Only Two Guys Part Of Last Test We Played At Dominica, Kohli shares pic with Dravid - Sakshi
Sakshi News home page

Kohli- Dravid: ద్రవిడ్‌ సెంచరీ.. కోహ్లి 19 పరుగులు! విరాట్‌ ట్వీట్‌ వైరల్‌

Published Mon, Jul 10 2023 3:11 PM | Last Updated on Mon, Jul 10 2023 3:37 PM

Only Two Guys Part of Last We Played Kohli Memory With Dravid Viral - Sakshi

రాహుల్‌ ద్రవిడ్‌తో విరాట్‌ కోహ్లి

India tour of West Indies, 2023: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి పంచుకున్న ప్రత్యేకమైన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌, లైకులతో దూసుకుపోతోంది. ఇంతకీ విరాట్‌కు ఆ ఫొటో ఎందుకంత స్పెషల్‌ అంటే.. రన్‌మెషీన్‌గా పేరొందిన కోహ్లి 2011, జూన్‌లో టెస్టుల్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

నాడు ద్రవిడ్‌ సెంచరీ.. కోహ్లి విఫలం
వెస్టిండీస్‌తో జమైకాలోని కింగ్‌స్టన్‌లో గల సబీనా పార్క్‌లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడాడు. నాటి భారత జట్టులో ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఉన్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వాల్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేయగా.. కోహ్లి ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కేవలం 4 పరుగులకే పరిమితం అయ్యాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్‌ సెంచరీ(112)తో ఆకట్టుకోగా.. కోహ్లి 15 పరుగులు చేశాడు. అలా తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ తర్వాతి కాలంలో టీమిండియా మేటి బ్యాటర్‌గా, సారథిగా ఎదిగిన కోహ్లి.. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 75 శతకాలు పూర్తి చేసుకున్నాడు.

హెడ్‌కోచ్‌, బ్యాటర్‌గా
కాగా కోహ్లి అరంగేట్రం చేసిన మరుసటి ఏడాదే ద్రవిడ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక 2011 తర్వాత ఈ ఇద్దరూ కలిసి వెస్టిండీస్‌ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి. అప్పుడు సహచర ఆటగాళ్లుగా ఉన్న ద్రవిడ్‌, కోహ్లి.. ప్రస్తుతం హెడ్‌కోచ్‌, కీలక బ్యాటర్లుగా వేర్వేరు హోదాల్లో ఉన్నారు.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కోహ్లి.. రాహుల్‌ ద్రవిడ్‌తో ఉన్న ఫొటో ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘‘గత పర్యాయం 2011లో ఇక్కడికి వచ్చిన ఇద్దరు ఆటగాళ్లు..  వేర్వేరు హోదాల్లో మరోసారి ఇలా! ఎంతో సంతోషంగా ఉంది’’ అని కోహ్లి చేసిన ట్వీట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా జూలై 12న తొలి టెస్టుతో టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌ ఆరంభం కానుంది.

ఇదిలా ఉంటే.. మొదటి టెస్టు జరుగనున్న డొమినికా 2011 నాటి మూడో టెస్టుకు వేదికైంది. ఇక్కడ దిగిన ఫొటోనే కోహ్లి షేర్‌ చేశాడు. నాడు డొమినికాలో ద్రవిడ్‌, కోహ్లి చేసిన పరుగులు వరుసగా.. 5, 34- 30. 

చదవండి: Ind Vs WI: షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే
WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement