75 నగరాల్లో ఉపాధ్యాయులకు సెంటా పోటీలు | CENTA Conducting Exam For Teachers In 75 Cities Acroos India On December 14th | Sakshi
Sakshi News home page

75 నగరాల్లో ఉపాధ్యాయులకు సెంటా పోటీలు

Published Thu, Nov 21 2019 4:55 PM | Last Updated on Thu, Nov 21 2019 5:25 PM

CENTA Conducting Exam For Teachers In 75 Cities Acroos India On December 14th - Sakshi

సాక్షి. హైదరాబాద్‌ : భార‌త‌దేశ‌ వ్యాప్తంగా బోధ‌న‌లో నైపుణ్యతను పెంపొందించ‌డమే ల‌క్ష్యంగా సెంటా కృషిచేస్తోంది. సెంట‌ర్ ఫ‌ర్ టీచ‌ర్ అక్రిడిటేష‌న్(సెంటా), టీచింగ్ ప్రొఫెష‌న‌ల్స్ ఒలంపియాడ్(టీపీఓ)లు కలిసి సంయుక్తంగా భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులకు వారి నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రతీ ఏటా వార్షిక పోటీలను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా డిసెంబర్‌14, 2019న భారతదేశ వ్యాప్తంగా ఉన్న 75 నగరాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు.

ఈ మేరకు సెంటా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించనుంది. అదే విధంగా పోటీలో విజేతలుగా నిలిచినవారికి రూ. లక్ష నగదుతో పిటు రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డును అందించనున్నారు. అదేవిధంగా టీపీవో ధృవీకరణ పత్రంతో పాటు, యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో మాస్టర్‌ క్లాస్ హాజ‌ర‌య్యేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది.

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్‌ 25, 2019 తుది గడువని సెంటా తెలిపింది. సెంటా టీపీవో పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి www.centa.org/tpo2019 లింక్ ద్వారా లాగిన్‌ అయి రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. ఈ పోటీలకు 18 ఏళ్లకు పైబడి, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, బీఈడీ/డీఈడీ విద్యార్థులు, పాఠ‌శాల ఉపాధ్యాయులు, స‌ప్లిమెంట‌ల్ టీచ‌ర్లు, ప్రిన్సిపాల్లు, కోఆర్డినేట‌ర్లు, కంటెంట్ క్రియేట‌ర్లు, బోధ‌నాభ్యాసంపై ఆస‌క్తి క‌లిగి ఉన్న ఇత‌రులు ఎవ‌రైనా పాల్గొనవచ్చని సెంటా తెలిపింది. 

పరీక్షా విధానం  
సెంటా టీపీఓకు 12 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల బోర్డుల‌తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జీ వంటి అన్ని బోర్డులు అండగా నిలుస్తున్నాయి. భార‌త‌దేశవ్యాప్తంగా 30,000కు పైగా పాఠ‌శాల‌ల త‌ర‌ఫున ఉపాధ్యాయులు పోటీ ప‌డుతున్నారు. సెంటా టీపీఓ పరీక్షలో మ‌ల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష నిడివి రెండు గంట‌లు కాగా  ఎన్‌సీఈఆర్‌టీ సిల‌బ‌స్‌లోని కామ‌న్ టాపిక్‌ల‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా ఆయా అంశాల‌ను అర్థం చేసుకోవ‌డం, అన్వయించుకోవ‌డంపై ప్రశ్నలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సెంటా వ్యవస్థాప‌కురాలు అంజ‌లీ మాట్లాడుతూ... బోధ‌న‌ను ఉత్తమ‌మైన వృత్తిగా ఎంచుకోవ‌డాన్ని ప్రోత్స‌హించేందుకు సెంటా టీపీఓ ఎప్పుడు క‌ట్టుబ‌డి ఉంటుంది. ఉపాధ్యాయులలోని ప్రతిభను గుర్తించి నగదుతో ప్రోత్స‌హిస్తాం.

నా జీవితాన్ని మార్చివేసింది


సెంటా నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో పని చేస్తున్న ప్రభుత్వ టీచ‌ర్ తోట శ్రీ‌నివాస్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయన తెలుగు మీడియం ప్రైమ‌రీ ట్రాక్ టాప‌ర్, టీపీఓ 2018లో 129వ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో జ‌రిగిన గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ ఆండ్ స్కిల్స్ ఫోరంలో క్రికెట్ లెజెండ్ బ్రియ‌న్ లారా ఆయ‌న్ను ఘనంగా స‌న్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement