ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచి వేయడానికి జిల్లా ఎస్పీ నియంతలా వ్యవహరిస్తున్నారు. సమైక్యవాదులపై అసాంఘిక శక్తుల ముద్ర వేసి.. కేసులు బనాయించి, బైండోవర్ చేస్తున్నారు. ప్రజాభిప్రాయం మేరకు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్న వైఎస్సార్‌సీపీ నేతలనే ఎస్పీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయడం లేదు. అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ, నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, సాలార్‌బాష, బలరాం, బండి పరశురాం, ధనుంజయ యాదవ్, గోపాల్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మహానందరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, ఉప్పర రాజశేఖర్, తిరుపాల్‌రెడ్డి, చింతకుంట మధు, వంశీ క ృష్ణారెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, బాలనర్సింహారెడ్డి, లింగాల రమేష్‌లపై మంగళవారం బైండోవర్ కేసు నమోదు చేశారు.
వీరిలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, శంకరనారాయణ, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి మినహా 15 మందిని అనంతపురం తహశీల్దార్ ఆంజనేయులు ఎదుట పోలీసులు బైండోవర్ చేయడం గమనార్హం. ఇంతకుముందే సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వెయ్యి మందిపై పది కేసులు నమోదు చేశారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు క్రాంతికుమార్, వాసు, చంద్రకుమార్, ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాసులును అరెస్టు చేసి.. శనివారం కోర్టులో హాజరు పరిచారు. వీరు నలుగురు మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. సమైక్యవాదులపై అక్రమ కేసులు బనాయించి.. భయోత్పాతం సృష్టించి, ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎస్పీ చేస్తోన్న యత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్‌ఆర్‌సీపీ నేతలే టార్గెట్
Published Wed, Aug 7 2013 2:05 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement