మూడు విడతల జన్మభూమి సభల్లో మొత్తం 1.41 లక్షల దరఖాస్తులు
ఇందులో హౌసింగ్ శాఖకు వచ్చింది 6,500 ప్రతిపాదనలే
ఒక్కో నియోజకవర్గానికి 7 నుంచి పది ఇళ్లలోపే
వీటినీ పచ్చ చొక్కాలకే కట్టబెట్టే యత్నం
కసరత్తు ప్రారంభించిన జన్మభూమి కమిటీలు
జిల్లాలో గూడులేని పేదల గోడు అరణ్యరోదనగా మారింది. చంద్రబాబు సర్కారు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క పక్కా ఇల్లూ మంజూరు కాలేదు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇళ్ల కోసం బడ్జెట్‌లో రూ.727.71 కోట్లు కేటాయించినా ఫలితం లేకుండా పోయింది. సొంత ఇంటి కోసం జిల్లా వ్యాప్తంగా 1.41 లక్షల దరఖాస్తులు వచ్చినా అందులో హౌసింగ్ శాఖకు 6,500 ప్రతిపాదనలే అందడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు: జిల్లాలో జన్మభూమి కమిటీల పెత్తనానికి అంతూపొంతూ లేకుండా పోతోంది. ప్రతి చిన్న పనినీ తమకు అనుకూలంగా ఉన్న వారికే కట్టబెట్టేస్తున్నారు. అధికార పార్టీకి చెందని వారికి సంక్షేమ ఫలాలు అందాలంటే ఆ కమిటీలకు ఎంతోకొంత సమర్పించుకోవాల్సి వస్తోంది. ఈ కమిటీలను సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుండటంతో అధికారులు కిమ్మనడంలేదు.
అర్జీలే.. అర్జీలు
మూడు విడతల జన్మభూమి గ్రామ సభల్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,41,738 మంది ఇళ్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు. 1,36,715 దరఖాస్తులు కంప్యూటరైజ్డ్ చేశారు. ఇంకా 5,023 దరఖాస్తులు చేయాల్సి ఉంది. నియోజకవర్గానికి 1,250 చొప్పున 11 నియోజకవర్గాలకు 13,750 ఇళ్లు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి నియోజకవర్గాలకు 500 ఇళ్లు.. ఇలా మొత్తం 15,250 ఇళ్లు కేటాయించారు. ఒక్కో ఇంటికి రూ.2.57లక్షల చొప్పున ప్రభుత్వం రూ.419 కోట్లు కేటాయించింది. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో 70 వేల మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరిలో జన్మభూమి కమిటీలు గుర్తించిన వారికి ప్రభుత్వం 15,250 ఇళ్లు కేటాయించనుంది. కమిటీ సభ్యులందరూ టీడీపీకి చెందిన వారే ఉండడంతో నిజమైన వారికి అన్యాయం జరుగుతుందేమోనని పలువురు పేదలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే లేఔట్‌లో 15 మంది ఉంటేనే
ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే ఒకే లేఔట్‌లో 15 మంది ఉండాలి. సొంత ఊళ్లో 15 మంది అర్హులు లేకపోతే.. పక్క ఊరికి మారాల్సి ఉంటుందనే నిబంధన ఉండడంతో పలువురు గందరగోళంలో పడ్డారు. ఇందిరమ్మ పథకం కారణంగా గతంలో ఊరికి దగ్గర లో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కాలనీలుగా మారిపోయాయి. ఇప్పుడు సామాజికవసరాలకు ప్రభుత్వ భూమి కరువైంది. భూసేకరణ చట్టం ప్రకారం పోయినా తమ పొలాలను ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరు. నియోజకవర్గానికి 1,250 ఇళ్లు మాత్రమే ఇచ్చినందున ఒక్కో పంచాయతీకి 7 నుంచి 10 పక్కాగృహాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
ఎప్పుడొస్తాయో..
ఎన్టీఆర్ పక్కా ఇళ్లు వచ్చేంత వరకు నమ్మకంగా లేదు. ప్రతి జన్మభూమి గ్రామ సభలో ఇంటికోసం అర్జీఇచ్చా. ఇంకా ఇండ్లే ఖరారు కాలేదు. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో.. తర్జనభర్జన పడుతున్నారు. ఎక్కువమంది దరఖాస్తు చేయడంతో ఆరు పాయింట్లుతో లబ్ధిదారులను ఎంపికచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అది ఎప్పుడవుతుందో.. ఏమో.. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ఆ రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తోంది. -పురుషోత్తం, దొమ్మన్నబావి, కురబలకోట మండలం
పదేళ్లుగా తిరుగుతున్నా
సొంతింటి కోసం పదేళ్లుగా కార్యాలయూల చుట్టూ తిరుగుతున్నాను. ఇస్తావుని చెబుతున్నారేగానీ ఆచరణలో పెట్టడం లేదు. పల్లెల్లో సైతం ఇంటి అద్దెలు ఎక్కువగా ఉన్నారుు. అద్దెలు చెల్లించే స్తోవుత మాకు లేదు. ప్రభుత్వం కనికరించడం లేదు. రచ్చబండ, జన్మభూమి కార్యక్రవూల్లో పలువూర్లు అర్జీలు ఇచ్చాను. లాభం లేకపోరుుంది. ఇస్తారనే నవ్ముకం కూడా సన్నగిల్లుతోంది. -వుునిరత్నం, పట్రపల్లె, పలమనేరు మండలం