kill people
-
12 మందిని కాల్చి ఆపై ఆత్మహత్య
పొడ్గొరిక(మాంటెనెగ్రో): నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్న వేళ మాంటెనెగ్రోలోని సెటింజె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. అకో మార్టినోవిక్(45) అనే వ్యక్తి ఉన్మాదిగా మారి బార్ యజమాని, అతడి ఇద్దరు పిల్లలతోపాటు సొంత కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకున్నాడు. స్థానిక బార్లో బుధవారం ఉదయం నుంచి మార్టినోవిక్ గడిపాడు. సాయంత్రం గొడవకు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి తుపాకీ తీసుకుని బార్లోకి ప్రవేశించిన అతడు బార్‌లోని వారిపైకి కాల్పులకు దిగాడు. అనంతరం బయటకు వెళ్లి మరో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. పోలీసులు వెంబడించడంతో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడ్గొరికకు వెళ్లాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. హింసా ప్రవృత్తి, చంచల స్వభావి అయిన మార్టినోవిక్పై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. యూరప్‌లోని చిన్న దేశం మాంటెనెగ్రో జనాభా 6.20 లక్షలు. ఆయుధాలను కలిగి ఉండటం ఇక్కడో సంప్రదాయం. తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ నేరాలు జరుగుతుంటాయి. తాజా ఘటన జరిగిన సెటింజెలోనే 2022 ఆగస్ట్‌లో ఓ దుండగుడు ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని కాల్చి చంపాడు. ఓ వ్యక్తి సకాలంలో అతడిని కాల్చి చంపడంతో మారణ హోమానికి పుల్‌స్టాప్ పడింది. -
శిథిలాల్లో 30 మృతదేహాలు
బీరుట్: లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ భవనం నేలమట్టమైంది. బుధవారం సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న కనీసం 30 మృత దేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కిందే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా చేపట్టిన ఈ దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. తీరప్రాంత సిడాన్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పట్టణంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి చేసిన దాఖలాలు లేవు. ఇలా ఉండగా, లెబనాన్‌లోని హెజ్బొల్లా సాయుధ గ్రూపు బుధవారం ఇజ్రాయెల్‌పైకి కనీసం 10 రాకెట్లను ప్రయోగించింది. దీంతో, టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి. ఒక రాకెట్ శకలం సెంట్రల్ ఇజ్రాయెల్ నగరం రాననలోని పార్కు చేసిన కారుపై పడింది. టెల్ అవీవ్‌లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలోని బహిరంగ ప్రాంతంలో రాకెట్లు పడ్డాయని మీడియా తెలిపింది. విమానాల రాకపోకలు మాత్రం కొనసాగాయని పేర్కొంది. రాకెట్ల దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సహాయక బృందాలు తెలిపాయి. -
స్పెయిన్‌లో వర్ష బీభత్సం
బార్సెలోనా: కుండపోత వర్షాలు, వడగళ్ల వానలతో స్పెయిన్ అతలాకుతలమవుతోంది. ఆకస్మిక వరదలు మంగళవారం దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. కనీసం 95 మందికి పైగా బలైనట్టు సమాచారం. ఒక్క వాలెన్సియా ప్రాంతంలోనే బుధవారం ఒక్క రోజే మృతుల సంఖ్య 62కు చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే పలువురి మృతదేహాలు దొరికినట్టు తెలిపారు. ఎంతోమంది గల్లంతైనట్టు చెప్పారు. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అక్కడ మరెంతో మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల భారీగా పెరిగేలా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 320 మి.మీ. వర్షం పడింది! దాంతో మలగా నుంచి వాలెన్సియా దాకా ఎక్కడ చూసినా నదులుగా మారిన రోడ్లు, కూలిన గోడలు, కొట్టుకుపోతున్న కార్లతో ఎక్కడ చూసినా పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల గ్రౌండ్ ఫ్లోర్లన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లన్నీ వరద పాలై కొట్టుకుపోతున్నాయి. స్పెయిన్ ఇంతటి వరదల బారిన పడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. వరదలో చిక్కిన వారిని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కాపాడుతున్నారు. ప్రభావి త ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసర సైనిక బృందం నుంచి వెయ్యి మంది సిబ్బందిని నియోగించారు. ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గురువారం తీవ్ర వర్షసూచనలున్నాయి.This is SPAIN, most of you have been here.Demand #ClimateAction & don’t put up with #FossilFuel company misinformation.Flash floods in Spain leave at least 51 people dead.https://t.co/UEO9y7iPl3 pic.twitter.com/WqBikKltbM— Dr Jill Belch (@JillBelch) October 30, 2024రవాణా కుదేలుఆకస్మిక వరదల దెబ్బకు ఏకంగా పలు నదులపై బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దాంతో స్పెయిన్ అంతటా రవాణా వ్యవస్థ కుదేలైంది. రైలు, విమాన సేవలు ప్రభావితమయ్యాయి. మలగా సమీపంలో 300 మంది పై చిలుకు ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ ట్రెయిన్ పట్టాలు తప్పింది. దాంతో వాలెన్సియా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, పార్కులను మూసేస్తున్నట్లు, క్రీడా కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు వాలెన్సియా సిటీ హాల్ తెలిపింది. అండలూసియాలో కొన్ని ప్రాంతాల్లో రెండో అతి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో చాలా మంది గల్లంతయ్యారని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్నారు. బాధితులను ఉద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు.నిన్నటిదాకా కరువు...స్పెయిన్ కొన్నేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితుల బారిన పడింది. తాజాగా గత సీజన్లో కొనసాగిన కరువు దెబ్బ నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే ఇలా వరదలు వచ్చి పడ్డాయి. వెచ్చని మధ్యధరా జలాలపై చల్లని గాలి కారణంగా ‘కోల్డ్ డ్రాప్’తో ఏర్పడ్డ క్యుములోనింబస్ మేఘాలు ఈ ఆకస్మిక వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి విపరీత సంఘటనలు తరచుగా, తీవ్రస్థాయిలో జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.SPAIN — The death toll from devastating flash floods in Spain’s eastern region of Valencia has risen to 51, with heavy rains submerging roads and sweeping away cars. The torrents, which followed an intense downpour, overwhelmed local infrastructure, turning town streets into… https://t.co/VwIMQh2FMq pic.twitter.com/yxHl0upKi8— News is Dead (@newsisdead) October 30, 2024క్రెడిట్స్: News is Dead Our thoughts are with Spain in the wake of the tragic flash floods. We extend our deepest condolences to those who have lost loved ones and express our gratitude to the rescuers working tirelessly to aid those affected. 🇪🇸 pic.twitter.com/c3RRSwH8OQ— EPP (@EPP) October 30, 2024 -
ఫిలిప్పీన్స్‌లో వరదలు.. 23 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్ ఈశాన్య ప్రాంతాన్ని ట్రామి తుపాను అతలాకుతలం చేస్తోంది. బికోల్ ప్రాంతంతోపాటు క్వెజాన్ ప్రావిన్స్‌లో నీట మునిగిన ఘటనల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగా నగరంలోనే ఏడుగురు చనిపోయారు. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే నమోదైందని అధికారులు తెలిపారు. ఆల్బే ప్రావిన్స్‌లో మయోన్ అగ్ని పర్వతం నుంచి వెల్లువెత్తుతున్న బురద ప్రవాహం అనేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది. ఇళ్లపైకి చేరిన వారిని, వరదలో చిక్కుకున్న వారిని యంత్రాంగం మోటారు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ట్రామి తుపానుతో 75,400 మంది నిరాశ్రయులయ్యారని మొత్తం 20 లక్షల మందిపై ప్రభావం చూపిందని ప్రభుత్వం తెలిపింది. బుధ, గురు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. చాలా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సాయం అందించడం కూడా కష్టంగా మారిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది. -
మయన్మార్‌లో పడక మునక..
బ్యాంకాక్: అండమాన్ సముద్రంలో ఆదివారం మయన్మార్‌కు చెందిన పడవ మునిగిన ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. తీర ప్రాంత పట్టణం క్యావుక్కర్లో గత వారం రోజులుగా సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల గెరిల్లాలకు మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఈ పట్టణం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 75 మంది ప్రజలు దక్షిణ ప్రాంత టనింథర్యిలోని తీర పట్టణం మెయిక్కు పడవలో బయలుదేరారు. అలల తాకిడి తీవ్రతకు పావు గంటలోనే పడవ ప్రమాదానికి గురైంది. సమీప గ్రామాల వారు వచ్చి సుమారు 30 మందిని కాపాడారు. ఎనిమిది మృతదేహా లను వెలికి తీశారు. మరో 20 మంది జాడ తెలియాల్సి ఉంది. పడవ సామర్థ్యం 30 నుంచి 40 మంది మాత్రమే కాగా, అందుకు మించి జనం ఎక్కడం, వారి వెంట సామగ్రి ఉండటంతో బరువు పెరిగి ప్రమాదానికి దారితీసిందని చెబుతున్నారు. క్యావుక్కర్ సమీపంలోని కియె గ్రామంపై బుధవారం ఆర్మీ వైమానిక దాడులు జరిపిందని, దీంతో వేలాదిగా జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని హక్కుల గ్రూపులు అంటున్నాయి. -
స్కూలు, క్లినిక్‌లపై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్/బీరుట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గురువారం ఒక స్కూలు, క్లినిక్‌లపై జరిగిన దాడుల్లో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. శరణార్థులు తలదాచుకుంటున్న డెయిర్ అల్– బలాహ్లోని స్కూలు భవనంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 28 మంది చనిపోగా, 54 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి, ఏడుగురు మహిళలున్నట్లు అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరణార్థులకు సాయం అందించే విషయమై ఓ సంస్థ ప్రతినిధులు శిబిరం నిర్వాహకులతో చర్చిస్తున్న సమయంలో భవనంపై దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఉదయం 11.20 గంటల సమయంలో ఘటన జరిగినప్పుడు స్కూలు భవనంలో సుమారు 3 వేల మంది ఉన్నట్లు పాలస్తీనియన్ రెడ్ క్రీసెంట్కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ హిషామ్ అబూ హోలీ తెలిపారు. దాడి తీవ్రతకు మృతదేహాలు ముక్కముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడిపోయాయన్నారు. ఛిద్రంగా మారిన శరీర భాగాలనే ఏరి ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి భయానక పరిస్థితిని హిషామ్ వివరించారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారన్నారు. మొత్తం మూడంతస్తులకు గాను ఒకటో ఫ్లోర్లో శిబిరం పరిపాలన సిబ్బంది ఉండగా, మిగతా రెండంతస్తుల్లోనూ శరణార్థులే తలదాచుకుంటున్నారన్నారు. మొదటి అంతస్తు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. కానీ, దాడి తీవ్రతకు రెండు, మూడు అంతస్తులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వివరించారు. మరో ఘటనలో..గాజా నగరం పశి్చమాన ఉన్న అల్–రిమల్ క్లినిక్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన లక్షిత దాడిలో ఆరుగురు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారని గాజాలోని అంబులెన్స్ సరీ్వస్ ప్రతినిధి పరేస్ అవాద్ తెలిపారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి: 11 మంది మృతి బీరుట్: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ గురువారం చేసిన రెండు వేర్వేరు దాడుల్లో 11 మంది మృతి చెందారని, 48 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రస్ అల్–నబాలో ఓ ఎనిమిది అంతస్తుల భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించగా.. అపార్ట్మెంట్ కిందిభాగం దెబ్బతింది. -
ఇజ్రాయెల్ దాడుల్లో 51 మంది మృతి
టెల్ అవీవ్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల దాడి మూడోరోజు బుధవారం కూడా కొనసాగింది. ఈ దాడుల్లో 51 మంది చనిపోగా, 223 గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబైద్ వెల్లడించారు. హెజ్బొల్లా అగ్రనాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో సోమ, మంగళవారాల్లో 564 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌పై భూతల దాడులకు సిద్ధమవుతున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి బుధవారం తెలిపారు.మొస్సాద్ ప్రధాన కార్యాలయం పైకి.. హెజ్బొల్లా బుధవారం ఇజ్రాయెల్‌పైకి డజన్ల కొద్ది క్షిపణులను ప్రయోగించింది. ఏకంగా టెల్ అవీవ్‌లోని నిఘా సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైకి ఖాదర్–1 బాలిస్టిక్ మిసై్పల్ను ప్రయోగించినట్టు ప్రకటించింది. టెల్ అవీవ్‌లో, సెంట్రల్ ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మారుమోగాయి. దాంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భూతలం నుంచి భూతల లక్ష్యంపైకి ప్రయోగించిన క్షిపణిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి సెంట్రల్ ఇజ్రాయెల్‌ను చేరుకోవడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. -
ఇజ్రాయెల్ భీకర దాడులు
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.వెళ్లిపోవాలంటూ మెసేజ్లుతామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. -
హెజ్బొల్లా క్షిపణి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
మస్యాఫ్: సిరియాలోని హెజ్బొల్లా క్షిపణి తయారీ కేంద్రంపై ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు దాడి చేశాయి. లెబనాన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలో ఉన్న మస్యాఫ్ నగర సమీపంలో సోమవారం చేపట్టిన ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. దాడి చిత్రాలను అమెరికా మీడియా బయట పెట్టడంతో వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలోని ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. వైమానిక దళానికి చెందిన ఎలైట్ షాల్డాగ్ యూనిట్ బలగాలు హెలికాప్టర్ల నుంచి దిగి, ఇరాన్ నిర్మించిన కేంద్రంలో పేలుడు పదార్థాలను అమర్చాయి. ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లాకు క్షిపణుల సరఫరాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అపరేషన్పై ముందుగానే అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. -
ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న యాగి
మనీలా: ఫిలిప్పీన్స్‌ను ‘యాగి’తుపాను వణికిస్తోంది. పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మనీలాలో మరికినా నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మనీలాతోపాటు అత్యధిక జనసాంద్రత కలిగిన లుజాన్ ప్రాంతంలో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. క్వెజాన్ ప్రావిన్స్‌లోని ఇన్ఫాంటా పట్టణంలో ఈదురుగాలుల తీవ్రతకు నివాసాలు దెబ్బతిన్నాయి. రిజాల్ ప్రావిన్స్‌లోని అంటిపొలో సిటీలో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నీట మునిగారు. సమర్ ప్రావిన్స్‌లోని సెబులో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నలుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కామరిన్స్ సుర్ ప్రావిన్స్‌లోని నాగా నగరంలో వరద నీటిలో మరో ముగ్గురు చనిపోయారు. మనీలాకు దక్షిణాన ఉన్న కావిట్ ప్రావిన్స్‌లో నివాస ప్రాంతాల్లోకి నడుములోతుకు పైగా వరద చేరడంతో యంత్రాంగం బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా పలు నౌకాశ్రయాల్లో 3,300 మంది ఫెర్రీ ప్రయాణికులు, సిబ్బంది చిక్కుబడి పోయారు. పలు దేశీయ విమాన సరీ్వసులను రద్దు చేశారు. మనీలాలోని నవోటాస్ పోర్టులో రెండు ఓడలు ఢీకొన్నాయి. అనంతరం ఒక ఓడ బలమైన గాలుల తీవ్రతకు వంతెనను ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతింది. ఓడలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బందిని కాపాడారు. పసిఫిక్ రింగ్ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కి పైగా తుపాన్లు ప్రభావం చూపిస్తుంటాయి. 2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భీకర తుపాను హయియాన్తో కనీసం 7,300 మంది చనిపోవడమో లేక గల్లంతవ్వడమో జరిగింది. మరో 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు..
ఇంఫాల్: మణిపూర్‌లోని కౌట్రుక్, కడంగ్బాండ్ ప్రాంతాల్లో ఆదివారం అనుమానాస్పద మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మిలిటెంట్ల దాడులు, ఇళ్లు, ఆస్తుల విధ్వంసం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోకి భద్రతా బలగాలను తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురికి బుల్లెట్ గాయాలు, మిగతా వారికి బాంబు పేలుడు గాయాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. -
ఖర్కీవ్‌పై రష్యా క్షిపణి దాడి
మాస్కో: ఉక్రెయిన్ నగరం ఖర్కీవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి ఆటస్థలంలో పడటంతో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. సరిహద్దులకు సమీపంలోని ఖర్కీవ్పైనే జరిపిన మరో దాడిలో 12 అంతస్తుల నివాస భవనం ధ్వంసమయింది. ఘటనలో ఐదుగురు చనిపోగా మరో 59 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనలో భవనంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనం వెలుపలి గోడ తీవ్రంగా దెబ్బతింది. సమీపంలో పార్కు చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇలా ఉండగా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. కాగా, డొనెట్స్క్ రిజియన్‌లోని చాసివ్ యార్ పట్టణంపై రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. పట్టణంలోని పౌరులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రాంత గవర్నర్ కోరారు. ఉక్రెయిన్ బలగాల మౌలిక వనరుల రవాణాకు కీలకంగా ఉన్న పొక్రొవ్స్క్ నగరానికి అతి సమీపంలో రష్యా బలగాలు తిష్టవేశాయి.ఎయిర్ ఫోర్స్ చీఫ్ తొలగింపు: ముందుకు చొచ్చుకు వస్తున్న రష్యా బలగాలను నిలువరించి, ఎదురు దాడులు చేయడంలో అమెరికా మిత్ర దేశాలు అందించిన ఎఫ్–16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కీలకంగా భావిస్తోంది. అయితే, సోమవారం ఒక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని రష్యా ఆర్మీ కూల్చి వేసింది. అందులోని పైలట్ కూడా చనిపోయారు. ఘటనను అధ్యక్షుడు జెలెన్స్కీ సీరియస్‌గా తీసుకున్నారు. వైమానిక దళం చీఫ్ మికోలా ఒలెశ్చుక్ను బాధ్యతల నుంచి తొలగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సైనికుల భద్రతకు ఆయనదే పూర్తి బాధ్యతని మాత్రమే వ్యాఖ్యానించారు. -
Wayanad landslide: వయనాడ్ విలయానికి... ఉమ్మడి కుటుంబం బలి!
వయనాడ్: అప్పటిదాకా ఇంటినిండా 16 మంది సభ్యుల సందడితో కళకళలాడిన ఆ ఉమ్మడి కుటుంబం ఒక్కసారిగా కళతప్పింది. కొండల మీదుగా దూసుకొచ్చిన ప్రకృతి ప్రళయం కుటుంబాన్ని అమాంతం మింగేసింది. చూరల్మల కుగ్రామంలో ఆ ఉమ్మడి కుటుంబంలో 42 ఏళ్ల మన్సూర్ ఒక్కడే మిగిలాడు. విపత్తు రోజున ఊళ్లో లేకపోవడంతో బతికిపోయాడు. తన ఇంట్లో 16 మందిని కొండలు కబళించాయంటూ విలపిస్తున్నాడు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విలయానికి బలైన వారి సంఖ్య 221కి చేరినట్టు కేరళ ఆదివారం ప్రకటించింది. వాస్తవ సంఖ్య 370 దాటినట్టు స్థానిక మీడియా చెబుతోంది. జీవనదిలో నిర్జీవ దేహాలు వయనాడ్ తదితర తీరవాసులకు జీవనాడిగా పేరొందిన చలియార్ నది ఇప్పుడు విలయానికి గుర్తుగా మారింది. కొండచరియలకు బలైన వారి మృతదేహాలు ఆరు రోజులైనా ఇంకా నది ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి! ఘటనాస్థలి మీదుగా 40 కి.మీ.ల పొడవునా తీరం వెంట గాలింపు కొనసాగుతోంది.సైన్యానికి సెల్యూట్.. బాలుడి లేఖ వయనాడ్‌లో అన్వేషణ, సహాయక పనుల్లో సైన్యం కృషిని రాయన్ అనే స్థానిక చిన్నారిని కదలించింది. ‘మీరు నిజంగా గ్రేట్’ అంటూ మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆరీ్మకి లేఖ రాశాడు. ‘‘ధ్వంసమైన నా వయనాడ్‌లో బాధితులను ఆర్మీ కాపాడుతున్న తీరు చూసి గర్వపడుతున్నా. మీ ఆకలిని కేవలం బిస్కెట్లతో చంపుకుంటూ శరవేగంగా బ్రిడ్జి కట్టడం టీవీలో చూశా. నేను కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తా’’ అని పేర్కొన్నాడు. ‘‘నువ్వు ఆర్మీ యూనిఫాంలో మాతో కలిసి పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ ఆర్మీ అతనికి తిరుగు లేఖ రాసింది! -
నైజీరియాలో బాంబు పేలుడు
అబూజ: నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో ఒక దుకాణసముదాయంలో అమర్చిన బాంబు పేలిన ఘటనలో 16 మంది చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటలకు కవోరీ ప్రాంతంలోని ఒక టీ దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. దాడి చేసింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదు. కానీ చాన్నాళ్లుగా పలు దాడులకు కారణమైన బోకో హరామ్ ఉగ్రసంస్థే ఈ దాడికి పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు. బోకో హరామ్, దాని చీలిక వర్గం ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్‌ల దాడులు, అంతర్యుద్ధం కారణంగా నైజీరియా, కామెరూన్, నైజర్, చాద్ దేశాల్లో గత 15 సంవత్సరాల్లో 35,000 మందికిపైగా ప్రజలు చనిపోయారు. -
Wayanad: బురద వరద ముంచేసింది
వయనాడ్ (కేరళ): ఘోర కలి. మాటలకందని విషాదం. కేరళ చరిత్రలో కనీ వినీ ఎరగని ప్రకృతి విలయం. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండ ప్రాంతమైన వయనాడ్ జిల్లాలో మహోత్పాతానికి కారణమయ్యాయి. అక్కడి మెప్పడి ప్రాంతంపైకి మృత్యువు కొండచరియల రూపంలో ముంచుకొచి్చంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధైపోయారు. కళ్లు తిప్పుకోనివ్వనంత అందంగా ఉండే మెప్పడి ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటిదాకా 123 మృతదేహాలను వెలికితీశారు. వాటిలో చాలావరకు సమీపంలోని నదుల్లోకి కొట్టొకొచ్చినవే. ఏ శవాన్ని చూసినా కాళ్లు చేతులు తెగిపోయి కని్పంచడం బీభత్స తీవ్రతను కళ్లకు కడుతోంది. ప్రమాద స్థలం పొడవునా నిండిపోయిన బురద ప్రవాహాన్ని, మట్టి దిబ్బలను తొలగిస్తే వందల్లో శవాలు బయట పడతాయని చెబుతున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు ఉత్తరాది నుంచి పొట్ట చేత పట్టుకుని వచి్చన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని భావిస్తున్నారు. సమీపంలోని టీ ఎస్టేట్‌లో పని చేస్తున్న 600 మంది వలస కూలీల జాడ తెలియడం లేదు. వారంతా విలయానికి బలై ఉంటారంటున్నారు. నడి రాత్రి ఘోర కలి... మెప్పడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ ప్రాంతమంతా తడిసీ తడిసీ వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. తొలుత సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వేళ ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సహాయక సిబ్బంది హుటాహుటిన స్పందించారు. బాధితులను సమీపంలోని చూరల్మల స్కూలు వద్ద సహాయక శిబిరాలకు తరలించారు. అనంతరం తెల్లవారుజామున నాలుగింటికి ఆ ప్రాంతమంతటా మళ్లీ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో శిబిరాలతో పాటు పరిసర గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాలన్నీ బురదలో కొట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జిల వంటివన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. దాంతో ఆ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో సహాయక బృందాలు అక్కడ కాలు పెట్టలేకపోతున్నాయి. అయితే బురదలో చిక్కుబడి ప్రాణాలతో ఉన్న పలువురిని సైన్యం, నేవీ సంయుక్త ఆపరేషన్ చేపట్టి హెలికాప్టర్ల ద్వారా కాపాడాయి. మెప్పడి ఆరోగ్య కేంద్రంలో స్థలాభవం కారణంగా మృతదేహాలను నేలపైనే వరుసగా పేరుస్తున్నారు. ఉత్పాతం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారంతా తలలు బాదుకుంటూ, హృదయ విదారకంగా రోదిస్తూ తమవారి శవాల కోసం వెదుక్కుంటున్నారు! నిర్వాసితులుగా మారిన వేలాదిమందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. రంగంలోకి సైన్యం కేరళ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సైన్యం, జాతీయ విపత్తు దళం హుటాహుటిన రంగంలోకి దిగాయి. బురద, మట్టి దిబ్బల కింద ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నారు. వారి ఆనవాలు పట్టేందుకు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మోదీ దిగ్భ్రాంతి ఈ ఘోర విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలు తదితరాల్లో కేరళకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని ప్రకటించారు. ఆయన బుధవారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.ప్రాణం దక్కించుకున్న వృద్ధుడు వయనాడ్ విలయంలో వెల్లువెత్తిన బురద ప్రవాహంలో చిక్కిన ఓ వృద్ధుడు గంటల కొద్దీ ఒక పెద్ద బండరాయిని ఆధారంగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. స్థానికులు అతని ఆర్తనాదాలు విని కూడా వరద ప్రవాహ తీవ్రత కారణంగా ఏమీ చేయలేకపోయారు. దాంతో వృద్ధుడు జోరు వానలో, వరద ప్రవాహం నడుమ గంటల పాటు బండరాయి చాటునే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చివరికి సహాయక బృందాలు చాలాసేపు శ్రమించి ఆయన్ను కాపాడాయి. ఆ వీడియో వైరల్‌గా మారింది.త్రుటిలో బయటపడ్డాం... కళ్లముందే సర్వస్వాన్నీ ముంచెత్తిన వరద, బురద బీభత్సం నుంచి పలువురు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వణికిపోయారు. ఓ వృద్ధ జంట తమ ఇంటి చుట్టూ బురద నీటి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుండటంతో వణికించే చలిని, జోరు వానను కూడా లెక్కచేయకుండా రాత్రి 11 గంటల వేళ కొండపై భాగానికి వెళ్లిపోయింది. కాసేపటికే వాళ్ల ఇల్లు నామరూపాల్లేకుండా పోయింది. ‘‘పొరుగింటాయనను రమ్మని బతిమాలాం. రాకుండా ప్రాణాలు పోగొట్టుకున్నాడు’’ అంటూ వాళ్లు వాపోయారు. ‘‘మా బంధువులైన దంపతులు పసిపాపను చంకనేసుకుని ప్రాణాల కోసం పరుగులు తీస్తూ నాతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రవాహం, బురద తమను ముంచెత్తుతున్నాయని చెప్పారు. కాసేపటికే ఫోన్ మూగబోయింది. వాళ్ల జాడా తెలియడం లేదు’’ అంటూ ఒక మహిళ రోదించింది.వయనాడ్‌కు రెడ్ అలర్ట్: న వయనాడ్‌తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఫోన్లలో ఆర్తనాదాలు బురద ప్రవాహంలో చిక్కుబడ్డ చాలామంది కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేశారు. ప్రాణ భయంతో ఫోన్లోనే ఏడ్చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చానళ్లలో ప్రసారమవుతున్న ఆ సంభాషణలు, గ్రామాలన్నీ బురద కింద కప్పబడిపోయిన్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఇది మాటలకందని విషాదమని సీఎం విజయన్ అన్నారు. ‘‘భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ప్రాంతమంతా పెను విధ్వంసానికి లోనైంది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారు. పలు శవాలు చెలియార్ నదిలో పొరుగున మలప్పురం జిల్లాలోకి కొట్టుకొచ్చాయి.నదే రెండుగా చీలింది విరిగిపడ్డ కొండచరియల ధాటికి స్థానిక ఇరువలింజిపుజ నది ఏకంగా రెండుగా చీలిపోయింది! అక్కడి వెల్లరిమల ప్రభుత్వ పాఠశాల పూర్తిగా సమాధైపోయిందని సీఎం విజయన్ చెప్పారు. -
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు. దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
Uttar Pradesh: పిడుగుపాటుకు 38 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పిడుగులు పడిన ఘటనలు పలువురి ప్రాణాలు బలిగొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు గురై కనీసం 38 మంది మరణించారని అధికారులు గురువారం ప్రకటించారు. ప్రతాప్‌గఢ్‌లో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు, ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి, సిద్ధార్థనగర్లలో ఒక్కొక్కరు మరణించారు. అనేక మందికి కాలిన గాయాలయ్యాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఘటనలో 13, 15 ఏళ్లున్న ఇద్దరుతో సహా చాలా మంది బాధితులు పొలంలో పనిచేస్తున్నారు. అప్పుడే చేపలు పట్టేటప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. సుల్తాన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొందరు వరి నాట్లు వేస్తుండగా, ఒకరు మామిడి కాయలు కోసేందుకు వెళ్లి, మరొకరు తాగునీరు తెచ్చేందుకు వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. బుధవారం భారీ వర్షం కురుస్తుండగా చెట్టు కింద తలదాచుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వర్షం కురుస్తుండటంతో మామిడి చెట్టు కింద తలదాచుకుంటున్న 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. డియోరియాలో పొలంలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తుండగా పిడుగుపడి 5 ఏళ్ల బాలిక మరణించింది. వారణాసిలో ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురయ్యారు. ఒకరు కాలిన గాయాలతో మృతి చెందగా, మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్. దాని పరిసర రాష్ట్రాలు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
Russia-Ukraine war: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్‌లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. -
Hathras Satsang Stampede: అనుమతి 80 వేల మందికి.. వచ్చింది 2.5 లక్షలు
హత్రాస్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య బుధవారం 121కి చేరుకుంది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్య సేవాదార్ దేవప్రకాశ్ మధుకర్‌తోపాటు ఇతరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భోలే బాబా పేరును ఇంకా చేర్చలేదు. 80 వేల మందికే అనుమతి ఉంటే 2.5 లక్షల మంది వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు దాచిపెట్టేందుకు నిర్వాహకులు ప్రయతి్నంచారని ఆరోపించారు. అనుమతి తీసుకొనే సమయంలో తమకు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తొక్కిసలాటలో పోలీసుల తప్పిదమీమీ లేదని స్పష్టం చేశారు. ఫూల్రాయ్లో తొక్కిసలాటకు కారణమైన బాబా నారాయణ్ హరి అలియాస్ సకర్ విశ్వ హరి భోలే బాబా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 121 మంది మృతుల్లో 117 మందిని గుర్తించారు. గాయపడ్డ 28 మందికి చికిత్స కొనసాగుతోంది. సత్సంగ్ టెంట్ వద్ద గుట్టలుగా పేరుకుపోయిన చెప్పులు దుర్ఘటనకు మౌనసాక్షిగా నిలిచాయి. జ్యుడీషియల్ విచారణ: యోగితొక్కిసలాటపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వలో జ్యుడీషియల్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దుర్ఘటన వెనుక కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. చికిత్స పొందుతున్న వారిని ఆయన బుధవారం పరామర్శించారు. ఘటనా స్థలాన్నీ్న పరిశీలించారు.బాబా మంచోడు: గ్రామస్తులుభోలే బాబా మంచోడని యూపీలో కాస్గంజ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బహదూర్‌నగర్ వాసులు చెబుతున్నారు. బాబా తమను ఏనాడూ చందాలు గానీ, కానుకలు గానీ అడగలేదని గ్రామస్థులు చెప్పారు. బహదూర్‌నగర్ సమీపంలో భోలేబాబాకు ఒక ఆశ్రమం ఉంది. బాబా దంపతులకు సంతానం కలగలేదు. ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం ఆ బాలిక చనిపోయింది. ఆమె ప్రాణాలతో లేచివస్తుందన్న నమ్మకంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు తన ఇంట్లోనే ఉంచారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు అంత్య క్రియలు నిర్వహించారు. బాబా అనుచరుల వల్లే తొక్కిసలాట! తొక్కిసలాటపై హత్రాస్ సబ్‌డివిజనల్ మేజి్రస్టేట్(ఎస్డీఎం) బుధవారం జిల్లా మేజి్రస్టేట్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. సత్సంగ్ ముగిసిన తర్వాత తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న భోలే బాబాను దగ్గరగా చూసేందుకు, చేత్తో తాకేందుకు భక్తులు అరాటపడ్డారని, వారిని బాబా అనుచరులు దూరంగా తోసివేయడానికి ప్రయతి్నంచడంతో తొక్కిసలాట జరిగిందని నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో నేలంతా బురదగా ఉండడంతో జనం జారిపడ్డారని, ఒకరిపై ఒకరు పడిపోయారని పేర్కొన్నారు. కింద చిక్కుకున్నవారు ఉపిరాడక మృతిచెందారని నివేదికలో ప్రస్తావించారు. సత్సంగ్‌కు 2 లక్షల మందికిపైగా జనం హాజరయ్యారని వివరించారు. విద్రోహ శక్తులే కారణం భోలే బాబా లక్నో: సత్సంగ్ వేదిక నుంచి తాను వెళ్లిపోయిన చాలాసేపటికి తొక్కిసలాట జరిగిందంటూ భోలే బాబా బుధవారం ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాటకు సంఘ విద్రోహ శక్తులే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో తానక్కడ లేనన్నారు. భక్తుల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. -
Delhi Rains: నీట మునిగిన ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నీట మునిగింది. రికార్డు స్థాయి భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వరుసగా శుక్రవారం రెండో రోజూ భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెగని వర్షం పడింది. దాంతో భరించలేని ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగినా నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు ఎన్సీఆర్ రోడ్లను వరదలు ముంచెత్తాయి. వరద నీటి ధాటికి చాలాచోట్ల డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోవడంతో సమస్య మరింత విషమించింది. సమీప ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. ఢిల్లీ జల మంత్రి ఆతిశితో పాటు శశి థరూర్ తదితర ఎంపీల నివాసాలు కూడా నీట మునిగాయి. వారి ఇళ్లలోని ఫరి్నచర్ తదితరాలు వరద నీటిలో తేలియాడుతూ కని్పంచాయి. వర్షాలు, సంబంధిత ఉదంతాల్లో ఐదుగురు మరణించారు. నీటితో నిండిపోయిన అండర్‌పాస్‌ల్లో వాహనాలు తేలియాడాయి. పలుచోట్ల వాటిలో ప్రయాణికులు గంటలపాటు చిక్కుకున్నారు. గుర్గావ్లోని పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్ గందరగోళం ఏర్పడింది. తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ నుంచి గాజీపూర్ దాకా, అక్షరధామ్–సరాయ్ కాలే ఖాన్ రహదారిపైనా... ఇలా ఎక్కడ చూసినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయి జనాలకు చుక్కలు చూపింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు, అంతకు మించి వరద కని్పంచింది. పలు చోట్ల మెట్రో స్టేషన్లు కూడా నీట మునిగాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో ఏకంగా 153.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. జూలై 3 దాకా వానలే ఢిల్లీ–ఎన్సీఆర్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం దాకా 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ గత 88 ఏళ్లలో అత్యధిక వర్షపాతంగా రికార్డుకెక్కింది. జూన్‌లో ఢిల్లీలో సగటున 80.6 మి.మీ వర్షం కురుస్తుంది. ఢిల్లీలో ఏడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. జూలై 3 దాకా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ‘‘ఈదురుగాలులతో భారీ వర్షాలు పడొచ్చు. జూలై 1, 2 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుంది’’ అని పేర్కొంది. -
చైనాలో వరద బీభత్సం: 53 మంది మృతి
బీజింగ్: ఆకస్మిక వర్షాలు, వరదలతో దక్షిణ చైనా వణికిపోతోంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బురద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతోంది. వరదల కారణంగా గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 47 మంది, ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. -
Delhi heatwave: ఢిల్లీలో వడగాడ్పులకు గూడు లేని 192 మంది బలి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎండల తీవ్రత, వడగాడ్పులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 11 నుంచి 19వ తేదీల మధ్య అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో వేడిగాలులకు తాళలేక 192 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 80 శాతం మంది ఎటువంటి ఆశ్రయం లేని వారేనని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఎన్జీవో తెలిపింది. ఇటువంటి వారికి తక్షణమే వసతులు కలి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ చెప్పారు. గాలి కాలుష్యం, పారిశ్రామికీకరణ,అడవుల నరికివేత వంటివి ఉష్ణోగ్రతలు పెరగడానికి, గూడు లేని వారి ఇబ్బందులను పెంచాయని విశ్లేíÙంచారు. -
తమిళనాడులో కల్తీ సారాకు 18 మంది బలి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన 18 మంది బుధవారం మరణించారు. మరో 90 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులలో ప్రవీణ్, సురేష్, శేఖర్, మోహన్, జగదీశ్, సుబ్రమణియన్, మణి ఉన్నారు. మరో ముగ్గురు సాయంత్రం మృతి చెందారు. ఈ సమాచారంతో కల్తీ సారా, సారా సేవించిన వారంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 90 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, కల్తీ సారా తాగి మరణించినట్టుగా వైద్య పరీక్షల్లో తేలలేదని కళ్లకురిచ్చి కలెక్టర్ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచి్చకి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. -
Russia-Ukraine war: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో దాడులు..
కీవ్: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమణలో ఉన్న ఖెర్సన్, లుహాన్స్క్లపై జరిగిన దాడుల్లో కనీసం 28 మంది మృతి చెందారు. ఖెర్సన్‌లోని సడోవ్ పట్టణంపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గైడెడ్ బాంబు, క్షిపణి దాడుల్లో 22 మంది చనిపోగా మరో 15 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా, లుహాన్స్క్ నగరంపై శుక్రవారం జరిగిన దాడిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మరణాల సంఖ్య ఆరుకు చేరిందని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. దీంతోపాటు, కుబాన్, అస్ట్రఖాన్,, తుల, క్రిమియా ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఆక్రమిత జపొరిఝియాకు 900 కిలోమీటర్ల దూరంలోని కాకసస్ నార్త్ ఒస్సేతియాలోని సైనిక స్థావరం లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు వివరించింది. -
గాజాలో భీకర పోరు.. 210 మందికి పైగా మృతి!
జెరూసలెం/గాజా: సెంట్రల్ గాజాలో నుసెయిరత్‌లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్ అల్ బలాహ్లోని అల్–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్ మెయిర్ జాన్(21), ఆండ్రీ కొజ్లోవ్(27), ష్లోమి జివ్(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్.. శనివారం ఐడీఎఫ్ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్ కేన్సర్ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి
గాజా: ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దాడులతో 24 గంటల వ్యవధిలో గాజాలో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఇద్దరు పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీకి చెందిన పారా మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారని వివరించింది. టాల్ అస్–సుల్తాన్ ప్రాంతంలో జరిగిన బాంబుదాడిలో బాధితులకు సాయం అందించేందుకు వెళ్లగా వీరు గాయపడినట్లు వెల్లడించింది. తాజా మరణాలతో గతేడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కనీసం 36,224 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 81,777 మంది క్షతగాత్రులైనట్లు అంచనా. ఇలా ఉండగా, ఈజిప్టుతో సరిహద్దులు పంచుకుంటున్న గాజా ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం తెలిపింది. -
చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం
దుమ్ముగూడెం: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కబిర్ధామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. మృతుల్లో 18 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కభీర్దామ్ జిల్లాలోని సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్దూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో బంజారి ఘాట్‌లో అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడింది. -
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్‌లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
చైనాలో కొట్టుకుపోయిన ఎక్స్‌ప్రెస్ వే..
బీజింగ్: చైనాలో ప్రధాన రహదారి కొట్టుకుపోయిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని మెయిజౌ నగరంలో బుధవారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. చైనాలో ‘లేబర్ డే’సందర్భంగా ఐదు రోజుల సెలవులు బుధవారం నుంచే మొదలయ్యాయి. దీంతో గ్వాంగ్డాంగ్– ఫుజియాన్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా మెయిజౌ నగరంలోని కొండప్రాంతంలో ఉన్న 18 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. అనూహ్య పరిణామంతో 20 వరకు వాహనాలు అందులో పడిపోయాయి. కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వాటిలో ఉన్న 54 మందిలో 24 మంది చనిపోగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. -
Israel-Hamas war: రఫాపై ఇజ్రాయెల్ దాడులు 22 మంది మృతి
రఫా: గాజా ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లకు పట్టున్న రఫాలోకి తమ సైన్యం త్వరలో ప్రవేశించనుందంటూ హెచ్చరికలు చేస్తున్న ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులకు దిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు. హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆరు నెలలకు పైగా భీకర దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉండగా, కాల్పుల విరమణకు ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో సంభాషించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. -
కెన్యాలో కూలిన డ్యామ్
నైరోబీ(కెన్యా): ఆఫ్రికా దేశం కెన్యాలో జలాశయం ధ్వంసమై నివాసప్రాంతాలను ముంచెత్తడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది గల్లంతయ్యారు. సుమారు 109 మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. తరచూ ఆకస్మిక వరదలు సంభవించే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మయి మహియులో ఇటీవలి వర్షాలకు పొంగి పొర్లుతున్న పాత కిజాబె డ్యాం ఆనకట్ట కొట్టుకుపోయింది. దీంతో వరద ఒక్కసారిగా నివాస ప్రాంతాలను ముంచెత్తిందని, ప్రధాన రహదారి కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో వరద పోటెత్తడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. -
తైవాన్‌లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్‌ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్‌ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్‌లో ఉంది. -
లోయలో పడ్డ తవేరా..10 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ హైవేపై రంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. తవేరా ట్యాక్సీ అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్‌తో పాటు అందరూ చనిపోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్‌స్‌్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్‌కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్‌తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
Israel-Hamas war: 25,000 దాటిన గాజా మృతులు
రఫా(గాజా స్ట్రిప్): తమతమ మతసంబంధ పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం ఘర్షణలతో మొదలై మెరుపు దాడులతో తీవ్రతరమై మహోగ్రరూపం దాలి్చన హమాస్– ఇజ్రాయెల్ పోరు పాతికవేల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. మరోవైపు వంద మందికిపైగా బందీలను విడిపించుకున్నాసరే అందర్నీ విడిపిస్తామని, హమాస్ సభ్యులందర్నీ హతమారుస్తామని ఇజ్రాయెల్ సేనల ప్రతినబూనడం చూస్తుంటే యుద్ధ బాధితులు, మరణాల సంఖ్య ఇక్కడితో ఆగేలా లేదు. యుద్ధం ఇంకొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులు తాజాగా ప్రకటించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా బందీలను విడిపించలేకపోవడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు ప్రదర్శలు పెరిగాయి. -
Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు
క్రైస్తవ, ముస్లిం, యూదు మతాల పవిత్ర స్థలాలకు నెలవైన జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాల దాడులతో రాజుకున్న వివాదం చివరకు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంగా తీవ్రరూపం దాల్చి ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికిపైగా అపహరణతో మొదలైన ఈ ఘర్షణ ఆ తర్వాత ఇజ్రాయెల్ భూతల, గగనతల భీకర దాడులతో తీవ్ర మానవీయ సంక్షోభంగా తయారైంది. వందల కొద్దీ బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో పారిపోయారు. దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తాగు నీరు లేక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. ఈ యుద్ధం 23 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. ఐక్యరాజ్యసమితి మానవీయ సాయం డిమాండ్లు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తోంది. మృత్యు నగరాలు ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్‌లోని ప్రతి పట్టణం దాదాపు శ్మశానంగా తయారైంది. మొత్తం 23 లక్షల జనాభాలో 85 శాతం మంది వలసపోయారు. ఉత్తర గాజాపై, ఆ తర్వాత దక్షిణ గాజాపై దాడుల ఉధృతి పెరగడంతో జనం ఈజిప్ట్ చిట్టచివరి సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలెంట్లు, యెమెన్‌లోని హౌతీల దాడులతో యుద్దజ్వాలలు పశ్చిమాసియాకు పాకుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేదాకా బందీలను వదిలిపెట్టబోమని, దాడులను ఆపబోమని హమాస్, దాన్ని హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించేదాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటున్నాయి! ఫలించని దౌత్యం ఖతార్, అమెరికా దౌత్యం తొలుత సఫలమైనట్లే కనిపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం బందీలను విడుదల చేశాయి. కానీ ఆ వెంటనే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ వంద రోజుల్లో లక్షలాది ఇళ్లు, వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటం అత్యంత విషాదకరం. రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాలబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఆహార, సరకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iran explosions: రక్తమోడిన ర్యాలీ
దుబాయ్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి ఖడ్గం ఝుళిపించింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం మధ్యాహ్నం మూడింటపుడు కెర్మాన్ నగరంలోని ఖాసిమ్ సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర నాలుగో సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్–జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా సమాధికి 700 మీటర్లదూరంలో మొదటి పేలుడు సంభవించింది. గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి ఒక కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనాస్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డెప్యూటీ గవర్నర్ రహ్మాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఎవరీ సులేమానీ? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని కీలక ఖుర్డ్స్ ఫోర్స్‌కు మేజర్ జనరల్ సులేమానీ నేతృత్వం వహిస్తుండేవారు. ఖుర్డ్స్ఫోర్స్ అనేది విదేశీ సైనిక వ్యవహారాల విభాగం. సైన్యం కోసం ఆయుధాలు, నిధుల సేకరణ, నిఘా, సరకుల రవాణా బాధ్యతలను ఈ దళమే చూసుకుంటుంది. ఇరాన్‌కు మద్దతు పలికే గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌కు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకూ సాయపడుతుంది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గతంలో ప్రకటించింది. ఎందుకు చంపారు? 2020 జనవరిలో ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంక్యూ9 రీపర్ డ్రోన్ సాయంతో అమెరికా సులేమానీని హతమార్చింది. ‘‘ 1998లో ఖుర్డ్స్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇరాక్, సిరియాలో లక్షలాది మంది అమాయకుల మరణాలకు సులేమానీ కారకుడు. ప్రపంచ నంబర్‌వన్ ఉగ్రవాది అయినందుకే అతడిని అంతమొందించాం’ అని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి రోజున ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఇరాన్ అప్పట్లో ప్రతీకార దాడులకు దిగడం తెల్సిందే. ఇరాన్ సైన్యాన్ని పటిష్టవంతం చేయడంలో సులేమానీది కీలక పాత్ర. అందుకే ఇరాన్ వ్యాప్తంగా సులేమానీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. నేషనల్ ఐకాన్‌గా కీర్తింపబడ్డారు. 2011లో అరబ్ ఉద్యమం తర్వాత సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. కానీ ఈ ఘటనలో సిరియాలో అంతర్యుద్ధం రాజుకుని అది ఇప్పటికీ రగులుతూనే ఉంది. 2018లో ప్రపంచ ఆర్థిక శక్తులు కీలక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగాక ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ట్రంప్ సర్కార్ ఇచి్చన ఆదేశాలతో సులేమానీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో అప్పట్లో సంచలనమైంది. సులేమానీ హత్యేకాదు అంత్యక్రియల ఘటనా వార్తపత్రికల పతాకశీర్షికలకెక్కింది. 2020లో వేలాదిమంది పాల్గొన్న అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. -
Israel-Hamas war: సెంట్రల్ గాజాపై భీకర దాడులు..
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాపై మరోసారి విరుచుకుపడింది. ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో కనీసం 35 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు వెల్లడించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లపై యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మరుసటి రోజే సైన్యం దాడులు ఉధృతం చేయడం గమనార్హం. ఆదివారం ప్రధానంగా ఖాన్ యూనిస్ నగరంపై క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,600 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. 55,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా పశి్చమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు పశ్చిమ దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఎర్ర సముద్రంలో భారీ కంటైనర్ షిప్‌ను ధ్వంసం చేయడానికి హౌతీ ముష్కరులు ప్రయోగించిన రెండు యాంటీ–షిప్ బాలిస్టిక్ క్షిపణులను మధ్యలోనే కూలి్చవేశామని అమెరికా సైన్యం ఆదివారం ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత ఇదే నౌకపై దాడి చేయడానికి నాలుగు పడవలు ప్రయతి్నంచాయని వెల్లడించింది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని, తమ ఎదురు కాల్పుల్లో సాయుధ దుండగులు హతమయ్యారని పేర్కొంది. -
రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. సచిన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
గుజరాత్లో అకాల వర్షాలు..
అహ్మదాబాద్: గుజరాత్ వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో 20 మంది వరకు చనిపోయినట్లు రాష్ట్ర అత్యవసర విభాగం తెలిపింది. దహోడ్ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, అహ్మదాబాద్, అమ్రేలీ, బనస్కాంత, బోటడ్, ఖేడా, మెహ్సానా, పంచ్‌మహల్, సబర్కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవ్‌భూమి ద్వారకల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారని ఒక అధికారి చెప్పారు. రాష్ట్రంలోని 252 తాలుకాలను గాను 234 చోట్ల ఆదివారం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, సౌరాష్ట్ర ప్రాంతంలోని సెరామిక్ పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రానికి మరింత వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. -
చైనాలో భారీ అగ్ని ప్రమాదం
బీజింగ్: చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 38 మంది గాయపడ్డారు. లియులింగ్ నగరంలోని లిషి ప్రాంతంలో గురువారం ఉదయం 6.50 గంటలకు ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గని కంపెనీకి చెందిన అయిదంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో మొదలైన మంటలు భవనమంతటికీ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది శ్రమించి మంటలను మధ్యాహ్నం 1.45కి అదుపులోకి తెచ్చారని చెప్పారు. చైనాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే వీటికి కారణమని చెబుతున్నారు. -
Israel-Hamas war: స్కూళ్లు, ఆస్పత్రులపై దాడులు
టెల్అవీవ్: గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యాలు మరింతగా చొచ్చుకుపోతున్నాయి. శనివారం మరిన్ని ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి విముక్తం చేసినట్టు సైన్యం ప్రకటించింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో జరిగిన బాంబు, క్షిపణి దాడుల్లో కనీసం 15 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది తమ పనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆంబులెన్సులో పారిపోతున్న ఉగ్రవాదులను ఏరేయడానికి దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. దాంతోపాటు జబాలియా శరణార్థి శిబిరం సమీపంలో ఓ స్కూలుపై జరిగిన క్షిపణి దాడిలో మరో 15 మంది దాకా మరణించారు. దాడులు ఉత్తర గాజాలోని ఐరాస శరణార్థి శిబిరాలకు కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇజ్రాయెల్ హెచ్చరిక మేరకు భారీ సంఖ్యలో దక్షిణాదికి వలస వెళ్లిన వారు పోగా ఇంకా 3 లక్షల మంది దాకా ఉత్తర గాజాలోనే చిక్కుబడ్డారు. వీరంతా ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పోరులో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 9,500 దాటినట్టు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, హమాస్ చీఫ్ నివాసంపై కూడా క్షిపణి దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి. సాయం... తక్షణావసరం గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లకు అత్యవసరాలు కూడా అందని దుస్థితి అలాగే కొనసాగుతోంది. అతి త్వరలో లక్షలాది మంది ఆకలి చావుల బారిన పడే ప్రమాదముందని అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస తదితర అంతర్జాతీయ సంస్థల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజావాసులకు మానవీయ సాయం అందేలా చూడాలని అమెరికా, యూరప్‌తో సహా అంతర్జాతీయ సమాజమంతా ముక్త కంఠంతో ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే స్పందించాలని కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. కాకపోతే యుద్ధక్షేత్రంలో చిక్కుబడ్డ పౌరులు దక్షిణాదికి పారిపోయేందుకు వీలుగా శనివారం మూడు గంటలపాటు దాడుల తీవ్రతను తగ్గించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనావాసులకు అత్యవసర సాయం అందేలా చూసే మార్గాంతరాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. రోజుకు ఆరు నుంచి 12 గంటల పాటు కాల్పుల విరామ ప్రకటించి మానవీయ సాయం అందేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు వీలు కలి్పంచాలని ఈజిప్ట్, ఖతర్ కోరుతున్నాయి. అలాగే బందీల విడుదలకు బదులుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనియన్లలో వృద్ధులు, మహిళలను వదిలేయాలని ప్రతిపాదిస్తున్నాయి. వీటిపై ఇజ్రాయెల్ ఇప్పటిదాకా స్పందించలేదు. రోజుకు రెండే బ్రెడ్డు ముక్కలు గాజావాసులు సగటున రోజుకు కేవలం రెండు బ్రెడ్డు ముక్కలు తిని ప్రాణాలు నిలబెట్టుకుంటున్నట్టు అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస సంస్థల డైరెక్టర్ థామస్ వైట్ వాపోయారు. అవి కూడా ఐరాస సేకరించిన పిండి నిల్వల నుంచే వారికి అందుతున్నట్టు చెప్పారు. గాజాలో ఒక్క ప్రాంతం కూడా సురక్షితమని చెప్పడానికి వీల్లేకుండా ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవీయ చట్టాలను గౌరవిస్తూ పాలస్తీనావాసులకు సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కానీ మానవీయ సాయం నిమిత్తం దాడులకు కాస్త విరామమివ్వాలన్న అంతర్జాతీయ విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. తమ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా దాడులను తగ్గించేది లేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ కూడా సమ్మతం కాదన్నారు. మరోవైపు ద్వంద్వ పౌరసత్వాలున్న 380 మందికి పైగా పాలస్తీనియన్లు శుక్రవారం ఈజిప్టు చేరుకున్నారు. తామిక ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్టేనని హెజ్బొల్లా నేత సయ్యద్‌హసన్ నస్రల్లా ప్రకటించారు. -
Israel-Hamas war: గాజాలో మరణ మృదంగం
ఖాన్ యూనిస్/జెరూసలేం: హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులు ఉధృతం చేస్తుండడం గాజాలో సాధారణ పాలస్తీనియన్లకు ప్రాణసంకటంగా మారింది. సోమవారం మరిన్ని దళాలు ఇజ్రాయెల్ భూభాగం నుంచి గాజాలోకి అడుగుపెట్టాయి. ఇజ్రాయెల్ సేనలు గాజాలోకి మరింత ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాలో 24 గంటల్లో 600 హమాస్ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం అణువణువూ గాలిస్తున్నాయి. గాజాలో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి అయిన ‘టర్కిష్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్’ సమీపంలోనే ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రి స్వల్పంగా ధ్వంసమయ్యింది. ఉత్తర, దక్షిణ గాజాను అనుసంధానించే ప్రధాన జాతీయ రహదారిని ఇజ్రాయెల్ యుద్ధట్యాంకులు, బుల్డోజర్లు దిగ్బంధించాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. ఇందుకు కారణం ఏమిటన్నది బయటపెట్టడం లేదు. ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వెళ్లలేకపోతున్నారు. ఉత్తర గాజాలకు భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నామని హమాస్ వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 304 మంది మృతిచెందారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇప్పటిదాకా 8,306 మంది పాలస్తీనియన్లు మరణించారని, 21,048 మంది గాయపడ్డారు. ఇంకా 1,950 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించింది. ఇజ్రాయెల్‌లో 1,400మందికిపైగా మృత్యువాత పడ్డారు. అరకొర సాయమే ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న మానవతా సాయం ఇప్పుడిప్పుడే గాజాకు చేరుకుంటోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, దుస్తులు, నీటి శుద్ధి యంత్రాలు వంటివి అందుతున్నాయి. 75 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్ తాజాగా ఈజిప్టు నుంచి దక్షిణ గాజాలోకి అడుగుపెట్టింది. ఈ వాహనాలు టన్నుల కొద్దీ ఆహారం, తాగు నీరు, పలు రకాల కీలక ఔషధాలను చేరవేశాయి. గాజాలోని 23 లక్షల జనాభాకు ఈ సాయం ఏమాత్రం చాలదని అక్కడి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. దక్షిణ గాజాలో రెండు నీటి సరఫరా పైపులైన్లను పునరుద్ధరించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. యూదుల కోసం విమానంలో గాలింపు ఇజ్రాయెల్ నుంచి వచి్చన విమానంలో యూదుల కోసం రష్యాలోని ముస్లింలు గాలించడం సంచలనాత్మకంగా మారింది. ఆదివారం టెల్ అవీవ్ నుంచి విమానం రష్యాలో ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన మాఖాచ్కలాలోని దగెస్తాన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో యూదులు ఉన్నారన్న అనుమానంతో వందలాది మంది ముస్లింలు ఎయిర్‌పోర్టును దిగ్బంధించారు. పాలస్తీనా జెండాలను చేబూని, ఎయిర్‌పోర్టులోకి లోపలికి ప్రవేశించి అలజడి సృష్టించారు. యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చంపేయాలంటూ నినదించారు. కొందరు రన్‌వే పైకి దూసుకెళ్లారు. ఇజ్రాయెల్ విమానాన్ని చుట్టుముట్టారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూదులపై దాడి చేయడానికే ఎయిర్‌పోర్టుకు వచి్చనట్లు తెలుస్తోంది. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపైనా తిరగబడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అపహరించిన షానీ లౌక్‌ను హత్య చేశారు 23 ఏళ్ల యువతి షానీ లౌక్ ఈ నెల 7న ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్‌లో ఓ సంగీత వేడుకలో ఉండగా హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడి చేశారు. కొందరిని కాలి్చచంపారు. షానీ లౌక్తోపాటు మరికొందరిని అపహరించారు. బందీలుగా బలవంతంగా గాజాకు లాక్కెళ్లారు. అయితే, మిలిటెంట్ల చెరలో షానీ లౌక్ క్షేమంగా ఉండొచ్చని ఆమె తల్లి, సోదరి భావించారు. త్వరలోనే ప్రాణాలతో తిరిగివస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే దుర్వార్త తెలిసింది. గాజాలో మిలిటెంట్లు ఓ యువతి మృతదేహాన్ని వాహనంలో ఉంచి, ‘అల్లాహో అక్బర్’ అని అరుస్తూ గాజా వీధుల్లో ఊరేగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శవంగా మారిన ఆ యువతి షానీ లౌక్ అని తల్లి రికార్డా లౌక్, సోదరి అడీ లౌక్ గుర్తించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇజ్రాయెలీ–జర్మన్ జాతీయురాలైన షానీ లౌక్‌ను మిలిటెంట్లు హత్య చేయడం దారుణమని, ఈ ఘటన తమను కలచివేసిందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది. -
గనిలో అగ్ని ప్రమాదం
లండన్: కజఖిస్తాన్లోని కొస్టెంకో బొగ్గు గనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 32 మంది కార్మికులు చనిపోగా మరో 14 మంది గల్లంతయ్యారు. లగ్జెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఈ విషయం తెలిపింది. శనివారం ప్రమాద సమయంలో గనిలో 252 మంది కారి్మకులు పనిచేస్తున్నారని వివరించింది. మీథేన్ గ్యాస్ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్. ఈ సంస్థకు అనుబంధంగా కజఖిస్తాన్లో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ పనిచేస్తుంది. ఘోర ప్రమాదం నేపథ్యంలో కజఖ్ ప్రభుత్వం ..దేశంలో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను జాతీయం చేసింది. -
Jivitputrika festival: 24 గంటల వ్యవధిలో.. బిహార్‌లో 22 మంది నీటమునక
పట్నా: బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో నదులు, చెరువుల్లో స్నానాలు చేసేందుకు వెళ్లిన 22 మంది మృత్యువాత పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వీరిలో అత్యధికులు జీవిత్పుత్రికా పండుగ సందర్భంగా స్నానాలు చేయడానికి వెళ్లిన మహిళలేనన్నారు. ఈ పండుగ రోజు మహిళలు తమ సంతానం బాగుండాలని దేవుణ్ని కోరుకుంటూ ఉపవాస దీక్షలు, నదీ స్నానాలు ఆచరించడం సంప్రదాయం. భోజ్‌పూర్‌లో బహియారా ఘాట్ వద్ద సోనె నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లిన 15–20 మధ్య వయస్కులైన బాలికలు సెల్ఫీ తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు అధికారులు వివరించారు. భోజ్‌పూర్‌లో అయిదుగురు, జెహానాబాద్‌లో నలుగురు, పట్నా, రొహతాస్ల్లో ముగ్గురు చొప్పున, దర్భంగా, నవడాల్లో ఇద్దరేసి, కైమూర్, మాధెపురా, ఔరంగాబాద్‌ల్లో ఒక్కరు చొప్పున జల సమాధి అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
టపాసుల దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
హోసూరు (తమిళనాడు): హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై తమిళనాడు సరిహద్దులో ఉన్న అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలతో సహా పలు వాహనాలు బూడిదయ్యాయి. 12 మంది కార్మికులు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం నవీన్ అనే వ్యక్తికి చెందిన టపాసుల గోదాములోకి లారీల్లో వచ్చిన స్టాక్‌ను 20 మందికి పైగా సిబ్బంది అన్లోడ్ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా ధాటికి చెలరేగిన మంటలు పక్క పక్కనే ఉన్న దుకాణాలకు, వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన బాణాసంచాతో పాటుగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. దుకాణ యజమాని సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండులారీలతో పాలు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం 12 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా తమిళనాడు వాసులే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టపాసులను అన్లోడ్ చేసే సమయంలో విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం..13 మంది సజీవ దహనం
మాడ్రిడ్: స్పెయిన్‌లోని ముర్సియా నగరంలోని ఓ నైట్ క్లబ్లో సంభవించిన అగ్ని ప్రమా దంలో 13 మంది సజీవ దహనమ య్యారు. మరో నలుగురు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ప్రముఖ టియేటర్ నైట్ క్లబ్లో ఉదయం 6 గంటల సమయంలో మొదలైన మంటలు భవనమంతటా వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. లోపల మరికొంత మంది చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనం పైకప్పు కూలుతుందనే భయంతో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారని చెప్పారు. -
పాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి
కరాచీ: మసీదుల్లో మిలాదునబి వేడుకలే లక్ష్యంగా పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మృత్యువాతపడగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు దాడిలో 54 మంది చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో డీఎస్పీ నవాజ్ గషో్కరి కూడా ఉన్నారు. గుర్తు తెలియని దుండగుడు డీఎస్పీ నవాజ్ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అదేవిధంగా, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ హంగు నగరంలోని దవోబా పోలీస్ ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరో నలుగురు పారిపోయారు. వారిలో ఒకరు పక్కనే ఉన్న మసీదులోకి చేరుకుని తనను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో మసీదులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట సాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ దాడులకు తాము కారణం కాదంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన కీలక కమాండర్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐఎస్ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
మణిపూర్ హింసాకాండలో 175 మంది బలి
ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు దహనమయ్యాయని తెలియజేసింది. మణిపూర్‌లో హింస మొదలైనప్పటి నుండి ఆయుధగారాల నుంచి 5,668 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వీటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు మళ్లీ స్వా«దీనం చేసుకున్నాయి. అల్లరి మూకల నుంచి భారీగా మందుగుండు సామగ్రి, బాంబులను కూడా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గృహ దహనాలకు సంబంధించి పోలీసులు 5,172 కేసులు నమోదు చేశారు. హింసాకాండకు సంబంధించి మొత్తం 9,332 కేసులు నమోదు చేశారు. 325 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరించాలి తమ రాష్ట్రం నుంచి అస్సాం రైఫిల్స్ దళాలను వెంటనే ఉపసంహరించాలని మణిపూర్ పౌర సమాజ సంస్థలతో కూడిన మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ(కాకోమీ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. అస్సాం రైఫిల్స్ జవాన్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాకోమీ ప్రతినిధులు తాజాగా ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. -
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం
హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు. -
సూడాన్‌లో డ్రోన్ దాడి..43 మంది మృతి
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని ఓ మార్కెట్‌పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో 43 మంది చనిపోయారు. మరో 55 మంది గాయాలపాలయ్యారని మానవీయ సాయం అందిస్తున్న సంస్థలు వెల్లడించాయి. దేశంలో మిలటరీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్, పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నేత జనరల్ మహ్మద్ హమ్దాన్ దగాలో మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఖార్టూమ్ ప్రాంతంలో నివాసాల్లో పారా మిలటరీ బలగాలు తిష్టవేసి పోరాట సాగిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మిలటరీ వైమానిక దాడులకు దిగుతోంది. రెండు వర్గాల మధ్య పోరులో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. ఈ పోరులో 4 వేల మందికి పైగా మరణించినట్లు ఐరాస చెబుతోంది. -
కాల్వలో పడిన ట్రాక్టర్.. 9 మంది మృతి
లక్నో: ట్రాక్టర్ ట్రాలీ కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. తాజ్‌పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్‌దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. బుధవారం నాలుగు, గురువారం అయిదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5–12 ఏళ్ల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులు న్నారు. గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయని అధికారులు చెప్పారు. -
మాలిలో దుండగుల కాల్పులు
బమాకో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మాలిలోని మోప్తీ ప్రాంతంలో తాజాగా ఈ ఘోరం చోటుచేసుకుంది. బందీయాగార పట్టణం సమీపంలోని యారౌ అనే ఓ గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారని, జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కాల్పుల్లో 21 మంది ప్రజలు చనిపోయారని, మరో 30 మందికిపైగా గాయపడ్డారని తెలియజేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. మాలిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐసిస్ చురుగ్గా పనిచేస్తున్నాయి. ఉగ్రముఠాల అండతో తిరుగుబాటుదారులు కొన్ని భూభాగాలను ఆక్రమించారు. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
Manipur Violence: మళ్లీ మణిపూర్‌లో హింస
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో రావణకాష్టంగా మారుతున్న మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం అర్ధరాత్రిదాటాకా బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై జరిగిన దాడిలో తండ్రీకుమారుడు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. క్వాక్టా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఆందోళనకారులు వీరిపై కాల్పులు జరిపి తర్వాత కత్తులతో నరికారు. చురాచాంద్‌పూర్ ప్రాంతం నుంచి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. తమ వారి మరణంతో ఆగ్రహించిన స్థానికులు ప్రతీకారం తీర్చుకునేందుకు చురాచాంద్పూర్కు బయల్దేరబో యారు. వీరిని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. అయితే దాడికి ప్రతీకారంగా ఉఖా తంపాక్ పట్టణంలో పలువురి ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. శనివారం ఉదయం మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసుసహా ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. మళ్లీ హింసాత్మక ఘటనలు పెరగడంతో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పాలనా యంత్రాంగం కుదించింది. బంద్ ప్రశాంతం మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ శాంతి నెలకొనాలంటూ 27 శాసనసభ స్థానాల సమన్వయ కమిటీ ఇచ్చిన 24 గంటల సాధారణ బంద్ ఇంఫాల్ లోయలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. శనివారం దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు, స్కూళలు మూతబడ్డాయి. అల్లర్లతో అవస్థలు పడుతున్న జనాన్ని మరింత ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ బంద్’ అని సమన్వయ కమిటీ ఎల్.వినోద్ స్పష్టంచేశారు. కుకీ మిలిటెంట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాన్నాళ్ల తర్వాత చర్చలు పునరుద్ధరించబడిన తరుణంలో అల్లర్లు మొదలవడం గమనార్హం. మరోవైపు శాంతిస్థాపనకు చర్యలు చేపట్టాలని స్థానిక తెగల నేతల ఫోరం(ఐటీఎల్ఎఫ్) విజ్ఞప్తిచేసింది. -
బీజింగ్‌లో అనూహ్య వరదలు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో కనీసం 20 మంది చనిపోగా మరో 27 మంది గల్లంతయ్యారు. బీజింగ్ ఎండల తీవ్రత అంతగా ఉండదు. కానీ, ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఎండలతో జనం ఇబ్బందులు పడ్డారు. అదేవిథంగా, భారీ వర్షాలు కురియడం కూడా అరుదే. ఈసారి మాత్రం అసాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. జనావాసాలు నీట మునిగాయి. రహదారులు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలకు సంబంధించిన ఘటనల్లో బీజింగ్ సిటీ సెంటర్లో 11 మంది చనిపోగా, 27 మంది జాడ తెలియకుండాపోయారు. నగర పరిధిలోని హుబే ప్రావిన్స్‌లో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని అధికార మీడియా తెలిపింది. -
పడవ మునక.. 21 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. రిజాల్ ప్రావిన్స్ బినంగోనన్ పట్టణ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో పడవలో ప్రయాణికులెందరున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. గాలులు బలంగా వీస్తుండటంతో ప్రయాణికులంతా పడవలో ఒకే వైపునకు చేరడంతో ప్రమాదం జరిగిందన్నారు. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్స్క్లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరి్నహివ్పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు. -
అల్జీరియాలో 34 మంది మృతి
అల్జీర్స్: దక్షిణ అల్జీరియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 34 మంది మరణించారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు. పరస్పరం ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగాయని, అందుకే భారీగా ప్రాణనష్టం జరిగిందని అధికారులు చెప్పారు. సహారా ఎడారి సమీపంలో తామన్రసెట్ ప్రావిన్స్‌లో తెల్లవారుజామున 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. -
పశ్చిమ బెంగాల్: ఎన్నికల్లో రక్తచరిత్ర.. ఎందుకీ హింస?
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ హింస రాజుకోవడం కొత్త కాదు. కాల్పులు, బాంబుల మోత, గృహదహనాలు, రాళ్లు విసురుకోవడాలు, బ్యాలెట్ బాక్స్‌లకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు సర్వసాధారణం. రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరగడం ఒక రివాజుగా మారింది. ఏ ఎన్నికలైనా, ఎవరు అధికారంలో ఉన్నా ఒక రక్తచరిత్రను తలపిస్తూ ఉంటాయి. కుల, మతపరమైన హింస దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తే రాజకీయ పార్టీల వారీగా ప్రజల్లో ఇక్కడ విభజన ఎక్కువ. ఎన్నికల వేళ ఈ విభేదాలు మరింత ముదిరి హింసకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగడం, ఎన్నికల సంఘం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండడం ఎన్నికల హింసకు ఒక కారణమేనని రాజకీయ విశ్లేషకుడు స్నిగ్ధేందు భట్టాచార్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువని, అందుకే ఎన్నికల సమయంలో హింస రాజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో బీజేపీ బెంగాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయ కక్షసాధింపులే కేంద్రంగా ఉన్న బెంగాల్లో మైనార్టీ బుజ్జగింపు చర్యలు, మతపరమైన రాజకీయాలు తోడు కావడంతో హింస ప్రజ్వరిల్లింది. టీఎంసీ కార్యకర్త హత్యకి ప్రతీకారంగా 2021 మార్చిలో బిర్భూమ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికలకి లిట్మస్ టెస్ట్ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు విషమ పరీక్షే. కాంగ్రెస్, లెఫ్ట్‌లతో చేతులు కలిపిన టీఎంసీ ఒకవైపు, బీజేపీ మరోవైపు రెండు శిబిరాలుగా మారిపోవడంతో ఘర్షణలు మరింతగా పెరుగుతున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ టీఎంసీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. అప్పట్నుంచి టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ పోరు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎస్ఎస్సీ, బొగ్గు స్మగ్లింగ్ కేసుల్లో టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ గురిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో అమీతుమీకి ఇరుపక్షాలు సిద్ధపడడం హింసను పెంచుతోంది. భద్రత ఇలా.. ► పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మళ్లీ రక్తమోడింది. కేంద్ర బలగాలు రంగంలోకి దింపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని 61,636 పోలింగ్ స్టేషన్లలో భారీగా భద్రతా ఏర్పాట్లు, ముందస్తు అరెస్ట్‌లు, ఆయుధాల స్వా«దీనం వంటి చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇప్పుడు టీఎంసీ.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా బుల్లెట్ పేలకుండా బ్యాలెట్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. పంచాయతీల్లో రాజకీయ నాయకులు తమ ధనబలం, కండబలంతో ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పాటు సీపీఐ(ఎం) రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల హింస తారాస్థాయికి చేరుకుంది. ధనబలం.. ► ఇటీవల పంచాయతీలకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరగడం హింసకు ఒక కారణంగా మారింది. ఒక జిల్లా కౌన్సిల్ ఐదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఒక గ్రామ పంచాయతీ రూ.5–15 కోట్లు ఖర్చు పెట్టుకునే వీలుంది. ప్రతీ ఏడాది గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయిస్తుంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించడానికైనా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ► గత నెల జూన్ 8 – 27 మధ్య బెంగాల్లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 337 మందికి గాయాలయ్యాయి. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ బెంగాల్లోనే 38 వరకు మరణించారు. ► 2018లో పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు 13 వరకు జరిగాయి. అదే ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 30 మంది మరణిస్తే, 12 మంది పోలింగ్ రోజునే ప్రాణాలు కోల్పోయారు. ► 2011లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిడ్నాపూర్‌లో జరిగిన ఘర్షణల్లో 14 మంది మరణించారు. ► లెఫ్ట్ అధికారంలో ఉన్న సమయంలో 2003లో 70 మంది 2008లో 36 మంది మరణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Poll violence in Bengal: బెంగాల్ పంచాయతీ హింసాత్మకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో శనివారం రాష్ట్రం దద్దరిల్లింది. ఈ హింసాత్మక ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు. బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన వారు మరణించారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకొని పోవడం, వాటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బెహార్, జిల్లాలతో పాటు దక్షిణ 24 పరగణాలోని భాంగార్, నందిగ్రామ్‌లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ఆనంద బోస్ ఉత్తర 24 పరగణా జిల్లాలో స్వయంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. మృతి చెందిన వారిలో బీజేపీకి పోలింగ్ ఏజెంట్ మధాబ్ బిశ్వాస్ కూచ్‌బెహార్ జిల్లాలో జరిగిన ఘర్షణలో మరణించారు. ఉత్తర దింజాపూర్‌లోని గోల్‌పోఖార్‌లో టీఎంసీ, కాంగ్రెస్ మద్య ఘర్షణల్లో టీఎంసీ పంచాయతీ అధ్యక్షురాలి భర్తను హత్య చేశారు. ముర్షీదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ, ఖర్గామ్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త సబీరుద్దీన్, కూచ్ బెహార్ జిల్లా తుఫాన్గంజ్లో బూతు కమిటీ సభ్యుడు గణేశ్ సర్కార్ మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపైనే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి చంపేశారని టీఎంసీ ఆరోపించింది. మూడంచెలున్న పంచాయతీల్లో 73,887 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీల పరస్పర ఆరోపణలు ఎన్నికల్లో హింసకు మీరు కారణమంటే మీరేనని బీజేపీ, టీఎంసీలు ఒకరినొకరు నిందించుకున్నాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని టీఎంసీ మంత్రి శశిపంజా ప్రశ్నించారు. కేంద్ర బలగాలు ఎందుకు మోహరించాయని, టీఎంసీ కార్యకర్తల్ని హత్య చేస్తూ ఉంటే ఆ బలగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని అన్నారు. ఈ ఘర్షణలకు టీఎంసీ కారణమంటూ బీజేపీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. హింసకు తామే కారణమైతే అంత మంది టీఎంసీ కార్యకర్తలు ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో బాంబుల సంస్కృతి‡ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారిందని, అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చని మమత భావిస్తున్నారని ఆరోపించారు. హత్యల కారణంగా ఎన్నికల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బగ్చి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. -
ఉక్రెయిన్ రెస్టారెంట్‌పై రష్యా క్షిపణి దాడి
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో పాపులర్ పిజ్జా రెస్టారెంట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 11 మంది మరణించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో మరో 61 మందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఇదే పెద్దది. అయితే ఈ క్షిపణి రెస్టారెంట్ వైపు వెళ్లేలా ప్రయోగించడానికి ఉక్రెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి రష్యా మిలటరీకి సాయం చేశాడన్న ఆరోపణలపై ఉక్రెయిన్ అధికారులు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. రష్యాలో ప్రైవేటు సైన్యం వాగ్నర్ సంస్థ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత రాజకీయంగా, మిలటరీ పరంగా అంతర్గత సంక్షోభం ఉన్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్‌పై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
మూడు రైళ్లు...మహా విషాదం!
భువనేశ్వర్/బాలాసోర్/హౌరా/సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఒకే చోటఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దారుణంలో కనీసం వంద మందికిపైగా దుర్మరణం పాలైనట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 350 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వందలాది మంది బోగీల్లో చిక్కుబడి ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కన్పిస్తోంది. సహాయక చర్యలకు పెను చీకటి అడ్డంకిగా మారింది. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఏం జరిగింది...? రాత్రి ఏడింటి ప్రాంతంలో బెంగుళూర్ నుంచి హౌరా వెళ్తున్న 12864 ఎక్స్‌ప్రెస్ బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దాని తాలూకు బోగీలను ఢీకొని షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పిందని, దాని బోగీలు మరో ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌పైకి దూసుకెళ్లాయని అంటున్నారు. కానీ వాస్తవానికి తొలుత ప్రమాదానికి గురైంది కోరమండల్ ఎక్స్ప్రెసేనన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం. దానికి పొరపాటున లూప్ లైన్లోకి సిగ్నల్ ఇవ్వడంతో ఆ ట్రాక్‌పై నిలిచి ఉన్న గూడ్స్‌ను శరవేగంగా ఢీకొట్టిందన్నది వారు చెబుతున్నారు. ‘‘ప్రమాద ధాటికి కనీసం ఏకంగా 14 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు బోగీలు గూడ్స్ బోగీల్లోకి దూసుకెళ్లాయి. దాంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి పరుగులు తీశారు. మరికొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. ఆ ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పింది’’ అని వారంటున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికారులు సరైన సమాచరం ఇవ్వకపోవడం, దాంతో సైట్లు, వార్తా సంస్థలు ఒక్కోటీ ఒకోలా రిపోర్టు చేయడం మరింత గందరగోళానికి దారితీసింది. హుటాహుటిన సహాయ చర్యలు ప్రమాద సమాచారం తెలియగా>నే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. చీకటి వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెప్పారు. 132 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. మిగతా వారిని సొరో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గోపాల్పూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, ఖొంటపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం కూడా రంగంలోకి దిగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం ఆయన ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. రైలు ప్రమాదంపై పరిస్థితిని తాను వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. రైల్వేస్టేషన్లు.. విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 0883 2420541, రేణిగుంటలో 9949198414, తిరుపతిలో 7815915571, నెల్లూరులో 0861 2342028, సామర్లకోటలో 7780741268, ఒంగోలులో 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రాగచ్చిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీగా ప్రయాణికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు సాధ్యమైన సహాయం అందించనున్నట్లు c. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రూ.10 లక్షల పరిహారం.. ప్రమాద బాధితులకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. మృతుల కు టుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. మాటలకందని విషాదం: వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ‘‘ఇది మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు దేవుడు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి అందరూ కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగేలా అందరూ సహకరించాలని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు తోడుగా నిలవాలని ట్వీట్ చేశారు. రద్దయిన రైళ్లు ఇవే... 12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023); 12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 20831 షాలిమార్–సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023); 12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023); 12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12509 ఎస్ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023). -
బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి
లిమా: దక్షిణ అమెరికా దేశం పెరూలోని ఓ బంగారు గనిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఇద్దరిని మాత్రమే రక్షించగలిగామని అధికారులు తెలిపారు. అరెక్విపా ప్రాంతంలోని ఎస్పెరాంజా గనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ఘటన చోటుచేసుకుంది. గనిలో సుమారు 100 మీటర్ల లోతులో సిబ్బంది పనిచేస్తున్న చోట మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ఏటా వీటి నుంచి 100 టన్నుల బంగారాన్ని వెలికితీస్తుంటుంది. ప్రపంచంలోని బంగారం ఉత్పత్తిలో ఇది 4%. -
సెర్బియాలో కాల్పులు.. 8 మంది మృతి
బెల్గ్రేడ్: సెర్బియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తుపాకీ పట్టుకున్న ఒక దుండగుడు కదులుతున్న కారులోంచి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బెల్గ్రేడ్కు దక్షిణంగా కారులో ప్రయాణిస్తూ మూడు గ్రామాల పరిధిలో ఆటోమేటెడ్ గన్‌తో అతను ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం నిందితుడ్ని అదుపులోనికి తీసుకుంది. ఆ వ్యక్తి ధరించిన నీలం రంగు టీ షర్ట్‌పై నాజీల అనుకూల నినాదాలు ఉన్నాయి. అయితే అతను ఎందుకు ఈ కాల్పులు జరిపాడో ఇంకా తెలియాల్సి ఉంది. స్కూలు విద్యార్థి జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన రెండు రోజులకే మరొకటి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. -
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం 21 మంది మృతి.. మరో ఘటనలో 11 మంది
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఈ ఘటనలో 71 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టామన్నారు. మరో ఘటనలో 11 మంది... ఝెజియాంగ్ ప్రావిన్స్ జిన్హువా నగరంలోని ఓ తలుపుల తయారీ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. కలప, రసాయనాల కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. -
యూపీలో వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది...
షాజహాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్, శ్రావస్తి జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. షాజహాన్‌పూర్ జిల్లా అజ్మత్‌పూర్‌కు చెందిన సుమారు 30 మంది గ్రామంలో జరిగే భాగవత కథ కార్యక్రమం కోసం నీటిని తెచ్చేందుకు గర్రా నదికి ట్రాక్టర్‌పై బయలుదేరారు. నిగోహి రోడ్డులో వంతెనపై వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిపోయింది. ఘటనలో 8 మంది చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంటున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మరో ఘటన..శ్రావస్తి, బలరాంపూర్ జిల్లాలకు చెందిన కొందరు పంజాబ్‌లోని లూధియానాలో పనులు చేసుకుంటున్నారు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరు ఎస్‌యూవీలో బయలుదేరారు. ఆ వాహనం శనివారం వేకువజామున శ్రావస్తి జిల్లా ఇకౌనా ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు పక్క చెట్టును ఢీకొని, గుంతలో పడిపోయింది. ఘటనలో 9 ఏళ్ల బాలుడు సహా ఆరుగురు చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. -
అమెరికాలో టోర్నడో బీభత్సం
లిటిల్‌రాక్ (యూఎస్): అమెరికాలో వారం క్రితం మిసిసిపి, పరిసర ప్రాంతాలను అల్లాడించిన ప్రాణాంతక టోర్నడో శుక్రవారం దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది. అర్కన్సాస్, ఇల్లినాయీతో పాటు ఇండియానా, అలబామా రాష్ట్రాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వచ్చి పడ్డ పెనుగాలుల ధాటికి ఎక్కడ చూసినా నేలమట్టమైన ఇళ్లు, షాపింగ్ సెంటర్లు తదితర భవనాలతో పరిస్థితి భయానకంగా మారింది. టోర్నడో బారిన పడి 18 మందికి పైగా మరణించగా డజన్ల మంది గాయపడ్డారు. అయోవా, ఓక్లహామా రాష్ట్రాల్లోనూ భారీ నష్టం సంభవించింది. దాదాపు 3 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. పెనుగాలుల కారణంగా పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యవసర, విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగాయి. వచ్చే బుధవారం మరికొన్ని భారీ తుపాన్లు, టోర్నడోలు రావచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
నాష్విల్లే స్కూల్లో దురాగతం..మాజీ విద్యార్థి పనే
నాష్విల్లే: అమెరికాలోని నాష్విల్లే క్రిస్టి యన్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో తొమ్మిదేళ్ల ముగ్గురు చిన్నారులతోపాటు స్కూల్ హెడ్ కేథరిన్, ఒక సబ్‌స్టిట్యూట్ టీచర్, కస్టోడియన్ ఒకరు ఉన్నారు. అనంతరం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ల ఆడ్రే ఎలిజబెత్ హేల్ అనే ట్రాన్స్‌జెండర్ మహిళగా గుర్తించారు. కాల్పుల గురించి పోలీసులకు 10.13 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే స్కూల్ వద్దకు చేరుకుని మొదటి అంతస్తులో ఉన్న విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. రెండో అంతస్తులో కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై హేల్ కాల్పులకు తెగించింది. వెంటనే జరిపిన ఎదురుకాల్పుల్లో హేల్ అక్కడికక్కడే హతమైంది. ఆమె వద్ద ఉన్న రెండు అసాల్ట్ రైఫిళ్లు, ఒక హ్యాండ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 నిమిషాల్లో ఇదంతా జరిగిపోయింది. ఆమె స్కూల్లోకి కారులో వచ్చినట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డయి ఉంది. షూటర్ హేల్ మాజీ విద్యార్థి అని అంటున్న పోలీసులు ప్రస్తుతం ఆమెకు స్కూల్‌తో గానీ స్కూల్ స్టాఫ్‌తో గానీ ఎటువంటి సంబంధాలున్నాయి? ఎవరిపై అయినా విరోధంతో ఈ ఘోరానికి పాల్పడిందా? అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే, కోవెనంట్ స్కూల్‌పై ద్వేష భావం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీస్ చీఫ్ జాన్ డ్రేక్ అన్నారు. మరోచోట కూడా కాల్పులు జరిపేందుకు హేల్ పథకం వేసినట్లు భావిస్తున్నామన్నారు. ఎన్కౌంటర్ ముగిసిన వెంటనే హేల్ ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు రెండు షాట్గన్లు దొరికాయి. ఇంకా స్కూల్‌కు సంబంధించిన మ్యాప్, ఇతర ప్రదేశాల మ్యాప్‌లు, కాల్పులకు ముందు రెక్కీ చేపట్టినట్లు ఆధారాలు దొరికాయి. ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు, అనూహ్య ఘటన జరగబోతోందంటూ కొద్ది నిమిషాలకు ముందే హేల్ తమకు మెసేజీలు పంపినట్లు స్నేహితులు చెబుతున్నారు. దారుణానికి వేదికైన కోవెనంట్ ప్రెస్బిటేరియన్ చర్చి స్కూల్ 2001లో ప్రారంభమైంది. ఇక్కడ ప్రి స్కూల్ నుంచి ఆరో గ్రేడ్ వరకు 200 మంది వరకు చిన్నారులు చదువుకుంటుండగా, 50 మంది సిబ్బంది ఉన్నారు. -
యూపీలో ఆలూ కోల్డ్‌స్టోరేజీలో ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో బంగాళదుంపలు నిల్వ చేసే ఒక కోల్డ్ స్టోరేజీ పైకప్పు కుప్పకూలిపోయిన ఘటనలో 14 మంది మరణించారు. చాందౌసీ పోలీసు స్టేషన్ పరిధిలో ఇందిరా రోడ్డులో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజీ పై కప్పు గురువారం రాత్రి హఠాత్తుగా కుప్పకూలింది. ఆ సమయంలో కోల్డ్ స్టోరేజీ లోపల ఆలూ బస్తాలను అన్లోడ్ చేస్తున్న వర్కర్లు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయ సిబ్బంది 24 మందిని ఆలూ బస్తాల నుంచి బయటకు తీసుకురాగా వారిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఆఫ్ పోలీసు శలభ మాథూర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించిన యోగి బాధితుల్ని పరామర్శించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఒక కమిటీ వేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం, గాయపడిన వారికి చికిత్స కోసం రూ.50 వేలు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో కోల్డ్ స్టోరేజీలో ఉన్న వారిలో ఆరుగురు స్వల్పగాయాలకు చికిత్స తీసుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మరో నలుగురికి చికిత్స జరుగుతోందని జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ బన్సల్ తెలిపారు. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ కోల్డ్ స్టోరేజీని మూడు నెలల క్రితమే నిర్మించారు. ప్రభుత్వం దగ్గర్నుంచి సరైన అనుమతులు లేకుండానే హడావుడిగా దీని నిర్మాణం కొనసాగించినట్టు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీ సామర్థ్యానికి మించి బంగాళ దుంప బస్తాలు నిల్వ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవే ప్రమాదానికి దారి తీసినట్టు భావిస్తున్నారు. -
అమెరికాను ముంచేసిన మంచు.. 60 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో హిమోత్పాతం దేశాన్ని గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. One car tried to drive my hill and Queen Anne and hit all these parked cars who clue down the hill… insane. DON’T DRIVE. #seattle pic.twitter.com/wJsor6byDa — Kaybergz (@kay0kayla) December 23, 2022 కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ (ఎన్‌డబ్ల్యూఎస్) తెలిపింది. ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు. ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో కోటి మంది వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కార్లలో ప్రయాణిస్తున్న వారిపై విపరీతంగా మంచుకురవడం వల్ల ఆ వాహనంలో మంచులో కూరుకుపోయి మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావడంపై ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. విద్యుత్ సబ్ స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికి కరెంట్ వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా ఈ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయింది. My dads places in Crystal Beach after the winter storm pic.twitter.com/BnntAihoMz — Bat Boy Slim (@TerjeOliver) December 26, 2022 -
Morbi bridge collapse: మోర్బీ వంతెన ప్రమాదంలో... 134కు పెరిగిన మృతులు
మోర్బీ/న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై బ్రిటిష్ కాలపు తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 134కు పెరిగింది! మరో ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దుర్ఘటన నేపథ్యంలో గుజరాత్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో రోడ్డు షో రద్దు చేసుకోగా కాంగ్రెస్ పరివర్తన్ సంకల్ప యాత్రను వాయిదా వేసుకుంది. గుజరాత్‌లోనే ఉన్న మోదీ ఈ ఘటనపై సోమవారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బాధితులకు అన్ని విధాలా సాయమందించాలని ఆదేశించారు. మంగళవారంఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. మోర్బీ వంతెన ప్రమాదంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ కుటుంబంలో పెను విషాదం వంతెన ప్రమాదానికి గుజరాత్‌లోని రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కల్యాణ్‌జీ కుందారియా కుటుంబంలో ఏకంగా 12 మంది బలయ్యారు! వారంతా ఆయన సోదరుడు, సోదరీమణుల కుటుంబాలకు చెందినవారు. వీరిలో ఐదుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. బ్రిడ్జిని చూసేందుకని వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోయారంటూ ఎంపీ కంటతడి పెట్టారు. ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘అజంతా’కు నిర్వహణ కాంట్రాక్ట్ మోర్బీ వంతెన నిర్వహణ, అపరేషన్ కాంట్రాక్ట్‌ను అజంతా ఒరెవా కంపెనీకి అప్పగించారు. సీఎఫ్ఎల్ బల్బులు, గోడ గడియారాలు, ఎలక్ట్రానిక్ బైక్‌ల తయారీకి అజంతా గ్రూప్ పేరొందింది. ఎల్ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లు, సెరామిక్ ఉత్పత్తులనూ తయారు చేస్తోంది. గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.800 కోట్ల పైమాటే. ‘ఫిట్‌నెట్ సర్టిఫికెట్’ లేకుండానే.. బ్రిడ్జికి ఫిట్‌నెట్ సర్టిఫికెట్ జారీ చేయలేదని మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ చెప్పారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని తెలిపారు. ‘‘వంతెనపైకి 20–25 మందిని ఒక గ్రూప్‌గా అనుమతిస్తుంటారు. కానీ నిర్వాహక సంస్థ అజంతా ఒరెవా నిర్లక్ష్యంగా ఒకేసారి దాదాపు 500 మందిని వెళ్లనిచ్చింది. అదే ఘోర ప్రమాదానికి దారి తీసింది’’ అన్నారు. 9 మంది అరెస్టు ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా 9 మందిని అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు తెలియజేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఐపీసీ సెక్షన్ 304, సెక్షన్ 308 కింద కేసు పెట్టామన్నారు. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడి స్థానంలో అజంతా కంపెనీ పేరు చేర్చామన్నారు. పూర్తి వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించారు. అరెస్టయిన 9 మందిలో అజంతా ఒవెరా గ్రూప్‌నకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టిక్కెట్ బుకింగ్ క్లర్కులు ఉన్నారు. బతుకుతెరువు కోసం వెళ్లి బలయ్యాడు బర్ధమాన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్బ బర్ధమాన్ జిల్లా కేశబ్బతి గ్రామానికి చెందిన 18 ఏళ్ల షేక్ హబీబుల్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని మోర్బీకి చేరుకున్నాడు. నగల దుకాణంలో పనికి కుదిరాడు. గత 10 నెలలుగా అక్కడే పనిచేస్తున్నాడు. ఆదివారం తీగల వంతెన చూసేందుకు వెళ్లాడు. దానిపైకి చేరుకొని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. షేక్ హబీబుల్ మృతితో స్వగ్రామం కేశబ్బతిలో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కలలన్నీ చెదిరిపోయాయని హబీబుల్ తండ్రి మహీబుల్ షేక్ వాపోయాడు. హబీబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కునాల్ ఘోష్ భరోసానిచ్చారు. 675 టికెట్లు అమ్మారా? మోర్బీ వంతెన ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. ప్రమాద సమయంలో 500 మందికిపైగా జనం వంతెనపై ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. బరువు ఎక్కువై కూలిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తీగల సాయంతో వేలాడే ఈ వంతెన సామర్థ్యం కేవలం 150 మంది. అంతకంటే ఎక్కువ మంది వెళితే ఆ బరువును తట్టుకోలేదు. ఈ విషయం తెలిసినప్పటికీ కాంట్రాక్ట్ సంస్థ ‘అజంతా ఒరెవా’ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏకంగా 675 మంది సందర్శకులకు టిక్కెట్లు విక్రయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నా చెల్లెలు కనిపించడం లేదు ప్రమాదంలో చెల్లెలు కనిపించకుండా పోయిందని ఓ యువకుడు రోదిస్తున్నాడు. ‘‘ఆ వంతెనపైకి మొదటిసారి వెళ్లాం. అప్పటికే వందలాది మంది ఉన్నారు. సెల్ఫీలు తీసుకుంటుండగానే కుప్పకూలింది. నేను మాత్రం ఈదుకొచ్చా. చెల్లి కోసం నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నా’’ అన్నాడు. భారీ శబ్దం వినిపించింది ‘‘స్నేహితులతో కలిసి వంతెన సమీపంలోనే కూర్చున్నా. అంతలో భారీ శబ్దం వినిపించింది. వంతెన కూలింది. వెంటనే అక్కడికి పరుగెత్తాం. కొందరు ఈదుతూ, మరికొందరు మునిగిపోతూ కనిపించారు. మేం పైపు సాయంతో 8 మందిని రక్షించాం’’ అని సుభాష్ భాయ్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. నా మిత్రుడు రాజేశ్ ఏమయ్యాడు? తన మిత్రుడు రాజేశ్ గల్లంతయ్యాడంటూ జయేశ్ భాయ్ అనే యువకుడు కంటతడి పెట్టాడు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని వాపోయాడు. 15 మృతదేహాలను బయటకు చేర్చా వంతెనపై 60 మందికి పైగా వేలాడుతూ కనిపించారని రమేశ్ భాయ్ చెప్పాడు. మిత్రులతో కలిసి తాడు సాయంతో 15 మృతదేహాలను బయటకు తెచ్చామన్నాడు. -
సునామీ భయం ప్రాణాలు తోడేసింది
మనీలా: సునామీ భయం ఫిలిప్పీన్స్ పర్వతప్రాంత ప్రజల ప్రాణాలు తీసింది. అక్కడ కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భారీ అలలు వచ్చి పడటంతో సునామీ ముంచుకొస్తోందని మగుందనావో ప్రావిన్స్‌లోని కుసియాంగ్ గ్రామవాసులు భయపడ్డారు. గతంలో ఆ గ్రామాన్ని భయంకర సునామీ ముంచెత్తింది. నాటి నేటికీ వెంటాడుతున్నాయి. దాంతో వారంతా హుటాహుటిన కొండ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి అక్కడ మట్టి, బురదచరియలు విరిగిపడి ఉన్నాయి. ఆ ఊబిలో చిక్కి దాదాపు 20 మంది సజీవ సమాధి అయ్యారు. అయితే, ఈసారి మృత్యువు మరో రూపంలో వారిని కబళించింది. వాయవ్య ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్న నాల్గే తుపాను కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. ఈ తుపాను ప్రభావ వర్షాల కారణంగానే కుసియాంగ్ గ్రామంలో బురదచరియలు విరిగిపడ్డాయి. ‘ఏటా ఇక్కడి వారు సునామీ వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఘటన జరిగినప్పుడు సైతం వార్నింగ్ బెల్స్ మోగడంతో చాలా మంది కొండ వద్ద ఉన్న చర్చి వద్దకు పరుగులు తీశారు. అదే వారి ఉసురు తీసింది’’ అని ఆ ప్రావిన్స్ మంత్రి చెప్పారు. -
South Korea: హాలోవీన్ వేడుకల్లో విషాదం (ఫోటోలు)
-
హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట..150కి చేరిన మృతుల సంఖ్య
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.çహాలోవీన్‌ను పురస్కరించుకుని శనివారం రాత్రి వీధుల్లో సంబరాలకు గుమిగూడిన జనం అకస్మాత్తుగా ఒక ఇరుకైన వీధిలోంచి పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ అనూహ్య ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో ఊపిరాడక ఈ మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Officials in Seoul said that at least 120 people were dead and 100 others were injured after a stampede in the South Korean capital's popular Itaewon district, where crowds had gathered to celebrate Halloween. https://t.co/auJuczo3Ll pic.twitter.com/7FXmfW8qab — The New York Times (@nytimes) October 29, 2022 ఇటెవోన్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన హాలోవీన్ ర్యాలీలో సుమారు లక్షమంది పాల్గొన్నాట్లు సమాచారం. వేల సంఖ్యలో గుమికూడిన ప్రజలు హ్యామిల్టన్ హోటల్ సమీపంలోని ఇరుకు మార్గం గుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొందరు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోగా మరికొందరు చనిపోయారు. WARNING: GRAPHIC CONTENT – At least 149 people, mostly teenagers and young adults in their 20s, were killed in South Korea when a crowd celebrating Halloween surged into an alley in a night-life area of Seoul https://t.co/ZBB3cKhxO5 pic.twitter.com/evlVibGuUw — Reuters (@Reuters) October 29, 2022 పదుల సంఖ్యలో ఒకరిపై ఒకరు పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న వారికి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. రక్షణ, సహాయక చర్యల నిమిత్తం 400 మంది సిబ్బందిని, 140 వాహనాలను వినిగించామన్నారు. ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయిన 150 మందిపైగా బాధితులకు సీపీఆర్ అందించినట్లు తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా అంబులెన్సులు, పోలీసు వాహనాల సంచారంతో నిండిపోయింది. Pushing and stressing hysterically, a man tries to escape..during the celebrations at the Halloween party..in South Korea..#SouthKorea #Halloween #Seoul #Itaewon #이태원 #이태원사고 #압사사고. pic.twitter.com/qqmgvLOXVf — Siraj Noorani (@sirajnoorani) October 29, 2022 తోపులాటకు కారణం తోపులాటకు దారి తీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇరుకు వీధిలోని ఇటెవొన్ బార్‌కు ఓ సెలబ్రిటీ వచ్చారన్న వార్తలతో జనం అక్కడికి చేరుకునేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడమే తోపులాటకు కారణమని స్థానిక మీడియా అంటోంది. 2020 కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు జనం పెద్ద సంఖ్యలో హాజరైనట్లు సమాచారం. ఆ ప్రాంతం అంత సురక్షితమైంది కాదంటూ శనివారం సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం కావడం గమనార్హం. అత్యవసర సమావేశం విషాద ఘటన అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులు, మరణించిన వారి అంత్యక్రియలక నిర్వహణ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
Russia-Ukraine War: కొనసాగుతున్న దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల పరంపర కొనసాగుతోంది. నేరుగా జనావాసాలను లక్ష్యంగా చేసుకొని రష్యా మిలటరీ దాడులు చేస్తోంది. అవిడ్వికా, నిక్పోల్, జపోరిజియా నగరాలపై ఎస్–300 క్షిపణులతో దాడి చేస్తోంది. అవిడ్వికా మార్కెట్‌పై జరిగిన క్షిపణి దాడిలో ఏడుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా, యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని నాటో స్పష్టం చేసింది. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో 50 దేశాల సమావేశాం అనంతరం కూటమి చీఫ్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థను అందించడానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని స్టోలెన్‌బర్గ్ స్పష్టంచేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడికి దిగుతుందని తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. అయితే అణు దాడికైనా వెనుకాడమని రష్యా అధినేత హెచ్చరించడం ఆయన బాధ్యతరాహిత్యాన్ని బయటపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్ మిలటరీ సామర్థ్యాన్ని, పశ్చిమ దేశాల అండను పుతిన్ తక్కువగా అంచనా వేశారని వ్యాఖ్యానించారు. మరోవైపు కెర్చ్ వంతెన పేలుడుకు సంబంధించి ఐదుగురు రష్యన్లు, ముగ్గురు ఉక్రెనియన్లను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అరెస్ట్ చేసింది. -
ఇరాన్లో హిజాబ్ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉధృతం రూపం దాలుస్తున్నాయి. కొత్త నగరాలు, పట్టణాలకు వ్యాపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి, నిర్బంధ హిజాబ్ ధారణ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు నిరసనలను ఇరాన్ భద్రతా దళాలు అణచివేస్తున్నాయి. భద్రతా సిబ్బంది దాడుల్లో ఇప్పటిదాకా 50 మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ హ్యూమన్ రైట్స్(ఐహెచ్ఆర్) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ప్రకటించింది. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని రెజ్‌వన్‌షాహర్ పట్టణంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు బలయ్యారని తెలియజేసింది. బబోల్, అమోల్‌లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆయా పట్టణాల్లో కాల్పుల్లో పలువురు మృతిచెందారని ఫ్రాన్స్ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ అత్యున్నత మతపెద్ద ఖమేనీ విగ్రహాన్ని ఆయన స్వస్థలం మషాద్‌లో నిరసనకారులు దహనం చేశారు. మరోవైపు ప్రభుత్వానికి మద్దతుగా టెహ్రాన్‌లో పలువురు ర్యాలీలు నిర్వహించారు. ఇరాన్లో పరిస్థితులపై ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇళ్లు, గోడలు కూలి 22 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పేదల ఉసురు తీశాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్‌లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది కూలీలున్నారు. లక్నోలోని దిల్కుషా ఏరియాలో ఆర్మీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ పనుల్లో పాల్గొంటున్న కూలీలు కొందరు ఆ గోడ పక్కనే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. భారీ వర్షాలతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రహరీ కూలీల గుడిసెలపై కూలిపడింది. శిథిలాల కింద చిక్కుకుని తొమ్మిది మంది చనిపోయారు. గాయపడిన ఒక్కరిని మాత్రం పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఝాన్సీ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. అదేవిధంగా, ఉన్నావ్ జిల్లా కాంతా గ్రామంలోని ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఝాలిహాయ్, కసందా గ్రామాల్లో ఇళ్లు కూలి ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫతేపూర్ జిల్లాలో ముగ్గురు, సీతాపూర్ జిల్లాలో ఒకరు, ప్రయాగ్‌రాజ్‌లో ఇద్దరు చిన్నారులు ఇంటి గోడకూలి మీద పడటంతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. లక్నో విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. -
అమెరికాలో దుమ్ము బీభత్సం
హర్డిన్: అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో సంభవించిన దుమ్ము తుపాను ఆరు ప్రాణాలను బలి తీసుకుంది. గంటకు 60 మైళ్ల వేగంతో వీచిన బలమైన గాలులు, దుమ్ము తుపానులో హార్డిన్ సమీపంలో మోంటానా ఇంటర్ స్టేట్ హైవేపై వెళ్తున్న వాహనాలు చిక్కుకున్నాయి. దారి కనిపించక ట్రాక్టర్ ట్రయిలర్లు, కార్లు తదితర 21 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు చనిపోయారని, క్షతగాత్రుల సంఖ్య తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడిందన్నారు. -
Russia-Ukraine war: ముట్టడిలో నగరాలు
పోక్రోవ్స్క్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పున డోన్బాస్లో పలు నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడింది. తయరీ పరిశ్రమకు కేంద్రమైన సెవెరోడోనెట్స్క్ నగరం బాంబులు, క్షిపణుల మోతతో దద్దరిల్లింది. సమీపంలోని లిసిచాన్స్క్ తదితర నగరాలపైనా దాడులు తీవ్రతరమయ్యాయి. డోన్బాస్లో కీలక కేంద్రాలైన ఈ రెండు నగరాలను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే ఉక్రెయిన్ దళాలు పలుచోట్ల వాటితో హోరాహోరీ తలపడుతున్నాయి. డోన్బాస్ చాలావరకు రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉండగా ఈ రెండు నగరాలూ ఉక్రెయిన్ అధీనంలో ఉన్నాయి. అక్కడి సైనిక లక్ష్యాలపై జరిగిన దాడుల్లో పలువురు పౌరులు కూడా బలయ్యారు. పౌర సేవలన్నీ స్తంభించిపోయాయి. సెవెరోలో ఇప్పటికే కనీసం 1500 మందికి పైగా మరణించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బాబ్రోవ్ గ్రామం వద్ద జరిగిన పోరులో రష్యా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. చాలామంది సైనికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు అవుతున్నట్టు చెబుతున్నారు. లుహాన్స్క్ ప్రాంతంలోని బక్ముట్ నగరంపైనా శనివారం రాత్రి నుంచి దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తరాన రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌తో పాటు , సమీ తదితర ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి దాడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఈయూ ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యాతో సెర్బియా మూడేళ్ల గ్యాస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశం ఇంధన అవసరాల కోసం దాదాపుగా రష్యా మీదే ఆధారపడింది. -
తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ
అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి. అంటే సగటున వారానికి పదన్నమాట! 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 56 మంది పౌరులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో ఈ నిత్య మారణకాండకు అక్కడి తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం. అమెరికాలో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైందని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థ గానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థ గానీ లేకపోవడంతో స్వీయరక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైనా తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ). ఏమిటీ ఎన్ఆర్ఏ? అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్ఆర్ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్‌తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. పైగా మాజీ అధ్యక్షులు, నేతలు, సినీ స్టార్ల వంటి ప్రముఖులెందరో ఈ సంస్థలో సభ్యులు. ఇటీవల పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. తుపాకుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఆర్‌ఏకు దీటుగా నిధులు సేకరించి తుపాకీ సంస్కృతి వ్యతిరేక ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ సంస్థలు 2018లో తొలిసారి ఎన్ఆర్ఏ కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు అంచనా. పౌరులదీ అదే దారి తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని కేవలం 52 శాతం మందే కోరుతున్నట్టు గాలప్ అనే సంస్థ 2020లో చేసిన సర్వేలో తేలింది. తుపాకుల వాడకానికి ఉన్న స్వేచ్ఛ ఇలాగే కొనసాగాలని 32 శాతం చెప్పారు. 11 శాతం మందైతే ప్రస్తుతమున్న కొద్దిపాటి నియంత్రణను కూడా ఎత్తేయాలంటున్నారు! చట్టసభ్యుల విషయానికొస్తే డెమొక్రాట్లలో 91 శాతం, రిపబ్లికన్లలో 24 శాతం తుపాకులపై నియంత్రణ డిమాండ్‌కు మద్దతిస్తున్నారు. అంగడి సరుకులు మన దగ్గర కూరగాయల దుకాణాల్లాగే అమెరికాలో అడుగడుగునా తుపాకుల దుకాణాలున్నాయి. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు చాలా సులువైన వ్యవహారం. 21 ఏళ్లు దాటి, నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. తుపాకీ లైసెన్సు దొరికేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు ఏకంగా 120 తుపాకులున్నాయి! ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరి వద్ద మాత్రమే తుపాకీ ఉంది. నలుగురు అధ్యక్షులు బలయ్యారు ఎక్కడపడితే అక్కడ అతి సులువుగా దొరుకుతున్న తుపాకులు అమెరికాలో విచ్చలవిడి హత్యలతో పాటు ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయి. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292! నలుగురు అమెరికా అధ్యక్షులు కూడా తుపాకులకే బలైపోయారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ.గార్ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తూటాలకు నేలకొరిగారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ తదితర అధ్యక్షులపై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయట పడ్డారు. తుపాకుల నీడలో ► అమెరికాలో సగటున రోజుకు 50 మందికి పైగా తుపాకులకు బలైపోతున్నారు. ► జనాభాలో 58 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో తుపాకుల బెదిరింపులకు లోనైనవారే. ► దేశంలో సగటున ఏటా 37 మంది టెర్రరిస్టుల దాడిలో చనిపోతుంటే, తుపాకుల సంస్కృతికి ఏకంగా 11,000 మంది బలవుతున్నారు. ► దేశంలో 63 వేల మంది లైసెన్సుడ్ ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పులు మరో ముగ్గురి దుర్మరణం లాగునావుడ్స్: అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా చర్చి, హూస్టన్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా చర్చిలో మధ్యాహ్న భోజన సమయంలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులకు సమాచారమంది వారు వచ్చేలోపే కాల్పులకు ఒకరు బలవగా ఐదుగురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం భక్తులు దుండగున్ని బంధించారు. కాల్పులకు దిగిన వ్యక్తి 60 ఏళ్ల ఆసియా సంతతికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనుక ఉద్దేశం తెలియరాలేదు. ఇంకో ఘటనలో హూస్టన్ మార్కెట్లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. వీటిలో ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బఫెలోలో ఓ శ్వేతజాతి యువకుడు పదిమందిని కాల్చిచంపిన విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తంజావూరు రథోత్సవంలో విషాదం
సాక్షి, చైన్నై: తమిళనాడులోని తంజావూరులో జరిగిన రథోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయానికి చెందిన రథోత్సవంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు రథంపై పడడంతో 11 మంది మరణించారు. తంజావూరు జిల్లా కలిమేడులోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన అప్పర్ స్వామి మఠం ప్రతీ ఏడాది మూడు రోజుల పాటు అప్పర్ సత్య జాతరని నిర్వహిస్తుంది. మహాశివుడికి ప్రతిరూపంగా కొలిచే ఈ అప్పర్ ఆలయానికి చెందిన పండుగలో రెండో రోజు బుధవారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. తంజావూర్–బూదలూర్ రహదారిపై రథం వెళుతుండగా తెల్లవారుజాముయ సుమారు 3 గంటల సమయంలో రథం పైభాగంలో 20 అడుగుల ఎత్తులో అలంకరించిన రంగురంగుల లైట్లకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో రథాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో 13, 14, 15 ఏళ్ల ముగ్గురు బాలురు, తండ్రీ, కుమారుడు ఉన్నారు. కరెంట్ షాక్ కొట్టిన వెంటనే రథాన్ని లాగుతున్న కొందరు భక్తులు కుప్పకూలిపోయారు. కరెంట్ షాక్‌కి మంటలు వ్యాపించడంతో రథం నిలువునా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ ఘటనకి రథోత్సవం తిలకించడానికి వచ్చిన ప్రజలు బెదిరిపోయారు. చెల్లాచెదురుగా పరుగులు తీస్తూ హాహాకారాలు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన కుటుంబాలకు రూ.50 వేలు సహాయంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తంజావూరు వెళ్లి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, డీఎంకే తరపున తలా రూ.2 లక్షలు సాయంగా అందజేశారు. -
కశ్మీర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమయ్యారు. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు వెల్లడించారు అమిషిపొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల్ని నిర్బంధించడానికి ప్రయత్నించగా వారు జరిపిన కాల్పుల్లో షకీల్ అహ్మద్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రంతా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా వివరించారు. -
40కి చేరిన కల్తీ మద్యం మరణాలు
సమస్తిపూర్/పట్నా: బిహార్‌లో కల్తీమద్యం తాగి మూడు రోజుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సమస్తీపూర్, గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గురు, శుక్రవారాల్లో గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో 33 మంది చనిపోయారు. తాజాగా, శనివారం సమస్తీపూర్ జిల్లా పటోరీ పోలీస్‌స్టేషన్ పరిధి రుపౌలీ పంచాయతీలో ఆర్మీ, బీఎస్ఎఫ్ జవాన్లు ఇద్దరు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ మానవ్‌జీత్ ధిల్లాన్ చెప్పారు. బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. -
అసోంలో ఆక్రమణదారులపై పేలిన పోలీసు తూటా
గువాహటి: అసోంలోని దరాంగ్ జిల్లా సిఫాజర్‌లో ఆక్రమణదారుల తరలింపు ప్రక్రియ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య గురువారం జరిగిన ఘర్షణలు రణరంగాన్ని తలపించాయి. ఖాకీల తూటాలకు ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం కావల్సిన భూసేకరణలో భాగంగా ధోల్పూర్లోని సిఫాజర్‌లో 800 కుటుంబాలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ కొన్ని దశాబ్దాల నుంచి ఆ కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం వారిని అక్కడ్నుంచి ఖాళీ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే దీనిని వ్యతిరేకించిన ఆ కుటుంబాలు తమకు పునరావాసం కల్పించాలంటూ నిరసనలకు దిగారు. వారిని చెదరగొట్టడానికి లాఠీలు, తుపాకీలతో పోలీసులు క్రౌర్యాన్ని ప్రదర్శించారు. విచక్షణా రహితంగా నిరసనకారుల్ని చితకబాదడమే కాకుండా వారిపై నేరుగానే కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలన్నింటినీ వీడియో తీయడానికి జిల్లా యంత్రాంగం నియమించిన కెమెరామ్యాన్ విజయ్‌శంకర్ బనియా నిరసనకారులపై అత్యంత దారుణంగా ప్రవర్తించారు. బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయి నేలపై పడి ఉన్న ఒక వ్యక్తిని విజయ్‌శంకర్ కాళ్లతో తన్నిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రభుత్వం ఆ కెమెరామ్యాన్ అరెస్ట్ చేసింది. ఈ ఘటనలపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో అస్సాం ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. మరోవైపు నిరసనకారులు పోలీసులపైకి పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేశారని, వారు చేసిన దాడిలో ఎనిమిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని దరాంగ్ ఎస్పీ, ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా సోదరుడు సుశాంత్ బిశ్వా శర్మ చెప్పారు. గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మొనిరుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని సద్దామ్ హుస్సేన్, షేక్ ఫోరిడ్‌గా గుర్తించారు. అస్సాం ప్రభుత్వమే కాల్పుల్ని స్పాన్సర్ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ సర్కార్ అధికారంలోకొచ్చాక ప్రజలపై వేధింపులు పెరిగినట్లు అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ బోరా అన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
హైతీని కుదిపేసిన భూకంపం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య 724కు పెరిగింది. వందలాదిగా నివాసాలు ధ్వంసం కావడంతో మరో 2,800 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా, అనంతర ప్రకంపనల భయంతో ప్రజలు ఇళ్లు వదిలి వీధుల్లోనే జాగారం చేస్తున్నారు. భూకంపంతో తీర పట్టణం లెస్‌కెస్‌తోపాటు గ్రాండ్ అన్స్, నిప్స్ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. స్థానిక ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. హైతీ ప్రధాని హెన్రీ నెల రోజులపాటు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆదివారం రాత్రికి మరణాల సంఖ్య 724కు చేరిందని అధికారులు ప్రకటించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, చర్చిలు కలిపి 860 వరకు ధ్వంసం కాగా, మరో 700 భవనాలకు నష్టం వాటిల్లిందన్నారు. సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి శిథిలాల కింద చిక్కుకున్న అనేక మందిని వెలికి తీయగలిగారు. ఇలా ఉండగా, మరో రెండు రోజుల్లో తుపాను ‘గ్రేస్’ హైతీని తాకనుందనే హెచ్చరికలతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. -
ఇంగ్లండ్‌లో కాల్పుల మోత
లండన్: ఇంగ్లండ్‌లోని ప్లేమౌత్ నగరంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లేమౌత్‌లోని కేమాన్ అనే ప్రాంతంలో గురువారం సాయంత్రం దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు, జరిపి తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందారు. దుండగుడితో సహా మొత్తం ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దేశంలో గత పదేళ్లలో ఇదే అతి పెద్ద కాల్పుల ఘటన అని పేర్కొన్నారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి సైతం ఉందని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని జేక్ డెవీసన్(22)గా గుర్తించారు. -
ముంబైలో ఘోర ప్రమాదం
ముంబై/న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనంలోని రెండతస్తులు పక్కను న్న ఒకే అంతస్తు భవనంపై కూలిపో యాయి. మల్వానీ ప్రాంతంలోని న్యూ కలెక్టర్ కాంపౌండ్ వద్ద బుధవారం రాత్రి 11.15 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. ఏడాదిన్నర నుంచి 15ఏళ్ల వయసులోపు ఉన్న మొత్తం ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. శిథాలాల నుంచి 18 మందిని కాపాడారు. ఒకే అంతస్తు భవనంలో అద్దెకు ఉంటున్న రఫీక్ షేక్(45) కుటుంబంలో ఆయన భార్యతోపాటు మరో ఎనిమిది మంది మరణించారు. కూలడానికి కొద్దిసేపు ముందే పాలు కొనేందుకు బయటకెళ్లడంతో రఫీక్ ప్రాణాలు దక్కించుకున్నారు. రఫీక్ కొడుకు సైతం ఔషధాల కోసం బయటికెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తిరిగి వచ్చాక తన కుటుంబ సభ్యులు విగత జీవులు కావడం చూసి రఫీక్ గుండెలవిసేలా రోదించారు. ఇటీవల టౌటే తుపాను ధాటికి భవనం దెబ్బతిన్నదని, అందుకే కూలిందని పోలీసు అధికారి విశ్వాస్ పాటిల్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి భవనం యజమాని, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయనున్నట్టు డీసీపీ విశాల్ ఠాకూర్ చెప్పారు. నష్ట పరిహారం ప్రకటించిన రాష్ట్ర సర్కారు భవన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. -
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం
కరాచీ: పాకిస్తాన్లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సింధ్ ప్రావిన్సులో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది చనిపోగా మరో 70 మంది గాయాలపాలయ్యారు. పాక్ ఆర్మీ, పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగి, సహాయ, రక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. బోగీల్లో మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరిగేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు.సోమవారం ఉదయం కరాచీ నుంచి సర్గోదా వెళ్తున్న మిల్లత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పి, ఎదురుగా ఉన్న పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఎదురుగా రావల్పిండి నుంచి కరాచీ వైపు వస్తున్న సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు వాటిని ఢీకొట్టింది. ఘోట్కి జిల్లా ధార్కి సమీపంలో జరిగిన ఈ ఘటనలో 50 మంది మరణించారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాద సమయంలో రైలు సాధారణ వేగంతోనే వెళుతోందని, చూస్తుండగానే మిల్లత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు దొర్లుకుంటూ పట్టాలపైకి రావడం, వాటిని ఢీకొట్టడం క్షణాల్లోనూ జరిగిపోయిందని ఈ ప్రమాదం నుంచి బయటపడిన సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్ అయిజాజ్ షా తెలిపారు. క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉండగా, ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి వెయ్యి మంది వరకు ప్రయాణికులున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పగా ఇందులో 6 నుంచి 8 వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. బోగీల్లోపల చిక్కుకున్న వారిని వెలుపలికి తీయడానికి భారీ యంత్ర సామగ్రిని రప్పిస్తున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల సాయం రైలు ప్రమాద ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి, ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాద బాధితులకు సాయం అందించడంతోపాటు ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాను’అని ఇమ్రాన్ ట్విట్టర్లో తెలిపారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 నుంచి రూ.3 లక్షల వరకు అందజేస్తామని యంత్రాంగం ప్రకటించిందని జియో న్యూస్ వెల్లడించింది. పాక్‌లో తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలకు కాలం చెల్లిన వ్యవస్థ, అవినీతి, నిర్వహణాలోపమే కారణమని రైల్వే మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దేశ విభజనకు ముందు కాలం నాటి రైల్వే వ్యవస్థ, పట్టాలనే ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. -
అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి
సాన్‌జోస్ (అమెరికా): కాలిఫోర్నియాలోని సాన్జోస్లో బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. సిలికాన్ వ్యాలీలో బస్సు, లైట్ రైలు సేవలు అందించే వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీకి చెందిన ఉద్యోగి సామ్ కాసిడీ ఈ దాడికి తెగబడ్డాడు. బుధవారం ఉదయం 6.30 గంటలకు కాసిడీ సాన్‌జోస్ రైల్వే యార్డులో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు. అతని సహోద్యోగులు సహా మొత్తం 8 మందిని పొట్టనబెట్టుకున్నాడు. కాసిడీ కూడా చనిపోయాడు. అయితే అతనెలా చనిపోయింది తెలియరావట్లేదు. చదవండి: గాజాకు అండగా మేముంటాం: అమెరికా -
Cyclone Tauktae: అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే
న్యూఢిల్లీ/బెంగళూరు/అహ్మదాబాద్: కరోనా విజృంభనకు తోడు తుపాను ‘తౌక్టే’ తీర రాష్ట్రాలను వణికిస్తోంది. తౌక్టే అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. మంగళవారం ఉదయం తీరం దాటనున్న గుజరాత్ తీర ప్రాంతంలో ‘ఆరెంజ్ అలర్ట్’ను జారీ చేసింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం తీవ్రమై తుపానుగా మారిన విషయం తెలిసిందే. తౌక్టే ఉత్తర– వాయవ్య దిశగా గుజరాత్ తీరం వైపు దూసుకు వస్తోందని, సోమవారం రాత్రి గుజరాత్ తీరానికి చేరువవుతుందని వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున పోరుబందరు– మహువ మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. తీరం దాటే సమయంలో అత్యంత తీవ్రమైన వేగంతో.. గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దక్షిణ మహారాష్ట్ర, గోవా, సమీప కర్ణాటక తీర ప్రాంతాల్లోనూ ఈ గాలుల వేగం గంటకు 140– 150 కిమీల వరకు ఉంటుందని తెలిపింది. డయ్యూడామన్ తీర ప్రాంతానికి కూడా ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసినట్లు తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర తీరంలో సోమవారం నుంచే గంటకు 65 నుంచి 85 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈదురుగాలులకు తోడు ఈ అన్ని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిం చింది. దక్షిణ గుజరాత్ తీరంలోని పోరుబందర్, జునాగఢ్, గిర్ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో, డయ్యూడామన్‌లో గాలుల వేగం మంగళవారం నాటికి తీవ్రమవుతుందని, గంటకు 150 నుంచి 175 కిమీల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ద్వారక, జామ్‌నగర్, భావ్‌నగర్ జిల్లాల్లో మే 18 ఉదయం నుంచి గంటకు 150 నుంచి 165 కిమీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో జునాగఢ్‌లో అలలు 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశముందని తెలిపింది. జునాగఢ్, భావ్‌నగర్ తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరగవచ్చని పేర్కొంది. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సమాచార, విద్యుత్ వ్యవస్థలు నిలిచిపోవచ్చని, రైల్వే సేవలకు అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. గుజరాత్ తీరంలో లోతట్టు ప్రాంతాల నుంచి లక్షన్నర మందిని సహా య కేంద్రాలకు తరలించారు. రాష్ట్రానికి చెందిన ఇతర సహాయ బృందాలతో కలిసి ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 54 బృం దాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటు న్నా యి. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవ ద్దని కో రామని, ఇప్పటికే వేటకు వెళ్లిన 149 బోట్లలో 107 తిరిగివచ్చాయని సీఎం విజయ్ రూపానీ చెప్పారు. కర్ణాటకలో నలుగురు మృతి తౌక్టే తుపాను కర్ణాటక తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. తీర ప్రాంత జిల్లాల్లోని 98 గ్రామాల్లో ఈ ప్రభావం భారీగా కనిపిస్తోంది. తుపాను కారణంగా ఇక్కడ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, కొడగు, హసన్, శివమొగ్గ, చిక్మగలూర్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో తుపాను ప్రభావం కనిపించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లో ఇళ్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు పండ్ల తోటలకు అపారనష్టం వాటిల్లిందని, రహదారులు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రధానంగా ఉడిపి జిల్లాలో 23 గ్రామాలు తుపాను బారినపడ్డాయని తెలిపారు. పడవను తీరంలో నిలుపుతున్న వ్యక్తిని మరో బోటు ఢీ కొట్టడంతో ఒకరు(ఉత్తర కన్నడ జిల్లా), విద్యుత్ షాక్‌తో ఒకరు(ఉడిపి), ఇల్లు కూలి ఒకరు (చిక్‌మగళూరు), పిడుగుపాటుకు మరొకరు (శివమొగ్గ) చనిపోయారని వెల్లడించారు. ఇప్పటివరకు తీర ప్రాంతాల్లో 11 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తీర మల్నాడు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయని, ఈ జిల్లాల్లోని 313 కేంద్రాల్లో సుమారు 64.5 మి.మీ.ల కన్నా ఎక్కువ వర్షపాతం, 15 కేంద్రాల్లో 200 మి.మీ.ల వర్షపాతం నమోదైందన్నారు. ఉడిపి జిల్లాలోని కుందపుర తాలూకా, నాడా స్టేషన్ వద్ద అత్యధికంగా 385 మి.మీ.ల వర్షపాతం నమోదైంద ని వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితిని, సహాయ చర్యలను సీఎం యెడియూరప్ప సమీక్షించారు. కేరళలో ప్రమాదకర స్థాయికి డ్యామ్‌లు కేరళలోని తీర ప్రాంతంలోని పలు డ్యాముల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి పెరిగాయి. ఎర్నాకులం, ఇదుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలను సహాయ కేంద్రాలకు తరలించారు. ఎర్నాకులం జిల్లాలోని చెల్లానం తీర గ్రామంపై పెద్ద ఎత్తున అలలు విరుచుకుపడటంతో నౌకాదళం ఆ గ్రామస్తులను కాపాడి, సహాయ కేంద్రాలకు తరలించింది. కొంకణ్, ముంబైల్లో నేడు భారీ వర్షాలు మహారాష్ట్రలోని ఉత్తర కొంకణ్, ముంబై, థానె, పాల్ఘార్‌ల్లో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గోవాలో.. ఆదివారం ఉదయం నుంచే ఈదురుగాలులు, వర్షా లు గోవాలోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ అలలు తీర ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చాయి. ఇళ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు. చెట్టు కూలడంతో ఒక బాలిక, బైక్‌పై వెళ్తుండగా విద్యుత్ స్తంభం కూలిపడడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలుల ధాటికి పలు 33 కేవీ ఫీడర్లు, మహారాష్ట్ర నుంచి గోవాకు విద్యుత్‌ను సరఫరా చేసే పలు 220 కేవీ లైన్లు ధ్వంసమయ్యాయి. పీఎం సమీక్ష రాష్ట్రాల్లో తుపాను సహాయ కార్యక్రమాల సంసిద్ధతను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సమీక్షించారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముప్పు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ ఆసుపత్రులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, వాటికి అన్ని సదుపాయాలు అందేలా చూడాలని, టీకా కార్యక్రమానికి విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. తీరప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని, కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన వర్చువల్ సమావేశంలో తెలిపారు. బోటు మునక.. ఇద్దరు మృతి మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు తీరంలో బోటు మునిగిన దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా, ముగ్గురు గల్లంతయ్యారు. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (ఎమ్మార్పీ ఎల్)కు చెందిన అలయెన్స్ అనే పడవ శనివారం సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో బోటులోని 8 మంది సిబ్బందికిగాను ఇద్దరు చనిపోగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారనీ, మిగతా ముగ్గురి జాడ తెలియాల్సి ఉందని ఎమ్మార్పీఎల్ ఆదివారం వెల్లడించింది. ‘తౌక్టే’ అంటే... తీవ్రమైన తుపానుగా మారుతున్న ‘తౌక్టే’ అంటే అర్థమేమిటో తెలుసా. తౌక్టే అంటే బర్మీస్ భాషలో గెకో... ‘గట్టిగా అరిచే బల్లి’. ప్రస్తుతం తుపాన్‌కు మయన్మార్ దేశం పెట్టిన పేరిది. మయన్మార్ ఎందుకు పెట్టింది అంటే... ఈసారి వాళ్ల వంతు కాబట్టి. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్/ యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ప్యానెల్ తుపాన్లకు పేర్లు పెడుతుంది. ఈ ప్యానెల్‌లోని 13 దేశాలు ఏషియా– పసిఫిక్ ప్రాంతంలో వచ్చే తుపాన్లకు వంతులవారీగా పేర్లు పెడుతుంటాయి. దీంట్లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలున్నాయి. ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున సూచిస్తాయి. ఇలా వచ్చిన మొత్తం 169 పేర్ల నుంచి తుపాన్లకు రొటేషన్ పద్ధతిలో ఆయా దేశాల వంతు వచ్చినపుడు.. వారు సూచించిన పేర్ల నుంచి ఒకటి వాడుతారు. కిందటి ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుపానుకు ‘నిసర్గ’గా బంగ్లాదేశ్ నామకరణం చేసింది. వాతావరణ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలు, సాధారణ ప్రజానీకం ప్రతి తుపాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ పేరు ఉపకరిస్తుంది. కన్యాకుమారి తీరంలో అల్లకల్లోలంగా మారిన సముద్రం -
ఢిల్లీలో ఆగని మృత్యుఘోష
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగింది. ఢిల్లీలోని తమ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ సరిపడ పీడనంతో సరఫరా కాకపోవడంతో కన్నుమూశారని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డీకే బలూజా చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల సమయానికి మా ఆస్పత్రిలో 200 మంది రోగులున్నారని, కేవలం అరగంటకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉందని ఆయన వెల్లడించారు. వీరిలో 80 శాతం మంది రోగులకు కృత్రిమ ఆక్సిజన్ అవసరమని, మిగతా వారిని ఐసీయూలో ఉంచామని చెప్పారు. ఇంకా కష్టాల్లోనే గంగారాం ఆస్పత్రి ‘మాకు రోజుకు 11వేల ఘనపు మీటర్ల ఆక్సిజన్ అవసరం. కానీ మా వద్ద కేవలం 200 ఘనపు మీటర్ల ఆక్సిజన్ ఉంది. రోగులు తమ సొంత ఆక్సిజన్ సిలిండర్లతో ఆస్పత్రిలో చేరుతున్నారు. అందరు ఉన్నతాధికారలు, నోడల్ అధికారులను కలిశాం. వందల ఫోన్‌కాల్స్ చేశాం. స్పందన శూన్యం. మరో రెండు గంటల్లో ఆక్సిజన్ అయిపోతుంది’ అని పరిస్థితిని గంగారాం ఆస్పత్రి చైర్పర్సన్ డీఎస్ రాణా వివరించారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రమవడంతో కోవిడ్ బాధితుల మరణాలు పెరుగుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సాయంచేయండంటూ ఢిల్లీ ఆస్పత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా వేడుకుంటున్నాయి. ఏదో విధంగా ఆక్సిజన్ సరఫరాపై చర్యలు తీసుకోండంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి, జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి, బాత్రా ఆస్పత్రి, సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ‘ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాను పెంచాలి. లేదంటే ఆక్సిజన్సరఫరాను అడ్డుకునే ఏ వ్యక్తినైనా సరే మేం ఉరితీస్తాం. ఎవరికీ వదిలిపెట్టం’ అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీకి రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్రప్రభుత్వ హామీ ఇచ్చింది. కానీ గత కొద్ది రోజులుగా 380 మెట్రిక్ టన్నులఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. శుక్రవారం కేవలం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని ఢిల్లీ సర్కార్ చెబుతోంది. వాల్వ్ మూసేయడంతో ఇద్దరి మృత్యువాత మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సివిల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోగులకు ఆక్సిజన్‌ను పంపిణీ చేసే వాల్వ్‌ను ఎవరో మూసేయడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు కోవిడ్ పేషెంట్లు మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వాల్వ్ మూసేసి ఉన్న సమయంలో ఏ రోగీ కృత్రిమ ఆక్సిజన్‌పై లేరని ఆస్పత్రి సిబ్బంది చెబుతుండగా, ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడంతోనే ఇద్దరూ మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగనుంది. పంజాబ్‌లో ఆరుగురి మృతి కోవిడ్ బాధితులకు సరిపడ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అమృత్‌సర్‌లోని నీలకంఠ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కోవిడ్ బాధితులు శనివారం ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో మరణించారు. ఆక్సిజన్ కొరతపై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ స్పందించలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయితే, ఆక్సిజన్ కొరత తీవ్రతను పేర్కొనలేదని, కేవలం సంబంధిత వాట్సప్ గ్రూప్‌లో ఒక చిన్న మెసేజ్ మాత్రమే ఆస్పత్రి యాజమాన్యం పంపిందని రాష్ట్ర వైద్య విద్య మంత్రి చెప్పారు. మృతి ఘటనపై పంజాబ్ సీఎం విచారణకు ఆదేశించారు. -
జలాంతర్గామి జలసమాధి
బన్యువాంగి: బుధవారం బాలి సముద్రంలో గల్లంతైన సబ్‌మెరైన్ మునిగిపోయిందని, అందులోని 53మంది సిబ్బంది మృతి చెందినట్లేనని ఇండోనేసియా నేవీ ప్రకటించింది. జలాంతర్గామి కోసం జరిపిన అన్వేషణలో సబ్‌మెరైన్ తాలుకా విడిభాగాలు లభ్యమయ్యాయని, దీన్నిబట్టి సబ్‌మెరైన్ మునిగిపోయి ఉంటుందని, శనివారం ఉదయం వరకే అందులోని ఆక్సీజన్ సరిపోతుందని, అందువల్ల దానిలోని సిబ్బంది బతికిబట్టకట్టే అవకాశమే లేదని భావిస్తున్నట్లు తెలిపింది. జలాంతర్గామి గల్లంతైన ప్రాంతంలో చమురు తెట్టలు, ధ్వంసమైన భాగాలు లభించాయని, ఇవి జలాంతర్గామి మునకకు ప్రధాన సాక్ష్యాలని ఆ దేశ మిలటరీ చీఫ్ హది జజాంటో చెప్పారు. శనివారం ముందువరకు సబ్‌మెరైన్ గల్లంతైందని ఇండోనేసియా చెబుతూ వచ్చింది. సబ్‌మెరైన్ పేలితే ముక్కలై ఉండేదని, సోనార్‌లో తెలిసేదని, కానీ ఈ ప్రమాదంలో జలాంతర్గామి నీటి అడుగుకు పోతున్న కొద్దీ పగుళ్లు వచ్చాయని దీంతో నీళ్లు లోపలికి చేరి మునిగి ఉంటుందని నేవీ చీఫ్ యుడు మర్గానో అభిప్రాయపడ్డారు. జలాంతర్గామి 655 అడుగుల వరకు నీటిలోపలకి వెళ్లే సామర్ధ్యం కలిగి ఉండగా, ఈ ప్రమాదంలో అది దాదాపు 2000– 2300 అడుగుల లోతుకు మునిగి ఉంటుందని నేవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థాయిల్లో నీటి పీడనం చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ పీడనాన్ని జలాంతర్గామి తట్టుకోలేదని వివరించారు. -
బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం ఫోటోలు
-
బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 27 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లోని షితలాఖ్య నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందికి పైగా ప్రయాణీకులతో వెళుతున్న పడవ ఎంఎల్ సబిత్ అల్ హసన్ మరో కార్గో వెజల్‌ను ఢీకొట్టిన ఘటనలో 27 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. పడవతో పాటు కొంత మంది నీటిలో మునిగిపోగా, మరి కొందరు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం 22 మృతదేహాలను వెలికితీయగా, మరో 5 మృతదేహాలను సోమవారం వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వెలికితీత కార్యక్రమంలో నేవీ, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్, పోలీసు బలగాలు పాల్గొన్నాయి. ప్రమాదానంతరం ప్రయాణికులను రక్షించే ప్రక్రియ పూర్తయిందని బంగ్లాదేశ్ దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ (బిత్వా) ప్రకటించింది. -
మయన్మార్‌లో నిరసనకారులపై తూటా
-
మయన్మార్‌లో నిరసనకారులపై తూటా
యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ ఒకవైపు సాయుధ బలగాల దినోత్సవాన్ని జరుపుకుంటూనే నిరసనకారులపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. మిలటరీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారిపై తుపాకీగుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో శనివారం మధ్యాహ్నానికి 93 మందిపైగా మిలటరీ తూటాలకు బలైనట్టుగా మయన్మార్‌లో స్వతంత్ర అధ్యయన సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి సైనికులు యాంగాన్, మాండాలే సహా 12 పట్టణాల్లో నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మండాలేలో జరిగిన కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది. మయన్మార్ సైనికులు తమని అణగదొక్కాలని చూస్తున్నప్పటికీ వారు గద్దె దిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిరసనకారులు ఎలుగెత్తి చాటారు. ‘‘మమ్మల్ని పిట్టల్లా కాల్చేస్తున్నారు. మా ఇళ్లల్లోకి కూడా సైనికులు చొరబడుతున్నారు’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు మొత్తంగా 400 మంది అమాయకులు బలయ్యారు. సిగ్గుతో తలదించుకోవాలి ఒకే రోజు ఈ స్థాయిలో అమాయకులు బలైపోవడంతో అంతర్జాతీయంగా మయన్మార్ మిలటరీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘సాయుధ బలగాలు ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’’ అని మిలటరీకి వ్యతిరేకంగా అధికారాన్ని కోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి అధికార ప్రతినిధి డాక్టర్ శస అన్నారు. సాయుధబలగాల దినోత్సవం బీభత్సంగా జరిగింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని మయన్మార్‌లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం విమర్శించింది. మరోవైపు మిలటరీ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హాలింగ్ ప్రజల పరిరక్షణ కోసమే తామున్నామని అన్నారు. త్వరలోనే స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తామని చెప్పారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో వరస కాల్పులు కలకలం రేపాయి. ఒక గంట వ్యవధిలోనే మూడు వేర్వేరు మసాజ్ సెంటర్లలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు ఆసియా దేశాలకు చెందినవారే ఉన్నారు. కాల్పులకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అట్లాంటా పోలీసు చీఫ్ రాడ్నీ బ్రియాంట్ తెలిపిన వివరాలు ప్రకారం ఉత్తర అట్లాంటాకు 50 కి.మీ. దూరంలోని గ్రామీణ ప్రాంతమైన అక్వర్త్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు యంగ్స్ ఆసియన్ మసాజ్ పార్లర్లో తుపాకుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలు అవుతుండగా అట్లాంటాకి సమీపంలోని బక్‌హెడ్‌లోని గోల్డ్ స్పాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ మసాజ్ సెంటర్లో దోపిడి జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు వచ్చి చూడగా ముగ్గురు మహిళలు విగతజీవులై పడి ఉన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న మరో వీధిలో అరోమాథెరపీ స్పాలో కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు చీఫ్ వివరించారు. ఈ బీభత్సకరమైన హింసాకాండలో బాధి తుల కోసం మేమంతా ప్రార్థనలు చేస్తున్నామంటూ అట్లాంటా గవర్నర్ బ్రెయిన్ కెంప్ ట్వీట్ చేశారు. కాల్పులు జరిపింది ఒక్కడేనా ? అక్వర్త్ ఘటనలో కాల్పులకు తెగబడినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్పా బయట అతను తిరుగుతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరన్ లాంగ్గా అతనిని గుర్తించారు. మిగిలిన రెండు చోట్ల కాల్పులు జరిపింది అతని పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి వీడియోలో కనిపించిన కారు, కాల్పులు జరిగిన ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించింది. కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆసియన్ అమెరికన్లపై దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ కాల్పులు కూడా అందులో భాగమేనన్న ఆందోళన పెరుగుతోంది. మరోవైపు అక్వర్త్లో యంగ్స్ ఆసియన్ మసాజ్ పార్లర్లో మరణించిన వారందరూ దక్షిణ కొరియాకి చెందిన మహిళలేనని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
తగ్గుతున్న కోవిడ్ కేసులు
బీజింగ్: కోవిడ్–19 విలయం చైనాలో కొనసాగుతూనే ఉంది. ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకూ ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 74,576కు చేరుకోగా మొత్తం 2,118 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 114 మంది కోవిడ్‌కు బలయ్యారని చైనా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తెలిపారు. హుబేలో కొత్త కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోందని అదే సమయంలో చికిత్స తరువాత ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య వ్యాధిబారిన పడుతున్న వారి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హమని అధికారులు చెప్పారు. కోవిడ్ కారణంగా దక్షిణ కొరియాలో తొలి మరణం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నివారణ చర్యలకు దిగింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మతపరమైన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో గుమికూడరాదని డీగూ నగర మేయర్ 25 లక్షల మందికి హెచ్చరికలు జారీ చేశారు. హాంగ్‌కాంగ్ తిరిగి వచ్చిన ప్రయాణీకులు: జపాన్ తీరంలో లంగరేసిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్‌షిప్‌లోని ప్రయాణీకుల్లో వందమంది గురువారం హాంకాంగ్ చేరుకున్నారు. ప్రత్యేక విమానం ద్వారా వచ్చిన వీరంతా హాంగ్‌కాంగ్ ప్రాంతానికి చెందినవారే. క్రూయిజ్‌షిప్‌లో మొత్తం 3,711 మంది ప్రయాణీకులు ఉండగా వీరిలో సుమారు 500 మందికి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. హాంకాంగ్ చేరుకున్న 106 మంది ప్రయాణీకులను ప్రభుత్వ ఆసుపత్రిల్లో పర్యవేక్షణలో ఉంచారు. -
బస్సు ప్రమాదంలో 11 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సు ఉడుపి– చిక్కమగళూరు ఘాట్ రోడ్డు కార్కళ తాలూకా మాళె సమీపంలో శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. బస్సు ఘాట్ రోడ్డులో వెళ్తుండగా అదుపు తప్పి కుడివైపు బండరాళ్లను అతివేగంతో బలంగా ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. బస్సు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఉడుపి జిల్లాలోని మణిపాల్, కార్కళలోని ఆస్పత్రులకు తరలించారు. మైసూరు జిల్లాకు చెందిన ఈ టూరిజం బస్సులో మొత్తం 35 మంది పర్యాటకులు ఉన్నారు. మైసూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులను విహార యాత్రకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
థాయిలాండ్‌లో సైనికుడి కాల్పులు
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఓ సైనికుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 20 మందిని పొట్టనబెట్టుకున్నాడు. థాయిలాండ్‌లోని నఖోన్ రట్చసిమా నగరంలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. నగరంలోని సైనిక స్థావరం నుంచి ఒక సైనిక వాహనాన్ని దొంగిలించిన సైనికుడు సర్జంట్ మేజర్ జక్రపంత్ తొమ్మా నగరం నడిబొడ్డుకు దాన్ని నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడి టెర్మినల్ 21మాల్లో ప్రవేశించి మెషీన్ గన్‌తో అక్కడ ఉన్నవారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయాలపాల య్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. కాల్పులకు సంబంధించిన ఫొటోలను స్వయంగా నిందితుడే తీసి ఫేస్బుక్లో షేర్ చేశాడు. ‘నేను లొంగిపోవాలా? మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు’ అంటూ ఒక పోస్ట్, ‘నేను అలసిపోయాను.. ఇక గన్ ట్రిగ్గర్ను లాగలేను’ అంటూ మరో పోస్ట్ పెట్టాడు. ప్రజలంతా భయపడుతూ పరిగెత్తడం మరో వ్యక్తి తీసిన వీడియోలో కనిపించింది. ఫేస్బుక్ దాన్ని తొలగించింది. నిందితుడు మాల్లో ఉన్నాడు. మాల్ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకొని రాకపోకలను నిషేధించారు. అయితే 16 మందిని అతడు నిర్బంధించాడని స్థానిక మీడియా తెలిపింది. -
కరోనా విశ్వరూపం
బీజింగ్: కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. చైనాలో 31 ప్రావిన్షియల్ రీజియన్లలో ఇది విశ్వరూపం చూపిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 490 మంది మరణించారని, 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకీ పెరిగిపోతూ ఉండడంతో వూహాన్లో జాతీయ స్టేడియం, జిమ్‌లనే తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా ధాటికి బెంబేలెత్తిపోయి హాంగ్‌కాంగ్ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో చైనా నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచుతామని హాంగ్‌కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ ప్రకటించారు. పుట్టిన పసికందుకి సోకిన వైరస్ చైనాలోని వూహాన్లో అప్పుడే పుట్టిన పసికందుకి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకు ఈ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రసవం కావడానికి ముందు తల్లికి జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో బిడ్డకు గర్భంలోనే ఆ వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు. అనుమానితుడు పరారీ: గుజరాత్లో కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. జనవరి 19న చైనా నుంచి వచ్చిన 41 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతనిని వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. అయితే రక్త నమూనాలు ఇవ్వకుండా అతను పరారీ కావడం ఆందోళన రేపుతోంది. కాగా, కరోనా వైరస్ నిర్మూలనకు చైనాతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం గుజరాత్లో వజ్రాల వ్యాపారాన్ని చావు దెబ్బ కొట్టనుంది. వచ్చే రెండు నెలల్లో 8 వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. -
చర్చిలో తొక్కిసలాట.. 20 మంది మృతి
దారెస్సలామ్: టాంజానియాలోని ఓ చర్చిలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు. టాంజానియాలో ప్రముఖ పాస్టర్ బోనిఫెస్ వాంపోసా ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. అందులో ఆయన ప్రార్థించిన నూనెను వేదిక ఎదుట పోశారు. భక్తులు ముందుకొచ్చి నూనెను తాకాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అది తాకితే రోగాల నుంచి విముక్తి పొందుతామని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడం తొక్కిసలాటకు దారితీసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనకు కారణమైన పాస్టర్‌తోపాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కరోనా మృతులు 56
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికి కరోనా వైరస్ సోకి 56 మంది ప్రాణాలు కోల్పోగా 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా సర్కార్ ప్రకటించింది. వివిధ దేశాలకు విస్తరణ చైనాలో వూహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ మెల్లమెల్లగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంగ్‌కాంగ్, మలేసియా, నేపాల్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్‌ల్యాండ్, వియత్నాం తదితర దేశాలకు వ్యాపించింది. పాకిస్తాన్‌కు కూడా ఈ వైరస్ విస్తరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన నలుగురు పాకిస్తానీయులకి ముల్తానా, లాహోర్ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కి తీసుకురావడానికి ఆ దేశం ప్రత్యేక విమానాన్ని పంపింది. ఫ్రాన్స్ ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేసి తమ దేశ పౌరుల్ని వెనక్కి తీసుకువచ్చేస్తోంది. భారత్‌లోనూ భయాందోళనలు చైనా నుంచి భారత్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో క్షుణ్నంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారిని ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఈ వైరస్ సోకినట్టు అధికారికంగా వెల్లడి కాలేదు. చైనాలో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు బీజింగ్‌లో భారత్ రాయబార కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ వైరస్‌కి కేంద్రమైన వూహాన్ నగరంలో 250 మంది వరకు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. వారికి ఎలాంటి సాయమైనా అందించడానికి భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మాంసం విక్రయంపై నిషేధం చైనాలో విస్తృతంగా మాంసాహారాన్ని వినియోగిస్తారు. అడవి జంతువుల్ని ఎక్కువగా చంపి తింటారు. కరోనా వైరస్ మొదట్లో సీఫుడ్ నుంచి వచ్చిందని భావించారు. కానీ తాజా పరిశోధనల్లో పాముల నుంచి ఇతర అడవి జంతువులకి సోకి వారి నుంచి మనుషులకి సోకినట్టు వెల్లడైంది. దీంతో అడవి జంతువుల మాంసం వ్యాపారాలపై చైనా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. వాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో చైనా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ఉండడంతో దానికి వాక్సిన్ కనుగొనడానికి శాస్త్రవేత్తలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల ఉన్నతాధికారుల సమావేశంలో కరోనా విస్తరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీనికి వాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్ట శాస్త్రవేత్త జూ వెంబో వెల్లడించారు. -
చైనాలో కరోనా కల్లోలం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. తాజాగా మరో 880 మంది ఈ వైరస్‌తో న్యుమోనియా బారినపడ్డారు. చైనాలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ ఈ వ్యాధి రేపుతున్న కల్లోలం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసాధారణ రీతిలో కొత్త సంవత్సరం వేడుకల్ని చైనా సర్కార్ రద్దు చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ వైరస్ భారత్‌నూ భయపెడుతోంది. 13 నగరాలకు రాకపోకలు బంద్ కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం 13 నగరాల్లో రవాణా ఆంక్షలు విధించింది. మొట్టమొదటి సారి ఈ వైరస్ కనిపించిన సెంట్రల్ హుబీ ప్రావిన్స్‌లో 13 నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకల్ని నిలిపివేసింది. బస్సులు, రైళ్లను రద్దు చేసింది. దీంతో 4.1 కోట్ల మందిపై ప్రభావం చూపించింది. హుబీ ప్రావిన్స్‌లో హువాన్, దాని చుట్టుపక్కల ఉన్న 13 నగరాల నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పట్టణాల్లో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దంటూ ఉత్తర్వులిచ్చారు. కొత్త సంవత్సర వేడుకలకి దూరం చైనాలో శనివారం కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. ఏటా వసంత రుతువుకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రజలెవరూ ఈ వేడుకల్ని జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాల్ని రద్దు చేసింది. గణతంత్ర వేడుకలు కూడా రద్దు ఈ నేపథ్యంలో చైనాలో భారత రాయబార కార్యాలయం గణతంత్ర వేడుకల్ని రద్దు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటం, సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషే«ధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు కరోనా వైరస్ సోకిందన్న అనుమానం కలిగిన వారికి వైద్యపరీక్షలు, చికిత్సల కోసం రాజధాని ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ (ఎయిమ్స్) ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది ముంబైలో ఇద్దరికి వైద్య పరీక్షలు ముంబై, సాక్షి: చైనా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు జలుబు, దగ్గు ఉండటంతో ముందు జాగ్రత్తగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 నుంచే ముంబై విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే, చైనాకు వెళ్లి వచ్చిన 80 మందిని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో ఏడుగురికి దగ్గు, జ్వరం, గొంతువాపు ఉండటంతో చికిత్స అందిస్తున్నారు. ఎక్కడ నుంచి?: ఈ వైరస్ ఎక్కడ నుంచి మనుషులకు వ్యాపించిందో చైనా ఆరోగ్య అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. అయితే సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచి వ్యాపించినట్లు భావిస్తున్నారు. వుహాన్‌లోని ఈ మార్కెట్లో చట్టవిరుద్ధంగా పలు అడవి జంతువులను కూడా అమ్ముతుంటారు. క్రెయిట్ పాములు, నాగు పాములు, గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు చైనా శాస్త్రవేత్తల అభిప్రాయం. 10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం! వైరస్ సోకిన వారికి చికిత్సచేసేందుకు ప్రత్యేకంగా ఫీల్డ్ ఆస్పత్రిని వుహాన్‌లో చైనా నిర్మిస్తోంది. కేవలం 10 రోజుల్లో ప్రీ ఫాబ్రికేటెడ్ విధానంలో దీని నిర్మాణం పూర్తయ్యేలా నిరంతరాయంగా పనులు చేయిస్తున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,000 పడకలు కలిగిన ఆస్పత్రిని నిర్మించనున్నారు. కాగా, అమెరికాలో రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. చికాగోకు చెందిన 60 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ణయించారు. గత డిసెంబరులో ఈమె వుహాన్‌ను పర్యటించినట్లు తెలిపారు. మరో 50 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. లక్షణాలు తీవ్రమైన జ్వరం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది న్యుమోనియాతో ఊపిరితిత్తుల్లో సమస్యలు కిడ్నీలు విఫలం కావడం మాస్క్‌లు ధరించడం జాగ్రత్తలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం మాంసాహారం మానేయడం లేదా బాగా ఉడికించి తినడం మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం కాళ్లు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం ఉతికిన దుస్తులు ధరించడం వైరస్ సోకిన వారికి దూరంగా ఉండటం దగ్గు, తుమ్ములు వచ్చినపుడు రుమాలు ఉపయోగించడం వన్యప్రాణులకు దూరంగా ఉండటం వుహాన్‌లో నిర్మించనున్న ఆస్పత్రి కోసం యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న పనులు -
అట్టుడుకుతున్న యూపీ
న్యూఢిల్లీ/లక్నో/పుణే: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. నిరసనకారుల దాడిలో 263 మంది పోలీసులు గాయాలపాలు కాగా, వీరిలో 57 మంది బుల్లెట్ గాయాలయ్యాయని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం, దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకు వ్యతిరేకంగా బిహార్‌లో ఆర్జేడీ పిలుపు మేరకు శనివారం బంద్ జరిగింది. ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో శనివారం పరిస్థితులు సద్దుమణిగాయి. పౌరసత్వ సవరణ చట్టంపై సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు మూడు కోట్ల కుటుంబాలకు అవగాహన కల్పిస్తామని బీజేపీ తెలిపింది. పోలీస్ ఠాణాకు నిప్పు శుక్రవారం జరిగిన ఆందోళనల్లో ఆరుగురు మృతి చెందడంపై నిరసనకారులు శనివారం రాంపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అయినప్పటికీ, 12– 18 ఏళ్ల వయస్సున్న బాలురు సహా 500 మంది ఆందోళనకారులు రాంపూర్ ఈద్గా సమీపంలో గుమికూడి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ఆందోళనకారులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో డజను మంది పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘర్షణలకు స్థానికేతరులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో నిరసనలు కొనసాగాయి. కాన్పూర్‌లో ఆందోళనకారులు యతీమ్‌ఖానా పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. వాళ్లే కాల్చుకున్నారు: డీజీపీ ఓపీ సింగ్ రాష్ట్రంలో ఎక్కడా పోలీసులు కాల్పులు జరపలేదని, ఆందోళనకారులే అక్రమంగా తెచ్చుకున్న ఆయుధాలతో కాల్చుకున్నారని యూపీ డీజీపీ ఓపీ సింగ్ వ్యాఖ్యానించారు. ‘నిరసనకారులు మహిళలు, చిన్నారులను అడ్డుపెట్టుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల అక్రమంగా ఆయుధాలతో కాల్పులకు దిగుతున్నారు. దీంతో పోలీసులు అంతిమ ప్రయత్నంగా టియర్‌గ్యాస్, లాఠీచార్జీలను వాడాల్సి వస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోల వారూ నిరసనలకు దిగుతున్నారు. అల్లర్ల వెనుక బంగ్లాదేశీయుల హస్తం ఉందంటూ వస్తున్న వార్తలపైనా దర్యాప్తు జరుపుతాం’ అని ఆయన తెలిపారు. లక్నోలో ఇప్పటి వరకు 218 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు లక్నోలో ఆందోళనల్లో సంభవించిన నష్టం వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులకు నోటీసులు జారీ చేసి నష్టాన్ని రాబడతామన్నారు. లక్నోలో ఈ నెల 23 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ నేరాలకు పాల్పడిన 705 మందిని అరెస్టు చేశామని, 4,500 మందిని నిర్బంధంలోకి తీసుకున్నామని ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు 102 మందిని అరెస్టు చేశామన్నారు. రాష్ట్రంలో నిరసనకారుల దాడిలో క్షతగాత్రులైన 263 మంది పోలీసు సిబ్బందిలో 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని ఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఆందోళనలు జరిగిన ప్రాంతాల నుంచి 405 ఖాళీ బుల్లెట్ కేసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫిరోజాబాద్ జిల్లాలో శనివారం జరిగిన వివిధ ఆందోళనల్లో ముగ్గురు మృతి చెందారని ఎస్పీ సచీంద్ర తెలిపారు. మహారాష్ట్ర కూడా వ్యతిరేకించాలి: పవార్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ కేంద్రాన్ని కోరారు. ఈ చట్టంపై ఇప్పటికే వ్యతిరేకత ప్రకటించిన 8 రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కూడా చేరాలని ఆయన సూచించారు. ఈ చట్టాన్ని అమలు చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన కల్పిస్తాం: బీజేపీ చట్ట సవరణపై వ్యక్తమవుతోన్న తీవ్రమైన వ్యతిరేకతకు చెక్‌పెట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. దీనిలో భాగంగా వచ్చే పది రోజుల్లో దాదాపు మూడు కోట్ల కుటుంబాలను కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ తెలిపారు. ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడతామని, దేశవ్యాప్తంగా 250 మీడియా సమావేశాలు పెడతామని అన్నారు. ఈ చట్టం వల్ల లబ్ధిపొందిన కుటుంబాల వారిని కూడా ఈ ప్రచారంలో భాగస్వాములుగా చేస్తామన్నారు. భీం ఆర్మీ చీఫ్ అరెస్ట్ ఢిల్లీలోని దార్యాగంజ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధం ఉందనే ఆరోపణలతో భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆజాద్‌ను 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆజాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దార్యాగంజ్ ఘటనకు సంబంధించి మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుభాష్ మార్గ్‌లో పార్కు చేసి ఉన్న ఓ ప్రైవేటు కారుకి ఆందోళన కారులు నిప్పు పెట్టారనీ, అల్లర్లకు పాల్పడ్డారనీ పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలతో సంబంధమున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టానికి 1,100 మంది విద్యావేత్తల మద్దతు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్నవేళ దేశ విదేశీ విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు సవరణ చట్టానికి అనుకూలంగా స్పందించారు. పౌరసత్వ చట్టాన్ని స్వాగతిస్తూ 1,100 మంది తమ సంతకాలతో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంతకాలు చేసిన వారిలో షిల్లాంగ్ ఐఐఎం చైర్మన్ శిశిర్ బజోరియా, నలందా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సునైనా సింగ్, జేఎన్‌యూ ప్రొఫెసర్ ఐనుల్ హసన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్, కన్ఫ్లిక్ట్ స్టడీస్ పరిశోధనా సంస్థలో సీనియర్ అధ్యాపకుడు అభిజిత్ అయ్యర్ మిత్ర, పాత్రికేయుడు కంచన్ గుప్తా, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా తదితరులు ఉన్నారు. అనవసరంగా భయాందో ళనలు చెందాల్సిన పనిలేదని, పుకార్ల భ్రమల్లో పడకూడదని ఈ లేఖ ద్వారా మేధావులు సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కోరారు. శాంతియుతంగా ఆలోచించాలని సూచించారు. భారతదేశ నాగరికతను కాపాడేందుకు, మైనారిటీల హక్కుల రక్షణకోసం పార్లమెంటు ప్రయత్నిస్తోందంటూ ఈ లేఖలో కొనియాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శనివారం పట్నాలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు -
ఢాకా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలుడు: 13 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లో అక్రమ నిర్వహణలో ఉన్న ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు వల్ల 13 మంది మృత్యువాత పడ్డారు. 21 మంది తీవ్రగాయాల పాలయ్యారు. «ఢాకా శివారు కెరాణీగంజ్లోని ప్లాస్టిక్ కంపెనీలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న 13 మంది మరణించారు. ఈ ప్రమాదం ఎందుకు సంభవించిందనేది నిర్ధిష్టంగా తెలియరాలేదు. నజ్రుల్ ఇస్లాం అనే వ్యక్తికి చెందిన ఈ కంపెనీలో ఈ యేడాది ఫిబ్రవరిలో సైతం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ ప్లేట్లూ, కప్పులను తయారుచేసే ఈ ఫ్యాక్టరీలో మొత్తం 300 మంది రెండు షిఫ్టుల్లో పనిచేస్తారనీ, బుధవారం ఫ్యాక్టరీలో ప్రమాద సమయంలో 150 మంది పనిచేస్తున్నట్టు కార్మికులు తెలిపారు. -
నిద్ర నుంచే అనంత లోకాలకు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందరిలాగే వారు కూడా రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. కానీ మూసిన కళ్లు తెరవక ముందే వారి జీవితాలు ముగిసిపోయాయి. ఏం జరిగిందో గుర్తించేలోపే ప్రమాదం ముంచుకురావడంతో పడుకున్న స్థితిలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. తెల్లవారుజామున ప్రశాంతంగా నిద్రిస్తున్న రెండు కుటుంబాల్లోని 17 మందిని మృత్యుదేవత తడిసిన గోడ రూపంలో కబళించిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా మరణించిన వారిలో పది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపం నడూరు కన్నప్పన్ లే–అవుట్లో ఓ వస్త్రవ్యాపారి ఇంటి సమీపంలో 50 మందికి పైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఈ ఇళ్లకు ఆనుకునే ఉన్న వస్త్రవ్యాపారి ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండరాళ్లతో నిర్మించిన ప్రహరీగోడ ఉంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం ధాటికి.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు పెంకుటిళ్లపై కూలింది. రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 17 మంది నిద్రిస్తున్న దశలోనే ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం మేట్టుపాళయంకు వెళ్లనున్నారు. -
ఛాత్ ఉత్సవాల్లో 30 మంది మృతి
పాట్నా: గోడ కూలడం, తొక్కిసలాట, మునిగిపోవడం వంటి వాటి కారణంగా బిహార్‌లో 30 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలు బిహార్ ప్రజలు జరుపుకునే ఛాత్ పండగ సందర్భంగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు గోడ కూలిన ఘటనలో, ఇద్దరు పిల్లలు తొక్కిసలాటలో, మరో 26 మంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉత్సవాల సందర్భంగా మునిగిపోయి మరణించారు. ఛాత్ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. లక్షలాది మంది ఈ పండుగను దేవాలయాల వద్ద, ఘాట్ల వద్ద స్నానాలాచరించి జరుపుకున్నారు. -
కర్ణాటకలో భారీ వరదలు
హొసపేటె/రాయచూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక మూడునెలల్లోనే రెండోసారి భారీ వరద ముప్పును ఎదుర్కొంటోంది. కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం ఆల్మట్టి డ్యాం నుంచి సుమారు 3.75 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యాం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కృష్ణా, తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా, ఉప నది మలప్రభ వరదల కారణంగా బాగల్‌కోట, బెళగావి, విజయపుర, యాదగిరి, రాయచూరు జిల్లాలు విలవిలలాడుతున్నాయి. అత్యధికంగా బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకాలో పదులసంఖ్యలో గ్రామాలు నీటమునిగాయి. నీటిలో కొట్టుకుపోయి, మిద్దెలు కూలి ఇప్పటివరకు సుమారు 15 మంది మరణించారు. వేలాది హెక్టార్లలో పంటపొలాలు నీటమునిగాయి. బళ్లారి, రాయచూరు జిల్లాలో ముఖ్యమైన వంతెనలు నీటమునగడంతో రాకపోకలు స్తంభించాయి. నిరాశ్రయులైన వేలాది మంది నీళ్లు, ఆహారం కోసం అలమటిస్తున్నారు. వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని సీఎం యడియూరప్ప కలెక్టర్లను ఆదేశించారు. -
ఇరాక్ నిరసనల్లో 28 మంది మృతి
బాగ్దాద్: అవినీతి, నిరుద్యోగాలకు వ్యతిరేకంగా ఇరాక్ పౌరులు గత మూడు రోజులుగా కొనసాగిస్తున్న నిరసనలు గురువారానికి దక్షిణానికి విస్తరించాయి. ఇప్పటి వరకు ఈ నిరసనల్లో జరిగిన హింసలో 28 మంది చనిపోయారు. 600 మందికి పైగా నిరసనకారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు కాల్పులు, వాటర్ కెనాన్స్, భాష్పవాయు ప్రయోగాలకు వెరవకుండా ఇరాకీలు, ఎవరి నాయకత్వం లేకుండానే, ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి అదెల్ అబ్దెల్ మెహదీకి ఈ నిరసనలు పెద్ద సవాలుగా మారాయి. షియాలు ఎక్కువగా ఉండే పట్టణాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనల్లో ప్రధాన రాజకీయ పార్టీల జోక్యాన్ని నిరనసకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విశేషం. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బటాలా: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి బటాలా ప్రాంతంలో జనావాసాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు తీవ్రతకు బాణాసంచా ఫ్యాక్టరీ నేలమట్టం కాగా, పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భయానక అనుభవం.. బటాలా అగ్నిప్రమాదంపై తమ భయానక అనుభవాలను స్థానికులు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయమై రాజ్‌పాల్ ఖక్కర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..‘నేను సమీపంలోని గురుద్వారాకు వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నేను నేలపై పడిపోయి స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచిచూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను’ అని తెలిపారు. సాహిబ్ సింగ్ అనే మరో వ్యక్తి స్పందిస్తూ..‘సెప్టెంబర్ 5న గురునానక్ దేవ్ 532వ వివాహ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లాను. అంతలోనే భారీ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే నేను తిరిగి స్పృహలోకి రావడానికి చాలాసేపు పట్టింది’ అని వ్యాఖ్యానించారు. మృతులకు 2 లక్షల పరిహారం బటాలా దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బటాలా అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ విచారణ చేపడతారని వెల్లడించారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి రాజేందర్ సింగ్‌కు సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50,000, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 వేలు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గురుదాస్‌పూర్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు బటాలా సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంజీవ్ భల్లా మాట్లాడుతూ.. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సెలవుపై ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెనక్కు పిలిపించామని పేర్కొన్నారు. రాష్ట్రపతి కోవింద్, రాహుల్ దిగ్భ్రాంతి బటాలా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశా>రు. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోవడంపై రాహుల్ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బటాలా దుర్ఘటనపై గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీడియోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కాలువలోకి ఎగిరిపడ్డ కార్లు.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు భవనాలు కూలిపోయాయి. దగ్గర్లోని కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు ఎగిరి సమీపంలోని కాలువలో పడిపోయాయి. పేలుడు ప్రకంపనలకు కిలోమీటర్ దూరంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. చాలామంది క్షతగాత్రుల తల, కాళ్లకు గాయాలయ్యాయి – విపుల్ ఉజ్వల్, గురుదాస్‌పూర్ డీసీపీ పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహాలను తీసుకెళ్తున్న పోలీసులు, స్థానికులు -
సోమాలియాలో ఉగ్రదాడి
మొగదిషు: దక్షిణ సోమాలియాలోని సరిహద్దు పట్టణం కిస్మాయోలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోగా 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మెదినా హోటల్లోకి సైనిక దుస్తులు ధరించిన కొందరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ ప్రవేశించారు. అదే సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంపై మరో ఉగ్రవాది ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులతో తలపడ్డాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు 12 గంటలపాటు కొనసాగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సహా కెన్యా, టాంజానియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలకు చెందిన పౌరులు కలిపి మొత్తం 26 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు కూడా గాయపడ్డారన్నారు. పేలుడు ధాటికి హోటల్ భవనం ధ్వంసమయ్యింది. ఈ దుశ్చర్యకు తామే కారణమని అల్ షబాబ్ ప్రకటించుకుంది. సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అల్ షబాబ్ దశాబ్ద కాలంగా విధ్వంసక చర్యలకు పాల్పడుతోంది. -
అమెరికాలో ఉన్మాది కాల్పులు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి నెత్తురోడింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్ సిటీలో ఓ ఇంజనీర్ శుక్రవారం తుపాకీతో సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని కాల్చిచంపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని డ్వేన్ క్రాడిక్(40)గా గుర్తించారు. ఈ విషయమై వర్జీనియా బీచ్ పోలీస్ చీఫ్ జేమ్స్ సెర్వెరా మాట్లాడుతూ.. నగర మున్సిపల్ శాఖలోని ప్రజాపనుల విభాగంలో గత 15 సంవత్సరాలుగా డ్వేన్ క్రాడిక్ ఇంజనీర్‌గా సేవలు అందిస్తున్నాడని తెలిపారు. అయితే తన విధుల పట్ల అసంతృప్తిగా ఉన్న డ్వేన్ క్రాడిక్.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు(స్థానిక కాలమానం) సైలెన్సర్ అమర్చిన తుపాకీతో తన కార్యాలయం ఉన్న వర్జీనియా బీచ్ మున్సిపల్ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. ఆఫీసులోకి వచ్చేముందు గేటుదగ్గర ఒకరిని తుపాకీతో కాల్చాడు. అనంతరం మున్సిపల్ శాఖ కార్యాలయాలున్న రెండో భవంతిలోకి దూసుకెళ్లాడు. ఆ భవంతిలోని మూడు అంతస్తుల్లోని సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగాడు. గదుల్లో దాక్కున్న ఉద్యోగులు.. ఈ సందర్భంగా కాల్పుల శబ్దం విన్న కొందరు ఉద్యోగులు.. గది తలుపులు మూసేసి 911కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్రాడిక్ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు డ్వేన్ క్రాడిక్ను కాల్చిచంపారు. క్రాడిక్ జరిపిన కాల్పుల్లో ఓ కాంట్రాక్టర్‌తో పాటు 11 మంది సహోద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. క్రాడిక్ ఈ హత్యలు ఎందుకు చేశాడు? సహోద్యోగులతో ఏమైనా గొడవపడ్డాడా? ఉన్నతాధికారులు మందలించారా? అన్న విషయమై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఇది వర్జీనియాబీచ్ చరిత్రలోనే అత్యంత దుర్దినమని నగర మేయర్ అన్నారు. -
ఇథియోపియాలో కూలిన విమానం
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియా గగనతలంలో ఆదివారం పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు భారతీ యులుసహా చైనీయులు, కెనడా, అమెరికా దేశాల పౌరులున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదా నికి కారణమేంటో తెలియరాలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు బతికున్నట్లు సమాచారమేదీ లేదని ఇథియోపియా ప్రధాని కార్యా లయం ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారని, మృతుల్లో 33 దేశాలకు చెందిన వారు ఉన్నారని ఇథియోపియా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ఈబీసీ వెల్లడించింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే.. అడిస్ అబాబాలోని బోలె విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇథియోపియా ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమా నం ఆరు నిమిషాలకే కుప్పకూలింది. దక్షిణ అడిస్ అబాబాకు సుమారు 50 కి.మీ దూరం లోని బిషోఫ్తులో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ ఎమర్జెన్సీ కాల్ చేశాడని, వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చామని విమానయాన సంస్థ సీఈవో తెలిపారు. విమానం టేకాఫ్ అయిన తరువాత అస్థిర వేగంతో పైకి ఎగిరిందని ఎయిర్ ట్రాఫిక్ మానిటర్ వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737–8 మ్యాక్స్ గత నవంబర్లోనే ఎయిర్‌లైన్స్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 32 మంది కెన్యా, 9 మంది ఇథియోఫియా, 18 మంది కెనడా పౌరులున్నట్లు చెప్పారు. అలాగే, చైనా, అమెరికా, ఇటలీ నుంచి ఎనిమిది మంది చొప్పున, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నుంచి ఏడుగురు చొప్పున, ఈజిప్టు నుంచి ఆరుగురు, నెదర్లాండ్స్ నుంచి ఐదుగురు, భారత్, స్లోవేకియా నుంచి నలుగురేసి చొప్పున ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఇథియోపియా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటనపై విమాన తయారీ సంస్థ బోయింగ్ విచారం వ్యక్తం చేసింది. భారతీయ మృతుల గుర్తింపు.. విమాన ప్రమాదంలో మరణించిన భారతీయుల వివరాలను ఇథియోపియా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందులో కేంద్ర పర్యావరణ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కన్సల్టెంట్ శిఖా గార్గ్ ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. గార్గ్ యూఎన్ఈపీ సమావేశానికి వెళ్తున్నారని చెప్పారు. మిగిలిన ముగ్గురు వైద్య పన్నాగేశ్ భాస్కర్, వైద్య హాసిన్ అన్నాగేశ్, నూకవరపు మనీషా అని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సుష్మా స్వరాజ్, హర్షవర్థన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అమెరికాలో చలిగాలుల బీభత్సం
షికాగో: అమెరికాలోని ప్రజలు చలికి వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలకు తోడు.. ఆర్కిటికా నుంచి వీస్తున్న భయంకరమైన శీతల గాలుల ధాటికి జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అక్కడి మధ్య పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా అంటార్కిటికా ధృవం కన్నా తక్కువగా మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. శరీర ఉష్ణోగ్రతలు కూడా ఎక్కడ పడిపోతాయోనన్న భయంతో స్కూళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూసివేశారు. ఈ శీతల గాలులకు ఇప్పటివరకు దాదాపు 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. చలి గాలుల తీవ్రతకు అమెరికాలోని దాదాపు 12 రాష్ట్రాల ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇండియానా, మిషిగాన్, ఇల్లినాయిస్, ఒహియో, అయోవా, డకోటాస్, నెబ్రస్కా ప్రాంతాల్లో తపాలా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. చలి తీవ్రతకు నయాగరా జలపాతం గడ్డ కట్టుకుపోయింది. నది ప్రవాహం కూడా నిలిచిపోయింది. షికాగో నగరం మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసింది. గురువారం తెల్లవారుజామున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. షికాగోలో బుధవారం ఉదయం మైనస్ 30.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇల్లినాయిస్లోని రాక్‌ఫోర్డ్ పట్టణంలో మైనస్ 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం షికాగోలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి వెళ్లాల్సిన దాదాపు 1,700లకు పైగా విమానాలు రద్దయ్యాయి. రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. వృద్ధులు, పిల్లల కోసం పలు చోట్ల 200లకు పైగా వెచ్చటి కేంద్రాలు (వార్మింగ్ సెంటర్స్) ఏర్పాటు చేశారు. బస్సులను కదిలే వార్మింగ్ కేంద్రాలుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. షికాగోలోని వీధుల్లో జీవించే దాదాపు 16 వేల మంది కోసం శిబిరాలను పెంచారు. హిందూ దేవాలయంపై దాడి వాషింగ్టన్: అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌వెల్లీలో ఉన్న ప్రఖ్యాత స్వామి నారాయణ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. విగ్రహప్రతిమపై నల్లరంగు చల్లడంతోపాటు ఆలయ గోడలపై విద్వేషపూరిత రాతలు రాశారు. ఆలయ కిటికీలు సహా సామగ్రిని ధ్వంసం చేశారు. ఘటన ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం మధ్య జరిగినట్లు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది జాతి విద్వేషంతో జరిపిన దాడిగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. దీనిపై ఎలాంటి వీడియో ఫుటేజీలు లభించలేదని ఆలయ అధికారులు తెలిపారు. ధ్వంసమైన స్వామి నారాయణ ఆలయాన్ని లూయిస్‌వెల్లీ మేయర్ జార్జ్ ఫిషర్ సందర్శించారు. ఆలయంపై దాడిని ఆయన ఖండించారు. ఏ మతం వారైనప్పటికీ ఇలా దేవాలయాలను ధ్వంసం చేయడం తగదని ఆలయానికి చెందిన రాజ్ పటేల్ తెలిపారు. గడ్డకట్టిన మిషిగాన్ సరస్సు -
కార్చిచ్చుకు 9 మంది బలి
పారడైజ్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అడవుల్లో చెలరేగుతున్న మంటల ధాటికి శుక్రవారం రాత్రికి మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. పదుల సంఖ్యలో మనుషులు ఆచూకీలేదు. వివిధ ప్రాంతాల్లోని వేలాది మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలోని మొత్తం 26 వేల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. మరణించిన వారంతా బుట్టే కౌంటీలోని ప్యారడైస్ పట్టణవాసులే. ఉధృతమైన గాలుల కారణంగా కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ప్యారడైజ్‌లో వందలాది ఇళ్లు, అనేక రెస్టారెంట్లు, వాహనాలు కాలిపోయాయి. 70 వేల ఎకరాలను కార్చిచ్చు బూడిద చేసిందనీ, ఇంకా మంటల తీవ్రత తగ్గలేదని కాలిఫోర్నియా అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు. అటు దక్షిణ కాలిఫోర్నియాలోని వెంచురా కౌంటీలోనూ రెండు కార్చిచ్చులు మొదలయ్యాయి. సియార్రా నెవాడా పర్వతాల దిగువన, చికో పట్టణంలో నివసిస్తున్న 52 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచించారు. వెంచురా కౌంటీలో ‘వూల్సీ ఫైర్’ ధాటికి 35 వేల ఎకరాలు కాలిపోయాయనీ, 88 వేల ఇళ్ల నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించామని అధికారులు చెప్పారు. హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే మాలిబు నగరానికీ కార్చిచ్చు వ్యాపిస్తోంది. లియోనార్డో డికాప్రియో, జాక్ నికోల్సన్, జెన్నిఫర్ అనిస్టన్; హాల్లే బెర్రీ, చార్లైజ్ థెరాన్, బ్రాడ్ పిట్ తదితరులు ఈ ప్రాంతంలోనే నివసిస్తారు. -
ప్రార్థనా మందిరంలో కాల్పులు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్బర్గ్ పట్టణంలో శనివారం ఉదయం యూదుల ప్రార్థనా మందిరం(సినగోగ్)లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు సహా 8 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో డజను మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. ప్రజలు ఉదయపు ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు వార్తలు వెలువడ్డాయి. దాడి తరువాత నిందితుడు రాబర్ట్ బోయర్స్ పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించింది. ఇది విద్వేషపూరిత దాడి అని, ఉగ్రకోణం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సినగోగ్ మూడో అంతస్తులో బోయర్స్, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ క్రమంలో గాయపడిన అతడు ఆ తరువాత లొంగిపోయేందుకు అంగీకరించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. శ్వేత జాతీయుడైన బోయర్స్ గడ్డంతో ఉన్నాడని, యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరుగెత్తుతూ కనిపించాడని చెప్పారు. దాడి జరిగిన సినగోగ్ భవనంలో తనిఖీల్ని ముమ్మరం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలోని అన్ని ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈ ప్రార్థనా మందిరం ఉన్న స్క్విరిల్ హిల్ ప్రాంతంలో సాయుధుడు సంచరిస్తున్నాడని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అంతకుముందే పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేశారు. -
అయ్య బాబోయ్.. ఇలా కూడా చంపుతారా..
హాంగ్‌కాంగ్: కొన్ని దారుణాలు చూసేందుకే ధైర్యం చాలదు.. అలాంటిది స్వయంగా చేయాలంటే ఎంతటి ధైర్యం కావాలి. ఒకరిని కాదు.. మొత్తం ముగ్గురుని.. కక్షకట్టి పగబట్టి ఏ కోశానా భయం లేకుండా చంపడమే లక్ష్యంగా ఓ వ్యక్తి కారుతో తెగబడితే.. అది కూడా పట్టపగలు నడిరోడ్డుపై.. బిజీగా ఉండే చౌరస్తాలో.. నాలుగు వైపుల వాహనాల రద్దీ ఉండగా.. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన హాంకాంగ్‌లో చోటుచేసుకుంది. బిజీగా ఉండే చౌరస్తాలో ఓ బ్లూ ట్యాక్సీ కారుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ లోపలే కూర్చుని ఉండగా ఓ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి మరో యువకుడు ఆ కారుపక్కనే నిల్చున్నారు. అదే సమయంలో వారి వెనుకాలే ఓ తెల్లటి కారు వారిపైకి దూసుకొచ్చింది. ఉద్దేశ పూర్వకంగా కారుతో సహా వారిని ఢీకొట్టింది. అందులో ఒకతను కారు కిందపడగా కారులోని మహిళ, మరో యువకుడు బయటకు వచ్చారు. అప్పటికీ వదిలిపెట్టని ఆ తెల్లటికారులోని వ్యక్తి ఆ ముగ్గురి అంతమే లక్ష్యంగా కారుతో పదే పదే గుద్దేసేందుకు చౌరస్తాలో చక్కెర్లు కొడుతూ ప్రయత్నించాడు. మహిళను ఢీకొట్టేందుకు ప్రయత్నించగా మరో కారు వచ్చి అతడిని అడ్డుకుంది. అయితే దానిని కూడా ఢీకొట్టి అంతటితో ఆగకుండా చౌరస్తా మొత్తం హడలెత్తెలా చక్కెర్లు కొడుతూ అక్కడి వారిని చంపేసేందుకు విఫలయత్నం చేశాడు. ఈ కారు ఢీకొన్న కారణంగా ఒక వ్యక్తి కొన ఊపిరితో కొట్టుకునే పరిస్థితికి వెళ్లగా మరో వ్యక్తి బతికి బయటపడ్డాడు. మహిళకు మాత్రం ఎలాంటి హానీ జరగలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ సీసీటీవీ ఫుటేజీని తాజాగా పోలీసులు విడుదల చేశారు.