
సాక్షి, గుంటూరు : పోలీసుల విచారణకు భయపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో కలకలం రేపుతోంది. స్థానికుల కథనం మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన కిరణ్ విజయవాడలో జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడంటూ కిరణ్‌పై ఓ యువకుడు కొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం ఉదయం కిరణ్‌ను విచారించారు. దీంతో భయాందోళనకు లోనైన కిరణ్ బుధవారం అర్థరాత్రి భార్య హెలీనాతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment