దేశభక్తి అంటే ఇంతేనా..?
మూడు రంగుల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తే గుండె ఉప్పొంగిపోతుంది. వందేమాతరం చెవిన పడితే మనసు ఉత్తేజితమవుతుంది. జనగణమన అంటూ మొదలుపెడితే అడుగు కదల్చకుండా నిలబడాలనిపిస్తుంది. దేశభక్తి అంటే ఇంతేనా..? ఆ మూడు రంగుల జెండా రెపరెపలాడడానికి కారణమైన వారిని గౌరవించుకోవడం కూడా దేశభక్తే. వందేమాతరం అంటూ తెల్లవాడి ముందు గొంతెత్తి అరిచిన వారిని స్మరించుకోవడం కూడా దేశాన్ని గౌరవించడమే. కానీ ఈ పనులు చేయడానికి ఎందుకో అధికారులు సంకోచిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు, పింఛన్లు వంటివి మంజూరు చేయడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అలా నిర్లక్ష్యానికి గురైన వారిలో ఒకరు సాలూరుకు చెందిన డెక్కత అప్పారావు రెడ్డి.
విజయనగరం కంటోన్మెంట్: బాల్యం లో ఉన్నప్పుడు పరిస్థితులతో యుద్ధం చేశారు. యవ్వనంలో ఉన్నప్పుడు ఆంగ్లేయులతో పోరాడారు. ఆ పో రాటానికి ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలిసం ధ్య కాలంలో మన నాయకులు, అ ధికారులతోనే సమరం చేయా ల్సి వస్తోంది. జిల్లాలోని చా లా మంది స్వాతంత్య్ర సమరయోధుల పరిస్థితి ఇది. అలాంటి ‘చాలా’ మందిలో ఒక యోధు డు డెక్కత అప్పారావు రెడ్డి. స్వాతంత్య్రం కోసం పోరాడిన స మరయోధుడు డెక్కత అప్పారా వు రెడ్డి బతికుండగా ఇంటి స్థలం ఇవ్వలేదు. దీంతో ఆయన కుమార్తె రోజా రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ ఇలా రౌండ్లు కొడుతున్నారు. అయినా ఆ కుటుం బానికి దక్కాల్సినవి దక్కడం లేదు. అప్పారావు భార్య మంచం పట్టడంతో కుమార్తె వీటి కోసం పోరాడుతోంది.
స్వాతంత్య్రం సమరంలో ఎన్నో కేసులు మీద వేసుకుని, ఎన్నో సా ర్లు జైలు జీవితాలు అనుభవించిన సాలూరుకు చెందిన డెక్కత అప్పారావు రెడ్డి 2.10.1918న పుట్టారు. డెక్కత అప్పారావు రెడ్డి అంటే ఆంగ్లేయులకు హడల్ అంటే అతిశయోక్తి కాదు. 1930 విశాఖలో నిర్వహిం చిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే 1932లో రాజకీయ ఉద్యమాల నిషేధం సమయంలో గుంటూరులో పికెటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెక్కత అప్పారావు రెడ్డి పాల్గొని కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా రాజకీయ ఉద్యమాల నిషేధాన్ని ఉల్లంఘించారనే నేరంపై డెక్కత అప్పారావు రెడ్డి అరెస్టయ్యారు. అలాగే 1942లో నిర్వహించిన భారీ ఉద్యమం క్విట్ ఇండియా పోరాటంలో డెక్కత అప్పారావు పాల్గొన్నారు. సమరంలో కూనిశెట్టి వెం కట నారాయణ దొర, వరహగిరి వెంకట గిరి, గోనా సీతారామస్వామిలే ఈయనకు స్ఫూర్తి. ఈ సందర్భంగా ఆయ న 1932లో జైలు శిక్ష అనుభవించా రు. జవహర్ లాల్ నెహ్రూ బొబ్బిలిలో సభ నిర్వహించి వెళ్లిపోతున్న సమయంలో ఆయనను రామభద్రపురం నుంచి సాలూరు తీసుకువెళ్లి సభను నిర్వహించారు.
అలాగే సరోజినీ నాయుడు సాలూరులో సభ నిర్వహించాల్సి ఉండగా బ్రిటిష్ వారు దానిని నిషేధించడంతో రామభద్రపురంలో నిర్వహించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలను ఆయన సాహసోపేతంగా నిర్వహించారు. నిబంధనలు, నిషేధాజ్ఞలను ఎదురించి స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. ఇంత చేసినా రెడ్డి కుటుంబానికి ప్రభుత్వ పరంగా దక్కాల్సినవి దక్కడం లేదు. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు ఇంటి స్థలం కోసం పోరాడుతూనే ఉన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ ఆయనకు సేవ చేసేందుకు మన అధికారులు మాత్రం సిద్ధంగా లేకపోవడం బాధాకరమని పలువురు అంటున్నారు.
ప్రభుత్వం తమకు ఇస్తానన్న ప్రభుత్వ భూమి కోసం కుటుంబ సభ్యులే ఓ చోటును గుర్తించి చూపారు కూడా. కానీ ఇప్పటి వరకూ ఆ స్థలం మాత్రం వీరికి ఇవ్వ లేదు. ఇటీవలే అప్పారావు జయంతి నాడు కూడా ఆయన కుమార్తె రోజా ఇంటిస్థలం కోసం అధికారుల వద్దకు వచ్చారు. దీనిపై ఎన్నో సార్లు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదులు చేసినా స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఇంటి స్థలం మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.