'వెయ్యిమంది కిరణ్‌లు వచ్చినా తెలంగాణ ఆగదు'
నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మతి భ్రమించి తెలంగాణపై అవాస్తవాలు మాట్లాడుతున్నాడని, ఆయన వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీమంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
నల్లగొండలో శుక్రవారం జరిగిన పద్మశాలి సంఘం భవనం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని కేంద్రం ప్రకటించిందని, రెండు మూడు నెలల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వెయ్యి మంది కిరణ్‌కుమార్‌రెడ్డిలు వచ్చినా తెలంగాణ ఆగదన్నారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేశానని, తనకు కొండా లకష్మణ్ బాపూజీ ఆదర్శమని చెప్పారు.