
వంకాయలు కేరాఫ్ తగరంపూడి
వంగ సాగుకు మారుపేరు తగరంపూడి. అనకాపల్లి సమీపంలో శారదా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామ రైతులు లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ పంటను ఖరీఫ్, రబీల్లోనూ చేపడతారు.
అనకాపల్లి: వంగ సాగుకు మారుపేరు తగరంపూడి. అనకాపల్లి సమీపంలో శారదా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామ రైతులు లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ పంటను ఖరీఫ్, రబీల్లోనూ చేపడతారు. ఏడాదంతా గ్రామం వంకాయ తట్టలు,వ్యాపారులతో కళకళలాడుతుంది. పొడవు, నల్ల, గుత్తి ఇలా ఏ రకం వంకాయ అయినా ఇక్కడ దొరుకుతుంది. గ్రామంలోని అందరు రైతులూ ఈ పంట పండిస్తారు. వంగ నారు నాటిన రెండు నెలల నుంచి మొక్కలు కాపునకు వస్తాయి. ఏటా ఈ ఒక్క గ్రామం నుంచే సుమారు మూడు వేల బస్తాల వంకాయలు మార్కెట్‌కు తరలిస్తారు. కొందరు ఔత్సాహిక రైతులు భూములను కౌలుకు తీసుకుని పంటను చేపడుతుంటారు. ఆగస్టు నెలాఖరులో కరుణించిన వర్షాల పుణ్యమా అనివంగ మొక్కల నాట్లు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మరి కొందరు ముందుగా నాటిన మొక్కల్లో కలుపుతీత పనుల్లో ఉన్నారు.
పూర్వం నుంచి పండిస్తున్నాం
తాతల కాలం నుంచి వంగ పంట చేపడుతున్నాం. 60 సెంట్లు భూమి కౌలుకు తీసుకున్నాను. రూ. 4 వేలు కౌలుకు చెల్లించగా, తోట సాగు కోసం మరో రూ. 20 వేలు అవుతుంది. ఏ టా 100 బస్తాలకు పైనే దిగుబడి వస్తున్న ది. అనకాపల్లి మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముతాను. మరో రెండు నెలల్లో పంట కాపునకు వస్తుంది. -ముమ్మిన ఏడుకొండలు
లాభమొచ్చినా..న ష్టమొచ్చినా
వంగ సాగులో లాభమొచ్చినా, నష్టమొచ్చినా సాగు చేస్తున్నాం. 15 ఏళ్ల నుంచి ఇదే పంట పండిస్తున్నాను. 80 సెంట్లు భూమిని రూ.4వేల కౌలు చెల్లింపునకు తీసుకున్నాను. ఎదిగిన నారును నాటుతున్నాం. కాల్వలు ఏర్పాటు చేశాక డీఏపీ వేస్తాను. ఒక్కో ఏడాది పంట కలిసొస్తే, మరో ఏడాది దెబ్బతింటోంది. అయినా ఇదే పంట చేపడుతున్నాను.
- సంగమయ్య