‘మాఫీ’ మాయపై అన్నదాత కన్నెర్ర
అమలాపురం :రుణమాఫీ పేరుతో ప్రభుత్వం తమను మోసగించిందని, అర్హులెందరో మాఫీ లబ్ధికి నోచుకోలేదని అన్నదాతల నిరసనలు, నిలదీతల మధ్య జిల్లాలో రైతు సాధికార సదస్సులు ప్రారంభమయ్యాయి. మాఫీ లబ్ధిదారులకు ‘రుణమాఫీ ఉపశమన పత్రాలు’ ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ సదస్సులు పిఠాపురం, రాజమండ్రి రూరల్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో గురువారం మొదలయ్యాయి. రుణమాఫీ అర్హుల జాబితాలు బ్యాంకులకు ఇంకా అందకున్నా, అర్హులెందరో తేలకున్నా ప్రభుత్వం సదస్సుల నిర్వహణకు పూనుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనకు భిన్నంగా రూ.50 వేల లోపు రుణాలు పూర్తిగా రద్దు కాకపోయినా.. సాధికార సమావేశాలు ఏర్పా టు చేయడం ప్రచారార్భాటానికేనని రైతులు మండిపడుతున్నారు. రైతులం తా తిరగబడే పరిస్థితులున్న తరుణంలో సదస్సులేమిటని వాపోతున్న అధికారులు రబీ సాగుపై సలహాలు ఇచ్చి సదస్సులు ముగిస్తున్నారు.
మల్లిసాలలో బ్యాంకు వద్ద ఆందోళన
జగ్గంపేట మండలం మల్లిసాలలో జరిగిన రైతు సాధికార సభలో రుణమాఫీ వంచనపై రైతులు తహసీల్దారు శివమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్థానిక ఆంధ్రాబ్యాంకులో 750 మందికి రైతులకు రుణాలుంటే, కేవలం నలుగురికి మాత్రమే మాఫీ వర్తింపుపై సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఆమె నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో బ్యాంకుకు వెళ్లి ఆందోళనకు దిగారు. అన్ని వివరాలు ప్రభుత్వానికి పంపామని, అర్హులుంటే మరోసారి పంపుతామని బ్యాంకు మేనేజర్ చెప్పగా ఆయనపై మండిపడ్డారు. రాజోలు నియోజకవర్గం చింతలమోరి, శంకరగుప్తం సదస్సుల్లో రైతులు అర్హులందరికీ రుణ మాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
రైతులకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో కేవలం ఇద్దరు రైతులు మాత్రమే సదస్సుకు హాజరయ్యారు. రాయవరం మండలం నదురుబాదలో జరిగిన సదస్సులో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సిరిపురం శ్రీనివాసరావు నిరసన తెలిపారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో కరప్రతాలను చూపుతూ బాబు మాట ఇచ్చినట్టు షరతులు లేని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ పండూరులో రుణమాఫీ వల్ల రుణాలు నిలిచిపోయాయని, తక్షణం రుణాలు ఇప్పించాలని రైతులు కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలను డిమాండ్ చేశారు. పెద్దాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ సదస్సులు సాదాసీదాగా జరిగాయి. తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలం జగన్నాథపురం, అల్లిపూడి, భీమవరపుకోటల్లోనే సదస్సులు జరిగాయి. తుని, తొండంగి మండలాల్లో మొదలు కానేలేదు.
అపరాధ వడ్డీ రూ.12 వేలు..
మాఫీ రూ.2 వేలు
ఐ.పోలవరం : ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్న ఐ.పోలవరం మండలం జి.వేమవరం రైతు సాధికార సదస్సుకు రైతులు అతి తక్కువమంది రావడం రుణమాఫీ అమలులో సర్కారు కుటిలత్వంపై వ్యతిరేకతకు మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. కేవ లం పింఛన్ల కోసం వచ్చిన వృదు ్ధలు, పార్టీ కార్యకర్తలు, అధికారులే ఎక్కువ మంది కనిపించారు. సభకు వచ్చిన కొద్ది మంది రైతులూ మంత్రి, ఎమ్మె ల్యే దాట్ల బుచ్చిబాబుల ఎదుటే నిరస న వెళ్లగక్కారు. ‘అపరాధ వడ్డీగా రూ. 12 వేలు కట్టమన్నారు. తీరా రెండు వే లే మాఫీ అయింది. చంద్రబాబు ప్ర భుత్వం నిలువునా ముంచింది’ అని రైతు లంకలపల్లి శివయ్య వాపోయాడు. రుణమాఫీకి సవాలక్ష మెలకలు పెట్టి తమను మోసం చేశారంటూ పలువురు రైతులు ధ్వజమెత్తారు.