పోలవరం నిర్మాణ సంస్థలకు సీఎం చంద్రబాబు సూచన
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్ధేశించిన లక్ష్యాలను నిర్మాణ సంస్థలు అలక్ష్యం చేయవద్దని, అవసరమైతే నిర్మాణ సంస్థలు పరస్పరం సహకారం అందించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల తో ప్రత్యక్ష ప్రసారం ద్వారా సీఎం సమీక్షించారు. పనులకు కావాల్సిన యంత్రాలను వెంటనే సిద్ధం చేసుకోవాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.
అమరావతిలో భారీ భవన సముదాయం
నూతన రాజధాని అమరావతిలో 900 ఎకరాల పరిధిలో భారీ భవన సముదాయాన్ని నిర్మిం చాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఏ శాఖకు ఎంత స్థలం కావాలనే అంశా న్ని అధికారులతో కూడిన పరిపాలన కమిటీ నిర్ధారించనుంది. ఎవరికెంత స్థలం కావాలో సమాచారం ఇవ్వాలంటూ సీఆర్‌డీఏ ఇప్పటికే అన్ని శాఖలను కోరింది. అయితే, కొన్ని శాఖలు ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో పరి పాలన కమిటీ మంగళవారం సమావేశం కానుంది. ఈ కమిటీ సమావేశమై, శాఖలు పంపించిన వివరాలను పరిశీలించి, ఎవరికెంత స్థలం అవసరమో నిర్ధారిస్తుంది.
పరస్పరం సహకరించుకోండి
Published Tue, Mar 14 2017 1:57 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement