సాక్షి, విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంచార్జిగా తనను నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తాను సామాన్య కార్యకర్తనని, ఎవరితో తనకు విభేదాలు లేవని విష్ణు వ్యాఖ్యానించారు. ఎవరు ఏ ఆరోపణలు చేసినా పాజిటివ్‌గా స్పందించడమే తన నైజమన్నారు. పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయాలను శిరసా వహిస్తానని పేర్కొన్నారు.
గడగడపకూ నవరత్నాలు..
వైఎస్ జగన్ స్ఫూర్తితో నియోజకవర్గంలోని గడగడపకూ నవరత్నాలను తీసుకువెళ్తానని మల్లాది విష్ణు అన్నారు. ఈ నెల 22న జగన్ పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకునే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని పేర్కొన్నారు.
Published Wed, Sep 19 2018 6:15 PM | Last Updated on Wed, Sep 19 2018 6:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment