
తల్లితో శివ, కావ్యశ్రీ, ఉదయశ్రీల(ఫైల్)
కొడిమ్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన బైరి కీర్తన, కూతురు రితన్య, ఏడాది వయస్సున్న కుమారుడు శివతో కలిసి జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి.
శివ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే.. రాంసాగర్ గ్రామానికే చెందిన కావ్యశ్రీ,, ఉదయశ్రీ అనే కవలలు తాత మెడిచెల్మల రాజేశం(60)తో జగిత్యాల బయలుదేరారు. ప్రమాదంలో రాజేశం మృతిచెందగా.. కవలలు మృత్యుంజయులుగా నిలిచారు. దాదాపు బస్సులోని వారందరూ మృత్యుముఖానికి వెళ్లగా చిన్నారులు మాత్రం సురక్షితంగా బతికి బయటపడడంతో సంబంధీకులు ఊపిరిపీల్చుకున్నారు.