పదోన్నతులు, నియామకాలు, బదిలీలపై నిషేధం | Bifurcation Work Complete; All Set for Two States | Sakshi
Sakshi News home page

పదోన్నతులు, నియామకాలు, బదిలీలపై నిషేధం

Published Sat, May 17 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM

Bifurcation Work Complete; All Set for Two States

ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల పదోన్నతులపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యేవరకు అన్ని రకాల పదోన్నతులపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అన్ని రకాల నియామకాలతోపాటు బదిలీలు, సీనియారిటీలు, సవరణలు, ఉద్యోగుల నియామకాల నియమ నిబంధనల్లో మార్పులు చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వస్తే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తగిన కారణాలను పేర్కొనాలని తెలిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాల్సిందిగా స్పష్టంచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement