viral tweet
-
నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్
ఢిల్లీకి చెందిన 'కుశల్ అరోరా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో చేసిన పోస్ట్ నెట్టింట్లో చర్చకు దారి తీసింది. నా వయసు 23 సంవత్సరాలు. ఏడాదికి 500000 డాలర్లు (రూ.4.2 కోట్లు కంటే ఎక్కువ) సంపాదిస్తున్నాను. నా వయసులోని విద్యార్థులు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా సోషల్ ఈవెంట్స్ మిస్ అయ్యాను. ఎన్నో వైఫల్యాలను చూశాను. అయినా నేను దీనినే ఎంచుకున్నాను. మీరు కూడా మీ కలల జీవితాన్ని నిర్మిస్తున్నారా? అని ప్రశ్నించారు.కుశాల్ అరోరా త్యాగాలు అతన్ని ఆర్థికంగా విజయం సాధించేలా చేశాయి. కానీ ఇవి కొందరికి స్ఫూర్తిగా నిలిచినప్పటికీ.. మరికొందరికి నచ్చలేదు. యువతరం మీద అనవసరమైన ఒత్తిడి సృష్టిస్తున్నాడని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అతనిని నిందించడం మొదలుపెట్టారు. డబ్బు మీద వ్యామోహం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు.నువ్వు నీ జీవితాన్ని గడిపావు, వాళ్ళు బ్రతుకుతున్నారు. అందరూ ఎక్కువ సంపాదించాలని కలలు కంటారు. కానీ దానినే ఫ్యాన్సీగా మార్చుకోవడం మానేయండి. మీరు కష్టపడి పనిచేస్తే.. డబ్బు వచ్చింది. దానితో జీవించండి. దీనిని ఇతరులకు ఆపాదించడం మానేయండి.. అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులునేను ఆ వయసులో పార్జీలు చేసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. మీరు పాటించిన విధానాలు అందరికి పనిచేస్తాయని అనుకోవద్దని మరొకరు అన్నారు. ఒక ట్వీట్‌పై అరోరా స్పందిస్తూ.. నేను 19 సంవత్సరాల వయసులోనే నా ప్రయాణం మొదలుపెట్టాను. నా వ్యాఖ్యలు యువతపై ఒత్తిడి తీసుకువస్తాయి అనుకుంటే సంతోషంగా మ్యూట్ చేయండి. కానీ నా లక్ష్యం యువతలో ప్రేరణ కల్పించడమే అని పేర్కొన్నారు.I'm 23yrs old earning over $5,00,000 annually.When students of my age were partying & chilling, I was:- Having sleepless nights working- Missing social events- Dealing with failures/rejection- Losing work-life balanceBut I chose that. Are you building your dream life?— Kushal Arora (@digitalkushal) October 16, 2024 -
టాటాకు సంతాపం తెలుపుతూ ట్వీట్.. కాసేపటికే డిలిట్!
రతన్ టాటా మృతిపట్ల సంతాపం తెలుపుతూ పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. టాటా మరణవార్త విని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా టాటాకు సంతాపం ప్రకటించారు. అయితే తన ట్వీట్లోని చివరి లైన్లపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.‘భవిష్యత్తు తరం వ్యాపారులు టాటా ఇచ్చే సలహాలు, సూచనలను మిస్ అవుతారు. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ టాటా. సెల్యూట్ సర్.. ఓకే టాటా బైబై’ అని విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ చివరి లైన్ ‘ఓకే టాటా బైబై’పై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాసేపటికే శర్మ ఆ పోస్ట్‌ను తొలగించారు.wtf is the last line pic.twitter.com/dOrIeMQH7c— Shivam Sourav Jha (@ShivamSouravJha) October 10, 2024ఇదీ చదవండి: టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్, సంజీవ్ గోయెంకా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, కుమారమంగళం బిర్లా, హిందుజా గ్రూప్ చైర్మన్. జీపీ హిందుజా, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండిగో) ఎండీ రాహుల్ భాటియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ ఉన్సూకిమ్..వంటి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. -
ఓలాకు మరో దెబ్బ! షోకాజ్ నోటీసు జారీ
ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.🚨🚨 Sources to CNBC-TV18 ⬇️⚡Central Consumer Protection Authority (CCPA) issues showcause notice to @OlaElectric for class action⚡ Ola Electric given 15 days to respond to CCPA showcause notice on service issues and more⚡ #OlaElectric faces more than 10,000 complaints… pic.twitter.com/fNbdBLsQQq— CNBC-TV18 (@CNBCTV18News) October 7, 2024ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలుఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
ఓలా సీఈఓ, కమెడియన్ మధ్య మాటల యుద్ధం
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆన్లైన్ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై కమ్రా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఎలక్ట్రిక్ వాహనాలను సూచించే ఫొటో షేర్ చేస్తూ కమ్రా తన ఎక్స్ ఖాతాలో ‘భారతీయ వినియోగదారులు సమస్యలపై మాట్లాడలేరని అనుకుంటున్నారా? వారికి ఇలాంటి సమస్యా? రోజువారీ వేతన కార్మికులు ద్విచక్ర వాహనాలు వాడుతూ జీవనాధారం పొందుతున్నారు’ అని ఆయన తన పోస్ట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ ‘భారతీయులు ఈవీలను ఎలా ఉపయోగిస్తారు?’ అని తెలిపారు. ‘పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా సంస్థ నాయకుడి నుంచి ఎలాంటి సమాధానం లేదు’ అని మరోపోస్ట్ పెట్టారు.Since you care so much @kunalkamra88, come and help us out! I’ll even pay more than you earned for this paid tweet or from your failed comedy career.Or else sit quiet and let us focus on fixing the issues for the real customers. We’re expanding service network fast and backlogs… https://t.co/ZQ4nmqjx5q— Bhavish Aggarwal (@bhash) October 6, 2024ఈ వ్యవహారంపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఘాటుగా స్పందించారు. కమ్రా పెట్టిన పోస్ట్‌లు ‘పెయిడ్ పోస్ట్’లు అని వ్యాఖ్యానించారు. ఈమేరకు భవిష్ కమ్రా విమర్శలకు ప్రతిస్పందనగా పోస్ట్ చేశారు. ‘మీరు ఈవీల వ్యవహారంపై చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి, వచ్చి మాకు సాయం చేయండి! ఈ ‘పెయిట్ ట్వీట్’లు, విఫలమైన మీ కామెడీ కెరీర్ ద్వారా ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగానే మీకు డబ్బు ఇస్తాను. ఇవేవీ కాదంటే నిశ్శబ్దంగా ఉండండి. మేము కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతున్నాం. సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం. బ్యాక్‌లాగ్‌లు త్వరలో క్లియర్ చేస్తాం’ అని స్పందించారు.Instead can you give a total refund to anyone who wants to return their OLA EV & who’s purchased it in the last 4 months? I don’t need your money people not being able to get to their workplace need your accountability.Show your customers that you truly care? https://t.co/tI2dwZT2n2— Kunal Kamra (@kunalkamra88) October 6, 2024కమ్రా భవిష్ ట్వీట్‌పై తిరిగి స్పందించారు. ‘పెయిడ్ ట్వీట్ చేసినట్లు, నేను ఏదైనా ప్రైవేట్ కంపెనీ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి డబ్బు పొందినట్లు మీరు రుజువు చేస్తే నా అన్ని సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే తొలగించి, మీరన్నట్లు ఎప్పటికీ నిశ్శబ్దంగా కూర్చుంటాను’ అని చెప్పారు. దీనికి అగర్వాల్ బదులిస్తూ ‘నేను అన్న మాటలతో బాధపడ్డారా? సర్వీస్ సెంటర్‌కు రండి. మాకు చాలా పని ఉంది. మీ ఫ్లాప్ షోల కంటే నేను బాగా డబ్బులిస్తాను. మీ వ్యాఖ్యలపై నిజంగా మీరెంత శ్రద్ధ వహిస్తున్నారో మీ అభిమానులకు తెలియాలి’ అని అన్నారు.ఇదీ చదవండి: రతన్‌టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరందీనిపై కమ్రా బదులిస్తూ ‘కస్టమర్ల ఈవీను తిరిగి ఇవ్వాలనుకునే వారికి, గత నాలుగు నెలల్లో ఈవీను కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేస్తారా? మీ డబ్బు నాకు అవసరం లేదు. మీ ఈవీ వాడుతున్న కస్టమర్లు సరైన సేవలందక తమ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. దీనికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నట్లు మీ కస్టమర్లకు తెలియాలి కదా?’ అని అన్నారు. దీనిపై భవిష్ స్పందిస్తూ ‘మా కస్టమర్లకు అందే సర్వీసు జాప్యం జరిగితే వారికి తగినన్ని ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. మీరు నిజంగా సమస్యపై స్పందించాలంటే కేవలం కుర్చీలో కూర్చొని విమర్శలు చేయడం కాదు. సమస్య ఎక్కడుందో తెలుసుకోండి. దీనిపై వెనక్కి తగ్గకండి’ అని పోస్ట్ చేశారు.We have enough programs for our customers if they face service delays. If you were a genuine one, you would have known.Again, don’t try and back out of this. Come and do some real work rather than armchair criticism. https://t.co/HFFKgsl7d9— Bhavish Aggarwal (@bhash) October 6, 2024 -
నిశ్చితార్థానికి జంట ‘క్రేజీ డీల్’ : వెడ్డింగ్ డీల్ కూడా మాదే అంటున్న స్విగ్గీ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు నిమిషాల్లో వేడి వేడి ఫుడ్‌ను మన కాళ్ల దగ్గరకు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ మూడ్ లోనో, ఓపికలేనపుడో, వర్షం వచ్చినపుడో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం దాదాపుఅందరికీ అలవాటే. అందరిలాగా తానూ చేస్తే కిక్ ఏముంది అనుకున్నారో ఏమోగానీ, ఒక జంట తమ ఎంగేజ్మెంట్ సెర్మనీకి వచ్చిన అతిథులకు ఏకంగా స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై మీమ్స్ ఫన్సీ కామెంట్స్ వైరల్‌గా మారాయి.ఒక జంట వారి నిశ్చితార్థ వేడుకలో సాంప్రదాయ క్యాటరింగ్‌కు బదులుగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్‌ను ఎంచుకున్నారు. ఈ వేడుకు హాజరైన వ్యక్తి ఈ విషయాన్ని గమనిం చాడు. డెలివరీ బాయ్. ఫంక్షన్లో ఉన్న ఒక టేబుల్‌పై ప్లాస్టిక్ ఫుడ్ బాక్స్‌ల వరుసలను పేర్చుతున్న చిత్రాన్ని షేర్ చేసారు. ఇది వైరల్‌గా మారడంతో స్విగ్గీ కూడా స్పందించింది.ఈ కుర్రాళ్ల కంటే ఉపయోగించినట్టుగా, క్రేజీ డీల్‌ను ఇంకెవరూ ఇలా వాడలేదు.. పెళ్లి భోజనాలు కూడా మా దగ్గరే ఆర్డర్ చేసుకోండి’’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. భోజనాలు వాళ్లింట్లో, చదివింపులు(జీపే) మాకు అంటూ ఒకరు, వాళ్ల యూపీఐ క్యూఆర్ పెడతారు అని ఒక కోడ్‌ని ఉంచుతారు. మరో యూజర్, వాళ్ల నిశ్చితార్థం, వాళ్ల పైసలు, వాళ్ల ఇష్టం..ఇక్కడ సమస్య కనిపించడం లేదు’’ అంటూ మరొకరు పన్నీగా కమెంట్ చేశారు.no one has used our Crazy Deals better than these guys 😭😭 shaadi ka khana bhi humse mangwa lena 🥰 https://t.co/XIo2z2TnYX— Swiggy Food (@Swiggy) August 4, 2024 -
బంగ్లా బాధితులు కన్నీరుమున్నీరు, అండగా సోనూసూద్, వీడియో వైరల్
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చి హింసాత్మకం మారిపోయింది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత తీవ్రంగా తలెత్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళ, రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. మరోవైపు పౌరులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వారిపై దాడులు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి ఒక మహిళ ఆవేదన ఎక్స్‌లో వైరల్‌గా మారింది. దీంతో తన వంతు సాయానికి ఎపుడూ ముందుండే నటుడు సోనూ సూద్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న హిందువులను భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేస్తానంటూ ఆమెకు మద్దతు ప్రకటించారు. దీంతో మరోసారి రియల్ హీరో అంటూ సోనూసూద్ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.‘‘తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని’ తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన మహిళ ఆ వీడియోలో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గామారడంతో సోనూ సూద్ స్పందించారు. ”బంగ్లాదేశ్ నుంచి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు. అంతేకాదు ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. మనందరి బాధ్యత కూడా.. జై హింద్” అంటూ ఆయన ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన హిందూవులను కాపాడటానికి దేశంలో ప్రముఖలతో పాటు ప్రతిఒక్కరు స్పందించాలని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. We should do our best to bring back all our fellow Indians from Bangladesh, so they get a good life here. This is not just the responsibility of our Government which is doing its best but also all of us.Jai Hind 🇮🇳 https://t.co/OuL550ui5H— sonu sood (@SonuSood) August 6, 2024 -
1 BHK రూ.70 వేలు! ఇది రెంటా లేక ఈఎంఐనా? పోస్ట్ వైరల్
అత్యంత రద్దీ నగరమైన ముంబై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదైన ఇక్కడి హౌసింగ్ మార్కెట్ నివాసితులకు ఒక ప్రధాన సవాలుగా కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలతో అందుబాటు అద్దెలో ఇళ్లు దొరకడం కష్టంగా మారింది. ఇటీవల విటా అనే ఒక లాయర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ విపరీతమైన ఖర్చులను ఎత్తిచూపడంతో పాటు ఆన్లైన్లో విస్తృత చర్చకు దారితీసింది.ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లో 1 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల అద్దె నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటోందని విటా తన ట్వీట్లో పేర్కొన్నారు. విడిగా ఉండేందుకు బయటకు వెళ్లకుండా తమ జీవన ఏర్పాట్లను పునఃపరిశీలించుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి నివసించాలని తోటి యూజర్లకు ఆమె సూచించారు. "ముంబైలో 1 బీహెచ్‌కే అద్దె రూ.50,000-70,000 ఉంటోంది. మీ అమ్మానాన్నలతో మంచి సంబంధాలు పెట్టుకోండి. స్వతంత్రంగా ఉండటానికి ఇంటి నుంచి బయటకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు" అని ఆమె రాసుకొచ్చారు.ఈ ట్వీట్ వెంటనే వైరల్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. ముంబైలో అధిక జీవన వ్యయం నుంచి పలువురు యూజర్లు తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. అప్పుల భారం లేకుండా ఇల్లు, మంచి వైద్యం, నాణ్యమైన విద్య పొందడం చాలా మందికి అసాధ్యమైన కలలా కనిపిస్తోందంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. 'ఇది 70 వేల అద్దె లేదా ఈఎంఐనా?' అని ప్రశ్నిస్తూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "నేను ఈ నగరం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. ఈ అద్దెను నేను భరించలేను" అంటూ ఇంకొక యూజర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. -
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ముందు వరుసలో ఉన్నాయి. కేకేఆర్ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రాజస్తాన్ పదింట ఎనిమిది గెలిచి ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.పాయింట్ల పరంగా సమంగా ఉన్నా నెట్ రన్‌రేటు విషయంలో కేకేఆర్(1.453) కంటే రన్‌రేటు పరంగా రాజస్తాన్(0.622) వెనుకబడి ఉన్నందు వల్లే స్థానాల్లో ఈ వ్యత్యాసం. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో సీఎస్కే(12 పాయింట్లు), నాలుగో స్థానంలో సన్‌రైజర్స్(12 పాయింట్లు) కొనసాగుతున్నాయి.లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లు అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో కూడా ఈ జాబితాలోనే ఉన్నా ఆ జట్టు ఎంట్రీ ఇచ్చింది 2022లో! ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది కూడా! కానీ మిగతా మూడు కనీసం ఒక్కసారి ఫైనల్ చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాయి.ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ ఖాతాలో ఏడో పరాజయం చేరింది.ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటాను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆమె బదులిచ్చిన తీరు వైరల్‌గా మారింది. ‘మీ జట్టు ప్రదర్శన పట్ల మీ స్పందన ఏమిటి?’ అని ఓ యూజర్ ప్రీతి జింటాను ట్యాగ్ చేశారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఏమాత్రం సంతోషంగా లేను. నాలుగు మ్యాచ్‌లలో మేమే ఆఖరి బంతికి ఓడిపోయాం. మా కెప్టెన్ గాయం బారినపడ్డాడు.కొన్ని మ్యాచ్‌లు మాత్రం అత్యద్భుతంగా సాగాయి. కానీ మేము అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాం. తదుపరి సొంత మైదానంలో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే ముందుకు వెళ్లగలం. ఏదేమైనా ఎల్లవేళలా మాకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’’ అని ప్రీతి జింటా పేర్కొంది. Thank you all for a wonderful #pzchat . It was very nice talking to you all after so long. Kids have woken up from their nap so I have to run. Till then take care, be happy & loads of love always ❤️❤️— Preity G Zinta (@realpreityzinta) May 6, 2024 -
కోహ్లిపై పాక్ మాజీ పేసర్ ట్రోలింగ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఐదో పరాజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. వాంఖడే మ్యాచ్‌లో తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో ముంబైతో మ్యాచ్‌లో కోహ్లి వైఫల్యాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ దారుణంగా ట్రోల్ చేశాడు. ఎక్స్ వేదికగా.. ‘‘స్ట్రైక్‌రేటు 33.33’’ అంటూ కోహ్లి బ్యాటింగ్‌పై జునైద్ ఖాన్ విమర్శలు సంధించాడు. కాగా జునైద్ కోహ్లిపై సెటైర్లు వేడయం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రాజస్తాన్ రాయల్స్‌తో విరాట్ కోహ్లి సెంచరీ చేసినపుడు కూడా ఇలాగే కామెంట్ చేశాడు. ‘‘ఐపీఎల్ చరిత్రలో స్లోయెస్ట్ 100 సాధించినందుకు శుభాభినందనలు’’ అంటూ జునైద్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. భారత గడ్డపై ఐపీఎల్లో శతకం చేసేందుకు అత్యధిక బంతులు తీసుకున్న బ్యాటర్ కోహ్లినే కావడం గమనార్హం. ఓవరాల్‌గా మనీశ్ పాండే(2009- సెంచూరియన్)తో కలిసి ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జునైద్ ఖాన్ కోహ్లిని ఇలా విమర్శించాడు. కాగా జునైద్ ఖాన్ ట్వీట్‌పై కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రతి ఒక్క మ్యాచ్‌లో ఏ ఆటగాడూ రాణించలేడని.. అటెన్షన్ కోసమే కోహ్లి పేరు వాడుకుంటున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి శతకం సాధించిన రాజస్తాన్‌తో మ్యాచ్‌లో.. తాజాగా అతడు విఫలమైన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఓడిపోయింది. ఇక పదిహేడో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి 319 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండటం విశేషం. Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 Strike rate 33.33 😶#RCBvsMI — Junaid khan (@JunaidkhanREAL) April 11, 2024 -
అతడికి నా పేరు కూడా తెలుసు: ఆర్సీబీ క్వీన్ పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ శ్రేయాంక పాటిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్లు గాల్లోతేలిపోయే అనుభూతిని ఆస్వాదిస్తోంది. తన రోల్ మోడల్‌ను నేరుగా కలవడమే గాకుండా.. అతడితో ప్రశంసలు అందుకోవడమే ఇందుకు కారణం. ఐపీఎల్ తర్వాత బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన బెంగళూరు అమ్మాయి శ్రేయాంక. దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం కర్ణాటకకు ఆడుతున్న 21 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గతేడాది భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది. గతేడాది ఆరంభమైన వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీకి ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. రూ. 10 లక్షలకు తనను కొనుక్కున్న ఆర్సీబీకి తాజా ఎడిషన్‌లో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్-2024లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంటోంది. ఇక సీజన్లో మొత్తంగా 9 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీసిన శ్రేయాంక పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు) విజేతగా నిలిచింది. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2024 అంతేకాదు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రోఫీ గెలిచిన మహిళా జట్టును ఆర్సీబీ పురుష జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్తో సముచితంగా గౌరవించింది. ఇక ఈ ఈవెంట్లో పేరు, లోగో మార్పులతో కొత్త జెర్సీని రివీల్ చేసింది ఆర్సీబీ. ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది శ్రేయాంకకు! ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనైందామె. ‘‘అతడి వల్లే క్రికెట్ చూడటం అలవాటు చేసుకున్నా. అతడిలాగే క్రికెటర్ కావాలని కలలు కంటూ పెరిగాను. ఎట్టకేలకు.. జీవితకాలానికి సరిపడా సంతోషాన్నిచ్చే క్షణం నిన్న రాత్రి చోటుచేసుకుంది. ‘హాయ్.. శ్రేయాంక.. అద్భుతంగా బౌల్ చేశావు’ అని విరాట్ నాతో అన్నాడు. అతడికి నా పేరు కూడా తెలుసు’’ అంటూ రోల్‌మోడల్‌తో కలిసి ఫ్యాన్‌గర్ల్ మూమెంట్‌ను ఆస్వాదించినట్లు శ్రేయాంక పాటిల్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టగా వైరల్‌గా మారింది. చదవండి: Sachin Tendulkar: నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా? Started watching cricket cos of him. Grew up dreaming to be like him. And last night, had the moment of my life. Virat said, “Hi Shreyanka, well bowled.” He actually knows my name 😬😬😬#StillAFanGirl #rolemodel pic.twitter.com/z3DB0C8Pt0 — Shreyanka Patil (@shreyanka_patil) March 20, 2024 -
భారత్‌లోకి టెస్లా.. పేరు మార్చుకుంటేనే పనవుతుంది! వైరల్ ట్వీట్
ఎలాన్ మస్క్ ( Elon Musk ) నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ( Tesla ) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ ( Nothing Phone ) సీఈఓ కార్ల్ పీ ( Carl Pei ).. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి ఓ ఫన్నీ సలహా ఇచ్చారు. భారత్‌లో ఫ్యాక్టరీని ఎలా తెరవాలో చమత్కారంగా సూచించారు. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ముందుగా ‘ఎక్స్’ (ట్విటర్) ప్లాట్‌ఫారమ్‌లో తన యూజర్ నేమ్‌ను "ఎలాన్ భాయ్"గా మార్చుకోవాలని కార్ల్ పీ సూచించారు. ఈయన కూడా స్వయంగా తన ‘ఎక్స్’ యూజర్ నేమ్‌ను 'కార్ల్ భాయ్'గా మార్చుకున్నారు. "ఎలాన్ మస్క్.. మీ యూజర్ నేమ్‌ను ఎలాన్ భాయ్‌గా మార్చకుండా భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొచ్చనుకుంటున్నారా?" ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. 6.7 లక్షల వీవ్స్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌కు యూజర్లు సైతం అంతే ఫన్నీగా స్పందించారు. "మీరు భాయ్, అతను (మస్క్) మామూ అవుతాడు" అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "ప్రాంతాన్ని బట్టి పేరు ఆధారపడి ఉంటుంది. గుజరాత్ అయితే ఎలాన్ భాయ్, మహారాష్ట్ర అయితే ఎలాన్ భావ్, తెలంగాణ అయితే ఎలాన్ గారు, హర్యానా అయితే ఎలోన్ టౌ, పంజాబ్ అయితే ఎలాన్ పాజీ, తమిళనాడు అయితే ఎలాన్ అన్నా, అలాగే పశ్చిమ బెంగాల్ అయితే ఎలాన్ దాదా" అని మరొక యూజర్ పేర్కొన్నారు. "ఎలాన్ దాదా బాగా సరిపోతుంది!" ఇంకొక యూజర్ చమత్కరించారు. ఇంకా రకరకాల పేర్లను యూజర్లు సూచించారు. .@elonmusk did you really think you could build a Tesla factory in India without changing your username to Elon Bhai? — Carl Bhai (@getpeid) February 18, 2024 ది ఎకనామిక్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే అంచున ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై రూ.30 లక్షలకు మించిన రాయితీ దిగుమతి సుంకాలను 2-3 సంవత్సరాల పాటు పొడిగించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ రూ.33 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని, ఆ శ్రేణి కంటే తక్కువ ఉన్న కార్లపై 60 శాతం విధిస్తోంది. కార్యకలాపాల ప్రారంభ సంవత్సరాల్లో విదేశీ ఈవీలపై ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లయితే భారత్‌లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టెస్లా సుముఖతను వ్యక్తం చేసింది. -
కేటీఆర్ దురుసు: సీతక్క స్ట్రాంగ్ కౌంటర్, ట్వీట్ వైరల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సుమతీ పద్యాన్ని ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసిన నేపథ్యంలో సీతక్క ట్విటర్ ద్వారా స్పందించారు. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగు కప్పుకొని, అధికారంలోకి వచ్చాక ప్రజలని బానిసల కంటే హీనంగా చూసిన మీ చరిత్రని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరంటూ ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్.. నీ ప్రతిమాటా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది.. అహంకారానికి బ్రాండ్ అంబాసిడరే మీ కుటుంబం.. అందుకే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. 'దొర'హంకారానికి ప్రతిరూపం మీ పాలన .. ప్రజాపాలనకి నిలువెత్తు నిదర్శనం మా పాలన..@revanth_anumula @RahulGandhi — Danasari Seethakka (@seethakkaMLA) January 26, 2024 ప్రతిమాటా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది, అసలు మీ కుంటుంబమే అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కేటీఆర్‌పై ధ్వజమెత్తారు సీతక్క. తెలంగాణా ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా, ఇంకా దొర అహంకారం పోలేదంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ పరోక్షంగా కామెంట్ చేసినప్పటికీ, సీతక్క మాత్రం డైరెక్ట్‌గా కేటీఆర్ నుద్దేశించి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు అంటూ ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి…’ పద్యాన్ని కేటీఆర్ ట్విటర్లో షేర్ చేశారు. దీంతో పెద్ద దుమారం రేగింది. తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గానే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ రాజకీయవర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా దీనికి కౌంటర్‌గా సీతక్క డైరెక్ట్ ఎటాక్ ట్వీట్ మరింత కాక పుట్టిస్తోంది. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt — KTR (@KTRBRS) January 26, 2024 -
తెలంగాణాలో కాంగ్రెస్ జోరు: సీతక్క ట్వీట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. కౌంటింగ్‌లో ఆదినుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ఫలితాల్లో తన జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయంతో తొలి బోణీ కొట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ధనసరి అనసూయ.. అలియాస్ సీతక్క సంచలన ట్వీట్లతో సందడి చేస్తున్నారు. వరుస ట్వీట్లతో అటు కేసీఆర్‌పైనా, బీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు గుప్పించారు. ఇవి ట్విటర్లో వైరల్‌గా మారింది. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన సీతక్క ప్రస్తుతం భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. TRS = BRS = VRS #TelanganaElectionResults — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 ఇది ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. 200 cr Kcr money Vs seethakka After completing 13 rounds 20 thousand majority to seethakka .. More 9 rounds to go.. #TelanganaElectionResults @RahulGandhi @priyankagandhi @kharge @revanth_anumula @srinivasiyc — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 -
అలాంటి ఉద్యోగులు అక్కర్లేదు.. యువ వ్యాపారవేత్త సంచలన వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' గత కొన్ని రోజులకు ముందు భారతదేశం అభివృద్ధి చెందాలంటే వారానికి 70 గంటల పని అవసరమని వెల్లడించారు.. ఈ విషయం మీద సాధారణ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రముఖ వరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఇదిలా ఉండగానే ఇటీవల ఓ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసేవారు అవసరం లేదంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికంటే కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'అనుభవ్ దూబే' (Anubhav Dubey). 23 ఏళ్ల వయసులోనే స్టార్టప్ కంపెనీ ప్రారభించి కోట్లు సంపాదిస్తున్నారు. చాయ్ సుత్తా బార్ (Chai Sutta Bar) పేరుతో ఒక చాయ్ కంపెనీ ప్రారంభించాడు, ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 500 అవుట్లెట్లను కలిగి ఉంది. ఈ సంస్థ విలువ రూ. 150 కోట్లు కావడం గమనార్హం. తక్కువ వయసులోనే సక్సెస్ సాధించి ఎంతోమంది యువకులకు రోల్ మోడల్‌గా నిలిచాడు. అనుభవ్ దూబే ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే వారి కోసం వెతకడం లేదని, ఇక్కడ సైన్యం తయారు చేస్తున్నామని, ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదీ చదవండి: ఆస్తులు అమ్మేయడానికి సిద్దమైన హెచ్‌సీఎల్.. ఎందుకంటే? నిజానికి అనుభవ్ దూబే తన బృందాన్ని మోటివేట్ చేయడానికి ఇలా చెప్పినట్లు తెలుస్తోంది, అయినప్పటికీ ఇది చాలామందికి కోపాన్ని తెప్పించింది. చాయ్ అమ్మడం పెద్ద విషయం కాదని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు చాయ్ అమ్మడానికి సైన్యం ఎందుకని ప్రశ్నించారు. We are not looking for office employees working 9 to 5. No, not at all. We are making f**king Army here. pic.twitter.com/MGBeb9Mk0J — Anubhav Dubey (@tbhAnubhav) November 27, 2023 -
నోబడి - అది నా పేరు.. మస్క్ ట్వీట్ వైరల్!
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ఎక్స్.కామ్, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల చేసి ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ వేదికగా 'నోబడి - అది నా పేరు' (Nobody—that’s my name) అంటూ తన అధికారిక ట్విటర్ పేజీలో షేర్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి ఈ పోస్ట్‌ని 3 మిలియన్స్ కంటే ఎక్కువమంది చూసారు. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా ఆలోచించడం 'మస్క్'కి కొత్తేమీ కాదు. ఇప్పటికే త కొడుకుకి ఎక్స్ఏఈఏ-12 మస్క్ అంటూ ఓ కొత్త పేరు పెట్టాడు. ట్విటర్ పేరుని 'ఎక్స్'గా మార్చదు. ఇవన్నీ చూస్తుంటే మస్క్ పేరుని 'నోబడీ'గా పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! ఇదిలా ఉండగా ఇటీవల మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్ కొనాలనుకుంటున్నట్లు కూడా ట్వీట్ చేసాడు. ఐఫోన్ ఫోటోలు & వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయని. అందుకే లేటెస్ట్ మొబైల్ కొనాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా మస్క్ ఏ మోడల్, ఏ కలర్ కొంటాడనేది తెలియాల్సి ఉంది. Nobody—that’s my name — Elon Musk (@elonmusk) September 26, 2023 -
ఐఫోన్ 15పై మనసుపడిన మస్క్.. రీజన్ ఇదేనట!
మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ విడుదలైనప్పటి నుంచి దానిపై ఉన్న అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. అనుకున్న విధంగా విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా మస్క్ కూడా ఒక ఐఫోన్ 15 కొనాలని మనసులో మాట చెప్పాడు. 2023 సెప్టెంబర్ 22 నుంచి ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సేల్స్ ప్రారంభించడానికి ముందే ఐఫోన్ లవర్స్ స్టోర్ల ముందు గంటల కొద్దీ పడిగాపులు కాస్తూ ఎదురు చూసారు. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్.. ఫోటోగ్రాఫర్లు స్టీఫెన్ విల్కేస్, రూబెన్ వుతో కలిసి ఉన్న ఫోటోలు ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో ఫోటోగ్రాఫర్లకు ఐఫోన్ పనిని చూపించడం కనిపిస్తుంది. ఇందులో రోడ్ ఐలాండ్‌లోని వేసవి అందం నుంచి ఉటాలోని ఇతర ప్రపంచ ఎడారుల వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను ఇక్కడ గమనించవచ్చు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. దీనిపైన ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఐఫోన్ ఫోటోలు & వీడియోల అందం అపురూపంగా ఉందని అన్నారు. తాను కూడా ఒకటి కొనబోతున్నట్లు ట్వీట్ చేసాడు. దీనికి కొంతమంది ఏ మోడల్ కొనబోతున్నావు, ఏ కలర్ ఎంచుకోబోతున్నావని అడుగుతున్నారు. అయితే మస్క్ ఐఫోన్ 15 కొంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. The beauty of iPhone pictures & video is incredible — Elon Musk (@elonmusk) September 22, 2023 I’m buying one! — Elon Musk (@elonmusk) September 22, 2023 -
ఆనంద్ మహీంద్రా ట్విటర్ పోస్ట్.. దీనికెవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!
Anand Mahindra Twitter Post: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) గ్రూప్ అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఈయన కేవలం ఒక పారిశ్రామిక వేత్త మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మరో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఒక స్ఫూర్తిదాయకమైన కథనం షేర్ చేశారు. ఇందులో వీధి పక్కన క్యాండిల్స్ అమ్ముకునే అంధుడైన ఒక వ్యాపారి కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఏకంగా 3500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన దృష్టికి వచ్చిన స్ఫూర్తిదాయకమైన అంశాల్లో ఇదే ప్రధానమైనదంటూ వెల్లడించినట్లు సమాచారం. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కథనం ప్రకారం, అతని పేరు భవేష్ చందూలాల్ భాటియా. రెటీనా మాక్యులర్ డీజనరేషన్ కారణంగా పుట్టుకతోనే చూపు పోయింది. అయితే కళ్ళు కనిపించవని నిరాశ చెందకుండా 1994లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో కొవ్వొత్తుల పరిశ్రమ స్థాపించి ఎంతోమందికి మార్గదర్శి అయ్యారు. ప్రస్తుతం భవేష్ చందూలాల్ భాటియా 14 రాష్ట్రాల్లో విస్తరించి.. కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోంది. ఈ సంఘటన ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకర్షించింది. ఇప్పటి వరకు ఈయన గురించి వినకపోవడం చాలా బాధాకరంగా ఉందని విచారపడ్డాడు. ఈ ట్విటర్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. “Toh kya Hua ki tum duniya nahin dekh sakte. Kuch aisa karo ki duniya tumhe dekhe.” This has to be one of the most inspiring messages I have ever encountered. I’m embarrassed that I hadn’t heard about Bhavesh until this clip dropped into my inbox. His start-up has the power to… pic.twitter.com/vVQeSMQEp3 — anand mahindra (@anandmahindra) August 9, 2023 -
కార్పొరేట్ ఇంజినీర్ కన్నా క్యాబ్ డ్రైవరే నయం! సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
ఈరోజుల్లో చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం చేయడం లేదు. ఒక వేళ చేసినా అందులో సంతృప్తి లేక కొన్ని రోజులకే మానేసి వేరే పని చేసుకుంటున్నారు. కొంతమంది విధి లేక ఇలా చేస్తుంటే మరికొంత మంది మాత్రం పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఇష్టపూర్వకంగానే చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఇలా చిన్న పనులు చేసుకునేవారిని చిన్నచూపు చూస్తుంటారు. వారు పెద్దగా సంపాదించలేరు అనుకుంటుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అలాంటి దానికి ఉదాహరణే ఈ సంఘటన. రద్దీగా ఉండే రోడ్డుపై క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, సంపాదన గురించి సోషల్ మీడియాలో శ్వేతా కుక్రేజా అనే యూజర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇటీవల తాను ఓ క్యాబ్‌లో ప్రయాణించానని, ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు క్వాల్కామ్ కంపెనీలో పనిచేసేవాడినని చెప్పిన అతను, ఆ ఉద్యోగంతో కంటే క్యాబ్ డ్రైవింగ్‌తోనే ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పినట్లు శ్వేత ట్వీట్ చేశారు. శ్వేత ఆగస్ట్ 6న ఈ ట్వీట్ చేయగా ఇప్పటి వరకు 7.7 లక్షల మంది వీక్షించారు. 6,700లకు పైగా లైక్‌లు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ సంపాదనపై యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కార్పొరేట్ జాబ్‌లు చేసినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాదని, క్యాబ్ డ్రైవర్లు ఎంత మాత్రం తక్కువ కాదని శ్వేత పేర్కొన్నారు. I was in a cab yesterday and that driver was an engineer. He said he earns more from the cab driving than his corporate job at Qualcomm. 🥲 — Shweta Kukreja (@ShwetaKukreja_) August 6, 2023 -
ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్ - ఫైట్‌కి ముందే సర్జరీ అవసరం అంటూ..
Elon Musk Tweet: ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య కేజ్ ఫైట్ జరగనున్న సంగతి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇంతలో మస్క్ చేసిన ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా.. నేను రేపు నా మెడ, అప్పర్ బ్యాక్ ఎమ్ఆర్ఐ చేయించుకుంటున్నాను, బహుశా సర్జరీ అవసరం కావొచ్చు అంటూ ట్వీట్ చేసాడు. ఖచ్చితమైన డేట్ ఈ వారంలో తెలుస్తుందన్నాడు. ఇప్పటికే ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అంతే కాకుండా ఈ పోరాటానికి తానూ పూర్తిగా సిద్దమవుతున్నట్లు, అయితే వర్కవుట్ చేసే సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మస్క్ జుకర్‌బర్గ్‌తో "కేజ్ ఫైట్ కోసం సిద్ధంగా ఉన్నాను" అని పేర్కొన్నాడు, దానికి "నాకు లొకేషన్ పంపండి" అని బదులిచ్చాడు. కాగా జుకర్‌బర్గ్ తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. ఇక వీరి కేజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. Exact date is still in flux. I’m getting an MRI of my neck & upper back tomorrow. May require surgery before the fight can happen. Will know this week. — Elon Musk (@elonmusk) August 7, 2023 -
వైరల్ అవుతున్న సాయి పల్లవి పోస్ట్
-
Ind Vs WI: ద్రవిడ్ సెంచరీ.. కోహ్లి 19 పరుగులు! విరాట్ ట్వీట్ వైరల్
India tour of West Indies, 2023: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పంచుకున్న ప్రత్యేకమైన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులతో దూసుకుపోతోంది. ఇంతకీ విరాట్‌కు ఆ ఫొటో ఎందుకంత స్పెషల్ అంటే.. రన్‌మెషీన్‌గా పేరొందిన కోహ్లి 2011, జూన్‌లో టెస్టుల్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నాడు ద్రవిడ్ సెంచరీ.. కోహ్లి విఫలం వెస్టిండీస్‌తో జమైకాలోని కింగ్‌స్టన్‌లో గల సబీనా పార్క్‌లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడాడు. నాటి భారత జట్టులో ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వాల్.. తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేయగా.. కోహ్లి ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కేవలం 4 పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్ సెంచరీ(112)తో ఆకట్టుకోగా.. కోహ్లి 15 పరుగులు చేశాడు. అలా తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ తర్వాతి కాలంలో టీమిండియా మేటి బ్యాటర్‌గా, సారథిగా ఎదిగిన కోహ్లి.. అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 75 శతకాలు పూర్తి చేసుకున్నాడు. హెడ్‌కోచ్, బ్యాటర్‌గా కాగా కోహ్లి అరంగేట్రం చేసిన మరుసటి ఏడాదే ద్రవిడ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక 2011 తర్వాత ఈ ఇద్దరూ కలిసి వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి. అప్పుడు సహచర ఆటగాళ్లుగా ఉన్న ద్రవిడ్, కోహ్లి.. ప్రస్తుతం హెడ్‌కోచ్, కీలక బ్యాటర్లుగా వేర్వేరు హోదాల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కోహ్లి.. రాహుల్ ద్రవిడ్‌తో ఉన్న ఫొటో ట్విటర్లో షేర్ చేశాడు. ‘‘గత పర్యాయం 2011లో ఇక్కడికి వచ్చిన ఇద్దరు ఆటగాళ్లు.. వేర్వేరు హోదాల్లో మరోసారి ఇలా! ఎంతో సంతోషంగా ఉంది’’ అని కోహ్లి చేసిన ట్వీట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా జూలై 12న తొలి టెస్టుతో టీమిండియా వెస్టిండీస్ టూర్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టు జరుగనున్న డొమినికా 2011 నాటి మూడో టెస్టుకు వేదికైంది. ఇక్కడ దిగిన ఫొటోనే కోహ్లి షేర్ చేశాడు. నాడు డొమినికాలో ద్రవిడ్, కోహ్లి చేసిన పరుగులు వరుసగా.. 5, 34- 30. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా! The only two guys part of the last test we played at Dominica in 2011. Never imagined the journey would bring us back here in different capacities. Highly grateful. 🙌 pic.twitter.com/zz2HD8nkES — Virat Kohli (@imVkohli) July 9, 2023 -
పాపం.. జడేజా హర్ట్ అయి ఉంటాడు.. సీఎస్కే సీఈఓ కామెంట్స్ వైరల్
Ravindra Jadeja- MS Dhoni: ‘‘అతడు బ్యాటింగ్ చేయడానికి వెళ్లే సమయానికి దాదాపు 5-10 బంతులో మిగిలి ఉన్న సమయంలో.. కొన్నిసార్లు షాట్లు ఆడగలడు. లేదంటే మిస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, తన తర్వాత ధోని బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుందని తనకు తెలుసు. కాబట్టి ఒక్కోసారి తనకు రెండు- మూడు బంతులు మాత్రమే ఆడే ఛాన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ధోని మైదానంలో అడుగుపెట్టగానే ప్రేక్షకులు అతడి నామస్మరణ మొదలుపెట్టడం సహజం. అంతేగాక ధోని రాక కోసం ఒక్కోసారి జడేజా తొందరగా అవుట్ కావాలని కోరుకుంటారు కూడా! బహుశా ఈ విషయం జడేజా మనసును గాయపరిచి ఉండొచ్చు. అలాంటి సమయంలో ఏ ఆటగాడైనా అలాగే ఫీల్ అవుతాడు. ఒత్తిడిలో కూరుకుపోతాడు. కానీ ఈ విషయం గురించి ఒక్కసారి కూడా అతడు మాకు కంప్లైంట్ చేయలేదు. తను ఆ ట్వీట్ చేసినప్పటికీ ఆ విషయం గురించి మా దగ్గర ప్రస్తావించలేదు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు. ధోనిపై ప్రేమ.. జడ్డూ మనసుకు గాయం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో అభిమానుల ప్రేమ.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కొన్నిసార్లు బాధపెట్టిన మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 ధోనికి చివరిదన్న వార్తల నేపథ్యంలో ఎక్కడ చూసినా ధోని నామస్మరణే సాగింది. చెన్నై సొంతమైదానం అనే కాకుండా ఇతర స్టేడియాల్లో కూడా సీఎస్కే మ్యాచ్ ఉందంటే ధోని పేరుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. జడ్డూ ట్వీట్‌పై అభిమానుల ఆగ్రహం ఇక బ్యాటింగ్ ఆర్డర్లో జడ్డూ తర్వాత ధోని ఎంట్రీ ఇచ్చే నేపథ్యంలో ఫ్యాన్స్ ఒక్కోసారి.. జడేజాను తొందరగా అవుట్ అవ్వాలంటూ కామెంట్లు చేశారు. ధోని మీద వారికున్న ప్రేమ.. జడేజాకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో మనసు చిన్నబుచ్చుకున్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. జట్టును గెలిపించి అవార్డు అందుకున్న సందర్భంలో.. ‘‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరో ఇప్పటికైనా తెలిసిందా?’’అన్న అర్థంలో ట్వీట్ చేశాడు. దీంతో జడేజాపై సీఎస్కే అభిమానులు కూడా విరుచుకుపడ్డారు. ధోని మీద ఆప్యాయత చూపినంత మాత్రాన నిన్ను తక్కువ చేసినట్లు కాదని.. అయినా నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తావంటూ చివాట్లు పెట్టారు. ధోనిని అవమానించావంటూ మండిపడ్డారు. ఫైనల్లో బౌండరీ బాది అయితే, ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బౌండరీ బాది జడేజా.. సీఎస్కేను విజయతీరాలకు చేర్చిన తర్వాత ధోని భయ్యా కోసం ఏదైనా చేస్తా అంటూ అతడు చేసిన ట్వీట్ అభిమానుల కోపాన్ని చల్లార్చింది. నిజంగానే జడ్డూకు ధోని అంటే ఎంత ప్రేమో అని ఫ్యాన్స్ మురిసిపోయారు. ఈ నేపథ్యంలో జడేజా క్రిప్టిక్ పోస్ట్‌పై తాజాగా స్పందించిన కాశీ విశ్వనాథన్ ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. జడ్డూ స్థానంలో ఎవరున్నా హర్ట్ అవడం సహజమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 విజేతగా నిలిచిన ధోని సారథ్యంలోని సీఎస్కే ఐదోసారి ట్రోఫీ గెలిచింది. చదవండి: Ind Vs WI: విండీస్‌కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్! ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం! M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
మరో ఓలా స్కూటర్ రానుందా? భవిష్ అగర్వాల్ ఏం చెబుతున్నాడంటే?
Ola Upcoming Electric Scooter: భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇప్పుడు మార్కెట్లో మరో స్కూటర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్' (Bhavish Aggarwal) తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, వచ్చే నెలలో (2023 జూలై) మరో ఉత్పత్తిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎండ్ఐస్ఏజ్ (#endICEAge) షో పార్ట్ వన్ అని అన్నారు. అయితే త్వరలో వెల్లడించనున్న స్కూటర్ ఏది అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ జాబితాలో మరో స్కూటర్ చేరనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నాము. ఇది కూడా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది. Announcing our next product event in July. Calling it the #endICEAge show, Part 1! Part 1 of the show would end ICE age in scooters! With S1 Pro, S1 Air and … XXXX 😉😎 And maybe one more thing!😀 pic.twitter.com/7Qz5JRg9I7 — Bhavish Aggarwal (@bhash) June 19, 2023 -
15 ఏళ్ల స్టార్టప్ సీఈవోకి లింక్డ్ఇన్లో నిషేధమా? ట్వీట్ వైరల్
అమెరికాలో చిన్నవయసులోనే స్టార్టప్‌కి సీఈవో, 15 ఏళ్ల ఎరిక్ ఝూకు వ్యాపార నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్లో చోటు దక్కలేదు. లింక్డ్ఇన్లో తననుఎందుకు బ్యాన్ చేసిందో, అకౌంట్ ఎందుకు లేదో తెలుపుతూ స్వయంగా అవియాటో సీఈవో ఎరిక్ తన ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించారు. దీంతో 6 లక్షలకు పైగా వ్యూస్, దాదాపు 4వేలకు పైగా లైక్స్‌తో ఈ ట్వీట్ వైరలయింది. విషయం ఏమిటంటే... హైస్కూల్లో చదువుతున్న ఎరిక్ ‘ఎవియాటో’ అనే స్టార్టప్‌ని ఏర్పాటు చేశాడు. బాచ్మానిటీ క్యాపిటల్‌లో పెట్టుబడిదారుడిగా కూడా ఉన్నాడు. ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఒక ఉద్యోగి “హే ఎరిక్, నేను మీ కంపెనీతో నా ఉద్యోగంపై సంతోషిస్తున్నా. కానీ లింక్డ్ఇన్ పోస్ట్‌లో మిమ్మల్ని ట్యాగ్ చేయలేకపోయాను, కానీ.. అంటూ వచ్చిన ఒక స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ అసలు విషయం చెప్పారు. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాదాపు ఇదే కారణంతో స్పేస్ఎక్స్ కైరన్ క్వాజీకి లింక్డ్ఇన్ ప్రొఫైల్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లింక్డ్ఇన్ ఖాతాను తెరవాలంటే కనీసం 16 ఏళ్ల వయసుండాలి. ఈ విషయాన్ని తన కంపెనీ కొత్త ఉద్యోగికి చెప్పాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి వయసు నిబందనపై లింక్డ్ఇన్ ప్రతినిధి ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. I had to tell my new employee that I got banned from linkedin for being 15 years old today… pic.twitter.com/fskiVDnpWw — Eric Zhu (@ericzhu105) June 15, 2023 -
ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!
Car Owner Tweets to Anand Mahindra: గత కొన్ని రోజులకు ముందు మహీంద్రా కంపెనీకి చెందిన లేటెస్ట్ స్కార్పియో ఎన్ ఒక పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ SUV చెట్టుకి ఢీ కొట్టడం వల్ల కారు పై భాగం మొత్తం ఒక పక్కకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ లోపల ఉన్న ప్రయాణికులకు ప్రాణ నష్టం జరగలేదు, కానీ గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ ఒక మహిళ ఈ ప్రమాదం గురించి 'ఆనంద్ మహీంద్రా'కి ట్వీట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మహీంద్రా స్కార్పియో-ఎన్ కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి డ్రైవింగ్ చేసే సమయంలో నిద్రపవడంతో ఈ పెను ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు చూస్తే ఒక్క సారిగా భయం కలుగుతుంది. కారు అటవీ ప్రాంతం గుండా వెల్తూ చెట్టుకి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైనపుడు స్కార్పియో ఎన్ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదని ఓనర్ వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయం మీదనే బిబేకానంద దాస్ ట్వీట్ చేస్తూ కారులో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదని, ఈ ప్రమాదం వల్ల తన చిన్న కూతురు పరిస్థితి విషయంగా ఉందని, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడమే దీనికి కారణమని, దీని మీద తప్పకుండా మరింత ద్రుష్టి సారించాలని కోరింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ప్రస్తుతానికి ఆనంద్ మహీంద్రా దీనిపైన స్పందించలేదు. కాగా ఇప్పటి వరకు స్కార్పియో ఎన్ కారుకి ఇలాంటి ప్రమాదం సంభవించలేదు, ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారంటే అందులో ఉన్న పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ మనకు ఇట్టే అర్థమైపోతాయి. @anandmahindra 🙏Met with a fatal road accident on 11th June while driving Scorpio N with my family my younger daughter is critical. Unfortunately none of the airbags open. Pl take care for further development. pic.twitter.com/yp3tUZGmpp— BIBEKANANDA DASH (@bibek_india) June 13, 2023 సేఫ్టీ రేటింగ్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యువిలో జరిగిన ఈ సంఘటన ఈ కారు కొనుగోలుదారులతో కొంత భయాందోళనను కలిగించింది. ఈ ఎస్యువి అడల్స్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 34 పాయింట్లకు గానూ 2.25 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 48 పాయింట్లకు గానూ 28.94 పాయింట్లను సాధించి, మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. సేఫ్టీ ఫీచర్స్ మహీంద్రా స్కార్పియో ఎన్ ఏడు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఓపెన్ కాలేదనేదానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. -
మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. పచ్చని పకృతి, పల్లె అందాలకు మురిసిపోతూ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. భారతదేశంలోని 10 అత్యంత అందమైన గ్రామాల లిస్ట్‌ను షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా నుండి మేఘాలయలోని మావ్లిన్నాంగ్ వరకు ఉన్న ఫోటోలు మిమ్మల్ని ఆనంద పరవశంలో ముంచేస్తాయి. దేశంలో పలు ప్రాంతాల శోభను ప్రతిబింబించేలా దేశం నలుమూలలా పరుచుకున్న ప్రకృతి మాత ఒడిలో, ఎనలేని సోయగంతో అలరారే అద్భుత అందాలను చూసి తరించాలని అందరికీ ఉంటుంది. రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి సేదదీరేందుకు సాధారణంగా పల్లెలకు పరుగులు తీస్తాం. అక్కడి అందాలను ఆత్మీయతలను జీవిత మంతా పదిలపర్చుకుంటాం. కానీ ఈ విశాల ప్రపంచంలో ప్రతీ మూలలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) అలాంటి వారికి భారీ ఊరటనిచ్చేలా దేశంలోని అందమైన టాప్ టెన్ పల్లెల అద్భుతమైన ఫోటోలను కలర్స్ ఆఫ్ భారత్ పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. వీటిని చూసిన ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర వాటిని రీట్వీట్ చేశారు. మండు వేసవిలో చల్లని చిరుజల్లుల్లా ఉన్న ఫోటోలనుచూసి ఆయన మురిసిపోయారు. మన చుట్టూ ఉన్న అందాలు చూసి తనకు మాటలు రావడం లేదంటూ పరశించిపోయారు. భారతలో తాను ఆస్వాదించాల్సిన అందమైన ప్రాంతాల లిస్ట్ పెరిగిపోతోంది అంటూ కమెంట్ చేశారు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) This beauty around us just left me speechless…My bucket list for travel in India now overflows…. https://t.co/WXunxChIKg — anand mahindra (@anandmahindra) June 8, 2023 -
రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న భారతీయ మహిళా రెజ్లర్ల ఆందోళనపై ప్రముఖ పారిశశ్రామికవేత్త హర్షగోయెంకా స్పందించారు. మహిళలకు తోటి మహిళలే అండగా లేకపోతే ఎలా? ఇంకెవరుంటారు అంటూ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. అంతేకాదు ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లు తోటి క్రీడాకారులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదీ చదవండి: ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు ఢిల్లీలో రెండు ఎఫ్ఐఆర్లు నమదు కావడం సంచలనం రేపింది. ఏళ్లుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులకు స్పందించిన ఢిల్లీ పోలీసులు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ 10 ఫిర్యాదులను నమోదు చేశారు. తమను అనుచితంగా తాకి, లైంగిక వేధింపులతో మనోవేదనకు గురిచేశారని మహిళా రెజర్లు ఆరోపించారు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ సింగ్ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలో నమోదు చేశారు. 2017, సెప్టెంబర్ లో ఆసియా ఇండోర్ గేమ్స్ కోసం కర్ణాటకలోని బళ్లారిలో శిక్షణ పొందుతున్నప్పుడు, శిక్షణ సమయంలో, గాయపడి దాదాపు మరణశయ్యపై ఉంటే, ఈమెయిల్ ద్వారా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినప్పటికీ నోటీసులు ఇచ్చారని, విచారణ కమిషన్ వేస్తామంటూ బెదిరించారని ఒక రెజ్లర్ వాపోయారు. సింగ్‌తోపాటు వినోద్ తోమర్‌పై ఆరోపణలు గుప్పించారు. (సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) If women will not support other women, who will? If the current iconic cricketers not support their brethren, who will? — Harsh Goenka (@hvgoenka) June 2, 2023 -
మహీ అన్న.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే: జడేజా ట్వీట్ వైరల్
#MS Dhoni- Ravnidra Jadeja: ఐపీఎల్-2023 ఫైనల్.. అసలే వర్షం.. అప్పటికే ఓరోజు వాయిదా పడ్డ మ్యాచ్.. కనీసం రిజర్వ్ డే అయినా వరుణుడు కరుణిస్తాడా లేదా అన్న సందేహాలు.. పర్లేదు వాతావరణం బాగానే ఉంది.. ఆట మొదలైంది.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. సాయి అద్బుత ఇన్నింగ్స్ సాయి సుదర్శన్ తుపాన్ ఇన్నింగ్స్(47 బంతుల్లో 96 పరుగులు) కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు స్కోరు బోర్డుపై ఉంచగలిగింది. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫలితం ఏమవుతుందోనన్న ఆందోళన నడుమ అర్ధరాత్రి మ్యాచ్ మళ్లీ మొదలైంది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ఈ నేపథ్యంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై గెలుపొందాలంటే 171 పరుగులు సాధించాలి. కాన్వే అదరగొట్టాడు సీజన్ ఆసాంతం అదరగొట్టిన సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(16 బంతుల్లో 26 పరుగులు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డెవాన్ కాన్వే (25 బంతుల్లో 47 పరుగులు) శుభారంభమే అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అజింక్య రహానే 13 బంతుల్లోనే 27 పరుగులు సాధించాడు. ఆతర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు 8 బంతుల్లో 19 రన్స్ తీశాడు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ధోని గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. రవీంద్ర జడేజా మరోసారి మ్యాజిక్ చేశాడు. జడ్డూ విన్నింగ్ షాట్.. ఐదోసారి చాంపియన్‌గా చెన్నై చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మోహిత్ శర్మ మొదటి నాలుగు బంతులు కట్టుదిట్టంగా వేశాడు. వరుసగా 0, 1,1,1.. మొత్తంగా మూడు పరుగులే వచ్చాయి. సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవాలంటే ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జడేజా ఉన్నాడు. నరాలు తెగే ఉత్కంఠ.. పదిహేనో ఓవర్ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన జడ్డూ.. ఆఖరి బంతికి ఫోర్ బాదాడు. విన్నింగ్ షాట్‌తో చెన్నైని ఫైవ్‌స్టార్ చేశాడు. అంతే.. సూపర్ కింగ్స్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. సారథి ధోని అయితే ఏకంగా జడ్డూను ఎత్తుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏంటీ విభేదాలా? మహీ అన్న కోసం ఏమైనా చేస్తా! కీలక మ్యాచ్‌లలో చెన్నైని గెలిపించిన జడేజా.. ఐపీఎల్-2023 ఫైనల్లోనూ అద్భుతం చేసి జట్టును విజయతీరాలకు చేర్చి ధోనికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. కాగా ధోని- జడేజా మధ్య విభేదాలంటూ గత కొంతకాలంగా వదంతులు వ్యాపిస్తున్న తరుణంగా రవీంద్ర జడేజా తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. జడ్డూ, తన భార్య రివాబా ట్రోఫీతో ధోనితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఇది కేవలం ఏకైక వీరుడు, ధీరుడు ఎంఎస్ ధోని కోసమే చేశాం. మహీ అన్నా.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే’’ అంటూ ధోనిపై ప్రేమను కురిపించాడు. వేలల్లో రీట్వీట్లు, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రవీంద్ర జడేజా ట్వీట్ దూసుకుపోతోంది. వీరి మధ్య పొరపొచ్చాలు లేవని ఇప్పటికైనా ఇలా చెప్పారంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు We did it for ONE and ONLY “MS DHONI.🏆 mahi bhai aapke liye toh kuch bhi…❤️❤️ pic.twitter.com/iZnQUcZIYQ — Ravindrasinh jadeja (@imjadeja) May 30, 2023 M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 𝙒𝙚 𝙬𝙖𝙣𝙩 𝙩𝙤 𝙙𝙚𝙙𝙞𝙘𝙖𝙩𝙚 𝙩𝙝𝙞𝙨 𝙏𝙞𝙩𝙡𝙚 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 𝙩𝙤 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 💛 Men of the moment @imjadeja & @IamShivamDube recap #CSK's glorious win in the #TATAIPL 2023 #Final 👌🏻👌🏻 - By @ameyatilak Full Interview 🎥🔽 #CSKvGT https://t.co/kDgECPSeso pic.twitter.com/yp09HKKCSn — IndianPremierLeague (@IPL) May 30, 2023 -
IPL 2023 Final: విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్‌మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్‌ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్‌యూవీని శుభ్‌మాన్ గిల్‌కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో 60.79 సగటుతో శుభ్‌మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్ఫామెన్స్తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…! — anand mahindra (@anandmahindra) May 28, 2023 -
చాలా కష్టంగా ఉంది.. ఒక్కరూ సాయం చేయడం లేదు.. కనీసం: చేతన్ శర్మ
Chetan Sharma shares cryptic post: భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ నెట్టింట మరోసారి వైరల్‌గా మారాడు. ఎవరూ సహకారం అందించడం లేదంటూ నర్మగర్భ ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పరాభవం నేపథ్యంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో అనూహ్య రీతిలో మరోసారి చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. శివ్‌సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌కు చేతన్ శర్మ పానెల్లో చోటిచ్చింది. సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇదిలా ఉంటే.. చీఫ్ సెలక్టర్‌గా మరోసారి నియమితుడైన చేతన్ శర్మ నెల రోజుల్లోనే వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. భారత క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారంటూ సంచలనం రేపాడు. అదే విధంగా సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లికి వ్యతిరేకంగా రాజకీయాలు జరిగాయంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో టీమిండియా ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీసేలా మాట్లాడిన చేతన్ శర్మ రాజీనామా చేయడం కూడా చర్చకు దారితీసింది. ఒక్కరు కూడా సాయం చేయడం లేదు ఈ నేపథ్యంలో చేతన్ శర్మను తప్పించాలనే ఉద్దేశంతో బీసీసీఐ పెద్దలే ఈ స్టింగ్ ఆపరేషన్‌కు ప్రణాళికలు రచించారనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. తాజాగా ఓ క్రిప్టిక్ పోస్ట్‌తో చేతన్ శర్మ ముందుకు వచ్చాడు. ‘‘ఇప్పటిదాకా గడిచిన జీవితం చాలా కష్టంగా తోచింది. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఎలాంటి సహకారం లేదు. ఆ మాతా రాణి ఆశీర్వాదాలైనా నాపై ఉంటాయని ఆశిస్తున్నా’’ అని చేతన్ శర్మ ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన ఆయన ఫాలోవర్లు.. ‘‘ధైర్యంగా ఉండండి. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీకు గడ్డు దశ నడుస్తుంది కావొచ్చు. కానీ ఏదో ఒకరోజు నీ సమస్యలు తీరిపోతాయి భాయ్’’ అని అండగా నిలుస్తున్నారు. చదవండి: యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. శ్రీలంక క్రికెటర్‌కు ఊరట చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? Life has been very tough so far. No hope from your near & dear. Hope Mata Rani bless me..... — Chetan Sharma (@chetans1987) May 17, 2023 -
నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఖాతాల బ్లూటిక్ మాయం కావడంతో ప్రముఖులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యంగా వెరిఫికేషన్ ఫీజు చెల్లించిన తరువాత కూడా బ్లూటిక్ మాయం కావడంతో ఒకింత అవమానంగా భావించారు. అంతేకాదు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలంతా ట్విటర్ చర్యతో షాక్ అవుతున్నారు. దీంతో మా బ్లూటిక్ మాకు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్వీట్ వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) హే ట్విటర్! మీరు వింటున్నారా?సబ్స్క్రిప్షన్ సేవ కోసం చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందుండే బ్లూటిక్‌ను తిరిగి ఇచ్చేయండి. తద్వారా నేనే అమితాబ్ అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. కాళ్లపై పడాలా? అంటూ బిగ్‌బీ ఫన్నీగా ట్విట్ చేశారు. దీంతో యూజర్లు ఫన్నీ రిప్లైలను పోస్ట్ చేసారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) " సహనం ఉంటేనే బ్లూ టిక్’’ అని ఒకరు, మూడు నాలుగురోజులు ఆగండి అని ఇంకొకరు కామెంట్ చేశారు. మిస్టర్ బచ్చన్, మస్క్ విదేశీయుడు, ఎవరి మాటా వినడు. మీరు కొన్ని రోజులు వేచి ఉండాలని ఇంకొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు "బచ్చన్ సాహెబ్ ఉ అంగ్రేజ్ హో కేహు కా నహీ సునత్ హో, అంటూ బిగ్‌బీ స్టయిల్లోనే మరొకరు సమాధానం ఇచ్చారు. అలాగే నటి ఖుష్బూ కూడా తాను సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ట్విటర్ బ్లూటిక్ పోయిందని ట్వీట్ చేశారు. T 4623 - ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम ... तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं - Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ?? — Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023 My account says subscription will end on 17th March 2024, yet it says canceled. I have paid for a year. Why does it stand canceled @TwitterBlue ??? pic.twitter.com/1BZpOm10aY — KhushbuSundar (@khushsundar) April 21, 2023 సినీ స్టార్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్లు, వార్తా సంస్థలు ఇలా ఏ ఖాతానూ మస్క్ వదిలిపెట్టలేదు. బాలీవుడ్ స్టార్లు షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, నటుడు ప్రకాశ్ రాజ్, టాలీవుడ్ హీరో చిరంజీవితోపాటు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖాతాల్లో బ్లూటిక్ ఎగిరిపోయింది. అలాగే హీరోయిన్లు సమంత, అలియా భట్ లతో పాటు రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, యూపీ యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలు మీడియా సంస్థలు కూడా బ్లూటిక్‌ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. As of now, this is my blue tick verification! 😬 https://t.co/BSk5U0zKkp pic.twitter.com/OEqBTM1YL2 — Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023 -
4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్?
IPL 2023- GT Vs KKR: ‘‘తలెత్తుకో.. ఒక్కోసారి అత్యుత్తమ క్రికెటర్ల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నీది కాదంతే! నువ్వు ఎల్లప్పుడూ చాంపియన్‌వే యశ్. ఇంతకంటే గొప్పగా.. మరింత వేగంగా పుంజుకుని నువ్వేంటో నిరూపించుకుంటావు’’ అంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ క్రీడాస్ఫూర్తిని చాటుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్‌ను ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్ చేసింది. అతడికి అండగా నిలిచి నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అదరగొట్టిన అయ్యర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలో తడబడ్డా.. వెంకటేశ్ అయ్యర్(83), నితీశ్ రాణా(45) రాణించి గెలుపుపై ఆశలు చిగురింపజేశారు. 5 సిక్సర్లతో దుమ్ములేపిన రింకూ ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు మర్చిపోలేని విజయం అందించాడు. కాగా రింకూ ఊచకోతకు బలైపోయిన బౌలరే యశ్ దయాల్. రింకూ, యశ్ ఒకే జట్టుకు ఆడతారు! ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశ్ లెఫ్టార్మ్ మీడియం పేసర్. దేశవాళీ క్రికెట్లో రింకూతో కలిసి ఆడాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశ్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు పూర్తి చేసి ఏకంగా 69 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్ ట్వీట్ వైరల్ ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఏకంగా 31 పరుగులు ఇచ్చి తమ జట్టు ఓటమి కారణమయ్యాడు. దీంతో ముఖం చేతుల్లో దాచుకుంటూ యశ్ దయాల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో కేకేఆర్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న యశ్‌ను ఉద్దేశించి చాంపియన్ అంటూ ట్వీట్ చేసింది. బాధ పడొద్దంటూ ధైర్యం చెప్పింది. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరీ యశ్ దయాల్? ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1997 డిసెంబరు 13న యశ్ దయాల్ జన్మించాడు. 2018లో యూపీ తరఫున లిస్ట్ ఏక క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 17 ఫస్ట్‌క్లాస్, 14 లిస్ట్ ఏ మ్యాచ్. 33 టీ20లు ఆడిన యశ్ దయాల్ మూడు ఫార్మాట్లలో వరుసగా 58, 23, 29 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ పేస్ బౌలర్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 వేలంలో 3.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు టైటాన్స్ తరఫున యశ్ దయాల్ 9 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌కు ఎంపికైన యశ్.. దురదృష్టవశాత్తూ.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. చదవండి: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్ IPL 2023: అవును.. బిగ్ ప్లేయర్.. కానీ పాపం నువ్వే బలైపోయావు! Chin up, lad. Just a hard day at the office, happens to the best of players in cricket. You’re a champion, Yash, and you’re gonna come back strong 💜🫂@gujarat_titans pic.twitter.com/M0aOQEtlsx — KolkataKnightRiders (@KKRiders) April 9, 2023 𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻, 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲, 𝗖𝗹𝗮𝘀𝘀: All captured in a moment to savour 🙌 Seek your Monday Motivation from this conversation ft. man of the moment @rinkusingh235 & @NitishRana_27 👏👏 - By @Moulinparikh Full Interview🔽 #TATAIPLhttps://t.co/X0FyKmIjAD pic.twitter.com/FtVgYQJQ5H — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
దిల్ ఉండాలబ్బా..! ఆనంద్ మహీంద్ర అమేజింగ్ వీడియో
సాక్షి,ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. తన మనసుకు నచ్చిన, ఆకట్టుకున్న వీడియో ఏదైనా సరే ఫ్యాన్స్‌తో పంచుకోవాల్సిందే. అలాంటి ఎన్నో విజ్ఞానదాయకమైన, ఆసక్తి కరమైన వీడియోలను ట్విటర్లో తరచుగా పంచుకుంటున్న ఏకైక బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. (ఇదీ చదవండి: హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్ ) తాజాగామనసుంటే మార్గముంటుంది అంటూ ఒక వీడియోను ట్వీట్ చేశారు. హ్యాండ్‌మేడ్, ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీం ఓన్లీ ఇన్ ఇండియా అంటూ ఒక వీడియోను షేర్ చేయడం విశేషంగా నిలిచింది. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) Where there’s a will, there’s a way. Hand-made & Fan-made ice cream. Only in India… pic.twitter.com/NhZd3Fu2NX — anand mahindra (@anandmahindra) March 29, 2023 -
‘పాపం..చేప! నా బాధ వారికే తెలుస్తుంది’ ఎయిరిండియాపై పెట్ లవర్ ఫిర్యాదు వైరల్
బెంగళూరు: టాటా యాజమాన్యంలోని ఎయిరిండియాపై ఒక వ్యక్తి ఫిర్యాదు వార్తల్లో నిలిచింది. నా పెంపుడు ఫిష్‌ను విమానంలో తీసుకెళ్లనీయ లేదంటూ బెంగళూరుకు చెందిన హుస్సేన్ ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను స్వయంగా హుస్సేన్ ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఈ చేప కథ వైరల్‌గా మారింది. డిజిటల్ మార్కెటర్ అకిబ్ హుస్సేన్ బెంగళూరు నుండి శ్రీనగర్‌కు ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. అత్యవసర విమానంలో హుస్సేన్ తన తల్లిని చూడటానికి వెళుతున్నారు. అయితే తనతోపాటు పెట్ ఫిష్ కంటైనర్‌ను తీసుకెళ్లడంపై సిబ్బంది అభ్యంతరం చెప్పారు. అందులోని నీరు పరిమితికి మించి ఉందంటూ దాన్ని క్యారీచేసేందుకు అనుమతినివ్వలేదు ఎయిర్‌లైన్. దీంతో తన లైఫ్‌లో ఇదో ‘‘చెత్త అనుభవం’’ అంటూ ఎయిరిండియా, టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన) ఈ వివరాలను వరుస ట్వీట్లలో షేర్ చేసిన హుస్సేన్ “ఒక పెట్ లవర్ బాధ మరో పెట్ లవర్‌కు మాత్రమే అర్థం అవుతుంది. కేవలం 50 గా బరువున్న ట్రాన్స్పరెంట్ కంటైనర్‌లో లైవ్ అక్వేరియం తీసుకెళ్లేందుకు బెంగళూరుకు చెందిన ఫ్లైట్ గ్రౌండ్ స్టాఫ్, ఫ్లైట్ ఎక్కనీయలేదు. క్యారీరింగ్ ఛార్జీగా రూ.1,350 జరిమానా చెల్లించేందుకు సిద్ధపడినా అంగీకరించలేదు. దీనిపై చర్య తీసుకొనేది ఎవరంటూ వాపోయాడు. సంవత్సరం పాటు కలిసి బతికాం.. కానీ ఎయిరిండియా కారణంగా బలవంతంగా విమానాశ్రయంలో వదిలివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లో వదిలివేసిన హుస్సేన్ పెంపుడు చేపను ఎయిర్‌లైన్ ఉద్యోగులు బెంగళూరులోని అతని బంధువుకు సురక్షితంగా అప్పగించారుట. (Disney Layoffs: మరో నాలుగు రోజులే, ఉద్యోగులకు ఈమెయిల్ బాంబు!) Pain for loosing a pet after spending 1 year together. Who is gonna take action on this @RNTata2000 Sir ? @airindiain @DGCAIndia @ministry_ca @AviationIndia2 — Aqib Hussain (@askaqibhussain) March 21, 2023 -
ఆనంద్ మహీంద్ర: బారాత్ వీడియో, కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నావ్ భయ్యా! ఫ్యాన్స్ ఫిదా
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. మహీంద్రకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ డీలర్ తన పెళ్లి సందర్భంగా స్వరాజ్ ట్రాక్టర్స్‌తో బారాత్ నిర్వహించాడు. ఇదే విషయాన్ని ట్విటర్లో పంచుకున్నారు. అందంగా ముస్తాబు చేసిన 12 ట్రాక్టర్లతో, 12 కుటుంబాలతో పెళ్లి ఊరేగింపు జరిగింది అంటూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేశారు. ఈ వీడియోపైనే ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇదికదా కుటుంబం అంటే.. కుటుంబసభ్యునిగా పిలుచుకునేది ఇందుకే కదా.. మనమంతా కుటుంబసభ్యులమే! అభినందనలంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీంతో ట్విటర్ యూజర్లు కూడా కొత్త జంలకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా బారాత్‌లో ట్రాక్టర్లతో ట్రాక్టర్ల డీలర్.. వారెవ్వా..నిజంగా సరైన ట్రాక్‌లో ఉన్నాడు అంటూ చమత్కరించడం విశేషం. Now THAT’S what I call being a member of the family! Badhai ho badhai. https://t.co/6vxIGqqAX4 — anand mahindra (@anandmahindra) March 10, 2023 -
నమ్మకం ఉంటే చాలు: ఆనంద్ మహీంద్ర మోటివేషనల్ వీడియో
సాక్షి, ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్, పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మరో స్ఫూర్తి దాయకమైన వీడియోను షేర్ చేశారు. ఎపుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన విజ్ఞాన, వినోద, ఆధునిక టెక్నాలజీ.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోను, విషయాలను తన ఫోలోవర్స్‌తో పంచుకోవడం అలవాటు. తాజాగా ఆయన చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. (మహీంద్రా ఇ-రిక్షా నడిపిన బిల్ గేట్స్ వీడియో వైరల్, ఆనంద్ మహీంద్ర స్పందన) నీటిపై ఒక గుర్రం శరవేగంతో పరుగులు తీస్తున్న అందమైన వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విటర్లో పోస్ట్ చేశారు. ఏ పని చేయాలన్నా మన మీద మనకి నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉంటే మీరు నీటిపై కూడా నడవవచ్చు. అంతా మన సంకల్పంలోనే ఉంది. మన మనసులోనే ఉంది. సో.. మీ కలసాకారం కోసం ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయండి అంటూ మండే మోటివేషన్ సందేశాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. అయితే దీనిపై కొంతమంది విభిన్నంగా స్పందించారు. అలాంటి ఒక యూజర్ కమెంట్, వీడియోకు స్పందించిన ఆయన నీటిపై నడవడానికి ప్రయత్ని స్తున్నప్పుడు మల్టీ టాస్కింగ్ చేయవద్దు అంటూ చురకలంటించారు. You too can walk on water if you believe you can. It’s all in the mind. 😊 Start your week believing in yourself and your aspirations. #MondayMotivation pic.twitter.com/qh6h3mEVtw — anand mahindra (@anandmahindra) March 6, 2023 😄 Moral of the story: Don’t Multi-task when trying to walk on water. https://t.co/pHLTrHQhTZ — anand mahindra (@anandmahindra) March 6, 2023 -
నాకు ఇది ముందే ఎందుకు కనిపించలేదబ్బా: ఆనంద్ మహీంద్ర
సాక్షి,ముంబై: ప్రముఖ పారిశశ్రామికవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో గురువారం మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. సాధారణంగా ఇంట్లో బట్టలు ఉతికిన తరువాత మడతపెట్టి బీరువాలోనో,కప్‌బోర్డ్‌లోనే సర్దడం అనేది ఒక పెద్ద టాస్క్. అందులోనూ ఏదైనా ఊరికి వెళ్లేటపుడు తక్కువప్లేస్లో ఎక్కువ లగేజీ సర్దడం అంటే నిజంగా బిగ్గెస్ట్ టాస్క్. ఈ విషయానికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్ర తన ఫాలోయర్లతో షేర్ చేశారు. పొందికగా, అందంగా దుస్తులను మడతపెట్టుతున్న ఈ వీడీయో ఆనంద్ మహీంద్రను బాగా ఆకర్షించింది. సాధారణంగా చేసుకునే పనులలో సింపుల్ టెక్నిక్స్ కొత్త ఇన్నోవేషన్ & డిజైన్ నైపుణ్యాలు ఆవిష్కారానికి నాంది పలుకుతాయి. ఈ వీడియో చాలా ఫ్యాసినేటింగ్ ఉంది అంటూ కొనియాడారు. దశాబ్దాలుగా ప్యాకింగ్‌ల మీద ప్యాకింగ్‌లు చేసుకుంటూ ప్రపంచమంతా కలియదిరుగుతున్న తనకు ముందే ఈ వీడియో ఎందుకు కనిపించలేదంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. Fascinating. How innovation & design skills can bring huge productivity in such simple activities. Wish I had seen this video decades ago when I traveled like a maniac and was packing & re-packing every few days. https://t.co/mEXfa4TFP1 — anand mahindra (@anandmahindra) March 2, 2023 -
BGT 2023: అక్కడ ఆడటం ఈజీ కాదన్న షంసీ! చెత్త వాగకు అంటూ కౌంటర్
India vs Australia, 1st Test: చెత్త మాటలు మాట్లాడితే సహించేది లేదంటూ నెటిజన్‌కు చురకలంటించాడు సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ. ఏదైనా మాట్లాడేటపుడు కాస్త ముందూ వెనుక ఆలోచించాలని సూచించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచమంతా టెస్టు క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోయిందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్ ఫైనలిస్టులను ఖరారు చేసే టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్‌పైనే అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో పిచ్, ఆటగాళ్ల బలాబలాలు తదితర అంశాలపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తొలి టెస్టుకు వేదికైన నాగ్‌పూర్ పిచ్‌ను డాక్టర్డ్ పిచ్ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. భారత జట్టు తమకు అనుకూలంగా(స్పిన్నర్లకు) పిచ్ తయారు చేయించుకుందని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా మాజీలు సీఏకు గట్టి కౌంటర్ ఇచ్చారు. షంసీ ఆసక్తికర ట్వీట్ ఇక గురువారం భారత్- ఆసీస్ తొలి టెస్టు ఆరంభం కాగా తొలి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. టీమిండియా స్పిన్నింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా ఐదు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసి కంగారూ జట్టు పతనాన్ని శాసించారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆసీస్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో.. సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘ఇండియాలో ఇండియాతో మ్యాచ్ ఆడటం అంత సులువేమీ కాదు’’ అంటూ ఫన్నీ ఎమోజీని జతచేశాడు. ఇక ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘నీకు ఐపీఎల్ కాంట్రాక్ట్ కచ్చితంగా వస్తుంది.. కంగ్రాట్యులేషన్స్ బ్రో’’ అంటూ వెటకారం ప్రదర్శించాడు. అయితే, షంసీ సదరు ట్విటిజెన్కు ఘాటుగానే బదులిచ్చాడు. చెత్త వాగకు.. ‘‘నేను ఇండియాలో ఇండియాతో మ్యాచ్‌లు ఆడాను. బహుశా నువ్వు ఆ మ్యాచ్‌లు చూసి ఉండవు. నేను అక్కడ ఆడిన నా వ్యక్తిగత అనుభవం గురించి పంచుకున్నాను. నువ్వు మాత్రం ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెత్త వాగుతున్నావు. మన ఇద్దరి అభిప్రాయాల మధ్య చాలా తేడా ఉంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. థాంక్స్’’ అంటూ షంసీ కౌంటర్ ఇచ్చాడు. కాగా టీమిండియాతో పలు మ్యాచ్‌లు ఆడిన చైనామన్ స్పిన్నర్ షంసీ.. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-2023 వేలం నేపథ్యంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో సదరు నెటిజన్ ఈ మేరకు కామెంట్ చేయగా.. షంసీ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. చదవండి: IND VS AUS 1st Test: భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు IND vs AUS: ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!! I've played against India in India and you havnt...... I'm speaking about something from personal experience and you are speaking nonsense just for the sake of speaking nonsense There is a huge difference between the two No need to throw rubbish comments around... thanks https://t.co/SfNHmHY8yh — Tabraiz Shamsi (@shamsi90) February 9, 2023 -
అబ్బాయిలకు Bతో స్టార్ట్ అయ్యేదే కావాలన్న ఓ అమ్మాయి.. అశ్విన్ ఏమన్నాడంటే..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసందే. ప్రతిష్టాత్మక ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. నాగ్‌పూర్‌లో భారత్, బెంగళూరులో ఆసీస్ ఆటగాళ్లు శిక్షణా శిబిరాల్లో చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా అయితే టీమిండియాపై మాటల యుద్ధానికి దిగి మైండ్ గేమ్‌ను మొదలుపెట్టేసింది. ఇంత బిజీ షెడ్యూల్లోనూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఆసక్తికర సంభాషణలో (సోషల్‌మీడియా) పాల్గొన్నాడు. మహిమా అనే ఓ ట్విటర్ యూజర్ చేసిన కామెంట్‌కు యాష్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అబ్బాయిలకు ఒక్కటే కావాలి, అది B అనే ఇంగ్లీష్ పదంతో స్టార్ట్ అవుతుందని మహిమ ట్వీట్ చేయగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటూ అశ్విన్ సమాధానం చెప్పాడు. మహిమ ఉద్దేశంలో ఇది కరెక్టో కాదో తెలీదు కానీ అశ్విన్ ఇచ్చిన సమాధానం మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. క్రికెట్ పట్ల అశ్విన్‌కు ఉన్న పిచ్చిని చూసి నెటిజన్లు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. యాష్.. BGT 2023ని చాలా సిరీయస్‌గా తీసుకుంటున్నాడని, ఓ బాధ్యతాయుతమైన దేశ క్రికెటర్‌కు ఇది చాలా అవసరమని టీమిండియా ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. కొందరైతే అశ్విన్‌కు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని అంటున్నారు. మరోవైపు మహిమ చేసిన కామెంట్‌పై కూడా చాలామంది స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సమాధానలు చెబుతున్నారు. కొందరేమో బహిరంగంగా వాడకూడని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి BGT 2023లో తొలి టెస్ట్‌కు ముందు ఓ సరదా సంభాషణతో అశ్విన్ టీమిండియా అభిమానులను అలరించారు. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. భారత్-ఆసీస్‌ల మధ్య ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ జరిగినా అశ్విన్ కీ రోల్ ప్లే చేస్తాడు. ఈ సిరీస్‌లోనూ యాష్ ప్రధాన పాత్ర పోషిస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై అశ్విన్ బంతితో పాటు బ్యాట్‌తో ఏరకంగా రెచ్చిపోతాడో గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్ విభాగాన్ని లీడ్ చేసే అశ్విన్‌కు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు వార్నర్, స్టీవ్ స్మిత్, లబూషేన్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో అశ్విన్ మరో వికెట్ తీస్తే.. టెస్ట్‌ల్లో 450 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. -
అదానీ-హిండెన్‌బర్గ్ సంక్షోభం: వారికి ఆనంద్ మహీంద్ర హెచ్చరిక
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు-అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రేపిన దుమారంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎంఅండ్ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. తన తాజా ట్వీట్లో అదానీ గ్రూప్ సంక్షోభాన్ని ప్రస్తావించారు.ఎన్ని సవాళ్లు వచ్చినా భారత్ దృఢంగా నిలబడుతుంది అంటూ సోషల్‌మీడియాలో ప్రకటించారు. (కుప్పకూలుతున్న అదానీ: డౌ జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్) వ్యాపార రంగంలో ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థికశక్తిగా ఉండాలనే భారతదేశ ఆశయాలను దెబ్బతీస్తాయా అని గ్లోబల్ మీడియా అనేక ఊహాగానాలు చేస్తోంది కానీ అలాంటిదేమీ ఉండదు. ఎన్ని తుఫానులు, సంక్షోభాలు వచ్చినా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉంటుందని ప్రకటించారు. ఇండియా గతంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొందని, కానీ ప్రతిసారీ బలంగా నిలబడిందని ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యానించారు. భూకంపాలు, కరువులు, మాంద్యాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు లాంటివి ఎన్నో చూశా.. తాను చెప్పేది ఒక్కటే, భారతదేశానికి వ్యతిరేకంగా ఎపుడూ సవాల్ చేయొద్దని సూచించారు. అలా అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై మోపిన అకౌంటింగ్ మోసం ఆరోపణల నేపథ్యంలో అనేక ఊహాగానాలు చేస్తున్న వారిని పరోక్షంగా ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. Global media is speculating whether current challenges in the business sector will trip India’s ambitions to be a global economic force. I’ve lived long enough to see us face earthquakes, droughts, recessions, wars, terror attacks. All I will say is: never, ever bet against India — anand mahindra (@anandmahindra) February 4, 2023 /p> -
ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: ఓ మహిళ స్టోరీ వైరల్
న్యూఢిల్లీ: ట్విటర్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు సహా, అనేక కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగాన్ని కోల్పోయిన చాలామంది తమ మనోభావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తాజాగా ఒక మహిళ అనుభవం వైరల్‌గా మారింది. ఉద్యోగాన్ని కోల్పోయిన మూడు రోజులకే.. 50 శాతం పెంపుతో జీతం, వర్క్ ఫ్రం హోం ఆప్షన్, ఇతర ప్రయోజనాలతో మరో జాబ్ఆఫర్ కొట్టేశారు. ఈ స్టోరీ ఇపుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. babyCourtfits అనే మహిళన తన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. మంగళవారం తొలగించారు. శుక్రవారం 50 శాతం ఎక్కువ వేతనం, WFH, ఇతర ఆఫర్లతో కొత్త జాబ్వ చ్చిందంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్ 7.1 మిలియన్ల వ్యూస్‌ను 5వేలక పైగా రీట్విట్లు, వందల కామెంట్లను సాధించింది. ఎపుడూ మనపై మనకుండే విశ్వాసానికి ఇదొక రిమైంటర్. మనం ఎవరో, ఎలా ఉండాలో శాసించేలా ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు. చాలా రోజులుగా ఆత్మన్యూనతలో గడిపిన తర్వాత ఈ మాట చెబుతున్నానన్నారు. అంతేకాదు క్లిష్ట సమయంలో తనకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సపోర్టివ్ మెసేజెస్ పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. గతవారం చాలా కష్టంగా నడిచింది. కానీ తాను స్ట్రాంగ్ విమెన్ని అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆమెకు ట్విటర్లో అభినందనల వర్షం కురుస్తోంది. Life update: I was fired on Tuesday. On Friday I got a job offer that pays me 50% more, WFH option, and more PTO. — babyCourtfits (@2020LawGrad) January 29, 2023 -
IPL: 18.5 కోట్ల ప్లేయర్‌కు చేదు అనుభవం.. షాకయ్యానంటూ ట్వీట్
Sam Curran Tweet Viral: ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు సిబ్బంది. అయితే, ఇందుకు గల కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! అసలేం జరిగిందంటే.. బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ వర్జిన్ అట్లాంటిక్ విమానంలో సామ్ ప్రయాణించేందుకు టికెట్ బుక్ అయింది. అందులో ప్రయాణం చేయడానికి వీల్లేదట తీరా అక్కడికి వెళ్తే తను కూర్చోవాల్సిన సీటు విరిగిపోయిందనే రీజన్‌తో సామ్‌ను లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సామ్ కరన్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘‘వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధమయ్యాను. కానీ సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. విమానంలో నేను కూర్చోవాల్సి సీటు విరిగిపోయిందట. కాబట్టి నేను అందులో ప్రయాణం చేయడానికి వీల్లేదని చెప్పారు. క్రేజీగా ఉంది కదా. ఇది నన్ను విస్మయానికి గురిచేసింది. చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది’’ అంటూ సామ్ కరన్ ఎయిర్‌లైన్స్ తీరుపై మండిపడ్డాడు. ఏదేమైనా థాంక్స్ వర్జిన్ అట్లాంటిక్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇందుకు స్పందించిన సదరు ఎయిర్‌లైన్స్ యాజమాన్యం.. సామ్ కరన్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్నితమ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినట్లయితే.. అప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవాళ్లమని చింతిస్తూ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సామ్ ట్వీట్ వైరల్ కాగా.. అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. కనీసం ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణానికైనా వీలుగా ఏర్పాట్లు చేయాల్సింది కదా అని పేర్కొంటున్నారు. కాసుల వర్షం ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరొందిన సామ్ కరన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 మినీ వేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. అతడి కోసం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడగా.. ఏకంగా 18.5 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. కాగా ప్రపంచకప్-2022లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన సామ్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ నేపథ్యంలో వేలంలో అతడిపై కాసుల వర్షం కురవడం గమనార్హం. Just turned up for a flight with @VirginAtlantic for them to tell me my seat is broken on the flight, therefore they’ve said I can’t travel on it. Absolutely crazy. Thanks @VirginAtlantic . Shocking and embarrassing 👍🏻 — Sam Curran (@CurranSM) January 4, 2023 -
సుశీల్ జీ మీకు రుణపడిపోయాం.. హ్యాట్సాఫ్: లక్ష్మణ్ ట్వీట్ వైరల్
Rishabh Pant Accident- VVS Laxman Hails Bus Driver: ‘‘మంటల్లో కాలిపోతున్న కారులో నుంచి రిషభ్ పంత్‌ను బయటకు తీసి.. బెడ్‌షీట్ చుట్టి.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి.. తనను కాపాడిన హర్యానా డ్రైవర్ సుశీల్ కుమార్‌కు ధన్యవాదాలు. మీరు చేసిన సేవకు కృతజ్ఞులం. సుశీల్ జీ మీకు రుణపడిపోయాం’’ అంటూ టీమిండియా దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడటానికి కారణమైన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్‌ను రియల్ హీరోగా అభివర్ణించాడు. అదే విధంగా.. కండక్టర్ పరంజిత్‌కు కూడా లక్ష్మణ్ ధన్యవాదాలు తెలియజేశాడు. పెద్ద మనసు రిషభ్‌ను కాపాడే క్రమంలో పరంజిత్.. సుశీల్‌కు సాయం చేశాడన్న లక్ష్మణ్.. వీరి సమయస్ఫూర్తికి సలాం కొట్టాడు. పంత్‌ను ప్రాణాలతో రక్షించిన సుశీల్, పరంజిత్లది పెద్ద మనసు అంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ యువ వికెట్ కీపర్ స్వయంగా కారు నడుపుకొంటూ స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన సుశీల్ వెంటనే తమ బస్సు నిలిపివేసి.. అప్పటికే కారు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పంత్‌ను మరికొంత మంది సాయంతో బయటకు తీశాడు. ఈ నేపథ్యంలో గాయాలతో బయటపడ్డ పంత్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స జరుగుతోంది. కాగా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి 25 ఏళ్ల పంత్ ప్రాణాలతో బయటపడటంలో సుశీల్ పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లకు ప్రోత్సాహకం టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్‌ను ప్రమాదం నుంచి కాపాడిన వారందరికీ సముచిత గౌరవం దక్కనుంది. ఈ విషయం గురించి ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు మొదటి గంట సమయం అత్యంత కీలకం. గోల్డెన్ పీరియడ్. ఆ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుడిని కాపాడిన వాళ్లను ప్రోత్సహించేందుకే కేంద్రం ది గుడ్ సామరిటన్ స్కీమ్ ప్రవేశపెట్టింది’’ అని తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్య సేవ అందేలా చేసిన వారికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహకం ఇస్తారు. చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది Gratitude to #SushilKumar ,a Haryana Roadways driver who took #RishabhPant away from the burning car, wrapped him with a bedsheet and called the ambulance. We are very indebted to you for your selfless service, Sushil ji 🙏 #RealHero pic.twitter.com/1TBjjuwh8d — VVS Laxman (@VVSLaxman281) December 30, 2022 -
ఆ క్యాచ్ పడితే భారత్ 89 రన్స్‌కే ఆలౌట్! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్
Bangladesh vs India, 2nd Test- Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వరల్డ్‌క్లాస్ బౌలర్‌గా.. కీలకమై సమయంలో బ్యాటర్‌గానూ రాణిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో అశ్విన్ విలువైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి.. అశూ 17.3 ఓవర్ల పాటు అసాధారణ పోరాటం చేశాడు. వికెట్లకు నేరుగా టర్న్ అవుతున్న బంతుల్ని చక్కగా కాచుకొని తెలివిగా బ్యాటింగ్ చేశాడు. మెహిదీ వేసిన 47వ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాది మ్యాచ్‌ను ముగించి భారత్‌కు విజయం అందించాడు ఈ ఆల్‌రౌండర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సంతోషాన్ని పంచుకుంటూ ‘‘గొప్ప మ్యాచ్.. గుర్తుండిపోయే విజయం’’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి ఈ అవార్డు అతడికి ఇవ్వాలంటూ ట్రోల్ కానీ, ఓ సోషల్ మీడియా యూజర్ మాత్రం అతడి ఆట తీరును కించపరిచే విధంగా కామెంట్ చేశాడు. ఇందుకు ఘాటుగా స్పందించిన అశ్విన్ తనదైన శైలిలో అతడికి కౌంటర్ ఇచ్చాడు. కాగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 33.4 ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అశూ ఇచ్చిన క్యాచ్‌ను మొమినుల్ జారవిడిచాడు. దీంతో లైఫ్ పొందిన అశూ ఇలా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో సదరు యూజర్.. ‘‘నీకు వచ్చిన ఈ అవార్డును నిజానికి మొమినుల్ హక్కు ఇవ్వాలి అశ్విన్. అతడే కదా నువ్వు ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డ్రాప్ చేసింది. నోరు మూయించిన అశ్విన్ ఒకవేళ అతడు క్యాచ్ పట్టి ఉంటే.. ఇండియా 89 పరుగులకే ఆలౌట్ అయ్యేది’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు స్పందించిన అశ్విన్.. ‘‘ఓహ్ నో! నేను నిన్ను బ్లాక్ చేశా అనుకున్నానే! సారీ నువ్వు కాదా? అతడు వేరే వ్యక్తి అయి ఉంటాడు. అతడి పేరు ఏదో ఉండే! యెస్.. డానియల్ అలెగ్జాండర్... గుర్తొచ్చింది. ఒకవేళ ఇండియా క్రికెట్ ఆడకపోయి ఉంటే.. మీ ఇద్దరి పరిస్థితి ఏమయ్యేదో కదా’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు జతచేశాడు. కాగా అశ్విన్‌ను కామెంట్ చేసిన ఆ ట్విటర్ యూజర్ పేరు నబ్రాజ్ రంజాన్. తన అకౌంట్లో ఉన్న బయో ప్రకారం.. శ్రీలంకకు చెందిన అతడు క్రికెట్ రైటర్, డైలీక్రికెట్ఎస్ఎల్ అడ్మినిస్ట్రేటర్. ఈ నేపథ్యంలో అశ్విన్ ఇలా అతడికి దిమ్మతిరిగేలా బదులిచ్చాడు. చదవండి: KL Rahul: రాహుల్ వరుస సెంచరీలు చేయాలి! లేదంటే కష్టమే!.. గిల్‌కు అన్యాయం చేసినట్లే కదా! Oh no ! I thought I blocked you, oh sorry that’s the other guy. 🤔🤔🤔 what’s his name?? Yes Daniel Alexander that’s the name !! Imagine what you both would do if India dint play cricket😂😂 https://t.co/FFqBvAPtDh — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 25, 2022 -
సూర్యకుమార్ యాదవ్ నీడలో రిలాక్స్ అవుతున్నా: బాబర్ ఆజమ్
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. హాఫ్ నాలెడ్జ్‌తో అతను పోస్ట్ చేసిన ఓ ఫోటో క్యాప్షన్.. అతనికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాభావం తర్వాత.. షికార్లు కొట్టడంలో బిజీగా ఉన్న పాక్ కెప్టెన్, ఓ ఆహ్లాదకరమైన ఉదయాన నీలం రంగు (టీమిండియా జెర్సీ కలర్) ఆకాశం కింద ఓ ఫోటో దిగి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇందుకు రిలాక్సింగ్ అండర్ బ్లూ స్కై అని క్యాప్షన్ పెట్టాడు. ఇదే క్యాప్షన్ మనోడి కొంపముంచింది. Relaxing under the blue sky 😎 pic.twitter.com/M78Lh9xLGJ — Babar Azam (@babarazam258) November 23, 2022 అతను ఏ ఉద్దేశంతో ఈ క్యాప్షన్ పెట్టాడో కానీ, భారత అభిమానుల చేతుల్లో మాత్రం బలి అవుతున్నాడు. బ్లూ స్కైని టీమిండియా జెర్సీలో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌తో పోలుస్తున్న టీమిండియా ఫ్యాన్స్.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను (సూర్యకుమార్ అగ్రస్థానంలో ఉండగా.. రిజ్వాన్ రెండు, బాబర్ ఆజమ్ నాలుగు స్థానాల్లో ఉన్నారు) ఉదాహరణగా తీసుకుని పాక్ కెప్టెన్‌ను ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. This is what he means. Relaxing 3 spots under the blue, vibrant no 1 spot of the one and only Suryakumar Yadav, aka SKY! pic.twitter.com/TqCZDpw3ML — Rishabh Tantry (@Rishabh_tantry) November 23, 2022 నువ్వు చెప్పింది కరెక్టే ఆజామూ.. టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ (స్కై) కిందే రిలాక్స్ అవుతున్నావు అంటూ ట్రోలింగ్‌కు దిగారు. ఇంత కరెక్ట్‌గా ఎలా క్యాప్షన్ పెట్టావు ఆజామూ.. నువ్వు నిజంగా సూర్యకుమార్ యాదవ్ నీడలోనే రిలాక్స్ అవుతున్నావు అంటూ ఆటపట్టిస్తున్నారు. తాను చేసిన ట్వీట్ మిస్ ఫైర్ కావడంతో బాబర్ ఆజమ్ నాలుక్కరుచుకుంటున్నాడు. ఇదిలా ఉంటే,నిన్న (నవంబర్ 23) విడుదల చేసిన లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్‌లో.. బాబర్ ఆజమ్ మూడో స్థానం నుంచి నాలుగో ప్లేస్‌కు దిగజారాడు. అతని స్థానానికి కివీస్ ప్లేయర్ డెవాన్ కాన్వే ఎగబాకాడు. Yes u r relaxing under our 🔥🔥 sky pic.twitter.com/8CTP1GguLI — piyush aggarwal (@Educatorpiyush) November 23, 2022 -
అడికి...అజిత్ బ్రో లాజిక్కే! ఆనంద్ మహీంద్ర హిల్లేరియస్ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఏదైనా ఒక బ్రాండ్ పాపులర్ కాగానే దానికి సంబంధించి నకిలీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తాయి. అసలేదో నకిలీ ఏదో గమనించలేనంత పకడ్బందీగా లోగో, బ్రాండ్పేరుతో సహా నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఈ విషయంపైనే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు. స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ బ్రాండింగ్‌ను పోలి ఉన్న ప్రొడక్ట్‌ను ట్వీట్ చేశారు. హిలేరియస్ కామెంట్ జత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!) లోగో, ట్రేడ్‌మార్క్‌తో అడిడాస్ షూస్ ను పోలిఉన్న పోస్ట్‌ను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ట్విటర్లో షేర్ చేశారు. నిశితంగా పరిశీలిస్తే తప్ప నకిలీ షూపై అడిడాస్‌కు బదులుగా "అజిత్‌దాస్" అని ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీంతో ఇది లాజిక్కే... అడికి అజిత్ అనే సోదరుడు ఉన్నాడని అర్థం. వసుధైక కుటుంబం అంటూ చేసిన ఆనంద్ మహీంద్ర ట్విట్ వైరల్‌గా మారింది. (Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్) Completely logical. It just means that Adi has a brother called Ajit. Vasudhaiva Kutumbakam? 😊 pic.twitter.com/7W5RMzO2fB — anand mahindra (@anandmahindra) November 22, 2022 Here are more pic.twitter.com/DdBfTluKnt — Sir Kazam (@SirKazamJeevi) November 22, 2022 pic.twitter.com/2K9NvbFUqH — $€€£ (@deep_befriend) November 22, 2022 -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కమింగ్ సూన్, సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఇ-మొబిలిటీ మార్కెట్లో ఓలా భారీ వ్యూహాలనే రచిస్తోంది. ఇప్పటికే ఎస్1, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఇపుడిక ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఇదీ చదవండి : ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ప్రకటించింది. ఈ పైప్‌లైన్‌లో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను చేర్చింది. త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న స్పోర్ట్స్, క్రూయిజర్, అడ్వెంచర్ లేదా కేఫ్ రేసర్ ఏది కావాలి అంటూ ట్విటర్ తన ఫాలోnయర్లను అడిగారు భవిష్ అగర్వాల్. అయితే ఆసక్తికరంగా స్పోర్ట్స్ కేటగిరీ అత్యధిక ఓట్లను పొందుతోంది. వచ్చే ఏడాది బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Building some 🏍️🏍️!! — Bhavish Aggarwal (@bhash) November 10, 2022 రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా సరసమైన ధరలో, ఆధునిక ఫీచర్లతో తీసుకొస్తున్నందని అంచనా. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఆదరణ బాగా లభించడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు ట్రిమ్‌లలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) Which bike style do you like — Bhavish Aggarwal (@bhash) November 10, 2022 -
టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్
Guinness World Records: టీ20 వరల్డ్‌కప్-2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దారుణంగా అవమానించింది. ప్రపంచం నలుమూలల్లో జరిగే ప్రతి అంశంలో అత్యుత్తమ, అతి దారుణమైన విశేషాలను తమ రికార్డుల్లో నమోదు చేసే ఈ సంస్థ.. నవంబర్ 10న ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని అతి దారుణంగా వర్ణిస్తూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత సునాయాసమైన లక్ష్య ఛేదన అంటూ ట్వీట్ చేసి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది. దీనిపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఆ సంస్థను ఓ ఆటాడుకుంటున్నారు. భారతీయుల మనో భావాలను దెబ్బతీసిన ఈ సంస్థను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు శక్తివంచన లేకుండా అత్యుత్తమ ఆటతీరు కనబర్చారని భారత క్రికెటర్లను వెనకేసుకొస్తున్నారు. Easiest run chase in history? 👀#INDvsENG — Guinness World Records (@GWR) November 10, 2022 ఇంత కంటే దారుణ పరాజయాలు క్రికెట్ చరిత్రలో చాలానే ఉన్నాయని రివర్స్ కౌంటరిస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.. యూకే సంస్థ కాబట్టి, గొప్పలకు పోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్లో పాక్‌పై ఎలా గెలవాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ట్రైనింగ్ ఇవ్వండి అంటూ సలహాలిస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, అదృష్టం కలిసి రాక సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. సూపర్-12 దశలో ఒక్క దక్షిణాఫ్రికాతో మినహా అన్ని జట్లపై అద్భుత విజయాలు సాధించి గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు చేరిన భారత్.. సెమీస్‌లో అనూహ్యంగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా, ఛేదనలో ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆటగాళ్లు విరాట్ (50), హార్ధిక్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ (80), హేల్స్ (86) అజేయమైన అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: హేల్స్ రెచ్చిపోతే.. పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు..! -
జింబాబ్వే చేతిలో ఓటమి.. వైరలవుతున్న పాక్ కెప్టెన్ ట్వీట్
టీ20 వరల్డ్‌కప్-2022లో పసికూన జింబాబ్వే.. పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించిన అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గతంలో చేసిన ఓ ట్వీట్ వైరలవుతోంది. 2015లో జింబాబ్వే.. పాక్ పర్యటనకు వచ్చిన సందర్భంగా బాబర్ ఆజమ్ ఆ జట్టుకు స్వాగతం పలికాడు. వెల్కమ్ జింబాబ్వే అంటూ ట్వీట్ చేశాడు. అయితే బాబర్ చేసిన ఆ ట్వీట్లో జింబాబ్వే స్పెల్లింగ్‌లో అక్షర దోషాలు ఉండటంతో నెటిజన్లు అతన్ని ఓ ఆటాడుకున్నారు. బాబర్.. ZIMBABWEకి బదులు ZIMBAWAY అంటూ ట్వీట్ చేయడంతో సొంత అభిమానులు సైతం ట్రోల్ చేశారు. పాక్ వ్యతిరేక అభిమానులైతే బాబర్ ఇంగ్లీష్‌ను అవహేళన చేశారు. Welcome zimbaway — Babar Azam (@babarazam258) May 19, 2015 కాగా, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి అనంతరం బాబర్ చేసిన ఈ ట్వీట్ మరోసారి తెరపై వచ్చింది. ఈ ట్వీట్‌ను బేస్ చేసుకుని నెటిజన్లు పాక్ కెప్టెన్‌ను మరోసారి ఆటాడుకుంటున్నారు. నువ్వు గతంలో జింబాబ్వే స్పెల్లింగ్‌ను తప్పు ట్వీట్ చేసినందుకు ఇప్పుడా ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. పాకిస్తాన్‌కు తిరుగు ప్రయాణం అయ్యేందుకు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్‌లు స్వాగతం పలుకుతున్నాయంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలే ఓటమి బాధలో ఉన్న బాబర్‌కు ఈ ట్వీట్ల గోల మరింత ఇబ్బందిగా మారింది. ye jo tumne zimbabwe ki galat spelling likhi hai uska badla liya hai un ne — Tatya Vinchu (@TatyaVinc) October 28, 2022 ఇదిలా ఉంటే, సూపర్-12 గ్రూప్-2లో భాగంగా అక్టోబర్ 27న జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పాక్‌కు ఊహించని షాకిచ్చింది. 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 129 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. సికందర్ రజా (3/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పాక్ ఓటమికి కారకుడయ్యాడు. Welcome Pakistan From Australia airports.. — $ARAN virat^°🔥 (@Itz_Saranvj) October 27, 2022 -
పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి?
T20 WC 2022- Pakistan vs Zimbabwe- Who is the fake Pak Mr Bean: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు జింబాబ్వే జట్టును హీరోను చేస్తే.. పాకిస్తాన్‌ను జీరో చేసింది. బాబర్ ఆజం బృందానికి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ప్రపంచకప్-2022లో భాగంగా సూపర్-12లో ఒక్క పరుగు తేడాతో పాక్‌ను ఓడించి జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా బ్యాటర్‌గా విఫలమైనా(9 పరుగులు) బౌలింగ్‌తో మ్యాజిక్ చేసి తమ జట్టును గెలిపించాడు. పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించి పెర్త్ మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ చేసిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.. కీలక సమయంలో వికెట్లు తీశాడు. మొత్తంగా 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్ గడ్డ మీద పుట్టిన ఈ ఆల్‌రౌండర్.. పాక్‌తో పోరులో జింబాబ్వేను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక జింబాబ్వే చేతిలో ఓటమితో పాకిస్తాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సెమీస్ అవకాశాలపై ఈ పరాజయం కచ్చితంగా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. నాడు పాక్ మోసం చేసిందంటూ జింబాబ్వే ప్రెసిడెంట్ ట్వీట్! ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 సూపర్-12లో జింబాబ్వే తొలి విజయంతో ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ డేంబజో మినాంగాగ్వ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘జింబాబ్వే అద్భుత విజయం! జట్టుకు శుభాకాంక్షలు. నెక్ట్స్ టైమ్ నిజమైన మిస్టర్ బీన్‌ను పంపండి’’ అని పేర్కొన్నారు. తమ జట్టును అభినందిస్తూనే పాక్ తీరుపై సెటైర్లు వేశారు. గతంలో తమ ప్రజలను మోసం చేసే విధంగా పాక్ వ్యవహరించిందన్న అర్థం వచ్చేలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలేం జరిగిందంటే.. నూరుద్దియన్ అనే ట్విటర్ యూజర్ జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ప్రతీకార మ్యాచ్ అవుతుందనుకోవడం లేదంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు స్పందనగా.. నుగుగి చాసురా అనే నెటిజన్.. ‘‘జింబాబ్వే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మిస్టర్‌బీన్ రోవాన్ బదులు పాక్ నకిలీ బీన్‌ను మా దగ్గరికి పంపించారు. ఈ మ్యాటర్‌ను రేపటి మ్యాచ్‌లో తేలుస్తాం. వర్షం మిమ్మల్ని కాపాడాలని ప్రార్థించుకోండి’’ అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు జతగా మిస్టర్ బీన్ డూప్‌తో ఇద్దరు వ్యక్తులు ఫొటోలకు పోజులిస్తున్న దృశ్యాన్ని షేర్ చేశాడు. Blimey. I didn't realise Pakistan vs Zimbabwe was a grudge match and for good reason pic.twitter.com/wtllENSZnl — Nooruddean (@BeardedGenius) October 26, 2022 అసలేం జరిగిందంటూ ఓ పాకిస్తానీ ఫ్యాన్ అడుగగా.. సదరు నెటిజన్.. ‘‘వాళ్లు మాకు మిస్టర్ బీన్ బదులు నకిలీ మిస్టర్ బీన్ ఇచ్చారు. స్థానికంగా జరిగే అగ్రికల్చరల్ షోకు అతడిని పంపించారు’’ అని వివరణ ఇచ్చాడు. ‘‘ఈ పాక్ బీన్.. ప్రజలను మోసం చేస్తూ వారి డబ్బును దోచుకుంటాడు’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ దీంతో ఈ నకిలీ బీన్ వ్యవహారమేమిటంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో పాక్‌పై జింబాబ్వే గెలుపొందడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. మిస్టర్ బీన్ డూప్‌లా ఉన్న ఆ వ్యక్తి పేరు ఆసిఫ్ ముహ్మద్గా కొంతమంది పేర్కొన్నారు. అతడు పాకిస్తానీ కమెడియన్. ఒకానొక సందర్భంలో అతడు జింబాబ్వే షోలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పలు వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. Here is the footage of Pakistani, Mr. Bean in Zimbabwe. The controversy is getting out of hands 🤣pic.twitter.com/BW3oc3oZbm — Shafqat Shabbir (@Chefkat23) October 26, 2022 2016లో హరారేలో ఓ కామెడీ షోలో రియల్ మిస్టర్ బీన్‌ను చూడటానికి 10 డాలర్లు చెల్లించి.. ప్రజలు ఎదురుచూడగా.. ఆసిఫ్ రావడంతో వారు కంగుతిన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే జింబాబ్వే ప్రెసిడెంట్ ఎమర్సన్ ట్వీట్ చేశారు. ఇక ఇందుకు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కాస్త ఘాటుగానే స్పందించారు. ఘాటు స్పందన ‘‘మా దగ్గర నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు. కానీ ఆటలో క్రీడా స్ఫూర్తి కనబరచ గల పరిణతి ఉంది... మా పాకీస్తానీలకు వెంటనే తిరిగి పుంజుకునే సరదా కూడా ఉంది! మిస్టర్ ప్రెసిడెంట్ మీకు శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజు మీ జట్టు చాలా బాగా ఆడింది’’ అని ట్వీట్ చేశారు. We may not have the real Mr Bean, but we have real cricketing spirit .. and we Pakistanis have a funny habit of bouncing back :) Mr President: Congratulations. Your team played really well today. 👏 https://t.co/oKhzEvU972 — Shehbaz Sharif (@CMShehbaz) October 27, 2022 మిస్టర్ బీన్ ఎవరు? మిస్టర్ బీన్‌గా కోట్లాది మందిని అలరిస్తున్న రోవాన్ సెబాస్టియన్ అట్కిన్సన్ ఇంగ్లిష్ నటుడు. కమెడియన్‌గా.. రైటర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ఆయన ముఖం చూస్తే చాలు నవ్వాపుకోవడం ఎవరితరం కాదు! చదవండి: Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. T 20 WC: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి' -
యాంటీ స్ట్రెస్ బాల్‌తో సిద్ధం, టీవీ మాత్రం చూడను! ఆనంద్ మహీంద్ర
సాక్షి,ముంబై: ఇండియా, పాకిస్తాన్,క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. సెలబ్రిటీస్‌ల దగ్గరినుంచి, సాధారణ క్రికెట్ ఫ్యాన్దాకా తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. తాజా టీ20 ప్రపంచకప్ పాక్, ఇండియా మ్యాచ్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మరోసారి తన ట్విట్‌తో వార్తల్లో నిలిచారు. ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్‌కోసం నేను సిద్ధం. యాంటీ-జిన్క్స్ స్ప్రే, యాంటీ-స్ట్రెస్ బాల్, వర్రీ బీడ్స్‌ని సిద్ధంగా ఉంచుకున్నా. సాయంత్రం రానున్న ఫలితాలకోసం ఎదురు చూస్తా తప్ప...టీవీని చూడను ఆఫ్ చేసేశా.. అంటూ మ్యాచ్ ప్రారంభానికి ముందే ట్వీట్ చేశారు. స్టేడియం ఉత్కంఠపూరితంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఉద్యోగం టీమిండియా జట్టు సభ్యుడిగా ఉండటం అంటూ కోట్లాది మంది అభిమానులు అంచనాల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్‌లో గెలుపుకోసం ఆటగాళ్ల ఆరాటం, తపనపై మరో ట్వీట్ చేశారు. మ్యాచ్‌కు ముందు అభిమానుల లుంగీ డ్యాన్స్ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ‘ఆనంద్ సార్, మీ హాస్యం అసాధారణమైనది, అయితే భారత క్రికెట్ జట్టును ఎంకరేజ్ చేసేందుకు ఈ మ్యాచ్‌ని తప్పక చూడాలి, తద్వారా ఇండియా పాకిస్తాన్‌ను ఓడించి పాత ఓటమినుంచి బయటపడుతుంది’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేయడం విశేషం. తాజాగా ఆస్ట్రేలియా మెల్బోర్న్ స్టేడియంలో టీ-20 వరల్డ్ కప్ 2022లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు క్రికెట్ ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా టార్గెట్ 160 (ఆదివారం, సాయంత్రం 3.30 నిమిషాలకు) కాగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. తద్వారా భారత్‌కు 160 టార్గెట్ నిర్దేశించింది. భారత ఆటగాళ్లు హార్దిక్, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు తీయగా, షమీ, భువీ చెరొక వికెట్ పడగొట్టారు. And as always, I am ready for the #indiaVsPakistan match. Have doused myself with the anti-jinx spray & have my anti-stress ball & worry beads at my side. And my TV set firmly switched off! 😀Will only await news of the results in the evening… pic.twitter.com/nxnceKcw9B — anand mahindra (@anandmahindra) October 23, 2022 Right now the real stadium is in the players’ minds. The real battle is being fought over there, in the Mindverse. Right now, with the burden of over a billion expectations, the toughest job in the world is being a member of the Team. Respect. #INDvsPAK pic.twitter.com/aUjTpawPkY — anand mahindra (@anandmahindra) October 23, 2022 Given the strength of the Lungi Dance Division & the Bhangra Battalion, India appears to have already won the #T20WC2022 World Cup of Pre-match Fan Support… pic.twitter.com/hiLuHzqSIP — anand mahindra (@anandmahindra) October 23, 2022 -
వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్
ముంబై: సంతకాలను అచ్చుగుద్దినట్టుగా కాపీ చేసే కేటుగాళ్లను చూశాం. ఫోర్జరీ సంతకాలతో అవతలి వాళ్లకే కాదు, ఆ సంతకంగల వారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా అనేక లావాదేవీలతో భారీ మోసాలకు పాల్పడే నేరగాళ్లు మన చుట్టూ చాలామందే అన్నారు. తాజాగా సిగ్నేచర్లను కాపీ చేస్తున్న మెషీన్ ఒకటి ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్‌వర్మ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. సంతకాల రోజులు పోయాయి ..ఈ మెషీన్ సంతకాన్ని ఖచ్చితంగా కాపీ చేయగలదు అంటూ ట్వీట్ చేశారు. పెన్ను పట్టుకుని అక్కుడున్న సంతకాన్ని అచ్చంగా దించేస్తున్న వైనంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అయితే ఈ మెషీన్‌లోని టెక్నాలజీ ఏంటి, ఏ కంపెనీ మెషీన్ అనే దానిపై క్లారిటీ లేదు. ఇది చాలా ప్రమాదకరమని కొందరు, నిశానీ (వేలిముద్రల) రోజులే బావున్నాయని కొందరు, ఓటీపీ ఉందిగా అంటూ మరికొందరు కమెంట్ చేశారు. కానీ సాధారణంగా సంతకంలోని స్ట్రోక్ ఒక సంతకానికి మరో సంతకానికి భిన్నంగా ఉంటుంది, కాబట్టి సంతకాన్ని మాత్రమే యంత్రం కాపీ చేయగలదు కానీ, స్ట్రోక్‌ను కాపీ చేయలేదని ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే మరో యూజర్ దమ్ముంటే దీన్ని కాపీ చేయండి అంటూ సినీనటుడు, బాలకృష్ట సంతకాన్ని షేర్ చేయడం నవ్వులు పూయిస్తోంది. GONE are the days of signatures ..This machine can copy a signature exactly pic.twitter.com/mNQI0v8fbc — Ram Gopal Varma (@RGVzoomin) October 22, 2022 Try copy this pic.twitter.com/vAwoT5jVsq — Mr.an's (@anildicon) October 22, 2022 But a machine can copy a signature but generally the stroke in a signature is different from one signature to another signature, the machine can follow only one signature but can’t copy the stroke of the signature who is signing, machines can’t — CA MSR (@MUNAGAS) October 22, 2022 -
క్రికెట్ వైరల్ వీడియో: ఆనంద్ మహీంద్ర ట్వీట్, నెటిజన్ల నోస్టాల్జియా
సాక్షి, ముంబై: స్మార్ట్‌టీవీలు, శాటిలైట్ చానెల్స్ హవా రాకముందు దూరదర్శన్‌లో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలకు భారీ క్రేజ్ ఉండేది. ఆయా మ్యాచ్‌ల లైవ్ చూసేందుకు జనం ఎగబడేవారు. నిజానికి రేడియో కామెంటరీ తర్వాత విజువల్ పరంగా అదొక్కటే ప్రేక్షకులకు వరం.అయితే పాత రోజుల్లో యాంటెన్నా కష్టాలు, దూరదర్శన్‌లో క్రికెట్ అంటూ ఒక వీడియో ఇటీవల ఇంటర్నెట్లో బాగా హల్ చల్ చేస్తోంది. అలనాటి యాంటెన్నా, కరెంట్, పిక్చర్ క్వాలిటీ తదితర కష్టాలను గుర్తుచేస్తున్న ఈవీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇది చదవండి: కోట్లాదిమందికి ప్రాణదాత, ఓఆర్ఎస్ సృష్టికర్త ఇకలేరు తాజాగా ఈ వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఎవరైనా ఈ వీడియోకి చక్కటి మ్యూజిక్ ట్రాక్ యాడ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలు రకాల కమెంట్లతో సందడి చేస్తున్నారు. యాంటెన్నా ఒక్కటే కాదు సార్! ఆ రోజుల్లో చాలా ఇళ్లలో బ్లాక్ అండ్ టీవీలు ఉండేవి. సో...పిక్చర్ ట్యూబ్ సమస్యలు కూడా చాలా కామన్‌గా కనిపించేవి కామెంట్ చేశారు. Remember this guys 😁😁😁 fixing of TV Ariel cricket match on DD ❤️❤️❤️ pic.twitter.com/rq1KWcczBd — 🦏 Payal M/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) October 15, 2022 Someone should be able to add an appropriate music track in sync with this… https://t.co/1V06POnv7c — anand mahindra (@anandmahindra) October 17, 2022 Doordarshan experience. pic.twitter.com/1kKETatGIt — Ajit Aditya (@shashijeet990) October 17, 2022 -
‘ప్లీజ్..కొనండి’ సేల్స్‌మేన్‌లా ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ సంచలనం
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ ఇంటర్నెట్లో చర్చకు దారి తీసింది. ఇటీవలను తాను కొత్తగా లాంచ్ చేసిన ‘బర్న్ట్ హెయిర్’ పెర్ఫ్యూమ్ను ప్రమోట్ చేస్తూ ట్విటర్లో మరోసారి సంచలనం రేపుతున్నారు. తనను తాను పెర్ఫ్యూమ్ సేల్స్‌మేన్‌గా పేర్కొన్న మస్క్ ‘‘నా బ్రాండ్ పెర్ఫ్యూమ్ను కొనండి ప్లీజ్.. మీరు కొంటే నేను ట్విటర్‌ను కొనుక్కుంటూ’’ అంటూ వేడుకోవడం గమనార్హం. ఈ మేరకు మస్క్ గురువారం వరుస ట్వీట్లు చేశారు. దీనిపై లైక్‌లు, కమెంట్ల వర్షం ఒక రేంజ్లో కురుస్తోంది. 25 వేలకు పైగా రీట్వీట్లు విభిన్న కమెంట్లతో వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా 20వేల బాటిల్స్ సేల్ అయ్యాయంటూ పేర్కొన్నారు. తద్వారా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ కొనుగోలు అంశంపై చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. (Elon Musk Perfume Business:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు) పెర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించిన మస్క్ ఓమ్నిజెండర్ పెర్ఫ్యూమ్ ఆడామగా ఇద్దరికీ పనికి వస్తుందని వెల్లడించారు. సుమారు రూ. 8,400 (100డాలర్లు) వద్ద దాన్ని లాంచ్ వేసిన వెంటనే 10వేల బాటిల్స్ సేల్ అయ్యా యంటూ ట్విట్ చేయడమేకాదు మిలియన్ బాటిల్స్ సేల్స్.. మీడియా వార్తలు.. అంటూ గప్పాలు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్‌ను అట్టహాసంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు మస్క్. కానీ నకిలీ ఖాతాలపై సరైన సమాచారం అందించలేదంటూ ట్విటర్‌పై విమర్శలు గుప్పించి మస్క్ ఈ డీల్‌ను ఉపసంహరించుకున్నప్పటి ఈ డీల్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. చివరికి కోర్టుకు చేరిన ఈ వివాదంపై అమెరికా కోర్టు విచారణను గత వారం వాయిదా వేసింది. తద్వారా ఈడీల్ పూర్తి చేయడానికి మస్క్‌కు మరింత సమయాన్ని ఇచ్చింది. అయితే అక్టోబర్ 28 నాటికి ఈ డీల్ పూర్తి చేయాలని మస్క్ భావిస్తున్నారట. Please buy my perfume, so I can buy Twitter — Elon Musk (@elonmusk) October 12, 2022 Please buy my pencil art, so I can buy Instagram pic.twitter.com/Yxui0F58Ag — FlowzPam Art (@flowzpam) October 12, 2022 pic.twitter.com/pn7PqQfp0T — Kunal Shah (@kunalb11) October 13, 2022 -
నయన్‌ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్
సీనియర్ నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. వివాస్పద ట్వీట్స్ చేస్తూ తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి సంచలన ట్వీట్ చేసి వార్తల్లోకెక్కింది. భారతదేశంలో సరోగసిని బ్యాన్ చేశారంటూ ఆమె చేసిన ట్వీట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ‘ఇండియాలో సరోగసీపై నిషేధం విధించారు. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప.. సరోగసీని ప్రోత్సాహించకూడదు. ఈ చట్టం జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. చదవండి: మనోజ్ సెకండ్ మ్యారేజ్‌పై మంచు లక్ష్మి షాకింగ్ రియాక్షన్ దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాం’ అంటూ కస్తూరి ఆమె తన ట్వీట్లో రాసుకొచ్చింది. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార తల్లయిన విషయం ప్రకటించిన అనంతరం కాసేపటికే ఆమె ఈ ట్వీట్ చేయడం గమనార్హం. జూన్ 9న ప్రియుడి విఘ్నేశ్ శివన్‌తో ఏడడుగులు వేసిన నయన్ ఆదివారం(అక్టోబర్ 9న) కవలకు తల్లయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సరోగసి ద్వారా కవలకు జన్మనిచ్చిందని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో నటి కస్తూరి సరోగసిపై ట్వీట్ చేయడంతో ఆమె నయన్‌ను టార్గెట్ చేసిందని అందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే దీంతో నయన్ ఫ్యాన్స్ కస్తూరిపై మండిపడుతున్నారు. ‘ఇప్పుటి రోజుల్లో లా(Law)ని ఎవరు ఫాలో అవుతున్నారు?’, ‘ఎవరి జీవితం వారిది.. మీకేందుకు, మీ పని మీరు చూసుకోండి’, ‘ఇప్పుడు ఈ ట్వీట్ చేసి ఎవరిని భయపెడుతున్నారు.. ఎదుటి వాళ్లు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారా?’ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలకు సైతం ఆమె స్పందిస్తూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నా పని నన్ను చూసుకో అని చెప్పిన వారందకి ఇదే నా సమాధానం. ‘లాయర్‌గా పట్టా పొందిన ఓ వ్యక్తిగా చట్టపరమైన అంశాలను విశ్లేషించే హాక్కు ఉంటుంది’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. Surrogacy is banned in India except for medically inevitable reasons. This is the law from Jan 2022. We are going to be hearing a lot about this for next several days. — Kasturi Shankar (@KasthuriShankar) October 9, 2022 -
ఆర్ఆర్ఆర్ మేనియా: ఆనంద్ మహీంద్ర కొత్త కారు నిక్‌నేమ్ ‘భీమ్’కే ఓటు
సాక్షి,ముంబై: మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర తన స్కార్పియో-ఎన్ కారుకి మంచి పేరు కావాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌కు నెటిజన్ల స్పందన బాగానే వచ్చింది. అయితే మళ్లీ ఆనంద్ మహీంద్ర మళ్లీ డైలమాలో పడ్డారు. వచ్చిన సూచనల్లో రెండు నిక్‌నేమ్స్‌ను సెలక్ట్ చేసుకున్నారు. అయితే వీటిల్లో దేన్ని ఫైనల్ చేయాలో తోచక మళ్లీ ఫ్యాన్స్‌నే ఆశ్రయించారు. (బిగ్ డే..మంచి పేరు కావాలి.. చెప్పండబ్బా: ఆనంద్ మహీంద్రా) కొత్త స్కార్పియో-ఎన్ అనే నిక్‌నేమ్స్ వరదలా వచ్చాయి. ఇందుకు అందరికీ ధన్యవాదాలు. వచ్చని వాటిల్లో రెండింటిని షార్ట్‌లిస్ట్ చేసాను. భీమ్, బిచ్చూ అనే రెండు పేర్లలో మీ ఓటు దేనికి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఇప్పటికే 25వేలకు పైగా స్పందనలొచ్చాయి. విశేషం ఏమిటంటే చాలామంది ‘భీమ్’ కే ఓటు వేస్తుండటం. భీమ్ ఈజ్ సింబల్ ఆఫ్ కింగ్.. స్కార్పియోకి అదే బాగా సూట్ అవుతుంది.. పలకడం కూడా ఈజీ అంటూ చాలామంది కమెంట్ చేశారు. Thank you all for the flood of suggestions for the nickname of my new Scorpio-N. I’ve shortlisted two. Here’s the final shoot-out between them. Need your verdict. — anand mahindra (@anandmahindra) October 8, 2022 Bheem ☑️ pic.twitter.com/Hf9BG0rnx2 — 🇩 🇻 🇸 #NTR30⚓ (@venkateshDUGUTA) October 8, 2022 BHEEM pic.twitter.com/5HwcaywfrL — Bellamkonda's (@kotiGowd9999) October 8, 2022 Bheem is the symbol of King. — Shweta Sinha (@gudiasinha) October 8, 2022 #Bheem pic.twitter.com/WFgUxyrL8p — nikhil reddy (@MuskuNikhil) October 8, 2022 -
బిగ్ డే..మంచి పేరు కావాలి చెప్పండబ్బా: ఆనంద్ మహీంద్రా
సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక సంతోషకరమైన వార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల మహీంద్రా లాంచ్ చేసిన స్కార్పియో-ఎన్ తన చేతికి వచ్చిన ముచ్చటను ట్విటర్లో షేర్ చేశారు. నిజంగా ఇది నాకు బిగ్ డే.. స్కార్పియో ఎన్ ను రిసీవ్ చేసుకున్నా. అయితే దీనికి ఒక మంచి పేరు కావాలి. ఎవరైనా పేరు సూచించే వారికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో మహీంద్రా ఇటీవల లాంచ్ చేసింది. ఈ పండుగ సీజన్లో స్కార్పియో-ఎన్ డెలివరీలను ప్రారంభించింది. ఈ క్రమంలో మహీంద్ర ప్రతినిధి ఆనంద్ మహీంద్రకు స్కార్పియో-ఎన్ తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర, తన స్కార్పియోకు పేరు సూచించమని అభిమానులను అడగడం విశేషంగా నిలిచింది. స్కార్పియో-ఎన్ ఎస్యూవీ క్యాబిన్ ప్రీమియం లుక్‌తో, 3D సరౌండ్ 12-స్పీకర్ సోనీ సిస్టమ్, విశాలమైన సన్‌రూఫ్, రిచ్ కాఫీ బ్లాక్ లెథెరెట్ సీట్లు, సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు, 70+ కనెక్టెడ్ కార్ ఫీచర్లతో లాంచ్ చేసింది. స్కార్పియో-ఎన్ ఎస్యూవీ ధర Z2 పెట్రోల్ MT వేరియంట్ రూ. 11.99 లక్షల నుండి ప్రారంభం. అలాగే Z8 L డీజిల్ MT వేరియంట్ ధర రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది. 5 వేరియంట్లు, ఏడు రంగుల్లో లభ్యం. ఈ ఏడాది జూలై 31న బుకింగ్‌లు ప్రారంభమైన తొలి నిమిషంలోనే 25 వేలకు పైగా వాహనాలు బుక్ అయ్యాయి. అంతేకాదు ఈ మోడల్ దేశంలో అత్యంత వేగంగా లక్ష బుకింగ్స్ నమోదు చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Big day for me; received my ScorpioN…. Need a good name for it…Recommendations welcome! pic.twitter.com/YI730Eo9uh — anand mahindra (@anandmahindra) October 7, 2022 -
Amit Mishra: గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లాలి! 300 కాదు ఐదొందలు తీసుకో!
Amit Mishra Viral Tweet: టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు. అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తూ ట్రోలింగ్ బారిన పడతాడు కూడా! ట్విటర్లో 1.4 మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న అమిత్ మిశ్రాకు.. ఇటీవల ఓ అభిమాని నుంచి అతడికి ఓ రిక్వెస్టు వచ్చింది. 300 కాదు.. ఐదొందలు తీసుకో తన గర్ల్‌ఫ్రెండ్‌ను డేట్‌కు తీసుకువెళ్లాలనుకుంటున్నానని.. ఇందుకు తనకు మూడు వందల రూపాయలు ఇచ్చి సాయం చేయాలని ఓ ఫ్యాన్ అమిత్ మిశ్రాను ట్యాగ్ చేశాడు. అయితే, అతడి అభ్యర్థనను ‘సీరియస్’గా తీసుకున్న మిశ్రా.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా 500 రూపాయలు పంపించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘‘పంపించాను. డేట్‌కి వెళ్తున్నావుగా.. ఆల్ ది బెస్ట్’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. నిజమే అంటారా? అమిత్ మిశ్రా ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘సర్ నా దగ్గర డబ్బు ఉంది కానీ. బాయ్‌ఫ్రెండ్ లేడు. సాయం చేయగలరా?’’ అని ఓ అమ్మాయి కొంటెగా అడుగగా.. డబ్బులిచ్చీ మరీ అబ్బాయిని చెడగొడుతున్నారండీ అంటూ మరొకరు ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఇంకొందరేమో.. ‘‘నిజంగా డేట్‌కి వెళ్లి ఉంటే ఆ ఫొటోలు కూడా షేర్ చేయమని చెప్పండి. మీరు మాతో ఆ ఫొటోలు పంచుకోండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తానికి అలా.. మూడు వందలు అడిగితే 500 ఇచ్చి ‘ఉదారత’ను చాటుకున్న అమిత్ మిశ్రా నెట్టింట వైరల్‌గా మారాడు. ఆ మ్యాచ్ చివరిది టీమిండియా తరఫున 2003లో సౌతాఫ్రికాతో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అమిత్ మిశ్రా.. 2008లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 2010లో పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చిన ఈ స్పిన్ బౌలర్.. 2017లో చివరిసారిగా టీమిండియాకు ఆడాడు. ఇక ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు ఢిల్లీ జట్టుకు అమిత్ మిశ్రా ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మెగా వేలం-2022లో మాత్రం అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో క్యాష్ లీగ్ చరిత్రలో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా(154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు)గా మిశ్రా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. గతేడాది ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ అతడికి ఐపీఎల్లో చివరిది. చదవండి: T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్ గెలవడం కష్టమే: ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ Ind Vs Sa 2nd T20: సూర్య మరో 24 పరుగులు సాధించాడంటే! ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే Done, all the best for your date. 😅 https://t.co/KuH7afgnF8 pic.twitter.com/nkwZM4FM2u — Amit Mishra (@MishiAmit) September 29, 2022 -
మంజ్రేకర్ ఫొటో షేర్ చేస్తూ జడేజా ట్వీట్.. రిప్లైతో మనసు గెలిచేశాడు!
Ravindra Jadeja- Sanjay Manjrekar: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌ను ఉద్దేశించి.. ‘‘నా ప్రియమైన మిత్రుడిని స్క్రీన్ మీద చూస్తున్నా’’ అంటూ జడ్డూ మంజ్రేకర్ ఫొటో షేర్ చేశాడు. కాగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి దూరమైన ఈ ఆల్‌రౌండర్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా మంజ్రేకర్ మాట్లాడుతున్న దృశ్యాన్ని పంచుకున్న జడ్డూ అతడిని డియర్ ఫ్రెండ్ అని సంభోదించాడు. ప్రియ మిత్రులుగా మారారా?! ఇక ఇందుకు స్పందనగా.. ‘‘హహా.. నువ్వు త్వరగా మైదానంలో అడుగుపెడితే చూడాలని నీ ఈ ప్రియమిత్రుడు ఎదురుచూస్తున్నాడు’’ అంటూ మంజ్రేకర్ బదులిచ్చాడు. ట్విటర్లో వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘వామ్మో.. ఒకప్పటి ‘శత్రువులు’ ఇప్పుడు మిత్రులుగా మారిపోయారా!? నీ రిప్లైతో జడ్డూ మనసు గెలిచేసుకున్నావన్న మాట’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. అప్పుడేమో అలా.. వన్డే వరల్డ్‌కప్-2019 సెమీ ఫైనల్ సందర్భంగా మంజ్రేకర్.. జడేజాను ఉద్దేశించి అరకొర ఆటగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు స్పందించిన జడ్డూ.. ‘‘నా కెరీర్లో ఇప్పటి వరకు నీకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడతాను’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడిచింది. అయితే, ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. అతడితో మాట్లాడేందుకు మంజ్రేకర్ వచ్చాడు. మంజ్రేకర్‌ను చూసి జడ్డూ నవ్వగా.. జడ్డూ నాతో మాట్లాడం ఇష్టమేనా అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా మాట్లాడుతా అంటూ జడేజా నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా! తాజాగా జడేజా ట్వీట్‌తో మరోసారి వీరిద్దరు వార్తల్లోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో గాయపడిన జడేజా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మరోవైపు.. పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా వెన్నునొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్-2022 ఆడే అవకాశాలు లేకుండా పోయాయి. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే. చదవండి: T20 WC 2022 Prize Money: ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంత లభిస్తుందంటే! Ha ha… and your dear friend looking forward to seeing you on the field soon :) https://t.co/eMpZyZYsYU — Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 30, 2022 -
Gujarat Titans: శుభ్‌మన్ గిల్ ఎక్కడికి పోడు, మాతోనే ఉంటాడు..!
ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ క్రికెట్ అభిమానులను తికమక పెట్టింది. ఆ జట్టు యాజమాన్యం ఇవాళ (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం ఓ క్రిప్టిక్ ట్వీట్ పెట్టి ఫ్యాన్స్‌ను గందరగోళానికి గురి చేసింది. ఆ ట్వీట్లో తమ స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ జట్టును వీడనున్నాడని అర్ధం వచ్చేలా.. గుజరాత్ టైటాన్స్‌తో నీ ప్రయాణం మరువలేనిది, నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొంది. 🤗❤️ — Shubman Gill (@ShubmanGill) September 17, 2022 ఈ ట్వీట్‌ను గిల్ సైతం ధృవీకరించినట్లు ఓ క్రిప్టెడ్ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ పోస్ట్ చేసిన సెకెన్ల వ్యవధిలోనే వైరల్ కావడంతో గుజరాత్ యాజయాన్యం అలర్ట్ అయ్యింది. ఆ ట్వీట్ అర్ధం మీరనుకున్నది కాదు.. గిల్ ఎక్కడికి పోడు.. గుజరాత్ టైటాన్స్‌తో పాటే ఉంటాడని వివరణ ఇచ్చింది. దీంతో ఆ జట్టు అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం తమను ఫూల్స్ చేశారని జీటీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఇలాంటి కన్ఫ్యూజింగ్ ట్వీట్లు చేయరాదని హితవు పలుకుతున్నారు. Twitterverse, Gill will always be a part of our 💙 P.S.: It’s not what you think, but we’re loving the theories. Keep it going! 😅 — Gujarat Titans (@gujarat_titans) September 17, 2022 మరికొందరేమో నిప్పులేనిదే పొగ రాదని, ఏదో తేడా కొడుతుందని గుసగుసలాడుకుంటున్నారు. ట్రేడింగ్ ద్వారా శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లే అవకాశం ఉందని, ఇంకొందరేమో గిల్ సీఎస్కేలోకి వెళ్తాడు, రవీంద్ర జడేజా గుజరాత్ టైటాన్స్‌లోకి వస్తాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందే శుభ్‌మన్ గిల్‌ను గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 132.33 స్ట్రైక్‌రేట్‌తో 483 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
కలలు నిజంగా నేరవేరుతాయి.. దినేశ్ కార్తీక్ భావోద్వేగం
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇవాళ (సెప్టెంబర్ 12) సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ వికెట్‌కీపర్ కమ్ ఫినిషర్ కోటాలో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కిన అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. జట్టును ప్రకటించిన కొద్ది నిమిషాల్లో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కలలు నిజంగా నేరవేరుతాయి అంటూ టీ20 వరల్డ్‌కప్ ఆడాలన్న తన కలను ప్రస్తావించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది. Dreams do come true 💙 — DK (@DineshKarthik) September 12, 2022 కాగా, 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన కార్తీక్.. 15 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కావడం ఆసక్తికరంగా మారింది. డీకే ఇటీవల ముగిసిన ఐపీఎల్లో మెరుపులు మెరిపించి ఎవరూ ఊహించని రీతిలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాను వరల్డ్‌కప్-2022లో ఆడాలని కలలు కంటున్నట్లు డీకే ఇటీవల తరుచూ ప్రస్తావించాడు. తాజాగా అతని కల నెరవేరడంతో అతను భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదిలా ఉంటే, భారత ప్రపంచ కప్ జట్టులో ఎలాంటి సంచలన ఎంపికలకు తావివ్వని సెలెక్టర్లు.. తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో పాల్గొన్న జట్టునే యధాతథంగా కొనసాగించారు. వికెట్కీపర్లుగా డీకే, పంత్‌లను ఎంపిక చేసిన సెలెక్టర్లు సంజూ శాంసన్‌కు మొండిచెయ్యి చూపించారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లు జట్టులోకి తిరిగి రాగా, గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులో కొనసాగనున్నాడు. ఈ మార్పులు మినహాంచి అందరూ ఊహించినట్లుగా జట్టు ఎంపిక జరిగింది. టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్ -
ట్విన్ టవర్ల కూల్చివేత, ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈరోజు నోయిడా జంట టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఆయన ప్రత్యేకత ఉంది. అహాన్ని జయించకపోతే... అది జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తెలిపే అద్భుత సందేశంతో టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లు కూల్చివేతను జీవిత సత్యంతో అన్వయించారు. నోయిడా టవర్ల కూల్చివేతను మండే మోటివేషన్‌కు ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, మనలోని ఈగో కొండలా పేరుకుపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన తనకు గుర్తు చేసిందన్నారు. కొండంత ఎత్తుకు చేరిపోయిన అహాన్ని అంతం చేయడానికి పేలుడు పదార్థాల అవససరం పడుతుందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహీంద్ర ఆలోచింపజేసే పోస్ట్‌తో ఏకీభవిస్తున్న ట్విటర్ యూజర్లు ఆయనను ప్రశంసించారు. మండే మోటివేషన్ ట్వీట్‌పై తమదైన శైలిలో కమెంట్ చేస్తున్నారు. తప్పు జరిగిందని అంగీకరించడానికి అహం అడ్డు వస్తుంది. వాస్తవానికి ఏ సమస్యకైనా తొలి పరిష్కారం అహాన్ని జయించడం. అలాకాకుండా ఈగో తిష్టవేసుకుని కూచుందో ఇహ..దాన్ని కూల్చేందుకు విస్ఫోటనం తప్పదు అని మరొక యూజర్ కమెంట్ చేశారు. Why am I using the demolition of the Noida towers for #MondayMotivation ? Because it reminds me of the dangers of letting our egos get too tall. Sometimes we need explosives to demolish the excess ego. pic.twitter.com/qSMl2qSera — anand mahindra (@anandmahindra) August 29, 2022 -
ఏఎన్ఐ పేరిట ట్వీట్! విడాకులంటూ వార్తలు.. స్పందించిన చహల్!
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్, అతడి సతీమణి, యూట్యూబర్ ధనశ్రీ వర్మ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. కొన్ని రోజుల క్రితం ధనశ్రీ వర్మ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో పార్టీకి హాజరైన నాటి నుంచి వీరి గురించి వదంతులు వ్యాపిస్తున్నాయి. చహల్ లేకుండానే పార్టీకి హాజరైన ధనశ్రీ వర్మ.. భారత జట్టు మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సూర్య దంపతులతో ఫొటో దిగింది. దీనిని సూర్య భార్య దేవిషా శెట్టి ఇన్‌స్టాలో షేర్ చేయడంతో రూమర్లు వ్యాపించాయి. అదే సమయంలో ధనశ్రీ తన ఇన్‌స్టా బయో నుంచి చహల్ ఇంటిపేరును తొలగించడంతో వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. (PC: Yuzvendra Chahal) ఈ నేపథ్యంలో.. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ పేరిట నకిలీ అకౌంట్ల నుంచి వచ్చిన ట్వీట్ చహల్ అభిమానుల గుండెల్లో గుబులు రేపింది. ‘‘బ్రేకింగ్: క్రికెటర్ యజువేంద్ర చహల్ నటి ధనశ్రీ వర్మ పంజాబ్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు’’ అంటూ మూడు అకౌంట్ల నుంచి ట్వీట్ షేర్ అయింది. దీంతో చహల్- ధనశ్రీ పేర్లు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. క్షణాల్లో ఈ వార్త వైరల్ అయింది. ఈ విషయాన్ని గమనించిన ఏఎన్ఐ వెంటనే రంగంలోకి దిగింది. ఆ మూడు ఫేక్ అకౌంట్లు అంటూ వివరణ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఏఎన్ఐ పేరును వాడుతూ ఈ మూడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఇలాంటి వార్త అసలు ఎక్కడా రాలేదు’’ అని అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. ఇది చూసిన చహల్ అభిమానులు ఫేక్ రాయుళ్లను ఏకిపారేస్తున్నారు. ‘‘మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.. పచ్చని జంట కాపురంలో నిప్పులు పోసేలా ఆ వార్తలు ఏంటి? మీకు బుద్ధిరాదా? సిగ్గు పడండి’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్-2022 ఆడే భారత జట్టుకు ఎంపికైన యజువేంద్ర చహల్.. మెగా ఈవెంట్లో సత్తా చాటేందుకు సంసిద్ధమవుతున్నాడు. ఇక ధనశ్రీని ప్రేమించిన చహల్ 2020 డిసెంబరులో ఆమెను వివాహమాడిన విషయం తెలిసిందే. సన్నిహితుల నడుమ అత్యంత వైభవోపేతంగా వీరి పెళ్లి జరిగింది. స్పందించిన చహల్.. తమ గురించి వస్తున్న రూమర్లపై యజువేంద్ర చహల్ స్పందించాడు. తమ బంధం గురించి పుట్టుకొస్తున్న ఇలాంటి పుకార్లు నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఇలాంటి వదంతులకు ముగింపు పలకాలంటూ గాసిప్ రాయుళ్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేశాడు. చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్‌తో చహల్ భార్య ఫొటో! ఇన్‌స్టాలో ఇంటిపేరు తొలగించిన ధనశ్రీ.. హాట్‌టాపిక్‌గా.. IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్ Please note: All three are fake accounts impersonating ANI. No such news has been flashed. pic.twitter.com/rIRwhzneit — ANI (@ANI) August 18, 2022 -
ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా
సాక్షి,ముంబై: పారిశశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ విజ్ఞాన, వినోద అంశాలను అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో తాజాగా అద్భుతమైన ఫోటోను పంచుకున్నారు. వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల జాతీయ జెండా రంగులతో ప్రకృతిలో సహజంగా పరుచుకున్న రమణీయమైన దృశ్యాన్ని షేర్ చేశారు. అంతేకాదు శత సంవత్సరాల దాకా ప్రతీ రోజూ ఈ రంగులు, ఈ దృశ్యం ఆవిష్కృతం కావాలని ఆయన అభిలషించారు. పైన వెలుగులు చిమ్ముతున్న సూరీడు, మధ్యలో నిర్మల ఆకాశం.. దిగువన పచ్చటి పంటచేలతో అలుముకున్న ఆకుపచ్చని రంగుతో చూడ ముచ్చటగా ఉన్న ఈ పిక్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా 75 వసంతాల స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాల్లో ఈ ఫోటో మరింత ఆకర్షణీయంగా నిలిచింది. (Reliance Jio 5G Phone: జియో మరో సంచలనం?12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్) ఇదీ చదవండి :వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది, అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ May all days dawn with these colours from now on. Onwards to the 100th anniversary of our Independence… 🇮🇳 pic.twitter.com/6H75bunovc — anand mahindra (@anandmahindra) August 16, 2022 -
వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర అపుడే వీకెండ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రానున్న వీకెండ్లో శుక్రవారానికే నా మైండ్ స్లో డౌన్ అయిపోతోందనుకుంట. అందుకే చిన్న జోక్‌ను అర్థం చేసుకోవడానికి కూడా నిమిషం టైం పట్టిందంటూ ఆయన ట్విట్ చేశారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) వీకెండ్లో జ్యూస్ అని పలకడానికి కూడా బద్ధకం ..కేవలం ‘జూ’ తో సరిపెడతాం అనే అర్థం వచ్చేలా ఉన్న ఒక పిక్‌ను ఆయన పోస్ట్ చేశారు. విత్ ఐస్.. జ్యూస్, వితౌట్ ఐస్ జూ , జూ + ఐస్.. ఇలా.. పలు రకాలుగా నర్మగర్భంగా ఉన్న ఈ జోక్‌ను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఇంకో సంగతి కూడా తన ఫ్యాన్స్‌తో షేర్ చేశారు. ‘జోక్ అర్థమయ్యాక బిగ్గరగా నవ్వేశాను. దెబ్బకి మా ఆవిడ కుర్చీలోంచి జంప్ చేసింది’’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ఇక దీనికి యథావిధిగా పలు మీమ్స్, కమెంట్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.(Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) Maybe it’s Friday & my mind is slowing down for the oncoming weekend because it took me a minute to get the joke. When I did, I laughed out so loudly my wife jumped out of her chair… pic.twitter.com/4SfjHQ8xMt — anand mahindra (@anandmahindra) August 12, 2022 pic.twitter.com/5M8mNg2s5F — sanjay kumawat (@ShoryaSanju) August 12, 2022 pic.twitter.com/8gQst5XDHc — SHIVANG (@its_shivang) August 12, 2022 -
పాక్ కామెంటేటర్ పైత్యం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సెహ్వాగ్! నెహ్రా ఇప్పుడు...
“Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections”: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత చలాకీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విషయం ఏదైనా తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తాడు. తాజాగా మరోసారి వీరూ భాయ్.. పాకిస్తాన్ పొలిటికల్ కామెంటేటర్ జైద్ హమీద్‌ను దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. క్రీడాకారుల పేర్లు వాడుకుని విద్వేష విషం చిమ్మాలనుకున్న హమీద్‌కు అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. కనీస అవగాహన లేని అతడి విషయపరిజ్ఞానాన్ని ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయమేమింటే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్-2022కు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఈ విభాగంలో పసిడి పతకం సాధించాడు. అంతకు ముందు జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రతజం సాధించగా.. నదీం నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ గైర్హాజరీలో అతడు ఏకంగా పసిడి పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో జైద్ హమీద్ ట్విటర్ వేదికగా తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ‘‘ఈ విజయం మరింత మధురమైనదిగా ఎందుకు మారిందంటే.. ఈ పాకిస్తానీ అథ్లెట్ ఇండియన్ జావెలిన్ త్రో హీరో ఆశిష్ నెహ్రాను ఓడించాడు. గతంలో ఆశిష్.. అర్షద్ నదీమ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే కదా! మరి ఇప్పుడు అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు’’ అని ట్వీట్ చేశాడు. నీరజ్ చోప్రా బదులు మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా పేరు వాడాడు. అంతేకాదు కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ పాల్గొనకపోయినా అతడిని పాక్ అథ్లెట్ ఓడించాడంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ ట్వీట్ వీరేంద్ర సెహ్వాగ్ కంటపడింది. ‘‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా ఇప్పుడు.. ఇంకేముంది! వీరూ భాయ్ తనదైన స్టైల్లో హమీద్‌కు చురకలు అంటించాడు. ‘‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా ఇప్పుడు యూకే ప్రధాన మంత్రి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాడు. నువ్వు కాస్త చిల్ అవ్వు’’ అంటూ సెటైర్ వేశాడు. అయితే, చాలా మంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొంత మంది మాత్రం మనకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారంటూ సెహ్వాగ్ ఇటీవల హిమదాస్‌కు శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను రీషేర్ చేస్తున్నారు. అదే విధంగా నీరజ్ చోప్రా, నదీమ్ సోదరభావంతో పరస్పరం ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతున్నారని.. హమీద్ లాంటి వాళ్లు మాత్రం విషం చిమ్మాలని చూస్తున్నారంటూ అతడిని విమర్శిస్తున్నారు. చదవండి: Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ Chicha, Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections. So Chill 🤣 pic.twitter.com/yaiUKxlB1Z — Virender Sehwag (@virendersehwag) August 11, 2022 -
మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు గాను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంలో నెటిజన్లు దాదాను ఓ ఆటాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ 9 పరుగుల తేడాతో ఓడి కనకం గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఫైనల్లో ఓడినప్పటికీ హర్మన్ సేన స్పూర్తివంతమైన ప్రదర్శనకు గాను ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ గంగూలీ కూడా హర్మన్ సేనను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇందులో దాదా టీమిండియాను అభినందిస్తూనే, చురకలంటించే వ్యాఖ్యలు కూడా చేశాడు. Congratulations to the Indian women's team for winning silver ..But they will go home disappointed as it was their game tonite ..@BCCIWomen — Sourav Ganguly (@SGanguly99) August 7, 2022 "సిల్వర్ గెలిచినందుకు భారత మహిళా క్రికెటజట్టుకు అభినందనలు.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్ వాళ్ల చేతుల్లోనే ఉండింది అంటూ గంగూలీ ఆమోదయోగ్యంకాని ట్వీట్ చేశాడు. గంగూలీ చేసిన ఈ అభ్యంతరకర ట్వీట్‌పై ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతుంది. అభిమానులు దాదాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. they shouldn't be disappointed, they should be proud of that silver medal they should be disappointed for still not having a proper system in place for them and it's a bit ironic when he talks about a final game lol#CWG2022 https://t.co/ydsrD7ow7o — Nikhil Mane 🏏🇦🇺 (@nikhiltait) August 8, 2022 తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, దాదాపు స్వర్ణం గెలిచినంత పని చేసినందుకుగాను టీమిండియాను మనస్పూర్తిగా అభినందించాల్సింది పోయి, హేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తావా అంటూ సీరియస్ అవుతున్నారు. అసలు మీ ట్వీటే అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వ్యక్తి బోర్డు ప్రెసిడెంట్‌గా ఉండటం దురదృష్టకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. The biggest disappointment is you. https://t.co/gBj47PO0HD — ಸುಶ್ರುತ । Sushrutha (@3eyeview) August 8, 2022 This guy is an absolute 🤡 Shame that he is the president of World's most powerful board https://t.co/slQz1drjPI — Harsh Deshwal🇮🇳 (@IamHarshDeshwal) August 8, 2022 చదవండి: నాలుగో ర్యాంక్‌లో టీమిండియా ఓపెనర్ -
పాక్ కెప్టెన్ ట్వీట్‌కు బదులిచ్చిన కోహ్లి.. ఏమన్నాడంటే..?
Virat Kohli-Babar Azam: ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విమర్శలతో పాటు సానూభూతి సందేశాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. విరాట్‌కు మద్దతుగా నిలబడిన ప్రముఖుల్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉన్నారు. కోహ్లిని టార్గెట్ చేస్తున్న వారికి హిట్‌మ్యాన్ తనదైన శైలిలో కౌంటిస్తుండగా, పాక్ కెప్టెన్.. ఫామ్ కోల్పోయిన తన ఆరాధ్య క్రికెటర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. Thank you. Keep shining and rising. Wish you all the best 👏 — Virat Kohli (@imVkohli) July 16, 2022 ఫామ్ కష్టాలు త్వరలో సమసి పోతాయి.. ధైర్యంగా ఉండు అంటూ బాబర్ చేసిన ట్వీట్‌పై కోహ్లి కొద్దిసేపటి క్రితమే స్పందించాడు. థ్యాంక్యూ.. నువ్వు ఇలాగే రాణిస్తూ, ఎదుగుతూ ఉండాలి.. ఆల్ ది బెస్ట్ బాబర్ అంటూ బదులిచ్చాడు. బాబర్ ట్వీట్‌పై కోహ్లి స్పందించాల్సి ఉండిందని షాహిద్ అఫ్రిది ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కోహ్లి రిప్లై ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే, కెరీర్ ఆరంభంలో బాబార్ ఆజమ్.. కోహ్లిని గురువు అని, రోల్ మోడల్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాబర్ ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ కోహ్లినే తన ఆరాధ్య క్రికెటర్‌గా పేర్కొంటాడు. కోహ్లి బ్యాటింగ్ చూస్తూనే తాను ఎదిగానంటూ బాబర్ పలు సందర్భాల్లో వెల్లడించాడు. బాబర్ ప్రస్తుతం కెరీర్లో అత్యుత్తమ దశలో కొనసాగుతుండగా.. కోహ్లి దుర్భర దశను ఎదుర్కొంటున్నాడు. చదవండి: బాబర్ ట్వీట్‌కు కోహ్లి తప్పకుండా రిప్లై ఇవ్వాలి: షాహిద్ అఫ్రిది -
మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా!
సాక్షి, ముంబై: ఫన్నీ విడియోలు, విభిన్న ఫోటోలు, పోస్ట్‌లతో సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకోవడం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు బాగా అలవాటు. అంతేకాదు యూజర్ల ప్రశ్నలకు అంతే చమత్కారంగా బదులివ్వడం కూడా వ్యాపార దిగ్గజానికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా మహీంద్రా షేర్ చేసిన వీడియోలోని వాయిస్ తనదేనా కాదా అని తెలుసుకోవాలనుకునే ట్విట్టర్ వినియోగదారుడికి ఆయనిచ్చిన సమాధానం నెటిజనులను ఆకట్టుకుంటోంది. విషయం ఏమిటంటే..ది మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ గురించి ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో టైటిల్స్‌లో వాయిస్ ఆనంద్ మహీంద్రఅని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆయన నేరేషన్లో ఈ వీడియో కథనం సాగుతుంది. అయితే “సార్, ఇది మీ వాయిస్?” అని ఒకరు సంభ్రమాశ్చర్యాలతో అడిగారు. దానికి సమాధానంగా మీకు నచ్చితే నా వాయిస్సే.. నచ్చకపోతే నాది కాదు..(ఊరికే సరదాగా అంటున్నా..అది నా వాయిస్సే) అంటూ రిప్లై ఇచ్చారు మహీంద్ర. దీంతో కమెంట్లు వెల్లు వెత్తాయి. “చివరికి మనం రోజూ చూసే ముఖానికి వాయిస్‌ని లింక్ చేయడం అద్భుతం. మీ డిక్షన్ వాయిస్ క్లారిటీ భలే ఉంది సార్ శుభాకాంక్షలు” ఒకరు "వావ్ మీరు వాయిస్ ఆర్టిస్ట్ కావచ్చు సార్" అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా అట్లాంటాలోని వరల్డ్ ఆఫ్ కోకా కోలా , స్టుట్గార్ట్లోని మెర్సిడెస్-బెంజ్ మ్యూజియం వంటి కార్పొరేట్ మ్యూజియంలు 1990ల నుండి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే గత దశాబ్దంలో అనేక భారతీయ వారసత్వ సంస్థలు, టాటా, అరవింద్ లిమిటెడ్ ఇలాంటి మ్యూజియంలను ప్రారంభించాయి. తాజాగా ఈ జాబితాలో మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ పేరుతో మహీంద్ర కూడా చేరింది. జీవితం స్థిరంగా లేనట్లే, ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో మహీంద్రా గ్రూప్‌కు సంబంధించి ఒక సజీవమైన, శ్వాసించే సంస్థ మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ " అని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ముంబైలోని మహీంద్ర ప్రధాన కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే ముందస్తు అనుమతితో దీన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. If you’re happy with it, it is my voice and if you don’t like it, it isn’t! ( Just kidding; yes it’s my voice) https://t.co/TG1yczLSrk — anand mahindra (@anandmahindra) July 11, 2022 Presenting The Museum of Living History, where #PurposeMeetsDesign. It celebrates the philosophy, DNA, core values, and culture of the @MahindraRise Group and is a collection of stories that define us. Located at our HQ in Mumbai, it’ll soon be open for viewing by appointment pic.twitter.com/c5ew7YaEsZ — anand mahindra (@anandmahindra) July 11, 2022 -
ఎలన్ మస్క్.. ప్లీజ్ స్విగ్గీని కొనేయండి.. శుభ్‌మన్ గిల్ ట్వీట్ వైరల్!
Shubman Gill Request To Elon Musk Viral: టీమిండియా యువ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీని ఉద్దేశించి గిల్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చేసిన విజ్ఞప్తి ఇందుకు కారణమైంది. అసలు విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్‌ల అధిపతి అయిన మస్క్.. ఇటీవలే సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది తమ సమస్యలు ప్రస్తావిస్తూ ఆయనను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ జాబితాలో గిల్ కూడా చేరిపోయాడు. సరైన సమయంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేయడం లేదనీ.. దానిని మీరు కొనుగోలు చేయాలంటూ మస్క్‌ను గిల్ అభ్యర్థించాడు. కనీసం అప్పుడైనా వాళ్ల పద్ధతి మారుతుందేమోనని ట్విటర్ వేదికగా కామెంట్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన స్విగ్గీ కేర్స్.. ‘‘హాయ్ శుభ్‌మన్ గిల్. ట్విటర్ ఉన్నా లేకున్నా.. ఒకవేళ మీరు మా పోర్టల్‌లో ఆర్డర్ చేసినట్లయితే తప్పకుండా సరైన సమయంలో డెలివరీ అయ్యేలా చూస్తాం. మాకు మీరు నేరుగా మెసేజ్ చేయవచ్చు. వెంటనే స్పందించి మీకు సేవలు అందించగలం’’ అని పేర్కొంది. ఇందుకు గిల్ సానుకూలంగా స్పందించడంతో అతడికి కృతజ్ఞతలు తెలిపి సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే గిల్ చేసిన ట్వీట్ పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరీ ఇంత చిన్న విషయానికే అంత ఎలన్ మస్క్ వరకు వెళ్లాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక స్విగ్గీ పేరిట ఉన్న ఓ ఫేక్ అకౌంట్ యూజర్ గిల్ ఆట తీరును ఉద్దేశించి.. ‘‘నీ టీ20 క్రికెట్ కంటే మేము వేగంగానే డెలివరీ చేస్తాం’’ అంటూ ట్రోల్ చేశారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘‘నేను డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను. కొన్నిసార్లు ట్రాఫిక్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుంది. కావాలని ఎవరూ ఏ తప్పూ చేయరు. పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. మరో ఎగ్జిక్యూటివ్ మాత్రం.. ‘‘నువ్వు ఒక్కసారి మా పొజిషన్లోకి వచ్చి చూడు.. ఎంత తొందరగా డెలివరీ చేస్తావో చూస్తాం’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక మరికొంత మంది బయో బబుల్ ఉండి బయటి నుంచి ఆహారం తెప్పించుకుంటున్నావా గిల్ అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీతో ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ జైత్రయాత్రలో గిల్ తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 229 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు- 96. చదవండి👉🏾IPL 2022:గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ.. విజయం ఎవరిది..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Elon musk, please buy swiggy so they can deliver on time. @elonmusk #swiggy — Shubman Gill (@ShubmanGill) April 29, 2022 How does #PapaPandya hit the ball so effortlessly? #TitansFAM, you now have the best view possible 🤩 Full Video ▶️ exclusively on our website: https://t.co/M6muWPKFbt#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/lmlggtYJyj — Gujarat Titans (@gujarat_titans) April 30, 2022 -
IPL 2022: ఆర్సీబీ టైటిల్ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..!
Amit Mishra Tweet: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్ 12) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ రంగాల్లో రాణించి సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. Really worried about her parents right now.. #CSKvsRCB pic.twitter.com/fThl53BlTX — Amit Mishra (@MishiAmit) April 12, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచేంతవరకు వరకూ పెళ్లి చేసుకోనంటూ ఓ అమ్మడు ప్లకార్డుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఐపీఎల్ లీడింగ్ వికెట్టేకర్లలో ఒకరైన అమిత్ మిశ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉందంటూ క్యాప్షన్ జోడించిన ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. భారీ స్థాయిలో ట్రోల్స్ పేలుతున్నాయి. మంగమ్మ శపథం చేయకు తల్లీ.. జీవితాంతం సింగిల్‌గానే మిగిలిపోగలవంటూ నెటిజన్లు ఆర్సీబీకి వ్యతిరేకంగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఐపీఎల్ 2022కు సంబంధించి కీలక అప్డేట్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: షమీ ప్రదర్శనపై మనసుపారేసుకున్న అమెరికా శృంగార తార..!
Kendra Lust Congratulates Mohammed Shami: ఐపీఎల్ 2022లో భాగంగా మార్చి 28న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షమీ నిప్పులు చెరిగే బంతులు విసిరి లక్నో జెయింట్స్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. తొలి బంతికే కేఎల్ రాహుల్ ను ఔట్ చేసిన షమీ.. డికాక్‌తోపాటు మనీష్ పాండేను పెవిలియన్‌కు పంపి లక్నో భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. Absolutely wonderful performance by @mdshami11 😍👏#LSGvsGT #IPL2022 — Kendra Lust™ (@KendraLust) March 28, 2022 మహ్మద్ షమీ ఈ ప్రదర్శనపై మనసు పారేసుకున్న అమెరికా శృంగార తార కెండ్రా లస్ట్, గుజరాత్ బౌలర్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించింది. అద్భుత ప్రదర్శన చేశావ్ షమీ అంటూ లవ్, క్లాప్ ఎమోజీలను వ్యాఖ్యకు జత చేసి అభినందించింది. కెండ్రా ఈ ట్వీట్ నేపథ్యంలో పలువురు ఆకతాయి నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. శృతిమించిన భాషలో కామెంట్లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. కొందరేమో.. షమీ భాయ్ నీ ప్రదర్శనకు అమ్మడు ఫిదా అయినట్లుందని, మరికొందరు కెండ్రా.. షమీతో ప్రేమలో పడిందని, షమీ భాయ్ కెండ్రాతో ఎప్పటినుంచి పరిచయం..? బాగా గుర్తుకొస్తున్నట్లున్నావు.. అంటూ అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నారు. Absolutely wonderful performance by @mdshami11 😍👏#LSGvsGT #IPL2022 — Kendra Lust™ (@KendraLust) March 28, 2022 ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌తో ద్వారా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు తమ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో ఎదురెదురుపడగా.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (55), ఆయుష్ బదోని (54) లు రాణించారు. ఛేదనలో గుజరాత్.. 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో హార్థిక్ పాండ్యా (33), మాథ్యూ వేడ్ (30), డేవిడ్ మిల్లర్ (30) పర్వాలేదనిపించగా.. ఆఖర్లో రాహుల్ తెవాటియా (40 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను విజయతీరాలను చేర్చాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను షమీకి(3/25) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. Absolutely wonderful performance by @mdshami11 😍👏#LSGvsGT #IPL2022 — Kendra Lust™ (@KendraLust) March 28, 2022 చదవండి: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్ -
ఎస్ఆర్హెచ్ను దారుణంగా ట్రోల్ చేస్తున్న రాజస్థాన్.. ఆరెంజ్ జ్యూస్ పిండేస్తామంటూ..!
SRH VS RR: ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్.. ఇవాళ (మార్చి 29) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బలంగా కనిపిస్తుండగా.. ఇందు భిన్నంగా ఎస్ఆర్హెచ్ బలహీనంగా కనిపిస్తుంది. రికార్డుల పరంగా చూస్తే.. ఇరు జట్లు దాదాపు సమంగానే (15 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ 8 విజయాలు, ఆర్ఆర్ 7 విజయాలు) కనిపిస్తున్నప్పటికీ.. ఈ సీజన్లో రాజస్థాన్ కాస్త బలంగా ఉందనేది బహిరంగ రహస్యం. Gooooood morning 👀 pic.twitter.com/HHwa9pR0um — Rajasthan Royals (@rajasthanroyals) March 29, 2022 అయితే, పేపర్‌పై ఈ బలాన్ని చూసుకుని రాజస్థాన్ రాయల్స్.. ఎస్ఆర్హెచ్పై ట్రోలింగ్‌కు దిగడం ఆ ఫ్రాంచైజీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇవాళ ఉదయం రాజస్థాన్ ‘ఆరెంజ్ జ్యూస్’ ఫోటోను ట్వీట్ చేసి, ‘గుడ్ మార్నింగ్’ అనే కాప్షన్ జోడించి ఎస్ఆర్హెచ్ను పరోక్షంగా కవ్వించింది. ఈ ట్వీట్‌తో ఆర్ఆర్.. ఎస్ఆర్హెచ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఆరెంజ్ జ్యూస్‌ను పిండేస్తామని అర్ధం వచ్చేలా ఆర్ఆర్ ట్వీట్ ఉండటంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గతంలో కూడా ఆర్ఆర్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ముందు ఇలాంటి పోస్టే చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 2020 సీజన్ రెండో మ్యాచ్‌కు ముందు ‘ఈ రాత్రికి హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేశాం’ అంటూ పోస్టు చేసింది. అయితే, ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ కొట్టిన దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజాగా ఆర్ఆర్ మరోసారి అలాంటి ట్వీటే చేయడంతో.. ఈసారి కూడా అలాంటి దెబ్బే తప్పదని ఎస్ఆర్హెచ్ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. చదవండి: ఎన్నడూ లేనంత బలంగా రాజస్థాన్.. ఏమాత్రం అంచనాలు లేకుండా ఎస్ఆర్హెచ్..! -
సెహ్వాగ్ జీవితంలో మార్చి 29 ఎంతో ప్రత్యేకం.. యాదృచ్చికంగా అతని కారు నంబర్ కూడా..!
టీమిండియా మాజీ ఓపెనర్, నజఫ్ఘడ్ నవాబ్, ముల్తాన్ కా సుల్తాన్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు పదేళ్లైనా, నేటికి అతను నెలకొల్పిన కొన్ని రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇందులో అతను టెస్ట్‌ల్లో సాధించిన డబుల్ ట్రిపుల్ హండ్రెడ్ల రికార్డు ఒకటి. భారత క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ సాధించలేకపోయారు. ఓవరాల్‌గా చూసినా ఈ రికార్డును డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ మాత్రమే సాధించగలిగారు. Date mein kya rakha hai? March 29th, a very significant date in my cricketing life. Got to the first triple hundred against Pakistan in Multan on this date and got out on 319 against South Africa on this very date. Coincidentally, without plan have a car which is numbered 2903. pic.twitter.com/tJ1rf3GPbw — Virender Sehwag (@virendersehwag) March 29, 2022 అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. సెహ్వాగ్ సాధించిన రెండు ట్రిపుల్ హండ్రెడ్‌లు ఒకే తేదీన సాధించడం. 2004 మార్చి 29న పాకిస్థాన్‌పై ముల్తాన్ టెస్ట్‌లో తొలి ట్రిపుల్‌ను (309) బాదిన వీరూ.. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత ఇదే తారీఖున (2008 మార్చి 29) చెన్నైలో దక్షిణాఫ్రికాపై రెండో ట్రిపుల్‌ను (319) సాధించాడు. దీంతో సెహ్వాగ్ క్రికెట్ కెరీర్లో ఈ తేదీ చాలా ప్రత్యేకంగా, సెంటిమెంటల్‌గా, లక్కీగా నిలిచింది. యాధృచ్చికంగా సెహ్వాగ్ కారు నంబర్ (2903) కూడా ఇదే తేదీతో ముడిపడి ఉండటం మరో విశేషం. తాజాగా (మార్చి 29, 2022) సెహ్వాగ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. తేదీలో ఏముంది..? మార్చి 29.. నా క్రికెట్ కెరీర్లో చాలా ప్రత్యేకమైన రోజు. ముల్తాన్ టెస్ట్‌లో (పాక్‌పై) ఇదే రోజున తొలి ట్రిపుల్ సెంచరీ కొట్టాను. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇదే తారీఖున దక్షిణాఫ్రికాపై ఈ ఫీట్ సాధించాను. యాదృచ్చికంగా నా కార్ నెంబర్ (2903) కూడా ఇదే కావడం నిజంగా నమ్మలేకపోతున్నానంటూ వీరూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది. చదవండి: IPL 2022: అతడు వన్డే ప్లేయర్ మాత్రమే! అద్భుతాలు చేయనక్కర్లేదు.. కానీ.. -
మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య ట్విటర్ వార్.. కత్తులు దూసుకున్న మాజీలు
Michael Vaughan VS Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ల మధ్య ట్విటర్ వార్ తారాస్థాయికి చేరింది. క్రికెట్‌కు సంబంధించి తరుచూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే ఈ మాజీలు తాజాగా మరోసారి మాటల యుద్ధానికి దిగారు. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్‌కు ఎదురైన దారుణ పరాభవం (టీ20 సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్‌లో ఓటమి) నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తొలుత వసీం జాఫర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. England 120 all out! What happened @MichaelVaughan was this Extras guy unavailable due to IPL or what? 😜 #WIvENG #IPL2022 pic.twitter.com/lSetnPSif5— Wasim Jaffer (@WasimJaffer14) March 27, 2022 ఈ ట్వీట్లో జాఫర్ ఇంగ్లండ్‌ను టార్గెట్ చేస్తూ వాన్‌కు చురకలు తగిలేలా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాకు సంబంధించిన ఫోటోను (జో రూట్ 1708 పరుగులు, రోరీ బర్న్స్ 530, ఎక్స్‌ట్రాలు 412) షేర్ చేస్తూ.. ఇంగ్లండ్ 120 ఆలౌట్! ఏమైంది వాన్..? ఈ ఎక్స్ట్రా రన్స్ కొట్టిన ఆటగాడు ఐపీఎల్లో ఆడుతున్నాడా ఏంది..? అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే రేంజ్లో ట్వీట్ (పంచ్) చేశాడు. Wasim .. At the moment we are focusing on the Womens World Cup semis .. !!! 😜😜 https://t.co/ubwxORXKBU— Michael Vaughan (@MichaelVaughan) March 27, 2022 దీనికి మైకేల్ వాన్ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు. వసీం.. ఈ సమయంలో మేము మహిళల ప్రపంచకప్ సెమీస్ (మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడి టీమిండియా ఇంటి బాట పట్టగా.. ఇంగ్లండ్ మాత్రం బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది) మీద దృష్టి సారించాం అని బదులిచ్చాడు. ఈ ట్వీట్ చూసి చిర్రెత్తిపోయిన జాఫర్ వెంటనే మరో కౌంటరిస్తూ.. With just 1 win in last 17 Tests, not surprised you have given up on the men's team Michael 😜 #WIvENG #IPL2022 https://t.co/xXNO71RmeR— Wasim Jaffer (@WasimJaffer14) March 28, 2022 రూట్ సేన గత 17 టెస్ట్‌ల్లో ఒకే ఒక విజయం సాధించింది, ఇలాంటి చెత్త ప్రదర్శన చేసిన జట్టును ఎవరు మాత్రం పట్టించుకుంటారంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇందుకు వాన్ ఏ విధంగా స్పందించనున్నాడోనని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, విండీస్ పర్యటనలో ఇంగ్లండ్ 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను, 0-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో రూట్ సేన రెండో ఇన్నింగ్స్‌లో 120కే ఆలౌట్ కావడంతో విండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: IPL2022: విజయానందంలో పంత్ సేన.. అంతలోనే సాడ్ న్యూస్ -
పంజాబ్‌లో ఆప్ "స్వీప్"ను ఆర్చర్ ముందే ఊహించాడా..?
Did Archer Predict AAPs Clean Sweep In Punjab: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2022 ఇవాళ (మార్చి 10) వెలువడిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని బంపర్ మెజర్టీతో జయకేతనం ఎగురవేసి, ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్, బీజేపీలకు షాకిచ్చింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 90కి పైగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఆప్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. YES! 😎 #AAPSweepsPunjab https://t.co/MAD1Wxzca0 — AAP (@AamAadmiParty) March 10, 2022 అవును, ఆప్ పంజాబ్‌ను ఊడ్చేసింది అంటూ.. ఆ పార్టీ ఇవాళ మధ్యాహ్నం 12:55 గంటలకు ఓ ట్వీట్ చేసింది. ఆప్ నిజంగానే పంజాబ్‌ను ఊడ్చేసింది కదా.. ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా..? ఇక్కడే ఆప్ ఓ ట్విస్ట్ ఇచ్చింది. గతంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ చేసిన ఓ ట్వీట్‌ను ఈ పోస్ట్‌కి ట్యాగ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆర్చర్ చేసిన ఆ ట్వీట్లో స్వీప్ అని పేర్కొని ఉంది. దీన్నే పంజాబ్‌లో తాము సాధించిన విజయంతో లింక్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. March 24th ? — Jofra Archer (@JofraArcher) March 1, 2013 ఆర్చర్ గతంలో చేసిన చాలా ట్వీట్లు యాదృచ్చికంగా నిజానికి దగ్గరగా ఉండటంతో ఆప్ చేసిన ఈ ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. 2013 మార్చిలో ఆర్చర్.. మార్చ్ 24? అని ట్వీట్ చేయగా, 2020వ సంవత్సరం అదే రోజు కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో లాక్డౌన్ ప్రకటన వెలువడింది. అలాగే అదే ఏడాది మార్చి 22న ఆర్చర్ లైట్స్ ఔట్ అని ట్వీట్ చేయగా, 2020 అక్టోబర్ 30న పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ముంబైని చీకటి కమ్మేసింది. Come on russia! — Jofra Archer (@JofraArcher) June 22, 2014 ఇక కమాన్ రష్యా అంటూ ఆర్చర్ 2014 జూన్ 22న ట్వీట్ చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు యాదృచ్చికంగా ఏదో ఒక సందర్భంతో ముడిపడి ఉండటంతో నెటిజన్లు అతన్ని అభినవ నోస్ట్రడామస్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రకటించిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa — Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022 చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..! -
Shahid Afridi: అల్లుడూ.. నువ్వు సూపరప్పా, అచ్చం నాలాగే..!
పీఎస్ఎల్ 2022లో భాగంగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఆటగాడు, పాక్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది ఎప్పటిలా బంతితో కాకుండా బ్యాట్‌తో చెలరేగిపోయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్‌కు ఆఖరి ఓవర్లో విజయానికి 24 పరుగులు అవసరం కాగా, జట్టు కెప్టెన్ షాహీన్ అఫ్రిది (20 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 39) బ్యాట్‌తో చెలరేగిపోయి 3 భారీ సిక్సర్లు, బౌండరీతో 23 పరుగులు రాబట్టి, మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లాడు. THAT over. #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/o8AYrxjmNg — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 అయితే, సూపర్ ఓవర్లో ఖలందర్స్ నిర్ధేశించిన ఆరు పరుగుల టార్గెట్‌ను పెషావర్ జట్టు తొలి రెండు బంతుల్లోనే ఛేదించి అద్భుత విజయం సాధించింది. పెషావర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ వరుసగా రెండు బౌండరీలు సాధించి తన జట్టును గెలిపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ముగ్దుడైన కాబోయే మామ షాహిద్ అఫ్రిది..అల్లుడూ నువ్వు సూపరప్పా.. అచ్చం నాలాగే ఆడావు అంటూ మురిసిపోయాడు. ట్విటర్ వేదికగా అల్లుడిపై ప్రశంసలు కురిపించాడు. షాహీన్ అఫ్రిది.. యు బ్యూటీ అంటూ కాబోయే అల్లుడిపై ప్రేమను ఒలకబోసాడు. తన ఫోటోతో పోలి ఉన్న షాహీన్ అఫ్రిది చిత్రాన్ని కలిపి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. SHAHEEN AFRIDIIII YOU BEAUTYYY!!! pic.twitter.com/RPv9ui2lNp — Shahid Afridi (@SAfridiOfficial) February 21, 2022 షాహిద్ అఫ్రిది తన జమానాలో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తూ, బంతితో మ్యాజిక్ చేయడంలో దిట్ట అయిన షాహిద్ అఫ్రిది తన జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ముఖ్యంగా వన్డేల్లో అతను సాధించిన 37 బంతుల శతకం చాలాకాలం వరకు ఫాస్టెస్ట్ సెంచరీగా చెలామణి అయ్యింది. ఇదిలా ఉంటే, షాహిద్ అఫ్రిది కూతురు అక్సాతో షాహీన్ అఫ్రిది ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశముంది. చదవండి: మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్ ఓవర్ -
Saina Nehwal: సిద్దార్థ క్షమాపణపై స్పందించిన సైనా.. ఎందుకు వైరల్ అవుతుందో..
సినీ నటుడు సిద్దార్థ తనకు క్షమాపణ చెప్పడం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పందించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని, అయితే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏదేమైనా సిద్దార్థను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మన దేశం సురక్షితంగా ఉందని ఎలా చెప్పుకోగలమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన నటుడు సిద్ధార్థ అభ్యంతరకర అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయగా తీవ్ర దుమారం రేగింది. జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. సైనా తండ్రి హర్వీర్ సింగ్, భర్త పారుపల్లి కశ్యప్ కూడా సిద్ధార్థ తీరును ఖండించారు. ఈ నేపథ్యంలో సైనా పేరు ట్విటర్లో మారుమోగిపోయింది. సిద్ధార్థ వ్యవహార శైలిపై రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన అతడు... సైనాను క్షమాపణ కోరుతూ సుదీర్ఘ లేఖ రాశాడు. ‘‘నువ్వు ఎల్లప్పటికీ నా చాంపియన్‌వే’’ అని ట్వీట్ చేశాడు. తాజాగా ఈ లేఖపై స్పందించిన సైనా.. టైమ్స్ నౌతో మాట్లాడుతూ... ‘‘మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నిజానికి నా పేరు ట్విటర్లో ట్రెండ్ అవడం చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే అతడు నా గురించి ఏం రాశాడో తెలిసింది. అతడితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీసులు అతడికి ఉండాలి’’ అని హుందాతనాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో.. ఈ వివాదం ఇప్పటికైనా ముగిసిపోతుందా లేదా అన్న అంశం గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కాగా పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సైనాను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించిన విషయం విదితమే. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 -
Anand Mahindra: ‘మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఒక్క దృశ్యం చూస్తే సరిపోతుంది.’
సోషల్ మీడియాలో తరచూ సమకాలిన అంశాలపై స్పందించే బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా కొత్త ఏడాది విషెస్‌ను తనదైన స్టైల్లో చెప్పారు. దాంతో పాటుగా తనకు 2021లో నచ్చిన ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. విత్ పవర్ఫుల్ మెసేజ్..! ఓ తండ్రి తన కుమారుడిని తోపుడు బండిపై తీసుకెళ్తున్న ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఈ ఫోటోలో తోపుడు బండిపై సదరు వ్యక్తి కుమారుడు పుస్తకంలో రాస్తూ కన్పించాడు. ఈ ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ... ‘ఈ ఏడాది నాకు నచ్చిన ఫొటో ఇది. క్షమించండి... దీన్ని ఎవరు తీశారో నాకు తెలీదు. ఇది నా ఇన్‌బాక్స్‌లో కనిపించింది. ఆశ, కృషి, ఆశావాదానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఒక్క దృశ్యం చూస్తే సరిపోతుంది' అంటూ షేర్ చేశారు. ఈ ఫోటో మనకు పవర్ఫుల్ మెసేజ్‌ను మనందరికీ ఇస్తోందని తెలిపారు. ఈ పోస్ట్ సుమారు 90 వేల లైక్స్‌ను సంపాదించి వైరల్‌గా మారింది. And here’s my favourite photo of the year. Apologies, I don’t know who took it so cannot acknowledge the photographer. It showed up in my inbox. Hope, Hard Work, Optimism. The essence of why we live…Once again, have a fulfilling New Year. pic.twitter.com/TwucYZruQA — anand mahindra (@anandmahindra) December 31, 2021 చదవండి: రెక్కలు కట్టుకుని ఎగిరిపోదాం.. ఆనంద్ మహీంద్రా వెరైటీ విషెస్ -
హర్భజన్‌తో ఉన్న ఆ ఇద్దరు పాక్ క్రికెటర్లు ఎవరు..?
క్రికెట్లో అవకాశాలు సన్నగిల్లాక సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తాజాగా నెటిజన్లకు ఓ పరీక్ష పెట్టాడు. 1997-98 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. అందులో తనతో ఉన్న ఇద్దరు పాక్ క్రికెటర్లు ఎవరో కనుక్కోవాలంటూ నెటిజన్లను కోరాడు. Pehchano to maaane.. U-19 World Cup days 1998/99 pic.twitter.com/2iawM1dSUK — Harbhajan Turbanator (@harbhajan_singh) December 10, 2021 ఈ ఫోటోలో భజ్జీని సులువుగా గుర్తుపడుతున్న నెటిజన్లు.. అతని పక్కన ఉన్న ఇద్దరిని మాత్రం పోల్చుకోలేకపోతున్నారు. నెటిజన్లకు సవాలుగా మారిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియా చక్కర్లు కొడుతోంది. ఇందులో భజ్జీ పక్కనున్న వాళ్లను గుర్తుపట్టాలంటూ అభిమానులు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఆ ఇద్దరిని కొందరు సరిగ్గా గెస్ చేయగలుగుతున్నా.. చాలా వరకు విఫలమవుతున్నారు. ఇదిలా ఉంటే, భజ్జీ పక్కన షర్ట్ లేకుండా ఉన్నది నాటి పాక్ ఆటగాడు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్ తాహిర్ కాగా, మరొకరు పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా. వీరిద్దరు పాక్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో హసన్ రాజా పాక్ తరఫున 7 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడగా.. పాక్‌లోనే పుట్టిన ఇమ్రాన్ తాహిర్ మాత్రం తన కుటుంబం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లడంతో ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 1997-98 అండర్-19 ప్రపంచకప్ విషయానికొస్తే.. ఆ టోర్నీలో భారత్, పాక్ జట్ల మధ్య డర్బన్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన భజ్జీ.. కీలకమైన షోయబ్ మాలిక్ వికెట్ తీశాడు. చదవండి: ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అంటున్న డేవిడ్ భాయ్, కౌంటరిచ్చిన కోహ్లి -
ముజీబ్ కోసం ఫిజియోను పంపిస్తామన్న అశ్విన్.. తెలుగులో బదులిచ్చిన రషీద్ ఖాన్
Rashid Khan Responds To Ashwin Offer For Afghanistan Ahead Of Their Clash Against Kiwis: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ విజయం సాధించాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకాంక్షించాడు. ఇందుకోసం గాయపడిన అఫ్గాన్ ప్రధాన స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు టీమిండియా ఫిజియో సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సరదాగా వ్యాఖ్యానించాడు. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అఫ్గాన్.. న్యూజిలాండ్‌ను ఓడించాల్సి ఉండడంతో అశ్విన్ ఈ మేరకు సరదా వ్యాఖ్యలు చేశాడు. Ashwin wants India’s physio to help Mujeeb get fit for Afghanistan’s match against New Zealand 😁 #T20WorldCup pic.twitter.com/xqWrfyzUZU — ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2021 ఈ వ్యాఖ్యలను ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ట్వీట్ చేయగా.. రషీద్ ఖాన్ స్పందించాడు. 'టెన్షన్ పడకు అశ్విన్ భాయ్.. మా టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడా ముజీబ్‌ను చూసుకుంటున్నారు.' అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో "చూసుకుంటున్నారు" అన్న పదం తెలుగులో ఉండడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. రషీద్ తెలుగు పదాన్ని వాడి ట్వీట్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. కాగా, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న రషీద్.. జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర కొన్ని తెలుగు పదాలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Rohit Sharma: ఆ ముచ్చట తీరకుండా, ఎన్ని సెంచరీలు చేసి ఏం లాభం..! -
అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు.. వైరలవుతున్న బీసీసీఐ ట్వీట్
Internet Has The Best Response To BCCI Tweet Over Anushka Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ పేరున బీసీసీఐ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతుంది. ఇందులో అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో అనుష్క శర్మ ఏంటీ, క్రికెట్ ఆడటమేంటి అని నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. Anushka Sharma 52 runs in 88 balls (5x4, 1x6) India B 140/0 #U19ChallengerTrophy — BCCI Women (@BCCIWomen) November 2, 2021 భారత మహిళల అండర్-19 ఛాలెంజర్స్ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనుష్క శర్మ అనే అమ్మాయి భారత-బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మంగళవారం(నవంబర్ 2) భారత్-ఏ తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆల్‌రౌండ్ ప్రతిభ చూపి సత్తా చాటింది. మొదట బ్యాటింగ్‌లో 88 బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి ఐదు వికెట్లు తీసింది. దీంతో బీసీసీఐ తమ అధికారిక మహిళల ట్విట్టర్ హ్యాండిల్లో అనుష్క శర్మను అభినందిస్తూ ఓ పోస్ట్ చేసింది. Abey isne Cricket khelna kab se shuru kar diya : pic.twitter.com/olGgNLw0Ae — Kushagra (@45kusha) November 2, 2021 ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు అనుష్క ఎప్పటి నుంచి క్రికెట్ ఆడడం ప్రారంభించిందని గందరగోళానికి గురవుతున్నారు. మరికొందరేమో.. భార్యాభర్తలిద్దరూ క్రికెట్ గ్రౌండ్లో ఉంటే వామికను ఎవరు చూసుకుంటున్నారంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో కోహ్లి అతని కుటంబంపై కొందరు సోషల్‌మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. Tumlog btaye kyu nhi Ki Anushka match khelne gyi hai , vamika ro rhi hai pic.twitter.com/s0yZVy7bej — Sumit □◇○ (@UN_PrEdiTAble) November 2, 2021 చదవండి: T20 WC 2021 IND Vs AFG: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా స్టార్ పేసర్.. -
వారిని క్షమించు.. జట్టును కాపాడుకో.. కోహ్లికి బాసటగా నిలిచిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Tweets In Support Of Virat Kohli: టీ20 ప్రపంచకప్-2021లో దాయాది పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ.. కొందరు దురభిమానులు సోషల్‌మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం షమీకి అండగా నిలిచాడు. అయితే, కోహ్లి.. షమీకి అండగా నిలబడటాన్ని జీర్ణించుకోలేని కొందరు దుర్మార్గులు విరుష్క దంపతుల గారాలపట్టి వామికను ఉద్దేశించి సోషల్‌మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. Dear Virat, These people are filled with hate because nobody gives them any love. Forgive them. Protect the team. — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2021 ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమిండియా కెప్టెన్‌కు బాసటగా నిలిచారు. కోహ్లి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా స్పందించారు. 'డియర్ విరాట్.. కొందరు మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును కాపాడుకో' అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. కాగా, అభం శుభం తెలియని చిన్నారి వామికను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. ఆటగాళ్లు రాణించకపోతే వారి కుటుంబసభ్యులను దూషించడం, వారిని టార్గెట్ చేయడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోహ్లికి అండగా నిలబడటాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ అంశంపై మహిళా కమీషన్ ఇవాళ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. కేసుకు సంబంధించిన పురోగతిపై ఆరా తీసింది. నిందితులను త్వరలోనే పట్టుకోవాలని ఆదేశించింది. కోహ్లి కుటుంబానికి బెదిరింపులు వచ్చినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా సుమోటో కేసు నమోదైంది. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? -
వాళ్లేమీ రోబోలు కాదు.. ప్రతి మ్యాచ్ గెలవడానికి, అండగా నిలవండి..!
Kevin Pietersen Bats For Team India After Shocking Loss Against New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో జట్టు సభ్యులందరిపై ముప్పేట దాడి మొదలైంది. ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ అభిమానులు, విశ్లేషకులు మాటల దాడికి దిగుతున్నారు. భారత ఆటగాళ్ల వైఫల్యాలకు ఐపీఎల్ కారణమని కొందరంటుంటే.. మరికొందరేమో కీలక మ్యాచ్‌ల్లో టీమిండియా ఒత్తిడికి లోనై చిత్తుగా ఓడటం సర్వసాధారణమని సర్ధుకుపోతున్నారు. खेल में एक विजेता और एक हारने वाला होता है। कोई भी खिलाड़ी हारने के लिए बाहर नहीं जाता है। अपने देश का प्रतिनिधित्व करना सबसे बड़ा सम्मान है। कृपया महसूस करें कि खेल के लोग रोबोट नहीं हैं और उन्हें हर समय समर्थन की आवश्यकता है।— Kevin Pietersen🦏 (@KP24) November 1, 2021 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లి సేనకు బాసటగా నిలిచాడు. ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మద్దతు నిలవాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ఆటలో జయాపజయాలు సహజమని, ఓ జట్టు గెలిస్తే మరో జట్టు ఓడాల్సి ఉంటుందని అన్నాడు. ఏ ఆటగాడు కూడా ఓడిపోవాలని బరిలోకి దిగడని.. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఆటగాళ్లు గొప్ప గౌరవంగా భావిస్తారని పేర్కొన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ గెలవడానికి ఆటగాళ్లేమీ రోబోలు కాదని, వారికి అన్ని సమయాల్లో అభిమానుల మద్దతు అవసరమంటూ” సోమవారం ట్వీట్ చేశాడు. కేపీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు టీమిండియాకు అనుకూలంగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. కాగా, ప్రస్తుత మెగా టోర్నీ టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూడగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాల్ని ఎదుర్కొని సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత -
టీమిండియాకు హెల్ప్ కావాలా..? నేను రెడీ అంటున్న 'జార్వో'
Cricket Pitch Invader Jarvo Tweets In Support Of Team India: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐపీఎల్-2021కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధించిన ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69 గుర్తున్నాడా..? అదేనండి తాను కూడా టీమిండియా ఆటగాడినే అంటూ నానా హంగామా చేసిన వ్యక్తి. ఆ సిరీస్‌లో మూడు సార్లు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి వచ్చి ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంతో జార్వోను ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. తాజాగా అదే వ్యక్తి టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆసక్తికర ట్వీట్ చేశాడు. Dose India need me for the T20 World Cup?Got my full kit ready!!! #showyourgame #jarvo69 #T20WorldCup pic.twitter.com/KeCZxjJFKe— Jarvo69 (Daniel Jarvis) (@BMWjarvo) October 29, 2021 టీమిండియాకు నా హెల్ప్ ఏమైనా కావాలా..? కిట్‌తో రెడీగా ఉన్నాను.. బరిలోకి దిగడమే తరువాయి అంటూ టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరించిన సెల్ఫీని పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. జార్వో ట్వీట్‌పై టీమిండియా అభిమానులు స్పందిస్తున్నారు. జార్వో ఉంటే టీమిండియాకు కలసి వస్తుందని కొందరంటుంటే.. కోహ్లీ రాజీనామా చేసి జార్వోకు కెప్టెన్సీ ఇవ్వాలని మరొకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. దీంతో ఆదివారం(అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f— Raghav Padia (@raghav_padia) September 3, 2021 చదవండి: టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్.. లంక స్పిన్నర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు -
'ఆటగాళ్లను గౌరవించండి..' షమీకి మద్దతుగా నిలిచిన పాక్ ఓపెనర్
Pak Opener Mohammad Rizwan Tweets In Support Of Shami: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా పాక్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్‌మీడియా వేదికగా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్ చేతిలో ఓటమికి షమీనే కారణమని, అతడు పాక్‌కు అమ్ముడుపోయాడని, షమీని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ షమీకి మద్దతుగా నిలిచాడు. ట్విటర్ వేదికగా ఓ అద్భుతమైన మెసేజ్‌ని షేర్ చేశాడు. The kind of pressure, struggles & sacrifices a player has to go through for his country & his people is immeasurable. @MdShami11 is a star & indeed of the best bowlers in the worldPlease respect your stars. This game should bring people together & not divide 'em #Shami #PAKvIND pic.twitter.com/3p70Ia8zxf— Mohammad Rizwan (@iMRizwanPak) October 26, 2021 దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఆటగాడు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాడని.. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేస్తాడని పేర్కొన్నాడు. షమీ ప్రపంచపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడని.. అలాంటి ఆటగాడిని గౌరవించుకోవాలి కాని దూషించకూడదని హితవు పలికాడు. క్రికెట్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలి కాని, విభజించకూడదంటూ షమీ ఫోటోను పోస్ట్ చేస్తూ ట్వీటాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. షమీకి అండగా నిలిచి అద్భుతమైన మెసేజ్‌ను షేర్ చేసిన రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇదే విషయమై భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు షమీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, పాక్‌తో జరిగిన మ్యాచ్ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన షమీ ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది.."
Shoaib Akhtar And Shahid Afridi Slams New Zealand Cricket Board: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డేకు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ సెక్యూరిటీ విభాగం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భద్రతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో కివీస్ క్రికెటర్లు హోటల్ రూముల నుంచి బయటకు రాలేదు. ప్రస్తుతం వారు స్వదేశానికి తిరుగుటపా కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భద్రత విషయమై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖానే స్వయంగా న్యూజిలాండ్ క్రికెటర్లకు భరోసా ఇచ్చినప్పటకీ వారు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. NZ just killed Pakistan cricket 😡😡 — Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021 సెక్యూరిటీ హెచ్చరిక లేదు.. ఏదీ లేదు.. అదంతా వట్టి డ్రామా.. హామీ ఇచ్చినా సిరీస్‌ను రద్దు చేసుకోవడం దారుణమని షాహిద్ అఫ్రిది మండిపడగా, ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది" అంటూ కోపంగా ఉన్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు. కాగా, సిరీస్ రద్దవ్వడంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. "సిరీస్ రద్దు పాక్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలుసు. పీసీబీ అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ తెలిపారు. ఇదిలా ఉంటే, పాక్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు రావల్పిండి వేదికగా తొలి వన్డే జరగాల్సింది. On a HOAX threat you have called-off the tour despite all assurances!! @BLACKCAPS do you understand the IMPACT of your decision? — Shahid Afridi (@SAfridiOfficial) September 17, 2021 చదవండి: కోహ్లి వారసుడిగా రోహిత్‌తో పోలిస్తే అతనైతేనే బెటర్.. ఎందుకంటే..? -
సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్
Samantha Akkineni Tweet: హీరోలకు సమానంగా హీరోయిన్స్‌ను అభిమానించే ఫ్యాన్స్‌ను బయట చూస్తూనే ఉంటాం. ఇక హీరోయిన్స్ అంటే పడిచచ్చే కుర్రాళ్లు ఏకంగా వారి పేర్లు, ఫొటోలు టాటూ వేయించుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఓ యువకుడు భిన్నంగా చేతిపై టాటూ వేసుకుని హీరోయిన్‌పై ప్రేమను వ్యక్తం చేయడమే కాకుండా ఆ ఫొటోలను ట్వీటర్లో షేర్ చేస్తూ.. సదరు హీరోయిన్ను ట్యాగ్ చేశాడు. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో కాదు అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. అయితే ఆ యువకుడు చేసిన ట్వీట్‌ను సామ్ రీట్వీట్ చేయడంతో ఇది కాస్తా హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: స్పెయిన్ వెళ్లనున్న మహేశ్ బాబు కాగా పవన్ సమ్ము పేరుతో ఓ నెటిజన్ ట్విటర్ ఖాతా ఓపెన్ చేశాడు. సమంత పేరును సమ్ము అంటూ టాటూ వేసుకుని ఆ ఫొటోలను షేర్ చేసి ఆమెను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్‌కు ‘మై ఫస్ట్ అండ్ మై లాస్ట్ లవ్ నువ్వే సమ్ము. నీపై ఉన్న ప్రేమ అనంతమైనది. ఇప్పుడ నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా శాశ్వతం’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఇది చూసిన సామ్ ఆ యువకుడి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. షాకింగ్ ఎమోజీలను జత చేసింది. సదరు ఫ్యాన్ ట్వీట్ చేయడం అలా ఉంచితే దీనిని సమంత రీట్వీట్ చేయడంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ పోస్ట్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక మిగతా ఫ్యాన్స్ సైతం సమంతపై ఉన్న తమ అభిమానాన్ని, ప్రేమను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అమెరికాలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న జగపతి బాబు 🥺🥺🥺 https://t.co/jK0DybgQVY — S (@Samanthaprabhu2) September 16, 2021 -
టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానులే కాక మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునిగితేలుతున్నారు. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం సాధించిన విజయం కావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్యాన్స్‌లు, కేకలు, ఈలలతో డ్రెసింగ్ రూమ్‌ను హోరెత్తించగా.. భారత అభిమానులు అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. भाई लोग आप की फरमाइश पे | Anything for an India victory, no matter how awkward :) pic.twitter.com/aSgGA1pUQE — Mohammad Kaif (@MohammadKaif) September 7, 2021 ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. నాగిని డ్యాన్స్ వేస్తూ టీమిండియా గెలుపును మనస్పూర్తిగా ఆస్వాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. "టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు.. నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం.. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు" అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోంది. ఎప్పుడూ కామ్‌గా కనిపించే కైఫ్.. ఇలా నాగిని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. కైఫ్.. టీమిండియా విజయాన్ని వంద శాతం ఆస్వాధిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండయా157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో 368 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్ -
టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్ మాజీ సారధి..
లండన్: టీమిండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి క్రికెట్ అభిమానులచే చివాట్లు తింటున్నా తీరు మార్చుకోని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖత మైఖేల్ వాన్.. తాజాగా మరోసారి కోహ్లి సేనపై తన అక్కసును వెల్లగక్కాడు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లంతా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సచిన్, ఏబీ డివిలియర్స్, సెహ్వాగ్, షేన్ వార్న్, గంగూలీ ఇలా చాలా మంది లెజెండరీ క్రికెటర్లు కోహ్లి సేనను ఆకాశానికెత్తుతున్నారు. అయితే ఇది మింగుడు పడని మైఖేల్ వాన్.. గంగూలీ చేసిన ఓ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ, టీమిండియాను పరోక్షంగా ఎగతాళి చేశాడు. In Test cricket .. not White ball cricket 👍 https://t.co/t5M3HQTB1c — Michael Vaughan (@MichaelVaughan) September 6, 2021 వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన అనంతరం టీమిండియాను అభినందిస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య నైపుణ్యంలో తేడా ఉందని, అతిపెద్ద వ్యత్యాసం ఒత్తిడిని అధిగమించడంలో ఉందని, ఈ విషయంలో భారత క్రికెటర్లు ఇతరులతో పోలిస్తే ఎన్నో రేట్లు మేలని ట్వీటాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఇంగ్లండ్ మాజీ సారధి తనకు మాత్రమే సొంతమైన వెటకారాన్ని ప్రదర్శిస్తూ టీమిండియాను కవ్విస్తున్నట్లు బదులిచ్చాడు. గంగూలీ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. 'టెస్ట్‌ల్లో మాత్రమే, వైట్ బాల్ క్రికెట్లో కాదు' అంటూ వ్యంగ్యంగా రీట్వీట్ చేశాడు. దీంతో అతనిపై టీమిండియా అభిమానులు ముప్పేట దాడి మొదలుపెట్టారు. సోషల్‌మీడియా వేదికగా ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా, ఇంగ్లండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి వాన్.. టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కోహ్లి సేన స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక కుప్పకూలుతుందంటూ ఎత్తి పొడుస్తూనే ఉన్నాడు. అయితే వాన్ ఇలాంటి కామెంట్లు చేసిన ప్రతిసారి టీమిండియా రెట్టింపు కసితో ఆడి విజయాలు సాధిస్తూ వస్తుంది. చదవండి: భూగ్రహం మొత్తంలో టీమిండియా కెప్టెన్‌కు మించినోడే లేడు: షేన్ వార్న్ -
అశ్విన్ విషయంలో టీమిండియా కెప్టెన్ నిర్ణయం సరైందే: ఏబీ డివిలియర్స్
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ సహచర క్రికెటర్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది జట్టులో యాష్‌కు స్థానం కల్పించకపోవడంపై జరుగుతున్న అనవసర రాద్దాంతం నేపథ్యంలో మిస్టర్ 360 ఆటగాడు ఈమేరకు స్పందించాడు. ఈ విషయమై టీమిండియా అభిమానులు ఆందోళన చెందకుండా, కోహ్లి సేన సాధించిన విజయాలను ఆస్వాదించాలని సూచించాడు. కెప్టెన్సీ విషయంలో కోహ్లి సూపర్ అని ఆకాశానికెత్తాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. నాలుగు టెస్ట్‌ల్లో యాష్‌కు నిరాశే ఎదురైంది. As “spectators” of Test Cricket, just stop worrying about team selection and other nonsense and start appreciating the competition, passion, skill and patriotism unfolding in front of your eyes. You’re missing a good game!— AB de Villiers (@ABdeVilliers17) September 6, 2021 ఓవల్ మైదానంలో అశ్విన్‌కు మంచి రికార్డు ఉండటంతో నాలుగో టెస్ట్‌లో అతనికి చోటు ఖాయమేనని అంతా భావించారు. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ మాత్రం అశ్విన్‌ను కాదని జడేజావైపే మొగ్గుచూపాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ విధానాన్నే అనుసరించాడు. ఏకైక స్పిన్నర్ కోటాలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజాకు తిరిగి అవకాశమిచ్చాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పించారు. కోహ్లీ ఘోర తప్పిదం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రోజు మ్యాచ్ భారత్‌వైపు మళ్లే వరకు విమర్శలు కొనసాగించారు. అశ్విన్ ఉంటే భారత్ విజయం సులువయ్యేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: టీమిండియా డాషింగ్ క్రికెటర్ నోట పవర్ స్టార్ పాపులర్ డైలగ్.. -
వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) అద్భుత శతకంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 94 పరుగుల వద్ద మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది కెరీర్లో తొలి ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా రోహిత్‌కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. The greatest pleasure in life is doing what people say you cannot do 😊😊 — Rohit Sharma (@ImRo45) September 14, 2016 ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ ఎప్పుడో 2016లో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. దీన్ని ట్రోల్ చేస్తున్న అతని అభిమానులు రోహిత్ చెప్పాడంటే చేస్తాడంతే అంటూ కామెంట్ల రూపంలో హంగామా చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. మనం ఏదైతే చేయలేమని జనం అనుకుంటారో.. దానిని చేసి చూపించడం కంటే ఆనందం మరొకటి ఉండదని రోహిత్ 2016, సెప్టెంబర్ 14న ట్వీట్ చేశాడు. చదవండి: అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్ ఒక్కడే అత్యధికంగా ఇలా..! ఆ ట్వీట్‌ను ఇప్పుడు రోహిత్ అభిమానులు వైరల్‌గా మార్చేశారు. ఎందుకంటే.. టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతున్నా, విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడన్న అపవాదు రోహిత్‌పై ఉంది. మొత్తానికి ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ ఆ అపవాదును చెరిపేసుకున్నాడు. కీలకమైన సమయంలో సెంచరీ చేసి తన సత్తా ఏంటో చాటడంతోపాటు జట్టును కూడా ఆదుకుని, తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. చదవండి: డుప్లెసిస్ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు.. -
నీటికోసం ఏనుగు.. ‘మనమూ నేర్చుకుందాం’
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతూ మంచినీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. మరోవైపు మానవ సమాజం అంతులేని నిర్లక్ష్యం. వెరసి అడవి జంతువులకు ప్రాణసంకటంగా మారుతోంది. చుక్క మంచినీరు దొరకడం కష్టంగా మారింది. అయినా మనుషులు నీటి వృధాపై దృష్టిపెట్టడంలేదు. ఈ విషయంలో నోరులేని జీవులు చాలా నయం అనిపిస్తోంది. ఈ విషయాన్ని జల సంరక్షణ మంత్రిత్వ శాఖ తాజా వీడియో ద్వారా తెలియజేసింది. చదవండి: World Elephant Day 2021: ఏనుగమ్మ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఉన్న ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అందరినీ ఆలోపించేజేసేదిలా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ట్యాప్‌ను సరిగ్గా తిప్పకుండా వదిలేసే కొంతమందితో పోలిస్తే ఈ గజరాజు చాలా మేలంటున్నారు. ఒక ఏనుగు చేతి పంపుతో స్వయంగా నీటిని పంపింగ్ చేసి తాగుతోంది. దాహం వేసినప్పుడు సమీపంలోని సరస్సు లేదా చెరువు వంటి సహజ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఎంతో విచారకరం. అయితే ప్రతి నీటి బొట్టును ప్రాముఖ్యతను గుర్తించిన ఆ ఏనుగు తన దాహం తీర్చడానికి సరిపోయేంత నీటిని మాత్రమే పంప్ చేస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించిన తీరు విశేషంగా నిలిచింది. "ఏనుగు కూడా ప్రతీ నీటి చుక్క ప్రాముఖ్యతను ఆకళింపు చేసుకుంది. కానీ మనుషులుగా మనం ఈ అమూల్యమైన వనరును ఎందుకు వృధా చేస్తున్నాం, ”అంటూ జల సంరక్షణ మంత్రిత్వ శాఖ ఈ వీడియోను ట్వీట్ చేసింది. ఇకనైనా మనం పాఠాలు నేర్చుకుని నీటిని కాపాడుకుందాం అని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. एक हाथी भी #जल की एक-एक #बूंद का महत्व समझता है। फिर हम इंसान क्यों इस अनमोल रत्न को व्यर्थ करते हैं? आइए, आज इस जानवर से सीख लें और #जल_संरक्षण करें। pic.twitter.com/EhmSLyhtOI — Ministry of Jal Shakti 🇮🇳 #AmritMahotsav (@MoJSDoWRRDGR) September 3, 2021 -
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రషీద్ ఖాన్ భావోద్వేగం
లండన్: ఆగస్టు 19.. అఫ్గానిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. దేశంలో ముష్కరుల(తాలియన్ల) విధ్వంసకాండ చూసి అతను చలించిపోయాడు. 'ఈరోజు అఫ్గానిస్థాన్ స్వాతంత్ర దినోత్సవం. దేశం కోసం మనమందరం కొంత సమయాన్ని కేటాయిద్దాం. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవలేము. శాంతియుత అఫ్గాన్ రాజ్య స్థాపన కోసం మనమందరం ప్రార్థిద్దాం. ఐక్యరాజ్యసమితి నుంచి సాయం ఆశిస్తున్నాము' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Today let us take some time to value our nation and never forget the sacrifices. We hope and pray for the peaceful , developed and United nation INSHALLAH #happyindependenceday 🇦🇫🇦🇫 pic.twitter.com/ZbDpFS4e20 — Rashid Khan (@rashidkhan_19) August 19, 2021 కాగా, ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణలతో ఉన్న దేశ ప్రజలు ఈసారి వేడుకలకు దూరంగా ఉన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కొందరు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టగా, తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టలేదు. మరోవైపు చాలామంది దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కాబుల్ విమానాశ్రయానికి వందల సంఖ్యలో తరలివచ్చారు. అయితే విమానాశ్రయానికి వెళ్లే దారుల్లోనూ పలుచోట్ల తాలిబన్లు ప్రజలను చితకబాదారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ లాంటి స్టార్ క్రికెటర్లైతే ఐపీఎల్ తదితర లీగ్‌ల్లో పాల్గొంటామని ఇదివరకే ప్రకటించారు. అయితే, మిగాతా అఫ్గాన్ జాతీయ క్రికటర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ పాల్గొంటుందా లేదా అన్న అంశంపై సందిగ్దత నెలకొంది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్లు పాల్గొనేది అనుమానంగా మారింది. చదవండి: రూట్‌ను ఔట్ చేయాలంటే..? సీక్రెట్‌ను రివీల్ చేసిన ఇంగ్లండ్ మాజీ బౌలర్ -
చిరంజీవిని కలిసిన ప్రకాశ్ రాజ్
-
చిరంజీవిని కలిసిన ప్రకాశ్‌రాజ్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. స్వయంగా చిరు ఇంటికి వెళ్లి ఆయనను కలిసి దిగిన ఫొటోను ప్రకాశ్‌రాజ్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ మారింది. ‘ఈ రోజు ఉదయం బాస్‌ని జిమ్‌లో కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అంటూ ఆయన రాసుకొచ్చారు. కాగా, మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్ ఈ సారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ చేస్తున్న వరుస ట్వీట్లు ‘మా’ ఎన్నికలను మరింత వేడెక్కిస్తున్నాయి. గతంలో ఎన్నికలు ‘ఎప్పుడని’ ఒకసారి ‘తెగేవరకు లాగొద్దంటూ’ మరోసారి ఆయన చేసిన ట్వీట్లు ‘మా’ దుమారం రేపాయి. ఆగష్టు 15న ‘జెండా ఎగరెస్తాం’ అంటూ ట్వీట్ చేసి ప్రకాశ్‌రాజ్ అందరిని ఆలోచనలో పడేశారు. తాజాగా చిరును కలవడం కూడా ఇందులో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. Early morning meeting with the BOSS in the gym. Thanked him for taking the initiative to find solutions for the film fraternity .. an ever inspiring ANNAYA.. we are blessed to have him 🤗🤗 pic.twitter.com/nJ3YTFzfLT — Prakash Raj (@prakashraaj) August 17, 2021 -
అవును.. లార్డ్స్ ఆండర్సన్ అడ్డానే.. కోహ్లికి కౌంటరిచ్చిన బ్రాడ్
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. నాలుగోరోజు ఆటలో భాగంగా ఆండర్సన్ పలు మార్లు పిచ్‌పై పరిగెత్తడమే కాకుండా కోహ్లిని కవ్వించేలా మాట్లాడాడు. దీనికి విరాట్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. "పిచ్ నీ సొంతం అనుకున్నావా.. పరిగెత్తడానికి'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Lord’s honours board suggests it’s as close to Jimmy’s backyard as Jimmy’s actual backyard. Love the fire but that language will have him in trouble — Stuart Broad (@StuartBroad8) August 15, 2021 అయితే, కోహ్లి-ఆండర్సన్‌ల మధ్య జరిగిన వాగ్వాదంపై ఇంగ్లండ్ మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ఈ విషయమై కోహ్లికి కౌంటరిస్తూ.. అవును, లార్డ్స్ ఆండర్సన్ అడ్డానే. కావాలంటే అక్కడి హానర్ బోర్డు చూడు.. లార్డ్స్ ఆండర్సన్ అడ్డా అని గణంకాలే చెబుతాయి. కోహ్లి.. నీలోని ఫైర్ బాగుంటుంది కానీ, నువ్వు వాడే భాషే నిన్ను కష్టాల్లో పడేస్తుంది అంటూ బ్రాడ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, ఆండర్సన్ లార్డ్స్ మైదానంలో 5 వికెట్ల ఘనతను ఏడు సార్లు సాధించాడు. ఈక్రమంలో అతను ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ రికార్డును(7 సార్లు 5 వికెట్ల ఘనత) సమం చేశాడు. ఇదిలా ఉంటే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నరాలు తెగే ఉత్కంఠత.. రోచ్ 'సూపర్' ఇన్నింగ్స్‌తో గట్టెక్కిన విండీస్ -
వైరల్ ట్వీట్: భోజనానికి వెళ్తున్నా.. భోజనం చేసేశా
సోషల్ మీడియాలో పలు ఆసక్తికర సంఘటనలు వైరల్‌గా మారుతుంటాయి. ఆ క్రమంలోనే ఒకరి ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ‘భోజనానికి వెళ్తున్నా’, ‘భోజనం చేసి వచ్చా’ అని చేసిన పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే అతడు భోజనానికి వెళ్తున్నా అని పోస్టు చేసిన 14 ఏళ్ల తర్వాత ‘భోజనం చేసి వచ్చా’ అని ట్వీట్ చేశాడు. అంటే పదాల్నుగేళ్ల పాటు భోజనం చేశాడు అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ ట్వీట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. @deleted అనే ట్విటర్ ఖాతాదారుడు 2007 మార్చి 15వ తేదీన మొదట ‘భోజనం కోసం వేచి చూస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. ఆ కొద్దిసేపటికి ‘భోజనం కోసం బయటకు వెళ్తున్నా (Going Out For Lunch)’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన అనంతరం అతడి ఖాతా నుంచి కొన్నేళ్లుగా ఒక్క పోస్టు కూడా చేయలేదు. అయితే తాజాగా జూలై 25, 2021న అంటే 14 సంవత్సరాల అనంతరం ‘భోజనం నుంచి తిరిగొచ్చా’ అని ట్వీట్ చేశాడు. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన అతడి ట్వీట్ చూసిన ఫాలోవర్లు ఆశ్చర్యంగా చూసి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఏం నాయనా పద్నాలుగేళ్ల పాటు భోజనానికి వెళ్లావా అని ప్రశ్నించారు. వనవాసం పద్నాలుగేళ్లు ఉంటుంది... నువ్వు భోజనం కోసం అన్ని సంవత్సరాలు వెళ్లావా? అని కామెంట్లు చేశారు. నువ్వు భోజనం చేసేచ్చేలోపు సమాజంలో ఎన్నో మార్పులు జరిగాయి అని ఓ నెటిజన్ రిప్లయ్ ఇచ్చాడు. ఆ రెస్టారెంట్ ఏదో చెప్పవా? అంటూ స్కాండినవియాన్ అడిగాడు. అయితే ఆయన 14 ఏళ్ల పాటు భోజనం వెళ్లాడా? అన్ని సంవత్సరాలు ఏం చేశాడు? ఎందుకు ట్వీట్లు చేయలేదు? అనే సందేహాలు నెటిజన్లలో మొదలైంది. వాటిని అతడిని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. Tell me the restaurant you have been too I shall never go there pic.twitter.com/pGq4tX6FwV — ll SᴄᴀɴᴅɪɴᴀᴠɪᴀN llᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ 💞 (@Odinsonleftus) July 26, 2021 -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: కోహ్లీ సేనపై మైఖేల్ వాన్ వెటకారం
నాటింగ్హమ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కడం ఆపడం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా డ్రా ముగిసిన నేపథ్యంలో.. తనకు మాత్రమే చేతనైన వెటకారపు ట్వీట్‌ను చేశాడు. కోహ్లీ సేనను రక్షించేందుకే వర్షం కురిస్తుందంటూ వ్యంగ్యమైన ట్వీట్‌ను సంధించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత అభిమానులు వాన్‌పై ధ్వజమెత్తుతున్నారు. ఆఖరి రోజు ఆటలో 98 ఓవర్లకు ఆస్కారముండగా టీమిండియా చేతిలో 9 వికెట్లు మిగిలున్నాయి. ఇంత పటిష్ట స్థితిలో భారత జట్టు ఉంటే.. వాన్ ఇలాంటి చెత్త ట్వీట్లు చేయడమేంటని భారతీయులు మండిపడుతున్నారు. Looks like Rain may be saving Indian here … 😜 #ENGvIND — Michael Vaughan (@MichaelVaughan) August 8, 2021 ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్ నెగ్గి శుభారంభం చేయాల్సిన టీమిండియాకు వరుణుడు అడ్డు తగిలాడు. 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు నాలుగో రోజు ఆఖరి సెషన్లో బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో నిలిచారు. ఆఖరి రోజు మరో 157 పరుగులు చేస్తే భారత్ విజయ జయభేరి మోగించేదే. ఇలాంటి తరుణంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు ఆఖరి రోజు ఆటను రద్దు చేస్తూ.. మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. అంతకుముందు 25/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా (5/64), శార్ధూల్ ఠాకూర్(2/37), సిరాజ్(2/84), షమీ(1/72) రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. -
నీరజ్ చోప్రాను అభినందించిన పాక్ అథ్లెట్.. ఆ దేశ అభిమానుల ఆగ్రహం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. ఫైనల్ పోటీలో నీరజ్ 87.58 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకోగా.. వడ్లెచ్ 86.67 మీటర్లు, వాస్లీ 85.44 మీటర్లు విసిరి వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నారు. వీరి తరువాత జర్మన్‌కు చెందిన వెబర్ నాలుగో స్థానంలో, పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అర్షద్ (84.62 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో నీరజ్‌తో పోటీపడి ఐదో స్థానంలో నిలిచిన పాక్ అథ్లెట్ నదీమ్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో నదీమ్.. భారత బల్లెం యోధుడు, స్వర్ణ పతకం విజేత, నా ఐడల్ నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు.. సారీ పాకిస్తాన్ నేను మీ కొరకు పతకం గెలవలేక పోయాను అంటూ పేర్కొన్నాడు. ఫైనల్ ముగిసిన కాసేపటికే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రాను తమ దేశ అథ్లెట్ అర్షద్ నదీమ్ ‘ఐడల్’ గా పేర్కొనడంపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంటే ఒక ఏడాది చిన్నవాడైన నీరజ్‌ను ఐడల్‌గా పేర్కొనడం ఏంటనీ విమర్శించారు. అయితే, అసలు విషయం ఏంటంటే.. ఆ ట్విట్టర్ అకౌంట్ నకిలీదని, సయీద్ అన్వర్ అనే వ్యక్తి నదీమ్ పేరిట ట్వీట్లు చేశాడని ట్విటర్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. కాగా, అంతకుముందు 2018 ఏషియన్ గేమ్స్‌లో వీరిద్దరి షేక్ హ్యాండ్ విషయం వైరల్ అయ్యింది. నీరజ్ అప్పుడు కూడా స్వర్ణం గెలవగా.. అర్షద్ నదీమ్ కాంస్య పతకంతో సరిపుచ్చుకున్నాడు. పతకాలు బహుకరించిన తర్వాత నదీమ్, నీరజ్ తమ దేశ జెండాలను భుజంపై వేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అప్పట్లో వైరల్ అయ్యింది. -
‘నాకు కరెంట్ వద్దు.. ఎమ్మెల్యే కావాలి’ మహిళా ట్వీట్ వైరల్
అమృత్సర్: కొన్ని నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటినుంచే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అయితే ఈసారి అధికారమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో కాంగ్రెస్‌కు గట్టిపోనిచ్చిన ఆప్ ఈసారి అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో అప్పుడే హామీల వర్షం మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రధాన హామీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై ఆప్ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ఉచిత విద్యుత్ వద్దు.. నాకు ఎమ్మెల్యే రాఘవ్ కావాలి’ అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌ను చూసిన ఆ ఎమ్మెల్యే స్పందించి ‘నేను మేనిఫెస్టోలో లేను’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సంభాషణ ట్విటర్లో వైరల్‌గా మారింది. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను చూసిన కృతి ఠాకూర్ స్పందిస్తూ ‘కరెంట్ వద్దు.. రాఘవ్ కావాలి’ అని కామెంట్ చేసింది. ఆ కామెంట్ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించింది. ఈ కామెంట్‌ను చూసిన రాఘవ్ చద్దా స్పందించారు. ‘మేనిఫెస్టోలో నేను లేను.. ఉచిత విద్యుత్ ఉంది’ అని రిప్లయ్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు ఓటేయండి. 24 గంటలు ఉచిత విద్యుత్ మీకు ఇస్తామని నేను హామీ ఇస్తున్నా. నా విషయంలో మాత్రం హామీ ఇవ్వలేను’ అంటూ రాఘవ్ కామెంట్ చేశారు. వీరి సంభాషణ ట్విటర్లో వైరలయ్యింది. 32 ఏళ్ల రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజేందర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన అతి చిన్న వయస్కుడు. ఆ ట్వీట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నాడు. ‘కేజ్రీవాల్ గ్యారంటీ’ అంటూ చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను రిఫర్ చేశారు. ఢిల్లీ జల్ బోర్డు అధ్యక్షుడిగా కూడా రాఘవ్ కొనసాగుతున్నారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆప్‌కు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి ఎలాగైనా 55 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఆప్ వ్యూహం రచిస్తోంది. -
ఫెన్సర్ భవానీ దేవి క్షమాపణలు.. స్పందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పోటీపడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి.. రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 7-15 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె యావత్ దేశానికి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపింది. 'శక్తిసామర్థ్యాల మేరకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయా. నన్ను క్షమించండి. ప్రతి ముగింపు ఓ ప్రారంభానికి నాంది. శిక్షణను కొనసాగిస్తా. 2024 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు సాగుతా' అని ట్వీట్ చేసింది. భవానీ దేవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Big Day 🤺 It was Excitement & Emotional. I won the First Match 15/3 against Nadia Azizi and become the First INDIAN Fencing Player to win a Match at Olympic but 2nd Match I lost 7/15 against world top 3 player Manon Brunet. I did my level best but couldn't win. I am sorry 🙏 🇮🇳 pic.twitter.com/TNTtw7oLgO — C A Bhavani Devi (@IamBhavaniDevi) July 26, 2021 You gave your best and that is all that counts. Wins and losses are a part of life. India is very proud of your contributions. You are an inspiration for our citizens. https://t.co/iGta4a3sbz — Narendra Modi (@narendramodi) July 26, 2021 ఆమె ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శక్తిమేరకు పోరాడావంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు. 'మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్ గర్విస్తోంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు' అంటూ ప్రధాని ఆమెకు అండగా నిలిచారు. తమిళనాడుకు చెందిన చందలవాడ ఆనంద సుందరామన్ భవానీ దేవి అరంగేట్రం ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. తొలి రౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచి ఔరా అనిపించారు. ఒలింపిక్స్ ఫెన్సింగ్‌లో ఓ మ్యాచ్‌లో గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. -
WTC Final: సోనూ భాయ్.. విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపండి ప్లీజ్..!
న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతున్న వేల, రియల్ హీరో సోనూ సూద్‌కు ఓ భారత అభిమాని ట్విటర్ వేదికగా ఓ వింత రిక్వెస్ట్ పెట్టాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అడ్డుగోడలా మారి 177 బంతుల్లో 49 పరుగులు చేసి కివీస్‌కు స్వల్ప ఆధిక్యాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాగర్ అనే ఓ భారత అభిమాని సోనూ సూద్‌కు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘హలో సోనూ సూద్.. దయచేసి విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపండి’ అంటూ సాగర్ చేసిన ట్వీట్ నెట్టింట హల్చల్ చేసింది. Hello @SonuSood, please Williamson ko pavilion bhej do — Sagar (@sagarcasm) June 22, 2021 हमारी टीम में ऐसे दिग्गज हैं जो खुद ही भेज देंगे। देखा, गया ना।🇮🇳 https://t.co/QLZ9aBy7rT — sonu sood (@SonuSood) June 22, 2021 కరోనా కష్టకాలంలో ప్రజలు సోనూసూద్‌కు మొరపెట్టుకుంటే వాళ్ల కష్టాలు ఎలా దూరమయ్యాయో.. యాధృచ్చికంగా, ఈ అభిమాని కోరిక కూడా అలానే నెరవేరింది. విలియమ్సన్ అవుట్ అయ్యాడు. ఆతరువాత సదరు అభిమాని ట్వీట్‌కు స్పందించిన సోనూ భాయ్.. 'మన టీమ్‌లో దిగ్గజ ఆటగాళ్లున్నారు.. వాళ్ళే అతనిని వెనక్కు పంపుతారు... చూడు విలియమ్సన్ అవుటైపోయాడు' అంటూ ట్వీట్ చేశాడు. విలియమ్సన్ అవుటవ్వడానికి సోనూ సూద్ కారణం కాకపోయినప్పటికీ.. అభిమాని ట్వీట్‌కు సోనూ సూద్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో సెన్సెషన్‌గా మారింది. దీంతో నిజంగానే సోనూసూద్‌ను ఏదైనా కోరుకుంటే అది జరిగిపోతుందేమోనని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో కొన్నివేల మందిని సొంత గ్రామాలకు పంపడంలో సోనూసూద్ ఎలా సాయపడ్డాడో అలాగే భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన విలియమ్సన్‌ను కూడా అదే తరహాలో పెవిలియన్‌కు పంపాడని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సోనూ సూద్‌కు మొరపెట్టుకుంటే ఏ కష్టమైనా తీరిపోతుందని ప్రజలు భావిస్తుంటారు. అందుకు అనుగుణంగా ప్రజలు ఏది అడిగినా ఆయన తన వంతు సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరాధ్య దైవంగా మారాడు. ఆయన స్ఫూర్తితో చాలా మంది తాము కూడా సమాజానికి ఏదైనా చేయాలని ఆరాటపడుతున్నారు. చదవండి: టీమిండియా ఓటమికి ఆ ఇద్దరే కారణం: టెండూల్కర్ -
కరోనా విలయం: చూస్తే కన్నీళ్లాగవు: వైరల్ ట్వీట్
సాక్షి,ముంబై: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల నమోదు, మరణాలతో దేశవాసులను బెంబేలెత్తిస్తోంది. మరోవైపు కరోనా రోగులకు ఆసుపత్రులలో మందులు దొరక్క, ఆక్సిజన్ కొరత, సమయానకి బెడ్లు దొరకక అనేమంది రోగులు తమ ఆత్మీయుల ముందే ఊపిరి వదులుతున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంక్షోభ సమయంలో ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా కరోనా రోగులను సమీప బంధువులే కనీసం తాకడానికి భయపడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రాణాలకు తెగించి మరీ లక్షలాది మందికి ప్రాణాలు పోస్తున్నారు. ఈ క్రమంలో అలుపెరుగక పోరాడుతున్నప్పటికీ కరోనా మహమ్మారికి బలవుతున్న రోగులను చూసి కంట తడిపెడుతున్న డాక్లర్లు అనేకమంది ఉన్నారు. మాస్క్ , భౌతిక దూరం, శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు పాటించాలంటూ వేడుకుంటున్న వైద్యులను చూశాం. ఈ నేపథ్యంలో తాజాగా ఒక డాక్టరు పోస్ట్ సంచలనంగా మారింది. (కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్) పీపీఈ కిట్లోసుమారు 15 గంటలు నిరంతరం ధరించడం వలన చెమటలో తడిసిపోయిన ఫోటోలను డాక్టర్ సోహిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటినుండి వేలాది లైక్‌లు, రీట్వీట్లలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటానికి తమ వంతు కృషి చేస్తూ, వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో ఈ పోస్ట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా సోహిల్ పీపీఈ కిట్‌లో ఉన్న ఒక ఫోటోను, పూర్తిగా చెమటతో తడిసి ముద్ద అయిన మరో ఫోటోను ట్వీట్ చేశారు. "దేశానికి సేవ చేయడం గర్వంగా ఉంది" అని సోహిల్ పేర్కొన్నారు. ‘‘మేం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కుటుంబాలకు దూరంగా ఉంటూ చాలా కష్టపడుతున్నాం. ఒక్కోసారి పాజిటివ్ రోగులకు అడుగు దూరంలో మాత్రమే ఉంటాం. మరోసారి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న పెద్దలకు కేవలం అంగుళం దూరంలో ఉంటాం. అందుకే వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు అందరి తరపున వేడుకుంటున్నా...దయచేసి అందరూ టీకా వేయించుకోండి’’ అంటూ ట్వీట్ ద్వారా అభ్యర్థించారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇదే ఏకైక పరిష్కారం కనుక ప్రజలందరూ టీకాలు వేయించుకుని, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. (రెమిడెసివిర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం) Proud to serve the nation pic.twitter.com/xwyGSax39y — Dr_sohil (@DrSohil) April 28, 2021 Talking on the behalf of all doctors and health workers.. we are really working hard away from our family.. sometimes a foot away from positive patient, sometimes an inch away from critically ill oldies... I request please go for vaccination.. it's only solution ! Stay safe. 🙏🙏 — Dr_sohil (@DrSohil) April 28, 2021 -
Harbhajan Singh: భజ్జీ.. సెలబ్రిటీలకు మాత్రమే రిప్లై ఇస్తావా?
చెన్నై: టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్, ఐపీఎల్లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సభ్యుడిగా కొనసాగుతున్న హర్భజన్ సింగ్‌ను టార్గెట్ చేస్తూ ఓ అభిమాని ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు. సోషల్ మీడియాలో పాపులర్ వ్యక్తులతో మాత్రమే ఎందుకు సంభాషిస్తావంటూ అతను భజ్జీని నిలదీశాడు. భజ్జీ.. మధ్య తరగతి ప్రజలతో సంభాషించేందుకు కానీ, రిప్లై ఇచ్చేందుకు కాని ఆయిష్టత చూపుతాడని ఆరోపించాడు. ప్రొఫైల్‌పై బ్లూ టిక్ మార్క్ ఉన్న సెలబ్రిటీలపై ఉన్న ఆసక్తి... సామాన్య ప్రజలపై ఎందుకుండదని ప్రశ్నించాడు. ఇదేనా మీకున్న మానవత్వమంటూ నిలదీశాడు. I am from lower middle class and I do reply to people who talk sense.. I am one of you brother not higher class or any class .. I am just a human like you who feel the pain of another 🙏🙏 https://t.co/82dGLovvnn — Harbhajan Turbanator (@harbhajan_singh) April 24, 2021 అయితే సదరు అభిమాని అడిగిన ప్రశ్నకు హర్భజన్ వినయంగా ప్రతి స్పందించాడు. తాను లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చానని.. పద్దతిగా సంభాషించే ప్రతి ఒక్కరికి తాను రిప్లై ఇస్తానని అన్నాడు. తాను ఏ క్లాస్‌కు చెందినవాడిని కాదని, ఎదుటి వ్యక్తి బాధను అర్ధం చేసుకోగల నీలాంటి సాధారణ వ్యక్తినేనని ఆ అభిమానికి బదులిచ్చాడు. సాధారణంగా అభిమానులతో హుందాగా వ్యవహరించే హర్భజన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతని అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కాగా, భజ్జీ ప్రస్తుత ఐపీఎల్లో కేకేఆర్ తరఫున కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. ఆశించిన స్థాయిలో రాణించకపోవటంతో అతని స్థానంలో మరొకరికి అవకాశం కల్పించారు. చదవండి: భారత్‌కు ఆక్సిజన్ అందిద్దాం.. షోయబ్ అక్తర్ పిలుపు -
ఉత్తమ జట్టు బరిలో ఉంది.. నా అవసరం వచ్చినప్పుడు చూద్దాం
ముంబై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే జట్టు.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సొంతం చేసుకుని నాలుగో టైటిల్ దిశగా అడుగులేస్తుంది. అయితే, చెన్నై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు స్థానం లభించకపోవడంపై అతని అభిమాని ఒకరు ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. దీనికి తాహిర్ బదులిస్తూ చేసిన రిటర్న్ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ట్వీట్లో తాహిర్ సదరు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రస్తుతం చెన్నై తమ అత్యుత్తమ జట్టుతో బరిలో ఉందని, వారు మైదానంలో ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారని, చెన్నై జట్టు సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నానని, జట్టుకు తన సేవలు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధంగా ఉన్నానని బదులిచ్చాడు. Thank you https://t.co/CwOFkDXgPq players are in the field and they are delivering and they should continue for the teams benefit.Its not about me.Its about the team.Iam extremely proud to be a part of this wonderful team.If Iam needed sometime I will give my best for the team https://t.co/Wh6PJ0dYHV — Imran Tahir (@ImranTahirSA) April 19, 2021 కాగా, 2018 ఐపీఎల్ నుంచి చెన్నై జట్టు సభ్యుడిగా కొనసాగుతున్న తాహిర్.. తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను గతేడాది పంజాబ్ కింగ్స్‌తో ఆడాడు. గడిచిన మూడు సీజన్లలో తాహిర్ లేకుండా చెన్నై జట్టు బరిలోకి దిగడం చాలా అరుదుగా చూశాం. తాహిర్ తన ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 58 మ్యాచ్‌ల్లో 16.15 స్ట్రయిక్ రేట్‌తో 80 వికెట్లు పడగొట్టాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 26 మ్యాచ్‌లు ఆడిన ఈ సఫారీ లెగ్ స్పిన్నర్.. 33 వికెట్లు సాధించాడు. తాహిర్.. చెన్నై తరఫున ఆడిన తొలి సీజన్లోనే(2018) సీఎస్కే టైటిల్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే సీజన్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైన ధోని సేన... ఆతరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో(పంజాబ్, రాజస్థాన్) విజయం సాధించి జోరుమీదుంది. బుధవారం(ఏప్రిల్ 21న) కేకేఆర్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో కూడా విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. చదవండి: వాషింగ్టన్, పడిక్కల్‌లకు బంపర్ ఆఫర్.. -
ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్..
చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వాహనాన్ని అందుకున్న టీమిండియా సెన్సేషనల్ బౌలర్ టి నటరాజన్.. ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని నటరాజన్ గురువారం ట్విటర్ వేదికగా తెలియజేశాడు. తనకు అందిన ఎస్యూవీ వాహనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. "నా ప్రయాణాన్ని గుర్తించి నాకు అండగా నిలిచిన మీకు కృతజ్ఞతలు సర్(ఆనంద్ మహీంద్ర), భారత్ తరఫున క్రికెట్ ఆడే అవకాశం రావడం నాకు దక్కిన వరం, గొప్ప వ్యక్తుల నుంచి ప్రోత్సాహం లభించడం నాకు దక్కిన గౌరవం, నాకు బహుమతిగా ఇచ్చిన వాహనాన్ని ఈ రోజే నడిపాను, నా అరంగేట్ర టెస్ట్ మ్యాచ్ జెర్సీని మీకోసం పంపిస్తున్నాను" అంటూ క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, నటరాజన్‌తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీలు అందుకున్నారు. Playing cricket for India is the biggest privilege of my life. My #Rise has been on an unusual path. Along the way, the love and affection, I have received has overwhelmed me. The support and encouragement from wonderful people, helps me find ways to #ExploreTheImpossible ..1/2 pic.twitter.com/FvuPKljjtu — Natarajan (@Natarajan_91) April 1, 2021 ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం నటరాజన్ సిద్దమవుతున్నాడు. గురువారమే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరాడు. నిబంధనల మేరకు ఏడు రోజుల క్వారంటైన్లో ఉండనున్నాడు. గత సీజన్లో యార్కర్లతో అదరగొట్టిన నట్టూ ఈసారి అంతకుమించి రాణించాలని సన్‌రైజర్స్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చెన్నై వేదిక ఏప్రిల్ 11న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: నా డార్లింగ్‌తో చివరి పెగ్: వార్నర్ -
వైరల్ పోస్ట్: జొమాటో రియాక్షన్
సాక్షి,ముంబై: నాణేనికి రెండు వైపులా అన్నట్టు సోషల్ మీడియా పుణ్యమా అని ఇబ్బందుల్లో ఉన్న చిరు వ్యాపారులకు, ఇతర బాధితులకు భారీ ప్రయోజనమే లభిస్తోంది. ఇటీవల మనవరాలి చదువుకోసం ఇల్లునే అమ్ముకున్న ఒక పెద్దాయన పట్ల నెటిజన్లు మానవత్వంతో స్పందించారు. అంతకుముందు ఢిల్లీకి చెందిన ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులకు సోషల్‌మీడియా ద్వారా మద్దతు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్థిక సంక్షోభంలో పడి విలవిల్లాడుతున్న ముంబైకి చెందిన ‘లిట్టీ చోఖా’ అమ్ముకుని జీవించే చిరువ్యాపారి కథనం వైరల్‌గా మారింది. జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది మొదలు పెట్టిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌కు భారీ స్పందన లభించింది. ప్రధానంగా ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటోతో పాటు, ఇతర దాతలు స్పందించిన తీరు విశేషంగా నిలిచింది.(జొమాటో వివాదం: ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్) ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది సోషల్ మీడియాలో ఈ కథనాన్ని పోస్ట్ చేశారు. వివరాలను పరిశీలిస్తే అహ్మదాబాద్‌కు చెందిన యోగేశ్ ముంబైలోని వెర్సోవా బీచ్‌లో లిట్టి చోఖా అమ్మకుని జీవనం సాగించేవాడు. స్టాల్లో రెగ్యులర్‌గా లీట్టీలను ఆస్వాదించే ద్వివేది మాటల సందర్బంలో యోగేశ్ కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడినట్టు తెలుసుకున్నారు. పాపులర్ లిట్టి-చోఖాను చట్నీ, బటర్, సలాడ్‌తో కలిపి కేవలం ఇరవై రూపాయలకు అమ్ముతున్నా కొనేవారు కరువైన పరిస్థితి. చివరికి దుకాణం కూడా మూసి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సోదరుడితోపాటు, తమ జీవనం దుర్భరంగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా ద్వివేదితో వాపోయారు ఈ నష్టాలను భరించే శక్తి ఇక తనకు లేదనీ, స్టాల్‌ను మూసివేయడం తప్ప వేరే మార్గం లేదంటూ యోగేశ్ ఆవేదన చెందారు. దీంతో చలించిన ద్వివేది యోగేశ్‌కు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు దీన్ని జోమాటోను ట్యాగ్ చేస్తూ మార్చి 16 న ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ రెండు వేలకు పైగా లైక్‌లను సంపాదించింది. అలాగే జొమాటోలో అతడి దుకాణాన్ని నమోదు చేయాలని నెటిజన్లు కూడా అభ్యర్థించారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. జొమాటో స్పందన దీనికి జొమాటోతో పాటు కొంతమంది నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. యోగేశ్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అతని వివరాలను సేకరించేపనిలో పడింది. ప్రతిస్పందన ఆలస్యం అయినందుకు క్షమించండి. వీలైతే, దయచేసి యోగేశ్ కాంటాక్ట్ నంబర్‌తో పాటు, ఇతర వివరాలను తమకు అందించాలని కోరింది. దీనిపై ద్వివేది సంతోషం వ్యక్తం చేశారు. సాయం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లిట్టీ-చోఖా: బిహార్‌కు చెందిన వంటకం ఇది. గోధుమపిండితో చేసిన చపాతిలో పప్పులు, ఇతర మసాలాలను స్టఫ్ చేసి, నిప్పులపై కాలుస్తారు. దీన్ని నేతితోనూ, వంకాయ కూర లేదా ఆలూకూరతో కలిపి తింటారట. Hi Priyanshu, sorry for the delay in response. If possible, please help us with his contact number over a private message and our team will be reaching out to him at the earliest to assist him with the listing procedure.https://t.co/jcTFuHa5Ue — zomato care (@zomatocare) March 17, 2021 @zomatoin please help this gentleman with his endeavour!!🙏 https://t.co/0l9ZKOYI8d — manoj bajpayee (@BajpayeeManoj) March 17, 2021 -
బ్యాట్ విరిగిపోతుందని మూడేళ్ల కిందటే ఊహించాడా..?
అహ్మదాబాద్: భారత్‌తో జరిగిన నాలుగో టీ20 ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ బ్యాట్ విరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ గెలుపునకు 3 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన తరుణంలో శార్ధూల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో ఆర్చర్ బ్యాట్ విరిగిపోయింది. క్రికెట్లో బ్యాట్ విరగిపోవడం అనేది సాధారణమైన విషయమే అయినప్పటికీ.. ఆర్చర్ ఈ ఘటనను మూడేళ్ల కిందటే ఊహించాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆర్చర్ మూడేళ్ల కిందట( 2018 మార్చి 7న) ఓ ట్వీట్ చేస్తూ.. "ఇంగ్లండ్‌లో ఎవరైనా మంచిగా బ్యాట్ రిపేర్ చేసే వాళ్లు ఉన్నారా" అంటూ తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను కోరాడు. ఈ ట్వీటే ప్రస్తుతం నెటిజన్లను తికమక పెడుతుంది. ఆర్చర్‌కు భవిష్యత్తు ముందుగానే తెలుసిపోతుందా అనే అంశంమే వారి తికమకకు కారణం. గతంలో కూడా అతను చాలా సందర్భాల్లో వివిధ అంశాలకు సంబంధించిన విషయాలను ముందే ఊహించినట్టుగా ట్వీట్ చేసేవాడు. చాలామంది అతనిని 'క్రికెట్ నోస్ట్రడామస్'గా పిలుస్తుంటారు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్ ఇదే వేదికగా ఆదివారం జరుగనుంది. -
2025లోనా.. ఇంకెవరు నేనే ఉంటా: జడేజా
ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా 2025లో మీ దృష్టిలో ఉత్తమ ఆటగాడిగా ఎవరుంటారో చెప్పాలంటూ రాజస్తాన్ రాయల్స్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడుగుతూ ఒక ఫోటోను షేర్ చేసింది. దీనిపై జడేజా వినూత్న రీతిలో స్పందించాడు. ''2025లోనా .. ఇంకెవరు నేనే ఉత్తమ ఆటగాడిగా ఉంటా.. అందులో సందేహం లేదు'' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. జడేజా ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. జడేజా ప్రస్తుత తరంలో ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో ఒకడిగా ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో తమ పోస్టుపై జడేజా పెట్టిన కామెంట్‌కు సంతృప్తి చెందిన రాజస్తాన్ రాయల్స్..'' మాకు సమాధానం దొరికింది.. ఇది ఇక్కడితో ముగిద్దాం'' అంటూ కామెంట్ చేసింది. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా మూడో టెస్టు మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్ చేస్తుండగా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జడేజా బొటనవేలికి తీవ్ర గాయమైంది. వైద్యులు అతన్ని పరీక్షించగా.. ఆరు వారాల విశ్రాంతి అవసరం కావడంతో ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అంతేగాక రేపటినుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు జడేజా అందుబాటులో ఉండడు. ఆ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్ మాత్రం ఆడే అవకాశం ఉన్నట్లు టీమిండియా మేనేజ్మెంట్ తెలిపింది. కాగా జడేజా తన ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశాడు. నా ప్రాక్టీస్ మెళ్లిగా ఆరంభించా.. కానీ కచ్చితంగా జట్టులోకి వస్తా అంటూ కామెంట్ చేశాడు. ఇక ఏప్రిల్ 9 నుంచి జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు మాత్రం జడేజా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాడు. ఇక టీమిండియా తరపున జడేజా 51 టెస్టుల్లో 1954 పరుగులు.. 220 వికెట్లు, 168 వన్డేల్లో 2411 పరుగులు.. 187 వికెట్లు, 50 టీ20ల్లో 217 పరుగులు.. 39 వికెట్లు సాధించాడు. చదవండి: 'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్ తినాలి' 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' Slowly but surely 💪🏻 pic.twitter.com/7uARo5bhms — Ravindrasinh jadeja (@imjadeja) March 9, 2021 -
ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి.. తిరిగి ప్రత్యక్షం
టోక్యో: జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి టైంపాస్ కోసం గూగుల్ ఎర్త్ చూస్తుంటే.. ఊహించని సర్ప్రైజ్ కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఎప్పుడో ఏడేళ్ల కిందట చనిపోయిన తండ్రి.. అందులో కనిపించారు. అది చూడగానే ఆ వ్యక్తి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. అంతే.. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వివరాలు.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల టైంపాస్ కోసం గూగుల్ ఎర్త్‌లో తన తల్లిదండ్రుల ఇల్లు ఎలా కనిపిస్తుందో చూడాలని అనుకున్నాడు. దానిలో భాగంగా గూగుల్ ఎర్త్ ఒపెన్ చేసి లోకేషన్ టైప్ చేయగా అతడికి ఆ ఇంటి ముందు ఏడేళ్ల కిందట చనిపోయిన తండ్రి ఫోటో కనిపించింది. దీనిలో వీధిలో రోడ్డు పక్కన నిలుచున్న తండ్రి ఫొటో కనిపించింది. (చదవండి: భార్య గుట్టు రట్టు చేసిన గూగుల్ మ్యాప్) ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తిరిగి ఇలా కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యే సరికి ఈ వ్యక్తి సంతోషం పట్టలేకపోయాడు. వెంటనే దీని గురించి తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.‘‘గూగుల్ ఎర్త్‌లో ఏడేళ్ల కిందట చనిపోయినా నా తండ్రిని చూశాను. అందులో అమ్మ.. నాన్న వద్దకు నడుస్తున్నట్లుగా ఉంది. బహుశా.. ఆయన అమ్మ కోసం రోడ్డు పక్కన ఎదురుచూస్తున్నారనుకుంటాను. ‘గూగుల్ ఎర్త్’ ఈ ప్రాంతాన్ని ఇంకా అప్డేట్ చేయకపోవడం వల్ల ఏడేళ్ల క్రితం చనిపోయిన నా తండ్రిని మళ్లీ చూడగలిగాను’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటివరకు 6.9 లక్షల మంది లైక్ చేశారు. (చదవండి: రహస్య గది.., 9 హత్యలు) コロナでやる事ないからGoogleEarthで実家見に行ったら7年前に死んだ親父が写ってた。その先に人が居たから見に行ったら母ちゃんだった。一服しながら奥さんの帰りを待ってたんだな。無口だけど優しい親父だった。このままこの場所の写真更新しないで欲しいな。 pic.twitter.com/PXxBICAxmz — タムチンキ (@TeacherUfo) January 4, 2021 గూగుల్ ఎర్త్‌తో వల్ల 40 ఏళ్ల క్రితం మిస్సయిన వ్యక్తి ఆచూకీ లభించడం.. మరో ఘటనలో ఓ వ్యక్తి తన ఇంటి సమీపంలోని పార్క్‌లో ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న భార్యని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం.. ఆపై ఆమెకు విడాకులు ఇవ్వడం గురించి గతంలో చదివే ఉన్నాం. -
ఆ కుర్చీ ఇప్పుడు నాకు పీడకల..
కరోనా సంక్షోభం కారణంగా దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, పిల్లలకు ఆన్లైన్లో పాఠాల బోధన నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలలు పూర్తైతే ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఏడాది పూర్తి కానుంది. ఈ వర్క్ ఫ్రం హోమ్ అనేది ఇప్పుడు సాధారణ జీవితంలా మారిపోయిందని ఉద్యోగులు అంటున్నారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు 9-10 గంటల పాటు పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు మాత్రం వర్క్ ఫ్రం హోమ్ పేరుతో 12 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగులు ఎప్పుడు ఈ వర్క్ ఫ్రం హోమ్ ఆపేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ వస్తున్నాయి. ఏ పని చేసినా కుర్చీలో కూర్చొని చేయాల్సి వస్తుందని.. వర్క్‌తో మొదలుపెడితే.. ఆన్లైన్ ఆర్డర్స్, సినిమాలు, ఆన్లైన్ షాపింగ్ ఇలా ఏది చూసినా కుర్చీ, సిస్టమ్‌తో ముడిపడి ఉంది. పడుకోగానే రాత్రి కలలోకి కూడా వస్తుందని.. ఇలాగే ఉంటే జీవితం మొత్తం కుర్చీ మయం అవుతుందంటూ మీమ్స్ పెడుతున్నారు. తాజాగా ఈ మీమ్స్‌కు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వినూత్నమైన రీతిలో స్పందించాడు. 'ఆ కుర్చీ ఇప్పుడు నాకు పీడకలగా వచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ ఇలాగే కొనసాగితే జీవితం మొత్తం కుర్చీకే అంకితమవుతుంది. ఆ మీమ్ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక నుంచి నా ఇంట్లో ఉన్న కుర్చీకి.. దాని ఎదురుగా ఉన్న సిస్టమ్‌కు పరిమితి సమయం ఉపయోగిస్తానని మాట ఇస్తున్నా. కానీ ఫ్రొఫెషనల్ వర్క్ చేస్తున్న ఉద్యోగులకు కుర్చీ కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవు' అంటూ కామెంట్ చేశాడు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆయన ట్వీట్‌ను 6వేలకు పైగా లైక్స్ రాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. What a nightmare. Not a future I’m ready to accept. When I saw this meme I jumped out of my chair & vowed to monitor & limit the time I spend in a chair in front of a screen every day... pic.twitter.com/HI0biamJ09 — anand mahindra (@anandmahindra) December 5, 2020 -
ఆనంద్ మహీంద్రా ట్వీట్: వారికి ఓదార్పు సలహా
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన అభిప్రాయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే తనకు ఎదురైన ఆసక్తికర విషయాలను తనదైన శైలిలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆదివారం తనకు వాట్సప్‌లో వచ్చిన రెండు ఫొటోలను ట్విటర్లో చేశారు. ఇందులో ఆయన 65 ఏళ్లు పైబడిన వారికి ఓ సలహా ఇచ్చారు. ‘ఈ రోజు నాకు వాట్సప్‌లో రెండు ఫొటోలు వచ్చాయి. ఈ రెండింటిలో 65 ఏళ్ల వారికి ఓదార్పు నిచ్చే సలహా ఉంది. అయితే దీనిని ఊహించిన వారికి బహుమతులు లేవు’ అంటూ తన ట్వీట్‌కు సరదా క్యాప్షన్ జోడించారు. (చదవండి: మాస్క్ ఎలా పెట్టుకోవాలో నేర్పించింది) I received two posts today, both of which had comforting advice for 65 year old folks. No prizes for guessing which one I derived more comfort from...😊 pic.twitter.com/esDztGzmsh — anand mahindra (@anandmahindra) September 13, 2020 ఆయన షేర్ చేసిన మొదటి చిత్రంలో "ప్రపంచంలోని 100 మంది వ్యక్తులలో, 8 మంది మాత్రమే 65 ఏళ్లు దాటి జీవించగలరు. మీకు 65 ఏళ్లు పైబడి ఉంటే, సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉండండి. జీవితాన్ని ఆనందించండి, క్షణం గ్రహించండి. మిగిలిన 92 మంది వ్యక్తుల లాగా మీరు 64 ఏళ్ళకు ముందే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు. మీరు ఇప్పటికే మానవాళిలో ఆశీర్వదించబడ్డారు’ అని ఉంది. ఇక రెండవ చిత్రంలో పెరుగుతున్న వయస్సుతో, ప్రజలు కంటి చూపును కోల్పోతారు కానీ ఇతరులను అంచనా వేసి తీర్పు చెప్పే సామర్థ్యాన్ని పొందుతారు’ అని పేర్కొన్న ఈ పోస్టులు షేర్ చేసిన కొద్ది గంటలకే వేలల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: ఇలాంటి వింత కోరికను ఎప్పుడైనా విన్నారా!) -
కంగనా ట్వీట్: పాక్ జర్నలిస్టుపై నెటిజన్ల ఫైర్
ముంబై: బాద్రాలోని తన ఖరీదైన పాలి హిల్ కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీ చర్యను పాకిస్తాన్‌తో పోల్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తారార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మెహర్‌ను భారత నెటిజన్లు విపరీతం ట్రోల్ చేస్తున్న ట్వీట్స్ సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. అయితే బీఎంసీ తన కార్యాలాయాన్ని కూల్చివేయడంతో కంగనా పాకిస్తాన్ మాదిరిగా ముంబైలో కూడా ప్రజాస్వామ్యం కరువైందంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ముంబైని పాకిస్తాన్‌తో పోలుస్తూ విమర్శించడంతో మెహర్ తారార్ కంగనాపై మండిపడుతూ... ‘డియర్ కంగనా, దయ చేసి మా దేశం పేరును వాడకుండా మీ రాజకీయ, ఇతర యుద్ధాలతో పోరాడండి. పాకిస్తాన్లో జాతీయ పౌరుల ఇళ్లు, కార్యాలయాలు ఎప్పుడు కూల్చివేసిన దాఖలు లేవు’ అంటూ ఆమె ట్వీట్లో రాసుకొచ్చింది. (చదవండి: కంగనాను బెదిరించలేదు: సంజయ్ రౌత్) దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ గురించిన ప్రశ్నలు వేయడమే కాకుండా మెహర్ తారుర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘అవును.. పాకిస్తాన్లో ఇళ్లు, కార్యాలయాలు కూల్చివేయరు, కానీ ఇతర మతాలకు సంబంధించిన స్థలాలను, భవనాలను, ఆస్తులను కూల్చడానికి మాత్రం పాకిస్తాన్ ప్రజలు గుమికుడుతారు’, ‘నేషనల్ హీరోస్: దావుద్, హఫీజ్, సల్లవుద్దీన్, ఓసామా, ఇమ్రాన్ ఖాన్’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరో ట్విటర్ యూజర్ ‘పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు.. వారు చంపబడం లేదా అదృశ్యమవ్వడం’ అంటూ తారాపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా శివసేనకు, కంగనా మధ్య మాటాల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా కార్యాలయాన్ని నిన్న(బుధవారం) కూల్చివేసిన బీఎంసీ.. ఇది అనధికారిక నిర్మాణంగా పేర్కొంది. (చదవండి: కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) Dear Kangana, please fight your political/other battles without involving our country's name. In Pakistan, houses or offices of national heroes are not demolished. https://t.co/LmsmE8hymE — Mehr Tarar (@MehrTarar) September 9, 2020 -
బిగ్ బీకి జాబ్ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న ఆయన ఇకపై తనకు ఉద్యోగం దొరుకుందో లేదో అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందేహం వ్యక్తం చేశారు. అయితే 65 ఏళ్లపైబడిన వారు అవుట్ డోర్ షూటింగ్లో పాల్గొనేందు వీలు లేదని మహరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. దీంలో మహరాష్ట్ర ఉత్తర్వులను ఉద్దేశిస్తూ బిగ్‌బీ సరదాగా చేసిన ట్వీట్‌కు ఓ అభిమాని చమత్కరించాడు. (చదవండి: సరిదిద్దుకున్నా.. నన్ను క్షమించండి: బిగ్‌బీ) అమితాబ్‌కు ఉద్యోగ అవకాశం ఇస్తున్నట్లు ఓ ఆఫర్ లెటర్‌ను ఆయన పోస్టుకు ట్యాగ్ చేశాడు. దీనికి అమితాబ్.. ‘ఊహించని రీతిలో నాకు ఉద్యోగం వచ్చింది’ చూడండి అంటూ ఆ లేటర్‌ను పంచుకున్నారు. ఇందులో ‘‘ప్రియమైన మిస్టర్ అమితాబ్... కొన్ని కారణాల వల్ల ప్రత్యామ్నాయంగా మీకు ఉద్యోగం ఇచ్చేందుకు మీ దరఖాస్తు తాత్కాలికంగా సమీక్షలో ఉందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము’’ అని ఉంది. ఇటీవల బిగ్ బీతో పాటు మహమ్మారి బారిన పడిన ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ఆయన కోడలు, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యలు పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన విషయం తెలిసిందే. (చదవండి: కరోనాను జయించిన అభిషేక్) -
నెహ్రూకు ఠాగూర్ రాసిన లేఖ చూశారా!
సాక్షి, న్యూడిల్లీ: రవీంద్రనాథ్ ఠాగూర్ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు రాసిన లేఖను లోక్‌సభ సభ్యులు శశిథరూర్ శనివారం పంచుకున్నారు. నెహ్రూ బయోపిక్ తనని ఎంతగానో ఆకట్టుకుందంటూ ఠాగూర్ తన చేతితో రాసిన లేఖను శనివారం ట్విటర్ షేర్ చేసి నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేశారు. 1936 ఠాగూర్ తన చేతితో రాసిన లేఖ అని ఎంపీ తన పోస్టులో వెల్లడించారు. ‘1936లో నెహ్రూ ఆత్మకథ చదివిన తరువాత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ నెహ్రూకు ఇచ్చిన అసాధారమైన గమనిక ఇది’ అని ట్విటర్లో థరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టుకు ఇప్పటి వరకు దాదాపు 7 వేలకు పైగా లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఎంపీ పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాటి మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు థరూర్‌కు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఠాగూర్ రాసిన కొన్ని కవితలలోని ఫేమస్ కొట్స్ షేర్ చేస్తున్నారు. ‘ఈ రోజు వరకు ప్రపంచంలోని అత్యంత తెలివైన అసాధారమైన వ్యక్తి ఠాగుర్’, ‘అందుకే ఠాగూర్ మాటలలో, పనులలో మాస్టర్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ప్రియమైన జవహర్లాల్, నేను మీ గొప్ప ఆత్మకథ పుస్తకాన్ని చదవడం ముగించాను. మీ విజయానికి నేను మంత్రముగ్థుడినయ్యాను. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అంతేగాక మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మానవత్వపు లోతైన భావాల వైపు ఈ పుస్తకం నడిపిస్తుంది. ఇది వాస్తవాల చిక్కులను అధిగమించి మమ్మల్ని గొప్ప వ్యక్తి వైపుకు నడిపిస్తుంది. మీ రవీంద్రనాథ్ ఠాగూర్’’ అంటూ ఠాగూర్ రాసుకొచ్చిన ఈ లేఖ మే 31, 1936 నాటిదని ఎంపీ పేర్కొన్నారు. This was Gurudev Rabindranath Tagore’s note to Pandit Nehru after reading his autobiography in 1936. Extraordinary and exquisite. pic.twitter.com/46PtaVJixG — Shashi Tharoor (@ShashiTharoor) July 30, 2020 -
కంగనాకు సమీర్ సోని కౌంటర్
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో పెద్ద దుమారం రేగుతోంది. సుశాంత్ మరణంపై బాలీవుడ్ తారలంతా ఒకరిపై మరొకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే సుశాంత్ బలవన్మరణానికి నెపోటిజమే కారణమంటూ అతని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సైతం సుషాంత్ మరణాన్ని ఉద్దేశించి బాలీవుడ్లో నెపోటిజంపై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ నటుడు సమీర్ సోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపింది. సుషాంత్ మరణాన్ని చాలా మంది తమ వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారంటూ కంగనాను ఉద్దేశిస్తూ పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే అతడికి సుషాంత్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ మొదలవడంతో వెంటనే ఆ పోస్ట్ ని తొలగించి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. (చదవండి: ‘కరణ్ జోహార్‌ను అభిమానిస్తానని చెప్పలేదు’) ఆ పోస్ట్‌లో సమీర్.. “నేను ఇంతకు ముందే చెప్పాను. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక పెద్ద విషాదం. అతను న్యాయం పొందటానికి అర్హుడు. కానీ అతని మరణాన్ని తమ వ్యక్తిగత కక్షల పరిష్కారానికి ఉపయోగిస్తున్న ఎవరికైనా(కంగనాతో సహా) నేను వ్యతిరేకం. ఇది చాలా హేయమైన చర్య’’ అని ట్వీట్ చేశాడు. “మీ తుపాకీని చనిపోయిన వ్యక్తి భుజం మీద నుండి కాల్చడం మానేయండి’’ అని సమీర్ విమర్శించాడు. కంగనా ఇటీవల అర్నాబ్ గోస్వామికి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత సమీర్ ఈ పోస్టులు పెట్టాడు. ఆ షోలో ఆమె కొంతమంది బాలీవుడ్ నిర్మాతలైన మహేష్ భట్, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, తాప్సీ పన్నూ, స్వరభాస్కర్ వంటి వారిపై ఆరోపణలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత నెల జూన్ 14న ముంబైలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్యపై కంగనా జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి నిర్వహించిన షోలో మాట్లాడుతూ బాలీవుడ్‌పై మండిపడ్డారు. (చదవండి: అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది) View this post on Instagram Apologies and love to all. ❤️ A post shared by Samir Soni (@samirsoni123) on Jul 19, 2020 at 12:42pm PDT -
‘సుశాంత్‌ది ఆత్మహత్య కాదు..’
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతూ ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన కారణాలను తాను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ ట్వీట్లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్‌ది ఆత్మహత్య కాదంటూ #SSRCaseIsNotSuicide అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ కేసులో న్యాయం కావాలంటూ అభిమానులు.. సుశాంత్ కేసు ఆత్మహత్య కాదు అనే పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. (చదవండి: నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని...) Respected @AmitShah sir , I’m sushants Singh Rajputs girlfriend Rhea chakraborty,it is now over a month since his sudden demise I have complete faith in the government, however in the interest of justice , I request you with folded hands to initiate a CBI enquiry..part 1 .. — Rhea Chakraborty (@Tweet2Rhea) July 16, 2020 రియా ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తూ... ‘ఓకే మిస్ రియా మీరు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ అని చెబుతున్నారు. అది మేము ఎందుకు నమ్మాలి! ముంబై పోలీసులు సుశాంత్ ఆత్మహత్య అంటున్నారు. బాలీవుడ్ కూడా ఇది ఆత్మహత్యే అనుకుంటుంది. అలాగే నువ్వు కూడా ఇది ఆత్మహత్య అనే అనుకుంటున్నావు కదా! కానీ #SSRCaseIsNotSuicide మాకు న్యాయం కావాలి’ అలాగే ‘సుశాంత్ ఇంటర్య్వూల్లో కూడా స్పష్టం తెలుస్తోంది. బాలీవుడ్‌లోని నెపోటిజం వల్లే తనని చాలా సినిమాల నుంచి తొలగించారని. అయినప్పటికీ సుశాంత్ నటనపై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేదు. అయితే ఇది ఇంకా ఆత్మహత్య అని ప్రజలను మభ్యపెట్టడం మానేయండి’ #SSRCaseIsNotSuicide, ‘సుశాంత్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాము’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
మాధవన్ టెన్త్ మార్కులు తెలుసా!
మార్కులు అనేవి జీవిత ఆశయాలను వెనక్కి తగ్గించలేవంటూ విద్యార్థులకు హీరో ఆర్ మాధవన్ ట్విటర్ ద్వారా సందేశం ఇచ్చారు. బుధవారం సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాధవన్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. అలాగే తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందొద్దంటూ మ్యాడీ తన 10వ తరగతి మార్కులను ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘సీబీఎస్సీ బోర్టు వెల్లడించిన ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికి అభినందనలు. నాకు 10వ తరగతిలో 58 శాతం మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందకండి. ఎందుకంటే ఆట అప్పుడే మొదలు కాలేదు మిత్రులారా’ అంటూ గురువారం ట్వీట్ చేశాడు. (చదవండి: చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..) To all those who just got their board results— congratulations to those who exceeded their expectations and aced it . 👌👌👍👍.. and to the rest I want to say I got 58% on my board exams.. The game has not even started yet my dear friends ❤️❤️🤪🤪🚀😆🙏🙏 pic.twitter.com/lLY7w2S63y — Ranganathan Madhavan (@ActorMadhavan) July 15, 2020 అది చూసిన నెటిజన్లు మాధవన్‌కు మద్దతునిస్తున్నారు. ‘జీవితంలో అద్భుతాలు చేయడానికి మీ పోస్టు ప్రేరణ’ ‘మార్కులు కేవలం సంఖ్యలు మాత్రమే... పెద్ద సంఖ్య భవిష్యత్తులో దేనికీ హామీ ఇవ్వదు, తక్కువ సంఖ్యతో జీవితం అంతం కాదు.. వీటిని కేవలం మార్కులు గానే చూడాలి. ఇవి కేవలం మార్కులే’ ‘మీరు జీవితంలో ఎదగాలంటే మార్కులు కాదు ముఖ్యం తెలివి, అణకువ, విలువలు, కష్టపడి పనిచేయడం ఉంటే జీవితంలో అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (చదవండి: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల) -
‘ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారు సల్మాన్’
ముంబై: మీరు ఎందుకు అంతగా ఓవరాక్షన్ చేస్తున్నారంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై యంగ్ హీరో సుశాంత్ సింగ్ అభిమానులు, నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో భాయిజాన్ పన్వెల్‌లోని తన ఫాంహౌజ్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ తన ఫాంలో వ్యవసాయం చేస్తున్నట్లుగా ఒళ్లంతా మట్టితో ఉన్న ఫొటోను బుధవారం ట్విటర్లో షేర్ చేశాడు. రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘రైతులందరికి గౌరవం ఇవ్వండి’ అనే క్యాప్షన్‌ను తన ట్వీట్‌కు జత చేశాడు. ఇక అది చూసిన నెటిజన్లు సల్మాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫొటోను జూమ్ చేసి ‘మీరు ముఖంపై మట్టిని రుద్దారు.. కానీ కాళ్లకు రుద్దడం మరచిపోయారు. ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు’ అంటూ ఓ నెటిజన్ భాయిజాన్‌ను ట్రోల్ చేశాడు. (చదవండి: సల్మాన్, కరణ్‌లపై పిటిషన్ కొట్టివేత) You rubbed mud in your face but forgot your legs! Itna Overacting mat kar!@TeamKangna #SushantSinghRajput #KanganaRanaut pic.twitter.com/40Uuwb4rEj — Tandav (@heavensbutcher) July 14, 2020 దీంతో మరి కొంతమంది నెటిజన్లు కూడా అతడికి మద్దతునిస్తూ.. ‘‘నేను చాలామంది రైతులను చుశాను.. కానీ వారి ముఖంపై ఎప్పుడు బురదను చూడలేదు’, ఫొటో కోసమే మట్టిని రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఇదంతా అవసరమా’’ అంటూ సల్మాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా భాయిజాన్ ప్రస్తుతం ప్రభుదేవ దర్శకత్వంలో వస్తున్న ‘రాధే’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 2020 రంజాన్‌కు ఈ సినిమాను విడుదల చేయలనుకున్నప్పటికీ కరోనా కారణంగా ఆ సినిమా విడుదల వాయిదా పడింది. కరోనాను అరికట్టెందుకు మార్చిలో విధించిన లాక్డౌన్ నుంచి సల్మాన్ పన్వెల్‌లోని తన ఫాం హౌజ్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫాంలో హీరోయిన్ జాక్వెలిన్ ఫర్నాండేజ్‌తో కలిసి చేసిన ‘తేరే బినా’ అల్భంలోని రెండు రోమాంటిక్ పాటలను ఇటీవల విడుదల చేశాడు. (చదవండి: సల్మాన్ ట్వీట్: విమర్శలు గుప్పించిన సింగర్!) -
కెమిస్ట్రీలో 24 మార్కులే.. ఐఏఎస్ ట్వీట్ వైరల్
గాంధీనగర్: ‘మార్కులే జీవితం కాదు.. వందేళ్ల నీ జీవితాన్ని వంద మార్కులు నిర్ణయించలేవు’ వంటి మాటలు చాలాసార్లు వినే ఉంటాం. కానీ వాస్తవంగా పరిస్థితులు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. సమాజంలో దాదాపు 99శాతం ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, జీవితాన్ని అంచాన వేస్తారు. బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సాధారణంగా ఐఏఎస్ అయ్యాడంటే చాలా తెలివితేటలు.. చదువులో టాప్ అనే భావం మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఈ ఐఏఎస్‌ను చూస్తే ఆ ఆలోచనలన్ని పటాపంచలవుతాయి. ఎందుకంటే ఈ అధికారి ఇంటర్ రసాయన శాస్త్రంలో కేవలం 24 మార్కులు తెచ్చుకుని జస్ట్ పాసయ్యాడు అంతే. అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్ స్మార్ట్ సిటీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న నితిన్ సంగ్వాన్ తన సీబీఎస్ఈ ఇంటర్ మార్క్స్ మెమోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షల్లో నాకు కెమిస్ట్రీలో 24 మార్కులే వచ్చాయి. పాస్ మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చింది. అయితే నా జీవితంలో నేను ఏం కావాలనుకుంటున్నానో ఈ మార్కులు నిర్ణయించలేదు. అందుకే మార్కుల భారాన్ని పిల్లల మీద మోపి వారిని బాధ పెట్టకండి. బోర్డు ఫలితాల కంటే జీవితం చాలా విలువైనది. రిజల్ట్ అనేది ఆత్మపరిశీలనకు అవకాశంగా భావించండి.. విమర్శించడానికి కాదు’ అంటూ ట్వీట్ చేశారు నితిన్. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. In my 12th exams, I got 24 marks in Chemistry - just 1 mark above passing marks. But that didn't decide what I wanted from my life Don't bog down kids with burden of marks Life is much more than board results Let results be an opportunity for introspection & not for criticism pic.twitter.com/wPNoh9A616 — Nitin Sangwan, IAS (@nitinsangwan) July 13, 2020 -
30 ఏళ్లుగా 15 మైళ్లు నడుస్తూ..
తమిళనాడు: దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు. అతడి పేరు డి శివన్. తమిళనాడులో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు ఉత్తరాలు చేరవేయడానికి అతడు దట్టమైన అడవి, జలపాతాల గుండా 15 మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆయన క్రూర మృగాల దాడులను కూడా ఎదుర్కొన్నాడు. ఆయినా బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లీ తన విధులను నిర్వర్తించాడు. Postman D. Sivan walked 15 kms everyday through thick forests to deliver mail in inaccessible areas in Coonoor.Chased by wild elephants,bears, gaurs,crossing slippery streams&waterfalls he did his duty with utmost dedication for 30 years till he retired last week-Dinamalar,Hindu pic.twitter.com/YY1fIoB2jj — Supriya Sahu IAS (@supriyasahuias) July 8, 2020 ప్రస్తుతం శివన్ పదవి విరమణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్‌ను ప్రశసింస్తూ ఐఏస్ అధికారి సుప్రియా సాహు బుధవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ ట్వీట్‌కు వేల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్ వచ్చాయి. నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేసిన శివన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతున్నారు. ‘దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది... అతని నిబద్ధతకు అభినందనలు’, ‘అతను పద్మ పురస్కారానికి అర్హుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
టిక్‌టాక్ బ్యాన్: వార్నర్‌ను ట్రోల్ చేసిన అశ్విన్
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించడంతో టిక్‌టాక్ స్టార్లపై ఫన్నీ మిమ్స్ క్రియోట్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కూడా ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున్న భారత్ ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ట్వీట్‌ను అశ్విన్ షేర్ చేస్తూ వార్నర్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి ‘అప్పో అన్వర్?’ అంటూ కన్ను కొడుతున్న ఎమోజీని జత చేశాడు. (వార్నర్ ‘మైండ్ బ్లాక్’ అదిరింది కానీ..) Appo Anwar? @davidwarner31 😉 https://t.co/5slRjpmAIs — Ashwin (During Covid 19)🇮🇳 (@ashwinravi99) June 29, 2020 వార్నర్‌ను ట్రోల్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వార్నర్ బాధపుడుతున్న ఓ ఫొటోకు ‘ఒకేసారి ఫ్యాన్స్‌ను కోల్పోయినప్పుడు’, ‘ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ను ఎప్పుడు నిషేధిస్తుందా అని వేయిటింగ్’ అంటూ ఫన్నీ మిమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా లాక్డౌన్లో డేవిడ్ వార్నర్ తన భార్య పిల్లలతో కలిసి టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసిన వీడియోలను షేర్ చేస్తుండేవాడు. అవి బాగా వైరల్ అవుతుండటంతో టిక్‌టాక్‌లో 4.8 ఫాలోవర్స్‌ను సంపాదించి వార్నర్ టిక్‌టాక్ స్టార్ కూడా అయ్యాడు. (వార్నర్ మరో టిక్‌టాక్.. ఈ సారి బాహుబలి) When you lose your entire audiece in a day!#TikTok #59Chineseapps #59chinese #DavidWarner pic.twitter.com/EvFCsajhGg — hitesh makwaney (@Chill_Sergeant) June 29, 2020 -
‘సుశాంత్ మరణాన్ని ముందే ఊహించా’
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబాన్ని కలిసేందుకు పట్నా వెళుతున్నట్లు టెలివిజన్ హోస్ట్, నటుడు శేఖర్ సుమన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. సోమవారం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సుశాంత్ తండ్రిని కలిసేందుకు నా స్వస్థలమైన పట్నాకు వెళ్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు కూడా సుశాంత్ మృతిపై స్పందిస్తూ ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించాను అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: సీబీఐ విచారణకు ఫోరం) ‘‘సుశాంత్ ఆత్మహత్యను నేను ముందుగానే ఊహించాను. అతడు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలా అని సుశాంత్‌ది సాధారణ మరణమని ఎవరూ భావించకండి. దీని వెనక చాలా పెద్ద కారణం ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలి. సుశాంత్‌కు న్యాయం జరిగేవరకు పోరాడదాం’ అంటూ ఆయన ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. కాగా జూన్ 14 సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడి మరణానికి బాలీవుడ్ పేరుకుపోయిన బంధుప్రీతి(నెపోటిజం) కారణమంటూ స్టార్‌కిడ్స్, ప్రముఖ దర్శకనిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతేగాక స్టార్‌కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుపునిస్తున్నారు. (సుశాంత్ మృతి మీకు వేడుకలా కనిపిస్తోందా!) Im going to my hometown Patna to meet Sushant's father and pay my respect to him and the CM Shri Nitish Kumar and all the admirers and fans of Sushant to press upon #CBIEnquiryForSushant #justiceforSushantforum @NitishKumar — Shekhar Suman (@shekharsuman7) June 28, 2020 -
‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’
ముంబై: సినీ రచయిత చేతన్ భగత్ ఐదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మోహిత్ సూరి దర్శకత్వంలో వస్తున్న ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లీడ్రోల్లో నటించబోతున్నాడు. ఇది చాలా సంతోషంగా ఉంది’ అంటూ 2015లో చేతన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చివరికి ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కావాలనే ఈ సినిమా నుంచి సుశాంత్‌ను తొలగించారంటూ దర్శకుడిపై, అర్జున్ కపూర్, బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో బంధుప్రీతి(నెపొటిజం) కారణంగా సుశాంత్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి తొలగించి స్టార్కిడ్ అయిన అర్జున్ను తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. (జస్టిస్ ఫర్ సుశాంత్) So happy to share @itsSSR will play lead in @mohit11481 directed Half Girlfriend. Shooting begins 1Q16. https://t.co/dUHSVZ2FQ5 — Chetan Bhagat (@chetan_bhagat) November 7, 2015 అంతేగాక ఈ సినిమాలో అర్జున్ నటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘బాలీవుడ్లో బంధుప్రీతి(నెపోటిజమ్) ఎంతగా పేరుకుపోయిందో చూశారా. సుశాంత్‌ను తొలగించి అదిత్య రాయ్... రణ్‌వీర్‌లు.. లెజెండరి నటుడు అర్జున్ కపూర్లు సినిమా అవకాశాలు పొందారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిందా లేదా అన్యాయంగా సుశాంత్‌ను తొలగించడం వల్ల జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ ఇప్పటికైనా సుశాంత్‌కు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే భవిష్యత్తులో మరికొందరు సుశాంత్‌లను పొగొట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాలీవుడ్ స్టార్‌కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలని ఇకపై వారి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిస్తున్నారు. (సుశాంత్ ఫైనల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్) -
గర్ల్ ఫ్రెండ్‌ను కలవాలంటూ నటుడికి ట్వీట్!
ముంబై: లాక్డౌన్లో తన ప్రియురాలిని కలుసుకునేందుకు సోషల్ మీడియాలో సహాయం కోరిన ఓ నెటిజన్‌కు నటుడు సోనూ సూద్ ఇచ్చిన సమాధానం నెట్టింట నవ్వులు పూయిస్తుంది. కాగా లాక్డౌన్లో వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వేళ్లేందు ఆయన రవాణ సౌకర్యం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన సాయం కోరిన వారికి ఆయన స్పందిస్తూ సహాయక చర్యలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ వ్యక్తి బీహార్‌లో ఉన్న తన ప్రియురాలి దగ్గరి పంపించు భయ్యా అంటూ ట్విటర్ వెధికగా కోరాడు. అది చూసిన సోనూ స్పందిస్తూ.. ‘భయ్యా.. కొన్ని రోజులు నీ ప్రేమకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ నిజమైన ప్రేమకు ఇది పరీక్ష’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. (సోనూసూద్.. నువ్వు రియల్ హీరో’) ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన హాస్య చతురతకు అభిమానులు ఫిదా అవుతూ తమ స్పందనను తెలుపుతున్నారు. కాగా కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ముంబైలో చిక్కుక్ను కర్ణాటక వలస కూలీల కోసం ఆయన 10 బస్సులను నియమించి వారిని తమ ఊళ్లకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది తమకు సాయం చేయాలంటూ సోనూ సుద్ను ట్విటర్ ద్వారా సంప్రదిస్తున్నారు. వారి ట్వీట్లకు వ్యక్తిగతంగా స్పందించడమే కాకుండా వారికి సహాయక చర్యలు అందిస్తూ.. సోనూ సుద్ తన ఉదారతను చాటుకుంటున్నాడు. (నెటిజన్‌కు.. దిమ్మ తిరిగే సమాధానం) -
మేమిద్దరం ఒకేలా ఉంటాం: కోహ్లి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు మైదానంలో పత్యర్థులుగా.. వెలుపల మంచి స్నేహితులుగా ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక మ్యాచ్ మధ్యలో వీలు చిక్కినప్పుడల్లా వీరిద్దరూ సంభాషించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో విరాట్, విలియమ్సన్తో కలిసి ఉన్న ఫొటోను శుక్రవారం ట్విటర్లో షేర్ చేశాడు. ‘మా మధ్య సంభాషణ ఆసక్తిగా ఉంటుంది. అది ఇష్టపడతాను. మీరు కూడా ఇష్టపడండి. విలియం మంచి వ్యక్తి’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా 2019 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్లో భారత్-న్యూజిలాండ్‌లు తలపడిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ ఓడి ఇంటిదారి పట్టింది. (కోహ్లి కన్నా సచిన్ గొప్ప ఆటగాడు: గంభీర్) Love our chats. Good man. pic.twitter.com/LOG62xQslM — Virat Kohli (@imVkohli) May 22, 2020 కాగా.. మ్యాచ్ అనంతరం కోహ్లి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోవిలియమ్సన్ గురించి అడగ్గా.. ‘కేన్.. నేను ఒకేలా మాట్లాడతాం, ఒకేలా ఆలోచిస్తాం, అంతేకాదు మా మనస్తత్వాలు కూడా ఒకేలా ఉంటాయి. ఇది నిజంగా అద్భుతం. వివిధ దేశాలకు చెందిన మేము ఒకేలా ఆలోచిండం, ఒకే బాషలో మాట్లాడుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరికి సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే విరాట్, విలియమ్సన్‌లు 2008 అండర్-19 టోర్నమెంట్ సమీ ఫైనల్లో పత్యర్థులుగా తలపడ్డారు. అప్పుడు భారత్ జట్టుకు విరాట్ కెప్టెన్ కాగా.. న్యూజిలాండ్‌కు విలియమ్స్‌న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో పార్ట్‌టైం బౌలర్‌గా వ్యవహరించిన కోహ్లి.. పత్యర్థులను తన బౌలింగ్‌తో కట్టడి చేసి జట్టును గెలిపించాడు. అండర్-19లో కోహ్లి బ్యాట్సమన్‌గా, బౌలర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచి అంతార్జాతీయ స్థాయికి ఎదిగాడు. (‘ప్రపంచ క్రికెట్లో వారిద్దరే అత్యుత్తమం’) -
‘ఆత్మ నిర్భర్’ ఫన్నీ మీమ్స్ వైరల్
లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన తర్వాత ఓ పదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆత్మ నిర్భర్’ అంటే అర్థం ఏంటో చెబుతూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్’ అంటే ‘స్వయంగా వంట చేసుకోవడం’ ‘మన పని మనం చేసుకోవడం’ అంటూ కొంత మంది కామెంట్స్ చేయగా.. మరికొందరూ ‘కొడుకును ఓ తల్లి నువ్వు పెళ్లి ఎప్పడూ చేసుకుంటావ్ అని అడిగిన ప్రశ్నకు.. కొడుకు అమ్మ నేను అత్మనిర్భర్’ అని బదులు ఇచ్చినట్లుగా నెటిజన్లు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరోక ట్విటర్ యూజర్ ‘నేను నా పబ్జీ పేరు ఆత్మనిర్భర్‌గా మారుస్తాను.. ఇప్పుడు చూడండి నా బృందం నాకు మద్దతు ఇవ్వదు’ అంటూ సరదాగా కొత్తకొత్తగా అర్థాలు వెతుకుతున్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) Meet Pandiyan, he has trained himself to pee in the pot. And has been working hard to be atmanirbhar much before Modiji came along & made it trend. Pandiyan's atmanirbharta is of as much consequence as today's speech. pic.twitter.com/RpdDNXChsV — Manisha (@ManiFaa) May 12, 2020 ఇక ‘మా పెంపుడు పిల్లి పాండియన్‌ను చూడండి. అది టాయిలేట్ వస్తే బాత్రూంకు వెళ్లడానికి శిక్షణ తీసుకుంది. అంటే ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్’గా ఉండాలని చెప్పక మునిపే పాండియన్ ‘ఆత్మనిర్భర్’గా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో అర్థాలు వెతుకుతున్నారు. కాగా దేశ వ్యాపంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆత్మ విశ్వాసం, ఆత్మ బలంతో ప్రజలు ఉండటమే కాకుండా ‘ఆత్మ నిర్భర్ భారత్’ అనేది దేశ ప్రజల నినాదం కావాలని ఆయన పిలుపునిచ్చారు. Mom : son when will you marry ?? Son : mom , I am #Atmanirbhar !! pic.twitter.com/G3Xvc7cWEy — Last Man Standing RELUCTANT_ECONOMIST (@Mnomics_) May 12, 2020 -
వైరల్: ‘ఎవరూ ఇలా ఆలోచించి ఉండరు’
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ ఓ వ్యక్తి వినూత్నంగా పాలు పంపిణీ చేస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఐఏఎస్ అధికారి నితిన్ సవాంగ్ శుక్రవారం షేర్ చేశారు. ఈ ఫొటోకు ‘ఈ వ్యక్తి కరోనా నుంచి తనను మాత్రమే సురక్షితంగా ఉంచడమే కాకుండా ఇతరులను కూడా మహమ్మారి నుంచి సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించిన తీరు ప్రశంసనీయం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేగాక ‘‘మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ ఇంట్లోనే ఉండటం, మాస్క్‌లు ధరించడం, చేతులకు గ్లౌజ్‌లు ధరించడం చేస్తున్నారు. కానీ ఇతడిలా ఏ ఒక్కరూ కూడా ఆలోచించి ఉండరు’’ అంటూ రాసుకొచ్చారు. (ఇర్ఫాన్ విషయంలో పెద్ద తప్పు చేశా: నటుడు) Good to see that some people go extra mile to keep themselves and others safe. Let's do basic minimum things of staying at home, wearing mask and keeping social distance even if we cannot go an extra mile like this innovative milkman. pic.twitter.com/RrjYVtdaKW — Nitin Sangwan, IAS (@nitinsangwan) May 7, 2020 ఈ ఫొటోలో ఆ వ్యక్తి తన మోటారు సైకిల్‌పై పాలు పంపిణీ చేస్తున్నాడు. అతను చేతులకు గ్లౌజ్‌లు, మొహనికి మాస్క్‌లు, ధరించడమే కాకుండా తన కస్టమర్ల నుంచి భౌతిక దూరం పాటించడానికి వినూత్న ఆలోచన చేశాడు. తన మోటరు సైకిల్ పోడవైన పైపును అమర్చి చేసి వినియోగదారులకు పాలు పోయడానికి ఉపయోగించిన అతని ఆలోచనకు నెటిజన్లంతా ఫిదా అవుతన్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్లో వివిధ పరిశ్రమలు, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం నిత్యవసర సేవలకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. (పెళ్లిపై స్పందించిన సల్మాన్ ప్రియురాలు!) -
వైరల్ ట్వీట్‌పై సానియా మీర్జా వివరణ
సాక్షి, హైదరాబాద్ : భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టీ 20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా వైరల్ అయిన తన ‘జోరు కా గులాం’ (భార్యా దాసుడు) ట్వీట్‌పై గురువారం వివరణ ఇచ్చారు. ఆస్ర్టేలియాతో భారత్ తలపడిన ఆ మ్యాచ్‌కు ఆస్ర్టేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వన్డే మ్యాచ్‌కు డుమ్మా కొట్టి మరీ తన భార్య, మహిళా క్రికెట్ స్టార్ హీలీ కోసం టైటిల్ పోరును వీక్షించేందుకు రావడంపై సానియా ఈ ట్వీట్ చేశారు. మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్‌కు హాజరవడంపై అందరి ప్రశంసలు అందుకున్నారు. సానియా సైతం స్టార్క్ తీరును కొనియాడుతూ ఇక ఆయనను భార్యాదాసుడు అంటారని చమత్కరించారు. కాగా, ఈ ట్వీట్‌పై భారత మహిళా క్రికెటర్లు రోడ్రిగ్స్, స్మృతి మంథానాలతో యూట్యూబ్ చాట్ షోలో సానియా ముచ్చటించారు. ఇది తాను సరదాగా చేసిన ట్వీట్ అని, తాను..అనుష్క ఈ ప్రభావానికి గురయ్యామని చెప్పుకొచ్చారు. తమ భర్తలు రాణిస్తే అది వారి ప్రతిభగా గుర్తిస్తారని..వారు సరిగ్గా రాణించని సందర్భాల్లో దానికి తాము కారణమని నిందిస్తారని సానియా అన్నారు. వారు అలా ఎందుకు అంటారో తనకు అర్ధం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మనం జోక్ అని చెప్పుకున్నా..లోతైన విషయం ఉందని అన్నారు. మహిళను బలహీనతగా సమాజం చూపుతుందని..బలంగా భావించదని అన్నారు. చదవండి : కోహ్లి, సానియాకు చాలెంజ్ విసిరిన సింధు అతడు తన భార్య, గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నాడా అయితే అతడు పరధ్యానంగా ఉంటాడు..ఎందుకంటే ఆమెతో డిన్నర్‌కు వెళుతుంటాడు అనే ధోరణిలో మాట్లాడతారని..ఇది అర్థంపర్థం లేని అవగాహన అని మండిపడ్డారు. స్టార్క్ మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు తన భార్య కోసం వెళ్లినప్పుడు అందరూ అతడిని ప్రశంసించారని గుర్తుచేశారు. షోయబ్ తన కోసం అలా చేశాడని తాను చెబితే ప్రపంచం బద్దలైనట్టు భావిస్తారని చెప్పుకొచ్చారు. అందుకే స్టార్క్‌ను అలా సంబోధించానని, అతను మహిళా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లేంతగా భార్యకు దాసోహం అయ్యాడని ముద్ర వేస్తారని తాను అలా చమత్కరించానని సానియా పేర్కొన్నారు. -
‘ఈ జంట కటిఫ్ చెప్పేసుకున్నట్టేనా?!’
బాలీవుడ్ భామ అతియా శెట్టి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో చూసి నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఇటీవల అతియా థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేశారు. ‘‘కలగా ఉంది’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటోలో అతియా రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను క్రాప్ చేశారు. ‘ఎందుకు రాహుల్‌ను ఫొటో నుంచి తీసేశారు’ ‘రాహుల్‌ను దూరం పెట్టారా’ ‘వీరిద్దరూ కటిఫ్ చెప్పేసుకున్నారా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (గర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వని రాహుల్) కాగా అతియా, రాహుల్‌లు ఇటీవల థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఈ జంట సందడి చేస్తున్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అదే ఫొటోను ఈ భామ మళ్లీ షేర్ చేస్తూ.. రాహుల్‌ను క్రాప్ చేసింది. దీంతో నెటిజన్లు పక్కనే రాహుల్ ఉన్నాడన్న విషయాన్ని పట్టేశారు. కాగా రాహుల్, అతియాలు ప్రేమించికుంటున్నట్లు బి-టౌన్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి కాఫీ షాపులకు, పార్టీలకు చేట్టాపట్టేలుసుకు తిరుగుతుండంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ గతేడాది వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎప్పడూ ఈ జంట మాట్లాడకపోవడం గమనార్హం. అయితే ఇటీవల ఈ జంట తమ బర్త్‌డే విషెష్లను సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చెప్పుకోవడం చూసి అభిమానుల, నెటిజన్లు వీరి రిలేషన్‌ను అధికారింగా ప్రకటించేశారంటూ అభిప్రాయ పడ్డారు. (చొక్కా ఎక్స్చేంజ్ చేసుకున్నారా?) View this post on Instagram feels like a dream ago 🪐 A post shared by Athiya Shetty (@athiyashetty) on May 5, 2020 at 9:15am PDT -
‘బాయ్స్ లాక్ రూం’పై పోలీసుల ట్వీట్
ముంబై: బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొట్టేలా కొంతమంది యువకులు ‘బాయ్స్ లాకర్ రూం’ పేరిట గ్రూప్‌లో సంభాషించిన ఓ ఆడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఆ గ్రూప్ సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సదరు యువకుల చర్యను ఖండిస్తూ ముంబై పోలీస్ ఓ సందేశం ఇచ్చారు. అంతేగాక అమ్మాయిలను మానసికంగా, లైంగికంగా వేధించే విధంగా వారి సంభాషణ ఉండటంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘బాయ్స్ లాక్ ఎర్రర్’?.. ఇక్కడ మహిళలను అగౌరవ పరిచే స్థలం లేదు" అంటూ ట్విటర్లో షేర్ చేశారు. దీనికి ‘‘పురుషుడు ఎప్పటికీ పురుషుడే. వీరిని ఎప్పటికీ క్షమించరాదు. ఇక ముందు కూడా ఇలాంటి వారు రాకుండా ఉండాలంటే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో వారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. (పోలీసుల అదుపులో ‘బాయ్స్ లాకర్ రూం’ సభ్యుడు) Boys will be boys - never an acceptable excuse earlier, will never be one ever after #StopThemYoung pic.twitter.com/sJx7nFOy4P — Mumbai Police (@MumbaiPolice) May 4, 2020 కాగా ఆ బాలుర చర్యను వ్యతిరేకిస్తూ మహిళలకు మద్దతుగా నిలిచిన ముంబై పోలీసులపై వివిధ రకాలుగా తమ స్పందనలను తెలుపుతూ నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ఢిల్లీ మహిళా సంఘం చీఫ్ కమిషనర్ స్వాతి మాలివాల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఢిల్లీ పోలీసులకు మే 4న నోటిసులు జారీ చేస్తూ.. మే 8 నాటికి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నోటిసులో ‘‘బాయ్స్ లాకర్ రూం’’ అనే పేరుతో కొంతమంది పాఠశాల బాలురు మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలని రెచ్చగొడుతూ చట్ట విరుద్దమైన చర్యలకు పాల్పడ్డారు. వీరిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె నోటీసులో పేర్కొన్నారు. (అశ్లీల ఫొటోలు షేర్ చేసి.. విపరీత వ్యాఖ్యలు) -
ఆర్జీవీ ట్వీట్.. మండిపడ్డ సింగర్!
మద్యం కొనుగోలు చేసే మహిళలు గృహ హింసపై ఫిర్యాదు చేయడానికి అనర్హులంటూ వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోమవారం ట్వీట్ చేశాడు. లాక్డౌన్ దేశంలో పేరుగుతున్న గృహ హింస కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి మద్యం దుకాణాల ప్రారంభానికి అనుమతించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహిళలపై గృహ హింస కేసులు పెరిగిన క్రమంలో ప్రభుత్వం మద్యం దుకాణాల తెరిస్తే ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని, అంతేగాక దీని ప్రభావం కుటుంబ సభ్యులపై, పిల్లలపై తీవ్రంగా చూపుతుందని వారు ధ్వజమెత్తారు. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. వైన్ షాపుల ఎదుట మహిళలు వరుసలో నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం’’ అంటూ తనదైన శైలిలో ఆర్జీవీ ట్వీట్ చేశాడు. (రంగోలికి సోనా మద్దతు.. సెలబ్రిటీల ఫైర్!) Dear Mr RGV,time for u to get into the line of people who desperately need a real education.1 that lets u understand why this tweet of yours reeks of sexism & misplaced morality.Women have a right to buy & consume alcohol just like men. No one has a right to be drunk & violent. https://t.co/5AUcTrAJrZ — ShutUpSona (@sonamohapatra) May 4, 2020 ఇక ఆర్జీవీ ట్వీట్‌కు బాలీవుడ్ సింగర్ సోనా మోహపత్రా స్పందిస్తూ.. ‘‘డియర్ మిస్టర్ ఆర్జీవీ. అసలైన విద్యావంతులు ఎలా ఉండాలని నేర్పించే వ్యక్తుల వరుసలో మిమ్మల్ని ఈ ట్వీట్ చేరుస్తుంది. మీ ట్వీట్ ఎందుకు సెక్సిజం, నైతికత రీక్స్ అర్థానికి వీలుగా ఉంది. మహిళలకు, పురుషుల మాదిరిగా మద్యం కొనుగోలు, మద్యం సేవించే హక్కు ఉంది. అయితే మద్యం సేవించాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు’’ అంటూ ఆర్జీవీపై ఆమె మండిపడ్డారు. కాగా మే 4 నుంచి లాక్డౌన్ మరోసారి పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా లాక్డౌన్ మూడవ దశలో కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ఇందులో మద్యం, పాన్, పొగాకు అమ్మకాలకు కూడా అనుమతించింది. అయితే మద్యం షాపులు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్, నటి మలైకా అరోరా, రవీణా టాండన్‌లు వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. (వైన్ షాపుల మూతపై వర్మ ట్వీట్) -
ఫేస్బుక్ కొత్త ఎమోజీ.. ఫన్నీ మీమ్స్ వైరల్
ఫేస్బుక్లో కొత్తగా వచ్చిన కేరింగ్ ఎమోజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్‌గా మారింది. ఈ ఎమెజీ వచ్చినప్పటి నుంచి నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ్యవాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రజలు రోజంతా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో వారి స్నేహితులతో, సన్నిహితులతో చాట్ చేస్తూ తమ భావాలను ఎమోజీల ద్వారా వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రేమ, చిరునవ్వు, బాధ, కోపం, అలగడం వంటి భావాలను తెలపడానికి వాట్సప్, ఫేస్బుక్లో ఇప్పటికే ఆరు ఎమోజీలు ఉన్న విషయం తెలిసిందే. (ఫేస్బుక్లో కొత్త ఎమోజీ... వివరాలు మీకోసం!) "Mask off" on the Facebook "Care Emoji"? It was actually the Uncle Fester Emoji the whole time! pic.twitter.com/8EBzkw5U7V — Parallax Views w/ J.G. Michael (Podcast) (@ViewsParallax) May 3, 2020 అయితే ఇప్పడు కొత్తగా లాక్డౌన్లో మన వారిని జాగ్రత్తగా ఉండమని చెబుతూ వారిపై మనకు ఉన్న బాధ్యతను తెలియపరచడానికి ఇటీవల ‘కేరింగ్’ ఎమోజీని ఫేస్బుక్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రేమ, చిరునవ్వులతో హృదయాన్ని హత్తుకుని ఉన్న ఎమోజీకి కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుంటే మరికొందరు ‘ఫేస్బుక్ కేరింగ్ ఎమోజీని షేర్ చేస్తుంటే.. అది లేని వారి రియాక్షన్ ఎలా ఉంటుంది’ ‘ఈ కేరింగ్ ఎమోజీ కోసం నా ఫేస్‌బుక్‌ను ఆప్డేట్ చేస్తూనే ఉన్నాను.. కానీ అది రావడం లేదు’ అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి ట్విటర్లో షేర్ చేస్తున్నారు. కాగా ఈ ఎమోజీని విడుదల చేస్తున్నట్లు కమ్మూనికేషన్ మేనేజర్ అలెగ్జాండ్రూ వోయికా ఏప్రిల్‌లో ట్వీట్ చేశాడు. ‘‘మేము కొత్తగా కేరింగ్ ఎమోజీని ఫేస్బుక్, మెసెంజర్లో విడుదల చేస్తున్నాము. ఈ విపత్కర కాలంలో దూరంగా ఉన్న మీ వాళ్లపై ప్రేమను పంచుకునేందుకు ఈ ఎమోజీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశాడు. -
జావేద్ ట్వీట్.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు!
బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెటింటా తెగ హల్చల్ చేస్తోంది. కేవలం ‘ఎమ్(M)’ లేటర్‌ను మాత్రమే షేర్ చేసి.. నెటిజన్లను అయోమయంలో పాడేశారు జావేద్. నెటిజన్లు దానికి అర్థం ఏంటో తెలిక తల బాదుకుంటున్నారు. ఇందులో ఎమైనా పజిల్ దాగుందేమోనని వారంతా మెదడుకు పదును పెడుతుంటే.. మరి కొంతరూ అదేంటో తెలుసుకొవడాని ఉత్సుకత చూపుతున్నారు. ('అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?') M — Javed Akhtar (@Javedakhtarjadu) April 21, 2020 ‘దీనికి అర్థం ఏంటీ అక్తర్ సార్’ అంటూ ఆయనకే ఎదురు ప్రశ్నలు వెస్తుంటే.. మరికొందరు ‘ఎమ్(M) తర్వాత వచ్చే ఆల్ఫాబేట్స్ను రీట్వీట్ చేస్తున్నారు. ఇక ఒకే సింగిల్ లేటర్‌ను షేర్ చేసిన ఆయన తీరు చూస్తుంటే లాక్డౌన్లో ఇంట్లో ఖాళీగా ఉన్న వారికి కాస్తా కాలక్షేపం ఇచ్చేందుకు ఇలా ట్వీట్ చేసుంటారని అభిప్రాయ పడుతున్నారు. -
రంగోలి ట్విటర్ బ్లాక్; ఖండించిన సింగర్
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విటర్ ఖాతా తొలగింపుపై బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. గాయని సోనా మోహపత్రా మాత్రం దానిని ఖండించారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కంగనా ఆమె సోదరి రంగోలిలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే హక్కు ఉందంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా వెంటనే ఒకసారి ఆలోచండి #వోక్సభ’ అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. అదే విధంగా ‘‘ఏ విషయాన్ని అయినా లోతుగా చూసే ప్రపంచంలో మనమంతా జీవిస్తున్నాము. ఇక్కడ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఏకిభవించరు. దేశ పురోగతికి ఇది చెత్త ఫార్ములా. ఇక రంగోలీ ట్విటర్ ఖాతాను బలవంతంగా తొలగించి మరింత ద్వేషాన్ని స్వాగతించారు’’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. (రంగోలి ట్విటర్ అకౌంట్‌ను తొలగించిన అధికారులు) Just read on my timeline that the ‘Rangoli Chandel-Kangana Ranaut’ handle has been suspended by @twitter ? While I might not subscribe to all their views,I also stand by their right to express them.Let’s not be so ‘politically correct’ & quick to be offended dear #WokeSabha 🧚🏿♀️🔴 — ShutUpSona (@sonamohapatra) April 16, 2020 ఇక సోనా మోహపత్రా ట్వీట్‌కు దర్శకురాలు రీమా కగ్టి, రంగోలీ ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ‘‘సోనా మీరు దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ఈ ట్వీట్‌ను మీరు చుశారో లేదో నాకు తెలియదు. అయితే ఈ ట్వీట్‌ను ఓసారి చూడండి. ఇందులో ఒక నిర్థిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను, నిర్థిష్టమైన పత్రికలను మారణ హెమానికి పిలుపునిచ్చింది. ఇది నేరం. ఆమోద యోగ్యం కానిది’’ అంటూ సోనా ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. ఇక దీనికి సోనమ్ మరో ట్వీట్ చేస్తూ ‘‘అవును ఇప్పుడే ఆ వివాదస్పద ట్వీట్‌ను చుశాను. అయితే దీనికి రద్దు చేయడమే పరిష్కారం కాదు. ఇలాంటి పద్దతిని సమర్థించను. ఎలాంటి వారినైనా క్షమించి వారి ఉదారవాదాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా’’ అని వివరణ ఇచ్చారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) కాగా ఫైర్ బ్రాండ్ రంగోలి తన అభిప్రాయాలను సోషల్ మీడయాలో తెలుపుతూ ఏప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి తన ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. దీంతో ఆమె ట్విటర్ ఖాతాను అధికారులు గురువారం రద్దు చేశారు. -
‘జోమాటో మాదిరిగా ఎందుకు పనికి రానన్నారు’
న్యూఢిల్లీ: జోమాటో పనికి మాలినదంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు ఆ సంస్థ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జోమాటోపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘లాక్డౌన్లో నిత్యం ఫోన్‌తో ఆడుకుంటున్న నన్ను చూసి.. జోమాటో మాదిరిగా నేను కూడా ఎందుకు పనికిరానని నా తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారు తెలివైన వారు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన జోమాటో ‘ప్రస్తుతం మేము కిరాణా సామగ్రిని కూడా పంపిణీ చేస్తున్నాం’ అని చమత్కారంగా సమాధానం ఇచ్చింది. (పానీ పూరీ లేదు.. ధైర్యంగా ఉండాలి!) we're actually delivering groceries now, aap apna dekh lo 😘 https://t.co/7vCX3k6dAW — Zomato (@ZomatoIN) April 13, 2020 ఇక జోమాటో ఇచ్చిన సమాధానికి నెటిజన్లు ఫిదా అవుతూ ‘వావ్.. గట్టి సమాధానం’ , ‘తెలివైన సమాధానం’ మరికొందరు లాక్డౌన్లో మేము జోమాటోలో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకుంటున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కొన్ని దుకాణాదారులు ఇంటికే అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జోమాటో ఫుడ్ డెలివరీతో పాటు కిరాణా సామాగ్రిని కూడా పంపిణీ చేస్తుంది. (ఫుడ్ డెలివరీబాయ్ నిజాయితీ) -
వైరల్: విస్టారా, ఇండిగోలపై కామెడియన్ కామెంట్
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై విస్టారా, ఇండిగో, గోఎయిర్, స్పెస్‌జెట్ భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు సోషల్ మీడియాలో సరదాగా చర్చించిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్టాండ్ అప్ ఇండియన్ కమెడియన్ కునాల్ కమ్రా విస్టారా ఎయిర్‌లైన్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ట్విటర్లో ట్రేండింగ్‌గా మారింది. ‘‘హే @airvistara నేను విన్నాను లాక్డౌన్ కారణంగా నిన్ను ఎత్తుకు ఎగరకుండా నిలిపివేశారంట కదా. ఎక్కడికి ఎగరకుండా పార్కింగ్‌లోనే జాగ్రత్తగా ఉండు. అలాగే ఇండిగో, స్పెస్‌జెట్, గోఎయిర్‌లు కూడా.. స్టేపార్కింగ్.. స్టేసేఫ్. ఇప్పటు మీకు అర్థం అవుతుంది నా బాధ’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఆయన సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెజన్లు తెగ ఆకట్టుకుంటోంది. (ప్రముఖ కమెడియన్‌పై ప్రయాణ నిషేధం) Now you know how I feel... https://t.co/oZcXqUIEeh — Kunal Kamra (@kunalkamra88) April 10, 2020 కాగా మార్చిలో విస్టారాతో పాటు ఇండిగో ఎయిర్ లైన్ అధికారుల లాక్డౌన్ అమలును అనుసరిస్తూ.. ఆయన ప్రయాణాన్ని నిషేధించినట్లు గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఏప్రిల్ 27వరకూ ఎయిర్ విస్టారాతో పాటు మరో నాలుగు విమానా ఎయిర్‌లైన్ సంస్థలు నా ప్రయాణాన్ని నిషేధించాయి. అంతేగాక అధికారుల ఆదేశాల మేరకు ఎవరూ కూడా ప్రయాణించడాకి వీలు లేదని చెప్పారు’’ అంటూ కునాల్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపార రంగాలు మూతపడ్డాయి. అంతేగాక జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో విమానా సేవలు కూడా నిలిచిపోయాయి. (కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్) -
రంగోలి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ్ మహల్‌పై రంగోలి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమేనని.. అది ఎప్పటికీ ‘ప్రేమ చిహ్నం’ కాదంటూ రంగోలి బుధవారం ట్వీట్ చేశారు. ‘తాజ్ మహల్‌ను చాలా మంది సమాధిగానే పరిగణిస్తారు. అయితే దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేగాక ముంతాజ్ బేగం గురించి కూడా ట్వీట్లో ప్రస్తావించారు. ముంతాజ్‌పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయని, ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఫోర్బ్స్‌పై కంగన సోదరి ఫైర్) Mr @rajcheerfull ji not every Indian is proud of Taj Mahal, a grave can never be a symbol of love, we are forced to accept it as a wonder but it’s creepy as hell especially when we know how she suffered in her lifetime how the artists who made it were tortured it’s creepy ... https://t.co/1V2waXDkbL — Rangoli Chandel (@Rangoli_A) April 7, 2020 ఇక రంగోలీ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘తాజ్ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా అంగీకరించాలని మిమల్ని ఎవరూ కోరడం లేదు’ ‘మీ అభిప్రాయం మాకు అవసరం లేదు, ‘ఇది ప్రపంచలోని వింత అని చరిత్రే చెబుతుంది ఇక మీ అభిప్రాయం ఎవరికి కావాలి’ అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజ్ మహల్ ప్రపంచంలోనే 7వ వింతగ పరిగణించబడుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రేమకు చిహ్నంగా భావిస్తు ప్రేమికులు సైతం తాజ్ మహాల్ బొమ్మలను బహుమతులుగా ఇచ్చుకుంటుంటారు. అంతేగాక దేశ ప్రజలంతా దీనిని చూసి గర్వపడుతుంటారు కూడా. కాగా రంగోలి ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవడం ఇది మొదటిసారి కాదు. తరచూ ఎన్నో విషయాల పట్ల తనకున్న అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ విమర్శలను ఎదుర్కొంటారు. -
వైరల్ ట్వీట్: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నకిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నందుకు ఆయనపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో 9 నిమిషాల పాటు దీపాలు వెలగించాలంటూ దేశప్రజలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బీ ఆదివారం మొత్తం చీకటిగా ఉన్న ప్రపంచ పటంలో భారదేశం వెలుగుతూ ఉన్న ఓ ఫేక్ పోస్టును ట్విటర్లో షేర్ చేశారు. (సిగ్గుపడను.. చాలా వింతగా ఉంది) ‘ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు భారతదేశం ప్రకాశిస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ ట్వీట్ చేసిన అసలైన పోస్టును అమితాబ్ రీట్వీట్ చేశారు. ‘‘ప్రపంచం మనల్ని చూస్తోంది, అందులో మనం ఒకరం’’ అంటూ ట్వీట్ చేశారు. ఇక బిగ్‌బీ తీరుపై ‘‘నకిలీ పోస్టులను పంచుకోవడం ఆపండి సార్’ ‘ఇదంతా అబద్ధం బచ్చన్ సార్.. మీరు పడుకొండి ఇక’, ‘ఎదైనా విషయాన్ని పోస్టు చేసే ముందు ఓసారి చెక్ చేసుకోండి ప్లీజ్’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. (మాస్క్‌లు ధరించకపోతే రూ.1000 జరిమానా) The World sees us .. we are ONE .. https://t.co/68k9NagfkI — Amitabh Bachchan (@SrBachchan) April 5, 2020 అయితే కరోనాపై అజాగ్రత్త వద్దంటూ అవగాహన కల్పించడంలో ముందున్న బిగ్‌బీ సమాచారం ఇచ్చేముందు జాగ్రత్త వహించాలని అభిమానులు కోరారు. అంతేగాక గతంలో కూడా కరోనాను ఎదుర్కొవటానికి ఆయుష్ మంత్రిత్వశాఖ తీసుకుంటున్న చర్యలకు మద్దతునిస్తూ.. హోమియోపతిలోని గోమూత్ర వైద్యం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించి విమర్శల పాలయ్యారు. అంతేగాక చైనా షేర్ చేసిన ఓ వీడియోను బిగ్‌బీ షేర్ చేస్తూ.. ‘‘అంటువ్యాధుల నివారణలో ప్రపంచాన్ని భారతదేశం నడిపిస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ చేసిన ట్వీట్‌ను భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. -
కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు 21 రోజుల లాక్ డౌన్ దేశవ్యాప్తంగా అమలవుతోంది. నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్లు వాడడం, కనీస భౌతిక దూరాన్ని పాటించడం లాంటి చర్యలు గత పదిరోజులుగా దాదాపు దేశ ప్రజలందరికి అలవాటుగా మారిపోయింది. అయితే కరెన్సీ నోట్ల మీద, పేపర్ మీద కూడా వైరస్ తిష్టవేసుకుని కూచుంటుందని, జాగ్రత్తలు అవసరమన్న హెచ్చరికలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగి అనుసరించిన పద్థతి, చెక్ తీసుకున్న వైనం చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో నిరంతరం చురుగ్గా వుంటూ, ఎన్నో ఆసక్తికర, విజ్ఞాన దాయక వీడియోలను పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను ట్వీట్ చేయడం విశేషం. వాట్సాప్ వండర్ బాక్స్ లో వచ్చిన వీడియోను షేర్ చేస్తూ ఈ టెక్నిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ, క్యాషియర్ సృజనాత్మకతను మాత్రం మెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. చేతికి గ్లౌజులు, నోటికి మాస్క్ లాంటి నియమాలను పాటించిన సదరు బ్యాంకు ఉద్యోగి వినియోగదారుడు నుంచి, చెక్కును ప్లకర్ తో అందుకోవడం, ఆ తరువాత దాన్ని పక్కనే సిద్ధంగా ఉంచుకున్న ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేసి మరీ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రక్రియ కరోనాను అడ్డుకునేందుకు ఎంతవరకు పనికి వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. కాగా లాక్డౌన్ సమయంలో దేశ ప్రజలందరూ ఇంటి పరిమితమైనప్పటికీ ప్రజల సౌకర్యార్ధం కొన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, వైద్యం, కిరాణా, బ్యాంకింగ్, మీడియా వంటి ముఖ్యమైన సేవలకు అనుమతి వుంది. అయినా దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఉదంతం అనంతరం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. చదవండి : కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్ డెలివరీ హామీ In my #whatsappwonderbox I have no idea if the cashier’s technique is effective but you have to give him credit for his creativity! 😊 pic.twitter.com/yAkmAxzQJT — anand mahindra (@anandmahindra) April 4, 2020 -
రజనీపై వర్మ మరో ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మరోసారి వంగ్యస్త్రాలు సందించాడు. మహమ్మారిని నాశనం చేసేందుకు ఆయన ఏం చేయట్లేదంటూ ఫన్నీ మీమ్‌తో ట్విటర్లో సోమవారం షేర్ చేశాడు. ప్రుస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కరోనా వైరస్‌ను నాశనం చేయడానికి రజనీకాంత్ ఎందుకు ఏమీ చేయడం లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. And why the f... is Rajnikant not doing anything to destroy the Coronavirus?????..Just asking — Ram Gopal Varma (@RGVzoomin) March 21, 2020 ఇక ఆర్జివి ట్వీట్ చూసిన రజనీ అభిమానులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. తమ అభిమాన హీరోపై వ్యంగ్యంగా ట్వీట్ చేసినందుకు వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక రజనీని ట్రోల్ చేయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు రజనీ నటించిన 2.0 విడుదల సమయంలో ఆయన లుక్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్మ గెహెర్ అనే హర్రర్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అమిత్ సాధ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
యువతి నోట కరోనా పాట.. ఆయన ఫిదా!
ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తున్న పేరు కరోనా వైరస్(కోవిడ్-19). మొదట చైనాలో పుట్టిన ఈ వైరస్ మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తూ.. ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాల ప్రజలకు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు ఇస్తోంది. ఇక ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం కరోనా నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలంటూ.. జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక కరోనాపై ఎవరికి తోచినట్లుగా వారు అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో రష్మీ సర్వీ అనే యువతి తాజాగా తన పాట ద్వారా అవగహన కల్పిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018లో హాలీవుడ్ సింగర్ కామిలా కాబెల్లో పాడిన పాట ‘హవానా’కు ‘కరోనా’ వెర్షన్‌తో పాడిన ఈ పాటను సోమవారం ఆమె ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోకు ‘ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ పరిశుభ్రంగా ఉండండి. మీకు ఎమైనా కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి’ అంటూ రష్మీ ట్వీట్ చేసింది. కాగా ‘‘ కరోనా.. హో.. నా.. నా. నా ఆలోచన మొత్తం నీ మీదే ఉంది కరోనా.. హో నానా. చైనా నుంచి వచ్చిన ఓ కరోనా.. నీలో ఏదో ఉంది కరోనా.. నా.. నా’’ అంటూ సాగే ఈ పాటతో రష్మీ ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. A lighter take on Corona2019. 🤓 There is no need to panic. Stay hydrated and keep yourself hygienic. If you feel any symptoms go see a doctor immediately. Lets hope to beat this spineless intruder soon. Hope the affected people recover soon 🙏🏻 #corona #Prayers #rashmishaarvi pic.twitter.com/2SqzbK6fcB — Rashmi_Shaarvi (@RShaarvi) March 14, 2020 ఇక రష్మీ పాడిన కరోనా రీమేక్ పాట ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఆ పాటకు 13వేల వ్యూస్ వచ్చాయి. ‘తన వాయిస్ చాలా బాగుతుంది’. ‘అందమైన గొంతు నుంచి అద్భుతమైన సాహిత్యం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీ మహింద్రా గ్రూప్ సంస్థల యాజమాని ఆనంద్ మహింద్రా కూడా ఆమె పాటకు ఫిదా అయ్యారు. ఈ వీడియోను ఆయన తన ట్విటర్లో పంచుకుంటూ.. రష్మీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘రష్మీ పాట వినోదభరితంగా ఉంది. తన గొంతు చాలా బాగుతుంది. మీరు ఓ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ కామెంట్ చేశారు. -
నువ్వు చేసింది పెద్ద నేరం తెలుసా..!!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు పెద్దలు. వ్యక్తుల అభిరుచులు, వాటి అనుచరణ కాస్త వింతగా తోచినపుడు వాడే ఈ నానుడిని.. ప్రస్తుతం నెటిజన్లు మరోసారి ఉటంకిస్తున్నారు. సాహిల్ అధికారి అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేసిన ఓ ఫొటో ఇందుకు కారణమైంది. భోజన ప్రియుడైన సాహిల్‌కు ఆహార పదార్థాలను రకరకాల కాంబినేషన్లతో తినడం ఇష్టమట. అందుకే ఈసారి వైరైటీగా కుర్కురేను పాలల్లో కలుపుకొని తినేశాడు. అంతేకాదు దానికి కుర్కురే మిల్క్‌షేక్ అనే పేరు కూడా పెట్టాడు. రుచికి రుచి.. కొత్తదనం కూడా అంటూ ఈ విషయాన్ని సాహిల్ ట్విటర్లో పంచుకోవడంతో ఇప్పుడు ఈ వెరైటీ వంటకం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలో... ‘ కొత్త కాంబినేషన్. మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి. స్వీట్ చూడ్డానికి బాగుంది. కుర్కురే హీరో’ అని ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తూ కొంతమంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ నువ్వు చేసింది పెద్ద నేరం. ఇలాంటివి తింటే భారతదేశంలో నివసించే అర్హత కోల్పోతావు. దేశ బహిష్కరణ తప్పదు’ అంటూ ఆహారపుటలవాట్ల విషయంలో సంప్రదాయవాదుల జోక్యాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా గతంలో కూడా స్వీట్ మ్యాగీ, చాకొలేట్ చెర్రీ దోస గురించి నెట్టింట్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. Kurkure Milkshake❤️ pic.twitter.com/U5fnwHMC0L — Desi Gooner (@Sahil_Adhikaari) November 7, 2019 -
‘మా అమ్మకు అందమైన వరుడు కావాలి’
సాధారణంగా పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం పరిపాటి. అయితే ఆస్తా వర్మ అనే యువతి మాత్రం ఇందుకు భిన్నంగా తన తల్లి కోసం వరుడి అన్వేషణ మొదలుపెట్టింది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. తన తల్లి మరోసారి ఒంటరి అయిపోతుందని భావించి.. ఆమెకు తోడును వెదికేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. ‘యాభై ఏళ్ల అందమైన వరుడు కావాలి. మా అమ్మకోసం! అతడు వెజిటేరియన్ అయి ఉండాలి. తాగుడు అలవాటు ఉండకూడదు. అంతేకాదు జీవితంలో స్థిరపడినవాడు అయి ఉండాలి’ కూడా అంటూ ఆస్తా చేసిన ట్వీట్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. తన తల్లితో పాటు కలిసి ఉన్న సెల్ఫీని ట్విటర్లో షేర్ చేయగా... నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ‘ఎంతో గొప్ప కూతురువి. తల్లీకూతుళ్లు ఇద్దరూ స్నేహితుల్లా ఉన్నారు. ప్రతీ ఒక్క వ్యక్తికి తోడు అవసరం. అందుకు వయస్సుతో సంబంధం లేదు. అమ్మ గురించి నువ్వు ఆలోచించిన తీరు అభినందనీయం’ అంటూ పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. అదే విధంగా తమకు తెలిసిన బ్యాచిలర్స్ వివరాలు కూడా అందజేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు డివోర్సీల పేర్లు ప్రతిపాదించగా.. మరికొంత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటూ తమ బంధువుల వివరాలను ఆస్తాకు పంపిస్తున్నారు. అయితే వారిలో ఆస్తా ఇంతవరకు ఎవరినీ కూడా ఎంపిక చేయలేదు. తనకు మాత్రమే కాదు తన తల్లికి కూడా పూర్తిగా నచ్చి.. సదరు వ్యక్తితో పర్సనల్‌గా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసింది. Looking for a handsome 50 year old man for my mother! :) Vegetarian, Non Drinker, Well Established. #Groomhunting pic.twitter.com/xNj0w8r8uq — Aastha Varma (@AasthaVarma) October 31, 2019 -
జాబిలి తీరం : బెంజ్ అద్భుత ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అద్భుత క్షణాలు మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కానున్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్- 2’ లోని విక్రమ్ ల్యాండర్ అందనంత ఎత్తా జాబిలమ్మా..సంగతేద్దో చూద్దాం రా.. అంటూ జాబిల్లిపై దిగనుంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు..అంటే సెప్టెంబరు 7న చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలుకానున్న సంగతి తెలిసిందే. చారిత్రాత్మకమైన ఆ మధుర క్షణాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఆసక్తి నెలకొంది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అనేక మంది ప్రముఖులు తమ ట్వీట్లతో విక్రమ్‌కు విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ వినూత్నంగా స్పందించింది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపిస్తూ..భారత ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఇస్రో సంస్థకు అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా అద్భుతమైన ఫోటోను ట్వీట్ చేసింది. సైడ్ మిర్రర్లో జాబిల్లిని చాలా దగ్గరగా ఫోకస్ చేసింది. ఆబ్జెక్ట్స్ ఇన్‌ద మిర్రర్ ఆర్ క్లోజర్ దేన్ దే అప్పియర్ అని హెచ్చరించే.. మిర్రర్ ఫోటోతో తనదైన శైలిలో ట్వీట్ చేసింది. చదవండి : ఆ క్షణాల్ని అందరూ వీక్షించండి : మోదీ A moment in history that was always meant to be made. Congratulations to team ISRO for taking India this far! #Chandrayaan2#Chandrayaan2Live pic.twitter.com/YCQfU96TRQ — Mercedes-Benz India (@MercedesBenzInd) September 6, 2019 -
ఓ మ్యాన్..నా వీకెండ్ మొదలైంది
సాక్షి,ముంబై : మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన ఫన్నీ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన తాజాగా ఒక బుడ్డోడి వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నేనైతే..పగలబడి నవ్వుతున్నా..అంటూ ఓ బుడ్డోడి రోబో లాంటి డ్యాన్స్ వీడియోను మహీంద్రా షేర్ చేశారు. విషయమేమిటంటే...సాధారణంగా బైక్‌లు, కార్లను ఎవరైనా టచ్ చేస్తే..యాంటీ థెప్ట్ అలారం మోగడం, ఆ అలారం చేసే గొడవ మనకు తెలిసిందే. అయితే.. ఓ బుడ్డోడు.. తన దారిన పోతూ ఓ సూపర్ బైక్‌ను చూశాడు. ఎంతైనా క్రేజీ బుడ్డోడు కదా. (దాన్ని ముట్టుకోగానే అలారం మోగుతుందని తెలుసో లేదో...తెలియదు గానీ) దాన్ని ఒక తన్ను తన్నాడు. అంతే ఇక రచ్చమొదలైంది. ఆ అలారం సౌండ్‌కు తగినట్టుగా బుడ్డోడు అచ్చం రోబోలా మెలికలు తిరిగిపోతూ డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా తన వస్తువులు తాను తీసుకొని అమాయకంగా జారుకున్నాడు. ఆ విన్యాసాలు మాటల్లో చెప్పడం కష్టం... చూసి తీరాల్సిందే. అందుకే ఆనంద్ గోపాల్ మహీంద్ర కూడా ఫిదా అయిపోయారు. తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇంతవరకూ ఇలాంటి ఫన్నీ వీడియోను చూడలేదు. ఈ పిల్లాడి రోబో డ్యాన్స్ చూసి కడుపుబ్బా నవ్వుకున్నాను. ఇంకా నవ్వును ఇంకా ఆపుకోలేకపోతున్నాను. ఇక నా వీకెండ్ మొదలైందంటూ ట్వీట్ చేశారు. ఏమైనా పిల్లలు పిడుగులబ్బా..వారి క్రియేటివిటికీ..ఆహా...! అనాల్సిందే. మరిలేకపోతే..వార్నింగ్ అలారం శబ్దాలకు కూడా ఇలా డ్యాన్స్ ఇరగదీయవచ్చని మనం ఊహించగలమా. ఇంకా ఊహలెందుకు..మన బుల్లి హీరోగారి డాన్స్‌తో వీకెండ్‌ను హుషారుగా ఆరంభించండి! Oh man, this has to be the coolest thing I’ve seen in a long time. I’m still on the floor laughing. My weekend has begun... pic.twitter.com/eYC4MKXRDk — anand mahindra (@anandmahindra) August 9, 2019 -
ఈ మసాజ్ ఒక్కసారి చాలు! రోగాలన్నీ మటుమాయం
సాక్షి, ముంబై: కార్పోరేట్ దిగ్గజం, మహీంద్ర అండ్ మహీంద్ర ఛైర్మన ఆనంద్ మహీంద్రా మరోసారి ఆసక్తికరమైన ట్విట్‌తో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికరమైన, ఇన్నోవేటివ్ అంశాలను షేర్ చేస్తూ వుంటారు. తాజాగా ఒక హిల్లేరియస్ ఫోటోను ట్వీట్ చేశారు. తద్వారా తన సెన్సాఫ్ హ్యూమర్‌ను చాటుకున్నారు. ఒక రోడ్ రోలర్ చక్రంపై బాడీ మసాజ్ ప్రకటన పోస్టర్ నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్ ఒక రోడ్ రోలర్ చక్రం మీద అంటించడమే ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బాడీ మసాజ్ కేవలం రూ.499 మాత్రమే అని దానిపై రాసి ఉంది. ఇక ఆయన ఊరుకుంటారా? వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి చక్కటి కమెంట్ యాడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. ఇలాంటి మసాజ్ ఒకసారి చేసుకుంటే చాలు...ఇక జీవితంలో మరోసారి దీని అవసరం రాదు. ఈ మసాజ్‌తో శరీరంలోని రుగ్మతలన్నీ మటుమాయమంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఈ పోస్టర్ అంటించిన వ్యక్తికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ అయినా ఉండాలి లేదంటే ఐక్యూ లెవల్ అయినా తక్కువగా ఉండాలని ట్వీట్ చేశారు. కాగా ట్విటర్లో ఆనంద్ మహీంద్రాకు 70 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. Hilarious. After this massage, you’ll never need another one; it’ll be a permanent remedy for all ailments... (The guy who plastered that poster either had a delicious sense of humour or a seriously low IQ!) pic.twitter.com/92UIQaCmhq — anand mahindra (@anandmahindra) June 3, 2019 -
ఏటీఎం కోసం పరుగో పరుగు!
బుధవారం జాతినుద్దేశించి తాను చేసే ప్రసంగానికి సంబంధించి ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు విపరీతంగా స్పందించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రధాని ట్వీట్‌కు 20,663 రీట్వీట్లు, 57,674 లైక్‌లు, 15,000 కామెంట్లు వచ్చాయి. బుధవారం ఉదయం 11.23 గంటలకు ప్రధాని మోదీ తన ట్విటర్ నుంచి ‘ఈ రోజు పదకొండు ముప్పావు, పన్నెండు గంటల మధ్య నేను జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నాను. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. టీవీ, రేడియో, సామాజిక మాధ్యమాల్లో నా ప్రసంగాన్ని చూడండి’అని ట్వీట్ చేశారు. పలువురు నేతలు నెటిజన్లు వెంటనే స్పందించారు. ► దేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తారని, దావూద్ ఇబ్రహీంను వెనక్కి తీసుకొచ్చినట్లు చెపుతారని, మసూద్ అజార్‌ను చంపేశా మని ప్రకటిస్తారని.. ఇలా వందల ట్వీట్లు వచ్చాయి. ► మోదీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారంటూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ► 2016, నవంబర్ 8న మోదీ ఇలాగే పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు జాతినుద్దేశించి ప్రసంగంలో ప్రకటించారు. దాన్ని ప్రస్తావిస్తూ ఒక ట్విటర్ ‘మోదీజీ కొంచెం ఆగండి.. ఏటీఎం నుంచి రూ.100 నోట్లు డ్రా చేస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. ► ‘మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. నేను ఇప్పటికే ఏటీఎం దగ్గరికొచ్చా’అని అమీర్ పఠాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ► ‘కేజ్రీవాల్ ఊహించినట్టే మోదీ దేశంలో ఎన్నికలపై నిషేధం ప్రకటించనున్నారు’ అని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ► ‘ ఓ మైగాడ్. అందరూ ఏటీఎంలవైపు పరుగెడుతున్నారు’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ► ‘మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తానన్నపుడల్లా అవినీతిపరులందరికీ గుండెపోటు వస్తోంది’ అన్నది మరో ట్వీట్. ► మోదీ ప్రసంగం ప్రకటన పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు బీపీ తెప్పిస్తోందనే క్యాప్షన్‌తో ‘ఇమ్రాన్ బీపీ చెక్ చేసుకుంటున్న ఫొటో’ మరొకరు ట్వీట్ చేశారు. ► మరొకరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటిం చినప్పటి ఫొటోను బ్లాగ్‌లో పెట్టారు. ► చివరికి మోదీ చెప్పిన సమయానికి 26 నిమిషాలు ఆలస్యంగా ప్రసంగం మొదలెట్టారు. భారతదేశం చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం గురించి ఆయన చెప్పారు. ఇదే ప్రధాని మోదీ చెప్పిన ‘ఆశ్చర్యకరమైన’విషయం. -
సంచలనం రేపుతున్న ప్రధాని మోదీ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాగైనా అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని మోదీ...ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ట్విటర్లో ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియా,టీవీలు, రేడియోల ద్వారా తన ప్రకటన కోసం వేచి చూడండి అంటూ ఉత్కంఠ రేపారు. ప్రధాని ఏమి సంచలన ప్రకటన చేస్తార న్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని జాతినుద్దేశించి ఆయన కీలక ప్రకటన చేయనున్నారు. దీంతో దేశ భద్రతకు సంబంధించే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు మోదీ ప్రకటనపై ట్విటర్లో పలు సెటైర్లతో ట్వీట్లు వెల్లువెత్తాయి. చదవండి : సూపర్ పవర్‌గా భారత్ - మోదీ मेरे प्यारे देशवासियों, आज सवेरे लगभग 11.45 - 12.00 बजे मैं एक महत्वपूर्ण संदेश लेकर आप के बीच आऊँगा। I would be addressing the nation at around 11:45 AM - 12.00 noon with an important message. Do watch the address on television, radio or social media. — Chowkidar Narendra Modi (@narendramodi) March 27, 2019