ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
సాక్షి, ఏలూరు: తమకు అధికారం కట్టబెడితే ఎన్నో పనులు చేస్తామన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారు. పదవి రాగానే అన్నీ వదిలేశారు. కొత్తగా ఏం అభివృద్ధి చేస్తారో తెలియదు కానీ.. జరుగుతున్న అభివృద్ధిపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులను, పనులను తక్షణమే నిలిపివేయూలంటూ రాష్ర్ట ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖజానాలో సొమ్ము నిండుకుందని చెబుతున్న ప్రభుత్వం మళ్లీ ఆదేశాలిచ్చేవరకూ పాత పనులను కొనసాగించవద్దని, కొత్త పనులను సైతం ప్రారంభించవద్దంటూ అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోనున్నాయి. పనులు, ప్రాజెక్టుల అంచనాలు, వ్యయాలు బేరీజు వేసుకున్నాక ఏ పనులను కొనసాగించాలో, వేటిని నిలిపివేయాలో, వేటిని తగ్గించాలో నిర్ణయిస్తామని.. నిధుల లభ్యతను బట్టి తదుపరి ఆదేశాలిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
శివారు భూములకు సాగునీరు అం దించేందుకు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. పశ్చిమ డెల్టా ఆధుని కీకరణ పనులను రూ.1383 కోట్లతో చేపట్టారు. వీటిలో ఇప్పటివరకూ రూ.441 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తిచేశారు. రూ.84కోట్లతో యనమదుర్రు డ్రెయి న్ అభివృద్ధి, రూ.18 కోట్లతో తమ్మిలేరు రక్షణగోడ నిర్మాణం, రూ.86 కోట్లతో పోగొండ రిజర్వాయర్, రూ.6 కోట్లతో 40 డ్రెయిన్ల నిర్వహణ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ పనులపై నీలినీడలు కుమ్ముకున్నాయి. పోలవరం మం డలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విద్యుదీకరణ కోసం రూ.కోటితో చేపట్టిన పనులు కొనసాగుతాయనే నమ్మకం లేదు. జిల్లాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 60 వేల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యా యి. రూ.6 కోట్లతో చేపట్టాల్సిన ఈ పనులు ఇప్పట్లో నిర్మాణానికి నోచుకునే అవకాశాలు కనిపిం చడం లేదు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి కొత్త పథకా లు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
నాణ్యమైన విద్యుత్ సంగతేంటో
అక్టోబర్ 2నుంచి జిల్లాలో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా రూ.122 కోట్లతో 159 కొత్త లైన్లు వేయడం ప్రారంభించారు. రూ.151 కోట్లతో ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, కేబుల్స్ మార్చేందుకు అనుమతి వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఈ పనులు జరుగుతాయో లేదో తెలి యని గందరగోళం నెలకొంది. ఈపీడీసీఎల్ కార్పొరేట్ సంస్థ కనుక, ఆ సంస్థ నిధులతో చేపట్టే ఈ పనులకు కొంత వెసులుబాటు లభించవచ్చని భావిస్తున్నారు. జిల్లాలో రూ.40 కోట్లతో 15వేల ఎకరాల్లో 8వేల మంది రైతులకు 1,490 బ్లాకులను గుర్తించి వ్యవసాయ బోర్లు మంజూరు చేశారు. బోర్లు వేసేందుకు చాలాకాలమే పట్టొచ్చు. జాతీయ గ్రామీణ మంచినీటి పథకం కింద రూ.71 కోట్లతో 317 పనులు చేపడుతున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 20 రోడ్ల నిర్మాణానికి రూ.65 కోట్లు మంజూ రయ్యాయి. షెడ్యూల్ కులాలు, తెగల ఉప ప్రణాళిక పద్దు కింద రూ.100 కోట్లతో 151 పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యూరుు. నిధుల లేమి కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యాచరణకు నోచుకుంటాయో లేదోననే విషయూన్ని అధికారులే చెప్పలేకపోతున్నారు. కేంద్ర నిధులతో చేపట్టే పనులకు ఆటంకం కలగకపోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.