ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది : విజయసాయిరెడ్డి | AP ideal to other states tweets MP Vijayasai reddy | Sakshi
Sakshi News home page

ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది : విజయసాయిరెడ్డి

Published Tue, Apr 14 2020 11:38 AM | Last Updated on Tue, Apr 14 2020 11:47 AM

AP ideal to other states tweets MP Vijayasai reddy - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అప్రమత్తత వల్ల అతి తక్కువ ప్రాణనష్టం నమోదైన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలు రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచి రక్షించాయని ట్విటర్‌లో తెలిపారు. వాలంటీర్లు మూడుసార్లు ఇంటింటి సర్వే చేసి పౌరుల ఆరోగ్య చరిత్రను రికార్డు చేయడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.(14410 ఫోన్‌లోనే వైద్య సేవలు)

‘పాలనా దక్షత అంటే సీఎం జగన్‌ని చూసి నేర్చుకోవాలి. అందరి సలహాలు తీసుకుంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తారు. వాటిని అమలు చేసే స్వేచ్ఛ అధికారులకిచ్చారు. పని జరగాలంతే. మీడియా ప్రచారం ఆయన అస్సలు కోరుకోరు. రాష్ట్రం బాగుంటే చాలని కోరుకుంటారు యువ సీఎం’ అని విజయసాయి రెడ్డి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా విజయసాయిరెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.(మరణం లేని మహా శక్తి ఆయన : సీఎం జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement