100 కేసులు నమోదు
160 మంది అరెస్ట్
ఇద్దరిపై పీడీ యాక్టు
డీజీపీ జేవీ రాముడు
విశాఖపట్నం : విశాఖలో భూకబ్జాదారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని రాష్ర్ట డెరైక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) జె.వి.రాముడు స్పష్టం చేశారు. ప్రాధాన్యత గల ఈ నగరంలో భూకబ్జాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించడానికి వీల్లేదన్నారు. నగర పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక బీచ్‌రోడ్‌లోని పోలీస్ మెస్‌లో ఫ్లీట్ రివ్యూతో పాటు ఇతర అంశాలపై జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో సివిల్ తగాదాల పేరుతో ఆక్రమణదారుల జోలికి వెళ్లడం లేదన్నారు. వీరికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఇప్పటికే సిటీ పరిధిలో 100 కేసులు నమోదు చేయగా, 160 మందిని అరెస్ట్ చేశారని, ఇరువురిపై పీడీ యాక్టు కూడా ప్రయోగించామని డీజీపీ వివరిం చారు.
నెలరోజుల క్రితం సిటీలో జరిగిన ఓ హిజ్రా హత్య కేసు లో నిందితుడిగా ఉన్న టీడీపీ నాయకుడికి పోలీసులు కొమ్ముకాస్తున్నారం టూ వస్తున్న ఆరోపణలపై డీజీపీ స్పందిస్తూ అలాంటి ది ఏమీ లేదన్నారు.కచ్చితంగా బాధ్యులపై చర్యలుంటాయని చెప్పారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు తప్పవన్నారు. రాష్ర్టపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర,రాష్ర్ట మంత్రులతో సహా 15వేల మందికిపైగా విదేశాలకు చెందిన వీవీఐపీలు వస్తున్నందున భారీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జన సమూహాలలో నిఘాకోసం ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం, నావీ సంయుక్తంగా 160 ప్రాం తాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నా రు. అవసరమైతేవీటిని పెంచుతామన్నారు. రిహార్సల్స్ తొలి రో జు నుంచి రివ్యూ పూర్తయ్యే వరకు ప్రతీ రోజూ లక్ష నుంచి రెండులక్షల మంది హాజర వుతారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా పాస్‌లు తీసుకోవాల ని.. పాస్‌లన్నీ ఉచితంగానే మీ సేవా కేంద్రాల్లో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పా రు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ (ఆపరేషన్స్) సు రేంద్రబాబు, అడిషనల్ డీసీ (అడ్మినిస్ట్రేషన్) ఆర్.పి.ఠాకూర్, సీఆర్‌పీఎఫ్ ఐజీ విష్ణు, నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ పాల్గొన్నారు.
మన్యంలో పరిస్థితులపై డీజీపీ ఆరా
అల్లిపురం : డీజీపీ మన్యంలో పరిస్థితిపై జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌తో చర్చించినట్టు తెలిసింది. కాపులుప్పాడ గ్రేహౌండ్స్ హెడ్ క్వార్టర్స్ సందర్శించిన ఆయన ఎస్పీతో ప్రత్యేకంగా సమావేశమై మన్యంలో బాక్సెట్ తవ్వకాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం.
కబ్జాదారులపై కఠిన చర్యలు
Published Fri, Nov 13 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM
Advertisement
Advertisement