ముందస్తు సాగు.. మహా జాగు | Rabi sowing lags, may pick up in coming weeks | Sakshi
Sakshi News home page

ముందస్తు సాగు.. మహా జాగు

Published Sat, Dec 20 2014 3:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ముందస్తు సాగు.. మహా జాగు - Sakshi

ముందస్తు సాగు.. మహా జాగు

* రుణాలు అందక మొదలుకాని రబీ నాట్లు
* 30 శాతమైనా పూర్తికాని నారుమడులు
* నెలాఖరులోగా నాట్లు వేయడం కష్టమేనంటున్న అన్నదాతలు
* రుణాలు అందకపోవడమే ప్రధాన కారణం

ఏలూరు : గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రబీ సాగు ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ నిర్ణరుుంచింది. ఈ మేరకు రైతులకు సూచనలూ చేసింది. క్షేత్రస్థారుులో మా త్రం ముందస్తు రబీ సాగుకు పరిస్థితు లు అనుకూలిం చడం లేదు. డిసెంబర్ 31లోగా నాట్లు పూర్తి చేయూలని అధికారులు తొందరపెడుతుండగా, ఆ సమయూనికి కనీసం నారుమడులైనా పూర్తిచేసే అవకాశాలు కనిపించడం లేదు. అన్నదాతకు అడుగడుగునా ఆటంకాలు ఎదురు కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రుణాలేవీ రుణమాఫీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో రైతులకు పంట రుణాలు అందటం లేదు. ఇప్పటివరకు అధికారులు వ్యవసాయ రుణ ప్రణాళికను ఖరారు చేయలేదు.

డీసీసీబీ ద్వారా ఏ మేరకు రుణాలు ఇస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నా. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసే తతంగం జనవరి నెలాఖరు వరకు కొనసాగేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కనీసం ఒక్క రైతుకైనా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదు. రుణమాఫీ సొమ్ములు ప్రభుత్వం నుంచి జమ అయితేనే కొత్తగా రుణాలిస్తామని బ్యాంకర్లు, సొసైటీ అధికారులు చెబుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అరుుతే మరీ దయనీయంగా ఉంది. జిల్లాలో రెండు లక్షలకు పైగా కౌలు రైతులు ఉండగా, వారికి రుణాలు ఎప్పుడిస్తారు, ఎంత ఇస్తారనేది నిర్ణయం కాలేదు.
 
నీటి లభ్యతపైనా అనుమానాలు
గోదావరి డెల్టా పరిధిలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేయూల్సి ఉంది. నూరు శాతం ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు, యంత్రాంగం చెబుతున్నా గత అనుభవాలను బట్టి చూస్తే అది సాధ్యమవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నారుు. గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతోందని, యుద్ధప్రాతిపదికన నారుమడులు వేసి ఈనెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీర్మానం సైతం చేశారు. ఆ దిశగా రైతులను సమాయత్తం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. మార్చి నెలాఖరు నాటికి కాలువలకు నీటిని నిలుపుదల చేసి డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుండగా, ఆ సమయూనికి పంటలు పూర్తయ్యే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు.
 
నీరున్నా కృష్ణా డెల్టాకు ఇవ్వరేం
కృష్ణా డెల్టా పరిధిలోని వరి చేలకు సాగునీరిచ్చే విషయంలో సర్కారు రైతులను వంచిస్తోంది. కృష్ణా నదిలో నీరున్నా రైతుల అవసరాలకు నీటిని విడుదల చేయడం లేదని, ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేస్తామని సర్కారు చెప్పడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కృష్ణా కాలువ కింద ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల్లోని 50వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. రబీలో ఏటా ఇక్కడి భూములకు సాగునీరు అందించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
 
30 శాతం నారుమడులు పూర్తి
జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగుకు 1.20 లక్షల హెక్టార్ల నారుమడి అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 40 వేల హెకార్ల మేర నారుమడులు వేశారు. ఇదికూడా మెట్ట ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. ఈ నెలాఖరు నాటికైనా నారుమడులు పూర్తిస్థారుులో వేసే అవకాశం కనిపించడం లేదు. అలా చేయకపోతే జనవరి నెలాఖరు నాటికైనా నాట్లు పూర్తిచేయలేమని వ్యవసాయ శాఖ ఆందోళన చెందుతోంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి కోతలు పూర్తరుుతే తప్ప డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టలేమని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అదును దాటితే డెల్టాలో వరి సాగుకు నీరివ్వలేమని చేతులెత్తేస్తున్నారు.
 
అవగాహన కల్పిస్తున్నాం
ఈ నెలాఖరు నాటికి రబీ నాట్లు పూర్తి చేసేలా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల కొరత ఏ మాత్రం లేదు. అన్ని సవ్యంగానే ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి కనీసం 50 శాతం విస్తీర్ణంలో అరుునా నాట్లు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటాం.
 -  సారుులక్ష్మీశ్వరి, జేడీ, వ్యవసాయ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement