తాడేపల్లిగూడెం రూరల్: తనకు తెలియకుండానే తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.55 వేల సొమ్మును ఎవరో డ్రా చేశారంటూ బాధితుడు తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... నల్లజర్ల మండలం ఆవపాడుకు చెందిన అచ్యుత వెంకటస్వామి గతనెల 13న పట్టణంలోని ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేశారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సొమ్ము తొందరగా తీసుకోవాలని హడావుడి చేయడంతో డబ్బు తీసుకుని వెంకటస్వామి బయటకు వచ్చారు. మంగళవారం బ్యాంక్‌కు వెళ్లి చూడగా తన అకౌం ట్‌లో రూ.55 వేలు లేవు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.