఐసీఐ కుంభకోణంలో కీలక సూత్రధారి టీడీపీ నాయకుడే
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట శాఖలో జరిగిన కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన టీడీపీ నేతను ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము కాజేసిన ఈ కుంభకోణంలో ఈ టీడీపీ నేతే సూత్రధారి అని అప్పట్లోనే తేటతెల్లమైనా, ఆయన్ని అరెస్టు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఆయన అరెస్టుకు సుదీర్ఘకాలం పట్టింది. కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న బ్యాంకు మేనేజర్ దూడ నరేష్ చంద్రశేఖర్ కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి కుంభకోణానికి సంబంధించిన వివరాలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి రూ. 35 కోట్ల అజిత్‌కుమార్, ఆయన తల్లి ఖాతాల్లో జమ అయినట్లు సీఐడీ విచారణలో తేలింది. దీంతో అజిత్ కుమార్‌ను అరెస్టు చేయక తప్పలేదు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఆయన్ని అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించటంతో నెల్లూరు జైలుకు తరలించారు. అరెస్టు సందర్భంగా అజిత్‌కుమార్, అయన సోదరుడు దీపక్ సీఐడీ అధికారులపై దురుసుగా ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికార పార్టీకి చెందిన తనను అరెస్టు చేస్తారా అంటూ ఎదురు తిరిగాడు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ అధికారులు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజిత్కుమార్పై కేసు నమోదు చేసిననట్లు రూరల్ ఎస్ఐ అనిల్‌కుమార్ చెప్పారు. టీడీపీ నేతగా హల్చల్ ఈ కుంభకోణం వెలుగు చూసిన వెంటనే మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కుంభకోణానికి సంబంధించిన విషయాలను సెల్ఫీ వీడియో ద్వారా విడదల చేశాడు. ఇందులో కీలక సూత్రధారి సింగ్ అజిత్‌కుమార్ అనే విషయం అప్పట్లోనే వెల్లడైంది. తనకు టీడీపీ అధిష్టానం వద్ద పలుకుబడి ఉందని, పార్టీ ఫండ్‌గా రూ. 4 కోట్ల ఇచ్చానని, టీడీపీ టికెట్ తనదేనని ప్రచారం చేసుకొన్నారు. ఎన్నారైగా చెప్పుకుంటూ పెద్ద కాన్వాయ్, దాంట్లో బౌన్సర్లతో హల్చల్ చేసేవాడు. అమెరికాలో ఉంటున్నట్లు చెప్పుకున్నప్పటికీ, తరుచూ స్వగ్రామానికి రావడంతో స్థానికుల్లోనూ అనుమానాలు ఉండేవి. ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ప్రత్తిపాటి పుల్లారావుకు రావడంతో ఆయనకు మద్దతుగా ప్రచారం చేశాడు. ఆయనకు ఎలక్షన్ ఫండ్ కింద రూ. 2 కోట్లు ఇచ్చినట్టు సైతం ప్రచారంలో ఉంది. ఇదీ జరిగింది.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచిలో ఖాతాదారుల సొమ్ము కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు గతేడాది అక్టోబర్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పలువురు ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు చేయడంతోపాటు గోల్డ్ లోన్లు పొందారు. రికరింగ్ డిపాజిట్ల వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు రావడంతో వారి ఖాతాల్లో డిపాజిట్లు మాయమైనట్లు తేలింది. దీంతో బాధితులు పెద్దఎత్తున బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు.బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజినల్ హెడ్ రమేష్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి చేరుకొని విచారణ జరిపి, కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. 2017 నుంచి చిలకలూరిపేట బ్రాంచి మేనేజర్‌గా వ్యవహరించిన దూడ నరేష్ చంద్రశేఖర్ ఈ గోల్‌మాల్‌లో కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆయన 2021లో నరసరావుపేట, 2023లో విజయవాడలోని భారతీనగర్ బ్రాంచికి బదిలీ అయ్యారు. 2024లో చిలకలూరిపేట బ్రాంచి కుంభకోణం వెలుగు చూడటంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. -
చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో నిందితురాలిగా ఉన్న చందా కొచ్చర్ కొత్త జర్నీని ప్రారంభించారు. ఐసీఐసీఐబ్యాంక్ సీఎండీగా ఉన్నపుడు చందా కొచ్చర్ క్రిడ్‌ప్రోకు పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో ఉద్యోగం కోల్పోవడంతో పాటు భర్త దీపక్ కొచ్చర్తో సహా జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం భర్తతో పాటు బెయిల్‌పై ఉన్న చందా కొచ్చర్ సోషల్ మీడియాలో సంచలనం రేపేందుకు సన్నద్ధమయ్యారు. యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ 'జర్నీ అన్‌స్క్రిప్టెడ్ విత్ చందా కొచ్చర్' ను లాంచ్ చేశారు. ఎలాంటి పరిణామాన్నైనా ఎందుర్కొనేందుకు ద్ధంగా ఉన్నాననీ, తన పాడ్‌కాస్ట్ చాలా విషయాలను వెలుగులోకి తీసుకొస్తుందని అన్నారు. జెన్ జెడ్ కి ఇష్టమైన మాధ్యమం ద్వారా వెలుగులోకి వస్తున్న చందాకొచ్చర్ పాడ్కాస్ట్పై కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.'జర్నీ అన్‌స్క్రిప్టెడ్' అనే పాడ్‌కాస్ట్‌ను చందా కొచ్చర్ ప్రారంభించారు. స్వయంగా తాను ఎంతో రీసెర్చ్ చేసి, అతిథులను స్వయంగా ఎంచుకుంటానని ఈ సందర్బంగా ఆమె చెప్పారు. నెలకు మూడు పాడ్‌కాస్ట్‌లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ప్రతిరోజూ కొత్తది నేర్చుకోవడం, మార్పుతోపాటు ముందుకు సాగడం ఈ రెండే తన లక్ష్యాలని ఆమె చెప్పారు. ఈ షోలో ఆమె తొలి అతిథి మారికో వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హర్ష్ మారివాలా. రెండో గెస్ట్‌గా నటుడు రాబోతున్నారని కూడా హింట్ ఇచ్చారు. కానీ ఆ గెస్ట్ పేరును వెల్లడించడానికి నిరాకరించారు. ఈ పాడ్‌కాస్ట్‌ను స్వతంత్ర కంటెంట్, డిజైన్ ఏజెన్సీ ‘ది సాల్ట్ ఇంక్’ రూపొందిస్తోంది. తొలి ఎపిసోడ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్లో దీన్ని షేర్ చేశారు. కాగా 1984లో ICICI బ్యాంక్‌లో చేరారు చందాకొచ్చర్. 2009లో బ్యాంకు ఎండీ, సీఈవో అయ్యారు. బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకులు లాభాల పరుగులు పెట్టించి గోల్డెన్ గర్ల్‌గా ప్రశంస లందుకున్నారు. 2010లో ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా కూడా స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు దేశీయ అత్యంత గౌరవనీయమైన ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ సహా, ఇంకా అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు.Thoroughly enjoyed this insightful debut podcast by Chanda Kochhar and one of my favorite people @hcmariwala. So many valuable learnings which Harsh has generously shared from his life experiences! Hear the full podcast in https://t.co/Tf2Ax3n8w1 . Some snippets here… pic.twitter.com/dwnkKVeH93— Harsh Goenka (@hvgoenka) February 16, 2025 2017లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించినప్పుడు ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు రూ.3,250 కోట్ల విలువైన రుణాల కేటాయింపు విషయంలో బ్యాంకు సీఎండీ అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. 2019లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు రూ.300 కోట్లు ఇచ్చాన మంజూరు కమిటీలో కొచ్చర్ భాగమని, చివరకు ఆ కంపెనీ దానిని చెల్లించడంలో విఫలమైందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో వేణుగోపాల్ ధూత్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకోలో కొచ్చర్ భాగమని సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్‌కు రూ.300 కోట్ల రుణం క్లియర్ అయిన ఒక రోజు తర్వాత దీపక్ కొచ్చర్ కంపెనీ నుపవర్ రెన్యూవబుల్స్‌లో వీడియోకాన్ రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ ఆరోపించింది. -
తేమ నుంచి తాగునీటికి ఏర్పాట్లు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాల్లోని తన కార్యాలయాల్లో అత్యాధునిక అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లను (AWG) ఏర్పాటు చేసింది. ఈ ఏడబ్ల్యూజీలు వాతావరణంలోని తేమ ద్వారా త్రాగునీటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ యూనిట్లు రోజుకు 8,000 లీటర్ల మంచినీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడబ్ల్యూజీ ప్లాంట్ల ద్వారా ఆయా ప్రదేశాల్లోని దాదాపు 4,200 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పింది.ఏడబ్ల్యూజీ ఎలా పని చేస్తుందంటే..వాతావరణంలోని తేమను గ్రహించి సూక్ష్మజీవులు లేని శుభ్రమైన తాగునీటిని ఉత్పత్తి చేసేందుకు అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లు (ఏడబ్ల్యూజీ) తోడ్పడుతాయి. ఈ ప్రక్రియలో తేమ ఘనీభవనం చెంది తర్వాత నీటి ఆవిరి బిందువులుగా రూపాంతరం చెందుతుంది. విభిన్న శ్రేణుల్లో వడపోత ప్రక్రియ జరుగుతుంది. తుదకు తాగేందుకు వీలైన శుభ్రమైన నీటిని అందిస్తుంది. పరిసర ఉష్ణోగ్రతలు 18-45 డిగ్రీ సెంటీగ్రేడ్, సాపేక్ష తేమ 25-100% ఉన్న సమయంలో ఈ ప్రక్రియ ద్వారా ఏడబ్ల్యూజీలు సంవత్సరం పొడవునా తాగునీటిని అందిస్తాయి. వాతావరణ తేమను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్యాకేజ్డ్ నీటిపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని బ్యాంకు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాతావరణంలో పునరుత్పాదక వనరును సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.‘పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’ఐసీఐసీఐ బ్యాంక్ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌమేంద్ర మట్టగజాసింగ్ మాట్లాడుతూ..‘పర్యావరణ పరిరక్షణకు బ్యాంక్ కట్టుబడి ఉంది. ఇందుకోసం 4R సూత్రం పాటిస్తున్నాం. R-రెడ్యుజ్(వాతావరణంలోని కాలుష్యాలను తగ్గించడం), R-రీయూజ్(వాటిని సమర్థవంతంగా తిరిగి ఉపయోగించడం), R-రిసైకిల్(రిసైకిల్ చేయడం), R-రెస్పాన్సిబుల్(బాధ్యతాయుతంగా వ్యవహరించడం) అనే విధానాలకు కట్టుబడి ఉన్నాం. ప్రపంచంలోని వివిధ నదుల్లో ఉన్న మంచినీటి కంటే వాతావరణంలోని తేమ అనేక రెట్లు అధికంగా ఉందని అంచనా. ఈ ఏడబ్ల్యూజీలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావంపడేలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు.ఇదీ చదవండి: రూ.26,000 కోట్ల విలువైన బిడ్లను తిరస్కరించిన ఆర్బీఐవివిధ సుస్థిరత కార్యక్రమాలుఐసీఐసీఐ బ్యాంక్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ఈఎస్జీ) పాలసీ కింద వివిధ సుస్థిరత కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2032 ఆర్థిక సంవత్సరం నాటికి స్కోప్ 1, స్కోప్ 2 ఉద్గారాల్లో(స్కోప్ 1 ఉద్గారాలు- బ్యాంకు సొంత వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, స్కోప్ 2 ఉద్గారాలు-బ్యాంకు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా వెలువడే ఉద్గారాలు. ఉదా: ఏసీ, రిఫ్రిజిరేటర్..నుంచి వచ్చే ఉద్గారాలు) కార్బన్ న్యూట్రల్‌గా మార్చాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. 49.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బ్యాంకు కార్యాలయాలకు చెందిన 180 సైట్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ధ్రువీకరణ లభించింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని బ్యాంకు సర్వీస్ సెంటర్ 2024 ఆర్థిక సంవత్సరంలో ‘నెట్ జీరో వేస్ట్’ సర్టిఫికేట్ పొందింది. -
అభివృద్ధివైపు గ్రామాలు.. పుంజుకుంటున్న ఎకానమీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దశాబ్దాలుగా అంతంతమాత్రంగానే ఉంటున్న గ్రామీణ ఎకానమీ క్రమంగా పుంజుకుంటోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ ప్రియాంక ఖండేల్వాల్ తెలిపారు.దేశ జీడీపీలో దాదాపు సగ భాగం వాటా ఉన్నప్పటికీ, ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ వ్యవసాయం మీదే ఎక్కువగా ఆధారపడటం వల్ల గ్రామీణ ప్రాంతాలవారి ఆదాయాలు పెద్దగా మారటంలేదని ఆమె పేర్కొన్నారు. దీనితో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఆదాయాల మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరిగిపోయిందని తెలిపారు. అయితే తయారీ రంగం, నిర్మాణ రంగాలు మెరుగ్గా రాణిస్తుండటం, నైపుణ్యాల అభివృద్ధి.. స్వయం ఉపాధిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుండటం వల్ల వ్యవసాయేతర ఉపాధి పెరగనుందని, గ్రామీణ ప్రాంతాల వారికి వచ్చే దశాబ్ద కాలం మరింత సానుకూలంగా ఉండగలదని ప్రియాంక చెప్పారు.గ్రామీణ ఆదాయాలు పెరగడం వల్ల వినియోగం, కనెక్టివిటీకి డిమాండ్ నెలకొంటుందని ఆమె చెప్పారు. కన్జూమర్ డ్యూరబుల్స్, రవాణా, సౌకర్య సంబంధ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని తెలిపారు. అలాగే, మెరుగైన మౌలిక సదుపాయాలు, చౌకగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి కనెక్టివిటీ పెరగడం వల్ల టెలికం, ఆటో, కన్జూమర్ ఫైనాన్సింగ్ తదితర విభాగాలు రాణించగలవని వివరించారు.అటు ఆదాయాల పెరుగుదలతో పొదుపు, అలాగే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలకు డిమాండ్ నెలకొంటుందని ప్రియాంక చెప్పారు. అక్షరాస్యత, కొత్త నైపుణ్యాలతో గ్రామీణ యువత సంప్రదాయ సాగు ధోరణులకు భిన్నంగా కొత్త విధానాలను అమలు చేసే కొద్దీ వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతుందని వివరించారు.గ్రామీణాభివృద్ధి, వినియోగం ఆధారిత రంగాలతో ముడిపడి ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆయా రంగాల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రూరల్ ఆపర్చూనిటీస్ ఫండ్ ఇదే లక్ష్యంతో పని చేస్తోందని ఆమె చెప్పారు. దీనికి నిఫ్టీ ఇండియా రూరల్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. -
బ్యాంకింగ్, రిలయన్స్ ర్యాలీ
ముంబై: బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల ర్యాలీతో స్టాక్‌సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 78,199 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు బలపడి 23,708 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వెంటనే తేరుకొని రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 488 పాయింట్లు ఎగసి 78,453 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 23,795 వద్ద గరిష్టాన్ని తాకాయి. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఇంధన, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇండ్రస్టియల్, కమోడిటీ, సర్విసెస్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్ క్యాప్ సూచీ 2% రాణించాయి. ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ హిట్ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.258 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 33% ర్యాలీ రూ.287 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 27% లాభంతో రూ.273 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,310.37 కోట్లుగా నమోదైంది. -
ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డ్ రూల్స్ మార్పు
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు నవంబర్ 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డ్ కొత్త నిబంధనలలో మార్పులను ప్రకటించాయి.మీరు కూడా ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే, ఈ మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లో మార్పులుఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేస్తే, దానిపై కొన్ని అదనపు ఛార్జీలు విధించవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్ లావాదేవీలు మొదలైన వాటిపై ఛార్జీలు వర్తించవచ్చు.ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లో మార్పులుఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఇంధన సర్ఛార్జ్ మినహాయింపులో మార్పులు చేసింది. కొన్ని కార్డ్‌లలో ఈ సదుపాయం పూర్తిగా తొలగించగా కొన్ని కార్డ్‌లలో ఇది పరిమితి ఆధారంగా అందుబాటులో ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది. నిర్దిష్ట కేటగిరీలలో రివార్డ్ పాయింట్ల రీడెంప్షన్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. దానిలో పరిమితులు ఉండవచ్చు. ఇక ఈఎంఐలో చేసిన కొనుగోళ్లకు వడ్డీ రేట్లు మారాయి. కార్డ్ రకం, లావాదేవీని బట్టి కొత్త వడ్డీ రేట్లు మారవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు, సెపె్టంబర్ త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన రూ.11,746 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5% అధికం. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి 17% పెరిగి రూ.47,714 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు పెరిగింది. దేశీయ రుణాలు పెరగడంతో నికర వడ్డీ ఆదాయం 9.5% వృద్ధి చెంది రూ.20,048 కోట్లకు చేరుకుంది. అయితే నికర వడ్డీ మార్జిన్ 4.53% శాతం నుంచి 4.27 శాతానికి తగ్గింది. ఫీజు ఆదాయ వృద్ధి కారణంగా వడ్డీయేతర ఆదాయం( 11% పెరిగి రూ.5,861 కోట్ల నుంచి రూ.6,496 కోట్లకు చేరింది. బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 16.66 శాతంగా నమోదైంది. జూలై– సెప్టెంబర్‌లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 2.48 శాతం నుంచి 1.97 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 0.42% నుంచి 0.43 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు(కేటాయింపులు) రూ.1,233 కోట్లకు చేరుకున్నాయి. గత క్వార్టర్ కేటాయింపులు రూ.583 కోట్లతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ప్రోవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 78.5 శాతంగా ఉంది. రుణాల విషయానికొస్తే.., దేశీయ రుణాలు 15.7%, రిటైల్ రుణాలు 14.2%, బిజినెస్ బ్యాంకింగ్ 30%, కార్పొరేట్ రుణాలు 11.2 శాతం మేర పెరిగాయి. సమస్యాత్మక వ్యక్తిగత రుణాలు, క్రిడెట్ కార్డుల రుణాల్లో తగ్గుదల ఉంది. ద్విచక్ర వాహన రుణాలు 32.4% తగ్గుముఖం పట్టాయి. → డిపాజిట్ల వృద్ధి 15.7% పెరిగి రూ.14,28,095 కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్ ఖాతా, పొదుపు ఖాతా(కాసా) నిష్పత్తి 38.9% గా ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కొత్తగా 90 శాఖలు ప్రారంభించడంతో మొత్తం బ్రాంచుల సంఖ్య 6,613కు చేరింది. ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషీన్ల సంఖ్య 16,120 గా ఉంది.→ బ్యాంకు అనుబంధ సంస్థల్లో జీవిత బీమా విభాగం లాభం రూ.252 కోట్లు పెరిగింది. సాధారణ బీమా విభాగ లాభం 20% పెరిగి రూ.694 కోట్లకు చేరింది. ఆస్తుల నిర్వహణ విభాగం లాభం రూ.691 కోట్లకు చేరింది. -
ఐసీఐసీఐ బ్యాంకులో రూ.28 కోట్ల కుంభకోణం
నరసరావుపేటటౌన్: ఐసీఐసీఐ బ్యాంకులో రూ.28 కోట్ల కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని సీఐడీ అడిషనల్ ఎస్పీ సీహెచ్ ఆదినారాయణ తెలిపారు. స్థానిక అరండల్‌పేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో సోమవారం తనిఖీలు చేసింది. అనంతరం అడిషనల్ ఎస్పీ సీహెచ్ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట, నరసరావుపేటతోపాటు విజయవాడలోని మూడు బ్రాంచ్‌లలో కలిపి సమారు రూ.28 కోట్ల కుంభకోణం జరిగినట్లు తేలిందన్నారు. చిలకలూరిపేటలో 60మంది, నరసరావుపేటలో ఏడుగురు, విజయవాడలో ఐదుగురు... మొత్తం 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటికే చిలకలూరిపేటలో 30 మంది, నరసరావుపేటలో ఐదుగురు బాధితుల నుంచి స్టేట్మెంట్ నమోదు చేశామన్నారు. తమతోపాటు బ్యాంకు అధికారులు కూడా ఈ కుంభకోణంపై శాఖాపరమైన విచారణ చేస్తున్నారని తెలిపారు. -
చికలూరిపేట ICICI బ్యాంకులో సీఐడీ విచారణ
-
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది. వివిధ కార్డ్ కేటగిరీల్లో రివార్డ్ పాయింట్లు, లావాదేవీల రుసుములు, ప్రయోజనాల్లో ఈ మార్పులు ఉన్నాయి. కొత్త నవంబర్ 15 నుండి అమలులోకి వస్తాయి.బీమా, యుటిలిటీ బిల్లులు, ఇంధన సర్‌ఛార్జ్‌లు, కిరాణా కొనుగోళ్లపై ప్రయోజనాలను తగ్గించడమే కాకుండా విమానాశ్రయ లాంజ్‌లను ఉపయోగించడం కోసం ఖర్చు పరిమితిని కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రెట్టింపు చేసింది. కొత్త మార్పుల గురించి తెలియజేస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు మెసేజ్‌లు పంపింది.మారిన రూల్స్ ఇవే..క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి బ్యాంక్ అనేక నిబంధనలను మార్చింది. క్రెడిట్ కార్డుల ద్వారా స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించే లావాదేవీల రుసుమును కూడా పెంచింది. కొత్త నిబంధనలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్లన్నింటికీ వర్తిస్తాయి.కొత్త నిబంధనల ప్రకారం, క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్-పార్టీ చెల్లింపు యాప్‌ల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించినట్లయితే, 1 శాతం లావాదేవీ రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుమును నివారించాలనుకుంటే నేరుగా పాఠశాల/కళాశాల వెబ్సైట్లో లేదా పీఓఎస్ మెషీన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.బ్యాంక్ లావాదేవీల రుసుములను పెంచడమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా తొలగించింది. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన యుటిలిటీ, బీమా చెల్లింపులపై లభించే రివార్డ్‌లను బ్యాంక్ తగ్గించింది. ప్రీమియం కార్డుదారులకు, రివార్డ్ పాయింట్ల పరిమితి నెలకు రూ. 80,000 కాగా, ఇతర కార్డుదారులకు ఈ పరిమితి రూ.40,000. -
ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ
సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.ఫిక్స్డ్ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు -
ఐసీఐసీఐ బ్యాంకులో భారీ స్కామ్.. సీఐడీ విచారణ
-
చిలకలూరిపేట ఐసీఐసీఐలో సీఐడీ విచారణ
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట బ్రాంచ్‌లో జరిగిన కుంభకోణం విషయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో సీఐడీ అధికారుల బృందం గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌కి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు తలుపులు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు. ఈ సందర్బంగా సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న సీఐడీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత విషయమై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేసినట్టు తెలిపారు. తమ విచారణలో ఇప్పటి వరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 28 కోట్లు గోల్మాల్ జరిగినట్టు గుర్తించినట్లు తెలిపారు. 2021 నుంచి ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేష్చంద్రశేఖర్, మరో ఇద్దరు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇక్కడ పనిచేసిన అనంతరం నరేష్చంద్రశేఖర్ నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ బ్రాంచ్‌లలో మేనేజర్‌గా పనిచేసినట్టు తెలిపారు. విజయవాడలో పనిచేస్తున్న సమయంలో అతని అవకతవకలు వెలుగు చూసి ఈ ఏడాది జూలైలో బ్యాంకు అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసిందన్నారు. ఈ నెల చిలకలూరిపేట బ్రాంచిలో జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇంకా ఎవరైనా బ్యాంకు సిబ్బంది ఈ వ్యవహారంలో ఉన్నారా లేరా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. వారం, పది రోజుల్లో విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, కేసు విషయమై ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్డ్ (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్‌లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యందీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు -
81,000 దాటిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్(3%), ఇన్ఫోసిస్(2%), రిలయన్స్(1%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి మార్కెట్ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. → ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్ పెంచాయి. ఎల్టీఐఎం 3.50%, టీసీఎస్ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్‌లు ఒకశాతం లాభపడ్డాయి. రూపాయి రికార్డ్ కనిష్టం @ 83.63 దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది. -
అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!
అదానీ గ్రూప్‌కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అదానీ వన్ (Adani One).. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఎయిర్పోర్ట్ -లింక్డ్ ప్రయోజనాలతో దేశీయ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్, అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనే రెండు ఆప్షన్లలో ఈ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంది.ఫీజు వివరాలుఅదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వార్షిక ఛార్జీ రూ .5,000. దీనికి జాయినింగ్ బెనిఫిట్స్ రూ .9,000 ఉంటాయి. అలాగే అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు వార్షిక ధర రూ .750 కాగా జాయినింగ్ బెనిఫిట్స్ రూ .5,000.ప్రయోజనాలు (అపరిమిత అదానీ రివార్డు పాయింట్లు)అదానీ వన్, విమానాశ్రయాలు, గ్యాస్, విద్యుత్, ట్రైన్‌మ్యాన్ సహా అదానీ సంస్థలలో 7 శాతం వరకు తగ్గింపు.ఇతర స్థానిక, విదేశీ ఖర్చులపై 2 శాతం వరకు తగ్గింపుఎయిర్పోర్ట్ బెనిఫిట్స్ ప్రీమియం లాంజ్ లతో సహా దేశీయ లాంజ్ లకు సంవత్సరానికి 16 వరకు యాక్సెస్లుసంవత్సరానికి రెండు వరకు ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్లు8 వరకు వాలెట్, ప్రీమియం ఆటోమొబైల్ పార్కింగ్ స్థలాలకు యాక్సెస్లుఇతర ప్రయోజనాలువిమానాలు, హోటళ్లు, విహార యాత్రలకు కూపన్లతో సహా రూ.9,000 వరకు వెల్మమ్ బెనిఫిట్.సినిమా టిక్కెట్లు ఒకటి కొంటే ఒకటి ఉచితం1 శాతం ఇంధన సర్ ఛార్జీ రద్దుఅదానీ వన్ రివార్డ్స్ అల్ట్రా లాయల్టీ స్కీమ్ కు ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ -
జైప్రకాశ్ అసోసియేట్స్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. జేపీ గ్రూప్‌లో కీలకమైన జేఏఎల్ ప్రధానంగా నిర్మాణం, హాస్పిటాలిటీ తదితర వ్యాపారాలు సాగిస్తోంది. కంపెనీ 2037 కల్లా మొత్తం రూ. 29,805 కోట్ల రుణాలను (వడ్డీతో కలిపి) కట్టాల్సి ఉండగా ఇందులో రూ. 4,616 కోట్లు 2024 ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వల్ల లిక్విడిటీ కొరత ఏర్పడటమే డిఫాల్ట్ కావడానికి కారణమంటూ జేఏఎల్ వినిపించిన వాదనలను తోసిపుచ్చిన ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలిచ్చింది. -
అకౌంట్లపై అదనపు వసూళ్లు.. బ్యాంక్‌లకు ఆర్బీఐ వార్నింగ్..
ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది.బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపైజీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్బీఐ అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానామరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. -
పద్మభూషణుడు..ప్రముఖ బ్యాంకర్..వాఘుల్ గురించి తెలుసా..?
భారత సివిల్ సర్వీసెస్‌లో చేరాలనే కల బలంగా ఉన్నా తగిన వయసు లేకపోవడంతో బ్యాంకింగ్‌లో తన కెరియర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఘనత నారాయణన్ వాఘుల్‌కే దక్కుతుంది. బ్యాంకింగ్ రంగంలో తాను చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2010లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల తన 88వ ఏటా అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ఆ ధర్మయోగి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.నారాయణన్ వాఘుల్ 1936లో అప్పటి బ్రిటిష్ ఇండియా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) జన్మించారు. ఎనిమిది మంది సంతానం ఉన్న కుటుంబంలో ఆయన రెండోవాడు. వాఘుల్ తన బాల్యంలో రామకృష్ణ మిషన్ స్కూల్లో చదువుకున్నారు. 1956లో మద్రాస్ విశ్వవిద్యాలయంలోని లయోలా కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత భారత సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. కానీ వయసు కటాఫ్ ఉండడంతో దానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు.చదువు పూర్తి చేసుకున్న తర్వాత వాఘుల్ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ అధికారిగా తన కెరియర్ ప్రారంభించారు. ఆ సమయంలో తనకు అప్పటి బ్యాంక్ ఛైర్మన్ ఆర్.కె.తల్వార్ మార్గదర్శకుడిగా ఉన్నారు. ఎస్బీఐలో సుధీర్ఘంగా 19 ఏళ్లు పనిచేసిన తరువాత పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్కు అధ్యాపకుడుగా పనిచేశారు. 1978లో ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తన 44వ ఏటా 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. చిన్న వయసులో ప్రభుత్వ రంగ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం.1985లో ప్రభుత్వ నియంత్రణలో ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐసీఐసీఐ) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. తర్వాతికాలంలో ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటైజేషన్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1996లో పదవీ విరమణ చేసినా 2009 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తూ కె.వి.కామత్, కల్పనా మోర్పారియా, శిఖా శర్మ, నచికేత్ మోర్ వంటి బ్యాంకింగ్ దిగ్గజాలను తయారుచేశారు. తర్వాతికాలంలో వీరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థలకు నాయకత్వం వహించారు.పదవి విరమణ అనంతరం వాఘుల్ విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, మిట్టల్ స్టీల్‌తో సహా అనేక కంపెనీల బోర్డులో డైరెక్టర్‌గా వ్యవహరించారు. వాఘుల్‌కు 2010లో వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో భారతదేశపు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. బిజినెస్ ఇండియా 1991 ఏడాదిలో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, ది ఎకనామిక్ టైమ్స్.. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించాయి. ఆయన భారతదేశంలోని ఎన్జీవోల్లో ఒకటైన ‘గివ్ ఇండియా’కు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. నారాయణన్ వాఘుల్ దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో 2012లో కార్పొరేట్ కాటలిస్ట్ ఫోర్బ్స్ ఫిలాంత్రోపీ అవార్డును అందుకున్నారు.ఇదీ చదవండి: సముద్రంపై మరోసారి అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలువాఘుల్ మరణవార్త తెలిసిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎక్స్ ఖాతాలో నివాళులర్పించింది. ‘ఒక ధర్మ యోగి, సంస్థ నిర్మాత, గురువు, దూరదృష్టి కలిగినవాడు, రచయిత, పరోపకారి, భారతీయ పరిశ్రమలో ప్రముఖుడు. వాణిజ్య బ్యాంకింగ్, బీమా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్లు.. ఇలా అన్నింటిలో భాగమైన ఐసీఐసీఐను డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంకింగ్ గ్రూప్‌గా తీర్చిదిద్దిన బ్యాంకర్. అనేక మార్గదర్శక ఆర్థిక సంస్థలను స్థాపించడంలో కీలకపాత్ర వహించిన దూరదృష్టి కలిగిన వ్యక్తి. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో నాయకులకు కొన్నేళ్లుగా మార్గదర్శకాలిచ్చిన గురువుకు ఐసీఐసీఐ బ్యాంకు రుణపడి ఉంటుంది’ అని తెలిపింది. -
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ 'నారాయణన్ వాఘుల్' చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో కన్నుమూశారు. రెండు రోజులకు ముందు ఇంట్లో పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. హుటాహుటిన ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స పొందుతూ.. శనివారం తుది శ్వాస విడిచారు.నారాయణన్ వాఘుల్ వయసు 88 ఏళ్లు. ఈయన భార్య పద్మా వాఘల్, పిల్లలు మోహన్, సుధ.. మనవళ్లు సంజయ్, కావ్య, అనువ్, సంతోష్ ఉన్నారు. భారతీయ బ్యాంకింగ్‌లో కొత్త శకానికి నాంది పలికిన దిగ్గజం నారాయణన్ వాఘుల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.నారాయణన్ వాఘుల్ 1936లో దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో జన్మించారు. అతని కుటుంబం చెన్నైకి (అప్పటి మద్రాసు) వెళ్లింది. అక్కడే లయోలా కాలేజీలో చదువుకున్నాడు. బ్యాంకింగ్ రంగంలో గొప్పగా ఎదిగిన వాఘల్.. ప్రారంభంలో సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రవేశించడానికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ పరీక్షను వాఘుల్ కేవలం ప్రాక్టీస్ టెస్ట్ మాదిరిగా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.తండ్రి ప్రోత్సాహంతో 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎస్బీఐ నుంచి వైదొలిగారు. ఆ తరువాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్లో చేరి దాని డైరెక్టర్ అయ్యారు. 39 సంవత్సరాల వయస్సులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని చేపట్టారు.నారాయణన్ వాఘుల్ 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చెప్పారు. 1981 - 1985 మధ్య కాలంలో ఐసీఐసీఐ లిమిటెడ్‌కి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ఇలా ఆయన దినదినాభివృద్ధి చెందుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 2006లో ఎకనామిక్ టైమ్స్ ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌తో సత్కరించింది.Today, I grieve for the Bhishma Pitamah of Indian Banking—Mr. N.Vaghul, who passed away this morning.I grieve not just for a Titan of Indian Business, but for one of the most inspiring & generous people I have ever had the good fortune to encounter. He was a member of the… pic.twitter.com/YgIs5BsE4d— anand mahindra (@anandmahindra) May 18, 2024 -
పొరపాటు జరిగింది.. నష్టపోతే రండి.. డబ్బు తీసుకోండి
ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన దాదాపు 17 వేల క్రెడిట్‌కార్డుల సమాచారం ఇతరుల ఖాతాకు పొరపాటున లింక్ అయినట్లు బ్యాంక్ తెలిపింది. సాంకేతికత లోపం వల్ల ఈ తప్పిదం జరిగిందని బ్యాంక్ అంగీకరించింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే వారి డబ్బు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది.డిజిటల్ మాధ్యమాల్లో తమ క్రెడిట్‌కార్డుల వివరాలు పొరపాటున ఇతర ఖాతాకు అనుసంధానమైనట్లు గుర్తించిన వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. అయితే ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం అయినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పింది.సాంకేతికలోపం వల్ల ఆన్లైన్లో ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డ్‌లు వివరాలు పొరపాటున లింక్ అయ్యాయి. దాంతో పాత కస్టమర్లు కొత్తవారి కోసం కేటాయించిన కార్డుల వివరాలు తెలుసుకునేలా వీలు కల్పించనట్లయింది. ఆన్లైన్లో లాగిన్ అవ్వగానే తాము కొత్తగా దరఖాస్తు చేయకపోయనా కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన బ్యాంక్ అధికారులు వెంటనే సమస్యను గుర్తించి సవరించినట్లు తెలిసింది. తర్వాత పొరపాటు జరిగినట్లు అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు.ఇదీ చదవండి: కేంద్రం నిబంధనలకు ‘నో’ చెప్పిన వాట్సప్ఈ సంఘటనలో ప్రభావితమైన వివరాలు, కార్డులను బ్లాక్ చేస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. తిరిగి కొత్తకార్డులు జారీ చేస్తామని చెప్పింది. ఇప్పటివరకైతే ఆర్థిక నష్టానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ఒకవేళ తాము ఈ సంఘటన ద్వారా నష్టపోయినట్లు గుర్తించి ఎవరైనా కస్టమర్లు బ్యాంక్‌ను సంప్రదిస్తే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. -
ఎన్ఆర్ఐ మహిళకు రూ.16 కోట్లు టోకరా ఇచ్చిన బ్యాంకు మేనేజర్
ఐసీఐసీఐ బ్యాంకు అధికారి బారిన పడి ఎన్ఆర్ఐ మహిళ పెద్దమొత్తంలో డబ్బును కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా మేనేజర్ నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలను కొట్టేశాడు. మరొక బ్యాంక్ ఉద్యోగి తన డబ్బులపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయడంతో, తన సొమ్ముకోసం ఆరా తీసిన నేపథ్యంలో ఈ స్కామ్ బయటపడింది. బీబీసీ కథనంప్రకారం ఎన్ఆర్ఐ శ్వేతా శర్మ 2016లో భారత్‌కు తిరిగి వచ్చింది. అమెరికాలో డిపాజిట్లపై వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇండియాలో సొమ్మును డిపాజిట్ చేయాలని నిర్ణయించుకుంది. పాత గురుగ్రామ్‌లోని బ్యాంకు బ్రాంచ్ని సందర్శించిన తర్వాత బ్యాంక్ అధికారి సలహా మేరకు శ్వేతా శర్మ 2019లో ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన NRE ఖాతాను తెరిచింది. 5.5-6 శాతం వడ్డీ రేటుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది 2019,సెప్టెంబర్-2023 డిసెంబర్ 2023 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో తమ సేవింగ్స్ దాదాపు రూ13.5 కోట్లను డిపాజిట్ చేసింది. వడ్డీతో కలిపి ఈ మొత్తం విలువ రూ. 16 కోట్లు ఉంటుందని శ్వేతా చెబుతున్నారు. స్నేహితురాలి ద్వారా తనకు పరిచయమైన బ్యాంకు అధికారి మోసపూరితంగా తనకు ఫేక్ స్టేట్మెంట్లు ఇచ్చాడని పేర్కొంది. ఫేక్ ఈమెయిల్ ఐడీని సృష్టించి, బ్యాంకు రికార్డుల్లో తనమొబైల్ నంబర్‌ను మార్చేసి, మెసానికి పాల్పడ్డాడని వాపోయింది. భారత్‌లో ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెట్టమని మోసపూరితంగానే ఒప్పించాడని, నకిలీ ఖాతాలు సృష్టించి, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, డెబిట్ కార్డులు, చెక్ బుక్‌లను తన (బ్యాంకు అధికారి) పేరు మీద తీసుకున్నాడని ఆరోపించింది. అందుకే బ్యాంకు నుంచి తనకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని తెలిపింది. అలాగే డిపాజిట్లలో ఒకదానిపై రూ.2.5 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకున్నాడని తన దృష్టికి వచ్చిందని కూడా వెల్లడించింది. బ్యాంక్ ప్రతినిధి కూడా మోసాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన ఐసీఐసీఐ బ్యాంకు గత మూడేళ్లు బాధితురాలి ఖాతాలో జరిగిన ఈ లావాదేవీలు బ్యాలెన్స్‌ల గురించి కస్టమర్ తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది.ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు అయినా ఆమె ఈ వ్యత్యాసాన్ని గమనించి ఉండాల్సిందని పేర్కొంది. అయినా దర్యాప్తు ఫలితాలను బట్టి, తాత్కాలికంగా ఆమె ఖాతాలో రూ.9.27 కోట్లు జమ చేశామని బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపింది. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు హామీ ఇచ్చినప్పటికీ ఫిర్యాదు చేసి ఆరు వారాలకు పైగా గడిచిపోవడం గమనార్హం. -
చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట!
ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియో కాన్ లోన్ కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట లభించింది. చందా కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. రుణాల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తమని అక్రమంగా అరెస్ట్ చేసిందని, తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చార్‌లు కోర్టు మెట్లెక్కారు. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ మధ్యంతర బెయిల్‌ను జారీ చేసింది. తాజాగా, మధ్యంతర బెయిల్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తులు అనూజా ప్రభుదేశాయ్,ఎన్ఆర్ బోర్కర్లతో కూడిన ధర్మాసనం.. ‘చందా కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఆర్డర్‌ను ధృవీకరించాం’ అని తెలిపారు. అంతేకాదు, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమమని బాంబే హైకోర్టు పేర్కొంది. 2023 జనవరి 9న కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్ సంస్థకు రుణాలు ఇచ్చారన్న కేసులో కొచ్చర్ దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నేరం అంగీకరించకపోవడమంటే విచారణకు సహకరించడం లేదని అర్థం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. 2022లో అరెస్ట్ వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణం కేసుకు సంబంధించి చందా కొచ్చర్ దంపతులను 2022 డిసెంబర్ 23న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కొచ్చర్తో పాటు వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. చందా కొచ్చర్ దంపతులతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీలను ఉల్లంఘించి ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల క్రెడిట్ మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది. నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద 2019లో నమోదైన ఎఫ్ఐఆర్లో వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తోపాటు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఐసీఐసీ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆయన భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ నిందితులుగా చేర్చింది. -
ఐసీఐసీఐ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 11,053 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 24 శాతం ఎగసి రూ. 10,272 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 18,678 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.65 శాతం నుంచి 4.43 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం 20 శాతం పురోగమించి రూ. 5,975 కోట్లయ్యింది. ఏఐఎఫ్‌ల ఎఫెక్ట్ ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మదింపుచేస్తే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడులకు రూ. 627 కోట్లమేర దెబ్బతగిలినప్పటికీ ప్రొవిజన్లు రూ. 2,257 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. మొత్తం ఏఐఎఫ్‌లకు కేటాయింపులు చేపట్టినట్లు తెలియజేశారు. నిజానికి గతేడాది చేపట్టిన కంటింజెన్సీ ప్రొవిజన్లు, అవలంబించిన ప్రొవిజన్ విధానాలు కేటాయింపుల తగ్గింపునకు దోహదపడినట్లు తెలియజేశారు. కాగా.. ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం నికర లాభం రూ. 227 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. సాధారణ బీమా నికర లాభం 22 శాతం జంప్‌చేసి రూ. 431 కోట్లను తాకగా.. అసెట్ మేనేజ్మెంట్ విభాగం నుంచి 30 శాతం అధికంగా రూ. 546 కోట్లు ఆర్జించింది. బ్రోకరేజీ బిజినెస్ నికర లాభం 66 శాతం దూసుకెళ్లి రూ. 466 కోట్లయ్యింది. వారాంతాన బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 1 శాతం బలపడి రూ. 1,008 వద్ద ముగిసింది. -
ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
2024లోనే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు 'ఫిక్స్డ్ డిపాజిట్' వడ్డీ రేట్లను పెంచనున్నట్లు పెంచుతున్నట్లు ప్రకటించి శుభవార్త చెప్పింది. ఈ కథనంలో ఏ బ్యాంకు ఎంత మేర వడ్డీ పెంచింది, దాని వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ఈ వడ్డీ రేట్లు గతంలో ఉన్న వడ్డీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సీనియర్ సిటిజన్లంటూ 0.50 శాతం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 7 రోజుల నుంచి 45 రోజులకు సాధారణ వడ్డీ 3.50 శాతం అనుకుంటే సీనియర్ సిటిజన్లను 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI) భారతదేశంలో రెండవ అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కూడా వడ్డీ రేట్లను 6.7 సంత నుంచి 7.25 శాతానికి పెంచింది. 61 రోజుల నుంచి 90 రోజులకు 6 శాతం, 91 రోజుల నుండి 184 రోజులకు 6.5 శాతం, 185 రోజుల నుంచి 270 రోజులకు 6.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు 7.25 శాతం వడ్డీ అందించనుంది. జనవరి 3 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC) 2023 అక్టోబరు నుంచి HDFC బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఒక సంవత్సరం నుంచి 15 నెలల కాలనీ వడ్డీ 6.6 శాతం, 15 నెలల నుంచి 18 నెలల వరకు వడ్డీ 7.10 శాతం, 18 నెలల నుంచి 21 నెలలకు వడ్డీ 7 శాతం, 21 నెలల నుంచి 2 సంవత్సరాల కాలనీ 7 శాతం వడ్డీ అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2023 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు 6.85 శాతం వడ్డీ, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వ్యవధికి 7.25 శాతం వడ్డీ, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి వడ్డీ 6.5 శాతం అందిస్తోంది. వీటితో పాటు బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ అని పిలువబడే 399 రోజుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ పొందవచ్చు. ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) 2023 డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.7 శాతం ఆఫర్ చేస్తోంది . 15 నెలల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతం అందిస్తుంది. డీసీబీ బ్యాంక్ (DCB Bank) 2023 డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం వినియోగదారుని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సంవత్సరానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు 7.15 శాతం వడ్డీని, 25 నెలల లేదా 26 నెలల మధ్య కాల వ్యవధి డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేటు 8 శాతం అందించడం జరుగుతుంది. -
ఎంతటి దుర్భర పరిస్థితి? చందా కొచ్చర్‌కు సుప్రీం కోర్టులోనూ తప్పని నిరాశ
దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపుతో అగ్రస్థానానికి ఎదిగి సంచలనం సృష్టించిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ కుంభకోణంలో ఇరుక్కుని కేసులను ఎదుర్కొంటూ తన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ సుప్రీం కోర్టులోనూ తీవ్ర నిరాశే ఎదురైంది. బ్యాంకు నుంచి తన పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి చందా కొచ్చర్ దాఖలు చేసిన అప్పీల్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు డిసెంబర్ 8న నిరాకరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చందా కొచ్చర్ గతంలో బాంబే హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేయగా డివిజన్ బెంచ్ తిరస్కరించింది. తాజాగా ఆ డివిజన్ బెంచ్ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కొచ్చర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. బాంబే హైకోర్టు తీర్పు అన్యాయమని, బ్యాంకు మొదట్లో కొచ్చర్‌కు రిటైర్మెంట్ ప్రయోజనాలను అందించేందుకు అంగీకరించి తర్వాత వెనక్కితీసుకుందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ ఏడాది మే నెలలో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలను కోరుతూ ఆమె చేసిన మధ్యంతర దరఖాస్తును తిరస్కరించిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో పదవి నుంచి చందా కొచ్చర్ తొలగింపును సమర్థించిన బాంబే హైకోర్టు దీనిపై ఆమె వేసిన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఆమె వేసిన మధ్యంతర పిటిషన్‌ను గతేడాది నవంబర్‌లో కొట్టేసింది. 2018లో ఆమె దక్కించుకున్న 6.90 లక్షల షేర్లతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2018 మేలో తనపై విచారణ ప్రారంభం కాగానే చందా కొచ్చర్ సెలవుపై వెళ్లిపోయారు. ఆ తరువాత ముందస్తు రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని ఆమోదించిన ఐసీఐసీఐ బ్యాంక్ టెర్మినేషన్ ఫర్ కాజ్'గా పరిగణించి ఆర్బీఐ నుంచి అనుమతి కూడా కోరినట్లు తెలిపింది. కాగా 2019 జనవరిలో దాఖలు చేసిన చార్జిషీట్లో చందా కొచ్ఛర్ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిందని సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు తరువాత నిరర్థక ఆస్తులుగా మారాయని, ఫలితంగా బ్యాంకుకు తప్పుడు నష్టం, రుణగ్రహీతకు, నిందితులకు తప్పుడు లాభం కలిగిందని సీబీఐ అభియోగం మోపిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 36% జంప్‌చేసి రూ. 10,896 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ లాభం సైతం రూ.7,558 కోట్ల నుంచి రూ. 10,261 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 31,088 కోట్ల నుంచి రూ. 40,697 కోట్లకు దూసుకెళ్లింది. నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ. 18,308 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.31 శాతం నుంచి 4.53 శాతానికి బలపడ్డాయి. ట్రెజరీ మినహా వడ్డీయేతర ఆదాయం 14 శాతం అధికమై రూ. 5,861 కోట్లయ్యింది. ఎన్పీఏలు డౌన్... తాజా సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి రూ. 2.48 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.07 శాతంగా నమోదైంది. -
ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 36 శాతం వృద్ధి
దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్టాండలోన్ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది. -
కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్
ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్బీఐ భారీ షాకిచ్చింది. రెగ్యులేటరీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా విధించింది. లోన్ అడ్వాన్స్‌లు చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు; మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఈ పెనాల్టీకి బ్యాంకుల కస్టమర్లకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. కాగా, ఇటీవల కేవైసీ నిబందల్ని పాటించడంలో విఫలమైందంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రూ.5.39 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
ఆ సెక్షన్ వర్తిస్తే.. చందా కొచ్చర్ దంపతులకు సుప్రీంకోర్టు నోటీసులు
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. రుణ మోసం కేసులో బాంబే హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సవాలు చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు దీనిపై చందా కొచ్చర్ దంపతుల స్పందన కోరింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం సీబీఐ పిటిషన్‌పై చందా కొచ్చర్ దంపతులకు నోటీసులు జారీ చేసి మూడు వారాల్లోగా స్పందనను తెలియజేయాలని కోరింది. సెక్షన్ 409 వర్తిస్తే.. సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ, ఐపీసీలోని సెక్షన్ 409 (ప్రభుత్వ సేవకుడి నేరపూరిత నమ్మక ద్రోహం)ను పరిగణనలోకి తీసుకోకుండా, నేరానికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని హైకోర్టు తప్పుగా భావించిందని తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ముద్దాయిలకు పది సంవత్సరాల నుంచి జీవత ఖైదు శిక్ష పడే ఆస్కారం ఉందన్నారు. ప్రైవేట్ బ్యాంకు అయినప్పుడు ఐపీసీ సెక్షన్ 409 ఎలా వర్తిస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. బ్యాంకు ప్రైవేట్ కావచ్చు కానీ అందులో ప్రజాధనం ఉంటుందని అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానమిచ్చారు. దీనిపై చందా కొచ్చర్ దంపతులకు నోటీసులు జారీ చేసి మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మోసం కేసుకు సంబంధించి 2022 డిసెంబర్ 23న చందా కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్టు చేసింది. అయితే విచక్షణను ఉపయోగించకుండా యాంత్రికంగా చందా కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసిందని ఆక్షేపిస్తూ బాంబే హైకోర్ట్ జనవరి 9న వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
ఫెస్టివ్ బొనాంజా: కస్టమర్లకు బంపర్ ఆఫర్లు, ఐఫోన్ 15పై స్పెషల్ ఆఫర్
దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ ప్రారంభంలో తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు, తగ్గింపులు రూ. 26 వేల వరకు క్యాష్‌బ్యాక్‌తో ‘ఫెస్టివ్ బొనాంజా’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 15 పై ప్రత్యేక ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేకాదు గృహ రుణాలు, వాహన రుణాలు ద్విచక్ర వాహన రుణాలపై త్వరలోనే గుడ్ న్యూస్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా UPI , కార్డ్‌లెస్ EMI కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను పొందవచ్చు. నో-కాస్ట్ EMI సదుపాయం కూడా కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఐఫోన్ 15పై నో-కాస్ట్ EMI ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (రికార్డ్ సేల్స్: మోదీ పిలుపు, ఖాదీ గెలుపు) కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందించే లక్ష్యంతో ప్రముఖ బ్రాండ్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా తెలిపారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ (అక్టోబర్ 8 - అక్టోబర్ 15 వరకు), మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (అక్టోబర్ 6 -అక్టోబర్ 19 వరకు), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అలాగే గృహ, బైక్, ఫోర్‌వీలర్ వాహన రుణాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తామని కూడా తెలిపారు. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!) దీని ప్రకారం యాపిల్ ఐఫోన్ 15తోపాటు,ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నిచర్, ట్రావెల్, ఫుడ్, ఇతర కేటగిరీలపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మేక్మైట్రిప్, టాటా న్యూ, వన్‌ప్లస్, హెచ్‌పి, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జి, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, స్విగ్గీ, జొమాటో వంటి ప్రధాన బ్రాండ్స్‌తో డీల్ కనుగుణంగా ఆఫర్లు పొందవచ్చు. కాగా ICICI బ్యాంక్ లిమిటెడ్‌కు జూన్ 30, 2023 నాటికి బ్యాంక్ మొత్తం ఆస్తులు రూ.16,47,000 కోట్లుగా ఉన్నాయి. -
అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై..
ఐసీఐసీఐ బ్యాంకులో ఆ సంస్థ మాజీ సీఈవో చందాకొచ్చర్ ముడుపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనని ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవి నుంచి అక్రమంగా తొలగించారంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు వారాల తర్వాత ఆమె వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. లక్షల కోట్ల ఆస్తులు. వేల సంఖ్యలో ఉద్యోగులు. పురుషాధిక్య వ్యాపార రంగం. ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ. అయితేనేం అంకెలతో గారడీ చేసే ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా.. బ్యాంకర్లకు మెగస్టార్లా..తోటి ఉద్యోగులకు దేవుడిలా కనిపించిన చందాకొచ్చర్ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 2018లో అప్పట్లో చందాకొచ్చర్ క్విడ్ ప్రోకో’ వ్యవహారం వెలుగులోకి రావడంతో అక్టోబర్ 4, 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ చందాకొచ్చర్‌తో స్వచ్ఛంద రాజీనామా చేయించింది. 4 నెలల తర్వాత బాంబే హైకోర్టు సైతం బ్యాంక్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైందేనని, చందా కొచ్చర్ సీఈవో పదవిలో కొనసాగేందుకు అనర్హులుగా తీర్పిచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చందా కొచ్చర్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. పలు నివేదికల ప్రకారం.. అదే సమయంలో, తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెన్ఫిట్స్, ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ (ఈఎస్ఓపీఎస్) అందిచాలని కోరింది. టెర్మినేషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, చందా కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్, అతని కంపెనీకి లాభం చేకూర్చిన వీడియోకాన్ గ్రూప్‌కు క్విడ్ ప్రోకో లోన్లు రూ. 3,250 కోట్లు ఇచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ డైరెక్టర్లు మాజీ సీఈవోకి ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ (ఈఎస్ఓపీఎస్) తోపాటు వేతనాన్ని నిలిపివేసింది. ఇప్పుడు అదే అంశాన్ని చందా కొచ్చర్ సుప్రీం కోర్టుకు చేసిన అప్పీల్లో వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ విఫలం ఐసీఐసీఐ బ్యాంక్ తన పదవీ విరమణ తర్వాత సంస్థ అందించే ప్రయోజనాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని నిరోధించాలని సుప్రీంకు విన్నవించారు. తన వద్ద ఉన్న 6,90,000 షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లపై అనుమతించాలని అన్నారు. స్టాక్స్ డీల్ చేసే వీలు లేదని తెలిపేలా ఐసీఐసీఐ యాజమాన్యం వద్ద ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేవని హైకోర్టులో నిరూపించుకోవడంలో విఫలమైందని గుర్తు చేశారు. వేధింపులకు గురవుతున్నారు ఒకప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటును దక్కించుకున్నారని, అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును పొందిన తాను ఈ కేసుల కారణంగా 62 ఏళ్ల వయస్సులో తీవ్రమైన మనోవేదకు గురవుతున్నట్లు అప్పీల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్.. బెయిల్‌పై విడుదల చందా కొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3,200 కోట్లకుపైగా లోన్ తీసుకుంది. ఈ లోన్ మంజూరు సమయంలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీరిద్దరినీ ఈనెల 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్ఆర్ఎల్), సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు చందా కొచ్చర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొంది. దీపక్ కొచ్చర్ దంపతులతో పాటు వేణుగోపాల్ ధూత్‌లు డిసెంబర్ 2022లో అరెస్టయ్యారు, అయితే ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. కాగా, ఇండియన్ బ్యాంకింగ్ ట్రెండ్‌ను మార్చేసి.. ఆ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్లారు. కానీ ఇప్పుడు కరువైన పలకరింపులు.. కోర్టులు,కేసులు, అరెస్ట్‌లతో ఆమె జీవితం భారం కావడంతో చందా కొచ్చర్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 చందా కొచ్చర్ అక్రమ సామ్రాజ్య పునాదులు కదిలాయి -
పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్
ఆధునిక కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మనకు సంబంధం లేకుండానే మనపేరు మీద లోన్ తీసుకోవడం వంటి సంఘటనలు గత కొంత కాలంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం పాన్, ఆధార్ జిరాక్స్ కాపీల కోసం జిరాక్స్ సెంటర్‌కు వెల్తూ ఉంటాము. అలాంటప్పుడు మన కాపీలను కొంతమంది వినియోగించి ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. నిజానికి మనకు సంబంధం లేకపోయినా కొన్ని సందర్భాల్లో మెసేజ్‌లు లేదా మెయిల్స్ వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని సరిగ్గా పట్టించుకోకుంటే మోసపోయినట్లు చివరి వరకు కూడా తెలిసే అవకాశం లేదు. ఇలాంటి ఉదండమే తాజాగా వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో భారీ మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 8.5కోట్ల రూపాయల విలువ చేసే బంగారం విషయంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు సంబంధించిన నిల్వల్లో తేడాలున్నట్లు ఆడిట్లో తెలిసింది. దీనిపైన బ్యాంకు డిప్యూటీ మేనేజర్ 'బైరిశెట్టి కార్తీక్'పై అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ను వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 5 పద్ధతుల్లో 128 ఖాతాదారులపేరిట గోల్డ్ లోన్ పొందినట్లు రికార్డులు తయారు చేసి బ్యాంకును మోసం చేసినట్లు, వచ్చిన డబ్బును ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు వెల్లడించారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ పగ్గాలు మళ్ళీ అతనికే - ఆర్బీఐ ఆమోదం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ 'సందీప్ భక్షి' (Sandeep Bakhshi)ని మరో మూడేళ్లపాటు కొనసాగడానికి ఆమోదం తెలిపింది. దీంతో ఈయన 2023 అక్టోబర్ 04 నుంచి 2026 అక్టోబర్ 03 వరకు ఆ పదవిలో ఉంటారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 ఆగష్టు 30న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో షేర్హోల్డర్లు ఆమోదించినట్లు తెలిసింది. 2018లో చందా కొచ్చర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత సందీప్ భక్షి సీఈఓగా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి బక్షి బ్యాంకుని అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేసాడు. ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలు - ఇది కదా కావాల్సింది! సందీప్ భక్షి నాయకత్వంలో ఐసీఐసీఐ బ్యాంక్ గొప్ప విజయాలను సాధించగలిగింది. 1986 నుంచి ఐసీఐసీఐ గ్రూపుతో మంచి సంబంధాలున్న భక్షి 2022లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ ఎండి అండ్ సీఈఓ పదవిని, 2010 నుంచి 2018 వరకు ఐసీఐసీఐ ఫ్రడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి, సీఈఓ పదవిని చేపట్టాడు. కాగా 2018 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓగా కొనసాగుతున్నాడు. -
ఆర్బీఐ ఊరుకున్నా.. ఈ రెండు బ్యాంకులు తగ్గలే.. వడ్డీ రేట్లు ఇలా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్లను ఏ మాత్రం పెంచకుండా యధాతధంగా ఉంచినప్పటికి.. రెండు బ్యాంకులు మాత్రం లోన్ వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో రుణ గ్రహీత కట్టాల్సిన ఈఎమ్ఐ అమాంతం పెరిగింది. ఇంతకీ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులేవీ? ఎంత శాతం వడ్డీ పెంచిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండూ కూడా తమ మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచింది. పెరిగిన ఈ రేట్లు 2023 సెప్టెంబర్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. కావున ఎవరైతే ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఉంటారో వారు కట్టాల్సిన ఈఎమ్ఐలు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కావున ఓవర్ నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.45 శాతం & మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.50 శాతం, 8.85 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి చేరింది. ఓవర్ నైట్ 8.45% ఒక నెల 8.45% మూడు నెలలు 8.50% ఆరు నెలలు 8.85% ఒక సంవత్సరం 8.95% ఇదీ చదవండి: నెలకు రూ. 40.50 లక్షలు రెంట్ ఇవ్వడానికి రెడీ.. అట్లుంటది కుబేరుడంటే? పంజాబ్ నేషనల్ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇది కూడా ఐదు బేసిస్ పాయింట్ల మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను పెంచింది. దీంతో ఈ బ్యాంక్ ఓవర్ నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8.5 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలకు సంబంధించిన రేట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతం, 8.55 శాతానికి పెరిగాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెంచారు. ఓవర్ నైట్ 8.15% ఒక నెల 8.25% మూడు నెలలు 8.35% ఆరు నెలలు 8.55% ఒక సంవత్సరం 8.65% మూడు సంవత్సరాలు 8.95% -
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: వడ్డీ రేట్లు మారాయ్..
ప్రముఖ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్లకుపైగా రూ.5 కోట్ల లోపు చేసే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 2023 సెప్టెంబర్ 2 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి తెచ్చింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed Deposits) పై సీనియర్ సిటిజన్లతోపాటు సాధారణ వ్యక్తులకూ ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు కాల వ్యవధిలో ఉండే బల్క్ ఎఫ్డీలపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. ఈ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లు, సాధారణ వ్యక్తులకూ ఒకే రకంగా ఉంటుంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల మెచ్యూరిటీలపై 7 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇక 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు కాల వ్యవధిలో ఉండే డిపాజిట్లపై 6.75 శాతం లభిస్తుంది. 2 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపైనా ఇదే వడ్డీ రేటు ఉంటుంది. 185 రోజుల నుంచి 270 రోజుల వరకు టెన్యూర్ డిపాజిట్లపై 6.65 శాతం, 91 రోజుల నుంచి 184 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు అమలవుతుంది. 61 రోజుల నుంచి 90 రోజుల టెన్యూర్‌కు 6 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 5.75 శాతం, 30 రోజుల నుంచి 45 రోజుల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఇక కనిష్టంగా 7 రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలో చేసే డిపాజిట్లపై 4.75 శాతం లభించనుంది. సవరించిన వడ్డీ రేట్లు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లతోపాటు రెన్యూవల్ చేసే ఇప్పటికే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకూ వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన చార్జీలు
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) చార్జీల రూపంలో కస్టమర్లపై మరింత భారాన్ని మోపింది. బ్యాంక్ డెబిట్ కార్డ్ (Debit cards)లపై వార్షిక రుసుములను పెంచేసింది. ఆగస్టు 21 నుంచి పెరిగిన చార్జీలు అమలవుతాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త డెబిట్ కార్డ్‌లపై జాయినింగ్ ఫీజులను కూడా ఇదే విధంగా పెంచింది. ఇవి ఆగస్టు 1 అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ లేదా బిజినెస్ ఎక్స్ప్రెషన్స్ డెబిట్ కార్డ్‌పై వార్షిక రుసుము రూ. 100 పెరిగింది. ఇది ఇంతకు ముందు రూ. 499లుగా ఉండగా ఇక నుంచి రూ. 599లు గా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ కోరల్ లేదా బిజినెస్ ఎక్స్ప్రెషన్స్ కోరల్ డెబిట్ కార్డ్‌పై కూడా యాన్యువల్ ఫీజు రూ. 100 పెరిగింది. రూ. 799 ఉన్నది రూ. 899లకు పెరిగింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ సప్ఫిరో డెబిట్ కార్డుకు ప్రస్తుతం రూ. 4,999 ఉన్న వార్షిక రుసుములో మార్పు లేదు. బ్యాంక్ కోరల్/బిజినెస్ కోరల్ డెబిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 599 నుంచి రూ. 699కి పెరిగింది. రూబిక్స్ డెబిట్ కార్డ్ వార్షిక రుసుమైతే ఏకంగా రూ. 350 పెరిగింది. ప్రస్తుతం రూ. 749 ఉండగా ఇక నుంచి రూ. 1,099 చెల్లించాలి. సప్ఫిరో/బిజినెస్ సప్ఫిరో డెబిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 500 పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ. 1,499 నుంచి రూ. 1,999 లకు చేరింది. కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ నెలవారీ రుసుము రూ. 249లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది సంవత్సరానికి రూ. 2,988 ఉంటుంది. కాగా ఏడాది పూర్తయిన ఆయా డెబిట్ కార్డులపై కస్టమర్లు వివిధ రకాల వోచర్లను ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తుంది. వార్షిక రుసుము చెల్లించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ-మెయిల్ ద్వారా ఈ వోచర్లను పొందవచ్చు. ఇదీ చదవండి: కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్.. ఇక్కడ మామూలు రూపాయిలు కాదు.. -
నష్టాల్లోంచి లాభాల్లోకి...
ముంబై: ఆఖరి గంటలో అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం ఇంట్రాడే నష్టాలను భర్తీ చేసుకొని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచీ సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్నాయి. ట్రే డింగ్‌లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 79 పాయింట్ల లాభంతో 65,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 170 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఆరు పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, ఇంధన, ఫార్మా, కన్జూమర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. ► అదానీ పోర్ట్స్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ ని్రష్కమణతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అంబుజా సిమెంట్స్ షేరు 3.50% పతనమైంది. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 3.26% నష్టపోయింది. అదానీ ట్రాన్స్మిషన్స్ 2.50%, ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 2% వరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 1.50%, ఎన్డీటీ 1.30%, అదానీ పవర్ ఒక శాతం పతనయ్యాయి. ► రూ.880 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గతవారం ఐపీఓకు వచి్చన టీవీఎస్ సప్లై చివరి రోజు నాటికి 2.78 రెట్ల సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.51 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా మొత్తం 6.98 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్! ఆ మూడు బ్యాంకుల్లో..
ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ 'ఐసీఐసీఐ'తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలకమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మూడు బ్యాంకులు తమ 'మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ల'ను (MCLR) సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది బహుశా కష్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రూల్స్ ఇప్పటికే (2023 ఆగష్టు 01) అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు బ్యాంకులు ఇచ్చే లోన్ మీద అమలు చేసే ఒక ప్రామాణిక వడ్డీ. ఒక వేలా ఎంసీఎల్ఆర్ రేట్లు పెరిగితే దీనికి అనుబంధంగా ఉండే వెహికల్, పర్సనల్, హోమ్ లోన్ వంటి అన్ని ఈఎమ్ఐలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కొత్త నిబంధనల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. అన్ని కాలవ్యవధులకు ఇది వర్తిస్తుందని సమాచారం. ఈ కారణంగా ఒక నెల ఎంసీఎల్ఆర్ రేట్లు 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అదే సమయంలో 3 & 6 నెలల కాలానికి వరుసగా 8. 41 శాతం, 8.80 శాతానికి చేరాయి. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) ఇప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లు యధాతధంగా ఉన్నట్లు సమాచారం. కావున బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.10 శాతంగా ఉంది. ఇక ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.20 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 హైబ్రిడ్ కార్లు - వివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) ఇక చివరగా బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే.. ఇది కూడా కొత్త నిర్ణయాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతం ఉండగా.. ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 8.15 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉంది. -
ఐసీఐసీఐ లాభం హైజంప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 44 శాతం జంప్‌చేసి రూ. 10,636 కోట్లను తాకింది. స్టాండెలోన్ లాభం సైతం 40 శాతం ఎగసి రూ. 9,648 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం(స్టాండెలోన్) రూ. 28,337 కోట్ల నుంచి రూ. 38,763 కోట్లకు పురోగమించింది. నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 18,227 కోట్లను తాకింది. రుణాల్లో 18 శాతం వృద్ధి సాధించగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.78 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 5,183 కోట్లయ్యింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.81 శాతం నుంచి 2.76 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 4,297 కోట్ల నుంచి రూ. 5,318 కోట్లకు పెరిగాయి. వీటిలో రిటైల్ విభాగం వాటా రూ. 5,012 కోట్లుకాగా.. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.9 శాతానికి చేరడంతో పెట్టుబడుల సమీకరణ అవసరంలేనట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. -
రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం?
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ వీడియోకాన్ ముడుపుల వ్యవహారంలో బాంబే హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా చందా కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోర్ట్‌ను కోరింది. కొచ్చర్ రూ.64 కోట్ల బ్యాంక్ నిధుల్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారని కోర్ట్‌కు సీబీఐ తెలిపింది. చట్టవిరుద్ధంగా బ్యాంక్ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆధారాలున్నాయని పేర్కొంది. అంతేకాదు, తమ విచారణలో రూ.64 కోట్లను కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్ రెన్యూవబుల్తో పాటు వీడియోకాన్ కంపెనీలోకి మళ్లించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ లిమోసిన్.. చందా కొచ్చర్ కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై రుణాలకు అనర్హమైన వీడియోకాన్ కంపెనీకి లోన్స్ ఇచ్చేలా తన పదవిని దుర్వినియోగం చేసినట్లు కోర్ట్ ఎదుట వాదించారు. దీంతో పాటు, 2016లో కొచ్చార్ ముంబైలోని చర్చ్‌గేట్ ప్రాంతంలో ఉన్న సీసీఐ చాంబర్స్‌లోని రూ.5.3 కోట్ల విలువైన ఫ్లాట్‌కు కేవలం రూ.11లక్షలే చెల్లించారని అన్నారు. 2021 నవంబర్ నెలలో అదే బిల్డింగ్‌లో ఓ ఫ్లోర్‌కు చందా కొచ్చర్ కుమారుడు అర్జున్ కొచ్చర్ రూ.19.11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. 11,000 పేజీల ఛార్జ్ షీట్ ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్‌లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. కేసులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ 11,000 చార్జిషీట్ దాఖలు చేసింది. జులై 3కి వాయిదా తాజాగా,ఆ చార్జిషీట్‌పై విచారణ జరిగింది. విచారణలో కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్ట్‌ను కోరింది. ఇరువురి వాదనలు విన్న బాంబే హైకోర్ట్ కేసు తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ ఎదుట లిమోసిన్ తన వాదనలు కొనసాగించనున్నారు. 2017లోనే తెరపైకి క్విడ్ ప్రో కో వివాదం.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచ్చర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంక్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ.1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. చివరిగా :: సీబీఐ నివేదికల ప్రకారం..ఆగస్ట్ 6, 2009లో వీడియోకాన్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా ఉన్న చందా కొచ్చార్ లోన్లు ఇచ్చారని, అదే ఏడాది సెప్టెంబర్ 7 ఆ రుణాల్ని వీడియోకాన్‌కు చెల్లించినట్లు తేలింది. చదవండి👉 ‘అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు ఆర్థిక నేరాలతో అరెస్ట్’ -
ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ దిగ్గజాలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ,పబ్లిక్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండూ తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (ఎంసీఎల్ఆర్) రేట్లు పెంచాయి. సవరించిన రేట్లు జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ అనూహ్యం కొన్నింటికి వడ్డీరేటును తగ్గించి, మరికొన్నింటిపై వడ్డీరేటును పెంచడం గమనార్హం. ఒక నెల ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ వడ్డీరేటు 8.50 శాతం 8.35శాతానికి దిగి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 8.75 శాతంనుంచి 8.85 శాతానికి పెంచడం విశేషం. (సూపర్ ఆఫర్: ఐపోన్ 13పై రూ. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం ఓవర్‌నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8శాతంనుంచి 8.10శాతానికి పెంచింది. ఒకటి, మూడు, ఆరు నెలల రేట్లును కూడా పెంచి వరుసగా 8.20, 8.30, 8.50 శాతంగా ఉంచింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.60శాతంగానూ, మూడేళ్ల రుణాలపై వడ్డీరేటు 8.80శాతంనుంచి 8.90 శాతానికి పెంచింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఫోన్ పే గూగుల్ పే పేటియంల కొంపముంచిన జొమాాటో
-
ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్!
Zomato UPI: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ సంస్థలకు షాక్ ఇస్తూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా సొంతంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి పేమెంట్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పడు ఇలా కాకుండా జొమాటోనే సొంతంగా యూపీఐ సర్వీస్‌ను తీసుకువచ్చింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! కస్టమర్లు చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడకుండా జొమాటో ఈ కొత్త సర్వీసును తీసుకువచ్చింది. దీని వల్ల కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగుతుంది. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు పేమెంట్ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్ ని ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. నేరుగా జొమాటో యూపీఐ ద్వారానే కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్ నుంచి సులువుగా డబ్బులు చెల్లించొచ్చు. జొమాటో కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యంతో ఈ కొత్త యూపీఐ సర్వీస్ ని తీసుకువచ్చింది. జొమాటో యూజర్లు యూపీఐ సేవలని ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద జొమాటో ఈ యూపీఐ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అందువల్ల ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. త్వరలో ఈ యూపీఐ సర్వీస్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
ఐసీఐసీఐ బ్యాంక్ రూపీ వోస్ట్రో ఖాతాలు
ముంబై: రూపీ వోస్ట్రో ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఎగుమతి, దిగుమతిదారులు వోస్ట్రో ఖాతాల ద్వారా రూపాయి మారకంలో చెల్లింపులు చేసుకోవచ్చ ని పేర్కొంది. ఇన్వాయిస్, చెల్లింపులకు ఐఎన్ఆర్ను ఉపయోగించడం ద్వారా విదేశీ కరెన్సీ మారకం రిస్క్ తగ్గుతుందని తెలిపింది. 29 దేశాల్లోని కరస్పాడెంట్ బ్యాంకుల్లో 100కుపైగా రూపీ వోస్ట్రో అకౌంట్లకు కలిగి ఉన్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానం 2023కు తోడు, ఎగుమతులు, దిగుమతులు, ఇన్వాయిసింగ్ ఐఎన్ఆర్లో ఉండాలన్న ఆర్బీఐ కార్యాచరణకు అనుగుణంగా ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ రూపీ వోస్ట్రో ఖాతాలు
ముంబై: రూపీ వోస్ట్రో ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఎగుమతి, దిగుమతిదారులు వోస్ట్రో ఖాతాల ద్వారా రూపాయి మారకంలో చెల్లింపులు చేసుకోవచ్చ ని పేర్కొంది. ఇన్వాయిస్, చెల్లింపులకు ఐఎన్ఆర్ను ఉపయోగించడం ద్వారా విదేశీ కరెన్సీ మారకం రిస్క్ తగ్గుతుందని తెలిపింది. 29 దేశాల్లోని కరస్పాడెంట్ బ్యాంకుల్లో 100కుపైగా రూపీ వోస్ట్రో అకౌంట్లకు కలిగి ఉన్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానం 2023కు తోడు, ఎగుమతులు, దిగుమతులు, ఇన్వాయిసింగ్ ఐఎన్ఆర్లో ఉండాలన్న ఆర్బీఐ కార్యాచరణకు అనుగుణంగా ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. -
లాభాల బాటలో ఐసీఐసీఐ బ్యాంక్.. ఫలితాలు ఇలా!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధింంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి-మార్చి(క్యూ4)లో నికర లాభం 27 శాతం ఎగసి రూ. 9,853 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం జంప్‌చేసి రూ. 9,122 కోట్లకు చేరింది. ఇందుకు రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు సహకరించాయి. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 40 శాతం దూసుకెళ్లి రూ. 17,667 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4 శాతం నుంచి 4.9 శాతానికి బలపడ్డాయి. రుణాల్లో 19 శాతం వృద్ధి ఇందుకు దోహదపడింది. ఆదాయం సైతం అప్ గతేడాది క్యూ4లో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 27,412 కోట్ల నుంచి రూ. 36,109 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 17,119 కోట్ల నుంచి రూ. 22,283 కోట్లకు పెరిగాయి. స్థల మొండిబకాయిలు 3.6 శాతం నుంచి 2.81 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,068 కోట్ల నుంచి రూ. 1,619 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.34 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ. 185 కోట్ల నుంచి రూ. 235 కోట్లకు, సాధారణ బీమా లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు జంప్‌చేశాయి. -
క్యూ4లో బ్యాంకుల జోరు.. టార్గెట్ లక్షకోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ రంగం ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు ఫైనాన్షియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. జనవరి–మార్చి(క్యూ4) లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లు ప్రధాన పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల మొత్తం లాభాలు రూ. లక్ష కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. మొండి రుణాలు తగ్గడం, రుణ వృద్ధి పుంజుకోవడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. రూ. 40,000 కోట్లకు మార్చితో ముగిసిన గతేడాదికి పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ రూ. 40,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలుంది. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలోనే రూ. 33,538 కోట్లు సాధించింది. ఇది అంతక్రితం ఏడాది(2021–22)లో అందుకున్న రూ. 31,676 కోట్లకంటే రూ. 1,862 కోట్లు అధికంకావడం గమనార్హం! ఈ బాటలో ఇతర ప్రభుత్వ బ్యాంకులు సైతం పటిష్ట పనితీరు ప్రదర్శించనున్నాయి. ఇందుకు మొండి బకాయిలు(ఎన్పీఏలు), స్లిప్పేజీలు తగ్గడానికితోడు రెండంకెల రుణ వృద్ధి, పెరుగుతున్న వడ్డీ రేట్లు సహకరించనున్నాయి. గతేడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 12 పీఎస్‌బీలు మొత్తంగా రూ. 70,166 కోట్ల నికర లాభాలను ప్రకటించాయి. 2021–22లో సాధించిన రూ. 48,983 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఈ ట్రెండ్ క్యూ4లోనూ కొనసాగనున్నట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ స్వరూప్ కుమార్ సాహా పేర్కొన్నారు. దీంతో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 30,000 కోట్లు ప్రకటించే వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి పూర్తి ఏడాదికి రూ. లక్ష కోట్ల నికర లాభాలను అందుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రైమాసికవారీగా ఇలా పీఎస్‌బీలు గతేడాది క్యూ1లో ఉమ్మడిగా రూ. 15,306 కోట్లు, క్యూ2లో రూ. 25,685 కోట్లు, క్యూ3లో రూ. 29,175 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా మిగిలిన అన్ని పీఎస్‌బీల నికర లాభాలూ క్యూ3లో మెరుగయ్యాయి. ఎస్బీఐ అత్యధికంగా 68 శాతం వృద్ధితో రూ. 14,205 కోట్లు ఆర్జించగా.. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పీఎన్బీ లాభం మాత్రం 44 శాతం క్షీణించి రూ. 628 కోట్లకు పరిమితమైంది. అయితే డిపాజిట్ల రేట్లు పెరగడం, కాసా(సీఏఎస్ఏ) తగ్గుతున్న కారణంగా నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి పడనున్నట్లు సాహా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెరుగుదలలోనూ క్యూ4లో రుణ వృద్ధి పుంజుకుకోవడం గమనార్హం. ఐసీఐసీఐ దూకుడు బ్రోకరేజీ.. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం త్రైమాసికవారీగా ప్రొవిజనింగ్ తగ్గనున్నట్లు అంచనా. ప్రొవిజనింగ్ కవరేజీ రేషియో(పీసీఆర్) భారీ బిల్డప్ నేపథ్యంలో ఎన్పీఏలు వెనకడుగు వేయనున్నాయి. అయితే ఆర్బీఐ నిబంధనల కారణంగా భారీ కార్పొరేట్ రుణాలుగల బ్యాంకులు అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుంది. కాగా.. ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ లాభాలు సాధించనుండగా.. యాక్సిస్ బ్యాంక్ నష్టాలు ప్రకటించే వీలున్నట్లు ఎమ్కే గ్లోబల్ నివేదిక పేర్కొంది. సిటీబ్యాంక్ పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లతో గుడ్‌విల్ రైటా ఫ్స్ చేపట్టవలసిరావడం ప్రభావం చూపనుంది. ఇక పటిష్ట వృద్ధి, తక్కువ ప్రొవిజన్లతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఉత్తమ ఫలితాలు ప్రకటించవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఆశావహ ఫలితాలు వెల్లడించే వీలుంది. ప్రయివేట్ రంగ బ్యాంకులు క్యూ3లో 33% అధికంగా రూ. 36,512 కోట్ల నికర లాభాలు ప్రకటించిన విషయం విదితమే. బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ మినహా అన్ని ప్రయివేట్ బ్యాంకులూ సానుకూల పనితీరు చూపాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా రూ. 12,259 కోట్లు ఆర్జించింది. -
ఐసీఐసీఐ స్కాంలో కీలక పరిణామం: ఆ ముగ్గురికీ భారీ షాక్!
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కాం కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కుంభకోణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చందా కొచ్చర్ తోపాటు, ఆమె భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లపై చార్జిషీట్ దాఖలైంది. ముంబై సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. రూ.3,250 కోట్ల రుణం మోసం కేసులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు శనివారం తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ 2009 , 2011 మధ్య వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన ఆరు కంపెనీలకు రూ. 1,875 కోట్ల రూపాయల టర్మ్ రుణాన్ని మంజూరులో అవకతవకలు జరిగాయని సీబీఐ ప్రధాన ఆరోపణ. క్విడ్ ప్రో కింద వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరైనట్టు, ఇందులో ధూత్ అంతిమ లబ్ధిదారుడని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకుగాను దీపక్ కొచర్‌కు చెందిన నూపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్‌కు రూ. 64 కోట్లు, దక్షిణ ముంబైలోని ఫ్లాట్‌కు 2016లో రూ. 11 లక్షలు (విలువ రూ. 5.25 కోట్లు) లంచంగా ముట్టాయని సీబీఐ పేర్కొంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో చందాకొచ్చర్‌ను ఐసీఐసీఐ బ్యాంకు తొలగించింది. ఈ కేసులో సీబీఐ 2019లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019లో, చందా కొచ్చర్ బ్యాంక్ ఎండీగా ఉన్నప్పుడు కంపెనీలకు ఐసీఐసీఐ మంజూరు చేసిన రూ.1,800 కోట్లకు పైగా రుణానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. 2022 డిసెంబర్లో కొచ్చర్ దంపతులను, వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. అయితే, అరెస్టులు చట్టానికి లోబడి లేవని పేర్కొంటూ జనవరి 9న బాంబే హైకోర్టు కొచ్చర్లకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ధూత్‌కు బెయిల్ కూడా లభించిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా?
ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ భక్షి దేశంలో అత్యధికంగా వేతనాలు పొందే బ్యాంకర్లలో ఒకరు. ఐసీఐసీఐ బ్యాంకును సంక్షోభాల నుంచి బయటకు తీసిన ఘనత ఆయనది. ఆయనకు ముందున్న చందా కొచ్చర్ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలతో రాజీనామా చేయడం తెలిసిందే. 2018లో బ్యాంకు పగ్గాలు చేపట్టిన సందీప్ భక్షి.. ఐదేళ్లలోనే మళ్లీ వృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్! సందీప్ భక్షి బాధ్యతలు స్వీకరించినప్పుడు బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు విలువ రూ. 313.35. అది మార్చి 16 నాడు రూ. 825 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు బ్యాంక్ మేనేజ్మెంట్పై విశ్వాసం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హయాంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 5.74 లక్షల కోట్లకు పెరిగింది. కంపెనీ పబ్లిక్‌గా ట్రేడ్ చేసిన అన్ని షేర్ల మొత్తం మార్కెట్ విలువను మార్కెట్ క్యాప్‌గా వర్ణిస్తారు. ఇంజినీర్ నుంచి బ్యాంకర్ సందీప్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల కార్పొరేట్ అనుభవం ఉంది. చండీగఢ్ పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన జంషెడ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. 1986లో ఐసీఐసీఐలో చేరిన సందీప్‌భక్షి 2018లో ఆ బ్యాంకుకు ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన బ్యాంక్ హోల్‌టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఎనిమిదేళ్లపాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పనిచేశారు. దానికి ముందు ఐసీఐసీఐ లాంబార్డ్‌కు ఆయన టాప్ ఎగ్జిక్యూటివ్. సంవత్సర జీతాన్ని వదులుకున్నారు.. 2022 ఆర్థిక సంవత్సరంలో సందీప్ భక్షి వార్షిక వేతనం రూ. 7.98 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ. 65 లక్షలు. అయితే సందీప్‌లోని మరో కోణం అందరినీ ఆకట్టుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆయన 2021 వార్షిక జీతాన్ని ఆయన వదులుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉండే ఆయన చాలా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. -
ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.15 శాతం వడ్డీ రేటును చెల్లించ నున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. డిపాజిట్ల రకాలు, వ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లులో మార్పులుంటాయి. రూ.2 కోట్లకుపైన రూ.5 కోట్ల లోపు ఉండే ఎఫ్డీలపై వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది. (ఇదీ చదవండి: సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం) ప్రస్తుతం 4.75 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది ఐసీసీఐ. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 23 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి (ఫిబ్రవరి 23 )నుంచే అమలులోకి వస్తాయని ఐసీఐసీఐ వెల్లడించింది. రెండు నుంచి మూడేళ్ల బల్క్ డిపాజిట్లపై 7.00 శాతాన్ని అలాగే 290రోజుల నుంచి రెండేళ్ల వ్యవధిలోని డిపాజిట్లపై అత్యధికంగా 7.15 శాతం వడ్డీని అందిస్తుంది. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) సవరించిన బల్క్ ఎఫ్డీ వడ్డీ రేట్లు ♦ 7 - 29 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4.75 శాతం ♦ 30 - 45 రోజులకు 5.50 శాతం ♦ 46 - 60 రోజులకు 5.75 శాతం ♦ 61 -90 రోజులకు 6.00 శాతం ♦ 91 -184 రోజులకు 6.50 శాతం ♦ 185 - 270 రోజులు 6.65 శాతం ♦ 3 నుంచి అయిదేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం ♦ 5 -10 సంవత్సరాల డిపాజిట్లపై 6.75 శాతం కాగా ఇటీవల మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్బీఐ రెపో రేటును పెంచిన సంగతివ తెలిసిందే. దీంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేటును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్ న్యూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ డీలర్స్కు గుడ్ న్యూస్. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించే డీలర్లకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం సమకూరుస్తుంది.తీసుకున్న రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేలా కాల పరిమితి ఉంటుంది. టాటాకు చెందిన డీజిల్, పెట్రోల్ వాహనాలను విక్రయిస్తున్న డీలర్లకు ఇప్పటికే ఈ బ్యాంక్ రుణం అందిస్తోంది. -
ఐసీఐసీఐ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 8,792 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 8,312 కోట్లతో పోలిస్తే ఇది 34 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం సైతం 35 శాతం జంప్‌చేసి రూ. 16,465 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.7 శాతం బలపడి 4.65 శాతానికి చేరాయి. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి 3.07 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 16.26 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో జీవిత బీమా లాభం రూ. 331 కోట్ల నుంచి రూ. 221 కోట్లకు క్షీణించింది. సాధారణ బీమా లాభం 11 శాతం మెరుగై రూ. 353 కోట్లను తాకింది. అసెట్ మేనేజ్మెంట్ లాభం రూ. 334 కోట్ల నుంచి రూ. 420 కోట్లకు వృద్ధి చూపింది. బ్రోకింగ్ విభాగం లాభం రూ. 281 కోట్లకు పరిమితమైంది. స్లిప్పేజీలు ఇలా... క్యూ3లో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల స్లిప్పేజీలు రూ. 5,723 కోట్లను తాకాయి. వీటిలో రిటైల్, రూరల్ బ్యాంకింగ్ విభాగం నుంచి రూ. 4,159 కోట్లు, కార్పొరేట్ల నుంచి రూ. 1,500 కోట్లు చొప్పున నమోదయ్యాయి. ఇక రూ. 2,257 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. వీటిలో ప్రుడెన్షియల్ కేటాయింపులకింద రూ. 1,500 కోట్లు పక్కనపెట్టింది. దీంతో మొత్తం బఫర్ రూ. 11,500 కోట్లకు చేరింది. ఈ కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 300తో కలిపి మొత్తం బ్రాంచీల సంఖ్య 5,700కు చేరింది. -
Chanda Kochhar: రూ.5.25 కోట్ల ప్లాట్ ఖరీదు రూ.11 లక్షలే!
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ కుంభకోణంలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లోన్ కేసులో ప్రధాన నిందితులైన చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్తో పాటు వేణుగోపాల్ ధూత్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు నిందితుల మధ్య జరిగిన లావాదేవీలను పరిశీలించగా అందులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొచ్చర్ దంపతులకు లంచాలు ఎలా ఇచ్చారంటే? ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందా కొచ్చర్ ఆర్బీఐ బ్యాంక్‌లకు విధించిన బ్యాంకింగ్ రెగ్యూలేషన్ యాక్ట్, క్రెడిట్ పాలసీ (రుణ) నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు రూ.3250 కోట్లలోన్ మంజూరు చేశారు. అందుకు గాను ధూత్.. కొచ్చర్ కుటుంబానికి లంచాలు ఇచ్చినట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. వడ్డీతో పాటు షేర్ కూడా రుణం మంజూరు తర్వాత భార్య భర్తలైన చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్‌కు వేణుగోపాల్ ధూత్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రుణం విషయంలో అనుకూలంగా వ్యవహరించారనే కారణంగా ధూత్ తన వీడియోకాన్ గ్రూప్‌లో ఆ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందాకొచ్చర్‌కు షేర్ ఇవ్వడంతో పాటు సంస్థ నుంచి వచ్చిన లాభాల్లో అధిక మొత్తంలో వడ్డీ ఇచ్చారు. పైగా తన ఖరీదైనా ప్లాటులో నివాసం ఉండేలా కొచ్చర్ దంపతులు ఇచ్చారు. అప్పు తీర్చేందుకు అప్పుగా రూ.300 కోట్ల రుణం సీఈవో పదవితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ శాంక్షనింగ్ కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న చందా కొచ్చర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ పదవిలో(శాంక్షనింగ్ కమిటీ చైర్ పర్సన్ గా) ఉన్న ఆమె బ్యాంక్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఎల్)కు రూ.300కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ రుణాన్ని వీడియోకాన్ గతంలో అదే బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు.. కొత్తగా వందల కోట్లను రుణాన్ని ఇచ్చింది. ఆ తర్వాత శాక్షనింగ్ కమిటీ పదవి నుంచి తప్పుకుంది. రూ.64కోట్లు ముడుపులు అందుకు ప్రతిఫలంగా వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్..చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (nrpl) సంస్థ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.64 కోట్లు ముడుపులుగా ఇచ్చినట్లు సీబీఐ తన ఇన్వెస్టిగేషన్లో గుర్తించింది. ఆ రూ.64 కోట్లతో దీపక్ కొచ్చర్ 33.15 మెగా వాట్ల కెపాసిటీతో విండ్ ఫార్మ్ ప్రాజెక్ట్ కావాల్సిన భారీ ఎత్తున చిన్న చిన్న విండ్ టర్బైన్లను కొనుగోలు చేశారు. రూ.5.25 కోట్ల ప్లాట్ ఖరీదు రూ.11 లక్షలే చందా కొచ్చర్, ఆమె కుటుంబం వేణుగోపాల్ ధూత్ నుంచి అన్నీ రకాల లబ్ధి పొందినట్లు దర్యాప్తు అధికారులు విచారణలో స్పష్టమైంది. పైన పేర్కొన్నుట్లుగా రూ.64 కోట్లతో పాటు ముంబైలోని సీసీఐ ఛాంబర్స్‌లో ఉన్న రూ.5.25 కోట్ల ఖరీదైన ఫ్లాటును 1996 నుంచి 2016 వరకు ఫ్రీగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత అదే ప్రాపర్టీని రూ.11లక్షలకు కొనుగోలు చేసిన వీడియోకాన్ గ్రూప్ తెలిపింది. ఈ లావాదేవీలు 2016 లో జరిగాయి. కానీ ఈ ప్లాట్ కొనుగోలు మాత్రం సంవత్సరాల ముందు నుంచి ఒప్పందం జరిగినట్లు సమాచారం. -
ఈ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీచేసే సంస్థలు ఎస్బీఐ (SBI), ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్, (Axis)యాక్సిస్ బ్యాంక్ వచ్చే ఏడాది మార్చి నాటికి `యూపీఐ` సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాయి. దీంతో డిజిటల్ పేమెంట్స్ సేవల వినియోగానికి యూజర్లకు అదనపు వెసులుబాటు లభించనుంది. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) `రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ` ఫీచర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని కింద రోజుకు రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయని ఎన్పీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ప్రైవేట్ రంగ బ్యాంక్ హెడీఎఫ్సీ బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ విభాగంలో తన కస్టమర్లు ఈ సేవలను అందిస్తున్నాయి. గత జూన్‌లో యూపీఐ సేవలతో క్రెడిట్ కార్డులను `పే నౌ` ఫెసిలిటీ కింద లింక్ చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది. ప్రస్తుతం రోజువారీగా రూ.50 లక్షల విలువైన లావాదేవీలు నమోదవుతుండగా, భవిష్యత్తులో ఇతర అతిపెద్ద క్రెడిట్ జారీ సంస్థలు యూపీఐ సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా లావాదేవీలు మరింత పెరుగనున్నాయి. యూపీఐ లావాదేవీలపై రూ.2000 వరకు రూపే క్రెడిట్ కార్డుల వినియోగంపై అదనపు చార్జీలను తొలగిస్తూ ఇటీవలే ఎన్పీసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్! -
వీడియో కాన్ సీఈవో వేణుగోపాల్ ధూత్ అరెస్ట్!
ఐసీఐసీఐ రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించే సమయంలో వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రూ. 3వేల కోట్లుకు పైగా రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ అరెస్ట్ చేసింది. వారిద్దరిని అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఇవాళ (సోమవారం) వేణుగోపాల్ ధూత్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేరపూరిత కుట్ర ఈ సందర్భంగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీపక్ కొచ్చర్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న నూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్ఆర్ఎల్) కంపెనీలతో పాటు కొచ్చర్ దంపతులతో పాటు, వేణుగోపాల్ ధూత్‌ను నిందితులుగా పేర్కొంది. రూ.40వేల కోట్లు రుణంలో ఇదొక భాగం కేసులో అభియోగాల ప్రకారం.. 2010 - 2012 మధ్యకాలంలో వీడియోకాన్ గ్రూప్‌కు బ్యాంకు రుణం మంజూరు చేసిన నెలల తర్వాత, క్విడ్ ప్రోకోలో భాగంగా వేణుగోపాల్ ధూత్ న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో రూ. 64 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అంతేకాదు చందా కొచ్చర్ తన పదవిని దుర్వినియోగం చేసి వీడియోకాన్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసినందుకు ధూత్ నుండి తన భర్త దీపక్ కొచ్చర్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుండి వీడియోకాన్ పొందిన రూ. 40వేల కోట్ల రుణంలో ఇది భాగం . పదవి నుంచి వైదొలగి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్,ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ వీడియోకాన్ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా చందా కొచర్ 2018 అక్టోబర్‌లో కీలక బాధ్యతల నుంచి వైదొలిగారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్బీఐ మార్గదర్శకాలు,బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘించి వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీ బ్యాంక్ రూ. 3,250 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. చందా కొచ్చర్ మాత్రం రుణాల విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కొట్టిపారేశారు. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ -
పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’
వేగంగా డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కథ అడ్డం తిరిగినప్పుడు కళ్లముందున్న డబ్బు కూడా చేతికొచ్చేలోగా ఆవిరైపోవచ్చు. అప్పుడు చేసిన పాపాలకు ముసుగేసే టైం దొరక్కపోవచ్చు. కష్టపడకుండా వచ్చిన సొమ్మును కాపాడుకోవడం కూడా కష్టమేనని నిరూపించిన సంఘటన చందాకొచ్చర్ స్కాం. కాస్త తెలివితేటలతో బ్యాంకింగ్ వ్యవస్థను అడ్డంగా వాడుకోవచ్చని బయటపెట్టిన ఈ కుంభకోణమే చందా కొచ్చర్ స్కాం. ఏదైనా సాధించడం ఎంత కష్టమో. దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. పవర్ఫుల్ బ్యాంకర్‌గా పేరు తెచ్చుకున్న చందా కొచ్చర్ పొజీషన్ కూడా అదే. లక్షల కోట్ల ఆస్తులు. వేల సంఖ్యలో ఉద్యోగులు. పురుషాధిక్య వ్యాపార రంగం. ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ. అయితేనేం అంకెలతో గారెడీ చేసే ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా.. బ్యాంకర్లకు మెగస్టార్లా..తోటి ఉద్యోగులకు దేవుడిలా కనిపించారు. ఇండియన్ బ్యాంకింగ్ ట్రెండ్‌ను మార్చేసి.. ఆ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్లారు. కానీ కొంతమందిని కొంతకాలమే మోసం చేయొచ్చు. కానీ ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సీఈవోగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఏలిన కొచ్చర్ కూడా అలాగే దొరికి పోయారు. బ్యాంకింగ్ రంగంలో నడిచిన కరప్షన్ ఏపీసోడ్ మొత్తం బయటపడింది. చందా కొచ్చర్ అక్రమసామ్రాజ్యం పునాదులతో కదిలాయి. సీబీఐ అరెస్ట్ ఒకప్పుడు మ్యాగజైన్ కవర్ పేజీల మీద మెరిసిన స్టార్ చందా కొచ్చర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. వేణుగోపాల్ ధూత్‌కి చెందిన వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ. 3,000 కోట్లకు పైగా రుణాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముడుపుల వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎస్సార్ గ్రూప్, వీడియోకాన్ గ్రూప్‌లో లాంచాల భాగోతం ఎలా వెలుగులోకి వచ్చింది. ఇచ్చుకో.. పుచ్చుకో 2010లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సాఆర్ స్టీల్‌కి 530 మిలియన్ డాలర్లు అప్పిచ్చింది. ఎస్సార్ ఆయిల్‌కి 350 మిలియన్ డాలర్ల అప్పును పువ్వులో పెట్టి ఇచ్చింది. ఎస్సార్ గ్రూప్‌లోని రెండు కంపెనీలకు అప్పులిచ్చిన తర్వాత లంచాల భాగోతం మొదలైంది. అంటే 2010 నుంచి 2012 మధ్య కాలంలో చందా కొచ్చర్ భర్త దీపా కొచ్చర్ కంపెనీలో పెట్టుబడులను అంటే లంచాల ద్వారా పంపించారు. ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన ఫస్ట్ హ్యాండ్ హోల్డింగ్స్ నాలుగు విడతులుగా న్యూ పవర్లో రూ.325 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. శశిరూయా అల్లుడు అనిరుధ్ భువాల్కాకు చెందిన ఏ1 మోటార్స్ అనే సంస్థ ఏంఎండబ్ల్యూ అనే మరో సంస్థతో న్యూపవర్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసిందని అరవింద్ గుప్తా అనే ఇన్వెస్టర్, సామాజిక కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విలువ ఎంతన్నది బయటకు రాలేదు. అంటే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రెండు కంపెనీలకు అప్పులందాయి. అడిగినంత అప్పు ఇచ్చినందుకు ప్రతిఫలంగా న్యూపవర్‌కు వెళ్లింది. చదవండి👉ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్! తీగలాగితే డొంక కదలింది అప్పులిచ్చిన చందా కొచ్చర్, లంచం తీసుకున్న దీపా కొచ్చర్ భార్యభర్తలు. అప్పులు తీసుకున్న రుయా సోదరులకు పెట్టుబడులు పెట్టిన అనిరుధ్, నిషాంత్ అల్లుళ్లు. ఈ వ్యవహారమే క్విడ్ ప్రోకో అని రిజిష్టార్ ఆఫీస్ కంపెనీస్ నుంచి సేకరించిన సమాచారం తన దగ్గరుందని విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు కొనసాగుతుండగా చందా కొచ్చర్ వీడియోకాన్‌కు రూ.3 వేల కోట్లకు పైగా ఇచ్చిన రుణం ఇచ్చినందుకు గాను తీసుకున్న ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో చందా కొచ్చర్ చీకటి సామ్రాజ్యం ప్రపంచానికి తెలిసింది. తీగలాగితే డొంక కదిలిందిన్నట్లుగా వీడియో కాన్ గ్రూప్‌ల వద్ద నుంచి తీసుకున్న ముడుపులు దెబ్బకు గతంలో ఎస్సాఆర్ గ్రూప్ వ్యవహారం బయటకొచ్చింది. కొచ్చర్ భాగోతంపై ప్రధానికి లేఖ వీడియోకాన్ గ్రూప్‌లో పెట్టుబడిదారు అరవింద్ గుప్తా. ఆ అరవింద్ గుప్తా 2016లో ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్‌ల మధ్య జరిగిన లావాదేవీలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కొచ్చర్ భాగోతాలపై అదే ఏడాది మార్చిలో ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖతో రంగంలో దిగిన ఆర్బీఐ దర్యాప్తు చేసింది. చందా కొచర్ - దీపక్ కొచ్చర్ అరెస్ట్: అక్టోబరు 2016: చందా కొచ్చర్‌పై ఆరోపణలు వెల్లు వెత్తిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌లో రుణ అక్రమాలు హైలెట్ అయ్యాయి. రంగంలోకి దిగిన ఆర్బీఐ దర్యాప్తు చేసింది కానీ.. కొచ్చర్ ముడుపుల వ్యవహారాన్ని ఎటూ తేల్చ లేకపోయింది. మార్చి 2018: 31లోన్ తీసుకున్న బ్యాంక్ అకౌంట్లలో సమస్యలను గుర్తించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ బ్యాంక్, ఆర్బీఐకు విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా ఫిర్యాదు చేచేశారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత, సీబీఐ అంతర్గత విచారణను దాఖలు చేసి దీపక్ కొచ్చర్‌ను ప్రశ్నించడం ప్రారంభించింది. ఏప్రిల్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు చందా కొచ్చర్‌కు అండగా నిలిచింది. ఆమెపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. కొన్ని వారాల తర్వాత, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFO) ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేసిన వీడియోకాన్ రుణంపై దర్యాప్తు చేయడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిని కోరింది. మే - జూన్ 2018: చందా కొచ్చర్‌పై విజిల్‌బ్లోయర్ తాజా ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ తప్పులు చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ విచారణ ప్రారంభించడంతో మే నెలలో కొచ్చర్ సెలవుపై వెళ్లారు. జూలై 2018: షోకాజ్ నోటీసుకు తన ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొచ్చర్‌ని కోరింది. అక్టోబర్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో బాధ్యతలకు చందా కొచ్చర్ రాజీనామా సమర్పించారు. జనవరి 2019: 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు మంజూరైన రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దీపక్ కొచ్చర్, చందా కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ వెంటనే, చందా కొచ్చర్ బ్యాంక్ కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్ర దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 2019: చందా కొచ్చర్‌పై సీబీఐ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. జనవరి 2020: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటి విలువ రూ.78 కోట్ల పైమాటే. సెప్టెంబర్ 2020: మనీలాండరింగ్ కేసులో దీపక్ కొచ్చర్‌ను ఈడీ అరెస్టు చేసింది. నవంబర్ 2020: చందా కొచ్చర్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 2021: దీపక్ కొచ్చర్ రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు మే 2022: సీబీఐ చందా కొచ్చర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. డిసెంబర్ 23, 2022: చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సిబిఐ అరెస్టు చేసింది. డిసెంబరు 26, 2022 వరకు వారిని 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి తీసుకుంది. పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి 1984లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన చందా కొచ్చర్.. అతి తక్కువ సమయంలో దేశ బ్యాంకింగ్ రంగంలో స్టార్‌గా ఎదిగారు. అనతి కాలంలో ట్రైనీ నుంచి బ్యాంక్ సీఈవోగా ఆమె ఎదిగిన తీరు అమోఘం..అనర్వచనీయం. 2009 మేలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా, ఎండీగా చందా కొచ్చర్ నియమితులయ్యారు. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఐసీఐసీఐ బ్యాంక్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రభుత్వ బ్యాంకులకు గట్టి పోటీ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలో ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2011లో పద్మ భూషణ్ ప్రదానం చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు కూడా చోటు దక్కింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకుపైగా కాలంలో ఎన్నోసార్లు అత్యంత ప్రభావశీల మహిళగా చందా కొచ్చర్ గుర్తింపును పొందారు. కానీ, ఎంతో అద్భుతంగా సాగుతున్న తన బ్యాంకింగ్ కెరీర్ మెరుపుల నుంచి మరకల వరకు ఇలా కటకటాల వెనక్కి వెళ్తామని బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
3 రోజుల పాటు సీబీఐ కస్టడీలో చందా కొచర్, దీపక్ కొచర్
ఐసీఐసీఐ మాజీ సీఈవో, ఎండీ చందాకొచర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టు 3 రోజుల పాటు సీబీఐ కస్టడీని విధించింది. వీడియోకాన్ రుణాల అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరూ 26 తేదీ వరకూ సీబీఐ తన కస్టడీలో ఉంచుకోనుంది. ఈ కేసులో వీరివురిని స్వల్పకాలిక విచారణ తర్వాత శనివారం అరెస్టు చేశారు. విచారణలో వారిద్దరూ సహకరించలేదని, అందుకే అరెస్టు చేశామని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. కాగా 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. -
‘ఐసీఐసీఐ’ మాజీ సీఈవో చందా కొచర్ అరెస్ట్
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల్లో అవకతవకలు, మోసం ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి వారిని ముందుగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రశ్నించారు. అయితే, వారు విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. చందా కొచర్, దీపక్ కొచర్లను శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. తొలి చార్జి షీటును కూడా సీబీఐ సత్వరం దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
బాండ్ల జారీ ద్వారా రూ.105 కోట్లు: అపోలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఐసీఐసీఐ బ్యాంక్‌నకు నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.105 కోట్లు సమీకరించనున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైసెస్ బుధవారం తెలిపింది. ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన 1,050 ఎన్సీడీలను జారీ చేసేందుకు డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని కంపెనీ వెల్లడించింది. ఎన్ఎస్ఈ హోల్‌సేల్ డెట్ మార్కెట్లో వీటిని లిస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ సుఖ్ సమృద్ధి
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సుఖ్ సమృద్ధి పేరుతో దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. పన్ను రహిత గ్యారంటీ ఇన్‌కం లేదా ఏక మొత్తంలో మెచ్యూరిటీ కార్పస్ పొందవచ్చు. పాలసీ వ్యవధిలో ఏ సమయంలోనైనా ఆదాయాన్ని కూడబెట్టుకోవడానికి, సేకరించిన కార్పస్‌ను ఉపసంహరించుకోవడానికి సేవింగ్స్ వాలెట్ వీలు కల్పిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళా కస్టమర్లకు అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడంతోపాటు ఆదాయ కాలంతో సహా పాలసీ మొత్తం వ్యవధిలో లైఫ్ కవర్ కొనసాగుతుంది. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
ICICI ఖాతాదారులకు సూపర్ గుడ్ న్యూస్
-
ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. బల్క్ ఎఫ్డీలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాల వరకు 6.80శాతం వడ్డీని అందించనుంది. కొత్త రేట్లు నవంబర్ 25, 2022 నుండి అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, 5 కోట్ల రూపాయల లోపు ఉండే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 - 6.50 శాతం మధ్య ఉంటుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు గరిష్ట వడ్డీ రేటు 6.80శాతంగా ఉంటుంది. (WhatsApp డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి,స్పందించకండి!) 30 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75శాతం, 46 - 60 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 61- 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 185 రోజుల నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 6 శాతం రేటును ఇస్తోంది. అయితే 2 కోట్ల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులను బ్యాంకు ప్రకటించలేదు. (తగ్గేదెలే అంటున్న మస్క్, టెక్ దిగ్గజాలకే సవాల్!) సీనియర్ సిటిజన్లకు అదనంగా 10 శాతం అలాగే రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు స్పెషల్‌గా 10శాతం వడ్డీని తాత్కాలికంగా అందిస్తుంది. అయితే డిపాజిట్ మొత్తం తప్పనిసరిగా రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. డిపాజిట్ సమయం అయిదేళ్లకుపైన, 10 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ స్పెషల్ స్కీం ఏప్రిల్ 7, 2023 తో ముగుస్తుంది. -
ఐసీఐసీఐ స్కాం : చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ
బాంబే హైకోర్టులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పదవీ విరమణ తర్వాత కొచ్చర్ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు 2018లో ఆమె సంపాదించిన 6.90 లక్షల షేర్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని జస్టిస్ ఆర్ఐ గహ్లా సింగిల్ బెంచ్ కొచ్చర్‌ను కోరినట్లు పీటీఐ నివేదించింది.దీంతో పాటు గతంలో ఆమె ఏదైనా షేర్లకు సంబంధించి ట్రాన్సాక్షన్, ఇతర వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఉంటే, ఆరు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని గహ్లా అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చాగ్లా మాట్లాడుతూ కొచ్చర్ రాజీనామా సమయంలో వెల్లడించని వాస్తవాలు ఇతర అంశాలపై పూర్తి అవగాహన బ్యాంకుకు లేదన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు విచారణ నివేదిక అందిన తర్వాత మాత్రమే వెల్లడయ్యాయని అన్నారు. కాగా, ఐసీఐసీఐ స్కాంలో చందా కొచర్ వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్ దంపతులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కస్టమర్లకు భారీ షాక్.. ఆ రెండు బ్యాంకులు కీలక నిర్ణయం!
కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు డీలా పడిన సంగతి తెలిసిందే. భారత్‌లో చూస్తే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం కట్టడికై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు సవరిస్తోంది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారంగా మారుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు బ్యాంకులు జత చేరాయి. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్, ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు పెంచి తమ కస్టమర్లకు షాకిచ్చాయి. బాదుడే బాదడు! బ్యాంకులు వరుసపెట్టి వారి రుణ రేట్లు పెంచుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ కూడా రుణ రేట్లు పెంచింది. తాజాగా ఇండియన్ బ్యాంకు తమ రుణ రేటును (MCLR) 35 బేసిస్ పాయింట్ల, ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటును (MCLR) 20 పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో లోన్ ఈఎంఐలు పెరగడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పైకి ఎగబాకుతాయి. పెంచిన వడ్డీ రేటు ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.4 శాతానికి చేరగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాతానికి చేరింది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ పెంపు నిర్ణయం నవంబర్ 1 నుంచే అమలులోకి రాగా, ఇండియన్ బ్యాంక్ రుణ రేటు పెంపు నవంబర్ 3 నుంచి అమలులోకి రానుంది. చదవండి: యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి! -
బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై..
ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ సంస్థలు తన కస్టమర్లకు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలో ప్రతి రోజు లక్షలాది బ్యాంక్ ఖాతాదారులు అటు ఆఫ్‌లైన్ ఇటు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే వీటిలో పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం సేవలు అందిస్తున్న పలు బ్యాంకులు ఇటీవల ఆయా సేవలపై చార్జీలు పెంచేశాయి. బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్ చార్జీల బాదుడిని మొదలెట్టాయి. ఏ బ్యాంకులు ఎంత పెంచాయో తెలుసుకుందాం! ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఏటీఎం పై ప్రతి ప్రాంతంలో ఉచితంగా 5 లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంక్ ఏటీఎం( ATM)లలో ఈ సంఖ్య మూడుకి తగ్గించింది. అవి ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్. ఒకవేళ ఈ పరిమితి దాటి విత్‌డ్రా చేస్తే.. ఎస్బీఐ ఏటీఎంల్లో 5 లావాదేవీలు దాటాక ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి దాటి జరిపే వాటిపై రూ.20 వసూలు చేస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ HDFC బ్యాంక్ తన ఏటీఎం (ATM) నుంచి నెలకు 5 చొప్పున ఉచిత లావాదేవీలను అందిస్తుంది. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మూడు కాగా, నాన్ మెట్రో నగరాల్లో ఐదు. ఆ తర్వాత, విత్‌డ్రా చేస్తే రూ. 21 కాగా, ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 ఛార్జ్ చేస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ ICICI బ్యాంక్ కూడా 5, 3 రూల్స్‌ని పాటిస్తుంది. అనగా ఆరు మెట్రో స్థానాల్లో(ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) ఐసీఐసీఐ ఏటీఎం ( ATM) నుంచి 5 విత్‌డ్రాలు, ఇతర బ్యాంక్ ATMల నుంచి 3 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉచితం. దీని తర్వాత, బ్యాంకు ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సొంత ఏటీఎంల్లో మెట్రో సిటీల పరిధిలో 5 ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒకవేళ ఈ పరిమితి దాటిన ప్రతి నగదు లావాదేవీలపై రూ.21, ఆర్థికేతర లావాదీవీలపైన రూ.10 వసూలు చేస్తుంది. పీఎన్బీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా మెట్రో పాలిటన్ సిటీల పరిధిలో తమ ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు మాత్రమే ఉచితం. అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, ఆర్థికేతర లావాదీవీల మీద రూ. 9 చార్జ్ చేస్తోంది. చదవండి: ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ -
స్వల్ప నష్టాల్లో సూచీలు;ఐసీఐసీఐ బ్యాంకు రికార్డ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం కొత్త సంవత్ 2079ని అట్టహాసంగా ప్రారంభించిన సూచీలు మంగళవారం స్వల్పంగా వెనుకబడ్డాయి. ఎనిమిదో వరుస సెషన్లో లాభాలతో టట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 59741 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు వెనుకబడి 17706 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. ఊహించిన దానికంటే మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మంగళవారం రికార్డు స్థాయికి చేరుకుంది. బీఎస్ఇలో 1.81 శాతం పెరిగి గరిష్టంగా రూ.943 తాకింది. అయితే 21 శాతం పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టెక్‌మహీంద్ర, మారుతి సుజుకి, గ్రాసిం, డా. రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడుతుండగా, నెస్లే, కోటక్ మహీంద్ర, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.72 స్థాయికి బలహీనపడింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 31 శాతం ఎగసి రూ. 8,007 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 37 శాతం జంప్‌చేసి రూ. 7,558 కోట్లకు చేరింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 5,511 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 26% వృద్ధితో రూ. 14,707 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్లు 0.3% బలపడి 4.31%కి చేరాయి. ఇతర ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం(ట్రెజరీమినహా) 17 శాతం పుంజుకుని రూ. 5,139 కోట్లను తాకింది. ట్రెజరీ ఆదాయం గత క్యూ2లో రూ. 397 కోట్లుకాగా.. ప్రస్తుతం రూ. 85 కోట్ల నష్టంగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 2,713 కోట్ల నుంచి రూ. 1,643 కోట్లకు వెనకడుగు వేశాయి. స్థూల మొండిబకాయిలు 4.82 శాతం నుంచి 3.19 శాతానికి తగ్గాయి. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో నమోదైన 3.41 శాతంతో పోల్చినా మెరుగుపడ్డాయి. తాజా స్లిప్పేజీలు రూ. 4,300 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఎండీ, సీఈవో సందీప్ బక్షి పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ బోర్డు ఏకగ్రీవంగా అనుమతించినట్లు బ్యాంక్ తాజాగా పేర్కొంది. అనుబంధ సంస్థలు ఇలా బ్యాంక్ అనుబంధ సంస్థలలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాభం రూ.445 కోట్ల నుంచి రూ.199 కోట్లకు క్షీణించింది. ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభం 32% ఎగసి రూ.591 కోట్లను తాకింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ లాభం 6 శాతం పుంజుకుని రూ.406 కోట్లయ్యింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం రూ. 51 కోట్లు తగ్గి రూ.300 కోట్లకు పరిమితమైంది. చదవండి: ముదురుతున్న మూన్‌లైటింగ్.. తెరపైకి మరో కంపెనీ, అసలేం జరుగుతోంది! -
ఆ కస్టమర్లకు షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం!
దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్‌గా పేరున్న ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ షాకిస్తూ వారి సేవింగ్స్ అకౌంట్ల బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు 1 నవంబర్ 2022 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీటితో పాటు చెక్కులతో కూడిన వివిధ లావాదేవీల పెనాల్టీ చార్జీలను కూడా పెంచేసింది. దీంతో ఇకపై చెక్ ద్వారా నిర్వహించే పలు లావాదేవీలకు కొత్తగా తీసుకున్న పెంపు నిర్ణయం వర్తించనుంది. ఏవేవి పెరిగాయి.. ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి.. నగదు డిపాజిట్లు, డూప్లికేట్ స్టేట్మెంట్ జారీ, డూప్లికేట్ పాస్‌బుక్ జారీ, IMPS అవుట్‌వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ రీ-జనరేషన్, ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) రీఇష్యూ వంటి వివిధ రకాల లావాదేవీల చార్జీలు పెరిగాయి. బ్యాంక్ జరిమానా ఛార్జీలు చెక్ రిటర్న్ అవుట్‌వర్డ్ (కస్టమర్ డిపాజిట్ చేసిన చెక్కు), చెక్ రిటర్న్ ఇన్వర్డ్ (కస్టమర్ జారీ చేసిన చెక్) వంటి వాటిపై ఉన్న జరిమానా చార్జీలను కూడా పెంచింది. చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త! -
దివాళీ బొనాంజా: బ్యాంకులు బంపరాఫర్లు.. కస్టమర్లకు పండగే!
కస్టమర్లకు బంపరాఫర్. దీపావళి సందర్భంగా కొత్త ఇల్లు, కారు కొనాలని అనుకుంటున్నారా? లేదా ఇల్లు రెనోవేట్ చేయాలని అనుకుంటున్నారా? భారీగా పెరిగిన వడ్డీరేట్ల నుంచి ఉపశమనం దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ,ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు పరిమిత కాలానికి లోన్ ఆఫర్లను ప్రకటించాయి. ఎస్బీఐ గృహ రుణాలను సంవత్సరానికి 8.4 శాతం నుండి టాప్-అప్ రుణాలను 8.8 శాతం నుండి అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సంవత్సరానికి 8.45 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. 8.45 శాతం నుండి కార్ లోన్లను అందిస్తుంది. కారు రుణాలపై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంవత్సరానికి 7.9 శాతం చొప్పున కారు లోన్లను అందిస్తోంది. 50 శాతం పూర్తయిన తర్వాత (కనీసం 24 నెలలు) ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. బంగారం రుణాలపై, ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం మాఫీ చేసింది. ఐసీఐసీ బ్యాంక్ ప్రస్తుతం కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ను అందిస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను చెక్ చేసిన తర్వాత, ప్రీ-అప్రూవ్డ్ లోన్లను మంజూరు చేస్తుంది. కారు రుణాలపై, ప్రాసెసింగ్ రుసుము రూ. 1,999, కొత్త కారు రుణాలపై ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ మొత్తాలను అందిస్తుంది. కార్ లోన్లపై ఫోర్క్లోజర్, ప్రీపేమెంట్ ఛార్జీలు లేవు. వ్యక్తిగత రుణాలపై 12 ఈఎంఐల తర్వాత ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు (12ఈఎంఐల కంటే ముందు ఫోర్క్లోజర్ చేస్తే 3 శాతం వసూలు చేస్తాయి). పంజాబ్ నేషనల్ బ్యాంకు పండుగ సీజన్లో పీఎన్బీ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022 అనే పేరుతో గృహ రుణాలు, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 7.50 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. తిరిగి చెల్లించే వ్యవధి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కార్ లోన్లను అందిస్తుంది. ఇది సంవత్సరానికి వడ్డీ 7.65 శాతం నుండి ప్రారంభమవుతుంది. కారు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులు లేవు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పండుగ సీజన్లో గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలను 8.30 శాతం నుండి, కారు రుణాలను 8.70 శాతం నుండి అందిస్తోంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏడేళ్ల వరకు కార్ లోన్లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేసేలా 100 శాతం వరకు ఫైనాన్స్ అందిస్తోంది. సాధారణంగా, బ్యాంకులు కారు రుణం 80-85 శాతం వరకు ఫైనాన్సింగ్‌ను అందిస్తాయి. ఇది 72 నెలల వరకు రూ. 50 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఇతర ప్రముఖ బ్యాంకులతో పోలిస్తే, బ్యాంక్ ఎక్కువ కాలం పాటు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. గరిష్ట రుణ మొత్తం ఎక్కువగా ఉంటుంది. గృహ రుణాల కోసం 30ఏళ్ల వరకు సుదీర్ఘ కాల వ్యవధిని అందిస్తోంది. -
ఐసీఐసీఐ బ్యాంకులో12 కోట్లు కొట్టేసి.. షికార్లు.. చివరికి...!
సాక్షి, ముంబై: థానేలోని మన్పాడ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 12 కోట్ల నగదు కొట్టేసిన కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అల్తాఫ్ షేక్‌ను పుణెలో పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం విచారణ అధికారి వెల్లడించారు. వేషం మార్చి, న్యూలుక్లో షికార్లు కొడుతున్న నిందితుడికి సంఘటన జరిగిన సుమారు రెండున్నర నెలల తరువాత పోలీసులు చెక్ పెట్టారు. అతడి వద్ద నుంచి 9 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం థానే , నవీ ముంబై పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో షేక్‌ను అరెస్టు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ భారీ చోరికి నిందితుడు భారీ ప్లానే వేశాడు. ముంబైకి చెందిన షేక్ ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్‌గా పని చేసేవాడు. కస్టోడియన్‌గా అంటే లాకర్ తాళాలకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఉన్న నగదు చూసి అతనికి బుద్ధి పక్కదారి పట్టింది. ఎలాగైనా సొమ్మును తస్కరించాలని గత ఏడాది కాలంగా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో సిస్టంలోని లూప్ హోల్స్‌ని గమనించాడు. అలాగే సీసీటీవీ ఫుటేజీని ట్యాంపరింగ్ చేసి, ఏసీ డక్ట్ ద్వారా మొత్తం దోపిడీని ప్లాన్ చేశాడు. అంతేకాదు తనను ఎవరూ గుర్తించకుండా బురఖా వేసుకొని మరీ నగదు దోచేశాడు. ఈ వ్యవహారంలో సహకరించిన షేక్ సోదరి నీలోఫర్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు అబ్రార్ ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరిను పోలీసులు అరెస్టు చేశారు. అలారం సిస్టమ్‌ను డియాక్టివేట్ చేసి, సీసీటీవీని ధ్వంసం చేసిన తర్వాత, షేక్ బ్యాంక్ ఖజానాను తెరిచి, నగదును కొట్టేసి అక్కడినుంచి పారి పోయాడు. ఈ ఏడాది జూలై 12న ఈ చోరీ జరిగింది. అయితే డీవీఆర్ సెక్యూరిటీ డబ్బు కూడా కనిపించకుండా పోయిందని సిబ్బంది గ్రహించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షేక్‌ను అరెస్టు చేసి చోరీకి గురైన మొత్తం 12.20 కోట్లలో సుమారు 9 కోట్లను రికవరీ చేయగలిగారు, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. -
వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!
సాధారణంగా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులను చాలా సేవలకు కస్టమర్లు ఉపయోగిస్తుంటారు. అందులో ప్రధానంగా క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె కడుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే ఫీజులు వసూలు చేయనుంది. అక్టోబర్ 20 నుంచి ఈ పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్‌లు ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఐసీఐ వసూలు చేయనున్న రుసుముకి ఇది అదనం కానుంది. ప్రస్తుతానికైతే ఈ ఫీజు వసూలు చేసే జాబితాలో ఐసీఐసీఐ మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మిగతా బ్యాంకులు ఈ తరహా నిర్ణయాన్నే తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వెనక ఇంత కథ జరుగుతుందా! అందుకే.. అసలు కథేంటంటే.. క్రెడ్( Cred), రెడ్ గిరాఫీ( RedGiraffe), మైగేట్( Mygate), పేటీఎం( Paytm) మ్యాజిక్ బ్రిక్స్( Magicbricks) వంటి ప్లాట్‌ఫాంలో ఇంటి అద్దెను క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించే వెసలుబాటు ఉంటుంది. ఈ ప్లాట్‌ఫాంలో కస్టమర్లు తమ కుటుంబాన్ని లేదా స్నేహితులను ఇంటి ఓనర్లుగా చేర్చుకుని, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డుని ఉపయోగించడం ద్వారా నగదు పొందుతున్నారు. సాధారణంగా అయితే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం( ATM) నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే 2.5-3% వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెడ్ గిరాఫీ( RedGiraffe) మినహా ఈ సేవలను అందిస్తున్న అన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు రెంట్ పేమెంట్ ధృవీకరించే అద్దె ఒప్పందాన్ని అడగడం లేదు. దీంతో క్రెడిట్ కార్డ్ లో ఉన్న ఫీచర్ ద్వారా అద్దె చెల్లింపు పేరుతో కొందరు కస్టమర్లు సులభంగా, ఏ ఫీజులు లేకుండా నగదుని పొందే అవకాశం ఉంది. ఇటీవల ఈ తరహా చెల్లింపులు ఎక్కువ కావడంతో బోగస్ పేమెంట్లను ఆపేందుకే ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు!
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పండుగ సీజన్ పురస్కరించుకుని తమ కస్టమర్ల కోసం ’ఫెస్టివ్ బొనాంజా’ పేరిట ప్రత్యేక ఆఫర్లనక్ప్రకటించింది. తమ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్జూమర్ ఫైనాన్స్, కార్డ్‌లెస్ ఈఎంఐ మొదలైన వాటి ద్వారా రూ. 25,000 వరకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు పొందవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, బిగ్‌బాస్కెట్, అజియో, రిలయన్స్ డిజిటల్, క్రోమా తదితర సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంకు ఈడీ రాకేష్ ఝా తెలిపారు. రుణాలపై కూడా (గృహ, వ్యక్తిగత, బంగారం రుణాలు మొదలైనవి) ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చని వివరించారు. వీటితో పాటు బ్యాంక్ పేర్కొన్న వస్తువులను కొనుగోళ్లు చేసే కస్టమర్లకు కార్డ్‌లెస్ ఈఎంఐ(EMI), 'నో-కాస్ట్ ఈఎంఐ(EMI) వంటి సౌకర్యాలను అందిస్తోంది. ప్రముఖ బ్రాండ్లు & ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంపై ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, టాటా క్లిక్ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలో ఆన్లైన్ షాపింగ్‌పై 10% తగ్గింపు. గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు: అర్మానీ ఎక్స్ఛేంజ్, కెనాలి, క్లార్క్స్, డీజిల్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్, పాల్ & షార్క్, సత్య పాల్, స్టీవ్ మాడెన్, బ్రూక్స్ & బ్రదర్స్ వంటి లగ్జరీ బ్రాండ్లపై అదనపు 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్ & గాడ్జెట్లపై ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లలో 10% వరకు క్యాష్‌బ్యాక్. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్‌లో కస్టమర్లు ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా పొందవచ్చు. దుస్తులు & ఆభరణాలు: షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, అజియో, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ దుస్తుల బ్రాండ్లపై అదనంగా 10% తగ్గింపు. అలాగే పీసీ జ్యువెలర్స్ (PCJ) నుంచి కనీసం ₹50,000 కొనుగోలుపై ₹2,500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్ -
ఖాతాదారులకు షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ మరోసారి తన ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు వాహన, గృహ అన్ని రకాల రుణాలపై వర్తిస్తుంది . ఈ రేట్లు నేడు(సెప్టెంబర్ 1, 2022) నుంచే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. తాజా వడ్డీ రేట్ల సవరణలో రుణ గ్రహీతలపై ఈఎంపై భారం మరింత పెరగనుంది. తాజాగాపెంచిన పెంపుతో ఓవర్‌నైట్ , ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటును 7.65 శాతం నుండి 7.75 శాతానికి పెంచినట్లు బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. దీని ప్రకారం మూడు నెలల కాల పరిమితి రుణాలపై 7.80 శాతంగానూ, ఆరు నెలలకు 7.95 శాతంగా ఉండనుంది. ఇక వార్షికరుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతంగా ఉంటుంది. గత నాలుగు నెలల్లో వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు జూన్, జూలై, ఆగస్టులలో రేట్లు సవరించింది. ఆగస్టులో, బ్యాంక్ తన రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇది చదవండి: షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్ windfall profit tax: మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్ SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
అప్పనంగా నొక్కేశాడు... బ్యాంకు ఉద్యోగి నిర్వాకం
హిమాయత్‌నగర్: తన అకౌంట్ నుంచి స్నేహితుడికి ఆన్లైన్ ద్వారా పంపిన డబ్బులు సాంకేతిక సమస్యతో క్రెడిట్ కాలేదు. పంపిన వ్యక్తి అకౌంట్లో నుంచి మాత్రం డబ్బు డెబిట్ అయ్యింది. ఈ సమస్యను పరిష్కారించాలంటూ నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా.. కాల్ లిప్ట్ చేయలేదు. రెండు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి కాల్ చేసి తాను సదరు బ్యాంక్ ఉద్యోగినని పరిచయం చేసు కున్నాడు. మాయ మాటలు చెప్పి ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించి బాధితుని అకౌంట్లోంచి డబ్బులతో పాటు.. అతని ఆధారాలతో లక్షల రూపాయలు రు ణం పొంది మోసానికి పాల్పడిన ఘటన ఇది. బుధవారం బాధితుడు సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. స్నేహితుడికి ఆన్లైన్ ద్వారా డబ్బు పంపగా.. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేస్తున్న నగర వాసి తన స్నేహితుడికి డబ్బు అవసరం కావడంతో రూ. 15వేలు ఆన్లైన్ ద్వారా పంపాడు. నగర వాసి అ కౌంట్ నుంచి అవి డెబిట్ అయినప్పటికీ స్నేహితుడికి జమ కాలేదు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ సిబ్బందికి చెప్పగా.. అతగాడు ఉద్యోగి ఫోన్లో ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించాడు. ఆ తర్వాత ఉద్యోగికి చెందిన ఆధార్, పాన్‌కార్డ్, సాలరీ పేస్లిప్స్‌ను తీసుకున్నాడు. మొబైల్లో ఉన్న ఐసీఐసీఐ యాప్ అంతా బ్యాంకు ఉద్యోగినే హ్యాండిల్ చేస్తున్నాడు. ఉద్యోగి సిబిల్ స్కోర్ మంచిగా ఉండటంతో ఐసీఐసీఐ ఉద్యోగి బ్యాంకు నుంచి రూ.7. 5 లక్షల రుణం కో సం అప్లై చేయగా.. అదే రోజు అకౌంట్లో క్రెడిట్ అయ్యింది. ఆ మొత్తాన్ని ఐసీఐసీఐ ఉద్యోగి వేర్వేరు ఖాతాల్లోకి జమ చేసుకుని ఖర్చు చేసుకున్నాడు. అకౌంట్లోంచి రూ.42 వేలు మాయం.. అంతకముందు బాధితుడి అకౌంట్లో ఉన్న రూ.42 వేలు సైతం కాజేశాడు. ఇదంతా ఈ ఏడాది జనవరి నెలలో జరగగా తనకు న్యాయం చేయాలని, మీ ఉద్యోగి తనని మోసం చేశాడంటూ ఐసీఐసీఐ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అధికారులు వారం రోజుల తర్వాత రూ.7.5 లక్షల బాధితుడి అకౌంట్లో క్రెడిట్ చేశారు. ఇక్కడే బ్యాంకు అధికారులు తెలివిగా ఓ పని చేశారు, వాటిని క్రెడిట్ చేసినప్పటికీ అవి వాడకుండా ఉండేందుకు నిబంధనలు విధించారు. తన అకౌంట్లో డబ్బు ఉంది కదా అని ధైర్యంగా ఉన్న బాధితుడు కొద్దిరోజులకు తీసుకునేందుకు ప్రయతి్నంచగా రాలేదు. ఇదే విషయంపై మరో మారు బ్యాంకును ఆశ్రయించగా మరలా నిబంధనలు ఎత్తివేసి కొన్ని గంటల్లోనే నిబంధలను విధించారు. దీనిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూ విసిగిపోయిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. (చదవండి: ముడిచమురు ధర తగ్గినా పెట్రో ధరలు తగ్గించరా? ) -
అమెజాన్‌తో భాగస్వామ్యం.. ఐసీఐసీఐ లాభం హైజంప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 55% జంప్‌చేసి రూ. 7,384 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 4,616 కోట్ల నుంచి రూ. 6,905 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% పుంజుకుని రూ. 13,210 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.89% నుంచి 4.01 శాతానికి బలపడ్డాయి. మొత్తం ప్రొవిజన్లు సగానికిపైగా తగ్గి రూ. 1,143 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 2,851 కోట్ల కేటాయింపులు చేపట్టింది. ఎన్పీఏలు డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.15 శాతం నుంచి 3.41 శాతానికి తగ్గాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 5,825 కోట్లకు పరిమితంకాగా.. గత క్యూ1లో 7,231 కోట్లుగా నమోదయ్యాయి. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌తో భాగస్వామ్యం ద్వారా 32 లక్షల క్రెడిట్ కార్డులను విక్రయించినట్లు బ్యాంక్ వెల్లడించింది. అనుబంధ సంస్థలలో జీవిత బీమా సంస్థ రూ. 156 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో రూ. 186 కోట్ల నికర నష్టం నమోదైంది. సాధారణ బీమా విభాగం నికర లాభం 79 శాతం ఎగసి రూ. 349 కోట్లను తాకింది. కనీస మూలధన నిష్పత్తి 18.7 శాతానికి చేరింది. చదవండి: Ford: భారీ షాక్.. భారత్ నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ! -
నెల వ్యవధిలోనే మరో షాకిచ్చిన ఐసీఐసీఐ
సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన వినియోగదారులకు మరోసారి భారీ షాకిచ్చింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 20 బీపీఎస్ పాయింట్లు పెంచింది. పెంచిన రేట్లు నేటి( జూలై 1, 2022) నుంచే అమల్లోకి వచ్చాయి. రుణాలపై వడ్డీ రేట్ల తాజా సవరణతో మూడు నెలల లోపు రుణాలపై వడ్డీరేటు 7.55 శాతం, ఆరు నెలల 7.70 శాతం, వార్షిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. అన్ని కాల వ్యవధి రుణాలపై ఈ పెంపు వర్తిస్తుంది. గత నెలలోనే (జూన్ 1) రుణాలపై వడ్డీరేటును 30 బీపీఎస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం హైజంప్!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 7,719 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,886 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక స్టాండెలోన్ నికర లాభం 59 శాతం ఎగసి రూ. 7,019 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 23,953 కోట్ల నుంచి రూ. 27,412 కోట్ల కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి 44 శాతం వృద్ధితో రూ. 23,339 కోట్ల నికర లాభం సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 19.16 శాతంగా నమోదైంది. వడ్డీ ఆదాయం అప్ తాజా సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 21 శాతం పుంజుకుని రూ. 12,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.84 శాతం నుంచి 4 శాతానికి బలపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.96 శాతం నుంచి 3.6 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏలు సైతం 1.14 శాతం నుంచి 0.76 శాతానికి తగ్గాయి. రికవరీలు, అప్‌గ్రేడ్స్ రూ. 493 కోట్లు అధికమై రూ. 4,693 కోట్లను తాకాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 2,883 కోట్ల నుంచి సగానికిపైగా తగ్గి రూ. 1,069 కోట్లకు పరిమితమయ్యాయి. బ్యాంక్ హోల్‌సేల్ రుణాల చీఫ్ విశాఖ మూల్యే పదవి నుంచి తప్పుకోవడంతో ప్రస్తుత రిటైల్ బిజినెస్ హెడ్ అనుప్ బాగ్చీకి బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ బాటలో బాగ్చీ బాధ్యతలను ప్రస్తుత సీఎఫ్‌వో రాకేష్ ఝా చేపట్టనున్నట్లు వెల్లడించింది. -
ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈవోగా విశాఖ మూల్యే!
ముంబై: ఆర్థిక సేవల సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈవోగా విశాఖ మూల్యే నియమితులయ్యారు. జూన్ 1 నుంచి ఆమె బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్నారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో అజయ్ శ్రీనివాసన్ స్థానంలో విశాఖ నియమితులయ్యారు. ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ బోర్డులో చేరనున్న తొలి మహిళా సభ్యురాలిగా కూడా ఆమేనని కంపెనీ తెలిపింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన విశాఖ మూలేకి దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరియర్ ఉంది. 2002లో ఐసీఐసీఐ బ్యాంక్–ఐసీఐసీఐ విలీనాన్ని పర్యవేక్షించిన టీమ్‌లో ఆమె సభ్యురాలు. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీఐసీఐ వెంచర్లో కూడా కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. -
అంచనాలకు మించి అదరగొట్టిన ఐసీఐసీఐ బ్యాంకు..!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభాలు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 59.4 శాతం మేర నికర లాభాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఆర్జించింది. సుమారు రూ. 7,018.7 కోట్లను ఐసీఐసీఐ బ్యాంకు గడించింది. అంతకుమందు ఏడాదిలో ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభాలు రూ. 4403 కోట్లు. నికర వడ్డీ ఆదాయం కూడా 21 శాతం మేర పెరిగి రూ. 12,605 కోట్ల రూపాయలుగా నమోదైంది. తగ్గిన ఎన్పీఏ ఆస్తుల విలువ..! నిరర్థక ఆస్తులు(నాన్ పర్ఫర్మింగ్ ఆసెట్స్(ఎన్పీఏ)) విలువ స్వల్పంగా క్షీణించింది. 53 బేసిస్ పాయింట్లు అంటే 3.6 శాతం మేర తగ్గింది. నికర నిరర్థక ఆస్తుల విలువ సైతం తగ్గింది. 0.76 శాతంతో తొమ్మిది బేసిస్ పాయింట్ల మేర క్షీణత కనిపించింది. నాలుగో త్రైమాసికంలో గ్రాస్ ఎన్పీఏ 4,204 కోట్ల రూపాయలుగా రికార్డయింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఈ మొత్తం 4,018 కోట్ల రూపాయలు. బ్యాంక్ అడ్వాన్సులు భారీగా పెరిగాయి. 17 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన రుణాలను మినహాయించి- రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లు 14 శాతం మేర పెరిగాయి. వీటి విలువ 10.64 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం టర్మ్ డిపాజిట్లల్లో తొమ్మిది శాతం మేర పెరుగుదల నమోదైంది.గత ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్ మంచి పురోగతిని రికార్డు చేసింది. అంతేకాకుండా షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్‌పై అయిదు రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. చదవండి: నెగ్గిన అమెజాన్ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్‌ను రద్దు చేసుకున్న రిలయన్స్..! -
కీలక నిర్ణయం..వారికి అదిరిపోయే శుభవార్తను అందించిన ఐసీఐసీఐ బ్యాంక్..!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్తను అందించింది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగిస్తూ ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రత్యేకమైన వడ్డీరేట్లను సీనియర్ సిటిజన్లకు అందించనుంది. సీనియర్ సిటిజన్ల కోసం ఐసీఐసీఐ బ్యాంకు పలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వారి కోసం ప్రత్యేకమైన వడ్డీ రేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్‌లో భాగంగా సీనియర్ సిటిజన్లకు అందించే 0. 50 శాతం వడ్డీరేటుతో పాటు మరో 0.25 శాతం అదనపు వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్ జనవరి 20నే ముగియాల్సి ఉండగా దానిని ఏప్రిల్ 8 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ పొడిగించింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఎఫ్డీ స్కీమ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. దీంతో ఈ స్కీమ్ సినీయర్ సిటిజన్లకు మరో 5 నెలల పాటు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు కొత్తగా ఓపెన్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించనుంది. దాంతో పాటుగా పాత ఫిక్స్డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకున్నవారికి కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక పథకం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 6.35 శాత వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ ఖాతాదారులకు అందించే 5.60 శాతం కంటే ఎక్కువ. చదవండి: గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..! వారు రూ. 5 వేలకు మించి విత్ డ్రా చేయలేరు..! -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల మాదిరిగా కాకుండా..ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విత్‌డ్రా చేయలేని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లకు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈలకు వర్తిస్తాయి.కాగా రూ.5 కోట్ల కంటే ఎక్కువ లేదా సమానమైన విత్‌డ్రా చేయలేని ఎఫ్డీలకు మాత్రమే ఈ వడ్డీరేట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త రేట్లు మార్చి 01, 2022 నుంచి అమలులోకి వచ్చాయని హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు రూ. 2 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించాయి. ఇక విత్‌డ్రా చేయలేని ఎఫ్డీలు సాధారణ డిపాజిట్ల కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి ఎటువంటి అకాల ఉపసంహరణ సదుపాయాన్ని కలిగి లేని ఫిక్స్డ్ డిపాజిట్స్. అంటే గడువు ముగిసేలోపు డిపాజిటర్ ఫిక్స్డ్ డిపాజిట్లను మూసివేయలేరు. అసాధారణమైన పరిస్థితులలో ఈ డిపాజిట్లను అకాల ఉపసంహరణను బ్యాంక్ అనుమతిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..! ► 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 5 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక ఎఫ్డీ వడ్డీరేటు 4.7 శాతం. ► 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.6 శాతం వడ్డీ రేటు. ► 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4.55శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ► 9 నెలల కంటే ఎక్కువ కాలం నుంచి ఒక ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4.15 శాతం వడ్డీరేటు ► 6 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4 శాతం వడ్డీరేటు ఇవ్వబడుతుంది. ► 91 రోజుల నుంచి 6 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై అత్పల్ప వడ్డీ రేటు 3.75 శాతం. చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్బీఐ బాటలోనే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కూడా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు మార్చి 10, 2022 వస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ వడ్డీ రేట్లు 2 కోట్ల కంటే ఎక్కువ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రమే వర్తించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ► 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక ఎఫ్డీ వడ్డీరేటు 4.6 శాతం. ► 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.50 శాతం. ► 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 4.2 శాతం వడ్డీరేటు ► 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధికి వడ్డీ రేటు 4.3 శాతం. ► 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య కాలానికి చేసిన ఎఫ్డీలపై 4.15 శాతం వడ్డీ రేటు ► 1 సంవత్సరం లోపు, ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 2.5 శాతం నుంచి 3.7 శాతం వరకు ఉంటాయి. పైన పేర్కొన్న రేట్లు సాధారణ , సీనియర్ సిటిజన్లకు సమానంగా ఉంటాయి. అంతేకాకుండా రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఎఫ్డీలపై వడ్డీ రేట్లను కూడా ఐసీఐసీఐ సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనున్నాయి.ఇక రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లు మారవు. చదవండి: ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ.. ఎంతంటే? -
సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..!
ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది. "గోల్డెన్ ఇయర్స్" అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో వృద్దులు పెట్టుబడి పెట్టేందుకు గడువును పొడిగించింది. ఈ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ గడువు తేదీని 8 ఏప్రిల్ 2022 వరకు పొడిగించింది. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ పథకం కింద బ్యాంకు వృద్ధులకు సంవత్సరానికి వడ్డీని 0.50 శాతం అదనంగా అందిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకాలలో నిర్ణీత కాలానికి ముందు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, వారు మరింత వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 20, 2022 నాటి నుంచి అమల్లోకి వచ్చాయి.డిపాజిట్ మొత్తం రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అన్ని ఇతర టర్మ్ డిపాజిట్ ప్రయోజనాలు, నియమ నిబంధనలు కూడా ఈ పథకానికి వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలలో డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మరోవైపు, అదే కాలానికి గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ కింద సీనియర్ సిటిజన్లు 6.35 శాతం వడ్డీ రేటును లభిస్తుంది. సాధారణ ప్రజలకు వార్షికంగా లభిస్తున్న వడ్డీ రేటు కంటే 0.75 శాతం అదనం. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డి స్కీమ్‌లో ఉన్న డిపాజిట్‌ను ముందుగానే విత్‌డ్రా చేస్తే లేదా 5 సంవత్సరాల 1 రోజు లేదా తర్వాత మూసివేసినట్లయితే పెనాల్టీ రేటు 1.25 శాతం ఉంటుందని సీనియర్ సిటిజన్లు తెలుసుకోవాలి. ఈ పథకం కింద తెరిచిన ఖాతా 5 సంవత్సరాల 1 రోజులోపు విత్‌డ్రా చేయబడినా లేదా మూసివేయబడినా బ్యాంకు ఉపసంహరణ నియమాలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ఎస్బీఐ వీకేర్ గడువును పొడిగించింది. బ్యాంక్ ఎస్బీఐ వీకేర్ స్కీమ్ గడువును 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం!) -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! మిస్సయ్యారో..రూ. 1200 పెనాల్టీ..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాకిస్తూ క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు నేటి (ఫిబ్రవరి 10) నుంచి అమలులోకి రానున్నాయి. మిస్సయ్యారో పెనాల్టీ కట్టాల్సిందే..! ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కు చెందిన వివిధ సేవల ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి సవరించింది. ఇక నుంచి క్రెడిట్ కార్డు వినియోగించి ఏటీఎం కేంద్రాల వద్ద నగదు తీసినా, ఆలస్యంగా బిల్లులు చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులు నగదు అడ్వాన్స్ లావాదేవీల మీద ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చెక్ రిటర్న్ అయినా, ఆటో డెబిట్ ఫెయిల్ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. క్రెడిట్ కార్డులపై ఐసీఐసీఐ బ్యాంకు సవరించిన ఛార్జీలు ఇలా ఉన్నాయి రూ.100 కంటే తక్కువ బకాయి ఉంటే ఎలాంటి ఆలస్య రుసుము ఉండదు. రూ. 100 నుంచి 500 మధ్య బకాయి ఉంటే రూ. 100 ఛార్జ్. రూ. 501- రూ 5000 బకాయి ఉంటే రూ 500 ఛార్జ్. రూ.10,000 వరకు బకాయి ఉంటే రూ. 750 ఛార్జ్. రూ. 25000 వరకు బకాయి ఉంటే రూ. 900 ఛార్జ్. రూ. 50,000 వరకు చెల్లించాల్సి ఉంటే రూ.1200 ఛార్జ్. చదవండి: ఎంఅండ్ఎం లాభం జూమ్ -
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. ఇందులో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డుల చార్జీల పెంపు గురించి సందేశాలను వినియోగదారులకు పంపినట్లు తెలిపింది. ఇక నుంచి క్రెడిట్ కార్డు వినియోగించి ఏటీఎం కేంద్రాల వద్ద నగదు తీసినా, ఆలస్యంగా బిల్లులు చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ఫిబ్రవరి 10, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులు నగదు అడ్వాన్స్ లావాదేవీల మీద ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చెక్ రిటర్న్ అయినా, ఆటో డెబిట్ ఫెయిల్ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు. రూ.50వేలు పైన ఎంత మొత్తమైనా గరిష్టంగా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చార్జీలతో పాటు అదనంగా మరో రూ.50+ జీఎస్టీ చెల్లించాలని ఐసీఐసీఐ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. అయితే, సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తే ఈఎమ్ఐ మార్చుకోవడం లేదా రుణం తీసుకొని చెల్లిస్తే మంచిది అని నిపుణులు అంటున్నారు. (చదవండి: లగ్జరీ గృహాలకు ఫుల్ డిమాండ్! కారణాలు ఇవే..!) -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 19% అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం దాదాపు 19 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 6,536 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ), గణనీయంగా పెరగడం, ప్రొవిజనింగ్ తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్ నికర లాభం రూ. 5,498 కోట్లు. మరోవైపు, సమీక్షాకాలంలో ఆదాయం రూ. 40,419 కోట్ల నుంచి రూ. 39,866 కోట్లకు తగ్గింది. ‘‘అన్ని విభాగాల్లోనూ వృద్ధి నమోదు చేశాం. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 23 శాతం, ప్రధానమైన ఆపరేటింగ్ లాభం 25 శాతం మేర పెరిగాయి. ప్రొవిజన్లు 27 శాతం తగ్గాయి’’ అని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు. క్యూ3లో ఎన్ఐఐ రూ. 9,912 కోట్ల నుంచి రూ. 12, 236 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.67 శాతం నుంచి 3.96 శాతానికి చేరింది. స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) నిష్పత్తి 4.38 శాతం నుంచి 4.13 శాతానికి దిగి వచ్చింది. నికర ఎన్పీఏలు 0.63 శాతం నుంచి 0.85 శాతానికి చేరాయి. మరోవైపు, స్టాండెలోన్ ప్రాతిపదికన ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం 25 శాతం పెరిగి రూ. 4,940 కోట్ల నుంచి రూ. 6,194 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 24,416 కోట్ల నుంచి రూ. 28,070 కోట్లకు పెరిగింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. తాజా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు జనవరి 20 నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకులతో పాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా & కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు కూడా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. మరిన్ని బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్దం అవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన అధికారిక పోర్టల్‌లో వడ్డీ రేట్లకు సంబంధించన కొత్త జాబితాను ప్రకటించింది. సాదారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ కి బ్యాంకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టర్మ్ డిపాజిట్లపై ఎక్కువగా 0.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఎన్ఆర్ఐ సీనియర్ సిటిజన్స్ కి అదనంగా వడ్డీ రేటు లభించదు. కొత్త ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. 3 నెలల్లో ఏకంగారూ.2.4 కోట్లు లాభం!) -
నేటి నుంచే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. బెస్ట్ ఆఫర్లు ఇవే..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే ఉత్సవాల పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఈ సేల్‌ను జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తోంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' పేరుతో ఈ సేల్‌ను జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహిస్తోంది. ఈ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణాలు సహా ఇతర అన్ని రకాల వస్తువులపైనా భారీ డిస్కాంట్లతో విక్రయించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్: ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' సేల్‌ను జనవరి 17 నుంచి 22 వరకు కొనసాగనుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు మాత్రం ఈ ఆఫర్లు నేటి(జనవరి 16) నుంచే అందుబాటులోకి వచ్చింది. యాపిల్, రియల్మీ, పోకో, షియోమీ, శాంసంగ్, ఒప్పొ, ఇన్ఫీనిక్స్ వంటి వాటిపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. గృహోపకరణాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే, ఐసీఐసీఐ కార్డు చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా ఎలక్ట్రానిక్, వస్త్రాలు, బ్యూటీ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి. అమెజాన్ సేల్: అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ప్రత్యేక సేల్‌ను ఈ నెల 17 నుంచి 20 వరకు నిర్వహిస్తోంది. అయితే ప్రైమ్ యూజర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 16) నుంచే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. యాక్సెసరిస్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొంది. ఇతర గాడ్జెట్స్, గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటుల అందుబాటులో ఉంటాయని అమెజాన్ ఇండియా పేర్కొంది. ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ తగ్గింపు ఇస్తోంది. కనీసం రూ.5,000కు పైన కొనుగోళ్లకు ఈ తగ్గింపు ఆఫర్ వర్తిస్తుంది. నాన్ ఈఎంఐ చెల్లింపులపై రూ.1,250, ఈఎంఐ చెల్లింపులపై రూ.1,500 తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది. (చదవండి: డబ్బులు పోయాయని కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తే.. రూ.12 లక్షలు మాయం!) -
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. గతేడాది ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై విధిస్తున్న ఛార్జీలను సవరించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి సవరించిన ఛార్జీలను అమల్లోకి తీసుకొని రానుంది. ►క్రెడిట్ కార్డ్ హోల్డర్లు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్(క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినందుకు బ్యాంక్ విధించే ఛార్జ్)లను సవరించింది. వాస్తవానికి అన్నీబ్యాంకులు క్రెడిట్కార్డులపై జరిపే లావాదేవీలపై 2.50 శాతం మొత్తాన్ని వసూలు చేస్తాయి. కానీ ఇప్పుడు ఆ ఛార్జీలను సవరించి 2శాతం మాత్రమే వసూలు చేయనున్నాయి. బ్యాంక్ ఇప్పుడు కనిష్టంగా రూ. 500 నుంచి క్రెడిట్ కార్డులపై 2శాతం ఛార్జీలను వసూలు చేయనున్నాయి. ►ఐసీఐసీ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని క్రెడిట్ కార్డ్‌లకు ఆలస్య చెల్లింపు ఛార్జీలను బ్యాంక్ సవరించనున్నాయి. కెడ్రిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.100 కంటే తక్కువ ఉంటే బ్యాంకులు అదనపు ఛార్జీలు విధించలేవు.మీరు చెల్లించాల్సిన మొత్తం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు గరిష్టంగా రూ.1200 వసూలు చేస్తాయి. ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు రూ. 50,000 కంటే ఎక్కువ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే వరుసగా రూ.1300, రూ.1300,రూ.1000 వరకు వసూలు చేస్తున్నాయి. ► కాగా నవంబర్ నెల ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం..అక్టోబర్ 2021తో పోలిస్తే క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య 1.84 శాతం పెరిగింది.గతేడాది అక్టోబర్ 2 శాతం,సెప్టెంబర్‌లో 1.7 శాతం పెరిగింది. చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! వచ్చే ఏడాది నుంచి మారనున్న రూల్స్..! -
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్..!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. ఇందులో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు కూడా ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు వచ్చే నెల ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డుల చార్జీల పెంపు గురించి సందేశాలను వినియోగదారులకు పంపింది. ఇక నుంచి క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు తీసినా, ఆలస్యంగా బిల్లు మొత్తం చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ఫిబ్రవరి 10, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులు నగదు అడ్వాన్స్ మీద లావాదేవీ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. కనీసం రూ.500 చొప్పున వసూలు చేస్తామని ఐసీఐసీఐ పేర్కొంది. అలాగే చెక్ రిటర్న్ అయినా, ఆటో డెబిట్ ఫెయిల్ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు. రూ.50వేలు పైన ఎంత మొత్తమైనా గరిష్టంగా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త క్రెడిట్ ఛార్జీలు ఈ క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి. పైన పేర్కొన్న చార్జీలతో పాటు అదనంగా మరో రూ.50+ జీఎస్టీ చెల్లించాలని ఐసీఐసీఐ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. అయితే, సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తే ఈఎమ్ఐ మార్చుకోవడం లేదా రుణం తీసుకొని చెల్లిస్తే మంచిది అని నిపుణులు అంటున్నారు. (చదవండి: దుబాయ్ దూకుడు.. సాహసోపేత అడుగులు) -
రూల్స్ ఉల్లంఘన.. పిఎన్‌బి, ఐసీఐసీఐకు భారీ పెనాల్టీ!
భారతీయ బ్యాంకులకు పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి), ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంకులకు భారీ పెనాల్టీ విధించింది. కేంద్ర బ్యాంకు పిఎన్‌బిపై రూ.1.8 కోట్ల జరిమానా విధించగా, ఐసీఐసీఐ బ్యాంకు మీద 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 చట్టంలోని కొన్ని సెక్షన్లను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పిఎన్‌బిపై రూ.1.8 కోట్ల జరిమానా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 19లోని సబ్ సెక్షన్ (2)కు విరుద్ధంగా రుణగ్రహీత కంపెనీల్లో పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో పిఎన్‌బి బ్యాంక్ షేర్లను కలిగి ఉన్నట్లు సెంట్రల్ బ్యాంక్ కనుగొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో చూపించాలని ఆర్బీఐ బ్యాంకు పిఎన్‌బికి నోటీసు జారీ చేసింది. విచారణ సమయంలో చేసిన బ్యాంక్ పేర్కొన్న వివరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలో పేర్కొన్న కొన్ని నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో ఆర్బీఐ పిఎన్‌బి బ్యాంకుపై జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తేలింది. ఐసీఐసీఐపై రూ.30 లక్షల జరిమానా ఐసీఐసీఐ బ్యాంకుకు పొదుపు బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణ విషయంలో శిక్షారుసుములు విధించడంపై కేంద్ర బ్యాంకు జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు జరిమానా విధించింది. ఆర్బీఐ ఆదేశాలను పాటించకుండా, నిబందనలకు విరుద్దంగా పొదుపు ఖాతాదారుల నుంచి కనీస బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు ఛార్జీలు వసూలు చేయడంతో ఐసీఐసీఐకు బ్యాంకుకు నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత బ్యాంకు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉండటంతో జరిమానా విధించినట్లు తెలిపింది. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! ఆగిపోనున్న బ్యాంకు కార్యకలాపాలు..!) -
ఐసీఐసీఐ రికార్డు లాభాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 5,511 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసికాలవారీగా చూస్తే ఇది రికార్డు గరిష్ట స్థాయి లాభం. వివిధ విభాగాల్లో రుణ వృద్ధి మెరుగుపడటం, మొండి బాకీలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో బ్యాంక్ రూ. 4,251 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా క్యూ2లో ఆదాయం రూ. 23,651 కోట్ల నుంచి రూ. 26,031 కోట్లకు పెరిగింది. ఇవి స్టాండెలోన్ ప్రాతిపదికన ఫలితాలు కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకు అత్యధికంగా రూ. 6,092 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది రూ. 4,882 కోట్లు. ఇక మొత్తం ఆదాయం స్వల్పంగా వృద్ధి చెంది రూ. 39,290 కోట్ల నుంచి రూ. 39,484 కోట్లకు చేరింది. కనిష్టానికి ఎన్పీఏలు: బ్యాంక్ ఎన్పీఏలు 5.17 శాతం నుంచి 4.82 శాతానికి దిగి వచ్చాయి. ఇక నికర ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గాయి. 2014 డిసెంబర్ 31 తర్వాత నికర ఎన్పీఏలు ఇంత కనిష్టానికి తగ్గడం ఇదే ప్రథమం. -
సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న ఐసీఐసీఐ బ్యాంక్..!
ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ 2021-2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సరికొత్త రికార్డును నమోదుచేసింది. క్యూ2 ఫలితాల్లో ఐసీఐసీఐ అంచనాలకు మించి ఫలితాలను రాబట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 30 శాతం పైగా నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. ఐసీఐసీఐ క్యూ2లో రూ. 5511 కోట్ల లాభాలను గడించింది. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే.. నెట్ ప్రాఫిట్ భారీగా మెరుగుపడింది. గత ఏడాది క్యూ2లో రూ. 4,251 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను ఐసీఐసీఐ సాధించింది. క్యూ2 లో సుమారు రూ. 5,441 కోట్ల నెట్ ప్రాఫిట్ వస్తోందని ఐసీఐసీఐ భావించగా..గడిచిన త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాలను సాధించింది. అంతేకాకుండా ఐసీఐసీఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 25 శాతం మేర పెరిగి, రూ. 11,690 కోట్ల రూపాయలకు చేరుకుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రేట్ 4 శాతానికి చేరగా.. గత ఏడాది రెండో త్రైమాసికంలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.89గా నమోదైంది. తగ్గిన నిరార్థక ఆస్తుల విలువ..! నిరార్థక ఆస్తుల(నాన్ పెర్మార్మింగ్ అసెట్స్-ఎన్పీఏ) విలువ 12 శాతం మేర, రూ. 8,161 కోట్లకు తగ్గింది. 2014 తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్పీఏ ఆస్తులు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్పీఏ ఆస్తుల విలువ రూ. 9,306 కోట్లుగా ఉండగా.. రెండో త్రైమాసికంలో ఎన్పీఏ ఆస్తులు విలువ రూ. 8,161 కోట్లకు చేరింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన టెస్లా..! -
ఫెస్టివల్ సీజన్లో బ్యాంకులు బంపర్ ఆఫర్లు, ఆన్లైన్ షాపింగ్‌తో డిస్కౌంట్లు
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా పలు బ్యాంకులు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ రూ .1100 ప్రాసెసింగ్ ఫీజుతో 6.70% వడ్డీతో హోం లోన్ ,వ్యక్తిగత రుణం 10.25% వడ్డీతో అందిస్తుంది.ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి తెలిపారు. ప్రత్యేక ఆఫర్లు ఇవే.. ఆటో లోన్ : 8 సంవత్సరాలు ఆటోలోన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆటోపై రూ .1 లక్ష రుణం తీసుకుంటే నెలవారీ వాయిదాగా రూ .799 చెల్లించాల్సి ఉంటుంది. ఇన్స్టంట్ పర్సనల్ లోన్: రూ.1999 ప్రాసెసింగ్ ఫీజుతో వ్యక్తిగత రుణాన్ని 10.25% ఇంటస్ట్ర్‌తో అందిస్తుంది. కన్జ్యూమర్ ఫైనాన్స్ లోన్: గృహోపకరణాలు, డిజిటల్ ప్రాడక్ట్‌లను నో కాస్ట్ ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇందుకోసం సంబంధిత ప్రూప్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ప్రైజ్ లోన్ : ఓవర్ డ్రాఫ్ట్ కింద మీకు రూ .50 లక్షల వరకు అసురక్షిత ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందని రూ .15 లక్షల వరకు ఓడీ తీసుకోవచ్చు. మీరు ఉపయోగించే మొత్తానికి మీరు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మీరు రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లిస్తే, దానిపై మీకు ఎలాంటి ఛార్జీ విధించరు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే : ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయపడేందుకు బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఉదాహరణకు మీ సేవింగ్ అకౌంట్లో, లేదంటే కరెంట్ అకౌంట్లో మనీ జీరో బ్యాలెన్స్‌లో ఉంటే సంబంధిత బ్యాంకులు ఈ ఓవర్ డ్రాఫ్ట సదుపాయాన్ని అందిస్తుంటాయి. ఈ సదుపాయంతో బ్యాంకులు పెద్దమొత్తంలో డబ్బుల్ని అందిస్తుంటాయి. అయితే చెల్లించాల్సిన టైమ్లోపులోనే చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఇంటస్ట్ర్ పడుతుంది. ఆయా బ్రాండ్లపై స్పెషల్ డిస్కౌంట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మిత్రా, టాటా క్లిక్ ,పేటీఎం మాల్ వంటి ఇ కామర్స్ ప్లాట్ ఫాంలలో ఆన్లైన్ షాపింగ్‌పై 10% డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్, రెడ్మీ, వన్ ప్లస్ రియల్ మీ, ఒప్పో, వివో ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ అఫర్లను పొందవచ్చు. షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, సెంట్రల్, ఆజీవో, ఫ్లిప్‌కార్ట్ లలో షాపింగ్ చేస్తే 10% డిస్కౌంట్, రూ .50వేల కొనుగోలుపై రూ .5,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మేక్ మై ట్రిప్, యాత్ర,పేటీఎం నుండి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే 25శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఫుడ్: జోమెటో, ఇజీడినర్, స్విగి మరియు బ్రికెట్ ఖచ్చితంగా 50% వరకు తగ్గింపు. చదవండి: క్రెడిట్ స్కోర్ బాగున్నా, లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసా? -
నయా బ్యాం‘కింగ్’.. బ్యాంకు సేవలన్నీ డిజిటల్‌గానే..
ఆధునిక, డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ పాత్ర చెప్పలేనంత పెద్దది. అది ఫోన్‌బ్యాంకింగ్ కావొచ్చు.. నెట్ బ్యాంకింగ్ కావచ్చు. డీమోనిటైజేషన్ తర్వాత నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కరోనా వచ్చి డిజిటల్‌ను మరింత వేగవంతం చేసింది. దీంతో నేడు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా సంప్రదాయ బ్యాంకులకు.. నియో బ్యాంకులకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకుం డా పోయింది. ఈ పరిణామాలు నియో బ్యాంకుల విస్తరణకు అవకాశాలను విస్తృతం చేసిందని చెప్పుకోవాలి. నేటి యవతరానికి బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద ‘క్యూ’లను చూస్తే చిరాకు. లెక్కలేనన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా వారికి నచ్చదు. సమయం వృథాకాకుండా.. ఉన్న చోట నుంచే బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు వారికి నచ్చింది. పెద్దవయసులోని వారు సైతం డిజిటల్ బ్యాంకు లావాదేవీలకు అలవాటు చేసుకుంటూ ఉండడం కొత్త ధోరణికి అద్దం పడుతోంది. కొంచెం ప్రత్యేకంగా.. నియో బ్యాంకులకు ప్రత్యేకమైన నిర్వచనం ఏదీ లేదు. భౌతికంగా ఎటువంటి శాఖలను కలిగి ఉండవు. ఇప్పటికే విస్తరించి ఉన్న సంప్రదాయ బ్యాంకులతో (లైసెన్స్ కలిగిన) ఇవి భాగస్వామ్యం కుదుర్చుకుని.. బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటాయి. బ్యాంకు సేవలను వినియోగదారులకు మరింత సౌకర్యంగా అందించడం వీటి ప్రత్యేకత. వీటివల్ల బ్యాంకులకూ ప్రయోజనం ఉంది. కొత్త కస్టమర్లను సంపాదించేందుకు పెద్దగా అవి శ్రమపడాల్సిన పని తప్పుతుంది. నియోబ్యాంకుల రూపంలో కొత్త కస్టమర్లు వాటికి సులభంగా వచ్చి చేరుతుంటారు. బ్యాంకులకు కొత్త కస్టమర్లను తీసుకొచ్చినందుకు.. కస్టమర్ యాక్విజిషన్ ఫీ పేరుతో నియోబ్యాంకులకు కొంత మొత్తం ముడుతుంటుంది. అంతేకాదు.. బ్యాంకు తరఫున కస్టమర్లకు అందించే ప్రతీ సేవలపైనా ఎంతో కొంత ఆదాయం నియోబ్యాంకులకు లభిస్తుంది. కస్టమర్లకు సౌకర్యం.. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల వల్ల కస్టమర్లకు కొన్ని సౌలభ్యాలున్నాయి. బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్‌లను నియోబ్యాంకులు డిజైన్ చేసుకుంటాయి. నిధుల విషయంలో ఎటువంటి అభద్రతా భావం, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నియోబ్యాంకులు మధ్యవర్తిత్వ పాత్రే పోషిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అకౌంట్లు, డిపాజిట్లు అన్నీ కూడా సంప్రదాయ బ్యాంకులవద్దే ఉంటాయి. వీటిల్లో ఖాతాను వేగంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్లోనే కేవైసీ వివరాలను పూర్తి చేయవచ్చు. ఆధార్, పాన్‌తోపాటు కొన్ని ప్రాథమిక వివరాలను ఇస్తే చాలు. పైగా ఇవన్నీ కూడా సున్నా బ్యాలన్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అంటే ఖాతాదారులు రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేకుండానే బ్యాంకు సేవలను పొందే వెసులుబాటు ఉంది. వార్షిక నిర్వహణ చార్జీలు కూడా లేవు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల భాగస్వామ్యం కలిగిన నియో బ్యాంకులు డిపాజిట్లపై అధిక రేటును ఆఫర్ (7 శాతం వరకు) చేస్తున్నాయి. నియో బ్యాంకులు కొన్ని సేవింగ్స్ ఆధారిత సేవలకే పరిమితం అవుతుంటే.. కొన్ని రుణ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. సేవింగ్స్ ఆధారిత నియో బ్యాంకులు పెట్టుబడులు, నగదు బదిలీలు, ఫారెక్స్ చెల్లింపుల వంటి సేవలకు పరిమితమైతే.. మరో రకం రుణ కార్యకలాపాలకు పరిమితం అవుతుంటాయి. సేవింగ్స్ ఆధారితం.. సేవింగ్స్ ఖాతా సేవలకు పరిమితమయ్యే నియో బ్యాంకులు ప్రధానంగా ఆయా సేవలను డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. ఐఎంపీఎస్/నెఫ్ట్/ఆర్టీజీఎస్/యూపీఐ తదితర చెల్లింపులు, చెక్ బుక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ స్టేట్మెంట్లు, ఖాతాలకు నామినీని నమోదు చేసుకోవడం ఇత్యాది సేవలన్నీ అందిస్తాయి. సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా సంప్రదాయ బ్యాంకులు ఆఫర్ చేసే అన్ని రకాల సేవలను నియో బ్యాంకుల ద్వారా డిజిటల్‌గానే పొందొచ్చు. లావాదేవీల పూర్తి వివరాలను సైతం ఎప్పటికప్పుడు పొందొచ్చు. నియోబ్యాంకులు కో బ్రాండెడ్ డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులను సైతం బ్యాంకుల భాగస్వామ్యంతో అందిస్తున్నాయి. నగదు ఉపసంహరించుకోవాలన్నా, నగదును డిపాజిట్ చేసుకోవాలన్నా.. అప్పుడు కస్టమర్లు నియో బ్యాంకు మంజూరు చేసిన ఏటీఎం కార్డును వినియోగించుకోవచ్చు. ఏ బ్యాంకు భాగస్వామ్యంతో కార్డు ఇచ్చిందో ఆయా బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. నగదు జమ కోసం అవసరమైతే భాగస్వామ్య బ్యాంకు శాఖకు వెళ్లి పనిచేసుకోవచ్చు. ఏటీఎం యంత్రాల్లోనూ క్యాష్ డిపాజిట్ అవకాశం ఉంటున్న విషయం తెలిసిందే. కస్టమర్ల వినియోగానికి తగ్గట్టు.. నియోబ్యాంకు ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్ల వినియోగాన్ని ట్రాక్ చేస్తుంటాయి. వారి అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఫెడరల్ బ్యాంకు సహకారంతో గూగుల్ పే ‘ఎఫ్ఐ మనీ’ని ఆరంభించింది. ఇది కూడా ఒక నియోబ్యాంకే. ఇది ఒక ఆటోమేటెడ్ బోట్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసింది. దీంతో కస్టమర్ స్విగ్గీ లేదా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ప్రతీ సందర్భంలోనూ రూ.50–100 వరకు పొదుపు చేయమని సూచిస్తుంటుంది. మరో నియోబ్యాంకు ‘జూపిటర్ మనీ’ మనీ మేనేజ్మెంట్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. తమ భవిష్యత్తు లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోనే ఖాతాదారు నిర్దేశించిన మొత్తాన్ని ప్రత్యేక భాగంగా జూపిటర్ మనీ నిర్వహిస్తుంటుంది. కొన్ని నియో బ్యాంకులు అయితే వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. నియోక్స్ అనే నియోబ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో (మధ్యవర్తి ప్రమేయం లేని) ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు. ఫిన్‌టెక్ కంపెనీ కలీదో ప్లాట్‌ఫామ్‌కు చెందిన కలీదో క్యాష్.. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, ఆర్డీలు, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం అందిస్తోంది. వీటిలో కొన్ని బ్యాంకులు బీటా వెర్షన్లోనే ఉన్నాయి. అంటే ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు. బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన ఇబ్బంది లేదు. మొబైల్ ఫోన్ నుంచే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. అన్ని లావాదేవీలనూ డిజిటల్‌గానే పూర్తి చేసుకోవచ్చు. ఆఖరుకు రుణాలను కూడా డిజిటల్ వేదికగా వేగంగా తీసుకోవచ్చు. ఈ తరహా సేవలతో నియో బ్యాంకులు విస్తరించుకుంటూ వెళుతున్నాయి. ఎటువంటి భౌతిక శాఖల్లేకుండా.. ఆన్లైన్ ఆర్థిక సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లనే నియోబ్యాంకులుగా పేర్కొంటున్నారు. ఈ సంస్థల సేవలపై వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... రుణ ఉత్పత్తులు.. కొన్ని నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. ఇవి సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణ దరఖాస్తులను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంటాయి. ఆన్లైన్లోనే ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఫొటో ఐడీ, ఆధార్ నంబర్, ఒక సెల్ఫీ కాపీలను బ్యాంకుకు ఆన్లైన్లో సమర్పిస్తే చాలు. ఫ్రియోకు చెందిన మనీట్రాప్.. రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు కస్టమర్ల రుణ చరిత్ర ఆధారంగా వేగంగా రుణాలను మంజూరు చేస్తోంది. నెలసరి వేతనం రూ.30,000, ఆపైన ఉన్న ఉద్యోగులకు 13 శాతం వడ్డీ రేటుపైనే మూడు నెలల నుంచి 36 నెలల కాలానికి మంజూరు చేస్తోంది. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి సేవలను ఫ్రియోపే పేరుతో అందిస్తోంది. రూ.500–3,000 వరకు క్రెడిట్‌ను స్థానిక దుకాణాల్లో కొనుగోళ్లకు వాడుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్ణీత తేదీలోపు చెల్లిస్తే చాలు. రూపాయి కూడా వడ్డీ ఉండదు. నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులను ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకుల భాగస్వామ్యంతో అందించొచ్చు. సేవింగ్స్ ఖాతా సేవలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకు నుంచే రుణ ఉత్పత్తులను ఆఫర్ చేయాలని లేదు. ఉదాహరణకు ఫ్రియో సంస్థ సేవింగ్స్ ఖాతా సేవలను ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సహకారంతో అందిస్తోంది. కానీ ఇదే ఫ్రియో తన మనీట్రాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణ ఉత్పత్తులను అందించేందుకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీఎం ఫైనాన్స్, అపోలో ఫిన్వెస్ట్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఆర్బీఎల్ బ్యాంకుతో టైఅప్ అయ్యి క్రెడిట్ కార్డులను సైతం అందిస్తోంది. సరైన క్రెడిట్ స్కోర్ లేని వారి గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా నియో బ్యాంకులు.. కస్టమర్ల మొబైల్లోని కాంటాక్ట్‌లు, గ్యాలరీ, ఇతర యాప్‌ల సమాచారం తీసుకునేందుకు అనుమతి కోరుతున్నాయి. నియంత్రణలు, ఫిర్యాదుల పరిష్కారం నియో బ్యాంకులపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాం కుల సాయంతోనే బ్యాంకింగ్ సేవలను ఇవి అందిస్తున్నాయని గమనించాలి. డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులను అందించే సంస్థలు భౌతికంగానూ శాఖలను కలిగి ఉండాలని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. కనుక నియోబ్యాంకులు భౌతికంగా శాఖలు కలిగిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకుని సేవలను అందిస్తున్నాయి. కనుక నియో బ్యాంకు అందిస్తున్న డిపాజిట్, సేవింగ్స్ ఖాతా సేవల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఖాతాల్లోని కస్టమర్ల డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుంది. కాకపోతే నియోబ్యాంకు ఒప్పందం చేసుకున్న బ్యాంకు ఏదన్నది తెలుసుకోవడం మంచిది. ఫిర్యాదులను నియో బ్యాంకు లేదా ఆ బ్యాంకుతో ఒప్పందం కలిగిన సంప్రదాయ బ్యాంకుల వద్ద దాఖలు చేసుకోవచ్చు. సకాలంలో పరిష్కారం రానట్టయితే ఆర్బీఐ సాచెట్ వెబ్సైట్లోనూ నమోదు చేసుకోవచ్చు. అనుకూలమేనా..? వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్, లావాదేవీలను సైతం సౌకర్యంగా నిర్వహించుకోగల వెసులుబాటు నియో బ్యాంకుల్లో ఉంటుంది. కాకపోతే అన్నింటినీ ఒకే కోణం నుంచి చూడకూడదు. కొన్ని నియో బ్యాంకుల్లో బ్యాలన్స్ వెంటనే అప్డేట్ కావడం లేదని.. కస్టమర్ సేవలు బాగోలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కనుక ఎంపిక చేసుకున్న నియోబ్యాంకు సేవలు మెరుగ్గా లేకపోతే వాటిల్లో కొనసాగడం ఆశించిన ప్రయోజనాలను ఇవ్వదు. సైబర్ భద్రతా రిస్క్ అంతా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే కావడంతో సైబర్ భద్రతా రిస్క్ ఉంటుంది. అలాగే, ఫోన్లో వ్యక్తిగత సమాచారం పొందేందుకు అనుమతి అడుగుతున్నందున ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. మెరుగైన, సులభతరమైన బ్యాంకు సేవల కోసంనియో బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్టయితే.. ఆశించిన మేర సేవల నాణ్యత ఉందేమో పరిశీలించుకోవాలి. ఇప్పటికే సంప్రదాయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు.. మెరుగైన సేవల కోసం రెండో ఖాతాను నియో బ్యాంకుల్లో తెరవడాన్ని పరిశీలించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా.. నియో బ్యాంకుల మాదిరే అన్ని రకాల సేవలను ఆఫర్ చేస్తున్న ఎస్బీఐ యోనో, కోటక్ 811 ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. నియో బ్యాంకులకు ఇవి మెరుగైన ప్రత్యామ్నాయంగా వారు పేర్కొంటున్నారు. పరిమితులు సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆటో డెబిట్ (ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అనుమతి) కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం అన్ని నియో బ్యాంకుల్లోనూ లేదు. అలాగే, పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు కూడా అవకాశం లేదు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 730 టార్గెట్: రూ. 870 ఎందుకంటే: గతేడాది(2020–21)కల్లా 8.4 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ దేశీ బ్రోకింగ్ బిజినెస్‌లో నాలుగో ర్యాంకులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్ల విషయంలో డిస్కౌంట్ బ్రోకర్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీలోనూ కంపెనీ పురోభివృద్ధి సాధిస్తోంది. కంపెనీకి గల పటిష్ట డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. క్లయింట్లకు వివిధ దశల్లో అవసరమయ్యే పెట్టుబడులు, రక్షణ, రుణాలు తదితర లైఫ్‌సైకిల్ సొల్యూషన్స్‌ను పూర్తిస్థాయిలో అందిస్తోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల పెట్టుబడుల్లో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇవి దేశీ బ్రోకింగ్ పరిశ్రమలో డిజిటల్ సేవలు, అతిపెద్ద సంస్థల కన్సాలిడేషన్‌కు దారి చూపుతున్నాయి. అతిపెద్ద కంపెనీగా ఐ–సెక్ సర్వీసులకు ఇకపై మరింత డిమాండు కనిపించే వీలుంది. కస్టమర్ల వ్యాలెట్ షేర్ల మానిటైజేషన్ తదితర డైవర్సిఫైడ్ ప్రొడక్టులతో కూడిన సేవల ద్వారా నిలకడైన ఆదాయాన్ని సాధించనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లను పొందడంలో ముందుంటోంది. వ్యయాల క్రమబద్ధీకరణతో లబ్ధి పొందనుంది. టీసీపీఎల్ ప్యాకేజింగ్ వెంచురా సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 532 టార్గెట్: రూ. 961 ఎందుకంటే: గత దశాబ్దన్నర కాలంగా కంపెనీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 17.7 శాతం పురోగతిని చూపుతోంది. సుమారు 6,000 లిస్టెడ్ కంపెనీలలో గత పదేళ్లుగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తున్న 105 కంపెనీలలో ఒకటిగా జాబితాలో చేరింది. మడిచే వీలున్న అట్టపెట్టెలు(ఫోల్డింగ్ కార్టన్స్), మార్పిడికి వీలయ్యే స్టాండెలోన్ పేపర్ బోర్డుల తయారీలో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. వెరసి ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో నిలకడైన, ప్రాధాన్యత కలిగిన కంపెనీగా పలు పరిశ్రమలకు చెందిన దిగ్గజ క్లయింట్ల నుంచి గుర్తింపును పొందింది. అంతర్జాతీయంగా రక్షణాత్మక ప్యాకేజింగ్ మార్కెట్ వార్షికంగా 6.7 శాతం వృద్ధితో 281 బిలియన్ డాలర్ల నుంచి 469 బిలియన్ డాలర్లకు జంప్చేయగలదని అంచనా. ఈ రంగంలో పట్టున్న కంపెనీగా టీసీపీఎల్‌కు భారీ అవకాశాలు లభించే వీలుంది. పర్యావరణ అనుకూల టెక్నాలజీస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నందున రానున్న దశాబ్ద కాలంలో కన్సాలిడేషన్ జరగనుంది. తద్వారా పోటీ తగ్గనుంది. ఈ ఏడాది రెండో తయారీ లైన్ ప్రారంభం కానుండటంతో కంపెనీ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సామర్థ్యం రెట్టింపుకానుంది. అనుబంధ సంస్థ ద్వారా చేపట్టనున్న పాలీఎథిలీన్ బ్లోన్ఫిల్మ్ తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనుంది. -
లోన్ యాప్స్ కేసుల్లో మరో ట్విస్ట్.. ఐసీఐసీఐ అధికారి అరెస్టు
లోన్ యాప్స్ కేసుల్లో సిటీ పోలీసులు ఫ్రీజ్ చేసిన ఆరు బ్యాంకు ఖాతాలను డీ-ఫ్రీజ్ చేసి రూ.1,18,70,779 మళ్లించిన కేసులో కోల్‌కతాలోని అలీపోరే ఐసీఐసీఐ బ్యాంకు శాఖ మేనేజర్ రాకేష్ కుమార్ దాస్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లతో మిలాఖత్ అయిన ఇతగాడు ఆరు ఖాతాలను డీ-ఫ్రీజ్ చేయడంతో పాటు చేయించినట్లు అధికారులు తేల్చారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అనిల్‌కుమార్, ఆనంద్ జున్నుల విచారణలో దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ ఏడాది జూన్ నుంచి పరారీలో ఉన్న రాకేష్‌ను కోల్‌కతాలో అరెస్టు చేసి, సోమవారం నగరానికి తీసుకువచ్చారు. ఇతడిని కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా పరారీలో ఉన్న సూత్రధారి ఉత్తమ్ చౌదరి ఆచూకీ కనిపెట్టాలని భావిస్తున్నారు.(చదవండి: Digital Loan: రంగంలోకి టెక్ కంపెనీలు) అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన లోన్ యాప్స్ కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేయించిన ఖాతాల్లో ఢిల్లీలోని హైంజ్ ఎంటర్ ప్రైజెస్‌కు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినవి ఉన్నాయి. దీని ఖాతా ఢిల్లీలోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లో ఉంది. దీంతో పాటు మరో అయిదు కంపెనీలకు చెందిన ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లోని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను డీ-ఫ్రీజ్ చేయించడానికి నేరగాళ్లు పథకం వేశారు. దీనికోసం అప్పట్లో కోల్‌కతాలో నివసిస్తున్న బీహార్‌కు చెందిన ఉత్తమ్ చౌదరిని రంగంలోకి దింపారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేయించిన 45 బ్యాంకు ఖాతాలను డీ- ఫ్రీజ్ చేయించాలని ఇతడితో చెప్పారు. రంగంలోకి దిగిన ఉత్తమ్ వీటిని డీ-ఫ్రీజ్ చేయాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో నకిలీ పత్రాలు తీసుకుని కోల్‌కతాలోని అలీపోరేలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌నకు వెళ్లాడు. దాని మేనేజర్ రాకేష్‌ను కలిసిన ఉత్తమ్... తన పథకం మొత్తం వివరించాడు. బ్యాంక్ మేనేజర్ సూచనల మేరకే అక్కడి లాల్‌బజార్ సైబర్ క్రైమ్ ఠాణా ఎస్సైగా నకిలీ పత్రాలు సైతం సృష్టించుకు వచ్చాడు. వీరిద్దరూ కలిసి పథకం పన్నారు. ఆ బ్రాంచ్‌లో ఉన్న రెండు ఖాతాలతో పాటు ఢిల్లీ, గుర్గావ్, హరియాణాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుల్లోని నాలుగింటిని డీ-ఫ్రీజ్ చేయించారు. 45 ఖాతాలను డీ–ఫ్రీజ్ చేయాలంటూ హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్ కార్యాలయానికీ లేఖ రాశారు. ఢిల్లీతో పాటు చట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వివిధ బ్రాంచ్‌ల్లోని మరో నాలుగు ఖాతాలను డీ-ఫ్రీజ్ చేయించాడు. రాకేష్ మరో అడుగు ముందుకు వేశాడు. డీ-ఫ్రీజ్ చేసిన ఖాతాల్లోని నగదును ఉత్తమ్ సూచించినట్లు అనిల్, ఆనంద్‌లకు చెందిన చెందిన ఎస్బీఐ ఖాతాలోకి మళ్లించేలా చేశాడు. రాకేష్ నగదు బదిలీలు సైతం చేయించేశాడు. తనపై అనుమానం రాకుండా హైదరాబాద్‌లోని రీజినల్ కార్యాలయానికి సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఈ కార్యాలయానికి కూడా కొన్ని ఖాతాలు డీ-ఫ్రీజ్ చేయమంటూ లేఖలు అందడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానించి కేసు నమోదు చేశారు. ఈ స్కామ్‌లో రాకేష్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు జ్యుడీషీయల్ రిమాండ్‌కు తరలించారు. -
ఎల్ఐసీకి మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్ బ్యాంకర్ సంస్థలను ఎంపిక చేసింది. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్ తదితరాలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్)కు దరఖాస్తు చేశాయి. చదవండి : Aadhar Link: టెక్నికల్ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే! -
టూవీలర్ కొనుగోళ్లపై తక్కువ వడ్డీరేట్లను అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
మనలో చాలా మందికి సొంత బైక్‌ను కొనాలనే ఆశ అందరికీ ఉంటుంది. డబ్బులు ఉన్నవారు వెంటనే ఆయా బైక్ కొనుగోలు చేస్తారు. డబ్బులు పూర్తిగా వెచ్చించి బైక్‌ను కొనుగోలు చేసే వీలు లేని వారి కోసం పలు బ్యాంకులు నిర్ణీత వడ్డీరేటుతో అప్పును ఇస్తాయి. మీ సిబిల్ స్కోర్ 750కు మించి ఉంటే బ్యాంకులు మీకు అప్పును అందిస్తాయి. సులభ వాయిదాల చొప్పున అప్పును చెల్లిసే మీరు కొనుగోలు చేసిన బైక్ మీ సొంతం అవుతుంది. పలు బ్యాంకులు టూవీలర్ కొనుగోళ్లపై గరిష్టంగా రూ. 10 లక్షల వరకు అప్పును ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఫలానా బ్యాంకుల నుంచి అప్పులను తీసుకోవడంలో వడ్డీరేట్లు ఎలా ఉంటాయో అనే సందేహం చాలా మందికి ఎదురై ఉంటుంది. టూవీలర్ కొనుగోళ్లపై అతి తక్కువ వడ్డీరేట్లను అందిస్తోన్న బ్యాంకుల వివరాలను మీ ముందుకు తెచ్చాం. రుణాలను పొందడానికి కావాల్సిన అర్హతలు: రుణగ్రహీతలు 21 నుంచి 58 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రుణగ్రహీత నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం కలిగి ఉండాలి. గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ను రుణగ్రహీతలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. టూవీలర్‌పై తక్కు వ వడ్డీరేట్లను అందిస్తున్న బ్యాంకులు క్రమ సంఖ్య. బ్యాంకులు అందిస్తోన్న వడ్డీరేట్లు లోన్ అమౌంట్ 1. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25% నుంచి 7.70% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 2. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35% నుంచి 8.55% రూ. 50 లక్షలు (గరిష్టంగా) 3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.70% నుంచి 10.05% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 4. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 8.70% నుంచి మొదలు రూ 2.5 లక్షలు (గరిష్టంగా) 5 పంజాబ్ & సింధ్ బ్యాంక్ 9.00% నుంచి మొదలు రూ. 10 లక్షలు (గరిష్టంగా) 6. కెనరా బ్యాంక్ 9.00% నుంచి మొదలు రూ. 10 లక్షలు (గరిష్టంగా) 7. ఐసీఐసీఐ బ్యాంక్ 9.50% నుంచి 26.00% రూ. 3 లక్షలు (గరిష్టంగా) 8. ఐడీబీఐ బ్యాంక్ 9.80% నుంచి 9.90% రూ. 1.20 లక్షలు నుంచి మొదలు 9. యూనియన్ బ్యాంక్ 9.90% నుంచి 10.00% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 10. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 9.99 % అంతకంటే ఎక్కువ రూ. 3 లక్షల కంటే ఎక్కువ గమనిక: పై వడ్డీరేట్లు ఆయా బ్యాంకుల వెబ్సైట్లనుంచి గ్రహించినవి. -
ఇకపై ‘టెలిగ్రామ్’ లో ఇన్సూరెన్స్ సేవల గురించి తెలుసుకోండి
ముంబై: సాధారణ బీమా పరిశ్రమలో తొలిసారిగా ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తన పాలసీదారులకు ‘టెలిగ్రామ్’ యూప్ వేదికగా సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ యూజర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్టు తెలిపింది. టెలిగ్రామ్‌పై చాట్‌బాట్ సాయంతో మోటారు క్లెయిమ్ నమోదు చేయడంతోపాటు.. పురోగతి తెలుసుకోవచ్చని.. బీమా పాలసీ రెన్యువల్, పాలసీ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వివరాల్లో మార్పుల కోసం అభ్యర్థనలు పంపొచ్చని సంస్థ సూచించింది. అదే సమయంలో వాట్సాప్‌పై మరిన్ని సేవలను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల అప్లోడ్, తక్షణ విచారణల సదుపాయాలు కల్పించినట్టు తెలిపింది. -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
విషాదం: దోపిడీని అడ్డుకున్న మహిళా బ్యాంకర్ దారుణ హత్య
సాక్షి, ముంబై: విధి నిర్వహణలో బ్యాంకు ఆస్తులను కాపాడబోయి ఓ మహిళా అధికారి ప్రాణాలు కోల్పోయిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫాల్గర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒకప్పటి బ్యాంకు మేనేజర్ బ్యాంకు దోపిడీకి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన మహిళా ఉద్యోగులపై కత్తులతో ఎటాక్ చేసి ఒక అధికారిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్ యోగితా వార్తక్ ప్రాణాలు కోల్పోగా, మరో ఉద్యోగిని, బ్యాంకు క్యాషియర్ శ్రద్ధా దేవ్రుఖ్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో విరార్ ఈస్ట్ బ్రాంచ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అసిస్టెంట్ మేనేజర్ యోగితా వార్తక్, క్యాషియర్ శ్రద్ధా దేవ్రుఖ్కర్ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి కత్తులతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. నగలు నగదు ఇవ్వమంటూ మహిళా ఉద్యోగినుల ఇద్దరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే వారిని ధైర్యంగా ఎదుర్కొన్న యోగితా అలారం మోగించి సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో డబ్బులు, జ్యువెల్లరీ తీసుకొని పారిపోతూ ఇద్దరు మహిళలపైనా కత్తితో దాడిచేశారు. ప్రధానంగా వర్తక్పై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. అయితే అలారంతో అప్రమత్త మైన సిబ్బంది బ్యాంక్ లోపల రక్తపు మడుగులో పడి ఉన్న యోగితాను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. యెగితాను కాపాడబోయి తీవ్ర గాయాల పాలైన దేవ్రుఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు పారిపోతున్న అనిల్ దుబేను పట్టుకోగా, మరో నిందితుడు మాత్రం అక్కడి నుంచి ఉడాయించాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ బ్యాంకు మాజీ మేనేజరే అనిల్ దుబే, మరో వ్యక్తితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గతంలో ఇదే బ్యాంకులో కోటి రూపాయల రుణం తీసుకున్నాడు అనిల్. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టాడు. చివరికి ఏకంగా బ్యాంకుకే కన్నం వేసేందుకు కుట్ర పన్నాడు. ప్రస్తుతం అతను మరో ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడని సీనియర్ పోలీసు అధికారి సురేష్ వరదే వెల్లడించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్!
అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి మారనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు, దేశీయ పొదుపు ఖాతాదారుల చెక్ బుక్ ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్ డ్రా, చెక్ బుక్ ఛార్జీల గురించి ఈ క్రింద పేర్కొన్నాము. ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి. 6 మెట్రో నగరాలలో ఒక నెలలో మొదటి 3 లావాదేవీలు(ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) మాత్రమే ఉచితంగా లభిస్తాయి. మెట్రో నగరాలు కాకుండా ఇతర అన్ని ప్రాంతాల్లో మొదటి 5 లావాదేవీలు ఉచితం. ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. నాన్ హోమ్ బ్రాంచీలో రోజుకు ₹25,000 వరకు నిర్వహించే క్యాష్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. ₹25,000 కంటే ఎక్కువ లావాదేవిలు జరిపితే ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు ₹25,000గా నిర్ణయించబడింది. ప్రతి లావాదేవీకి ₹25,000 వరకు నిర్వహించే ప్రతి లావాదేవీపై ₹150. ₹25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు చేయడం వీలు కాదు. ఒక సంవత్సరంలో 25 చెక్కు లీఫ్స్ గల చెక్ బుక్ ఉచితం. 10 చెక్కు లీఫ్స్ గల అదనపు చెక్కు బుక్ కావాలంటే ₹20 చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెలలో నిర్వహించే మొదటి 4 లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి వెయ్యి రూపాయలకు ₹5 చెల్లించాల్సి ఉంటుంది. కనీస రుసుము రూ.150కు లోబడి ఉంటుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదిత్య పురికి రూ. 13.82 కోట్ల ప్యాకేజీ
ముంబై: ప్రైవేట్ రంగంలోని టాప్ 3 ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఆదిత్య పురి అత్యధిక వేతన ప్యాకేజీ అందుకున్నారు. ఆయన రిటైర్ అయిన గత ఆర్థిక సంవత్సరంలో(2020–21) రూ. 13.82 కోట్లు జీతభత్యాల రూపంలో పొందారు. ఇందులో రూ. 3.5 కోట్ల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పురి రిటైర్మెంట్ తర్వాత సీఈవో, ఎండీగా నియమితులైన శశిధర్ జగదీశన్ రూ. 4.77 కోట్లు వేతనం అందుకున్నారు. మరోవైపు, కోవిడ్–19పరమైన పరిస్థితుల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి స్వచ్ఛందంగా తన జీత భత్యాల్లో ఫిక్స్డ్ భాగాన్ని, కొన్ని అలవెన్సులను వదులుకున్నారు. రూ. 38.38 లక్షల అలవెన్సులు అందుకోగా .. 2017, 2018 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ. 63.60 లక్షలు పనితీరు ఆధారిత బోనస్ పొందారు. అటు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి రూ. 6.52 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. -
ఐసీఐసీఐ లాభం హైజంప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2021–22) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 4,747 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 77 శాతం దూసుకెళ్లి రూ. 4,616 కోట్లను అధిగమించింది. మొత్తం ప్రొవిజన్లు 62 శాతం తగ్గి రూ. 2,852 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) పెరగనున్న అంచనాలతో గతేడాది క్యూ1లో రూ. 7,594 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. తాజా స్లిప్పేజెస్ రూ. 7,231 కోట్లకు చేరాయి. వీటిలో రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ వాటా రూ. 6,773 కోట్లు. ఎస్ఎంఈ, కార్పొరేట్ విభాగం నుంచి రూ. 458 కోట్లు నమోదైంది. ఎన్పీఏలు ఇలా ఐసీఐసీఐ బ్యాంక్ జీఎన్‌పీఏలు గతేడాది క్యూ1తో పోలిస్తే 5.46 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఇవి 4.96 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.14 శాతం నుంచి 1.16 శాతానికి స్వల్పంగా పెరిగాయి. రిటైల్, బ్యాంకింగ్ బిజినెస్ విభాగంలో మరింత ఎక్కువగా 2.04 శాతం నుంచి 3.75 శాతానికి పెరిగాయి. కాగా.. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 10,936 కోట్లను తాకింది. ఇతర ఆదాయం 56 శాతం ఎగసి రూ. 3,706 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 0.2 శాతం బలపడి 3.89 శాతానికి చేరాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.27 శాతంగా నమోదైంది. -
పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు శుభవార్త
ముంబై: ఇంధన కొనుగోళ్లపై తగ్గింపుల ప్రయోజనాలతో కూడిన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్’ కార్డుతో హెచ్‌పీసీఎల్ పెట్రోలియం ఔట్లెట్ల వద్ద చేసే చెల్లింపులపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని.. ‘హెచ్‌పీపే’ యాప్ ద్వారా కార్డుతో చెల్లింపులు చేసినట్టయితే అదనంగా మరో 1.5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్ చేస్తుండగా.. వార్షిక ఫీజు రూ.500గా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టాలకు చేరిన తరుణంలో తగ్గింపుల ప్రయోజనాలతో బ్యాంకు ఈ వినూత్నమైన కార్డును ఆవిష్కరించడం మార్కెట్ వాటాను పెంచుకునే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తరచుగా సాంకేతిక అవాంతరాలు తలెత్తుండడంతో నూతన క్రెడిట్ కార్డులు జారీ చేయవద్దంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పోటీ సంస్థలైన ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు.. క్రెడిట్ కార్డుల్లో వాటాను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. -
ICICI Bank: డాక్టర్లకు రూ. పది కోట్ల దాకా లోన్
సాక్షి, ముంబై: వైద్యుల బ్యాం కింగ్ అవసరాలను తీర్చే దిశగా ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ కొత్తగా ’సెల్యూట్ డాక్టర్స్’ పేరిట ప్రత్యేక సొల్యూషన్స్‌ను ప్రవేశపెట్టింది. వైద్య విద్యార్థి స్థాయి నుంచి సీనియర్ మెడికల్ కన్సల్టెంట్, ఆస్పత్రి లేదా క్లినిక్ యజమానిగా మారే దాకా ప్రతీ దశలోనూ వారికి అవసరమయ్యే ఆర్థిక సేవలను అందించనున్నట్లు బ్యాంక్ హెడ్ (లయబిలిటీస్) ప్రణవ్ మిశ్రా తెలిపారు. డాక్టర్స్ కోసమే ప్రత్యేకమైన ఫీచర్లతో రూపొందించిన సేవింగ్స్, కరెంటు ఖాతాలు మొదలుకుని గృహ, వ్యాపార, వ్యక్తిగత, వ్యాపార రుణాల దాకా పొందవచ్చని పేర్కొన్నారు. రూ. 1 కోటి దాకా విద్యా రుణం పొందవచ్చని వివరించారు. ఆఫర్ల వివరాలు: మెడికల్ ఎక్విప్మెంట్ లోన్ : 10 కోట్ల రూపాయల దాకా రుణ సదుపాయం. వారు బ్యాంక్ కస్టమర్లు అయినా కాకపోయినా వైద్యులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వివరాలకు హెచ్సిఎఫ్ను 567677 కు SMS చేయవచ్చు. బిజినెస్ లోన్: మూలధన అవసరాలకు లేదా క్లినిక్ / ఆసుపత్రిని పునరుద్ధరించడం, వైద్య పరికరాల కొనుగోలు వంటి ఇతర వ్యాపార సంబంధిత ఖర్చులకు రూ. 40 లక్షల దాకా వ్యాపార రుణం ప్రీ అప్రూవ్డ్ కస్టమర్లకు తక్షణమే రుణ సదుపాయం. వ్యక్తిగత రుణం: సాధారణ ఆన్లైన్ డాక్యుమెంటేషన్ , ప్రాసెసింగ్‌తో రూ. 25 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఎడ్యుకేషన్ లోన్: ‘డాక్టర్ సెలెక్ట్ ఐస్మార్ట్ ఎడ్యుకేషన్ లోన్’ అని పిలిచే ఈ సదుపాయం ద్వారా కోటి రూపాయల వరకు రుణం. ఇంకా 50 లక్షల వరకు ఆటో లోన్సదుపాయం ‘ఫ్లెక్సీ ఈఎంఐ’ సౌలభ్యాన్ని కూడా వైద్యులకు అందుబాటులోఉంచినట్టు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. -
చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!
మీరు మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీ దగ్గర సొంతిల్లు కట్టుకోవడానికి సరిపడినంత డబ్బులు మీ వద్ద లేవా? అయితే మీకు ఒక శుభవార్త. చాలా బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. అయితే గృహ రుణాలను బ్యాంక్ నుంచి తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. హోమ్ లోన్ అనేది ఎక్కువ మొత్తంతో కూడుకున్న వ్యవహారం. అందుకే వడ్డీ రేట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు కొంచెం తగ్గిన దీర్ఘకాలంలో భారీ లాభం కనిపిస్తుంది. అందువల్ల వడ్డీ రేటు తక్కువున్న బ్యాంకులో లోన్ తీసుకోండి. మేము మీ కోసం చౌక వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు జాబితాను మీ కోసం అందిస్తున్నాం. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతం ఐసీఐసీఐ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.80 శాతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.85 శాతం ఐడీబీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం కెనరా బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం ఎస్బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
కిడ్నీ రోగులకు ఐసీఐసీఐ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ గ్రూపునకు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యతా విభాగం ‘ఐసీఐసీఐ ఫౌండేషన్’ కిడ్నీ రోగులకు భారీ ఉరటనిస్తోంది. డయాలసిస్ కేంద్రాల్లో పేద రోగులకు నిరంతరాయంగా ఆపరేషన్లు జరిపేలా దిగుమతి చేసుకున్న అత్యాధునిక యంత్రాలను సేకరించి గుర్తించిన ఆసుపత్రులకు నాలుగేళ్ల వారంటీతో అందిస్తున్నట్లు ఐసీఐసీఐ ఫౌండేషన్ తెలిపింది. పేదలకు ఉచిత డయాలసిస్ సేవలను అందించేందుకు ఉద్దేశించిన జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని 'ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం' కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫౌండేషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 100 దిగుమతి చేసుకున్న డయాలసిస్ పరికరాలను దేశంలోని 14 రాష్ట్రాల పరిధిలోని పలు ఆస్పత్రులకు వీటిని ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. 60 జిల్లాల పరిధిలో అందుబాటు ధరలకే చికిత్సలు అందించేందుకు ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది. నాలుగేళ్ల వారంటీతో వీటిని అందించనున్నట్టు తెలిపింది. -
ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్‌కు ఊరట
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ కొచర్‌కు భారీ ఊరట లభించింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్‌కు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలతో గత ఏడాది సెప్టెంబర్‌లో దీపక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే జైల్లో ఉండగానే కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న అర్జీని ముంబై ప్రత్యేక కోర్టు గతంలో పలుమార్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
స్కూల్ ఫీజులూ.. సులభ వాయిదాల్లో...
న్యూఢిల్లీ: భారీ విలువ చేసే లావాదేవీలకు చెల్లించే మొత్తాన్ని నేరుగా కస్టమర్లే ఆన్లైన్లో ఈఎంఐల (నెలవారీ వాయిదాలు) కింద మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. ఎంపిక చేసిన సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాదారులు .. తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బీమా ప్రీమియంలు మొదలుకుని స్కూలు ఫీజుల దాకా వివిధ రకాల చెల్లింపులను ఈఎంఐల కింద చెల్లించవచ్చని తెలిపింది. దీనితో భారీ మొత్తాన్ని సులభ వాయి దాల్లో చెల్లించుకునేందుకు వీలవు తుందని పేర్కొంది. రూ. 50,000కు పైబడి రూ. 5 లక్షల దాకా విలువ చేసే లావాదేవీలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వీటిని 3,6,9,12 నెలల కాల వ్యవధికి ఈఎంఐల కింద మార్చుకోవచ్చని, ఇందుకోసం అదనపు చార్జీలేమీ ఉండవని బ్యాంకు తెలిపింది. ’ఈఎంఐ @ ఇంటర్నెట్ బ్యాంకింగ్’ పేరిట ఈ సదుపాయం అందు బాటులో ఉంటుందని వివరించింది. ఇందు కోసం బిల్‌డెస్క్, రేజర్‌పే అనే ఆన్లైన్ పేమెంట్ గేట్వేలతో పాటు 1,000కి పైగా వ్యాపార సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
సొంతింటి కల : ఐసీఐసీఐ గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: సొంత ఇల్లు కొనుగోలుచేయాలనుకునే వారికి దేశీయ అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకు ఐసీఐసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. గృహరుణాలపై వడ్డీ రేటును 6.7 శాతంగానిర్ణయించింది. సవరించిన వడ్డీ రేటు, ఈ రోజు(మార్చి 5, శుక్రవారం) నుండి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఆ తగ్గింపు రేటు అందుబాటులో ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. దీంతో హోమ్లోన్లపై బ్యాంకు వసూలుచేస్తున్న వడ్డీరేటు పదేళ్ల కనిష్ఠానికి దిగి రావడం విశేషం. గృహ రుణాల కోసం వినియోగదారులు రూ.75 లక్షలలోపు రుణాలపై వడ్డీరేటు 6.7 శాతంగా ఉంటుంది. రూ.75 లక్షలకు మించినరుణాలపై వడ్డీరేటు మాత్రం 6.75 శాతం నుంచి మొదలవుతుందని ఐసీఐసీఐ సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ రవి నారాయణన్ చెప్పారు. గత కొన్ని నెలలుగా గృహాలను కొనాలనుకునే సంఖ్య పెరుగుతోందని, డిమాండ్ తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లతో వినియోగదారుల సొంత ఇంటి కల నెర వేర్చేందుకు ఇది సరైన సమయంగా తాము భావిస్తున్నామన్నారు. -
ఐసీఐసీఐ స్కాం : చందా కొచర్‌కు ఊరట
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌కు ఊరట లభించింది. ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణా కుంభకోణంకేసులో ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు చందా కొచర్‌కు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆమెకు 5 లక్షల రూపాయల పూచీకత్తుతో కొచ్చర్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచర్,ఆమె భర్త దీపక్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఐసీఐసీఐ స్కాంలో చందా కొచర్ వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్ దంపతులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
నాలుగు బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం
వాట్సప్ పేమెంట్స్ కి గతంలో భారత ప్రభుత్వం ఆమోదించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం దేశంలో రెండు కోట్ల మందికి వాట్సాప్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వాట్సాప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని కంపెనీ స్వయంగా ప్రకటించింది. వాట్సప్ పేమెంట్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ)కి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) సిస్టమ్ యూజర్లకు అందుబాటులోకి ఉందని కంపెనీ తెలిపింది.(చదవండి: 437 కోట్లు కాదు.. రూ.52 కోట్లు నష్టం!) సందేశాన్ని సురక్షితంగా పంపినంత తేలికగా డబ్బులను పంపించుకోవచ్చు. డబ్బు చెల్లింపుల కోసం స్థానిక బ్యాంకులకు వెళ్లకుండా సులభంగా డబ్బులను పంపవచ్చని సంస్థ తెలిపింది. సులభంగా, సురక్షితంగా డబ్బులను పంపించుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ.యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాంటి లాభాలను ఎక్కువ మందికి అందించేందుకు కృషి చేస్తున్నాం అని వాట్సప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తెలిపారు. 160కి పైగా బ్యాంకులకు వాట్సప్ పేమెంట్స్ సపోర్ట్ చేస్తుంది అని అన్నారు. డిజిటల్ ఇండియాలో మేము భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నాం అని అన్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 12 కోట్ల మంది యూపీఐ యూజర్స్ ఉన్నారు. మొత్తం యూపీఐ యూజర్ల సంఖ్యలో ఇది 28 శాతం. ప్రతి నెల యుపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం 2020 నవంబర్‌లో 2.23 బిలియన్ లావాదేవీలు జరిగాయి. అక్టోబర్(2.07 బిలియన్) నెలలో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 6.7 శాతం ఎక్కువ. -
ఐసీఐసీఐ బ్యాంక్ హౌసింగ్ లోన్స్ రికార్డ్
ముంబై: మార్టిగేజ్ రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 2 లక్షల కోట్లను అధిగమించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. దేశీయంగా ఈ ఫీట్‌ను సాధించిన తొలి ప్రయివేట్ రంగ సంస్థగా నిలిచినట్లు తెలియజేసింది. హౌసింగ్ రుణాలలో బ్యాంక్ తొలిసారి 2016లో రూ. ట్రిలియన్ మార్క్‌ను చేరుకున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో రికార్డ్‌స్థాయిలో మార్టిగేజ్ రుణాలను మంజూరు చేసినట్లు తెలియజేసింది. వెరసి కోవిడ్-19కు ముందు స్థాయిని సైతం అధిగమించినట్లు వివరించింది. ఇదే విధంగా అక్టోబర్‌లోనూ రికార్డును నెలకొల్పుతూ అత్యధిక రుణాలను విడుదల చేసినట్లు తెలియజేసింది. ఈ బాటలో రానున్న నాలుగేళ్లలోగా రూ. 3 ట్రిలియన్ మార్టిగేజ్ లోన్ మార్క్‌ను అందుకోనున్నట్లు అంచనా వేసింది. కారణాలివీ.. రుణాల ప్రాసెసింగ్‌లో డిజిటైజేషన్, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంతో క్లయింట్లకు రుణాలు ఆఫర్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోలో వృద్ధిని సాధించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. దాదాపు మూడో వంతు రుణాలను డిజిటలైజేషన్ ద్వారానే విడుదల చేసినట్లు తెలియజేసింది. ప్రధానంగా చౌక వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరల క్షీణత, కొన్ని రాష్ట్రాలలో తగ్గిన స్టాంప్ డ్యూటీ వంటి అంశాలు రుణాలకు డిమాండ్ పెంచినట్లు వివరించింది. దీనికితోడు వేగవంతమైన వృద్ధికి వీలున్న ద్వితీయ శ్రేణి పట్టణాలపై దృష్టిపెట్టినట్లు తెలియజేసింది. షేరు ఫ్లాట్.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు నామమాత్ర లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 490ను అధిగమించిన షేరు రూ. 472 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. -
ఐసీఐసీఐ, డీఎల్ఎఫ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ, రియల్టీ రంగ బ్లూచిప్ కంపెనీ డీఎల్ఎఫ్ లిమిటెడ్, ఎన్బీఎఫ్సీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఆరు రెట్లు ఎగసి రూ. 4,251 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 16 శాతం పెరిగి రూ. 9,366 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.64 శాతం నుంచి 3.57 శాతానికి స్వల్పంగా బలహీనపడ్డాయి. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.37 శాతం నుంచి 5.17 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 1.6 శాతం నుంచి 1 శాతానికి వెనకడుగు వేశాయి. దీంతో ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ప్రస్తుతం 7.3 శాతం జంప్‌చేసి రూ. 421 వద్ద ట్రేడవుతోంది. డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో డీఎల్ఎఫ్ లిమిటెడ్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ2లో రూ. 236 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 72 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం మూడు రెట్లు పెరిగి రూ. 1,723 కోట్లకు చేరింది. ఇబిటా రూ. 100 కోట్ల నుంచి రూ. 576 కోట్లకు ఎగసింది. క్యూ2లో నికర అమ్మకాల బుకింగ్స్ రూ. 152 కోట్ల నుంచి రూ. 853 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 167 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 171 వరకూ లాభపడింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ రూ. 985 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం రూ. 2,022 కోట్లుగా నమోదైంది. ఇవి గతేడాది క్యూ2తో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ అంచనాలకంటే మెరుగైన ఫలితాలేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8 శాతం నుంచి 6.42 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 5.1 శాతం నుంచి 3.64 శాతానికి వెనకడుగు వేశాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 4.8 శాతం ఎగసి రూ. 1.13 ట్రిలియన్లను తాకాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 755 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 763 వరకూ దూసుకెళ్లింది. -
చందా కొచర్‌కు మరోసారి నిరాశ
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసిన చందాకొచర్ భర్త దీపక్ కొచ్చర్ కు ఊరట కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ముంబైలోని తలోజా జైలులో ఉండగానే ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే కోలుకున్న తరువాత ఆందోళనలో ఉన్న కొచర్‌ను మరింత మెరుగైన వైద్యంకోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ పీ రాజవైద్యా తోసిపుచ్చారు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ క్విడ్ ప్రో కో కింద వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1875 కోట్ల రూపాయల రుణాలను అక్రమ మంజూరు ఆరోపణలు, వారి వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ కస్టమర్లకు కొత్త సర్వీసు
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాలు పొందిన కస్టమర్ల కోసం లోన్ఎగైనెస్ట్ సెక్యూరిటీస్ (లాస్) డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందిన కస్టమర్లకు ఎలక్ట్రానిక్ కార్డులను జారీ చేయొచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాల నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ సౌకర్యాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దేశంలో మొట్టమొదటి బ్యాంకుగా ఐసీఐసీఐ అవతరించింది. వీసా ప్లాట్ఫామ్లో డెబిట్ కార్డుద్వారా దేశీయ వ్యాపార సంస్థల కొనుగోళ్ళతోపాటు, పీఓఎస్ మెషీన్లు, ఆన్లైన్ లావాదేవీలను ఇ-కామర్స్ పోర్టల్‌పై చెల్లింపులు చేసుకోవచ్చు. కొత్త వినియోగదారులకు 24 గంటల అనంతరం డిజిటల్ డెబిట్ కార్డు జారీ అవుతుంది. ఈ కార్డును బ్యాంకుకు చెందిన ఐమొబైల్ యాప్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. అలాగే ఏడు పనిదినాల్లో ఫిజికల్ డెబిట్ కార్డు కూడా వస్తుంది. అయితే పాత లాస్ కస్టమర్లు ఈ కార్డును వెంటనే పొందవచ్చు. వీరికి కార్డు ఆటోమేటిక్‌గానే రెన్యూవల్ అవుతుంది. ప్రయోజనాలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది పర్సనల్ లోన్ లానే వినియోగించుకోవచ్చు. డెబిట్ కార్డుకు లోన్ క్రెడిట్ అవుతుంది. నిబంధనల ప్రకారం ఈ డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త డెబిట్ కార్డు ద్వారా రోజుకు రూ.3 లక్షల వరకు పీఓఎస్ మిషన్లతో పాటు అన్ని ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. కస్టమర్ సౌలభ్యం, వారి వైవిధ్యమైన అవసరాలను తీర్చే నిమిత్తం డిజిటల్ యుగంలో ఇది ఒక కొత్త అడుగు అని బ్యాంకు అన్ సెక్యూర్డ్ ఎసెట్స్ హెడ్ సుదీప్తా రాయ్ తెలిపారు. కరోనాకాలంలో వ్యాపార కార్యకలాపాలు తిరిగి పుంజుకునేలా ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాతో అనుసంధానించిన ఈ వినూత్న డెబిట్ కార్డ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని వీసా ఇండియా అండ్ సౌత్ ఆసియా గ్రూప్ కంట్రీ మేనేజర్ టీఆర్ రామచంద్రన్ తెలిపారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. గృహ, వాహన, వ్యక్తిగత, వినిమయ రుణాలపై ఐసీఐసీఐ పండగ బొనాంజాను ప్రకటించింది. గృహ రుణాలు, ఇతర బ్యాంకుల నుంచి రుణాల బదిలీపై కనిష్టంగా 6.9 శాతం నుంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేయనుంది. ప్రాసెసింగ్ ఫీజును అతితక్కువగా రూ 3000 నుంచి వసూలు చేయనుంది. పండగ సీజన్లో సొంత కారును కొనుగోలు చేసేవారికి వెసులుబాటుతో కూడిన ఈఎంఐలను ప్రకటించింది. 84 నెలల కాలవ్యవధిలో లక్ష రూపాయలకు కేవలం 1554 రూపాయల నుంచి ఈఎంఐలను ఆఫర్ చేస్తోంది. దీనికి తోడు మహిళా కస్టమర్లకు కనిష్టంగా 1999 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును నిర్ణయించింది. ఇక ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వారికి 36 నెలల వ్యవధికి వేయి రూపాయలకు ఈఎంఐ అతితక్కువగా 36 రూపాయలు చార్జ్ చేయనుంది. వారికి ప్రత్యేకంగా ప్రాసెసింగ్ ఫీజును కేవలం 999 రూపాయలుగా నిర్ణయించింది. వ్యక్తిగత రుణాలను కనిష్టంగా 10.50 శాతం వడ్డీరేటుపై ఆఫర్ చేయడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కేవలం 3999 రూపాయలుగా నిర్ణయించింది. ఫెస్టివ్ బొనాంజా పేరుతో పలు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లనూ బ్యాంక్ ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై వినిమయ రుణాలపై నో కాస్ట్ ఈఎంఐని ఆఫర్ చేస్తోంది. ఫెస్టివ్ బొనాంజా కింద ఐసీఐసీఐ బ్యాంక్ రిటైల్, వాణిజ్య కస్టమర్లకూ పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. చదవండి : ఐసీఐసీఐలో చైనా భారీ పెట్టుబడులు -
19 వరకూ ఈడీ కస్టడీలో దీపక్ కొచ్చర్
ముంబై: అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద సోమవారం అరెస్టయిన దీపక్ కొచ్చర్ సెప్టెంబర్ 19వ తేదీ వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంటారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు జడ్జి మిలిద్ వీ కుర్తాదికర్ కస్టడీ ఆదేశాలు ఇచ్చారు. దీపక్ కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ భర్త అయిన సంగతి తెలిసిందే. చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్‌కు సీఈఓగా ఉన్న సమయంలో, వీడియోకాన్ సంస్థకు రుణాలు మంజూరు చేయడం ద్వారా తన భర్త సంస్థకు అక్రమ లబ్ది చేకూర్చారని, తద్వారా చందా కొచ్చర్ దంపతులు లాభపడ్డారన్నది దర్యాప్తు సంస్థ వాదన. ఈ ఏడాది మొదట్లో వీరికి చెందిన రూ.78 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. దీపక్ కొచ్చర్‌కు చెందిన కొన్ని కంపెనీలు, వాటాలు కూడా జప్తు అయిన వాటిలో ఉన్నాయి. వీడియోకాన్ గ్రూప్‌నకు బ్యాంక్ రుణాల విషయంలో కొచ్చర్ దంపతులను ఈడీ పూర్తి స్థాయిలో ప్రశ్నించింది. అయితే కొన్ని లావాదేవీల గురించి వివరించలేకపోవడంతో దీపక్ కొచ్చర్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ఏమి చెబుతోంది? రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టు ముందు ఉంచిన ఈడీ, కేసులో మరింత ప్రశ్నించడానికి దీపక్ కొచ్చర్ కస్టడీని కోరుతున్నట్లు తెలిపింది. ఈడీ కోర్టుకు తెలిపిన సమాచారం ప్రకారం, 2009 సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇన్టర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఈఎల్)కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.300 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ రుణ మంజూరు సమయంలో బ్యాంక్ మంజూరు కమిటీకి దీపక్ కొచ్చర్ భార్య చందా కొచ్చర్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ రుణం మంజూరు అయిన కేవలం ఒక్క రోజు తర్వాత రూ.64 కోట్లు వీఐఈఎల్ నుంచి నుపవర్ రిన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఆర్పీఎల్)కు బదిలీ అయ్యాయి. ఈ కంపెనీ దీపక్ కొచర్చర్కు చెందినది. దీపక్ కొచ్చర్ విచారణకు సహకరించడం లేదు. రూ.64 కోట్ల బదలాయింపు విషయమై ఆయనను మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉంది. అయితే ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలను దీపక్ కొచ్చర్ న్యాయవాది విజయ్ అగర్వాల్ తోసిపుచ్చారు. తన క్లైయింట్ 12 సార్లు ఈడీ విచారణకు హాజరై, అడిగిన పత్రాలన్నింటినీ సమర్పించినట్లు తెలిపారు. అయితే ఇరువురు వాదనలు ఉన్న జడ్జి, ‘‘దీపక్ కొచ్చర్ కస్డోడియన్ ఇంటరాగేషన్ తప్పనిసరి అని భావిస్తున్నట్లు’’ పేర్కొన్నారు. చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ దూత్ తదితరులపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ అధ్యయనం అనంతరం ఈడీ తన రిపోర్టును జడ్జి ముందు ఉంచింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు రుణ మంజూరీల ద్వారా కొచ్చర్ దంపతులు ప్రయోజనం పొందారన్నది ఆరోపణ -
ఈడీ కస్టడీలో దీపక్ కొచర్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణ కుంభకోణంలో కేసులో బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది.మనీలాండరింగ్ వ్యవహారాల కేసులను విచారించే ముంబై ప్రత్యేక కోర్టు ఇందుకు ఈడీకి అనుమతినిచ్చింది. (ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్ భర్త అరెస్టు) మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద దీపక్ కొచర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం అరెస్టు చేసింది.ఈ కేసులో సేకరించిన కొన్ని తాజా సాక్ష్యాల గురించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు అతన్ని కస్టోడియల్ విచారణను కోరినట్టు ఈడీ అధికారులు తెలిపారు. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1,875 కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా మంజూరు చేసిన ఆరోపణలతో ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. -
ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్ భర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు, ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. చందా కొచర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం అరెస్టు చేసింది, ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసుకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. రేపు (మంగళవారం) సెషన్స్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ తోపాటు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, అతని కంపెనీలపై జనవరి 22, 2019 న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, జనవరి 31న, ఐసీఐసీఐ బ్యాంక్ కార్పొరేట్ గ్రూపు 1,875 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలకు సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నఆస్తులను విడుదల చేయాలని కోరుతూ దీపక్ కొచర్‌కు చెందిన పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల సీజ్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుందని, ఈడీ ఎలాంటి చార్జ్ షీట్ దాఖలు చేయని కారణంగా సంస్థ ఆస్తులను విడుదల చేయాలని కోరింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ ఇలాంటి పిటిషన్ ఇప్పటికే బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని వాదించింది. గత ఏడాది మార్చిలో, పసిఫిక్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఈడీ దాడుల సందర్భంగా డైరీ, హార్డ్ డిస్క్‌తోపాటు 10.5 లక్షలరూపాయలను స్వాధీనం చేసుకుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ స్కాం బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు రేపింది. 3,250 కోట్ల రూపాయల కుంభకోణంలో క్విడ్ ప్రో కో కింద అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచర్ తన పదవిని కోల్పోయారు. -
ఐసీఐసీఐలో చైనా భారీ పెట్టుబడులు
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో చైనా బ్యాన్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో దేశీయ ప్రైవేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులో చైనా భారీ పెట్టుబడులు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (సెంట్రల్ బ్యాంకు) ఐసీఐసీఐ బ్యాంకులో ఏకంగా 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లో పెట్టుబడులతో భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన తరువాత చైనా సెంట్రల్ బ్యాంక్ తాజాగా ఐసీఐసీఐ బ్యాంకును ఎంచుకుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంకులో సింగపూర్, మోర్గాన్ ఇన్వెస్ట్ మెంట్ సొసైటీ జనరల్ లాంటి ఇతర సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి ప్రస్తుతం, ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నప్పటికీ భారతదేశంలో చైనా పెట్టుబడులకు ఎటువంటి అడ్డంకులు, ఆంక్షలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. సరిహద్దులో చైనా దుశ్యర్య తరువాత చైనాకు చెందిన టిక్‌టాక్, షేర్ఇట్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే చైనా పెట్టుబడులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. -
ఆటో, ఐటీ స్టాక్స్ దన్ను
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ బుల్లిష్ ధోరణి నెలకొంది. మంగళవారం రోజంతా సానుకూలంగా ట్రేడ్ కావడంతోపాటు ఒకటిన్నర శాతం వరకు ప్రధాన సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ధోరణి ఉండగా, దేశీయంగా ఇన్వెస్టర్లు ఐటీ, ఆటో, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోళ్లకు దిగడం భారీ లాభాలకు దారితీసింది. వరుసగా ఐదు రోజుల కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్లు సానుకూల బ్రేకవుట్ ఇచ్చాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారం మరిన్ని వృద్ధి కారక నిర్ణయాలను ప్రకటించొచ్చన్న అంచనాలతో క్రితం రోజు అమెరికా మార్కెట్లు లాభపడగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రధాన సూచీల్లో ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐటీసీ మాత్రమే నష్టపోయాయి. టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎంఅండ్ఎం, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఆటో గణనీయంగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. జూన్ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడంతో అల్ట్రాటెక్ సిమెంట్ 7 శాతానికి పైగా పెరిగి సెన్సెక్స్‌కు మద్దతుగా నిలిచింది. మిడ్, స్మాల్‌క్యాప్‌లో నష్టాలు.. బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 38,000 మార్క్ పైన ట్రేడింగ్ ఆరంభించగా.. ఇంట్రాడేలో 38,555 వరకు వెళ్లింది. చివరకు 558 పాయింట్లు లాభపడి (1.47 శాతం) 38,493 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో (1.52 శాతం) 11,300 మార్క్‌పైన క్లోజయింది. బీఎస్ఈలో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. అత్యధికంగా ఆటో రంగ సూచీ 3.26 శాతం, ఐటీ 2.54 శాతం, బేసిక్ మెటీరియల్స్ 2.32 శాతం, టెక్ 2.18 శాతం చొప్పున లాభపడ్డాయి. కానీ, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.61 శాతం, మిడ్‌క్యాప్ 0.76 శాతం, లార్జ్‌క్యాప్ 1.46 శాతం చొప్పున నష్టపోయాయి. ‘‘దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు 1.4 శాతం మేర లాభాలతో ముగిశాయి. ఆటో, ఐటీ స్టాక్స్ అధిక లాభాలకు కారణమయ్యాయి. కొన్ని స్టాక్స్ వాటి ఫలితాల ఆధారంగా ర్యాలీ చేశాయి. యూఎస్ ఫెడ్ తన డోవిష్ పాలసీ విధానాన్ని కొనసాగిస్తుందన్న అంచనాలు అంతర్జాతీయంగా నెలకొని ఉన్నాయి. ఇది లిక్విడిటీ కొనసాగేలా చేస్తుంది. ముఖ్యంగా భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగేలా చేస్తుంది. మార్కెట్ల పనితీరుకు లిక్విడిటీయే చోదకంగా ఉంది. కనుక ఫెడ్ నిర్ణయం సానుకూలంగా దోహదం చేయనుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. లాభాల రిలయన్స్: రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో సానుకూల సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. మరొక శాతం లాభపడి ఈ స్టాక్ బీఎస్ఈలో 2177.45 వద్ద క్లోజయింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.13,80,373 కోట్లుగా ఉంది. విశ్లేషకులు ఏమంటున్నారు..? ‘‘గత ప్రారంభంలో ఎగువవైపునున్న అంతరం 11,245, అదే విధంగా మార్చి 6 నాటి ఆరంభ దిగువవైపు అంతరాన్ని సూచీలు పూర్తి చేసేశాయి. సమీప కాలంలో మరింత అప్‌సైడ్‌కు ఇది సంకేతంగా కనిపిస్తోంది. నిఫ్టీ–50కి ఫిబ్రవరి 28 నాటి డౌన్గ్యాప్ ఓపెనింగ్ 11385–11535 శ్రేణి నిరోధంగా వ్యవహరిస్తుంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు. ‘‘నిఫ్టీ–50 తక్షణ నిరోధ స్థాయి 11,250కు ఎగువన క్లోజయింది. అంతేకాదు గత 89 ట్రేడింగ్ సెషన్లలో అత్యధిక రోజువారీ ముగింపు ఇది. ఇండెక్స్ సంబంధించి అధిక శాతం ధోరణి సానుకూలంగానే ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపారియా తెలిపారు. -
ఐసీఐసీఐ -యస్ బ్యాంక్ షేర్ల పతనం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 361 దిగువన ట్రేడవుతోంది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఐసీఐసీఐ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 2599 కోట్లను అధిగమించింది. ప్రధానంగా జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థల పనితీరు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 సంబంధ ప్రొవిజన్లు రూ. 5,550 కోట్లు అదనంగా నమోదుకావడం ప్రతికూల అంశమని తెలియజేశారు. క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9280 కోట్లను తాకింది. యస్ బ్యాంక్ ఈ నెల 15-17 మధ్య ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) చేపట్టిన ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 10 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 12.30 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఎఫ్‌పీవో ధర రూ. 12 సమీపానికి చేరింది. కాగా.. ఎఫ్‌పీవో ద్వారా బ్యాంకు రూ. 14,272 కోట్లను సమీకరించింది. ఎఫ్‌పీవోలో భాగంగా బ్యాంక్ షేర్ల అలాట్మెంట్ను పూర్తిచేయడంతో ఇవి ట్రేడింగ్‌కు అందుబాటులోకి వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కౌంటర్లో సుమారు 4.2 కోట్ల షేర్ల సెల్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఎఫ్‌పీవోకు రూ. 12 ధరను ఖరారు చేశాక యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి వారాంతానికల్లా యస్ బ్యాంక్ షేరు 55 శాతం దిగజారినట్లు వివరించారు. -
ఆకర్షణీయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఫలితాలు
ముంబై: ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేసినప్పటికీ.. బ్యాంకు కన్సాలిడేటెడ్ లాభం 24 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా కరోనా కారణంగా చెల్లింపులు రాకపోవచ్చన్న అంచనాలతోనే రూ.5,550 కోట్లను పక్కన పెట్టింది (ప్రొవిజనింగ్). స్టాండలోన్‌గా చూసుకుంటే (అనుబంధ కంపెనీలను మినహాయించి) బ్యాంకు లాభం 36 శాతం వృద్ధితో రూ.2,599 కోట్లుగా నమోదైంది. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో స్వల్ప వాటాలను విక్రయించడం లాభాల వృద్ధికి దోహదపడింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతానికి పైగా పెరిగి రూ.37,939 కోట్లుగా నమోదైంది. మారటోరియం వినియోగించుకున్న రుణ గ్రహీతల శాతం ఏప్రిల్ చివరికి 30 శాతంగా ఉంటే, జూన్ ఆఖరుకు 17.5 శాతానికి తగ్గింది. -
జీతాల పెంపు యోచనలో ఐసీఐసీఐ బ్యాంక్
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్‌రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తన సిబ్బంది జీతాలను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుమారు 80వేల మందికి పైగా ఉద్యోగుల మూలవేతనంపై 8శాతం పెంచనుంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలోనూ బ్యాంకుకు వీరు అందించిన సేవలకు ప్రోత్సాహకంగా వేతనాల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంచుతున్న 8శాతం వేతనం ఈజూలై నుంచి అమల్లోకి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించే ఎం1, అంతకంటే తక్కువ గ్రేడ్ ఉద్యోగులకు ఈ వేతనాల పెంపు ఉంటుందని తెలుస్తుంది. అయితే వేతనాల పెంపు అంశంపై బ్యాంకు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కోవిడ్-19 దెబ్బకు అనేక సంస్థలు వ్యయా నియంత్రణలో భాగంగా సిబ్బందిని తొలగించడం, వేతనాల కోత విధిస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి వారి వేతనాలు పెంచడం అభినందనీయమని కార్పోరేట్ వర్గాలు తెలిపాయి. -
ఐసీఐసీఐలో కోటి వరకు విద్యారుణం
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌లో విద్యా రుణాలు(ఎడ్యుకేషన్ లోన్స్)ను వేగంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వినియోగదారులకు రూ.10లక్షల నుంచి కోటి రూపాయలు అందించే ప్రణాళికను రూపకల్పన చేసింది. ‘ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరిట నిబంధనలు, షరతులతో కొద్ది నిమిషాల్లోనే విద్యా రుణాలను అందించనుంది. పూర్తిగా డిజిటల్ పద్దతిలో విద్యా రుణాల ప్రక్రియను చేపట్టనుంది. దేశీయ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తుంది. అయితే వినియోగదారులు తమ స్థిర డిపాజిట్ల(ఫిక్సడ్ డిపాజిట్స్)లో 90శాతం బ్యాంక్ రుణాలు పొందవచ్చు అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. వేగంగా మంజూరు చేసే రుణాల వల్ల విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని ఐసీఐసీఐ తెలిపింది. కాగా రుణాలు చెల్లించడానికి పది సంవత్సరాల కాలపరిమితిని బ్యాంక్ విధించింది. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 ఇ ప్రకారం.. 8 సంవత్సరాల వరకు బ్యాంక్‌లో విద్యా రుణాలకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాగా అంతర్జాతీయ సంస్థలలో ప్రవేశం పొందే విద్యార్థుల కోసం, బ్యాంక్ రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ.కోటి వరకు, దేశీయ సంస్థలలో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పొందవచ్చు.కాగా విద్యారుణాలను అప్లై చేయాలంటే..మొదటగా వినియోగదారులు ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ సైట్లో రుణాలకు సంబంధించిన ఆఫర్‌ను అధ్యయనం చేయాలి. వినియోగదారులకు కావాల్సిన రుణం, చెల్లించే కాలపరిమితి, ప్రవేశం పొందిన విశ్వవిద్యాలయం పేరు తదితర వివరాలను అప్లికేషన్ ఫార్మ్‌లో నమోదు చేయాలి. తరువాత విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్థితో సంబంధం వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంక్‌కు సంబంధించిన నిబంధనలు, షరతులను అంగీకరిస్తే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా బ్యాంక్ దృవీకరించిన నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక, విద్యారుణాలు పొందిన మంజూరు లేఖను బ్యాంక్ వినియోగదారులకు అందిస్తుంది. (చదవండి: ‘బోగస్’తో బ్యాంక్‌కు టోకరా!) -
ఐబీ హౌసింగ్- ఐసీఐసీఐ.. స్పీడ్
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎన్బీఎఫ్సీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్ కనిపిస్తోంది. గత వారాంతాన ఎఫ్‌పీఐలు కంపెనీలో వాటా కొనుగోలు చేసిన వార్తలు ఈ కౌంటర్‌కు జోష్నిస్తుంటే.. బీమా అనుబంధ విభాగంలో వాటా విక్రయ వార్తలతో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం.. ఐబీ హౌసింగ్ బల్క్ డీల్ ద్వారా గత వారాంతాన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో విదేశీ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) 1.05 శాతం వాటాకు సమానమైన దాదాపు 45.23 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. షేరుకి రూ. 184.76 సగటు ధరలో వీటిని కొనుగోలు చేయగా.. యూకే సంస్థ బ్లాక్‌రాక్ అడ్వయిజర్స్‌కు చెందిన ఐషేర్స్ 1.66 శాతం వాటాను రెండు ఈటీఎఫ్‌ల ద్వారా కొనుగోలు చేసింది. ఐబీ హౌసింగ్‌లో ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ UCITS 25.69 లక్షల షేర్లు, ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ 45.59 లక్షల షేర్లను.. షేరుకి 189.51 సగటు ధరలో సొంతం చేసుకున్నాయి. షేరు దూకుడు విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) వాటా కొనుగోలు వార్తలతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐబీ హౌసింగ్ షేరు 21 శాతం దూసుకెళ్లి రూ. 246 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 254 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమానం 2.9 కోట్ల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.24 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఎఫ్‌పీఐల వాటా కొనుగోలు వార్తలతో శుక్రవారం సైతం ఐబీ హౌసింగ్ కౌంటర్లో భారీ ట్రేడింగ్ నమోదైంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 202 ఎగువన ముగిసింది. ఈ నెల 26 నుంచీ ఐబీ హౌసింగ్ షేరు నిఫ్టీ మిడ్‌క్యాప్-100 ఇండెక్స్‌లో చోటు దక్కించుకోనుంది. గత మూడు నెలల్లో ఈ షేరు ఏకంగా 160 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఐసీఐసీఐ బ్యాంక్ బీమా అనుబంధ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో 1.5 శాతం వాటాను విక్రయించినట్లు మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. తద్వారా సుమారు రూ. 840 కోట్లను సమీకరించినట్లు తెలియజేసింది. దీంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో బ్యాంక్ వాటా 51.4 శాతానికి పరిమితమైనట్లు పేర్కొంది. ఇక మరో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్‌లోనూ 3.96 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 2250 కోట్లను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 371 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 375 వరకూ పెరిగింది. వెరసి వరుసగా మూడో రోజు లాభాలతో కదులుతోంది. కాగా.. మరోపక్క ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేరు సైతం 4 శాతం జంప్‌చేసి రూ. 406 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 419 వరకూ ఎగసింది. ఐసీఐసీఐ లంబార్డ్ షేరు 0.5 శాతం పుంజుకుని రూ. 1277 వద్ద కదులుతోంది. -
ఐసీఐసీఐ లాంబార్డ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా విక్రయం
దేశీయ ప్రైవేట్ రంగఐసీఐసీఐ బ్యాంక్ తన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌లో 3.96శాతం వాటాను విక్రయించింది. ఈ వాటా విక్రయం మొత్తం రూ.2250 కోట్లుగా ఉంది. వీలు చిక్కిన ప్రతిసారీ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడాన్ని పరిశీస్తామని త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కోంది. అందులో భాగంగా తన ఇన్సూరెన్స్ సంస్థలో 3.96 వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ‘‘ఇందుకు ముందు బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానానికి అనుగుణంగా నేడు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మొత్తంలో వాటాలో 3.96శాతానికి సమానమైన 1.8కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడమైంది. ఈ వాటా అమ్మకం ద్వారా మొత్తం రూ.2250 కోట్లను సమీకరణ చేస్తున్నాము.’’ అని ఎక్చ్సేంజ్‌లకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ అమ్మకంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ హోల్డరింగ్ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51.9శాతానికి దిగివస్తుంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం మార్చి 31నాటికి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్యాంక్ 55.86శాతం వాటాను కలిగి ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కోవిడ్-19 ప్రభావంతో ఈ మార్చి క్వార్టర్లో ప్రోవిజన్లకు రూ.2,725 కోట్లను కేటాయించింది. ఆర్బీఐ ఏప్రిల్ 17 నాడు ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్ చేసిన కేటాయింపు అవసరం కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం గం.2:30ని.లకు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 2శాతం లాభంతో రూ.359 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఐసీఐసీఐ లాంబార్డ్ షేరు మునుపటి ముగింపు(రూ.1276.50)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో రూ.1,259.00 వద్ద ట్రేడ్ అవుతోంది. -
నాస్డాక్ అప్- విప్రో ఏడీఆర్ జూమ్
కరోనా వైరస్‌కు కారణమైన చైనాను విమర్శిస్తున్న ప్రెసిడెంట్ ట్రంప్ తాజా ప్రెస్మీట్లో వాయిస్ తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. వెరసి వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య అటూఇటుగా ముగిశాయి. ఇంట్రాడేలో 25,032 వద్ద కనిష్టాన్ని తాకిన డోజోన్స్ చివరికి 18 పాయింట్లు(0.1 శాతం) నీరసించి 25,383 వద్ద నిలిచింది. ఇక ఎస్అండ్పీ15 పాయింట్లు(0.5 శాతం) బలపడి 3,044 వద్ద స్థిరపడింది. అయితే నాస్డాక్ 121 పాయింట్లు(1.3 శాతం) జంప్‌చేసి 9,490 వద్ద ముగిసింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను దశలవారీగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న అంచనాలు ఇటీవల మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 3 శాతం, జేపీ మోర్గాన్ 2.5 శాతం చొప్పున క్షీణించడంతో శుక్రవారం డోజోన్స్ బలహీనపడగా.. సెమీకండక్టర్ తయారీ కంపెనీలు మార్వెల్ టెక్నాలజీస్ 9 శాతం, ఎన్విడియా 4.6 శాతం చొప్పున జంప్‌చేయడంతో నాస్డాక్ జోరందుకుంది. డోజోన్స్ భళా గత వారం డోజోన్స్ 3.8 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ సైతం 3 శాతం ఎగసింది. నాస్డాక్ దాదాపు 2 శాతం పుంజుకుంది. ఈ నెలలో ఎస్అండ్పీ, డోజోన్స్ 4.5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. నాస్డాక్ మరింత అధికంగా 6.7 శాతం ఎగసింది. కాగా.. ఏప్రిల్‌లో వ్యక్తిగత వ్యయాలు 13.6 శాతం క్షీణించగా.. పొదుపు రేటు 33 శాతం ఎగసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ట్రంప్ ఇలా వైట్‌హౌస్‌కు చెందిన రోజ్‌గార్డెన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో తెగతెంపులు చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థ పూర్తిగా చైనా నియంత్రణలో పనిచేస్తున్నదని విమర్శించారు. యూఎస్‌లో లిస్టయిన చైనా కంపెనీలు ఖాతాలను విభిన్నంగా నిర్వహించడంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. హాంకాంగ్‌కు ఇస్తున్న ప్రత్యేక వాణిజ్య హోదాను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే చైనాతో వాణిజ్య వివాదాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. వేదాంతా అప్ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం లాభాలతో ముగిశాయి. అయితే టాటా మోటార్స్(టీటీఎం) 0.7 శాతం నష్టంతో 5.71 డాలర్ల వద్ద నిలిచింది. కొత్త సీఈవో ఎంపికతో విప్రో లిమిటెడ్ 8.2 శాతం దూసుకెళ్లి 3.31 డాలర్లను తాకగా.. డాక్టర్ రెడ్డీస్ 4 శాతం జంప్‌చేసి 53.44 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 2.6 శాతం ఎగసి 8.7 డాలర్ల వద్ద, వేదాంతా(వీఈడీఎల్) 1.9 శాతం బలపడి 4.88 డాలర్ల వద్ద ముగిశాయి. ఇతర కౌంటర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 1.8 శాతం ఎగసి 41.83 డాలర్ల వద్ద నిలవగా.. ఇన్ఫోసిస్ 0.4 శాతం పుంజుకుని 9.10 డాలర్ల వద్ద స్థిరపడింది. -
సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ శుభవార్త
సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు వృద్ధులకు శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్ల కోసం 'ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ' అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాన్ని గురువారం ప్రవేశపెట్టింది.ఈ డిపాజిట్లపై అదనంగా 0.80 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు సాధారణ డిపాజిట్‌దారుల కంటే సీనియర్ సిటిజన్లకు చెల్లిస్తున్నది 0.50 శాతం అధికం మాత్రమే. 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు వార్షికంగా 6.55 శాతం వడ్డీ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. ఈ పథకం సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే వృద్ధులకు ప్రధాన ఆదాయవనరని తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారిమీద ఉన్న గౌరవంతో కొత్త పథకం ద్వారా వారికి అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నామని ఐసీఐసీఐ లయబిలిటీస్ గ్రూప్ అధిపతి ప్రణవ్ మిశ్రా తెలిపారు. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) సీనియర్ సిటిజన్స్ ప్రత్యేక ఎఫ్డి పథకం ఐదు విషయాలు ఈ పథకం 2020 మే 20 నుండి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో వుంటుంది. ఇది ఒకే డిపాజిట్ మొత్తానికి , కాలానికి సాధారణ ప్రజలకు వర్తించే దానికంటే 80 బేసిస్ పాయింట్లను ఎక్కువ అందిస్తుంది. రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు కొత్త ఎఫ్‌డీల ద్వారా పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. లేదా పాత ఎఫ్‌డిలను పునరుద్ధరించుకోవచ్చు. రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు రూ. 2 కోట్లు లోపు ఎఫ్డీలపై 6.55 శాతం అధిక వడ్డీ రేటును 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో పొందుతారు. ప్రిన్సిపల్ మొత్తం, లేదా అక్రూడ్ వడ్డీపై 90 శాతం రుణాన్ని కస్టమర్లు పొందవచ్చు. ఎఫ్డీ మీద క్రెడిట్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను భారీగా తగ్గించడంతో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు చెల్లించే వడ్డీని పెంచిన విషయం తెలిసిందే. మోసగాళ్లకు చెక్ : మెసెంజర్లో కొత్త ఫీచర్ -
ఈ 2 ఫైనాన్స్ షేర్లకు మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ రేటింగ్
ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ పైనాన్షియల్ షేర్లపై ‘‘బుల్లిష్’’ వైఖరిని కలిగి ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. ఈ రెండు షేర్లపై బ్రోకరేజ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా సమగ్ర నివేదికను ఇప్పుడు పరిశీలిద్దాం... ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఫైనాన్స్ రంగ షేర్లు ప్రదర్శన అంత బాగాలేదు. ఇటీవల స్థూల ఆర్థికవ్యవస్థలో ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనలు ఫైనాన్స్ రంగంలో అధిక స్లిపేజ్‌లు, రుణ వ్యయాలకు దారితీశాయి. ఇంతకు ముందు కార్పోరేట్ ఎన్పీఏలు పెరగడం.. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఫైనాన్స్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు ఎన్బీఎఫ్సీలు, మధ్య స్థాయి బ్యాంకులకు అధిక ఎక్స్పోజర్ను కలిగి ఉంటాయని సిద్ధార్థ నివేదికలో పేర్కోన్నారు. ధీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు మధ్య స్థాయి బ్యాంకులు, ఎన్బీఎబీఎఫ్సీలతో పోలిస్తే ఈ రంగంలో పెద్ద బ్యాంకులుగా పేరొందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే ఈ రెండు బ్యాంకులపై ఎక్స్పోజర్ల ఒత్తిడి స్వల్ప కాలానికే పరిమితమయ్యే ఆస్కారం ఉంది. ఒకటి లేదా రెండు క్వార్టర్లో మాత్రమే షేర్లపై ఎక్స్పోజర్ల ఒత్తిడి ఉండవచ్చు. అలాగే ఆస్తి నాణ్యత, అధిక స్లిప్పేజీలు మాత్రమే కాకుండా ప్రస్తుత వాతావరణంలో మనుగడ కోసం అదనపు మూలధనాన్ని సమీకరించుకోగలవు. కాబట్టి మేము ఈ రంగంలో ప్రధాన షేర్లైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌లను కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు సలహానిస్తున్నామని సిద్ధార్థ తెలిపారు. -
షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కాలంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ తాజాగా తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వివిధ కాల పరిమితుల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్ల వకు కోత విధించినట్లు బ్యాంక్ తెలిపింది. సవరించిన రేట్లు మే 11 నుంచే అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. (తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’) ఐసీఐసీఐ బ్యాంక్ తాజా రేట్ల కోత నిర్ణయంతో ఏడాది కాల పరిమితి డిపాజిట్లపై ఇప్పుడు 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. అదే ఏడాది పైన కాల పరిమితిలోని ఎఫ్డీలపై 5.7- 5.75 శాతం మధ్య వడ్డీని చెల్లించనుంది. మరోవైపు రుణరేట్ల (ఎంసీఎల్ఆర్) ను కూడా తగ్గించే అవకాశం వుందని భావిస్తున్నారు. అటు నిరాశాజనక ఫలితాలతో స్టాక్మార్కెట్లో బ్యాంకు షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు కోత విధించిన సంగతి తెలిసిందే. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) చదవండి : రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే! కరోనా: ఎయిరిండియా ఉద్యోగికి పాజిటివ్ -
వాట్సాప్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ సేవలు
ముంబై : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం ప్రాధాన్యతను చాటుతూ ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను ఇంటి నుంచే పొందేందుకు నూతన సర్వీసును ప్రారంభించామని బ్యాంక్ తెలిపింది. ఐసీఐసీఐ కస్టమర్లు వాట్సాప్ ద్వారా తమ పొదుపు ఖాతాలో నిల్వను, చివరి మూడు లావాదేవీల వివరాలను, క్రెడిట్ కార్డు పరిమితిని చెక్ చేసుకోవచ్చని వెల్లడించింది. వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా కస్టమర్లు వివిధ ఆపర్ల వివరాలు పొందవచ్చని, క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకాన్ని బ్లాక్, అన్‌బ్లాక్ చేసుకోవచ్చని తెలిపింది. బ్రాంచ్‌ను సందర్శించకుండానే తమ కస్టమర్లు బ్యాంకింగ్ అవసరాలను నెరవేర్చుకోవచ్చని, తమ కస్టమర్లకు ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి అన్నారు. చదవండి : రెండు లక్షల వరకు కరోనా మృతులు -
నకిలీ పత్రాలతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు, బోగస్ వ్యక్తులతో రంగంలోకి దిగిన ఓ ఘరానా మోసగాడు ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా వేశాడు. దాదాపు పదేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఈ కేసులో నిందితుల అరెస్టు మాట అటుంచి కనీసం వారెవరో గుర్తించడమూ సాధ్యం కాలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఇన్స్పెక్టర్ ఆర్.గోవింద్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. మొత్తం నలుగురిని నిందితులుగా గుర్తించి, ముగ్గురిని పట్టుకున్నారు. విదేశంలోని జైల్లో ఉన్న మరో నిందితుడి కోసం లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయడానికి నిర్ణయించామని గోవింద్‌రెడ్డి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఆద్యంతం పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన నిందితులు ఈ స్కామ్‌కు పాల్పడ్డారని ఆయన వివరించారు. ఖరీదు చేస్తామంటూ పత్రాలు పొంది... సైదాబాద్ ప్రాంతానికి చెందిన సలావుద్దీన్ వృత్తిరీత్యా రియల్ఎస్టేట్ దళారి. ఈ స్కామ్ మొత్తానికి ఇతడే సూత్రధారిగా ఉన్నాడు. ఇతగాడు 2008 ఆఖరులో తన స్నేహితుడైన హసన్ అలీతో కలిసి ఖైరతాబాద్‌లోని ఏఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు మహ్మద్ రియాసత్ హసన్‌ను సంప్రదించాడు. ఆయన నిర్మించిన ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌ను ఖరీదు చేస్తామంటూ చెప్పారు. న్యాయ సలహా తీసుకోవడానికంటూ ఆ ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలను సేకరించారు. లోన్ వస్తుందో, రాదో చెప్పడానికి ఓ సారి తమ బ్యాంకు వాళ్ళు వచ్చి చూసి వెళ్తారని ఆయనతో చెప్పాడు. ఆ పత్రాల ఆధారంగా వీరిద్దరూ స్కామ్‌కు నాంది పలికారు. ఇక్కడ స్థిరాస్తిని కలిగి, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాటి యజమానులు ఆస్తులు విక్రయించే అధికారం ఇక్కడున్న వారికి దఖలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. దీనికోసం విదేశంలోని యజమాని స్పెషల్ పవరాఫ్ అటార్నీ (ఎస్పీఏ) రూపొందించి పంపిస్తారు. దీన్నే సలావుద్దీన్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. డ్రైవర్ ఫొటోతో ఎస్పీఏ తయారీ... యజమాని రియాసత్ హసన్ విదేశాలకు వెళ్ళినట్లు, ఆయన తన ఫ్లాట్‌ను విక్రయించడానికి ఎస్పీఏ ఇచ్చినట్లు సలావుద్దీన్ నకిలీ పత్రాలు సృíష్టించాడు. గతంలో తనకు ట్యాక్సీలు తీసుకువచ్చిన డ్రైవర్ అబ్దుల్ కవి ఫొటో వినియోగించి, నకిలీ పేర్లు, చిరునామాలతో దీన్ని తయారు చేయించాడు. ఇలా సదరు ఫ్లాట్‌ను విక్రయించడానికి నకిలీ యజమానికి సృష్టించేసిన సలావుద్దీన్... దాన్ని ఖరీదు చేయడానికీ ఓ బోగస్ పార్టీని ‘సిద్ధం చేశాడు’. హైదరాబాద్‌కు చెందిన సర్ఫ్రాజ్ అహ్మద్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని డాక్యుమెంట్లు సిద్ధం చేసిన సలావుద్దీన్... సదరు ఫ్లాట్ ఖరీదు చేయడానికి ఆయన ఆసక్తి చూపినట్లు కథ అల్లాడు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అతడు భారత్‌కు రావడానికి కుదరట్లేదని, ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఉండే తన భార్యకు సదరు స్థిరాస్తి ఖరీదు చేసే అధికారం దఖలు చేస్తూ పత్రాలు పంపినట్లు నకిలీవి తయారు చేశాడు. కమీషన్ ఆశచూపి యువతికి ఎర... తనకు బ్యూటీపార్లర్‌లో పరిచయమైన, అవివాహిత అయిన ఫర్హా దీబాను సర్ఫ్రాజ్ భార్యగా నటించేందుకు ఒప్పించాడు. ఇలా సహకరిస్తే తనకు వచ్చే ‘లాభం’లో కమీషన్ ఇస్తానంటూ ఎరవేసి ఒప్పించాడు. ఆమె ఫొటో, నకిలీ పేరు వివరాలతో గుర్తింపుకార్డులు తయారు చేయించాడు. ఎస్సార్‌నగర్‌లోని సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌కు కవి, ఫర్హా దీబాలను తీసుకువెళ్ళి... ఖైరతాబాద్ ఫ్లాట్‌ను కవి ద్వారా ఫర్హా పేరు మీదకు బదిలీ చేయించాడు. ఈ సేల్‌డీడ్‌ను ఆధారంగా చేసుకుంటూ బేగంపేటలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆశ్రయించి ఫర్హా ద్వారా గృహరుణం దరఖాస్తు చేయించాడు. దీనికి ముందే రియాసత్‌కు చెందిన ఏఎస్ కన్సల్టెన్సీ పేరుతోనే వేరే వ్యక్తుల్ని యజమానులు చూపించి ఓ నకిలీ సంస్థను ఏర్పాటు చేసిన సలావుద్దీన్ ఆ పేరుతో బ్యాంకు ఖాతా కూడా తెరిచాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో... సదరు బ్యాంకు అధికారులు వెళ్ళి ఖైరతాబాద్‌లోని ఫ్లాట్‌ను పరిశీలించారు. ఆ విషయం రియాసత్‌కు తెలిసినప్పటికీ గతంలో సలావుద్దీన్ చెప్పినట్లు వాళ్ళు వచ్చారని భావించాడు. ఫ్లాట్‌ను, పత్రాలను సరిచూసిన బ్యాంకు 2009లో రూ.30 లక్షల రుణం మంజూరు చేస్తూ ఏఎస్ కన్సల్టెన్సీ పేరుతో చెక్కు ఇచ్చింది. దీన్ని తాను తెరిచిన నకిలీ ఖాతాలో వేసిన సలావుద్దీన్ డబ్బు డ్రా చేసుకుని స్వాహా చేశాడు. ఈ మొత్తం నుంచి కొంత హసన్ అలీ, అబ్దుల్ కవి, ఫర్హా దీబాలకు ఇచ్చాడు. రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో అధికారులు ఆ ఫ్లాట్ స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు. దీన్ని రియాసత్ అడ్డుకోవడంతో ఆరా తీయగా జరిగిన మోసం వాళ్ళకు తెలిసింది. దీంతో 2010లో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అసలు నిందితులు ఎవరనేది గుర్తించలేకపోయారు. పదేళ్ళకు వీడిన చిక్కుముడి... ఇటీవల ఈ కేసును సమీక్షించిన ఉన్నతాధికారులు మూసేయవచ్చని నిర్ణయించారు. అయితే వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్–10 ఇన్స్పెక్టర్ ఆర్.గోవింద్‌రెడ్డి మాత్రం తనకు ఓ చాన్స్ ఇవ్వాలంటూ కోరారు. దీనికి సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అనుమతించడంతో పునర్ దర్యాప్తు చేపట్టారు. నిందితులు వివిధ చోట్ల దాఖలు చేసిన నకిలీ గుర్తింపుపత్రాలను అధ్యయనం చేసిన ఇన్స్పెక్టర్ చిన్న క్లూ సంపాదించారు. దీని ఆధారంగా ముందుకు వెళ్ళిన ఆయన సలావుద్దీన్‌తో పాటు కవి, ఫర్హాలను పట్టుకున్నారు. ఈ ఫ్రాడ్ తర్వాత దుబాయ్ వెళ్ళిన హసన్ అలీ అక్కడ ఓ నేరం చేయడంతో ఆ దేశ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారని దర్యాప్తు అధికారి గుర్తించారు. దీంతో ఇతడిపై అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు ఎల్ఓసీ జారీ చేయడంతో పాటు ఈ స్కామ్‌పై ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.4,670 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,874 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్)ఈ క్యూ3లో రూ.4,670 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఎస్సార్ స్టీల్ రుణాలు రికవరీ కావడం, కీలక ఆదాయం పెరగడం దీనికి కారణమని వివరించింది. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.1,605 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు.... నికర వడ్డీ ఆదాయం 24 శాతం అప్... ఈ క్యూ3లో బ్యాంక్ 16 శాతం రుణ వృద్ధిని సాధించింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.77 శాతానికి పెరిగింది. దీంతో నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,545 కోట్లకు ఎగబాకింది. ఇక ఇతర ఆదాయం 19 శాతం పెరిగి రూ.4,043 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 17 శాతం వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 23 శాతం వృద్ధితో రూ.7,017 కోట్లకు పెరిగింది. తగ్గిన మొండి బకాయిలు.... గత క్యూ3లో 7.75 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5.95 శాతానికి తగ్గాయి. ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు రూ.4,363 కోట్లకు ఎగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం. అయితే ఎస్సార్ స్టీల్ రుణాలు రూ.2,000 కోట్ల మేర రికవరీ అయ్యాయి. దీంతో నికరంగా చూస్తే, తాజా మొండి బకాయిల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఇక కేటాయింపులు 51 శాతం తగ్గి రూ.2,083 కోట్లకు చేరాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ3 ఆర్థిక ఫలితాలను శనివారం వెల్లడించింది. ఫలితాలపై సానుకూల అంచనాలతో గత శుక్రవారం 1.1 శాతం లాభంతో రూ.533.95 వద్ద ముగిసింది. -
రెండింతలైన ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభం
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు క్యూ3లో నికర లాభం రెండు రెట్లుకు పైగా పెరిగింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 4,146 కోట్ల లాభాలను నమోదు చేసి అదరహో అనిపించింది. ఏడాది క్రితం అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఇది రూ.1,605 కోట్లుగా వుందని ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం ఆదాయం 17.23 శాతం పెరిగి రూ .23,638 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .20,163.25 కోట్లు. 2019 డిసెంబరు చివరిలో ఎన్పీఏలు 5.95 శాతానికి దిగి రావడంతో బ్యాంక్ ఆస్తి నాణ్యత మెరుగుపడింది. ఇది ఏడాది క్రితం 7.75 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జిన్లు క్యూ 3, 2020 ఆర్థిక సంవత్సరంలో లో 3.77 శాతంగా ఉందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 2019 డిసెంబర్ 31 నాటికి బ్యాడ్ లోన్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టి రూ. 43 453.86 కోట్లుగా ఉన్నాయి, ఇది ఏడాది క్రితం రూ .51 511.47 కోట్లు. నికర ఎన్‌పిఎలు మొత్తం అడ్వాన్స్‌లో 1.49 శాతంగా ఉన్నాయి, 2018 డిసెంబర్ నాటికి ఇది 2.58 శాతంగా ఉంది. క్యూ 3 లో రైట్-ఆఫ్స్ మినహా రికవరీలు, అప్గ్రేడ్లు, ఇతర తొలగింపులు రూ .4,088 కోట్లు. -
చందా కొచర్‌కు మరిన్ని చిక్కులు
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణంలో ఐసీఐసీఐ బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈస్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎండీ చందా కొచర్ నుంచి తామిచ్చిన బోనస్‌ను రికవరీ చేయాలని కోరింది. అలాగే తన తొలగింపు అక్రమమంటూ చందా కొచర్ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. తన తొలగింపు ద్వారా ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొనడం, బ్యాంకు విలువైన స్టాక్ ఆప్షన్‌ను పొందేందుకు, తప్పు దారి పట్టించే ప్రయత్నమని ఐసీఐసీఐ బ్యాంకు తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మేరకు జనవరి 10 న దావా వేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా పడింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా ఆమెను తొలగించిన తరువాత ఏప్రిల్ 2006- మార్చి 2018 వరకు ఆమెకిచ్చిన బోనస్ క్లాబ్యాక్ చేయాలని కోరుతోంది. (క్లాబ్యాక్ అంటే ఏదైనా దుష్ప్రవర్తన లేదా క్షీణించిన లాభాల విషయంలో ఒక ఉద్యోగి నుండి బోనస్ తదితర ప్రోత్సాహక-ఆధారిత వేతనాన్ని కంపెనీ తిరిగి తీసుకోవచ్చు) బ్యాంకు వ్యాపార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి బ్యాంకుతోపాటు వాటాదారులందరికీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించిందనీ, బ్యాంకుకు ప్రతిష్టకు తీరని నష్టం కలిగిందని ఆరోపించింది. తన భర్త దీపక్ కొచర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే వీడియోకాన్ గ్రూపునకు రూ .2,250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ పాత్ర ఉందని బ్యాంకు ఆరోపించింది. కాగా చందా కొచర్ తన పదవీకాంలో వీడియోకాన్‌కు క్విడ్ ప్రో కో ద్వారా చట్టవిరుద్ధంగా రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. అయితే మొదట్లో చందా కొచర్‌కు బాసటగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు జస్టిస్ (రిటైర్డ్) బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2019 జనవరిలో ఏర్పాటు చేసింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఆమెను పదవినుంచి తొలగించడంతోపాటు ఏప్రిల్ 2009- మార్చి 2018 మధ్య ఆమెకు చెల్లించిన అన్ని బోనస్, స్టాక్ ఆప్షన్లను తిరిగి తీసుకోవాలని బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు తన తొలగింపు చట్టవిరుద్ధమని పేర్కొంటూ బ్యాంకు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ (నవంబర్ 30, 2019న)చందా కొచర్ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ నిర్లక్ష్యంతో రూ.43 లక్షలు మాయం
పంజగుట్ట: సికింద్రాబాద్ లోని ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.43,07,535 గళ్లంతయ్యిందని ఎన్నారై రాజా ఉత్తమ్‌కుమార్ అతని న్యాయవాది పీవీ కృష్ణమాచారి ఆరోపించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ..తనకు జరిగిన మోసంపై సచివాలయంలోని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (అడ్జుడికేటింగ్ అధికారి) ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామని, దీనిపై విచారణ చేపట్టిన అధికారులు బ్యాంకుదే బాధ్యతగా నిర్ధారిస్తూ ఖాతానుంచి గళ్లంతైన సొమ్మును 9శాతం వడ్డీతో పాటు కోర్టు ఖర్చులకింద రూ.50వేలు, ఖాతాదారులను మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు మరో రూ.5 లక్షలు అరవై రోజుల్లో చెల్లించాలని ఆదేశించారన్నారు. అయితే బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆస్తులను జప్తు చేసుకోవాలని కోరుతూ సోమవారం అడ్జుడికేటింగ్ అధికారికి వినతిపత్రం అందజేశామన్నారు. 2015లో సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా తెరిచిన తాను రూ.50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసి అమెరికా వెళ్లిపోయినట్లు తెలిపాడు. అదే ఏడాది డిసెంబర్లో ఖాతాను చెక్‌చేసుకోగా పాస్వర్డ్ మారినట్లు సమాచారం అందిందన్నారు. ఈ విషయమై ఐసీఐసీఐ బ్యాంకు విచారణ విభాగాన్ని సంప్రదించగా విచారణ చేసి చెబుతామని చెప్పారని, కొన్ని రోజుల తర్వాత పాస్వర్డ్ మార్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. తీరా ఖాతాలో చూసుకోగా రూ.43,07,535 విత్‌డ్రా అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయమై బ్యాంకు అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో 2016లో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భాస్కర్ రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రూ. 2 లక్షలు వసూలు చేశారన్నారు. నిందితుల్లో కొందరు విదేశాలకు వెళ్లడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు. బ్యాంకు, పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఖాతా వివరాలు భద్రంగా ఉంచాల్సిన బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగిందని ఆరోపిస్తూ 2017లో డిసెంబర్లో రాష్ట్ర అడ్జుడికేటింగ్ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. వారు పూర్తిస్థాయిలో విచారించి ఖాతాదారుని డబ్బులు భద్రపర్చడంలో బ్యాంకు విఫలమైందని నిర్ధారిస్తూ గళ్లంతైన సొమ్ముకు 9 శాతం వడ్డీ, ఖర్చులకింద రూ.50వేలు, ఖాతాదారుడిని మానసికంగా బాధపెట్టినందుకు రూ. 5 లక్షలు 60 రోజుల్లో చెల్లించాలని 2019 అక్టోబర్‌లో తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. ఈ గడువు ముగిసినా బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేదని, ఈ నేపథ్యంలో బ్యాంకు ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో న్యాయవాది రజని, మునీష్ వాజ్‌పేయి పాల్గొన్నారు. -
చందా కొచర్ ఖరీదైన ఫ్లాట్ గోవిందా!
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వీడియోకాన్ రుణాల జారీ విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్య తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) చందాకొచర్‌కు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఎటాచ్ చేసింది. ఇందులో ముంబైలోని ఖరీదైన ఆమె ఫ్లాట్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఐసీఐసీఐ- వీడియోకాన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్ తనపదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. వీడియోకాన్ గ్రూపునకు సుమారు 3,250 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అయితే తనను పదవినుంచి తొలగించడంపై చందా కొచర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. -
ఐసీఐసీఐపై కౌంటర్ వేయనున్న చందా కొచర్
ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్ తనను సీఈవోగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 2009 నుంచి 2019 వరకు పొందిన బోనస్‌లను తిరిగి ఇచ్చేయాలన్న ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయంపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రంజిత్, జస్టిస్ కార్నిక్‌తో కూడిన దర్మాసనం వాదనలు విననుంది. మరోవైపు హేతుబద్దమైన ఆధారాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా తనను తొలగించడంపైనే ఆమె పిటిషన్‌లోని ముఖ్య అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చందాకొచర్ తరుపున విక్రమ్ నన్‌కాని, సుజయ్ కంతవాలా వాదనలు వినిపిస్తుండగా ఐసీసీఐ బ్యాంక్ తరపున డారియస్ కమ్‌బాటా వినిపించనున్నారు. కాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న చందాకొచర్‌పై వీడియోకాన్ రుణాలకు సంబంధించిన క్రిడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చందా కొచర్, భర్త దీపక్ కొచర్‌తో పాటు ఇతర బంధువులను కూడా చార్జ్ షీటు చేర్చింది. అయితే ప్రారంభంలో చందా కొచర్‌ను వెనకేసుకొచ్చిన బోర్డు, ఆరోపణలపై విచారణకు నియమించిన మాజీ న్యాయమూర్తి బీఎన్ కృష్ణ ఆధ్వర్యంలోని స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక అనంతరం ఆమెపై వేటు వేసిన సంగతి తెలిసిందే. -
రికార్డుల ర్యాలీ..
స్టాక్ మార్కెట్లో ఆల్‌టైమ్ హై రికార్డ్ల జోరు కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల దన్నుతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమైనా, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు రోజు కావడంతో ఒడిదుడుకులు చోటుచేసుకున్నా,...సూచీలు లాభాల్లోనే ముగిశాయి. నేడు(శుక్రవారం) వెల్లడి కానున్న ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 జీడీపీ గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ, సూచీలు ముందుకే దూసుకుపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 41,130 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 12,151 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగియడం ఇది వరుసగా రెండో రోజు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం కలసివచ్చింది. ఒక్క వాహన సూచీ మినహా మిగిలిన అన్ని నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్లు పతనమైనా.... హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి మద్దతునిచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. దీనికి ప్రతిగా చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే పెరుగుతున్న అంతర్జాతీయ లిక్విడిటీ మన మార్కెట్‌కు ఊతాన్నిస్తోందని విశ్లేషకులంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానివ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. నవంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,164, నిఫ్టీ 12,159 పాయింట్ల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఇవి రెండూ ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. ► ధరలు పెంచే అవకాశాలున్నాయన్న వార్తలతో లోహ షేర్లు పెరిగాయి. ► ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 25 శాతం ఎగసి రూ.334 వద్ద ముగిసింది. గత నెల 17న రూ.166కు పడిపోయిన ఈ షేర్ నెలన్నర వ్యవధిలోనే 110% పెరగడం విశేషం. ► ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 2.6 శాతం లాభంతో రూ. 519 వద్ద ముగిసింది. ► పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, అదానీ గ్రీన్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, దివీస్ ల్యాబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. రూ.1.87 లక్షల కోట్లు పెరిగిన సంపద స్టాక్ మార్కెట్లో రికార్డ్ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో రూ.1.87 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ రెండు రోజుల్లో రూ.1,87,371 కోట్లు పెరిగి రూ.155.58 లక్షల కోట్లకు ఎగబాకింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ ‘మహా లోన్ ధమాకా’
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. తక్షణ రుణ మంజూరీ సేవలను అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మహా లోన్ ధమాకా’ పేరిట ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,000 రుణ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. వ్యక్తిగత, వాహన, బంగారు రుణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను ఈ క్యాంప్స్ ద్వారా జారీ చేయనున్నట్లు వివరించింది. హ్యుందాయ్ మోటార్స్ వంటి కంపెనీలతో ఏర్పాటుచేసుకున్న ఒప్పందం మేరకు కస్టమర్లు కాకపోయినా.. ప్రత్యేక ఆఫర్లతో మేళా వద్ద రుణాలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్యాంప్స్ ఉండనున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) అనుప్ బాగ్చి పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని.. వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223, ఏటీఎంలు 1,580 ఉన్నాయని తెలిపింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 1,131 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 6 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,205 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.1,131 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.31,915 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.37,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.909 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 28 శాతం తగ్గి రూ.655 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం రూ.18,262 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.22,760 కోట్లకు ఎగసిందని వివరించింది. రూ.3,712 కోట్ల పన్ను వ్యయాల కారణంగా లాభం తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.6,417 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.8,057 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.33 శాతం నుంచి 3.64 శాతానికి చేరిందని తెలిపింది. మెరుగుపడిన రుణ నాణ్యత... నికర లాభం తగ్గినా, ఈ బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 8.54 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 6.37 శాతానికి అలాగే నికర మొండి బకాయిలు 3.65 శాతం నుంచి 1.60 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గాయి. మొత్తం కేటాయింపులు రూ.3,994 కోట్ల నుంచి రూ.2,506 కోట్లకు తగ్గాయి. ఆల్‌టైమ్ హైకి ఐసీఐసీఐ బ్యాంక్... నికర వడ్డీ ఆదాయం, నికర వడ్డీ మార్జిన్లు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.473ను తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.469 వద్ద ముగిసింది. -
28 శాతం క్షీణించిన ఐసీఐసీఐ లాభం
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను మోదు చేసింది. క్యూ2లో బ్యాంక్ నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 655 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 909 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 26 శాతం ఎగసి రూ. 8057 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 3994 కోట్ల నుంచి రూ. 2507 కోట్లకు క్షీణించాయి. ఇతర ఆదాయం రూ. 3156 కోట్ల నుంచి రూ. 4194 కోట్లకు చేరింది. పన్ను వ్యయాలు రూ. 346 కోట్ల నుంచి రూ. 3712 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 13 శాతం రుణ వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 6.49 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.77 శాతం నుంచి 1.74 శాతానికి నీరసించాయి. స్థూల స్లిప్పేజెస్ రూ. 2779 కోట్ల నుంచి రూ. 2482 కోట్లకు వెనకడుగు వేశాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.61 శాతం నుంచి 3.64 శాతానికి మెరుగుపడ్డాయి. కాగా ఫలితాలపై అంచనాలతో శుక్రవారం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 469 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 471 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఫలితాల ప్రభావం దివాలీ మూరత్ ట్రేడింగ్‌లో కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఐసీఐసీఐకు సెబీ షాక్
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకునకు సెబీ షాకిచ్చింది. ఒప్పందాలను దాచి పెట్టిందన్న కారణంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బ్యాంకుతో పాటు, దాని కంప్లెయిన్స్ అధికారి సందీప్ బాత్రాకు భారీ జరిమానా విధించింది. ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్నిరిపోర్టు చేయడంలో ఆలస్యం, ఇతర కొన్ని ముఖ్యమైన విషయాలను బహిర్గతం చేయడంలో లోపాల కారణంగా బ్యాంకునకు రూ. 10లక్షలు, సందీప్ బాత్రాకు రూ. 2 లక్షలు మొత్తం రూ.12 లక్షల జరిమానా విధించింది. కాగా 2010, మే 18న బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్‌తో ఐసీఐసీఐ బ్యాంకు బైండిగ్ ఇంప్లిమెంటేషన్ ఒప్పందానికి సంతకాలు చేసింది. అయితే ఈ ఒప్పందాన్ని రెగ్యులేటరీ సంస్థలకు నివేదించడంలో ఆలస్యం చేసింది. బైండింగ్ ఒప్పందంపై సంతకం చేసిన సమాచారాన్ని సకాలంలో స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలో ఐసీఐసీఐ బ్యాంకు విఫలమైందని దర్యాప్తులో తేలిందని సెబీ తన ఆర్డర్లో తెలిపింది. -
వాట్సాప్ ‘పేమెంట్స్’కు లైన్ క్లియర్!
బెంగళూరు: మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపుల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించినట్లుగా పేమెంట్ డేటాను భారత్‌లోనే భద్రపర్చేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత వ్యవస్థ ద్వారా వాట్సాప్ ఈ సేవలు అందించనుంది. ఈ సర్వీసుల కోసం ముందుగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రోజుల్లో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లతో పాటు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా జట్టు కట్టనున్నట్లు సమాచారం. ‘డేటా లోకలైజేషన్‌కి సంబంధించిన పనులన్నీ వాట్సాప్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆడిట్ ప్రక్రియ నడుస్తోంది. ఆడిటర్లు తమ నివేదికను రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించిన తర్వాత వాట్సాప్ తన పేమెంట్ సర్వీసులను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు అవకాశం ఉంటుంది‘ అని సంబంధిత వర్గాలు వివరించాయి. గతేడాదే పైలట్ ప్రాజెక్టు.. అమెరికన్ సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్ 2018లోనే ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో యూజర్లకు పేమెంట్ సేవలు అందించడం ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో తమ యాప్‌లో పేమెంట్స్ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై వివాదం రేగింది. నియంత్రణ సంస్థ ఆదేశాలకు విరుద్ధంగా డేటాను భారత్‌లో కాకుండా విదేశాల్లో భద్రపరుస్తుండటం, యూజర్ల డేటా భద్రతపై అనుమానాలు, వాట్సాప్‌లో తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్‌గా మారుతుండటం తదితర అంశాలు ఈ ప్రాజెక్టుకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ప్రధానమైన డేటా లోకలైజేషన్ అంశంతో పాటు ఇతరత్రా సమస్యలన్నింటినీ వాట్సాప్ పరిష్కరించుకోవడంతో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెనక్కి తగ్గని ఆర్బీఐ .. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. చెల్లింపుల సేవలు అందించే సంస్థలు ముందుగా భారత్‌లో డేటా స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆడిట్ నివేదికను కూడా సమర్పించిన తర్వాతే సర్వీసులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే విదేశాల్లోని సర్వర్లలో డేటా నిల్వ, ప్రాసెస్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు..మళ్లీ భారత్‌లో కూడా ప్రత్యేకంగా డేటా స్టోరేజీ చేయాలంటే శ్రమ, వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని, తమకు మినహాయింపునివ్వాలని ఆర్బీఐని కోరాయి. కానీ భారత యూజర్ల డేటా భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించి తీరాల్సిందేనంటూ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కావాలంటే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేసుకోవచ్చని, అయితే ఆ తర్వాత 24 గంటల్లోగా భారత్‌లోని సిస్టమ్స్‌లోకి బదలాయించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో దారికొచ్చిన అంతర్జాతీయ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ డేటా లోకలైజేషన్ నిబంధనల ప్రకారం భారత్‌లో తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ కూడా డేటా స్థానికత మార్గదర్శకాలను పాటిస్తూ ఈ మద్యే యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసులు ప్రారంభించింది. ఇందుకోసం యాక్సిస్ బ్యాంక్‌తో జట్టు కట్టింది. తాజాగా వాట్సాప్ కూడా అదే బాటలో స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. ఇలా అంతర్జాతీయ దిగ్గజాలు నిర్దేశిత నిబంధనలు పాటించేలా చేయడంలో రిజర్వ్ బ్యాంక్ విజయం సాధించినట్లయిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజా గణాంకాల ప్రకారం దేశీయంగా మొత్తం 39 థర్డ్ పార్టీ యాప్స్.. పేమెంట్స్ సర్వీసులు అందిస్తున్నాయి. గూగుల్ పే, అమెజాన్, ఉబెర్, ఓలా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. -
ఆర్బీఐ ఎఫెక్ట్: డిపాజిట్లపై వడ్డీరేటు కోత
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మానిటరీ రివ్యూలో 25 పాయింట్ల రెపో రేట్ కట్ తరువాత దేశీయ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిప్ బ్యాంకు, కోటక్ మహీంద్ర , హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై వినియోగదారులకు చెల్లించే వడ్డీరేటు స్వల్పంగా తగ్గించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్ల కోసం ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై 10 -25 బిపిఎస్ మధ్య వడ్డీ రేట్లను తగ్గించింది. 61-90 రోజులు, 91-120 రోజులు, 121-184 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అదేవిధంగా, 390 రోజుల నుండి 2 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై కొత్త రేటు 7.10 శాతం నుండి 7 శాతానికి పడిపోయింది, 2-3 సంవత్సరాల డిపాజిట్లపై 20 బిపిఎస్ నుండి 7.3 శాతానికి తగ్గింది. యాక్సిస్ బ్యాంకు దేశీయ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ రూ .2 కోట్ల లోపు ఒక సంవత్సరం మెచ్యూరిటీలపై డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించామని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు, బ్యాంక్ ఇప్పుడు 1 సంవత్సరం డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ చెల్లించనుంది. ఈ సవరించిన రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక అడుగు ముందుకు వేసి, బిల్ల డిపాజిట్ కాలాన్ని ఆఫర్లో ఉన్న మొత్తం పదవీకాలం 20 నుండి 18నెలలకు తగ్గించింది. 18 నెలలు- 2 సంవత్సరాల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు 7.10 శాతంగా ఉంది. గతంలో మూడు వేర్వేరు 391 రోజుల నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ 7.20 శాతంగా ఉంది. అదేవిధంగా, 2-3 సంవత్సరాల దేవిధంగా, 2-3 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లు ఇప్పుడు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించి ప్రస్తుతం 7శాత వడ్డీని చెల్లిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కూడా డిపాజట్లపై వడ్డీరేటును తగ్గించింది. ఈ సవరించిన రేట్లు జూన్12నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 2కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై చెల్లించేవడ్డీరేటు 7.30శాతంగా ఉంది. 2-3 ఏళ్ల డిపాజిట్లపై 7.25 శాతానికి తగ్గించింది. 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5శాతం వడ్డీని చెల్లిస్తుంది.