ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులు | Consecutive holidays to Governement employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులు

Published Sat, Jan 11 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

Consecutive holidays to Governement employees

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా సెలవులు కలిసివచ్చాయి. శనివారంతో మొదలుకుని ఈ నెల 15 వరకు వారికి వరుసగా సెలవులు వచ్చాయి. శనివారం రెండో శనివారం కాగా ఆదివారం ఎలాగూ సెలవు. సోమవారం భోగి పండుగ. మంగళవారం మకర సంక్రాంతి. బుధవారం కనుమ పండుగ ఆప్షనల్ హాలిడే. పాఠశాలలకు ఈ నెల తొమ్మిది నుంచే సెలవులిచ్చారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు రావడంతో సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకునేందుకు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా సొంత ఊళ్ల బాట పడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు వివిధ పట్టణాలు, నగరాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు స్వగ్రామాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement