కాకినాడ క్రైం: శిశువుల సమగ్ర ఆరోగ్యరక్షణకు కేంద్రం సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా క్షయ, పోలియో, కోరింతదగ్గు, కంఠసర్పి, ధనుర్వాతం, పచ్చకామెర్లు, పొంగు వంటి వ్యాధులు రాకుండా ప్రస్తుతం వేస్తున్న అయిదు వ్యాక్సిన్లు (టీకాలు) స్థానంలో ఒకే వాక్సిన్ ‘పెంటా వేలెంట్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను 6, 10, 14 వారాల వయసులో ఇంజక్షన్ రూపంలో తప్పనిసరిగా చిన్నారులకు వేయించాలి. ఇందుకు జిల్లాలోని 109, విలీన మండలాల్లోని ఎనిమిది శీతలీకరణ కేంద్రాల్లో వేక్సిన్‌ను అందుబాటులో ఉంచారు.
కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం కాకినాడ పర్లోపేటలోని ఏఎంజీ స్కూల్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. ఈ వ్యాక్సిన్‌తో జిల్లాలోని 79,979 మంది శిశువులు ఈ ఏడాది రక్షణ పొందుతారని జిల్లా యంత్రాంగం అంచనా. పెంటావేలెంట్ టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ఆయా పీహెచ్‌సీలకు, ఆరోగ్యకేంద్రాలకు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య సిబ్బంది, వైద్యాధికారులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ కూడా పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెంటా వేలెంట్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది.
చిన్నారులను రక్షించండి ..
ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించే బాధ్యత తల్లిదండ్రులతోపాటు సమాజంలో ప్రతీ ఒక్కరిపై ఉంది. దగ్గరలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లేదా ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో ఈ టీకాలు ఉచితంగా లభిస్తాయి. పిల్లలకు వేరుుంచే టీకాల వివరాలను ఎంసీపీ రికార్డుపై నమోదు చేయించాలి.
-డాక్టర్ అనిత,
జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి
ఐదు ‘రక్షాకవచాలు’ ఒకే టీకాలో..
Published Fri, May 8 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement