
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: తండ్రితో గొడవ పడి మనస్థాపానికి గురైన ఓ యువ క్రీడాకారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియం, అథ్లెటిక్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ స్ప్రింటర్ పర్విందర్ చౌదరీ (18) బుధవారం వసతి రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఫోన్ సంభాషణలో తన తండ్రితో గొడవపడ్డాడని, అనంతరం అతని సోదరి మాట్లాడిందని, కానీ దురదృష్టవశాత్తు పర్విందర్ ప్రాణాలు రక్షించలేకపోయామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొన్నారు.