సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీల కార్యక్రమం విజయవంతమైంది. మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన ఈ ర్యాలీల్లో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గారలో జరిగిన ర్యాలీలో శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కల్యాణి, జిల్లా యువజన విభాగం క న్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, జిల్లా కమిటీ సభ్యుడు అందవరపు సూరిబాబు, మార్పు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం గ్రామంలోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టెక్కలిలో నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. పాత జాతీయ రహదారి నుంచి పట్టణ వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో కార్యకర్తలు, రైతులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పలాస నుంచి కాశీబుగ్గ వరకు పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో ఎడ్లబళ్లు, ట్రాకర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇచ్ఛాపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌లో మానవహారం చేపట్టారు. పార్టీ మునిసిపల్, మండల కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి సుగ్గు ఛత్రపతి, మండల యువజన విభాగం కన్వీనర్ పిట్ట ఆనంద్, మునిసిపల్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్ మేరుగు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకొండలో నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమైక్యాంధ్ర నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల కన్వీనర్ కనపాక సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
రాజాంలో పార్టీ సమన్వయకర్త పీఎంజె బాబు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్ర జై... సోనియా డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాలకొండ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ జి.టి.నాయుడు, మెంటాడ పద్మశ్రీ, నాలుగు మండలాల కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రామతీర్థాల కూడలి నుంచి రణస్థలం మండల కాంప్లెక్స్ వరకు ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. లక్ష్యం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, నాయకులు పిన్నింటి సాయికుమార్, కరిమజ్జి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం చాపురం-పాత్రునివలస సమీపంలోని శ్రీసాయి డెంటల్ కళాశాల ఎదుట 16వ నంబర్ జాతీయరహదారిని దిగ్బంధించారు. దీంతో అటు పెద్దపాడు వరకు, ఇటు కొత్తరోడ్డు కూడలి వరకు దాదాపు గంటన్నర సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దఎత్తున నినాదా లు చేశారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కాంగ్రెస్ అధిష్టానం రాష్ర్ట విభజనకు పూనుకుందని విమర్శించారు. దీనిపై సీమాంధ్ర నేతలు సరైన రీతిలో స్పందించ లేదని విమర్శించారు. ప్రజల మనోభావాల ను గౌరవించి ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని పేర్కొన్నా రు. కార్యక్రమంలో డెంటల్ కళాశాల, నారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ట్రాక్టర్ల ర్యాలీలు విజయవంతం
Published Thu, Dec 12 2013 4:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement