vice chancellor
-
ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారా యని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. వర్సిటీలను అలా చేయొద్దని సూచించారు. యూనివర్సిటీలన్నీ విద్యార్థులు కేంద్రంగా పని చేయాలే తప్ప.. కాలం చెల్లిన వారికి పునరావాసం కల్పించేందుకు కాదని స్పష్టం చేశారు. గతంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇంకా ఉన్నారనే భావనతో పలు విశ్వ విద్యాలయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను ఇప్పటికీ బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత విద్యపై రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడారు. కేకేతో చర్చించండి: ప్రస్తుతం వర్సిటీలకు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వస్తున్నారని.. వారికి సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుని ప్రైవేటు విశ్వ విద్యాలయాల వైపు వెళ్లిపోతున్నారని..వారితో ఎదురయ్యే పోటీని ప్రభుత్వ విశ్వ విద్యాలయాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సులనే బోధించాల్సి ఉందని చెప్పారు.గతంలో నియమితులైన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అధునాతన, డిమాండ్ ఉన్న బోధనను అందివ్వని పక్షంలో వారికి పాలనపరమైన బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వీసీలు తమ విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత, భవనాలు, ఇతర వసతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యూనివర్సిటీలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారు. వీసీలందరూ తమ ఉమ్మడి సమస్యలు, అలాగే యూనివర్సిటీల వారీగా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో సమావేశమై చర్చించాలని సూచించారు. వర్సిటీల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచాలని చెప్పారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి సమగ్ర విధాన పత్రాన్ని రూపొందించాలని సూచించారు. ఇది ఆచరణకు దగ్గరగా ఉండాలని చెప్పారు.విద్యా రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడా రేవంత్ సమీక్ష నిర్వహించారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ పాఠశాలలకు కమిటీల ఏర్పాటు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. ప్రాథమిక దశే పునాది ప్రాథమిక దశలో అందే విద్య కీలకమని, విద్యార్థికి పునాది వేసేది ఇదేనని సీఎం తెలిపారు. ప్రాథమిక విద్య బలోపేతం చేస్తే ఉన్నత విద్యలో మరింత రాణిస్తారని అన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1960 దశకం నుంచి ఇప్పటివరకు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, ఆలోచన ధోరణి ఏ విధంగా క్షీణిస్తోందో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వివరించారు. విద్యా ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయ్? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పరీక్ష (న్యాస్)లో విద్యార్థుల ప్రమాణాలు తగ్గిపోవడం, భాషల్లోనూ బలహీనంగా ఉండటాన్ని సీఎం ప్రస్తావించారు. అధికారుల నుంచి వివరణ కోరారు. అధికారులు దీనిపై ప్రతినెలా ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు.ఇప్పటికీ ప్రజల్లో ప్రభుత్వ స్కూళ్ళు సరిగా నడవవని, పాఠాలు సరిగా చెప్పరనే అపోహ ఉందంటూ, దీన్ని ఎలా దూరం చేస్తారో చెప్పాలన్నారు. ఈ దిశగా చపట్టబోయే చర్యలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ప్రైవేటు స్కూళ్ళు ప్రతి ఏటా ప్రవేశాలు పెంచుకుంటున్నాయని, ప్రభుత్వ స్కూళ్ళు మాత్రం ప్రజల్లో నమ్మకాన్ని కల్పించలేకపోవడంతో ప్రవేశాలు తగ్గుతున్నాయని సీఎం అన్నట్టు తెలిసింది. వేసవి సెలవుల్లో టీచర్లకు ప్రత్యేక శిక్షణ డిజిటల్, ఏఐ సాంకేతిక విద్యను ప్రాథమిక దశలోనే ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి తగ్గట్టుగా టీచర్లూ తమ నాణ్యతను పెంచుకోవాలని సీఎం సూచించినట్టు సమాచారం. ఇలావుండగా వేసవి సెలవుల్లో ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని రేవంత్ సూచించారు. ఈ సమీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావుతో పాటు శ్రీనివాసరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ప్రాథమిక విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి, వీసీలు ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ టి.యాదగిరిరావు, ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ప్రొఫెసర్ కిషన్‌కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ టి.గంగాధర్, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ప్రొఫెసర్ వి.నిత్యానందరావు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
women's day 2025 అవగాహన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు!
‘అన్నం ముద్దను మన నోటికి చేర్చే రైతు కష్టానికిఅవగాహన, సాంకేతికత, ఆర్థిక వెన్నుదన్ను అందిస్తేవ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు’ అంటున్నారు డాక్టర్ నీరజా ప్రభాకర్. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్శిటీకి ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్‌గా చేసి, అగ్రికల్చర్యూనివర్శిటీలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి హెడ్‌గా, సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 42 ఏళ్లుగా ఈ రంగంలో చేస్తున్న కృషిని, చోటు చేసుకుంటున్న మార్పులను, నేటి తరం ఆలోచనలనూ మన ముందు ఆవిష్కరించారు. ‘‘రైతు నేలలో విత్తనాలు వేసిన రోజు నుంచి నీటి సదు΄ాయాలు, భూసారం, వాతావరణం, తెగుళ్లు.. అన్నింటినీ దాటుకొని రైతు కష్టం మన చేతికి వచ్చేవరకు ఏయే దశలు దాటుతుంది అనే విషయాల పట్ల అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించగలం. ఉల్లిపా యలు వేసిన మార్గం..మాది వ్యవసాయం కటుంబం. చదువుకునే రోజుల నుంచి ఉల్లిపాయలపై మార్కెట్లో వచ్చే హెచ్చు తగ్గులు ఎప్పుడూ విస్మయానికి లోను చేస్తుండేవి. ఆ ఆలోచనతోనే 1983లో ఎమ్మెస్సీ హార్టీ్టకల్చర్, అటు తర్వాత ‘ఉల్లిపాయలు– నీటి యాజమాన్యం’ మీద పీహెచ్డీ చేశాను. 1994 లో సంగారెడ్డి ఎఆర్వో నర్సరీ ఇంచార్జ్‌గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మూడేళ్లకు ఉల్లి ధరలుæపెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు ఉల్లి సాగులో ఎక్కువ దిగుబడి సాధించడానికి శిక్షణాతరగతులు నిర్వహించాం. అక్కణ్ణుంచి మామిడి, జామ, స΄ోట, సీతాఫలం అంటు మొక్కలతోపాటు జామ, పనస వంటి పండ్లు, మల్లె మొక్కల... అమ్మకాలు కూడా ప్రాంరంభించాం.ప్రాంతానికి తగిన విధంగాఏ ప్రాంతానికైనా అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పండే పంటలు కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించి అన్ని సీజన్లలో ఎలా పండించవచ్చో సాధించి చూ΄ాం. వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ (అఖిల భారత సమన్వయ సంస్థ కూరగాయల పరిశోధన)లో ఆరేళ్లు పని చేశాను. రైతుల దగ్గరకు వెళ్లి, వాళ్లు ఎంచుకున్న సాగు పద్ధతులు స్వయంగా తెలుసుకొని, మార్పులూ చేశాం. బీర, దోస, సొరకాయ, గుమ్మడి.. మొదలైన వాటిలో క్రాసింగ్,, హైబ్రీడ్స్ మీద వర్క్ చేశాను.పారిశ్రామిక రంగానికి జత చేయాలిఆ తర్వాత 15 ఏళ్లు అధ్యాపకురాలిగా ఉన్నాను. సీనియర్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ ఆ తర్వాత 20 రోజుల్లోనే కొండాలక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్శిటీ కి ఫస్ట్ రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ పోస్టింగ్ వచ్చింది. దేశంలోనే హార్టికల్చర్ యూనివర్శిటీస్‌లో ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్‌గానూ గుర్తింపు లభించింది. మొదటిసారి విద్యార్థులనుపారిశ్రామిక రంగానికి అటాచ్ చేస్తూ స్కిల్స్ నేర్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేశాం. కమర్షియల్ హార్టికల్చర్, నర్సరీ, ఫ్లోరికల్చర్, మష్రూమ్స్‌పై పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌తో తయారుచేసే నిల్వ పదార్థాలు, సుగంధ తైలాల తయారీలోనూ ట్రైనింగ్ ఇచ్చాం. టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్స్, మామిడిపై పరిశోధన, ప్రదర్శనలు, డ్రాగన్ ఫ్రూట్ సాగులను ప్రోత్సహించాం. వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో మన రైతులకు, స్టూడెంట్స్‌కు మధ్య చర్చలు జరిపాం.నవతరం దృష్టి మారాలి..ఐదారేళ్ల నుండి ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అయితే, అమ్మాయిలు ఫీల్డ్కి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అవగాహన కలిగినవారు వెనుకంజ వేస్తే వ్యవసాయ రంగం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ రంగంలోకి వచ్చేవారు పొలాలకు వెళ్లడానికి ఉదయం, సాయంత్రం సమయాలను ఎంచుకోవడం వంటి స్మార్ట్ వర్క్ నేర్చుకోవడం కూడా ముఖ్యం. రైతులు ఏ విధంగా కష్టపడతారో ఈ రంగంలోకి వచ్చి శిక్షణ తీసుకున్నవారు కూడా అంత కష్టపడాల్సి ఉంటుంది. చేసే పనిలో అంకితభావం ఉంటే మంచి ఫలితాలను ΄÷ందగలం’’అని వివరించారు.- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు
గౌహతి: పరీక్షల్లో అక్రమాలకు ఊతమిచ్చారన్న ఆరోపణలపై యూనివర్సిటీ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేఘాలయ(యూఎస్‌టీఎం) చాన్స్‌లర్ మహబూబుల్ హక్ అరెస్టయ్యారు. అస్సాంలోని షిభుమి జిల్లాకు చెందిన ఓ కోర్టు శనివారం రాత్రి హక్‌తోపాటు, కరీమ్గంజ్ జిల్లా పత్తర్‌కండిలోని ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను కూడా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు గౌహతిలోని నివాసంలో ఉన్న హక్‌ను శనివారం అదుపులోకి తీసుకుని షిభుమికి తరలించారు. యూఎస్‌టీఎం చాన్స్‌లర్‌గా ఉన్న హక్ ఈఆర్డీ అనే ఫౌండేషన్ ద్వారా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఇందులో పత్తర్‌కండిలోని స్కూలు కూడా ఉంది. ఇతర జిల్లాలకు చెందిన సీబీఎస్ఈ విద్యార్థులను ఎక్కువ మార్కులు వచ్చేలా ప్రిపేర్ చేస్తామంటూ ఈ స్కూలుకు తీసుకువచ్చారు. వీరు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు పథకం వేశారంటూ శుక్రవారం నుంచి అక్కడ వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లతోపాటు చాన్స్‌లర్ హక్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ..దీని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్నారు. సీబీఎస్ఈలోనే కాకుండా, మెడికల్ ఎంట్రన్స్‌లోనూ ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘యూఎస్‌టీఎం చాన్స్‌లర్ హక్ పెద్ద ఫ్రాడ్, ఆయన జీవితమే ఫ్రాడ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హక్ దొడ్డిదారిన పొందిన ఓబీసీ సరి్టఫికెట్ తర్వాత రద్దయిందని చెప్పారు. అస్సాం–మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న యూఎస్‌టీఎం క్యాంపస్ కారణంగా గౌహతి నగరానికి వరద ముప్పు పెరిగిందంటూ సీఎం శర్మ గతంలోనే ఆరోపణలు చేయడం తెల్సిందే. -
9 వర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ (చాన్సలర్) ఎస్.అబ్దుల్ నజీర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర సాంకేతిక విద్యా సంస్థలు, సెంట్రల్ వర్సిటీల్లో పనిచేస్తున్న వారికి వీసీలుగా ప్రాధాన్యం కల్పించారు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక విభాగంలో వారినే వీసీలుగా ఎంపిక చేశారు. తాజాగా నియమించిన 9 మంది వీసీల్లో ఐదుగురు ఐఐటీ, ఎన్ఐటీ, ఢిల్లీ సాంకేతిక వర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, ఉస్మానియా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు. వీరంతా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్య కార్యదర్శి కోనశశిధర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా వర్సిటీల్లో పని చేస్తున్న ఇన్చార్జీ వీసీలను రిలీవ్ చేశారు. మరో 8 వర్సిటీలకు.. గతంలో 17 వర్సిటీలకు వైస్ చాన్సలర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సెర్చ్ కమిటీల భేటీ అనంతరం తొలివిడతగా 9వర్సిటీలకు వీసీలను నియమించారు. మిగిలిన 8 వర్సిటీలకు వీసీ నియమించాల్సి ఉండగా ద్రవిడియన్, ఉర్దూ వర్సిటీలకు ఇంకా సెర్చ్ కమిటీ భేటీ జరగాల్సి ఉంది. వాస్తవానికి గతంలోనే ద్రవిడియన్ వర్సిటీ వీసీ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలను కూటమి ప్రభుత్వం ప్రభావితం చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలోనే ద్రవిడియన్ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశంలో ఉన్నత విద్యా మండలికి చెందిన ఉన్నత స్థాయి అధికారి ఓ వర్గానికి చెందిన వ్యక్తికి వీసీ పోస్టు రిజర్వ్ చేయాలని సూచించడంతో యూజీసీ నుంచి సెర్చ్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ నుంచి వీసీ పోస్టు రిజర్వ్ చేయమని జీవో ఉంటే చూపించాలని కోరడంతో పాటు వీసీ ఎంపికలో దొర్లుతున్న తప్పులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సమావేశాన్ని నిలిపేశారు. ఇప్పటి వరకు మళ్లీ సెర్చ్ కమిటీ సమావేశానికి తేదీ ప్రకటించకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. పైగా సదరు వర్సిటీలోనే అర్హత లేని వ్యక్తుల పేర్లు వీసీ పోస్టుకు ప్రతిపాదించాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. -
డిగ్రీ కాదు.. నైపుణ్యమే కీలకం
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విసురుతున్న సవాళ్లకు అనుగుణంగా సాంకేతిక విద్యలో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ హెచ్) నూతన వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ టి.కిషన్‌కుమార్‌రెడ్డి అన్నారు. వీసీగా తన లక్ష్యం కూడా అదేనని చెప్పారు. మంగళ వారం వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తిగా సాంకేతిక వర్సిటీ కావడం వల్ల జేఎన్టీయూహెచ్ బాధ్యతలు కత్తిమీద సాములాంటివేనని పేర్కొ న్నారు. తమ వర్సిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు కాలే జీల్లోనూ నాణ్యత పెంచడంపై దృష్టి పెడతామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గబోమని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకా రం కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు ఉంటేనే గుర్తింపు ఇస్తామని తెలిపారు. కోర్ గ్రూ పుల తగ్గింపు క్షేమకరం కాదని అభిప్రాయపడ్డారు. సీఎస్ఈ వైపే విద్యార్థులను పరుగులు పెట్టించడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. భవనాలు కాదు.. బోధకులు ముఖ్యంఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులవైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని కిషన్‌కుమార్‌రెడ్డి తెలిపా రు. అయితే, నాణ్యమైన ఫ్యాకల్టీ కొరత ఉందని చెప్పారు. ‘అందమైన భవనాలుంటేనే మంచి విద్య వస్తుందనే భ్రమలు తొలగాలి. బోధకుల ప్రమాణా లేంటో పరిశీలిస్తాం. అనుబంధ గుర్తింపు ఇచ్చేట ప్పుడు అన్ని కోణాల్లోనూ పరిశీలన చేస్తాం. విద్యా ర్థులకు మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించే దిశగానే కాలేజీలు ఉండాలి. త్వరలోనే ఈ విషయంపై వర్సిటీ అధికారులతో సమీక్షిస్తా. నాణ్యత పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. వర్సిటీ లోని అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకుని నైపుణ్యంతో కూడిన విద్యను అందించే ప్రయత్నం చేస్తాం’ అని తెలిపారు.ఉద్యోగానికి నైపుణ్యమే కీలకంవిద్యార్థికి ఉద్యోగం సంపాదించే నైపుణ్యాలు నేర్పటమే కీలకమని కిషన్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘ఉద్యోగాల ట్రెండ్ మారింది. ఏఐ వచ్చాక ఉద్యోగం రావడం కష్టంగా మారింది. ఇప్పుడు కంప్యూటర్‌తో పరుగులు పెట్టే నైపుణ్యం అవసరం. ఇంజనీరింగ్‌లో ఎన్ని మార్కులొచ్చాయని కంపెనీలు చూడటం లేదు. ఏమేర నైపుణ్యం ఉందనే విషయాన్ని పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. జేఎన్టీయూహెచ్ పరిధిలోనూ నైపుణ్యాలు అభివృద్ధి చేస్తాం. పుస్తకాల పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని ప్రైవేటు కాలేజీలు ఈ దిశగా అడుగులు వేయడానికి కృషి చేస్తాం’ అని వెల్లడించారు. జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ కిషన్‌కుమార్ రెడ్డిగవర్నర్ ఉత్తర్వులు.. వెంటనే బాధ్యతల స్వీకరణమెదక్ జిల్లాలో పుట్టి జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన టీకే రెడ్డిగతంలో దీన్‌దయాళ్ పెట్రోలియం వర్సిటీ వీసీగా సేవలు సాక్షి, హైదరాబాద్: జవ హర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యా లయం (జేఎన్టీయూ) వైస్ చాన్స్ లర్ (వీసీ)గా ప్రొఫెసర్ టీ కిషన్‌కుమా ర్రెడ్డిని నియమిస్తూ మంగళ వారం గవర్నర్ ఉత్తర్వు లు జారీచేశారు. ఆ వెంటనే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. గత ఏడాది మే నెలలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీల గడువు ముగియటంతో సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేక పాలనాధికారులుగా ప్రభుత్వం నియమించింది. అనంతరం గత ఏడాది అక్టోబర్‌లో పలు వర్సిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది. జేఎన్టీయూహెచ్కు కూడా సెర్చ్ కమిటీని వేసినప్పటికీ సాంకేతిక సమస్యలతో వీసీ నియామకం ఆపివేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. గత నెలలో సెర్చ్ కమిటీ తిరిగి సమావేశమై ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వారిలో నుంచి కిషన్‌కుమార్‌రెడ్డిని వీసీగా గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఎంపిక చేశారు.సిద్దిపేట నుంచి జేఎన్టీయూహెచ్ వీసీ దాకాప్రొఫెసర్ టీకే రెడ్డి సిద్దిపేట జిల్లా అల్లీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గురవారెడ్డి కుమారుడు. పాఠశాల చదువు హైదరాబాద్ సెయింట్ పాల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో సాగింది. నారాయణగూడలోని న్యూసైన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1973–78లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. 1981–87లో అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీలో థర్మల్ ఫ్లూయిడ్ సైన్స్‌పై పీహెచ్డీ చేశారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశారు. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. అనేక జాతీయ అవార్డులు అందుకున్నారు. -
‘వెటర్నరీ’ వీసీ ఎంపిక ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎంపికలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. రెండుసార్లు సెర్చ్ కమిటీలు భేటీ అయినా వీసీని ఎంపిక చేయలేదు. అయితే ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని ఓ వ్యక్తి తన బంధువు కోసం చక్రం తిప్పుతున్నారా? వెటర్నరీ యూనివర్సిటీలో ఎవరిని కదిపినా ఇవే ప్రశ్నల పరంపర వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలకు ఒకేరోజు వీసీలను ఎంపిక చేసి.. ఆ జాబితాను గవర్నర్ ఆమోదానికి సీఎం పంపిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో వెటర్నరీ వర్సిటీ వీసీ పేరు లేదు. » గత డిసెంబర్ 28న తొలిసారిగా సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. తమిళనాడు వెటర్నరీ వర్సిటీ వీసీ, పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ గోపీ, ఐసీఏఆర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాఘవేంద్ర భట్‌తో కూడిన ఈ కమిటీ అదే రోజు సమావేశమై వీసీ పోస్టుకు అర్హులైన ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ప్రభుత్వానికి పంపించింది. కానీ ఆ సెర్చ్‌కమిటీ ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎంపిక చేయలేదు. » ఈ ఏడాది ఫిబ్రవరి 5న మరోసారి వీసీ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ సమావేశమైంది. ఆరోజు నుంచి ఇప్పటివరకు వీసీ ఎంపిక ఏమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. రెండో విడత సమావేశమైన సెర్చ్ కమిటీ ఇచి్చన పేర్లలో ముఖ్యమంత్రి ఒకరిని ఎంపిక చేసి గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదముద్రతో వీసీ నియామకం అధికారికంగా జరుగుతుంది. అయితే యూనివర్సిటీల చరిత్రలో రెండోసారి సెర్చ్ కమిటీ సమావేశమై అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపినా, వీసీ ఎంపికపై ఏ నిర్ణయమూ తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి ఒకరు వీసీ నియామక విషయంలో జోక్యం చేసుకుంటున్నారని వెటర్నరీ వర్సిటీలో చర్చ జరుగుతోంది. వి శ్వసనీయ సమాచారం ప్రకారం వీసీ రేసు లో ప్రొఫెసర్లు చంద్రశేఖర్, పురుషోత్తం, కొండల్‌రెడ్డి, జ్ఞానప్రకాశ్ ఉన్నట్టు తెలిసింది. -
బోధకులే లేరు.. ఏం సాధిస్తాం?
సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరిస్తే తప్ప రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పలేమని వైస్ చాన్స్లర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అధ్యాకుల కొరతను తక్షణమే తీర్చాలని కోరుతున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై వర్సిటీల్లో సమస్యలపై చర్చించారు. అన్ని వర్సిటీల్లోనూ దాదాపు ఒకే రకమైన సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఈ సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించారు. దీనిని త్వరలో సీఎంకు అందివ్వనున్నారు. సమస్యలెన్నో.. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 74 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంజూరైన మొత్తం పోస్టులు 2,825 కాగా, ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ సిబ్బంది 873 మంది మాత్రమే. మిగతా వాళ్లంతా తాత్కాలిక ఉద్యోగులే. దీంతో బోధనలో జవాబుదారీతనం లోపించి, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలున్నాయి. పోస్టుల భర్తీపై గత ప్రభుత్వం నియమించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధ్యాపకుల కొరత కారణంగా ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలతో పోటీ పడలేని స్థితి ఉంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు తీసుకొచ్చినా ప్రాజెక్టులు రావడం లేదు. ఉస్మానియా వర్సిటీలో పరిశోధనలు. పరిశోధన ప్రాజెక్టులూ తగ్గిపోయాయి. 2020–21లో రూ.52.45 కోట్ల ప్రాజెక్టులొస్తే.. 2022–23 నాటికి రూ.24.75 కోట్లకు తగ్గింది. రెండేళ్లలోనే 53 శాతం పడిపోయాయి. శాపంగా మారిన నిధుల కొరత చాలా యూనివర్సిటీల్లో నిధుల కొరత ఉంది. పాలమూరు వర్సిటీకి రూ.10 కోట్లు కేటాయించినా,ఇస్తున్నది మాత్రం రూ.7 కోట్ల లోపే. ఇక్కడ ఏడు విభాగాలకు 84 పోస్టులు మంజూరైతే 17 పోస్టుల్లోనే అధ్యాపకులున్నారు. వీరిలో ఇద్దరు ప్రొఫెసర్లు. నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు. కొత్తగా ప్రవేశపెట్టిన 11 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రెగ్యులర్ అధ్యాపకులే లేరు. 94 మంది తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. తెలంగాణ వర్సిటీలో 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైనా, ఉన్నది 61 మంది మాత్రమే. 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్న ఈ వర్సిటీలో అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టకొస్తున్నారు. కాకతీయ వర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఏడాదికి రూ.150 కోట్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ కింద రూ.97 కోట్లు మాత్రమే వస్తోంది. దీంతో అంతర్గత సమీకరణల ద్వారా రూ.53 కోట్లు సమకూర్చుకుంటున్నారు. ఇక్కడ 405 రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు ఉంటే, అందుబాటులో ఉన్నది 83 మందే. మరో 190 మందిని కాంట్రాక్టు, 201 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సులను కలుపుకుంటే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలి.సాంకేతిక విద్యకు అగచాట్లుఇంజనీరింగ్లో కొత్త కోర్సులు వస్తు న్నాయి. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు మౌలిక వసతులు, బోధనా నైపుణ్యం గల సిబ్బంది లేకపోవటంతో ప్రభుత్వ వర్సిటీల్లో నిర్వహించలేకపోతున్నారు. జేఎన్టీయూహెచ్లో 410 మంది అధ్యాపకులుండాలి. కానీ 169 మందే ఉన్నారు. 241 పోస్టులు ఖాళీ. కొత్త ఏఐ కోర్సులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ఏటా రూ.200 కోట్లు అవసమని ఇక్కడి ఉన్నతాధికారులు చెబుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో చాలాకాలంగా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ లేదు. ఇక్కడ 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. -
ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది. ముసాయిదా ప్రకారం వైస్‌ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్‌లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు. నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది. గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్‌భవన్‌ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. -
నూరు శాతం వర్సిటీల ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని.. వాటిల్లోని పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వర్సిటీల గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత వైస్ చాన్స్లర్లపైనే ఉందన్నారు. ఇటీవల నియమితులైన వివిధ యూనివర్సిటీల వీసీలతో సీఎం రేవంత్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ, సామాజిక సమీకరణాల ఆధారంగానే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్లను ఎంపిక చేశామని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రభావితాలు లేవన్నారు. వర్సిటీల్లో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని వీసీలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేపట్టి నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి..‘గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ప్రభుత్వం మీకు స్వేచ్ఛ ఇస్తోంది. మంచిపనులు చేసేందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. తప్పు జరిగితే మాత్రం ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టిపెట్టండి. విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్ ఇవ్వండి’ అని సీఎం రేవంత్ వీసీలకు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
9 వర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాల యాలకు ఉప కులపతులు నియమితులయ్యారు. ప్రభుత్వ సిఫారసుతో వర్సిటీలకు వీసీలను ఖరారు చేసినట్టు గవర్నర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వీసీల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి 13 వర్సిటీలు ఉండగా.. మహిళా వర్సిటీకి ముందే వీసీని నియమించారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లకు ఇంకా వీసీలను నియమించాల్సి ఉంది. అంబేడ్కర్ వర్సిటీకి అత్యధిక దరఖాస్తులురాష్ట్రంలోని వర్సిటీలకు చెందిన వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే 23 తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో తొలుత ఐఏఎస్ అధికారులకు వీసీలుగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, మరోవైపు ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే సెర్చ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ పోస్టుల కోసం 312 మంది 1,382 దరఖాస్తులు సమర్పించారు. చాలామంది అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేశారు. అత్యధికంగా బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి 208 దరఖాస్తులు వస్తే, ఉస్మానియాకు 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీ వర్సిటీకి 157 వచ్చాయి. జేఎన్టీయూహెచ్కు 106 దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ సెర్చ్ కమిటీ పరిశీలించి మూడు పేర్ల చొప్పున ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వీసీలను ఎంపిక చేసిన ప్రభుత్వం దసరా ముందు ఫైల్‌ను గవర్నర్ కార్యాలయానికి పంపింది. తాజాగా గవర్నర్ కార్యాలయం వీసీల పేర్లను ఖరారు చేసింది. వివాదంలో జేఎన్టీయూహెచ్జేఎన్టీయూహెచ్కు వీసీ నియామకం ఆఖరి దశలో ఆగిపోయింది. అంతర్గత వివాదం, వీసీ నియామకం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీసీ ఖరారును వాయిదా వేశారని తెలిసింది. ఈ వర్సిటీకి సెర్చ్ కమిటీ ముగ్గురు పేర్లను సిఫారసు చేయగా.. ఇందులో ఓ మాజీ వీసీ పేరు ఉండటం వివాదాస్పదమైంది. గతంలో ఆయనపై పలు ఆరోపణలున్నాయని, అయినప్పటికీ ఆయన పేరును సెర్చ్ కమిటీ సూచించిందంటూ పలువురు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీని వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఆయనకు సంబంధించిన ఫైల్‌ను గవర్నర్‌కు పంపలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. జేఎన్ఏఎఫ్, ‘అంబేడ్కర్’పై భేటీకాని సెర్చ్ కమిటీలుఅంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రాగా, ఈ పోస్టును దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు సైతం జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచే నాలుగు సిఫారసులు వచ్చినట్టు తెలిసింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సెర్చ్ కమిటీ ఇంతవరకూ ఈ వర్సిటీ విషయమై భేటీ అవ్వలేదని తెలుస్తోంది. అలాగే జేఎన్ఏఎఫ్ఏపై కూడా సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించలేదు. ఈ భేటీ త్వరలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త వీసీలు వీరే.. యూనివర్సిటీ: వీసీపాలమూరు, మహబూబ్‌నగర్: ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్రావుకాకతీయ, వరంగల్: ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డిఉస్మానియా, హైదరాబాద్: ప్రొఫెసర్ కుమార్ మొలుగరంశాతవాహన, కరీంనగర్: ప్రొఫెసర్ ఉమేశ్కుమార్తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్: ప్రొఫెసర్ నిత్యానందరావుమహాత్మాగాంధీ, నల్లగొండ: ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్తెలంగాణ, నిజామాబాద్: ప్రొఫెసర్ యాదగిరిరావుప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ: ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన: ప్రొఫెసర్ రాజిరెడ్డిప్రొఫెసర్ అల్దాస్ జానయ్యజయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన ప్రొ.అల్దాస్ జానయ్య నల్లగొండ జిల్లా, తిప్పర్తి మండలం, మామిడాల గ్రామంలో జన్మించారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం జగిత్యాల వ్యవసాయ కాలేజీ అసోసియేట్ డీన్‌గా సేవలందిస్తున్నారు. 2002లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.ప్రొ.రాజిరెడ్డి దండకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన దండ రాజిరెడ్డి మహారాష్ట్రలోని పంజాబ్రావు కృషి విద్యాపీఠ్‌లో అగ్రికల్చర్లో బీఎస్సీ, ఎంఎస్సీ చేశారు. గుజరాత్ అగ్రికల్చర్ వర్సిటీలో అగ్రో మెటియోరాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. అఫ్గానిస్తాన్ అగ్రోమెట్ సర్వీసెస్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు కన్సల్టెంటుగా కొంతకాలం పనిచేశారు. చాలాకాలం పాటు జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.ప్రొ.వెలుదండ నిత్యానందరావు తెలుగు వర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.వెలుదండ నిత్యానందరావు స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా మంగనూరు గ్రామం. పాలెం ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అదే శాఖ హెచ్వోడీగా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు. ఆయన రచించిన ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే గ్రంథం అన్ని వర్సిటీల తెలుగు విభాగాల్లో ప్రామాణిక గ్రంథంగా ఇప్పటికీ బోధిస్తున్నారు.ప్రొ.టి.యాదగిరిరావు తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.యాదగిరిరావు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. పీజీ, పీహెచ్డీ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇప్పుడు అదే వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బీవోఎస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కేయూలో యూజీసీ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి అవార్డు అందుకున్నారు. తెలంగాణ వర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. ప్రొ.జీఎన్ శ్రీనివాస్ పాలమూరు యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.జీఎన్ శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ పూర్తిచేశారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీనివాస్.. 2003లో ఏపీలోని అనంతపురం జేఎన్టీయూలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. ప్రొ.కుమార్ మొలుగరం ఉస్మానియా వీసీగా నియమితులైన కుమార్ మొలుగరం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపురం గ్రామంలో జన్మించారు. ఓయూలో బీటెక్, జేఎన్టీయూలో ఎంటెక్, ఐఐటీ బాంబే నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఆయన అపార అనుభవశాలి. ప్రస్తుతం ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్‌గా, రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 2018లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి పురస్కారం, ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఓయూ 107 సంవత్సరాల చరిత్రలో వీసీగా నియమితులైన తొలి ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఘనత సాధించారు.ప్రొ.అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఖాజా అల్తాఫ్ హుస్సేన్.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జన్మించారు. ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి, వరంగల్ సీకేఎం కాలేజీలో ఇంటర్, డిగ్రీ.. కాకతీయ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో పీజీ, పీహెచ్డీ పూర్తిచేశారు. కేయూ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా, హెచ్వోడీగా, రిజిస్ట్రార్‌గా సేవలందించారు. 2016–19 మధ్యకాలంలో కూడా మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా పనిచేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని ఎంజీయూ వీసీగా నియమితులైన అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభిస్తామని ‘సాక్షి’కి తెలిపారు. ప్రొ.ప్రతాప్‌రెడ్డి కాకతీయ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.ప్రతాప్‌రెడ్డిది రంగారెడ్డి జిల్లా యాచారం. ఓయూలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన ప్రతాప్‌రెడ్డి.. ఓయూలో జువాలజీ విభాగం హెచ్వోడీగా, రిజిస్ట్రార్‌గా, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్‌గా సేవలందించి రిటైర్ అయ్యారు. ప్రొ.ఉమేష్కుమార్శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఉమేష్‌కుమార్.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట గ్రామంలో జన్మించారు. కెమిస్ట్రీ విభాగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. గతంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ జాతీయ స్థాయి ఎన్ఎస్ఎస్ ట్రోఫీని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎంజీ యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు, బోధనా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారు. -
తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. వీసీల నియామకం ఫైల్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్.కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాపరెడ్డిఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం కుమార్ శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్ తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావుమహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్ తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరిరావుప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా ఆల్ దస్ జానయ్యకొండ లక్ష్మణ్ తెలంగాణ ఆర్టికల్చర్ యూనివర్సిటీ - రాజిరెడ్డిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది -
పూర్తవని కూడికలు, తీసివేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏ యూనివర్సిటీకి ఎవరిని నియమించాలనే అంశంపై కసరత్తు దాదాపు పూర్తయినప్పటికీ, కూడికలు, తీసివేతలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీసీల కూర్పు నేపథ్యంలో పలు రకాల ఒత్తిళ్లు వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి అక్టోబర్ 3, 4 తేదీల్లో ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు భేటీ కానున్నాయి. ఈ కమిటీలు వీసీల నియామకంపై ప్రభుత్వానికి అవసరమైన సిఫార్సులు చేస్తాయి. ఒక్కో వీసీ పోస్టుకు ముగ్గురిని సూచిస్తాయి. వీటిల్లో ఒకరిని ప్రభుత్వం గుర్తించి, జాబితాను గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. కాగా, సెర్చ్ కమిటీల భేటీ తర్వాత తుది నిర్ణయం తీసుకునేందుకు సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. దసరా సెలవులు, ఆ తర్వాత కూడా కొన్ని సెలవులు ఉండటం వల్ల అనుకున్న వ్యవధిలో వీసీల నియామకం జరగకపోవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రక్షాళన తప్పదా?అనుభవజు్ఞలు, పదవికి గౌరవం తెచ్చే వారితోనే ఈసారి వీసీల నియామకం ఉంటుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మీడియాకు తెలిపారు. ఈ దిశగా అనేక మంది పేర్లు పరిశీలించినట్టు చెప్పారు. అయితే, ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలిలోనూ భారీ ప్రక్షాళన ఉండొచ్చని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. మండలిలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కొనసాగించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఒక్కసారిగా మండలిని కొత్తవారితో నింపడం సరికాదని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో కార్యకలాపాలన్నీ సాఫీగా, ఎలాంటి వివాదాలు లేకుండా సాగుతున్నాయన్నది అధికారుల అభిప్రాయం. ఈ కారణంగా లింబాద్రిని కొనసాగించడమా? లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ లింబాద్రి స్థానంలో వేరే వ్యక్తిని నియమిస్తే, ఆయనను ఏదైనా యూనివర్సిటీకి వీసీగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. మండలిలో ఇద్దరు వైస్ చైర్మన్ల మార్పు తప్పదనే వాదన వినిపిస్తోంది. మండలి కార్యదర్శిగా ఉన్న శ్రీరాం వెంకటేశ్ కొన్ని నెలల క్రితమే ఆ పోస్టులోకి వచ్చారు. ఆయన అనుభవా న్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులో కొనసాగించే వీలుంది. కాగా, కీలకమైన జేఎన్టీయూహెచ్కు పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. దీనికి ఎన్ఐటీలో ఉన్న ఓ ప్రొఫెసర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో వచ్చే సిఫార్సులను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తోందని సమాచారం. ఉస్మానియా వర్సిటీ వీసీ పోస్టుకు ఉన్నతాధికారులు పాత వీసీనే సిఫార్సు చేస్తున్నారు. మరో నలుగురు కూడా వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థానం ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారింది. మొత్తం మీద అన్ని వర్సిటీలకు కూడా పోటీ ఉందని, ఈ నేపథ్యంలో వీసీల కూర్పునకు కొంత సమయం తప్పదని అధికారులు అంటున్నారు. -
17 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ల(వీసీల)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.యూనివర్సిటీల్లో టీఎన్ఎస్ఎఫ్, కూటమి అనుకూల ఉద్యోగులు వీసీలను బెదిరిస్తూ.. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో జూలై 2 నాటికే వీసీలంతా రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. -
పలువురు వీసీల రాజీనామా
ఉన్నత విద్యకు పట్టుగొమ్మలుగా విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వర్సిటీలను తమ రాజకీయ విషక్రీడలకు బలిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్లను రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా వీసీలందరికీ ఫోన్లు చేయిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది వీసీలు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూటమి నేతలు, అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.సాక్షి, అమరావతి/కర్నూలు కల్చరల్/ఏఎఫ్‌యూ/తిరుపతి సిటీ/ఏఎన్‌యూ/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అయిన అబ్దుల్ నజీర్‌కు మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. బాబ్జీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ వైద్యుడు. గతంలో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన బాబ్జీ గతేడాది ఫిబ్రవరిలో వీసీగా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో తన పదవి నుంచి వైదొలిగారు.తప్పుకున్న రాయలసీమ వర్సిటీ వీసీ..కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సుధీర్ ప్రేమ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. హైదరాబాద్ జేఎన్టీయూ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ అయిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ ఏడాది జనవరి 17న వీసీగా బా«ధ్యతలు స్వీకరించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ రాజీనామాతిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవి నుంచి వైదొలిగారు. ఆమె గతేడాది జూన్ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో రాజీనామా చేశారు.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ కూడా..కడపలో 2020లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను గతేడాది ఫిబ్రవరి 9న ఏఎఫ్‌యూ వీసీగా నియమించారు.కాగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాకు చెందిన యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వివాదం లేని గిరిజన ఆచార్యుడైన బానోతు ఆంజనేయప్రసాద్‌ను సైతం రాజీనామా సమర్పించాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో వీసీ పదవి నుంచి వైదొలిగారు. 2026 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం ఉన్నా తప్పుకున్నారు.వైదొలిగిన జేఎన్టీయూకే వీసీజేఎన్టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 29న వీసీగా నియమితులైన ఆయన మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.ఏఎన్‌యూ వీసీ, ఉన్నతాధికారులు..గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు కో–ఆరి్డనేటర్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. -
తక్షణమే తప్పుకోండి..
అనంతపురం/విశాఖ సిటీ/గుడుపల్లె (చిత్తూరు జిల్లా)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసింది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పీఏ నుంచి రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయా పదవులకు వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పారు. అధికారికం కాదులే అని ఆగినా..లోకేశ్ పీఏ పేరుతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోదని వీసీలు తొలుత భావించారు. అదే నిజమైతే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు కదా అని అనుకున్నారు. ఎవరో ప్రాంక్ కాల్చేసి ఉండవచ్చని వీసీలు మిన్నకుండిపోయారు. దీంతో నేరుగా వైస్‌ఛాన్సలర్ల వాట్సాప్ గ్రూపులో అధికారికంగా మెసేజ్ పెట్టారు. తక్షణమే వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని అందులో ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. జేఎన్టీయూ (ఏ), ఎస్కేయూ వీసీలు, రిజిస్ట్రార్లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో..» జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రమే తన పదవికి రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ ప్రొ. సి.శశిధర్ సైతం రిలీవ్ అయ్యారు. దీంతో ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణను నియమించిన వీసీ శ్రీనివాసరావు.. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. » అలాగే, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. హుస్సేన్‌రెడ్డి కూడా శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య మాత్రం పదవిలో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. » ద్రవిడ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కూడా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయాలని శుక్రవారం ఉదయం ఎవరో ఫోన్ ద్వారా ఆమెను ఒత్తిడి చేశారని సమాచారం. రాజీనామా చేయకపోతే వచ్చే సోమవారం ద్రవిడ వÆటీలో ఆందోళన చేస్తామని వీసీని హెచ్చరించారని తెలిసింది. దీంతో ఆమె శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా గవర్నరుకు పంపించారు. సాయంత్రమే ద్రవిడ వర్సిటీ వదిలి వెళ్లిపోయారు. » అలాగే, కృష్ణా యూనివర్శిటీ వీసీ జి. జ్ఞానమణి సైతం శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా..నిజానికి.. జేఎన్టీయూ (ఏ)లో అప్పటి వీసీ ప్రొ. శ్రీనివాస్‌కుమార్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమితులయ్యారు. 2019లో రాష్ర్టంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినా.. శ్రీనివాస్‌కుమార్‌ను వీసీగానే కొనసాగించారు. ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయ్‌భాస్కర్ కూడా 2015లో నియమితులైనా.. ఆరేళ్లపాటు చైర్మన్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగారు. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా వైస్ఛాన్సలర్లనే తప్పుకోమనే సంస్కృతికి తెరతీసింది. ప్రజా వ్యతిరేక పాలనను టీడీపీ ప్రభుత్వం తన మార్క్‌గా చూపించేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు భావిస్తున్నారు.పదవి కోసం వైఎస్సార్ విగ్రహం తాకట్టు..ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో జీవితాలకు బాటలు వేసిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ఈ ఏడాది ఆరంభంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడో రోజే విగ్రహాన్ని తొలగించాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విగ్రహం తొలగిస్తే మీరు పదవుల్లో కొనసాగుతారని వీసీ, రిజిస్ట్రార్లను హెచ్చరించారు. దీంతో వారు 24 గంటల్లో వైఎస్సార్ విగ్రహాన్ని అధికారికంగా తొలగించారు. అయినప్పటికీ వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లుచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జేఎన్టీయూ (ఏ)లో అధునాతనంగా నిర్మించిన ఆడిటోరియానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అక్కడే ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటుచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ర్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఎన్టీఆర్ విగ్రహం ఔన్నత్యాన్ని కాపాడారు. కానీ, టీడీపీ మాత్రం ఎస్కేయూలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.ఏయూ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొ. పీవీజీడీ ప్రసాదరెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు రిజిస్ట్రార్ స్టీఫెన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. వెంటనే ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ఏయూ అకడమిక్ డీన్‌గా ఉన్న ప్రొ.కిషోర్‌బాబును నియమించారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రసాదరెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసాదరెడ్డిపై రాజకీయ ఆరోపణలు ఎక్కుపెట్టగా.. మరోవైపు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి ఫోన్లుచేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. రాజీనామా చెయ్యకపోతే దాడులకు తెగబడతామని పార్టీ శ్రేణులు సైతం హెచ్చరించాయి. దీనిపై ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, ఏయూలోని వీసీ కార్యాలయం వద్ద నిత్యం నిరసనల పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడావుడి చేసూ్తనే ఉన్నారు. పలుమార్లు వీసీని అడ్డుకోడానికి ప్రయత్నించారు. -
ఏయ్.. రాజీనామా చేయ్! ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డికి బెదిరింపులు
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్ర యునివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ కాల్స్ వస్తున్నాయి. ఇలా హైదరాబాద్ కి చెందిన మాధవనాయుడు అనే వ్యక్తి ఏయూ రిజిస్టర్డ్ ఆఫీస్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగ్గుతున్నాడని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నట్లు సమాచారం. -
‘సెర్చ్’ ఏదీ ?
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల(వీసీ) ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్‌లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఐఏఎస్‌లంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్టీయూహెచ్లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి వాటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. మరోవైపు ఐఏఎస్‌లు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధన ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండాపోయిందని మండలివర్గాలు అంటున్నాయి. వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. దీంతో కొత్తవారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఐఏఎస్ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్చ్ కమిటీలు ఏమైనట్టు? వీసీ ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోయాలి. అంతిమంగా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. మూడు వారాలైనా ఇంతవరకూ సెర్చ్ కమిటీల భేటీ జరగలేదు. వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పెద్దఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమని వారు అంటున్నారు. ఒత్తిడే కారణమా...? ప్రధాన యూనివర్సిటీల వీసీల కోసం పెద్దఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్టీయూహెచ్ వీసీ కోసం కేంద్రస్థాయిలో కాంగ్రెస్ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌కు చెందిన మరో కాంగ్రెస్ కీలకనేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్‌కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. జేఎన్టీయూహెచ్ వీసీ పోస్టుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్టు తెలిసింది. అయితే, తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. ఈ కారణంగానే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇంతవరకూ భేటీ అవ్వలేదని తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నా, యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతోందని ఉన్నతవిద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
ఐఏఎస్‌లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్ చాన్స్లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సెర్చ్ కమిటీలు వేసినా.. వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. భారీగా పైరవీలు షురూ.. వైస్ చాన్స్‌లర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు. రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
వందేళ్ల చరిత్ర గలిగిన అలీగఢ్ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ!
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయానికి తొలి మహిళ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో విద్యామంత్రిత్వశాఖ ఖాతూన్ని వీసీగా నియమించింది. దీంతో అలీఘఢ్ విశ్వవిద్యాలయం మహిళా వైస్ ఛాన్సలర్‌ని కలిగి ఉన్న మూడవ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఈ విశ్వవిద్యాలయం 123 ఏళ్ల చరిత్రలో ఈ పదవికి నియమితులైన తొలి మహిళ ఖాతూన్. అయిదేళ్ల పాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. నైమా ఖాతూన్ అలీగఢః విశ్వవిద్యాలయం నుంచే మనస్తత్వ శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. 1988లో అదే విభాగంలో లెక్చరర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. క్రమంగా ఏప్రిల్ 1998లో అసోసీయేట్ ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత 2006లో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్‌గా మారారు. ఆమె డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఆమె సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా, చైర్‌పర్సన్‌గా పనిచేయడాని కంటే ముందు 2014లో మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే ఆమె నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రువాండా, సెంట్రల్ ఆఫ్రికాలో ఒక ఏడాది పాటు ప్రొఫెసర్‌గా బోధించారు. ఆమె అలీగఢ్ విశ్వవిద్యాలయంలో వివిధ అడ్మినిస్ట్రేటివ్ పాత్రలలో కూడా పనిచేశారు, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ ప్రొక్టర్, ఇందిరా గాంధీ హాల్ అండ్ అబ్దుల్లా హాల్ రెండింటిలోనూ ప్రోవోస్ట్‌గా పనిచేశారు. ఆమె సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ, అలీగఢ్ విశ్వవిద్యాలయాల్లో డాక్టోరల్ వర్క్ నిర్వహించారు. అంతేగాక తన పరిశోధన పత్రాలను యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లే (USA), యూనివర్శిటీ ఆఫ్ ఆల్బా యూలియా (రొమేనియా), చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయం (బ్యాంకాక్), ఇస్తాంబుల్ (టర్కీ, స్టన్ (USA) రెండింటిలోని హోలింగ్స్ సెంటర్లో సమర్పించారు. అంతేగాదు నైమా రచయిత, పరిశోధకురాలిగా రెండు పుస్తకాలను కూడా రచించారు. అలాగే ఆమె రచించిన క్లినికల్, హెల్త్, అప్లైడ్ సోషల్,ఆధ్యాత్మిక సైకాలజీ వాటికి సంబంధించిన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. వృత్తిలో అల్ రౌండ్ ఎక్సలెన్స్ పరంగా నైమా ఖాతూన్ పాపా మియాన్ పద్మ భూషణ్ బెస్ట్ గర్ల్ అవార్డు వరించింది. (చదవండి: వారానికి పది గంటలే పని..ఏడాదికి ఏకంగా రూ. 80 లక్షలు..!) -
ఏయూ వీసీ నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
సాక్షి, అమరావతి:ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) నియామక ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమంది. విశ్వవిద్యాలయం వీసీగా ప్రసాద్‌రెడ్డి పనిచేసిన కాలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఛాన్సలర్ (గవర్నర్) తగిన నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాద్‌రెడ్డి వీసీగా ఉన్న సమయంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పూర్వ విద్యార్థుల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది పిచ్చయ్య వాదనలు వినిపిస్తూ.. ప్రసాద్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారన్నారు. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా.. ప్రకటన జారీ చేయకుండా ఏకపక్షంగా నియామకాలు చేశారన్నారు. అడ్డగోలుగా చెట్లను నరికేయించారని తెలిపారు. తిరిగి ప్రసాద్‌రెడ్డినే వీసీగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రసాద్‌రెడ్డి తీరుపై ఛాన్సలర్‌కు ఈ నెల 1న ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు ఛాన్సలర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నవంబర్ 1న ఫిర్యాదు చేసి, స్పందించేందుకు తగిన సమయం ఇవ్వకుండా నవంబర్ 10న ఎలా పిల్ దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. స్పందించేందుకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందంది. ప్రసాద్‌రెడ్డినే తిరిగి వీసీగా నియమిస్తున్నారా? అని విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను తెలుసుకుని పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతానని విశ్వవిద్యాలయం న్యాయవాది వి.సాయికుమార్ తెలిపారు. వీసీగా ప్రసాద్‌రెడ్డి కాల పరిమితి 24తో ముగిసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఛాన్సలర్‌కు తగిన సమయం ఇద్దామని తెలిపింది. విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ సమయంలో పిచ్చయ్య స్పందిస్తూ.. వీసీ నియామక ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం సీజే ధర్మాసనం తేల్చిచెప్పింది. -
విషాదం: ఓయూ మాజీ వీసీ నవనీత రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ (వీసీ) ప్రొఫెసర్ నవనీత రావు (95) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి తీరని లోటని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి ఆయనెంతో కృషి చేశారని కొనియాడారు. అయితే, నవనీత రావు 1985 నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఆయన పని చేశారు. నవనీత రావు మృతితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు అధ్యాపకులు, విద్యార్థులు చేరుకుంటున్నారు. ఇక, ఆయన మృతిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవనీత రావు డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ అని ఆయన కొనియాడారు. ఓయూ గౌరవాన్ని పెంచడమే కాకుండా, నిరుపేద విద్యార్థుల జీవితాలను కూడా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. నవనీత రావు మృతిపై దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిపాలనలో రాజకీయ జోక్యాలకు తావు ఇవ్వకుండా, స్వయం ప్రతిపత్తిని కొనసాగించారని గుర్తు చేశారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత ఐపీఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయనతో సన్నిహితంగా పని చేయడం తనకు దక్కిందని శ్రవణ్ పేర్కొన్నారు. నవనీత రావు ఆత్మకు శాంతి చేకూరాలని శ్రవణ్ ప్రార్థించారు. Very saddened to know the unfortunate demise of Prof T Navaneeth Rao Garu, former Vice Chancellor of Osmania University @osmania1917 & former Director of @ipe_info Institute of Public Enterprise. He was a dynamic administrator with great professional values, dignity and… pic.twitter.com/PqRSH68PoY — Prof Dasoju Srravan (@sravandasoju) August 26, 2023 -
విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానాన్ని తీసుకురావాలి. విద్యారంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించి మార్పులు తీసుకురావాలి. అధునాతన పద్ధతిలో వైద్య విద్యార్థులకు బోధన ఉండాలి. మన విద్యార్థులు క్రియేటర్లుగా ఉండాలి. విద్యార్థులకు కావాల్సిన కోర్సులు, లెర్నింగ్ ఆప్షన్స్‌పై చర్చించాలి. రానున్న రోజుల్లో సిలబస్ విధానం మార్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలి. విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలి.. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు వస్తాయి. విద్యావ్యవస్థలో ఏఐని భాగం చేయాల్సిన అవసరం ఉంది. అగ్మెంటేషన్ రియాల్లీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి సారించాలి. మన ఫ్యాకల్లీ కూడా ఆ స్థాయిలో పిల్లలకు విద్యనందించాలి. విద్యారంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే.. ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలి. ఉన్నత విద్యా రంగంలో వైస్‌ఛాన్సలర్లది కీలక పాత్ర. టెక్నాలజీ పరంగా చూస్తే.. మొదటి రివల్యూషన్ 1784లో స్టీమ్‌తో రైలు ఇంజన్ రూపంలో చూశాం. తర్వాత 100 ఏళ్ల తర్వాత విద్యుత్ రూపంలో మరొక రివల్యూన్ చూశాం. మూడోది 1960–70 ప్రాంతంలో కంప్యూటర్లు, ఐటీ రంగం రూపేణా మరొక విప్లవం చూశాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చబోతోంది. ఈ అడుగులో మనం వెనుకబడితే.. కేవలం అనుసరించే వాళ్లుగానే మనం మిగులుతాం. సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే.. మనం ఈరంగాల్లో నాయకులమవుతాం. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్ చేసేవారు.. మరొక వర్గంగా తయారవుతారు. మనం క్రియేటర్లుగా మారాలి.. గతంలో స్టీం ఇంజిన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ విప్లవాల్లో మనం వెనకడుగులోనే ఉన్నాం. మనం ఏదీ క్రియేట్ చేసే పరిస్థితిలో లేం. అందుకనే ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యం. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో మనం క్రియేటర్లుగా తయారు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఒకవైపు మన విద్యావిధానంలోకి తీసుకువచ్చి.. విద్యార్థులకు బోధన, నేర్చుకునే సమర్థతను పెంచుకోవడంలో ఎలా వాడుకోవాలి? అన్న కార్యక్రమం చేస్తూనే.. రెండోవైపున ఏఐ క్రియట్ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలి. ఇది కూడా కరిక్యులమ్‌లో భాగం కావాల్సిన అవసరముంది. మార్పులకు శ్రీకారం.. ఇటీవలే జర్మన్ కాన్సులేట్ జనరల్ నన్ను కలిశారు. జర్మనీ లాంటి దేశంలో నైపుణ్యం ఉన్న మానవవనరుల కొరత ఉందని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం అంతా డెమోగ్రఫిక్ ఇన్‌బ్యాలెన్స్ ఎదుర్కొంటోంది. మనదేశంలో, మన రాష్ట్రంలో సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారు. వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం. ఇది వాస్తవం. అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలి. ఏ రకమైన మార్పులకు శ్రీకారం చుడితే.. మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి, విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై ఆలోచనలు చేయాలి. మన పిల్లలు లీడర్లుగా ఉండాలి.. నలుగురితో నేను మాట్లాడి... నాకు అనిపించిన ఆలోచనలన్నింటినీ కూడా వీసీల ముందు ఉంచుతున్నాను. ఈ ఆలోచనలు కార్యాచరణలోకి రావాలి, వీటికి రూపకల్పన జరగాలి. ఇందులో మీ పాత్ర గరిష్టంగా ఉండాలి. ఈరోజు మనం మొట్టమొదటి అడుగు వేస్తున్నాం. ఈ తొలి అడుగు మన ఆలోచనలను చైతన్యం చేయడం ద్వారా విద్యారంగాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచస్థాయిలో మన పిల్లలను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. ఇవాళ మనం చదివిస్తున్న, చదువుకుంటున్న చదువులు నిజంగానే.. ప్రపంచస్థాయిలో నాయకులుగా నిలబడగలిగే స్థాయిలో ఉన్నాయా? లేకపోతే.. ఎలా చేయాలన్న దానిపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు చదువులు చెప్తే విధానాలను పరిశీలిస్తే.. మనం కొన్ని సబ్జెక్టులను నిర్దేశిస్తున్నాం. ఒకసారి వెస్ట్రన్ కరిక్యులమ్ చూస్తే.. వెస్ట్రన్ వరల్డ్‌లో... ఒక ఫ్యాకల్టీని తీసుకుంటే.. చాలా వర్టికల్స్ కనిపిస్తాయి. విద్యార్థులకు మరిన్ని ఆప్షన్స్ ఇవ్వాలి.. ఒక బీకాంలోనే అసెట్ మేనేజ్మెంట్, ఫైనాన్సియల్ మార్కెట్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలసిస్ ఇలాంటి వర్టికల్స్ ఎన్నో ఉన్నాయి. మన దగ్గర లేవు. మంచి డిగ్రీ రావాలంటే విదేశాలకు పోవాల్సిందే. మనం కూడా చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలి. వారు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే అవకాశాలను ఇవ్వాలి. మనం డిగ్రీలకు సంబంధించి తాజాగా క్రెడిట్స్‌ఇస్తున్నాం. కానీ, వాటి స్థాయిని కూడా పెంచాల్సి ఉంది. పిల్లలకు కావాల్సిన కోర్సుల్లో బోధన అందించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయడానికి ప్రతీ ఫ్యాకల్టీలో మనం క్రియేట్ చేయగలగాలి. దీనిపై ప్రతి వీసీ కూడా ఆలోచన చేయాలి. ఇవేకాకుండా రకరకాల అంశాల్లో అడుగులు పడాల్సి ఉంది. మనం ఇచ్చే డిగ్రీలకు సంబంధించి కూడా మార్పులు రావాల్సి ఉంది. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. వైద్య రంగంలో ఎన్నో మార్పులు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా వినియోగించుకోవాలి. సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వర్టికల్ కోర్సులకు సంబంధించి బోధన చేసే స్థాయిలో మనం ఉన్నామా? లేదా? అన్నదికూడా చూడాలి. ఒకవేళ లేకపోతే.. అలాంటి కోర్సులు కావాలనుకునే విద్యార్థులకు బోధనను నిలిపేస్తామా? అంటే నిలిపివేయలేం. వర్చువల్ రియాలిటీని తీసుకునివచ్చి ఆగ్మెంటెడ్ రియాలిటీతో కలుపుతాం. ఎప్పుడైతే ఈ రెండూ కలిసాయో.. వర్చువల్ క్లాస్ టీచర్ విద్యార్ధులకు పాఠాలు చెబుతారు. ఆ మేరకు తరగతుల నిర్వహణ ఉండాలి. మెడికల్ కోర్సుల బోధనలో కూడా మార్పులు గణనీయంగా రావాల్సి ఉంది. 5 ఏళ్ల మెడికల్ కోర్సు రాబోయే రోజుల్లో ఇవాళ సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా కూడా మార్పులు రావాలి. శరీరాన్ని కోసి ఆపరేషన్ చేసే రోజులు పోయాయి. కేవలం కొన్ని హోల్స్ చేసి.. కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడకుని ఆపరేషన్ చేసే స్థాయి వచ్చింది. అందుకే వైద్యులకు రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలి. హర్యానాలోని ఒక మెడికల్ కాలేజీలో కూడా దీనికి సంబంధించిన కోర్సులనుకూడా పెట్టారు. కేవలం మెడిసిన్‌లో చికిత్సకు సంబంధించిన జ్ఞానం ఇవ్వడమేకాదు, టెక్నాలజీని ఎలా వాడుకోవాలన్న దానిపై పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ టెక్నాలజీని అవగాహన చేసుకోవాలి. దాన్ని కరిక్యులమ్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దాన్ని వినయోగించుకోవడం, ఆ రంగాల్లో బోధనను మెరుగుపరచడం చేయాలి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉంది. అందులో వర్చువల్ రియాల్టీ, అగమెంటెడ్ రియాల్టీని కరిక్యులమ్‌లోకి తీసుకునిరావాలి. వ్యవసాయంలో కూడా గణనీయ మార్పులు.. వ్యవసాయం చేసే తీరుకూడా గణనీయంగా మారిపోతోంది. మన రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఆర్బీకేలను తీసుకుని రావడం ద్వారా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. గణనీయ మార్పులు తీసుకు వచ్చాం. గ్రామ స్ధాయిలో చేయిపట్టుకుని నడిపే వ్యవస్ధను తీసుకొచ్చాం. ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకూడదు. ప్రతి రైతును, ప్రతి ఎకరాలో సాగును కూడా చేయిపట్టుకుని నడిపించుకునే స్థాయికి వెళ్లాలి. ప్రతి ఎకరాలో భూసార పరీక్ష చేస్తాం. శాటిలైట్ ఇమేజ్ ద్వారా భూమిలో ఉన్న కాంపోజిషన్ చెప్పే పరిస్థితి ఉంది. డ్రోన్ల ద్వారా భూసారం ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఈ రిపోర్ట్ ద్వారా ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకుని రావచ్చు. దీని ద్వారా ఆ పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో ఇట్టే తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీని మనం పిల్లలకు నేర్పకపోతే.. మనం వెనకబడతాం. ప్రశ్నా పత్నం విధానం మారాలి.. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ గాని చూస్తే.. వీళ్ల పాఠ్యపుస్తకాలు, వీళ్ల బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం.. చాలా విభిన్నంగా ఉంటుంది. మనకు, వీరికీ తేడా ఎందుకు ఉంటుంది? అన్నదానిపై ఆలోచన చేయాలి. మన పిల్లలకు మంచి సబ్జెక్ట్ జ్ఞానం ఉండొచ్చు.. కానీ, వెస్ట్రన్ దేశాల మాదిరిగానే అక్కడ రూపొందించే ప్రశ్నలకు సమాధానాలు నింపే పరిస్థితుల్లో ఉన్నారా? అన్నది చూడాలి. ప్రశ్నా పత్నం విధానం మారాలి. వెస్ట్రన్ వరల్డ్ ఎలా బోధిస్తుందన్నది మన కరిక్యులమ్‌లోకి రావాలి. ఇవేమీ చేయకపోతే మనం వెనకబడి ఉంటాం. అక్కడ పాఠ్యపుస్తకాలు కూడా పిల్లలకు ఇచ్చి.. సమాధానాలు రాయించి.. ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఉందా? లేదా? అని చూస్తారు. మనం ప్రాక్టికల్ అప్లికబులిటీ ఆఫ్ నాలెడ్జ్‌ను తీసుకునిరావడం లేదు. అందుకే ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి. ఇవన్నీకూడా అత్యంత కీలకమైన అంశాలు. ఇవన్నీ చేయాల్సిన మార్పులు. ఇవి చేయకపోతే వెనుకబడతాం. ఇవన్నీ చేయాలంటే.. ఎలా చేయాలి? ఎలా చేయగలుగుతాం? అన్నది ఆలోచన చేయాలి. ఒక్కో యూనివర్శిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్ తయారు చేయలేదు. ఒక్కో మాదిరిగా ఉండలేదు. మనం చేస్తున్న విజన్ కోసం ఒక హైలెవల్ అకడమిక్ బోర్డు మనకు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం. ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లకు పైన చెప్పిన అంశాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ మార్పులతో కరిక్యులమ్‌ను రీడిజైన్ చేద్దాం. పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం. వర్చువల్ రియాలిటీ, ఏఐ టెక్నాలజీని పాఠ్యప్రణాళికలో భాగం చేద్దాం. బోధనలో కూడా వాడుకుందాం. ఇవన్నీ అత్యంత సమర్ధవంతంగా ఎలా చేయాలన్నదానిపై ఆలోచన చేయడానికే బోర్డు ఏర్పాటు చేద్దాం. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే మార్పులు రావాలి.. కేవలం ఉన్నత విద్యాస్థాయిలోనే మార్పులు చేస్తే ఫలితాలు రావు. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే ఈ మార్పులు రావాలి. ఆ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడ్డాయి. స్కూళ్లను ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలోకి మార్పు చేశాం. బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆరోవ తరగతి ఆ పైనున్న తరగతులను డిజిటల్ క్లాస్ రూమ్స్‌లా మార్చాం. తరగతి గదుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు నాటికి 6వ తరగతి ఆపై తరగతులకు చెందిన 63వేల క్లాస్‌రూమ్స్‌ను ఐఎఫ్పి ఫ్యానెల్స్‌తో డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే 31వేల తరగతి గదులకు ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. బైజూస్ కంటెంట్‌ను ఇంటిగ్రేట్ చేశాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చాం. దీనికి తదుపరిగా తీసుకు రావాల్సిన మార్పులు తీసుకురావాలి. వీఆర్, ఏఆర్, ఏఐలని టెక్నాలజీని వాడుకుని వారికి మంచి బోధన, నేర్చుకునే సమర్థతను పెంచాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటర్లుగా కూడా తొలిఅడుగులు అక్కడ పడాలి. అందుకే పాఠశాల విద్య స్థాయిలో ఒక బోర్డును, హయ్యర్‌ఎడ్యుకేషన్ లెవల్లో మరొక బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి. పౌండేషన్ లెవల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తీసుకుంటున్న చర్యలను సినర్జీ చేయాలి. కలను సాకారం చేసుకోవాలి.. నా ఆలోచనలను తదుపరిస్థాయికి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో పలు విధానాలు ఇప్పటికే వచ్చేశాయి. కాని వాటి ఫ్యాకల్టీలో మనం వెనకబడి ఉన్నాం. కంటెంట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలి అన్నదానిపై మనం ఆలోచన ఉండాలి. శిక్షణ ఇచ్చుకుంటూ పోతే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధం అవుతారు. ఆ రకంగా దీన్ని అధిగమించాలి. దీనిపై మరిన్ని సాలోచనలు చేయడానికి నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్యప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. మన కలను సాకారం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇది కూడా చదవండి: రామోజీ కథ, బాబు నిర్మాత, పవన్ యాక్టర్: ఎంపీ భరత్ సీరియస్ -
ఏసీబీ వలలో వీసీ
-
ఏసీబీకి చేతికి చిక్కిన వీసీ.. ఇంతకూ తొలగించే అధికారం ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఏసీబీ వలలో చిక్కిన తర్వాత రాజ్యాంగ పరమైన అనేక అంశాలపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వీసీ నియామకం, తొలగింపుపై పూర్తి అధికారాలు గవర్నర్‌కు మాత్రమే ఉంటాయి. నియామకానికి సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, తొలగింపు విషయంలో మాత్రం ఏ అధికారం ఉండదని నిబంధనలు పేర్కొంటున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలోనూ వీసీ ఈ అంశాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాలేజీ విద్య కమిషనర్‌కు తనను ప్రశ్నించే అధికారమే లేదని ఆయన అన్నట్టు మీడియాలో వచ్చింది. ఆ త ర్వాత కూడా తనను తీసివేసే అధికారం ప్రభుత్వాని కి ఎక్కడుందనే వాదన పరోక్షంగా వీసీ లేవ నెత్తారు. ఇదే క్రమంలో యూనివర్సిటీ పాలన వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయడం, తాజాగా ఓ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యక్షంగా వీసీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఈ ఎపిసోడ్లో కొత్త మలుపు. ఇప్పు డు జరగబోయేదేంటనేది హాట్ టాపిక్‌గా మారింది. వీసీ నియామకం ఎలా...? ఏదైనా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను నియమించేటప్పుడు ముందుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, వీసీ నియామకం జరిగే విశ్వవిద్యాలయం నుంచి ఒకరిని ఈ కమిటీలో చేరుస్తారు. యూజీసీ ఎవరినైనా నిపుణుడిని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యాశాఖ కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు. యూనివర్సిటీ తరపున పదవీ విరమణ చేసిన నిపుణుడైన మాజీ వీసీని సాధారణంగా చేరుస్తారు. నోటిఫికేషన్ తర్వాత వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను గవర్నర్‌కు పంపుతుంది. ఇందులోంచి గవర్నర్ ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ నియామకానికి సంబంధించిన నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఇస్తారు. తొలగింపు ఎలా? గవర్నర్ నియమించిన వైస్ చాన్స్‌లర్ ప్రభుత్వానికి ఇష్టం లేదనుకుంటే రెండింట మూడొంతుల అసెంబ్లీ మెజారిటీ తీసుకుని వీసీ తొలగింపు ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఇక్కడ కూడా అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. నేరుగా గవర్నర్‌కు కూడా వీసీని కారణాలు లేకుండా తొలగించే అధికారం ఉండదు. అయితే, తెలంగాణ యూనివర్సిటీ వీసీ వివాదం భిన్నమైంది. ఇలాంటి సంక్లిష్ట సమస్య గతంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఏసీబీ దాడి చేయడంపైనా పలు ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ఇలా దాడి చేయాలన్నా, ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలా? అనే విషయమై ఉన్నతాధికారులు ముందుగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. వీసీ వేతనం తీసుకుంటున్నాడు కాబట్టి, ప్రజా సేవకుడిగానే చూడాలని నిపుణులు తెలిపారు. కాబట్టి ఏసీబీ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. ఏసీబీ దాడి, అరెస్టు జరిగిన తర్వాత వీసీని కూడా సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విచారణ పూర్తయి నేరం రుజువైతే శాశ్వతంగా తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే ప్రతీ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళా్లల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
వీసీ అరెస్ట్.. తెలంగాణ వర్శిటీలో విద్యార్థుల సంబరాలు
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో తొలుత వీసీని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. పూర్తి స్థాయిలో తనిఖీలు ఆయన్ను అనంతరం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే రవీందర్ గుప్తా ఇంట్లో, ఆఫీస్‌లో, యూనివర్శిటీ చాంబర్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆపై రవీందర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. కోర్టులో హాజరుపర్చనుంది. అయితే రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రవీందర్ అరెస్టు చేయగానే యూనివర్శిటీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చడంతో పాటు స్వీట్లు పంచుకుని మరీ సెలబబ్రేట్ చేసుకున్నారు. గతం కొంతకాలంగా వీసీ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు.. ఏసీబీ అరెస్ట్ వార్త తర్వాత సంబరాలు చేసుకున్నారు. కాగా, నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. చదవండి: మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారనుకోలేదు: బాలుడి తండ్రి ఆవేదన -
అవును.. ఆయన లంచంతో పట్టుబడ్డాడు: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా(63) తమ అదుపులోనే ఉన్న విషయాన్ని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ ప్రకటించారు. అయితే ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని.. పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిశాక అరెస్ట్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. సాక్షితో మాట్లాడిన ఆయన.. శనివారం జరిగిన పరిణామాలకు వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. తార్నాకలోని తన ఇంట్లోనే బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడాయన. ఆయన అల్మారా నుంచి నగదును సేకరించి.. కెమికల్ టెస్ట్ నిర్వహించి వేలిముద్రలతో పోల్చి చూసుకున్నాం. ఆ వేలిముద్రలు ఆయన ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలాయి. నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. వీడియో: గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి డబ్బులు చల్లుతూ వీసీ రవీందర్ డ్యాన్స్ లు ఇదీ చదవండి: కోరుకున్న కాలేజీ.. కోర్సు కూడా! -
ఏసీబీ ట్రాప్ లో తెలంగాణ యూనివర్సిటీ వీసీ
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడినట్లు సమాచారం. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు వీసీ రవీందర్ గుప్తా. ఈ క్రమంలో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి బాధితుడు డబ్బు ఇవ్వబోయాడు. ఆ టైంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రవీందర్ గుప్తా. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన్నీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదీ చదవండి: BRS ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి ఏం తీసుకెళ్లారు? -
లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోతున్నారు . మొన్న దీపిక అత్మహత్య చేసుకోగా నేడు మరో విద్యార్థి లిఖిత బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. అయితే విద్యార్థినిది అత్మహత్య అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా..ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత మరణం ప్రమాదమే: వీసీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరమని తెలిపారు. లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదమని తెలిపారు. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని తెలిపారు. నిర్మల్ ఆసుపత్రికి లిఖిత తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రెడ్డి .వీసీ వెంకటరమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా.. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. కూతురు మరణంపై కనీసం సమాచారం ఇవ్వలేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.లిఖిత ఎందుకు చనిపోయిదో కారణం చెప్పడంలేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంతకుముందు అసుపత్రికి వచ్చిన వీసి వెంకటరమణను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చదవండి: పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయం హాస్టల్ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి అయితే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లిఖిత అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. వారం రోజుల క్రితమే హాస్టల్‌కు వెళ్లిన తమ కూతురు.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
కాళ్లు మొక్కుతాం.. మా డబ్బులు మాకివ్వండి
సాక్షి, నిజామాబాద్ (డిచ్పల్లి): ‘ఏదో పని దొరుకుతుందని ఆశ పడి అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాం. కాళ్లు మొక్కుతాం.. కనికరించి మా డబ్బులు మాకివ్వండి సారూ’ అంటూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ డి.రవీందర్‌గుప్తా కాళ్లపై పడి బాధితులు వేడుకున్నారు. వీసీ రవీందర్ బుధవారం క్యాంపస్‌కు వచ్చినట్లు తెలియడంతో భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన 15 మంది బాధితులు మెయిన్ క్యాంపస్‌కు చేరుకున్నారు. ఉద్యోగాల పేరుతో డెయిలీవేజ్ కింద తమను పనిలోకి చేర్చుకున్నారని, ఇందుకోసం వీసీ రవీందర్ ఒక్కొక్కరి వద్ద రూ. 40 వేల నుంచి రూ. 50వేలు తీసుకున్నారని బాధితులు సుభద్ర, ప్రశాంత్, ప్రభాకర్‌గౌడ్, రాహుల్ తదితరులు తెలిపారు. మూడు నెలలు పనిచేసిన తర్వాత ప్రభుత్వం, ఈసీ ఆమోదం లేదని తమను పనిలోకి రావద్దని చెప్పారని బాధితులు వివరించారు. పనిచేసిన కాలానికి కూడా ఒక్కరూపాయి జీతం ఇవ్వలేదని, తాము ఇచ్చిన డబ్బులన్నా తిరిగి ఇవ్వాలని వీసీని ఘోరావ్ చేశారు. వీరికి విద్యార్థులు అండగా నిలిచారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు చివరకు వీసీ కాళ్లపై పడి తమ డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో వీసీ.. బాధితులందరూ పేర్లు, అమౌంట్, ఫోన్ నంబర్లు రాసి ఇవ్వాలని, రెండు రోజుల్లో ఎవరి డబ్బు లు వారికి ఫోన్‌పే చేస్తానని హామీ ఇచ్చారు. చదవండి: బీజేపీ అధ్యక్షుడు మార్పు.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఇన్చార్జి -
తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్రమాలపై విచారణ
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ పాల్పడిన అక్రమ చెల్లింపులు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం కమిటీ సభ్యులు గంగాధర్‌గౌడ్, వసుంధరదేవి, ప్రవీణ్‌కుమార్ వర్సిటీని సందర్శించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని కలిసి 2021 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ 18 వరకు వర్సిటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ మధ్యకాలంలో జరిపిన చెల్లింపులపై విచారణ జరపనున్నారు. వర్సిటీకి విచారణ కమిటీ రాక సందర్భంగా విద్యార్థులు ‘థాంక్యూ సాక్షి’అంటూ క్యాంపస్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’పత్రికకు ధన్యవాదములు’అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు సోషల్ మీడియాలో వైరలైంది. వర్సిటీలో కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నెల 19న హైదరాబాద్ రూసా భవనంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సమావేశానికి హాజరైన వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం వీసీ అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, నలుగురు ఈసీ మెంబర్లతో కలిపి పాలకమండలి కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ నెల 26న జరిగిన పాలకమండలి సమావేశంలో ఏ విధంగా విచారణ జరపాలనే విషయమై కమిటీ సభ్యులకు మార్గనిర్దేశనం చేశారు. ఈసీ నిర్ణయాలు తాత్కాలికంగా రద్దు చేసిన హైకోర్టు ఈ నెల 19న జరిగిన తెలంగాణ యూనివర్సిటీపాలక మండలి(ఈసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతరంగా రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఈ సమావేశంలో వీసీ అధికారాలు తగ్గించడం, ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగించి ప్రొఫెసర్ యాదగిరిని నియమించడం, వీసీపై వచ్చిన ఆరోపణల విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలను ఈసీ తీసుకున్న విషయం తెలిసిందే. ఈసీ నిర్ణయాలపై తాను హైకోర్టును ఆశ్రయించగా, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వీసీ తెలిపారు. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుందని ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. -
పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్ ఆవిష్కరణ
ఫిలింనగర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్తగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్‌ను శనివారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. సీతారామారావు ఆవిష్కరించారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశ పెట్టిన కోర్సుల్లో పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయని డీన్ ఆనంద్ పవార్ పేర్కొన్నారు. ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 10 అని వెల్లడించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇ. సుధారాణి, షకీలా ఖానం, వడ్డాణం శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు కలిసిన పలు వర్సిటీల కొత్త వీసీలు..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పలు యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ ఛాన్స్లర్లు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. కాగా, వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వీరంతా సీఎం జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో కడప డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన బానోత్ ఆంజనేయ ప్రసాద్, జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ) గురజాడ, విజయనగరం వీసీ కే. వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలు వీసీ మారెడ్డి అంజిరెడ్డి ఉన్నారు. ఇక, ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొ. కే. హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
విశ్వవేదికపై చెదరని ఖ్యాతి ఓయూ సొంతం
సాక్షి, హైదరాబాద్: వందేళ్లు దాటిన మహోన్నత చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తనకు తానే ఒక బ్రాండ్ ఇమేజ్ అని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యా లయాల్లో చెక్కుచెరదరని స్థానం కలిగి ఉందని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ అన్నారు. గతేడాది రూపొందించిన ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాల యాల జాబితాలో ఉస్మా నియా 22వ స్థానంలో ఉందని చెప్పారు. ఇటీవల వరకు ఉద్యమాల గడ్డగా ఉన్న ఉస్మానియా వర్సిటీ ఇప్పుడు ఉద్యోగాల అడ్డాగా మారిందని పేర్కొ న్నా రు. ‘ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్నై మీట్–2023’ వేడుకలు మంగళవారం వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమ య్యాయి. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ స్వాగతోపన్యా సం చేశారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలలో పాల్గొనేందుకు దేశ, విదేశాల్లో స్థిరపడిన వేలాదిమంది ‘ఉస్మానియన్స్’ తరలివచ్చారు. వైస్ చాన్సలర్ మాట్లాడుతూ టీచింగ్, లెర్నింగ్ మెథడ్స్, రీసెర్చ్ రంగంలో అత్యున్నత ప్రమాణాలను అభి వృద్ధి చేసినట్లు, అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓయూ నిర్వహించిన ‘నిపుణ’కార్యక్రమంలో 250 క్యాంపస్‌లు పాల్గొన్నా యని, 55 వేలమంది విద్యార్థులు హాజరయ్యారని, సుమారు 16 వేలమందికి ఉద్యోగాలు లభించా యని వివరించారు. ఉస్మానియా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీ పూర్వ విద్యా ర్థులను ఒక వేదికపైకి తీసుకురాగలిగినట్లు చెప్పా రు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యా ర్థుల సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టినట్లు వివరించారు. కార్య క్రమంలో ఆయన ఉస్మానియా టీవీని లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 46 చానళ్లతో త్వరలోనే ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. చదువులమ్మ చెట్టు నీడలో... పూర్వవిద్యార్థుల ప్యానెల్ సమావేశంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, ఫ్యూజీ సీఈవో మనోహర్‌రెడ్డి, ఓఎస్డీ రాజశేఖర్ వర్సిటీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎక్కడో నల్లమల అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగిన తనను ఉస్మానియా కన్నతల్లిలా చేరదీసి ఆదరించిందని చెప్పారు. ఆర్ట్స్ కళాశాలలో 1989–91లో ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్న తాను ఉస్మానియన్‌గా చెప్పుకొనేందుకు గర్విస్తున్నానని సీవీ ఆనంద్ అన్నారు. ఉస్మానియా వర్సిటీకి సైతం అలుమ్నైలు బలమైన వెన్నుదన్నుగా నిలవాలని బుర్ర వెంకటేశం అభిప్రాయపడ్డారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఉస్మానియా గాలిలోనే ఒక వైబ్రేషన్ ఉందన్నారు. అమ్మకు, ఆవకాయకు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ అవసరం లేనట్లుగానే ఉస్మాని యా కు అవసరం లేదన్నారు, ఉస్మానియా ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ దేవరకొండ, సీఏబీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. -
ఘర్షణ పెరిగి.. గౌరవం తగ్గి..
మొన్న తమిళనాడు.. నిన్న పశ్చిమ బెంగాల్.. నేడు కేరళ.. మరి రేపు? వరుస చూస్తుంటే, కేంద్ర పాలకుల చెప్పుచేతల్లో ఉంటారని పేరుబడ్డ గవర్నర్లపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు గట్టిగానే సమర శంఖం పూరిస్తున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కులపతి అనే గౌరవ హోదా నుంచి గవర్నర్లను ఒక్కో ప్రభుత్వం సాగనంపుతోంది. ఇతర రాష్ట్రాల బాటలో ఇప్పుడు కేరళ శాసన సభ సంబంధిత బిల్లును ఆమోదించింది. గవర్నర్ స్థానంలో విద్యావేత్తల్ని ఛాన్సలర్‌గా నియమించే విశ్వవిద్యాలయ చట్టాల (సవరణ) బిల్లుకు కేరళ అసెంబ్లీ మంగళవారం ఓకే అంది. పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థకూ, ప్రజాప్రభుత్వాలకూ మధ్య ఘర్షణకు ఇది తాజా ఉదాహరణ. కేరళలోని వామపక్ష సర్కారుకూ, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కూ మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అను గుణంగా జరగలేదంటూ, కేరళ టెక్నలాజికల్ యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ (వీసీ) నియామకాన్ని సుప్రీమ్ కోర్ట్ కొట్టేయడంతో రాజ్‌భవన్‌తో సర్కారు వారి రచ్చ షురూ అయింది. సుప్రీమ్ చట్ట విరుద్ధమన్న పద్ధతిలోనే మరో 11 మంది వీసీల నియామకం జరిగిందంటూ, ఆ వీసీలు రాజీనామా చేయాల్సిందేనని గవర్నర్ తాఖీదులిచ్చారు. నిజానికి, రాష్ట్ర ఉన్నత విద్యలో రాష్ట్ర చట్టాలు, యూజీసీ చట్టానికి విరుద్ధంగా ఉంటే తప్పు కానీ, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వీసీల నియామకాన్ని కొట్టేయడం సరి కాదని రాజ్యాంగ నిపుణుల మాట. మొత్తానికి, తలనొప్పి గవర్నర్లను వర్సిటీల నుంచి తప్పించడమే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మార్గమవుతోంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ మినహా మిగతా పక్షాలన్నీ ఢిల్లీ పాలకులతో, వారికి ఏజెంట్లుగా పని చేస్తున్నారని అపకీర్తి సంపాదిస్తున్న గవర్నర్లతో విసిగిపోతున్నాయనడానికి ఇది ఓ నిదర్శనం. గవర్నర్లను కులపతి పీఠం నుంచి కదిలించే ప్రక్రియ ఊపందుకుంది అందుకే. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాట స్టాలిన్ సర్కార్ రెండు బిల్లులు తెచ్చింది. గవర్నర్ బదులు రాష్ట్రప్రభుత్వమే వీసీలను నియమించేలా బిల్లులో నిబంధనలు పెట్టింది. ఇక, జూన్‌లో పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర వర్సిటీలకు ముఖ్యమంత్రినే కులపతిని చేస్తూ, మమత మంత్రివర్గం నిర్ణయించింది. మహారాష్ట్ర సర్కార్ సైతం రాష్ట్ర వర్సిటీల్లో వీసీల నియామక ప్రక్రియను మారుస్తూ 2021లోనే బిల్లు తేవడం గమనార్హం. తాజాగా కేరళ సర్కారు తన అధికారాలకు కత్తెర వేసిన కొత్త బిల్లును అక్కడి వివాదాస్పద గవర్నర్ ఎలాగూ ఆమోదించరు. కథ రాష్ట్రపతి వద్దకు చేరుతుంది. తర్వాత మలుపులేమిటో చూడాలి. నిజానికి, రాష్ట్రాల సమాఖ్య అయిన మన దేశంలో కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య సంబం ధాలు సవ్యంగా సాగట్లేదు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై భారత ప్రభుత్వం గతంలో సర్కారియా కమిషన్ వేసింది. తర్వాత రెండు దశాబ్దాలకు 2007లో పూంఛీ కమిషన్ వేసింది. పూంఛీ కమిషన్ 2010లో గవర్నర్ల పాత్ర సహా అనేక అంశాలపై 273 సిఫార్సులు చేసింది. రాజ్యాంగంలో చెప్పని అధికారాలనూ, హోదాలనూ కట్టబెట్టి గవర్నర్‌పై భారం మోపితే, వివాదాలు, విమర్శలు తప్పవు అంది. ఇప్పుడు ఆ సిఫార్సు ఆసరాతోనే బెంగాల్ మమత నుంచి కేరళ పినరయ్ విజయన్ దాకా అందరూ గవర్నర్‌ను వర్సిటీల నుంచి పక్కనబెడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఇలాగే చేసింది. 2013లో గుజరాత్‌లోని నాటి మోదీ సర్కార్ సైతం వర్సిటీల ఛాన్సలర్‌గా వీసీల నియామకానికి గవర్నర్‌కున్న అధికారాలు తీసేసింది. కేంద్రంలో సొంత సర్కారొచ్చాక 2015లో తమ గవర్నర్‌తో దానికి ఆమోదమూ వేయించుకుంది. అలాగే, కొత్త ప్రభుత్వం ఎన్నికైనప్పుడూ, ఏటా తొలి సమావేశంలోనూ అసెంబ్లీలో గవ ర్నర్ ప్రభుత్వ విధాన ప్రసంగం చేయడం 176వ అధికరణం కింద రాజ్యాంగ విహితం. జనవరి బడ్జెట్ సమావేశాల్లో దాన్ని పక్కనపెట్టాలని కేరళ సర్కార్ యోచిస్తోందట. ఇప్పటికే తెలంగాణ సర్కార్ తమతో తరచూ విభేదిస్తున్న గవర్నర్‌ను పక్కనబెట్టి, ఈ ఏడాది ఇలాంటి పనే చేసింది. నిరవధిక వాయిదా తర్వాత అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తున్నట్టు ప్రకటించలేదన్న సాంకేతిక మిష రాష్ట్ర సర్కార్లకు అందివస్తోంది. ఇతరులకిది అనుకోని ఆదర్శమైంది. సాంకేతికంగా అది సరైనదైనా, సభా సంప్రదాయం, గౌరవాల రీత్యా సమర్థించలేం. రాష్ట్ర ప్రథమ పౌరులని పిలుచుకొనే గవర్నర్ పీఠానికే అది అగౌరవం. వ్యక్తుల వ్యవహారశైలి సరిగ్గా లేదని, వ్యవస్థనే తృణీకరించి, తూష్ణీభావం చూపితే అది భవిష్యత్తుకు సత్సంప్రదాయం కాదు. అలాగని రాజ్యాంగ నామినేటెడ్ పదవిలోని గవర్నర్లు సైతం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు పంపిన ఫైళ్ళను అకారణంగా పెండింగ్‌లో పెట్టడం తప్పు. రాజ్భవన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చడం పార్టీలకు అతీతంగా పాలకులందరూ కొన్నేళ్ళుగా చేస్తున్న తప్పున్నర తప్పు. రాష్ట్రానికి పెద్దగా గవర్నర్ చేయాల్సింది – మంచీచెడూల మార్గదర్శనమే! అలా కాక, ప్రజ లెన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని తానే సర్వం సహా అనుకొని, పగ్గాలు చేతబట్టి సమాంతర సర్కార్ నడపాలనుకుంటేనే సమస్య. ప్రజా ప్రభుత్వాల అజెండాను కాక, పదవి ఇచ్చిన ఢిల్లీ పెద్దల అజెండాల ప్రకారం నడుచుకోవాలని గవర్నర్లు ప్రయత్నిస్తే అది వ్యవస్థ గౌరవాన్ని మరింత పలచన చేస్తుంది. రాష్ట్ర సర్కార్ల ప్రతిచర్యలను ప్రోత్సహిస్తుంది. గవర్నర్‌కూ, గవర్నమెంట్‌కూ మధ్య ఈ సంఘర్షణ వైఖరి ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు! ఎవరికీ శోభస్కరమూ కాదు!! -
సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా విధానంలో సమూల మార్పులకు జేఎన్టీయూహెచ్ శ్రీకారం చుట్టింది. కంప్యూటర్ కోర్సులకు ధీటుగా సాంప్రదాయ బ్రాంచిలకు అదనపు హంగులు అద్దుతోంది. క్రెడిట్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్ కోర్సులకు రూపకల్పన చేసింది. నైపుణ్యంతో కూడిన ఇంజనీరింగ్ విద్య కోసం కొన్నేళ్ళుగా చేస్తున్న కసరత్తు ఈ ఏడాది నుంచే అమల్లోకి వచ్చిందని జేఎన్టీయూహెచ్ ఉప కులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక కంప్యూటర్ కోర్సుల వెంటే పడక్కర్లేదని స్పష్టం చేశారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ చేసినా బహుళజాతి కంపెనీల్లో సులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చని చెప్పారు. ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. అమల్లోకి ఆర్–22 ప్రతి నాలుగేళ్ళకోసారి ఇంజనీరింగ్ విద్య స్వరూప స్వభావాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య ఎలా ఉండాలనే అంశంపై 250 మంది నిపుణులతో అధ్యయనం చేశాం. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, అన్ని సబ్జెక్టులకు చెందిన నిష్ణాతులూ ఉన్నారు. వీరి సలహాల ఆధారంగా రూపొందించిందే ఆర్–22 రెగ్యులేషన్. ఇది యూజీసీ, అఖిలభారత సాంకేతిక విద్య నిబంధనలకు లోబడే ఉంటుంది. ఇక్కడ ఇచ్చే క్రెడిట్స్ ఏ దేశంలోనైనా చెల్లే విధంగా ఇది ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అనుసరిస్తాయి. అన్ని బ్రాంచ్‌లకు అదనంగా కంప్యూటర్ కోర్సులు ఇంజనీరింగ్‌లో సీఎస్సీ ఓ క్రేజ్‌గా మారింది. కానీ ఇప్పుడు దానికోసం అంతగా పోటీ పడాల్సిన పనిలేదు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అతి ముఖ్యమైన సాఫ్ట్వేర్ కోర్సులు చేయవచ్చు. ప్రధాన బ్రాంచినే చదువుతూ.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటాసైన్స్ (పైథాన్ లాంగ్వేజ్‌తో), క్లౌడ్ డెవలప్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఇండ్రస్టియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఇంటర్నెట్ థింక్స్ వంటి కోర్సులను అదనంగా చేసేందుకు జేఎన్టీయూహెచ్ వీలు కల్పిస్తుంది. ఒక్కో సబ్జెక్టులోనూ మూడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి మూడు క్రెడిట్స్ ఉంటాయి. ఈ కోర్సులను 70 శాతం ఆన్లైన్లో, 30 శాతం ప్రత్యక్ష బోధన ద్వారా నేర్చుకోవచ్చు. రోజుకు రెండు గంటల చొప్పున ఆరు నెలల్లో 48 గంటల్లో ఈ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌కు 160 క్రెడిట్స్ వస్తాయి. అదనపు కోర్సులు చేయడం వల్ల మరో 26 క్రెడిట్స్ వస్తాయి. ఏ బ్రాంచి విద్యార్థి అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేందుకు ఈ క్రెడిట్స్ సరిపోతాయి. అంతర్జాతీయంగా కూడా ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థుల ఉపాధికి ఢోకా ఉండదు. ఇంతకుముందు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని చేర్చుకుని తమకు అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడు చాలా సంస్థలు నైపుణ్యం వారినే చేర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసేసరికే కంప్యూటర్ నాలెడ్జి ఉండటం ఉపకరిస్తుంది. ఎగ్జిట్ విధానం.. డ్యూయల్ డిగ్రీ నాలుగేళ్ళ ఇంజనీరింగ్ పూర్తి చేస్తేనే పట్టా చేతికొచ్చే పాత విధానం ఇక ఉండదు. రెండేళ్ళు చదివినా డిప్లొమా ఇంజనీరింగ్‌గా సర్టిఫికెట్ ఇస్తారు. అంటే డిప్లొమాతో భర్తీ చేసే ఉద్యోగాలకు ఇది సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటే అంతకు ముందు ఇచి్చన డిప్లొమా సర్టిఫికెట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ మధ్యలో మానేసే వారికి ఒకరకంగా ఇది వరమే. రెండేళ్ళ వరకు క్రెడిట్స్‌ను కూడా లెక్కగడతారు. మరోవైపు డ్యూయల్ డిగ్రీ విధానం కూడా అందుబాటులోకి వచి్చంది. జేఎన్టీయూహెచ్ పరిధిలో బీబీఏ అనలిటికల్‌ను ఆన్లైన్ ద్వారా చేసే వెసులుబాటు కలి్పస్తున్నాం. ఇంజనీరింగ్ చేస్తూనే దీన్ని చేయవచ్చు. ఇక ఇంజనీరింగ్ మధ్యలోనే స్టార్టప్స్ పెట్టుకునే వాళ్ళు.. వీలైనప్పుడు (8 ఏళ్ళలోపు) మళ్ళీ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇంజనీరింగ్ విద్యకు గుర్తింపు తేవడమే ఈ మార్పుల లక్ష్యం. -
వీసీలు రాజీనామా చేయాలని గవర్నర్ లేఖలు.. మండిపడ్డ సీఎం
తిరువనంతపురం: కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని లేఖలు పంపారు. సోమవారం ఉదయంలోగా పదవుల నుంచి తప్పుకోవాలని ఆదివారం సాయంత్ర కోరారు. అయితే వారు రాజీనామాలు చేయకపోవడంతో సోమవారం అందిరికీ షోకాజ్ నోటీసులు పంపారు. వారంతా పదవుల్లో కొనసాగేందుకు ఉన్న చటబద్ధమైన హక్కేమిటో చెప్పాలని అడిగారు. దీంతో వైస్ ఛాన్సలర్లంతా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన న్యాయవస్థానం.. వీరికి తాత్కాలిక ఊరటనిచ్చింది. రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. గవర్నర్ షోకాజ్ నోటీసులు పంపిన తర్వాత.. రాజీనామా చేయాలని పంపిన లేఖకు ఔచిత్యం లేకుండాపోయిందని పేర్కోంది. అయితే యూనివర్సీల ఛాన్సలర్ అయిన గవర్నర్.. ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకునేవరకు వైస్ ఛాన్సలర్లు పదవుల్లోనే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ వీరిని పదపుల నుంచి తొలిగిస్తూ చట్టపరమైన ఆదేశాలిస్తే అందరూ పదవులను కోల్పోతారు. ఈ వైస్ ఛాన్సలర్లంతా చట్టవిరుద్ధంగా పదవులు దక్కించుకున్నారు, ఎల్డీఎఫ్ సహకారంతో పదవులు చేపట్టారని గవర్నర్ ఆరోపిస్తున్నారు. అందుకే వారు రాజీనామాలు చేయాలని లేఖలు పంపారు. గవర్నర్ తీరుపై కేరళ సీఎం పనిరయ్ విజయన్ మండిపడ్డారు. అరిఫ్ ఖాన్ తన పరిధి మేరకు నడుచుకోవాలని హితవుపలికారు. వైస్ ఛాన్సలర్లను నియమించింది ఆయనే అని, అలాంటప్పుడు చట్టవిరుద్ధంగా జరిగిందేమిటని ప్రశ్నించారు. గవర్నర్ తీరు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. చదవండి: పాసైన బిల్లుల ఆమోదం నా పరిధిలోనిది.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై! -
గవర్నర్ ఉత్తర్వులపై కేరళ సీఎం ఫైర్
బెంగళూరు: కేరళలో తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30 గంటల కల్లా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక పాలక ప్రభుత్వం గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు దాఖలైన పిటీషన్ పరిశీలించేందుకు సోమవారం సాయంత్రమే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఐతే గవర్నర్ ఖాన్ సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ... విశ్వవిద్యాలయా వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే మాతో ఇలా యుద్ధానికి దిగుతున్నారంటూ గవర్నర్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విరుచుకుపడ్డారు. సంఘ పరివార్‌కి ధీటుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, విద్యాపరంగా స్వతంత్రంగా ఉండాల్సిన యూనివర్సిటీల అధికారాలను కాలరాసేలా గవర్నర్ తన చర్యలను అతిక్రమిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కేరళ ప్రభుత్వం వివిధ యూనివర్సిటీలకు వీసీలను సొంతంగా నియమిస్తున్న నేపథ్యం ఉందని, కానీ గవర్నర్ ఇది తన బాధ్యత అంటూ వాదిస్తున్నారని అన్నారు. అయినా గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడానికో లేదా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడానికో కాదని స్పష్టం చేశారు. అంతేగాదు గవర్నర్‌కు అలాంటి దిశానిర్దేశం చేసే అధికారం లేదని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి కూడా కరాఖండీగా చెప్పారు. ఇది ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితమైనదంటూ విమర్శలు గుప్పించారు. విద్యాసంస్థల్లో హిందూత్వ భావజాలన్ని ప్రచారం చేయాలన్న కుట్రపూరిత ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. (చదవండి: దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి) -
వీసీ నిర్వాకం: అమ్మాయిలతో డ్యాన్సులు.. డబ్బులు వెదజల్లుతూ..
సాక్షి, తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ గుప్తా క్యాంపస్‌లోని విద్యార్థినులతో కలిసి గురువారం రాత్రి చేసిన డ్యాన్సులు వివాదాస్పదంగా మారాయి. ఒక వీసీ.. అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, క్యాబరే తరహాలో డబ్బులు వెదజల్లడమేంటంటూ శనివారం ఉదయం నుంచి టీవీలు, సామాజిక మాధ్యమాల్లో కథనాలు ప్రసారం అయ్యా యి. వీసీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గర్ల్స్ హాస్టల్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై వీసీ రవీందర్ గుప్తా శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో స్పందించారు. గణేశ్ నిమజ్జనం రోజు విద్యార్థినుల కోరిక మేరకే హాస్టల్ వద్దకు వెళ్లానని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, డ్యాన్సులు చేస్తూ డబ్బులు వెదజల్లానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అనవసరమైన, అవాస్తవమైన వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలుంటాయని, గణేశ్ నిమజ్జనంలో వీసీ ఒక భక్తుడిగా మాత్రమే పాల్గొన్నారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని పేర్కొన్నారు. చదవండి: (మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం) -
వ్యవసాయ వర్సిటీ వీసీగా రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ (వీసీ)గా వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ వీసీగా పనిచేసిన ప్రవీణ్‌రావు ఈనెల 24న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి వీసీగా రఘునందన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. పూర్తిస్థాయి వీసీ నియామకం జరిగే వరకు రఘునందన్‌రావు ఈ బాధ్యతల్లో ఉండనున్నారు. పూర్తిస్థాయి వీసీ పదవీ విరమణ చేసినపుడు వ్యవసాయ శాఖకు కమిషనర్‌గా ఉన్న వారే ఇన్చార్జి వీసీగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌రావు ఈ బాధ్యతలు చేపట్టారు. -
గవర్నర్ అధికారాల కోతలో దీదీ సక్సెస్!
పశ్చిమ బెంగాల్లో గవర్నర్ అధికారాలకు మరింత కోత పెట్టింది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఆసక్తిరేపిన ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది బెంగాల్ అసెంబ్లీ. బీజేపీ వ్యతిరేకత కూడా ఇక్కడ పని చేయకపోవడం గమనార్హం. యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా వ్యవహరించాల్సిన గవర్నర్ ప్లేస్‌లో.. ఇకపై సీఎం వ్యవహరించాలన్నది ఆ బిల్లు ఉద్దేశం. కోల్‌కతా: యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా గవర్నర్ బదులు.. సీఎం వీసీగా వ్యవహరించే బిల్లుకు West Bengal University Laws (Amendment) Bill, 2022 సోమవారం ఆమోదం తెలిపింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ. డెబ్భై మందికిపైగా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నా.. బిల్లు పట్ల నిరసనలు వ్యక్తం చేసినా.. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 40 ఓట్లు మాత్రమే బిల్లు వ్యతిరేకంగా రావడం గమనార్హం. మొత్తం ఓట్లలో 183 బిల్లుకు అనుకూలంగా వచ్చాయి. యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తే.. రాజకీయ జోక్యం నేరుగా, అదీ ఎక్కువగా ఉంటుందని, విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ అసెంబ్లీ.. ఈ బిల్లును మెజార్టీతో ఆమోదించింది. తర్వాతి దశలో ఈ బిల్లు.. గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. కేబినెట్ సలహా మేరకు ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా కాలం పాటు బిల్లులను తమ వద్దే ఉంచుకుని.. రాష్ట్రపతికి పంపిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీలకు ఛాన్స్లర్ల నియామకంలో బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తన అనుమతి లేకుండానే.. 25 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించారంటూ ఈ జనవరిలో ఆయన బెంగాల్ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు. అయితే శాంతినికేతన్‌లోని విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీకి ప్రధాని వైస్ ఛాన్స్‌లర్‌గా ఉన్నప్పుడు.. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా ఎందుకు వ్యవహరించరాదు అంటూ ప్రశ్నిస్తున్నారు బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు. ఇదిలా ఉంటే.. యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించే గవర్నర్ అధికారాన్ని.. రాష్ట్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం గత నెలలో ఓ బిల్లును ఆమోదించింది. -
వైఎస్సార్ ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్
ఏఎఫ్‌యూ: కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) వైస్ చాన్సలర్ పోస్టుకు ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన వారు 20 రోజుల్లోపు http:// aps che. ap. gov. in వెబ్సైట్ ద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించింది. 2020లో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి ఓఎస్డీగా ఆచార్య డి.విజయ్కిశోర్ను నియమించగా.. ఆయన రెండేళ్లకు పైగా ఇన్చార్జి వీసీగా, ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఆయన మాతృసంస్థకు వెళ్లడంతో.. వైవీయూ వైస్ చాన్సలర్ సూర్యకళావతిని ఇన్చార్జి వీసీగా నియమించారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, చలమారెడ్డిపల్లె వద్ద 134 ఎకరాల్లో రూ.458 కోట్లతో నిర్మించనున్న ఈ విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జూలై 7న భూమి పూజ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. -
Mamata Banerjee: ఇక ‘చాన్సలర్’ మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో యూనివర్సిటీలకు ఇకపై గవర్నర్ బదులుగా ముఖ్యమంత్రే చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు. సోమవారం సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టనుంది. ప్రైవేట్ వర్సిటీల విజిటర్ హోదాను కూడా గవర్నర్ నుంచి రాష్ట్ర విద్యా మంత్రికి బదలాయించారు. గవర్నర్ ధనకర్‌తో మమతకు పొసగని విషయం తెలిసిందే. చదవండి: (వాడో బచ్చా సీఐ, మూడో కన్ను తెరుస్తా.. మండిపడ్డ ఎమ్మెల్యే) -
ఫస్ట్ టైమ్: ఇక పాలన పాఠాలు
ప్రొఫెసర్ నీలోఫర్‌ఖాన్ ‘యూనివర్శిటీ ఆఫ్ కశ్మీర్’కు వైస్–చాన్స్‌లర్‌గా నియామకం అయ్యారు. ఫలితంగా ఆ యూనివర్శిటీ తొలి మహిళ వైస్–చాన్స్‌లర్‌గా చారిత్రక గుర్తింపు పొందారు. పాఠాలు చెప్పడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఖాన్‌కు విద్యార్థులలో మంచి గుర్తింపు ఉంది. ఆమె పాఠాలు వినడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహం చూపుతారు. ‘ఎంత సంక్లిష్టమైన విషయాన్ని అయినా, సులభంగా అర్థమయ్యేలా చెబుతారు’ అంటారు విద్యార్థులు. పాఠాలలోనే కాదు పాలన సంబంధిత విషయాలలోనూ ఆమెకు అపారమైన అనుభవం ఉంది. యూనివర్శిటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే యూనివర్శిటీ కౌన్సిల్, యూనివర్శిటీ సిండికేట్, అకాడమిక్ కౌన్సిల్... మొదలైన విభాగాలలో పనిచేశారు. ఆస్ట్రేలియా, మలేషియాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడి యూనివర్శిటీల పనితీరును అధ్యయనం చేశారు. ఆమె రచనలు దేశ, విదేశ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 20 పీహెచ్డీ స్కాలర్స్‌కు పర్యవేక్షకురాలిగా వ్యవహరించారు. ‘ఇంటర్నల్ కంప్లైంట్స్’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసిన ఖాన్‌కు యూనివర్శిటీ సమస్యల గురించి లోతైన అవగాహన ఉంది. విద్యార్థుల సంక్షేమం, యూనివర్శిటీని మరో స్థాయికి తీసుకువెళ్లడం తన ప్రాధాన్యత అంశాలుగా చెబుతున్నారు నీలోఫర్‌ఖాన్. -
ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది
కాలేజ్‌లో సీటు, పరీక్షల్లో మంచి పర్సంటేజీలు తెచ్చుకున్నంత సులువు కాదు ఉద్యోగం సాధించడం. ఈ ఘట్టాన్ని సులభతరం చేయడానికి అనేక విద్యాసంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటాయి. కానీ, నిరుద్యోగిత లెక్కలు మాత్రం ప్లేస్మెంట్ ప్రయత్నాలు సరిపోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు యోగి వేమన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సూర్య కళావతి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగంతో కలిసి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ‘‘మా యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ), ఇండియా విభాగం గత కొన్ని నెలలుగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. ఈ సంగతి తెలిసిన తరవాత మా జిల్లా విద్యార్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మే నెల రెండవ తేదీన మా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఏటీఏ ఇండియా చాప్టర్ సమన్వయం కుదిర్చిన అనేక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ జాబ్‌మేళా టార్గెట్ ఆరువేల ఉద్యోగాలు. టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు అందరికీ ఇది అనువైన వేదిక. గార్మెంట్ మేకింగ్ యూనిట్ల నుంచి మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్నికల్ – నాన్ టెక్నికల్, ఐటీ, బీపీవో వరకు అన్ని రకాల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మంచి సహకారం మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే... పదిమంది తలా ఒక చెయ్యి వేసి విజయవంతం చేస్తారని అంటారు. అదేవిధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది సహకారం అందిస్తున్నారు. ఆ రోజున వచ్చే వేలాదిమందికి ఆహారపానీయాలను సమకూర్చడానికి శ్రీ సంపద గ్రూప్ కంపెనీ, జీఎస్ఆర్ ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. ఏటీఏ చాలా శ్రద్ధగా మంచి కంపెనీలను అనుసంధానం చేసుకుంది. వాళ్లు ఉద్యోగులకు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వాళ్లిస్తున్న శాలరీ ప్యాకేజ్‌లు ఏడాదికి లక్షా పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి. ఇది మా యూనివర్సిటీకి మాత్రమే కాదు, జిల్లాలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చిన్న పట్టణాల్లో చదివే వాళ్లకు పెద్ద భరోసా’’ అన్నారు సూర్య కళావతి. ప్రభుత్వం స్థాపించిన విద్యాసంస్థలు సామాజిక బాధ్యతను మరింతగా చేపట్టి ఇలాంటి కార్యక్రమాలకు వేదికలవుతుంటే యువతరం ఆలోచనలు కూడా ఆదర్శవంతంగా సాగుతాయి. మరోతరానికి స్నేహహస్తాలుగా మారుతాయి. వేలాది ఉద్యోగాలకు వేదిక! మా అమ్మది కడప జిల్లా బలపనూరు. నేను పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. ఇంటర్ వరకు అక్కడే చదివాను. బీటెక్ కడపలోని కేఎస్ఆర్ఎమ్లో. ఎంటెక్ ఎస్వీయూ, పీహెచ్డీ జేఎన్టీయూ హైదరాబాద్, పోస్ట్ డాక్టరేట్ పిట్స్బెర్గ్లోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో. నా ఉద్యోగ జీవితం కడపలో నేను చదువుకున్న కేఎస్ఆర్ఎమ్ కాలేజ్తోనే మొదలైంది. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు మా యూనివర్సిటీ విద్యార్థుల కోసమే ఈ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఇప్పుడు జిల్లా అంతటికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ‘చదువుకున్నాను, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు’ అని ఎవరూ ఆందోళన చెందకూడదనేది నా అభిలాష. అందుకే ఏటీఏ గురించి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. – మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, యోగి వేమన యూనివర్సిటీ, కడప. అనూహ్యమైన స్పందన! అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం ఈ ఏడాది జాబ్‌మేళా కాన్సెప్ట్ తీసుకుంది. ఇప్పటివరకు కుప్పం, పుంగనూరు, తిరుపతి నగరాల్లో నిర్వహించాం. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగాలుంటాయి. మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. మా టీమ్‌లో ఉన్న కిరణ్ రాయల్ అయితే ఉద్యోగాల్లో ఉండే సవాళ్ల గురించి ఓరియెంటేషన్ ఇస్తుంటారు. ఈ సోషల్ కాజ్లో అందరం ఉత్సాహంగా పని చేస్తున్నాం. యోగి వేమన యూనివర్సిటీ మెగా జాబ్ మేళా తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పుట్టపర్తి, కదిరి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడానికి క్యాలెండర్ సిద్ధమవుతోంది. – జి. సూర్యచంద్రారెడ్డి, కో ఆర్డినేటర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం – వాకా మంజులారెడ్డి -
వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆది నుంచి గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే ప్రభుత్వం.. తమ తీరును మరోసారి అసెంబ్లీ సాక్షిగా చాటింది. సోమవారం కీలకమైన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ల నియామకంలో అధికార మార్పిడికి కోసం.. సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. తద్వారా ఇప్పటి వరకు గవర్నర్ పరిధిలో ఉన్న వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గుజరాత్ తరహాలోనే తమిళనాడులో సైతం వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. గవర్నర్ వద్ద ఈ అధికారులుంటే వివాదాలు తలెత్తుతాయని చెప్పారు. అందుకే తగిన మార్పులతో కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. తమిళనాడు ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని మొత్తం 13 వర్సిటీలు విద్యాబోధనలో చారిత్రాత్మకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వీసీల నియమించే అధికారం లేకపోవడం వల్ల వర్సిటీల పనితీరులో అవకతవకలతో ప్రశ్నార్థకంగా మార్చివేసిందని అన్నారు. ఈ ఏడాది జనవరిలోనే.. అంతకు ముందు ఉన్నత విద్యాశాఖమంత్రి పొన్ముడి తమిళనాడు యూనివర్సిటీల సవరణ చట్టం –2022 బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టగా ఆమోదించారు. బిల్లు ప్రవేశపెడుతున్న దశలోనే బీజేపీ సభ్యులు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నకాలంలో తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్ర ఉన్నతవిద్యశాఖకు సంబంధించి బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. వర్సిటీలకు వైస్ చాన్స్లర్ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ కేవలం ఆమోదముద్ర మాత్రమే వేయాల్సి ఉందని డీఎంకే ప్రభుత్వం అంటోంది. అయితే అన్నాడీఎంకే హయాంలో గవర్నర్ భన్వారీలాల్ వీసీల నియామకం పూర్తి చేయడం వల్లనే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విబేధాలు మొదలైనాయని డీఎంకే శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇందువల్లే అన్నావర్సిటీ వీసీ సూరప్పపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ బదిలీ కాగా ఆర్ఎన్ రవి ఆ తరువాత బాధ్యతలు చేపట్టారు. కొత్త గవర్నర్ సైతం భన్వారీలాల్ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నట్లు డీఎంకే భావిస్తోంది. అంతేగాక ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తమిళనాడు వీసీలుగా నియమించడం చర్చకు దారితీసింది. ఇకపై వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందని, ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతామని జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం స్టాలిన్ ప్రకటించారు. అనేక రాష్ట్రాల్లో వీసీల నియామకం ప్రభుత్వమే చేస్తోందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి అదే అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు. కొసమెరుపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షతన తమిళనాడులోని అన్ని యూనివర్సిటీల వీసీలు, విభాగాధిపతుల మహానాడు నీలగిరి జిల్లా ఊటీలో ‘నవ ప్రపంచలో భారత్ భాగస్వామ్యం’ అనే అంశంపై సోమవారం జరిగింది. ఈ మహానాడు జరుగుతున్న సమయంలో గవర్నర్ అధికారాలను కత్తిరిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం గమనార్హం. బీజేపీ వాకౌట్ వీసీల నియామకం వ్యవహారంపై బీజేపీ సభ్యులు వాకౌట్ చేయగా, అన్నాడీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి, మరో అంశంపై వాకౌట్ చేశారు. -
విద్యార్థులకు తెలియకుండానే.. దరఖాస్తులు అప్లోడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎక్కడా సీట్ల బ్లాకింగ్ జరగలేదని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఏడు సీట్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల అభ్యర్థుల టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్, నీట్ అర్హతకార్డు వంటివన్నీ ఇతరులెవరో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసినట్టుగా భావిస్తున్నా మని తెలిపారు. అయితే తమను తప్పుదారి పట్టించేందుకు అభ్యర్థులే ఈ నాటకం ఆడుతున్నారా? లేక ప్రైవేట్ ఏజెన్సీలేమైనా అక్రమాలకు పాల్పడ్డాయా అన్నదానిపై విచారణ జరుగుతోందన్నారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కాంపై శుక్రవారం వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుతో కలిసి కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సొంత రాష్ట్రంలోని మంచి కాలేజీలో చేరి, ఇక్కడా చేరినట్టు అనుమానం రావడంతో.. మార్చి 16న కొందరు అభ్యర్థులకు లేఖలు రాశామని.. సీట్లు బ్లాక్ చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించామని తెలిపారు. వివిధ విడతల కౌన్సెలింగ్ అనంతరం 37 సీట్లలో ఉన్నతర్యాంకు వారు దరఖాస్తు చేశారని.. వారిలో ముగ్గురికి సొంత రాష్ట్రాల్లో మంచి సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో తిరస్కరించామని వివరించారు. మిగతా 34 సీట్లకుగాను 14 మంది ఇక్కడ చేరారన్నారు. మరో ఏడుగురికి సంబంధించి అభ్యర్థులు కాకుండా ఇతరులు దరఖాస్తు చేసినట్టు గుర్తించామని తెలిపారు. వారు బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందినవారని వెల్లడించారు. సాధారణంగా మాప్ అప్ విడత తర్వాత మిగిలిన సీట్లను మేనేజ్మెంట్లకు ఇవ్వాలని, కానీ మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ తర్వాతా సీట్లు మిగిలితేనే ఎన్నారై కోటా కింద మార్చుకునేందుకు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఉంటుందన్నారు. గవర్నర్‌కు నివేదిస్తాం..: సీట్ల బ్లాకింగ్‌కు సంబంధించిన ప్రచారం నేపథ్యంలో గవర్నర్‌కు సమగ్ర నివేదిక ఇస్తామని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు సీటు వదులుకుంటే ఇప్పటివరకు రూ.5 లక్షలు జరిమానా విధించే వారమని, దాన్ని రూ.20 లక్షలకు పెంచామని చెప్పారు. 2017 నుంచి నీట్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నందున మేనేజ్మెంట్ సీట్లకు సంబంధించి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. 2019లో ఇలాగే ముగ్గురు విద్యార్థులపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కు లేఖ రాశామని.. బ్లాకింగ్ జరగలేదని ఎన్ఎంసీ తేల్చిందని చెప్పారు. అన్నిరాష్ట్రాల పీజీ సీట్లలో ఎవరెవరు చేరారో వెబ్సైట్లలో పెట్టడం లేదా కామన్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. -
వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించండి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా షామియానాలతో పాటు ఇతర ఏర్పాట్లు చేసినందుకు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన వివాదరహిత మొత్తాన్ని వారం రోజుల్లో చెల్లించాలని హైకోర్టు సోమవారం విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ)ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని యూనివర్సిటీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మంజూరు చేసిన డిప్యూటీ ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి అధికారుల విషయంలో మెమో జారీచేస్తే సరిపోదని, వారిని సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు. స్నాతకోత్సవం సందర్భంగా చేసిన ఏర్పాట్లుకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదంటూ లక్ష్మీనర్సింహ షామియానా సప్లయిర్స్ యజమాని వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఈ వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టుకు రావాలని విశ్వవిద్యాలయం వీసీ, రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు వీసీ శ్యాంప్రసాద్, రిజిస్ట్రార్ శంకర్ సోమవారం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. వారి న్యాయవాది జి.విజయ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు చెల్లించాల్సింది రూ.3.5 లక్షలు మాత్రమేనన్నారు. అయితే డిప్యూటీ ఇంజనీర్ రూ.18 లక్షలు చెల్లించాలంటూ బిల్లులు ధ్రువీకరించారని తెలిపారు. వాస్తవానికి డిప్యూటీ ఇంజనీర్ స్నాతకోత్సవం రోజున సెలవులో ఉన్నారని, దురుద్దేశంతో బిల్లులు ధ్రువీకరించినందుకు డిప్యూటీ ఇంజనీర్‌కు మెమో జారీచేశామని తెలిపారు. వాస్తవంగా చెల్లించాల్సిన రూ.3.5 లక్షలను చెల్లించేందుకు సిద్ధమని వీసీ చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆ రూ.3.5 లక్షల బిల్లును వారం రోజుల్లో పిటిషనర్‌కు చెల్లించాలని వీసీని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేశారు. -
రణరంగంగా జేఎన్‌యూ వర్సిటీ.. విద్యార్థులకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలపై సోమవారం జేఎన్‌యూ రిజిస్ట్రార్ విద్యార్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ ఓ నోటీసులో హెచ్చరించారు. జేఎన్‌యూ వర్సిటీలో హింసకు పాల్పడితే సహించేది లేదన్నారు. శాంతికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పారని ఆ లేఖలో రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీరామనవమి పూజ సందర్బంగా వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పండుగ సందర్బంగా వర్సిటీ హాస్టల్లో నాన్ వెజ్ వండటం వల్లే ఘర్షణ తలెత్తినట్టు ఓ విద్యార్థి సంఘం నేత పేర్కొనగా.. తామేమీ నాన్ వెజ్ ఫుడ్‌కు వ్యతిరేకం కాదు అని, హాస్టల్లో ఏదైనా తినవచ్చు అని మరో విద్యార్థి సంఘం నేత తెలిపారు. ఇక, ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని ఏబీవీపీ విద్యార్తులపై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. -
ఓయూలో అబ్బాయిల హాస్టల్.. అమ్మాయిలకు!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ కేటాయింపుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంగళవారం వీసీ కార్యాలయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అబ్బాయిల స్పోర్ట్స్ హాస్టల్‌ను అమ్మాయిలకు కేటాయించారు. తమ కోసం స్పోర్ట్స్ నిధులతో నిర్మించిన హాస్టల్‌ను ఖాళీ చేసేదిలేదని వ్యాయామ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు 12 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఓయూ వీసీని రీకాల్ చేయండి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్‌ను రీకాల్ చేయాలని బహుజన విద్యార్థి ఫెడరేషన్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సైను కోరారు. సంస్కరణల పేరుతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలువురు అధికారులు యూనివర్సిటీ కాలేజీలు, కార్యాలయాల్లో అవసరం నిమిత్తం డైలీవేజ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించగా తనకు నచ్చని అధికారులు, సిబ్బందిని వీసీ రవీందర్ అకారణంగా తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం 2014లో జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఓయూకు సంబంధం లేని ఆర్క్యూస్లో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసేయడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థి నేతలు వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. (క్లిక్: కారులో కూర్చుని వెండితెరపై సినిమా చూడొచ్చు.. త్వరలో హైదరాబాద్‌లో..) -
జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా తెలుగు బిడ్డ
న్యూఢిల్లీ/సాక్షి, తెనాలి: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నూతన ఉపకులపతి(వీసీ)గా తెలుగు బిడ్డ డాక్టర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్(59) నియమితులయ్యారు. జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా ఆమె రికార్డుకెక్కారు. శాంతిశ్రీ నియామకానికి రాష్ట్రపతి, జేఎన్‌యూ విజిటర్ రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు సోమవారం వెల్లడించారు. మహారాష్ట్రలోని సావిత్రిభా యి ఫూలే పుణే యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శాంతిశ్రీ జేఎన్‌యూ వీసీ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. ఆమె గతంలో జేఎన్‌యూ నుంచి ఎంఫిల్, పీహెచ్డీ అందుకున్నారు. ఇప్పుడు అదే వర్సిటీకి ఉపకులపతిగా నియమితులు కావడం గమనార్హం. మరో తెలుగు వ్యక్తి స్థానంలోకి ఆమె వస్తుండడం మరో విశేషం. ఐదేళ్లు జేఎన్‌యూ వీసీగా సేవలందించిన తెలంగాణవాసి ఎం.జగదీష్ కుమార్ గత ఏడాది ఆఖర్లో పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి యాక్టింగ్ వీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయన గతవారమే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. నూతన వీసీగా బాధ్యతలు చేపట్టనున్న శాంతిశ్రీ ధూళిపూడిని జగదీష్ కుమార్ ప్రశంసించారు. నూతన వీసీగా సోమవారమే ఆమెకు బాధ్యతలు అప్పగించానని వెల్లడించారు. విధి నిర్వహణలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మెడిసిన్ కాదనుకొని హయ్యర్ సెకండరీలో మంచి మార్కులతో శాంతిశ్రీ ఉతీర్ణురాలయ్యాక, సైన్స్‌లో తనకు వచ్చిన మార్కులతో మెడిసిన్‌లో సీటు వచ్చేది. అయినాసరే, ఆమె చరిత్ర, పొలిటికల్ సైన్స్ చదవాలని నిర్ణయించుకున్నారు. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ 1962 జూలై 15న రష్యాలోని (అప్పటి యూఎస్ఎస్ఆర్) సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్ ధూళిపూడి ఆంజనేయులు రచయిత, జర్నలిస్టు. శాంతిశ్రీ తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్గ్రాడ్ ఓరియంటల్ ఫ్యాకల్టీ డిపార్టుమెంట్లో తమిళం, తెలుగు భాషల ప్రొఫెసర్‌గా పనిచేశారు. ► శాంతిశ్రీ మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1983లో హిస్టరీ, సోషల్ సైకాలజీలో బీఏ డిగ్రీ అందుకున్నారు. ► 1985లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ(ఎంఏ) డిగ్రీ పొందారు. ► 1990లో జేఎన్యూకు చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ‘పార్లమెంట్, ఫారిన్ పాలసీ ఇన్ ఇండియా–ద నెహ్రూ ఇయర్స్’పై పీహెచ్డీ డాక్టరేట్ అందుకున్నారు. ► ఉన్నత విద్యావంతురాలైన శాంతిశ్రీ ధూళిపూడి ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. కన్నడం, మలయాళం, కొంకణీ భాషలను అర్థం చేసుకోగలరు. ఎన్నెన్నో పురస్కారాలు.. ► శాంతిశ్రీ పలు అంశాల్లో 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ► మద్రాసు పెసిడెన్సీ కాలేజీ నుంచి 1980–81, 1981–82, 1982–83, 1983–84, 1984–85లో ఎల్ఫిన్‌స్టోన్ ప్రైజ్. ఈ ప్రైజ్‌ను ఎక్కువసార్లు (ఐదుసార్లు) గెలుచుకున్న రికార్డు ఇప్పటికీ శాంతిశ్రీ పేరిటే ఉంది. ► 1998లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్‌కు చెందిన సెంటర్ ఫర్ సౌత్ ఆసియన్ డీస్ నుంచి ఫెలోషిప్. ఆస్ట్రియా నుంచి మరో ఫెలోషిప్. విద్యా రంగానికి సేవలు ► 1988లో గోవా యూనివర్సిటీలో బోధనా వృత్తిని ఆరంభించారు. ► 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ సెనేట్ సభ్యురాలిగా, 2001 నుంచి 2007 వరకూ ఇంటర్నేషనల్ సెంటర్ డైరెక్టర్‌గా, 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా బాధ్యతలు. ► చైనాలోని హూనన్ వర్సిటీలో ఆసియన్ అండ్ యూరోపియన్ స్టడీస్ రిసోర్స్‌పర్సన్‌గా విధులు. ► యూజీసీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) సభ్యురాలిగా పని చేశారు. ఆర్ఎస్ఎస్ మద్దతుదారు! శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు బలమైన మద్దతుదారు అని తెలుస్తోంది. హిందుత్వవాదులకు అనుకూలంగా గతంలో ఆమె చేసిన ట్వీట్లను పలువురు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. వామపక్షవాదులను, ఉదారవాదులను జిహాదీలుగా ఆమె అభివర్ణించారు. మహాత్మాగాంధీ హత్య పట్ల విచారం వ్యక్తం చేస్తూనే నాథూరామ్ గాడ్సేకు సానుభూతి తెలిపారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీకి కాదు, బీజేపీ ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటాన్ని, షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని శాంతిశ్రీ తప్పుపట్టారు. ఆమె ట్వీట్లను విద్యార్థులు, జర్నలిస్టులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతిశ్రీ తన ట్విట్టర్ ఖాతాను తొలగించినట్లు సమాచారం. 2011లో పుణే యూనివర్సిటీలో విద్యార్థుల ప్రవేశాల విషయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీసీ పోస్టు కోసం శాంతిశ్రీతోపాటు ప్రొఫెసర్ గుల్షన్ సచ్‌దేవా, అవినాశ్‌చంద్ర పాండే పేర్లు పరిశీలనకు వచ్చాయి. భావజాలం రీత్యా శాంతిశ్రీ వైపే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మూలాలు శాంతిశ్రీ తండ్రి ధూళిపూడి ఆంజనేయులు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అమృతలూరు మండలంలోని యలవర్రు. ఆయన 1924 జనవరి 10న జన్మించారు. ఉన్నత విద్య అభ్యసించి, పాత్రికేయ రంగంలో స్థిరపడ్డారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందూ పత్రికల్లో సబ్ఎడిటర్గా చేశారు. ఆకాశవాణి సొంత పత్రిక సంపాదకులుగా పనిచేశారు. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభు త్వ సమాచార శాఖలో సమాచార అధికారిగా సేవలందించారు. ఇంగ్లిష్ త్రైమాసిక పత్రిక త్రివేణికి సహసంపాదకులుగా ఉన్నారు. (చదవండి: ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు) (క్లిక్: ఇలాంటి ఆధార్ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియా ఫిదా) -
యూజీసీ చైర్మన్‌గా తెలుగు తేజం జగదీశ్
న్యూఢిల్లీ/సాక్షి, నల్లగొండ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)గా ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్ ఎంపికయ్యారు. యూజీసీకి చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్ కుమార్ ప్రస్తుతం జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. వీసీగా పదవీకాలం గతేడాదే ముగిసినా ఆయనను కొనసాగించారు. జేఎన్‌యూలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలిచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయాలనికి తాళాలేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవవనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి. నల్లగొండ వాసి... తెలుగువాడైన జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్ డాక్టో్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సాంçస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ – సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్ఏ అండ్ వీఎస్‌ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు. నూతన బాధ్యతలు చాలెంజింగ్‌గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమవుతాను. మల్టీడిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది. -
నకిలీ సర్టిఫికెట్ల భరతం పడతాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ డిగ్రీలను తయారు చేస్తున్న నేరస్తుల భరతం పడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. దీనికోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమన్వయంతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సోమవారం ఆయన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ యూనివర్సిటీలు ఇచ్చే సరిఫికెట్లన్నీ ఒకే పోర్టల్ ద్వారా సంబంధిత కంపెనీలు తేలికగా పరిశీలించుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా నకిలీ అని తేలితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీలకు సూచించారు. ఈ ప్రక్రియలో పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ దిశగా అన్ని యూనివర్సిటీలు డేటాను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ నకిలీల గుర్తింపునకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు. అవసరమైన సంస్థలు పోర్టల్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2016 వరకు అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్ చేశామని, త్వరలో మిగతా సంవత్సరాలవి కూడా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ వెంకటరమణ, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
సైబర్‌క్రైం కేసులు పెడతాం.. సిబ్బందిని బెదిరించిన తెయూ వీసీ
సాక్షి, తెయూ(నిజామాబాద్): యూనివర్సిటీకి సంబంధించిన వివరాలు ఫొటోలు తీసి ఎవరైనా మీడియాకు అందజేస్తే వారిపై సైబర్ క్రైం నేరం కింద కేసులు పెట్టిస్తామని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ హెచ్చరించారు. పాలక మండలి (ఈసీ) అనుమతి లేకుండా అవుట్సోర్సింగ్ విధానంలో ఇటీవల సుమారు 50 మంది బోధనేతర సిబ్బంది నియామకాలపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయమై బుధవారం సాయంత్రం 6 గంటలకు బోధన, బోధనేతర, రెగ్యులర్, అవుట్సోర్సింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు సిబ్బందికి బుధవారం 4 గంటలకు స మాచారం ఇచ్చారు. దీంతో 5 గంటలకు విధు లు ముగించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన సిబ్బంది క్యాంపస్‌లోనే ఉండిపోయారు. వీసీ రవీందర్ తో పాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కనకయ్య రాత్రి 7 గంటల తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధికి ఒక విజన్‌తో ముందుకు వె ళుతున్న తనను కొందరు అసత్య ఆరోపణల తో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెయూ పరిధిలో మెయిన్ క్యాంపస్ (డిచ్పల్లి), సౌత్ క్యాంపస్(భిక్కనూర్), ఎడ్యుకేషన్ క్యాంపస్ (సారంగపూర్) మూడు క్యాంపస్‌లు ఉన్నాయని, సిబ్బంది కొరత వల్లనే అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. మూడు క్యాంపస్‌లు ఉన్న విషయం రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తెలియదని వీసీ పేర్కొనడంతో బోధన, బోధనేతర సిబ్బంది అవాక్కయ్యారు. ప్రస్తుత ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గతంలో రెండు సార్లు తెయూ రిజిస్ట్రార్ గా పని చేసిన విషయం తెలిసిందేనని ఆయనకు ఎన్ని క్యాంపస్‌లు ఉన్నాయో తెలియదా అని వారు నవ్వుకున్నారు. సిబ్బంది నియామకాలపై మీడియాలో వార్తలు వస్తే సిబ్బందిని బెదిరింపులకు గురి చేయడం ఏంటని పలువురు వాపోయా రు. రాత్రి 7.45 గంటలకు సమావేశం ముగించడంతో ఈ సమయంలో తాము ఇళ్లకు ఎలా వె ళ్లాలని మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రిన్సిపాల్ ఆఫీస్ నుంచి ఫొటోలు వెళ్లాయనుకుంటే వారితోనే సమావేశం నిర్వహించాలే కానీ మెయిన్ క్యాంపస్, ఎడ్యుకేషన్ క్యాంపస్‌లకు చెందిన అందరినీ పిలిపించి బెదిరింపులకు పాల్పడితే ఏమిటని ప్రశ్నించారు. చదవండి: బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా: ‘పేపర్ వేస్తే తప్పేంటి’ -
విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు.. వీసీ సీరియస్
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీ డిగ్రీ పరీక్షల 6వ సెమిస్టర్ ప్రశ్నాపత్రం ఓ ప్రయివేటు కళాశాలకు చెందిన విద్యార్థుల వాట్సాప్‌గ్రూపులో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని వీసీ మల్లేశ్ సీరియస్‌గా తీసుకున్నారు. డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలకు కోవిడ్ కారణంగా సెల్ఫ్సెంటర్లు ఏర్పాటుచేశారు. దీని కారణంగా కొన్ని ప్రయివేటు కళాశాలల్లో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరిగిందని గుర్తించిన వీసీ 12వ తేదీ నుంచి జరుగుతున్న 4, 6వ సెమిస్టర్లకు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తుండగా.. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను పట్టుకొని కేసు నమోదుచేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సెల్ఫోన్లలో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడాన్ని వీసీ సీరియస్‌గా తీసుకున్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై శాతవాహన వీసీ మల్లేశ్ నలుగురితో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదే శించారు. గురువారం కమిటీ తన పనిని ప్రారంభించగా.. శనివారం దీనిపై ప్రత్యేకసమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహా రంలో కొన్ని ప్రముఖ కళాశాలలకు చెందిన వారి హ స్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి నుంచి లీకవుతున్నాయి.. ఎస్సారార్ కళాశాల కేంద్రంలో పరీక్ష రాస్తున్న నగరానికి చెందిన ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం రావడం, అప్పుడే వర్సిటీ అధికారులకు సమాచారం చేరడంతో విషయం బయటకు పొక్కింది. కానీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కొన్ని రోజుల నుంచే జరుగుతోందని చర్చ జరుగుతోంది. కొంతమంది విద్యార్థులు పేపర్ లీక్ విషయం కొత్తేమి కాదని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బుధవారం పలువురు విద్యార్థుల సెల్ఫోన్లలో ప్రత్యక్షమైన ప్రశ్నాపత్రం వర్సిటీవ్యాప్తంగా వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ నిఘా శాతవాహనలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిసింది. వర్సిటీ వేసిన ప్రత్యేక కమిటీతో నిజం తేలిన తర్వాత బాధ్యులపై చర్యలకు యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని చర్చజరుగుతోంది. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వర్సిటీలో గురువారం జరిగిన ఒక సమావేశంలో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకు సీజ్చేసిన తొమ్మిదిసెల్ఫోన్లు ఇవ్వమని వీసీ స్పష్టం చేశారు. -
12 సెంట్రల్ వర్సిటీలకు కొత్త వీసీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 12 సెంట్రల్ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారని విద్యా శాఖ తెలిపింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, గయాలోని దక్షిణ బిహార్, మణిపూర్ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, నార్త్–ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం, బిలాస్పూర్ గురు ఘాసిదాస్ విశ్వవిద్యాల యాలకు వీసీల నియామకం జరిగింది. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సత్యనారాయణను నియమించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో మొత్తం 22 వైస్ ఛాన్సలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా యని, అందులో 12 పోస్టులకు నియామకాలను రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం రాజ్యసభకు తెలిపారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి వీసీలు లేని సెంట్రల్ యూనివర్సిటీలలో బనారస్ హిందూ యూనివర్సిటీ , ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. కొత్త వైస్ ఛాన్స్లర్లు వీరే.. హరియాణా సెంట్రల్ యూనివర్శిటీ- ప్రొఫెసర్ (డాక్టర్) తంకేశ్వర్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ- ప్రొఫెసర్ సత్ ప్రకాష్ బన్సాల్ జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ - డాక్టర్ సంజీవ్ జైన్ జార్ఖండ్ సెంట్రల్ యూనివర్శిటీ - క్షితి భూçషణ్ దాస్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ - ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ తమిళనాడు సెంట్రల్ యూనివర్శిటీ - ప్రొఫెసర్ ముత్తుకలింగన్ కృష్ణన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ- డాక్టర్ బసుత్కర్ జె రావు దక్షిణ బిహార్ సెంట్రల్ యూనివర్శిటీ - ప్రొఫెసర్ కామేశ్వర్‌నాథ్ సింగ్ నార్త్–ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ- ప్రొఫెసర్ ప్రభాశంకర్ శుక్లా గురు ఘాసిదాస్ యూనివర్సిటీ - డాక్టర్ అలోక్ కుమార్ చక్రవల్ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ- ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మణిపూర్ యూనివర్సిటీ - ప్రొఫెసర్ ఎన్. లోకేంద్ర సింగ్ -
HCU: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీగా బీజే రావు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్సలర్‌గా డాక్టర్ బసూత్కర్ జగదీశ్వర్ రావు నియమితులయ్యారు. ఆయన్ను వీసీగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజే రావు ప్రస్తుతం తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ డీన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు పలు ఉన్నత పదవులు చేపట్టిన బసూత్కర్ జగదీశ్వర్ రావు.. అమెరికాలోని యేల్ స్కూల్ నుంచి బయోలాజికల్ సైన్స్‌లో పోస్ట్ డాక్టరేట్ పట్టా పొందారు. ఈయన ఐదేళ్లపాటు హెచ్‌సీయూ వీసీగా కొనసాగనున్నారు. ఇక మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ వీసీగా సయ్యద్ ఐనుల్ హుస్సేన్ నియమితులయ్యారు. డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్ట్‌గా ప్రొఫెసర్ హుస్సేన్ పనిచేస్తున్నారు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణకు అవకాశం దక్కింది. -
వంద రూపాయల కోసం మాజీ వైస్ చాన్సలర్ దారుణ హత్య
భువనేశ్వర్: వంద రూపాయలు అడిగితే ఇవ్వలేదని మాజీ వైస్ చాన్సలర్‌ను దారుణ హత్య చేసిన ఘటన ఆదివారం ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాలు.. జార్సుగూడకు చెందిన ప్రొఫెసర్ ధూర్బరాజ్ నాయక్ సంబల్పూర్ యునివర్సిటీలో వైస్ చాన్సలర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కాగా ఆదివారం ఉదయం నాయక్ పనిమీద ఆయన బయటికి వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య, కూతురు, అల్లుడు వేరే గదుల్లో ఉన్నారు. కాగా మధ్యాహ్నం ఊళ్లో నుంచి కొంతమంది యువకులు వచ్చి నాయక్ ఇంట్లోకి చొరబడ్డారు. నేరుగా నాయక్ రూంకి వెళ్లి తనిఖీలు చేస్తుండగా.. నాయక్ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. నాయక్‌ను చూసిన ఆ యువకులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అతను అందుకు ఒప్పుకోకపోవడంతో కనీసం వంద రూపాయలైనా ఇవ్వాలంటూ అతనిపై దౌర్జన్యం చేశారు. దీంతో నాయక్, ఆ యువకులు మధ్య తోపులాట జరగ్గా.. ఆ యువకుల్లో ఒక వ్యక్తి అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని నాయక్ మెడపై నరికాడు. దీంతో నాయక్ అక్కడే కుప్పకూలగా.. వారు అక్కడినుంచి పారిపోయారు. వేరే గదిలో ఉన్న ఆయన భార్య వచ్చి నాయక్‌ను తన అల్లుడు సాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రికి తరలించిన కాసేపటకే ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జార్సుగూడ ఎస్పీ బీసీ దాస్ తెలిపారు. చదవండి: 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. రెండో భార్య ఏంచేసిందంటే.. హైటెక్ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో -
ఒలింపిక్స్ పతకాలే లక్ష్యం: వీసీ కరణం మల్లీశ్వరి
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ క్రీడా యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్ చాన్సలర్(ప్రకటిత) కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడలకు కావాల్సిన వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన సులభమేనన్నారు. ఢిల్లీ క్రీడా వర్సిటీ వీసీగా నియమితులైన క్రమంలో బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్నతనం నుంచే క్రీడలపై మనసు లగ్నం చేస్తే.. యుక్త వయసు నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడం, పతకాలు సాధించడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ క్రీడా యూనివర్సిటీలో ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వరకు కోర్సులుంటాయన్నారు. ‘ఆరో తరగతి నుంచే క్రీడల్లో శిక్షణ ఇస్తే ఈ రంగంలో మరింత దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అకాడమీల్లో ఏదో ఒక క్రీడ మాత్రమే నేర్చుకునే వీలుంది. యూనివర్సిటీలో పలు క్రీడల పట్ల అవగాహన పెంచుకుని తగిన క్రీడను ఎంచుకునేందుకు అనేక అవకాశాలుంటాయి. క్రీడలను కెరియర్‌గా ఎంచుకుని ఎదగగలమన్న విశ్వాసాన్ని కల్పించేలా ఈ వర్సిటీ ఉంటుంది. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఇది ఒక వరం లాంటింది. త్వరలోనే బాధ్యతలు చేపడతా. అధికారులు, ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాలు, అర్హతలు, ఇతరత్రా అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’ అని కరణం మల్లీశ్వరి వివరించారు. చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి -
ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ మొదటి వీసీగా కరణం మల్లీశ్వరి
సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రముఖ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ చాన్స్‌లర్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. అంచెలంచెలుగా.. ఆమదాలవలస మండల పరిధిలోని ఊసవానివానిపేట అనే మారుమూల గ్రామానికి చెందిన మల్లేశ్వరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె తల్లిదండ్రులు కరణం మనోహర్, శ్యామల. మల్లేశ్వరి అక్క నరసమ్మకు జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంసెట్టి అప్పన్న శిక్షణ ఇస్తుండేవారు. అక్క విజయాలను చూసిన మల్లేశ్వరి కూడా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తొలుత జిల్లాస్థాయి, దానికి కొనసాగింపుగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. అనంతరం జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. ఒలింపియన్‌గా.. 2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో మల్లేశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి విశ్వవ్యాప్తంగా సిక్కోలు ఖ్యాతిని వ్యాపింపజేశారు. ఈ పోటీ ల్లో 110 కేజీల స్నాచ్, 130 కేజీల క్లీన్ అండ్ జర్క్ ద్వారా మొత్తం 240 కేజీల బరువు ఎత్తి ఒలింపిక్స్ లో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు పలు ప్ర పంచస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీ ల్లో మల్లేశ్వరి వరుసగా పతకాల పంట పండించారు. మొత్తం అన్నీ 54 కేజీల విభాగంలో సాధించారు. 1993లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో కాంస్యం, 1994లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో బంగారం, 1995లో చైనాలోని గ్యాంగ్‌ఝూలో బంగారం, 1996లో చైనాలోని గ్యాంగ్ ఝాలో కాంస్య పతకాలు సాధించింది. ఆ తరువాత 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో 63 కేజీల విభా గంలో రజతం సాధించి శభాష్ అనిపించారు. 1997 లో ఈమె సహచర వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడైన రాజేష్ త్యాగిని వివాహం చేసుకున్నారు. 2004 ఒలింపిక్స్ తర్వాత తన ఆటకు ఫుల్స్టాప్ పెట్టారు. ప్రస్తుతం ఈమె హర్యానాలోని యమునానగర్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) బోర్డు డైరెక్టర్‌గా, దేశంలోని పలు స్పోర్ట్స్ కమిటీల్లో, ఇండియన్ వెయిట్‌లిప్టింగ్ ఫెడరేషన్లో కీలక సభ్యురాలిగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొదటి వీసీగా నియామకమయ్యారు. చదవండి: Milkha Singh Love Story: ఆమె ప్రేమకై అతడి పరుగు -
తెలంగాణ: యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: విశ్వ విద్యాలయాలు ఉత్కృష్టత నిలయాలుగా ఎదగాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్లకు సూచించారు. విశ్వవిద్యాలయాలు కేవలం 'టీచింగ్ యూనివర్సిటీలు' గా మాత్రమే మిగలకూడదని అవి పరిశోధన, ఆవిష్కరణల నిలయాలుగా ఎదగాలన్నారు. గ్లోబల్ ఇన్నొవేషన్‌లో భారతదేశం 49వ స్థానంలో ఉందని, అయితే టాప్ ట్వంటీ లోకి భారత్‌ను తీసుకురావాలంటే విశ్వవిద్యాలయాలు కూడా పరిశోధనల్లో, ఆవిష్కరణల్లో మరింత చురుకుగా వ్యవహరించాల్సి ఉంటుందని గవర్నర్ అన్నారు. కోవిడ్ సంక్షోభానికి సంబంధించి సైన్స్, సామాజిక శాస్త్రాల ఉమ్మడి పరిశోధన కూడా సాగాలని ఆమె సూచించారు. గవర్నర్ రాష్ట్రంలోని మొత్తం 14 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో.. వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత విద్యలో మరింతగా అభివృద్ధి చేసి నంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలలో అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంపొందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం, విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, యూత్ రెడ్ క్రాస్, ఎన్ ఎస్ ఎస్ సేవలు మరింత విస్తరించడం, గ్రామాల దత్తత ఇలాంటి అంశాలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. విశ్వవిద్యాలయాలు సకాలంలో క్లాసులు, పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి అకాడమిక్ సంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆన్లైన్ క్లాసులు పొందలేక పోతున్న అణగారిన వర్గాలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఆన్ లైన్ విద్య డిజిటల్ అంతరాలను పూడ్చేదిగా ఉండాలి, కానీ మరింత గా అంతరాలను పెంచేదిగా ఉండకూడదని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 14 మంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్స్లర్లు తమ యూనివర్సిటీల కార్యక్రమాలను, ప్రగతిని గవర్నర్‌కు వివరించారు. చదవండి: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు: మంత్రి సబితా జూన్ 23లోగా జీవో అమల్లోకి తీసుకురావాలి: హైకోర్టు -
ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. ‘వీసీ’ రాలే!
భైంసా(ముధోల్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని యూనివర్సిటీలకు వీసీ (వైస్ చాన్స్‌లర్)లను నియమించింది. బాసర ట్రిపుల్ ఐటీకి వీసీ నియామకం విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర– ఆర్జీయూకేటీ)కి మాత్రం ఇన్చార్జి వీసీ పాలనే కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ఏళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ఇడుపులపాయ, నూజీవీడు, బాసరలో ఆర్జేయూకేటీ పేరుతో ట్రిపుల్ ఐటీలను అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక చదువుల తల్లి కొలువైన బాసరలోని ట్రిపుల్ ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ హోదా కల్పించింది. పాలనపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు. ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో ఓయూ వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన కొనసాగిన అనంతరం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇన్చార్జి వీసీగా రాహుల్ బొజ్జ కొనసాగుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. బాసర ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది రెగ్యులర్ వీసీ నియామకం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆరేళ్ల కోర్సులో భాగంగా ఇక్కడ ఏటా ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 300 మంది వరకు టీచింగ్ స్టాఫ్, వెయ్యి మంది వరకు బోధనేతర సిబ్బంది ఉంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందిస్తూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న ఈ వర్సిటీలో ప్రవేశాలకు ఏటా పోటీ విపరీతంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించిన వారంతా ఇన్‌చార్జీలే కావడంతో పూర్తిస్థాయిలో సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. తమ పరిమితులకు లోబడే పని చేస్తున్నారు. ఇది ట్రిపుల్ఐటీ ప్రగతికి అవరోధంగా మారింది. విద్యాలయ ప్రగతికి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అలాగే యూనివర్సిటీ నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్ కౌన్సిలింగ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల పరిధిలోనే ఇన్చార్జీ వీసీలు నిర్ణయాలు అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. విద్యాలయంలో చాలా వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇన్చార్జి వీసీలంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో ఇక్కడికి ‘విజిటింగ్’కే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర రాజధానిలో కీలకవిధి నిర్వహణలో ఉండేవారికే ఇక్కడ ఇన్చార్జి వీసీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు సైతం పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వీసీ ప్రత్యక్ష పర్యవేక్షణ కరువై పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ వీసీ నియామకంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలెన్నో.. ► ఇక్కడ చదివే విద్యార్థులు భోజనం, వసతి, విద్యాబోధన తదితర అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ► కొంతమంది అధికారులు విద్యాలయంలో ఆధిపత్యం చెలయిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ గతంలో పలుమార్లు విద్యార్థులు సైతం ఆందోళన బాటపట్టారు. ► టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌లో ఖాళీలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. చదవండి: మట్టిదిబ్బల కింద మహత్తర శిల్పాలు ఎవరితోనైనా లేచిపో లేదంటే.. వదిన అసభ్యంగా దూషించడంతో.. -
TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్చాన్స్లర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల మేరకు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వీసీల నియామక ప్రక్రియలో భాగంగా పేర్లను సిఫారసు చేశారు. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యమైనా నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేశారు. వీసీల నియామకానికి శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారిని వీసీలుగా నియమించింది. వీటికి సంబంధించి యూనివర్సిటీ వారీగా ఉన్నత విద్యా శాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బాసరలోని ట్రిపుల్‌ఐటీకీ ప్రభుత్వం త్వరలోనే వీసీని నియమించనుంది. ట్రిపుల్ ఐటీకి ప్రొఫెసర్ గోవర్ధన్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ముగ్గురికి రెండోసారి అవకాశం.. వీసీలుగా నియమితులైన వారిలో ముగ్గురికి రెండోసారి అవకాశం దక్కించింది. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వీసీగా నియమితులైన ప్రొఫెసర్ కె.సీతారామరావు ఇంతకుముందు కూడా అదే యూనివర్సిటీ వీసీగా పని చేశారు. 2016 జూలై నుంచి 2019 జూలై వరకు ఆయన వీసీగా పని చేశారు. ప్రొఫెసర్ కవిత దర్యాణి జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి (జేఎన్ఏఎఫ్ఏయూ) రెండోసారి వీసీగా నియమితులయ్యారు. అలాగే ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఉమ్మడి ఏపీలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీగా పని చేశారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్‌గా సేవలందించిన ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ తాజాగా శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురికి వీసీలుగా అవకాశం దక్కింది. ప్రొఫెసర్ టి.రమేశ్, ప్రొఫెసర్ సీతారామరావు, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. రెండేళ్ల తర్వాత నియమకాలు.. రాష్ట్రంలోని 10 వర్సిటీలకు 2016లో ప్రభుత్వం వీసీలను నియమించింది. వారందరి పదవీ కాలం 2019లో ముగిసింది. దీంతో ప్రభుత్వం వీసీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని వర్సిటీలతో పాటు ఇతర రాష్ట్రాల చెందిన 984 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. వాటిన్నింటినీ ప్రభుత్వం క్రోడీకరించి సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో సెర్చ్ కమిటీల సమావేశాలు ఆలస్యయ్యాయి. ఎట్టలకేలకు గత ఫిబ్రవరిలో సెర్చ్ కమిటీల సమావేశాలను ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక్కో యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం ముగ్గురు చొప్పున పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించింది. ప్రొఫెసర్ కవితా దర్యాణి ప్రొఫెసర్ కవితా దర్యాణి.. జేఎన్ఏఎఫ్ఏయూలో ఆర్కిటెక్చర్ విభాగం లెక్చరర్‌గా 1985లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2002లో జేఎన్టీయూ హైదరాబాద్ లో అడినషల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా, 2004లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. అనంతరం మాసబ్‌ట్యాంక్ జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్గా, 2013 నుంచి 2016 వరకు ఇదే యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, 2017లో వీసీగా పదోన్నతి పొందారు. తాటికొండ రమేశ్ వరంగల్‌లోని గోవిందరాజుగుట్ట ప్రాంతానికి చెందిన తాటికొండ రమేష్ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రి రామయ్య ఆజాంజాహీ మిల్లులో కార్మికుడిగా పనిచేయగా, తల్లి లక్ష్మమ్మ మద్రాస్ చక్కెర బీడీ కంపెనీలో బీడీలు చుట్టేవారు. ఆమెతో కలసి నాలుగో తరగతి సమయం నుంచే తల్లితో పాటు బీడీలు చుట్టేవారు. హైస్కూల్ విద్యతో పాటు ఇంటర్, డిగ్రీ వరంగల్‌లోనే పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1987లో ఎంఏ సోషియాలజీ, 1990లో ఎంఫిల్, 2009లో పీహెచ్డీ పూర్తిచేసిన ఆయన.. 1992లో కేయూ సోషియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నిర్మల్ పీజీ సెంటర్లో 1991లో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కేయూలో సోషియాలజీ విభాగానికి అధిపతిగా, బీఓఎస్‌గా, సోషల్ సైన్స్ డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కేయూ అకడమిక్ ఆడిట్ డీన్‌గా ఉన్న ఆయన 20కి పైగా పుస్తకాలు రచించారు. తంగెడ కిషన్‌రావు కరీనంగర్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు 1973లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశారు. 1991లో అదే యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1974 నుంచి 1984 వరకు భువనగిరిలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పని చేశారు. అప్పటి నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో అకడమిక్ ఆడిట్ సెల్లో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పని చేశారు. 1991 నుంచి 1999 వరకు ఉస్మానియాలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1999 నుంచి ప్రొఫెసర్‌గా పని చేశారు. 2006 నుంచి బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గానూ పని చేశారు. ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్.. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. 1990లో అదే యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా నియమితులయ్యారు. కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్షిప్ ఇన్ అకడమిక్ ప్రోగ్రాంలో శిక్షణ పొందారు. ఓయూ పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా గతంలో పని చేశారు. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. మహత్మాగాంధీ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డీన్‌గా, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ కోఆర్డినేటర్‌గా పని చేశారు. నిజాం కాలేజీ, ఓయూ పీజీ కాలేజీల్లోనూ ఆయన సేవలు అందించారు. సీతారామారావు వరంగల్ జిల్లా హన్మ కొండకు ప్రొఫెసర్ సీతా రామారావు కేయూ యూని వర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభా గంలో 1977లో పీజీ, 1981లో ఎంఫిల్, 1999లో పీహెచ్డీ పూర్తిచేశారు. 1978లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులైన ఆయన ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది విభాగాధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, సోషల్ సైన్స్ డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశాక 2016లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా నియమితులై మూడేళ్ల పాటు కొనసాగారు. ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ కరీంనగర్ జిల్లాలోని హన్మాజ్పేట్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ ఉన్నత స్థాయికి ఎదిగారు. పదో తరగతి వరకు కరీంనగర్ జిల్లాలోనే చదువుకున్న ఆయన బాబు జగ్జీవన్‌రామ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్ పూర్తి చేశారు. ఇంటర్నేషనల్ జర్మనీ ఫెలోషిప్ అందుకుని అక్కడే పీహెచ్డీ పూర్తి చేశారు. 1992లో లెక్చరర్‌గా నియమితులైన ఆయన 1994లో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చేశారు. ఆ తర్వాత నిజాం కాలేజీ ప్రిన్సి పాల్గా పని చేశారు. 2010లో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ హెడ్‌గా, 2012 నుంచి 2014 వరకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. లక్ష్మీకాంత్ రాథోడ్ మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్.. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకానమిక్స్ పూర్తి చేశారు. బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేసిన ఆయన.. 2006లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎయిడెడ్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి.. ఐదేళ్ల తర్వాత ఉస్మానియాలో ఫ్యాకల్టీగా చేరారు. అప్పటి నుంచి 2020 ఆగస్టు వరకు ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా పని చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. సీహెచ్ గోపాల్‌రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్‌రెడ్డి.. వరంగల్ కాకతీయ యూని వర్సిటీలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు. 1990లో అదే యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత యూనివర్సిటీలో వివిధ హోదాల్లో పని చేశారు. నల్లగొండ పీజీ కాలేజీ డిపార్ట్మెంట్ హెడ్‌గా, సైఫాబాద్ యూనివర్సిటీ సైన్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫిజిక్స్ హెడ్‌గా మూడేళ్లు పని చేశారు. డీన్‌గా, అడ్మిషన్స్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. 2016లో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితు లయ్యారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. డి.రవీందర్‌గుప్తా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కి చెందిన ప్రొఫెసర్ డి.రవీందర్‌గుప్తా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన రాసిన 172 ఆర్టికల్స్ అంతర్జాతీయ జర్నల్స్‌లో పబ్లిష్ అయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 1994లో బాయ్‌స్కాస్ట్ ఫెలోషిప్ పొందారు. 1996లో యునైటెడ్ కింగ్డమ్ రాయల్ సొసైటీ విజిటింగ్ ఫెలోషిప్ పొందారు. సైన్స్ టెక్నాలజీ విభాగంలో 1994లో ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. యూజీసీ కెరీర్ అవార్డును పొందారు. కట్టా నర్సింహారెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌కు చెందిన కట్ట నర్సింహారెడ్డి.. మహాత్మాగాంధీ యూని వర్సిటీ వీసీగా 2011 నుంచి 2014 వరకు పని చేశారు. అంతకుముందు ఉస్మానియా యూని వర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెం ట్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2013లో పదవీ విరమణ పొం దారు. ఆయన తండ్రి రామ చంద్రా రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. చదవండి: చిన్నపిల్లలకు వ్యాక్సిన్ త్వరగా తీసుకురండి: గవర్నర్ తమిళిసై -
గురువు రుణం తీర్చుకున్నాడు
కేయూ క్యాంపస్ (వరంగల్): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్ చిదిమేసింది. కోవిడ్ కారణంగా గురువు చనిపోవడంతో శిష్యుడే అంత్యక్రియలు పూర్తిచేసి గురువు రుణం తీర్చుకున్నాడు. మాజీ వీసీ పశుల సాంబయ్య బుధవారం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందగా ఆయన మృతదేహాన్ని పరకాల మండలం నాగారానికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కుమారుడు వరుణ్‌కు ఇటీవల కరోనా సోకి తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కుమార్తె ప్రణయ గర్భవతి కావడంతో అంత్యక్రియలు పూర్తిచేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం వరుణ్ చేయి పట్టుకుని తలకొరివి పెట్టిద్దామదనుకున్నా ఆయన నీరసించి నిలబడలేని స్థితికి చేరడంతో సాంబయ్య శిష్యుడు డాక్టర్ బండి శ్రీను గురువు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆచార్య సాంబయ్యతో తనకు పాతికేళ్ల అనుబంధం ఉందని, తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనలోనే తండ్రిని చూసుకుంటున్నానని,ఆయన పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసిన తాను ఇలా రుణం తీర్చుకున్నానని వెల్లడించారు. (చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా: నలుగురు మృతి) -
రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ లేఖ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఏడాదిన్నరగా రెగ్యులర్ వైస్ చాన్స్లర్లు(వీసీ) లేరని, వెంటనే వీరి నియామకానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాసినట్లు తెలిసింది. ఇటీవల వీసీలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా వీసీలను నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 నాటికే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే ఏడాది జూలైలో ఈ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, 984 దరఖాస్తులు వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నియామకాల్లో జాప్యంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సెర్చ్ కమిటీల సమావేశాలు త్వరగా నిర్వహించాలని, వీసీల నియామకాలూ వేగంగా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
డిస్టర్బ్ చేశావు, ఎలా నిద్రపోనిస్తాను?
సాక్షి, అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస్‌కుమార్‌పై ఓ ఉద్యోగి బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను మాజీ వీసీ శ్రీనివాస్‌కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. జేఎన్టూయూ అనంతపురం సూపరింటెండెంట్ ఎం.డీ నాగభూషణం తనను వాట్సాప్ మేసేజ్‌ల ద్వారా బెదిరిస్తున్నారని చెప్పారు. ‘మీ జాతకంలో ఏమైనా గండాలు ఉన్నాయా? ఉంటే చూసుకోండి... నీకు.. నాకు వ్యక్తిగత కక్షలు లేవు.. మరి ఎందుకు నన్ను బదిలీ చేశారు? నేను అక్కడికి రావాలా.. వద్దా....? ఆన్సర్ చెప్పండి సార్.. మౌనంగా ఉంటే ఎలా? నిన్ను ఎలా నిద్రపోనిస్తాను?' అంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ అనంతపురం నుంచి ఇటీవల సూపరింటెండెంట్ నాగభూషణంను కలికిరికి బదిలీ చేశారన్నారు. జేఎన్టీయూ అనంతపురం నుంచి కలికిరి బదిలీకి తానే కారణమన్నట్లు తనను బెదిరిస్తున్నారని చెప్పారు. అతని బదిలీ జరిగిన కొద్ది రోజులకే అంటే గతేడాది డిసెంబర్ 8న వీసీ పదవీ విరమణ పొందానన్నారు. వీసీ పదవిలో లేననే ఉద్దేశంతో సదరు సూపరింటెండెంట్ వార్నింగ్‌లు ఇస్తున్నాడన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతుంటే ఉన్న ఉద్యోగం చేసుకోలేక మాజీ అధికారికి సూపరింటెండెంట్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. (చదవండి: వాట్సాప్‌లో పెళ్లి పిలుపు, ఫేస్బుక్లో లైవ్) -
నియామకాల వివాదం : వర్సిటీ వీసీపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వర్సిటీ నియామకాల్లో వివాదానికి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ యోగేష్ త్యాగిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులపై సస్సెండ్ చేసినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. యూనివర్సిటీ నియామకాలకు సంబంధించి వివాదంపై వీసీపై దర్యాప్తునకు అనుమతించాలని గతవారం విద్యామంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై మంత్రిత్వ శాఖ ఆరోపణల నేపథ్యంలో వీసీపై విచారణకు రాష్ట్రపతి మంగళవారం రాత్రి ఆమోదం తెలిపారు. పదవిలో ఉండగా విచారణను ప్రభావితం చేస్తారని పేర్కొంటూ విచారణ ముగిసే వరకూ వీసీని సస్సెండ్ చేస్తున్నట్టు విద్యామంత్రిత్వ శాఖ వర్సిటీ రిజిస్ర్టార్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ప్రొఫెసర్ పీసీ జోషీ వీసీగా బాధ్యతలు చేపడతారని తెలిపింది. కాగా ఆరోగ్య సమస్యలతో ఈ ఏడాది జులైలో వీసీ యోగేష్ త్యాగి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సెలవులో ఉన్నారు. త్యాగి తిరిగి విధుల్లో చేరేవరకూ ప్రొఫెసర్ పీసీ జోషీని ఇన్చార్జ్గా జులై 17న ప్రభుత్వం నియమించింది. ఇక గతవారం జోషీని ప్రో వీసీగా తొలగించి ఆయన స్ధానంలో గీతా భట్‌ను త్యాగి నియమించడంతో వివాదం నెలకొంది. మరోవైపు ప్రొఫెసర్ జోషి ఇటీవల నూతన రిజిస్ర్టార్‌గా వికాస్ గుప్తాను నియమించగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించింది. అయితే అదే రోజు తాత్కాలిక రిజిస్ర్టార్‌గా పీసీ ఝాను నియమిస్తూ త్యాగి ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ, ప్రో వీసీల మధ్య అధికార వివాదంలో విద్యా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని త్యాగి సెలవులో ఉన్నందున ఆయన చేపట్టిన నియామకాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. చదవండి : గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు -
అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్
అనంతపురం : తమ కళాశాలకు అనుమతి ఇవ్వకుంటే అంతుచూస్తామని అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విద్యా ప్రమాణాల దృష్ట్యా ఇంజినీరింగ్ కళాశాలల్లో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు జిల్లాల్లోని 63 ఇంజినీరింగ్ కాలేజీల అనుమతులు ప్రశ్నార్ధకంగా మారాయి. దీంతో తమ కాలేజీలకు అనుమతులు దక్కవేమోనని కొందరు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బెదిరింపులు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. -
'కేఎల్ యూనివర్సిటీ ఆ హోదాను కోల్పోలేదు'
సాక్షి, విజయవాడ : కేఎల్ యూనివర్సిటీ.. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కోల్పోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రచారంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. '40 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యా రంగంలో కేఎల్ యూనివర్సిటీ కనబరుస్తున్న ప్రతిభ వల్ల మా విద్యా సంస్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను పొందింది. యూజీసీ, ఎంహెచ్ఆర్డీ నిబంధనలకు అనుగుణంగానే మా యూనివర్సిటీలో ప్రవేశాలు, విద్యా బోధన, పరిశోధనలు జరుగుతాయి' అని వీసీ వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి: కీలక బిల్లులపై హైకోర్టులో విచారణ వాయిదా -
మాజీ వైస్ ఛాన్సలర్‌పై సీబీఐ కేసు నమోదు
సాక్షి, ఢిల్లీ : విశ్వభారతి విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ సుశాంత దత్తాగుప్తాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. పదవీకాలంలో ఆర్థిక అవకతవలకు పాల్పడ్డారన్న కారణంగా వీసీ సుశాంత దత్తాగుప్తాను 2016లో తొలిగించారు. కేంద్ర విశ్వవిద్యాలయ వీసీనీ పదవినుంచి తొలిగించడం ఇదే మొదటి సంఘటన. గుప్తాను తొలిగించాలని కోరుతూ సిఫారసు చేయడంలో ఎలాంటి చట్ట విరుద్ధం లేదని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించారు. కాగా విశ్వభారతి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించే సమయంలో జీతం డబ్బులతో సహా పెన్షన్ వేతనాన్ని అందుకున్నాడు. కేంద్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఓ ప్రైవేటు సంస్థకు అక్రమంగా నిధులు సమకూర్చేవాడు. గతంలోనూ యూనివర్సిటీ నియామకాల్లో తన వర్గానికి చెందిన కొందరిని నియమించాడనే అభియోగాలు గుప్పుమన్నాయి. దత్తాగుప్తా ఆర్థిక అవకతవలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దుత్తాను దోషిగా తేల్చుతూ కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదికను అందజేసింది. -
క్షమాపణలు కోరిన విశ్వభారతి వర్సిటీ వీసీ
కోల్‌కతా : శాంతినికేతన్ (విశ్వభారతి) యూనివర్సిటీలో రవీంద్రనాథ్ ఠాగూర్ బయటివ్యక్తి (అవుట్ సైడర్ ) అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కతీసుకుంటున్నట్లు వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ బిద్యూత్ చక్రవర్తి ప్రకటించారు. తన వ్యాఖ్యలు ఇతరుల మరోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నా అని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం బోల్పూర్ నుంచి ఇన్స్టిట్యూట్కు వచ్చారని, ఆయన కూడా అవుట్‌సైడరే అంటూ వీసి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సహ అధ్యాపకులు, విద్యార్థుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఠాగూర్ స్థాపించిన సంస్థకి ఆయనే బయటివ్యక్తి ఎలా అయ్యారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదని, తాను కేవంలం చారిత్రక, భౌగోళిక వాస్తవాలనే ప్రస్తావించానని వైస్ చాన్సలర్ వివరణ ఇచ్చారు. (జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ) అయితే తన వ్యాఖ్యలు ఇతరుల మనోభావాలను దెబ్బతీసినందున క్షమాపణలు కోరుతున్నా అంటూ పేర్కొన్నారు. ఇక 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతికేతన్ ఇన్స్టిట్యూట్ 1951లో కేంద్ర విశ్వవిద్యాలయంగా మారింది. ఇక ఇన్స్టిట్యూట్ సమీపాన ఉన్న పౌష్ మేళా మైదానంలో జరిగిన హింసాకాండపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోరుకుంటున్నామని చక్రవర్తి అన్నారు. ఈ దాడి వెనక టీఎంసీ నాయకులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేవారు. ఆగస్టు 17న ఇన్స్టిట్యూట్లోని ఓ గేటును కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే తాను బీజేపీ పక్షం ఉన్నానని, కావాలనే లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నానన్న ఆరోపణలను వీసీ చక్రవర్తి కొట్టిపారేశారు. ఒకవేళ అది నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. (మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్) -
అది దేశ విద్యా విధానం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కేవలం ప్రభుత్వ విధానం కాదని.. అది మొత్తంగా భారత దేశ విద్యా విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం కూడా దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో సాధ్యమైనంతగా మార్పుచేర్పులకు వీలు కల్పించాలని, ఈ విద్యా విధానానికి సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ‘రోల్ ఆఫ్ ఎన్ఈపీ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్’అనే అంశంపై సోమవారం జరిగిన గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ విద్యా విధానంపై సంబంధిత వర్గాలకు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉండటం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘విద్యా విధానంలో భాగమైన ప్రతీ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తాం. ప్రశ్నలకు జవాబిస్తాం. అనుమానాలను నివృత్తి చేస్తాం’అని స్పష్టం చేశారు. చాలా ప్రశ్నలు ఎన్ఈపీ అమలుకు సంబంధించే ఉన్నాయన్నారు. దేశ విద్యా విధానం ఆ దేశ ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని అభివర్ణించారు. ఈ విద్యా విధానాన్ని రూపొందించిన తీరు తరహాగానే.. అమలులోనూ సాధ్యమైనంత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని సూచించారు. సదస్సులో రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు, వర్సిటీల వైస్ చాన్సెలర్లు పాల్గొన్నారు. ఎన్ఈపీ–2020పై సెప్టెంబర్ 25 లోపు యూనివర్సిటీల్లో వర్చువల్ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. నూతన విద్యా విధానాన్ని పాఠశాల ఉపాధ్యాయుల నుంచి, ప్రఖ్యాత విద్యావేత్తల వరకు అంతా స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. అకడమిక్, వొకేషనల్, టెక్నికల్ సహా అన్ని అంశాలను, అలాగే, పాలనాపరమైన అనవసర జాప్యాలను నివారించే చర్యలను కూడా నూతన ఎన్ఈపీలో సమగ్రంగా పొందుపర్చారన్నారు. కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు దశలవారీగా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలనే ఆలోచన వెనుక.. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలి, సమర్థ్ధతకు పట్టం కట్టాలనే ఉద్దేశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. ‘ఈ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’అన్నారు. చదవడం కన్నా నేర్చుకోవడంపై, విశ్లేషణాత్మక ఆలోచనాధోరణిని పెంపొందించుకోవడంపై ఈ నూతన విద్యా విధానంలో ప్రధానంగా దృష్టి పెట్టారన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పుస్తకాలు, సిలబస్, పరీక్షల ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు ఈ విధానంలో ఉన్నాయన్నారు. చిన్న క్లాసుల నుంచే వృత్తి విద్యకు, శిక్షణకు ప్రాధాన్యతనిచ్చి, వారిని దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధ్దం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. ‘స్వావలంబ భారత్’లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఈ నూతన ఎన్ఈపీ రూపొందిందన్నారు. గతంలో విద్యార్థులు తమకు ఆసక్తి లేని అంశాలను బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చేదని, నూతన విద్యా విధానంలో ఆ సమస్యకు పరిష్కారం చూపామని వివరించారు. 21వ శతాబ్దపు నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా భారత్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన విద్యా విధాన స్థూల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా జోక్యం చేసుకోలేదన్నారు. విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు ఈ విధానంలో సముచిత ప్రాధాన్యతనిచ్చారన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలు భారత్‌లో తమ కేంద్రాలను ప్రారంభించేలా నూతన విధానంలో అవకాశం కల్పించామన్నారు. దీనివల్ల మేధో వలస సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ‘పరిశోధన’కు నిధులు పెంచాలి పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ నిధులను భారీగా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే...భారత్ ఈ రంగంలో అతి తక్కువ నిధులను కేటాయిస్తోందన్నారు. పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టడం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమన్నారు. నూతన విద్యా విధానంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్’కు జీడీపీలో అమెరికా 2.8%, దక్షిణ కొరియా 4.2%, ఇజ్రాయెల్ 4.3% నిధులను కేటాయిస్తుండగా, భారత్ మాత్రం జీడీపీలో 0.7% నిధులను మాత్రమే కేటాయిస్తోందన్నారు. -
వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయండి
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల వైస్చాన్స్లర్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వచ్చేనెల 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ప్రగతిభవన్‌లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల ఏర్పాటు పూర్తయిందని, ఎంపిక కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు కరోనా కారణంగా వీసీల నియామకంలో జాప్యం జరిగినందున.. ఇకపై ఆలస్యం చేయొద్దని సూచించారు. వీసీల నియామక ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రజోపయోగ కార్యక్రమాలపై చర్చ..: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, రేగా కాంతా రావు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, చల్లా ధర్మారెడ్డి, గణేశ్ గుప్తా, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ వర్సిటీ వీసీ పీఠం ఎవరికో?
సాక్షి, యూనివర్సిటీ: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ పోస్టుకు ముగ్గురు అధ్యాపకుల ఎంపిక కోసం శుక్రవారం సెర్చ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సెర్చ్ కమిటీలో తమిళనాడు అగ్రికల్చర్ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎన్.కుమార్, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్, ఏపీ ప్రభుత్వ ఛీప్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 2న సెర్చ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సమావేశం రద్దు చేశారు. తిరిగి ఈ నెల 10న సమావేశం కానున్నారు. ఆన్లైన్ ద్వారా ఈ సమావేశం నిర్వహించి ముగ్గురు అధ్యాపకుల పేర్లను వీసీ పోస్టు కోసం సిఫార్సు చేయనున్నా రు. ఇక్కడ వీసీగా పనిచేసిన దామోదర నాయు డు పదవీ కాలం జూన్ 5తో ముగిసింది. ప్రస్తుతం మార్కెంటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తాత్కాలిక వీసీగా పనిచేస్తున్నారు. ఆది నుంచి అన్యాయమేనా? ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. 50 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో రాజేంద్రనగర్‌లో వర్సిటీ ఉండగా, రాష్ట్రం విడిపోయాక గుంటూరులో ఏర్పాటు చేశారు. నూతన వర్సిటీ ఏర్పాటు సమయంలో తిరుపతిలో వర్సిటీ ప్రధాన కార్యా లయం ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపించాయి. తిరుపతిలో వర్సిటీ ఏర్పాటుకు అన్ని హంగులు, వసతులు, పరిశోధన సౌకర్యాలు ఉన్నా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయలేదు. తిరుపతిలోని పలు పరిశోధన ప్రాజెక్ట్‌లను గుంటూరుకు తరలించారు. 2017 నుంచి 2020 జూన్ వరకు వీసీగా పనిచేసిన దామోదరనాయుడు కూడా తన హయాంలో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. పలు పరిశోధన ప్రాజెక్ట్‌లను గుంటూరు, ఇతర ప్రాంతాలకు తరలించారు. రాయలసీమ జిల్లాల్లో అధ్యాపకులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. గత 13 ఏళ్లుగా ఈ యూనివర్సిటీకి వీసీలుగా ఈ ప్రాంతం వారు లేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన రాఘవరెడ్డిని వీసీగా నియమించారు. ఆ తర్వాత సీమ జిల్లాలకు ఆ పదవి దక్కలేదు. ఫిబ్రవరిలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు స్పందించి 26 మంది అధ్యాపకులు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారికి వీసీ పదవి ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల భర్తీ అయిన వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ పోస్టు కూడా గుంటూరు ప్రాంతానికి చెందిన అధ్యాపకుడికి ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. హార్టీకల్చర్ వర్సిటీ వీసీ పదవికి సెర్చ్ ప్రతిపాదించిన ప్యానల్లో సీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు అధ్యాపకులు ఉన్నప్పటికీ పదవి దక్కలేదని ప్రచారం జరుగుతోంది. వ్యవసాయ వర్సిటీ వీసీ పదవి ఈ సారైనా రాయలసీమ జిల్లాలకు దక్కుతుందో లేదో వేచి చూడాలి. -
'సిలబస్‌ను ఆన్లైన్లో పూర్తి చేయండి'
సాక్షి, అమరావతి : కరోనాతో లాక్డౌన్ కారణంగా సిలబస్ పూర్తి కాకపోవటం, పరీక్షలు నిర్వహించలేకపోవటం తదితర అంశాలపై అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ లతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు పూర్తికాని సిలబస్‌ను ఆన్లైన్ ద్వారా భోదన చేపట్టి పూర్తి చేయాలని పేర్కొన్నారు. దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రస్తుతం విద్యార్థులకు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తికాని సెమిస్టర్లు ఆన్లైన్ ద్వారా పూర్తి చేయాలని, అవసరమైతే పరీక్షలు కూడా ఆన్లైన్లో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 2020-21 విద్యా సంవత్సరంలో పనిదినాలు కోసం పండుగలు ఇతర సెలవుదినాలు కూడా పరిశీలించి మొత్తం పనిదినాలు 220కు తగ్గకుండా చూసుకోవాలన్నారు.క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగిస్తున్న హాస్టల్, ఇతర విద్యాశాఖ భవనాలు తిరిగి వినియోగించుకునే ముందు సంబంధిత జిల్లా వైద్యశాఖ అధికారులతో యూటిలైజేషన్ సర్టిఫికెట్ పొందాలన్నారు. వాటిని పూర్తి స్థాయి లో శుభ్రపరిచిన తరువాతే భవనాలు వాడుకునేలా చూడాలన్నారు. అన్ని అసోసియేషన్, అనుబంధ కళాశాలల్లో నిబంధనలకు లోబడి ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నత విద్యా సంస్కరణలపై జీవో 63 అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. 2020-21 విద్యాసంవత్సరం లో ఇతర దేశాలకు వెళ్లలేని విద్యార్థులు ఇక్కడ కళాశాలల్లో చేరేందుకు అవకాశాలు కోసం చూస్తారన్నారు. దీని వల్ల కోర్సులు, సీట్ల కొరత రాకుండా చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జేఎన్ఏఎఫ్ఏయూ ఇన్చార్జి వీసీగా చిత్రా రామచంద్రన్
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా (వీసీ) విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల కిందటే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు నియమించలేదు. ఎట్టకేలకు ఆ వర్సిటీకి కూడా ఇన్చార్జి వీసీని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘వర్సిటీ’లో ఇష్టారాజ్యం..?
సాక్షి, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్) : శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్(వీసీ) లేక ఐదేళ్లు అవుతోంది. అప్పటి నుంచీ ఇన్చార్జిల పాలనే కొనసాగుతోంది. ఇతర బాధ్యతల్లో నిమగ్నమై ఉండడం, వర్సిటీకి చుట్టం చూపులాగే వచ్చిపోతుండడంతో పత్యక్ష పర్యవేక్షణ కొరవడింది. దీంతో కిందిస్థాయి అధికారులు వివిధ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఏళ్ల తరబడిగా వస్తున్నాయి. అయినా పట్టించుకోకుండా యూనివర్సిటీకి ఇన్చారి్జలనే కేటాయిస్తున్నారు. ఇన్చార్జిల పాలన కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ పనిచేసిన రిజిస్ట్రార్లు అధ్యాపక, అధ్యాపకేతర నియమాకాల్లో, అభివృద్ధి పనుల్లో, రిజిస్ట్రార్‌గా కొనసాగడం వంటివి నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు వివిధ అంశాలకు సంబందించి శాతవాహన అధ్యాపకుల సంఘం ప్రతినిధులు, లోక్‌సత్తా పార్టీతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు వేర్వేరుగా గవర్నర్, ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ కొనసాగుతోంది. యూనివర్సిటీలో ఏ పని జరిగినా వీసీకి తెలియకుండా జరగదని, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నింటిలో ఇన్చార్జి వీసీల పాత్ర ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలు ఇన్చార్జి వీసీలకు తెలిసి జరిగినా, తెలియక జరిగినా ఆరోపణల అపవాదును మాత్రం మూటగట్టుకుంటన్నారని విద్యారంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్‌పై వివిధ ఆరోపణలు రావడంతో రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ టి.భరత్‌ను నియమించారు. ఆ తర్వాత ఉన్నతా విద్యామండలి ప్రత్యేక కమిటీతో ఉమేష్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై ఇద్దరితో కూడిన కమిటీతో విచారణ జరిపిస్తోంది. కమిటీ నివేదిక రాగానే సంబంధిత చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. కమిటీ నివేదిక ఏం వస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. పట్టించుకోని ఇన్చార్జిలు... శాతవాహన యూనివర్సిటీ 2015 నుంచి ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతుండడంతో వివిధ వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇన్చార్జి వీసీలు మరో ముఖ్యమైన బాధ్యతల్లో ఉండడంతో దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదని, దీంతో ఇక్కడున్న రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యాపక, విద్యార్థి సంఘాలు బలంగా ఆరోపిస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీలో ఐదేళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగుతోంది. 19 ఏప్రిల్ 2012 నుంచి రెగ్యులర్ వీసీగా కె.వీరారెడ్డి బాధ్యతలు చేపట్టి 18 ఏప్రిల్ 2015 వరకు రెగ్యులర్ వీసీగా పనిచేశారు. ఆ తర్వాత ఆగస్టు 2015 వరకు ఇన్చార్జిగా విధులు నిర్వర్తించారు. 13 ఆగస్టు 2015న ప్రస్తుత విద్యాశాఖ కార్యదర్శి, అప్పుటి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి బి.జనార్దన్‌రెడ్డి ఇన్చారి్జగానే నియమించబడ్డారు. కానీ ఆయన మున్సిపల్ శాఖ బాధ్యతల్లోనే బిజీగా ఉండడం, యూనివర్సిటీకి తగిన సమయం కేటాయించలేదు. ఆయన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) కమిషనర్ టి.చిరంజీవులును 30 ఆగస్టు 2017న నియమించింది. ఎప్పుడో ఒకసారి వస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికి ప్రతీ పనికి వర్సిటీ అధికారులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్చార్జిలు.. శాతవాహనలో గత కొన్నేళ్లుగా ఇన్చార్జి పాలన కొనసాగడంతో యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని వివిధ వర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని యూనివర్సిటీ వ్యాప్తంగా చర్చ జరగడం, రాజకీయ పార్టీల నాయకులు స్వయంగా హైదరాబాద్‌లో దీనిపై సమావేశాలు ఏర్పాటు చేసి మరీ శాతవాహన అక్రమాల గురించి ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. ఆ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారులకు సైతం పాత్ర ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం టి.చిరంజీవులు ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. ఇన్ని రోజులు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఉమేష్‌కుమార్‌పై నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారని, పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలకు తెరతీశాడని, ఇష్టారాజ్యంగా అంతర్గత బదిలీలు చేశారని శాతవాహన అధ్యాపకుల సంఘం, లోక్‌సత్తా పార్టీ, వివిధ విద్యార్థి సంఘాలు గవర్నర్, ఉన్నత విద్యామండలికి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఈ నెల 18న శాతవాహనలో కేయూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విశ్రాంత రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ జగన్నాథస్వామి, ప్రొఫెసర్ వెంకటయ్యలతో కూడిన కమిటీ ద్వారా విచారణ జరిపించారు. దీనికి సంబంధించిన నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందనున్నట్లు తెలిసింది. కానీ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులుకు తెలియకుండా ఒక్క పనికూడా చేయలేదని, పై అధికారి సూచనలతోనే శాతవాహనలో పనులు చేశానని ఉమేష్‌కుమార్ తెలిపారు. ఒకవేళ ఉమేష్‌కుమార్ అక్రమాలు చేశారని తేలితే దానిలో ఇన్చార్జి వీసీ చిరంజీవులుకు కూడా పాత్ర ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల వివిధ అక్రమాలకు తావివ్వడం సహజమేనని ఇన్చార్జి వీసీకి తెలిసి జరిగినా, తెలియకుండా జరిగినా సంబంధిత అపవాదులను మూటగట్టుకోవడం తప్పదని, రెగ్యులర్ వీసీ ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని విద్యారంగనిపుణులు విశ్లేషిస్తున్నారు. -
'వీసీల నిమామక ప్రక్రియ వేగవంతం చేయండి'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.దీనివల్ల వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు.రాబోయే రెండు-మూడు రోజుల్లోనే ఇదంతా జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. -
జేఎన్‌యూ వీసీ జగదీష్ కుమార్‌కు హెచ్ఆర్డీ సమన్లు
-
జేఎన్‌యూ విద్యార్థుల ర్యాలీలు భగ్నం
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో నాలుగు రోజుల క్రితం విద్యార్థుల దాడి నేపథ్యంలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్‌కుమార్‌ను తొలగించాలంటూ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ర్యాలీలను పోలీసులు భగ్నం చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్చార్డీ)భవనం వైపు గురువారం ఉదయం విద్యార్థులతోపాటు సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, సమస్యలపై చర్చించేందుకు హెచ్చార్డీ అధికారులు కొందరు విద్యార్థి నేతలతో భేటీకి అంగీకరించారు. వీసీ తొలగింపునకు మాత్రం అధికారులు అంగీకరించలేదు. ఫీజుల పెంపు సహా ఇతర సమస్యలపై ఈనెల 10వ తేదీన వీసీతో కలిపి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వీసీ వైదొలగాలన్న డిమాండ్ నెరవేరేదాకా నిరసన ఆపేది లేదని జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వైపు కొందరు విద్యార్థులు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ సందర్భంగా 11 మందిని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా, హెచ్చార్డీ నిర్ణయించిన మేర ఫీజుల పెంపుపై వెనక్కితగ్గేది లేదని జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్ తెలిపారు. -
జేఎన్‌యూ వీసీ వెంటనే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస నేపథ్యంలో వర్సిటీ అధికారిక విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) వీసీని టార్గెట్ చేసింది. క్యాంపస్‌లో జరిగిన దాడులకు జేఎన్‌యూ వీసీ జగదేశ్‌కుమార్ కారణమని నిందించింది. వీసీ ఒక మాబ్‌స్టెర్‌గా వ్యవహరిస్తూ యూనివర్సిటీలో హింసను ప్రేరేపిస్తున్నాడని, తన బాసులను సంతృప్తి పరిచేందుకే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 20మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఏబీవీపీ విద్యార్థులే కారణమని వామపక్ష విద్యార్థి సంఘాలతో కూడిన జేఎన్‌యూఎస్‌యూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో హింసకు వీసీ జగదేశ్ కారణమని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్ గూండాలు తమపై దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
అలహాబాద్ వర్సిటీ వీసీ రాజీనామాకు ఆమోదం
న్యూఢిల్లీ: అలహాబాద్ వర్సిటీ వీసీ రతన్ లాల్ హంగ్లూ రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్చార్డీ) వెల్లడించింది. అనేక అవక తవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని రాష్ట్రపతి ఆదేశించారని పేర్కొంది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్చార్డీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి వర్సిటీ వీసీగా ఉన్న సమయంలోనూ హంగ్లూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. -
అలహాబాద్ యూనివర్సిటీ వీసీ రాజీనామా
లక్నో: అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ రతన్ లాల్ హంగ్లూ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి, లైంగిక వేధింపుల ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదనే ఆరోపణల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆయన.. తీవ్ర పని ఒత్తిడి కారణంగానే తాను వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 'నేను రాజీనామా చేసిన విషయం వాస్తవమే. నాకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలు, ఫిర్యాదుల్లో నిజంలేదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. నిరాధారమైన ఆరోపణలతో.. అకారణంగా తరచూ విచారణలు చేపడుతుండడంతో విసుగుచెంది రాజీనామా చేస్తున్నాను' అని హంగ్లూ పేర్కొన్నారు. ఇతరుల ప్రలోభాలకు లోనుకాకుండా, ఒత్తిడిని తట్టుకుంటూ నిజాయితీగా తన విధులు నిర్వర్తించానని హంగ్లూ ఈ సందర్బంగా తెలిపారు. అయితే హంగ్లూ పనితీరును తప్పుబడుతూ గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. అలహాబాదు విశ్వవిద్యాలయంలో 2016 నుంచి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు చుట్టుముట్టడంతో హంగ్లూ పనితీరుపై నిఘా పెరిగింది. ఈ క్రమంలోనే.. యూనివర్సిటీ విద్యార్థినులు ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదంటూ గతవారం జాతీయ మహిళా కమిషన్ అతనికి వ్యతిరేకంగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే.. 'తనపై వచ్చిన ఆరోపణలను సీబీఐ ఎదుట నిరూపించండి. ఆ తర్వాత హైకోర్టులో తేల్చండి' అంటూ హంగ్లూ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కాలేజీలో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసేవారిని మాఫీయాగా అభివర్ణించడంతో ఆయన వైఖరిని తప్పుబడుతున్నారు. యూనివర్సిటీలో 1,200 మంది నియామకాలు జరగాలి. నేను అక్కడ ఉంటే, ఇతరులు సిఫార్సులు, అభ్యర్థనలు స్వీకరించను. కేవలం అభ్యర్థి మెరిట్ ప్రాతిపదికన మాత్రమే వెళ్తానని, మాఫియా నుంచి ఆర్డర్లు ఎంతమాత్రం తీసుకోనని ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి కాబట్టే రాష్ట్రపతి కార్యాలయం రెండు సార్లు ఫైల్‌ను వెనక్కిపంపిందని హాంగ్లూ అన్నారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి చట్టపరమైన సహాయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయమై డిసెంబరు 26న జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరై, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కాగా ప్రొఫెసర్ హంగ్లూ 2015 నుంచి అలహాబాద్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నియమితులైనారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి యూనివర్సిటీలో వీసీగా విధులు నిర్వర్తించారు. -
గదుల్లోకి చొరబడి మరీ కొట్టారు..
సాక్షి, న్యూడిల్లీ: వివాదాస్సద పౌరసత్వ సవరణకు బిల్లు వ్యతిరేక ఆందోళనతో ఢిల్లీ నగరం అట్టుడుకుతోంది. ముఖ్యంగా జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన హింసాత్మక ఘటనలకు దారి తీసింది. దీనిపై యూనివర్శిటీ వైస్ చాన్సలర్ నజ్మా అక్తర్ స్పందిస్తూ, విద్యార్థులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండించారు. ఈ కష్ట సమయంలో విద్యార్థులకు తమ సంపూర్ణ మద్దతు వుంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా పొలీసులు జెఎంఐలోకి ప్రవేశించారనీ, విద్యార్థుల తరగతి గదుల్లో చొరబడి మరీ వెంబడించి కొట్టారని ఆరోపించారు. లైబ్రరీలో చదువుకుంటున్న అమాయకులపై దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. ఈ అనాగరిక ఘటనపై తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ట్విటర్లో వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నానని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ కష్టసమయంలో మీరు ఒంటరిగా లేరని జామియా మొత్తం మద్దతు విద్యార్తులకు ఉంటుందని హామీ ఇచ్చారు. మీరు ఎప్పటికీ ఒంటరికాదు.. నిరుత్సాహపడకండి.. పుకార్లను నమ్మొద్దు అంటూ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇదిలావుండగా, నిరసనల సందర్భంగా నిన్న అదుపులోకి తీసుకున్న 50 మంది విద్యార్థులను సోమవారం తెల్లవారుజామున విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. Jamia Millia Islamia V-C records a message for her students. Stands in solidarity with them and says she will flag the issue of cops forcing their way into the university with authorities at the highest level. pic.twitter.com/40ElYmJM1u — Ritika Chopra (@KhurafatiChopra) December 16, 2019 ఢిల్లీ విద్యార్థులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు), కోల్‌కతా జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, ఐఐటీ ముంబై విద్యార్థులు నిరసన తెలిపారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఆదివారం నిర్వహించిన వ్యతిరేకంగా ప్రదర్శన సందర్భంగా, నాలుగు బస్సులు, రెండు పోలీసు వాహనాలను తగలబెట్టినట్టు తెలుస్తోంది. ఆందోళనకారులు పోలీసులు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహా దాదాపు 60 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు)లో ఘర్షణ చెలరేగింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. టియర్గాస్ షెల్స్‌ను ఉపయోగించి, కాల్పులు జరిపారు. యూనివర్శిటీ బాత్రూంలో గాయపడిన విద్యార్థులు, తీవ్ర రక్తస్రావంతో పడివున్న విద్యార్థుల ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఢిల్లీ పోలీసులు బలవంతంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యార్థులను కొట్టారని యూనివర్శిటీ చీఫ్ ప్రొక్టర్ వసీమ్ అహ్మద్ ఖాన్ ఆదివారం ఆరోపించారు. Look at the non-violence, bravery, and professionalism of delhi police against the “alleged” law breakers!! https://t.co/6YeKMjqhva — Prashant Kishor (@PrashantKishor) December 16, 2019 -
ఓయూ మాజీ వీసీ రామకిష్టయ్య కన్నుమూత
సాక్షి, నల్లకుంట: ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ (వీసీ), ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెదుల్ల రామకిష్టయ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కన్ను మూశారు. దీంతో నల్లకుంట విజ్ఞానపురి కాలనీలోని ఆయన నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయనకు నరేందర్, శేఖర్, రమణ, మధు నలుగురు కుమారులతో పాటు ఓ కుమార్తె సుజాత ఉన్నారు. సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో రామకిష్టయ్య పార్థివ దేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. బంధు మిత్రుల అశ్రు నయనాల నడుమ ఆయన పెద్ద కుమారుడు నరేందర్ రామకిష్టయ్య చితికి నిప్పంటించారు. నల్లగొండ జిల్లా మునుగోడులో 1932 అక్టోబర్‌లో జన్మించిన రామకిష్టయ్య 1996–99 వరకు ఓయూ వీసీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన భార్య రాధమ్మ కొన్నేళ్ల కిందట పరమపదించారు. రామకిష్టయ్య మృతికి సంతాపం తెలిపిన వారిలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు ఉన్నారు. -
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్ట్
సాక్షి, గుంటూరు: గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ) వల్లభనేని దామోదర్ నాయుడిని ఆదివారం తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన తనను ఉద్యోగం నుంచి తొలగించి, కులం పేరుతో దూషించి, బెదిరింపులకు గురిచేశారని ఉయ్యాల మురళీకృష్ణ గత నెల 24న తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1,2)తోపాటు ఐపీసీ 506 కింద వీసీని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వివరాల్లోకెళ్తే.. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నంకు చెందిన ఉయ్యాల మురళీకృష్ణ 2016లో ఎన్జీ రంగా వర్సిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా చేరాడు. అతడిని ఈ ఏడాది ఏప్రిల్ 12న ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి తనను ఉద్యోగంలో పెట్టుకోవాలని కోరుతూ వచ్చిన మురళీకృష్ణ గత నెల 23న సచివాలయంలో వీసీ, రిజిస్ట్రార్ ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లి తనను ఉద్యోగంలో చేర్చుకోవాల్సిందిగా మరోసారి ప్రాధేయపడ్డాడు. దీంతో ఆగ్రహించిన వీసీ మరోసారి తన దగ్గరకు వస్తే అంతు చూస్తానని బెదిరించడంతోపాటు కులం పేరుతో దూషించాడని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతోనే మురళీకృష్ణతోపాటు అతడి భార్య విజయదుర్గను, తదితరులను కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత ఐదేళ్లూ టీడీపీపై ప్రేమతో ఓ సామాజికవర్గానికి చెందినవారినే వీసీ దామోదర్ నాయుడు ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. ఇతర సామాజికవర్గాలవారు తన చాంబర్ దరిదాపుల్లోకి కూడా రావడానికి వీల్లేదని బాహాటంగానే ప్రకటించారని ఉద్యోగులు చెబుతున్నారు. వీసీ చర్యలతో అకారణంగా నష్టపోయిన ఉద్యోగులు గవర్నర్, సీఎంకు ఫిర్యాదులు చేశారు. ప్రజాప్రతినిధులు, వర్సిటీ అధికారులకు కూడా 400 ఫిర్యాదులు అందాయి. వీసీపై అందిన ఫిర్యాదులను విచారించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నను నియమించింది. కాగా, రెండేళ్ల కిందట ఎస్టీ ఉద్యోగిని కులం పేరుతో దూషించిన ఘటనలోనూ వీసీపై కేసు నమోదవ్వగా టీడీపీ ప్రభుత్వం దీన్ని నీరుగార్చింది. -
వేధింపులపై వారే సీఎంకు లేఖ రాశారు
సాక్షి, రాజానగరం: ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్రపై వచ్చిన లైంగిక వేధింపులపై ప్రాథమిక విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సురేష్‌వర్మ శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. వేధింపులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖను 2017- 19 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురు విద్యార్థినిలకు ఫోన్లు చేస్తే.. సరిగా రెస్పాండ్ కావడం లేదనీ.. అంతేకాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారని తెలిపారు. ఫిర్యాదు చేసిన విద్యార్థినులు యూనివర్సిటీలో ఉన్న సమయంలో తాను వీసీగా లేనని అన్నారు. ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్న విద్యార్థులు ఎవరైనా తెలుగులో ఉత్తరం రాస్తారా..? పైగా విద్యార్థులు రాసిన లేఖలో వారి సంతకాలు కూడా లేవని సందేహం వ్యక్తపరిచారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, ఇందులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో తెలుసుకుని యూనివర్సిటీ తరఫున క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. చదవండి: నన్నయ వర్సిటీలో లైంగిక వేధింపులు -
త్వరలో వర్సిటీలకు వీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్లను నియమించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, జేఎన్టీయూహెచ్, శాతవాహన యూని వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మహత్మాగాంధీ యూనివర్సిటీల్లో ఒక్కో యూనివర్సిటీకి ఒక సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నియమించింది. ఆయా యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్(ఈసీ) నామినీలను, యూజీసీ నామినీలను కమిటీల్లో సభ్యులుగా నియమిం చింది. ఇప్పటికే యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, ఆ దరఖాస్తులను పరిశీలించి ప్రతి వర్సిటీకి ముగ్గురి పేర్లను సిఫారసు చేసేందుకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి వర్సిటీకి కమిటీలు తమ నివేదికలో ఇచ్చే ముగ్గురి పేర్లలో ఒక్కరిని చాన్స్‌లర్ అయిన గవర్నర్.. వీసీలను నియమిస్తారని వెల్లడించింది. ప్రభుత్వ నామినీగా వ్యవహరించే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సెర్చ్ కమిటీల సమావేశాలను నిర్వహిస్తారని ఉత్వర్వుల్లో పేర్కొంది. వీలైనంత త్వరగా సెర్చ్ కమిటీలు సమావేశమై ప్రతి వర్సిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తుల్లో ముగ్గురి పేర్లను సిఫారసు చేయాలని స్పష్టం చేసింది. -
అన్వేషణ మొదలు..
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవికి అర్హులైనవారి కోసం అన్వేషణ మెదలైంది. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించే ప్రక్రియను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రారంభించింది. వీటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉపకులపతి పదవులకు అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రా వర్సిటీకి ప్రస్తుత వీసీగా(అదనపు బాధ్యతలు) వ్యవహరిస్తున్న ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి.. బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే పాలనలో తనదైన ముద్ర వేశారు. రెక్టార్‌గా, రిజిస్ట్రార్‌గా గతంలో పని చేసిన అనుభవంతో స్వల్పకాలంలోనే పలు మార్పులు చేసి వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. రెగ్యులర్ వీసీ పదవికి ఆయన కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతిగా ఇటీవలి వరకు పనిచేసిన ఆచార్య జి.నాగేశ్వరరావు పదవీ కాలం గత నెల 16న ముగిసింది. ఆయన స్థానంలో పూర్తిస్థాయి వీసీని నియమించాల్సి ఉంది. అంతవరకు తాత్కాలిక ఏర్పాటుగా ఏయూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యుడు పి.వి.జి.డి ప్రసాదరెడ్డికి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ మొదలుకావడంతో వర్సిటీలో సందడి నెలకొంది. సెర్చ్ కమిటీ.. వీసీ నియామకానికి ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో సంబంధిత వర్సిటీ నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, గవర్నర్ నామినీ ఒకరు సభ్యులుగా ఉంటారు. అందిన దరఖాస్తులను ఈ కమిటీ వడపోసి అర్హుడైన ఆచార్యుడి పేరును సిఫార్సు చేస్తుంది. ప్రభుత్వం, గవర్నర్ ఆమోదం పొందిన తరువాత ఆ అభ్యర్థిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. సెప్టెంబరు 17తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. అనంతరం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, వడపోత ప్రారంభమవుతుంది. ఇందుకోసం సెర్చ్ కమిటీ పలుమార్లు భేటీ అవుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆమోదం, గవర్నర్ ఆమోదముద్ర పొందడానికి మరో నెల పడుతుంది. మొత్తం మీద డిసెంబర్ నాటికి వీసీల నియామకం పూర్తి అయ్యే అవకాశముంది. ఇతర వర్సిటీలకు ఏయూ ఆచార్యులే.. ఏయూతోపాటు పద్మావతి మహిళావర్సిటీ, ఆదికవి నన్నయ, ఆచార్య నాగార్జున, కృష్ణా, యోగి వేమన వర్సిటీలకు వీసీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏయూ ఆచార్యులు ఏయూతో పాటు ఆచార్య నాగార్జున, కృష్ణా, నన్నయ, పద్మావతి మహిళా వర్సిటీ పోస్టులకు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెసర్‌గా పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారు ఏయూలో అధికంగా ఉన్నారు. వీరంతా వీసీ పదవికి పోటీ పడనున్నారు. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలకు ఏయూ ఆచార్యులే వీసీలుగా ఉన్నారు. కొత్త పదవుల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలువురు ఆ చార్యులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వీసీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసాదరెడ్డి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంది. నెల రోజుల్లోనే ప్రసాదరెడ్డి ముద్ర.. ప్రస్తుతం ఏయూ వీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆచార్య ప్రసాద రెడ్డి నెలరోజుల్లోనే తనదైన ముద్ర వేశారు. గతంలో రిజిస్ట్రార్‌గా, రెక్టార్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఎంతో కలిసి వస్తోంది. తనదైన శైలిలో విద్యార్థుల సంక్షేమమే ప్రధానంగా ఆయన సేవలు అందిస్తున్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ వర్క్స్‌పై ప్రత్యేక కమిటీ వేసి ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నారు. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పరీక్షల రీ వాల్యుయేషన్ సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించారు. వర్సిటీ ఆర్థిక సమస్యల నేపథ్యంలో నూతన వసతిగృహాల నిర్మాణానికి పలువురు దాతలను ఇప్పటికే సమీకరించారు. వర్సిటీ ఆర్థిక పరిస్థితిని బలోపేతంచేస్తూనే..నిధులు దుర్వినియోగం కాకుండా అవసరమైన మేరకే నిధులు ఖర్చుచేస్తున్నారు. నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా పేరున్న ప్రసాదరెడ్డి గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో నాటి వీసీ ఆచార్య బీల సత్యనారాయణతో సమన్వయం చేసుకుంటూ పాలన సాగించారు. వర్సిటీ ఉద్యోగులతో సత్సంబంధాలు ఉండటంతో తనదైన ముద్ర వేశారు. -
‘వెంకయ్య, చంద్రబాబు నా బంధువులు’
సాక్షి, విజయవాడ: ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ వివాదం గవర్నర్ వద్దకు చేరింది. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు మంగళవారం రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. అర్హత లేకుండా అధికారం చెలాయిస్తున్న వైస్ చాన్సిలర్ దామోదర్ నాయుడిని రీకాల్ చేయాలని గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం బాధిత శాస్త్రవేత్తలు మీడియాతో మాట్లాడుతూ.. వీసీ దామోదర్ నాయుడి అంశంలో గవర్నర్ తమ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అర్హతలు లేకున్నా తెలుగుదేశం ప్రభుత్వం దామోదర్ నాయుడిని ఆ పదవిలో కూర్చొబెట్టిందని వారు ఆరోపించారు. కులపత్రం తప్ప వీసీగా బాధ్యతలు నిర్వహించేందుకు అవసరమైన ఏ సర్టిఫికేట్ దామోదర్ నాయుడి దగ్గర లేదన్నారు. కుల అహంకారంతో దామోదర్ నాయుడు ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధిత శాస్త్రవేత్తలు వాపోయారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు మా బంధువలంటూ దామోదర్, ఉద్యోగులను బెదిరించి ఇబ్బంది పెడతున్నాడని వారు మండి పడ్డారు. అనుభవం లేని వ్యక్తికి పగ్గాలు ఇవ్వడం వల్ల విశ్వవిద్యాలయం ర్యాంకింగ్‌లో వెనకబడటమే కాక.. శాస్త్రవేత్తలు, రైతులు కూడా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర్ నాయుడు యూనివర్సిటీ నిధులను యాక్సిక్ బ్యాంకుకు మళ్లించి కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడని ఆరోపించారు. పది రోజుల్లో వీసీపై చర్యలు తీసుకోకపోతే.. ఎన్జీరంగా యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న అన్ని వ్యవసాయ శాలలకు తాళాలు వేసి ఆందోళనకు దిగుతామని బాధిత శాస్త్రవేత్తలు హెచ్చరించారు. -
‘అవుట్సోర్సింగ్ సిబ్బంది పొట్టగొట్టారు’
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వీ సీ ప్రొఫెసర్ సాంబయ్యను అవుట్ సోర్సింగ్ సి బ్బంది అడ్డుకుని నిరసన తెలిపారు. వీసీ మూడే ళ్ల పదవీకాలం బుధవారం ముగిసింది. గురువా రం వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి వెళ్లేందుకు వీసీ సిద్ధమయ్యారు. ఇంతలోనే వీసీ రెసిడెన్స్ వ ద్దకు చేరుకున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది అక్క డే బైటాయించి ధర్నా నిర్వహించారు. జీవో నెంబరు 14 ప్రకారం వేతనాలు పెంచకుండా తమకు తీవ్ర అన్యాయం చేశాడరని ఆరోపించారు. మూడేళ్ల కాలంలో వీసీ ఒక నియంతలా వ్య వహరించారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీ వ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్స్ నుంచి బయటకు వచ్చిన వీసీ సాంబయ్యను చుట్టుముట్టిన అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ పొట్టారని ఆరోపిస్తూ దుర్భాషలాడారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిం చాలని జీవో ఉన్నప్పటికీ తెలంగాణ యూనివర్సిటీలో అమలు చేయకుండా సాంబయ్య తమ కు అన్యాయం చేశారని సిబ్బంది ఆగ్రహం వ్య క్తం చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వా తావరణం ఏర్పడింది. సమాచారం అందుకు న్న డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌కు మార్ క్యాంపస్ కు చేరుకుని అవుట్ సోర్సింగ్ సి బ్బందిని సముదాయించి శాంతింపజేశారు. సాంబయ్యను అక్కడి నుంచి వాహనంలో పం పించి వేశారు. నియంత అధికారి వర్సిటీని వది లి వెళుతున్నారని పేర్కొంటూ అవుట్ సోర్సింగ్ సిబ్బంది బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. -
మారని వైస్ చాన్సలర్ తీరు!
సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ దామోదరనాయుడు అవినీతి, అక్రమాలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఆయన తీరు సరిగా లేదని, మమ్ములను ఇబ్బంది పెడుతున్నారని యూనివర్సిటీ ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ అధికారిగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నను ప్రభుత్వం నియమించింది. ఈయన వర్సిటీ రికార్డులను పరిశీలించి సిబ్బందిని విచారణ చేస్తున్నారు. అయితే వైస్ చాన్సలర్ దామోదర్‌నాయుడు మాత్రం రికార్డులు తారు మారు చేసి, విచారణ అధికారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వర్సిటీలోని సిబ్బంది వీసీని దీర్ఘకాలిక సెలవుపై పంపి సీఐడీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ను ప్రస్తుత వీసీనే నియమించడంతో, వీసీ అక్రమాలకు ఆయన దన్నుగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ను సైతం సస్పెన్షన్ చేసి, రికార్డులు తారు మారు చేయకుండా పారదర్శకంగా విచారణ జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వీసీ మాత్రం తనకు బీజేపీ అగ్రనేతల అండదండలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ విచారణకు హాజరైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విచారణాధికారికి సైతం ఇప్పటికే ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఐఆర్ 27 శాతం సైతం ఉద్యోగులకు అమలు చేయకుండా వీసీ ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఉద్యోగులు యూనివర్సిటీ ఎదుట గత బుధవారం ఆందోళనకు దిగారు. ఉద్యోగోన్నతుల నిరాకరణ 2018లో చేసిన సీఏఎస్ఏ (కాసా) ఉద్యోగోన్నతుల్లో వింత నిబంధనలతో 57 మంది అర్హత ఉన్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతులను వీసీ నిరాకరించారు. అక్రమ బదిలీల వేధింపులపై కోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడటమే కాకుండా ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేసి వేధింపులకు గురిచేశారు. ఆడిట్ అభ్యంతరాలు, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగుల హక్కు అయిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను ఏడాది కాలంగా నిలుపుదల చేశారు. సుమారు 200 మందికి పైగా విచారణ అధికారి, మార్కెటింగ్ కమిషనర్ ఎదుట ప్రత్యక్షంగా రెండు దఫాలుగా హాజరై తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. 500 మందికిపైగా సిబ్బంది, విద్యార్థులు ఈమెల్స్ ద్వారా వీసీపై ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరుగుతున్నప్పటికీ దామోదర్‌నాయుడు వివిధ వ్యక్తుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధిత సిబ్బంది, విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. గత శనివారం 13వ తేదీ సుమారు వంద మందికిపైగా బాధిత సిబ్బంది వీసీ బెదిరింపు దోరణిపై విచారణ అధికారికి రాత పూర్వక ఫిర్యాదు చేశారు. ఉపకులపతిని ప్రభుత్వం దీర్ఘకాలిక సెలవుపై పంపి పూర్తి స్థాయి విచారణ సీఐడీతో పారదర్శకంగా జరిపించాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు. అవినీతి ఆరోపణలు ఇవే.. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ నిలుపుదల చేసి ఇబ్బందుల పాలు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాక్ట్ (టైపిస్టు) నియామక రాత పరీక్షల లీకేజీలో కీలక పాత్ర పోషించారు. ––ఎన్నికల కోడ్‌ను అతిక్రమించి డి.ఎస్.కోటేశ్వరరావును నోడల్ అధికారిగా నియమించారు. వర్సిటీ వాహనాలను కుటుంబ సభ్యులు అడ్డగోలుగా వాడుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ కంట్రోలర్ రవాణా అధికారి అండదండలతో అక్రమాలు, ఆగడాలకు పాల్పడ్డారు. సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. వర్సిటీ నిధులు ప్రైవేటు బ్యాంకుకు బదిలీ చేసి కుమారుడికి క్విడ్ ప్రోకో ద్వారా ఉద్యోగంతో పాటు, ప్రమోషన్ పొందారు. అక్రమ బదిలీలు, వేధింపులు, ఉద్యోగోన్నతుల్లో కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ సీపీ అనుకూల ముద్ర వేసి తాత్కాలిక ఉద్యోగులను తొలగించారు. కాంట్రాక్టు, టైమ్ స్కేల్ లేబర్ న్యాయమైన కోరికలను సైతం నిరాకరించారు. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వీటన్నింటికి సంబంధించి ఆధారాలను విచారణాధికారికి వర్సిటీ ఉద్యోగులు అందించారు. -
‘వైఎస్ జగన్ పిలిచి ఈ అవకాశం ఇచ్చారు’
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్ర యునివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్‌గా పీవీజీడీ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ రెడ్డి వీసీగా బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ భావించినట్లుగా.. ఏయూని దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. యూనివర్సిటీలో స్థానం సంపాదించిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. యూనివర్సిటీలోని విద్య భోదనను సులభతరం చేసేందుకు పాలన విధానాలలో మార్పులు తీసుకొచ్చి, ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అదనపు ఉద్యోగులను నిమమిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, లెక్చరర్లకు ఏ సమస్య ఎదురైనా 24 గంటల్లో పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీని నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం వీసీగా అవకాశం వచ్చి చేజారినందుకు బాధపడ్డానన్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా తనను పిలిచి ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. -
ట్రిపుల్ ఐటీ పై పట్టింపేది?
సాక్షి, నిర్మల్: ఉత్తర తెలంగాణ పేదింటి విద్యార్థుల కలల చదువు.. కల్పతరువు.. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ఐటీ. చదువులమ్మ కొలువుదీరిన చోట 272ఎకరాల విశాల ప్రశాంత వాతావరణంలో ఈ విద్యాక్షేత్రం కొలువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008లో ప్రారంభమైంది. మొత్తం ఏడువేల మంది విద్యార్థుల కలల ప్రపంచమిది. ఎన్నో ఆశలు, ఆశయాలతో వచ్చిన పేదింటి విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరుస్తోంది. అలాంటి రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ) పై రాష్ట్ర సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లుగా ఈ ప్రత్యేక యూనివర్సిటీని ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ పాలనతోనే నెట్టుకొస్తోంది. ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నవారూ అరకొర పర్యవేక్షణే చేపడుతుండటంతో ఇక్కడి క్యాంపస్‌లో ఇష్టారాజ్యం నడుస్తోంది. అవినీతి, అక్రమాలకు నిలయంగా పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ట్రిపుల్‌ఐటీలో తాజాగా కీచక చేష్టలూ వెలుగులోకి రావడం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఏళ్లుగా ఇన్చార్జి పాలన.. పేద పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చాలన్న వైఎస్ఆర్ ఆశయంతో ఏర్పడిందే ట్రిపుల్ఐటీ. తెలంగాణలో ఏకైక ట్రిపుల్ఐటీ బాసర ఆర్జీయూకేటీ. ఉన్న ఒక్క చదువుల క్షేత్రంపై ఏళ్లుగా వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడిచిన ఐదున్నరేళ్లుగా ట్రిపుల్‌ఐటీని ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. శాశ్వత వీసీని నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక విశ్వవిద్యాలయంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీకి రెగ్యులర్ వీసీ ఉండాలన్న డిమాండ్ ఏళ్లుగా వస్తున్నా..కనీసం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇక్కడి క్యాంపస్‌పై శీతకన్ను కొనసాగుతోంది. ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్ వీసీ నియామకంపై చర్చించకపోవడం గమనార్హం. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేశారు. అనంతరం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్‌కు ఇన్చార్జి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. పర్యవేక్షణ కరువై.. ఏడువేల మంది విద్యార్థులు ఉంటున్న బాసర ట్రిపుల్ఐటీకి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్ వీసీని నియమించడం లేదు. ఏళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగుతుండటంతో ఇక్కడి వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఇన్చార్జి వీసీ అశోక్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవల తరచూ వివాదాల్లో ఇంటర్‌బోర్డు కూరుకుపోతుండటంతో ఆయన మరింతగా సంబంధిత శాఖపైనే పూర్తి దృష్టిపెడుతున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఆయన ఇన్చార్జిగా ఉన్న బాసర క్యాంపస్‌పై పడుతోంది. ఎప్పుడన్నా.. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పా ఇన్చార్జి వీసీ క్యాంపస్‌కు రావడం లేదు. ఇక్కడి ఏఓ, రిజిస్ట్రార్ల పరిధిలోనే వర్సిటీ పాలన కొనసాగుతోంది. వైస్ చాన్స్‌లర్ పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు, అధ్యాపకుల్లో కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా కీచక చేష్టలు.. ఉన్నత ఆశయాలతో క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విషనాగుల్లాంటి అధ్యాపకులూ ఇక్కడ ఉన్నారు. పదోతరగతి వరకు బాగా చదువుకుని, ట్రిపుల్‌ఐటీలో ప్రవేశమే లక్ష్యంగా అత్యుత్తమ మార్కులు సాధించి వచ్చిన పేదింటి బిడ్డల జీవితాలతో ఆడుకునేవారు దాపురించారు. తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన క్యాంపస్‌లో కొంతమంది అధ్యాపకుల వికృత చేష్టలకు అద్దం పట్టింది. కెమిస్ట్రీ విభాగాధిపతిగా ఉన్నతస్థానంలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి వరాల చేసిన పని అధ్యాపకవృత్తినే తలదించుకునేలా చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సెల్ఫోన్లో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ మేరకు ఆయనను విధుల నుంచి తొలగించడంతో పాటు కేసులనూ నమోదు చేశారు. ఇక ఇలాంటి కీచక చేష్టలతో పైశాచిక ఆనందం పొందుతున్న వారు మరికొందరు ఉన్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దొరికితేనే దొంగ.. అన్న రీతిలో వీరు చేస్తున్న కథలు బయటపడక పోవడంతో గుట్టుగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలోనూ ఓ అధ్యాపకుడు చేసిన నిర్వాకానికి ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. మొత్తం ఇప్ప టి వరకు ఏడుగురు విద్యార్థులు వివిధ కారణాల తో ఇక్కడి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. అవినీతి, అక్రమాలకూ ఆస్కారం.. ట్రిపుల్ఐటీకి వివిధ సంస్థలు, ప్రభుత్వాల నుంచి వచ్చే ఉత్తమ పురస్కారాలను అందుకుంటున్న ఇన్చార్జి వీసీ ఇక్కడి అక్రమాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల కోసం వచ్చే లాప్‌టాప్‌లు, యూనిఫాంలలో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు ఏళ్లుగా వస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడ మెస్‌లలో లోపాలపైనా విద్యార్థులు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని, అన్ని విభాగాలనూ వారికే దక్కేలా చూస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక అకాడమిక్ పరంగా కూడా ఇన్చార్జి వీసీ ఉండటంతో విభాగాధిపతులపై పర్యవేక్షణ కరువైంది. ఈక్రమంలో రవి వరాల వంటి వారు ఇష్టారాజ్యం ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో భద్రతపైనా భరోసా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదేవిషయంపై సోమవారం క్యాంపస్‌ను తనిఖీ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా.. 2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్ఐటీ లో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువు లు సాధించారు. గ్రామీణ విద్యార్థులకు అ త్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్‌లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పేదింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్ఐటీపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టా ల్సిన అవసరం ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇక ముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇందు కోసం అత్యుత్తమ రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్‌ను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ కోరుతున్నారు. -
కొత్త వీసీ వచ్చేనా?
సాక్షి, భైంసా(నిర్మల్) : రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్‌చాన్స్‌లర్)లను నియమించేందుకు విద్యా శాఖ కసరత్తు ఆరంభించింది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి రెగ్యూలర్ వీసీ నియమిస్తారని ఇక్కడ చదివే విద్యార్థులు ఆశిస్తున్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ పదవీకాలం గతనెలలో ముగిసింది. మరో ఏడు యూనివర్సిటీల్లోనూ వీసీల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త వీసీ ల నియామకంపై విద్యాశాఖ కసరత్తు ఆరంభించి ప్రభు త్వం ముందుంచింది. శాతవాహన యూనివర్సిటీతో పాటు బాసరలోని ట్రిపుల్ఐటీకి ఇప్పటి వరకు వీసీలనే నియమించలేదు. కొత్తగా వీసీల నియామకం కోసం అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఈ సమయంలో బాసరకు రెగ్యూలర్ వీసీ నియమిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ఇన్చార్జీనే.. తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ బాసర ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. గత ఐదున్నరేళ్లుగా ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. శాశ్వతంగా బాసర ట్రిపుల్ఐటీకి వీసీ నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణకు బాసర ట్రిపుల్‌ఐటీలు దక్కాయి. ప్రత్యేక విద్యాలయాలు కావడంతో ప్రభు త్వం విశ్వవిద్యాలయాలకు హోదా కల్పించి విద్యాలయ ప్రగతికి పాలనాపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్ వీసీ నియమించలేదు. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేసిన అనంతరం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీసీగా అశోక్ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్ వీసీ నియాయమకంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఏళ్లుగా బాసర ట్రిపుల్ఐటీకి వీసీ నియామకం జరగకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వారు పూర్తిస్థాయి వీసీ కాకపోవడంతో పరిమితులకు లోబడి పనిచేస్తున్నారు. విద్యాలయాల నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల పరిధిలోనే తన నిర్ణయాలను అమలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఐదేళ్లుగా ఇన్చార్జి వీసీతోనే విద్యాలయ నిర్వహణ కొనసాగుతోంది. సాధించిన కొలువులు... 2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్‌ఐటీలో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువులు సాధించారు. ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో కొలువులు సాధించారు. 2014లో 309 మంది విద్యార్థులు 2015లో 336 మంది, 2016లో 478 మంది, 2017లో 362 మంది, 2018లో ఇప్పటి వరకు 282 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులు వార్షికవేతనం రూ. 12లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పొందుతున్నారు. ఏటా ప్రవేశాలు... గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్‌లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడి విద్యావిధానం, వసతులు ప్రారంభంలో బడ్జెట్ తదితర విషయాలను పరిశీలించేందుకు 2018లో ప్రభుత్వం అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న విషయాన్ని గుర్తించి రాష్ట్రంలో మరో మూడు చోట్ల ట్రిపుల్ ఐటీలను ప్రారంభించేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. -
అయిన వారైతే అందలమే!
సాక్షి, కర్నూలు : కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.ముజఫర్ అలీకి గత తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్ల పదవీ కాలాన్ని కట్టబెట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉర్దూ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయనకు పదవీ విరమణ సమయం రెండు నెలలు ఉండగా అప్పటి ప్రభుత్వం ఉర్దూ వర్సిటీ వీసీగా నియమిస్తూ 2017 మార్చి 25న జీఓ 54ను జారీ చేసింది. నిబంధనలకు, సంప్రదాయాలకు నీళ్లు వదలి నాలుగేళ్ల పదవీ కాలాన్ని ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఆయనపై గత ప్రభుత్వానికి ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్సిటీల యాక్ట్ ప్రకారం రాష్ట్రంలోని వైస్ చాన్సలర్ల పదవీ కాలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. అయితే ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి ఏకంగా నాలుగేళ్ల టెన్యూర్ ఇవ్వడం గమనార్హం. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు కావడంతో గత రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్సిటీల వ్యవహారాలను చూసిన విశ్రాంత ప్రొఫెసర్ ఒకరు (ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు) ఈ వ్యవహారాన్ని నడిపించారు. కొత్త వర్సిటీ ఏర్పడినప్పుడు ఎలాంటి సెర్చ్ కమిటీ లేకుండానే సమర్థవంతుడు, వర్సిటీ అభివృద్ధికి పాటు పడే వ్యక్తిని ప్రభుత్వమే ఎక్స్ఆర్డినరీ కేసు కింద వైస్ ఛాన్సలర్‌ను నియమిస్తుంది. అయితే ముజఫర్ అలీకి నాలుగేళ్ల పదవిని ఇవ్వడం కోసం ఉర్దూ వర్సిటీ యాక్ట్ 13ను ప్రత్యేకంగా తయారు చేయించి.. ప్రభుత్వ ఆమోదం పొందేలా చూశారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఈయన పనితీరుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ రిజిస్ట్రార్‌కు, ఈయనకు మధ్య విభేదాలున్నాయని తెలుస్తోంది. రెండు మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగించారు. కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్ నియామకం కోసం 22 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టుల భర్తీ, నోటిఫికేషన్ విడుదల విషయాల్లో వీసీ, రిజిస్ట్రార్ రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం సాధించేందుకు ఎవరికి వారు యత్నిస్తున్నారు. గత నెల 24న వర్సిటీలో తరగతులు ప్రారంభమయ్యాయి. సుమారు 150 మంది విద్యార్థులు ఉండగా.. పది మంది కూడా తరగతులకు హాజరు కావడం లేదు. ఆరేడుగురు గెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు హాజరు కావడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఉన్నత విద్యాశాఖాధికారులు వర్సిటీపై ప్రత్యేక శ్రద్ధ చూపి చదువుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి« సంఘాల నేతలు కోరుతున్నారు. అన్నీ సర్దుకుంటాయి వర్సిటీలో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే. టీచింగ్ స్టాఫ్ నియామకంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. వాటిని అధిగమించి వారంలోగా కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. కొత్త వర్సిటీలు ఏర్పడినప్పుడు వాటి అభివృద్ధికి కొంత సమయం పడుతుంది. అందుకోసమే ప్రత్యేక యాక్ట్ ద్వారా నాలుగేళ్ల పదవీకాలం ఇచ్చారు. – ప్రొఫెసర్ ముజఫర్ అలీ, వీసీ, ఉర్దూ విశ్వవిద్యాలయం -
ఎస్వీయూ వీసీపై వేటుకు రంగం సిద్ధం
టీడీపీ ప్రభుత్వ ఆశీస్సులతో హైకోర్టు కన్నుగప్పి పాత తేదీలతో విధుల్లో చేరిన ఎస్వీ యూనివర్సిటీ వీసీ వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. ఈయన నిమామకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఈ నెల 24న తుది తీర్పు వెలువడనుంది. తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం ఖాయం కావడంతో రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ అంశంపై సోమవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసినట్లు తెలిసింది. సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. 4న ఆయన విధుల్లో చేరా రు. ఆయనకు అనుకూలమైన అప్పటి ఎస్వీయూ అధికారుల సహకారంతో 3వ తేదీన విధుల్లో చేరిన ట్లు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి, హైకోర్టుకు చేరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్ నియామకాన్ని తప్పుపట్టింది. ఈ నియామకంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సరైన వివరణ ఇవ్వలేకపోవడంతో ఈ కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది. 24న తుది తీర్పు వెలువడనుంది. ఆయన తొలగింపు ఉత్తర్వులు లాంఛనమే. గత ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగంలో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందిన రాజేంద్రప్రసాద్‌ను నియమించింది. ఈయన ఇదివరకు ఎలాంటి పదవులూ చేపట్టలేదు. విభాగాధిపతిగా కూడా పనిచేయలేదు. అకడమిక్ పరంగా కూడా చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేదు. వయసు రీత్యా కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి రెండేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ సోదరుడు కావడంతో ప్రభుత్వం ఈయన్ను వీసీగా నియమించింది. ఈయన వీసీ పోస్టుకు దరఖాస్తు చేయకపోయినా సెర్చ్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు దరఖాస్తు తెప్పించుకుని పదవి కట్టబెట్టారు. ఈ నియామకం వెనుక మాజీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. నియామక ప్రక్రియపై అనేక కేసులు ఎస్వీయూ వీసీ నియామకానికి గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి మొదటివారంలో సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సెర్చ్ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి ఒక సభ్యుడిగా ఉండటం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పి. మునిరత్నం రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఫిబ్రవరి 4న తీర్పు ఇచ్చింది. ఎస్వీయూ, పద్మావతి, మరికొన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించ వద్దని ఆదేశించింది. ఫిబ్రవరి 4న ఈ తీర్పు వస్తుందని భావించిన ప్రభుత్వం ముందు రోజు అర్ధరాత్రి ఈయన్ను వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే వీసీల నియామకం చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. కానీ ఎస్వీయూ వీసీగా ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టినట్లు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. కో వారెంటో.. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్ నియామాన్ని సవాల్ చేస్తూ ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ మార్చిలో ప్రొఫెసర్ మునిరత్నం రెడ్డి హైకోర్టులో కో వారెంటో వేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. హైకోర్టుకు వేసవి సెలవుల అనంతరం సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు వీసీ నియామకంలో గత ప్రభుత్వం తప్పు చేసినట్లు గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టం కావడంతో ఎస్వీయూ వీసీ నియామకంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు హైకోర్టు గుర్తించడంతో వీసీని తొలగించే అవకాశాలున్నాయి. ఎస్వీయూ వీసీ రాజీనామా ? ఎస్వీయూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్న ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్ నియామకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, పదవిపోవడం దాదాపు ఖరారు కావడంతో ఆయన రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిసింది. వారం తర్వాత హైకోర్టు తనను వీసీగా తొలగించే అవకాశం ఉండటంతో రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఆయన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిశారు. ఎస్వీయూ వీసీ పదవికి రాజీనామా చేసినట్లు ఎస్వీయూలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వీసీతో మాట్లాడేందుకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్ ద్వారా ప్రయత్నించింది. ఆయన స్పందించలేదు. -
ఒక వ్యక్తి.. మూడు పదవులు
నూజివీడు: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకే వ్యక్తి మూడు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికీ ఆ మూడింటినీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయా (ఆర్జీయూకేటీ)నికి వైస్ చాన్స్‌లర్‌గా పని చేస్తున్న ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు. ఆయన ఆర్జీయూకేటీ వీసీగా పనిచేస్తుండగానే గత అక్టోబర్ నెలలో ఆర్జీయూకేటీ చాన్సలర్‌గా ఉన్న ఆచార్య డి.రాజ్‌రెడ్డి పదవీకాలం ముగియడంతో రామచంద్రరాజుకే ఇన్చార్జ్ చాన్స్‌లర్ (ఎఫ్ఏసీ)గా బాధ్యతలను అప్పగించింది టీడీపీ ప్రభుత్వం. తరువాత కృష్ణా వర్సిటీ వీసీ పదవి ఖాళీ కావడంతో ఆయననే ఆ యూనివర్సిటీకి కూడా ఇన్చార్జ్ వీసీగా గత ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌గా రాజ్ రెడ్డి పదవీకాలం గతేడాది అక్టోబర్ 20తో ముగియగా, ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తారని అందరూ భావించగా, అనూహ్యంగా ఇన్చార్జ్ చాన్స్‌లర్‌గా రామచంద్రరాజు నియమితులయ్యారు. అస్తవ్యస్తంగా మారిన ఆర్జీయూకేటీ మూడు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత వీసీ హయాంలో ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీల అభివృద్ధి ఏమాత్రం జరగకపోగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలలో టీడీపీ నాయకులతో పాటు ఆగిరిపల్లి మండలంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ చెప్పిన వారికల్లా అవసరం లేకపోయినా ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక్క శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలోనే ఆఫీసులలో పనిచేసే నాన్‌టీచింగ్ స్టాఫ్ దాదాపు 170 మంది ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీసీ కార్యాలయంలో సైతం టీడీపీ నాయకులు చెప్పిన వారినల్లా నియమించుకున్నారు. ఈ నియామకాలు నిబంధనల మేరకు జరగలేదు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ అప్రూవల్ కూడా లేదు. గత మూడేళ్లుగా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మెస్‌ల నిర్వహణకు టెండర్లను ఖరారు చేయకుండా నామినేషన్ పద్ధతిపైనే కొనసాగిస్తున్నారు. ఏటా టెండర్లు పిలవడం, సీఎంవో నుంచి ఫోన్ వచ్చిందంటూ నిలిపివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇన్చార్జ్ చాన్స్‌లర్, వైస్‌చాన్స్‌లర్ ఒక్కరే కావడంతో నియంతృత్వ పోకడలు కూడా ఎక్కువయ్యాయనే ప్రచారం కూడా జరుగుతోంది. -
క్యాంపస్‌లో సరస్వతీ పూజ : వర్సిటీ అధికారుల అనుమతి
తిరువనంతపురం : విద్యార్ధుల నిరసనలతో కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తమ అలప్పుజ క్యాంపస్‌లో సరస్వతి పూజకు అనుమతించింది. శాంతియుతంగా పూజ నిర్వహించాలని సూచిస్తూ వర్సిటీ వారిని అనుమతించింది. కొచ్చిన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అభ్యసిస్తున్న ఉత్తరాది విద్యార్ధుల ఆందోళనలతో పూజలకు వర్సిటీ అధికారులు అనుమతించారు. తొలుత వర్సిటీ సెక్యులర్ క్యాంపస్ అని, ఇక్కడ మతపరమైన ప్రార్థనలు, పూజలకు అనుమతించబోమని కొచ్చిన్ వర్సిటీ అధికారులు స్పష్టం చేసినా ఉత్తరాది విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో ఈనెల 9,10,11 తేదీల్లో క్యాంపస్‌లో శాంతియుతంగా సరస్వతి పూజ నిర్వహించుకోవాలని అనుమతించారు. గత ఏడాది సైతం పూజలకు అనుమతించారని విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో కొచ్చిన్ వర్సిటీ వీసీ, రిజిస్ర్టార్లతో కూడిన ఉన్నతస్ధాయి కమిటీ సరస్వతీ పూజకు అనుమతించిందని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. -
వీసీ కనబడుటలేదు.. విద్యార్థుల నిరసన
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. యూనివర్సిటీ వైస్ చాన్సులర్ (వీసీ) గత పదిహేను రోజులుగా కనిపించడంలేదంటూ విద్యార్థులు కరపత్రాన్ని విడుదల చేశారు. యూనివర్సిటీలో సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు ఉద్యోగులు గత నెల రోజులుగా విధులను బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు విధులకు రాకపోవడంతో క్లాస్‌లు జరగడంలేదని విద్యార్థులు వీసీకి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. కానీ వీసీ సాంబయ్య విద్యార్థుల సమస్యలపై పట్టీపట్టనట్టు ఉంటున్నారని, ఇన్ని సమస్యలు ఉన్నా గత పదిహేను రోజులుగా యూనివర్సిటీకి రావడంలేదంటూ విద్యార్థులు మంగళవారం నిరసనకు దిగారు. తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ యూనివర్సిటీలో ఆందోళనకు దిగి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. -
పదేళ్ల తర్వాత మహిళ అధ్యక్షతన రాజ్యసభ
న్యూఢిల్లీ: రాజ్యసభకు గత పదేళ్లలో తొలిసారి ఓ మహిళ అధ్యక్షత వహించారు. తొలిసారి ఎంపీగా సభలో కాలుపెట్టిన వ్యక్తి కావడం అధ్యక్షతవహించడం విశేషం. తొలిసారి సభ్యురాలైన జేడీయూ ఎంపీ కహక్‌శాన్ పర్వీన్ గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సభను నడిపించారు. జీరో అవర్ తర్వాత సభా కార్యక్రమాలను పర్వీన్ నడిపిస్తారంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. సభ ప్రారంభం కాగానే పర్వీన్ అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. దీంతో సభ్యులంతా బల్లలు చరిచి అభినందించారు. తర్వాత వెంకయ్య పర్వీన్‌ను ‘బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారం’టూ అభినందించారు. కొందరు మహిళా సభ్యులు మార్చి 8 (మహిళా దినోత్సవం సందర్భంగా)న చేసిన డిమాండ్ ఆధారంగా వెంకయ్య పర్వీన్‌ను వైస్ చైర్‌పర్సన్‌గా నియమించారు. వైస్ చైర్‌పర్సన్స్ ప్యానెల్లో పర్వీన్ ఏకైక మహిళా అభ్యర్థి. -
ఆగస్టు 8న వీసీలతో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని పరిస్థితులు, అక్కడి సమస్యలు, గతేడాది తీసుకున్న నిర్ణయాల అమలుపై గవర్నర్ నరసింహన్ సమీక్షించనున్నారు. వచ్చే నెల 8న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉదయం 10:30 గంటలకు వైస్ చాన్స్లర్లతో సమీక్ష సమావేశం ఉంటుంది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో కామన్ అకడమిక్ కేలండర్ అమలు తదితర అంశాలపై గవర్నర్ సమీక్షించనున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు, బడ్జెట్ సద్వినియోగపర్చుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, అధ్యాపకుల భర్తీ, పీహెచ్డీ ప్రవేశాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా నిధుల సమీకరణపై చర్చించనున్నారు. కొత్త కోర్సుల ప్రవేశం, ఇన్నోవేషన్, పరిశోధన ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అనుబంధ కాలేజీల్లో రెగ్యులర్ తనిఖీలు, హాస్టళ్లలో బయటి వ్యక్తుల నివాసం, అకడమిక్ కౌన్సిళ్ల ఏర్పాటు వంటి అంశాలపై గవర్నర్ సమీక్షించనున్నారు. -
యూజీసీ ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను (యూజీసీ) కొనసాగిస్తూనే దాని బలోపేతానికి చర్యలు చేపట్టాలని నిపుణులు, వైస్చాన్స్లర్లు అభిప్రాయపడ్డారు. యూజీసీని రద్దు చేసి ఆ స్థానంలో ప్రతిపాదిత హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) ఏర్పాటును వ్యతిరేకించారు. యూజీసీ స్థానంలో హెకీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హెకీపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలు, వీసీలు, రిటైర్డ్ వీసీలతో సమావేశం నిర్వహించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కె.కేశవరావు, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ భేటీ లో హెకీ ముసాయిదా బిల్లులోని పలు అంశాలపై చర్చించారు. ఆయా అంశాలతో నివేదికను రూపొం దించి ఈ నెల 20లోగా కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెకీ అవసరమే లేదని, అయి నా కేంద్రం హెకీని అమల్లోకి తేవాలనుకుంటే పలు సవరణలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు సామాన్యులకు విద్య అందించేలా ఉండాలి: కడియం కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు నాణ్యమైన విద్యనందించేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతిపాదిత హెకీ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. వర్సిటీలకు నిధుల పెంపుతోపాటు, నేరుగా వర్సిటీలకు అవి వచ్చేలా, ఇన్సెంటివ్‌లు ఇచ్చేలా సవరణలు చేయాలన్నారు. డ్రాఫ్ట్ బిల్లుపై అభిప్రాయాలు చెప్పేందుకు మూడు వారాలే ఇవ్వడం సరికాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు వల్ల ఫీజులు పెరుగుతాయని, గ్రాంట్స్ తగ్గుతాయన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కేకే మాట్లాడుతూ ఈ ముసాయిదా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సి వస్తుందేమోనన్నారు. -
ఎస్ఆర్ఎమ్ వర్సిటీ వీసీగా ‘జంషెడ్ బారుచా’
సాక్షి, అమరావతి : ఎస్ఆర్ఎమ్ యూనిర్శిటీ వైస్ చాన్సలర్‌గా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జంషెడ్ బారుచా నియమితులయ్యారు. అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్శీటీ వ్యవస్థాపక వైస్ చాన్సలర్‌గా ఆయన కొనసాగనున్నారు. ఆయన గతంలో అమెరికాకు చెందిన పలు ప్రముఖ విద్యాసంస్థలలో ఉన్నత పదవులలో కొనసాగారు. ఎస్ఆర్ఎమ్ విద్యాసంస్థల అధినేత పి. సత్యనారాయణన్ మాట్లాడుతూ.. యూనివర్శిటీ, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన ఎల్లవేళలా కృషి చేయగలరని ఆకాక్షించారు. జంషెడ్ బారుచాను అమరావతి ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా నియమించటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. జంషెడ్ బారుచా మాట్లాడుతూ.. జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి అన్ని రకాలుగా కృషిచేయాలని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. శక్తివంచన లేకుండా విద్యార్థులకు సహకరించటమే కాకుండా.. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. -
నిరుపేదలకూ టోపీ
సూళ్లూరుపేట : క్యామెల్ సంస్థ నిర్వాకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులకే కాకుండా నిరుపేదలకూ టోపీ పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన గరిక ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ సూళ్లూరుపేట కేంద్రంగా క్యామెల్ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేస్తూ సంస్థను అభివృద్ధి చేసుకున్నారు. సంస్థకు అనుబంధంగా క్యామెల్ మహిళా మ్యాక్స్ అనే సంస్థను 2002లో స్థాపించి రిజిస్ట్రేషన్ చేయించారు. 2002 నుంచి ఈ సంస్థలో మహిళలు గ్రూపులుగా ఏర్పడి పొదుపు చేసుకుంటే తామే రుణాలిచ్చి ఆదుకుంటామని సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో నాలుగు బ్రాంచీలను స్థాపించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వరదయ్యపాళెంలో నాలుగు బ్రాంచీలను ఏర్పాటు చేసి 500 గ్రూపులను తయారు చేశారు. సుమారు 10 వేల మంది పొదుపు మహిళలను చేర్చుకొని వారితో రూ.20 నుంచి రూ.200 వరకు పొదుపు చేయించి నగదును వీరి వద్దే ఉంచుకున్నారు. పొదుపు కట్టిన పుస్తకాలను కూడా వీరివద్దే ఉంచుకున్నారు. 2002 నుంచి 2009 వరకు పొదుపు చేసిన మొత్తాన్ని చూపించి నాబార్డు, ఇతర బ్యాంకుల నుంచి సుమారు రూ.9.21 కోట్లను రుణంగా తీసుకున్నారు. ఇందులో మహిళలకు రుణాలిస్తూ కట్టుకుంటూ వచ్చారు. నాబార్డు శాఖ రూ.50 పైసల వడ్డీకే సంస్థలకు రుణాలిస్తే దాన్ని పొదుపు మహిళలకు రూ.రెండు వడ్డీకి ఇచ్చి అందులో రూ.1.5 వడ్డీని ఆదాయంగా మలుచుకున్నారు. మెయింటెనెన్స్ కింద నాబార్డు వారు క్యామెల్ మహిళా మ్యాక్స్‌కు 2.5 శాతం ఇవ్వగా, క్యామెల్ వారు మాత్రం పొదుపు మహిళల నుంచి ఐదు శాతాన్ని వసూలు చేశారు. గ్రూపుల్లో ఎవరైనా రుణాలు తీసుకోకపోయినా, వారి పేర్లపై కూడా తీసుకున్నట్లు రికార్డులు ఉన్నాయని చెప్తున్నారు. గ్రూపునకు రూ.రెండు లక్షలు ఇచ్చినట్లు వారి వద్ద నుంచి సంతకాలు చేయించుకొని 2 పక్కనే 1 వేసుకొని రూ.10 లక్షలు తీసుకున్న సందర్భాలున్నాయని వారి వద్ద పనిచేసిన వారు చెప్పడం విశేషం. చాలా మంది రుణాలను చెల్లించినా వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో మండలంలోని పేర్నాడు పల్లెల్లో చాలా మందికి హైకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ముందుగా ఆమె వచ్చి తాము కట్టిన పొదుపు నగదు మొత్తం ఎంత ఉంది..ఎంత కట్టాలనే విషయాలను నిగ్గుతేలిస్తే ఆమే తమకు బాకీ పడుతుందని అంటున్నారు. భారీగా స్థిరాస్తులు నిరక్షరాస్యులను మోసం చేశారు. చివరికి బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పొలీసుల కస్టడీలోకి తీసుకున్న ఈశ్వరమ్మను టీడీపీ నేత పరసా వెంకటరత్నయ్య వదిలేయమని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ఆమెను పూర్తిస్థాయిలో విచారించి ఉంటే నిజాలు నిగ్గుతేలి ఉండేవి. ఓజిలి మండలంలో 16 ఎకరాలు, తనియేలి వద్ద 12 ఎకరాలు, సూళ్లూరుపేటలో మూడేసి అంతస్తులు కలిగిన రెండు పెద్ద భవనాలు, పరమేశ్వరినగర్‌లో రెండు ప్లాట్లతో పాటు నెల్లూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కూడా స్థిరాస్తులను కూడబెట్టినట్టు సమాచారం. హోంగార్డు నాగూరమ్మను బలిచేసే యత్నం ఆర్థికపరమైన కేసులో ఈశ్వరమ్మను పట్టుకొని అధికార పార్టీకి చెందిన పరసారత్నం ఫోన్ చేశారని వదిలిపెట్టేసి ఇప్పుడు హోంగార్డు నాగూరమ్మను బాధ్యులు చేయాలని సీఐ కిషోర్‌బాబు ఒత్తిడి తెస్తున్నారు. తప్పు చేశావని అంగీకరించి సంతకం చేయమని సీఐ ఒత్తిడి చేస్తున్నారని నాగూరమ్మ ఆరోపిస్తున్నారు. నెల్లూరులో ఆమె ఎస్పీ రామకృష్ణను కలిసి తన గోడును తెలియజేశారు. ఇందులో తనకు సంబంధం లేకపోయినా హోంగార్డునని బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు డీఎస్పీ విచారణ సూళ్లూరుపేట రూరల్ : తన తప్పిదాన్ని గుర్తించి ఎస్పీ ఎక్కడ చర్యలు తీసుకుంటారోనని భయపడిన ఎస్సై నెపాన్ని హోంగార్డుపై వేసే యత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను సరెండర్ చేస్తూ మెమో ఇచ్చారు. అందులో ఆర్ఐ, హోంగార్డు అని రాయాల్సిన చోట ఆర్ఐ, వీఆర్ అని రాయడంతో నాగూరమ్మను వీఆర్ పోలీసులు సరెండర్ చేసుకోలేదు. దీంతో ఆమె తిరిగి సూళ్లూరుపేటకు వచ్చేశారు. శనివారం మధ్యాహ్నం గూడూరు డీఎస్పీ రాంబాబు ఘటనపై విచారణ జరిపారు. అందర్నీ పిలిచి వివరాలను సేకరించారు. ఆ సమయంలో ఎస్సై మరోసారి నాగూరమ్మకు సరెండర్ మెమో ఇచ్చి నెల్లూరుకు పంపించేశారు. ఈ ఫొటోలోని మహిళ పేరు కుప్పంపాటి నాగమ్మ. సూళ్లూరులోని బొగ్గుల కాలనీలో 32 మందితో ఝాన్సీ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మనిషికి రూ.20 చొప్పున గరిక ఈశ్వరమ్మ నిర్వహిస్తున్న క్యామెల్ మహిళా మ్యాక్స్‌లో పొదుపు చేసుకుంటూ వచ్చారు. మధ్యలో కొన్ని గ్రూపుల్లో సభ్యులు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఉన్న గ్రూపుల నుంచి సర్దుబాటు చేయడంతో 20 మంది లెక్కన ఒక్కో గ్రూపులో ఉంటూ వచ్చారు. రూ.20తో ప్రారంభించిన పొదుపును 2013 నాటికి నెలకు రూ.200 వరకు చెల్లించారు. ఈ గ్రూపులను ఆధారంగా చేసుకొని ఒక్క నాబార్డు సొసైటీ నుంచి మహిళా సాధికారత పేరుతో రూ.7.21 కోట్లను రుణాలుగా తీసుకొచ్చారు. పొదుపు మహిళలకు ప్రతి గ్రూపునకు రూ.రెండు లక్షల చొప్పున ఇచ్చారు. ఈ నగదుకు రూ.రెండు వడ్డీ లెక్కన వసూలు చేసి, మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులకు మాత్రం రూ.0.50 పైసల వడ్డీ ఇస్తూ వచ్చారు. ముందుగా పొదుపు కింద ఎంత కట్టారో లెక్కలు చూపించకుండా రుణంగా తీసుకున్న మొత్తాన్ని కట్టాలని ఇటీవల ఒత్తిడి చేశారు. పొదుపు మహిళలు ఎంత పొదుపు చేసుకున్నారో చూపిస్తే రుణం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాంకులను మోసం చేసినట్లే పొదుపు సంఘాల్లో నిరుపేద మహిళలనూ ఈశ్వరమ్మ మోసం చేశారు. -
‘జిన్నా ఫోటోతో వివాదానికి సంబంధం లేదు’
లక్నో: అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో రగడపై వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ వివరణ ఇచ్చారు. వర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం ఓ అంశం కాదని, 1938 నుంచి ఏఎంయూలో జిన్నా ఫోటో ఉందని స్పష్టం చేశారు. ఈ వివాదంతో యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మే 2న వర్సిటీ క్యాంపస్‌లోకి ఇతరులు వచ్చి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసినందుకే విద్యార్థులు నిరసనలు చేపట్టారన్నారు. క్యాంపస్‌లోకి ఇతరులు ప్రవేశించి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో ఆయన కార్యక్రమం రద్దయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై న్యాయవిచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడానని చెప్పారు. విద్యార్థులు ఈ అంశాల మీద దృష్టిసారించకుండా పరీక్షలకు సంసిద్ధం కావాలని వీసీ సూచించారు. యూనివర్సిటీలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను సాకుగా తీసుకుని కొన్ని న్యూస్ ఛానెల్స్ అర్థ సత్యాలతో వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వర్సిటీ వర్గాలు ఆరోపించాయి. -
తిరుపతి రుయా ఆస్పత్రిలో కీచకపర్వం
-
రుయాలో కీచక పర్వం: గవర్నర్‌కు నివేదిక
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో కీచకపర్వం పై ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమణయ్య స్పందించారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. లైంగిక వైధింపులపై ఎస్వీ మెడికల్ కళాశాల పీడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థిని ఫిర్యాదు చేసిన మాట వాస్తవేనన్నారు. తనను ముగ్గురు ప్రొఫెసర్లు లైంగికంగా వేధిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలంటూ గవర్నర్‌కు ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన గవర్నర్... విచారణ చేపట్టాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారన్నారు. దీంతో వర్సిటీ వీసీ ఆదేశాల మేరకు విచారణ చేశామని ఆయన తెలిపారు. రేపు ఈ ఘటనపై నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. కాగా, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ కిరీటి, ప్రొఫెసర్ శశికుమార్‌లు తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు గవర్నర్‌కు పంపిన లేఖలో పేర్కొంది. ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, అభ్యంతరకర పదాలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు వారి చేతుల్లో ఉన్నాయని వేధిస్తున్నారని ఆరోపించింది. ఓ పాపకు తల్లినైన తాను వారి బాధలు భరించలేక ఓ సారి ఆత్మహత్యకు యత్నించగా, తన భర్త కాపాడినట్లు వివరించింది. పలుమార్లు ఎస్వీ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. దీనిపై స్పందించిన గవర్నర్... లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్ వర్సిటీ వీసీని ఆదేశించారు. రుయాఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి జమున, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జయా భాస్కర్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌లతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4 రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేపట్టింది. -
శానిటరీ ప్యాడ్ వాడిందెవరు?
భోపాల్ : స్త్రీల సహజసిద్ధ రుతుక్రమాన్ని అర్థం చేసుకొనేందుకు ఈ సమాజానికి ఇంకెంత కాలం పడుతుందోనన్న అనుమానం ఈ ఘటనతో మరింత బలపడుతోంది. శానిటరీ నాప్కిన్స్ తయారుచేసే యంత్రాన్ని తొలిసారిగా పరిచయం చేసిన మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటన అమ్మాయిల పట్ల వివక్షనీ, అవమానకర వైఖరిని మరోమారు రుజువుచేసింది. మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింఘ్ గౌర్ యూనివర్సిటీ కి చెందిన హాస్టల్లో వాడిపడేసిన శానిటరీ ప్యాడ్ కనిపించడంతో, దాన్ని వాడిందెవరో తెలుసుకునేందుకు ఒక్కొక్కరుగా విద్యార్థులందరి దుస్తులనూ విప్పించి చెక్చేయడం వివాదానికి తెరతీసింది. విద్యార్థులను అవమానించిన రాణీ లక్ష్మీబాయి హాస్టల్ వార్డెన్ చందాబెన్ వైఖరికి వ్యతిరేకంగా ఆమె ఇంటిముందు విద్యార్థులు ఆందోళనకి దిగడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. హాస్టల్లో కనిపించిన శానిటరీ ప్యాడ్ ఎవరు వాడారో తెలుసుకోవడం కోసం రాణీ లక్ష్మీబాయి హాస్టల్ వార్డెన్ చందాబెన్ తమ బట్టలు విప్పించి అవమానించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్పి తివారీకి విద్యార్థులు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన యూనివర్సిటీ విసి ఆర్పి తివారీ విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించడంతో పాటు, వార్డెన్ తప్పిదం రుజువైతే కఠినంగా శిక్షిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విషయం సద్దుమణిగింది. విచిత్రమైన విషయమేమిటంటే రుతుక్రమం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకూ, అమ్మాయిల్లో డ్రాప్‌ఔట్ రేట్ ని తగ్గించే ఉన్నతమైన లక్ష్యంతోనూ, పేద విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ని అందించేందుకు దేశంలోనే తొలిసారిగా భోపాల్‌లోని మోడల్ హైస్కూల్స్‌లో శానిటరీ నాప్‌కీన్స్ తయారుచేసే మిషన్స్ ని అమర్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా శానిటరీ ప్యాడ్స్ తీసుకునేందుకు విద్యార్థినులకు ప్రత్యేకమైన కాయిన్స్‌ని యిస్తుంది. ప్యాడ్స్ అవసరమైనప్పుడు ఆ కాయిన్స్‌ని ఇచ్చి విద్యార్థులు ప్యాడ్స్‌ని ఉపయోగించుకొనే సౌలభ్యం ఉంటుంది. ఇంత ప్రయోజనకరమైన ప్రాజెక్ట్‌ని తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రంలోనే శానిటరీ న్యాప్కీన్ వాడిపడేసినందుకు విద్యార్థులను అవమానించిన ఘటన ఉత్పన్నం కావడం చర్చనీయాంశం అయ్యింది. అనేక దశాబ్దాలుగా స్త్రీల హక్కులను గురించి, వారి శారీరక శాస్త్రీయతను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను గురించీ పదే పదే మహిళలు విభిన్న రీతుల్లో ఉద్యమిస్తూనే ఉన్నారు. దానికి తోడు అక్షయ్ కుమార్ ‘ప్యాడ్మాన్’ సినిమా తీసుకొచ్చిన చైతన్యం నేపథ్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 200 ప్రధాన రైల్వే స్టేషన్లలో శానిటరీ నాప్కిన్ మెషిన్స్‌ని ప్రారంభించామనీ, వెనుకబడిన, బలహీన వర్గాల స్త్రీలకూ, మహిళా ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగకరమనీ రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్వినీ లోహనీ వ్యాఖ్యానించారు. అయితే అక్షయ్ కుమార్ ‘పాడ్‌మాన్’ తరహా సినిమాలు మాత్రమే ఆశించిన మార్పుని తేలేవన్న విషయాన్ని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బయోమెట్రిక్ ఉంటేనే అనుబంధ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంచేశారు. వాటిని ఏర్పాటు చేసిన కాలేజీలకే అనుబంధ గుర్తిం పునివ్వాలని చెప్పారు. 1,551 పోస్టుల్లో 1,061 పోస్టు ల భర్తీకి ఒకే చెప్పినా ఒక్క వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, వచ్చే జూన్ నాటికి అధ్యాపకుల నియామకాలను పూర్తి చేయాలన్నారు. వర్సిటీల వైస్ చాన్సలర్ల (వీసీ)తో గతంలో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన సమీక్షలో నిర్ణయించిన 10 అంశాల పురోగతిపై బుధవారం కడియం సమీక్షించారు. మౌలిక వసతుల కల్ప న పనులను మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించామని కడియం చెప్పారు. డిమాండ్ లేని విభాగాల్లో వచ్చిన పోస్టులను డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్లలోకి మార్పు చేసుకునే అధికారాన్ని వీసీలకు ఇచ్చామన్నారు. ఈ మార్పులతోపాటు రోస్టర్ తయా రు చేసుకొని ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఐదేళ్లలో పీహెచ్డీ.. ఐదేళ్లలోగా పీహెచ్డీ పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించాలని కడియం అన్నారు. అన్ని వర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలపై ఆలోచన లేదని, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళ వర్సిటీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, 14 యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. లోపం ఎవరిది? ‘నేను మంత్రి అయ్యాక వీసీలతో నిర్వహించిన ఐదో సమావేశం ఇది. తీసుకున్న నిర్ణయాలు ఆశించిన మేరకు అమలు కావట్లేదు. ప్రభుత్వపరంగా అర్థం చేసుకోవడంలో లోపం ఉందా.. మీ పనితీరులో లోపం ఉందా.. కౌన్సిల్ సరిగ్గా గైడ్ చేయలేకపోతోందా తెలియడం లేదు’ అంటూ వీసీల సమావేశంలో కడియం ఆవేదన వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌తో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను 6 నెలల్లో అమలు చేస్తామన్నారు. మళ్ళీ గవర్నర్ మీటింగ్ పెడితే ఏం సమాధానం చెబుతారు. కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచు తామని హామీ ఇచ్చాం. అదీ జరగడం లేదు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిద్దాం. పీహెచ్డీ అడ్మిషన్లలో సమస్యలు ఎందుకు వస్తు న్నాయి. గైడ్లకు వివక్ష ఎందుకు? స్టూడెంట్ అకడ మిక్ ఫర్ఫార్మెన్స్ బాగా ఉన్నా గైడ్ మార్కులు ఇవ్వ డం లేదు. మనం గైడ్‌లైన్స్ ఫాలో కావడం లేదు. ఇది సరికాదు. అవకతవకలు, అనుమానాలకు అవకాశం లేకుండా పని చేయాలి’ అని అన్నారు. -
30 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వర్సిటీ వీసీ
సాక్షి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి రూ.30 లక్షలు లంచం తీసుకుంటూ కోయంబత్తూరులోని భారతీయార్ వర్సిటీ వీసీ గణపతి అవినీతి నిరోధక విభాగం అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టు కోసం సురేశ్ అనే అభ్యర్థి వీసీ గణపతిని సంప్రదించాడు. అయితే, ఆయన రూ.35లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ.30 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీనిపై సురేశ్ అవినీతి నిరోధక విభాగానికి సమాచారం అందించాడు. ఈ మేరకు శుక్రవారం రూ.లక్ష నగదు, రూ.29 లక్షలకు చెక్కులను వీసీకి ఆయన నివాసంలో అందజేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించారన్న ఆరోపణలపై వర్సిటీ ప్రొఫెసర్ ధర్మరాజ్‌పైనా కేసు నమోదు చేశారు. ఇద్దరి నివాసాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కరెన్సీ నోట్లను చించివేసి డ్రైనేజీలో పడ వేసిన వీసీ భార్య స్వర్ణలతపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. -
గవర్నర్ అధ్యక్షతన వీసీల సదస్సు
సాక్షి, విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీలో బుధవారం యూనివర్సిటీ వీసీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ఏపీలోని అధ్యాపకులు, విద్యార్థుల కోసం బయెమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. అదే విధంగా విద్యాలయాల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యారంగంలో విశ్వవిద్యాలయాల విజన్, ర్యాంకులు మెరుగు పరుచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు, బయోమెట్రిక్ విధానం అమలు- ప్రగతి, అనుబంధ కళాశాలల వెబ్సైట్లను వర్సిటీ వెబ్ సైట్లతో అనుసంధానించడం, ప్రాజెక్టులు, నిధులు సాధించే విధానాలు, నూతన విశ్వ విద్యాలయాలకు అందించిన క్యాపిటల్ ఫండ్‌ను ఖర్చు చేస్తున్న విధానం, స్కిల్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్ విధానం తదితర విషయాలను ఈ సదస్సులో చర్చించారు. ఈ సదస్సుకు 16 యూనివర్సిటీల వీసీలతో పాటు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాధ్‌దాస్, మండలి చైర్మన్ చైర్మన్ విజయనంద్, వైస్ చైర్మన్ వల్లీకుమారిలు పాల్గొన్నారు. -
1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు!
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధానంపై వైస్ చాన్స్లర్ల కమిటీ కీలక సిఫారసు చేసింది. ఇప్పటివరకు వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో దరఖాస్తు చేసుకున్న అందరిని ఇంటర్వ్యూలకు పిలిచే విధానానికి పుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టులో ఒక్కో పోస్టుకు పది మందిని మెరిట్స్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఇంటర్వ్యూలకు (1:10 నిష్పత్తిలో) ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం నియమించిన వైస్ చాన్స్లర్ల కమిటీ రెండు రోజుల కింద ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్స్ ఆధారంగా స్క్రీనింగ్ చేయాలని సూచించింది. ఆ మెరిట్ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. ఒక్కో అంశానికి 10 మార్కుల చొప్పున 60 మార్కులకు వెయిటేజీ ఇచ్చి, మెరిట్ ఉన్న వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేయాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఇంటర్వ్యూలో 4 కీలక అంశాల్లో అభ్యర్థిని బట్టి 40 మార్కుల వరకు కేటాయించే విధానాన్ని సూచించినట్లు సమాచారం. తద్వారా ఇంటర్వ్యూలను త్వరగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నట్లు తెలిసింది. ఏ వర్సిటీ నోటిఫికేషన్‌ను ఆ యూనివర్సిటీనే ఇవ్వాలని, ఒక వర్సిటీలో దరఖాస్తు చేసుకున్న వారు మరో యూనివర్సిటీలోనూ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇంటర్వ్యూ కమిటీలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన వారు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సబ్జెక్టు నిపుణుడిగా నియమించాలని సూచించినట్లు తెలిసింది. తద్వారా పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టవచ్చని సూచించినట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీలో వైస్ చాన్స్‌లర్, డీన్, డిపార్ట్మెంట్ హెడ్, ఇద్దరు సబ్జెక్టు ఎక్స్పర్ట్స్, ఇంటర్వ్యూ కమిటీలో వైస్ చాన్స్‌లర్, డీన్, రిజిస్ట్రార్, సబ్జెక్టు ఎక్స్పర్ట్ ఉండాలని పేర్కొన్నట్లు తెలిసింది. న్యాయశాఖ అభిప్రాయం తర్వాత ఈ 1,061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది. మెరిట్ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలు.. ► పోస్టు గ్రాడ్యుయేషన్‌లో మార్కులు ► అకడమిక్ రికార్డు (స్లెట్, నెట్, పీహెచ్డీ, విదేశాల్లో చదువులు) ► పబ్లికేషన్స్.. వివిధ అధ్యయన పత్రాలు, రచనలు.. ► ఫెలోషిప్‌లు, పరిశోధనలు, ప్రాజెక్టులు.. వాటి ఫలితాలు ► సర్వీసు, అనుభవం (కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న కాలం, ప్రైవేటు కాలేజీల్లో బోధన అనుభవం) ► అవార్డులు, రివార్డులు) ఇంటర్వ్యూ కమిటీ పరిగణనలోకి తీసుకునే 4 అంశాలు లెక్చర్స్, పరిశోధనలు, సబ్జెక్టు విశ్లేషణ, అభ్యర్థి వ్యక్తిత్వం తదితరాలు. -
నాన్ బోర్డర్లకు ఓయూ వీసీ అప్పీల్
హైదరాబాద్: పరిస్థితులు అర్థం చేసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వసతి గృహాల్లో ఉంటున్న నాన్ బోర్డర్లు వెంటనే యూనివర్సిటీని ఖాళీ చేసి వెళ్లిపోవాలని వర్సిటీ వైఎస్ ఛాన్సలర్ రామచంద్రం విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాశారు. లేదంటే ఎన్నో ఆశలతో వర్సిటీకి వస్తున్న నూతన విద్యార్థులకు అన్యాయం చేసినవాళ్లం అవుతామంటూ అందులో వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థుల పరిస్థితిపై అవగాహన ఉండి కూడా గతంలో విద్యనభ్యసించి కోర్సు పూర్తయినా వెళ్లకుండా ఉండిపోతున్న నాన్ బోర్డర్లు ఇలా వ్యవహరించడం భావ్యం కాదని అన్నారు. 'ఎంతో శ్రమపడి ఉన్నత విద్యాభ్యాసం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా స్వశక్తిని సంపాదించుకునేందుకు మన యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు చేరుతారు. మన విద్యార్థులకు సామాజిక, ఆర్థిక వసతుల లేమి మీకు(నాన్ బోర్డర్లకు) బాగా తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి ఎడ్యుకేషన్ ద్వారా బయటపడేందుకు నూతన విద్యార్థులు వస్తుంటారు. వారికి తగిన సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులుగా మాపై ఉంది. సంతృప్తికరమైన వసతి, భోజనం ఏర్పాట్లు, పరిసరాలు లేకుండా విద్యార్థులకు తాము కోరుకున్న స్వశక్తిని సాధించడం సాధ్యం కాదు. హాస్టల్ వసతులు, బడ్జెట్ అర్హత ఉన్న లబ్ధిదారులకు చేరుకోవడం లేదు. దీనికి కారణం నాన్ బోర్డర్లే. కోర్సులు ముగిసినప్పటికీ వారు ఖాళీ చేయకుండా అలాగే ఉండిపోతున్నారు. దీంతో కొత్తగా వస్తున్న విద్యార్థులకు వసతి గృహాల్లో, విద్యావకాశాల్లో తమ అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందిన నూతన విద్యార్థులకు అకాడమిక్ అనుభవాన్ని అందించడం నా ధర్మకతృత్వ బాధ్యత మాత్రమే కాకుండా నైతిక బాధ్యత కూడా. నూతనంగా ప్రవేశం పొందుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను అర్థం చేసుకొని వెంటనే హాస్టళ్లు ఖాళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లేదంటే మన విద్యార్థులకు, వారి కలలకు, ఆశయాలకు పెద్ద అన్యాయం జరిగినట్లు అవుతుంది. మనమంతా కలిసి ప్రతి విద్యార్థికి ఉస్మానియా యూనివర్సిటీ అందుబాటులో ఉండేలా చూడాలి. అప్పుడే మనమంతా మన యూనివర్సిటీని విద్యాపరిశోధనా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేర్చగలం' అని బహిరంగ లేఖలో వీసీ విజ్ఞప్తి చేశారు. -
గవర్నర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
చెన్నై: అనేక వర్సిటీల వైస్ చాన్స్‌లర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమిళనాడు హైకోర్టు స్పందించింది. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాట్రం ఇందియా సంస్థ డైరెక్టర్ పాడం నారాయణన్ వేసిన పిటిషన్‌కు సంబంధించిన వివరాలివీ.. రాష్ట్రంలోని చెన్నై వర్సిటీ, అన్నా వర్సిటీ, కామరాజర్ వర్సిటీ, లా వర్సిటీ వంటి అనేక వర్సిటీలలో వైస్ చాన్స్‌లర్ పదవులు అనేక నెలలుగా ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా భారతీదాసన్ వర్సిటీ, పెరియార్ వర్సిటీలలో వైస్ చాన్స్లర్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. సాధారణంగా వైస్ చాన్స్‌లర్ పదవి ఖాళీ కావడానికి మూడు నెలల ముందుగానే కొత్త వీసీని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, అనేక వర్సిటీలలో వీసీని ఎన్నుకునేందుకు కమిటీలను ఇంకా ఏర్పాటు చేయలేదు. వైస్ చాన్స్లర్లు లేని వర్సిటీలలో పలు కార్యక్రమాలు స్తంభించిపోయాయి. స్నాతకోత్సవాలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. వీసీ పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి ఉత్తర్వులివ్వాలని పాడం నారాయణన్ తన పిటిషన్లో కోరారు. అంతేకాకుండా ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లో వైస్ చాన్స్‌లర్ లేకుండానే అన్నా వర్సిటీలో శుక్రవారం స్నాతకోత్సవం నిర్వహించేందుకు సంకల్పించారని, దీనికి స్టే విధించాలని కోరారు. ఈ కేసుపై న్యాయమూర్తులు మహాదేవన్, గోవిందరాజ్ విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ఉన్నత విద్యా కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి నోటీసులు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. -
రాత్రిపూట అమ్మాయిల హాస్టల్లో..
మైసూరు: విశ్వవిద్యాలయాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉప కులపతి అమ్మాయిల హాస్టళ్లలో తిరుగుతూ కలకలం రేకెత్తించారు. వీసీ పీఠాన్నే సందేహాస్పదం చేశారు. విద్యార్థినుల హాస్టళ్లలోని శౌచాలయాలు తదితర ప్రాంతాల్లో తిరుగుతున్న మైసూరు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ దయానంద మానె ప్రవర్తనపై మంగళవారం హాస్టల్ విద్యార్థినిలు వర్సిటీ రిజిస్ట్రార్ రాజణ్నకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 19న మైసూరు యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా నియమితులైన దయానంద మానె ఇటీవల యూనివర్శిటీలో విద్యార్థినుల హాస్టల్ భవనంలోకి గుట్టుగా వెళ్లి వారి గదులు, టాయ్లెట్ల తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇది గమనించిన విద్యార్థినులు వీసీ ప్రవర్తన తమకు భయాన్ని కలిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రాజణ్ణకు ఫిర్యాదు చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన ఘటనపై ప్రభుత్వానికి లేఖ రాశారు. -
జేఎన్టీయూ(ఏ) వీసీ దుర్మరణం
-
జేఎన్టీయూ(ఏ) వీసీ దుర్మరణం
⇒ అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన ఇన్నోవా కారు ⇒ వీసీ సర్కార్‌తో పాటు పీఏ, కారు డ్రైవర్ మృతి పామిడి (గుంతకల్లు): అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రానికి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం (జేఎన్టీయూ–ఏ) వైస్ చాన్స్‌లర్ ఎంఎంఎం సర్కార్ (65) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాబా ఫకృద్దీన్ (32), డ్రైవర్ నాగప్రసాద్ (30) అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం కోసం బుధవారం సాయంత్రం జేఎన్టీయూ వీసీ తన పీఏతో కలిసి కారులో బయల్దేరారు. పామిడికి సమీపంలోని ఖల్సా దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కుడివైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో గుత్తి నుంచి అనంతపురం వైపు లారీ (ఏపీ21 టీడబ్ల్యూ 6801) వస్తోంది. లారీ డ్రైవర్ అప్రమత్తమై బ్రేకు వేసేలోపు కారు వేగంగా లారీ ముందుభాగం కిందకు దూసుకెళ్లింది. కారు డ్రైవర్ నాగప్రసాద్, వెనుక సీటులో కూర్చున్న వీసీ ఎంఎంఎం సర్కార్, ఆయన పక్కనే కూర్చున్న పీఏ బాబా ఫకృద్దీన్ దుర్మరణందారు. కారు టైరు పగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి.. కుడివైపు రోడ్డులోని లారీ కిందకు దూసుకెళ్లిందని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వీసీ అంత్యక్రియలు శుక్రవారం వైజాగ్‌లో జరుగుతాయని బంధువులు తెలిపారు. వీసీ మృతికి గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: జేఎన్టీయూ వీసీ ఎమ్.ఎమ్.ఎమ్.సర్కార్ మృతి పట్ల తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సర్కార్ మరణించడంతో రాష్ట్రం ఒక విద్యావేత్తను కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఘోర ప్రమాదం: జేఎన్టీయూ వీసీ మృతి
-
15న డీసీసీబీ వైస్‌చైర్మన్ ఎన్నిక
– ఎన్నికల అధికారిగా శ్రీనివాసరెడ్డి నియామకం కర్నూలు (అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు వైస్ చైర్మన్ ఎన్నిక నవంబరు 15న నిర్వహించనున్నారు. ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్ మురళి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల అధికారిగా డీసీసీబీ ఓఎస్డీ శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారు. ఇటీవలి వరకు డీసీసీబీ చైర్మన్‌గా గుండం సూర్యప్రకాష్‌రెడ్డి వ్యవహరించారు. ఆయన రాజీనామా తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో జరిగిన డీసీసీబీ బోర్డు సమావేశంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా తీర్మానం చేసి సహకార శాఖకు పంపారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఒకే రోజు నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియ జరుగుతాయి. ఈ పదవి కోసం ప్రస్తుత డైరెక్టర్లు సుధాకర్, శ్రీనివాసులు, అహ్మద్‌హుసేన్ పోటీ పడుతున్నారు. -
బ్రౌన్ గ్రంథాలయానికి పూర్తి సహకారం
కడప కల్చరల్ : బ్రౌన్ గ్రంథాలయం గురించి సాహితీ, విశ్వ విద్యాలయాల ప్రముఖుల ద్వారా తెలుసుకునే వచ్చానని, నిజానికి తాను విన్నదాని కంటే మరెన్నో రెట్లు ఉన్నత స్థానంలో ఈ గ్రంథాలయం ఉండడం తనకెంతో ఆశ్చర్యంగా ఉందని, దీని అభివృద్ధికి వైవీయూ సంపూర్ణ సహకారం అందిస్తుందని వైస్ ఛాన్సలర్ అత్తిపల్లి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నెలనెల మన జిల్లా సాహిత్యం కార్యక్రమం 60వ మాసం ప్రత్యేక కార్యక్రమంగా మంగళవారం బ్రౌన్ గ్రంథాలయంలో విశేష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ గ్రంథాలయాన్ని విజ్ఞాన నిధిలా భావిస్తున్నానని, దీన్ని కేంద్రంగా 60 వరుస కార్యక్రమాలను నిర్వహించడం వైవీయూకు గర్వకారణమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, అందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కేంద్రం ఆధారంగా భాషా, సాహిత్యాలపైన కొత్త కోణాలలో పరిశోధనలు చేయించాలని సూచించారు. బ్రౌన్కి మించి దేనికీ అర్హత లేదు సభాధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నెలనెల...మన జిల్లా సాహిత్యం కార్యక్రమం రూపుదిద్దుకున్న నేపధ్యాన్ని వివరించారు. జిల్లా సాహితీ చరిత్రలో ఇదో మరుపురాని సన్నివేశమని, ఇంత విజయం సాధిస్తుందని తామెవరూ ఊహించలేదన్నారు. రచన, అధ్యయనం, ప్రచాచాలకు బ్రౌన్ గ్రంథాలయం కేంద్రంగా నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాహిత్య ప్రచారం మరింతగా జరగాలని ఆశిస్తున్నామన్నారు. మైసూరులోని ప్రాచీన భాష అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బ్రౌన్ గ్రంథాలయం మినహా మరే దేనికీ అర్హత లేదని వైవీయూ ఆ కేంద్రాన్ని ఈ గ్రంథాలయానికి తెచ్చేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఈ మేరకు సాహితీవేత్తలంతా ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేయాలని సూచించారు. ప్రత్యేక అతిథి అలపర్తి పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వైవీయూ ఆధ్వర్యంలో బ్రౌన్ గ్రంథాలయం సాధించిన ఈ అరుదైన రికార్డు సాహిత్యాభిమానులందరికీ సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వైవీయూ రిజిస్ట్రార్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బ్రౌన్ గ్రంథాలయానికి, వైవీయూకుగల బంధాన్ని వివరించారు. డీఎస్పీ లోసారి సుధాకర్ మాట్లాడుతూ ఈ గ్రంథాలయం ద్వారా నేటి యువతలో సాహితీ స్పహ కల్పించేందుకు మరింతగా కృషి చేయాలన్నారు. నైతిక విలువల రక్షణకు సాహిత్యం మినహా మరో మార్గం లేదని పేర్కొన్నారు. డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి కార్యక్రమాల నేప«థ్యాన్ని ‘నెల నెల’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన వారందరినీ అభినందించారు. ఈ సభను నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రముఖ కవి, విమర్శకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గజ్జెల మల్లారెడ్డి జీవితం–సాహిత్యం అంశంపై ప్రసంగించారు. మల్లారెడ్డి అధిక్షేప సాహిత్యం ఎంతో పదునైనది..విభిన్నమైనదని తెలిపారు. ముఖ్యంగా తనదైన వ్యంగంతో సమకాలిన సమస్యలపై కత్తి ఝళిపించారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా నెలనెల కార్యక్రమం’ రూపకర్త రాచపాలెంను బి.కోడూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, జానమద్ది సాహితీపీఠం అధ్యక్షులు జానమద్ది విజయభాస్కర్ తదితరులు ఘనంగా సత్కరించారు. నిర్వాహకలు కార్యక్రమానికి సహకరించిన వారందరినీ కూడా సత్కరించారు. సహాయ పరిశోధకులు భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, శివారెడ్డి, బ్రౌన్ గ్రంథాలయ అధికారి హరి, చిట్టి, పలువురు సాహితీ ప్రియులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీ ఈ సందర్బంగా సభకు ముందుగా స్థానిక కోటిరెడ్డి సర్కిల్లో గల స్టేట్ గెస్ట్‌హౌస్‌నుంచి వైవీయూ విద్యార్థులు, జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు మేళ తాళాల మధ్య సాహిత్య ర్యాలీ నిర్వహించారు. ఎర్రముక్కపల్లె బ్రౌన్ సెంటర్‌లోగల బ్రౌన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ బ్రౌన్ గ్రంథాలయానికి చేరుకుంది. -
యోగి వేమన వీసీగా ప్రొ.రామచంద్రారెడ్డి
కడప: యోగి వేమన విశ్వవిద్యాలయ కొత్త వైస్ చాన్సలర్(వీసీ)గా ప్రొ.అత్తిపల్లి రామచంద్రారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు అత్తిపల్లి యోగి వేమన విశ్వవిద్యాలయ వీసీగా సేవలందిచనున్నట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ యూనివర్సిటీ ప్లాంట్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అత్తిపల్లి మొక్కలపై విసృత పరిశోధనలు చేశారు. ఫోటో సింథసిస్(రసాయనిక ప్రక్రియ) మొక్కల ఎదుగుదలకు ఎలా తోడ్పడుతోందనే అంశాన్ని గురించి కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆయన అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యువ శాస్త్రవేత్త అవార్డుతో సత్కరించింది. బొటనీలో పరిశోధనలకు ప్రొ.హీరాలాల్ చక్రవర్తి అవార్డు, బయోటక్నాలజీ ఓవర్ సీస్ అసోసియేట్ షిప్ అవార్డులను కూడా అత్తిపల్లి అందుకున్నారు. -
రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?
చిలకలపూడి (మచిలీపట్నం): మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు. జేసీగా ఆయనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అథారిటీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం. అథారిటీకి కొత్త వైస్‌చైర్మన్‌ను రెండు రోజుల్లో నియమిస్తామని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రేఖారాణికే ఈ బాధ్యతలు కట్టబెట్టవచ్చని సమాచారం. ఇప్పుడామె శాప్‌కు సారథ్యం వహిస్తున్నారు. పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన నేప«థ్యంలో పూర్తిస్థాయిలో ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. -
కీర్తి ప్రతిష్టలు పెంచాలి
జేఎన్టీయూకే 8వ ఆవిర్భావ వేడుకల్లో వీసీ కుమార్ పిలుపు బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ కీర్తి ప్రతిష్టలు మరింత పెంచాలని ఉపకులపతి వీఎస్ఎస్ కుమార్ కోరారు. వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూకే ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి చెంది దేశంలో ఉన్న వర్సిటీల్లో పేరొందిందన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తోందన్నారు. త్వరలో బీటెక్ నాల్గవ సంవత్సరం చదువుతూ 75 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను జేఎన్టీయూకే నుంచి 15 మందిని, అనుబంధ కళాశాలల నుంచి 10 మందిని ఎంపిక చేసి విదేశీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పీహెచ్డీ కోర్సులు చేసే అవకాశం రాష్ట్రప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇప్పటికే కేంద్రమానవ వనరుల శాఖ రూ.పదికోట్లు డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్‌కు మంజూరు చేసిందని, బయోటెక్నాలజీ విభాగంలో డాక్టర్ మాలోతు రమేష్ పరిశోధనలు గావించి మూడు పెటేంట్ హక్కులు సాధించి వర్సిటీ ప్రతిష్ట పెంచారన్నారు. రెక్టార్ ప్రభాకరరావు మాట్లాడుతూ నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం, ఇంక్యూబేషన్ సెంటర్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌పై దృష్టి పెట్టి వాటిని విద్యార్థులకు చేరవేయాలన్నారు. రిజిస్ట్రార్ సాయిబాబు మాట్లాడుతూ యూనివర్సీటీ పరీక్షల విభాగంలో సంస్కరణలు అమలు చేశామని, జంబ్లింగ్ విధానంతో పాటు సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నామన్నారు. జేఎన్టీయూకే మూడుసార్లు ఈసెట్, రెండుసార్లు ఎంసెట్, పీజీ ఈ సెట్ పొరపాట్లకు తావులేకుండా నిర్వహించిందన్నారు. అనంతరం కృష్ణాపుష్కరాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్‌రావు, ప్రోగ్రాం డైరెక్టర్లు పాల్గొన్నారు. -
నేడు ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని మంగళవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నట్లు రాయలసీమ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వై. నరసింహులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, గౌరవ అతిథిగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయమోహన్ హాజరుకానున్నట్లు తెలిపారు. -
ఉద్యోగ కల్పన లక్ష్యంగా కేంద్రాలు
తణుకు టౌన్: యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో ప్లేస్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ ఎం.ముత్యాలనాయుడు తెలిపారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివద్ధి కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఏటా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 30 వేల మంది డిగ్రీలు చదివి బయటకు వస్తున్నారని, వారందరికీ చదువుతో పాటు నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో కాకినాడకు చెందిన వికాస సంస్థ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ పరిధిలో తొలి మానవ వనరుల అభివద్ధి కేంద్రాన్ని తణుకులో ప్రారంభిస్తున్నామని, ఇది విజయవంతమైతే మరో 20 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవి నిరుద్యోగులకు సమాచార, శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయన్నారు. నైపుణ్య శిక్షణ.. కాకినాడ వికాస కేంద్రం ప్లేస్మెంట్ అధికారి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ చదువుతో నైపుణ్యాలు ఒడిసిపట్టుకుంటే yì గ్రీ పూర్తి కాగానే ఉద్యోగం సాధించవచ్చన్నారు. ప్రిన్సిపాల్ పి.అరుణ, కోశాధికారి నందిగం సుధాకర్, చిట్టూరి సత్య ఉషారాణి, ఏవో డాక్టర్ డి.సుబ్బారావు, డాక్టర్ జె.చంద్రప్రసాద్, నన్నయ వర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ డి.జగన్మోహన్రెడ్డి, కార్పొరేట్ ట్రెయినీ రవి, కళాశాల ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ కె.రాధాపుష్పావతి, ట్రై నర్ సంతోష్‌కుమార్, వి.వెంకటేశ్వరరావు, యూ.లక్ష్మీసుందరిబాయి పాల్గొన్నారు. -
మట్టి పనులకు వెళ్లి చదువుకున్నా
ఎప్పుడూ టీచర్లతో దెబ్బలు తినలేదు తెలంగాణ ఉద్యమం అంటే మహా పిచ్చి కేసీఆర్‌కు నచ్చితే అభిమానిస్తారు సన్మాన సభలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ సాంబయ్య పరకాల : తట్టలు ఎత్తాను... రోడ్డు పనులకు వెళ్లాను... మట్టి పనులకు వెళ్లి చదువుకున్నానని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పసుల సాంబయ్య అన్నారు. వీసీగా నియమితులైన సందర్భంగా ఆయన స్వగ్రామమైన మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో సోమవారం సన్మాన సభను నిర్వహించారు. న్యాయవాది ఏరుకొండ జయశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీసీ పసుల సాంబయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ సాంబయ్య మాట్లాడుతూ గ్రామంలో 50పైసలకు కూలీ పోయే వాడినన్నారు. నాగారం, పైడిపల్లి రోడ్డు నిర్మాణం పనికి పోయానని చెప్పారు. ఈ రోడ్డు పోసే పనికి పోయి ఇప్పుడు అదే రోడ్డుపై కారులో వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కష్టపడే తత్వం, నమ్మకం ఉంటే పైకి రావచ్చన్నారు. చదువులో అందరి కంటే ముందు ఉండేవాడినని అన్నారు. టీచర్లతో ఒక్క దెబ్బ తినకుండా చదువుకున్నానని తెలిపారు. బాగా చదివే పిల్లలను ఉపాధ్యాయులు ప్రేమిస్తారన్నారు. చదువులో రాణిం చడం కారణంగా జయపాల్, హరగోపాల్ సార్లు ప్రోత్సాహాన్ని అందించారన్నారు. చదువుతున్న క్రమంలోనే ఉద్యోగాలు వచ్చాయన్నారు. లెక్చరర్ కావాలనే ఏకైక కారణంతో కష్టపడి చదువుకున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్య మం అంటే మహా పిచ్చిగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వ్యాసాలు రాశానని చెప్పారు. అదే అనుభవంతో సమావేశాల్లో మాట్లాడి ప్రజల హృదయాలను గెలుచుకున్నానని తెలిపారు. ఆత్మకూరులో జరిగిన సమావేశంలో నా ప్రసంగం కోసం ప్రజలు పట్టుబట్టడంతో వేదికపై ఉన్న మంత్రి కేటీఆర్ ఆశ్చర్య పోయారన్నారు. టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో పాల్గొని ఎంపీ, ఎమ్మెల్యేలను మెప్పించానని తెలిపారు. నా ప్రసంగాలే సీఎం కేసీఆర్‌కు దగ్గర అయ్యేటట్లు చేసిందన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమిస్తానని అంటే తనకు ఇష్టం లేదని చెప్పానన్నారు. వరంగల్ ఎంపీ టికెట్‌ను తిరస్కరించి, వీసీ మాత్రమే కావాలని అడిగానన్నారు. తెలంగాణ యూనివర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కేసీఆర్‌కు నచ్చితే అభిమానిస్తారని అన్నారు. గొప్ప పట్టుదల ఉన్న నాయకుడని కొనియాడారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, ఎంపీటీసీ ఎరుకొండ రమాదేవి–శ్రీనివాస్, కోడూరి మల్లేశం, బాల్య స్నేహితులు గంప లింగమూర్తి, ఆనం దం, రాందాసు, హంసారెడ్డి, నర్సింహరామ య్య, కేయూ పరిశోధక విద్యార్థులు మడికొండ శ్రీను, మార్క కిరణ్, ముంజం ప్రకాష్ , సీఐ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తకు విజయం.. పాతకు పరాభవం
- ‘పీడీసీసీబీ అవిశ్వాçÜం’ అంశానికి తాత్కాలిక తెర - బ్యాంకు చైర్మన్‌కు ఫిరాయింపుల ఎమ్మెల్యేల మద్దతు - వైస్ చైర్మన్‌కు దామచర్ల, మంత్రి, కరణం, ఏలూరు మద్దతు - మెజార్టీ డైరక్టర్ల మద్దతు చైర్మన్‌కే...S - అధిష్టానానికి కొత్త ఎమ్మెల్యేల ఫిర్యాదు - ఓడిపోయి పార్టీ పరువు బజారుకీడ్చద్దంటూ బాబు, లోకేష్ సూచన - ఈదర మోహన్‌తో మంత్రి శిద్దా, ఎమ్మెల్యే దామచర్ల చర్చలు - వైస్ చైర్మన్‌తో రాజీనామా చేయిస్తామంటూ వేడుకోలు - ఎట్టకేలకు అంగీకారం తెలిపిన చైర్మన్ - అవిశ్వాస సమావేశానికి చైర్మన్ సహా డైరక్టర్లు డుమ్మా --------------------------------------- సాక్షి ప్రతినిధి,ఒంగోలు: అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన పీడీసీసీబీ అవిశ్వాస తీర్మాన వ్యవహారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తొలి విజయాన్ని అందింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల, మంత్రి శిద్దా రాఘవరావు, సీనియర్ నేత కరణం, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులతో కూడిన పాత నేతలకు పరాభవాన్ని మిగిల్చింది. టీడీపీ పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న వర్గవిబేధాల నేపథ్యంలో పీడీసీసీబీ వివాదం శిఖరాగ్రానికి చేరింది. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు లోకేష్‌ల జోక్యంతో ఈ రచ్చకు తాత్కాలికంగా తెరపడింది. చైర్మన్ ఈదర మోహన్ విజయం సాధించగా... వైస్ చైర్మన్ మస్తానయ్యకు రాజీనామా గండం తప్పలేదు. రచ్చకెక్కిన విభేదాలు.. పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్, వైస్ చైర్మన్ మస్తానయ్యల మధ్య ఇటీవల విభేదాలు పొడచూపాయి. వీరి గొడవ పీడీసీసీబీకి పాకింది. పీడీసీసీబీలో అవినీతి జరిగిందంటూ వైస్ చైర్మన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరి పాకానపడింది. వైస్ చైర్మన్ మస్తానయ్యపై చైర్మన్ వర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. గత నెల 10న అవిశ్వాస తీర్మానం జరగాల్సి ఉంది. మస్తానయ్యకు మద్దతు పలికిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రి శిద్దా రాఘవరావుల వర్గం అవిశ్వాస తీర్మానాన్ని నిలిపివేయాలంటూ బ్యాంకు చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు మస్తానయ్యకు గట్టి మద్దతు ప్రకటించారు. దీంతో అవిశ్వాస సమావేశం జరగకుండా సహకార శాఖ మంత్రి ద్వారా మినిస్టర్ స్టే తెచ్చుకున్నారు. పాత నేతలపై ఈదర ధిక్కారం.. వైస్ చైర్మన్‌కు మద్దతు పలికిన పాత నేతలపై చైర్మన్ ఈదర మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపై రాజకీయ జోక్యం తగదంటూ విమర్శలు గుప్పించారు. అంతటితో వదలక అవిశ్వాçÜం కోసం కోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు అవిశ్వాస తీర్మానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో అధికార పార్టీ పాత నేతల వర్గం ఈదర మోహన్‌పై ఆగ్రహం పెంచుకుంది. గత నెలలో ఒంగోలులో జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి పీడీసీసీబీ చైర్మన్ హోదాలో మోహన్ హాజరుకాగా, పేరు లేదంటూ పోలీసులు ఆయనను బయటకు నెట్టి వేశారు. దీంతో ఆయన అవమానభారంతో వెనుతిరగాల్సి వచ్చింది. కలిసొచ్చిన అధికార పార్టీ వర్గవిభేదాలు టీడీపీ వర్గవిభేదాల వ్యవహారం మోహన్‌కు కలిసొచ్చింది. పాత నేతలపై అక్కసుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావులు తదితరుల కోటరీ తనకు మద్దతు పలకడంతో మోహన్ పాత నేతలతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో అవిశ్వాçÜం నిర్వహించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో 26న అవిశ్వాస తీర్మానానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈదర మోహన్‌కు మెజార్టీ.. 20 మంది సభ్యులున్న పీడీసీసీబీలో మెజార్టీకి అవసరమైన 14 మంది సభ్యుల మద్దతు చైర్మన్‌కు ఉండగా, కేవలం ఆరుగురే వైస్ చైర్మన్ పక్కన నిలిచారు. దీంతో మస్తా¯Œæరావుకు మద్దతిచ్చిన పాత టీడీపీ వర్గం ఓటమి తప్పనిసరైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫిర్యాదు ఇదే సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కోటరీ ముఖ్యమంత్రితో పాటు లోకేష్‌లకు అధికార పార్టీల్లో చిచ్చుపెడుతున్నారంటూ పాత నేతలపై ఫిర్యాదు చేసింది. అవిశ్వాçÜం ఓడినా... నెగ్గినా అధికార పార్టీ పరువు బజారున పడుతుందని, అందుకు కారణం పాత నేతలే అన్న వాదన వినిపించింది. దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు అవిశ్వాస తీర్మాన సమావేశం జరగకుండా సర్దుబాటు చేయాలంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడుతో పాటు మంత్రి శిద్దాను ఆదేశించినట్లు సమాచారం. పాత నేతలకు భంగపాటు.. అధిష్టానం ఆదేశాలతో పాత నేతల వర్గం చైర్మన్‌తో చర్చలు జరిపింది. తొలుత ఆయన ససేమిరా అన్నారు. దీంతో మరింత తగ్గిన పాత నేతలు మస్తానయ్యతో రాజీనామా చేయిస్తామంటూ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే రాజీనామా చేసిన తర్వాతనే తాను రాజీకి వస్తానంటూ మోహన్ పట్టుపట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే జనార్దన్ మస్తానయ్యతో రాజీనామా లేఖను తీసుకున్నారు. ఒకటిన్నర నెలలో రాజీనామాను తామే ఆమోదింపజేస్తామంటూ హామీ ఇచ్చారు. అనంతరం తనకు మద్దతు పలుకుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చర్చించిన ఈదర వారి సూచనల మేరకు సర్దుబాటుకు సిద్ధమయ్యారు. ప్రత్యర్థిని రాజీనామా చేయించేందుకు అధికార పార్టీ పాత నేతలు హామీ సిద్ధపడటంతో అవిశ్వాస తీర్మాన సమావేశానికి గైర్హాజరయ్యేందుకు చైర్మన్వర్గం అంగీకారం తెలిపింది. దీంతో చైర్మన్‌తో సహా డైరెక్టర్లలెవరూ మంగళవారం జరగాల్సిన అవిశ్వాస తీర్మానానికి హాజరుకాలేదు. ఎట్టకేలకు మస్తానయ్యకు మద్దతు పలికిన పాత టీడీపీ వర్గానికి భంగపాటు తప్పకపోగా, తొలిసారిగా ఫిరాయింపు ఎమ్మెల్యేల వర్గం పీడీసీసీబీ వేదికగా పైచేయి సాధించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
9 వర్సిటీలకు వీసీల నియామకం
హైదరాబాద్: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డిని జేఎన్ టీయూ వీసీగా నియమించింది. తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్ వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సాంబశివరావులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఉస్మానియ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రామచంద్రం నియమితులయ్యారు.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు, కాకతీయ వీసీగా సాయన్న, ఆర్ జేయూకేటీ వీసీగా సత్యనారాయణ, పాలమూరు వర్సిటీ వీసీగా రాజారత్నం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగగా ప్రవీణ్ రావులను నియమించారు. -
ఘనంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు
-
ఘనంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు
అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం త్వరలోనే పూర్తికాల వీసీ నియామకం యూనివర్సిటీ పూర్వవైభవానికి చర్యలు చేపట్టాలి ఉత్సవాల నిర్వహణకు సలహా మండలి ఏర్పాటు చేయాలి సాక్షి, హైదరాబాద్: నిజాం హయాం నాటి ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా వచ్చే ఏడాది శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీకి పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల నిర్వహణపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య తదితరులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 1917లో ప్రారంభమైన ఓయూ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించిందని...వర్సిటీలో చదివిన ఎందరో విద్యార్థులు దేశవిదేశాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారన్నారు. వర్సిటీ నుంచి పట్టా పొందడాన్ని విద్యార్థులు ఎంతో గొప్పగా, ప్రత్యేకమైనదిగా భావించే వారని, తమ నామఫలకం (నేమ్‌ప్లేట్)పై విద్యార్హతలతోపాటు ఓఎస్ఎం అని రాసుకునే వారని సీఎం గుర్తుచేశారు. ఇప్పటికీ వివిధ రంగాల్లోని ప్రముఖుల్లో ఉస్మానియా నుంచి చదివిన వారే ఎక్కువ మంది ఉండటం విశేషమన్నారు. అలాంటి యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. ఉత్సవాలపై నివేదిక ఇవ్వండి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీకి ఏం కావాలి, ఇందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని విద్యాశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే వర్సిటీకి పూర్తి కాల వీసీని నియమిస్తామన్నారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, ఎంపీ కె.కేశవరావు వంటి అనుభవజ్ఞులు, యూనివర్సిటీతో అనుబంధమున్న వారితో సలహా మండలిని ఏర్పాటు చేసి శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉస్మానియాలో చదివి విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఉత్సవాల్లో భాగంగా ఎన్ఆర్ఐ సదస్సును నిర్వహించాలని సీఎం సూచించారు. 1975 వరకు తెలంగాణలోని విద్యా సంస్థలన్నీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నాయని...అందుకే ఇక్కడ చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరినీ భాగస్వాములను చేయాలన్నారు. వర్సిటీలో చదివిన విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, సాహితీవేత్తలు, సివిల్ సర్వెంట్లు, కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు, జర్నలిస్టులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖుల జాబితా రూపొందించి వారందరినీ ఉత్సవాలకు ఆహ్వానించాలని సూచించారు. నకిలీ సర్టిఫికెట్లకు స్థానం లేదు విద్యా వ్యవస్థను బలహీనపరుస్తూ పరీక్షలను అపహాస్యం చేసేలా ప్రవర్తించే వ్యక్తులు, శక్తులపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పోలీస్ శా ఖను ఆదేశించారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, నకిలీ సర్టిఫికెట్లకు స్థానం లేదని... తప్పుడు పద్ధతులు అవలంబించే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలన్నారు. ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ పొరపాటు జరగడానికి అవకాశం ఉందో గమనించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. -
బెలుం గుహల్లో కొలకలూరి ఇనాక్
కొలిమిగుండ్ల: బెలుం గుహలను ఆదివారం పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ఎస్కె ఎస్వీ యూనివర్శీటీల రిటైర్డ్ వైస్‌చాన్సలర్ కొలకలూరి ఇనాక్ తిలకించారు. గుహల మేనేజర్ ఏఎంవీ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం భూగర్భంలో ఏర్పడిన వివిధ ఆకతులను సందర్శించారు. గుహలు ఏర్పడిన విధానం, ప్రాముఖ్యత తదితర అంశాలపై మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. భూమి లోపల విశాలంగా ఏర్పడి గుహలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. -
నమ్మించి...వంచించి..!
► మాచర్ల మునిసిపాలిటీలో టీడీపీ కొత్త డ్రామా .. ► పదవి నుంచి దిగిపోవాలని చైర్‌పర్సన్‌పై ఒత్తిడి ► ససేమిరా అంటున్న చైర్పర్సన్ వర్గీయులు ► గ్రూపులుగా విడిపోయిన అధికార కౌన్సిలర్లు ► మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి ► వైస్ చైర్పర్సన్ నెల్లూరు మంగమ్మ ఏరుదాటాక తెప్ప తగలేయడం అధికార పార్టీకి అలవాటే అంటున్నారు. నమ్మించి వంచించడంలోనూ అంతేనంటున్నారు. ఓట్ల కోసం దేనికైనా ఒడిగడతారని, అవసరమైతే మాటలు చెప్పి మభ్యపెడతారంటున్నారు. ఈ కోవలోనే మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోతూ, అధికారపార్టీ అంటేనే అసహ్యించుకునే రీతిలో చైర్పర్సన్ సామాజిక వర్గీయులు రగిలిపోతున్నారు. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చేందుకు వర్గాలను వాడుకొని ఆ తర్వాత కూరలో కరివేపాకులా ఏరిపారేయడం అధికార పార్టీ నేతలకు అలవాటు. జిల్లాలోని మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ వ్యవహారంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. మున్సిపాల్టీలో ఎక్కువ ఓటర్లు ఉన్న ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చైర్పర్సన్ పదవిని ఎరచూపారు. ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థితో భారీగా ఖర్చు పెట్టించారు. తీరా గెలుపొందిన తర్వాత అధికార పార్టీ అసలు రూపం చూపించారు. చైర్‌పర్సన్‌కు ఏ పనిలోనూ సహకరించకుండా అడుగడుగునా అవస్థలకు గురిజేశారు. ఒప్పందంలో భాగమంటూ ఇప్పుడు పదవి నుంచి దిగిపోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. కౌన్సిలర్లు గ్రూపులుగా విడిపోయినట్లు డ్రామాలాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకి.... టీడీపీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గోపవరపు శ్రీదేవిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. పదవి చేపట్టినప్పటి నుంచి అధికార పార్టీ సామాజిక వర్గ నేతలు, కౌన్సిలర్లు ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్లో ఆమోదించాల్సి వచ్చినప్పుడల్లా గైర్హాజరవుతూ కోరం లేకుండా చేస్తూ అడుగడుగునా అడ్డుపడ్డారు. అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో దూషణలకు దిగడమే కాకుండా చైర్పర్సన్, ఆమె భర్తపై భౌతిక దాడులకు సైతం తెగబడ్డారు. సుమారు ఆరు కోట్ల నిధులు ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు చేసే అవకాశం లేకుండా చేశారు. పలు సార్లు కౌన్సిల్ సమావేశాల సాక్షిగా చైర్పర్సన్, ఆమెకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లను అవమానించారు. పదవి నుంచి దిగేందుకు ససేమీరా అంటున్న చైర్పర్సన్ వర్గం... ఒప్పందం ప్రకారం జూలై 2వ తేదీన నూతన చైర్‌పర్సన్‌గా ప్రస్తుత వైస్ చైర్మన్ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. తమకాలంలో ఒక్క పనికి కూడా సహకరించనందుకు తాము పదవి నుంచి దిగే సమస్యే లేదని చైర్పర్సన్ వర్గం భీష్మించి కూర్చుంది. వైస్ చైర్మన్ నెల్లూరు మంగమ్మను చైర్పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ, మంత్రి సైతం శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవసరమైతే చైర్‌పర్సన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు. పదవి కోసం డ్రామా.... ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా వారు పట్టీ పట్టనట్లు వ్యవహరించిన తీరుపై చైర్పర్సన్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఖండించని నియోజకవర్గ ఇన్చార్జితోపాటు, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు వారి సామాజిక వర్గం నేతను చైర్మన్‌గా కూర్చొబెట్టేందుకు రాజకీయ డ్రామాకు తెరలేపారు. గ్రూపులుగా విడిపోయినట్లు నటిస్తూ చైర్పర్సన్ సామాజిక వర్గానికి దూరం కాకుండా వ్యవహారం నడుపుతున్నారు. చైర్పర్సన్ ఇబ్బందులకు గురిచేసినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారంటూ ఆర్యవైశ్య నాయకులు జిల్లా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
నకిలీ వైస్‌చాన్స్‌లర్...
బెంగళూరు: నకిలీ యూనివర్శిటీని ప్రారంభించి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు విద్యాసంస్థల యాజమాన్యానికి కుచ్చుటోపి పెట్టిన ఘనుడిని బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విచారణలో ఎంబీయే చదివిన ఈ నిందితుడు ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిని తన కార్యాలయంలో ఉద్యోగిగా నియమించుకున్నట్లు తేలడం గమనార్హం. యూనివర్శిటీనే సష్టించాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంతోష్ లెహర్ 2004లో బెంగళూరుకు చేరుకుని ఇక్కడే ఎంబీఏ పూర్తి చేశాడు. అటుపై కొన్ని ప్రముఖ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఏడాది క్రితం ఉద్యోగానికి ఫుల్‌స్టాఫ్ పెట్టేశాడు. నగరంలోని బన్నేరుఘట్ట రోడ్డులో ‘బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఇందుకు తనకు తాను వైస్ చాన్స్‌లర్‌గా ప్రకటించుకున్నాడు. అనంతరం ఇంటర్నెట్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలను సంప్రదించి ‘ దేశంలో ఎవరైనా ఇక పై నర్సింగ్, పారామెడికల్ కోర్సులకు సంబంధించి విద్యా సంస్థలను ప్రారంభించాలన్నా, లేక ఇప్పటికే ఉన్న కళాశాలల్లో సదరు కోర్సులను మొదలు పెట్టాలన్నా తమ యూనివర్శిటీ అనుమతి తప్పని సరి.’ అని పేర్కొనడంతో పాటు ఇందుకు సంబంధించిన నకిలీ ధృవీకరణ పత్రాలను కూడా వారికి అందజేసేవాడు. ఈ పత్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ పత్రాలను పోలి ఉండటం గమనార్హం. ఇందుకు ఏదేని విద్యాసంస్థ యాజమాన్యం ప్రతిస్పందించిందంటే సంతోష్ లెహర్ ఇక తన చాతుర్యాన్ని ప్రదర్శించేవాడు. ప్రతిస్పందించిన వారి వద్దకు ఎర్రబుగ్గ ఉన్న కారులో వెళ్లేవాడు. వారు ఇప్పటికే విద్యాసంస్థలను నిర్వహిస్తుంటే వివిధ రకాల పేర్లతో పరిశీలనలు జరిపి డబ్బు గుంజేవాడు. ఈ విధంగా ఇప్పటి వరకు కేరళ, తమిళనాడురాష్ట్రాలతోపాటూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, చుట్టుపక్కల ఉన్న పలు విద్యాసంస్థల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేశాడు. వంచన ఇలా బయటపడింది... ఈ ఏడాది ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్లో బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్ నకిలీదంటూ పశ్చిమ బెంగాల్లో ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో గతంలో ఈ వర్శిటీ నుంచి వివిధ రకాల కోర్సులకు అనుమతి పొందిన చెన్నై కు చెందిన వీరిస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షుడు టీసీ.అరివళగన్, సంతోష్ లెహర్‌ను ప్రశ్నించారు. అయితే అవన్నీ గిట్టనివారు చేస్తున్నారని పట్టించుకోనవసరం లేదని సంతోష్ లెహర్ చెప్పి అప్పటికప్పుడు మభ్యపెట్టారు. అటు పై మే 4న వంచన కేసులో ‘బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్ సీఈఓ శ్యామల్ దత్త అరెస్టైన విషయం అక్కడి వార్తా పత్రికలతో పాటు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. అంతేకాకుండా సదరు సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉన్నట్లు కూడా తెలిపాయి. విషయం తెలుసుకున్న టీ.పీ అరివళగన్ నగరంలోని పోలీసులను సంప్రదించారు. అప్పటికే ఈ విద్యాసంస్థ విషయమై సమాచారం అందుకున్న నగర పోలీసులు బన్నేరుగట్టలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆ సంస్థ శాఖల పై ఏ కాలంలో దాడుల చేశారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నిందితుడైన సంతోష్లెహర్ పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ కమిషనర్ శరప్ప ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివిధ చోట్ల గాలింపు చేపట్టారు. చివరికి బంధువుల ఇంట్లో ఉన్న సంతోష్లెహర్ను అరెస్టు చేశారు. దర్యాప్తులో ఇతను వివిధ సంస్థల నుంచి ఇప్పటి వరకూ రూ.78.40 లక్షలను పరిశీలన రుసుం పేరుతో వసూలు చేసినట్లు తేలింది. ఇదిలా ఉండగా ఇతని కార్యాలయం, ఇంటిలో పెద్ద సంఖ్యలో కోర్సుల ప్రారంభానికి సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలు, స్టాంప్ పేపర్లు, రబ్బరు స్టాంపులతో పాటు రూ.8.96 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇతని పేరు పై ఉన్న బ్యాంకు ఖాతాలోని రూ.27లక్షల నగదుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపకూడదని సంబంధింత అధికారులకు బ్యాంకు అధికారులకు పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా ఇతని వద్ద ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పనిచేస్తుండేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సంతోష్ లెహర్ మోసంలో సదరు విశ్రాంత ఐఏఎస్ అధికారి పాత్ర తేల్చడానికి పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఏయూ వీసీగా నాగేశ్వరరావు?
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఆచార్య జి.నాగేశ్వరరావు నియమితులైనట్లు వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయం నుంచి ఈ విష యం క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మా రింది. ఏయూ వీసీగా బీసీ సామాజిక వర్గానికి చెం దిన వ్యక్తిని నియమిస్తారని గత కొంత కాలంగా వినిపిస్తోంది. అందుకు తగినట్లే సెర్చ్ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ముగ్గురు పేర్ల జాబితాలో ఆచార్య నాగేశ్వరరావు పేరు ముందు వరుసలో ఉన్నట్లు గత నెల రోజులుగా చర్చ జరుగుతోంది. కాగా గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏయూ వీసీగా నాగేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. వివిధ చానళ్లు, వెబ్సైట్లలో స్క్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఫైలుపై గవర్నర్ సంకతం అనంతరం సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వ జీవోలు పొందుపరిచే వెబ్సైట్ మధ్యాహ్నం నుంచి పనిచేయకపోవడంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. నేడో, రేపో వీసీ నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది. కాగా ఆచార్య జి.నాగేశ్వరరావు ప్రస్తుతం ఏయూ సైన్స్ కళాశాల ప్లేస్మెంట్ అధికారిగా, అసోసియేట్ ప్లేస్మెంట్ అధికారిగా సేవలు అందిస్తున్నారు. పరిశోధనల్లో 36 మందికి మార్గదర్శనం చేశారు. రసాయన శాస్త్రంలో ఇనార్గానిక్ విభాగ నిపుణుడిగా సుపరిచితులు. -
అగ్రీ వర్సిటీ వీసీ పోస్టుకు పోటాపోటీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పోస్టుకు రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి గుంటూరుకు సమీపంలోని లాంఫారానికి తరలిపోయిన విశ్వవిద్యాలయానికి పాలక మండలి వ్యవహారం కొలిక్కి రావడంతో ఇక పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇతర యూనివర్శిటీల మాదిరి వ్యవసాయ వర్శిటీకి వైస్ ఛాన్సలర్ నియామకానికి సెర్చ్ కమిటీ (శోధక సంఘం) ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ రంగ ప్రముఖులతో చర్చించి తనకు ఇష్టమైన వారిని నియమించుకునే స్వేచ్ఛ ఉంది. ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో ప్రస్తుత ఇన్చార్జీ వీసీ విజయకుమార్‌తో పాటు నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ వరప్రసాద్, మరట్వాడ యూనివర్శిటీ వీసీగా ఉన్న తెలుగు వ్యక్తి డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, యూనివర్శిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణ, యూనివర్శిటీ ప్రస్తుత అధికారులు ఆర్. వీరరాఘవయ్య, రమేష్‌బాబు, డాక్టర్ సుధాకర్, ఆలపాటి సత్యనారాయణ తదితరులున్నారు. అధికార పార్టీలోని తమ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యలతో ఎవరికి వారు పైరవీలు చేయించుకుంటున్నారు. -
వీసీకే దక్కని న్యాయం!
సాధారణంగా అసమ్మతి అధ్యాపకులు, విద్యార్థులు ఆర్టీఐని దుర్వినియోగం చేస్తూ మమ్మల్ని వేధించుకు తింటున్నారని ైవైస్ చాన్స్లర్లు, విశ్వవిద్యాలయ అధికారులు ఆర్టీఐని నిందిస్తూ ఉంటారు. కాని ఆర్టీఐ ఒక వైస్ చాన్స్‌లర్‌కు కూడా ఏ విధంగా న్యాయమైన సాయం అందిస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అస్లాం సమాచార చట్టం కింద దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది. ముందు ఇన్చార్జిగా ఆ తరువాత పూర్తికాలపు వైస్ చాన్స్‌లర్ గానూ ప్రొఫెసర్ అస్లాం నియమితులైనారు. ఇగ్నో కొన్ని అవకతవకలకు, లోపాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదులపైన 18 నవంబర్ 2014న దర్యాప్తునకు ఆదేశించారు. అనుమతి లేకుండా క్యాంపస్ బయట సెంటర్లు తెరవడం, జ్ఞాన్ దర్శన్, జ్ఞాన్ వాణి టీవీ కార్యక్రమాలను నిలిపివేయడం, భారత సైన్యానికి ఉద్దేశించిన కోర్సులను మూసివేయడం, చాలా మంది ప్రొఫెసర్లు రాజీనామా చేయవలసి రావడం, నిధులు వచ్చినా చైర్ నియామకాలు జరపకపోవడం, రిజిస్టర్ చేయకుండా ఇగ్నో రిలీఫ్ ఫండ్‌ను సృష్టించడం, భారత సైన్యం 28 కోట్లు, వైమానిక దళం ఉద్యోగులు 5 కోట్లు నిధులు ఇచ్చినా వారికి పరీక్ష లు నిర్వహించకపోవడం వంటి అవకతవకల గురించి విచారణ ను ఆదేశించారు. గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆధ్వర్యంలో విచారణ సమంజసంగా జరగడానికి వీలుగా 28.11.2014 నాడు ైవైస్ చాన్స్‌లర్‌ను సెలవుపై వెళ్లమని మానవ వనరుల మంత్రిత్వ అధికారులు ఆదేశించారు. ఇది కేవలం విచారణే కాని వైస్ చాన్స్‌లర్ పైన నిందారోపణ కాదని ఆ శాఖ వివరించింది. దర్యాప్తు పూర్తయి నివేదిక సిద్ధంగా ఉన్నా తనకు ఇవ్వడం లేదని సహ దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే నివేదికను పరిగణించేముందు, ప్రొఫెసర్ అస్లాంను మళ్లీ పదవిలోకి తీసుకునే ముందు తమ అనుమతి తీసుకోవాలని 20.2.2015న మంత్రిత్వ శాఖ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు లేఖ రాసింది. ఈ విచారణ నివేదికను ఇగ్నో విజిటర్ అయిన భారత రాష్ర్టపతికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ అస్లాం పిటిషన్‌పైన భారత ప్రభుత్వ న్యాయవాది విచారణ నివేదికను 3 సెప్టెంబర్ 2015న విజిటర్‌కు సమర్పిస్తామని ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చారు. అక్టోబర్ 7, 2015న హైకోర్టు విచారణ నివేదికను రాష్ర్టపతికి ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక సారాంశాన్ని వెంటనే విడుదల చేయరాదని, మూసిన కవర్లో కోర్టుకు నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించారు. రాష్ర్టపతి త్వరగా నిర్ణయం తీసుకునే వీలుందేమో ఆలోచించండి అంటూ ఢిల్లీ హైకోర్టు 15.12.2015న ఒక ఆదేశాన్ని జారీ చేసింది. 25.1.2016 నాడు మళ్లీ ఢిల్లీ హైకోర్టు విజిటర్ భారత రాష్ర్టపతి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తూ విచారణ ముగించింది. ఇంతకూ భారత రాష్ర్టపతికి నివే దిక అందిందా లేదా తెలియదు. విపరీ తంగా ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రొఫె సర్ అస్లాం వైస్ చాన్స్‌లర్ పదవీకాలం గడిచిపోతూ ఉంటుంది. సాధార ణంగా ఆలస్యం వల్ల కోరిన సమా చారం పనికి రాకుండా పోతుంది. కాని ప్రొఫెసర్ అస్లాం ఒక్కో రోజు ఆలస్యం వల్ల ఒక్కోరోజు పదవీకాలాన్ని కోల్పోతున్నారు. ఇంకొన్నాళ్లకు పదవీ కాలం పూర్తిగా ముగిసిపోవచ్చు. సమాచార వితరణలో ఆలస్యం సహ చట్టం కింద ఉల్లంఘనే. సమాచార నిరాకరణే కాకుండా, ప్రొఫెసర్ అస్లాం వైస్ చాన్స్‌లర్‌గా కొనసాగే హక్కుకూడా హరిస్తోంది. విచారణలో ఉంది కనుక నివేదిక ప్రతి ఇవ్వజాలమనే రక్షణ ఇప్పుడు ఎంహెచ్ఆర్డీకి లేదు. ఇగ్నో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అస్లాంకు దూరవిద్యలో నిపుణుడని మంచి పేరు ఉంది. ఆయనమీద వ్యక్తిగతమైన ఆరోపణేదీ లేదని సంబంధిత అధికారులే వివరణ ఇచ్చారు. సక్రమంగా పరిశోధన జరిపి ప్రొఫెసర్ అస్లాం సైరైన వ్యక్తి అని భావించి ఆయనను వైస్ చాన్స్‌లర్‌గా నియమించారు. విచారణ నివేదిక ఇవ్వకపోవడం వల్ల ఆయన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు. ఏ దర్యాప్తు కారణంగా ఆయన సెలవుపై వెళ్లవలసి వచ్చిందో, ఆ ఆరోపణలపై దర్యాప్తు నివేదికను కోరుకునే హక్కు ప్రొఫెసర్ అస్లాంకు ఉంది. ఇది సహజన్యాయం కూడా. కానీ దర్యాప్తు నివేదికను ఇచ్చిన తరువాత కూడా రాష్ర్టపతికి ఇస్తున్నామని, మున్ముందు ఇస్తామని అంటూ కాపీ ఇవ్వకపోవడం న్యాయం కాదు. నివేదికను బట్టి సత్వర చర్య తీసుకోవడం సుపరిపాలన అవసరం. ఏ చర్యా తీసుకోకపోవడం వెనక ఏవో శక్తులు ఉన్నాయని ప్రొఫెసర్ అస్లాం అనుమానిస్తున్నారు. ప్రొఫెసర్ అస్లాం వయసుకు, పదవికి, పేరు ప్రతిష్టలకు కనీస గౌరవం ఇచ్చినా విచారణ నివేదికను నిలిపివేయడం జరిగేదికాదు. ఇప్పుడీ విచారణ నివేదిక రాష్ర్టపతికి ఇస్తారా ఇవ్వరా, దీనిపైన ఏవైనా చర్యలు ఉంటాయా లేదా? ప్రొఫెసర్ అస్లాంను వైస్ చాన్స్‌లర్ పదవిలోకి రానిస్తారా రానివ్వరా తెలియని గందరగోళం కొనసాగుతున్నది. నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వాధికారులు కాలహరణం చేయడాన్ని ప్రశ్నించడానికే ఆర్టీఐ వచ్చింది. నివేదిక ప్రతి ఎప్పుడు ఇస్తారు? ఏ చర్య తీసుకున్నారు. నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కమిషన్ ఆదేశించింది. (ప్రొఫెసర్ అస్లాం, వర్సెస్ ఎంహెచ్ఆర్డీ CIC/CC/A/2015/004250-SA కేసులో 29.3.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com - మాడభూషి శ్రీధర్ -
వీసీ క్వాష్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వైస్ చాన్సలర్ పొదెల అప్పారావు వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వీసీ అప్పారావు క్వాష్ పిటిషన్ సవాల్ చేస్తూ విద్యార్థులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ సుసైడ్ నోట్ జిరాక్స్ కాపీని కోర్టుకు పోలీసులు సమర్పించారు. అయితే రోహిత్ సూసైడ్ నోటు.. ఒరిజినల్ కాపీ ఎందుకు సమర్పించలేదని పోలీసులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో విచారణ బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, గతంలో సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మనస్తాపంతో యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
కొత్త వివాదంలోకి జేఎన్‌యూ వీసీ
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. యూనివర్సిటీలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయగా.. అసలు పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ఎలా ప్రవేశించారనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. వైస్ ఛాన్సలర్ ఎం జగదీశ్ కుమారే స్వయంగా పోలీసులను ఆహ్వానించాడని, వారిని క్యాంపస్ లోకి అనుమతించాడని తాజాగా ఓ లేఖ బయటపడింది. అయితే, అంతకుముందు వీసీ కుమార్ మాట్లాడుతూ అసలు తాను పోలీసులకు అనుమతి ఇవ్వనే లేదని చెప్పిన నేపథ్యంలో ఈ లేఖ స్వయంగా ఆయనే పోలీసులకు రాసినట్లు తాజాగా బయటపడటం కొంత ఆసక్తిని కలిగిస్తోంది. వీసీ ఏవో నిజాలు దాచిపెడుతున్నారని యూనివర్సిటీలోని పలువురు విద్యార్థినాయకులు, నాన్ టీచింగ్, టీచింగ్ స్టాఫ్‌లలో కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నెల 9న క్యాంపస్‌లోకి పోలీసులకు అనుమతిస్తూ ఆయన స్వయంగా సంతకం చేసిన లేఖ ఒకటి తాజాగా బయటపడింది. ఆరోజే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. -
సమ్మెలు అవసరం లేదు: జేఎన్ యూ వీసీ
న్యూఢిల్లీ: ఎవరైనా శాంతియుతంగా తమ అభిప్రాయాలు వెల్లడించొచ్చని జవహర్ లార్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్ యూ) వైస్ ఛాన్సలర్ జగదీశ్ కుమార్ అన్నారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోబోమని స్పష్టం చేశారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని, సమ్మెలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. క్యాంపస్ లో తలెత్తిన వివాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ వేశామని తెలిపారు. ఈనెల 25లోగా కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు. క్యాంపస్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, జేఎన్ యూ అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. -
వీసీల నియామకాలను రాజకీయం చేయొద్దు
- కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా చట్ట సవరణ సరికాదు: హైకోర్టు - వీసీల నియామకాలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయి - మధ్యంతర ఉత్తర్వులు జారీ.. తదుపరి విచారణ 23కు వాయిదా సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ల(వీసీ) నియామకాలను రాజకీయ నియామకాలుగా చేయడం ఎంత మాత్రం సబబు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాన్ని అన్వయించుకుంటే దానికి శాసన వ్యవస్థ ద్వారా మాత్రమే సవరణలు చేయాలి తప్ప.. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కాదని పునరుద్ఘాటించింది. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చేపట్టబోయే వైస్ చాన్స్లర్ల నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ అంశాన్ని వీసీల నియామకపు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 23న కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్టసవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? లేదా? అన్న విషయంపై తుది విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో 29, జీవో 38ను సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.మనోహర్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. యూజీసీ పే స్కేళ్లను సవరించి వాటిని 2014 నుంచి వర్తింపచేసేందుకు జారీ చేసిన ఉత్తర్వులనూ సవాలుచేశారు. ఈ వ్యాజ్యాలను సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆర్డినెన్స్ తేవడంలో అర్థమేంటి? పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఏపీలోని చట్టాన్ని అన్వయింప చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ చట్టానికి ఉత్తర్వు ద్వారా సవరణ తెచ్చింద న్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీలకు గవర్నర్ చాన్స్‌లర్‌గా ఉండే వారని, ఇప్పుడు దాన్ని సవరించిందని తెలిపారు. ఇందుకు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఇది కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగో వ్యాజ్యమని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తమకున్న అధికారం మేరకే వ్యవహరించామని వివరించారు. ఈ సందర్భంగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు విషయంలో మొదట జారీ చేసిన జీవో 207ను రద్దు చేసి.. మరో ఆర్డినెన్స్ జారీ చేయడంలో అర్థమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. మేయర్ ఎన్నికల సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ జీవో రద్దు చేసి ఆర్డినెన్స్ తెచ్చాం తప్ప మరే ఉద్దేశం లేదని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అలాగే దేశంలో చాలా వర్సిటీలకు చాన్స్లర్లుగా గవర్నర్లు లేరని చెప్పారు. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ వివాదం పదేపదే తలెత్తుతోందని, అందువల్ల అన్ని వ్యాజ్యాలపై తుది విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ రోజున ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు ఆర్డినెన్స్‌ను తమ ముందుంచాలని ఏజీకి తేల్చి చెప్పింది. -
వర్సిటీ వైస్ చాన్స్లర్లు ఎలా ఉండాలి?
అభిప్రాయం విశ్వవిద్యాలయాలు అత్యున్నత స్థాయి విద్యా సంస్థలు. చిన్నప్పటి నుండి అనేక రకాల పాఠ్యాంశాలను అభ్యసించిన విద్యా ర్థులు చివరగా ఒక నిర్దిష్టాంశాన్ని ఎన్నుకుని దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి కొండంత ఆశతో విశ్వవిద్యాల యంలోకి అడుగుపెడతారు. విశ్వవిద్యాల యాలు వైస్ చాన్స్లర్ల నాయకత్వంలో పని చేస్తుంటాయి. ఇదొక పెద్ద ప్రపంచం. అందుకే విశ్వవిద్యాలయమన్నారు. ఈ ప్రపంచానికి నాయకులు వైస్ చాన్స్లర్లు. విశ్వ విద్యాలయ ప్రగతి, గౌరవాలు వీళ్ళు భుజస్కంధాల మీద మోస్తూ ఉండాలి. ఒక్క మాటలో విశ్వవిద్యాలయ రథానికి ఇరుసు వైస్ చాన్స్‌లర్. తమ పిల్లలు తమకన్నా మించిన జ్ఞానవంతులు, ప్రయో జకులు అవుతారన్న గట్టి నమ్మకంతో వాళ్ళను తల్లిదండ్రులు విశ్వవిద్యాలయంలోకి పంపిస్తారు. అత్యున్నత విద్య ద్వారా తమ పిల్లలు తమ జీవితం కన్నా మంచి జీవితం పొందాలని ఆశిస్తారు. ఈ నమ్మకాలు, ఈ ఆశలు వమ్ము కాకుండా, విఫలం కాకుండా చూసే బాధ్యత వైస్ చాన్స్లర్ల పైన ఉంది. ఇంతటి బాధ్యతగల పదవిలోకి ప్రభుత్వం పంపించే వైస్ చాన్స్లర్లు ఎలాంటి వాళ్లై ఉండాలి? విశ్వవిద్యాలయాలు హేతువాదానికి, లౌకికవాదానికి, శాస్త్రీయ దృక్పధానికీ నిలయాలుగా ఉండాలని ప్రథమ భారత ప్రధాని పండిత జవ హర్ లాల్ నెహ్రూ ఆకాంక్షించారు. విద్యా ర్థులు వాటిని జీర్ణించుకుని విద్య ముగించుకుని బయటికెళ్ళిన తరువాత భారతదేశాన్ని ఈ సూత్రాల మీదనే పునర్నిర్మాణంలో చేయడానికి కృషి చేస్తారని ఆయన భావించి ఉంటారు. ఇంతపని జరగాలంటే వైస్ చాన్స్లర్లలో ఈ మూడు లక్షణాలు ఉండాలి. వీళ్ళు హేతువాదులు, లౌకిక వాదులైఉండాలి. శాస్త్రీయ దృక్ప థాన్ని అలవరచుకొని విశ్వవిద్యాలయాన్ని నడిపించాలి. కానీ, ఇవాళ మన విశ్వవిద్యాలయాలు ఇందుకు భిన్నంగా, తలకిందులుగా వేలాడుతున్నాయి. ఈ మూడు సూత్రాలమీద నమ్మకం లేని ఆచార్యులు ‘‘వైస్ చాన్స్‌లర్ పదవి’’ని ‘‘అలంకరి స్తున్నారు’’. నిరక్షరాస్యులలో జీర్ణించుకుపోయిన విశ్వాసాలు, అభి రుచులు, ఆలోచనలు గల విద్యావంతులు వైస్ చాన్స్లర్లు అవు తున్నారు. చాన్స్‌లర్ అధ్యక్షుడైతే, వైస్ చాన్స్‌లర్ ఉపాధ్యక్షుడు కావాలి. కానీ చాలామంది వైస్ చాన్స్లర్లు తమ కార్యాలయాల దగ్గర ఉపకులపతి అని బోర్డు త గిలించుకుని ఉంటారు. నెహ్రూజీ విశ్వవిద్యాలయాలలో ఉండాలని పేర్కొన్న మూడు అంశాలకు ‘ఉపకులపతి’ వ్యతిరేకమైనది. కుల వ్యవస్థ వల్లే భారతదేశం ఇంకా కురుక్షేత్రంగా ఉంది. కుల, మత భారతదేశం స్థానంలో లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్యవాద భారతదేశ నిర్మాణం లక్ష్యంగా భారత రాజ్యాంగం నిర్దేశించుకున్నది. దీనికి ‘కుల పతులు’ పనికిరారు. రాజ్యాంగం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అను గుణంగా పౌరులను తయారు చేయడం విశ్వవిద్యాలయ బాధ్యత. అక్కడే ‘కులపతులు’ ఉంటే అక్కడ ప్రాణం పోసుకునేది కులాలే. వైస్ చాన్స్లర్లు ‘కులపతులు’గా మురిసిపోతుంటే సమాజానికి దిక్కెవరు? విశ్వవిద్యాలయమంటే కుల, మత, అజ్ఞాన రోగులకు చికిత్స చేసే కేంద్రమని అర్థం. అలాంటి సంస్థకు ‘ఉపకులపతులు’ నాయకులుగా పనికిరారు. ‘కోడలుదిద్దిన కాపురం’ సినిమాలో ‘ఈ దేశంలో పుట్టిన ప్రతి అడ్డగాడిదకు ఒక కులం ఉంటుంది’ అంటారు ఎన్.టి. రామారావు. భారతదేశం కుల సమాజం, మత సమాజం. విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్లను కూడా వీటి ప్రాతి పదిక పైనే నియమిస్తున్నారు. ఒక ‘ఆచార్యుడు’ ైవైస్ చాన్స్‌లర్‌గా నియమితుడైన తరువాత ఆయన/ఆమె అందరి వ్యక్తి కావాలి. తన కులాన్ని, తన మతాన్ని తన ఇంట్లో అటకమీద పెట్టి రావాలి. ‘విశ్వనరుడు’గా విశ్వవిద్యాలయంలోనికి అడుగుపెట్టాలి. అంతే తప్ప తన కులమతాలను తీసుకొచ్చి విశ్వవిద్యాలయంలో దించేస్తే అక్కడ మిగిలిలేది బూడిదే. ఇప్పుడు వైస్ చాన్స్‌లర్ పదవికి ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు సాంకేతికమైనవే తప్ప తాత్వికమైనవి కావు. అయిదేళ్లో, పదేళ్లో ఆచార్యులుగా అనుభవం ఉండటం. కొన్ని పరిశోధనలు చేయించి ఉండటం, కొన్ని ప్రచురణలు చేసి ఉండటం, ఇలాంటివే ఇప్పుడున్న అర్హతలు, ఇవి అవసరమైనవే. కానీ ఇవే సర్వస్వం కాదు. ఇప్పుడు ఈ అర్హతలు లేని ఆచార్యులు ఉండరు. వీళ్లలో అత్యధికులు ‘ఉపకులపతి’ నామప్రియులే. ఉపాధ్యక్షులు కాదగిన సమర్థులు తక్కువ మందే ఉంటారు. ప్రభుత్వం వీళ్ళను వెతికి పట్టుకోవాలి. ఎక్కువమంది వైస్ చాన్స్లర్లు సామాజిక వైజ్ఞానిక, శాస్త్రాలకు చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్లు ఆయా శాస్త్రాలలో నిష్ణాతులుగా కూడా ఉంటారు. కానీ తాత్వికతలో, సామాజిక చైతన్యంలో వాళ్ళు మామూలు వాళ్లుగానే ఉంటారు. శాస్త్రాలు చదువుకుంటారు గానీ శాస్త్రీయ దృక్పథం ఉండదు. ఇందువల్ల విశ్వవిద్యాలయాలకు నష్టం తప్ప ప్రయోజనముండదు. కర్మ సిద్ధాంతం, పూర్వ జన్మ సుకృతం వంటివి చెప్పడానికి ఎంఏలు, ఎంఎస్‌లు ఎందుకు? పీహెచ్‌డీలు ఎందుకు? అలాంటి వాళ్ళకు వైస్ ఛాన్స్లర్ పదవి ఎందుకు? కర్మ సిద్ధాంతం శ్రమ దోపిడీ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాం తాన్ని పట్టుకుని వేలాడే వైస్ చాన్స్లర్లు ఇక విద్యా సంస్థలను ఎలా ముందుకు తీసుకుపోతారు? ఆధునిక విద్యకు కర్మ సిద్ధాంతానికి సంబంధం లేదు. కర్మ సిద్ధాంతం వ్యాపారుల సిద్ధాంతం, విద్యావంతుల సిద్ధాంతం కాదు, తాత ముత్తాల నాటి విశ్వా సాలను నిర్మూలించి ఆధునిక వైజ్ఞానిక ఆలోచనలను రేకెత్తిం చవలసిన విశ్వవిద్యాలయంలోకి కర్మవాదులు రావడం నష్ట దాయకం. వాళ్ళు శల్యసారధులౌతారు. కర్మ సిద్ధాంతం ప్రచారం చెయ్యడానికి వేరే సంస్థలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీళ్లకు విశ్వవిద్యాలయాలెందుకు? విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు వర్తమానంలో ఆలోచించాలి. వర్తమానంలో జీవించాలి మనసా వాచా కర్మణా. విశ్వవిద్యా లయ ఉపాధ్యక్షులు ప్రజాస్వామికవాదులు, మానవీయమూర్తులు కావాలి. నిరంకుశులు, మానవ ముఖం లేని వాళ్ళు ఈ పదవికి పనికిరారు. ఇతరుల అభిప్రాయాలను వినగలిగిన, గౌరవించ దగిన సంస్కారం ఉండాలి. నేను చెప్పిందే శాసనం అనే పిడివాదులు ఈ పదవికి పనికిరారు. భారతదేశం వైరుధ్యాల పుట్ట. వైవిధ్య భరితమైన నేపధ్యాలలో ఉంటారు విద్యార్థులు, ఉపాధ్యా యులు. ఈ వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుని సమన్వయం చేసుకోగల సంస్కారాన్ని ప్రజాస్వామ్యమిస్తుంది. నిరంకుశత్వం ఇవ్వదు. వైస్ చాన్స్లర్ల్లు మానవ ప్రేమికులు కావాలి. ఉద్యోగులను, విద్యార్థులను సానుకూల దృష్ట్టితో అర్థం చేసుకోగలగాలి. పదిమందికి తిండి బెట్టడానికి, వేల మందికి జ్ఞానమివ్వడానికి విశ్వవిద్యాలయం ఉన్నదనే జ్ఞానంగలవాళ్ళే ఈ పదవికి అర్హులు. విశ్వవిద్యాలయాలు బయటి సమాజానికి వైజ్ఞానిక నాయ కత్వం వహించాలి. ప్రగతిశీలమైన అంశాలను ముందుగా దొరక బుచ్చుకుని సమాజానికి మార్గదర్శకత్వం వహించాలి. ఇలాంటి సంస్థలకు ఆధునిక వేషం వేసుకున్న పదకొండవ శతాబ్దపు ఆలోచనపరులు పనికిరారు. బయటి సమాజంలోని రుగ్మతలను విశ్వవిద్యాలయం తన పరిశోధనల ద్వారా నిర్మూలించాలి. బయటి సమాజంలోని రుగ్మతలను ఒంటబట్టించుకోకూడదు. దేశ పునర్నిర్మాణానికి అవసరమైన పౌరులను తయారు చేసే విశ్వవిద్యాలయానికి ‘‘ఏక రక్త బంధూ! విశ్వ కుటుంబీ’’ అనే శ్రీశ్రీ భావనల మీద విశ్వాసం గల వాళ్ళే వైస్ చాన్స్లర్లు కావడానికి అర్హులు, ఈ భావాలు అలవరచుకున్న వాళ్ళుంటేనే విశ్వవిద్యాలయాలు నిజమైన విద్యాలయాలు అవుతాయి. లేదంటే అవి కులాల కుంపట్లు, మతాల మంటపాలు అవుతాయి. హేతువాదం, లౌకికత్వం, శాస్త్రీయ దృక్పథం గల వాళ్లు మాత్రమే వైస్ చాన్స్లర్లుగా ఉండటానికి అర్హులు. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, వ్యాసకర్త ఆచార్యులు, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప మొబైల్: 9440222117 -
జేఎన్‌యూ వీసీగా తెలుగు వ్యక్తి
* నల్లగొండ జిల్లా వాసి జగదీశ్‌కు కుమార్‌కు పట్టం * వర్సిటీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ) వైస్ చాన్స్‌లర్ గా నల్లగొండ జిల్లాకు చెందిన ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. జగదీశ్ కుమార్ త్వరలో నియమితులు కానున్నారు. అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల విజిటర్ అయిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పంపించిన 4 పేర్ల జాబితా నుంచి జగదీశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రముఖ శాస్త్రవేత్త వీఎస్ చౌహాన్, జేఎన్‌యూ లోని అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్స్ నేషనల్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఆరెన్కే బమేజాయ్, జేఎన్‌యూ భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన రామకృష్ణ రామస్వామి పేర్లు జాబితాలో ఉన్నాయి. జెఎన్యూ ప్రస్తుత వైస్‌చాన్స్‌లర్ సుధీర్ కుమార్ పదవీకాలం ఈ నెల 27తో ముగుస్తుంది. ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జగదీశ్ కుమార్ నల్లగొండ జిల్లాలోని మామిడాల గ్రామంలో జన్మించారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లో సభ్యులుగా కూడా ఆయన కొనసాగుతున్నారు. వివిధ ఐఐటీలలో పని చేసిన విశేష అనుభవం ఉన్న జగదీశ్ కుమార్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్టీచింగ్ను కూడా అందుకున్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీ ఐఐటీ, జేఎన్‌యూల మధ్య సహకారంతో రెండు సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ విద్యతో పాటు హ్యుమానిటీస్ కూడా చాలా ప్రధానమైనవని.. ఈ రెండూ కలిసి ముందుకు సాగాలని ఆయన అన్నారు. ‘‘జేఎన్‌యూ ఒక విశిష్టమైన సంస్థ. దీని పరిధిలో భాషలు, అంతర్జాతీయ విద్య, న్యాయశాస్త్రం వంటి వివిధ కోర్సులను బోధించే సంస్థలతో పాటు పాఠశాలలు కూడా ఉన్నాయి. వీటిని బలోపేతం చేయటం నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు. -
‘పైరవీ’ వీసీ!
► హెచ్‌సీయూ వీసీగా అప్పారావు నియామకానికి చక్రం తిప్పిన కేంద్రమంత్రి ► అనేక మంది సీనియర్లను కాదని అప్పారావుకు బాధ్యతలు ► సెర్చ్ కమిటీ తుది జాబితాలో ప్రస్తుత వీసీ పేరు చూసి ఆశ్చర్యపోయిన సీనియర్లు.. ► అతను చీఫ్ వార్డెన్‌గా ఉన్నప్పటికే ప్రొఫెసర్లుగా ఉన్నవారికి కూడా రాని అవకాశం ► తుది జాబితాలో సీసీఎంబీ మాజీ డెరైక్టర్ మోహన్‌రావు, జేఎన్టీయూ మాజీ వీసీ డీఎన్ రెడ్డి.. వారిని కాదని అప్పారావుకు చాన్స్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ నియామకంలో కేంద్ర మంత్రి ఒకరు చక్రం తిప్పిన విషయం బయటపడింది. ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 16 మంది సీనియర్ ప్రొఫెసర్లను పక్కనబెట్టి వారందరికంటే జూనియర్ అయిన పి.అప్పారావు వైస్ చాన్స్‌లర్ అయ్యేలా ఆ మంత్రి తన పలుకుబడిని ఉపయోగించారు. ఆఖరుకు సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన ఐదుగురిలో ఏరకంగా చూసినా అప్పారావు అర్హతలు తక్కువేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయినా ఆయనకు వీసీగా ‘అవకాశం’ వచ్చింది. ఢిల్లీ స్థాయిలో అండదండలు ఉండడం వల్లే తాను వీసీ అయ్యానని అప్పారావు పలుమార్లు తన సన్నిహితులతోను, సహచర ప్రొఫెసర్లతోనూ చెప్పుకొన్నారు కూడా. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ నియామకంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఉదంతం అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ద్విసభ్య కమిటీ సైతం వైస్ చాన్స్‌లర్ నియామక ప్రకియకు సంబంధించిన ఫైల్‌ను పరిశీలించింది. హెచ్‌సీయూలో బోధనా సిబ్బంది కొందరు ఇచ్చిన సమాచారం మేరకు.. కమిటీ ఆ ఫైల్‌ను పరిశీలించినట్లు అత్యున్నత అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మొత్తంగా వైస్ చాన్స్‌లర్ వ్యవహారశైలి బాగా లేకపోవడం వల్లే వర్సిటీలో విపరీత పోకడలు చోటు చేసుకున్నాయని ద్విసభ్య కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఈ కమిటీ సభ్యులు గురువారం ఢిల్లీలో మానవ వనరుల శాఖ కార్యదర్శికి తమ నివేదికను అందజేశారు. జూనియర్ అయినా.. హెచ్‌సీయూ వీసీ నియామకం కోసం కేంద్ర మానవ వనరుల శాఖ గతేడాది జూలైలో సెర్చ్ కమిటీని నియమించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వగా 190 దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటినీ వడపోసిన కమిటీ 21 మందిని జాబితాలో పెట్టింది. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 17 మంది హెచ్‌సీయూలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు. వారందరిలోనూ ప్రస్తుత వీసీ అప్పారావు జూనియర్ అని విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది పేర్కొంటున్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాలో చోటు దక్కని మరో 17 మంది కూడా అప్పారావు కంటే సీనియర్లని ఓ ప్రొఫెసర్ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. సెర్చ్ కమిటీ ఈ వర్సిటీకి చెందిన 17 మందితో పాటు బయటి వ్యక్తులు నలుగురిని ఇంటర్వ్యూ చేసింది. చివరగా ఎవరి పేర్లు సిఫారసు చేయాలన్న విషయంలోనూ మానవ వనరుల శాఖ ఆదేశాల మేరకు సెర్చ్ కమిటీ నడుచుకున్నదని పేరు చెప్పేందుకు ఇష్టపడని సీనియర్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ‘‘మా పేరు లేకపోయినా ఫరవాలేదు. కానీ తుది జాబితాలో అప్పారావు పేరు చూసి మేం షాకయ్యాం. మాలో చాలా మంది కంటే ఆయన జూనియర్. ఆయన చీఫ్ వార్డెన్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే మేం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాం. ఆయన పేరు జాబితాలో ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. ఆ తరువాత తెలిసిందేమంటే కేంద్ర మంత్రి ఒకరు ఆయనకు సన్నిహిత బంధువు..’’ అని ఆయన తెలిపారు. చక్రం తిప్పిన కేంద్ర మంత్రి హెచ్‌సీయూ వీసీ నియామకం కోసం సెర్చ్ కమిటీ ఐదుగురి పేర్లను మానవ వనరుల శాఖకు సిఫారసు చేసింది. ఇందులో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ‘సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)’ డెరైక్టర్‌గా పనిచేసిన మోహన్‌రావు, ‘జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)’ మాజీ వీసీ డీఎన్ రెడ్డి ఉన్నారు. ఏరకంగా చూసినా అప్పారావు కంటే వారిద్దరూ సీనియర్లు. కానీ వారిని కాదని అప్పారావుకు వీసీ పదవి వచ్చేలా కేంద్ర మంత్రి చక్రం తిప్పారు. ఆ కేంద్ర మంత్రితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అప్పారావు నియామకానికి తన వంతు సహకారం అందించినట్లు హెచ్‌సీయూ ప్రొఫెసర్లు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అండదండలు ఉన్నందువల్లే అప్పారావు విశ్వవిద్యాలయంలో గొడవలను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఏబీవీపీ అంటే వీసీకి ప్రత్యేకమైన అభిమానం లేనప్పటికీ, తన సామాజికవర్గం వారికి అన్ని రకాల అండదండలు ఇవ్వడంలో అర్హులైన ఇతరులకు అన్యాయం చేశారని ఓ సీనియర్ ప్రొఫెసర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి మానవ వనరుల శాఖకు లేఖ రాసినా ఇప్పటివరకూ వారి నుంచి ఏ రకమైన సమాచారం రాలేదన్నారు. -
ఇది వీసీ వైఫల్యమే
- హెచ్‌సీయూపై కేంద్రానికి నిఘా విభాగం నివేదిక - వర్సిటీని వీసీ అప్పారావు పూర్తిగా గాలికొదిలేశారు - నాలుగు నెలలుగా అరాచక పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోలేదు.. సమస్యలను పరిష్కరించలేదు - తనను కలిసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు - విద్యార్థులు వర్గాలుగా చీలిపోయి ఘర్షణలకు దిగినా చూసీచూడనట్టు ఉన్నారు... వీసీ నిర్లక్ష్యం వల్లే గతేడాది ఆగస్టులో పరిణామాలు చినికిచినికి పెద్దవయ్యాయి - ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారు.. కొందరు విద్యార్థి సంఘాల మధ్య చిచ్చుపెట్టారు - రోహిత్ సహా పలువురు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది నెలలుగా ఫెలోషిప్ చెల్లించలేదు - ఇది కూడా విద్యార్థుల్లో అసహనానికి కారణమైంది సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలను నివారించడంలో వైస్ చాన్స్‌లర్ అప్పారావు విఫలమయ్యారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. గడచిన నాలుగు మాసాలుగా విశ్వవిద్యాలయంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు వైస్ చాన్స్‌లర్ ప్రయత్నించలేదని తెలిపింది. రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐబీ సీనియర్ అధికారి ఒకరు సోమవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. రెండ్రోజులపాటు ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థి సంఘాల కార్యకలాపాలతో సంబంధం లేని దాదాపు వంద మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లతో మాట్లాడారు. వైస్ చాన్స్‌లర్‌గా అప్పారావు నియామకానికి ముందు, తర్వాత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తనపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని వీసీకి రాసిన లేఖ కాపీ విశ్వవిద్యాలయం ఇన్వార్డ్ డివిజన్లో నమోదు చేయని విషయాన్ని గుర్తించారు. మామూలుగా ఏ వర్సిటీలో అయినా వైస్ చాన్స్‌లర్ ప్రతిరోజూ ఏదో సమయంలో విద్యార్థుల సమస్యలు వినేందుకు కొంత సమయం కేటాయిస్తారు. కానీ హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ తనను కలిసేందుకు వ చ్చే విద్యార్థులకు సమయం ఇచ్చేవారు కాదని వీసీ కార్యాలయం సిబ్బంది పూసగుచ్చినట్లు వివరించారు. ఒక్క సమస్యను పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలు కొత్తవి కాకపోయినా.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించేందుకు కూడా వీసీ చొరవ చూపలేదని ఐబీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘విద్యార్థులు మూడు నాలుగు వర్గాలుగా విడిపోయి విశ్వవిద్యాలయంలో పలుమార్లు ఘర్షణలకు పాల్పడుతున్నా వీసీ చూసీ చూడనట్టు వ్యవహరించారు. విశ్వవిద్యాలయంలో బలంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలను చర్చలకు పిలిచి వారి మధ్య సామరస్య వాతావరణం నెలకొనేలా చూడలేదు. విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది కొందరు అక్కడ జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తే అవే సర్దుకుంటాయన్న ధోరణిలో నిర్లక్ష్యం కనబరిచారు’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది. గడచిన సంవత్సరం ఆగస్టు మొదటివారంలో చోటు చేసుకున్న పరిణామాలు చినికిచినికి పెద్దవి కావడానికి వీసీ అలసత్వమే కారణమని పేర్కొంది. బోధనా సిబ్బందితో కమిటీ వేసి విద్యార్థులతో చర్చలు జరిపితే పరిష్కారమయ్యే సమస్యల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించారని వివరించింది. కలవాలంటే రెండ్రోజుల ముందు మెయిల్ విద్యార్థులు అప్పుడప్పుడు క్షణికావేశానికి లోనవుతుంటారు. తమ సమస్యను అప్పటికప్పుడు బాధ్యులైన వారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తారు. కానీ వీసీ.. తనను కలిసేందుకు పెట్టిన ఆంక్షల ఫలితంగా విద్యార్థులతో సమన్వయం పూర్తిగా లేకుండా పోయింది. ఎవరైనా వీసీని కలవాలనుకుంటే.. ఏ కారణాలతో కలువాలనుకుంటున్నారో రెండ్రోజుల ముందుగానే వీసీ కార్యాలయానికి మెయిల్ పెట్టాలి. ఇలా మెయిల్ పెట్టిన విద్యార్థులకు కూడా వీసీ సమయం ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అసహనం పెరిగిపోయింది. విద్యార్థి సంఘాలు సైతం వీసీ వైఖరి కారణంగా ఏ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లలేదు. వర్సిటీలో తరచూ ఘర్షణలకు కారణమవుతున్న ఏబీవీపీ, ఏఎస్ఏ (అంబేద్కర్ విద్యార్థి సంఘం) నేతలను విశ్వాసంలోకి తీసుకుని వారి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. బోధన, బోధనేతర సిబ్బందిలోనూ అసంతృప్తి బోధన సిబ్బంది పట్ల కూడా వీసీ వ్యవహారశైలి బాగా లేకపోవడం విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలకు ఆజ్యం పోసిందని ఐబీ తన నివేదికలో పేర్కొంది. బోధనా సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశంపైనా వీసీ సానుకూల దృక్పథంతో వ్యవహరించలేదని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని వివరించింది. ఈ కారణంగా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారని తెలిపింది. ‘‘కొందరు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాల మధ్య మరింత చిచ్చుపెట్టారు. వారి మధ్య విద్వేషాలు పెరిగేలా చూశారు. బోధన సిబ్బంది సైతం కుల ప్రాతిపదికన విడిపోయారు. ఇన్ని విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నా వీసీ దేన్నీ సీరియస్‌గా తీసుకోలేదు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ సహా కొందరు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది మాసాలుగా ఫెలోషిప్ చెల్లించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. విశ్వవిద్యాలయానికి ఏ రకమైన నిధుల కొరత లేదు. వారికి ఇవ్వాల్సిన ఫెలోషిప్ ఇవ్వకపోవడం వల్ల కూడా వారిలో అసహనం పెరిగిపోవడానికి కారణమైంది’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది. -
వీసీ పోస్టులకు 1,289 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో వైస్‌చాన్స్‌లర్(వీసీ) పోస్టుల కోసం 1,289 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సైంటిసులూ ఉన్నారు. కొందరు ప్రొఫెసర్లు తొమ్మిది వర్సిటీలకూ దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 330 మంది 1,289 దరఖాస్తులు పంపారు. గత నెలలో వర్సిటీ వీసీ పోస్టులకు నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసి, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 8 వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. వీరిలో 15 మంది తాము ఏ వర్సిటీ వీసీ పోస్టును కోరుకుంటున్నారో తెలపకుండా దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు. వీటిని పరిశీలించి ప్రతి వీసీ పోస్టుకు ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు సెర్చ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కాగా దరఖాస్తు చేసుకున్న వారినే కాకుండా చేసుకోని వారిని కూడా వీసీలుగా నియమించే అవకాశం ఉండనుంది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అత్యధికంగా 182 దర ఖాస్తులు వచ్చాయి. ఆ తరువాతి స్థానంలో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ పోస్టు కోసం 176 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. -
ప్రొఫెసర్‌గా పదేళ్లు కాదు.. ఐదేళ్లు చాలు
- వీసీల నియామకాల్లో నిబంధనలు సడలింపు - విద్యా శాఖ నిర్ణయం.. త్వరలో నోటిఫికేషన్ జారీ - ఉస్మానియా సహా తొమ్మిది వర్సిటీలకు వైస్ చాన్స్లర్లు - వచ్చే నెలాఖరులోగా నియామకాలు పూర్తి చేసేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్(వీసీ) పోస్టుల భర్తీలో నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పని చేసి ఉండాలన్న ప్రధానమైన నిబంధన ఉంది. అయితే రాష్ట్రంలో కొన్ని కేటగిరీల్లో వైస్ చాన్స్‌లర్ పోస్టుకు పదేళ్ల సీనియారిటీ కలిగిన ప్రొఫెసర్లు లేకపోవడంతో దీనిని ఐదేళ్లకు తగ్గించాలని నిర్ణయించింది. తద్వారా వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించవచ్చని భావిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో వివిధ కోణాల్లో ఆలోచించినా.. వీసీల నియామకాలకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఏమైనా రిజర్వేషన్ కల్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలను ప్రభుత్వం గతంలో చేసింది. వీసీల నియామకాలకు సంబంధించిన అన్ని నిబంధనలను, మార్గదర్శకాలను పరిశీలించిన అధికారులు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదని తేల్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకే కాకుండా అన్ని కేటగిరీల వారికి ఐదేళ్ల సడలింపు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసి త్వరలోనే నోటి ఫికేషన్‌ను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. గత వారమే నోటిఫికేషన్ జారీ చేయాలని భావించినా అప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నోటిఫికేషన్ జారీని నిలిపివేశారు. ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం లేఖ రాశారు. ఇందుకు ఈసీ కూడా ఇటీవల ఓకే చెప్పింది. దీంతో రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్లు లేని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతోపాటు శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టిశ్రీరాములు తెలుగు, అంబేడ్కర్ ఓపెన్, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్స్లర్ల నియామకాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్ పోస్టు భర్తీ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్న నేపథ్యంలో ఆ వర్సిటీకి వీసీ నియామకంపై తర్వాత దృష్టి సారించాలన్న నిర్ణయానికి వచ్చింది. తొలుత తొమ్మిది వర్సిటీలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత సెర్చ్ కమిటీలు వచ్చిన దర ఖాస్తుల్లో అర్హతలను బట్టి ప్రాధాన్య క్రమంలో ప్రభుత్వానికి ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లను సూచించనున్నాయి. మొత్తంగా వచ్చే నెలాఖరులోగా వీసీల నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
'అగ్రికల్చర్ కాలేజీల్లో ర్యాగింగ్ జరగకూడదు'
హైదరాబాద్ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ జరక్కుండా చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్లూరి పద్మరాజు ఆయా కళాశాలల అధిపతులను ఆదేశించారు. ఏపీలోని వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్, టెక్నాలజీ, గృహ విజ్ఞాన, పాలిటెక్నిక్ కళాశాలల అధిపతులు, అసోసియేట్ డీన్లు, వార్డెన్ల సమావేశం గురువారం నగరంలో జరిగింది. విద్యార్ధి వ్యవహారాల విభాగం డీన్ డాక్టర్ ఆర్.వి.రాఘవయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. కళాశాలల్లో చేరిన కొత్త విద్యార్థులను పాతవారు సరదాగానైనా ఆట పట్టించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించమని సూచించారు. క్లాసుల్లో, హాస్టళ్లలో హాజరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పై అధికారులకు తెలియజేయాలన్నారు. హాస్టళ్లలో వసతులు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు. పీజీ విద్యార్ధుల పరిశోధనకు సంబంధించిన డేటాను పర్యవేక్షించాలని సంబంధిత డీన్లను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక శిక్షణ విభాగం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కళాశాలలకు నాబార్డ్ ఇచ్చే నిధుల వినియోగానికి పక్కా ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. -
'నెలలోపు వీసీల నియామకం'
తిరుపతి: నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏడు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు ప్రకటించారు. హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ఔట్సోర్సింగ్ అధికారులకు అప్పగించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ మేరకు ముందుగా ఎస్వీ యూనివర్సిటీలో ఒక హాస్టల్‌ను ఔట్సోర్సింగ్ అధికారులకు ఫెలైట్ ప్రాజెక్టుగా ఇచ్చి పరిశీలిస్తామని చెప్పారు. ఇది విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల హాస్టల్స్ నిర్వహణ బాధ్యతలు ఔట్సోర్సింగ్ అధికారులకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. వైస్చాన్స్లర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడగిస్తూ చర్యలు తీసుకుంటామన్నారు. రెండేళ్లలో తర్వాత పనితీరును పరిశీలించి ఆశాజనకంగా లేకపోతే పదవి నుంచి తొలగిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. -
యూనివర్సిటీలకు కొత్త చట్టం