కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరుగుతున్న వివిధ పోరాటాల్లో ఆర్టీసీ కార్మికులు కూడా ప్రత్యక్షంగా పా ల్గొనాలని నిర్ణయించినట్లు ఎంప్లాయీస్ యూ నియన్ సమైక్యాంధ్ర పోరాట సమితి అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్‌జీఓ హోంలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి ఎన్‌జీఓల తో కలిసి ఆందోళనల్లో పాల్గొంటారని వెల్లడించారు. యాజమాన్య బెదిరింపులను లెక్క చేయకుండా రాయలసీమ, కోస్తాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన అన్ని కేటగిరిల కార్మికులు సమ్మెలోకి వచ్చారని తెలిపారు. మంగళవారం రాస్తారోకోలు, మానవహారాలు,వంటావార్పు లు నిర్వహించారన్నారు. విశ్రాంత ఆర్టీసీ కార్మికులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్.రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ జిల్లాలో 2300 మం ది గెజిటెడ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రం విభజన జరిగితే 58 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళుతుందన్నారు. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో తీవ్రం గా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ర్ట ఆదాయంలో 65శాతం హైదరాబాద్‌తో కూడి న తెలంగాణా నుంచి వస్తుండగా సీమాంధ్ర నుంచి కేవలం 35శాతమే లభిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో విభజన అంటూ జరిగితే ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండదన్నారు. ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కెవి శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 35వేల మంది వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు సమ్మె చేపట్టారని తెలిపారు. మున్సిపల్ కార్మిక ఉద్యోగులు కూడా సమ్మెచేపట్టారని, అయితే తాగునీరు, శానిటేషన్, విద్యుత్ వంటి సమస్యలకు ఇబ్బంది కలగకుండా చూస్తారన్నారు.
గతంలో పిఆర్‌సి వంటి తమ ఆర్థిక పరమైన డిమాండ్ల కోసం మాత్రమే ఆందోళనలు చేసిన తాము ఇప్పుడు రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమంలో పాల్గొంటున్నామన్నారు. సమ్మెలోకి వెళితే ఎస్మా ప్రయోగిస్తామంటూ ట్రెజరీ ఉద్యోగులకు బెదిరింపులు పంపడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి తక్షణం ఉద్యమంలోకి రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర పోరాట సమితి కన్వీనర్ రాజేంద్రప్రసాద్, జోనల్ కార్యదర్శి జివి నరసయ్య, రీజనల్ ట్రెజరర్ నాగముని తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యక్ష పోరాటాల్లోకి ఆర్టీసీ కార్మికులు సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి
Published Wed, Aug 14 2013 3:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement