
'రాష్ట్రంలో ఎక్కడైనా గంటాతో పోటీకి సై'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. మంత్రి గంటా విసిరిన ఛాలెంజ్ ను తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా గంటా పోటీకి వస్తానంటే తాను సిద్ధమేనన్నారు.